1 00:00:31,073 --> 00:00:36,328 పర్యవసానాలు. తర్వాత జరిగే పరిణామాలు. 2 00:00:36,828 --> 00:00:40,415 అంటే, ఏదైనా ముఖ్యమైన, జరగకూడని సంఘటన జరిగిన తర్వాత 3 00:00:40,415 --> 00:00:43,085 మనకి ఎదురయ్యే పరిస్థితులని అర్థం. 4 00:01:14,074 --> 00:01:16,034 మెసేజ్ - తెలియని నంబర్ ఒక కొత్త మెసేజ్ 5 00:01:16,034 --> 00:01:18,328 "ఫోన్ పడేయమని చెప్పారు కదా. 6 00:01:18,328 --> 00:01:22,165 నిజంగానే నన్ను వదిలేసుకోగలవా? నిజంగా ఏం జరిగిందో తెలిసింది నా ఒక్కరికే కదా. 7 00:01:22,666 --> 00:01:26,128 చీకటి పడ్డాక స్నానం చేయిస్తారు, చాలా చక్కగా దాస్తారు. 8 00:01:26,128 --> 00:01:29,339 అడవిలో నివాసముంటూ, ఎవరికీ కనిపించకుండా ఉంటారు. 9 00:01:30,340 --> 00:01:33,719 చీకటి పడ్డాక స్నానం చేయిస్తారు, చాలా చక్కగా దాస్తారు. 10 00:01:33,719 --> 00:01:37,222 అడవిలో నివాసముంటూ, ఎవరికీ కనిపించకుండా ఉంటారు." 11 00:01:38,390 --> 00:01:40,601 ...ప్రయాణికులారా, ప్లాట్ ఫామ్ 16 వద్ద ఉన్న 12 00:01:40,601 --> 00:01:43,228 న్యూయార్క్ సిటీ ఫెర్రీకి ఇదే ఆఖరి బోర్డింగ్ కాల్. 13 00:01:44,146 --> 00:01:45,981 ప్రయాణికులందరూ, గేట్ దగ్గరకు రావాలి. 14 00:01:47,316 --> 00:01:51,028 మళ్లీ చెప్తున్నాను, న్యూయార్క్ సిటీ ఫెర్రీకి ఇదే ఆఖరి బోర్డింగ్ కాల్... 15 00:02:11,965 --> 00:02:15,052 ఎమ్మా? ఎమ్మా. 16 00:02:24,978 --> 00:02:25,979 లేయ్. 17 00:02:33,904 --> 00:02:34,905 మనం దీన్ని అధిగమిస్తాం. 18 00:02:52,130 --> 00:02:53,757 సమయం అయింది. వాళ్లు నీ కోసం ఎదురుచూస్తున్నారు. 19 00:02:54,424 --> 00:02:59,346 మనకి ఇది తప్ప మరో దారి లేదు, అసలు ఇదంతా నిజమేనా లేదా... 20 00:03:00,848 --> 00:03:02,432 లేదా నేను కూడా అమ్మలాంటిదాన్నే అనా? 21 00:03:05,978 --> 00:03:11,024 నాపై అనుమానం వద్దు. నాతో రా. వచ్చి నువ్వే చూడు. 22 00:03:11,024 --> 00:03:14,278 తను ఏం చెప్పిందో తెలుసుగా. నువ్వు ఒక్కదానివే రావాలట. 23 00:03:14,278 --> 00:03:16,530 - చెప్పేది విను, కిమ్. నాతో రా. - చూడు. 24 00:03:16,530 --> 00:03:17,990 - నీ మంచి కోసం... - వద్దు. 25 00:03:17,990 --> 00:03:19,950 ...నేను నిన్ను వదిలేయక తప్పదు. 26 00:03:19,950 --> 00:03:23,996 నాతో రా, కిమ్. ప్లీజ్. 27 00:03:24,872 --> 00:03:27,040 ఈ విషయంలో నువ్వు శిక్ష అనుభవించకూడదు. 28 00:03:33,922 --> 00:03:35,507 {\an8}ఐ లవ్ యు! 29 00:04:24,681 --> 00:04:26,016 కాల్ నీకు అంత ధైర్యం ఉంటేనే 30 00:04:26,016 --> 00:04:27,726 ఎమ్మా: నేను సిద్ధంగా ఉన్నాను 31 00:04:45,911 --> 00:04:47,871 విక్టర్ లవాల్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 32 00:05:45,804 --> 00:05:46,805 సుస్వాగతం. 33 00:05:46,805 --> 00:05:48,223 నా కొడుక్కి ఏమైంది? 34 00:05:48,223 --> 00:05:50,142 - నాతో రండి. - నన్ను తాకవద్దు. 35 00:05:52,186 --> 00:05:53,187 నా కొడుకు ఎక్కడ? 36 00:05:54,980 --> 00:05:59,276 నేను చెప్పిన పని చేశారు కదా, చేశాక మీకు ఏం కనిపించింది? 37 00:06:00,277 --> 00:06:01,653 నేనేం చూశానో మీకు తెలుసు. 38 00:06:02,154 --> 00:06:03,197 మొత్తానికి మీకు తెలిసిపోయిందిగా. 39 00:06:04,656 --> 00:06:07,576 మీకేమీ పిచ్చి కాదు. మొదట్నుంచీ మీ అనుమానం నిజమే అని తేలింది. 40 00:06:07,576 --> 00:06:10,662 నా కొడుకు ఎక్కడున్నాడో ఇంకా నాకు తెలీదు, అలాంటప్పుడు నా అనుమానం నిజమైతే ఏంటి, కాకపోతే ఏంటి? 41 00:06:10,662 --> 00:06:14,458 మీ కొడుకు ఇక్కడే ఉన్నాడన్న భ్రమ, దానితో పాటే మీ క్షోభ తొలగిపోతాయి. 42 00:06:14,458 --> 00:06:18,086 వాడు ఇక్కడే ఉన్నాడు. అది నాకు తెలుస్తోంది. 43 00:06:18,086 --> 00:06:20,672 ఎక్కడ ఉన్నాడో చెప్పండి చాలు. 44 00:06:21,340 --> 00:06:23,258 మన పిల్లలు ప్రత్యేకమైనవాళ్ళని మనందరం అనుకుంటాం. 45 00:06:23,258 --> 00:06:24,593 తొక్కేం కాదు. 46 00:06:24,593 --> 00:06:30,432 దాన్ని నాశనం చేస్తే, అంతా స్పష్టంగా అర్థం అవుతుందని, 47 00:06:31,767 --> 00:06:35,687 నాకు మరో అవకాశం దొరుకుతుందని మీరే అన్నారు కదా. 48 00:06:35,687 --> 00:06:37,940 మీ జీవితం విషయంలో మీకు మరో అవకాశం దొరుకుతుంది అన్నాను. 49 00:06:38,565 --> 00:06:41,068 ఇక్కడ ఉండే ప్రతీ మహిళకి కూడా ఒకప్పుడు ఇలాగే అనిపించింది. 50 00:06:41,068 --> 00:06:43,028 - మేమందరమూ సానుభూతి చూపుతాం. - నేను వెళ్లిపోతున్నా. 51 00:06:43,737 --> 00:06:47,324 మా గురించి బయట ప్రపంచానికి చెప్పి, ఇక్కడ ఉండే మహిళల్ని, పిల్లల్ని ప్రమాదంలోకి నెట్టవద్దని 52 00:06:47,324 --> 00:06:49,493 మిమ్మల్ని కోరుతున్నాను. 53 00:06:51,203 --> 00:06:53,580 కోరుతున్నారా, లేక అడుగుతున్నారా? 54 00:06:55,249 --> 00:06:56,250 ఆ రెండూ అనుకోండి. 55 00:06:57,251 --> 00:07:03,924 మీ మనుషుల సాయంతో ఈ క్షణమే నన్ను నగరానికి పంపించండి. 56 00:07:04,424 --> 00:07:07,219 అది కుదరదు. మిమ్మల్ని మళ్లీ వెనక్కి పంపడం, 57 00:07:07,219 --> 00:07:08,512 అది కూడా ఈ స్థితిలో... 58 00:07:09,304 --> 00:07:10,848 నన్ను వదలండి. 59 00:07:16,228 --> 00:07:17,980 తను కొంత సమయం శాంతంగా ఉండేలా చేయండి. 60 00:07:19,106 --> 00:07:20,691 నన్ను వదలండి. 61 00:07:39,126 --> 00:07:42,337 ఎక్కడున్నావో కనిపెడతా. నువ్వు ఎక్కడున్నావో కనిపెడతా. 62 00:07:48,302 --> 00:07:52,389 దరిద్రుల్లారా! నాశనమైపోతారు మీరు! 63 00:07:52,389 --> 00:07:54,349 నన్ను తాకారంటే చస్తారు... 64 00:07:57,019 --> 00:07:58,937 ఇది మీకు విశ్రాంతిని ఇస్తుంది. 65 00:08:29,843 --> 00:08:33,554 {\an8}"చీకటి పడ్డాక స్నానం చేయిస్తారు, చాలా చక్కగా దాస్తారు. 66 00:08:33,554 --> 00:08:37,100 {\an8}అడవిలో నివాసముంటూ, ఎవరికీ కనిపించకుండా ఉంటారు." 67 00:09:42,541 --> 00:09:44,251 "చీకటి పడ్డాక స్నానం చేయిస్తారు." 68 00:10:20,078 --> 00:10:22,414 చీకటి పడ్డాక స్నానం చేయిస్తారు, చాలా చక్కగా దాస్తారు 69 00:10:22,414 --> 00:10:25,000 అడవిలో నివాసముంటూ, ఎవరికీ కనిపించకుండా ఉంటారు 70 00:10:36,011 --> 00:10:39,890 భర్త చనిపోతే భార్యని వితంతువు అని, 71 00:10:39,890 --> 00:10:42,476 భార్య చనిపోతే భర్తని విధురుడు అని అంటారు. 72 00:10:43,310 --> 00:10:45,729 తల్లిదండ్రులు లేని పిల్లలని అనాథలంటారు. 73 00:10:47,856 --> 00:10:50,067 కానీ పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులని నిర్వచించే పదం 74 00:10:50,067 --> 00:10:51,735 నాకు తెలిసి మన భాషలో లేదు. 75 00:10:54,905 --> 00:10:57,074 అందుకే మా లైబ్రరీలో డిక్షనరీ ఉండాలని అనుకుంటూ ఉంటా. 76 00:10:57,074 --> 00:10:59,743 ఇలా నన్ను ఎంత సేపు ఉంచారు? 77 00:11:00,744 --> 00:11:02,913 మీరు నిద్రపోయి చాలా కాలమైంది. 78 00:11:02,913 --> 00:11:04,498 ఎంత సేపు ఉంచారు? 79 00:11:05,666 --> 00:11:06,583 చాలా సేపు. 80 00:11:08,168 --> 00:11:11,380 నాకు సమయం మించిపోతోంది. 81 00:11:11,380 --> 00:11:13,549 పిల్లలని ఫెయిరీలు ఎక్కడికి తీసుకెళ్తాయో ఎవరికీ తెలీదు. 82 00:11:16,718 --> 00:11:18,512 మీరూ, మీ తొక్కలో రహస్యాలు. 83 00:11:19,054 --> 00:11:24,017 మహిళల్లో ఒక్కరు కూడా, తమ పిల్లల ఆచూకీని కనుగొనలేకపోయారు. 84 00:11:25,018 --> 00:11:30,232 చెప్తున్నా కదా, వాళ్లు ఒంట్లో సత్తువ, తెగింపు ఉన్నంత కాలం వెతికారు... 85 00:11:30,941 --> 00:11:32,734 చివరికి ఆ మానసిక క్షోభ భరించలేక వదిలేశారు. 86 00:11:33,694 --> 00:11:36,905 నాతో సహా, ఒక్కరు కూడా తమ పిల్లలని కనుగొనలేకపోయారు. 87 00:11:46,832 --> 00:11:49,168 కానీ బ్రయాన్ వేరు. 88 00:11:50,210 --> 00:11:51,044 వేరు కాదని మీకు తెలిసేదాకా. 89 00:11:52,129 --> 00:11:56,258 నా భర్తే బతికి ఉంటే, నా కోసం తప్పకుండా ఇక్కడికి వస్తాడు. 90 00:11:56,258 --> 00:11:58,135 ఈ చోటును కనుక్కోవడం ఆ దేవుడి తరం కూడా కాదు. 91 00:12:00,095 --> 00:12:01,180 అదీ చూద్దాం. 92 00:12:02,181 --> 00:12:04,016 ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నేను తెలుసుకోవాలి. 93 00:12:06,143 --> 00:12:08,562 లైబ్రరీ అన్నారు కదా? 94 00:12:09,313 --> 00:12:11,690 పర్వాలేదులే, ఒక రకంగానే ఉంటుంది అది. 95 00:12:11,690 --> 00:12:12,858 చెట్లపై పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? 96 00:12:13,859 --> 00:12:15,527 అక్కడికి వెళ్లాక అరవడాలు, గోల చేయడాలు చేయరు కదా? 97 00:12:18,614 --> 00:12:19,615 చేయను. 98 00:12:25,954 --> 00:12:27,080 సరే మరి. అక్కడికి పోదాం పదండి. 99 00:12:32,586 --> 00:12:33,879 పర్వాలేదన్నారే? 100 00:12:33,879 --> 00:12:35,297 అవసరమైన వాటికే ప్రాధాన్యత ఇస్తాం. 101 00:12:38,425 --> 00:12:39,510 మీకు పుస్తకాలు తెచ్చివ్వగలను. 102 00:12:40,969 --> 00:12:41,970 థ్యాంక్యూ. 103 00:12:44,014 --> 00:12:48,560 కానీ ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసేదాకా మీరు ఇక్కడే ఉంటే బాగుంటుంది. ఏమంటారు? 104 00:12:49,436 --> 00:12:51,438 మీ వల్ల ప్రమాదమేమీ లేదని మాకు పక్కాగా తెలిసేదాకా. మీరర్థం చేసుకోగలరు కదా. 105 00:12:53,315 --> 00:12:56,443 అంటే, ఇక్కడ ఉండే మహిళలను పరిచయం చేసుకోండి. 106 00:12:57,152 --> 00:12:59,738 అలా నడకకు వెళ్లండి. తాజా గాలిని పీల్చుకోండి. అంతా... 107 00:13:00,280 --> 00:13:03,951 ఎమ్మా, బాధలోని మొదటి దశ తిరస్కారమే. 108 00:13:03,951 --> 00:13:07,287 కాల్, మీ మాటలు ప్రవచనాల లాగా అనిపిస్తాయి, 109 00:13:07,287 --> 00:13:11,625 మీకేదో అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు, నాకు మహా చిరాకుగా అనిపిస్తోంది. 110 00:13:33,146 --> 00:13:34,565 పడవ ఏమైపోయింది? 111 00:13:38,485 --> 00:13:39,486 నీ యెంకమ్మ. 112 00:14:22,779 --> 00:14:23,864 ఇక వినోదం విషయానికి వద్దాం. 113 00:14:28,911 --> 00:14:31,330 అడవిలో, ఒక పార్టీ జరుగుతోంది. 114 00:14:33,332 --> 00:14:38,795 బాగా చీకటి పడ్డాక, అతిథులందరూ చక్కగా తయారయి వచ్చారు. 115 00:14:40,047 --> 00:14:43,300 సంగీతం వాయిస్తున్నారు, నృత్యకారులు చకచకా నాట్యం చేస్తున్నారు. 116 00:14:44,927 --> 00:14:48,347 వారి కౌగిలిలో ఉన్న బిడ్డకి ఎప్పటికీ ఏమీ కాదు, 117 00:14:48,347 --> 00:14:51,892 ఆ బిడ్డకి వయస్సు పెరగదు, బిడ్డ బలహీనం కాదు, ప్రేమ అయితే లెక్కలేనంత అందుతుంది. 118 00:14:52,768 --> 00:14:55,646 నింగిలో నక్షత్రాలు వెలుగుతున్నంత కాలం బిడ్డకి డోకా ఏమీ లేదు. 119 00:14:56,480 --> 00:14:59,525 ఫెయిరీలు బిడ్డను తమ గుండెలకి హత్తుకుంటాయి. 120 00:15:00,484 --> 00:15:03,487 బిడ్డని మళ్లీ ఇచ్చేయవు. చాలా ప్రేమగా చూసుకుంటాయి. 121 00:15:33,141 --> 00:15:35,185 చాలా పడవలు ఉన్నాయి... 122 00:15:36,186 --> 00:15:38,772 - సరే, నేను తీసుకుంటా. - ఏమంటావు? 123 00:15:41,733 --> 00:15:42,734 ఏనుగు. 124 00:15:43,485 --> 00:15:44,486 హా. 125 00:15:47,656 --> 00:15:49,533 - ఇది నీదా? - ఇంకొక్క స్పూన్. 126 00:15:50,909 --> 00:15:52,035 మీకు జరిగినదానికి చింతిస్తున్నాను. 127 00:15:55,664 --> 00:15:56,790 ఈ ఇద్దరూ మీ పిల్లలా? 128 00:16:00,544 --> 00:16:01,378 అవును. 129 00:16:02,713 --> 00:16:03,547 హా. 130 00:16:04,464 --> 00:16:07,301 వీళ్లిద్దరూ కాకుండా 131 00:16:10,262 --> 00:16:11,597 మధ్యలో రేచల్ అనే పాప పుట్టింది. 132 00:16:19,521 --> 00:16:21,190 పడవని ఎక్కడ ఉంచుతారు? 133 00:16:23,066 --> 00:16:24,359 - నాకు తెలీదు. - అబద్ధం. 134 00:16:29,948 --> 00:16:31,158 ఏం కాలేదులే. 135 00:16:42,711 --> 00:16:47,174 దీవిలోని ఆగ్నేయం దిక్కున ఒక గ్యారేజీ ఉంది, అందులో ఉంచుతారు. 136 00:16:49,510 --> 00:16:50,511 గుడ్ లక్. 137 00:18:15,888 --> 00:18:20,475 తనని వదిలేసేయ్. ఒకప్పుడు నువ్వు కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నావు. 138 00:18:20,475 --> 00:18:21,768 తను సఫలం కాలేదు. 139 00:18:22,686 --> 00:18:24,021 కనీసం ప్రయత్నమైనా చేయనిద్దాం. 140 00:19:31,213 --> 00:19:33,215 నేను దేవుడినైన, అపోలోని. 141 00:19:37,761 --> 00:19:38,971 అబ్బాయి పుట్టాడు. 142 00:19:41,431 --> 00:19:43,016 బ్రయాన్ అని పేరు పెడదామా? 143 00:20:14,464 --> 00:20:15,757 "ముందు ప్రేమ పుడుతుంది." 144 00:20:44,328 --> 00:20:46,330 ఫోర్ట్ వాషింగ్టన్ లైబ్రరీ 145 00:21:24,576 --> 00:21:28,205 "అబ్బురపరిచే జలపాతాలు, అరణ్యాలు." ఇక్కడున్నావా! 146 00:21:43,595 --> 00:21:46,557 పోలీసులు, పారామెడిక్స్ చూసేసరికి బిడ్డలో చలనం లేదు, 147 00:21:46,557 --> 00:21:48,600 బిడ్డ అప్పటికే చనిపోయాడని చెప్పారు. 148 00:21:48,600 --> 00:21:52,145 కనిపించకుండా పోయిన ఎమ్మా వ్యాలంటైన్ గురించి ఇంకా ఏమీ తెలీలేదు, 149 00:21:52,145 --> 00:21:55,482 తను చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు, సంఘటనా స్థలంలో తన రక్తం ఉంది. 150 00:21:56,483 --> 00:21:59,027 తండ్రి అపోలో కాగ్వాకి చాలా బలమైన గాయాలు తగిలాయి కనుక... 151 00:21:59,027 --> 00:22:00,529 తాజా వార్త పసివాడు చనిపోయి ఉన్నాడు, తల్లి ఆచూకీ తెలీదు 152 00:22:00,529 --> 00:22:02,322 ...అతడిని హుటాహుటిన ఐసీయూకి తరలించారు. 153 00:22:02,322 --> 00:22:04,199 ఆ దేవుడి తరం కూడా కాదు. 154 00:22:04,199 --> 00:22:08,078 చుట్టుపక్కల ప్రాంతాల కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే, సంఘటనా స్థలానికి చెందిన 155 00:22:08,078 --> 00:22:09,788 భయంకరమైన ఫోటోలు ఆన్ లైన్ లోకి 156 00:22:09,788 --> 00:22:12,583 ఎలా లీక్ అయ్యాయో తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. 157 00:22:32,853 --> 00:22:33,937 వారెవ్వా. 158 00:22:36,148 --> 00:22:36,982 మళ్లీ ఇక్కడికి వచ్చేశారే. 159 00:22:38,108 --> 00:22:41,778 ఎక్కడికి వెళ్లాలో తెలిసేంత వరకు, ఎక్కడికని వెళ్లను నేను! 160 00:22:44,198 --> 00:22:47,326 నా పరిస్థితి ఏంటో తెలిసిన వ్యక్తులు మీరే కదా. 161 00:22:51,079 --> 00:22:54,833 అదీగాక నేను పుస్తకాలను తెస్తానని మాటిచ్చాను. 162 00:22:58,504 --> 00:22:59,505 {\an8}వావ్. 163 00:23:00,088 --> 00:23:01,089 థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్. 164 00:23:01,590 --> 00:23:03,717 పుస్తకాలు లేని జీవితం, జీవితమే కాదు. 165 00:23:03,717 --> 00:23:05,511 అందులో సందేహమే లేదు. 166 00:23:08,305 --> 00:23:10,599 "'ఎవరు నువ్వు?' అని గొంగళి పురుగు అడిగింది. 167 00:23:11,350 --> 00:23:14,186 ఆ మాటతో సంభాషణ ప్రారంభించడం, ఆలీస్ కి అదోలా అనిపించింది. 168 00:23:14,895 --> 00:23:16,563 కాస్త మొహమాటంగానే ఆలీస్ బదులిచ్చింది, 169 00:23:17,231 --> 00:23:18,899 'నేనెవరో నాకు తెలీట్లేదు, సర్. 170 00:23:18,899 --> 00:23:22,402 అంటే, ఈ ఉదయం లేచినప్పుడు నేనెవరో నాకు తెలుసు, 171 00:23:22,402 --> 00:23:28,116 కానీ ఆ తర్వాతి నుండి, నేను చాలా సార్లు మారిపోయా.' 172 00:23:28,617 --> 00:23:32,371 'మారిపోవడం అంటే ఏంటి?' అని గొంగళి పురుగు ముక్కుసూటిగా అడిగేసింది. 173 00:23:32,371 --> 00:23:35,582 గొంగళి పురుగు, ఆలీస్ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు. 174 00:23:36,208 --> 00:23:39,419 చివరికి గొంగళి పురుగు, తన నోట్లో నుండి హుక్కా తీసింది." 175 00:23:39,419 --> 00:23:41,088 హుక్కా అంటే ఏంటో తెలుసా? 176 00:23:58,814 --> 00:23:59,815 మళ్లీనా? 177 00:24:00,816 --> 00:24:03,485 అలా చదవకూడదు. కళ్లు మూసుకో. 178 00:24:03,986 --> 00:24:05,112 బూ! 179 00:24:07,906 --> 00:24:08,907 పుస్తకాలు తెచ్చినందుకు థ్యాంక్స్. 180 00:24:13,161 --> 00:24:14,288 మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా? 181 00:24:16,665 --> 00:24:18,876 హేయ్, మీ అన్నయ్యకి చదివి వినిపిస్తావా? 182 00:24:18,876 --> 00:24:20,711 - సరే. - చెల్లిని పెద్ద బెడ్ దగ్గరికి తీసుకెళ్లు. 183 00:24:21,420 --> 00:24:23,005 సరే. రా. 184 00:24:33,473 --> 00:24:34,474 మీతో... 185 00:24:35,684 --> 00:24:37,728 బిడ్డ మీ దగ్గర ఉండినప్పుడు 186 00:24:38,562 --> 00:24:42,232 మీకు ఎప్పుడైనా ఏమైనా కనిపించిందా? 187 00:24:42,232 --> 00:24:45,652 ఉయ్యాలలో ఏమైనా కనిపించేదా? 188 00:24:47,362 --> 00:24:48,572 ఏమైనా కనిపించేదా అని అడుగుతున్నారా? 189 00:24:49,323 --> 00:24:56,205 కాస్త చిత్రమైన ప్రశ్నే అని నాకు తెలుసు. కానీ మీకు చెట్టుకు కానీ, కొమ్మకి కానీ 190 00:24:57,497 --> 00:25:00,918 సంబంధించిన భాగమేమైనా కనిపించిందా? 191 00:25:02,503 --> 00:25:03,795 హా, భలే వింతగా అనిపించేది. 192 00:25:04,379 --> 00:25:08,800 నాకు మురికిగా అనిపించేది... అంటే మట్టిలా అన్నమాట... ఎప్పుడూ అది కనిపించేది, 193 00:25:09,718 --> 00:25:10,719 ఆ తర్వాత... 194 00:25:13,555 --> 00:25:14,556 ఒకసారి ఆకు కనిపించింది. 195 00:25:16,350 --> 00:25:19,770 చివర్లో... ఒక ఆకు కనిపించింది. 196 00:25:21,939 --> 00:25:23,190 అది మీ దగ్గర ఉందా? 197 00:25:23,190 --> 00:25:26,068 లేదు. ఆకే కదా అని వదిలేశా. 198 00:25:26,568 --> 00:25:28,028 హా. సరే. 199 00:25:28,862 --> 00:25:31,031 కానీ గీసి ఇవ్వగలను. 200 00:26:59,369 --> 00:27:00,537 వృక్షమా, నీకు థ్యాంక్స్. 201 00:27:09,838 --> 00:27:13,800 నార్వే మేపుల్ చెట్టు. చాలా దూకుడు గల చెట్టు జాతి అది. 202 00:27:14,301 --> 00:27:19,598 ఎంత దూకుడంటే, అది ఏ చెట్టు నుండి అయితే పుడుతుందో, ఆ చెట్టు వేళ్ళనే పెనవేసి, నీళ్లు అందక చనిపోయేలా చేస్తుంది. 203 00:27:20,349 --> 00:27:23,143 చాలా పెద్ద నీడని ఇస్తుంది, 204 00:27:23,143 --> 00:27:27,231 దానితో ఇతర మొక్కలు, అడవి పూలు పెరగడానికి వీలు దొరకదు. 205 00:27:29,358 --> 00:27:31,610 విలన్ చెట్టు ఇది. 206 00:27:43,872 --> 00:27:45,249 నీ కోసం వస్తున్నా. 207 00:27:51,338 --> 00:27:52,548 నాకు ఇంటర్నెట్ కావాలి. 208 00:27:53,173 --> 00:27:54,716 ఎలాంటి సంప్రదింపు వ్యవస్థ ద్వారా అయినా 209 00:27:54,716 --> 00:27:56,552 ఈ దీవి ఉనికి గురించి బయటి ప్రపంచానికి తెలిసిపోతుంది. 210 00:27:57,135 --> 00:27:58,303 మీరు ఆన్ లైన్లోనే కదా సందేశం పంపింది! 211 00:27:58,303 --> 00:28:01,890 మేము సౌత్ బ్రదర్ దీవికి పడవలో వెళ్లి, అక్కడ ప్రీపెయిడ్ బర్నర్ ఫోన్స్ కొని, అక్కడే వాడతాం. 212 00:28:01,890 --> 00:28:05,602 - అయితే నేను మళ్లీ పడవని వాడాల్సి ఉంటుంది. - అది క్షేమం కాదు. 213 00:28:05,602 --> 00:28:08,230 మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనైతే వెళ్తాను, 214 00:28:08,230 --> 00:28:10,899 అవసరమైతే మిమ్మల్ని చంపి అయినా దాన్ని తీసుకుంటాను. 215 00:28:16,321 --> 00:28:17,573 నేను మరిన్ని పుస్తకాలు తెస్తాను. 216 00:28:19,533 --> 00:28:20,576 సరే. 217 00:28:20,576 --> 00:28:22,744 కానీ నగరానికి వెళ్లడానికి ఇంకా మంచి మార్గాన్ని నీకు చూపిస్తాను. 218 00:28:22,744 --> 00:28:25,455 ఇంకో విషయం ఎమ్మా, నువ్వు పోలీసులకి దొరికితే, 219 00:28:25,455 --> 00:28:27,332 వాళ్లు నిన్ను అరెస్ట్ చేస్తే, ఇక నీ పాటికి నువ్వు అన్నట్టే. 220 00:28:27,332 --> 00:28:28,625 మేము నీకు సాయపడలేం, 221 00:28:29,668 --> 00:28:31,795 ఈ దీవి గురించి నువ్వు ఒక్క ముక్క కూడా చెప్పడానికి వీల్లేదు. 222 00:30:01,301 --> 00:30:02,594 ఎమ్మా వ్యాలంటైన్. 223 00:30:07,641 --> 00:30:09,393 స్వాగతం! నా పేరు వీల్స్. 224 00:30:10,644 --> 00:30:13,689 మేము నీడ లేని వాళ్లం, మీ లాంటి స్టార్ హోటళ్లు, బంగళాల్లో ఉండేవాళ్లు, 225 00:30:13,689 --> 00:30:17,442 నవ్వుకోవడానికి పనికి వచ్చే వాళ్లం మేము. 226 00:30:18,652 --> 00:30:21,864 ఏం... ఏం చెప్పాలో నాకు తెలీట్లేదు. 227 00:30:21,864 --> 00:30:24,074 చూడకుండా ఏం చెప్పగలరులే, ఏదైనా, మాకేం పర్వాలేదు. 228 00:30:25,993 --> 00:30:27,244 నేను నా కొడుకు కోసం వెతుకుతున్నా. 229 00:30:28,203 --> 00:30:30,581 రండి. తెల్లారోలేపే పని కానించేయాలి. 230 00:30:32,499 --> 00:30:33,667 ఇక్కడ బాగా వేడిగా ఉంది. 231 00:30:33,667 --> 00:30:35,627 ఆవిరి పైప్స్. 37 డిగ్రీలు ఉంటుంది! 232 00:30:35,627 --> 00:30:38,589 ఈ వేడిలో మంచి ఆహారాన్ని వండుకోవచ్చు. 233 00:30:39,882 --> 00:30:40,924 నా యమహా ఎక్కండి. 234 00:30:43,594 --> 00:30:44,595 గట్టిగా పట్టుకోండి! 235 00:30:57,316 --> 00:30:59,276 నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు 236 00:31:03,113 --> 00:31:04,281 ఏంటది? 237 00:31:04,281 --> 00:31:08,452 ఇక్కడ చిత్రవిచిత్రమైన మనుషులు కనిపిస్తారు. అన్ని రకాల వారు, అన్ని జాతుల వారు ఉంటారు. 238 00:31:08,452 --> 00:31:10,454 విద్యుత్తును చాకచక్యంగా ఉపయోగించుకుంటున్నారు. 239 00:31:10,454 --> 00:31:13,665 అసలు సిసలైన నివాసాన్ని ఏర్పరచుకున్నారు. 240 00:31:16,084 --> 00:31:17,377 అది పంది కదా. 241 00:31:17,377 --> 00:31:21,465 దాని పేరు హెన్రీ. గ్రాండ్ సెంట్రల్ కమ్యూనిటీకి స్వాగతం. 242 00:31:21,965 --> 00:31:23,258 ఇప్పుడు మనం దాని కిందే ఉన్నాం. 243 00:31:23,884 --> 00:31:25,219 ఎంత కాలం నుండి ఇక్కడ ఉంటున్నారు? 244 00:31:25,219 --> 00:31:27,221 మేము మొదట్నుంచీ ఇక్కడే ఉన్నాం. 245 00:31:28,055 --> 00:31:29,806 పైన ప్రపంచం ఉన్నంత కాలం, కింద కూడా ఓ ప్రపంచం ఉంటుంది. 246 00:31:30,724 --> 00:31:32,935 పైనో లోకం, కిందో లోకం. 247 00:31:32,935 --> 00:31:37,064 ఇక్కడ అన్ని జాతుల వారూ ఉన్నారు. నల్లవారు, తెల్లవారు, ఆసియావారు, ల్యాటిన్ అమెరికావారు, 248 00:31:37,064 --> 00:31:40,108 ముసలివారు, యువకులు, డ్రగ్స్ బానిసలు, డ్రగ్స్ తీసుకోనివారు, 249 00:31:40,108 --> 00:31:43,529 మామూలువారు, గేలు, మాడాలు, ఇప్పుడు చెప్పిన ఏ వర్గానికీ చెందనివారు. 250 00:31:44,196 --> 00:31:46,448 కాబట్టి దీన్ని కూడా మహానగరమనే చెప్పవచ్చు, 251 00:31:46,448 --> 00:31:51,161 కానీ ఈ సొరంగాలలో జాతి, ఉన్నవారు, లేనివారు, లింగం వంటి అంశాల ఆధారంగా ఏ తారతమ్యాలూ లేవు, 252 00:31:51,161 --> 00:31:52,871 కాబట్టి అక్కడివాళ్ల కంటే మేమే మేలు. 253 00:31:53,539 --> 00:31:55,624 ఇంత కన్నా కిందికి మనం వెళ్లలేకపోవచ్చు. 254 00:31:55,624 --> 00:31:59,002 కానీ పైనున్నా, కింద ఉన్నా డ్రగ్స్ మత్తులో తూగడం సర్వసాధారణమే. 255 00:32:02,673 --> 00:32:04,258 ఇక్కడ నియమాలు ఉంటాయి, వాటిని పాటించాలి, లేదంటే గెంటేస్తారు. 256 00:32:04,258 --> 00:32:06,051 నియమాలు - దొంగిలించకూడదు అరవకూడదు - గోప్యతను గౌరవించండి 257 00:32:06,051 --> 00:32:07,719 ఇచ్చిపుచ్చుకోండి సొరంగంలో చావవద్దు 258 00:32:07,719 --> 00:32:09,805 అదీగాక, ఇక్కడ ఉండాలంటే, నా ఆహ్వానం ఉండాల్సిందే. 259 00:32:10,389 --> 00:32:11,890 మనం బయలుదేరాలి. 260 00:32:13,475 --> 00:32:16,353 గ్రేట్ డిప్రెషన్ తర్వాత న్యూయార్క్ నగరంలో వీధిన పడినవారి సంఖ్య 261 00:32:16,353 --> 00:32:18,605 ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. 262 00:32:18,605 --> 00:32:21,400 ట్రాక్ 61. దాని గురించి మీకు తెలుసా? తెలీదు! 263 00:32:21,400 --> 00:32:22,651 ఎందుకంటే అది రహస్యం కదా. 264 00:32:24,194 --> 00:32:28,240 నాకు చరిత్ర అంటే భలే ఇష్టం. దీన్ని ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ కోసం నిర్మించారు. 265 00:32:28,740 --> 00:32:31,451 ఇలా వెళ్తే లిఫ్ట్ ఉన్న ప్రత్యేకమైన ప్లాట్ ఫామ్ వస్తుంది, 266 00:32:31,451 --> 00:32:35,372 ఆ లిఫ్ట్ ఎక్కి అతను నేరుగా వల్డోర్ఫ్ అస్టోరియా హోటల్ గ్యారేజీకి వెళ్లిపోయేవాడు, 267 00:32:35,372 --> 00:32:37,416 ఎందుకంటే, అతనికి పోలియో ఉండి, చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. 268 00:32:37,416 --> 00:32:39,126 దీన్ని చూడండి. 269 00:32:39,126 --> 00:32:40,586 చాలా అందంగా ఉంది కదా? 270 00:32:41,086 --> 00:32:43,881 జనాలని బ్రాడ్ వేకి, అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చేది ఇది. 271 00:32:44,381 --> 00:32:48,260 కార్లు వచ్చాయి, పెట్రోల్ కి ఖర్చు చేస్తూ దీన్ని పక్కకు పెట్టేశారు. దారుణం అబ్బా. 272 00:32:49,219 --> 00:32:50,512 కానీ ఇప్పుడు ఇదే నా ఇల్లు అయిపోయింది. 273 00:32:50,512 --> 00:32:52,139 పన్నులు లేవు, ఖర్చులు లేవు, 274 00:32:52,139 --> 00:32:54,266 మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించి, టీ ఇచ్చి, 275 00:32:54,266 --> 00:32:56,810 చరిత్ర విషయంలో నాకున్న జ్ఞానాన్ని మీతో పంచుకొనే సమయం కూడా లేదు. 276 00:33:00,105 --> 00:33:02,316 మీకు అర్థం కాని వాటిని నమ్మితే 277 00:33:02,316 --> 00:33:04,067 అనుభవించక తప్పదు 278 00:33:04,067 --> 00:33:05,986 ఇది కొలంబస్ సర్కిల్ కమ్యూనిటీ. 279 00:33:06,486 --> 00:33:09,364 - హేయ్! నీకు నీళ్లు తెచ్చా! - తిరిగి వచ్చేటప్పుడు తీసుకుంటా. 280 00:33:09,865 --> 00:33:13,327 - నీళ్లా? - సెంట్రల్ పార్కులో నగరపు కుళాయి నీళ్లతో నడిచే 281 00:33:13,327 --> 00:33:14,995 జలపాతాలు మూడు ఉన్నాయి కదా. 282 00:33:14,995 --> 00:33:18,457 బద్ధకస్థులైన మేము ఆ మంచి నీళ్లనే తాగడానికి వాడతాం. 283 00:33:19,041 --> 00:33:22,211 కొలంబస్ కమ్యూనిటీ వాళ్లు రాత్రి అక్కడికి వెళ్లి మాకోసం తీసుకొస్తారు. 284 00:33:22,211 --> 00:33:25,130 మేము ఏవైతే సంపాదిస్తామో, వాటిని వాళ్లకి ఇచ్చి నీళ్లు తెచ్చుకుంటాం. 285 00:33:25,756 --> 00:33:28,300 పోర్న్ మ్యాగజీన్లు కానీ, సిగరెట్లు కానీ, చాక్లెట్లు కానీ. 286 00:33:29,259 --> 00:33:30,719 నాకు ఆశ చాక్లెట్లంటే చాలా ఇష్టం. 287 00:33:38,018 --> 00:33:40,229 అవతలి వైపు అసలైన రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. 288 00:33:40,729 --> 00:33:41,897 కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 289 00:33:43,357 --> 00:33:44,733 బాబోయ్! గోడకు పిడకలా అంటుకోండి! 290 00:33:56,203 --> 00:33:57,579 దీన్ని మర్చిపోయా. 291 00:34:00,582 --> 00:34:02,251 ఏ రైలు ఎప్పుడు వస్తుందో నాకు బాగా తెలుసు, 292 00:34:02,918 --> 00:34:05,546 కానీ పొద్దుపోయాక కొత్తగా ఒక రైలు వేశారు, దాని కొత్త టైమింగ్స్ ఇంకా తెలుసుకోలేదు. 293 00:34:06,547 --> 00:34:09,007 మీ అబ్బాయిని కనుగొనే ముందే నా వల్ల మీరు పచ్చడి పచ్చడి అయిపోతే బాగోదు కదా... 294 00:34:09,007 --> 00:34:13,011 - ఇంతకీ అతని పేరేంటి? - బ్రయాన్. నా కొడుకు పేరు బ్రయాన్. 295 00:34:14,763 --> 00:34:16,348 మీరు అతడిని బాగా మిస్ అవుతుంటారు. 296 00:34:17,766 --> 00:34:19,935 మా అమ్మ నాకోసం కూడా బాగా వెతికి ఉంటుందని, నాకేం అయ్యుంటుందా అని 297 00:34:19,935 --> 00:34:21,603 కంగారు పడి ఉంటుందని అప్పుడప్పుడూ ఊహించుకుంటా. 298 00:34:22,771 --> 00:34:23,772 పాపం. 299 00:34:24,606 --> 00:34:26,817 సరే, 181వ స్ట్రీట్ స్టేషన్ కి వచ్చాం. మీరు రావాల్సిన చోటు ఇదే. 300 00:34:28,318 --> 00:34:31,905 సరే మరి. అందరిలా మామూలుగా ప్రవర్తిద్దాం. 301 00:34:47,337 --> 00:34:49,590 ఆ తలుపు వెనుక మీ కోసం వేచి ఉంటా. 302 00:34:50,257 --> 00:34:51,717 నాకు సాయపడినందుకు థ్యాంక్యూ. 303 00:34:52,509 --> 00:34:55,137 ఇది పెద్ద విషయం కాదు. దీని కన్నా చాలా భయంకరమైన విషయాల్లో జనాలకు సాయపడ్డా, 304 00:34:56,346 --> 00:34:58,640 కానీ నేనేం ఈ పని ఊరికే చేయట్లేదు. నాకు మీరు చెల్లించాల్సిందే. 305 00:34:58,640 --> 00:35:00,184 నా దగ్గర డబ్బులు లేవు, అలాగే... 306 00:35:00,184 --> 00:35:03,937 "ద ట్రావెల్స్ ఆఫ్ పెద్రో డి సియేజా డి లియోన్, ఏడీ 1532-50, 307 00:35:03,937 --> 00:35:06,481 కంటేయిన్డ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ క్రానికల్ ఆఫ్ పెరూ." 308 00:35:08,108 --> 00:35:09,193 చరిత్ర అంటే నాకు ప్రాణం. 309 00:35:10,194 --> 00:35:12,696 - త్వరగా బయలుదేరండి. తెల్లవారేలోపే... - పని కానించేయాలి. 310 00:35:12,696 --> 00:35:14,489 కళ్లు మూసి తెరిసేలోపు సూర్యుడు వచ్చేస్తాడు మరి. 311 00:35:31,006 --> 00:35:35,344 న్యూయార్క్ నగరంలో వృక్షాల వివరాలు 312 00:35:36,053 --> 00:35:37,221 సరే. 313 00:35:41,308 --> 00:35:43,268 నార్వే మేపుల్ 314 00:35:51,985 --> 00:35:53,529 నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? 315 00:35:57,783 --> 00:36:00,285 ఇంత త్వరగా వచ్ఛేశారే. అయ్య బాబోయ్. 316 00:36:00,285 --> 00:36:01,620 {\an8}మ్యాప్ ని ప్రింట్ చేయండి 317 00:36:11,004 --> 00:36:13,674 హా. అబ్బా. 318 00:36:14,383 --> 00:36:17,052 నిజంగా చెప్తున్నా కదా, ఏం పర్వాలేదు, అమ్మా, సరేనా? నేను మళ్లీ వస్తాలే. 319 00:36:32,901 --> 00:36:34,611 చాలాసార్లు చెప్పా కదా. 320 00:36:39,950 --> 00:36:42,494 హా. ఇవాళ పుస్తకాల లెక్కింపు జరుగుతుంది. 321 00:36:42,494 --> 00:36:44,204 వాళ్లు త్వరలోనే వస్తారు. 322 00:36:44,788 --> 00:36:46,915 సరే. లవ్ యూ. బై. 323 00:37:36,089 --> 00:37:37,883 - వద్దు! కాల్చవద్దు! - అరవకు. ఆపు. 324 00:37:37,883 --> 00:37:39,343 కాల్చకు! నాకు తెలీదు! 325 00:37:47,392 --> 00:37:48,477 {\an8}యురీనా. 326 00:37:53,065 --> 00:37:54,107 ఛ! 327 00:37:56,401 --> 00:37:59,404 అపోలో, మేము సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. 328 00:37:59,404 --> 00:38:03,700 అందరూ చింతిస్తున్నారు. అందరూ చింతిస్తున్నారు! తను ఎక్కడ ఉంది? 329 00:38:03,700 --> 00:38:05,410 - మాకు తెలీదు. - మాకు తెలీదు. 330 00:38:05,410 --> 00:38:08,455 దయచేసి మమ్మల్ని వదిలేయ్. 331 00:38:10,916 --> 00:38:12,626 జనాలు అలా ఎలా మాయమైపోతారు? 332 00:38:12,626 --> 00:38:15,462 మాయమైపోతారు. తను మాయమైపోయిందిగా. 333 00:38:15,963 --> 00:38:17,422 - అపోలో, మాకు ఏమీ తెలీదు. - అపోలో. 334 00:38:20,467 --> 00:38:23,387 - బిడ్డ గురించి ఎప్పుడూ... - తను అలసిపోయిందని చెప్పవద్దు. 335 00:38:23,387 --> 00:38:24,471 తను... 336 00:38:24,471 --> 00:38:27,182 - నేను కూడా అలసిపోయా. - వద్దు, ఏమీ చేసుకోకు, అపోలో! 337 00:38:32,479 --> 00:38:34,565 ఓయ్, ఆగు! మేము పోలీసులం! 338 00:38:35,983 --> 00:38:38,068 పోలీసులం! అక్కడే ఆగు! 339 00:38:41,864 --> 00:38:42,865 మేము పోలీసులం! 340 00:38:46,285 --> 00:38:48,537 పద, పద, పద! 341 00:38:56,336 --> 00:38:59,256 - ఆగు! - ఆగు! ఆగు! 342 00:39:00,465 --> 00:39:02,134 కాస్త ఆగు! 343 00:39:03,135 --> 00:39:04,136 ఓయ్! 344 00:39:08,599 --> 00:39:10,893 వీల్స్. పద, పద! 345 00:39:13,520 --> 00:39:15,063 ఆగండి! మేము పోలీసులం! 346 00:39:24,615 --> 00:39:26,325 పుస్తకానికి థ్యాంక్స్. 347 00:39:27,326 --> 00:39:28,660 చక్కెర వేసి పాలు ఇవ్వనా? 348 00:39:29,578 --> 00:39:30,787 మీరు చాలా సేపు ఆలోచిస్తున్నారు. 349 00:39:31,538 --> 00:39:33,040 పాలు... 350 00:39:34,625 --> 00:39:35,876 చక్కెర. 351 00:39:38,337 --> 00:39:39,546 ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, ఎమ్మా? 352 00:39:41,006 --> 00:39:42,174 చీకటి పడ్డాక వెళ్తా. 353 00:39:42,674 --> 00:39:46,303 పుస్తకాలు ఇచ్చేసి, మళ్లీ వస్తా. 354 00:39:46,929 --> 00:39:48,222 నేను... 355 00:39:52,643 --> 00:39:55,812 నగరంలో ఉండే ప్రతి నార్వే మేపుల్ చెట్టు దగ్గరికి నేను వెళ్లి, తనిఖీ చేయాలి. 356 00:39:56,522 --> 00:40:00,692 - మీ దగ్గర ఇదొక్క ఆధారమే ఉందా? - హా. అదిగాక ఓ పిల్లల పుస్తకంలోని ఒక వాక్యం ఉంది. 357 00:40:02,986 --> 00:40:06,990 "చీకటి పడ్డాక స్నానం చేయిస్తారు, చాలా చక్కగా దాస్తారు. 358 00:40:07,908 --> 00:40:10,994 అడవిలో నివాసముంటూ, ఎవరికీ కనిపించకుండా ఉంటారు." 359 00:40:12,538 --> 00:40:14,081 నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. 360 00:40:15,666 --> 00:40:17,125 బాబోయ్, నార్వే మేపుల్ అట. 361 00:40:18,919 --> 00:40:20,087 అది నార్వేకి చెందిన జాతి అయ్యుంటుంది, 362 00:40:20,087 --> 00:40:24,132 - కాబట్టి అక్కడి నుండి మొదలుపెట్టండి. - సూపర్ సలహా. 363 00:40:24,132 --> 00:40:28,345 నిజంగానే చెప్తున్నా. లిటిల్ నార్వే అనే ప్రాంతం న్యూయార్కులో ఉంది. 364 00:40:29,930 --> 00:40:32,432 - ఏంటి? - చరిత్ర అంటే నాకు ప్రాణమని చెప్పా కదా. 365 00:40:33,225 --> 00:40:34,726 మీరు సరిగ్గా ఆలకించలేదు. 366 00:40:34,726 --> 00:40:40,524 క్వీన్స్ లో ఉండే ఫారెస్ట్ హిల్స్ అనే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు లిటిల్ నార్వే అని పిలిచేవాళ్లు. 367 00:40:40,524 --> 00:40:45,404 మొదటి వలసదారులు 1825లో వచ్చారు. అక్కడ అడవి కూడా ఉంది. 368 00:40:47,197 --> 00:40:49,324 "అడవిలో నివాసముంటూ, ఎవరికీ కనిపించకుండా ఉంటారు." 369 00:40:50,284 --> 00:40:51,952 వావ్! వెళ్లి అందరికీ బై చెప్పి రండి. 370 00:40:52,452 --> 00:40:54,121 మళ్లీ రేపు రాత్రి ఇక్కడ కలుసుకుంటా మిమ్మల్ని. 371 00:40:54,621 --> 00:40:55,622 సరే. 372 00:40:58,542 --> 00:41:04,339 మీ అమ్మ మీరేం అయిపోయారు అని ఆందోళన చెందలేదని, మీకోసం వెతకలేదని మీరు అనుకుంటే, 373 00:41:04,339 --> 00:41:07,676 మీకు పిచ్చి అనే అర్థం. 374 00:41:08,719 --> 00:41:11,972 మీ అమ్మ ఇంకా బతికే ఉంటే, తనని కలిసి తన బాధని దూరం చేయండి. 375 00:41:41,418 --> 00:41:44,838 వావ్. లైబ్రరీ అంటే ఇలా ఉండాలి. 376 00:41:55,724 --> 00:41:56,725 నా బిడ్డ ఆచూకీ తెలియగానే... 377 00:41:56,725 --> 00:41:58,018 మాకు సందేశం పంపండి. 378 00:42:01,980 --> 00:42:05,400 ఏదేమైనా, మిమ్మల్ని నేను చూడటం ఇదే ఆఖరి సారి అవుతుంది. 379 00:42:07,694 --> 00:42:08,695 ఆ విషయం నాకు తెలుసు. 380 00:42:32,594 --> 00:42:34,888 ఎవరి చేతనైనా దీన్ని ఇక్కడికి పంపించమని వీల్స్ కి చెప్పండి. 381 00:42:43,981 --> 00:42:47,651 కాల్, నేను చనిపోతే, నా కొడుకు ప్రాణాలతోనే ఉండి, 382 00:42:48,694 --> 00:42:50,529 ఎప్పుడైనా నా కోసం ఎలాగోలా ఇక్కడికి వస్తే. 383 00:42:52,614 --> 00:42:53,615 ఎలాగోలా వస్తే. 384 00:42:55,158 --> 00:42:56,785 ఇది వాడికి ఇవ్వండి, కాస్త ఊరట కలుగుతుంది. 385 00:42:58,954 --> 00:43:00,914 నా భర్తకి ఇదంటే పిచ్చి. 386 00:43:02,249 --> 00:43:04,793 అపోలో వాళ్ల నాన్న, అపోలోకి చిన్నప్పుడు చదివి వినిపించేవాడు. 387 00:43:06,295 --> 00:43:09,006 అతనికి... అంటే. బ్రయాన్ కి చెప్పండి... 388 00:43:11,383 --> 00:43:13,927 అపోలో కూడా దీన్ని వాడికి చదివి వినిపించాలనుకున్నాడని. 389 00:43:15,470 --> 00:43:16,471 తప్పకుండా చెప్తా. 390 00:43:18,348 --> 00:43:21,393 మీకు వాడి ఆచూకీ దొరక్కపోతే ఏం జరుగుతుంది అనేదాని గురించి ఆలోచించారా? 391 00:43:26,398 --> 00:43:27,524 వెతకడానికి ఎక్కడికి వెళ్తున్నావు? 392 00:43:31,153 --> 00:43:32,529 బ్రయాన్ అడవిలో ఉన్నాడు. 393 00:43:42,664 --> 00:43:43,707 నేను మిమ్మల్ని క్షమించలేను. 394 00:43:45,209 --> 00:43:46,543 మీరు నాకు మత్తుమందు ఇచ్చారు. 395 00:43:46,543 --> 00:43:49,296 మీ వల్ల నాకు చాలా సమయం వృథా అయిపోయింది, ఆ సమయంలో, నేను చాలా గాలించి ఉండేదాన్ని. 396 00:43:51,381 --> 00:43:55,052 మీకు విశ్రాంతి ఇచ్చాను, తద్వారా వివేకంగా ఆలోచించే వీలు మీకు కల్పించాను. 397 00:43:56,094 --> 00:43:58,263 ఏ విషయాన్ని అయినా రెండు దృక్పథాలతో చూడవచ్చు. 398 00:44:17,950 --> 00:44:18,951 గుడ్ లక్, ఎమ్మా. 399 00:44:43,183 --> 00:44:44,476 మీ అమ్మ నీ కోసం వస్తోందిరా. 400 00:45:37,654 --> 00:45:39,656 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్