1 00:00:27,444 --> 00:00:29,655 నేను తయారు చేయని మద్యాన్ని పుచ్చుకున్నాను - 2 00:00:36,286 --> 00:00:38,789 పర్ల్ లో మగ్గులని ముంచుకొని తాగాను - 3 00:00:52,886 --> 00:00:54,346 ది కాన్స్టిలేషన్ 4 00:00:55,848 --> 00:00:58,475 ఫ్రాంక్ఫర్ట్ బెర్రీలు అంతటి రుచిని అందించలేవు 5 00:01:26,253 --> 00:01:27,796 ఎంతటి మత్తును కలుగజేస్తాయి 6 00:01:27,880 --> 00:01:31,466 అమ్హెర్స్ట్ నుండి మే-వైన్ --ఈ. డికిన్సన్ 7 00:01:46,190 --> 00:01:47,191 అజరామరం. 8 00:01:49,234 --> 00:01:50,235 దేవుడా. 9 00:01:55,115 --> 00:01:58,535 "ఈ గాలి నన్ను కవ్విస్తోంది... ఈ హిమముకు నేను బానిసనయ్యాను... 10 00:01:58,952 --> 00:02:03,123 నీలి నీలి ఆకాశం మాటు నుండి అంతేలేని వేసవి దినాలని ఆస్వాదిస్తున్నాను 11 00:02:03,207 --> 00:02:07,544 తుమ్మెదలు తేనెను సేకరించడం ఆపేసినా కానీ - 12 00:02:07,628 --> 00:02:10,214 సీతాకోకచిలుకలు తమ అందాలని వదిలేసినా కానీ - 13 00:02:10,297 --> 00:02:12,216 నేను మాత్రం ఆస్వాదిస్తూనే ఉంటాను!" 14 00:02:13,509 --> 00:02:14,510 అదిరిపోయింది. 15 00:02:14,593 --> 00:02:16,595 అవును. అది చాలా బాగుంది. 16 00:02:16,678 --> 00:02:19,014 అక్షరాలా, ఇది నన్ను తలపిస్తోంది. 17 00:02:19,097 --> 00:02:21,308 ఆ కవిత చాలా బాగుంది. ఎవరు రాశారు? 18 00:02:21,808 --> 00:02:22,935 ఎమిలీ రాసింది, అమ్మా. 19 00:02:23,352 --> 00:02:24,645 ఎవరు? 20 00:02:24,728 --> 00:02:26,396 ఎమిలీ డికిన్సన్, నీ కూతురు, 21 00:02:26,480 --> 00:02:30,692 నేటి "స్ప్రింగ్ ఫీల్డ్ రిపబ్లికన్"లో పతాక శీర్షికలో ప్రచురించబడిన కవితను రాసింది. 22 00:02:30,776 --> 00:02:32,110 మద్యం తాగడం గురించి రాసింది. 23 00:02:33,237 --> 00:02:35,656 అది మద్యం తాగడం గురించి కాదు, షిప్. 24 00:02:35,739 --> 00:02:39,034 "నేను తయారు చేయని మద్యాన్ని పుచ్చుకున్నాను" అని స్పష్టంగా ఉంది కదా. 25 00:02:39,117 --> 00:02:42,287 ఇది ప్రకృతితో పరవశం పొందడం గురించి, 26 00:02:42,371 --> 00:02:44,540 అంతటి మత్తును మద్యం అస్సలు ఇవ్వలేదు. 27 00:02:44,623 --> 00:02:46,458 కాబట్టి, ఇది అస్సలు తాగడం గురించి కాదు, 28 00:02:46,542 --> 00:02:48,544 ఒక ఉద్రేకభరిత భావావేశపూరిత మనస్సును నుండి జారువాలిన కవిత ఇది. 29 00:02:48,627 --> 00:02:49,628 సరే. 30 00:02:50,254 --> 00:02:51,463 నువ్వు మరీ ఎక్కువ చదువుతావు. 31 00:02:51,547 --> 00:02:53,090 మన్నించు, నాకు నేను సవాళ్ళను విసురుకుంటూ ఆనందిస్తా. 32 00:02:53,173 --> 00:02:56,593 నువ్వు నన్ను నన్నుగా నీ జీవితంలోకి ఆహ్వానించాలి... 33 00:02:56,677 --> 00:02:58,053 -లేదు, షిప్. -...లవీనియా. 34 00:02:58,136 --> 00:02:59,972 మనం పరస్పరం ఆహ్వానించుకోవాలి! 35 00:03:00,055 --> 00:03:01,849 -కాదు! -నాకు అర్థంకావడం లేదు. 36 00:03:01,932 --> 00:03:04,059 ఎమిలీ రాసిన కవితనా. అసలు ఇదెలా జరిగింది? 37 00:03:04,142 --> 00:03:05,561 ఇదేమైనా అనుకోకుండా జరిగిందా? 38 00:03:05,644 --> 00:03:07,145 ఆస్టిన్ ఏమైనా ఇంకో పోటీలో పాల్గొన్నాడా? 39 00:03:07,229 --> 00:03:09,982 ఈ ఊరిలోని అందరి దగ్గర కూడా దీని కాపీ ఒకటి ఉందని అంటున్నావా? 40 00:03:10,065 --> 00:03:11,233 కేవలం ఈ ఊరిలో ఉన్నవాళ్ళ దగ్గరే కాదు. 41 00:03:11,316 --> 00:03:14,027 "ద స్ప్రింగ్ ఫీల్డ్ రిపబ్లికన్"కి 12,000 మంది సభ్యత్వం తీసుకున్నారు. 42 00:03:14,778 --> 00:03:15,821 దేవుడా. 43 00:03:15,904 --> 00:03:18,407 ఇది మామూలు విషయం కాదు. ఎమిలీ పేరు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. 44 00:03:19,157 --> 00:03:21,618 దీన్ని మీ నాన్న చూస్తే ఏమంటాడో, ఏమో, ఆ దేవుడే మనల్ని కాపాడాలి. 45 00:03:21,702 --> 00:03:25,122 అడిగినందుకు ధన్యవాదాలు, కానీ నేను ఇవాళ టిఫిన్ చేయడం లేదు. 46 00:03:25,205 --> 00:03:27,749 నేను తినలేను. నాకు చాలా ఉద్రేకంగా ఉంది. 47 00:03:28,083 --> 00:03:30,252 నా చిరకాల స్వప్నం ఇప్పుడు నిజమవుతోంది. 48 00:03:30,335 --> 00:03:32,921 ఈ కవిత నా హృదయపు లోతుల నుండి వచ్చింది. 49 00:03:33,005 --> 00:03:34,423 దీన్ని రాయడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది. 50 00:03:38,552 --> 00:03:39,636 నాకు ఇవాళ అస్సలు తీరిక లేదు, 51 00:03:39,720 --> 00:03:42,472 కానీ ఎవరైనా నన్ను ఏమైనా అడగాలనుకుంటే, కొన్ని నిమిషాలు కేటాయించగలను. 52 00:03:43,807 --> 00:03:48,687 నా థీమ్స్ గురించి, నా పద్ధతుల గురించి ఆనందంగా మీతో పంచుకోగలను. 53 00:03:50,814 --> 00:03:51,982 ఎవరైనా? 54 00:03:52,065 --> 00:03:53,066 ఎమిలీ ఎక్కడ? 55 00:03:53,150 --> 00:03:54,318 ఇంకా పడుకొనే ఉందనుకుంటా. 56 00:03:54,401 --> 00:03:56,236 -నేను ఇక్కడే ఉన్నాను. -పడుకొనే ఉందా? లేదు. 57 00:03:57,029 --> 00:03:59,031 తన పడక గదిలోనే ఇంకా దాక్కొని ఉంది అని నాకు ఖచ్చితంగా తెలుసు, 58 00:03:59,114 --> 00:04:00,490 తన స్థానంలో నేనుంటే, అదే చేసేదాన్ని. 59 00:04:00,574 --> 00:04:02,117 మీకు అసలు ఏమైంది? హలో? 60 00:04:02,201 --> 00:04:05,579 ఎందుకంటే వాళ్ళ నాన్న దీన్ని కానీ చూశాడంటే అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. 61 00:04:05,662 --> 00:04:06,663 నాన్న ఏం చూస్తే? 62 00:04:08,290 --> 00:04:09,291 ఏంటి? 63 00:04:10,042 --> 00:04:11,043 నీ వెనకాల నువ్వేం దాస్తున్నావు? 64 00:04:12,044 --> 00:04:13,253 కాస్త టిఫిన్ తినరాదు, బంగారం? 65 00:04:14,046 --> 00:04:16,882 టీ తాగుతావా? ప్రశాంతంగా. 66 00:04:16,964 --> 00:04:18,591 నాకు ప్రశాంతత అవసరం లేదులే. ఇప్పుడేగా లేచాను. 67 00:04:18,675 --> 00:04:20,636 నా పత్రికని ఎందుకు నీ వెనకాల దాస్తున్నావు? 68 00:04:20,719 --> 00:04:22,387 దాన్ని ఇవ్వు, మాతా. ఇవ్వు. 69 00:04:22,471 --> 00:04:23,388 దయచేసి ఇవ్వు. 70 00:04:24,556 --> 00:04:25,974 చూడు, మరీ అంత దారుణంగా ఏమీ లేదు. 71 00:04:26,892 --> 00:04:29,728 మళ్లీ షేర్లు పడిపోయాయని చెప్తావేమో అని తెగ భయపడిపోయాను. 72 00:04:29,811 --> 00:04:32,648 నేను రాసిన కవిత ముద్రించబడింది, అది పత్రిక మొదటి పేజీలో ఉంది. 73 00:04:32,731 --> 00:04:33,607 ఇక మీ ఇష్టం! 74 00:04:34,775 --> 00:04:36,944 ఓ, చూడు, కర్టెన్ల అమ్మకం గురించి ఏదో ఉంది. 75 00:04:37,027 --> 00:04:39,446 అవునా? పత్రికని చూసినప్పుడు నాకు అది కనబడలేదే. 76 00:04:39,530 --> 00:04:40,948 -మరీ ఎక్కువ ఉత్సాహపడిపోకండి, శ్రీమతి గారూ -నన్ను చూడనివ్వు. 77 00:04:41,031 --> 00:04:42,824 ఇక్కడ, "సాధారణ ధరల కన్నా తక్కువ," అని రాసుంది. తక్కువ అంతే. 78 00:04:42,908 --> 00:04:45,410 -కర్టెన్లా? -మన కర్టెన్లు బాగానే ఉన్నాయి. చూడు. 79 00:04:45,494 --> 00:04:47,120 నేను పత్రికని వేరే గదికి తీసుకెళ్తాను. 80 00:04:47,204 --> 00:04:49,456 దయచేసి పత్రికని నాకు ఇస్తావా? 81 00:04:50,457 --> 00:04:53,752 ఈ. డికిన్సన్ రచించిన "ద మే-వైన్"? 82 00:04:53,836 --> 00:04:55,963 నువ్వు నా నుండి దాచాలని ప్రయత్నిస్తున్నది ఇదే అన్నమాట. 83 00:04:56,046 --> 00:04:57,172 తనకి పిచ్చెక్కి ఏదో చేసింది. 84 00:04:57,256 --> 00:05:00,342 అసలు దీని గురించి ఎవరైనా నాతో కాస్త మాట్లాడతారా? 85 00:05:00,425 --> 00:05:01,677 ఇప్పుడు తనని ఆపలేము. 86 00:05:01,760 --> 00:05:03,595 నన్ను మన్నించు, ఎడ్వర్డ్. దీనికంతటికీ తప్పు నాదే. 87 00:05:03,679 --> 00:05:05,639 నేను తన మీద ఓ కన్నేసి ఉంచాల్సింది. 88 00:05:05,722 --> 00:05:08,183 ఓ విషయం చెప్పనా? ఇది అంత చండాలంగా ఏమీ లేదు. 89 00:05:10,185 --> 00:05:12,312 "తుమ్మెదలు తేనెను సేకరించడం ఆపేసినా"... 90 00:05:12,396 --> 00:05:15,399 నేనొకదాన్ని ఇక్కడ లేనట్టు మీరు నటించాల్సిన పని లేదు. హలో? 91 00:05:15,482 --> 00:05:17,484 తను మన కుటుంబానికి మంచి పేరే తీసుకొస్తుందేమో. 92 00:05:17,568 --> 00:05:19,027 దేవుడా, నేనెవ్వరికీ కబడటం లేదా ఏంటి? 93 00:05:23,115 --> 00:05:25,033 డికిన్సన్ 94 00:05:25,117 --> 00:05:27,119 నాకు గుర్తింపు లేదు! నువ్వెవరవు? 95 00:05:33,166 --> 00:05:36,753 నెనెవ్వరికీ కనబడటం లేదు, ఎవ్వరికీ నా మాటలు వినబడటం లేదు, నా ఉనికి కూడా తెలియడం లేదు. 96 00:05:36,837 --> 00:05:37,838 మ్యాగీ! 97 00:05:40,257 --> 00:05:41,383 నీకు నేను కనబడుతున్నాను. 98 00:05:41,466 --> 00:05:43,343 నేను ఇవాళ రగ్గులని శుభ్రపరచడం మర్చిపోయా. 99 00:05:46,471 --> 00:05:47,472 కమాన్! 100 00:05:48,724 --> 00:05:51,518 షిప్, హాయ్! హలో. నేను నీకు కనబడుతున్నానా? 101 00:05:51,602 --> 00:05:53,228 విన్నీ, ఇక నా వల్ల కాదు. 102 00:05:53,604 --> 00:05:56,356 నేను ఎన్నో ఆశలుగల, నా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకొనే ఒక వ్యాపారవేత్తని, 103 00:05:56,440 --> 00:05:58,317 నాకు అండగా ఉండే భార్య కావాలి. 104 00:05:58,400 --> 00:05:59,401 షిప్, నీ మాటలు నాకు వినబడుతున్నాయి. 105 00:05:59,484 --> 00:06:03,322 నువ్వు నాకు అండగా ఉండే భార్యవి అనుకున్నా, కానీ కాదు అని తెలుసుకున్నాను, 106 00:06:03,739 --> 00:06:07,367 నువ్వెంత అందంగా ఉన్నా, నీ మీద నాకెంత మోజుగా ఉన్నా కూడా. 107 00:06:07,451 --> 00:06:08,952 నువ్వు తన... అతను మామూలుగానే అన్నాడులే. 108 00:06:09,036 --> 00:06:12,039 నేను ఒక మగాడిగా ప్రవర్తించి మన నిశ్చితార్థాన్ని రద్దు చేసేయాలి. 109 00:06:13,165 --> 00:06:16,001 నేను నిన్ను వదిలేస్తున్నా, లవీనియా. 110 00:06:18,921 --> 00:06:22,007 షిప్, నీలో నువ్వు మాట్లాడుకొనే మాటలు లోపల మాకందరికీ వినబడుతున్నాయి. 111 00:06:22,090 --> 00:06:24,384 -నేను కేవలం నాతోనే మాట్లాడుకోవడం లేదు. -అవును, నేను ఇక్కడే ఉన్నాను. 112 00:06:24,468 --> 00:06:26,136 నేను నీతో తెగతెంపులు చేసుకుంటున్నా, లవీనియా. 113 00:06:26,220 --> 00:06:29,556 ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఎందుకంటే నేనే నీతో తెగతెంపులు చేసేసుకుంటున్నాను. 114 00:06:29,640 --> 00:06:31,183 -ఏంటి? -ఇక దీన్ని భరించడం నా వల్ల కాదు. 115 00:06:31,266 --> 00:06:32,392 ఈ నిశ్చితార్థం రద్దయిపోయింది. 116 00:06:32,476 --> 00:06:33,435 -బాబులూ. -అలాగే, తప్పకుండా. 117 00:06:33,519 --> 00:06:37,272 నేను నా గడియారాన్ని ఇప్పట్నుండి 26 గంటలకు సెట్ చేస్తా, నువ్వు మనస్సు మార్చుకుంటావు. 118 00:06:37,356 --> 00:06:38,982 ఒక రోజులో 24 గంటలు ఉంటాయి, షిప్. 119 00:06:39,066 --> 00:06:41,860 చూడు, నేను కళాశాల నుండి పట్టా పొందనందుకు నన్ను మన్నించు. 120 00:06:41,944 --> 00:06:43,237 నేను నీకు ఎన్నటికీ సరిపోను అనుకుంటా. 121 00:06:43,320 --> 00:06:45,781 -నేను ఇక్కడ ఒకదాన్ని నిలబడి... -నీ అభద్రతాభావాన్ని తట్టుకోలేకపోతున్నా. 122 00:06:45,864 --> 00:06:47,533 -నువ్వు నన్ను జడిపిస్తావు. -ఏంటి? 123 00:06:47,616 --> 00:06:49,701 నీకు అధునాతన భావాలు ఎక్కువగా ఉన్నాయి, 124 00:06:49,785 --> 00:06:54,039 నాకేమో నువ్వు సంప్రదాయబద్ధమైన, ఒక మామూలు భార్యగా ఉండటం ఇష్టం. 125 00:06:54,122 --> 00:06:55,290 అబ్బో. 126 00:06:55,374 --> 00:06:58,502 సరేమరి. నేను మామూలుదాన్ని కాదు. 127 00:06:58,585 --> 00:06:59,753 సరేనా? 128 00:06:59,837 --> 00:07:04,675 నేనొక కపటబుద్ధిగల, దుష్ట, సృజనాత్మక, కామ కోరికలు ఉన్న దాన్ని, 129 00:07:04,758 --> 00:07:06,426 నీకు ఇవి నచ్చవు. 130 00:07:06,510 --> 00:07:07,761 నీకు నేను నచ్చలేదు! 131 00:07:07,845 --> 00:07:08,846 ఏం జరుగుతోంది ఇక్కడ? 132 00:07:11,515 --> 00:07:13,267 ఇక్కడి వాతావరణం ఏదో తేడా తేడాగా ఉంది. 133 00:07:13,350 --> 00:07:14,852 క్షుద్రపూజలు చేసినా కూడా ఇంకా దెయ్యం పోలేదేమో. 134 00:07:14,935 --> 00:07:16,562 ఎమిలీకి ఒక దెయ్యం కూడా కనబడింది. 135 00:07:16,645 --> 00:07:19,189 దేవుడా. నేను దెయ్యం అయిపోయానా? 136 00:07:19,273 --> 00:07:22,067 మీ డికిన్సన్స్ కి కాస్త పిచ్చి. 137 00:07:23,068 --> 00:07:26,321 నేను నెవాడాకి వెళ్లి లోలా ప్రేమపూజలని అందుకుంటా, అదే నాకు మంచిది, 138 00:07:26,405 --> 00:07:30,242 తన వయ్యార డాన్సులతో నాకు మతి పోగొడుతుంది! 139 00:07:32,619 --> 00:07:34,121 వయ్యారి డాన్స్. 140 00:07:34,788 --> 00:07:36,540 లవీనియా, నేను ఇక్కడ ఉన్నానని గుర్తించు! 141 00:07:39,751 --> 00:07:42,629 ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు... 142 00:07:42,713 --> 00:07:44,506 -సరే గుర్తించకులే. అంటే... -ఆరు, ఏడు, ఎనిమిది. 143 00:07:44,590 --> 00:07:46,884 ఒకటి, రెండు, మూడు, నాలుగు... 144 00:07:46,967 --> 00:07:49,136 -విన్నీ, నిన్ను నువ్వు గాయాలపాలు చేసుకోకు. -...అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది. 145 00:07:49,219 --> 00:07:50,596 ఒకటి, రెండు, మూడు. 146 00:07:54,600 --> 00:07:56,935 లవీనియా? విన్నీ? 147 00:07:57,477 --> 00:07:58,645 విన్నీ! 148 00:07:58,729 --> 00:07:59,813 నేను నిన్ను హెచ్చరించాను. 149 00:08:01,148 --> 00:08:03,150 అసలు ఇక్కడేం జరుగుతోంది? 150 00:08:03,233 --> 00:08:04,401 నువ్వు నా మాట వినలేదు. 151 00:08:04,776 --> 00:08:06,862 నువ్వెవరు, మా వంట గదిలో నువ్వేం చేస్తున్నావు? 152 00:08:06,945 --> 00:08:08,322 నాకు గుర్తింపు లేదు! నువ్వెవరవు? 153 00:08:08,405 --> 00:08:11,575 సరే, ఈ పొడుపు కథ బాగానే ఉంది, కానీ నువ్వొక దెయ్యానివి, 154 00:08:11,658 --> 00:08:14,161 ఇంకా నేను నీకు మాత్రమే కనబడుతున్నాను, అంటే నేను చచ్చిపోయాను! 155 00:08:14,828 --> 00:08:17,039 బహుశా రాత్రి నిద్రలో చనిపోయుంటా. 156 00:08:18,248 --> 00:08:21,460 సరే. పర్వాలేదు. నేను దాన్ని దిగమింగుకుంటున్నాను. 157 00:08:21,543 --> 00:08:23,128 నొప్పిలేకుండా జరిగిపోయింది అనుకుంటా. 158 00:08:24,671 --> 00:08:26,715 మా కుటుంబ సభ్యులు నా శవాన్ని ఎప్పుడు చూస్తారో ఏమో. 159 00:08:27,382 --> 00:08:28,842 బహుశా వాళ్లు ఇప్పుడు పైన ఉన్నారేమో, 160 00:08:28,926 --> 00:08:31,762 నా దుప్పటిని తీసి నా శవాన్ని కళ్ళారా చూస్తారేమో! 161 00:08:36,390 --> 00:08:38,769 నువ్వు చనిపోలేదు, నేను కూడా దెయ్యాన్ని కాదు. 162 00:08:38,852 --> 00:08:41,063 నిజంగానా? కానీ నిన్ను చూస్తే అలాగే అనిపిస్తోంది. 163 00:08:41,855 --> 00:08:43,982 హఠాత్తుగా ఎక్కడి నుండో ఊడిపడతావు, నన్ను కాల్చుకుతింటున్నావు! 164 00:08:44,066 --> 00:08:46,401 నేను దెయ్యాన్ని కాదు. నేనొక అంతుచిక్కని రహస్యాన్ని, అంతే. 165 00:08:46,818 --> 00:08:47,861 రహస్యమా? 166 00:08:48,278 --> 00:08:49,488 వావ్. సరేమరి. 167 00:08:50,280 --> 00:08:51,615 నేను నీ చిక్కుముడిని విప్పాలా? 168 00:08:52,032 --> 00:08:53,033 నువ్వు ప్రయత్నించి చూడవచ్చు. 169 00:08:53,116 --> 00:08:55,285 చూడు, నువ్వు ఎంత ప్రలోభ పెట్టినా, నేను దీన్ని అధిగమించగలను. 170 00:08:55,369 --> 00:08:57,329 ఇప్పుడు నాకు ఇతర పనులతో తీరిక లేదు. 171 00:08:57,412 --> 00:08:59,331 ఇది నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన రోజు, 172 00:08:59,414 --> 00:09:02,835 నన్ను కాస్తంత మెచ్చుకుంటారేమోనని చూస్తూ ఉన్నా. 173 00:09:03,418 --> 00:09:04,837 ఒకటో, రెండో పొగడ్తలు. 174 00:09:04,920 --> 00:09:07,297 ఇవాళ అందరూ నా గురించే మాట్లాడుకుంటారని భావించాను, 175 00:09:07,381 --> 00:09:10,384 కానీ ఇక్కడ నేనెవ్వరికీ కనబడటం కూడా లేదు. 176 00:09:10,467 --> 00:09:12,261 బహుశా ఇందులో సానుకూల అంశం కూడా ఉందేమో. 177 00:09:12,344 --> 00:09:13,512 "సానుకూల అంశం" అంటే? 178 00:09:13,595 --> 00:09:16,515 నువ్వు ఎవ్వరికీ కనబడటం లేదు, అంటే నువ్వు నిజం తెలుసుకోవచ్చు. 179 00:09:17,349 --> 00:09:18,350 నిజమా? 180 00:09:18,433 --> 00:09:21,061 నీ కవిత గురించి జనాలు నిజంగా ఏమనుకుంటున్నారో నువ్వు తెలుసుకోవచ్చు. 181 00:09:28,527 --> 00:09:29,570 అది మంచి విషయమే. 182 00:09:31,905 --> 00:09:33,115 "స్ప్రింగ్ ఫీల్డ్ రిపబ్లికన్". 183 00:09:33,574 --> 00:09:35,450 రండి, మీ పత్రికని తీసుకోండి! 184 00:09:38,120 --> 00:09:39,496 "స్ప్రింగ్ ఫీల్డ్ రిపబ్లికన్". 185 00:09:40,205 --> 00:09:44,209 వచ్చి తాజా సంచికని తీసుకోండి! "స్ప్రింగ్ ఫీల్డ్ రిపబ్లికన్". 186 00:09:45,043 --> 00:09:46,837 చాలా చాలా ధన్యవాదాలు. సరే, ధన్యవాదాలు. 187 00:09:46,920 --> 00:09:49,256 పత్రిక తొలి పేజీలో ఉన్న కవితని రాసింది నేనే, 188 00:09:49,339 --> 00:09:51,717 నేనే ఎమిలీ డికిన్సన్ ని. 189 00:09:52,092 --> 00:09:55,345 కవితకి మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. వావ్, దీన్ని చూడండి. 190 00:09:55,804 --> 00:09:57,723 ఈ కవితని చూడు. దీన్ని నువ్వు చదివావా? 191 00:09:57,806 --> 00:10:01,101 ఆ, చదివాను. దీన్ని ఒక మహిళ రాసింది. తను ధైర్యవంతురాలిలా ఉంది. 192 00:10:01,185 --> 00:10:02,853 ఇది చాలా బాగుందనుకుంటా. 193 00:10:02,936 --> 00:10:05,272 అవును, తను బాగా తెలివైనదని తెలిసిపోతుంది. 194 00:10:05,355 --> 00:10:07,983 -ధన్యవాదాలు. -ఇంకా తనకి కామకోరికలు కూడా ఎక్కువే. 195 00:10:08,066 --> 00:10:10,611 -అవును, తను కోరికలతో రగిలిపోతోంది. -ఒక్క నిమిషం, ఏంటి? 196 00:10:10,694 --> 00:10:12,571 తను ఈ ఊరిలోనే ఉంటోంది. మనం తను ఎక్కడుంటుందో కనిపెట్టవచచ్చు. 197 00:10:12,654 --> 00:10:15,115 -వద్దు, పర్వాలేదులే. -అవును. తన ఇంటికి వెళ్దాం. 198 00:10:15,199 --> 00:10:18,410 తన ఇంటి వద్దకి వెళ్లి, పొదల మాటున హస్తప్రయోగం చేసుకుందాం. 199 00:10:18,493 --> 00:10:20,287 నేనైతే ఈ కవిత మీదనే హస్తప్రయోగం చేసుకుంటా. 200 00:10:22,623 --> 00:10:23,790 పేరు ఎల్లప్పుడూ మనకి నచ్చకపోవచ్చు. 201 00:10:33,091 --> 00:10:35,928 తన విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగానే. 202 00:10:36,011 --> 00:10:37,513 అవును, నాకు ఈ కవిత చాలా బాగా నచ్చింది. 203 00:10:37,596 --> 00:10:40,015 ధన్యవాదాలు! ధన్యవాదాలు. మంచి మాట చెప్పావు. 204 00:10:40,349 --> 00:10:41,558 ఇదొక పిచ్చి కవితలాగా ఉంది. 205 00:10:42,184 --> 00:10:44,937 మొట్టమొదటగా, ఇందులో ప్రాస ఉంది, అది పిల్లోళ్ళ యవ్వారం. 206 00:10:45,020 --> 00:10:47,523 అవును. అది నిజమే, కానీ... 207 00:10:47,606 --> 00:10:49,608 కమాన్. ఇంకా ప్రాసలా? 208 00:10:50,359 --> 00:10:53,320 మనం ఆ దశని దాటిపోయామనుకున్నా. ఇప్పుడంతా మనం మామూలు కవితలనే కదా రాశేది? 209 00:10:53,403 --> 00:10:56,448 నా ఉద్దేశంలో, నియమాలను పక్కన పెట్టాలంటే ముందు వాటి మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. 210 00:10:56,532 --> 00:10:58,200 తను అసలు ఏ విషయంలోనూ పట్టు సాధించలేదులే. 211 00:10:58,283 --> 00:11:01,119 నేను దీన్ని నిద్రలో కూడా రాయగలిగేవాడిని, దీని చదువుతుంటే నాకు నిద్రే వస్తోంది. 212 00:11:01,203 --> 00:11:02,829 అసలు పసే లేదు. 213 00:11:02,913 --> 00:11:04,957 అంటే, నాకేమీ అలా అనిపించడం లేదు... 214 00:11:05,040 --> 00:11:06,416 నువ్వు నాకు నచ్చావు. 215 00:11:06,500 --> 00:11:08,168 ...కానీ ఇందులో నాకు దురుసుతనం కనబడుతోంది. 216 00:11:08,752 --> 00:11:09,962 దురుసుతనమా? ఎలా? 217 00:11:10,045 --> 00:11:12,089 అంటే, దీనిలో దురుసు అనేదే నాకు కనబడటంలేదు. 218 00:11:12,172 --> 00:11:14,800 అందుకే నాకు ఇది దురుసుగా ఉంది. ఏదోక పక్షం వహించాలి. 219 00:11:14,883 --> 00:11:17,135 రాజకీయాల మీద రాయాలి, లేకపోతే నీ సమయం అంతా వృధా చేసుకున్నట్టే. 220 00:11:18,136 --> 00:11:20,347 అవును, నువ్వు నా మనస్సు మార్చేశావు. 221 00:11:20,430 --> 00:11:24,059 ఈ కవితలో పస అనేదే లేదు, నాకు ఇది నచ్చలేదు. 222 00:11:24,142 --> 00:11:26,520 సరే. నాకు ఈ చర్చ నచ్చింది, కానీ... 223 00:11:26,603 --> 00:11:28,063 మన పనులు మనం చేసుకుందాం పదండి. 224 00:11:29,314 --> 00:11:30,315 హ్యాటీ. 225 00:11:32,401 --> 00:11:34,528 -ఏంటది? -పేరు తాలూకు మరో కోణం. 226 00:11:34,611 --> 00:11:36,613 మొత్తానికి తను ముద్రించేసింది. 227 00:11:36,697 --> 00:11:37,948 అవును, ఎమిలీ కవిత ముద్రించబడింది. 228 00:11:38,031 --> 00:11:39,950 ఇది నా జీవితంలో అత్యంత దారుణమైన రోజు. 229 00:11:40,033 --> 00:11:41,201 నిజానికి, ఇది నాకు చాలా నచ్చింది. 230 00:11:41,285 --> 00:11:44,204 -ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఉంది. -అది నిజమే. 231 00:11:44,288 --> 00:11:47,499 నాకు కూడా అది నచ్చింది. నాకర్థం కాలేదు. అందుకే నాకు నచ్చింది. 232 00:11:47,583 --> 00:11:49,418 ఇందులో చాలా నిగూఢ అర్థం ఉంది. 233 00:11:49,501 --> 00:11:51,170 ఇది మద్యం గురించి. 234 00:11:51,253 --> 00:11:53,797 మద్యం వ్యత్రిరేక సంఘం సభ్యులకు ఇది అస్సలు నచ్చలేదని విన్నాను. 235 00:11:53,881 --> 00:11:56,300 జనాలు ఈ కవిత మీద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తారు. 236 00:11:56,383 --> 00:11:57,551 తనకి రక్షణ అవసరం. 237 00:11:57,634 --> 00:11:59,303 తనకి ఏమీ కాదులే. 238 00:12:02,055 --> 00:12:03,265 హేయ్, మీకు ఇది అక్కర్లేదా? 239 00:12:07,102 --> 00:12:08,520 పేరు ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. 240 00:12:19,573 --> 00:12:21,992 మరి, పేరు పొందడం అనేది నువ్వు ఆశించినదానిలాగా లేదు కదా. 241 00:12:23,202 --> 00:12:27,289 నేనేమి ఆశించానో నాకు తెలీదు, కానీ ఇది దారుణంగా ఉంది. 242 00:12:27,372 --> 00:12:29,583 కమాన్. అంత దారుణంగా ఏమీ లేదులే. 243 00:12:31,210 --> 00:12:33,212 వాళ్ళు చెప్పేదాంట్లో నిజమున్నా, లేకపోయినా 244 00:12:33,295 --> 00:12:35,756 అందరూ నా గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. 245 00:12:35,839 --> 00:12:38,342 అదెలా ఉంటుందో జరిగేదాకా నీకు తెలీదనుకుంటా. 246 00:12:39,218 --> 00:12:41,428 పేరు... అది మరణం లాంటిది. 247 00:12:42,763 --> 00:12:44,223 కానీ నేను చనిపోలేదు కదా? 248 00:12:44,306 --> 00:12:45,807 లేదు. నువ్వు కేవలం... 249 00:12:46,350 --> 00:12:47,476 ఎవ్వరికీ కనబడటం లేదు, అంతే. 250 00:12:49,645 --> 00:12:51,480 చాలా గొప్ప గొప్ప విషయాలు కూడా కనబడవులే. 251 00:12:51,563 --> 00:12:52,564 ఏమంటున్నావు? 252 00:12:52,648 --> 00:12:53,815 మనం పీల్చే గాలి. 253 00:12:54,566 --> 00:12:56,610 వీచే పిల్లగాలులు. ప్రేమ. 254 00:13:00,572 --> 00:13:01,782 నువ్వేమంటున్నావో అర్థమవుతోంది. 255 00:13:02,199 --> 00:13:04,785 ఈ ప్రపంచం అదృశ్య విషయాల మీదనే నడుస్తోంది, ఎమిలీ డికిన్సన్. 256 00:13:07,746 --> 00:13:08,747 తెలుసా... 257 00:13:10,457 --> 00:13:11,458 నువ్వన్నది నిజమే. 258 00:13:13,836 --> 00:13:16,630 నేనొక మంచి సెంటు లాంటిదాన్ని. 259 00:13:17,297 --> 00:13:18,507 పాటలోని చరణాలు లాంటి దానివి. 260 00:13:19,132 --> 00:13:20,801 వేసవి ముగిసే సమయంలో అందరికీ కలిగే భావన లాంటి దాన్ని. 261 00:13:20,884 --> 00:13:22,052 కనబడకుండా ఉండటమనేది... 262 00:13:23,679 --> 00:13:24,888 ఒక శక్తి. 263 00:13:34,982 --> 00:13:36,692 నా మిత్రుడు బెన్ ని ఇక్కడే ఖననం చేశారు. 264 00:13:36,775 --> 00:13:38,110 నువ్వు అతడిని మిస్ అవుతున్నావు. 265 00:13:38,193 --> 00:13:39,987 అవును. మిస్ అవుతున్నాను. 266 00:13:40,070 --> 00:13:43,782 కానీ నేనిక్కడ నిలబడినప్పుడు, అతను కేవలం కనబడకుండా ఉన్నాడని మాత్రమే అనిపిస్తోంది. 267 00:13:45,450 --> 00:13:46,994 నీ సమాధి మీద ఏం రాసుంటుంది? 268 00:13:47,703 --> 00:13:49,329 నాకు సమాధి లేదు. 269 00:13:51,206 --> 00:13:53,417 కానీ నీకు ఏదోక పేరు ఉంటుంది కదా. 270 00:13:54,084 --> 00:13:55,419 -నాకు ఉందంటావా? -ఖచ్చితంగా ఉంటుంది. 271 00:13:56,211 --> 00:13:58,630 నిన్ను చూస్తే నాకెలాగో తెలిసినవాడిలా ఉన్నావు. నువ్వు నాకు తెలుసు. 272 00:13:59,590 --> 00:14:01,842 అంటే, నీ లోలోపల, నువ్వెవరో నీకు తెలిసి ఉంటుంది కదా. 273 00:14:02,217 --> 00:14:03,218 గుర్తులేదు. 274 00:14:04,344 --> 00:14:05,345 ఎందుకు? 275 00:14:06,972 --> 00:14:08,307 నాకేదీ గుర్తులేదు, కానీ... 276 00:14:10,642 --> 00:14:11,643 కానీ? 277 00:14:12,394 --> 00:14:13,604 అదొక ఫ్లాష్ అన్నమాట... 278 00:14:16,607 --> 00:14:17,608 భరించలేని నొప్పి. 279 00:14:18,650 --> 00:14:20,903 ఒక భారీ, భయంకరమైన యుద్ధం జరుగుతోంది, 280 00:14:20,986 --> 00:14:22,613 ఎక్కడ చూసినా మగవాళ్ళే ఉన్నారు, యువకులు అన్నమాట... 281 00:14:24,323 --> 00:14:25,324 ఆర్తనాదాలు చేస్తున్నారు. 282 00:14:25,407 --> 00:14:28,535 ఇంకా ఆ వాసన, ఎక్కడ చూసినా లోహపు వాసన. 283 00:14:31,288 --> 00:14:32,331 ఇంకా ఒక పేలుడు... 284 00:14:36,877 --> 00:14:37,878 నన్ను తాకడం. 285 00:14:38,629 --> 00:14:40,714 అది నాకు వెచ్చదనం కలిగించి, వెనువెంటనే నన్ను గడ్డకట్టుకుపోయేలా చేసి... 286 00:14:44,176 --> 00:14:45,177 ఇక అంతే. 287 00:15:22,297 --> 00:15:25,133 దక్షిణ రాష్ట్రాల నుండి ఇది బాగుందని నాకు వర్తమానం అందింది. 288 00:15:25,217 --> 00:15:26,426 -అదీ! -అంతే. 289 00:15:26,510 --> 00:15:28,720 మన పత్రిక అమ్మకాల ద్వారా మనకి అందిన డబ్బు, 290 00:15:28,804 --> 00:15:31,139 జాన్ బ్రౌన్ కి, అలాగే అతని శిబిరానికి చేరింది. 291 00:15:31,598 --> 00:15:34,351 -అదీ! -అతని మనుషులు ఆశావాహ దృక్పథంలో ఉన్నారు. 292 00:15:34,434 --> 00:15:36,353 ఇప్పుడు వాళ్ళకి కావలసిందల్లా వాళ్ళ వద్ద ఉంది, 293 00:15:36,436 --> 00:15:38,981 ఇదంతా మన చలవ, అలాగే మన లాంటి వాళ్ళ చలవ. 294 00:15:39,064 --> 00:15:40,816 యాహూ! మంచిది! 295 00:15:42,150 --> 00:15:44,778 త్వరలోనే, వాళ్ళు తమ వ్యూహానికి కార్యరూపాన్ని ఇస్తారు. 296 00:15:44,862 --> 00:15:46,488 వాళ్ళు దాడి చేస్తారు... 297 00:15:46,572 --> 00:15:50,826 అప్పుడు ఈ అమెరికన్ రూపురేఖలు సమూలంగా మారిపోతాయి. 298 00:15:51,285 --> 00:15:54,872 తిరుగుబాటు జరగబోతోంది. 299 00:15:54,955 --> 00:15:56,290 అది జరగబోతోంది! జరగబోతోంది! 300 00:15:56,373 --> 00:15:59,710 "ది కాన్స్టిలేషన్"కి అందులో భాగం ఉంది. 301 00:16:00,169 --> 00:16:05,883 మన డబ్బు ద్వారా వాళ్ళు ఆయుధాలు కొనుండవచ్చు కానీ మన పదాలే వారికి బలం ఇచ్చాయి. 302 00:16:05,966 --> 00:16:07,009 అవును! 303 00:16:10,762 --> 00:16:13,390 అందరి పదాలు కాదులే. హ్యాటీ. 304 00:16:13,849 --> 00:16:16,518 నువ్వేమన్నా చెప్పాలనుకుంటే, నేరుగా నా మొహం మీద చెప్పేయి. 305 00:16:16,602 --> 00:16:19,563 ఊరికే అంటున్నానులే. పసలేని నీ దెయ్యాల కథల వల్ల ఎవ్వరికీ చైతన్యం కలగడం లేదు. 306 00:16:19,646 --> 00:16:23,567 నా పసలేని "దెయ్యాల కథల"లో అర్థం దాగుంటుంది. 307 00:16:23,650 --> 00:16:27,654 మహిళల అనుభవాల గురించి కీలక ప్రశ్నలు అడగటానికి నేను మోటైన కథలను రాస్తాను, 308 00:16:27,738 --> 00:16:29,281 కానీ నేనైతే నీలాగా 309 00:16:29,364 --> 00:16:33,785 గత పదేళ్ళుగా నీ సొంత అత్యల్పమైన పిట్టకథని చెప్పుకుంటూ గడపడం లేదులే. 310 00:16:33,869 --> 00:16:35,078 నేను ఒక పెట్టెలో తప్పించుకున్నాను. 311 00:16:35,162 --> 00:16:36,622 నువ్వు వీధిల్లో ప్రదర్శరించే గారడివాడివిలే. 312 00:16:36,705 --> 00:16:38,290 వావ్. 313 00:16:38,373 --> 00:16:41,710 నువ్వు ఒక పెట్టెలో తప్పించుకున్నావని జనాలకి పదేపదే చెప్తూనే ఉంటావు. 314 00:16:41,793 --> 00:16:43,921 మాకర్థమైంది. అందరికీ అర్థమైంది. 315 00:16:44,004 --> 00:16:46,548 నేను బానిసత్వం వల్ల కలిగే నష్టాలను అందరికీ తెలియపరుస్తున్నాను. 316 00:16:46,632 --> 00:16:47,799 నువ్వు అది ఎంత తీవ్రంగా తెలియపరుస్తున్నావంటే, 317 00:16:47,883 --> 00:16:50,010 జనాలు దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు. 318 00:16:50,093 --> 00:16:51,053 హేయ్, ఇక ఆపండి! 319 00:16:51,136 --> 00:16:52,429 అది నిజం. 320 00:16:52,513 --> 00:16:54,431 ఈ మంకుపట్టుతనాన్ని ఆపండి. 321 00:16:54,890 --> 00:16:57,309 మనం వాటన్నింటికీ అతీతం అవ్వాలి. 322 00:16:57,392 --> 00:16:59,937 మనం చేసే పనికి మన అహంకారం అడ్డు రాకూడదు. 323 00:17:00,020 --> 00:17:02,606 ఎవరి వైపు ఎక్కువ శ్రద్ద వెళ్తోంది, ఎవరికి ఎక్కువ డబ్బు దక్కుతుంది, 324 00:17:03,023 --> 00:17:05,317 ఎవరి పేరు పతాక శీర్షికలో పడుతుందన్నది ముఖ్యం కాదు. 325 00:17:05,400 --> 00:17:08,153 మనం పోరాడేది అందుకు కాదు. 326 00:17:08,694 --> 00:17:09,988 -అందుకేనా? -కాదు. 327 00:17:10,071 --> 00:17:11,490 -అందుకేనా? -కాదు. 328 00:17:11,573 --> 00:17:12,491 కాదు. 329 00:17:13,242 --> 00:17:16,453 వాటన్నింటి కన్నా మనం ఇక్కడ ఏం చేస్తున్నామో, అదే ముఖ్యమైనది. 330 00:17:16,537 --> 00:17:21,791 మనం ఇక్కడ మనకి కూడా జీవించే హక్కు ఉందని మన గళమెత్తుతున్నాం. 331 00:17:21,875 --> 00:17:22,876 అవును. 332 00:17:22,960 --> 00:17:24,419 మన రచనలు? 333 00:17:24,502 --> 00:17:27,172 మన వార్తాపత్రిక ప్రపంచాన్ని మార్చేస్తోంది. 334 00:17:27,673 --> 00:17:31,093 ఈ దేశం యొక్క విధిరాతనే ఇది మార్చేస్తోంది. 335 00:17:31,510 --> 00:17:37,683 మనం ఇవాళ ఎవరో తెలియకపోవచ్చు, కానీ రేపు మనమెవరో తెలిసిపోయే అవకాశముంది. 336 00:17:37,766 --> 00:17:39,518 -సరే. -అవును. అవును. 337 00:17:39,601 --> 00:17:41,478 -నువ్వు అదృశ్యంగానే ఉండిపోతావా? -లేదు. 338 00:17:41,812 --> 00:17:43,856 -నువ్వు అదృశ్యంగానే ఉండిపోతావా? -లేదు. 339 00:17:46,817 --> 00:17:47,985 నువ్వు? 340 00:17:48,652 --> 00:17:52,030 -అవును, నువ్వు అదృశ్యంగానే ఉండిపోతావా? -లేదు. 341 00:17:52,114 --> 00:17:53,031 అది నిజమే. 342 00:17:53,115 --> 00:17:54,241 హెన్రీ చెప్పింది నిజమే. 343 00:17:55,325 --> 00:17:58,620 మనం సంబరాలు చేసుకోవాలి... తిట్టుకోకూడదు. 344 00:18:00,163 --> 00:18:01,164 తథాస్తు. 345 00:18:01,582 --> 00:18:02,875 సరేమరి. మంచిది. 346 00:18:02,958 --> 00:18:05,210 మన పత్రికకి సభ్యత్వాలు తీసుకొన్నవారి సంఖ్య అకాశాన్ని అంటుతోంది. 347 00:18:05,294 --> 00:18:10,549 మనం మనస్సుకు, దేహానికి, ఆత్మకి సంబంధించిన తిరుగుబాటుకు ఆజ్యం పోస్తున్నాం. 348 00:18:10,632 --> 00:18:13,302 మన రేపటి తరాలు దీని కంటే మంచి లోకంలో జీవించగలరు, 349 00:18:13,385 --> 00:18:15,095 ఎందుకంటే మనం దాని కోసమే పోరాడుతున్నాం. 350 00:18:15,179 --> 00:18:17,181 మనం మన గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నాం. 351 00:18:17,264 --> 00:18:19,183 అవును! అవును. 352 00:18:20,893 --> 00:18:24,855 నాకు మీ గురించి తెలియదు కానీ... 353 00:18:27,524 --> 00:18:28,734 నాకయితే చిందులేయాలని ఉంది. 354 00:18:31,945 --> 00:18:34,698 బాబోయ్. నువ్వు దాన్ని దొంగలించావా ఏంటి? 355 00:18:35,115 --> 00:18:36,116 నన్ను మత్తెక్కించేలా కనబడనివ్వు. 356 00:18:36,533 --> 00:18:37,951 నేను నా ఫిడేలును తెచ్చుకున్నాను. 357 00:18:38,035 --> 00:18:39,453 అదీలెక్క. 358 00:18:39,536 --> 00:18:41,663 ఫ్రెడ్డీ మళ్లీ పిచ్చోడు అయిపోయాడు. 359 00:20:05,247 --> 00:20:06,331 టెంపోని పెంచండి. 360 00:20:08,000 --> 00:20:10,127 ఎమిలీ ఇక్కడికి త్వరలోనే వచ్చేస్తుందిలే. 361 00:20:11,044 --> 00:20:12,087 ఏదైతే ఏంటిలే. 362 00:20:13,297 --> 00:20:14,423 దేవుడా, తను ఏమైపోయిందబ్బా? 363 00:20:14,506 --> 00:20:18,468 ఈ చక్కని రాత్రి కోసం మనమంతా వేచి చూస్తున్నాం, ఇక తను... అదృశ్యమైపోయింది. 364 00:20:22,014 --> 00:20:22,931 ఆస్టిన్. 365 00:20:26,935 --> 00:20:28,103 నువ్వు ఎమిలీని చూశావా? 366 00:20:28,687 --> 00:20:29,813 ఈరోజు చూడలేదు. 367 00:20:30,981 --> 00:20:33,275 వంట గది మీద దాడి చేశాను. తినడానికి అక్కడ ఎక్కువ ఏమీ లేవు. 368 00:20:35,152 --> 00:20:36,695 మన ప్రముఖ వ్యక్తి ఏమైపోయింది? 369 00:20:36,778 --> 00:20:39,156 చూడండి, అందరూ, మిస్టర్ బౌల్స్ వచ్చేశారు. 370 00:20:39,239 --> 00:20:40,240 నాకు ఆలస్యమైనందుకు మన్నించాలి. 371 00:20:40,699 --> 00:20:42,034 తను ఎక్కడ? 372 00:20:42,451 --> 00:20:45,120 -ఎమిలీ? తను ఇవాళ అస్సలు కనబడనే లేదు. -అవును. 373 00:20:46,246 --> 00:20:48,874 కనబడటం లేదా? అది కూడా ఈరోజా? 374 00:20:49,666 --> 00:20:52,878 తన మీద కురిసే ప్రశంసా జల్లులని ఆస్వాదిస్తూ తిరుగుతుంటుందని అనుకున్నాను. 375 00:20:57,549 --> 00:20:59,384 హేయ్. ఎలా ఉన్నావు, బాసూ? 376 00:20:59,927 --> 00:21:02,137 ఈ నకలు చాలా బాగుంది. నువ్వే చేయించావా? 377 00:21:02,763 --> 00:21:05,182 నకలా? ఏమంటున్నావు? 378 00:21:05,265 --> 00:21:07,809 నా ఉద్దేశం, ఇది అసలైన చిత్రాన్ని చాలా బాగా పోలి ఉంది అని. 379 00:21:07,893 --> 00:21:09,520 ఇదే ఆ అసలైన చిత్రం. 380 00:21:10,354 --> 00:21:11,980 ఒక యూరోప్ కళాకారుడు దీన్ని గీశాడు. 381 00:21:12,064 --> 00:21:13,774 కాదు, ఇది అది కాదు. 382 00:21:13,857 --> 00:21:15,359 చూడు, ఇది గీసిన వ్యక్తి నాకు తెలుసు. 383 00:21:15,943 --> 00:21:17,569 గడ్డిని చూస్తే ఇది నకలు అని తెలిసిపోతుంది. 384 00:21:18,153 --> 00:21:20,614 గడ్డిని అవసరమైనంత సున్నితంగా గీయలేదు. 385 00:21:21,782 --> 00:21:23,992 నేను చాలా ఖర్చుపెట్టి దీన్ని కొన్నాను. 386 00:21:24,910 --> 00:21:27,079 మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? 387 00:21:29,248 --> 00:21:30,499 ఈ చిత్రం గురించి. 388 00:21:31,124 --> 00:21:32,251 ఇది అసలైనది కాదు. 389 00:21:32,334 --> 00:21:34,169 ఇది అసలైనదే అని వాళ్ళు నాకు చెప్పారు. 390 00:21:37,923 --> 00:21:43,136 ఇది బాగానే ఉంది కదా, అలాంటప్పుడు ఇది అసలైనది అయితే ఏంటి, కాకపోతే ఏంటి? 391 00:21:46,765 --> 00:21:48,642 -ఒక్క నిమిషం. -ఆస్టిన్, నువ్వు ఇప్పుడు వెళ్లిపోలేవు. 392 00:21:48,725 --> 00:21:50,519 -నాకు బుర్ర పగిలిపోతోంది. -మన ఇంట్లో అతిథులు ఉన్నారు. 393 00:21:50,602 --> 00:21:53,981 ఎమిలీ లేదు కదా, మనం ఈ పార్టీని తన కోసమే నిర్వహిస్తున్నాం కదా, 394 00:21:54,773 --> 00:21:55,899 కాబట్టి నేను వెళ్లి తనను తీసుకువస్తాను. 395 00:23:59,815 --> 00:24:00,816 ఎమిలీ! 396 00:24:16,665 --> 00:24:18,709 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పద. 397 00:24:20,210 --> 00:24:22,796 వావ్, ఆస్టిన్. నేను నీకు కనబడుతున్నానా? 398 00:24:22,880 --> 00:24:24,006 నువ్వు తాగున్నావా? 399 00:24:24,631 --> 00:24:26,383 నాకు తెలీదు. నువ్వు తాగున్నావా? 400 00:24:27,759 --> 00:24:29,344 నువ్వు మా ఇంటికి ఎందుకు రాలేదు? 401 00:24:29,428 --> 00:24:33,557 ఎందుకంటే, నన్నెవ్వరూ చూడలేకపోతున్నారు, ఆస్టిన్. నేనెవ్వరికీ కనబడటం లేదు. 402 00:24:33,974 --> 00:24:35,976 సరే, నేను మాత్రం నిన్ను చూడగలుగుతున్నాను. 403 00:24:36,685 --> 00:24:39,438 ఈ రోజు అంతటిలో నన్ను చూడగలిగిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. 404 00:24:39,521 --> 00:24:42,900 నీ కవితలు ముద్రించబడ్డాయని నీకు మానసికంగా ఏదైనా తేడా జరిగిందా? 405 00:24:44,234 --> 00:24:45,903 నేను అనామకురాలిని, ఆస్టిన్. 406 00:24:48,405 --> 00:24:49,823 నాకు నువ్వు అనామకురాలివి కాదు. 407 00:24:49,907 --> 00:24:51,658 అతను నిజంగా అతనితోనే మాట్లాడుకుంటున్నాడా? 408 00:24:51,742 --> 00:24:52,868 అవును, అతను నా బాస్. 409 00:24:52,951 --> 00:24:54,077 ఏమైంది అతనికి? 410 00:24:54,578 --> 00:24:57,039 నేనెంత మంది తెల్లవాళ్ళ రహస్యాలను దాస్తున్నానో నువ్వసలు ఊహించలేవు. 411 00:24:58,165 --> 00:24:59,458 నువ్వు నా కవితని చదివావా? 412 00:24:59,541 --> 00:25:00,542 చదివాను. 413 00:25:01,460 --> 00:25:02,920 నీ మీద నాకు చాలా గర్వంగా ఉంది. 414 00:25:03,253 --> 00:25:04,254 నిజంగానా? 415 00:25:04,338 --> 00:25:06,089 అవును. నిజంగానే, 416 00:25:06,715 --> 00:25:09,384 ప్రస్తుతం నా జీవితంలో నేను గర్వపడేది ఏదైనా ఉందంటే, అది నువ్వే. 417 00:25:10,219 --> 00:25:11,386 ఆస్టిన్, ఏమైంది? 418 00:25:12,304 --> 00:25:14,515 ఏంలేదులే, నేను చెప్పేది బాగా విను. 419 00:25:15,098 --> 00:25:19,311 నీ కవిత్వం, అది చాలా వాస్తవమైనది. నీలో వాస్తవమైనది ఒకటి ఉంది. 420 00:25:19,394 --> 00:25:21,021 నాలో కూడా అలాంటిది ఏదైనా ఉంటే... 421 00:25:22,689 --> 00:25:24,107 నేను సంతోషంగా ఉండేవాడిని. 422 00:25:24,691 --> 00:25:27,528 -హేయ్, మిస్టర్ డికిన్సన్. -ఆస్టిన్. 423 00:25:28,904 --> 00:25:29,988 చూడు. అదిగో నా బండి. 424 00:25:52,469 --> 00:25:53,470 అయ్యో. 425 00:25:57,099 --> 00:25:58,725 -నమస్తే, అమ్మాయి. -నమస్తే. 426 00:25:59,685 --> 00:26:05,858 ఈ మధ్యే చనిపోయిన ఒక మహారచయిత అయిన, ఎడ్గార్ ఆలన్ పో ని నీకు పరిచయం చేస్తున్నా. 427 00:26:05,941 --> 00:26:08,235 అవును, అది నేనే. నీకు ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా? 428 00:26:08,318 --> 00:26:10,070 వావ్. మీరు ఇక్కడ ఉన్నారంటే నేనస్సలు నమ్మలేకపోతున్నాను. 429 00:26:10,946 --> 00:26:12,322 అతను కొన్నేళ్ళ క్రితమే చనిపోయాడు. 430 00:26:12,406 --> 00:26:15,742 అవును, నేను దెయ్యాన్ని, ఎడ్గార్ ఆలన్ పో యొక్క దెయ్యాన్ని. 431 00:26:16,243 --> 00:26:19,371 అనుమానాస్పద పరిస్థితుల మధ్య చనిపోయాను. నా గుర్తింపుకు తగినట్టుగానేలే. 432 00:26:19,454 --> 00:26:21,540 లేదు, నువ్వు మరీ ఎక్కువ తాగి చనిపోయావు, సోదరా. 433 00:26:22,249 --> 00:26:23,250 సరేమరి. 434 00:26:24,001 --> 00:26:25,294 నువ్వు నన్ను చూడటానికి వచ్చావు. 435 00:26:25,377 --> 00:26:27,087 మంచిది. అభిమానులను కలవడమంటే నాకు చాలా ఇష్టం. 436 00:26:27,171 --> 00:26:29,965 నీకు ఇష్టమైనదాని పేరు వచ్చినప్పుడు తల ఊపు. 437 00:26:30,048 --> 00:26:33,635 "ద రేవన్," "టెల్-టేల్ హార్ట్," "అనాబెల్ లీ." 438 00:26:33,719 --> 00:26:35,137 నువ్వు తల ఆడించడం లేదు. 439 00:26:35,512 --> 00:26:39,391 "ద ఫాల్ ఆఫ్ ద హౌజ్ ఆఫ్ అషర్," "ద కాస్క్ ఆఫ్ అమోంటిల్యాడో"... 440 00:26:39,474 --> 00:26:40,559 నేను "రేవన్"ని మాత్రమే చదివాను. 441 00:26:40,642 --> 00:26:41,810 అలాగే. 442 00:26:42,644 --> 00:26:44,479 ఇది చాలా చక్కగా ఉంది, 443 00:26:44,563 --> 00:26:46,481 కానీ మనం అంతా తిరుగుతూ, నా అభిమానులను కనుగొని 444 00:26:46,565 --> 00:26:48,609 వారితో రాసకేళీలు జరుపుకోవచ్చని అనుకున్నాను. 445 00:26:49,651 --> 00:26:51,236 తను నా అభిమాని, సోదరా. 446 00:26:51,320 --> 00:26:52,321 అవును. 447 00:26:52,404 --> 00:26:54,114 ఒక అందమైన వనిత యొక్క మరణానికి మించిన 448 00:26:54,198 --> 00:26:58,368 కవితార్హమైన విషయం, ఈ ప్రపంచంలోనే ఉండదంటే అది అతిశయోక్తి కాదు. 449 00:27:02,414 --> 00:27:03,540 నన్ను సూ ఇంటి వద్ద దింపుతారా? 450 00:27:03,624 --> 00:27:05,000 సూ ఎవరు? తను నా కోరికలను తీరుస్తుందా? 451 00:27:05,083 --> 00:27:07,544 సూ నా ప్రాణ స్నేహితురాలు. తను నాకు పార్టీ ఇస్తోంది. 452 00:27:08,170 --> 00:27:10,005 ఒక సాహిత్య సంబంధిత పార్టీ. 453 00:27:10,088 --> 00:27:13,509 నేను కూడా ఒక పేరు పొందిన రచయిత్రినే కనుక, నా కవిత్వాన్ని వేడుకగా చేసుకోవడానికి. 454 00:27:13,592 --> 00:27:16,136 నిజంగానా? నీ ప్రచురణకర్త ఎవరు? "వైలీ అండ్ పాట్నమ్"? 455 00:27:16,595 --> 00:27:19,932 నా కవిత ఈరోజే "ద స్ప్రింగ్ ఫీల్డ్ రిపబ్లికన్"లో ముద్రించబడింది. 456 00:27:20,682 --> 00:27:22,392 మన్నించాలి, నువ్వు "న్యూ యోర్క్ ట్రిబ్యూన్" అని అన్నావా? 457 00:27:22,809 --> 00:27:25,437 కాదు, ద... స్ప్రింగ్ ఫీల్డ్ 458 00:27:25,521 --> 00:27:26,939 నువ్వు అన్నది అతనికి వినిపించింది. 459 00:27:27,814 --> 00:27:29,024 వెటకారం చేస్తున్నాడు, అంతే. 460 00:27:30,025 --> 00:27:32,736 వార్తాపత్రికలో ఒక కవిత పడగానే, పెద్ద తోపు అనుకుంటున్నావు. 461 00:27:33,570 --> 00:27:35,572 నేను సగౌరవంగా నీకు తెలియజేస్తున్నాను, 462 00:27:35,656 --> 00:27:39,243 నువ్వెవ్వరో అస్సలు నాకు తెలీనే తెలీదు, ఇప్పుడు తెలుసుకోవాలనుకున్నా అది కుదరదు. 463 00:27:39,326 --> 00:27:43,247 నా ప్రియమైన యువతీ, పేరు ఎలా ఉంటుందో నీకు తెలీను కూడా తెలిదు. 464 00:27:43,330 --> 00:27:45,582 సరే, కేవలం ఒక్క కవిత మాత్రమే కాదు. 465 00:27:46,166 --> 00:27:48,669 -అవునా? -ఎడిటర్ ఇంకా చాలా ముద్రించబోతున్నాడు. 466 00:27:51,255 --> 00:27:52,673 -వాళ్ళు నిన్ను బుట్టలో పడేశారు. -ఏంటి? 467 00:27:52,756 --> 00:27:56,301 పేరు అనేది మనల్ని బానిసగా చేసుకుంటుంది. ఒకసారి వస్తే, దానికి దాసి అయిపోతావు. 468 00:27:56,385 --> 00:27:58,929 ఇంకా పేరు రావాలని నువ్వు తపిస్తూనే ఉంటావు. 469 00:27:59,012 --> 00:28:02,099 ధనవంతులైనా పేదవారైనా. తెలిసినా, తెలియకపోయినా. 470 00:28:02,182 --> 00:28:04,434 కానీ అది మాత్రం చాలదు. నన్ను చూడు. 471 00:28:04,518 --> 00:28:08,397 నాకు ఎంత పేరున్నా, చివరికి ఏమైంది, చనిపోయాను. 472 00:28:09,231 --> 00:28:13,068 నాకు ఆనందాన్ని ఇచ్చే మహిళ కోసం వెతుకుతూ, 473 00:28:13,151 --> 00:28:17,155 చచ్చినవారిని తిప్పే జట్కా బండిలో ఊరంతా తిరుగుతూ ఉన్నాను, 474 00:28:19,324 --> 00:28:20,325 ప్రపంచాంతం వరకు. 475 00:28:20,409 --> 00:28:21,994 ఆగాగు. ప్రపంచాంతం వరకూ ఏమీ కాదు. 476 00:28:22,953 --> 00:28:24,705 ఏదోక సమయంలో నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 477 00:28:24,788 --> 00:28:26,874 నువ్వు నా శ్రద్ధాంజలి సంస్మరణని మళ్లీ చదువుతావా? 478 00:28:26,957 --> 00:28:28,625 దేవుడా. ఇక దాన్ని వదిలేయి. 479 00:28:28,709 --> 00:28:32,296 భగవంతుడా. నేను నా కజిన్/బాల వధువును మిస్ అవుతున్నాను. 480 00:28:32,379 --> 00:28:34,381 తను నా సంస్మరణని చదివేది. 481 00:28:37,885 --> 00:28:38,886 పేరు... 482 00:28:42,139 --> 00:28:43,182 అనేది ఒక తుమ్మెద లాంటిది. 483 00:28:44,057 --> 00:28:45,475 -ఏంటి? -నాకది నచ్చింది. 484 00:28:47,227 --> 00:28:48,353 నేను బాగా తాగున్నాను. 485 00:28:50,147 --> 00:28:51,523 మేము నిన్ను దింపేయాలా? 486 00:28:52,316 --> 00:28:53,317 వద్దు. 487 00:28:54,651 --> 00:28:56,778 వద్దు, ఇంకాసేపు తిరుగుదాం. 488 00:28:56,862 --> 00:28:58,280 నేను స్టైల్ గా ఆలస్యంగా వెళ్దామనుకుంటున్నాను. 489 00:28:59,072 --> 00:29:00,991 మరి నీ సంగతేంటి? ఎక్కడికైనా వెళ్ళాలా? 490 00:29:01,074 --> 00:29:02,701 లేదు, సోదరా. అస్సలు లేదు. 491 00:29:26,308 --> 00:29:27,309 సూ? 492 00:29:31,146 --> 00:29:32,397 సూ? 493 00:29:36,443 --> 00:29:37,736 ఎక్కడున్నావు నువ్వు? 494 00:30:03,220 --> 00:30:04,429 నేను అక్కడికే వెళ్తాను. 495 00:30:07,975 --> 00:30:09,184 నా పదాలు. 496 00:30:14,815 --> 00:30:15,816 సూ. 497 00:30:19,111 --> 00:30:21,446 సూ, నువ్వు అన్నది నిజమే. నువ్వు అన్న ప్రతీమాటా నిజమే. 498 00:30:21,530 --> 00:30:24,116 జనాలు నన్ను గొప్పగా చూడాలి. 499 00:30:24,199 --> 00:30:25,576 నువ్వు నన్ను గొప్పగా చూడాలి. 500 00:30:26,535 --> 00:30:27,536 సూ? 501 00:30:27,911 --> 00:30:29,830 పర్వాలేదు. ఇక్కడ ఎవ్వరూ లేరు. 502 00:32:10,055 --> 00:32:12,057 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య