1 00:00:21,063 --> 00:00:22,231 హాయ్. 2 00:00:22,314 --> 00:00:24,316 నామకరణానికి ఇది చాలా మంచి రోజు. 3 00:00:24,399 --> 00:00:26,401 ఏమో. ఏదో తేడాగా అనిపిస్తోంది. 4 00:00:26,485 --> 00:00:27,486 నువ్వు ఏమంటున్నావు? 5 00:00:27,569 --> 00:00:31,323 బహూశా జాన్ బ్రౌన్ తతంగం వలన నాకు అలా అనిపిస్తోందేమో. ఏమో. 6 00:00:32,198 --> 00:00:33,742 నిన్న రాత్రి నాకు ఓ పీడకల వచ్చింది. 7 00:00:34,326 --> 00:00:36,328 నిన్నరాత్రి ఆనందంగా గడిపామనుకున్నానే. 8 00:00:36,411 --> 00:00:38,664 మన మధ్య మళ్లీ అంతా బాగా అయిపోయినందుకు నాకు అనందంగా ఉంది, బంగారం. 9 00:00:38,747 --> 00:00:39,957 నాకు కూడా. 10 00:00:40,415 --> 00:00:42,876 ఇక నువ్వు మీ కుటుంబమంతటికీ సెలవు చెప్పేయవచ్చు, 11 00:00:42,960 --> 00:00:44,962 ఎందుకంటే మనం న్యూ ఓర్లీన్స్ కి వెళ్తున్నాం. 12 00:00:45,796 --> 00:00:48,423 -ఒక్క నిమిషం. ఏంటి? -మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. 13 00:00:49,424 --> 00:00:51,426 ఈ రోజు నువ్వు జేన్ కి సాయమందించడం చాలా మంచి విషయం. 14 00:00:52,928 --> 00:00:56,765 తన బిడ్డకి సంరక్షకునిగా ఉండమని తను నన్ను అడిగింది. తను విధవ కాబట్టి, అది నా బాధ్యత. 15 00:00:57,850 --> 00:00:58,851 అవునులే. 16 00:00:59,518 --> 00:01:00,727 ఎమిలీ ఎక్కడ? 17 00:01:01,395 --> 00:01:05,022 ఇంట్లోనే ఉందనుకుంటా. తను మామూలుగా చర్చికి రాదు కదా. 18 00:01:06,233 --> 00:01:10,696 తన కవిత ముద్రించబడిననాటి నుండి నేను తనని చూడనేలేదు. 19 00:01:11,321 --> 00:01:12,948 కావాలని నా నుండి తప్పించుకుందేమో అనిపిస్తోంది. 20 00:01:13,031 --> 00:01:14,491 అవును, అంటే... 21 00:01:15,367 --> 00:01:17,703 నీ స్థానంలో నేనుంటే, తనని ఒంటరిగా వదిలేసేవాడిని. 22 00:01:18,370 --> 00:01:19,371 కానీ... 23 00:01:20,873 --> 00:01:22,791 తనకి నేను కొన్ని విషయాలను చెప్పాలి. 24 00:01:23,458 --> 00:01:25,460 తనకి అవి తెలుసనుకుంటా. 25 00:01:28,005 --> 00:01:29,131 జేన్ వచ్చేసింది. 26 00:01:29,923 --> 00:01:31,425 -ఇక నేను నా బాధ్యతని నిర్వర్తించాలి. -హాయ్. 27 00:01:31,508 --> 00:01:34,720 నువ్వు ఇంకా నా భర్తవే అని జనాలని మర్చిపోనివ్వవద్దు. 28 00:01:36,430 --> 00:01:38,682 ఆ విషయంలో ఇక్కడున్న వారెవ్వరికీ సందేహం లేదులే. 29 00:01:41,059 --> 00:01:42,060 హాయ్. 30 00:01:44,771 --> 00:01:46,648 ఎంత ముద్దుగా ఉన్నాడో? 31 00:02:03,707 --> 00:02:05,375 ఆగండి. 32 00:02:24,228 --> 00:02:26,146 డికిన్సన్ 33 00:02:26,230 --> 00:02:28,190 అగ్ని జ్వాలలను నువ్వు ఆర్పలేవు 34 00:02:42,788 --> 00:02:44,248 హేయ్, మ్యాగీ. ఏంటి సంగతి? 35 00:02:45,165 --> 00:02:46,375 మామూలే. 36 00:02:47,334 --> 00:02:48,919 ఒక ప్రశాంతమైన ఆదివారం, అంతే. 37 00:02:49,002 --> 00:02:50,462 విశ్రాంతి తీసుకుంటూ ఆస్వాదిస్తున్నా. 38 00:02:50,546 --> 00:02:53,715 ఆదివారాల నాడు నేను విశ్రాంతి తీసుకోను. ఆ రోజు కూడా వార్తలు ఉంటాయి కదా. 39 00:02:53,799 --> 00:02:55,425 ప్రతీరోజు వార్తలు ఉంటాయి. 40 00:02:56,218 --> 00:02:57,511 దేవుడా, నాకు ఆకలి మండిపోతోంది. 41 00:02:57,594 --> 00:02:59,304 తినడానికి ఏమైనా ఉందా? 42 00:02:59,763 --> 00:03:01,557 వంట గదిలో ప్లమ్స్ ఉండవచ్చేమో. 43 00:03:01,640 --> 00:03:02,933 బీఫ్ వేపుడు ఏమైనా ఉందా? 44 00:03:03,433 --> 00:03:04,643 ఉందేమో వెళ్లి చూస్తాను. 45 00:03:04,726 --> 00:03:06,353 మీ కోట్ ఏమైనా తీయమంటారా? 46 00:03:06,436 --> 00:03:07,437 లేదు, నేను ఎక్కువ సేపు ఉండను. 47 00:03:07,521 --> 00:03:09,690 ప్రయాణాన్నికొనసాగించే ముందు త్వరగా ఏమైనా తినేసి వెళ్దామని ఆగాను. 48 00:03:09,773 --> 00:03:12,317 డికిన్సన్స్ ని పలకరించి వెళ్లిపోదామని వచ్చాను. 49 00:03:12,401 --> 00:03:13,777 వాళ్ళల్లో ఎక్కువ మంది ఇక్కడ లేరు. 50 00:03:13,861 --> 00:03:15,904 నామకరణ మహోత్సవం ఉంటే చర్చికి వెళ్ళారు. 51 00:03:16,405 --> 00:03:17,406 ఒకరు ఉన్నారులే. 52 00:03:19,449 --> 00:03:21,285 మిస్టర్ బౌల్స్, నేను నీతో మాట్లాడాలి. 53 00:03:23,036 --> 00:03:24,997 ఏదో తేడాగా మాట్లాడుతున్నావు. అంతా బాగానే ఉందా? 54 00:03:25,080 --> 00:03:27,207 మిస్టర్ బౌల్స్, నాతో హాలులోకి వస్తారా? 55 00:03:32,963 --> 00:03:34,590 నేను తినడానికి ఏమైనా ఉందేమో వెళ్లి చూస్తాను. 56 00:03:48,729 --> 00:03:49,771 ఏంటి సంగతి? 57 00:03:49,855 --> 00:03:51,773 నేను నిన్ను ఒకటి అడగాలి. 58 00:03:51,857 --> 00:03:52,858 సరే. 59 00:03:53,358 --> 00:03:54,985 మరి, గోడ వైపు తిరిగి ఎందుకు మాట్లాడుతున్నావు? 60 00:03:56,695 --> 00:03:58,530 ఎందుకంటే నేను నా కనులను కాపాడుకుంటున్నాను. 61 00:03:59,031 --> 00:04:00,282 నా కళ్ళు చాలా సున్నితమైనవి, 62 00:04:00,365 --> 00:04:02,492 నిన్ను చూస్తే, గుడ్డిదాన్ని అయిపోతానేమో అని భయంగా ఉంది. 63 00:04:02,576 --> 00:04:03,702 చిత్రంగా ఉందే. 64 00:04:03,785 --> 00:04:07,039 మిస్టర్ బౌల్స్, నా కవితల పుస్తకం ఇంకా నీ దగ్గర ఉందా? 65 00:04:08,207 --> 00:04:09,208 నేను నీకు ఇచ్చాను కదా? 66 00:04:09,958 --> 00:04:12,252 అవును, ఉంది. నా సంచిలోనే ఉంది అది. 67 00:04:12,336 --> 00:04:14,922 రైలులో వెళ్ళేటప్పుడు వాటినన్నింటినీ మరోసారి చదువుదామనుకుంటున్నాను. 68 00:04:15,005 --> 00:04:17,466 నా ఉద్దేశం, నీ కవితలు చాలా బాగుంటాయి. అది నీకు తెలిసిందే కదా. 69 00:04:17,548 --> 00:04:18,759 అవి బాగా ఆకట్టుకుంటాయి. 70 00:04:20,010 --> 00:04:22,763 అవి మళ్లీ నాకు ఇచ్చేయమని నాకు అడగక తప్పడం లేదు. 71 00:04:22,846 --> 00:04:23,972 ఏమన్నావు? 72 00:04:25,390 --> 00:04:27,226 నేను మర్యాదపూర్వకంగా... 73 00:04:28,560 --> 00:04:30,437 నా కవితలని నాకు ఇచ్చేయమని అడిగాను. 74 00:04:31,230 --> 00:04:32,689 -వాటిని వెనక్కి ఇచ్చేయాలా? -అవును. 75 00:04:33,190 --> 00:04:34,191 తక్షణమే. 76 00:04:34,274 --> 00:04:35,275 సరే, నాకు అర్థమైందిలే. 77 00:04:35,359 --> 00:04:38,070 నీ ఎడిటర్ గా నేను ఇప్పటికే చాలా కాలంగా ఉన్నాను. 78 00:04:38,153 --> 00:04:40,656 నీ కవితలను ముద్రించబడటం 79 00:04:40,739 --> 00:04:42,741 నీకు ఇష్టం లేదన్నట్టుగా నువ్వు ఆడగడం ఒక నాటకం. 80 00:04:42,824 --> 00:04:44,535 నువ్వు గొప్ప అని చెప్పడానికి కావాలని రివర్స్ లో వెళ్తున్నావు. 81 00:04:44,618 --> 00:04:45,827 ఇది బాగానే ఉంది, కానీ... 82 00:04:46,662 --> 00:04:48,497 నువ్వు ఇలా చేయవలసిన పని లేదు. 83 00:04:49,164 --> 00:04:50,791 నేనేమీ ఆటలు ఆడటం లేదు. 84 00:04:51,375 --> 00:04:52,626 సరే. 85 00:04:52,709 --> 00:04:56,296 మిస్టర్ బౌల్స్, నేనెంతగానో ఆలోచించాను, నాకు బాధగా కూడా అనిపించింది, 86 00:04:56,380 --> 00:04:58,924 నా కవితలు ముద్రించబడకూడదని నిర్ణయించుకున్నాను. 87 00:04:59,007 --> 00:05:00,425 కనుక, నేను అభ్యర్థిస్తున్నాను... 88 00:05:00,509 --> 00:05:04,930 లేదు. నేను నా కవితలని నాకు ఇచ్చేయమని అడుగుతున్నాను. 89 00:05:05,305 --> 00:05:06,348 ఎమిలీ. 90 00:05:06,431 --> 00:05:08,892 నీ కవితకి మంచి ఆదరణ లభించింది. 91 00:05:08,976 --> 00:05:11,019 నువ్వు తక్కువ కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రివి కాబోతున్నావు. 92 00:05:11,103 --> 00:05:14,523 మేము ముద్రించినది జనాలకి బాగా నచ్చింది, ఇంకా ముద్రించమని మమ్మల్ని బతిమాలుతున్నారు. 93 00:05:14,606 --> 00:05:15,607 అది అబద్ధం. 94 00:05:16,525 --> 00:05:19,987 -కొందరికి నచ్చలేదు. నేను విన్నాను. -లేదు, నువ్వు వేరేగా అనుకున్నావు. 95 00:05:20,070 --> 00:05:21,280 అది వాళ్ళకి ఇబ్బందిని కలిగించింది. 96 00:05:21,655 --> 00:05:24,491 అది వాళ్ళని ఆలోచింపజేసింది. ప్రశ్నలను అడిగేలా చేసింది. 97 00:05:25,200 --> 00:05:27,411 అది ఉద్రేకాలని తట్టిలేపింది. దానికి వాళ్ళు ప్రతిస్పందించారు. 98 00:05:27,911 --> 00:05:29,913 ఒక రచయిత్రిగా ఇదే కదా నీకు కూడా అవసరం. 99 00:05:30,455 --> 00:05:31,748 ఎమిలీ, నేను నిజంగా చెప్తున్నాను. 100 00:05:31,832 --> 00:05:35,836 న్యూ ఇంగ్లాండ్ లోనే ఒక గొప్ప కవయిత్రివి కాబోతున్నావు, అమెరికాలో కూడా కావచ్చు. 101 00:05:36,295 --> 00:05:38,714 నీ దారికి నువ్వే అడ్డుపడుతున్నావు, అలా కాకూడదనే నా ప్రయత్నమంతా. 102 00:05:38,797 --> 00:05:42,426 ఇప్పుడు నా దారికి అడ్డుగా ఉంది కేవలం నువ్వు మాత్రమే. 103 00:05:42,509 --> 00:05:44,094 ఆ మాట నన్ను బాధించింది. 104 00:05:44,178 --> 00:05:45,721 నా కవితలను నాకు ఇచ్చేయి. 105 00:05:45,804 --> 00:05:48,432 నా పత్రికా సామ్రాజ్యం నలుదిశలా వ్యాపిస్తోంది. 106 00:05:49,141 --> 00:05:52,561 అందులో నువ్వూ భాగం కావచ్చు. ఒక సామ్రాజ్య నిర్మాణానికి తోడ్పడాలని నీకు లేదా? 107 00:05:52,644 --> 00:05:53,854 నాకు కూడా ఒక సామ్రాజ్యం ఉండేది! 108 00:05:55,856 --> 00:05:57,065 ఇక్కడ ఉండేది. 109 00:05:58,567 --> 00:06:00,444 దాన్ని నువ్వు దొంగలించేశావు. 110 00:06:01,987 --> 00:06:03,155 నువ్వు... 111 00:06:04,323 --> 00:06:05,449 ఇంకా సూ. 112 00:06:12,748 --> 00:06:13,957 అయితే ఇది సూ గురించి అన్నమాట. 113 00:06:17,002 --> 00:06:18,587 నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు. 114 00:06:21,548 --> 00:06:23,175 నీకు మా గురించి తెలిసిపోయింది కదా? 115 00:06:23,258 --> 00:06:24,551 ఇక్కడ ఏం జరుగుతోందో నాకర్థమైంది. 116 00:06:24,635 --> 00:06:27,304 నా గురించి, సూ గురించి నీకు తెలిసిపోయింది, కాబట్టి నీకు కుళ్ళుగా ఉంది. 117 00:06:27,721 --> 00:06:30,349 నేను నీతో సరసమాడుతున్నానని నువ్వు అనుకున్నావు. 118 00:06:31,099 --> 00:06:32,309 నీ మీద మనస్సు పడ్డానని అనుకున్నావు. 119 00:06:33,519 --> 00:06:35,354 కానీ అదేమీ లేదు, సరేనా? 120 00:06:36,605 --> 00:06:38,607 నాకు నీ కవితల మీద తప్ప ఇక దేని మీదా ఆసక్తి లేదు, 121 00:06:38,690 --> 00:06:40,901 నువ్వు కూడా నీ కవితల మీదే దృష్టి పెట్టాలి. 122 00:06:41,568 --> 00:06:44,363 నీ భావావేశాలతో నీ వృత్తి జీవితాన్ని పాడు చేసుకోకు. 123 00:06:44,446 --> 00:06:46,323 మహిళలలో ఇదే పెద్ద సమస్య. 124 00:06:48,116 --> 00:06:49,326 నాకు నా కవితలు కావాలి. 125 00:06:49,743 --> 00:06:51,411 లేదు, ఎమిలీ. నీకు నేను కావాలి. 126 00:06:52,120 --> 00:06:54,998 చూడు, చాలా మంది నిన్ను అస్సలు పట్టించుకొనేవాళ్ళే కాదు. 127 00:06:55,457 --> 00:06:58,126 కానీ నేను పట్టించుకున్నాను, ఎందుకంటే నేను నిన్ను అర్థం చేసుకున్నాను. 128 00:06:58,210 --> 00:07:01,839 నువ్వు చిత్రవిచిత్రమైనదానివి, నీకు మానసిక సమస్య ఉంది, అలాగే వింత మనిషివి కూడా 129 00:07:02,214 --> 00:07:06,051 కానీ ఒక మహిళగా నీలోని కళా చాతుర్యం వాటి ద్వారానే వస్తోందని నేను అర్థం చేసుకున్నా. 130 00:07:06,134 --> 00:07:08,846 ఇప్పుడు, నిన్ను పట్టించుకోకుండా ఉండగలగడం ప్రపంచానికి చాలా తేలిక, 131 00:07:08,929 --> 00:07:10,097 కానీ అలా నేను జరగనివ్వను. 132 00:07:10,848 --> 00:07:12,891 నేనే కనుక వాళ్ళనందరినీ 133 00:07:12,975 --> 00:07:15,477 నీ వైపు మళ్లించకుంటే, నిన్ను పట్టించుకొనే నాథుడే ఉండడు. 134 00:07:15,561 --> 00:07:16,728 నా మాట నమ్ము. 135 00:07:17,688 --> 00:07:19,773 నేను లేకుంటే నువ్వు ఎందుకూ పనికిరావు. 136 00:07:20,732 --> 00:07:25,070 ఏదోకరోజు, నువ్వు ఇదంతా తలుచుకున్నప్పుడు, నాకు కృతజ్ఞతలు తెలియజేస్తావు. 137 00:07:27,990 --> 00:07:29,616 నేను నిన్ను ఆఖరి సారి అడుగుతున్నాను... 138 00:07:31,660 --> 00:07:33,370 నా కవితలను నాకు ఇచ్చేయి. 139 00:07:35,664 --> 00:07:36,707 ఇవ్వను. 140 00:07:37,499 --> 00:07:39,001 ఎంత ధైర్యం. 141 00:07:39,084 --> 00:07:41,295 నువ్వు వాటిని నాకు ఇచ్చేశావు, ఇప్పుడు అవి నావి. 142 00:07:41,879 --> 00:07:43,422 వాటిని నేను నీకు ఇవ్వలేను. 143 00:07:43,505 --> 00:07:44,506 సరే. 144 00:07:44,965 --> 00:07:47,050 వాటిని నువ్వు నాకు ఇవ్వకుంటే, నేను వాటిని లాక్కోవలసి ఉంటుంది. 145 00:07:47,134 --> 00:07:48,969 లేదు, ఓ విషయం చెప్పనా? దానికి బాగా ఆలస్యమైపోయింది. 146 00:07:49,052 --> 00:07:50,053 ఏంటి? 147 00:07:50,137 --> 00:07:51,972 ఇప్పటికే నేను ఒక కవితని ఆఫీసుకి పంపించేశాను. 148 00:07:52,848 --> 00:07:54,683 ఇవాళ కాసేపయ్యాక, దాన్ని ముద్రిస్తారు. 149 00:07:56,643 --> 00:07:57,644 మన్నించు. 150 00:08:02,274 --> 00:08:04,026 -నా సంచిని ముట్టుకోకు! -నేను వాటిని తీసేసుకుంటున్నాను! 151 00:08:04,109 --> 00:08:05,694 -అవి నావి! -అవి నీవి కాదు. 152 00:08:06,445 --> 00:08:07,446 అవి నాకు దొరికేశాయి. 153 00:08:07,529 --> 00:08:08,780 -వాటిని నాకిచ్చేయి. -ఇవి నీకు కావాలా? 154 00:08:08,864 --> 00:08:10,240 -వాటిని నాకిచ్చేయి! -వచ్చి తీసుకో. 155 00:08:10,324 --> 00:08:11,700 వాటిని నాకిచ్చేయి! 156 00:08:12,784 --> 00:08:13,994 హేయ్! 157 00:08:15,287 --> 00:08:16,663 పద! పద! 158 00:08:16,747 --> 00:08:18,290 -నా కవితలను నాకిచ్చేయి. -ఇవ్వను. 159 00:08:18,373 --> 00:08:19,374 ఇచ్చేయి! 160 00:08:21,376 --> 00:08:22,628 వాటిని నాకిచ్చేయి! 161 00:08:24,546 --> 00:08:26,006 నువ్వు దరిద్రుడివి! 162 00:08:26,089 --> 00:08:27,758 నేను స్త్రీవాదిని! 163 00:08:31,803 --> 00:08:33,347 ఇవాళ మనమందరమూ విలియం విల్కిన్సన్ II 164 00:08:33,429 --> 00:08:36,183 పుట్టుకను వేడుకలా జరుపుకుందామని ఇక్కడికి చేరుకున్నాం, 165 00:08:36,265 --> 00:08:37,643 -అలాగే అతను సాగించబోయే... -తను చాలా బాగుంది. 166 00:08:37,726 --> 00:08:39,394 ...విశ్వాసబద్ధ మార్గంలో అతనికి శుభం జరగాలని దీవిద్దాం. 167 00:08:39,477 --> 00:08:41,020 ఆపు! 168 00:08:41,104 --> 00:08:43,273 ఈ పిల్లవాడి అమ్మ, జేన్, 169 00:08:43,357 --> 00:08:45,943 స్వర్గస్థులైన విలియం విల్కిన్సన్ I తరఫున నిలబడి ఉన్న 170 00:08:46,026 --> 00:08:49,988 ఇతని సంరక్షకుడైన ఆస్టిన్ డికిన్సన్ తో పాటు ఇప్పుడు మన ముందు ఉంది. 171 00:08:51,281 --> 00:08:53,200 మనవళ్ళు పుడితే బాగుంటుంది కదా? 172 00:08:53,575 --> 00:08:56,036 చావు మన నుండి అతడిని వేరు చేసినా 173 00:08:56,119 --> 00:08:58,956 విశ్వాసం, ప్రేమ మనల్ని ఎల్లప్పుడూ కలిపే ఉంచుతాయి. 174 00:08:59,498 --> 00:09:02,751 విలియం విల్కిన్సన్ I, మీరు కనబడకపోవచ్చు, కానీ మీరిక్కడే ఉన్నారని మాకు తెలుసు. 175 00:09:07,089 --> 00:09:08,298 నా దగ్గర ఏమున్నాయో చూడండి. 176 00:09:09,049 --> 00:09:10,634 మీ ఇద్దరూ దొంగా పోలీసు ఆడుకుంటుండగా 177 00:09:10,717 --> 00:09:12,928 నేను అతని ఆ చిన్ని సూట్ కేసు నుండి దొంగలించేశాను. 178 00:09:13,512 --> 00:09:14,513 మ్యాగీ. 179 00:09:14,596 --> 00:09:16,473 ధన్యవాదాలు. వీటిని ఎలా సంపాదించావు? 180 00:09:17,641 --> 00:09:20,269 సరైన పని మనిషికి కనబడకుండా ఎలా ఉండాలో బాగా తెలుస్తుంది. 181 00:09:20,936 --> 00:09:22,271 ధన్యవాదాలు. ధన్యవాదాలు. 182 00:09:23,814 --> 00:09:24,857 ఒకటి పడిపోయింది. 183 00:09:26,859 --> 00:09:28,443 సూ కి 184 00:09:30,279 --> 00:09:32,322 ప్రభువా, ఈ నీటిని పవిత్రం చేయండి, 185 00:09:32,406 --> 00:09:36,410 తమరి సంపూర్ణ కరుణ ఈ పిల్లవాడి మీద చూపండి. 186 00:09:39,454 --> 00:09:43,458 ఆస్టిన్ డికిన్సన్, ఈ పిల్లవాడికి సంరక్షకుడిగా ఉండటం ద్వారా, 187 00:09:43,542 --> 00:09:46,253 ఇతని తల్లి అయిన జేన్ పట్ల, అలాగే ఈ పిల్లవాడి పట్ల 188 00:09:46,336 --> 00:09:48,714 నీకు ప్రేమ ఉన్నదని నీవు అంగీకరిస్తున్నావు. 189 00:09:48,797 --> 00:09:50,048 ఈ పిల్లవాడికి ఈ లోకంలో 190 00:09:50,132 --> 00:09:53,135 ప్రేమకి లోటు రాకుండా చూసుకుందువని నీవు నీ మాట ఇస్తున్నావు. 191 00:09:56,054 --> 00:09:58,682 ఈ పిల్లవాడి సంరక్షకుని పాత్ర నీకు సమ్మతమేనా? 192 00:10:02,352 --> 00:10:03,979 -సమ్మతమే. -అయితే ప్రార్థన చేద్దాం. 193 00:10:04,897 --> 00:10:07,691 ప్రభువా, ఈ పిల్లవాడిని దీవించి, భద్రంగా కాచుము. 194 00:10:08,192 --> 00:10:09,193 తథాస్తు. 195 00:10:09,276 --> 00:10:10,652 -తథాస్తు. -తథాస్తు. 196 00:10:13,530 --> 00:10:14,656 నీకు పొగ వాసన వచ్చిందా? 197 00:10:27,461 --> 00:10:28,462 ఎమిలీ. 198 00:10:29,630 --> 00:10:31,173 నీకు నేనెవరో తెలిసిపోయింది కదా. 199 00:10:31,256 --> 00:10:32,257 అవును. 200 00:10:33,717 --> 00:10:35,636 అవును, నువ్వు ఫ్రేజర్ వి. ఫ్రేజర్ స్టర్న్స్. 201 00:10:35,719 --> 00:10:38,096 నేనెవరో, నేనెలా చావబోతున్నానో నీకు తెలుసు. 202 00:10:38,180 --> 00:10:39,181 అవును. 203 00:10:40,807 --> 00:10:42,017 -యుద్ధంలో. -యుద్ధంలో. 204 00:10:45,187 --> 00:10:47,606 కీర్తి కోసం, పేరు కోసం పాకులాడుతూ 205 00:10:51,068 --> 00:10:52,277 నేను నా ఇంటిని వదిలి... 206 00:10:55,030 --> 00:10:56,240 నా కుటుంబాన్ని వదిలి... 207 00:10:57,491 --> 00:10:58,492 యుద్ధంలోకి అడుగుపెడతాను. 208 00:10:59,952 --> 00:11:00,953 అవును. 209 00:11:02,412 --> 00:11:04,164 అప్పుడు ఆ తూటా... 210 00:11:05,958 --> 00:11:07,000 నీ గుండె లోలోతులలోకి దిగబడుతుంది. 211 00:11:08,460 --> 00:11:10,337 ఇక ఫ్రేజర్ స్టర్న్స్ అస్తమిస్తాడు... 212 00:11:12,756 --> 00:11:14,174 జ్ఞాపకాలని మాత్రమే వదిలివెళ్తాడు. 213 00:11:18,720 --> 00:11:20,556 గుర్తింపులేని వారిగా ఉండటమే మంచిదేమో. 214 00:11:21,098 --> 00:11:22,099 నాకు అర్థమైంది. 215 00:11:22,975 --> 00:11:24,852 అదే తప్పును నేను చేయను. 216 00:11:27,020 --> 00:11:29,022 నువ్వు ఎన్నో యుద్ధాలు పోరాడాల్సి వస్తుంది, ఎమిలీ డికిన్సన్. 217 00:11:33,026 --> 00:11:35,028 కానీ నువ్వు వాటిని రహస్యంగా పోరాడాలి. 218 00:11:38,282 --> 00:11:39,491 ఒంటరిగా. 219 00:11:40,409 --> 00:11:41,618 ఎవ్వరికీ కనబడకుండా. 220 00:11:42,369 --> 00:11:46,123 నీకు నీ అంతరంగం నుండే పేరు రావాలి, ఈ ప్రపంచం నుండి కాదు. 221 00:11:51,253 --> 00:11:52,880 నువ్వు ఒక గుర్తింపులేని వ్యక్తివి అయిపోవాలి. 222 00:11:56,049 --> 00:11:58,886 ఇప్పటి వరకు ఎవ్వరూ కనీవిని ఎరుగని ఒక బ్రహ్మాండమైన ధీర వనితవి నువ్వు కావాలి. 223 00:12:15,819 --> 00:12:17,487 అగ్ని జ్వాలలను నువ్వు ఆర్పలేవు - 224 00:12:19,781 --> 00:12:21,867 మండించగల వస్తువు 225 00:12:23,160 --> 00:12:25,204 లవీనియా. రా, బంగారం. 226 00:12:25,954 --> 00:12:28,290 ఫ్యాన్ గాలి తగలకుండానే ఆరిపోగలదు - 227 00:12:32,169 --> 00:12:33,170 ఆబీ! 228 00:12:33,253 --> 00:12:34,505 రాత్రి అనుకున్న విధంగా జరగని నాడు - 229 00:12:34,588 --> 00:12:35,672 పక్కకు తప్పుకోండి... 230 00:12:38,884 --> 00:12:40,594 అంతే. బయటకి పద. 231 00:13:03,700 --> 00:13:04,701 వెళ్లిపోండి. 232 00:13:07,538 --> 00:13:08,539 ఎమిలీ. 233 00:13:10,624 --> 00:13:11,625 నేను నిన్ను కలవడానికి వచ్చాను. 234 00:13:13,961 --> 00:13:15,003 ఇక్కడి నుండి వెళ్లిపో. 235 00:13:17,172 --> 00:13:18,173 ఎమిలీ. 236 00:13:20,634 --> 00:13:21,635 మనం మాట్లాడుకోవాలి. 237 00:13:21,718 --> 00:13:23,971 నాకు నీతో మాట్లాడాలని లేదు. కనీసం నీ ముఖం చూడాలని కూడా లేదు. 238 00:13:24,054 --> 00:13:26,807 ఇప్పుడు ఆలోచిస్తుంటే, అసలు నిన్ను ఇకపై చూడాలని కూడా నాకనిపించడం లేదు. 239 00:13:29,393 --> 00:13:31,395 విషయాలను నా వైపు నుండి వివరణనిచ్చే అవకాశం ఇవ్వు. 240 00:13:31,478 --> 00:13:33,146 వివరణ ఇవ్వడానికి ఇంకా ఏముంది? 241 00:13:33,230 --> 00:13:35,023 నాకు ఇప్పుడు అంత స్పష్టంగా కనబడుతోంది. 242 00:13:35,107 --> 00:13:37,734 లేదు. నీకు కనబడని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. 243 00:13:39,236 --> 00:13:41,488 నీకు నా మీద కోపం రావడంలో ఆశ్చర్యం లేదు. 244 00:13:41,572 --> 00:13:43,490 నేనేమీ నీ అనుమతి కోరడం లేదు. 245 00:13:43,574 --> 00:13:46,243 నువ్వు అతడిని పట్టించుకుంటున్నావని నాకు తెలుసు. 246 00:13:50,581 --> 00:13:51,582 అతడిని పట్టించుకుంటున్నానా? 247 00:13:53,458 --> 00:13:56,003 అలా నా చేత చేయించింది నువ్వే కదా. 248 00:13:57,379 --> 00:13:59,006 నువ్వు నన్ను బలవంతంగా నెట్టావు! 249 00:14:00,132 --> 00:14:03,260 అతడిని నేను ప్రేమించాలని నువ్విదంతా చేసినట్టుగా ఉంది. ఎందుకు అలా చేశావు? 250 00:14:03,343 --> 00:14:05,596 అతడి మీద ప్రేమ ఉంది నీకే కదా. 251 00:14:05,679 --> 00:14:06,889 నాకు అతని మీద ప్రేమ లేదు. 252 00:14:07,639 --> 00:14:09,266 -ఎప్పుడూ లేదు. -నువ్వు అబద్ధమాడుతున్నావు. 253 00:14:10,058 --> 00:14:13,687 -అతని గురించి నేనస్సలు పట్టించుకోను కూడా. -అయితే ఎందుకు అతనితో పడక పంచుకున్నావు? 254 00:14:15,397 --> 00:14:16,565 ఇంకా ఎందుకు... 255 00:14:17,691 --> 00:14:19,818 అతనికి నా కవితలని ఇవ్వమని ఎందుకు నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేదానివి? 256 00:14:19,902 --> 00:14:22,571 ఎందుకంటే నీ కవితల వల్ల నాలో కలిగే భావాలను నేను నియంత్రించుకోలేను కనుక. 257 00:14:23,614 --> 00:14:26,909 నీ కవితలలో నేను తట్టుకోలేనంత శక్తి ఉంది. అవి పాముల్లాంటివి. 258 00:14:26,992 --> 00:14:30,537 అవి నా లోనికి ప్రవేశించి, నా గుండెని చుట్టుకొని, 259 00:14:30,621 --> 00:14:33,373 నా ఊపిరి ఆగేంతవరకు పిండేసేవి. 260 00:14:33,457 --> 00:14:36,668 అవి మెరిసే విషపూరితమైన కవితలు, అవి కరుస్తాయి కూడా. 261 00:14:38,128 --> 00:14:39,838 నాకు భయమేసింది, ఎమిలీ. 262 00:14:39,922 --> 00:14:43,342 నీ మీద, నువ్వు నన్ను బంధీ చేసుకున్న విధానం మీద, నన్ను విషపూరితం చేసిన పద్దతి మీద. 263 00:14:46,637 --> 00:14:48,847 నేను ఆస్టిన్ ని పెళ్లి చేసుకున్నప్పుడు మనిద్దరం అక్కాచెల్లెళ్ళం అయ్యాము, 264 00:14:48,931 --> 00:14:51,099 మన మధ్యన పదాలు తప్ప వేరే బంధం ఉండేది కాదు. 265 00:14:51,183 --> 00:14:57,898 నువ్వు చాలా రాయడం మొదలుపెట్టావు, కానీ వాటిలోని అర్థం నాకు మాత్రమే తెలిసేది. 266 00:14:59,399 --> 00:15:00,609 నేను భరించలేకపోయాను. 267 00:15:03,028 --> 00:15:06,365 కాబట్టి నేను అనుకున్నాను, నిన్ను కాస్త దూరం ఉంచితే, అప్పుడు... 268 00:15:08,867 --> 00:15:11,578 నువ్వు నన్ను దూరంగా ఉంచేస్తే, అప్పుడు నేను ఇంకొకరి సమస్య అవుతాను, అంతే కదా? 269 00:15:16,124 --> 00:15:17,960 ఓ విషయం చెప్పనా? 270 00:15:20,838 --> 00:15:22,589 నేను ఇకపై నీకు సమస్యగా ఉండనులే, సూ. 271 00:15:23,799 --> 00:15:27,010 ఇక నువ్వు నీ సొగసైన దుస్తులు ధరించి నీ హాలులోకి వెళ్లిపోవచ్చు, 272 00:15:27,094 --> 00:15:29,596 ఏ భావాలు లేకుండా డొల్లగా ఉండిపోవచ్చు, 273 00:15:29,680 --> 00:15:32,266 ఎందుకంటే ఇకమీదట నీలో నేను ఎలాంటి భావాలను రగిలించను కాబట్టి. 274 00:15:32,349 --> 00:15:33,851 ఇక నేను లేకుండా... 275 00:15:35,477 --> 00:15:36,478 ఏంటి? 276 00:15:37,604 --> 00:15:38,772 నేను లేకుండా... 277 00:15:40,440 --> 00:15:42,818 నీలో భావాలు పుడతాయని నేను అనుకోవడం లేదు. 278 00:15:44,945 --> 00:15:45,946 సరే. 279 00:15:48,156 --> 00:15:49,658 వెళ్ళేటప్పుడు తలుపు మూసేసి వెళ్ళు. 280 00:15:53,579 --> 00:15:54,580 నువ్వన్నది నిజమే. 281 00:15:57,249 --> 00:15:58,584 ఏ విషయంలో? 282 00:16:02,462 --> 00:16:05,465 నాకు భావాలు నీతో ఉన్నప్పుడే కలుగుతాయి. 283 00:16:12,598 --> 00:16:16,185 "తన మాటలు ఎంత అందంగా ఉన్నా అవి చురకత్తుల వలె పదునుగా ఉన్నాయి." 284 00:16:17,352 --> 00:16:21,440 అతని వైపుకు నేను నిన్ను ఎందుకు నెట్టానంటే, నా భావాల నుండి నేను తప్పించుకోవాలనుకున్నా. 285 00:16:22,816 --> 00:16:25,652 ఆ భావాలను దూరంగా చేసుకోవడానికి నేను అతనితో పడక పంచుకున్నాను. 286 00:16:26,403 --> 00:16:31,241 నాలో చాలా భావాలు కలుగుతున్నాయి, అవి కలగాలని నాకు లేదు, ఎమిలీ. 287 00:16:33,744 --> 00:16:35,621 ఇక నేను కలగకూడదనుకుంటున్న అతిపెద్ద భావన... 288 00:16:35,704 --> 00:16:36,914 ఏంటది? 289 00:16:39,208 --> 00:16:40,209 ఏంటది? 290 00:16:41,251 --> 00:16:42,586 ఏంటది, సూ? చెప్పేయి! 291 00:16:42,669 --> 00:16:44,338 నీతో ప్రేమలో పడ్డాను అనే భావన. 292 00:16:44,421 --> 00:16:45,797 నేను నీ మాటలను నమ్మను. 293 00:16:45,881 --> 00:16:47,007 అది నిజమే. 294 00:16:47,090 --> 00:16:48,300 అది నిజం కాదు. 295 00:16:49,510 --> 00:16:51,803 నువ్వు నాకు చెప్పేదేదీ నిజం కాదు! 296 00:16:52,596 --> 00:16:54,431 అసలు నువ్వు సూ వి కూడా కాదు. 297 00:16:54,515 --> 00:16:56,892 నువ్వు ఒక కొత్త, నకిలీ మనిషివి. 298 00:16:56,975 --> 00:17:00,103 నువ్వెవరో కూడా నాకు తెలియడం లేదు, నువ్వు నాకు చెప్పేవన్నీ అబద్ధాలే! 299 00:17:00,187 --> 00:17:01,396 ఎమిలీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను! 300 00:17:01,480 --> 00:17:02,773 నాతో అబద్దాలాడటం ఆపు! 301 00:17:02,856 --> 00:17:03,690 నేను నిన్ను ప్రేమిస్తున్నాను! 302 00:17:04,398 --> 00:17:08,612 లైబ్రరీలో కూడా నీ ఉనికి నాకు తెలిసింది, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు. 303 00:17:08,694 --> 00:17:10,405 నేను నీ నుండి తప్పించుకోలేను, 304 00:17:10,489 --> 00:17:15,035 ఎందుకంటే నాకు తెలిసిన భావం ఒకే ఒకటి, అది నీ మీద నాకున్న ప్రేమ. 305 00:17:42,980 --> 00:17:44,690 సరే, సరే, సరే. 306 00:17:48,902 --> 00:17:51,280 అమ్మాయిలూ, మీకేమీ కాలేదు కదా? 307 00:17:55,576 --> 00:17:57,744 దీనికి కారణం మీరు కాదు కదా? 308 00:18:01,623 --> 00:18:02,958 అబ్బా. 309 00:18:04,626 --> 00:18:05,627 సరే... 310 00:18:07,171 --> 00:18:08,797 దీని గురించి ఎవ్వరికీ చెప్పకండి. 311 00:18:09,506 --> 00:18:12,509 ఇది 1850ల కాలం. ఎప్పుడూ ఏదోకటి తగలబడుతూనే ఉంటుంది. 312 00:18:13,802 --> 00:18:15,804 సరే, ఇంటికి పదండి. 313 00:18:23,687 --> 00:18:25,439 స్థలం ఉన్నచోట కూర్చోండి. 314 00:18:26,064 --> 00:18:29,193 టోపీలు, కోట్లు, జాకెట్లు, వాటిని లైబ్రరీలో ఉంచవచ్చు. 315 00:18:30,152 --> 00:18:33,488 వేడి వేడి టీ తయారవుతోంది. అందరికీ సరిపడా ఆహారం కూడా ఉంది. 316 00:18:33,572 --> 00:18:37,284 విరాళాల కోసం అక్కడ ఒక డబ్బాని ఉంచాను. 317 00:18:37,367 --> 00:18:40,704 ఎవరైనా తమకు చేతనైనంత సాయం చేస్తే, అది చాలా మేలు అవుతుంది. 318 00:18:41,288 --> 00:18:44,124 పాత చర్చి? అది మనకి బాగానే ఉపయోగపడింది. 319 00:18:45,209 --> 00:18:46,919 పదికాలాలు దాని జ్ఞాపకాలు చల్లగా ఉండాలి. 320 00:18:47,002 --> 00:18:50,088 సమయం పడుతుంది కానీ మనం దాన్ని పునర్నిర్మించవచ్చు. 321 00:18:50,839 --> 00:18:53,634 ఎప్పటిలాగానే, అమ్హెర్స్ట్ అంతా ఏకమవుతుంది, 322 00:18:54,259 --> 00:18:56,887 మనం ఈ దుర్ఘటనకి కలిసి అధిగమిస్తాం. 323 00:18:57,346 --> 00:18:59,890 -అవును. చాలా బాగా చెప్పారు. -అవును. 324 00:18:59,973 --> 00:19:01,391 నా కొడుకుని చూసి నాకు గర్వంగా ఉంది. 325 00:19:01,975 --> 00:19:04,019 వాడి భార్య ఎక్కడ ఉంది? 326 00:19:04,102 --> 00:19:07,314 ఇలాంటి సమయంలో తను కూడా వాడి పక్కన ఉంటే బాగుంటుంది కదా? 327 00:19:08,732 --> 00:19:10,609 ఆస్టిన్, సూ ఎక్కడ? 328 00:19:10,692 --> 00:19:13,237 మనం తనని చర్చిలోనే అగ్నికి ఆహుతి అవ్వడానికి వదిలేయలేదనే ఆశిస్తున్నా. 329 00:19:13,320 --> 00:19:16,865 నాకు నచ్చినట్టు నేను జీవిస్తున్నట్టుగానే తనకు నచ్చినట్టు తను జీవిస్తోంది అనుకుంటా. 330 00:19:24,873 --> 00:19:29,670 మరి, ఏంటి న్యూ ఓర్లీన్స్ కి వెళ్లిపోదాం అనేదో పిచ్చిగా మాట్లాడుతున్నావు? 331 00:19:29,753 --> 00:19:30,879 నోలా, బంగారం. నోలా. 332 00:19:30,963 --> 00:19:33,215 నువ్వు దాన్ని ఎలాగైనా పిలుచుకో. నేను మాత్రం అక్కడికి రాను. 333 00:19:33,298 --> 00:19:34,883 నువ్వు వస్తున్నావు. 334 00:19:35,300 --> 00:19:39,263 అక్కడ స్థిరాస్థి రంగంలో నాకు తెలిసిన జోసెఫ్ లైమన్ కి నేను టెలిగ్రాం పంపాను. 335 00:19:39,763 --> 00:19:41,223 జోసెఫ్ లైమన్, నా మాజీ ప్రియుడా? 336 00:19:41,306 --> 00:19:44,101 అవును. నీకు అతను తెలుసనే విషయం నేను మర్చిపోయాను. లైమన్. 337 00:19:44,184 --> 00:19:45,269 లైమన్! 338 00:19:45,352 --> 00:19:47,521 చాలా మంచి వాడు. నా దగ్గర ఉన్న డబ్బంతా వాడికి పంపేశాను. 339 00:19:47,604 --> 00:19:48,689 మనకో ఇంటిని సంపాదించాడు. 340 00:19:48,772 --> 00:19:50,816 జోసెఫ్ లైమన్ మనకో ఇంటిని అమ్మాడా? 341 00:19:50,899 --> 00:19:52,234 దాన్ని పాక అని అనవచ్చు. 342 00:19:52,317 --> 00:19:54,653 న్యూ ఓర్లీన్స్ లో ఒక పాక కోసం నువ్వు నీ డబ్బునంతా ఖర్చు చేశావా, 343 00:19:54,736 --> 00:19:57,739 పైగా నేను అన్నింటినీ వదిలేసి, నీతో రావాలని అడుగుతున్నావా? 344 00:19:57,823 --> 00:19:58,866 అవును. 345 00:19:58,949 --> 00:20:00,701 ఇది 19వ శతాబ్దం. నువ్వు నా భార్యవి. 346 00:20:00,784 --> 00:20:02,035 నిర్ణయాలను తీసుకొనేది నేను. 347 00:20:02,119 --> 00:20:05,122 సరే, ఇంతసేపూ నేను చెప్తోంది 348 00:20:05,205 --> 00:20:06,206 ఏమైనా తలకి ఎక్కించుకున్నావా? 349 00:20:06,290 --> 00:20:08,208 బంగారం, నోలా చాలా బాగుంటుంది. నీకు అది బాగా నచ్చుతుంది. 350 00:20:08,292 --> 00:20:11,420 ఇప్పుడు ఒక అంతర్యుద్ధం మొదలవ్వబోతోంది. నేను లూసియానాకు రాలేను. 351 00:20:11,503 --> 00:20:13,130 నా కుటుంబానికి నేను శాశ్వతంగా దూరమవుతాను. 352 00:20:13,630 --> 00:20:15,632 అదీగాక, చరిత్రలో నేను చెడుపని చేసినదానిగా మిగిలిపోతాను. 353 00:20:15,716 --> 00:20:17,050 హేయ్, దక్షిణ ప్రాంతం అంత దారుణంగా ఏమీ ఉండదు. 354 00:20:17,134 --> 00:20:19,469 అక్కడి ప్లాంటేషన్ వ్యవస్థ, అది జమీందారీ వ్యవస్థ లాంటిది... 355 00:20:19,553 --> 00:20:21,346 బానిసత్వం దారుణమైనది, షిప్. 356 00:20:21,430 --> 00:20:23,515 నీది విశాల మనస్తత్వం అని అనుకున్నానే. 357 00:20:23,599 --> 00:20:24,683 ఈ విషయంలో మాత్రం కాదు. 358 00:20:24,766 --> 00:20:26,560 కమాన్. అక్కడ చాలా బాగుంటుంది. 359 00:20:26,643 --> 00:20:28,020 దక్షిణ ప్రాంతంలో నిన్నొక రాచరికపు... 360 00:20:28,103 --> 00:20:29,938 నేనొక పనికిమాలిన యాంకీ తిరుగుబోతుని. 361 00:20:30,314 --> 00:20:31,940 -దాన్ని గౌరవించు. -నాకు అర్థంకావడం లేదు. 362 00:20:32,024 --> 00:20:33,317 నిన్ను ఇక్కడ వదిలేసి, 363 00:20:33,400 --> 00:20:35,569 నేను నోలాకి వెళ్లి, అక్కడో పత్తి భూస్వామి కూతురిని పెళ్లి చేసుకోమంటున్నావా? 364 00:20:35,652 --> 00:20:38,197 లేదు, నువ్వు... నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు, 365 00:20:38,280 --> 00:20:42,117 మనం అమ్హెర్స్ట్ లోనే ఉండాలి, మన బంధంలో పరిమితులు తక్కువ, స్వేచ్ఛ ఎక్కువగా ఉండాలి. 366 00:20:42,201 --> 00:20:43,202 దేవుడా... 367 00:20:43,785 --> 00:20:44,912 వదిలేయిలే. 368 00:20:45,454 --> 00:20:46,455 వదిలేయి, తల్లీ! 369 00:20:46,538 --> 00:20:49,541 ఇప్పటికే ఆ పాకలో నేను నా తలకు మించి ఖర్చు చేశాను. 370 00:20:51,210 --> 00:20:53,253 ఏంటి... షిప్... 371 00:20:55,464 --> 00:20:56,924 నేనేమైనా తప్పు చేస్తున్నానా? 372 00:20:57,007 --> 00:20:58,008 అవును. 373 00:20:58,091 --> 00:20:59,343 అందులో సందేహమే లేదు. 374 00:20:59,426 --> 00:21:01,178 అతను నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాడు, లవీనియా. 375 00:21:01,261 --> 00:21:03,722 ఇక నువ్వు వయస్సు మించిపోయిన బ్రహ్మచారిణిగానే మిగిలిపోతావు. 376 00:21:09,061 --> 00:21:10,395 రోజులు మారుతున్నా, తప్పులు మారడం లేదు. 377 00:21:15,400 --> 00:21:16,693 షిప్. 378 00:21:16,777 --> 00:21:18,153 సరేమరి. 379 00:21:18,237 --> 00:21:20,239 -నువ్వు న్యూ ఓర్లీన్స్ కి వెళ్లు. -నోలా. 380 00:21:22,908 --> 00:21:24,117 అక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకో. 381 00:21:24,826 --> 00:21:26,495 పిల్లలని కను ఇంకా ఏమైనా చేసుకో. 382 00:21:27,496 --> 00:21:29,831 కానీ నీకూ తెలుసు, నాకూ తెలుసు... 383 00:21:30,499 --> 00:21:31,500 ఏం తెలుసు? 384 00:21:31,583 --> 00:21:35,212 ...నువ్వు ప్రేమించిన అమ్మాయిలలో నన్ను మించినవారు నీకు ఎవ్వరూ దక్కరని. 385 00:21:40,175 --> 00:21:41,677 మన చర్చి. 386 00:21:41,760 --> 00:21:43,470 మన అందమైన పాత చర్చి. 387 00:21:43,554 --> 00:21:44,555 శ్రీమతి డికిన్సన్. 388 00:21:46,473 --> 00:21:47,933 నిన్న రాత్రి ఇది నా కలలోకి వచ్చింది. 389 00:21:50,143 --> 00:21:51,144 ఏంటి? 390 00:21:51,770 --> 00:21:53,981 -నువ్వేమంటున్నావు? -ఇలా జరగడం నేను చూశాను. 391 00:21:56,275 --> 00:21:58,360 చర్చి తగలబడిపోవడం. ఇది నాకు ముందుగానే తెలిసింది. 392 00:21:59,069 --> 00:22:00,070 అది నా కలలోకి వచ్చింది. 393 00:22:00,737 --> 00:22:02,573 ఇదంతా నేను ఇంతకు ముందే చూశాను. 394 00:22:03,323 --> 00:22:05,158 లేదు, నువ్వు ఏవేవో ఊహించుకుంటున్నావు. 395 00:22:05,242 --> 00:22:07,828 లేదు. దీన్ని నిన్న రాత్రి నేను కల కన్నాను, ఇప్పుడు అది నిజమైంది. 396 00:22:07,911 --> 00:22:09,830 ఇదొక చెడు సూచకం అయ్యుంటుంది, చెడు శకునం. 397 00:22:13,333 --> 00:22:15,836 ఈ సూచకాలూ, కనబడటాలు. 398 00:22:16,336 --> 00:22:18,005 ఎమిలీలాగానే పిచ్చిగా మాట్లాడుతున్నావు. 399 00:22:20,257 --> 00:22:22,467 బహుశా తను మనం అనుకున్నంత పిచ్చిది కాదేమో. 400 00:22:58,378 --> 00:22:59,588 దేవుడా. 401 00:23:53,517 --> 00:23:54,518 సర్పము 402 00:23:54,601 --> 00:23:56,270 గడ్డిలోన ఉండే ఒక సన్నపాటి జీవి 403 00:23:56,645 --> 00:23:58,063 అప్పుడప్పుడూ అటూఇటు వెళ్తూ ఉంటుంది - 404 00:23:58,772 --> 00:24:01,483 మీరు దాన్ని చూసే ఉంటారు? అవును 405 00:24:01,567 --> 00:24:03,068 ఇలా కనిపించి అలా వెళ్లిపోతుంది 406 00:24:04,278 --> 00:24:05,988 గడ్డి, పాపిడి దువ్వినట్టు విడిపోతుంది, 407 00:24:07,155 --> 00:24:08,657 మచ్చమచ్చల రూపం గలది 408 00:24:10,951 --> 00:24:12,953 నీ పాదాల మధ్య నుండి జారుకుంటుంది 409 00:24:13,537 --> 00:24:14,955 ఇక ముందుకు వెళ్లిపోతుంది - 410 00:24:16,164 --> 00:24:17,708 దానికి తడి నేలలు అంటే ఇష్టం 411 00:24:18,375 --> 00:24:20,460 ఆ ప్రదేశం చాలా చల్లగా ఉండాలి - 412 00:24:21,253 --> 00:24:23,130 కానీ నా చిన్నతనంలో, చెప్పులు వేసుకోనప్పుడు 413 00:24:23,213 --> 00:24:24,590 మధ్యాహ్న సమయాల్లో చాలా సార్లు దాన్ని చూశాను 414 00:24:25,382 --> 00:24:27,634 ఏదో కొరడా అని అనుకున్నాను 415 00:24:28,302 --> 00:24:29,761 అలా ఎండలో పడుంది 416 00:24:30,429 --> 00:24:32,055 దాన్ని పట్టుకుందామని ఆగాను 417 00:24:32,681 --> 00:24:34,474 అది జారుకొని వెళ్లిపోయింది - 418 00:24:40,689 --> 00:24:42,316 ప్రకృతి జీవులలో చాలా వరకు 419 00:24:42,399 --> 00:24:44,443 అవి నాకు తెలుసు, నాకు అవి తెలుసు 420 00:24:45,277 --> 00:24:47,779 నా మదిలో వాటి పట్ల 421 00:24:47,863 --> 00:24:49,114 స్నేహభావం ఉంది 422 00:24:52,492 --> 00:24:53,911 కానీ ఇంతవరకూ నేను దీన్ని చూడలేదు 423 00:24:55,329 --> 00:24:57,164 ఇతరులతో అయినా, ఒంటరిగా అయినా 424 00:24:59,666 --> 00:25:01,084 దాన్ని చూస్తే నాకు వణుకు 425 00:25:02,211 --> 00:25:03,837 చచ్చేంత భయం 426 00:25:12,596 --> 00:25:14,431 ఇప్పుడు నేను ఆనందంగా చనిపోగలను. 427 00:25:17,100 --> 00:25:18,101 నేను కాదు. 428 00:25:19,228 --> 00:25:21,063 ఈ రోజు మరణం మీద నాకు జాలి కలుగుతోంది. 429 00:25:23,440 --> 00:25:24,441 ఎమిలీ? 430 00:25:25,817 --> 00:25:26,818 ఏంటి? 431 00:25:28,820 --> 00:25:30,030 నేను నీతో ఉన్నప్పుడే... 432 00:25:31,990 --> 00:25:34,284 అప్పుడే నాలో ప్రాణం ఉన్నట్టు నాకు తెలుస్తుంది. 433 00:25:43,836 --> 00:25:45,045 నాకు కావలసింది అదే. 434 00:25:46,380 --> 00:25:48,048 ఎప్పట్నుంచో నేను కోరుకున్నది అదే. 435 00:25:49,842 --> 00:25:51,468 నీకు ఆ విధంగా అనిపించేలా చేయడం. 436 00:25:53,428 --> 00:25:55,848 నేను నీ కోసం, నా సూ కోసం రాస్తాను. 437 00:25:56,807 --> 00:25:58,016 నీ కోసం రాస్తాను. 438 00:26:00,602 --> 00:26:01,812 నీ కోసమే రాస్తాను. 439 00:26:04,356 --> 00:26:05,649 నాకు అది చాలు. 440 00:26:10,445 --> 00:26:12,447 నేను నిన్ను ఇక ఎప్పటికీ వదులుకోను. 441 00:27:21,308 --> 00:27:23,310 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య