1 00:00:11,762 --> 00:00:12,763 అమ్మా! 2 00:00:14,431 --> 00:00:15,641 నాకు నీ సాయం కావాలి. 3 00:00:15,724 --> 00:00:17,309 ఆస్టిన్, ఏమైంది? 4 00:00:17,392 --> 00:00:19,311 చెప్పనవసరం లేదులే. ఉతికిన సాక్సులన్నింటినీ నువ్వు వాడేశావు. 5 00:00:19,394 --> 00:00:21,355 కాదు, ఇది అంతకన్నా దారుణమైంది. 6 00:00:21,438 --> 00:00:25,025 నేను మా కాలేజీ స్నేహితుల కోసం ఓ రీయూనియన్ హోస్ట్ చేస్తున్నాను, కానీ సూ ఊరిలో లేదు. 7 00:00:25,108 --> 00:00:26,109 ఎక్కడికి వెళ్లింది? 8 00:00:26,193 --> 00:00:27,986 ఒక నేస్తాన్ని కలవడానికి వెళ్లింది. 9 00:00:28,070 --> 00:00:29,112 నేస్తం అంటే? 10 00:00:29,196 --> 00:00:30,489 ఏమో. నాకు తెలీదు. 11 00:00:30,572 --> 00:00:32,573 బిడియస్థురాలైన సూ ఇంత మంది మిత్రులని ఎలా సంపాదించింది 12 00:00:32,658 --> 00:00:34,910 అని నేనెంత బుర్ర బద్దలుకొట్టుకున్నా నాకు అర్థంకావడం లేదు. 13 00:00:34,993 --> 00:00:37,162 అమ్మా! ఇప్పుడు నేనేం చేయాలి? 14 00:00:37,246 --> 00:00:40,541 నా మిత్రులందరూ వస్తున్నారు, నేను వాళ్ళకి భోజనం చేసి వెళ్ళాలని, 15 00:00:40,624 --> 00:00:42,292 కనీసం ఫలహారాలను అయినా తిని వెళ్ళాలని చెప్పాను. 16 00:00:42,376 --> 00:00:44,294 బంగారం, కంగారుపడిపోకు. 17 00:00:44,378 --> 00:00:45,629 నీకు నేను సాయం చేస్తాను. 18 00:00:45,712 --> 00:00:47,548 దేవుడా? నిజంగా చేస్తావా? 19 00:00:47,631 --> 00:00:49,216 తప్పకుండా. 20 00:00:49,299 --> 00:00:52,219 మీ కొత్త వంట గదిలోకి రావాలని నేనెంతగానో ఎదురుచూస్తున్నాను. 21 00:00:52,302 --> 00:00:55,055 కేకుల తయారీకి ఉపయోగించే ఆ కొత్త మెరిసేటి పాత్రని తాకాలని నాకెంతగానో ఉంది. 22 00:00:55,931 --> 00:00:57,099 తప్పకుండా. 23 00:00:57,182 --> 00:01:00,018 నేను మీ స్నేహితులకి, మీ జీవితంలో మీరు ఎన్నడూ కనీవిని ఎరుగని టీ పార్టీని ఇస్తా. 24 00:01:00,644 --> 00:01:01,770 ఏంటిది? 25 00:01:01,854 --> 00:01:03,480 వీడు స్లిప్పర్లని వేసుకొని ఇక్కడ ఎందుకు ఉన్నాడు? 26 00:01:03,564 --> 00:01:06,567 మన అబ్బాయి, తన మిత్రులకి టీ పార్టీ ఇస్తున్నాడు, దానికి నేను సాయమందిస్తున్నా. 27 00:01:06,650 --> 00:01:08,735 ఆ పని వాడు చూసుకోలేడా? 28 00:01:08,819 --> 00:01:11,405 -లేదు. -ఇక్కడ టీ చేయడానికి నువ్వు ఉండాలి కదా. 29 00:01:11,488 --> 00:01:12,781 బోర్డ్ మీటింగ్ ఉంది, గుర్తుందా? 30 00:01:12,865 --> 00:01:13,866 బోర్డ్ మీటింగ్ ఏంటి? 31 00:01:13,949 --> 00:01:17,202 ఎడ్వర్డ్, నీ భార్య న్యూ ఇంగ్లాండ్ లోకల్లా అత్యుత్తమైనదని మర్చిపోయినట్టున్నావు. 32 00:01:17,286 --> 00:01:20,747 నా కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టేసున్నా కూడా నేను రెండు టీ పార్టీలని ఇవ్వగలను. 33 00:01:20,831 --> 00:01:22,666 అంత శ్రమపడిపోవలసిన అవసరం లేదులే. 34 00:01:22,749 --> 00:01:23,834 బహుశా ఎమిలీ సాయపడగలదేమో. 35 00:01:23,917 --> 00:01:25,294 తను సాయపడలేదు. 36 00:01:25,377 --> 00:01:27,379 నిన్నటి నుండి తన గది నుండి తను బయటకు రాలేదు. 37 00:01:27,462 --> 00:01:29,298 తన కవిత ముద్రించబడినప్పటి నుండి. 38 00:01:29,381 --> 00:01:30,716 తనను ఎవ్వరూ చూడలేదు. 39 00:01:30,799 --> 00:01:32,926 తను చాలా సిగ్గుచేటుగా భావిస్తోందనుకుంటా. 40 00:01:33,510 --> 00:01:34,511 నిన్న రాత్రి నేను తనని చూశాను. 41 00:01:35,429 --> 00:01:37,055 చూశావా? ఎక్కడ? 42 00:01:38,807 --> 00:01:42,227 స్పష్టంగా ఆలోచించాను, నేను తనని చూడలేదులే. 43 00:01:42,311 --> 00:01:43,312 చాలా వింతగా అనిపించింది. 44 00:01:43,395 --> 00:01:45,522 ఈ మధ్య తను ఇలా తరచుగా ప్రవర్తిస్తోంది. 45 00:01:45,606 --> 00:01:48,150 ఒక పిచ్చిదానిలాగా తన గది నుండి అస్సలు బయటకు అడుగే పెట్టడం లేదు. 46 00:01:48,567 --> 00:01:51,445 ఇది నాకు కలత కలిగిస్తోంది. ఇది తాత్కాలికమే అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 47 00:01:55,532 --> 00:01:57,451 డికిన్సన్ 48 00:01:57,534 --> 00:01:59,536 బాధ అంటే నాకు ఇష్టం 49 00:02:11,632 --> 00:02:12,633 నాన్నా. 50 00:02:17,346 --> 00:02:18,764 ఈ బోర్డ్ మీటింగ్ ఏంటి? 51 00:02:19,348 --> 00:02:23,143 "ద స్ప్రింగ్ ఫీల్డ్ రిపబ్లికన్" ఇంకా దాని అనుబంధ సంస్థల పెట్టుబడీదారుల సమావేశం, 52 00:02:23,227 --> 00:02:25,270 ఇప్పుడు మనం కూడా అందులో ఒకరం. 53 00:02:26,480 --> 00:02:28,941 ఒక్క నిమిషం, నువ్వు అతని పత్రికలో పెట్టుబడి పెట్టావా? 54 00:02:29,024 --> 00:02:31,527 అవును, అది నిజం. న్యూమన్ ఎస్టేట్ లోని మిగిలిన ఆస్థిని పెట్టా. 55 00:02:31,610 --> 00:02:33,612 మిస్టర్ బౌల్స్ పత్రికలో దాన్ని పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాను. 56 00:02:33,695 --> 00:02:35,155 -కానీ నాన్నా, అతను... -మొదట్లో నేను కూడా తటపటాయించాను, 57 00:02:35,239 --> 00:02:38,283 కానీ అతను కాదనలేని ఒక వాదనతో ఒప్పించాడు. 58 00:02:38,367 --> 00:02:40,285 వార్తాపత్రికల వ్యాపారం పెరుగుతుందే తప్ప తరగదు. 59 00:02:40,369 --> 00:02:41,828 భవిష్యత్తు అంతా ప్రింట్ జర్నలిజానిదే. 60 00:02:41,912 --> 00:02:43,956 కానీ, నాన్నా, నాకు అర్థంకావడం లేదు. 61 00:02:44,498 --> 00:02:45,499 నా ఉద్దేశం... 62 00:02:46,166 --> 00:02:49,920 ఎమిలీ కవితలను ముద్రించిన వ్యక్తి పత్రికలో నువ్వు పెట్టుబడి ఎలా పెట్టగలిగావు? 63 00:02:50,003 --> 00:02:52,047 నీకు అలాంటివి అస్సలు నచ్చవు అని అనుకున్నా. 64 00:02:52,130 --> 00:02:54,383 అతను ఎమిలీ కవితలను చాలా ప్రచురించాలనే ఆలోచనలో ఉన్నాడు. 65 00:02:54,466 --> 00:02:57,386 కాలంతో పాటు మనం కూడా మారాలి కదా? 66 00:02:57,469 --> 00:02:59,388 అదీగాక, నేను ఆ విషయంలో గొడవ పడితే, 67 00:02:59,471 --> 00:03:02,766 దాని వలన పెట్టుబడి పెట్టడం మరింత సంక్లిష్టంగా మారే అవకాశముంది. 68 00:03:02,850 --> 00:03:05,269 సరే. అయితే డబ్బే ముఖ్యం అన్నమాట? 69 00:03:06,228 --> 00:03:07,229 నాకు అర్థమయింది. 70 00:03:08,272 --> 00:03:09,898 నీ సిద్ధాంతాలన్నీ గాల్లో కలిసిపోయాయి అన్నమాట. 71 00:03:15,612 --> 00:03:17,239 నాతో అలా మాట్లాడకు. 72 00:03:17,322 --> 00:03:19,741 ఆ నిర్ణయం తీసుకొనే ముందు నువ్వు నన్ను సంప్రదించి ఉండాల్సింది. 73 00:03:19,825 --> 00:03:21,159 నిన్ను సంప్రదించాలా? 74 00:03:21,243 --> 00:03:22,327 అవును. 75 00:03:22,411 --> 00:03:24,997 ఈ వ్యాపారంలో నేను నీ భాగస్వామిని. 76 00:03:25,080 --> 00:03:27,666 అయినా నన్ను అడగకుండా నీ పాటికి నువ్వు నిర్ణయాలను తీసుకుంటూనే ఉన్నావు! 77 00:03:27,749 --> 00:03:29,042 నన్ను ఒక పిల్లాడిలా చూస్తున్నావు. 78 00:03:29,126 --> 00:03:31,753 బాబూ, నువ్వు ఇంకా పిల్లాడివే మరి. ఒకసారి నీ అవతారం చూసుకో. 79 00:03:31,837 --> 00:03:34,089 మధ్యాహ్నం కావస్తోంది, ఇంకా నువ్వు నైట్ డ్రెస్ లోనే ఉన్నావు. 80 00:03:34,173 --> 00:03:36,216 బట్టలు మార్చుకొనేంత తీరిక కూడా నాకు లేదు. 81 00:03:36,300 --> 00:03:40,470 నీ మిత్రులకి ఇవ్వబోయే ఒక టీ పార్టీ గురించి తెగ కంగారు పడటంలో నీకు తీరిక లేదు. 82 00:03:40,554 --> 00:03:44,224 నీ జీవితంలో నీకు అదుపు లేని అనేక విషయాలలో ఇది కూడా ఒకటి. 83 00:03:44,308 --> 00:03:47,895 నా అభిప్రాయానికి విలువ ఇస్తున్నావని, కనుకే నన్ను భాగస్వామిని చేసుకున్నావని అనుకున్నా. 84 00:03:47,978 --> 00:03:50,981 నువ్వు నా కొడుకువి కాబట్టి నిన్ను ఈ సంస్థలో భాగస్వామిగా చేసుకున్నాను. 85 00:03:52,149 --> 00:03:55,569 ఆ పనే కనుక నేను చేయకపోతే, మన కుటుంబం గురించి అందరూ చెడుగా అనుకుంటారు. 86 00:03:56,111 --> 00:03:59,406 నీ అభిప్రాయానికీ, దానికీ అస్సలు సంబంధమే లేదు, 87 00:03:59,865 --> 00:04:02,367 పెట్టుబడుల వ్యవహారంలో అస్సలు నీ అభిప్రాయాన్ని తీసుకోను కూడా. 88 00:04:05,287 --> 00:04:09,791 సరే, నేను కూడా మంచి విషయాలలో పెట్టుబడి పెట్టాను. 89 00:04:09,875 --> 00:04:12,503 అవి మంచి విషయాలు. ఈ లోకాన్ని ఇంకా మెరుగ్గా మార్చే రకమైన విషయాలు. 90 00:04:12,586 --> 00:04:14,671 అంటే ఎలాంటివి? నువ్వు కొన్న నకిలీ పెయింటింగ్ లాంటివా? 91 00:04:14,755 --> 00:04:16,839 నేను దాన్ని కనిపెట్టలేనని అనుకున్నావు. 92 00:04:16,923 --> 00:04:19,343 నేను నీకు నిజంగా చాలా ఇచ్చాను. 93 00:04:19,968 --> 00:04:22,387 ఎన్నో అవకాశాలను నీకు అందించాను, 94 00:04:22,471 --> 00:04:25,516 కానీ నువ్వు వాటితో ఏం చేశావు? ఏం సాధించావు? 95 00:04:26,558 --> 00:04:27,768 ఏమీలేదు. 96 00:04:28,852 --> 00:04:31,605 ఒక వైఫల్యం తరువాత మరొకటి. 97 00:04:31,688 --> 00:04:33,899 -నేను... -ఎమిలీ గురించి నువ్వు ఎంతైనా చెప్పవచ్చు, 98 00:04:34,691 --> 00:04:36,985 కనీసం తను ఏవో పిచ్చి కవితలనైనా రాసుకుంటుంది. 99 00:04:38,445 --> 00:04:39,446 లోపలికి రండి. 100 00:04:39,947 --> 00:04:41,365 శుభోదయం, డికిన్సన్స్. 101 00:04:43,742 --> 00:04:45,118 నేనేమైనా రాకూడని సమయంలో వచ్చానా? 102 00:04:45,202 --> 00:04:49,623 లేదు. మన భాగస్వామ్యం తాలూకు అద్భుతమైన వార్తని ఆస్టిన్ కి తెలుపుతున్నాను, అంతే. 103 00:04:49,706 --> 00:04:52,042 అవును. మా బోర్డులో చోటు దక్కించుకున్న కొత్త సభ్యులు. 104 00:04:52,125 --> 00:04:55,420 న్యూ ఇంగ్లాండ్ లోని అతిపెద్ద వార్తాపత్రిక తాలూకు గౌరవప్రదమైన పెద్దమనుషులు. 105 00:04:55,504 --> 00:04:57,506 మనమందరం కలిసి ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చేయబోతున్నాం. 106 00:04:58,257 --> 00:04:59,925 అది దానంతట అది మారనప్పుడే అనుకోండి. 107 00:05:00,717 --> 00:05:03,220 ఇదిగో. మీరు దీన్ని అస్సలు నమ్మరు, ఎడ్డీ. 108 00:05:03,303 --> 00:05:04,304 నేను మిమ్మల్ని ఎడ్డీ అని పిలవవచ్చా? 109 00:05:04,388 --> 00:05:07,391 న్యూ యార్క్ లో ఉన్న మిస్టర్ గ్రీలీ ఈ టెలిగ్రామును పంపారు. 110 00:05:07,808 --> 00:05:10,602 ఇప్పుడు వర్జీనియా నుండి పిచ్చెక్కించే వార్తలు వస్తున్నాయి. 111 00:05:10,686 --> 00:05:12,145 ఏ వార్తలు? ఏం జరిగింది? 112 00:05:12,229 --> 00:05:14,731 బానిసత్వ నిర్మూలనకి సాయుధ పోరే తగినది నమ్మే ఆ వెర్రి జాన్ బ్రౌన్ ఉన్నాడు కదా? 113 00:05:14,815 --> 00:05:16,316 అతను హార్పర్స్ ఫెర్రీని దోచుకోవాలని చూశాడు. 114 00:05:16,400 --> 00:05:19,194 జాన్ బ్రౌన్. కాన్సాస్ లో ఆ అల్లకల్లోలం సృష్టించిన 115 00:05:19,278 --> 00:05:20,612 బాకు పట్టుకొని తిరిగే ఆ నరహంతకుడేనా? 116 00:05:20,696 --> 00:05:21,864 అవును, అతనే. 117 00:05:21,947 --> 00:05:24,408 అతను తన గురించి ఒక ప్రవక్త అని అనుకుంటుంటాడు. 118 00:05:24,491 --> 00:05:27,911 ఆ ముఖమూ, ఆ జుట్టూ. ప్రముఖులకి ఉండాల్సినవన్నీ అతనిలో ఉన్నాయి. 119 00:05:28,453 --> 00:05:30,372 మన పత్రికలో అతని గురించి మనం చాలా కథనాలు రాస్తూ ఉన్నాం. 120 00:05:30,455 --> 00:05:31,874 ఏం జరిగిందో అది చెప్పు చాలు. 121 00:05:31,957 --> 00:05:34,501 అతను వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి, 122 00:05:34,585 --> 00:05:36,920 హార్పర్స్ ఫెర్రీలో ఉన్న ఆయుధాగారాన్ని దోచుకోవాలని చూశాడు. 123 00:05:37,004 --> 00:05:40,549 దక్షిణ ఫ్రాంతంలో భారీ తిరుగుబాటును ఉసిగొల్పడానికి పథకం రచించాడని విన్నాను. 124 00:05:40,632 --> 00:05:42,467 దేవుడా, అది పిచ్చి విషయం. 125 00:05:42,551 --> 00:05:44,136 మరి అది పనిచేసిందా? 126 00:05:44,219 --> 00:05:46,096 అస్సలు లేదు. అది సంపూర్ణ వైఫల్యం. 127 00:05:46,180 --> 00:05:47,264 అతని మనుషుల్లో చాలా మంది చనిపోయారు. 128 00:05:47,347 --> 00:05:50,184 బ్రౌన్ తో సహా మిగతావారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటారు. 129 00:05:50,267 --> 00:05:52,895 దేశద్రోహాం కింద బ్రౌన్ ని ఉరితీస్తారు, దాని వలన పరిస్థితులు దిగజారి 130 00:05:52,978 --> 00:05:55,480 ఒక అంతర్యుద్ధానికి దారితీసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. 131 00:05:55,564 --> 00:05:57,774 లేదు, అలా కాదు. అలా జరగదు. 132 00:05:57,858 --> 00:05:59,359 సహేతుకమైన స్వభావం గలవారే నిలవగలరు. 133 00:05:59,776 --> 00:06:01,195 అలాంటి వాళ్ళు ఎల్లకాలం ఉండలేరు. 134 00:06:01,278 --> 00:06:04,698 నా ఉద్దేశం, తేనెతుట్టును కదపడం లాంటి ఈ ఘటన వలన దేశమంతా అల్లకల్లోలం కాగలదేమో. 135 00:06:04,781 --> 00:06:06,116 దేవుడా, ఎంతటి విపత్తు. 136 00:06:06,200 --> 00:06:08,368 ఎడ్డీ, మీరు అన్నది నిజమే. నిజంగా ఇది ఒక విపత్తే. 137 00:06:08,744 --> 00:06:10,120 కానీ దీని వలన మనకి లాభం కలగవచ్చు. 138 00:06:10,579 --> 00:06:12,039 దానర్థం ఏంటి? 139 00:06:12,831 --> 00:06:14,249 యుద్ధం వల్ల పత్రికలు మరింత బాగా అమ్ముడవుతాయి, గురూ. 140 00:06:15,083 --> 00:06:16,418 యుద్ధం వల్ల పత్రికలు మరింత బాగా అమ్ముడవుతాయి 141 00:06:17,044 --> 00:06:18,629 ఇప్పటికి కూడా, పుకార్లు కార్చిచ్చులా వ్యాపిస్తున్నాయి. 142 00:06:18,712 --> 00:06:20,714 బ్రౌన్ కి సహాయం చేసిన వాళ్ళందరి గుట్టు బయట పడుతుంది. 143 00:06:20,797 --> 00:06:23,217 నా ఉద్దేశం, అతను చేయాలని ప్రయత్నించినా కానీ ఇన్ని తప్పులు చేయలేడు. 144 00:06:23,300 --> 00:06:26,011 దీనికి నిధులు సమకూర్చిన వాళ్ళతో సహా అతనికి సహకరించిన వాళ్ళందరినీ కనిపెడతారు, 145 00:06:26,094 --> 00:06:28,764 వాస్తవాలు బయటకొచ్చే కొద్దీ మనం మన పత్రిక అమ్మకాలను పెంచుకుంటూ ఉండవచ్చు. 146 00:06:29,223 --> 00:06:31,183 ఇతను ఇంతటి పరాజితుడు కావడం వలన మనకి మేలే జరిగింది. 147 00:06:31,642 --> 00:06:34,394 నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడేవాడు ఎవ్వడూ కూడా పరాజితుడు కాడు. 148 00:06:36,563 --> 00:06:37,773 ఇక సెలవు. 149 00:06:37,856 --> 00:06:39,441 సమావేశానికి నువ్వు ఉండటం లేదా? 150 00:06:39,525 --> 00:06:41,193 లేదు, ఒక యుద్ధం ద్వారా లాభం పొందాలని 151 00:06:41,276 --> 00:06:43,946 చూడటం కన్నా మంచి పనులు నాకు వేరేటివి ఉన్నాయి. 152 00:06:44,029 --> 00:06:45,989 అవును, అతను టీ పార్టీ చేసుకుంటున్నాడులే. 153 00:06:50,911 --> 00:06:51,912 ఎమిలీ ఎక్కడ? 154 00:06:53,580 --> 00:06:54,706 తను పైన తన పడక గదిలో ఉంది. 155 00:07:17,396 --> 00:07:19,815 హెన్రీ. హమ్మయ్య, నువ్వు క్షేమంగానే ఉన్నావు. 156 00:07:19,898 --> 00:07:21,233 నేను క్షేమం కాదు. 157 00:07:21,316 --> 00:07:23,235 మీరందరూ తిరుగుబాటు చేస్తున్నారని అనుకున్నా. 158 00:07:23,318 --> 00:07:25,654 ఇది ఒక కొత్త ప్రపంచానికి నాంది అని అనుకున్నాను. 159 00:07:25,737 --> 00:07:28,740 పరిస్థితులు మెరుగవ్వాలంటే, ముందు అవి బాగా దిగజారిపోవాలి. 160 00:07:28,824 --> 00:07:33,495 దేశం నయం కావాలంటే ముందు అది నాశనమవ్వాలి. 161 00:07:33,579 --> 00:07:35,455 మనం చేయగలిగింది ఏమైనా ఉందా? 162 00:07:35,789 --> 00:07:37,374 నేనేం చేయాలో అదే నేను చేస్తున్నాను. 163 00:07:37,791 --> 00:07:38,834 నేను వెళ్లిపోతున్నాను. 164 00:07:39,376 --> 00:07:40,460 నా కుటుంబంతో సహా. 165 00:07:41,837 --> 00:07:44,506 బెట్టీ చెప్పింది నిజమే. నా కూతురి ప్రాణాన్ని నేను ప్రమాదంలోకి నెట్టాను. 166 00:07:44,923 --> 00:07:48,218 ఇక వాళ్ళు మమ్మల్ని కనిపెడితే, మమ్మల్ని ఏం చేస్తారో ఆ దేవుడికే తెలియాలి. 167 00:07:48,302 --> 00:07:49,303 కానీ... 168 00:07:50,053 --> 00:07:51,180 ఎక్కడికి వెళ్తున్నావు? 169 00:07:51,638 --> 00:07:52,973 అది నేను నీకు చెప్పలేను. 170 00:07:55,350 --> 00:07:56,435 ఉంటాను... 171 00:07:57,436 --> 00:07:58,604 మిస్టర్ డికిన్సన్. 172 00:08:02,649 --> 00:08:03,650 ఆస్టిన్. 173 00:08:05,319 --> 00:08:06,737 నువ్వు మళ్లీ నన్ను కలుస్తావా? 174 00:08:08,822 --> 00:08:10,240 అది జరుగుతుందని నాకనిపించడం లేదు. 175 00:08:53,909 --> 00:08:55,702 ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు. 176 00:08:55,786 --> 00:08:57,120 మేరీ, దానిదేముందిలే. 177 00:08:57,538 --> 00:08:58,747 చాలా కాలమైంది. 178 00:08:59,831 --> 00:09:01,458 ఇంకా అది ఏదో తప్పులాగా అనిపించింది. 179 00:09:01,542 --> 00:09:04,211 శ్యామ్ ని చాలా ఎక్కువగా కలుసుకోవడం, నిన్ను చాలా తక్కువగా కలుసుకోవడం. 180 00:09:04,711 --> 00:09:06,338 ఎక్కువ మంది శ్యామ్ నే ఎక్కువగా కలుస్తారు. 181 00:09:07,631 --> 00:09:09,424 అతనికి బయట ఉండటమంటేనే ఇష్టం. 182 00:09:09,508 --> 00:09:11,009 నాకేమో ఇంట్లోనే ఉండాలనుంటుంది. 183 00:09:11,093 --> 00:09:12,302 అవునులే. అది నాకు తెలుసు. 184 00:09:13,637 --> 00:09:15,055 కానీ, మేరీ, నేను నిన్ను మిస్ అయ్యాను. 185 00:09:15,138 --> 00:09:16,265 నిజంగా మిస్ అయ్యావా? 186 00:09:16,640 --> 00:09:18,267 ఒకప్పుడు నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. 187 00:09:19,935 --> 00:09:21,353 నీకు ఆ వేసవి గుర్తుందా? 188 00:09:21,937 --> 00:09:24,273 జెనీవాలో మనం గడిపిన ఆ భయంకరమైన ఎండల వేసవి, 189 00:09:24,356 --> 00:09:26,900 అప్పుడు మనం ప్రతిరోజూ సరస్సులో ఈత కొట్టడానికి వెళ్ళేవాళ్ళం? 190 00:09:27,484 --> 00:09:30,112 అవును, ఆ వేసవిలోనే మా నాన్న చనిపోయారు. 191 00:09:32,197 --> 00:09:33,240 ఆ వేసవిలోనేనా? 192 00:09:34,992 --> 00:09:36,618 మీ నాన్న దానికి తర్వాతి వేసవిలో చనిపోయారు అనుకున్నా. 193 00:09:37,578 --> 00:09:38,829 మా నాన్న చనిపోయిన వేసవిలోనే అనుకున్నా. 194 00:09:38,912 --> 00:09:41,331 లేదు, మా నాన్న చనిపోయిన తర్వాతి వేసవిలో మీ నాన్న చనిపోయారు. 195 00:09:42,332 --> 00:09:43,333 దేవుడా. 196 00:09:43,834 --> 00:09:45,586 మన చిన్నతనమంతా ఎంత ఆనందంగా గడిచిపోయిందో. 197 00:09:48,463 --> 00:09:50,299 అవును, మనకి అప్పుడు కష్టంగా ఉండింది. 198 00:09:50,382 --> 00:09:51,383 నువ్వు నాకు దొరికావు, శ్యామ్! 199 00:09:51,466 --> 00:09:52,467 అయినా కానీ... 200 00:09:53,302 --> 00:09:56,930 వాటి గురించి ఆలోచిస్తే, అవే నా జీవితంలో ప్రశాంతమైన రోజుల్లా అనిపిస్తూ ఉంటుంది. 201 00:09:57,806 --> 00:09:58,807 నిజంగానా? 202 00:09:59,766 --> 00:10:02,060 పరిస్థితులు కఠినంగా ఉన్నాయా? 203 00:10:02,144 --> 00:10:03,145 అదే, 204 00:10:03,228 --> 00:10:06,356 పెళ్లి, పిల్లలు, ఇదంతా చూసుకోవడం చిన్న విషయం కాదు. 205 00:10:08,066 --> 00:10:10,152 శ్యామ్ జూనియర్ కూడా వాళ్ళ నాన్న లాంటి వాడే. 206 00:10:10,235 --> 00:10:11,278 అవునా? 207 00:10:11,361 --> 00:10:12,571 ఎలా? 208 00:10:14,948 --> 00:10:16,366 తట్టుకోలేనంత హుషారు. 209 00:10:20,204 --> 00:10:23,123 నీకూ, ఆస్టిన్ కి ఇంకా పిల్లలు కలగలేదా? 210 00:10:25,501 --> 00:10:28,921 నువ్వు సామాజిక కార్యకలాపాల్లో చాలా చురుకుగా ఉంటావు కాబట్టి 211 00:10:29,296 --> 00:10:31,507 నీకు అది మంచిదే అనుకుంటా. 212 00:10:32,049 --> 00:10:34,968 నీ చర్చావేదికల గురించి వింటూ ఉంటే చాలా బాగుంటుంది. 213 00:10:35,052 --> 00:10:37,262 మీ ఇల్లు చాలా ఇంపైనదిగా అనిపిస్తోంది. 214 00:10:38,305 --> 00:10:39,306 ఎవర్గ్రీన్స్. 215 00:10:39,389 --> 00:10:41,517 అన్ని కార్యక్రమాలకీ నిజంగా అదే వేదికగా మారింది. 216 00:10:42,059 --> 00:10:43,227 అవును. 217 00:10:43,310 --> 00:10:45,604 అందులో శ్యామ్ పాత్ర కూడా చాలా ఉందన్నది స్పష్టం, 218 00:10:45,687 --> 00:10:47,940 మా గురించి చాలా గొప్పగా రాస్తాడు. 219 00:10:48,023 --> 00:10:49,942 చాలా ఉదారంగా ఉంటూ ఉన్నాడు. 220 00:10:50,025 --> 00:10:51,276 అవునులే. 221 00:10:51,360 --> 00:10:56,990 శ్యామ్ గురించి బాగా తెలిసినదాన్ని, అతనికి కూడా దీని నుండి ఏదో ప్రతిఫలం దక్కుతంటుంది. 222 00:10:58,283 --> 00:10:59,326 ప్రతిఫలమా? 223 00:10:59,409 --> 00:11:00,410 అవును. 224 00:11:00,869 --> 00:11:03,622 ఎవరోక అమ్హెర్స్ట్ యువతి తనకి బాగా నచ్చుంటుంది. 225 00:11:05,123 --> 00:11:06,124 నాకు... 226 00:11:06,208 --> 00:11:10,295 కానీ ప్రస్తుతానికి, అతని పలుకుబడి ద్వారా మీకు సాయపడుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. 227 00:11:11,171 --> 00:11:12,548 నువ్వంటే నాకు చాలా ఇష్టముండేది, సూజీ. 228 00:11:13,465 --> 00:11:14,883 నువ్వు నాకు ఆప్త స్నేహితురాలివి. 229 00:12:05,601 --> 00:12:08,729 మనం బాగా తాగేసి, నార్తాంప్టన్ కి వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చేవాళ్ళం. హేయ్! 230 00:12:08,812 --> 00:12:11,440 -ఇక షిప్ ఆవరణలో మత్తుతో కుప్పకూలిపోయాడు. -అవును, కుప్పకూలిపోయాను. 231 00:12:11,523 --> 00:12:14,776 అది నా జీవితంలోనే అత్యద్భుతమైన రోజు, కానీ అది నాకు గుర్తు కూడా లేదు. 232 00:12:16,528 --> 00:12:18,363 కాలేజీ జీవితం అమోఘం! అమ్హెర్స్ట్ జయహో! 233 00:12:20,449 --> 00:12:22,743 జివితం చాలా సరదాగా ఉండేది. 234 00:12:23,577 --> 00:12:25,787 పెద్దమనుషులారా, టీ తీసుకోండి. 235 00:12:26,288 --> 00:12:29,416 జార్జ్ కి క్రీమ్, చక్కెర ఎక్కువ ఉండాలని నాకు తెలుసు. 236 00:12:29,499 --> 00:12:32,169 షిప్లీ కి అయితే క్రీమ్ ఉండకూడదు, కానీ తేనె మాత్రం బాగా ఉండాలి. 237 00:12:32,961 --> 00:12:35,672 ఆర్చిబాల్డ్ కి కాస్తంత పాలు ఉండాలి, చక్కెర ఉండకూడదు. 238 00:12:35,756 --> 00:12:38,133 ఇక సిల్వెస్టర్ కి కాస్తంత చక్కెర ఉండాలి, కానీ పాలు ఉండకూడదు. 239 00:12:38,800 --> 00:12:41,303 నా ఆస్టిన్ కి బ్లాక్ టీ అంటే ఇష్టం. 240 00:12:41,386 --> 00:12:44,932 ఇక టోషియాకికి గ్రీన్ టీ కావాలి, అది అతనికి తన ఇంటిని గుర్తు చేస్తుంది కనుక. 241 00:12:45,015 --> 00:12:48,644 నిజానికి, మిసెస్ డీ, ఈ నెల నేను కెఫీన్ కి దూరంగా ఉంటున్నాను. 242 00:12:48,727 --> 00:12:50,687 నాకు నిమ్మరసం పిండిన వేడి నీళ్లు ఇవ్వండి, చాలు. 243 00:12:51,605 --> 00:12:53,690 ఓ సారి నీ కప్పులో ఏముందో చూడు, మిస్టర్ టోషియాకి. 244 00:12:53,774 --> 00:12:55,108 చూసి ముగ్ధుడివి అయిపోతావు అనుకుంటా. 245 00:12:56,944 --> 00:12:59,029 అది నిమ్మరసం పిండిన వేడి నీళ్ళే. 246 00:12:59,404 --> 00:13:00,614 కానీ మీకెలా తెలుసు? 247 00:13:00,697 --> 00:13:02,950 ఇప్పుడు నేను కేకులని తెస్తాను. 248 00:13:08,956 --> 00:13:10,499 హేయ్, ఆస్టిన్? 249 00:13:11,625 --> 00:13:13,377 ఇది ఏర్పాటు చేసి మంచి పని చేశావు. 250 00:13:13,877 --> 00:13:15,629 చివరిసారి మనం ఎప్పుడు కలిశామో కూడా నాకు గుర్తు లేదు. 251 00:13:15,712 --> 00:13:16,755 షిప్లీ కూడా వచ్చాడు. 252 00:13:16,839 --> 00:13:19,633 అవును. షిప్లీ మా తల్లిదండ్రుల ఇంట్లోనే పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. 253 00:13:19,716 --> 00:13:21,260 అవును, కానీ నిన్నటి నుండి బయటకొచ్చేశానులే. 254 00:13:21,343 --> 00:13:23,929 కానీ మిత్రులందరమూ కలుస్తున్నామని విని మళ్లీ ఇక్కడికి వచ్చాను. 255 00:13:24,596 --> 00:13:26,515 షిప్ కి, లవీనియాకి నిశ్చితార్ధం అయింది. 256 00:13:26,598 --> 00:13:28,267 -ఏంటి? -ఏంటి? ఊరికే వేళాకోళం ఆడుతున్నావు. 257 00:13:28,350 --> 00:13:29,601 -లేదు. -అభినందనలు! 258 00:13:29,685 --> 00:13:30,894 నిశ్చితార్ధం రద్దయిపోయింది. 259 00:13:32,312 --> 00:13:33,939 మహిళలు నాకు అచ్చిరారు. 260 00:13:34,481 --> 00:13:35,482 అంటే... 261 00:13:35,899 --> 00:13:37,484 మనం అందరం ఇక్కడికి వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. 262 00:13:37,568 --> 00:13:39,319 మిమ్మల్నందరినీ నేను మిస్ అయ్యాను. 263 00:13:39,403 --> 00:13:40,571 ఇక్కడికి అందరూ వచ్చేశారు. 264 00:13:40,654 --> 00:13:43,448 కాదు. అందరూ కాదు. ఇంకా ఫ్రేజర్ రావాలి. 265 00:13:43,532 --> 00:13:44,533 ఏంటి, ఫ్రేజర్ ఆ? 266 00:13:44,616 --> 00:13:46,159 -ఫ్రేజర్ స్టర్న్స్ కూడా వస్తున్నాడా? -అవును. 267 00:13:46,243 --> 00:13:47,953 -అతను వెస్ట్ పాయింట్ లో ఉన్నాడనుకున్నానే. -అవును. 268 00:13:48,036 --> 00:13:50,497 కానీ ఇప్పుడు సెలవులో ఉన్నాడు, అతడిని నేను ఒపెరాలో కలిశాను. 269 00:13:50,581 --> 00:13:52,291 -ఒపెరా! -అవును, అందుకని అతడిని ఆహ్వానించా. 270 00:13:52,374 --> 00:13:56,503 నిజానికి, ఫ్రేజర్ ని చూసినప్పుడే మనమందరం కలవాలనే ఆలోచన నాకు వచ్చింది. 271 00:13:56,587 --> 00:13:58,797 -ఫ్రేజర్ చాలా మంచి వాడు. -అతడిని చూడాలని చాలా ఆత్రుతగా ఉంది. 272 00:13:58,881 --> 00:14:02,342 దేవుడా, మళ్లీ మన గ్యాంగ్ అంతా కలవడం చాలా బాగుంది, కదా? 273 00:14:02,426 --> 00:14:03,844 అవును. 274 00:14:04,428 --> 00:14:07,723 ఇప్పుడు యుద్ధం వచ్చినా, మనం ఒకరికొకరం అండగా ఉన్నాం. 275 00:14:10,225 --> 00:14:12,352 బాసూ. మూడ్ ని మొత్తం చెడగొట్టేశావు. 276 00:14:12,436 --> 00:14:14,563 నువ్వు హార్పర్స్ ఫెర్రీ దగ్గరి పరిస్థితి గురించే మాట్లాడుతున్నావా? 277 00:14:14,646 --> 00:14:15,898 అవును. జాన్ బ్రౌన్. 278 00:14:16,523 --> 00:14:18,025 జాన్ బ్రౌన్ పరమ దరిద్రుడు. 279 00:14:18,108 --> 00:14:21,028 ఆ బ్రౌన్ మనుషులకి మొత్తం తగలబడిపోవటం కావాలి. 280 00:14:21,111 --> 00:14:22,696 వాళ్ళు సరైన పనే చేస్తున్నారనుకుంటా. 281 00:14:22,779 --> 00:14:25,908 ఒకవేళ వాళ్ళు చేసేది తప్పయినా, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. 282 00:14:25,991 --> 00:14:27,993 డికిన్సన్, నువ్వు భయాన్ని వ్యాప్తి చేస్తున్నావు. 283 00:14:28,493 --> 00:14:31,371 పోల్స్ లో ఎవ్వరూ యుద్దం కోరుకోవడం లేదని తేలింది, అవి ఇంతవరకూ తప్పు కాలేదు. 284 00:14:31,455 --> 00:14:33,373 అవును. దీనికి నేను కూడా వత్తాసు పలుకుతున్నాను, 285 00:14:33,457 --> 00:14:35,834 నేను ఇప్పుడు జోస్యం చెప్పే వ్యాపారం నుండి బయటకు వచ్చేశాను అని మీకు చెప్పాననుకోండి, 286 00:14:35,918 --> 00:14:37,753 కానీ అంతా సవ్యంగానే ఉంటుందని నా బలమైన నమ్మకం. 287 00:14:37,836 --> 00:14:39,505 కావచ్చు, కానీ అలా జరగకపోతే? 288 00:14:39,588 --> 00:14:41,215 పరిస్థితులు ఎప్పటికీ బాగుపడకపోతే? 289 00:14:41,757 --> 00:14:43,759 ఇంకా అవి బాగు అవ్వాలంటే, ముందుగా అవి దిగజారాల్సిన అవసరం ఉంటే? 290 00:14:43,842 --> 00:14:45,636 బాబోయ్, బాబోయ్, ఇదొక పిచ్చి ఆలోచన. 291 00:14:47,387 --> 00:14:49,640 -మనం ఇలా ప్రతీ వారం చేసుంటే? -ఏం చేసుంటే? 292 00:14:49,723 --> 00:14:51,558 అంటే, అందరమూ కలిసి రాజకీయాల గురించి మాట్లాడుంటే. 293 00:14:51,642 --> 00:14:55,687 అంటే, ఊరికే సరదాగా గడుపుతూ కూడా, రాజకీయాల గురించి విశ్లేషించడం. 294 00:14:55,771 --> 00:14:57,606 ఇంకా దాన్ని ఎవరైనా రికార్డ్ చేస్తే? 295 00:14:57,689 --> 00:14:59,900 దాన్నంతటినీ రాయడం లాంటివి చేసి, 296 00:14:59,983 --> 00:15:02,444 ఇక అందరూ దాన్నే ఆలకిస్తారు. 297 00:15:02,528 --> 00:15:04,029 మనం ప్రకటనలను ఇవ్వవచ్చు... 298 00:15:04,905 --> 00:15:07,241 ఆప్రాన్ల కి. 299 00:15:07,824 --> 00:15:08,992 నీలి ఆప్రాన్ల కి. 300 00:15:09,451 --> 00:15:12,329 అందరికీ జామ్ వేసిన వేడి వేడి కేకులు సిద్ధంగా ఉన్నాయి. 301 00:15:12,412 --> 00:15:16,250 ఒకవేళ యుద్ధమే జరిగితే, అందులో మనం కూడా పాల్గొనాలని మీరు గ్రహించడం లేదా? 302 00:15:16,708 --> 00:15:20,337 ఇది మనం చిన్నప్పుడు బొమ్మ సైనికులతో ఆడుకున్నట్టు కాదు. 303 00:15:21,255 --> 00:15:24,591 వేలాది ప్రజలు, నిజమైన ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతారు. 304 00:15:24,675 --> 00:15:26,260 మన లాంటి ప్రజలు. 305 00:15:26,343 --> 00:15:29,304 ఇక మన తరం, కదనరంగంలోని ముందు వరుసలో ఉంటుంది. 306 00:15:30,556 --> 00:15:32,808 సమ్మేళనంలో ఆబ్రహం లింకన్ చెప్పాడు కదా, 307 00:15:33,308 --> 00:15:35,561 "అంతర్గత చీలికలు ఉన్న దేశం కుప్పకూలిపోతుంది," అని. 308 00:15:36,436 --> 00:15:38,313 ఓ, అది నిజం కాదులే. 309 00:15:39,106 --> 00:15:39,940 అమ్మా? 310 00:15:40,023 --> 00:15:42,943 రెండు టీ పార్టీలకు ఎలా సర్వ్ చేయాలో అనే విషయాన్ని నేను కనుగొనగలిగానంటే, 311 00:15:43,026 --> 00:15:46,238 అమెరికన్లమైన మనం మన దేశాన్ని ఎలా ముక్కలు కాకుండా చూసుకోవాలో కూడా కనిపెట్టగలం. 312 00:15:47,114 --> 00:15:48,115 అసలు ఈ హార్పర్స్ ఫెర్రీ 313 00:15:48,198 --> 00:15:51,493 ఉదంతం మొత్తాన్ని నువ్వు ఎలా కవర్ చేద్దామనుకుంటున్నావో తెలుసుకోవాలనుంది. 314 00:15:51,577 --> 00:15:54,621 జాన్ బ్రౌన్ చేపడుతున్న చర్యలని కాకుండా అతని ఉద్దేశానికి మద్దతు ఇవ్వడమే కీలకం. 315 00:15:54,705 --> 00:15:56,582 చూడండి, మనకి ఆ సాయుధ తిరుగుబాటుకు మద్ధతు తెలిపేవారి అండ కూడా ఉండాలి, 316 00:15:56,665 --> 00:16:00,586 అదే సమయంలో, మన ఆధునిక భావాలు, ఇంకా కొన్ని కేసులలో, దక్షిణ ప్రాంతపు భావాజాలం 317 00:16:00,669 --> 00:16:02,087 ఉన్నవారిని కూడా మనం వదులుకోకూడదు. 318 00:16:02,671 --> 00:16:05,799 ఆ వ్యూహం అనుసరిస్తూ సాగితే, "ద రిపబ్లికన్"ను మించిన పత్రికే ఉండదు... 319 00:16:06,717 --> 00:16:08,051 పర్వాలేదు. నేను చూసుకుంటాను. 320 00:16:08,135 --> 00:16:11,096 ఇదొక దేశంగా ఎంత కాలం ఉంటుందో అని నాకు ఆశ్చర్యంగా ఉంది. 321 00:16:11,180 --> 00:16:12,764 ఇది త్వరలోనే రెండుగా ముక్కలైపోవచ్చు. 322 00:16:12,848 --> 00:16:15,893 అలా అయితే, మన పత్రిక ఆ రెండు ముక్కల్లో కూడా ఉండాలి. 323 00:16:15,976 --> 00:16:18,979 సమాచార రంగం ప్రాచుర్యం పొందుతున్న ఈ సమయంలో, చూపరులను పొండడమే కీలకం. 324 00:16:19,062 --> 00:16:22,566 సుదీర్ఘ కాలం పాటు మన పత్రికలకు అతుక్కుపోయే వాళ్ళు మనకి కావాలి. 325 00:16:22,649 --> 00:16:24,109 ఎంత శ్రద్ధ మళ్లించుకోగలిగితే అంత లాభం. 326 00:16:31,033 --> 00:16:32,659 వెళ్ళేటప్పుడు తలుపు మూసేసి వెళ్లు, మాతా. 327 00:16:32,743 --> 00:16:34,578 ఇక్కడ మేము దేశానికి సంబంధించిన విషయాలను చర్చిస్తున్నాం. 328 00:16:35,370 --> 00:16:36,455 అలాగే, ఎడ్వర్డ్. 329 00:16:36,914 --> 00:16:39,917 నా అభిప్రాయంలో అయితే... 330 00:16:42,127 --> 00:16:45,130 మగాళ్ళు మర్యాదపూర్వకంగా ఉంటే యుద్ధాలనేవే జరగవు. 331 00:16:58,310 --> 00:16:59,353 మిస్టర్ షిప్లీ. 332 00:16:59,978 --> 00:17:01,480 -హలో. -హేయ్, మిసెస్ డీ. 333 00:17:02,022 --> 00:17:03,524 ఆ కేకులు అదిరిపోయాయి. 334 00:17:03,607 --> 00:17:06,359 అలా అన్నందుకు ధన్యవాదాలు. 335 00:17:07,944 --> 00:17:09,780 ఇవాళ నేను చాలా కష్టపడ్డాను. 336 00:17:10,571 --> 00:17:12,574 నేను రెండు టీ పార్టీలను అద్భుతంగా నిర్వహించాను, 337 00:17:13,282 --> 00:17:14,617 కానీ ఒక్కరు కూడా అది గమనించలేదు. 338 00:17:14,701 --> 00:17:15,786 ఏమంటున్నారు మీరు. 339 00:17:15,868 --> 00:17:17,496 ఆటపట్టిస్తున్నారా? నేను గమనించాను కదా. 340 00:17:18,372 --> 00:17:19,873 ఇంటి పనులను చేయడంలో మిమ్మల్ని మించినవాళ్ళు ఎవ్వరూ లేరు, మిసెస్ డీ. 341 00:17:20,540 --> 00:17:21,541 నిజంగానే. 342 00:17:21,625 --> 00:17:23,252 మహిళ అనే పదానికే నిలువెత్తు రూపం మీరు. 343 00:17:25,878 --> 00:17:28,048 అలా అనడం నీ మంచితనం. 344 00:17:28,131 --> 00:17:29,925 -ధన్యవాదాలు. -నాకు కూడా మీ లాంటి భార్యే కావాలి. 345 00:17:31,134 --> 00:17:33,637 అందుకే లవీనియాతో మాట్లాడి మళ్లీ బంధాన్ని నిలబెట్టుకోవాలని వచ్చాను. 346 00:17:35,055 --> 00:17:38,058 ఎందుకంటే, ఒక కూతురు కాక తన తల్లిలా ఎవరు ఉండగలరు? 347 00:17:40,561 --> 00:17:42,271 నిశ్చితార్ధం రద్దయిపోయింది అనుకున్నానే. 348 00:17:43,897 --> 00:17:48,193 వినండి. అంతర్యుద్ధమనేదే వస్తే, అది ముగిసే దాకా నన్ను ప్రేమించేవాళ్ళు నాకు కావాలి. 349 00:17:56,201 --> 00:17:57,452 ధన్యవాదాలు, మిస్టర్ షిప్లీ. 350 00:18:04,001 --> 00:18:06,420 లవీనియా? మనం మాట్లాడుకోవాలి. 351 00:18:06,503 --> 00:18:08,088 షిప్, లోపలికి వచ్వేముందు నువ్వు తలుపు తట్టాలి. 352 00:18:08,172 --> 00:18:09,673 దేశం యుద్ధం ముంగిట ఉంది, 353 00:18:09,756 --> 00:18:12,926 మనిద్దరం మధ్య గొడవలు ఉండాలని నాకు లేదు. 354 00:18:13,010 --> 00:18:14,720 నువ్వేమంటున్నావు? 355 00:18:14,803 --> 00:18:16,180 మనం మన బంధాన్ని ఎలాగోలా కొనసాగించాలి, విన్నీ. 356 00:18:16,263 --> 00:18:18,473 నాకు తగిన భార్యవి నువ్వే, అది నీకు కూడా తెలుసు. 357 00:18:20,184 --> 00:18:21,185 మనం పెళ్లి చేసుకుందాం. 358 00:18:23,103 --> 00:18:26,648 షిప్, నువ్వు నన్ను నన్నుగా స్వీకరించలేవు కాబట్టి, మనం విడిపోయాం. 359 00:18:26,732 --> 00:18:30,569 ఒక్క క్షణం నా మీద చాలా ఇష్టాన్ని చూపుతావు, మరుక్షణం నేను తెలివి చూపుతున్నాను అంటావు. 360 00:18:32,196 --> 00:18:33,739 నువ్వు ఆ అసలైన లవీనియాని ఎన్నటికీ ప్రేమించలేవు. 361 00:18:33,822 --> 00:18:36,033 ప్రేమిస్తాను. నా ఉద్దేశం, నేను ప్రేమిస్తున్నాను, విన్నీ. 362 00:18:36,491 --> 00:18:37,910 దాన్ని నీకు నేనెలా నిరూపించను? 363 00:18:37,993 --> 00:18:43,165 నువ్వేం చేసినా నేను నిన్ను విడిచివెళ్లిపోలేనని నీకు ఎలా నిరూపించను? 364 00:18:47,711 --> 00:18:48,921 నా దగ్గర ఒక ఆలోచన ఉంది. 365 00:18:49,963 --> 00:18:51,381 నా కొరడా దెబ్బ రుచి చూడు. 366 00:18:52,257 --> 00:18:53,258 ఏంటి? 367 00:19:09,816 --> 00:19:11,151 ఏం చేస్తున్నావు? 368 00:19:34,842 --> 00:19:35,926 అదీలెక్క. 369 00:19:55,112 --> 00:19:57,114 నీకు బాగాలేదని విని నేను బాధపడ్డాను. 370 00:19:57,948 --> 00:19:58,949 ఇప్పుడు నీకు బాగానే ఉందా? 371 00:19:59,283 --> 00:20:00,284 బాగాలేదా? 372 00:20:04,371 --> 00:20:07,416 అదన్నమాట. అందరికీ శ్యామ్ అలా చెప్తున్నాడన్నమాట. 373 00:20:09,001 --> 00:20:10,169 అయితే, నీకు ఆరోగ్యం బాగానే ఉందా? 374 00:20:10,252 --> 00:20:11,587 శారీరకంగా బాగానే ఉన్నాను. 375 00:20:12,045 --> 00:20:13,046 మరి... 376 00:20:13,755 --> 00:20:14,756 ఏమైంది? 377 00:20:18,218 --> 00:20:19,219 అంటే... 378 00:20:22,556 --> 00:20:24,975 ఈ ఏడాది మాకు ఒక పాప పుట్టాల్సి ఉంది. 379 00:20:27,019 --> 00:20:28,020 కానీ... 380 00:20:28,896 --> 00:20:29,897 తను చనిపోయింది. 381 00:20:31,273 --> 00:20:32,274 నా కడుపులోనే చనిపోయింది. 382 00:20:34,193 --> 00:20:35,319 అయ్యో, మేరీ. 383 00:20:36,904 --> 00:20:38,030 నేను చాలా చింతిస్తున్నాను. 384 00:20:38,113 --> 00:20:40,157 నా... నా పాప... 385 00:20:41,783 --> 00:20:42,784 చనిపోయింది. 386 00:20:51,668 --> 00:20:53,295 అలాంటిదే... 387 00:20:56,006 --> 00:20:57,841 అలాంటిదే నాకు కూడా జరిగింది. 388 00:20:59,760 --> 00:21:01,595 ఓ, నేను చాలా చింతిస్తున్నాను. 389 00:21:07,976 --> 00:21:09,686 నేను ప్రయత్నిస్తున్నాను... 390 00:21:12,981 --> 00:21:16,485 ఆ బాధని దూరం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. 391 00:21:17,986 --> 00:21:19,571 నువ్వు దాన్ని దూరం చేసుకోనవసరం లేదు. 392 00:21:20,822 --> 00:21:22,241 దాన్ని అనుభవించడంలో తప్పు లేదు. 393 00:21:40,050 --> 00:21:41,218 ఫ్రేజర్ అయ్యుంటాడు. 394 00:21:41,301 --> 00:21:42,636 ఫ్రేజర్ స్టర్న్స్. 395 00:21:42,719 --> 00:21:45,180 -దేవుడా, అతడిని చూడాలని నాకు ఆతృతగా ఉంది. -మనం సిద్ధంగానే ఉన్నాం. 396 00:21:49,893 --> 00:21:50,936 ఫ్రే... 397 00:21:51,019 --> 00:21:52,646 ఎమిలీ. నువ్వా. 398 00:21:55,107 --> 00:21:56,650 ఇంకెవరి కోసమైనా చూస్తున్నావా? 399 00:21:56,733 --> 00:21:58,068 అవును, కానీ నిన్ను చూడటం ఆనందంగా ఉంది. 400 00:21:58,151 --> 00:21:59,236 -లోపలికి రా. -ధన్యవాదాలు. 401 00:21:59,903 --> 00:22:01,113 ఇది నేను తీసుకోనా? 402 00:22:03,782 --> 00:22:05,033 నువ్వు బాగానే ఉన్నావా? 403 00:22:09,288 --> 00:22:10,289 నాకు తెలీదు. 404 00:22:11,748 --> 00:22:14,960 నా మిత్రుల్లో కొందరు టీ పార్టీకి ఇక్కడికి వచ్చారు. 405 00:22:15,794 --> 00:22:16,795 నువ్వు కూడా జాయిన్ అవుతావా? 406 00:22:17,880 --> 00:22:18,881 అలాగే. 407 00:22:20,048 --> 00:22:21,216 అందుకే నేను ఇక్కడికి వచ్చాను. 408 00:22:22,092 --> 00:22:24,261 ఇప్పుడు నేను జనాల మధ్య ఉండాలని నాకు అనిపిస్తోంది. 409 00:22:26,221 --> 00:22:27,222 సరే. 410 00:22:31,518 --> 00:22:34,188 బహుశా కాకపోవచ్చు. నాకు కూడా సరిగ్గా తెలీదు. కేవలం... 411 00:22:36,690 --> 00:22:38,108 -ఎమిలీ. -హేయ్, జార్జ్. 412 00:22:41,111 --> 00:22:43,322 మీకు నా చెల్లెలు ఎమిలీ గుర్తుంది కదా? 413 00:22:45,032 --> 00:22:46,575 మీరందరూ ఏం చేస్తున్నారేంటి? 414 00:22:46,658 --> 00:22:47,659 ఓహ్, ఏముంది. 415 00:22:48,035 --> 00:22:49,328 వార్తల గురించి మాట్లాడుకుంటున్నాం. 416 00:22:50,037 --> 00:22:51,747 ఈ రోజంతా పిచ్చిపిచ్చిగా ఉంది. 417 00:22:51,830 --> 00:22:53,957 నా బుర్రలో జరిగేదానితో పోలిస్తే ఇదేమంత పిచ్చిది కాదులే. 418 00:22:55,000 --> 00:22:59,046 దేవుడా, నా మెదడులో ఏదో పగులు ఉన్నట్టు, అది రెండుగా అయిపోయేటట్టుగా నాకనిపిస్తోంది. 419 00:23:01,548 --> 00:23:02,758 మీకెవరికైనా అలా ఎప్పుడైనా అనిపించిందా? 420 00:23:05,802 --> 00:23:07,763 ఈ వారమైతే అనిపించలేదు. 421 00:23:08,680 --> 00:23:09,806 నేనున్నానని పట్టించుకోకండి. 422 00:23:10,599 --> 00:23:12,100 నేను ఈ మంటని చూస్తూ కూర్చుంటాను, అంతే. 423 00:23:25,948 --> 00:23:29,409 బహుశా మనం రాజకీయాల గురించి మాట్లాడటం ఆపేయాలేమో. 424 00:23:29,493 --> 00:23:31,411 నిజంగానే చెప్తున్నా, ఈ ఆనందభరిత మధ్యాహ్నాన్ని నా మిత్రులందరూ 425 00:23:31,495 --> 00:23:34,122 యుద్ధంలో చనిపోతారని ఆలోచిస్తూ గడపాలని నాకు లేదు. 426 00:23:36,625 --> 00:23:38,126 ఎప్పటికైనా మరణించాల్సిన మానవుడు - 427 00:23:38,877 --> 00:23:41,255 కోయిల కూతల కోసం చెవి కోసుకుంటాడు - 428 00:23:42,923 --> 00:23:47,135 ఎందుకంటే దాని సరాగం, తన శిరస్సుకై తపిస్తున్న గొడ్డలికి ఊతమిస్తుంది 429 00:23:51,974 --> 00:23:52,975 నేను చూస్తానులే. 430 00:23:56,812 --> 00:23:58,021 తను భలే సరదా మనిషి. 431 00:24:02,234 --> 00:24:04,361 హాయ్. నువ్వు ఎమిలీ కదా? 432 00:24:07,698 --> 00:24:09,741 నువ్వు... గుర్తింపులేని వాడివి. 433 00:24:11,785 --> 00:24:13,161 లేదు. నేను... 434 00:24:13,245 --> 00:24:14,997 ఫ్రేజర్! హేయ్! 435 00:24:15,455 --> 00:24:16,665 అక్కడున్నావా నువ్వు. 436 00:24:17,249 --> 00:24:18,584 మొత్తానికి వచ్చేశావు. 437 00:24:21,295 --> 00:24:24,131 ఎమిలీ, ఇతను ఫ్రేజర్ స్టర్న్స్, నా కాలేజీ స్నేహితుడు. 438 00:24:24,214 --> 00:24:25,799 -నీకు ఇతను గుర్తున్నాడు కదా? -గుర్తున్నాడు. 439 00:24:25,883 --> 00:24:27,801 నువ్వు పార్టీలు ఇచ్చేదానివి కదా, అప్పుడు మనం ఒకట్రెండు సార్లు కలిశాం. 440 00:24:27,885 --> 00:24:30,095 ఇతను గుర్తింపులేని వాడు. ఇతను గుర్తింపులేని వాడు. 441 00:24:30,179 --> 00:24:31,555 నువ్వు... గుర్తింపులేని వాడివి. 442 00:24:31,638 --> 00:24:33,473 ఎమిలీ, దురుసుగా ప్రవర్తించకు. 443 00:24:33,557 --> 00:24:35,434 నా చెల్లెలు కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తుంది. నువ్వు తప్పుగా అనుకోకు. 444 00:24:35,517 --> 00:24:37,019 లేదు, లేదు. అదేమీ పర్వాలేదు. నాకు గుర్తుందిలే. 445 00:24:39,646 --> 00:24:40,564 భగవంతుడా. 446 00:24:43,442 --> 00:24:44,443 నువ్వు చనిపోతావు. 447 00:24:44,526 --> 00:24:46,111 ఎమిలీ, ఇక ఆపు. 448 00:24:46,195 --> 00:24:48,238 లేదు, ఆస్టిన్. అతను చనిపోబోతున్నాడు. నేను కళ్ళారా చూశాను! 449 00:24:50,449 --> 00:24:52,868 నీకు గుర్తులేదా? కదనరంగంలో? 450 00:24:54,036 --> 00:24:57,831 పేలుడు, యుద్ధం, తూటా. అది నీ గుండె లోలోతుల్లోకి దూసుకుపోతుంది. 451 00:24:57,915 --> 00:25:00,125 ఇది కాస్త తీవ్రతరం అవుతున్నట్టు అనిపిస్తోంది. 452 00:25:00,209 --> 00:25:02,127 నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. నీ ప్రాణాలను నువ్వు కాపాడుకో! 453 00:25:02,211 --> 00:25:03,837 -వెళ్లిపో... -ఎమిలీ! ఎమిలీ, ఇక చాలు. 454 00:25:04,588 --> 00:25:06,340 చూడు, మనవాళ్ళందరూ హాలులో ఉన్నారు. 455 00:25:06,423 --> 00:25:09,343 వెళ్లి టీ తాగు, నేను నా చెల్లిని మందలించి వస్తాను. 456 00:25:09,426 --> 00:25:10,636 సరే. ధన్యవాదాలు. 457 00:25:11,637 --> 00:25:12,596 ఎమ్. 458 00:25:14,848 --> 00:25:16,475 దేవుడా. సూ. 459 00:25:17,976 --> 00:25:20,145 అయితే, అదంతా నిజమే. అదంతా నిజమే అన్నమాట. 460 00:25:20,896 --> 00:25:23,649 ఎమిలీ, ఏంటా ప్రవర్తన? ఇతరులతో అలా ప్రవర్తించకూడదు. 461 00:25:23,732 --> 00:25:27,694 నాకు మతిపోయుంటే బాగుండని ఆశిస్తూ ఉన్నా, కానీ నేను నిన్న చూసినదంతా, 462 00:25:27,778 --> 00:25:30,364 -నేను అనుభూతి చెందినదంతా... -నువ్వేం మాట్లాడుతున్నావు? 463 00:25:30,447 --> 00:25:33,408 ఆస్టిన్, నేను నీకో విషయం చెప్పాలి. ఒక భయంకరమైన విషయం చెప్పాలి. 464 00:25:34,451 --> 00:25:35,452 ఏంటి? 465 00:25:39,081 --> 00:25:42,918 శ్యామ్ తో సూ నిన్ను మోసం చేసింది. 466 00:25:43,752 --> 00:25:45,379 నేను వాళ్ళని ఇక్కడ చూశాను. 467 00:25:46,922 --> 00:25:48,131 నేను చాలా చింతిస్తున్నాను. 468 00:25:50,843 --> 00:25:52,177 నీకు నేను చెప్పింది వినబడలేదా? 469 00:25:52,261 --> 00:25:54,596 -సూ నిన్ను మోసం చేసింది. -ఆ విషయం నాకు తెలుసు. 470 00:25:56,557 --> 00:25:57,558 నీకు తెలుసా? 471 00:25:58,350 --> 00:25:59,351 అవును. 472 00:26:00,143 --> 00:26:01,186 నాకు ఆ విషయం కొన్ని వారాల ముందే తెలిసింది. 473 00:26:08,360 --> 00:26:09,570 మంచిది. 474 00:26:13,824 --> 00:26:16,034 అయితే, నీకు అన్ని విషయాల గురించి తెలిసే ఉంటుంది. 475 00:26:17,411 --> 00:26:18,829 నీకు శ్యామ్ గురించి తెలుసు. 476 00:26:19,371 --> 00:26:20,706 నీకు బిడ్డ గురించి తెలుసు. 477 00:26:20,789 --> 00:26:22,416 బిడ్డ ఏంటి? 478 00:26:27,296 --> 00:26:28,297 ఎమిలీ. 479 00:26:30,007 --> 00:26:31,008 బిడ్డ ఏంటి? 480 00:26:33,635 --> 00:26:34,761 నేను చెప్పలేను. 481 00:26:35,220 --> 00:26:36,430 నువ్వు చెప్పాలి. 482 00:26:38,098 --> 00:26:39,308 ఇప్పుడే చెప్పావు కదా. 483 00:26:40,017 --> 00:26:41,977 ఎమిలీ! బిడ్డ ఏంటి? 484 00:26:42,060 --> 00:26:43,896 సూ ది, అలాగే నీది. 485 00:26:45,939 --> 00:26:47,149 సూ బిడ్డకి జన్మనిచ్చిందా? 486 00:26:47,733 --> 00:26:51,153 లేదు, లేదు. జన్మనివ్వలేదు. 487 00:26:56,033 --> 00:26:57,034 ఎప్పుడు? 488 00:26:58,285 --> 00:27:01,705 నీ పెళ్లిలో. తను కడుపుతో ఉండింది. కానీ బిడ్డ కడుపులోనే చనిపోయింది. 489 00:27:02,581 --> 00:27:06,210 నన్ను మన్నించు, ఆస్టిన్. నన్ను మన్నించు. నేను అసలు ఏదీ చెప్పుండకూడదు. 490 00:27:13,217 --> 00:27:15,135 నువ్వు... కాస్త నువ్వు ఏదైనా మాట్లాడతావా? 491 00:27:15,219 --> 00:27:16,303 ఆస్టిన్? 492 00:27:17,513 --> 00:27:19,139 ఏదోకటి మాట్లాడు, ఆసిన్! 493 00:27:19,223 --> 00:27:20,265 దేవుడా. 494 00:27:22,601 --> 00:27:23,727 నాన్న చెప్పింది నిజమే. 495 00:27:25,103 --> 00:27:27,731 నేను పరాజితుడిని. సంపూర్ణ పరాజితుడిని. 496 00:27:28,232 --> 00:27:30,275 -నేనొక వెంగళప్పని. -అది నిజం కాదు. 497 00:27:30,359 --> 00:27:32,569 అది నిజమే, ఎమిలీ. 498 00:27:33,320 --> 00:27:34,321 అవును. 499 00:27:35,155 --> 00:27:36,240 నీకు అర్థంకావడం లేదు. 500 00:27:38,408 --> 00:27:40,953 నేనేం చేసినా అది సఫలం అవ్వదు. 501 00:27:41,870 --> 00:27:45,290 నేనేం ముట్టుకున్నా అది మసి అయిపోతుంది. 502 00:27:48,001 --> 00:27:51,046 అసలు పరమార్థం కనిపెట్టాలని నేను తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. 503 00:27:51,129 --> 00:27:53,549 సూ నన్ను ప్రేమించేలా... 504 00:27:55,467 --> 00:27:57,678 ఎలా చేయాలి అనేదాని కోసం వెతుకుతూనే ఉన్నాను. 505 00:27:58,595 --> 00:28:01,348 కానీ నేనేం చేసినా లాభం ఉండదు. 506 00:28:02,057 --> 00:28:03,684 నేనొక వెంగళప్పని, ఎమిలీ. 507 00:28:05,811 --> 00:28:06,937 ఒక నకిలీగాడిని... 508 00:28:09,940 --> 00:28:13,151 నాలో ఉన్న శూన్యాన్ని ఏదీ పూడ్చలేదు. 509 00:28:28,166 --> 00:28:32,045 బాధ అంటే నాకు ఇష్టం ఎందుకంటే అది నిజం కాబట్టి - 510 00:28:35,132 --> 00:28:37,259 మగవాళ్ళు ఉద్రేకాలను ఆపుకోలేరు - 511 00:28:38,010 --> 00:28:39,553 అలాగే నొప్పిని కూడా అనుభవించలేరు - 512 00:28:45,100 --> 00:28:48,520 కళ్ళు ఒకేసారి చమ్మగిల్లుతాయి, ఇక చావు తథ్యం 513 00:28:50,606 --> 00:28:52,024 అది నటించడం ఆసాధ్యం 514 00:29:03,827 --> 00:29:05,495 గృహ సంబంధ విషయాల వలన 515 00:29:11,960 --> 00:29:13,962 కోపంతో నుదురు మడతపడింది 516 00:29:20,719 --> 00:29:21,762 ఆస్టిన్. 517 00:29:25,474 --> 00:29:28,685 నువ్వు నకిలీగాడివి కాదు. 518 00:29:32,022 --> 00:29:34,650 నిజానికి, నీ అంత కపటం లేని మనిషి నాకు తెలిసి ఇంకెవ్వరూ లేరు. 519 00:29:38,320 --> 00:29:41,657 నీలో ప్రేమ పొంగి పొర్లుతుంది. నీలో పంచేంత ప్రేమ చాలా ఉంది. 520 00:29:41,740 --> 00:29:43,867 అది లేకుండా మేమెవ్వరమూ బతకలేము... 521 00:29:46,453 --> 00:29:47,663 నా వల్ల అయితే అస్సలు కాదు. 522 00:29:53,794 --> 00:29:55,212 నువ్వు అది నిజంగా అంటున్నావా? 523 00:29:59,007 --> 00:30:00,634 నేనెప్పుడూ నిజమే చెప్తా కదా? 524 00:30:19,611 --> 00:30:21,947 చూడు, ఇందాక జరిగిన దానికి నన్ను మన్నించు. 525 00:30:22,030 --> 00:30:24,324 -నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు. -పర్వాలేదు. 526 00:30:25,826 --> 00:30:28,203 నేను సైనికుడిని అవ్వడానికి శిక్షణ తీసుకుంటున్నాను, నేను నిబ్బరంగా ఉండాలి. 527 00:30:31,081 --> 00:30:33,584 ఏదేమైనా, నీ కవిత నాకు బాగా నచ్చింది. 528 00:30:33,667 --> 00:30:34,918 ఏంటి? 529 00:30:35,711 --> 00:30:36,795 నీ కవిత. 530 00:30:37,838 --> 00:30:38,881 పత్రికలో ఉంది కదా? 531 00:30:39,381 --> 00:30:43,093 ఓ. అవును. ధన్యవాదాలు. 532 00:30:44,052 --> 00:30:45,637 అది చాలా బాగా అనిపించింది. 533 00:30:46,346 --> 00:30:47,472 నీ దగ్గర కవితలు ఇంకా ఉన్నాయా? 534 00:30:48,015 --> 00:30:49,474 నాకు వాటిని చదవాలని ఎంతో ఆశగా ఉంది. 535 00:30:51,435 --> 00:30:52,603 నా దగ్గర చాలానే ఉండేటివి. 536 00:30:54,855 --> 00:30:56,565 కానీ వాటిన్నన్నింటినీ నా ఎడిటర్ కి ఇచ్చేశాను, 537 00:31:00,068 --> 00:31:01,195 ఇచ్చి పెద్ద తప్పు చేశాను. 538 00:31:02,154 --> 00:31:04,698 ఎందుకు? అవి ముద్రించబడటం నీకు ఇష్టం లేదా? 539 00:31:05,240 --> 00:31:06,450 నాలోని ఒక భాగానికి అవి ముద్రించబడాలనే ఉంది. 540 00:31:09,411 --> 00:31:10,412 అంటే ఇంతకుముందు ఉండేదే ఏమో. 541 00:31:13,832 --> 00:31:17,085 కానీ నాలోని మరో భాగానికి, పేరు వల్ల నాకు మంచి జరగదని చాలా బాగా తెలుసు. 542 00:31:20,464 --> 00:31:22,841 నిజానికి, అది చాలా ప్రమాదకరమని నా అభిప్రాయం. 543 00:31:24,635 --> 00:31:25,761 ఎలా? 544 00:31:32,017 --> 00:31:33,435 ఎలా చెప్పమంటావు? 545 00:31:37,731 --> 00:31:40,150 నాకు కనుక పేరు వస్తే, నేను దాని మాయ నుండి బయటపడలేను - 546 00:31:42,903 --> 00:31:45,030 అలా అయితే, నీ కవితలను నువ్వు తీసేసుకోవడం మంచిది. 547 00:32:39,877 --> 00:32:41,879 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య