1 00:00:06,924 --> 00:00:08,383 పూటీ, పూటీ, పూటీ... షూ! 2 00:00:08,467 --> 00:00:09,468 పూటీ షూ 3 00:00:09,927 --> 00:00:11,595 ఎవరు ఈ ముసుగు మనిషి? 4 00:00:11,678 --> 00:00:13,597 అతను ఒక ఎన్.పీ.సీ, 5 00:00:13,680 --> 00:00:17,434 మీ కొత్తవారికి అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ఆడటం సాధ్యం కాని వ్యక్తి అనమాట. 6 00:00:17,518 --> 00:00:19,520 అతని ముసుగు అదిరిపోయేలా ఉంటుంది, ఇంకా పూర్తిగా నలుపు వేషధారణలో ఇరగదీసేలా ఉంటాడు. 7 00:00:19,603 --> 00:00:22,314 అతని బట్టలకు వెండి తళుకులు ఉంటాయి. అతను పరికరాలు ఇచ్చువాడు. 8 00:00:22,397 --> 00:00:23,398 +1 నిప్పుఖడ్గం - లెవల్ 65 9 00:00:23,482 --> 00:00:25,609 అదీ! ఒక నిప్పుఖడ్గం! ఇంకా పరికరాలు తీసుకొనువాడు 10 00:00:25,692 --> 00:00:26,610 -1 లెధర్ డాలు - లెవల్ 62 11 00:00:26,693 --> 00:00:28,237 దేవుడా, వాడు నా డాలుని లాగేసుకున్నాడు. 12 00:00:28,320 --> 00:00:31,532 కానీ, వీడిని ఆటలో ప్రవేశపెట్టిన మొదటిసారి, "నాకు వీడు తెగ నచ్చాడు," అని పూటీ అన్నాడు, 13 00:00:31,615 --> 00:00:32,616 ఎందుకంటే వీడు అందరికీ నచ్చాడు. 14 00:00:32,698 --> 00:00:35,869 ఎంక్యూ వీడిని బాగా ప్రచారం చేసింది. వీడి మీద వాణీజ్య ప్రకటనలు ఇచ్చింది. 15 00:00:35,953 --> 00:00:38,038 ఎవడు ఈ ముసుగు మనిషి? ఇప్పుడే ముందు-ఆర్డర్ చేసేసుకోండి. 16 00:00:38,121 --> 00:00:39,206 ఇతడిని టీ-షర్టుల మీద ముద్రించారు. 17 00:00:39,289 --> 00:00:42,292 వావ్! "ఎవడు ఈ ముసుగు మనిషి?" 18 00:00:42,376 --> 00:00:47,256 కానీ ఆ ముసుగు మనిషి ముసుగు మాత్రం ఇప్పటిదాకా తీయనే లేదు, మిత్రులారా. 19 00:00:47,339 --> 00:00:52,010 మనం పదే పదే ఎంత మొత్తుకున్నా కూడా తీయనే లేదు. 20 00:00:52,094 --> 00:00:56,765 ఏదోకరోజు వాడి అసలు గుర్తింపు బయటపడుతుంది, అప్పుడు మీకందరికీ మతిపోక తప్పదు. 21 00:00:56,849 --> 00:00:58,350 వస్తున్నాడు, వస్తున్నాడు, అతను వస్తున్నాడు. 22 00:00:58,433 --> 00:01:01,520 అనుకున్నదాని కంటే కాస్త ఆలస్యంగా వస్తున్నాడు, కానీ వస్తున్నాడు. 23 00:01:01,603 --> 00:01:05,274 కాస్త శాంతించి, ఓపిక వహించమని మిమ్మల్ని కోరుతున్నాను, సరేనా? 24 00:01:05,357 --> 00:01:08,402 నేను... ముసుగు మనిషి గురించి అడగటం ఇక ఆపండి. దాని గురించి ఇక అడగవద్దు. 25 00:01:08,485 --> 00:01:10,529 అది వెల్లడించడానికి... అది వెల్లడించడానికి ఇది సరైన సమయం కాదు. 26 00:01:10,612 --> 00:01:13,991 ఇక ఆపండి, సరేనా? మీరు... ఇక అడగటం ఆపండి. 27 00:01:14,199 --> 00:01:16,034 ఎంక్యూ మన ముందుకు సమాధానాలతో, 28 00:01:16,118 --> 00:01:19,663 అసలైన, నిక్కచ్చి సమాచారంతో వచ్చేదాకా మనమిక్కడ వేచి చూస్తూ ఉండాలి. 29 00:01:19,746 --> 00:01:21,039 రహస్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. 30 00:01:21,123 --> 00:01:22,124 వీక్షించినందుకు ధన్యవాదాలు! 31 00:01:22,207 --> 00:01:23,792 పూటీ... షూ! 32 00:01:23,876 --> 00:01:24,835 అదుగో వచ్చేసింది. 33 00:01:24,918 --> 00:01:25,919 అసలు ఎవరు నువ్వు? 34 00:01:26,753 --> 00:01:29,506 పూటీ షూ 14 ఏళ్ళ పిల్లవాడు. వాడేమనుకున్నా పట్టించుకొనేది ఎవడు? 35 00:01:29,590 --> 00:01:33,010 అవును, వాడు సన్నాసే, కానీ వాడు చెప్పినదానిలో వాస్తవం ఉంది. 36 00:01:33,093 --> 00:01:34,720 వాడు బెదిరిస్తున్నాడు, వాడి పనిపట్టాల్సిన సమయం వచ్చింది. 37 00:01:34,803 --> 00:01:36,555 -జో, దయచేసి ఆపు. -పనిపట్టాలా? 38 00:01:36,638 --> 00:01:38,515 ఐయాన్, నీ నిర్ణయాన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదు, 39 00:01:38,599 --> 00:01:40,267 అది పూటీ అయినా కానీ, ఇంకెవ్వరైనా కానీ. 40 00:01:40,350 --> 00:01:42,102 -జో. -పాపి, డేవిడ్, నోర్మూసుకొండి. 41 00:01:42,186 --> 00:01:45,397 జో, నువ్వు నా గురించి సరిగ్గా అనుకుంటున్నావు. నీ ఉత్సుకత నాకు నచ్చింది. 42 00:01:45,814 --> 00:01:47,816 మిత్రులారా, నేను దీని గురించి కంగారు పడటం లేదు. 43 00:01:47,900 --> 00:01:51,486 ఐయాన్, సీ.డబ్ల్యూ., ముసుగు మనిషి యొక్క ముసుగు తీయవలసిన సమయం ఆసన్నమైంది. 44 00:01:52,154 --> 00:01:53,447 ఇది ఒక భారీ వేడుకగా జరగబోతోంది. 45 00:01:53,530 --> 00:01:56,950 ఎంత భారీగా ఉండబోతుందంటే, క్యాసినో యొక్క... 46 00:01:58,952 --> 00:02:00,037 ఎంక్యూ గ్రాండ్ 47 00:02:00,120 --> 00:02:01,455 ...గొప్ప ప్రారంభోత్సవంలాగా. 48 00:02:01,914 --> 00:02:04,625 వద్దు. క్యాసినో అనేది పరమచెత్తది. 49 00:02:04,708 --> 00:02:06,668 సరే, అవును, అది చెత్తదే. కానీ మీరు దాని మీద పనిచేయలేదు, 50 00:02:06,752 --> 00:02:08,627 అందుకే ఆ పనిని నేను బుచారెస్ట్ లోని ఓ స్టూడియోకి ఇచ్చాను. 51 00:02:08,711 --> 00:02:10,964 అది పనిచేయకుండా తేరగా వచ్చే సొమ్ము కనుక, అంతేగాక ఆటకి దానికీ సంబంధమే లేదు కనుక, 52 00:02:11,048 --> 00:02:12,841 మేము దాని మీద పని చేయలేదు. 53 00:02:12,925 --> 00:02:15,969 సరే, ఆ రెండింటినీ ఏకం చేయడానికి ఇదే సువర్ణావకాశం. ఏమంటారు? 54 00:02:16,053 --> 00:02:20,182 మెరుగులు దిద్దండి. సరిపోయేలా చేయండి. కళనీ, వాణిజ్యాన్ని సరిగ్గా ఏకం చేయండి. 55 00:02:20,265 --> 00:02:24,061 బ్రాడ్, నీకో విషయం చెప్పనా? నువ్వు కూడా చాలా విధాలుగా క్యాసినో లాంటి వాడివే. 56 00:02:24,144 --> 00:02:27,481 ఒక మాయారణ్యం మధ్యనున్న ధన ఆశ గల హృదయంలేని కసాయివి నువ్వు. 57 00:02:27,564 --> 00:02:30,150 మాకది అవసరం లేదు. నువ్వు కూడా మాకు అవసరం లేదు. 58 00:02:33,487 --> 00:02:34,488 అలాగే. 59 00:02:36,156 --> 00:02:39,326 చాలా విచిత్రంగా చెప్పావు. డేవిడ్, ఇంకేదైనా ఉందా? 60 00:02:39,409 --> 00:02:41,912 చూడండి. నేను సృజనాత్మకత ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తానని మీకు తెలుసు. 61 00:02:41,995 --> 00:02:43,497 -అది నా సహజ గుణం. -కాదు, అది కాదు. 62 00:02:43,580 --> 00:02:46,124 -పిరికి పందలాగా ఉండటం నీ సహజ గుణం. -అవును. 63 00:02:46,208 --> 00:02:49,711 ఏంటి... పిరికిపందనా? అంటే ఏంటి? 64 00:02:49,795 --> 00:02:51,046 నీకు తర్వాత చెప్తానులే. 65 00:02:51,421 --> 00:02:52,464 అది మంచి మాటేనా? 66 00:02:53,048 --> 00:02:54,049 ఆహా. 67 00:02:54,132 --> 00:02:55,217 సరే, మంచిది. 68 00:02:55,300 --> 00:02:57,386 చూడండి, బ్రాడ్ చెప్తున్నదానిలో కూడా వాస్తవం ఉందేమో. సరేనా? 69 00:02:57,469 --> 00:03:00,973 ఇప్పటికే రెండేళ్ళయింది. బహుశా ముసుగు మనిషి గుర్తింపును బయటపెట్టవలసిన సమయం ఇదేనేమో. 70 00:03:01,056 --> 00:03:03,767 లేదు. దానికి సరైన సమయం ఇదేనని నాకు అనిపించడం లేదు. 71 00:03:03,851 --> 00:03:05,435 వాళ్ళకి అతనెవరో తెలీదు కాబట్టే, వాళ్ళు వెల్లడించడం లేదు. 72 00:03:05,519 --> 00:03:07,813 అతని గుర్తింపును మేము ఎన్నో ఏళ్ళ క్రితమే నిర్ణయించాము. 73 00:03:07,896 --> 00:03:10,774 చూడండి, మిత్రులారా, అతని గుర్తింపును బయటపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. 74 00:03:10,858 --> 00:03:12,442 సమయం వచ్చినప్పుడు, మేమే మీకు చెప్తాం. 75 00:03:12,526 --> 00:03:15,320 ఇక, మనం ఎవరి పనులను వారు చేసుకుందామా? 76 00:03:22,661 --> 00:03:24,746 -వాళ్ళు నమ్మారనుకుంటున్నావా? -ఏమో. 77 00:03:25,330 --> 00:03:27,833 కానీ, ఈ చెత్త విషయాన్ని ఓ పెద్ద విషయంగా నేను మార్చేశాను. 78 00:03:27,916 --> 00:03:29,126 అవును. 79 00:03:29,209 --> 00:03:32,713 మనం ఈ ముసుగు మనిషి ఎవరో త్వరగా నిర్ణయించేయాలి, లేకపోతే మన గతి అధోగతే. 80 00:03:36,466 --> 00:03:40,137 Mythic Quest: 81 00:03:40,846 --> 00:03:45,058 Raven's Banquet 82 00:03:48,604 --> 00:03:49,897 చేదు కబురు, పిల్లా. 83 00:03:50,480 --> 00:03:55,152 క్యాసినోలోని లోపాల జాబితాని వెనువెంటనే మనం తయారుచేయాలని ఇప్పుడే నాకు బ్రాడ్ చెప్పాడు. 84 00:03:55,611 --> 00:03:59,072 ఏంటి? అది లోపాలమయం కనుక దాని జోలికి వెళ్ళవద్దని మనకి చెప్పాడు కదా. 85 00:03:59,156 --> 00:04:01,450 ఏదో భారీ వేడుకకి ప్రణాళిక వేస్తున్నారనకుంటా. 86 00:04:02,034 --> 00:04:06,246 బాబోయ్. రాత్రంతా దానికే సరిపోతుంది. నాకు వేరే పని ఉందే. 87 00:04:10,083 --> 00:04:13,879 ఓ విషయం చెప్పనా? ఈ వారమంతా తిరిక లేకుండా గడిచింది. నీ పనిని కూడా నేనే చేస్తానులే. 88 00:04:14,671 --> 00:04:18,841 -వద్దు, నా పనిని నువ్వు చేయవలసిన పని లేదు. -పర్వాలేదు. నేను చూసుకుంటాలే. 89 00:04:21,553 --> 00:04:22,554 ధన్యవాదాలు, రేచ్. 90 00:04:23,347 --> 00:04:25,265 పర్వాలేదులే. మిత్రులంటే ఆమాత్రం చేయరా? 91 00:04:38,153 --> 00:04:40,072 ది బ్రేజన్ షీల్డ్ - ది ఫాల్ ఆఫ్ హ్రాడ్ ఇన్సైడ్ ది కేవ్స్ ఆఫ్ బెనెరోత్ 92 00:04:40,155 --> 00:04:42,449 అమెరికా యొక్క సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ రచయితలు, నెబ్యులా అవార్డు, 1973 ఉత్తమ నవల 93 00:04:43,408 --> 00:04:44,618 మనుషుల ద్వారా స్వయాన ఎంపిక చేయబడింది 94 00:04:45,827 --> 00:04:46,954 వావ్. 95 00:04:47,621 --> 00:04:50,666 నీ కార్యాలయంలో నేను మరింత ఎక్కువ సమయం గడపాలి. ఇది భలే చిత్రంగా ఉంది. 96 00:04:51,583 --> 00:04:53,836 నువ్వు రాసిన ప్రతీ పుస్తకం ఇక్కడ ఉంది. 97 00:04:53,919 --> 00:04:58,465 ద కేప్ ఆఫ్ నో హోప్. ది ఫాల్ ఆఫ్ హ్రాడ్. శాటర్న్స్ డిజైర్. 98 00:04:59,550 --> 00:05:04,054 చిన్నప్పుడు నాకు బాగా నచ్చిన పుస్తకమిది. సమ్మోహన మోహినిని నేనెప్పటికీ మరిచిపోలేను. 99 00:05:04,137 --> 00:05:05,430 నేను కూడా మరిచిపోలేను. 100 00:05:05,514 --> 00:05:07,975 మోరొకోలో ఉన్నప్పుటి నా ప్రేయసిని ఆధారంగా చేసుకొని ఆ పాత్రని సృష్టించాను. 101 00:05:08,934 --> 00:05:10,978 గమ్మత్తైన విషయమేమిటంటే, ఆ పుస్తకం ద్వారా 102 00:05:11,061 --> 00:05:14,106 వచ్చిన డబ్బులతోనే తన ద్వారా వచ్చిన వ్యాధికి చికిత్స చేయించుకున్నాను. 103 00:05:15,816 --> 00:05:17,568 -ఛీ. -అవును. 104 00:05:19,319 --> 00:05:20,821 ఇక తిరిగి పని మొదలుపెడదామా? 105 00:05:20,904 --> 00:05:21,947 -సరే. -అలాగే. 106 00:05:22,030 --> 00:05:23,657 అలాగే! ఇప్పుడే. 107 00:05:26,034 --> 00:05:27,411 ఎవరు నువ్వు? 108 00:05:28,161 --> 00:05:30,956 వీడి ముసుగుని తీసేసినప్పుడు, అది భావోద్వేగానికి గురిచేసేలా ఉండాలి, 109 00:05:31,039 --> 00:05:33,208 లేకపోతే ఎవరూ పట్టించుకోరన్న విషయం మాత్రం సుస్పష్టం. 110 00:05:33,292 --> 00:05:34,459 అవునవును. 111 00:05:34,543 --> 00:05:37,546 ఇంకా పరికరాలు తీసుకొనువాడు మరియు పరికరాలు ఇచ్చువాడు ఇతనే, 112 00:05:37,629 --> 00:05:39,548 అది ఆసక్తి రేపే విషయం. 113 00:05:39,631 --> 00:05:41,216 -ఐయాన్. -ఇప్పుడు కాదు, జో. మేము పనిలో ఉన్నాం. 114 00:05:41,300 --> 00:05:44,344 అర్థమైంది. కాకపోతే, మనం విజయం సాధించామని నీకు చెప్దామనుకుంటున్నాను. 115 00:05:44,428 --> 00:05:46,847 పూటీకి మండిపోయింది. అతనికి చిర్రెత్తుకొచ్చింది. 116 00:05:46,930 --> 00:05:48,807 ఆగాగు. ఆగు. ఆగు. ఏంటి? అతను ఏమంటున్నాడు? 117 00:05:48,891 --> 00:05:50,058 ఇదిగో, ఓసారి చూడు. 118 00:05:50,851 --> 00:05:52,769 మీకందరికీ తెలిసే ఉంటుంది, నేను సానుకూల మనిషినని, 119 00:05:52,853 --> 00:05:56,023 కానీ ఈ మధ్యే ఎంక్యూ నుండి నాకు ఒక తీవ్రమైన పరుష సందేశం వచ్చింది, 120 00:05:56,106 --> 00:05:58,567 వాళ్ళకి నా మీద అంత ద్వేషం ఎందుకు... అని నాకు అంతుచిక్కడం లేదు, 121 00:05:58,650 --> 00:06:01,028 అదికూడా రోజంతా వారి ఆటను నేను ఆడుతున్నప్పుడు. 122 00:06:01,111 --> 00:06:03,238 "వేర్లు బాగుండకపోతే చెట్టు ఎలా బాగుంటుంది," అనే నానుడి ఉంది కదా? 123 00:06:03,322 --> 00:06:07,284 కాబట్టి, ఐయాన్, నేను కేవలం ముసుగు మనిషి ఎవరు అని మాత్రమే అడిగాను. 124 00:06:07,367 --> 00:06:10,370 నీకు సమాధానం తెలియనంత మాత్రాన నా మీద నీ కోపం చూపించడం తగని పని. 125 00:06:10,454 --> 00:06:12,664 -పూటీ ఈ విషయంలో పర్యాలోచిస్తాడు. -పూటీ పర్యాలోచిస్తున్నాడు. 126 00:06:12,748 --> 00:06:13,832 పూటీ పర్యాలోచిస్తున్నాడు 127 00:06:13,916 --> 00:06:15,292 ఎంక్యూ బహిష్కరణ? 128 00:06:16,418 --> 00:06:17,544 ఎంక్యూ బహిష్కరణ? 129 00:06:17,628 --> 00:06:19,713 ఇలాంటిదాన్ని నేనసలు పరిగణించేవాడినే కాదు, 130 00:06:20,297 --> 00:06:21,798 కానీ పరిస్థితులు మారాయి. 131 00:06:21,882 --> 00:06:24,510 -నువ్వు వాడిని ఏమన్నావు? -ఒక హాస్యాస్పదమైన సందేశాన్ని పంపాను. 132 00:06:24,593 --> 00:06:25,636 అందరినీ ఆనందంగా ఉండనివ్వు. చచ్చిపో. 133 00:06:25,719 --> 00:06:27,221 "అందరినీ ఆనందంగా ఉండనివ్వు. చచ్చిపో," అని రాసుంది... 134 00:06:27,304 --> 00:06:29,139 అవును, అక్కడ ఏం రాసుందో నాకు కనబడుతోంది, జో. ధన్యవాదాలు. 135 00:06:29,223 --> 00:06:31,808 కానీ ఎందుకు? ఒక 14 ఏళ్ళ పిల్లాడికి ఈ సందేశాన్ని ఎందుకు పంపావు? 136 00:06:31,892 --> 00:06:34,353 ఇది ఫలితం ఇస్తుంది. ఉన్నత పాఠశాలలో దీన్ని షానన్ అనే పొగరుబోతు మీద నేను ప్రయోగించాను. 137 00:06:34,436 --> 00:06:36,230 తను ఆత్మహత్య చేసుకోలేదు కానీ, ఆ ప్రయత్నం చేసింది. 138 00:06:37,481 --> 00:06:40,359 సరే, జో, కానీ ఆ సందర్భంలో, బెదిరింపులకు దిగింది షానన్ కాదు. 139 00:06:40,442 --> 00:06:41,944 -షానన్ యే బెదిరింపులకు దిగింది. -తను బాధితురాలు. 140 00:06:42,027 --> 00:06:43,529 -లేదు, షానన్ బెదిరించింది. -షానన్ బాధితురాలు. 141 00:06:43,612 --> 00:06:45,656 ఆరవ తరగతి చేరక ముందు, ఓసారి తన ఇంటికి వెళ్తే, నన్ను బార్బీ బొమ్మలతో ఆడుకోమంది. 142 00:06:45,739 --> 00:06:46,990 వాటితో చిన్నపిల్లలు ఆడుకుంటారని తనకి చెప్పాను, 143 00:06:47,074 --> 00:06:49,326 ఇక తరువాతి రోజు పాఠశాలకి వెళ్లి, తను వెర్రిబాగులది అని అందరికీ చెప్పాను. 144 00:06:50,869 --> 00:06:53,622 అలాంటప్పుడు, నువ్వెలా... సరేలే. అది ఇప్పుడు ముఖ్యం కాదులే. 145 00:06:53,705 --> 00:06:56,500 జో, నువ్వు దీన్ని వదిలేస్తావా? దయచేసి దీన్ని వదిలేయి చాలు. 146 00:06:56,583 --> 00:06:59,086 నిన్ను బాధపెట్టాను. నన్ను మన్నించు. 147 00:06:59,169 --> 00:07:01,255 నేను దీన్ని సరిచేయగలను. మాటిస్తున్నాను. నాకు మరో అవకాశం ఇవ్వు చాలు. 148 00:07:02,130 --> 00:07:04,800 సరే, అలాగే. నువ్వు ఈ పరిస్థితిని కాస్త మెరుగుపరచగలవా? 149 00:07:05,884 --> 00:07:09,930 అంతేకాదు, జో, జో, జో. ఆత్మహత్యని మాత్రం పక్కన పెట్టేసేయి. 150 00:07:10,013 --> 00:07:11,515 వాడి నిర్ణయాలు వాడే తీసుకుంటాడు. 151 00:07:11,598 --> 00:07:13,684 లేదు, లేదు, లేదు. కాస్త... 152 00:07:14,309 --> 00:07:16,019 కాస్త ఆత్మహత్యని పక్కన పెట్టేద్దాం, సరేనా? 153 00:07:16,103 --> 00:07:18,605 ఇతరులు చేసేపనిలో మన ప్రమేయం ఏముండదు. 154 00:07:18,689 --> 00:07:21,441 అవును, కానీ మనం... అతడిని అంత తీవ్రమైన కార్యానికి ఉసిగొల్పకుండా చూడగలమేమో. 155 00:07:21,525 --> 00:07:24,444 నేను చేయవలసింది నేను చేస్తాను, వాడు చేయవలసింది వాడు చేస్తాడు. 156 00:07:24,528 --> 00:07:26,697 లేదు, నువ్వు నేను చెప్పిందే చేస్తావు. సరేనా? 157 00:07:28,532 --> 00:07:29,658 ఆలాగే. 158 00:07:32,786 --> 00:07:36,039 తనకి ఉన్న శక్తిని పనికి వచ్చే పనులకి నేను ఉపయోగించుకోగలిగితే, మనకి ప్రయోజనం ఉంటుంది. 159 00:07:36,123 --> 00:07:37,457 తన గురించి వదిలేయి. 160 00:07:37,541 --> 00:07:42,212 దీని మీద దృష్టి పెడితే మనం, పూటీని... వాడి పూటీ పాపలను నోరు మెదపకుండా చేయవచ్చు. 161 00:07:43,213 --> 00:07:44,590 అలాగే వాడి పూటీ బాబులను కూడా. 162 00:07:45,674 --> 00:07:46,800 పని కానిద్దాం. 163 00:07:50,637 --> 00:07:51,638 అలాగే. 164 00:08:05,027 --> 00:08:07,946 హేయ్. మనము సమస్యలో ఉన్నామనుకుంటా. 165 00:08:10,240 --> 00:08:12,201 అవును, నేను తిరిగి వచ్చేసరికి, అక్కడ ఏమీ లేదు. 166 00:08:12,284 --> 00:08:14,244 అతను ఏమైనా తప్పించుకొని వచ్చినవాడు అంటావా? పరిణామాలకి భయపడి పారిపోయుండవచ్చు. 167 00:08:14,328 --> 00:08:16,455 అలా పారిపోయేవాళ్ళు, తమ బల్లలని కూడా ఎత్తుకెళ్ళరు. 168 00:08:16,538 --> 00:08:19,291 తన అవసరం మనకి ఉందని అతను నిరూపించాలనుకుంటున్నట్టు తెలిసిపోతుంది. 169 00:08:20,709 --> 00:08:23,212 బ్రాడ్ లేకుండా ఒక రోజు. 170 00:08:25,088 --> 00:08:28,383 అయ్యో. అతనికి ఈ ఆలోచన ముందే వచ్చుంటే బాగుండు. 171 00:08:28,467 --> 00:08:30,093 ఇంకాస్త ఎక్కువ సమయం హాయిగా గడిపే అవకాశముండేది. 172 00:08:30,177 --> 00:08:31,553 సరేమరి, నేను ఇంటికి బయలుదేరుతున్నాను. 173 00:08:32,010 --> 00:08:34,431 ఏంటి? లేదు, ఆగు. నువ్వు వెళ్లిపోలేవు. 174 00:08:34,515 --> 00:08:36,140 -అంటే, ఈ విషయంలో మనం ఏం చేయాలి? -ఏమీ చేయనవసరం లేదు. 175 00:08:36,225 --> 00:08:39,144 అతను అలిగిన పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. వదిలేయి. అదే సమసిపోతుందిలే. 176 00:08:39,227 --> 00:08:41,980 కానీ, పాపి, మనం బ్రాడ్ కి కోపం తెప్పించకూడదు. 177 00:08:42,063 --> 00:08:44,316 ఆటని లాభదాయకంగా చేయడమనేది మన ఆదాయంలో ఒక కీలక భాగం. 178 00:08:44,399 --> 00:08:46,485 నువ్వు ఓ నిర్ణయానికి రావాలి, డేవిడ్. 179 00:08:46,568 --> 00:08:49,196 నీకు సూట్లు వేసుకొనేవాళ్ళు కావాలా, లేక సృజనాత్మకత ఉన్న వాళ్ళు కావాలా? 180 00:08:49,279 --> 00:08:50,489 సృజనాత్మకత ఉన్న వాళ్ళు. 181 00:08:50,572 --> 00:08:53,283 అద్భుతం. అయితే నిన్ను శాంతంగా ఉండమని కోరుతున్నా. ఉండగలవుగా? 182 00:08:53,992 --> 00:08:54,993 ఉండగలను. 183 00:08:56,495 --> 00:08:57,496 నిన్ను చూస్తే కంగారుపడుతున్నట్టుగా ఉన్నావు. 184 00:08:57,579 --> 00:08:59,081 లేదు. లేదు, నేనేమీ కంగారు పడటం లేదు. 185 00:08:59,164 --> 00:09:01,500 నిజానికి, నేను వేరే ఏదో దాని గురించి ఆలోచిస్తున్నాను. లేదు, నేను... 186 00:09:01,875 --> 00:09:03,585 నేను, ప్రశాంతంగా ఉన్నాను. తెలుసా? 187 00:09:03,669 --> 00:09:05,462 ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? 188 00:09:06,255 --> 00:09:08,799 నేను ఊరికే అలా నిలబడున్నాను, అంతే. 189 00:09:09,591 --> 00:09:12,970 సరే. అయితే నువ్వు... ప్రశాంతంగా ఉంటావు కదా? 190 00:09:13,053 --> 00:09:14,096 -అవును. -మంచిది. 191 00:09:14,179 --> 00:09:17,099 నా గురించి నీకు తెలుసు. నాకు భావోద్వేగాలు ఉండవు, బంగారం. 192 00:09:17,808 --> 00:09:20,060 సరే. నువ్వు ఇంటికి వెళ్ళు. 193 00:09:20,143 --> 00:09:21,812 -అలాగే. మంచిది. -కాస్త విశ్రాంతి తీసుకో. 194 00:09:21,895 --> 00:09:23,897 రేపు ఉదయానికల్లా ఇదంతా సర్దుకొని పోతుంది. 195 00:09:23,981 --> 00:09:25,190 అలాగే, అలాగే, అలాగే. 196 00:09:25,274 --> 00:09:26,400 అన్ని సార్లు అనకు. 197 00:09:30,654 --> 00:09:31,655 మంచిది. 198 00:09:37,452 --> 00:09:41,707 క్రాప్స్ టేబుల్ అంచుకి తగలగానే పాచికలు మాయమైపోతున్నాయి. కొత్త లోపం. 199 00:09:42,082 --> 00:09:43,709 -బాగుంది. -దారుణం. 200 00:09:47,421 --> 00:09:48,589 నీకు కళ్ళద్దాలు ఉన్నాయా? 201 00:09:48,672 --> 00:09:52,259 అవును. నేను వీటిని రాత్రి మాత్రమే ధరిస్తాను. ఇవి చూడటానికి బాగుండవు. 202 00:09:52,342 --> 00:09:55,304 లేదు, నాకు అవి నచ్చాయి. కాకపోతే నువ్వు వాటిని వేసుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. 203 00:09:55,387 --> 00:09:58,015 అవును, రోజంతా తెరని చూసి నా కళ్ళు అలసిపోతాయి. 204 00:09:58,098 --> 00:10:00,225 నేను ఇంటికి వెళ్ళాక ఇంకాస్త సమయం ఎంక్యూ ని ఆడతాను. 205 00:10:00,309 --> 00:10:02,102 ఒక్క నిమిషం. నువ్వు పనయ్యాక కూడా ఎంక్యూని ఆడతావా? 206 00:10:02,186 --> 00:10:03,520 అవును మరి. 207 00:10:03,604 --> 00:10:07,316 నేనూ, ఆటలోని నా పాత్ర టోక్స్విగ్ కలిసి, ఎనిమిది నుండి అర్థరాత్రి దాకా కసిగా ఆడతాం. 208 00:10:07,399 --> 00:10:10,777 కమాన్, పిల్లా. అది చాలా బాగుంది. నువ్వు ఆడుతూనే ఉంటావంటే నమ్మలేకపోతున్నాను. 209 00:10:10,861 --> 00:10:13,572 ఓహ్, అర్థరాత్రి కావస్తోంది. నువ్వెక్కడికో వెళ్ళాలని అన్నావు కదా? 210 00:10:13,655 --> 00:10:16,533 ఓహ్... అవును. పర్లేదులే. 211 00:10:17,242 --> 00:10:18,869 -నిజంగానా? -నీకు ఆకలిగా ఉందా? 212 00:10:22,456 --> 00:10:25,292 పాపి కంగారుగా ఉన్నప్పుడు తినే ఐస్ క్రీమ్ శాండ్విచ్ లను ఎక్కడ దాస్తుందో నాకు తెలుసు. 213 00:10:25,375 --> 00:10:26,627 అవును. 214 00:10:27,252 --> 00:10:29,213 ఆగు, మనల్ని ఎవరైనా చూస్తే? 215 00:10:33,217 --> 00:10:34,676 చూస్తుంటే ఇక్కడ మనిద్దరమే ఉన్నట్టున్నాం. 216 00:10:40,682 --> 00:10:41,683 వెజ్జీ బర్గర్ ప్యాటీలు 217 00:10:42,851 --> 00:10:44,102 -చాలా బాగుంది కదా? -అవును. 218 00:10:44,436 --> 00:10:45,771 -చీర్స్. -చీర్స్. 219 00:11:11,296 --> 00:11:13,465 చెమ్మచెక్క చేరడేసి మొగ్గ. 220 00:11:13,549 --> 00:11:16,009 అట్లు పోయంగ ఆరగించంగ. 221 00:11:16,093 --> 00:11:18,011 ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగ. 222 00:11:18,095 --> 00:11:20,097 రత్నాల చేమ్మచెక్క రంగులేయంగ. 223 00:11:20,180 --> 00:11:21,181 వావ్! 224 00:11:37,197 --> 00:11:38,991 జో చేత బోల్తా కొట్టించబడండి 225 00:11:39,074 --> 00:11:42,244 టెస్టర్లకు చెల్లించండి 226 00:12:17,070 --> 00:12:18,155 చిన్న సమస్య వచ్చిపడింది. 227 00:12:20,449 --> 00:12:21,450 ఏం జరుగుతోంది? 228 00:12:21,867 --> 00:12:24,119 బ్రాడ్ అల్లరి కాస్త హద్దు మీరింది. 229 00:12:25,621 --> 00:12:26,455 ఉచితం 230 00:12:26,538 --> 00:12:28,665 దేవుడా. అతను స్టోర్ ని మూసేసి, అన్నింటినీ ఉచితానికి పెట్టేశాడు. 231 00:12:28,749 --> 00:12:30,667 అవును, ఈ ఉదయం సూ నాకు కాల్ చేసింది. 232 00:12:30,751 --> 00:12:34,713 అద్భుతమైన పరికరాల పెట్టెలని, ఓపీ ఆయుధాలను దోచుకుంటూ జనాలు వెర్రెక్కిపోతున్నారు. 233 00:12:35,297 --> 00:12:37,216 అందరికీ అక్షరాలా మొత్తం ఉచితంగా లభిస్తోంది. 234 00:12:37,299 --> 00:12:38,342 అది దారుణం. 235 00:12:38,425 --> 00:12:40,511 ఈ క్షణంలో కూడా, వేల సంఖ్యలో ఉన్న పై లెవెల్ ఆటగాళ్ళు, 236 00:12:40,594 --> 00:12:42,638 రేవన్స్ బ్యాంక్వెట్ లోని విషయాన్ని ఒక చిత్తు కాగితంలా 237 00:12:42,721 --> 00:12:44,181 నలిపి పడేస్తుంటారు. 238 00:12:44,264 --> 00:12:47,434 -అది మరింత దారుణం. మరింత దారుణం. -సరే, కంగారు పడవద్దు. ఏమీ కాదులే. 239 00:12:47,518 --> 00:12:48,977 లేదు, లేదు. ఇది మంచి విషయం కాదు. 240 00:12:49,061 --> 00:12:51,647 ఇది నన్ను ముంచేసే విషయం. 241 00:12:51,730 --> 00:12:53,273 సరే. కానీ మనం బ్రాడ్ కి తలొగ్గకూడదు. 242 00:12:53,357 --> 00:12:55,234 ఇది మనకన్నా అతడినే ఎక్కువగా బాధిస్తుంది. 243 00:12:55,317 --> 00:12:58,195 అతనికి అన్నింటికన్నా డబ్బంటేనే ప్రాణం. బ్రాడ్ ఖచ్చితంగా తలొగ్గుతాడు. 244 00:12:58,278 --> 00:13:02,157 రేవన్స్ బ్యాంక్వెట్ నిర్మాణానికి రెండేళ్ళు పట్టింది. వాళ్ళు దాన్ని చిదిమేస్తున్నారు. 245 00:13:02,241 --> 00:13:04,076 నువ్వు ధరలను మళ్లీ ప్రవేశపెట్టలేవా? 246 00:13:04,159 --> 00:13:06,203 ఆర్థికసంబంధిత అధికారాలు బ్రాడ్ ఒక్కడి చేతిలోనే ఉన్నాయి. 247 00:13:08,247 --> 00:13:11,291 నాకు తెలుసు. నీకో విషయం చెప్పనా? నువ్వు కుదురుగా కూర్చుంటే మంచిది. 248 00:13:11,375 --> 00:13:14,044 కూర్చో. కూర్చో చాలు. ఆ శబ్దం మాత్రం చేయకు. 249 00:13:14,127 --> 00:13:18,173 శ్వాస ఆడించు. నా కోసం శ్వాస ఆడించు. శాంతంగా శ్వాస ఆడించు. లోపలికి, బయటకి. 250 00:13:18,549 --> 00:13:19,716 బయటకి. 251 00:13:20,175 --> 00:13:21,885 బహుశా నువ్వు మింట్ ని వేసుకోవాలేమో. 252 00:13:21,969 --> 00:13:24,388 పక్కకి తిప్పి శ్వాస ఆడించు, ఎందుకంటే నీ శ్వాస వాసన వస్తుంది. 253 00:13:24,471 --> 00:13:25,889 నేను ఇలా చేస్తాను, సరేనా? 254 00:13:25,973 --> 00:13:27,683 నేను నా బృందం చేత కొన్ని అడ్డంకులని సృష్టిస్తాను. 255 00:13:27,766 --> 00:13:30,227 మేము బాస్ తో పోరాటాన్ని కఠినతరం చేస్తాం, ఆక్రమణల నిడివిని పెంచుతాం, 256 00:13:30,310 --> 00:13:31,854 అత్యంత శక్తివంతమైన ఆయుధాల శక్తిని తగ్గిస్తాం. 257 00:13:31,937 --> 00:13:34,815 అవును, నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండాలి. ఉండగలవుగా? ప్రశాంతంగా ఉండగలవుగా? 258 00:13:36,650 --> 00:13:38,402 నువ్వు ప్రశాంతంగా ఉన్నావని మాట్లాడకుండా చెప్పు. 259 00:13:39,403 --> 00:13:42,531 హేయ్, అదీ అలా ఉండాలి! నువ్వు చేయగలవు. 260 00:13:42,614 --> 00:13:44,116 కోడర్స్ ఉన్న గదికి వెళ్దాం పద. 261 00:13:44,825 --> 00:13:47,327 బాగా చేస్తున్నావు. నువ్వు అద్భుతంగా చేస్తున్నావు. అలాగే ప్రశాంతంగా ఉండు. 262 00:13:47,411 --> 00:13:48,704 -అంత పెద్ద పెద్ద అడుగులు వేయనక్కర్లేదు. -అలాగే. 263 00:13:48,787 --> 00:13:49,872 అందరూ వినండి! 264 00:13:53,667 --> 00:13:54,668 మిషెల్? 265 00:13:54,751 --> 00:13:56,628 అది నా పేరే. 266 00:13:56,712 --> 00:13:58,088 మిగతావాళ్ళు ఏమైపోయారు? 267 00:13:58,714 --> 00:14:00,007 వాళ్ళని బ్రాడ్ ఇళ్ళకి పంపేశాడు. 268 00:14:00,090 --> 00:14:02,092 అతను లేకుంటే మొత్తం ప్రోగ్రామింగ్ బృందానికి జీతాలు ఇవ్వడానికి 269 00:14:02,176 --> 00:14:05,012 మీ వద్ద డబ్బులు ఉండవని అతను చెప్పాడు, కాబట్టి అందరూ వెళ్లిపోయారు. 270 00:14:05,095 --> 00:14:08,932 ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇన్ని అడ్డంకులని నేనొక్కదాన్నే సృష్టించలేను. 271 00:14:09,016 --> 00:14:10,809 సరే, ఇప్పుడు నేను కంగారు పడవలసిన సమయం వచ్చేసింది. 272 00:14:10,893 --> 00:14:13,020 -కంగారు పడకు. -మరి, ఇప్పుడు మనం ఏం చేయాలి? 273 00:14:13,103 --> 00:14:15,898 మీకు బ్రాడ్ అవసరం ఉందని ఇప్పటికైనా మీకు తెలిసివచ్చిందని అనుకుంటున్నాను. 274 00:14:15,981 --> 00:14:18,066 -నోర్మూసుకో, మిషెల్! -నోర్మూసుకో, మిషెల్! 275 00:14:18,150 --> 00:14:20,402 ఈ ముక్క చెప్పడానికి అతను నాకు వేయి డాలర్లు ఇచ్చాడు. 276 00:14:27,201 --> 00:14:29,036 పూటీ, పూటీ, పూటీ... ప్రత్యేకం. 277 00:14:29,119 --> 00:14:30,412 పూటీ షూ ప్రత్యేకం 278 00:14:30,495 --> 00:14:33,290 వాళ్ళెలాగూ ముసుగు మనిషి యొక్క ముసుగు తీయడం లేదు కనుక, 279 00:14:33,373 --> 00:14:37,503 ఐయాన్ గ్రిమ్ యొక్క ముసుగును తీద్దామని నేను ఆలోచిస్తూ ఉన్నాను. 280 00:14:37,586 --> 00:14:40,547 మరి, ఈ ఐయాన్ గ్రిమ్ ఎవరు? 281 00:14:40,631 --> 00:14:45,469 లింకిడిన్ పేజ్ ప్రకారం, ఇతడు, "లోకాల సృష్టికారుడు." 282 00:14:45,552 --> 00:14:48,347 దానర్థం ఏమిటో మరి. ఇక కరువుతో ఉన్న అతని ప్రొఫైల్ చిత్రాన్ని చూడండి. 283 00:14:48,430 --> 00:14:49,431 కరువు. 284 00:14:49,515 --> 00:14:50,724 కరువు! 285 00:14:50,974 --> 00:14:52,434 కనీసం అతను కసిగా ఉన్నాడన్న విషయమైనా మనకి తెలిసిందిలే. 286 00:14:52,518 --> 00:14:56,563 ఓహ్. మరో అంతగా తెలియని విషయం. అతను తండ్రులను అంతమొందించువాడు. 287 00:14:56,647 --> 00:14:57,940 తండ్రులను అంతమొందించువాడు 288 00:14:58,023 --> 00:15:02,277 అది నిజం. అందరికన్నా ముందు ఈ విషయాన్ని మీ ముందుకు పూటీ స్కూప్ తెచ్చింది. 289 00:15:02,361 --> 00:15:07,491 ఐయాన్ గ్రిమ్ తన కన్న తండ్రి మీదే దావా వేశాడు! "నిరూపించు, పూటీ"? అలాగే బంగారం. 290 00:15:07,574 --> 00:15:09,201 కాలిఫోర్నియా రాష్ట్రం ఐయాన్ గ్రిమ్ జూ. వర్సెస్ ఐయాన్ గ్రిమ్ సీ. 291 00:15:09,284 --> 00:15:11,828 మిస్టర్ గ్రిమ్, మీ నాన్న వద్దనున్న డబ్బునంతా అణాపైసలతో సహా 292 00:15:11,912 --> 00:15:13,789 తీసుకుంటారని మీరు మీ తండ్రికి చెప్పారా? 293 00:15:14,540 --> 00:15:17,668 నాకు తెలీదు. నేను మీ అమ్మతో **** విషయం నిజమా? 294 00:15:18,794 --> 00:15:21,630 సరే. మీరు దయచేసి పిచ్చిగా ప్రవర్తించకుండా అడిగిన ప్రశ్నకి జవాబిస్తారా? 295 00:15:22,005 --> 00:15:23,715 నేను కూడా మీ అమ్మతో అదే చెప్పాను. 296 00:15:23,799 --> 00:15:25,884 సరేమరి. ఇది ఆయాసం తెప్పిస్తోంది. 297 00:15:25,968 --> 00:15:27,970 మనం అయిదు నిమిషాలు విరామం తీసుకుందామా? 298 00:15:28,720 --> 00:15:30,347 మీ అమ్మ కూడా అదే చెప్పింది. 299 00:15:32,391 --> 00:15:34,017 ఎంతటి దరిద్రుడు. 300 00:15:35,143 --> 00:15:36,937 చనుమొనలు. చూసినందుకు ధన్యవాదాలు. 301 00:15:37,020 --> 00:15:39,022 ఆ దావా గురించి వీడికి ఎలా తెలిసింది? 302 00:15:39,106 --> 00:15:40,274 నేనే వాడికి చేరవేశాను. 303 00:15:40,357 --> 00:15:41,984 ఎందుకు? ఎందుకు ఆ పని చేశావు? 304 00:15:42,067 --> 00:15:44,570 ఎందుకంటే నువ్వు నీ కన్నతండ్రి మీదే దావా వేశావు. అది అద్భుతమైన విషయం. 305 00:15:44,653 --> 00:15:46,530 నీ తండ్రి పట్లనే నువ్వలా ప్రవర్తించావంటే, 306 00:15:46,613 --> 00:15:48,782 ఈ చిట్టి వెధవ అయిన పూటీని నువ్వు ఇంకేం చేయగలవో ఉహించుకో. 307 00:15:48,866 --> 00:15:52,703 జో, మా నాన్న నా సంస్థని చేజిక్కించుకోవాలని చూశాడు కనుక, అతని మీద ప్రతిదావా వేశాను. 308 00:15:55,747 --> 00:15:57,791 -అయితే అతను పోటుగాడు. -లేదు, అతను పోటుగాడు కాదు. 309 00:15:57,875 --> 00:15:59,585 అతను పోటుగాడు కాదు. నేను కూడా పోటుగాడిని కాదు. 310 00:15:59,668 --> 00:16:01,378 ఆ సన్నివేశంలో అసలు గొప్పతనమే లేదు, అర్థమైందా? 311 00:16:01,461 --> 00:16:04,965 అది ఒక తండ్రీ కొడుకుల మధ్య నడిచిన బాధాకరమైన విషయం. అది సంక్లిష్టమైనది. 312 00:16:05,340 --> 00:16:06,842 అయ్యయ్యో. నేను నిన్ను నిరాశపరిచాను. 313 00:16:07,718 --> 00:16:09,678 నేనే నా సందేశాన్ని చదివి, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. 314 00:16:09,761 --> 00:16:12,639 భగవంతుడా! జో, జో, జో. 315 00:16:12,723 --> 00:16:15,100 మనం ఆత్మహత్య గురించి మాట్లాడకుండా ఉందామా? 316 00:16:15,184 --> 00:16:17,477 మనం... మనం కాసేపు మాట్లాడకుండా ఉందామా? 317 00:16:17,561 --> 00:16:19,938 నువ్వు వెళ్లి డేవిడ్ కి సహకరించవచ్చు కదా? 318 00:16:20,022 --> 00:16:23,233 చూడు, నువ్వు నాకు సహకరించడానికి అదే ఉత్తమ మార్గం. డేవిడ్ కి సహకరించడం. 319 00:16:24,026 --> 00:16:25,194 -విషమా? -విషం కాదు. 320 00:16:25,277 --> 00:16:26,904 విషం కానే కాదు. 321 00:16:26,987 --> 00:16:30,574 అతనికి ఏం కావాలంటే అది. కాఫీ, టీ. విషపూరితం కానిది ఏదైనా. 322 00:16:30,657 --> 00:16:33,076 అర్థమైంది. నీ దారికి అడ్డుపడకుండా అతనికి కాస్త జ్వరం తెప్పిస్తే చాలు. 323 00:16:33,452 --> 00:16:34,828 అవును. జో, నేను... 324 00:16:36,455 --> 00:16:38,123 మనం తనని ఉద్యోగంలో నుండి తీసేయాలనుకుంటా. 325 00:16:38,207 --> 00:16:40,292 లేదు. ఐయాన్, 326 00:16:40,375 --> 00:16:45,130 ఈ పిచ్చి అసిస్టెంట్ తెలియకుండానే ఈ మొత్తం విషయానికి పరిష్కారాన్ని చూపింది. 327 00:16:46,006 --> 00:16:47,007 అవునా? 328 00:16:47,841 --> 00:16:50,928 అమ్మానాన్నలకి, పిల్లలకీ మధ్యనున్న అనుబంధం భావావేశపరమైనదని 329 00:16:51,011 --> 00:16:53,472 తను గ్రహించింది. 330 00:16:54,640 --> 00:16:56,683 అంతేగాక తను డేవిడ్ ని హత్య చేయాలనుకుంది కూడా. 331 00:16:56,767 --> 00:17:00,646 ఐయాన్, మనకి కావలసిన ఆ భావావేశపరమైన అంశం ఇదేనేమో. 332 00:17:00,729 --> 00:17:04,942 ముసుగు మనిషి అనేది ఒక తండ్రికీ, కొడుకుకీ మధ్య నడిచే కథ. 333 00:17:05,483 --> 00:17:07,402 ఆసక్తికరంగా ఉంది. చెప్పు. 334 00:17:07,486 --> 00:17:09,780 తండ్రి దుర్మార్గుడు, అతను అంధకారానికి గుర్తు. 335 00:17:09,863 --> 00:17:13,242 కానీ అతనికో కొడుకు ఉన్నాడు. ఓ కొత్త పాత్ర. 336 00:17:13,325 --> 00:17:15,536 ఆ కొడుకు వెలుగుకి గుర్తు. 337 00:17:15,617 --> 00:17:17,663 వారిద్దరూ తలపడక తప్పదు. 338 00:17:18,372 --> 00:17:20,207 కానీ తండ్రిని కొడుకు నరికే ముందు, 339 00:17:20,832 --> 00:17:25,170 అతను తన తండ్రిని అంధకారం నుండి వెలుగులోకి తీసుకువస్తాడు. 340 00:17:25,252 --> 00:17:29,466 మరి అతను అక్కడ పడి చనిపోయే ముందు, అతని ముసుగు తొలగించబడుతుంది. 341 00:17:30,509 --> 00:17:33,929 ముసుగు మనిషి, కొత్త కథానాయకుడి... 342 00:17:34,012 --> 00:17:35,305 తండ్రి. 343 00:17:37,683 --> 00:17:39,101 అది... 344 00:17:40,686 --> 00:17:41,770 "స్టార్ వార్స్" కథ. 345 00:17:42,813 --> 00:17:45,107 -"స్టార్ వార్స్"? -అవును, సినిమా? 346 00:17:45,190 --> 00:17:47,317 70ల దశకంలో విడుదలైంది. భారీ చిత్రాలలో అది కూడా ఒకటి. 347 00:17:47,401 --> 00:17:50,904 70ల దశకం నాటివి సరిగ్గా గుర్తులేవని ఒప్పుకోవాలి, కానీ ఎప్పుడో విన్నట్టు ఉంది. 348 00:17:50,988 --> 00:17:53,365 అవును, సందేహమే లేదు. ఇప్పటిదాకా సుమారు 20 తీసుంటారు. ఇంకా తీస్తూనే ఉన్నారు. 349 00:17:53,448 --> 00:17:55,117 -నిజంగానా? ఎందుకు? -ఎవ్వరికీ తెలీదు. 350 00:17:55,200 --> 00:17:57,619 ఏదేమైనా, అది ఇదివరకే చెప్పబడిన కథ కాబట్టి, మనం మళ్లీ దాన్నే చెప్పకూడదు. 351 00:17:57,703 --> 00:17:59,872 ఎందుకు చెప్పకూడదు? అదొక సామాన్య కథాంశమే. 352 00:18:00,664 --> 00:18:02,958 కొన్ని వేల సంవత్సరాలుగా అదే నడుస్తోంది. 353 00:18:03,041 --> 00:18:07,004 ద ఒడిస్సీ, అర్థర్ మాహారాజు. టోల్కీన్ రాసినది ఏదైనా చూడు. ఈ ఇతిహాసాలలోనూ ఉంది. 354 00:18:07,546 --> 00:18:09,047 అవును. అది ద హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్. 355 00:18:09,131 --> 00:18:10,132 అంతే. 356 00:18:10,215 --> 00:18:11,925 ముసుగు మనిషి దుష్టుడు. నాకది నచ్చింది. 357 00:18:13,051 --> 00:18:15,179 సరే. కానీ దీనికి ఇంకా ఏదో తక్కువ అయింది, కదా? 358 00:18:15,262 --> 00:18:19,433 కథని కలిపే ఒక ప్రత్యేకమైన అంశం మనకి ఒకటి కావాలి. 359 00:18:19,516 --> 00:18:22,019 మనకి డెత్ స్టార్ కావాలి. 360 00:18:23,103 --> 00:18:26,023 ఒక "డెత్ స్టార్." 361 00:18:29,193 --> 00:18:30,194 అదేంటి? 362 00:18:30,277 --> 00:18:31,653 సరేమరి. మనం వెళ్లి ముందు ఆ సినిమాని చూద్దాం. 363 00:18:31,737 --> 00:18:33,780 ఓ విషయం చెప్పనా? ఆ సినిమాని చూద్దాం, ఆ తర్వాత మనం... 364 00:18:33,864 --> 00:18:35,199 -డెత్ స్టార్? -అవును, నా కార్యాలయానికి రా. 365 00:18:35,282 --> 00:18:36,283 దాన్ని ఎవరు నమ్ముతారు? 366 00:18:37,576 --> 00:18:39,077 నువ్వు పరిగెత్తడం ఆపుతావా? 367 00:18:39,161 --> 00:18:40,954 అతను ఫోన్ ఎత్తడం లేదు! ఎత్తు, బ్రాడ్. 368 00:18:41,038 --> 00:18:42,915 సరే. వచ్చి కారు ఎక్కు. మనం అతని ఇంటికి వెళ్తున్నాం. 369 00:18:42,998 --> 00:18:44,750 -డేవిడ్? -ఏంటి? 370 00:18:45,709 --> 00:18:47,920 -ఏంటిది? -పార్కింగ్ జరిమానాలని కట్టడం మరిచిపోయావా? 371 00:18:48,003 --> 00:18:49,630 లేదు. లేదు. నేను కట్టేశాను... 372 00:18:50,506 --> 00:18:51,757 భగవంతుడా. 373 00:18:52,758 --> 00:18:56,261 బ్రాడ్ సృష్టించిన ఆ అందమైన వనదేవత కారణంగా మనకి వచ్చిన బోనస్ తో ఈ కారును కొన్నాను. 374 00:18:57,012 --> 00:18:58,597 అసలు ఆ విషయం అతనికెలా తెలిసింది? 375 00:18:58,680 --> 00:19:01,141 నంబరు ప్లేట్ చూసి తెలుసుకున్నాడేమో? 376 00:19:01,225 --> 00:19:03,977 "వనదేవత యొక్క తండ్రి"? నిజంగానా? నువ్వు వనదేవత యొక్క తండ్రివా? 377 00:19:04,728 --> 00:19:07,231 నేను... చూడు, దాన్ని వదిలేయిలే. నీ కారులో వెళ్దాం పద. 378 00:19:07,314 --> 00:19:08,899 నాకు కార్ లేదు. లిఫ్ట్ ద్వారా ప్రయత్నిస్తాను. 379 00:19:08,982 --> 00:19:11,109 నీకు కార్ లేదా? నీకు కార్ ఎందుకు లేదు? 380 00:19:11,193 --> 00:19:13,028 నీ వద్ద 36 ల్యాప్ టాప్ లు ఉన్నాయి కానీ, ఒక్క కారు కూడా లేదు. 381 00:19:13,111 --> 00:19:15,072 నీకు మగతోడు దొరకకపోవడానికి కారణం ఇదేనని నీకు నేను చెప్పవచ్చా? 382 00:19:15,155 --> 00:19:18,116 అసలు మగతోడు దొరకంది ఎవరికో తెలుసా? నీ మాజీ భార్యకి. 383 00:19:20,327 --> 00:19:22,788 మన్నించు. కాస్త హద్దు మీరాను. నన్ను మన్నించు. అది అనుకోకుండా... 384 00:19:22,871 --> 00:19:24,748 -లేదు, నువ్వన్నది వాస్తవమే. -లేదు, అదేదో... 385 00:19:24,831 --> 00:19:27,292 నీ కంగారు నాకు అంటుకుంటున్నట్టు ఉంది. నువ్వు... నువ్వు కాస్త శాంతించాలి. 386 00:19:27,376 --> 00:19:30,504 మనం ఇంత కంగారుతో బ్రాడ్ దగ్గరికి వెళ్తే, మనం అతనికి తలొగ్గామని అతను భావిస్తాడు. 387 00:19:30,587 --> 00:19:31,880 మనం నిజంగా అతనికి తలొగ్గే ఉన్నాం. 388 00:19:31,964 --> 00:19:34,258 బాబోయ్. నా ఖాతా పనిచేయడం లేదు. 389 00:19:36,093 --> 00:19:38,136 ఎందుకంటే అది కార్పొరేట్ కార్డుతో అనుసంధానమై ఉంది కనుక. 390 00:19:38,220 --> 00:19:41,098 అది కార్పొరేట్ కార్డుతో అనుసంధానమై ఉంది, పిచ్చిపిల్లా! 391 00:19:41,181 --> 00:19:43,600 -మహిళని. -మహిళల వద్ద కార్లు ఉంటాయి! సరేమరి. 392 00:19:43,684 --> 00:19:45,102 ఏవేవో అనేసుకుంటారు. 393 00:19:45,185 --> 00:19:47,271 -సరేమరి. తిరిగి లోపలికి వెళ్దాం పద. -నాకు తెలీదు. అలాగే. 394 00:19:49,189 --> 00:19:51,733 కావాలంటే అతని ఇంటి దాకా పరుగెత్తుకొనైనా వెళ్దాం. మనకి బ్రాడ్ తక్షణమే ఇక్కడ కావాలి. 395 00:19:51,817 --> 00:19:55,529 డేవిడ్, కాస్త శాంతించు. నీ రక్తంలో చక్కెర స్థాయి కాస్త తక్కువయిందని నాకనిపిస్తోంది. 396 00:19:56,238 --> 00:19:58,115 మనం కాస్త ఏదైనా తినేసి, 397 00:19:58,198 --> 00:20:00,158 ఆ తర్వాత వివేకంతో దీని గురించి చర్చించుకుందాం. 398 00:20:03,036 --> 00:20:07,624 నా ఐస్ క్రీమ్ శాండ్విచ్ లు ఏమైపోయాయి? 399 00:20:07,708 --> 00:20:09,042 -పాపి. -ఒరేయ్ దరిద్రపు బ్రాడ్ గా! 400 00:20:09,126 --> 00:20:10,752 -నేను నా స్వంత డబ్బుతో కొనుక్కున్నాను! -పాపి. 401 00:20:10,836 --> 00:20:12,796 ఆ దరిద్రుడు నాకు దొరకగానే, వాడిని చంపిపారేస్తాను! 402 00:20:12,880 --> 00:20:14,006 అతను అక్కడే ఉన్నాడు. 403 00:20:16,925 --> 00:20:19,469 బ్రాడ్. బ్రాడ్? బ్రాడ్. మాకు నీతో పనుంది. 404 00:20:19,553 --> 00:20:22,264 చూడు, బాసూ, నా ఐస్ క్రీమ్ శాండ్విచులని ఏం... 405 00:20:22,347 --> 00:20:23,390 పాపి. 406 00:20:24,391 --> 00:20:26,768 నిన్ను కుక్క కూడు తినే కార్పొరేట్ జలగ అని పిలిచినందుకు నన్ను మన్నించు. 407 00:20:26,852 --> 00:20:28,937 -"ధన ఆశ గల హృదయంలేని కసాయి," అనుకున్నానే. -అది కూడా. 408 00:20:29,021 --> 00:20:32,065 చూడు, బ్రాడ్, దయచేసి, నువ్వు ధరలను మళ్లీ ప్రవేశపెట్టగలవా? 409 00:20:32,149 --> 00:20:34,401 -అలాగే. కానీ అది ఇప్పటికే చేసేశాను. -చేసేశావా? నువ్వు తలొగ్గేశావా? 410 00:20:34,484 --> 00:20:36,778 లేదు, లేదు. ముసుగు మనిషి ముసుగును క్యాసినోలో తీయడానికి ఐయాన్ అంగీకరించాడు, 411 00:20:36,862 --> 00:20:38,113 కాబట్టి నాకు కావలసినదంతా దక్కింది. 412 00:20:38,739 --> 00:20:42,743 అవును. చూడండి, ఆన్నింటినీ ఎలా ఏకం చేయాలో, నేనూ, సీ.డబ్ల్యూ. కనిపెట్టేశాం. 413 00:20:42,826 --> 00:20:45,746 ముసుగు మనిషి అనేవాడు క్యాసినోలో నివాసముండే దుష్టుడు. 414 00:20:45,829 --> 00:20:46,955 అవును, అది అర్థవంతమైనదే, 415 00:20:47,039 --> 00:20:49,166 ఎందుకంటే ముసుగు మనిషి, స్వయాన నడిచే క్యాసినో లాంటి వాడు. 416 00:20:49,249 --> 00:20:51,168 పరికరాలు ఇచ్చువాడు, పరికరాలు తీసుకొనువాడు కదా. 417 00:20:51,251 --> 00:20:52,336 దీన్ని చూడండి. 418 00:20:53,253 --> 00:20:55,547 "ముసుగు మనిషి యొక్క ఆటల మరియు భాగ్య నిలయం." 419 00:20:55,631 --> 00:20:58,967 అంతేగాక, మనం శ్వేత యోధుడు అనే పాత్రని కూడా సృష్టించబోతున్నాం, 420 00:20:59,051 --> 00:21:01,053 అతని ముసుగు మనిషితో తలపడటానికని ఉద్దేశింపబడ్డాడు, 421 00:21:01,136 --> 00:21:04,014 ఇక చివరికి... క్యాసినో వద్ద అతని ముసుగును తీసేస్తాడు. 422 00:21:04,097 --> 00:21:08,477 చూశారా, ఆటగాళ్ళని క్యాసినో దాకా కథ తీసుకు వస్తుంది, అక్కడ వారి సొమ్ము ఖాళీ అవుతుంది. 423 00:21:08,560 --> 00:21:11,522 మిత్రులారా, ఇది కళ మరియు వాణిజ్యం యొక్క సరైన కలయిక. 424 00:21:11,605 --> 00:21:13,357 కానీ, ఐయాన్, నీకు బ్రాడ్ అంటే పడదు కదా? 425 00:21:13,732 --> 00:21:16,193 అతనంటే పడదా? అవును, అతనంటే నాకు పడని మాట వాస్తవమే. 426 00:21:16,276 --> 00:21:18,695 -అవును, ఇతడిని నేనస్సలు పట్టించుకోను కూడా. -ఇతను ఓ ఉన్మాది. 427 00:21:18,779 --> 00:21:22,908 కానీ మన ఆట నడవడానికి అసలైన కారణం ఇతను తీసుకువచ్చే డబ్బే. 428 00:21:23,909 --> 00:21:25,369 అది మీకు అర్థమైంది, కదా? 429 00:21:26,578 --> 00:21:27,621 -అవును. -అవును, సందేహమే లేదు. 430 00:21:27,704 --> 00:21:28,872 -అవునులే. -అది సుస్పష్టమైన విషయం. 431 00:21:28,956 --> 00:21:30,874 -అవును. -మేము ప్రశాంతంగానే ఉన్నాం. అవును. 432 00:21:30,958 --> 00:21:33,043 -నిజంగా, డేవిడ్, నువ్వు ప్రశాంతంగా లేవు. -లేదు. 433 00:21:33,126 --> 00:21:35,671 అంటే... అవును. నేను ప్రశాంతంగానే ఉన్నానని తనే చెప్పింది. 434 00:21:36,588 --> 00:21:38,048 నేను అబద్దం చెప్పాను. 435 00:21:42,553 --> 00:21:43,971 సరేమరి. మంచిది. 436 00:21:44,054 --> 00:21:46,306 అయితే, మీరు క్యాసినోకి కాస్త మెరుగులు దిద్దగలరు అనుకుంటా. లోపాలు చాలా ఉన్నాయి. 437 00:21:46,390 --> 00:21:49,351 లెక్కలేనన్ని ఉన్నాయని టెస్టర్లు చెప్పారు. మీకు అది ఆనందం కలిగించే విషయం. 438 00:21:49,434 --> 00:21:51,520 అవును. అది ఈమె పని, నాది కాదు. హేయ్, మనలో మన మాట, ఎవరది? 439 00:21:52,646 --> 00:21:53,689 ముసుగు మనిషి. ఎవరది? 440 00:21:53,772 --> 00:21:58,360 అవును. ముసుగు మనిషి శ్వేత యోధుడి తండ్రి. 441 00:22:00,028 --> 00:22:01,321 "స్టార్ వార్స్" లాగా అనమాట. 442 00:22:01,905 --> 00:22:05,117 అవును, కాస్త "స్టార్ వార్స్"కి పోలిక ఉంది. మీరు గమనించరేమోనని అనుకున్నాను. 443 00:22:06,535 --> 00:22:08,203 పని చేయకుండా చాలా సేపు భలేగా గడిపాం కదా? 444 00:22:08,287 --> 00:22:09,288 టెస్టింగ్ 445 00:22:09,371 --> 00:22:11,290 నిన్న రాత్రి, సుమారు వంద లోపాలను మనం జాబితా చేశాం. 446 00:22:11,373 --> 00:22:13,834 హేయ్, మన వ్యక్తిగత రికార్డును మనమే బద్దలుకొట్టేశాం. 447 00:22:14,293 --> 00:22:16,879 -కలల లోకంలో జీవిస్తున్నాం! -అవును. 448 00:22:20,966 --> 00:22:22,009 ఇక... 449 00:22:24,469 --> 00:22:26,054 వాస్తవానికి వచ్చేశాం. 450 00:22:26,597 --> 00:22:27,598 అవును. 451 00:22:34,271 --> 00:22:36,773 పని చేసేశామని వాళ్ళకి చెప్తా మరి. 452 00:22:37,065 --> 00:22:38,233 -మంచిది. -మంచిది. 453 00:22:38,317 --> 00:22:39,359 అవును. 454 00:22:40,319 --> 00:22:42,029 సరేమరి. రేపు కలుద్దాం. 455 00:22:42,112 --> 00:22:44,740 అలాగే. ప్రశాంతంగా గడుపు, గడుసు పిల్లా. 456 00:24:11,118 --> 00:24:13,120 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య