1 00:01:28,672 --> 00:01:31,508 తల్లి ద్వారా నేర్చుకోని పిల్లలందరూ... 2 00:01:33,552 --> 00:01:35,512 లోకం ద్వారా నేర్చుకుంటారు. 3 00:01:52,905 --> 00:01:53,739 హేయ్. 4 00:01:55,532 --> 00:02:00,120 - జలపాతం దగ్గర ఒక ముసలావిడని చూశా. - జలపాతమా? 5 00:02:01,455 --> 00:02:02,289 అవును. 6 00:02:02,581 --> 00:02:04,750 ఆ మడుగు దగ్గరికి మీరు మళ్లీ వెళ్లకండి. 7 00:02:05,167 --> 00:02:06,210 ఏంటి? 8 00:02:06,210 --> 00:02:07,336 అక్కడ ఆత్మలు ఉంటాయి. 9 00:02:07,878 --> 00:02:09,170 చాలా ఆత్మలు ఉంటాయి. 10 00:02:09,170 --> 00:02:12,049 అక్కడ ఉండే చాకలి ఆవిడ... తను మంత్రగత్తె. 11 00:02:13,050 --> 00:02:13,884 మంత్రగత్తె... 12 00:02:13,884 --> 00:02:15,511 మీరేం చేసినా కానీ... 13 00:02:15,511 --> 00:02:17,721 అక్కడికి మాత్రం వెళ్లకండి. 14 00:02:17,971 --> 00:02:20,349 అస్సలు... అస్సలంటే అస్సలు... 15 00:02:20,349 --> 00:02:22,518 మిమ్మల్ని తాకే అవకాశం ఆమెకి ఇవ్వకండి! 16 00:02:40,452 --> 00:02:44,540 మహిళల శక్తి మాటలకు అందనంత గొప్పది. 17 00:02:45,874 --> 00:02:50,045 భయంకరమైనంత మర్మమైనది, అనేక పొరలతో ఉండి, చాలా సంక్లిష్టకరంగా ఉంటుంది. 18 00:02:51,755 --> 00:02:53,173 వారు శక్తివంతమైన జీవులు... 19 00:02:55,551 --> 00:02:58,262 మహిళలు ఏమేం చేయగలరో ఊహించే శక్తి వాళ్లకి లేదు, 20 00:02:58,762 --> 00:03:03,267 కాబట్టి వారి శక్తిని లాగేసుకొనే ప్రయత్నం చేస్తారు, వారి ప్రత్యేకతను గుంజుకునే ప్రయత్నం చేస్తారు. 21 00:03:03,976 --> 00:03:06,520 మొదట్నుంచీ అంతే, ఎప్పటికీ అంతే. 22 00:03:09,106 --> 00:03:11,233 వారి లోపల ఉండే మాయా శక్తి అంటే భయం. 23 00:03:12,067 --> 00:03:14,236 అది కనిపించట్లేదా? మరింత శ్రద్ధగా చూడండి. 24 00:03:16,405 --> 00:03:18,991 మరింత శ్రద్ధగా చూడండి. 25 00:04:53,669 --> 00:04:55,587 తాకవచ్చా అని మీరు చెట్టును అనుమతి అడగాలి ముందు. 26 00:04:59,299 --> 00:05:00,342 సారీ. 27 00:06:38,899 --> 00:06:39,858 ఫోటో తీయనా? 28 00:06:43,153 --> 00:06:44,238 సరే. 29 00:06:47,449 --> 00:06:48,909 సరే. నేను సుసు పోసుకొని వస్తా. 30 00:06:48,909 --> 00:06:49,993 సరే. 31 00:10:18,577 --> 00:10:23,498 తను ఆ కెమెరాలోకి ఏదో మంత్రగత్తె చూసినట్టు చూసింది, అపోలో. 32 00:10:59,826 --> 00:11:01,286 చీకటి పడ్డాక స్నానం చేయిస్తారు, చాలా చక్కగా దాస్తారు. 33 00:11:01,286 --> 00:11:02,871 అడవిలో నివాసముంటూ, ఎవరికీ కనిపించకుండా ఉంటారు. 34 00:11:21,056 --> 00:11:23,058 విక్టర్ లవాల్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 35 00:12:03,557 --> 00:12:07,186 చీకటి పడ్డాక స్నానం చేయిస్తారు, చాలా చక్కగా దాస్తారు. 36 00:12:08,228 --> 00:12:14,318 అడవిలో నివాసముంటూ, ఎవరికీ కనిపించకుండా ఉంటారు. 37 00:12:15,068 --> 00:12:16,236 అపోలో? 38 00:12:22,117 --> 00:12:23,577 గుడ్ మార్నింగ్, పెర్ల్. 39 00:12:25,454 --> 00:12:27,331 పెర్ల్ వాకర్, 40 00:12:28,457 --> 00:12:32,836 మెయిన్ తీరంలో పెరిగింది, నిత్యం దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతూ దొరికిపోయేది. 41 00:12:34,129 --> 00:12:38,008 పెద్ద తాగుబోతు. ఆమెకి ఒక బిడ్డ ఉంది. 42 00:12:42,721 --> 00:12:44,806 నీ హై స్కూల్ చిహ్నం పేరేంటో గుర్తుందా? 43 00:12:44,806 --> 00:12:47,309 ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటే, నేను ఆనందంగా గుర్తుచేయగలను... 44 00:12:47,309 --> 00:12:50,896 నిన్న రాత్రే పెట్రోల్ పోసి నిన్ను నిప్పంటించాలనుకున్నా. 45 00:12:52,189 --> 00:12:56,527 కానీ మనస్సు మార్చుకొని, "వద్దులే, ఆ పని గ్రెట్టాకి వదిలేద్దాం," అని ఊరుకున్నా. 46 00:12:57,027 --> 00:12:58,737 అందుకని తనని ఇక్కడికి రమ్మని ఒక పడవ పంపాను. 47 00:12:58,737 --> 00:13:01,907 మరి నా కూతురి సంగతేంటి? 48 00:13:01,907 --> 00:13:03,575 నువ్వు చంపేసిన కూతురా? 49 00:13:03,575 --> 00:13:05,494 - ఒక్క నిమిషం. - నువ్వు చచ్చినా, తను నీకు కనిపించదు. 50 00:13:05,494 --> 00:13:08,413 - ఒక్క నిమిషం ఆగండి. - మంత్రగత్తె. మాయల మరాఠీ. 51 00:13:08,413 --> 00:13:10,457 నీ నోట్లోంచి వచ్చేవన్నీ అబద్ధాలే. 52 00:13:10,457 --> 00:13:12,292 ఆగండి, ఇతను కన్న కూతురిని చంపేశాడని మీరు అంటున్నారు. 53 00:13:12,292 --> 00:13:14,878 అది నిజం కాదు. తన భార్యని, కూతురిని తీసుకెళ్లడానికే ఇతను ఇక్కడికి వచ్చాడు. 54 00:13:14,878 --> 00:13:17,047 - అవును కదా, విలియమ్? - ఈ పనికిమాలినది అబద్ధాలు ఆడుతోంది. 55 00:13:17,047 --> 00:13:20,926 తను మాయ చేస్తోంది. మంత్రగత్తెల పనే అది కదా. 56 00:13:21,885 --> 00:13:23,971 నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా. 57 00:13:25,264 --> 00:13:26,265 ఎందుకు? 58 00:13:26,849 --> 00:13:28,058 నీకు ఆ అవకాశం వద్దా? 59 00:13:30,435 --> 00:13:31,687 ఒకవేళ నేను బయటకు వస్తే, 60 00:13:31,687 --> 00:13:33,355 నన్ను పిట్టను కాల్చినట్టు కాల్చేయరని గ్యారెంటీ ఏంటి? 61 00:13:33,355 --> 00:13:36,066 గ్యారెంటీ ఏం లేదు. ఏదేమైనా, నువ్వు ఏం చేయగలవు? 62 00:13:39,778 --> 00:13:42,072 నీ గురించి ఎమ్మా అంతా చెప్పింది, అపోలో. 63 00:13:42,906 --> 00:13:44,116 నువ్వు తప్పకుండా వస్తావని చెప్పింది, 64 00:13:44,825 --> 00:13:48,495 మనం మన దీవిలో ఉన్నంతవరకూ మనల్ని ఆ దేవుడు కూడా కనిపెట్టలేడని నేను అన్నాను. 65 00:13:49,371 --> 00:13:52,332 కానీ తను అన్నట్టే నువ్వు వచ్చావు... 66 00:13:55,377 --> 00:13:59,548 కానీ నువ్వు వేరే వ్యక్తిని కూడా తీసుకొస్తావని తను చెప్పలేదు. 67 00:14:02,176 --> 00:14:07,264 నేను ఇంకో అవకాశాన్ని ఇస్తున్నా. ఇదే ఆఖరి అవకాశం. కానివ్వు. 68 00:14:23,822 --> 00:14:25,282 నేను అడిగింది మర్చిపోకు, అపోలో. 69 00:14:25,782 --> 00:14:27,826 నన్ను మర్చిపోకు, గురూ! 70 00:14:38,170 --> 00:14:40,839 - తల చూసుకో. - అబ్బా. 71 00:14:47,054 --> 00:14:50,015 నేను కలిసినప్పుడు అతను ఎలా ఉండేవాడో, ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాడు. 72 00:14:51,099 --> 00:14:52,476 అప్పుడు చాలా బాగా మాట్లాడాడు. 73 00:14:55,062 --> 00:14:57,105 అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? 74 00:14:58,565 --> 00:15:02,277 మీరు నన్ను చంపేస్తారా? ఒకవేళ మీ ప్లాన్ అదే అయితే, నాకేం పర్వాలేదు. అస్సలు పట్టించుకోను కూడా. 75 00:15:02,277 --> 00:15:05,280 కానీ... నేను చనిపోయే ముందు ఎమ్మాకి ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నా, అంతే. 76 00:15:05,280 --> 00:15:07,157 అన్నీ మెల్లమెల్లగా నీకే అర్థమవుతాయి, 77 00:15:07,157 --> 00:15:09,201 కానీ తొందరపడ్డామంటే, తప్పుగా అర్థం చేసుకొనే అవకాశం ఉంటుంది. 78 00:15:09,201 --> 00:15:10,410 - తను ఇక్కడే ఉందా? - లేదు. 79 00:15:10,410 --> 00:15:12,412 పడవని పంపించి గ్రెట్టాని రమన్నట్టే, ఎమ్మాని కూడా రమ్మనగలరా? 80 00:15:12,412 --> 00:15:15,707 ఎమ్మా ఇప్పుడున్న చోటు నుండి పడవ ద్వారా రప్పించడం సాధ్యపడదు. 81 00:15:17,042 --> 00:15:21,088 పడవ ద్వారానే కాదు కదా, కారు, విమానం, రైలు, వీటిలో దేని ద్వారా కూడా సాధ్యపడదు. 82 00:15:21,672 --> 00:15:23,340 అసలు మీరేం అంటున్నారు? 83 00:15:24,675 --> 00:15:26,176 తను బయట ఎక్కడో ఉంది, అపోలో. 84 00:15:27,010 --> 00:15:30,556 నువ్వు కూడా అలాంటి చోటకు వెళ్లే ముందు, నీకు కొన్ని విషయాలు అర్థమవ్వాల్సిన అవసరం ఉంది. 85 00:15:30,556 --> 00:15:33,141 ఈ సస్పెన్స్ అంతా పక్కన పెట్టి, తను ఎక్కడ ఉందో చెప్పండి! 86 00:15:46,071 --> 00:15:48,532 ఇది నేను ఒకలా ఉంటుంది అనుకున్నా, కానీ అలా లేనే లేదు... 87 00:15:51,785 --> 00:15:56,331 ఇది... ఇంతలా బాధిస్తుందని నేను అనుకోలేదు. 88 00:15:58,625 --> 00:16:02,921 బాగా మనస్థాపంలో కూరుకుపోయాను, 89 00:16:04,131 --> 00:16:05,132 ఇంకా... 90 00:16:07,718 --> 00:16:12,181 చూడు, నిజానికి నీపై ఎనలేనంత ప్రేమని చూపించాలి నేను... 91 00:16:16,185 --> 00:16:17,603 కానీ నాకు భయందోళనలు ఎక్కువ అయి... 92 00:16:21,440 --> 00:16:23,233 ఆ ప్రేమ తక్కువ అయిపోతోంది. 93 00:16:27,613 --> 00:16:33,035 కన్నా, నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే... 94 00:16:35,329 --> 00:16:38,040 నీకు ఇంకా మంచి అమ్మగా ఉండాలని ఉంది నాకు. 95 00:16:43,712 --> 00:16:45,088 మనిద్దరి విషయంలో నాకు భయంగా ఉంది. 96 00:16:48,550 --> 00:16:52,638 మనం బతికి బట్టకట్టకపోతే ఏమవుతుంది? 97 00:17:09,195 --> 00:17:12,074 - ఇది మనకి మరపురాని రాత్రి. - హా. అవును. 98 00:17:13,157 --> 00:17:14,701 అందరూ వినండి! 99 00:17:14,701 --> 00:17:15,868 సారీ, బంగారం. 100 00:17:15,868 --> 00:17:20,040 ఓయ్! బొకే విసిరేయాల్సిన సమయం వచ్చింది. అందరూ రండి. 101 00:17:22,542 --> 00:17:26,588 సరే మరి. ఇక్కడ అందరూ వీరోచితంగా పోటీ పడాలి. 102 00:17:26,588 --> 00:17:30,175 ఒలింపిక్స్ లా ఫీల్ అయిపోవాలి. 103 00:17:30,175 --> 00:17:32,052 నువ్వు అదరగొట్టేస్తావని తెలుసు, అక్క. 104 00:17:32,052 --> 00:17:37,432 సరే. ఇది ఎవరు పట్టుకుంటే వాళ్లని నేను జీవితాంతం ప్రేమిస్తా... 105 00:17:41,353 --> 00:17:43,689 - సిద్ధంగా ఉన్నారా? సరే మరి. - హా! పిచ్చెక్కిద్దాం! 106 00:17:43,689 --> 00:17:45,399 సరే. విసిరేస్తున్నా మరి. 107 00:18:06,545 --> 00:18:09,256 న్యూయార్క్ నగరమా, నువ్వంటే నాకు ప్రాణం! 108 00:18:16,346 --> 00:18:17,431 ఎవరోకరు పట్టుకొని ఉంటారు. 109 00:18:22,394 --> 00:18:24,479 ఒకప్పుడు నేనెలా ఉండేదాన్నో నీకు తెలిస్తే బాగుండు. 110 00:18:27,399 --> 00:18:31,320 వేరేగా ఉండిన మీ అమ్మ నీకు తెలిస్తే బాగుండు. 111 00:18:34,364 --> 00:18:35,657 ఇప్పుడు తనే ఉంటే బాగుండు. 112 00:19:02,935 --> 00:19:03,936 తెలివైన తల్లులు 113 00:19:03,936 --> 00:19:05,270 ఎమ్మా, మూగుల్, మొదటిసారి పోస్ట్ చేస్తున్నారు, 114 00:19:05,270 --> 00:19:06,647 నేను ఇప్పుడు చెప్పేది వింతగా అనిపించవచ్చు, 115 00:19:06,647 --> 00:19:09,233 కానీ ఎవరికైనా, తమ బిడ్డ అసలు తమది కాదు అని ఎప్పుడైనా అనిపించిందా? 116 00:19:09,233 --> 00:19:10,817 అంటే, బిడ్డని ఆసుపత్రిలో కానీ, తర్వాత అయినా కానీ 117 00:19:10,817 --> 00:19:12,069 మార్చేశారు... అన్నట్టుగా? 118 00:19:12,069 --> 00:19:14,238 ఏమీ అర్థం కావట్లేదు. ఇలా చెప్తూ ఉంటే నాకే అదోలా ఉంది, 119 00:19:14,238 --> 00:19:16,365 నా... నా బిడ్డ నాది కాదు అనిపిస్తోంది. 120 00:19:24,915 --> 00:19:26,750 కాల్ సందేశం పంపాలనుకుంటున్నారు అంగీకరించండి - తిరస్కరించండి 121 00:19:32,548 --> 00:19:35,926 మీకు సందేశాలు వచ్చి, మాయమైపోతున్నాయా? 122 00:19:46,603 --> 00:19:47,729 అవును 123 00:19:53,735 --> 00:19:55,237 సారీ. 124 00:19:55,237 --> 00:19:56,697 మీకు నేను సాయపడగలను. 125 00:19:59,491 --> 00:20:03,579 కానీ ఆ సాయం నువ్వు పొందాలంటే నీకు చాలా ధైర్యం అవసరం అవుతుంది. 126 00:20:05,163 --> 00:20:06,164 ఏంటి? 127 00:20:10,752 --> 00:20:13,088 తెలియని నంబర్: మంత్రగత్తెల మాటలు వినకు. హహహ! 128 00:20:15,257 --> 00:20:16,300 నీ యెంకమ్మ. 129 00:20:20,137 --> 00:20:21,471 ఛ! 130 00:20:26,143 --> 00:20:27,436 ఎమ్మా? 131 00:20:30,564 --> 00:20:31,732 నేను బాగానే ఉన్నానులే. 132 00:20:33,525 --> 00:20:34,735 హేయ్, అంతా ఓకేనా... 133 00:20:36,069 --> 00:20:38,238 మేము నిన్ను చంపము, అపోలో. 134 00:20:38,822 --> 00:20:39,907 ఆ పరిస్థితి నువ్వు తెస్తే తప్ప. 135 00:20:41,533 --> 00:20:45,287 హమ్మయ్య అనాలో, అనకూడదో అర్థం కావట్లేదు. 136 00:20:51,919 --> 00:20:53,295 ఇది తీసుకో. 137 00:20:53,295 --> 00:20:54,588 అయ్య బాబోయ్. 138 00:20:54,588 --> 00:20:55,672 అబ్బురపరిచే జలపాతాలు, అరణ్యాలు 139 00:20:55,672 --> 00:20:58,008 ఎమ్మా, నేను చాలాసార్లు పొద్దుపోయేదాకా మాట్లాడుకున్నాం. 140 00:21:00,302 --> 00:21:04,890 ఎమ్మా వ్యాలంటైన్, ఏదో దీవిలో హాయిగా, ప్రాణాలతోనే ఉందన్నమాట. 141 00:21:05,933 --> 00:21:09,186 బతికే ఉంది కానీ, హాయిగా అయితే లేదు. 142 00:21:11,313 --> 00:21:16,276 మీ నాన్న గురించి, ఈ పుస్తకం గురించి, ఇది నీకు ఎంత ముఖ్యం అనే దాని గురించి తను చెప్పింది. 143 00:21:18,737 --> 00:21:24,660 నా అంతర్గత రహస్యాలను తెలీని వ్యక్తితో పంచుకొని ద్రోహం చేయడం. తను అంతేగా. 144 00:21:25,160 --> 00:21:29,039 ఈ కథ నీకు నచ్చడం భలే ఆసక్తికరంగా ఉంది. 145 00:21:30,666 --> 00:21:34,169 - ఎందుకు? - దాని వల్లే కదా నువ్వు ఇక్కడికి రాగలిగావు. 146 00:21:35,796 --> 00:21:38,173 న్యూయార్క్ నగరంలోని ఎస్ట్రోజెన్ దీవికా? నా ఉద్దేశం... 147 00:21:42,553 --> 00:21:43,554 సారీ. 148 00:22:07,828 --> 00:22:10,831 నన్ను వెర్రిదాన్ని చేయాలని చూడకు. 149 00:22:11,540 --> 00:22:14,960 నాకు పిచ్చి ఉంది అనిపించే ప్రయత్నం చేయకు. సరేనా? 150 00:22:40,569 --> 00:22:42,779 నాకు పిచ్చి ఉంది అనిపించడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వృథాయే. 151 00:22:59,963 --> 00:23:01,715 నేను సిద్ధంగా ఉన్నాను 152 00:23:31,537 --> 00:23:32,871 ఈ పని చేయాలని నాకు అస్సలు లేదు. 153 00:23:34,081 --> 00:23:35,082 నిజంగానే చెప్తున్నా. 154 00:23:35,749 --> 00:23:39,378 బంగారు, నిజంగా చెప్తున్నా. నిజంగా... 155 00:23:41,964 --> 00:23:42,965 దేవుడా. 156 00:23:44,967 --> 00:23:45,968 నన్ను కాపాడు. 157 00:24:09,408 --> 00:24:15,080 నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం, ఎంతో నువ్వు ఊహించను కూడా లేవు. 158 00:24:19,543 --> 00:24:21,211 వాడి కోసం నేను ఏం వదులుకోవడానికైనా సిద్ధమే. 159 00:24:22,588 --> 00:24:24,089 వాడి కోసం నా ప్రాణాన్ని వదిలేసుకుంటా. 160 00:24:27,009 --> 00:24:28,135 నా భర్త ప్రాణం... 161 00:24:32,264 --> 00:24:33,682 నీ ప్రాణం కూడా తీసేస్తా. 162 00:24:53,827 --> 00:24:56,413 నన్ను క్షమించు. నిజంగానే క్షమించు. 163 00:25:03,629 --> 00:25:06,173 నువ్వు వీలర్ పడవ ఎక్కినప్పుడు న్యూయార్కులోనే ఉన్నావు. 164 00:25:07,549 --> 00:25:11,261 కొంత సేపు ఈస్ట్ రివర్ లోనే ప్రయాణించావు, రికర్స్ దీవిని కూడా దాటావు. 165 00:25:11,261 --> 00:25:13,347 త్రోగ్స్ నెక్ వంతెనని కూడా దాటావేమో. 166 00:25:13,347 --> 00:25:17,935 కానీ నువ్వు మా దీవిని సమీపించేటప్పుడు వేరే నీటిలోకి ప్రవేశించావు. 167 00:25:18,727 --> 00:25:21,021 నువ్వు పడవని వేరే తీరంలో ఆపావు. 168 00:25:21,021 --> 00:25:24,107 మీ మాటలు పొడుపు కథల్లాగా అర్థం కాని విధంగా ఉంటాయని ఎవరైనా చెప్పారా? 169 00:25:24,858 --> 00:25:27,444 అమెజాన్ జాతివారు తెమిస్కీరా దీవిలో ఉంటారని అంటుంటారు, 170 00:25:27,444 --> 00:25:30,822 ఇంకా, యొలాంగు జాతివారు అయితే చనిపోయినవారిని ఒక దీవిలో ఖననం చేసేవారు. 171 00:25:31,532 --> 00:25:32,866 ఆ ప్రదేశాలు భలే గమ్మత్తుగా ఉంటాయి, 172 00:25:34,159 --> 00:25:36,495 అక్కడ మీ ప్రపంచ సూత్రాలు వర్తించవు. 173 00:25:37,704 --> 00:25:39,873 ఇప్పుడు నువ్వు కూడా అలాంటి చోటుకే వచ్చావు. 174 00:25:42,084 --> 00:25:46,713 అవును, కానీ ఇది నార్తర్న్ బ్రదర్ ఐల్యాండ్. ఇది భూమి మీద ఉన్న ఒక చోటు, మ్యాప్ లో కూడా ఉంది ఇది. 175 00:25:46,713 --> 00:25:49,591 ఇది ఒకప్పుడు నార్తర్న్ బ్రదర్ ఐల్యాండే, కానీ మేము దాన్ని మార్చేశాం. 176 00:26:34,970 --> 00:26:35,971 స్కూల్? 177 00:26:36,555 --> 00:26:39,099 హా. లైబ్రరీ కూడా ఉంది, ఇవన్నీ ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. 178 00:26:40,184 --> 00:26:42,269 వావ్, చాలా బాగుంది. 179 00:26:43,645 --> 00:26:44,897 నీకు ఆకలిగా ఉందా? 180 00:26:45,647 --> 00:26:47,316 హా. ఆకలిగా ఉంది. 181 00:26:48,942 --> 00:26:53,280 బ్రయాన్ బడికి వెళ్లే రోజు ఎప్పుడు వస్తుందా అని నేను పగటి కలలు కనేవాడిని. 182 00:26:54,448 --> 00:26:58,076 పిచ్చి నాన్నలా వాడిని కనిపెట్టుకొనే ఉంటానట, అందరూ కంగారు పడిపోయి, 183 00:26:58,076 --> 00:27:00,787 ఎవడో ఒక వింత మనిషి కిటికీ గుండా పిల్లలని గమనిస్తూ ఉన్నాడని 184 00:27:00,787 --> 00:27:01,914 పోలీసులకు కాల్ చేయాలనుకుంటారట. 185 00:27:02,873 --> 00:27:06,210 ఈ కాలంలో మనం ఎప్పుడూ పిల్లల మీద ఓ కన్నేసే ఉంచుతున్నాంగా, ఎవరూ పోలీసులకు కాల్ చేయట్లేదు. 186 00:27:08,253 --> 00:27:11,340 సోషల్ మీడియా. అవి భయంకరమైన ఉచ్చులు. 187 00:27:12,257 --> 00:27:14,593 జనాలు ఆనందంగా తమ పిల్లలను, 188 00:27:14,593 --> 00:27:18,096 తమ గోప్యమైన, విలువైన క్షణాలను ప్రతిరోజూ అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. 189 00:27:19,515 --> 00:27:20,516 అవును. 190 00:27:21,558 --> 00:27:24,019 తలుపు తెరిచి మరీ దుర్మార్గులను ఆహ్వానిస్తున్నాం. 191 00:27:27,147 --> 00:27:28,315 మేము ఇక్కడే భోజనం చేస్తాం. 192 00:27:35,447 --> 00:27:37,282 ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? 193 00:27:40,452 --> 00:27:41,703 ఎమ్మా? 194 00:27:44,331 --> 00:27:45,332 ఏమన్నారు? 195 00:27:45,874 --> 00:27:47,459 ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? 196 00:27:50,420 --> 00:27:53,173 ఇంతకీ వీడిని ఎక్కడ బ్యాప్టైజ్ చేస్తున్నారు? 197 00:27:54,174 --> 00:27:55,509 అదేం లేదు... 198 00:27:55,509 --> 00:27:58,887 పవిత్ర జలం, పవిత్ర ఆత్మ ఆశీస్సులు లేనిదే వీడిని కాపాడలేం. 199 00:27:58,887 --> 00:28:00,722 ఎవరి నుండి కాపాడలేం? 200 00:28:01,515 --> 00:28:03,350 ప్రపంచంలో ఉన్న దుష్ట శక్తుల నుండి. 201 00:28:07,729 --> 00:28:09,189 మీరు దాన్ని నమ్ముతున్నారా? 202 00:28:11,024 --> 00:28:12,442 నేనేం నమ్ముతున్నానో నాకే తెలీట్లేదు, 203 00:28:13,652 --> 00:28:18,949 కానీ జీవితం సజావుగా సాగడానికి 204 00:28:20,325 --> 00:28:23,912 నేను ఉన్న మార్గాలన్నిటినీ ప్రయత్నించాలనుకుంటున్నా. 205 00:28:27,040 --> 00:28:32,671 మీరు ఆధ్యాత్మికత వ్యక్తి అంటున్నారు కానీ, మతం మీద నమ్మకం లేదంటున్నారా? 206 00:28:34,381 --> 00:28:38,594 - అవును. - సరే. మరి మీ భర్త? 207 00:28:40,596 --> 00:28:41,597 నాస్తికుడు. 208 00:28:43,807 --> 00:28:48,353 మరి మీ అబ్బాయిని బ్యాప్టైజ్ చేయాలని మీరు అంటే, మీ భర్త ఏమంటాడని మీ నమ్మకం? 209 00:28:56,445 --> 00:29:00,616 ఇంకా ఆయనకి మేలుకొలుపు కాలేదు. 210 00:29:02,201 --> 00:29:05,245 సరే. ఒకరికి మేలుకొలుపు కలగడం కన్నా, ఇంకా మంచిగా మత తీర్థం పుచ్చుకోవాలని 211 00:29:05,245 --> 00:29:08,248 అనిపించడం కన్నా, అందమైన సందర్భం ఇంకేముంటుంది. 212 00:29:09,416 --> 00:29:12,377 దేవుడు నన్ను పిలిచిన క్షణం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. నాకు... 213 00:29:12,377 --> 00:29:14,004 ఆ పని వీలైనంత త్వరగా చేయడానికి కుదురుతుందా? 214 00:29:15,797 --> 00:29:19,301 త్వరగా ఆ పని ముగించేయాలనుకుంటున్నా. వీలైనంత త్వరగా. 215 00:29:21,678 --> 00:29:25,015 అలాగే. తప్పకుండా. 216 00:29:25,015 --> 00:29:28,018 డైరీ చూసి చెప్తాను, ఏమంటారు? 217 00:29:34,358 --> 00:29:35,734 గుడ్ మార్నింగ్, అమ్మాయిలూ. 218 00:29:41,573 --> 00:29:44,785 హేయ్. ఎమ్మా ఇక్కడ ఎన్ని రోజులు ఉండింది? 219 00:29:45,494 --> 00:29:47,579 అటూఇటుగా రెండు నెలలు. 220 00:29:48,956 --> 00:29:51,750 వారానికి ఒకసారి న్యూయార్కుకు వెళ్లేది. 221 00:29:51,750 --> 00:29:55,045 ఇక్కడి లైబ్రరీ అంతా ఖాళీగా ఉందని పుస్తకాలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేది. 222 00:29:56,672 --> 00:29:59,299 తన దృష్టిలో, పుస్తకాలు లేని జీవితం, అసలు జీవితమే కాదు. 223 00:30:00,050 --> 00:30:01,051 అవును. 224 00:30:01,051 --> 00:30:03,303 ఇక్కడికి వచ్చినా లైబ్రేరియన్ గానే ఉండేది. 225 00:30:03,303 --> 00:30:05,180 ఇది నీకే. ఆగు. 226 00:30:07,224 --> 00:30:08,976 ఉదయం చల్లగా ఉన్నప్పుడు, ఇది తింటే బాగా అనిపిస్తుంది. 227 00:30:11,603 --> 00:30:12,604 పెడుతున్నా. 228 00:30:19,444 --> 00:30:21,697 పెట్టేస్తున్నా. ఎలా ఉంది? 229 00:30:22,281 --> 00:30:24,283 నువ్వు మంచి తండ్రివి అవుతావు. 230 00:30:26,076 --> 00:30:27,202 ఒకటి చెప్పనా? 231 00:30:30,038 --> 00:30:32,040 తను ఎలా వెళ్లి వచ్చేది? 232 00:30:32,040 --> 00:30:33,792 మాకు సొంత నావికా దళం ఉందిలే. 233 00:30:35,127 --> 00:30:36,628 ఉత్తినే చెప్పాలే. 234 00:30:37,504 --> 00:30:42,134 మా దగ్గర చిన్న నౌక ఒకటి, దానితో పాటు ఒక మనిషి పట్టే చిన్న తెప్ప పడవ ఒకటి ఉంది. 235 00:30:43,343 --> 00:30:46,346 ఒక్క నిమిషం. తనకి తెప్ప పడవలో ఎలా ప్రయాణించాలో అస్సలు తెలీదు. 236 00:30:46,346 --> 00:30:48,473 అవును. వెళ్తూ వెళ్తూ చాలా సార్లు పడిపోయింది కూడా. 237 00:30:50,809 --> 00:30:54,062 కానీ తను ఎప్పుడూ పట్టు విడవదు. నీ భార్యకి పట్టుదల చాలా ఎక్కువ. 238 00:30:54,062 --> 00:30:55,189 హా, అది నాకు తెలుసు. 239 00:31:03,280 --> 00:31:05,991 అయితే, ఇక్కడున్న మహిళలందరూ... 240 00:31:07,868 --> 00:31:09,870 వాళ్లు... వాళ్లు ఎమ్మా చేసిన పనే చేశారా? 241 00:31:11,413 --> 00:31:12,497 అవును. మేమందరమూ అదే చేశాం. 242 00:31:13,248 --> 00:31:15,626 మరి ఇందాక నాకు పిల్లలు కనిపించారు కదా, వాళ్లెవరు? 243 00:31:15,626 --> 00:31:17,503 కొందరికి ఒకరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నారు. 244 00:31:17,503 --> 00:31:20,464 కాబట్టి, వాళ్లు నా దగ్గరికి పారిపోయి వచ్చినప్పుడు, ఆ పిల్లలని కూడా తెస్తారు. 245 00:31:23,258 --> 00:31:26,637 మహిళలు ఇక్కడికి అయోమయంలో, దిక్కుతోచని స్థితిలో వస్తారు, 246 00:31:26,637 --> 00:31:30,891 వాళ్లు చెప్పేది ఇక్కడ నమ్ముతారనే నమ్మకం ఇచ్చి వాళ్లకి ఇక్కడ ఆశ్రయమిస్తాను. 247 00:31:32,392 --> 00:31:35,896 ఆ అదృష్టం ఎంత తక్కువ మంది మహిళలకు దక్కుతుందో తెలుసా? 248 00:31:37,814 --> 00:31:39,149 దాని వల్ల వాళ్లు అద్భుతాలు సృష్టించగలరు. 249 00:31:52,329 --> 00:31:56,667 తనకి ఎంత అద్భుతమైన శక్తి ఉందో నీకు తెలుసా, అపోలో? 250 00:31:57,626 --> 00:31:58,877 తను బాగా చితికిపోయాక కానీ అది బయటపడలేదు. 251 00:31:58,877 --> 00:32:01,964 ఒక మహిళ నుండి మహిళకు చేరే సలహా అని చెప్పవచ్చు. 252 00:32:02,756 --> 00:32:06,885 ఆ మహిళ అనుభవసారం నుండి తనకి అందిన జ్ఞానం అది. ఈ కష్టమైన పనులను ఎలా చేయగలం అని. 253 00:32:08,470 --> 00:32:11,640 నేను మా అమ్మని సంప్రదిస్తాను, తను నా చేతిని పట్టుకుంటుంది, 254 00:32:12,349 --> 00:32:15,853 తను వాళ్ల అమ్మని సంప్రదించి, తన సాయం తీసుకుంటుంది. 255 00:32:16,770 --> 00:32:19,982 ఒక పొడవాటి సమాచార గొలుసు అని అనవచ్చు. 256 00:32:19,982 --> 00:32:24,528 అది ఎన్నో తరాల నుండి అందిన సమాచారం అన్నమాట. 257 00:32:34,037 --> 00:32:36,248 "బిడ్డ పుట్టడమంటే కల నిజం అయినట్టు. 258 00:32:37,624 --> 00:32:40,419 కానీ ఆ కలలే ఫెయిరీలకు చాలా ఇష్టమైన ఆహారం." 259 00:32:41,545 --> 00:32:44,464 "అవి కిటికీ దగ్గరకు వచ్చి, బిడ్డ నిద్రపోవడాన్ని చూస్తూ ఉంటాయి. 260 00:32:44,464 --> 00:32:47,843 బిడ్డ వాటికి చాలా ముద్దొస్తుంది, ఇక ఏడ్చేస్తాయి అవి. 261 00:32:50,179 --> 00:32:53,932 అది మాకు కావాలి, మాకు కావాలంతే. దాన్ని మా వశం చేసుకోవాల్సిందే. 262 00:32:54,850 --> 00:32:57,936 గడిని ఊరికే అలా తట్టారంతే, దానికి కిటికీ ఊగిపోతోంది." 263 00:32:57,936 --> 00:33:01,106 - ఈ పుస్తకం మరీ భయంకరంగా ఉంది. - బాగుందిగా. 264 00:33:04,067 --> 00:33:06,195 "అమ్మానాన్నలు బాగా నిద్రపోతున్నారు. 265 00:33:06,195 --> 00:33:09,072 చనిపోయిన వారిలా, ఆదమరిచి నిద్రపోతున్నారు. 266 00:33:10,741 --> 00:33:13,368 ఫెయిరీలు బిడ్డను తమ గుండెలకి హత్తుకుంటాయి. 267 00:33:13,869 --> 00:33:15,120 బిడ్డని మళ్లీ ఇచ్చేయవు. 268 00:33:15,662 --> 00:33:17,623 - చాలా ప్రేమగా చూసుకుంటాయి." - "చాలా ప్రేమగా చూసుకుంటాయి." 269 00:33:23,337 --> 00:33:28,926 నీ చిన్నప్పుడు మీ నాన్న దీన్ని నీకు ఎందుకు చదివి వినిపించాడో నాకు తెలీదు. 270 00:33:29,426 --> 00:33:30,427 నాకు నిజంగా తెలీదు. 271 00:33:33,889 --> 00:33:35,140 కానీ అదంతా నిజమే. 272 00:33:39,811 --> 00:33:42,147 నువ్వు ఇక్కడికి రావాలని ఎమ్మా కోరుకుంది, అపోలో. 273 00:33:43,732 --> 00:33:45,484 నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం నీకు ఉంటే, దాన్ని నీకు చూపాలని. 274 00:33:46,652 --> 00:33:50,364 నువ్వు, తనూ ఒక భయంకరమైన కథలో భాగమైపోయారు. 275 00:33:51,865 --> 00:33:55,118 మీరు అదంతా బూటకమని కొట్టిపారేసినా, అలా ఏం జరగలేదన్నట్టు ప్రవర్తించినా, అదే నిజం. 276 00:33:55,118 --> 00:33:57,162 మీరు ఈ ప్రపంచంలోకి ప్రవేశించారు. ఇక వెనక్కి వెళ్లలేరు. 277 00:33:58,914 --> 00:34:01,708 విలియమ్స్ ఒక విషయం మాత్రం నిజమే చెప్పాడు. మేము మంత్రగత్తెలం. 278 00:34:03,794 --> 00:34:05,754 కానీ అతను చెప్పిన ఇంకో నిజం ఏంటో చెప్తాను. 279 00:34:06,338 --> 00:34:09,049 ఆ బోనులో ఉండే వ్యక్తి, రాకాసులతో చేతులు కలిపాడు. 280 00:34:11,552 --> 00:34:12,469 "దొరికాడు." 281 00:34:13,469 --> 00:34:18,391 వాడి ఫోటోకి సరిగ్గా కింద, పెద్ద పెద్ద అక్షరాలతో "దొరికాడు" అని 282 00:34:19,101 --> 00:34:21,395 - రాసి పంపారు. - చూపించు. నాకు చూపించు. 283 00:34:21,395 --> 00:34:22,563 - నాకు చూపించు. - అవి ఇప్పుడు లేవు. 284 00:34:22,563 --> 00:34:24,356 - ఆ వాక్యం చూపించు... - అది నీకూ తెలుసు... 285 00:34:24,356 --> 00:34:26,567 - ఎందుకంటే, అది అసలు రాలేదు. - తయారవుదాం. 286 00:34:26,567 --> 00:34:28,025 నీతో పాటు మేము చర్చికి రాము, ఎమ్మా. 287 00:34:29,277 --> 00:34:31,947 వీడిని బ్యాప్టైజ్ చేయడానికి బదులు నువ్వు క్షుద్రపూజలు చేయించినా చేయిస్తావు. 288 00:34:32,739 --> 00:34:35,909 ఆన్ లైన్ ఫోరంలో చర్చి ద్వారా అందే చికిత్స స్వాంతన చేకూర్చగలదని ఉంది, కానీ మన స్తోమత చాలదు. 289 00:34:35,909 --> 00:34:37,159 ఎప్పుడూ చూసినా ఆన్ లైన్ ఫోరం గోలే. 290 00:34:37,159 --> 00:34:39,246 మన జీవితాలను మనమెలా జీవించాలి, మన పిల్లాడిని మనం ఎలా పెంచాలి అనేది 291 00:34:39,246 --> 00:34:40,998 కొందరు పిచ్చి ముసలమ్మల చేతిలో పెట్టేస్తావా నువ్వు? 292 00:34:40,998 --> 00:34:42,583 అసలు సమస్య ఏంటో తెలుసా, ఎమ్మా? 293 00:34:42,583 --> 00:34:44,793 నువ్వే. నువ్వే అసలు సమస్య, అర్థమైందా? 294 00:34:44,793 --> 00:34:46,795 నువ్వు వెళ్లి ఇంకో మాత్రో, లేక టానికో వేసుకో. 295 00:34:54,511 --> 00:34:56,013 నీకు అర్థం కావట్లేదు, కానీ త్వరలోనే అర్థమవుతుంది. 296 00:35:00,475 --> 00:35:04,021 నేను తనని నమ్మలేదు. తన ఆరోగ్యం దెబ్బతింది అనుకున్నా. 297 00:35:08,108 --> 00:35:09,109 మరి ఇప్పుడు? 298 00:35:14,448 --> 00:35:15,449 నాకు తెలియట్లేదు. 299 00:35:17,367 --> 00:35:20,954 నాకు తెలియట్లేదు, కానీ, నాకు తెలుసుకోవాలనుంది. 300 00:35:25,125 --> 00:35:26,126 నాకు తెలుసుకోవాలనుంది. 301 00:35:30,005 --> 00:35:32,174 - నా దగ్గర ఉంది. నా దగ్గర ఉంది. - ఇలా ఇవ్వు. 302 00:35:41,141 --> 00:35:42,476 నీకేం కాదులే. 303 00:35:43,393 --> 00:35:44,228 హా. 304 00:35:44,228 --> 00:35:47,606 నాకు పీడకలలు వచ్చినప్పుడు నా భార్య నాతో అదే అనేది. 305 00:35:50,609 --> 00:35:51,944 అయ్యయ్యో. 306 00:35:53,237 --> 00:35:57,991 స్కూటర్లు అప్పుడప్పుడూ జారిపోతాయి. హేయ్. నీకు ఏమీ కాలేదు కదా? 307 00:35:58,867 --> 00:36:01,620 ఇదుగో. నీకు సాయం ఏమైనా కావాలా? 308 00:36:03,080 --> 00:36:04,206 నా పేరు అపోలో. 309 00:36:04,706 --> 00:36:05,707 తన పేరు గేయల్. 310 00:36:06,500 --> 00:36:10,128 హాయ్. నీకు బ్యాండ్ ఎయిడ్ ఏమైనా తీసుకురానా, లేదంటే, నేను వెళ్లి... 311 00:36:11,129 --> 00:36:13,131 - వీళ్లకి మగవాళ్లు కొత్త కదా. - హా. 312 00:36:13,924 --> 00:36:14,758 మళ్లీ పడిపోయిందే. 313 00:36:14,758 --> 00:36:15,843 - ఇది పట్టుకోండి. - హా. 314 00:36:15,843 --> 00:36:17,761 హేయ్. నీకు ఏమీ కాలేదు కదా? 315 00:36:19,596 --> 00:36:22,724 లేయ్. వావ్. నువ్వు భలే గట్టిదానివిలే. 316 00:36:22,724 --> 00:36:24,101 తిను భలే గట్టిది. 317 00:36:24,101 --> 00:36:26,937 - నీకు తను నేస్తం అయిపోయినట్టుందే. - హా. బాబోయ్, సరే మరి. 318 00:36:31,775 --> 00:36:33,443 నన్ను ఎక్కడికి తీసుకెళ్తోందో తెలీదు, కానీ... 319 00:36:36,321 --> 00:36:40,868 - హేయ్. నేను గ్రెట్టా గురించి మీతో మాట్లాడాలి. - ఏ విషయం? 320 00:36:41,493 --> 00:36:44,079 విలియమ్ తన కూతురిని ఎలా చంపాడో మీకు తెలుసు కదా? 321 00:36:44,079 --> 00:36:45,873 - అతను నిజంగానే చంపాడు. - హా, అంటే... 322 00:36:47,666 --> 00:36:49,835 బంగారం, నువ్వు లోపలికి వెళ్లి ఏదైనా పుస్తకం చదువుకో. 323 00:36:53,172 --> 00:36:56,633 సరే మరి. ఈ మహిళలందరూ, అటూ ఇటుగా ఒకే పని చేశారు, కదా? కాబట్టి... 324 00:36:56,633 --> 00:37:01,305 కాదు. ఒకే పని కాదు. అది నిజం కాదు. 325 00:37:01,305 --> 00:37:05,184 సరే. సరే. నేను తన నోటి నుండి విందామనుకుంటున్నా, సరేనా? 326 00:37:05,184 --> 00:37:06,602 వినాలనుందా? 327 00:37:06,602 --> 00:37:08,812 ఏంటి? నువ్వు అతనికి కాస్తంత చనువు ఇస్తే, అతనేమో సందు దొరికిందని 328 00:37:08,812 --> 00:37:11,732 - కావలసినవన్నీ ఏకరువు పెట్టేశాడా? - సరే. అది అభ్యర్థన మాత్రమే. 329 00:37:12,274 --> 00:37:14,985 సరేనా, కాల్? ప్లీజ్. 330 00:37:19,823 --> 00:37:21,867 సరే. పగటి సమయంలో మేము నదిలో ప్రయాణం చేయము, 331 00:37:21,867 --> 00:37:23,410 కానీ గ్రెట్టా ఈరాత్రికి ఇక్కడికి వస్తుంది. 332 00:37:24,244 --> 00:37:27,039 రాత్రి భోజనం తర్వాత తోలు బొమ్మలాట ఉంది, తనకి నీతో మాట్లాడటం పర్వాలేదంటే, 333 00:37:27,039 --> 00:37:28,123 నువ్వు ఆ సమయంలోనే మాట్లాడాలి. 334 00:37:31,335 --> 00:37:32,336 థ్యాంక్యూ. 335 00:37:39,593 --> 00:37:41,261 హేయ్. ఏం చదువుతున్నావు? 336 00:37:44,598 --> 00:37:47,017 మంచి పుస్తకంలానే ఉందే. నేను కూడా నీతో పాటు చదివితే, నీకేం పర్లేదు కదా? 337 00:37:47,518 --> 00:37:50,437 సరే. 338 00:37:50,979 --> 00:37:53,774 "అది మాకు కావాలి, మాకు కావాలంతే. దాన్ని మా వశం చేసుకోవాల్సిందే. 339 00:37:53,774 --> 00:37:56,693 గడిని ఊరికే అలా తట్టారంతే, దానికి కిటికీ ఊగిపోతోంది. 340 00:37:57,236 --> 00:37:59,363 అమ్మానాన్నలు బాగా నిద్రపోతున్నారు. 341 00:37:59,363 --> 00:38:02,407 చనిపోయిన వారిలా, ఆదమరిచి నిద్రపోతున్నారు. 342 00:38:03,325 --> 00:38:06,370 బిడ్డని అవి వశం చేసేసుకున్నాయి, కానీ వాళ్లకి ఆ విషయం తెలీనే తెలీదు, 343 00:38:06,370 --> 00:38:10,123 ఆ బిడ్డ స్థానంలో అవి ప్రాణం లేని, చలనం లేని బిడ్డని వదిలి వెళ్లాయి." 344 00:38:13,502 --> 00:38:14,670 "ఇక వినోదం విషయానికి వద్దాం. 345 00:38:14,670 --> 00:38:17,673 అడవిలో, బాగా చీకటి పడ్డాక ఒక పార్టీ జరుగుతోంది, 346 00:38:17,673 --> 00:38:19,883 అతిథులందరూ చక్కగా తయారయి వచ్చారు." 347 00:38:21,468 --> 00:38:24,096 "సంగీతం వాయిస్తున్నారు, నృత్యకారులు చకచకా నాట్యం చేస్తున్నారు. 348 00:38:24,596 --> 00:38:27,516 వారి కౌగిలిలో ఉన్న బిడ్డకి ఎప్పటికీ ఏమీ కాదు." 349 00:38:28,684 --> 00:38:33,438 నా దగ్గర ఒక కోడి ఉండేది ఆ కోడి నాకు నచ్చింది 350 00:38:34,606 --> 00:38:39,528 ఆ కోడిని పాత యాపిల్ చెట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నా 351 00:38:47,703 --> 00:38:51,665 ఎందుకు నవ్వుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు నా భార్త గుర్తొస్తోంది. 352 00:38:55,794 --> 00:38:56,795 నా భార్య. 353 00:38:59,464 --> 00:39:00,465 బాగానే ఉన్నావా? 354 00:39:02,301 --> 00:39:03,302 పాడు. 355 00:39:03,302 --> 00:39:09,057 నా దగ్గర ఒక కోడి ఉండేది ఆ కోడి నాకు నచ్చింది 356 00:39:10,142 --> 00:39:15,939 ఆ కోడిని పాత యాపిల్ చెట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నా 357 00:39:20,110 --> 00:39:21,195 ఏంటి? 358 00:39:21,945 --> 00:39:23,238 సారి, నేను... 359 00:39:23,238 --> 00:39:27,284 నా భర్త ఇంత భయంకరంగా పాడతాడని నేను అనుకోలేదు. 360 00:39:27,910 --> 00:39:28,744 ఏంటి? 361 00:39:31,288 --> 00:39:33,290 సరే. మళ్లీ పాడతాను. 362 00:39:35,042 --> 00:39:36,126 - నా దగ్గర... - వద్దు. 363 00:39:37,836 --> 00:39:39,129 వద్దు. 364 00:39:41,381 --> 00:39:42,841 నువ్వు దాలా దారుణంగా పాడుతున్నావు. 365 00:39:43,634 --> 00:39:44,968 కానీ నువ్వంటే నాకు ప్రాణం. 366 00:39:45,928 --> 00:39:47,471 - కానీ ఇక పాడకు. - అలా అంటే పాడకుండా ఉంటారా? 367 00:39:47,471 --> 00:39:48,555 పాడవద్దు. 368 00:39:51,558 --> 00:39:54,811 అందరూ తోలుబొమ్మలాటకు రండి, సమయం అయింది. 369 00:39:55,604 --> 00:39:57,606 పిల్లలూ, రండి. వెళ్లి మంచి సీట్లలో కూర్చోండి. 370 00:39:58,190 --> 00:40:03,237 తోలుబొమ్మలాటకు రండి. రాకో. జోయి. జాకరీ. ఐవీ. 371 00:40:03,237 --> 00:40:07,032 రండి. రండి. ముందుండే సీట్లలో ముందు కూర్చోవాలి. 372 00:40:07,032 --> 00:40:09,743 - హా. తోలుబొమ్మలాట. హేయ్. - అందరూ రావాలి. హాయ్. 373 00:40:16,458 --> 00:40:17,459 గ్రెట్టా. 374 00:40:29,680 --> 00:40:30,681 గ్రేస్ ఎలా ఉంది? 375 00:40:32,015 --> 00:40:33,141 తను మా అమ్మానాన్నలతో ఉంది. 376 00:40:38,814 --> 00:40:40,107 - విలియమ్ వచ్చాడా? - అవును. 377 00:40:41,650 --> 00:40:44,570 అలా ఎలా వచ్చేస్తాడు? 378 00:40:44,570 --> 00:40:45,946 నాతో వచ్చాడు. 379 00:40:45,946 --> 00:40:47,030 - నువ్వు అతని మిత్రుడివా? - కాదు... 380 00:40:47,030 --> 00:40:48,532 నేను ఎమ్మా... 381 00:40:49,700 --> 00:40:51,118 నేను ఎమ్మా భర్తని. 382 00:40:51,618 --> 00:40:52,619 మరేం పర్వాలేదులే. 383 00:40:53,871 --> 00:40:54,872 నేను ఎమ్మా భర్తని. 384 00:40:57,583 --> 00:40:59,418 అతని పీడా ఎప్పుడు వదులుతుందా అనే ఆలోచిస్తుంటా ఎప్పుడూ. 385 00:41:00,711 --> 00:41:02,754 కానీ ఎలాగోలా నా జీవితంలోకి వస్తున్నాడు. 386 00:41:02,754 --> 00:41:04,506 - అవును. - అస్సలు పట్టు వదలట్లేదు. 387 00:41:04,506 --> 00:41:07,384 మేము అతని వాళ్లం, అతను అలానే అనేసుకుంటున్నాడు. 388 00:41:09,970 --> 00:41:12,890 అతను... అతను... 389 00:41:12,890 --> 00:41:13,974 నా కూతురిని చంపాడా అనేనా? 390 00:41:14,933 --> 00:41:17,686 - అతను ఏమన్నాడంటే... - హా. అతను ఏమన్నాడో చెప్పేయండి. 391 00:41:17,686 --> 00:41:20,647 అతని దృక్పథం ఏంటో మీ చేత చెప్పించుకోవడానికే నేను ఇంత దూరం వచ్చా మరి. 392 00:41:22,900 --> 00:41:23,901 సరే. 393 00:41:28,071 --> 00:41:31,825 నా కొత్త చిరునామా సంపాదించాడు. ఒక పుస్తకాన్ని పోస్ట్ చేసి పంపాడు. 394 00:41:32,951 --> 00:41:37,581 - పుస్తకమా? - "టు కిల్ ఎ మాకింగ్ బర్డ్." దాన్ని నాశనం చేశాడు. 395 00:41:39,708 --> 00:41:40,709 ఏంటి? 396 00:41:40,709 --> 00:41:42,920 ప్రతీ పేజీలో ఒకే ముక్క రాశాడు. 397 00:41:44,338 --> 00:41:46,798 అతను నా డబ్బంతా కాజేశాడు. 398 00:41:47,883 --> 00:41:52,930 - నా ఖాతాలో ఉన్న డబ్బునంతా ఖాళీ చేశాడు. - ఒక్క నిమిషం. ఎంత... 399 00:41:53,597 --> 00:41:54,598 ఎంత తీసుకున్నాడు? 400 00:41:55,265 --> 00:41:56,558 డెబ్బై వేల డాలర్లు. 401 00:41:59,603 --> 00:42:04,191 - ఏంటి? - ఆ దరిద్రుడు నా 70,000 డాలర్లని దొంగిలించేశాడు. 402 00:42:07,819 --> 00:42:08,987 ప్రతీ పేజీలో ఏం రాశాడు? 403 00:42:11,323 --> 00:42:12,533 తన పేరు. 404 00:42:12,533 --> 00:42:14,034 ఆగ్నెస్! ఆగ్నెస్! 405 00:42:14,618 --> 00:42:18,413 ప్రతీ పేజీలో ఆగ్నెస్ అని రాశాడు. 406 00:42:36,431 --> 00:42:38,058 విలియమ్! హేయ్. 407 00:42:44,231 --> 00:42:48,443 విలియమ్! విలియమ్, నాతో మాట్లాడు! 408 00:42:49,486 --> 00:42:51,655 నా పేరు అది కాదు, అలా నన్ను పిలవకు. 409 00:42:51,655 --> 00:42:53,991 నీ పేరు అదే! ఇప్పుడే నీ భార్యతో మాట్లాడాను. 410 00:42:53,991 --> 00:42:55,951 నా కుటుంబం మళ్లీ ఒకటవుతుందా? 411 00:42:55,951 --> 00:43:00,455 "విలియమ్ నా 70,000 డాలర్లని దొంగిలించేశాడు," అని అంది ఆమె. ఆ పుస్తకాన్ని నాశనం చేశావని కూడా అంది. 412 00:43:01,999 --> 00:43:03,959 నిజానికి, నా అసలైన పేరేంటో కూడా నాకు తెలీదు. 413 00:43:05,252 --> 00:43:06,712 అసలు నేనెవరో కూడా నాకు తెలీదు. 414 00:43:08,297 --> 00:43:09,131 ఏంటి? 415 00:43:09,131 --> 00:43:11,300 ఒకసారి నాది అనిపించే చోటు ఒకటి కనుగొన్నాను. 416 00:43:11,884 --> 00:43:14,595 నన్ను అర్థం చేసుకునే వారు అక్కడ నాకు లభించారు. 417 00:43:16,471 --> 00:43:18,891 ఎవరితోనూ మాట్లాడలేని విధంగా వారితో నేను మాట్లాడగలిగాను. 418 00:43:20,976 --> 00:43:25,689 నా వారిని కనుగొన్నాక, నేను విలియమ్ వీలర్ ముఖాన్ని తీసుకున్నాను. 419 00:43:34,072 --> 00:43:36,283 లోపల నా అసలైన స్వరూపం నాకు తెలిసొచ్చింది. 420 00:43:39,119 --> 00:43:42,789 నేను ఎవరు అనేది నా మిత్రులు గమనించాక... 421 00:43:44,791 --> 00:43:47,252 వాళ్లు నాకు నా అసలైన పేరు ఇచ్చారు. 422 00:43:49,755 --> 00:43:53,884 నిజానికి అపోలో, నీకు అది తెలుసు కూడా. 423 00:43:56,803 --> 00:43:58,096 నాకెలా తెలుసు? 424 00:44:00,265 --> 00:44:01,934 రాత్రికి డిన్నర్ కోసం ఒక ప్లాన్ వేశాను, 425 00:44:03,268 --> 00:44:07,356 బ్రయాన్ చంటిపిల్లాడి స్ఫూర్తితో ఓ వంటకం చేశాను, 426 00:44:08,857 --> 00:44:10,984 ఉడకబెట్టిన కూరగాయలు. 427 00:44:13,111 --> 00:44:14,279 కిండర్ గార్టెన్! 428 00:45:44,036 --> 00:45:46,038 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్