1 00:00:08,258 --> 00:00:10,677 అసలు మిథిక్ క్వెస్ట్ అంటే ఏంటి? 2 00:00:11,094 --> 00:00:12,930 మిథిక్ క్వెస్ట్ 3 00:00:13,013 --> 00:00:15,390 ఇది కేవలం ఒక వీడియో గేమ్ మాత్రమేనని కొందరు అనుకోవచ్చు. 4 00:00:18,393 --> 00:00:23,106 ఎంక్యూ ని మొదట ప్రవేశపెట్టినప్పుడు, ఇదొక అద్భుతమని అందరూ కొనియాడారు. 5 00:00:23,690 --> 00:00:27,027 ఇప్పుడు దీన్ని ఆరు ఖండాలలోని ఇరవై దేశాల వారు ఆడుతున్నారు, 6 00:00:27,110 --> 00:00:32,783 మల్టీప్లేయర్ రోల్-ప్లేయింగ్ ఆటలలో అతిపెద్ద ఆట ఇదే, సింహాసన స్థానం దీనిదే. 7 00:00:32,866 --> 00:00:37,079 కానీ సంపదలు అటూ ఇటూ కాగల, అంతేగాక మహామహులే నేలరాలగల 8 00:00:37,663 --> 00:00:39,581 ఇటువంటి సున్నితమైన పరిశ్రమలో... 9 00:00:41,041 --> 00:00:42,793 వారు సంధర్బోచితంగా ఉండి తీరాలి. 10 00:00:43,293 --> 00:00:46,839 మరి ఈనాడు, ప్రారంభమైన నాటి తర్వాతి నుండి 11 00:00:46,922 --> 00:00:49,967 అత్యంత కీలక ఘట్టానికి వారు చేరుకున్నారు. 12 00:00:50,592 --> 00:00:56,056 వారి తొలి భారీ విస్తరింపు అయిన మిథిక్ క్వెస్ట్: రేవన్స్ బ్యాంక్వెట్. 13 00:00:57,349 --> 00:01:00,853 ఇక దీని బాధ్యత అంతా ఒక వ్యక్తి మీదనే ఉంది. 14 00:01:00,936 --> 00:01:03,438 క్రియేటివ్ డైరెక్టర్, ఐయాన్ గ్రిమ్. 15 00:01:03,522 --> 00:01:07,025 నేను మొదట ఎంక్యూని ఆవిష్కరించినప్పుడు, ఏదో ఓ ఆటను మాత్రమే నిర్మించాలని నేననుకోలేదు. 16 00:01:07,109 --> 00:01:08,527 ఐయాన్ గ్రిమ్ క్రియేటివ్ డైరెక్టర్ 17 00:01:09,152 --> 00:01:10,737 నా లక్ష్యం ఓ ప్రపంచాన్నే నిర్మించడం. 18 00:01:10,821 --> 00:01:14,533 మరి ఆ ప్రపంచంలోకి ఈ రేవన్స్ బ్యాంక్వెట్ మరొక అడుగు. 19 00:01:14,616 --> 00:01:17,119 దీన్ని ఒక్కడే చేయలేడనుకోండి. 20 00:01:17,578 --> 00:01:21,206 ఇటువంటి ప్రపంచాన్ని నిర్విరామంగా నడపడానికి వేల మంది యొక్క తోడ్పాటు అవసరమవుతుంది. 21 00:01:21,832 --> 00:01:25,169 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డేవిడ్ బ్రిటిల్స్బీ... 22 00:01:26,170 --> 00:01:27,921 లీడ్ ఇంజనీర్ పాపి లీ లాంటివారు. 23 00:01:29,047 --> 00:01:32,426 హెడ్ ఆఫ్ మోనిటైజేషన్ అయిన బ్రాడ్ భక్షీ లాంటి వారు. 24 00:01:32,926 --> 00:01:36,263 ఎంక్యూ కి మాత్రమే సొంతమైనది, మరే ఇతర ఆటలు బడాయికి పోలేనిది ఏంటంటే 25 00:01:36,346 --> 00:01:40,100 ఒక నెబ్యులా అవార్డును సొంతం చేసుకున్న రచయిత అయిన సీ.డబ్ల్యూ. లాంగ్బాటమ్. 26 00:01:40,184 --> 00:01:41,185 హెడ్ రైటర్ 27 00:01:41,268 --> 00:01:42,311 సదా మీ సేవలో. 28 00:01:42,394 --> 00:01:46,899 కానీ ఇదంతా చివరికి ఆట సృష్టికర్త యొక్క కల్పన గుండా పోవలసిందే. 29 00:01:47,399 --> 00:01:48,859 అతని కల్పనలు మరి భారీగానే ఉంటాయి. 30 00:01:48,942 --> 00:01:51,361 మనం సాంస్కృతికపరమైన తరాల వారథుల గురించి ఆలోచిస్తే, 31 00:01:51,904 --> 00:01:55,073 మనకి ఈటీ, స్టార్ వార్స్, అవతార్ గుర్తుకువస్తాయి, 32 00:01:55,490 --> 00:01:59,995 అయినా మన పరిశ్రమ ముందు సాంప్రదాయబద్ద వినోద పరిశ్రమ దిగదుడుపే. 33 00:02:00,078 --> 00:02:02,289 అందుకని మనం గొప్పవాటి గురించి ఆలోచించేటప్పుడు... 34 00:02:03,290 --> 00:02:05,959 మిథిక్ క్వెస్ట్ గురించి ఎందుకు ఆలోచించకూడదు? 35 00:02:06,043 --> 00:02:07,252 ఇది నిజమే. 36 00:02:07,336 --> 00:02:10,672 మనం ఒక కల్పనాశక్తిగల, లోక నిర్మాణ చాతుర్యం గల కళాకారుల గురించి ఆలోచించినప్పుడు, 37 00:02:10,756 --> 00:02:14,551 కేవలం స్పీల్బర్గ్, లూకస్ మరియు కేమరన్ ల గురించే కాకుండా, 38 00:02:14,635 --> 00:02:16,553 గ్రిమ్ గురించి... 39 00:02:18,180 --> 00:02:19,348 ఎందుకు ఆలోచించకూడదు? 40 00:02:20,015 --> 00:02:23,018 గ్రిమ్ 41 00:02:23,101 --> 00:02:25,771 మన్నించు, నేను ఆపాలి. ఏంటిది? 42 00:02:26,730 --> 00:02:29,358 -ఇది ఆటకి వాణిజ్య కార్యక్రమం. -ఇది నీకు వాణిజ్య కార్యక్రమం. 43 00:02:29,441 --> 00:02:30,442 ఇంకా కొనసాగుతూనే ఉంది. 44 00:02:35,072 --> 00:02:37,908 దేవుడా. 45 00:02:39,243 --> 00:02:41,453 నా దృష్టిలో ఇది అద్భుతంగా ఉంది. 46 00:02:46,333 --> 00:02:50,587 మిథిక్ క్వెస్ట్ 47 00:02:50,671 --> 00:02:54,967 మిథిక్ క్వెస్ట్: రేవన్స్ బ్యాంక్వెట్ 48 00:02:57,177 --> 00:03:01,932 ఒక కొత్త ఖండం, ఆడటానికి వీలుగా వేలకొలది వస్తువులు, 49 00:03:02,015 --> 00:03:06,144 వీటన్నింటినీ ఎంఎంవోల చరిత్రలోనే ఒక అత్యంత పటిష్టమైన కోడ్ బేస్ మీద నిర్మించారు. 50 00:03:06,228 --> 00:03:08,438 ఇక్కడ నేనేమీ గొప్పలకు పోవడం లేదు, 51 00:03:08,522 --> 00:03:12,317 కానీ నేనూ, నా బృందం కలిసి ఒక అద్భుతమైనదాన్ని ఆవిష్కరించాం, అందుకని... 52 00:03:13,652 --> 00:03:15,612 రేవన్స్ బ్యాంక్వెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది! 53 00:03:15,696 --> 00:03:18,532 -బాగుంది! అద్భుతం. -ధన్యవాదాలు. 54 00:03:18,615 --> 00:03:22,828 అదరగొట్టేశావు, పాపి. ఈ విస్తరింపు వాళ్ళని మైమరిపించేస్తుంది. 55 00:03:22,911 --> 00:03:25,747 కానీ పని అయిపోయిందని నీకు ఖచ్చితంగా అనిపిస్తుందా? 56 00:03:25,831 --> 00:03:28,250 అయిపోయిందనుకుంటాను. రెండేళ్ళ నుండీ దీని మీద పని చేస్తున్నాం. అద్భుతంగా వచ్చింది. 57 00:03:28,333 --> 00:03:31,920 లేదు. చూస్తూంటే దాదాపుగా అయిపోనట్టే ఉంది, దాదాపు అద్భుతంగా ఉంది. 58 00:03:32,004 --> 00:03:33,505 -అది నీకెక్కడిది? -నాకు నాది ఉంది. 59 00:03:33,589 --> 00:03:35,757 "దాదాపు అద్భుతంగా ఉంది," అనేది ఎవరికీ గుర్తుండదు కదా? 60 00:03:35,841 --> 00:03:37,926 అది... ఇలా ఉంటుంది. 61 00:03:38,010 --> 00:03:39,469 సరే, ఏంటిది, పాప్? 62 00:03:39,970 --> 00:03:40,971 అదొక పార. 63 00:03:42,014 --> 00:03:44,641 అది నా కోసం నేను తయారు చేసుకున్న ఒక ఎంటీఎక్స్ వస్తువులే. 64 00:03:44,725 --> 00:03:46,435 ఈ ఆటంతా నీ కల్పన మీద ఆధారమైనదే. నేననుకున్నాను... 65 00:03:46,518 --> 00:03:48,395 నిజమే, కానీ దీనిలో ఏదో తేడాగా ఉంది. 66 00:03:48,478 --> 00:03:50,439 కదా? పూర్తిగా ఇది... 67 00:03:51,940 --> 00:03:53,150 అద్భుతంగా లేదు. 68 00:03:53,609 --> 00:03:55,569 "అద్భుతమా"? "అద్భుతం." 69 00:03:55,652 --> 00:03:57,821 లేదు, కానీ ఇది అద్భుతంగానే ఉంది, 70 00:03:57,905 --> 00:04:00,949 ఎందుకంటే ఇది ఆటలో ఒక కొత్త యాంత్రిక పని అయిన తవ్వకానికి పనికి వస్తుంది కనుక. 71 00:04:01,575 --> 00:04:04,953 ఇప్పుడు ఆటగాళ్ళు తమ ఆట యొక్క చిత్రపటాన్నే మార్చేయగలరు. 72 00:04:06,371 --> 00:04:08,707 -పాప్, దాన్ని ఎవరూ కొనరు. -నేను ఒకటి చెప్పవచ్చా? 73 00:04:08,790 --> 00:04:11,502 ఈ పారకి ఒక కథ ఉండాలేమో. 74 00:04:11,919 --> 00:04:14,671 ఈ మర్మమైన భూలోక-పరికరాన్ని ఎవరు తయారుచేశారు? 75 00:04:15,255 --> 00:04:16,589 స్వయాన దేవతలేనా? 76 00:04:16,673 --> 00:04:21,470 పసిబిడ్డలు తమ తల్లి చనుమొన నుండి పాలు తాగినట్టు వారు హేరా వక్షముల నుండి తాగారా? 77 00:04:22,137 --> 00:04:24,640 -అది చాలా బాగుంది. -చనుమొనలు అయితే అమ్మగలను. అదే కానిద్దాం. 78 00:04:24,723 --> 00:04:27,100 వద్దు. చనుమొనల ప్రస్తావన వద్దు. 79 00:04:27,768 --> 00:04:30,270 అకౌంటింగ్ విభాగం మూడవ అంతస్థులో ఉంటుంది, మార్కెటింగ్ ది రెండవ అంతస్థు, 80 00:04:30,354 --> 00:04:32,105 టెక్ సపోర్ట్ ఆరవ అంతస్థులో ఉంటుంది, 81 00:04:32,189 --> 00:04:35,400 కానీ ఇక్కడ... ఆట ఆవిష్కరణ జరిగేది ఇక్కడే. 82 00:04:35,817 --> 00:04:39,530 డెవలప్మెంట్ బృందం యొక్క నాయకులు అందరూ ఇక్కడ ఉంటారు, నేనంతా పర్యవేక్షిస్తుంటాను. 83 00:04:39,613 --> 00:04:41,615 వావ్. అది మీ కార్యాలయమా? 84 00:04:42,616 --> 00:04:45,536 కాదు, అది కాదు. అది ఐయాన్ ది. అతను క్రియేటివ్ డైరెక్టర్. 85 00:04:45,619 --> 00:04:47,704 మరి అదెందుకు అందరి కార్యాలయాల కన్నా ఎత్తులో ఉంది? 86 00:04:47,788 --> 00:04:50,499 లేదు, అదంత ఎత్తులో ఏమీ లేదు. అది నిర్మాణ లోపం, అంతే. 87 00:04:50,582 --> 00:04:53,919 అందరికన్నా ఎక్కువ అధికారమున్న వ్యక్తికి అతిపెద్ద కార్యాలయం ఉండాలనేమీ లేదు, జో. 88 00:04:54,002 --> 00:04:56,505 నిజానికి, ఈ సంస్థలో అందరికన్నా ఎక్కువ అధికారమున్న వ్యక్తిని నేను కూడా కాదు. 89 00:04:56,588 --> 00:04:59,508 ఈ మొత్తం స్టూడియో యొక్క యాజమాన్య హక్కు మోంట్రియల్ లోని ఒక మాతృ సంస్థకి ఉంది. 90 00:04:59,591 --> 00:05:00,592 ఓ విషయం చెప్పనా? 91 00:05:00,676 --> 00:05:03,804 కొద్ది సేపట్లో జరగబోయే సిబ్బంది సమావేశంలో నువ్వు వీటన్నింటి గురించి తెలుసుకుంటావు. 92 00:05:03,887 --> 00:05:05,597 ఎలాగూ మాటల్లో వచ్చింది కనుక, నా అసిస్టెంట్ గా, 93 00:05:05,681 --> 00:05:07,683 నువ్వు నోట్స్ ను విస్తారంగా తీసుకోవలసి వస్తుంది, ఎందుకంటే, 94 00:05:07,766 --> 00:05:09,726 సిబ్బంది సమావేశానికి 95 00:05:09,810 --> 00:05:13,397 ఈ కార్యాలయం పనిచేయడంలో ఒక విడదీయలేని భాగం ఉంటుంది, ఇంకా దీనింతటికీ నేనే నాయకుడిని. 96 00:05:13,480 --> 00:05:15,399 మీరు మాట్లాడుతున్నది ఆ సమావేశం గురించేనా? 97 00:05:16,650 --> 00:05:19,444 లేదు. లేదు, అది అయ్యుండదు, ఎందుకంటే, నేను లేకుండా వారు సమావేశమవ్వరు. 98 00:05:19,528 --> 00:05:21,405 వాళ్ళు నేను లేకుండా ఎందుకు సమావేశమయ్యారు? 99 00:05:23,490 --> 00:05:27,578 ఇది నా వస్తువు. నా ఒక్కగానొక్క వస్తువు. వెళ్లిపోవద్దు. సమావేశం ఇంకా ముగియలేదు. 100 00:05:27,661 --> 00:05:30,080 హేయ్, మిత్రులారా? మీరిక్కడ సిబ్బంది సమావేశంలో ఉన్నారా? 101 00:05:30,163 --> 00:05:32,291 లేదు, నిజానికి, అది ఇప్పుడే అయిపోయింది. 102 00:05:33,000 --> 00:05:34,126 ఈమె ఎవరు? 103 00:05:34,209 --> 00:05:36,378 ఈమె జో. తను నా కొత్త అసిస్ట్ంట్. జో, ఇదే బృందం. 104 00:05:36,461 --> 00:05:37,588 హాయ్. 105 00:05:38,380 --> 00:05:40,591 హలో. సరే, ఇక అదే అయితే... 106 00:05:40,674 --> 00:05:44,094 ఐయాన్ నా పారని మార్చాలని అనుకుంటున్నాడు, దానితో ప్రవేశపెట్టడం ఆలస్యమవుతుంది. 107 00:05:44,178 --> 00:05:47,222 "ప్రవేశపెట్టడం ఆలస్యమౌతుందా"? లేదు, ఐయాన్, అనుకున్న సమయానికి, మొత్తానికి, గుర్తుందా? 108 00:05:47,306 --> 00:05:50,142 పాపి, నీకు అమితంగా నచ్చిన తొలి ఆట పేరేంటి? 109 00:05:50,225 --> 00:05:51,602 -కోంట్రా. -కొత్త అమ్మాయి, నువ్వు చెప్పు. 110 00:05:51,685 --> 00:05:53,228 -గ్రాండ్ థెప్ట్ ఆటో. -బాగా హింసాత్మకమైంది. నాకది నచ్చింది. 111 00:05:53,312 --> 00:05:54,313 డేవిడ్? 112 00:05:54,396 --> 00:05:56,565 నాకు మిస్ పాక్-మ్యాన్ అంటే ఎప్పుడూ ఇష్టమే, కానీ దానికీ దీనికీ సంబంధమేంటో... 113 00:05:56,648 --> 00:06:00,652 వాటిలో నచ్చే అంశాలు ఉంటాయి కనుక ప్రతీ ఒక్కరికి తమకి బాగా నచ్చే ఆట ఒకటుంటుంది. 114 00:06:01,069 --> 00:06:03,280 ఆ ఆటలు ఎవరోకరి అస్తిత్వానికి రూపాలు. 115 00:06:03,363 --> 00:06:05,115 ఈ ఆట నా అస్తిత్వానికి రూపం. 116 00:06:05,199 --> 00:06:06,742 -మన అసిత్వం. -మన అస్తిత్వం. ఏదోకటిలే. 117 00:06:06,825 --> 00:06:07,910 నా అస్తిత్వం మాత్రం కాదు. 118 00:06:07,993 --> 00:06:10,078 మార్పులూ చేర్పులూ ఆపడానికి తుది గడువుకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కదా? 119 00:06:10,162 --> 00:06:12,539 కాబట్టి నన్ను సవరణ చేయనివ్వు. ఈ ఒక్క విషయంలో నాకు కాస్త సవరించే అవకాశమివ్వు. 120 00:06:12,623 --> 00:06:14,625 -నన్ను సవరణ చేయనివ్వు చాలు. సవరించనివ్వు. -అదిగో మళ్లీ ఆ పదం వాడేశావు. 121 00:06:14,708 --> 00:06:17,544 నువ్వు "సవరణ" పదాన్ని వాడావు. నువ్వు ఆ పదం పలికితే నాకు కంగారు వచ్చేస్తుంది. 122 00:06:17,628 --> 00:06:21,965 డేవిడ్, విస్తరింపు గడువును పొడగించమని నిన్ను అడగనని మాట ఇస్తున్నాను. 123 00:06:25,135 --> 00:06:27,638 నాకు ఈమె నచ్చింది. తను బాగా చేస్తుంది. సమావేశం ముగిసినట్టేనా? 124 00:06:27,721 --> 00:06:29,431 -సమావేశం ముగిసింది. అవును. -మంచిది. 125 00:06:39,274 --> 00:06:40,359 "నేను" వీటిని చూశానా? 126 00:06:40,442 --> 00:06:42,945 దేవుడా, మనం లేకుండా మరో సమావేశంలో పాల్గొంటున్నారా? పరమ దరిద్రం. 127 00:06:43,028 --> 00:06:45,948 వాళ్ళు మన అభిప్రాయాలని ఎందుకు తీసుకోరు? ఎంతైనా మనం రోజంతా ఈ ఆటను ఆడుతూనే ఉంటాం. 128 00:06:46,365 --> 00:06:47,741 తెలుసు, ఇది చాలా బాగుంది కదా? 129 00:06:48,283 --> 00:06:50,285 అవును, బాగుంది, కానీ 130 00:06:50,369 --> 00:06:52,955 రోజంతా ఆటలో లోపాలను నివేదించడంలోనే కాకుండా మనం ఇంకా చాలా చేయగలం కదా? 131 00:06:53,372 --> 00:06:56,166 కమాన్, రేచల్. మనం ఇక్కడ సుమారు ఒక ఆరు నెలల నుండే కదా పనిచేస్తున్నాం. 132 00:06:56,250 --> 00:06:59,169 అవును, కానీ, నా ఉద్దేశం, నీలో అద్భుతమైన ఆలోచనలు చాలా ఉన్నాయి. 133 00:06:59,253 --> 00:07:01,338 -వాళ్ళు వాటిని వింటే బాగుంటుంది. -నాలో ఉన్నాయంటావా? 134 00:07:01,421 --> 00:07:03,006 అవును. మొన్న నీకు ఓ ఆలోచన వచ్చింది. 135 00:07:03,090 --> 00:07:05,884 అదే, కొండ రాక్షసుడి దెబ్బ పరిధిని పెంచాలనే దాని గురించి. 136 00:07:08,804 --> 00:07:10,514 నీ జ్ఞాపక శక్తి అమోఘం. 137 00:07:10,931 --> 00:07:12,266 ధన్యవాదాలు. 138 00:07:12,349 --> 00:07:14,017 నీ ఆలోచనలు చాలా బాగుంటాయి. నువ్వు కూడా. 139 00:07:14,101 --> 00:07:15,602 ఇప్పుడు తాగవలసిన సమయం. 140 00:07:19,147 --> 00:07:21,191 నువ్వు నీ పనిని ప్రారంభించాలి, ఎందుకంటే, 141 00:07:21,275 --> 00:07:22,568 వాళ్ళు మన పనిని గమనిస్తూ ఉంటారు. 142 00:07:22,651 --> 00:07:24,903 సరే, తప్పకుండా. అవును, అది మంచి ఆలోచన. 143 00:07:25,571 --> 00:07:28,907 ఇదెలా ఉందే, తింగరి దానా. 144 00:07:29,533 --> 00:07:31,702 ఈ ఉద్యోగం నాకు అన్నింటికన్నా భలే నచ్చింది. 145 00:07:32,744 --> 00:07:33,745 అవును. 146 00:07:40,252 --> 00:07:43,881 బ్రాడ్, నాకు నీ సాయం కావాలి. ఈ పార సమాచారం పాలిగన్ కి సైగ్గా చేరవేద్దామనుకుంటున్నా. 147 00:07:43,964 --> 00:07:46,008 ఆ తర్వాత విమర్శుకలకి అది నచ్చాక, వాళ్ళకి నచ్చితీరుతుందనుకో, 148 00:07:46,091 --> 00:07:48,760 వాళ్ళు దాని గురించి రాస్తారు, అప్పుడు ఐయాన్ దాన్ని మార్చలేడు. 149 00:07:49,553 --> 00:07:51,305 చాలా కపటపూరిత ఆలోచన. నాకు నచ్చింది. 150 00:07:51,388 --> 00:07:54,099 అంటే, నాకు ముందుచూపు కాస్త ఎక్కువలే. 151 00:07:54,183 --> 00:07:56,185 "కాస్త ఎక్కువ"నా? హేయ్, అది బాగా ఎక్కువలా ఉంది. 152 00:07:56,268 --> 00:07:58,187 -అవును, నీకు కాస్తంత చూపిస్తా... -దగ్గరికి రాకు. 153 00:07:58,270 --> 00:08:01,273 మన్నించు. పార యొక్క హాప్టిక్ ఫీడ్బ్యాక్ ని కాస్త సవరిస్తాను, దానితో నొక్కగానే... 154 00:08:01,356 --> 00:08:04,484 నాకు అదంతా అనవసరం. నేను నీ పథకంలో భాగమవుతున్నాను, సరేనా? 155 00:08:04,943 --> 00:08:08,614 విమర్శకులని పక్కన పెట్టేయ్. నీ పార జనాల మెప్పు పొందాలంటే, 156 00:08:09,239 --> 00:08:11,158 నువ్వు ఒకేఒక వ్యక్తికి నివేదించవలసిన అవసరముంది. 157 00:08:13,285 --> 00:08:14,286 అవును. 158 00:08:14,369 --> 00:08:15,370 వద్దు... 159 00:08:17,998 --> 00:08:19,833 పూటీ షూ? -పూటీ షూ. 160 00:08:19,917 --> 00:08:22,377 -పూటీ, పూటీ, పూటీ... షూ. -షూ. 161 00:08:23,629 --> 00:08:24,630 అరివీరశూర అవతారం 162 00:08:24,713 --> 00:08:26,298 హేయ్, మిత్రులారా! నేను పూటీ షూని. 163 00:08:26,381 --> 00:08:29,885 నా పూటీ పాపలకి, నా పూటీ బాబులకి, ఇంకా తప్పనిసరిగా నా ఎల్.జి.బి.టి.క్యు 164 00:08:29,968 --> 00:08:32,596 పూటీ మాడాలందరికీ నమస్కారాలు తెలియజేద్దామనుకుంటున్నాను. 165 00:08:32,679 --> 00:08:35,765 -నాకు పూటీ షూ అంటే పరమ అసహ్యం. -అవును, వాడో అష్ట దరిద్రుడు. 166 00:08:36,558 --> 00:08:38,558 కానీ ఒక కోటి అనుచరులున్న అష్ట దరిద్రుడు వాడు, 167 00:08:38,644 --> 00:08:40,645 కాబట్టి వాడికి నీ పార నచ్చితే, నీకే ఇబ్బంది ఉండకపోవచ్చు. 168 00:08:41,230 --> 00:08:44,149 అవునవును, కానీ వాడి వయసు 14 ఏళ్ళే. 169 00:08:44,232 --> 00:08:46,527 కానీ, నిజంగా వాడికి ఈ సూక్ష్మభేదాలు అర్థమవుతాయి అంటావా? 170 00:08:46,610 --> 00:08:48,946 ఈ రోజుల్లో పద్నాలుగేళ్ళవాళ్ళ తెలివి నీ ఊహలకి కూడా అందదు. 171 00:08:49,029 --> 00:08:51,323 -నీ పార అద్భుతమైనది కదా? -అవును, నిస్సందేహంగా. 172 00:08:51,406 --> 00:08:53,784 -అయితే పూటీయే దీనికి సరైనవాడు. -నువ్వు నీ రికార్డింగ్ ని పూర్తిచేయగలవా? 173 00:08:53,867 --> 00:08:55,744 మామ్, ఏం చేస్తున్నావు? నేను ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నాను, మామ్. 174 00:08:55,827 --> 00:08:58,080 సరే, దానికి కాస్త నిలపగలవా లేక... 175 00:08:58,163 --> 00:09:02,084 లేదు, నేను నిలపలేను. ఇప్పుడు ఇది ఒక కోటి మంది జనాల ముందు ఉంది. 176 00:09:02,167 --> 00:09:03,627 -అలాగే మరి. -బయటకు వెళ్లు! వెళ్లిపో! 177 00:09:03,710 --> 00:09:04,753 -పిల్లాడా. -బయటకు వెళ్లు! 178 00:09:04,837 --> 00:09:07,506 నీ మిత్రులందరి ముందు నువ్వో ముఖ్యమైనవాడిలా ప్రవర్తించాలనుకుంటున్నావు. అర్థమైంది. సరే. 179 00:09:07,589 --> 00:09:11,218 హాయ్, ఆ విషయంలో మన్నించండి. అదస్సలు మంచి విషయం కాదు. 180 00:09:11,301 --> 00:09:14,179 మా మామ్ అప్పుడప్పుడూ విసిగిస్తూ ఉంటుంది, 181 00:09:14,263 --> 00:09:18,976 కానీ మొత్తానికి, తను ఓ గొప్ప ఉద్యోగి, అలాగే ఓ గొప్ప మామ్ కూడా. 182 00:09:24,481 --> 00:09:28,986 తవ్వు, తవ్వు, తవ్వు. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకర్థమైందా? 183 00:09:29,069 --> 00:09:33,407 పార కాస్త నిరుత్సాహకరంగా ఉంది, కానీ ఇక్కడ మనం మరొక అంశాన్ని పరిగణించాలి. 184 00:09:35,784 --> 00:09:37,327 దీని గురించి నీ అభిప్రాయమేంటి... 185 00:09:39,288 --> 00:09:41,123 అందులో ఏదో లోపముంది కదా, డేవిడ్? 186 00:09:41,206 --> 00:09:44,585 నాకు మరికొన్ని దాడి భంగిమలని కూడా ప్రయత్నించి చూడాలనుంది. 187 00:09:44,668 --> 00:09:46,628 అలాగే. సరే, అది చాలా బాగుంది. 188 00:09:46,712 --> 00:09:48,672 నాకిదంతా చాలా బాగా నచ్చింది. 189 00:09:48,755 --> 00:09:50,465 నువ్వు సవరణలు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. 190 00:09:51,091 --> 00:09:53,051 ముఖ్యమైన విషయం. నాకు సమయం గురించి కంగారుగా ఉంది. 191 00:09:53,135 --> 00:09:54,469 డేవిడ్, నేను వీలైనంత వేగంగా కదులుతున్నాను. 192 00:09:54,553 --> 00:09:56,847 ఈ పుచ్చకాయలు, అసలైన తలల లాగా పేలకపోవడం నా తప్పు కాదు. 193 00:09:56,930 --> 00:09:58,557 నీకు అసలైన తలలని నేను తెచ్చివ్వగలను. 194 00:09:59,558 --> 00:10:00,684 మానవ తలలు కాదు. 195 00:10:02,186 --> 00:10:04,438 -అదీ నిబద్ధత అంటే. -జో, దయచేసి అతనికి తలలు తెచ్చివ్వకు. 196 00:10:04,521 --> 00:10:07,524 మానవులవి అయినా, కాకపోయినా. అసలు నువ్విక్కడ ఏం చేస్తున్నావు? 197 00:10:07,608 --> 00:10:10,277 -ఐయాన్ కి సాయం అందిస్తున్నాను. -నువ్వు నా అసిస్టెంట్ వి. నాకు సాయమందించు. 198 00:10:10,360 --> 00:10:12,070 -డేవిడ్, ఏం జరుగుతోంది? -అస్సలు నమ్మలేకపోతున్నాను. 199 00:10:12,154 --> 00:10:13,238 ఏం జరుగుతోంది? 200 00:10:13,322 --> 00:10:15,991 నా అసిస్టెంట్ మొత్తం బృందం ముందు నన్ను నపుంసకుడిని చేస్తోంది, 201 00:10:16,074 --> 00:10:18,285 -అదే జరుగుతోంది. -అది కాదు, నా ఉద్దేశం... ఒకటి చెప్పనా? 202 00:10:19,203 --> 00:10:20,454 -ఐయాన్. -హేయ్, పాపి! 203 00:10:20,537 --> 00:10:21,872 -ఏం చేస్తున్నావు? -శుభవార్త. 204 00:10:21,955 --> 00:10:25,417 పారని నేను ఒక ఆయుధంగా మలిచాను, ఇక దీని ద్వారా ఇప్పుడు రెండు ప్రయోజనాలున్నాయి. 205 00:10:25,501 --> 00:10:27,920 దీన్ని జనాలు ఖచ్చితంగా కొంటారు. చూడు. 206 00:10:30,047 --> 00:10:32,174 ఇది పూర్తిగా సరిగ్గా రాలేదు కానీ, దాదాపుగా ఇంతే. 207 00:10:32,257 --> 00:10:35,219 కాకపోతే, ఖచ్చితంగా తెలియడం లేదు... ఒకవేళ అది ఇలా ఉండాలా... 208 00:10:35,302 --> 00:10:36,720 లేక పైకి తెగ్గొడుతున్నట్టు ఉండాలేమో? 209 00:10:36,803 --> 00:10:40,766 ఆ, వద్దులే, పారతో జనాలని చంపడం నాకిష్టం లేదు. అది తవ్వకానికే పరిమితం కావాలి. 210 00:10:40,849 --> 00:10:43,810 "తవ్వకమా"? ఇటువంటి వస్తువుకు ఎంత టీటీపీ రావచ్చో నీకు అసలు తెలుసా? 211 00:10:43,894 --> 00:10:47,105 -ఆ, ఎంత రావచ్చు అంటే... -"టీటీపీ," అంటే "టైమ్ టు పెనిస్." 212 00:10:47,189 --> 00:10:51,568 ఒక కొత్త వస్తువు ద్వారా ఒక పురుషాంగాన్ని చేయడానికి ఓ ఆటగాడికి పట్టే సమయం అనమాట. 213 00:10:51,985 --> 00:10:53,237 అవును, నాకు తెలుసు టీటీపీ అంటే ఏంటో. 214 00:10:53,320 --> 00:10:54,613 డేవిడ్, వివరంగా చెప్పవలసిన పని లేదు, తనకి తెలుసు. 215 00:10:54,696 --> 00:10:56,865 అది పురుషాంగాలు చేయడానికి కాదు, ఐయాన్. 216 00:10:56,949 --> 00:10:58,909 నువ్వు జనాలకి పారని ఇస్తే, వాళ్ళు పురుషాంగాలనే తవ్వుతారు. 217 00:10:58,992 --> 00:11:00,661 నువ్వు వాళ్ళకి కలం ఇస్తే, దానితో వాళ్ళు పురుషాంగాలని గీస్తారు. 218 00:11:00,744 --> 00:11:02,162 నువ్వు వాళ్ళకి కాస్త బంకమట్టిని ఇస్తే... 219 00:11:02,246 --> 00:11:03,872 ఖచ్చితంగా పురుషాంగాలుగా మలుస్తారు. 220 00:11:04,373 --> 00:11:07,417 ఐయాన్, బూత్ లోకి వెళ్ళమని నా అసిస్టెంట్ కి దయచేసి చెప్తావా? 221 00:11:07,501 --> 00:11:10,504 మహిళలకి నేనేం చేయాలో చెప్పను. వాళ్ళకి నచ్చినవి వాళ్ళని చేసుకోనిస్తాను. 222 00:11:10,587 --> 00:11:12,089 -ధన్యవాదాలు. -ఫర్వాలేదులే. 223 00:11:12,172 --> 00:11:13,966 ఐయాన్, వాళ్ళు వాటిని పురుషాంగాలుగా మార్చకూడదు. 224 00:11:14,049 --> 00:11:16,051 వాళ్ళకి ఆ అవకాశమివ్వకుండా, నేను దానికి కొన్ని పరిమితులని విధిస్తాను. 225 00:11:16,134 --> 00:11:17,928 నియమాలు గల పార. ఇది మహబాగా ఉందే. 226 00:11:18,011 --> 00:11:21,223 అవును, ఆటలో ఎన్ని నియమాలు పెట్టగలిగితే అన్ని నియమాలు పెట్టండి. చాలా బాగుంటుంది. 227 00:11:21,306 --> 00:11:23,517 దాన్నో ఆయుధంగా మార్చవద్దని అతనికి కాస్త చెప్తావా? 228 00:11:23,600 --> 00:11:25,853 -డేవిడ్, డేవిడ్, డేవిడ్. -వాళ్ళకి ఇది చేయమని నేనేమీ చెప్పలేను. 229 00:11:25,936 --> 00:11:27,145 పాపి. 230 00:11:29,857 --> 00:11:30,941 మనమందరం ఇక్కడ ఎందుకు ఉన్నాం? 231 00:11:31,024 --> 00:11:32,401 భగవంతుడా, ప్రసంగం మొదలుపెట్టేలా ఉన్నాడే. 232 00:11:32,484 --> 00:11:35,988 నువ్వు తిరస్కరించేది కేవలం మాలో పుట్టుకొచ్చే కొత్త ఆలోచనలని మాత్రమే కాదు. 233 00:11:36,071 --> 00:11:40,367 ఆ ఎనిమిదేళ్ళ పిల్లాడిని కూడా తిరస్కరిస్తున్నావు. ఇంకా నాకనిపిస్తోంది... 234 00:11:40,450 --> 00:11:43,078 తను నన్ను జినోమ్ గా మార్చేసింది కదా? మళ్లీ నన్ను యోధుడిలా మార్చు. 235 00:11:43,161 --> 00:11:44,580 -డేవిడ్, వద్దు. -డేవిడ్, నన్ను మార్చు. 236 00:11:44,663 --> 00:11:46,707 -డేవిడ్, వద్దు. -డేవిడ్, నన్ను మార్చేయ్. 237 00:11:46,790 --> 00:11:47,791 -వద్దు. -డేవిడ్. 238 00:11:47,875 --> 00:11:48,959 -డేవిడ్. -నన్ను మార్చు, డేవిడ్. 239 00:11:49,042 --> 00:11:51,628 -డేవిడ్. డేవిడ్! డేవిడ్, వద్దు. -దయచేసి నన్ను మార్చు, డేవిడ్! 240 00:11:51,712 --> 00:11:53,755 నాకు మళ్లీ నా తల్లిదండ్రుల విడాకుల పర్వంలో ఇరుక్కున్నట్టుగా ఉంది. 241 00:11:53,839 --> 00:11:54,840 బలవంతాన ఒకరి పక్షాన ఉండాల్సి వచ్చింది. 242 00:11:54,923 --> 00:11:58,051 నువ్వేమంటావో నాకు తెలుసు. ఎవరోకరి పక్షాన నిలవడమనేది నా ఉద్యోగ విధి. నేనే బాస్ ని. 243 00:11:58,135 --> 00:12:01,972 కానీ ఈ సృజనాత్మకత ఉన్న వారంతా ఇంతే, నేను బాస్ ని కాదనట్టు ప్రవర్తిస్తుంటారు. 244 00:12:02,055 --> 00:12:04,600 అది బహుశా నాలో సృజనాత్మకత కానీ, ప్రతిభ కానీ లేదని మా అమ్మ నాకు చెప్పినందుకేమో, 245 00:12:04,683 --> 00:12:06,727 ఇంకా నాన్న తనతో విబేధించలేనంతగా త్రాగిన మత్తులో ఉన్నాడు కనుక ఏమో. 246 00:12:06,810 --> 00:12:10,272 దేవుడా, నాకేం చేయాలో అర్థంకావడం లేదు. 247 00:12:10,355 --> 00:12:12,524 దయచేసి నేనేం చేయాలో చెప్తావా, కేరొల్? 248 00:12:12,983 --> 00:12:15,819 నాకు తెలీదు, డేవిడ్. ఎందుకంటే నేను వైద్యురాలిని కాదు. 249 00:12:16,236 --> 00:12:18,405 ఇది మానవ వనరుల విభాగం. 250 00:12:18,947 --> 00:12:20,782 అవునవును. 251 00:12:22,159 --> 00:12:23,702 కానీ నువ్వు నాకు సహాయపడగలవేమో? 252 00:12:26,330 --> 00:12:29,875 సరే, సరే. మరి నీ నిర్వహణా పద్దతి ఎలా ఉంటుంది? 253 00:12:29,958 --> 00:12:36,089 అంటే... ఒక ఆర్కెస్ట్రా బృందంలో నేను ఒక కండక్టర్ లాంటివాడినని చెప్పవచ్చు. 254 00:12:36,173 --> 00:12:39,801 నాకు వాయిద్యం ఎలా వాయించాలో తెలీదు, సంగీతమూ అర్థం కాదు, 255 00:12:39,885 --> 00:12:43,305 కానీ నా చేతులని నేను గాల్లోకి ఆడించినప్పుడు, 256 00:12:43,388 --> 00:12:47,309 అన్నీ సమతాళంలోకి వచ్చిన్నట్టు అయిపోతుంది. 257 00:12:47,392 --> 00:12:49,520 కాదు, కండక్టర్ చేసే పని అది కాదు. 258 00:12:49,603 --> 00:12:52,105 -అది కాదా? -అదంత కన్నా సంక్లిష్టమైనది. 259 00:12:52,189 --> 00:12:53,815 నాకు తెలీదు. ఇంత వరకూ నేను స్వరసమ్మేళనానికి వెళ్ళనేలేదు. 260 00:12:53,899 --> 00:12:57,945 అది నన్ను మరింత సున్నితంగా మారుస్తుందని అమ్మ అంది, అందుకు నాన్న కూడా ఏకీభవించాడు. 261 00:12:58,028 --> 00:13:00,656 నిజానికి, వాళ్లిద్దరూ ఏకీభవించిన ఏకైక విషయం అదే. 262 00:13:00,739 --> 00:13:03,367 దేవుడా. మనం దాని గురించి మాట్లాడుకోవాలి. 263 00:13:03,450 --> 00:13:05,452 చూడు, ఆ మాటలు నా నోటి వెంట రాగానే నేను కాస్త... 264 00:13:09,790 --> 00:13:11,416 -మా అమ్మ... -డేవిడ్! 265 00:13:12,543 --> 00:13:14,461 మనమిద్దరమూ ఇక సెలవు తీసుకోవాలనుకుంటా. 266 00:13:26,181 --> 00:13:27,933 హేయ్, మిత్రులారా, నేను పూటీ షూ ని. 267 00:13:28,016 --> 00:13:31,728 నాకు అసహ్యించుకోవడం నచ్చదని మీకు తెలుసు, కానీ ఈ పార తవ్వకానికి పనికివచ్చేలా లేదు. 268 00:13:32,145 --> 00:13:33,438 అందులో పూటీ-జోకు దాగుంది. 269 00:13:34,022 --> 00:13:36,984 నేల మీద పురుషాంగాకారాన్ని తవ్వాలని చూశాను, కానీ అది తవ్వనివ్వలేదు, ఇదంత బాగాలేదు. 270 00:13:37,067 --> 00:13:40,737 జనాలు నా కళాచాతుర్యాన్ని అడ్డుకుంటే నాకెలా ఉంటుందో తెలుసా. హాష్టాగ్ ఫ్రీ పూటీ. 271 00:13:40,821 --> 00:13:44,366 నిజంగా, ఓ పురుషాంగమా? నీకు అది తప్ప వేరే ఆలోచనే రాలేదా? 272 00:13:44,992 --> 00:13:47,619 నాకే రోజంతా తవ్వాలని ఉంటే, నా తోటమాలిని పీకేసి నేనే ఆ పని చేస్తాను. 273 00:13:49,162 --> 00:13:51,373 రేవన్స్ బ్యాంక్వెట్ లోని మిగిలిన భాగమైనా దీనికన్నా నయంగా ఉంటుందని ఆశిద్దాం. 274 00:13:51,456 --> 00:13:54,751 అదో సరికొత్త ప్రపంచ నిర్మాణ పరికరమురా, దరిద్రుడా. 275 00:13:55,169 --> 00:13:57,296 -పాపి, పాప్-టార్ట్స్. -అసలేం జరుగుతోంది, బ్రాడ్? 276 00:13:57,379 --> 00:13:58,714 పూటీకి పార అస్సలు నచ్చనేలేదు. 277 00:13:58,797 --> 00:14:01,341 అవును, చూశాను. చింతించకు, వాడికి నచ్చేలా ఒకటి ఏర్పాటు చేశాములే. 278 00:14:01,425 --> 00:14:03,343 నేను ఒకటి చెప్పవచ్చా? ఓసారి ఊహించుకోండి. 279 00:14:04,178 --> 00:14:06,013 కథానాయకుడు తన వైరిని అంతమొందించాలి, 280 00:14:06,096 --> 00:14:09,266 కానీ ప్రాచీన దేవుళ్ళ ఆయుధాలు అందుకు సరిపోవు. 281 00:14:09,349 --> 00:14:12,269 అందుకని అతను ఏరిస్ యొక్క పీఠం మీద ప్రార్థించాలి... 282 00:14:12,352 --> 00:14:14,021 దేవుడా, ఆ కథని పక్కని పెట్టి విషయానికి రా. 283 00:14:14,104 --> 00:14:16,773 కథలోనే విషయమంతా ఉంది, సన్నాసి వెధవా. 284 00:14:16,857 --> 00:14:18,734 ఇక నన్ను దయచేస కొనసాగించనిస్తే. 285 00:14:18,817 --> 00:14:22,779 కథానాయకుడు ఏరిస్ యొక్క పీఠం మీద ప్రార్థించాలి, తనకి... 286 00:14:26,533 --> 00:14:28,952 "ఐయాన్ యొక్క పార," పంపమని. ఇది ఆటలోనే అత్యుత్తమ కొత్త ఆయుధం. 287 00:14:29,369 --> 00:14:32,581 వారు దాన్ని కొనుగోలు చేయగలిగేలా చేసే పరికరాల పెట్టె వనదేవతే. 288 00:14:32,956 --> 00:14:36,293 పార పొందిన తర్వాత జరిగేది ఏమిటి? 289 00:14:37,878 --> 00:14:41,173 ఈ సుందర కన్య ఎద నుండి అది వెళ్లిపోవాలి. 290 00:14:42,007 --> 00:14:44,968 అప్పుడు ఆ కథానాయకుడికి ఏం కనిపిస్తుంది? 291 00:14:46,220 --> 00:14:48,388 నాకు అస్సలంటే అస్సలు ఏమీ అర్థంకావడం లేదు. 292 00:14:49,556 --> 00:14:51,225 -వక్షములు. -అది కాదు. నాకా భాగం అర్థమైంది. 293 00:14:51,308 --> 00:14:54,186 కానీ దీనిలో మీరు నన్నేం చేయమంటున్నారో నాకర్థం కావడం లేదు. 294 00:14:54,269 --> 00:14:56,271 ఆటలో ఈ అప్డేట్ ని చేర్చడానికి మాకు సాయపడతావా? 295 00:14:56,355 --> 00:14:59,233 లేదు. ఎందుకంటే నాకు ఐయాన్ యొక్క పారని అమ్మాలని లేదు. 296 00:14:59,316 --> 00:15:00,734 నాకు నా పారనే అమ్మాలనుంది. 297 00:15:00,817 --> 00:15:03,695 కానీ నీ పారలో ఊపే లేదు. లేదనే అనుకుంటాను. నిజానికి నాకు తేడా ఏంటో తెలీదులే. 298 00:15:03,779 --> 00:15:05,239 కానీ ఐయాన్ కి అది నచ్చలేదు, 299 00:15:05,322 --> 00:15:07,449 అంతేగాక ఆటలాడే వెర్రివాళ్ళు ఏం కోరుకుంటారో అతనికి బాగానే తెలిసినట్టుంది. 300 00:15:08,325 --> 00:15:10,953 -పూటీకి అది నచ్చదని నీకు ముందే తెలుసు. -అవును, నాకు తెలుసు. 301 00:15:11,036 --> 00:15:13,247 కానీ ఆ విషయం నీకు కూడా తెలుసు కదా? అంటే నీకు ముందు చూపు బాగా ఎక్కువ. 302 00:15:13,330 --> 00:15:18,126 నీ సొగసైన పరికరాల పెట్టెకి కోడ్ అవసరమై అలా చేశావు అనమాట. 303 00:15:18,877 --> 00:15:20,838 అవును. ఆ విషయం నీకిప్పుడే అర్థమవుతోందా? 304 00:15:20,921 --> 00:15:24,383 బ్రాడ్, నువ్వో సన్నాసివి. 305 00:15:24,883 --> 00:15:26,468 ఇప్పుడు నీకు బాగా అర్థమైపోయింది. 306 00:15:28,595 --> 00:15:30,764 -అందరికీ తెలుసనే నేననుకున్నాను. -అవును, నేను కూడా అదే అనుకున్నాను. 307 00:16:02,129 --> 00:16:03,338 హేయ్, నాకు కాఫీ ఇవ్వగలరా? 308 00:16:03,922 --> 00:16:05,257 ఇదిగో వస్తున్నా, ఐయాన్! 309 00:16:07,759 --> 00:16:09,595 నేనెప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. 310 00:16:10,554 --> 00:16:13,682 అప్పుడప్పుడూ నువ్వు నీ జడని ఎలా నములుతావో అలాంటి పిచ్చిపిచ్చి విషయాలని. 311 00:16:13,765 --> 00:16:16,768 ఆ క్షణాన నేను నిన్ను చూసినప్పుడు, నువ్వు ఇబ్బంది పడటం, ఇంకా... 312 00:16:16,852 --> 00:16:19,479 కానీ అలాంటి ముద్దొచ్చే విషయాన్ని ఇదివరకు నేనెన్నడూ చూడలేదు. 313 00:16:19,563 --> 00:16:22,900 ఇది పూర్తిగా పిచ్చిగా ఉంటుందని నాకు తెలుసు... 314 00:16:23,901 --> 00:16:25,861 కానీ నీకు కూడా ఏదో అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. 315 00:16:27,404 --> 00:16:30,115 అందుకని నేను నిన్ను అడుగుతున్నాను... 316 00:16:31,366 --> 00:16:32,618 నీకు కూడా అలానే అనిపిస్తే. 317 00:16:34,995 --> 00:16:36,788 నాకు తెలియడం లేదు. ఇది బాగానే ఉంటుందా? 318 00:16:36,872 --> 00:16:40,250 -నాకు తెలియదు. -ఇదే కదా మీ పని? 319 00:16:40,334 --> 00:16:43,295 మీది మానవ వనరుల విభాగం. పని సంబంధిత వ్యక్తిగత సమస్యలలో మీరు సాయపడాలి. 320 00:16:43,378 --> 00:16:45,422 భగవంతుడా, నువ్వు ఈ వ్యక్తితో కలిసి పనిచేస్తున్నావా? 321 00:16:45,506 --> 00:16:48,008 అవును, డానా. తను కూడా టెస్టింగ్ విభాగంలో నాతో పని చేస్తుంది. తనది పొడవాటి జుట్టు. 322 00:16:48,091 --> 00:16:51,053 లేదు, నాకు తెలుసుకోవాలని లేదు. నేను తెలుసుకోకూడదు. 323 00:16:51,136 --> 00:16:53,096 ఎందుకని? నా ఈ రహస్యాన్ని చెప్పేస్తావా? 324 00:16:53,180 --> 00:16:55,432 నేనే నీ రహస్యాన్ని చెప్పేస్తే, అది నాకే చుట్టుకుంటుంది. 325 00:16:55,891 --> 00:16:58,602 నా పనేంటో ఈ కార్యాలయంలో ఎవ్వరికీ తెలీదేమోనని నాకనిపిస్తోంది. 326 00:16:58,685 --> 00:17:01,063 కేరొల్. మీరు సెషన్ మధ్యలో ఉన్నారా? 327 00:17:01,146 --> 00:17:02,272 -అలాంటిదేమీ లేదు. -మన్నించు. 328 00:17:02,356 --> 00:17:04,316 నాకు కాస్త దిగులుగా ఉన్నట్టనిపించింది. 329 00:17:04,397 --> 00:17:06,026 ఫర్వాలేదులే. తర్వాత వస్తాను. ఇబ్బందేమీ లేదు. 330 00:17:06,108 --> 00:17:07,694 వద్దు. మళ్లీ రావద్దు. 331 00:17:09,404 --> 00:17:10,405 తను కాదు. 332 00:17:12,156 --> 00:17:15,867 సరేమరి. వచ్చినందుకు ధన్యవాదాలు. 333 00:17:15,953 --> 00:17:17,746 ఈ కార్యాలయంలో వేధింపులు 334 00:17:17,829 --> 00:17:20,790 చాలా చోటుచేసుకుంటున్న విషయాన్ని గమనించి ఈ అత్వవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాను. 335 00:17:20,874 --> 00:17:23,166 అయ్యయ్యో. ఎవరైనా వేధింపులకు గురయ్యారా? 336 00:17:23,252 --> 00:17:24,837 అవును, డేవిడ్. నేనే. 337 00:17:25,546 --> 00:17:29,216 మీరందరూ మానవ వనరుల విభాగాన్ని వేధింపులకు గురి చేస్తున్నారు. 338 00:17:29,299 --> 00:17:32,761 కేరొల్, ఇది మనం ఇప్పుడే చర్చించాలా? ఓ పార విషయంలో మేమందరం సందిగ్ధంలో ఉన్నాం. 339 00:17:32,845 --> 00:17:35,222 నిజానికి, కేరొల్, ఐయాన్ సమస్యకి నా వద్ద ఓ పరిష్కారముంది. 340 00:17:35,305 --> 00:17:38,892 మేము నీ పారని తీసుకొని, దాన్ని ఒక సొగసైన కొత్త పరికరాల పెట్టెలో పెడతాం. 341 00:17:38,976 --> 00:17:40,018 పాపి కూడా తన సమ్మతి తెలిపింది. 342 00:17:40,102 --> 00:17:42,104 లేదు, లేదు. కేరొల్, నేను తన వేశ్యకి కోడ్ ని రాయను. 343 00:17:42,187 --> 00:17:44,439 -మిత్రులారా, నేను సమావేశానికి పిలిచింది... -కేరొల్, తను వేశ్య కాదు. 344 00:17:44,523 --> 00:17:48,569 తను ఒక సంక్లిష్ట నేపథ్యమున్న, ఈడుకు వచ్చిన ఒక యువ వన కన్య. 345 00:17:48,652 --> 00:17:50,279 -సీ.డబ్ల్యూ.? -నేను ఒకటి చెప్పవచ్చా... 346 00:17:50,362 --> 00:17:51,572 వద్దు, చెప్పవద్దు. 347 00:17:51,655 --> 00:17:53,615 -కేరొల్, క్షమించు. -అలాగే. 348 00:17:53,699 --> 00:17:55,534 వాళ్ళు తమదే లోకం అన్నట్టు ప్రవర్తిస్తారు. నువ్వే వాళ్ళని అదుపులోకి తెచ్చుకోవాలి. 349 00:17:55,617 --> 00:17:56,910 -నా వద్ద ఓ ఉపాయం ఉంది. -మన్నించు. 350 00:17:56,994 --> 00:17:58,370 కేరొల్, అసలు టెస్టర్లకు ఇక్కడ ఏం పని? 351 00:17:58,453 --> 00:18:00,664 ఎందుకంటే మా వద్ద కూడ ఉపాయాలున్నాయి. నిజం చెప్పాలంటే, అద్భుతమైన ఉపాయాలు. 352 00:18:00,747 --> 00:18:02,249 నిజం చెప్పాలంటే డానా వద్ద చాలా మంచి ఉపాయాలున్నాయి 353 00:18:02,332 --> 00:18:03,750 లేదు, నా వద్ద లేవు. లేవు. 354 00:18:03,834 --> 00:18:06,753 బాగుంది. మన బిలియన్ డాలర్ల సంస్థని 355 00:18:06,837 --> 00:18:08,881 వృద్ధిలోకి తీసుకువచ్చే ఉపాయాలు సరికొత్త ఉద్యోగుల వద్ద ఉన్నాయి. 356 00:18:08,964 --> 00:18:10,507 జో, తప్పకుండా అన్నింటినీ రాసుకో. 357 00:18:10,591 --> 00:18:12,467 -అవేంటో మాకు చెప్పండి. -చూశావా? అతను వినాలనుకుంటున్నాడు. 358 00:18:12,551 --> 00:18:15,554 -నాకేమీ లేదు... -"టెస్టర్లు తమ పరిధిని దాటారు." 359 00:18:15,637 --> 00:18:16,638 నా దగ్గర ఒక ఉపాయముంది. 360 00:18:16,722 --> 00:18:18,974 ఆ వేశ్య విషయం కాస్త చిత్రంగా ఉందని నాకనిపిస్తుంది. 361 00:18:19,057 --> 00:18:20,642 అర్థరహితమైన వాదన. 362 00:18:20,726 --> 00:18:24,229 ఒక ఆవేశపూరిత అహంభావంగల వ్యక్తి చేప్పేదంతా నేనిక్కడ రాస్తూ కూర్చోలేను. 363 00:18:24,313 --> 00:18:26,106 -నేను హెడ్ రైటర్ ని. -నీకు ఓ 80 ఏళ్ళుంటాయి, గురూ. 364 00:18:26,190 --> 00:18:29,318 హేయ్, హేయ్. కాస్త మర్యాదగా ప్రవర్తించు, టెస్టర్. అతను నెబ్యులా అవార్డు గ్రహీత. 365 00:18:29,401 --> 00:18:30,694 అది 1973లో. 366 00:18:30,777 --> 00:18:33,405 ఓ రాష్ట్రస్థాయి సంతలో వేంపిన చికెన్ ను అమ్ముతున్నప్పుడు నువ్వతడిని కలుసుకున్నావు. 367 00:18:33,488 --> 00:18:35,449 -దానికి కూడా అవార్డ్ గెలుచుకున్నాను. -అతడికి ఆ రెండు విషయాలలో ప్రావీణ్యముంది. 368 00:18:35,532 --> 00:18:39,494 -మిత్రులారా, మీరొక్క క్షణం పాటు... -మన్నించు. ఇతను కార్యాలయంలో నిద్రపోతాడు. 369 00:18:39,578 --> 00:18:41,121 కేవలం అతిగా త్రాగినప్పుడే, కేరొల్. 370 00:18:41,205 --> 00:18:42,831 అతను రోజూ త్రాగుతాడు. ఆయన ఎప్పుడూ ఇక్కడే పడుంటాడని నేను గట్టిగా చెప్పగలను. 371 00:18:42,915 --> 00:18:43,999 అది నిజం కాదు, కదా? 372 00:18:44,583 --> 00:18:49,755 కేరొల్, నీకు నా వర్తమానం తెలియాలంటే, ముందు నీకు నా గతం తెలియాలి. 373 00:18:50,839 --> 00:18:52,090 ఆల్బేనియా, 1939... 374 00:18:52,174 --> 00:18:53,926 వద్దు! ఇంక గతంలో జరిగిన ఇంకో చెత్త కథను చెప్పవద్దు! 375 00:18:57,012 --> 00:19:00,140 మన్నించండి. ప్రస్తుతం నాకు కాస్త చికాకుగా ఉంది. 376 00:19:00,599 --> 00:19:01,600 మనమింక ఏ మార్పులూ చేర్పులూ చేయకూడదు, 377 00:19:01,683 --> 00:19:04,978 క్యూఏ చివరి పరీక్ష చేస్తుంది, అది అయ్యాక పారని ఎలా ఉందో అలానే విడుదల చేసేద్దాం. 378 00:19:05,062 --> 00:19:08,857 డేవిడ్, పారని ఇప్పుడే విడుదల చేయలేము, సరేనా? నాకు ఇంకాస్త సమయం కావాలి... 379 00:19:08,941 --> 00:19:10,984 సోమవారం నాడు విస్తరింపు అమలులోకి వస్తుంది. 380 00:19:11,068 --> 00:19:14,112 ఇప్పుడు శుక్రవారం, సాయంత్రం అయిదు గంటలు. దాన్ని పొడగించమని అతను నిన్ను అడుగుతాడు. 381 00:19:14,196 --> 00:19:17,658 లేదు, అడగడు. విస్తరింపు తేదీని పొడగించమని అడగనని నాకు అతను మాట ఇచ్చాడు. 382 00:19:17,741 --> 00:19:20,118 డేవిడ్, విస్తరింపు తేదీని పొడగించమని అడుగుతున్నాను. 383 00:19:20,202 --> 00:19:24,081 ఏంటి? లేదు, లేదు. లేదు, సమయం సరిపోతుందని అన్నావు నువ్వు. 384 00:19:24,164 --> 00:19:26,333 మనమిది చేయగలమని నువ్వు అన్నావు. ఇక పొడగించనని నాకు మాట ఇచ్చావు. 385 00:19:26,416 --> 00:19:28,252 సరిపోయేంత సమయం లేదు. మేము చేయలేదు. ఇంకా నేను అబద్ధమాడాను. 386 00:19:29,002 --> 00:19:30,546 -నువ్వు నన్ను ముంచేస్తున్నావు. -అవును. 387 00:19:30,629 --> 00:19:32,047 -నువ్వు నన్ను ముంచేస్తున్నావు. -కానీ నాకేమీ ఇది ఆనందంగా లేదు. 388 00:19:32,130 --> 00:19:33,590 -ఇది ఆట కోసమే. -ఇదిలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. 389 00:19:33,674 --> 00:19:37,135 -నాకిది ఏ మాత్రం బాగా అనిపించడం లేదు. -నువ్వో దద్దమ్మవి. 390 00:19:37,219 --> 00:19:38,512 -నువ్వే దద్దమ్మవి! -బాబోయ్... 391 00:19:38,595 --> 00:19:40,889 జో, ఆపు. ధన్యవాదాలు. నాకు నీ సాయం అక్కర్లేదు. 392 00:19:40,973 --> 00:19:43,392 డేవిడ్, పాపి దద్దమ్మలా ప్రవర్తిస్తోంది, సరేనా? 393 00:19:43,475 --> 00:19:46,019 విస్తరింపు ఇంకా సిద్ధంగా లేదు. దాన్ని పొడగించాలి. 394 00:19:46,103 --> 00:19:48,063 -కాస్త పొడగిస్తే చాలు, సరిగ్గా చేసిస్తాను. -పొడగించాల్సిన అవసరమే లేదు. 395 00:19:48,146 --> 00:19:50,274 -వద్దు. డేవిడ్, పొడగించవద్దు. -కేవలం కాస్తంతే. 396 00:19:50,357 --> 00:19:52,568 -కాస్తంత వద్దు, అస్సలు వద్దంటే వద్దు. -కేవలం కాస్తంత. 397 00:19:52,651 --> 00:19:55,070 -పొడగించవద్దు. -పొడగించు. పొడగించు. 398 00:19:55,153 --> 00:19:57,322 -విస్తరింపును పొడగించు. -పొడగించవద్దు. 399 00:20:07,666 --> 00:20:10,586 డేవిడ్, నువ్వు కనుక నిర్ణయం తీసుకోకపోతే... 400 00:20:10,669 --> 00:20:13,213 సరే, నేను మామ్ వైపు ఉంటాను! పాపి. 401 00:20:13,297 --> 00:20:15,340 -ఛ, నా ఉద్దేశం, "పాపి వైపు ఉంటాను," అని. -అదీ! 402 00:20:15,424 --> 00:20:16,758 ఐయాన్, నువ్వే దీని పితామహుడివి, 403 00:20:16,842 --> 00:20:20,846 కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ని నేను, ఎగ్జిక్యూటివ్ నిర్ణయాన్ని నేను తీసుకుంటా. 404 00:20:21,388 --> 00:20:24,308 కోడ్ లో ఇక మార్పులూ చేర్పులూ ఉండవు. ఇక అందరూ, ఇళ్ళకి బయలుదేరండి! 405 00:20:24,391 --> 00:20:27,644 అలాగే! ఓ విషయం చెప్పనా? మీకు ఆటను నాశనం చేయాలనుందా? నన్ను నమ్మకండి. 406 00:20:27,728 --> 00:20:28,937 ఆట గురించి నాకు ఏం తెలుసు? 407 00:20:29,021 --> 00:20:31,356 నాకు ఆట గురించి ఒక్క ముక్క కూడా తెలియదు. నేను కేవలం సృష్టికర్తని అంతే. 408 00:20:31,773 --> 00:20:33,734 "ఐయాన్ మగతనం చూపాడు." 409 00:20:33,817 --> 00:20:36,069 నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు, డేవిడ్. మంచి పని చేశావు. 410 00:20:36,153 --> 00:20:37,529 ధన్యవాదాలు, మామ్. పాపి. 411 00:20:40,240 --> 00:20:41,366 సమావేశం ముగిసింది. 412 00:20:43,452 --> 00:20:46,455 మనం సాధించేశాం. మనం రేవన్స్ బ్యాంక్వెట్ కోడ్ లో మార్పులు ఇక చేయడం లేదు. 413 00:20:47,456 --> 00:20:49,124 ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తప్పక తాగలి. 414 00:20:51,877 --> 00:20:52,878 సరే. 415 00:21:00,469 --> 00:21:03,639 లేదు, లేదు! రక్తం మరింత చిందాలి. 416 00:21:09,144 --> 00:21:10,979 లేదు! లేదు. 417 00:21:16,068 --> 00:21:17,986 అయ్యో, అయ్యో! 418 00:21:19,446 --> 00:21:20,656 ఏం చేస్తున్నావు? 419 00:21:25,244 --> 00:21:26,912 -పని చేస్తున్నాను. -అది నాకు తెలుసు. 420 00:21:26,995 --> 00:21:28,830 ఎవరో నా కొడ్ ని తునాతునకలు చేస్తున్నారని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ నుండి 421 00:21:28,914 --> 00:21:30,457 నాకో హెచ్చరిక వచ్చింది. 422 00:21:30,541 --> 00:21:32,459 మంచిది, ధన్యవాదాలు, పాప్! వచ్చినందుకు ధన్యవాదాలు! 423 00:21:32,543 --> 00:21:34,461 ఈ ఒక్క విషయాన్ని నాకు వదిలేస్తే నీకు కలిగే నష్టమేంటి? 424 00:21:34,545 --> 00:21:35,838 నీ సహాయానికి అభినందనలు! 425 00:21:35,921 --> 00:21:37,172 నాకు కావలసింది అదే. 426 00:21:37,256 --> 00:21:40,717 ఈ మొత్తం ఆటలోకల్లా "అది నాది," అని నేను చెప్పుకోదగినది 427 00:21:40,801 --> 00:21:43,762 ఒక్కటైనా ఉండాలనేదే నా కోరిక. 428 00:21:44,596 --> 00:21:46,598 -నిజంగానా? -అవును. 429 00:21:46,682 --> 00:21:50,435 పాపి, ఈ ఆటంతా నీదే. దీన్ని నిర్మించిందే నువ్వు. 430 00:21:50,519 --> 00:21:51,687 నేను నీ కల్పనని నిర్మించాను. 431 00:21:53,647 --> 00:21:56,233 నువ్వో గొప్ప చిత్రకారుడివి అయ్యుండి... 432 00:21:56,316 --> 00:21:57,317 చెప్పు. 433 00:21:57,860 --> 00:22:00,654 నన్ను పూర్తిగా చెప్పనివ్వు... నువ్వో గొప్ప చిత్రకారుడివి... 434 00:22:00,737 --> 00:22:01,738 అలాగే. 435 00:22:03,657 --> 00:22:05,158 ...ఇక నేను నీకు బాగా నచ్చే కుంచెని. 436 00:22:05,242 --> 00:22:10,122 నీ అద్భుతమైన కల్పనకి రూపమిచ్చే సాధనాలలో నేను కేవలం ఒక సాధనాన్ని అంతే. 437 00:22:12,249 --> 00:22:15,335 నాకా పోలిక నచ్చింది, కానీ అది సరైనది కాదు కదా? నా ఉద్దేశంలో నువ్వు... 438 00:22:15,419 --> 00:22:17,462 నిజంగా ఇప్పుడు నా పోలికలో సవరణలు చేయాలనుకుంటున్నావా? 439 00:22:17,546 --> 00:22:20,507 -ఆ సన్నివేశంలో ఏ పూత వాడబడింది? -నేను చెప్పేది కాస్త ఆలకిస్తావా? 440 00:22:20,591 --> 00:22:23,468 అదెంత చికాకు తెప్పిస్తుందో నీకు అసలు తెలుసా? 441 00:22:23,886 --> 00:22:26,180 సరే. అలాగే. నువ్వన్నది నిజమే. నువ్వన్నది నిజమే. 442 00:22:26,263 --> 00:22:28,098 పాపి, నువ్వన్నది నిజమే. అది నిజమే. చూడు. 443 00:22:28,515 --> 00:22:32,769 ఆ... లోపభూయిష్టమైన పోలికలో, 444 00:22:32,853 --> 00:22:36,732 చిత్రకారిణివి నువ్వే, కుంచెవి కూడా నువ్వే. 445 00:22:37,774 --> 00:22:42,696 నీ వెనుక నిలబడి, ఏం గీయాలో చెప్పే వ్యక్తిని మాత్రమే నేను. 446 00:22:43,697 --> 00:22:47,117 కానీ దానికి ప్రాణం ఇచ్చేది మాత్రం నువ్వే. 447 00:22:47,618 --> 00:22:50,621 నేను అది చేయగలిగితే బాగుండు, కానీ అది నా వల్ల కాదు. అందుకని నాకు నీ అవసరముంది. 448 00:22:53,123 --> 00:22:55,751 నాకు అది మహా చిరాకు తెప్పిస్తుంది, అయినా కానీ అది చేస్తాను, 449 00:22:55,834 --> 00:22:59,671 ఎందుకంటే ఆట అలాగే మెరుగవుతుంది, మనకి కావలసింది కూడా అదే. 450 00:23:08,680 --> 00:23:14,269 ఆటలో ఇదే ఒక అద్భుతమైన వస్తువు కాబోతోందని, జనాలకి ఇది బాగా నచ్చుతుందని 451 00:23:14,353 --> 00:23:15,687 నాకు తెలుసు. 452 00:23:15,771 --> 00:23:19,566 నాకది ఎలా తెలుసో తెలీదు. కానీ నాకు తెలుసు. 453 00:23:23,695 --> 00:23:27,533 మరింత బరువుతో కూడిన ఊపు కావాలంటే పార యొక్క ముందు అంచున ఒక వేగాధిక్య వంపును చేర్చాలి. 454 00:23:28,867 --> 00:23:31,328 కదలిక ముందు వేగవంతంగా ఉండి, చివరకి వచ్చే సరికి నెమ్మదించేలా చూడాలి, 455 00:23:31,411 --> 00:23:33,872 తద్వారా అది కొట్టేలా అనిపిస్తుంది. 456 00:23:33,956 --> 00:23:37,501 తాకిడి అవ్వగానే రక్తపు బొట్టుల ప్రాథమిక వేగాన్ని పెంచాలి. 457 00:23:40,420 --> 00:23:42,089 అప్పుడు బాగా వస్తుందా? 458 00:23:42,506 --> 00:23:44,633 అవును, బాగా వస్తుంది. 459 00:23:46,844 --> 00:23:48,387 జనాలకి బాగా నచ్చుతుంది. 460 00:23:51,181 --> 00:23:52,975 నాకది ఎలా తెలుసో తెలీదు. 461 00:23:58,564 --> 00:23:59,940 -నాకు తెలుసు... ఒక్క నిమిషం. -అద్భుతం. అమోఘం. 462 00:24:00,023 --> 00:24:02,651 -వెంటనే దీని మీద పని ప్రారంభిద్దాం. -"నాకు తెలుసు అంతే," అని చెప్పబోతున్నాను. 463 00:24:02,734 --> 00:24:04,570 -నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. -అది చాలా బాగా ఉండేది. 464 00:24:04,653 --> 00:24:07,573 -మనకి సమయం మించిపోతోంది. -కనీసం ఒక్కసారైనా నన్ను ఆనందపడనివ్వవు. 465 00:24:11,076 --> 00:24:13,078 పూటీ, పూటీ, పూటీ... షూ. 466 00:24:13,161 --> 00:24:14,621 సమీక్షలు. 467 00:24:17,332 --> 00:24:18,500 సరేమరి, మిత్రులారా. 468 00:24:20,002 --> 00:24:23,505 ఈ ఉదయం రేవన్స్ బ్యాంక్వెట్ విడుదలైందన్న విషయం మీకు తెలిసిన విషయమే. 469 00:24:24,131 --> 00:24:28,343 రోజంతా ఈ పిల్లాడు పజామాలు వేసుకొని ఈ ఆట ఆడతాడని నమ్మి తీరాలి. 470 00:24:28,427 --> 00:24:31,471 ముందుగా, నేను... 471 00:24:34,933 --> 00:24:36,268 రేజర్ బాడీ మిస్ట్ కి ధన్యవాదాలు చెప్పాలి, 472 00:24:36,351 --> 00:24:39,479 మీ పూటీని తాజాగా ఉంచుతున్నందుకు, అతని తల్లిదండ్రుల తాకట్టును కట్టేసినందుకు. 473 00:24:40,898 --> 00:24:42,983 రేజర్. ఈ ఆవేశాన్ని చవిచూడు. 474 00:24:43,483 --> 00:24:45,235 త్వరగా కానివ్వురా, పింజారీ వెధవ. 475 00:24:45,319 --> 00:24:46,612 కానీ మీకు వాస్తవాలు చెప్పనివ్వండి. 476 00:24:46,695 --> 00:24:49,573 మిథిక్ క్వెస్ట్ మీద నాకు ఎంత ప్రేముందో మీకందరికీ తెలుసు. 477 00:24:49,656 --> 00:24:53,702 కాబట్టి నేనిప్పుడు ఇవ్వబోయే ప్రకటన చాలా చాలా కీలకమైనది. 478 00:24:57,956 --> 00:24:59,625 రేవన్స్ బ్యాంక్వెట్... 479 00:25:01,668 --> 00:25:03,629 ఒక మహాద్భుతమైన ఆట. 480 00:25:03,712 --> 00:25:04,755 భగవంతుడా! 481 00:25:06,048 --> 00:25:07,132 అదీ! 482 00:25:07,216 --> 00:25:09,009 ఇందులో నాకన్నింటికన్నా నచ్చింది... 483 00:25:10,344 --> 00:25:11,720 ఈ పారే. 484 00:25:14,348 --> 00:25:17,726 ఈ ఆటని నిర్మించినవాళ్ళు నన్నెప్పుడూ విస్మయానికి గురిచేస్తూనే ఉంటారు. 485 00:25:18,310 --> 00:25:21,396 ఈ పారతో జనాల తలలు పగలగొట్టడమనేది భలే గమ్మత్తైన విషయం. 486 00:25:22,022 --> 00:25:23,607 అదిరిపోయింది, బాసూ. 487 00:25:24,274 --> 00:25:25,651 ఇక, అధికారికంగా చెప్పేద్దాం. 488 00:25:25,734 --> 00:25:28,570 నోర్మూసుకోండి, నోర్మూయండి! వాడు రేటింగ్ ఇస్తున్నాడు. వాడు రేటింగ్ ఇస్తున్నాడు. 489 00:25:32,658 --> 00:25:33,909 నాలుగు త-కాయలు. 490 00:25:34,993 --> 00:25:37,079 నాలుగు త-కాయలు! నాలుగు త-కాయలు! 491 00:25:37,162 --> 00:25:39,081 నాలుగు, నాలుగు, నాలుగు త-కాయలు. 492 00:25:39,414 --> 00:25:40,499 నాలుగు త-కాయలు! 493 00:25:41,083 --> 00:25:42,292 నాలుగు త-కాయలు! 494 00:25:42,376 --> 00:25:43,794 అంటే తలకాయలా? 495 00:25:43,877 --> 00:25:46,129 అవును. వాడిది తలకాయల రేటింగ్ వ్యవస్థ అనమాట. 496 00:25:46,463 --> 00:25:48,549 రెండుకు మించి ఎంత వచ్చినా అది అద్భుతమైనదే. 497 00:25:48,632 --> 00:25:50,133 ఈ ఉద్యోగం భలే విచిత్రంగా ఉంది. 498 00:25:50,634 --> 00:25:52,886 అవును. చాలా బాగుంది కదా? 499 00:25:55,305 --> 00:25:57,015 అవును. చాలా బాగుంది. 500 00:25:57,099 --> 00:25:58,559 నేను ఈ ఆటను ఆపకుండా ఆడుతూనే ఉంటాను. 501 00:26:04,857 --> 00:26:09,278 ఆలస్యమైనందుకు మన్నించు. ట్రాఫీక్ భయంకరంగా ఉంది. 502 00:26:09,361 --> 00:26:11,363 -ఏంటి సంగతి? -మనకి నాలుగు తలకాయలు వచ్చాయి. 503 00:26:11,947 --> 00:26:13,407 దేవుడా. 504 00:26:14,199 --> 00:26:17,411 హువాంలో ఉన్నప్పుడు నాకొక ప్రేయసి ఉండేది. తనకు మూడు ఉన్నాయి. 505 00:26:18,620 --> 00:26:20,038 కానీ నాలుగంటే... 506 00:26:21,832 --> 00:26:23,250 అది మామూలు విషయం కాదు. 507 00:26:24,668 --> 00:26:25,669 ఏంటి? 508 00:26:28,839 --> 00:26:30,841 హేయ్, విస్తరింపు దిగ్విజయవంతమైంది. 509 00:26:30,924 --> 00:26:32,593 రెడిట్ లో, స్టీమ్ లో, కొటాకు లో అన్ని చోట్లా సానుకూల రేటింగులు వచ్చాయి, 510 00:26:32,676 --> 00:26:34,469 అంతేకాదు, గంటగంటకీ వేల సంఖ్యలో పారలు అమ్ముడయిపోతున్నాయి. 511 00:26:34,553 --> 00:26:37,389 ఆటలో అది అత్యంత ముఖ్యమైన వస్తువు. దానికి నీకు అభివందనాలు. 512 00:26:37,472 --> 00:26:39,141 లేదా ఐయాన్ కి. ఎవరు గెలిచుంటే వారికి. 513 00:26:39,224 --> 00:26:40,851 గెలుపెవరిదో నేనింక లెక్కపెట్టలేను, నాకది అనవసరం కూడా. 514 00:26:40,934 --> 00:26:42,769 -మేమిద్దరమూ. మేమిద్దరమూ గెలిచాం. -అద్భుతం. 515 00:26:42,853 --> 00:26:44,188 తను ఏమైపోయాడు? 516 00:26:44,271 --> 00:26:47,065 మీరు మళ్లీ సాధించారు. 517 00:26:47,149 --> 00:26:52,070 నా కల్పనకి ఒక వాస్తవ రూపాన్ని ఇచ్చారు, ఇంతకన్నా గర్వకారణమైనది నాకింకేది ఉంటుంది. 518 00:26:52,571 --> 00:26:56,617 కానీ, ఇదంతా నా దేవత లేకుండా నేను చేయగలిగుండే వాడిని కాదనుకోండి. 519 00:26:57,367 --> 00:26:58,785 నా భాగస్వామి, నిజంగా. 520 00:26:58,869 --> 00:27:01,371 గత కొన్ని రోజులుగా, కార్యాలయంలో తను అలసటగా ఉండటాన్ని 521 00:27:01,455 --> 00:27:02,789 మీరు గమనించి ఉంటారు, 522 00:27:02,873 --> 00:27:05,292 కానీ తన మీద నాకు ఎన్నడూ కూడా నమ్మకం సన్నగిల్లలేదు. 523 00:27:07,169 --> 00:27:09,838 నిజానికి, తనని ఇక్కడికి పైకి పిలవాలి అనుకుంటున్నాను. ఎక్కడుంది తను? 524 00:27:09,922 --> 00:27:11,131 పైకి వెళ్ళు, పాప్. 525 00:27:11,215 --> 00:27:12,549 అతను మాట్లాడేది పార గురించి. 526 00:27:12,633 --> 00:27:15,052 పార! అదుగో తను. వావ్! 527 00:27:15,135 --> 00:27:16,553 -అదుగదుగో! -బాగుంది! 528 00:27:18,138 --> 00:27:19,223 పార కి జై! 529 00:27:20,557 --> 00:27:21,975 మిథిక్ క్వెస్ట్ కి జై! 530 00:27:22,434 --> 00:27:24,686 ఐయాన్. ఐయాన్. ఐయాన్. 531 00:28:39,344 --> 00:28:41,346 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య