1 00:00:04,463 --> 00:00:05,464 వావ్. 2 00:00:06,507 --> 00:00:08,007 "మిథిక్ క్వెస్ట్ ని వదిలేయడం." 3 00:00:08,090 --> 00:00:09,801 కనీసం చెప్పటానికి కూడా విచిత్రంగా అనిపిస్తుంది. 4 00:00:10,302 --> 00:00:11,637 నేను ఇక్కడే పెరిగినట్టు అనిపిస్తుంది. 5 00:00:11,720 --> 00:00:13,096 మంచిది, పాపి. 6 00:00:13,180 --> 00:00:16,350 కానీ నువ్వు ఇక్కడ చేరబోయే తేదీ నాకు కావాలి, అంతే. 7 00:00:16,767 --> 00:00:18,393 అక్కడ నీ నోటీసును ఎప్పుడు ఇవ్వబోతున్నావు? 8 00:00:18,477 --> 00:00:19,811 ఇవాళే. ఇప్పుడే ఇస్తున్నాను. 9 00:00:19,895 --> 00:00:21,605 సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను, అంతే. 10 00:00:21,688 --> 00:00:24,107 అతని మనసు ఊరికే మారిపోతూ ఉంటుంది. 11 00:00:24,775 --> 00:00:26,777 తమకి తాము గొప్పవాళ్ళు అనుకొనే వీళ్ళ మనసు ఎలా మారితే అలా మనం నడుచుకోవలసి వస్తుంది. 12 00:00:26,860 --> 00:00:28,570 కాసేపు ఇదంటారు, కాసేపు అదంటారు, అటు అంటారు, ఇటు అంటారు. 13 00:00:28,654 --> 00:00:30,030 అసలు ఫలితం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. 14 00:00:30,113 --> 00:00:32,991 మంచి విషయం ఏమిటంటే, నువ్వు ఆ పాట్లు ఎక్కువ కాలం పాటు పడవలసిన అవసరం ఉండదు. 15 00:00:33,075 --> 00:00:36,036 ఎందుకంటే మేమిక్కడ విశ్వసనీయతకి, స్థిరత్వానికి పెద్దపీట వేస్తాం. 16 00:00:36,411 --> 00:00:39,998 మంచిది. ఎందుకంటే ఈ నాటకీయతని భరించడం ఇక నా వల్ల కాదు. 17 00:00:42,000 --> 00:00:44,253 ఐయాన్, మనం మాట్లాడుకోవాలి. ఎక్కడున్నావు? 18 00:00:44,670 --> 00:00:45,879 ఇక్కడ ఉన్నాను. 19 00:00:47,089 --> 00:00:49,132 నిన్ను అక్కడ చూడలేదు. 20 00:00:49,967 --> 00:00:51,385 మన్నించు, ఏం చేస్తున్నావు? 21 00:00:51,468 --> 00:00:52,761 ఏం లేదు. 22 00:00:53,220 --> 00:00:55,722 నీ కనుల ముందే... 23 00:00:56,890 --> 00:00:58,225 సంకట స్థితిలో ఉన్న ఓ వ్యక్తి ఉన్నాడు, అంతే. 24 00:01:00,435 --> 00:01:02,396 కమాన్. 25 00:01:15,617 --> 00:01:18,745 సరేమరి. నువ్వు ప్రదర్శన ఇవ్వడానికి సిద్దంగా ఉన్నావా, వైల్డ్_డీ? 26 00:01:19,454 --> 00:01:21,540 బ్రాడ్, ఇవాళ నేను కాస్త త్వరగా వెళ్తే పర్వాలేదా? 27 00:01:21,832 --> 00:01:25,043 నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం నీకు నచ్చదని నాకు తెలుసు, కానీ చాలా సేపు పని... 28 00:01:25,127 --> 00:01:27,629 నువ్వన్నది నిజమే. నీ వ్యక్తిగత జీవితం గురించి నువ్వు మాట్లాడటం నాకు నచ్చదు. 29 00:01:27,713 --> 00:01:29,673 ఇక, నువ్వు నా కొత్త ఉత్పత్తికి ప్రచారం చేయడం మొదలుపెట్టాలి. 30 00:01:29,756 --> 00:01:31,842 దాని పేరు, కాలానుబంధ ఖడ్గం. కూర్చో. 31 00:01:31,925 --> 00:01:33,969 సరే, నేను ఆటలో చేర్చబోయే ఓ కొత్త అరుదైన వస్తువు ఇది. 32 00:01:34,052 --> 00:01:36,221 ధర 250 డాలర్ల వరకూ పెడతాననుకో. 33 00:01:36,305 --> 00:01:38,807 తమాషాలాడుతున్నావా? అంత పెట్టి ఎవ్వరూ దాన్ని కొనరు. 34 00:01:38,891 --> 00:01:40,184 లేదు, కొనకపోవచ్చు. 35 00:01:40,267 --> 00:01:42,978 కానీ, ఒక డ్రాగన్ తో తలపడాల్సి వస్తే, వాళ్ళకి దాని అవసరం ఉంటుంది. 36 00:01:43,061 --> 00:01:45,898 వాళ్ళని ఉదయాన్నే మేల్కొల్పేటటువంటి వాళ్ళకి అందని వస్తువు. 37 00:01:45,981 --> 00:01:47,983 హేయ్! నా సహోద్యోగులంతా ఏమైపోయారు? 38 00:01:48,859 --> 00:01:49,943 హేయ్, డానా. 39 00:01:50,444 --> 00:01:51,486 ఏంటి సంగతి, బ్రాడ్లీ? 40 00:01:51,570 --> 00:01:54,406 యుద్ధానికి సంబంధించిన బట్టలు ధరించావనమాట. వాటిని నేను లెక్కలేనన్ని అమ్మాను. 41 00:01:54,489 --> 00:01:56,241 నేను సామాన్యతను అవలంబిస్తున్నాను. 42 00:01:56,325 --> 00:01:57,451 ముసుగు మనిషి ఎవరు? 43 00:01:57,534 --> 00:02:00,495 చూడు, ముసుగు మనిషి, పూటీయే అనే విషయం జనాలకు బాగా నచ్చింది. 44 00:02:00,913 --> 00:02:02,539 కానీ నేను ఆ కథ ఆద్యంతం 45 00:02:02,623 --> 00:02:05,334 పరమ దరిద్రంగా ఉందని అనుకున్నాను. 46 00:02:05,417 --> 00:02:06,502 చాలా పదునైన అభిప్రాయం. 47 00:02:07,461 --> 00:02:10,130 కానీ, కటకటా, జనం తమ అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. 48 00:02:10,214 --> 00:02:12,549 కాబట్టి, నేను ఆ ప్రవాహంతో పాటు ప్రయాణిస్తూ 49 00:02:12,633 --> 00:02:17,471 అందరికీ అమోదయోగ్యమైన సామాన్య తరంగంతో కొట్టుకొనిపోతాను. 50 00:02:18,055 --> 00:02:19,598 నా ఉద్దేశం, నాకు ఏం తెలుసులే? 51 00:02:21,517 --> 00:02:22,809 ఫ్రైస్ కావాలా? 52 00:02:22,893 --> 00:02:24,937 సరేమరి, అతనికి ఏదో అయింది. 53 00:02:25,020 --> 00:02:27,689 బాగా నవ్వాలి, మనం చిత్రీకరణని ప్రారంభిస్తున్నాం. 54 00:02:28,148 --> 00:02:29,775 భగవంతుడా! 55 00:02:30,359 --> 00:02:31,818 వైల్డ్_డీ. 56 00:02:32,945 --> 00:02:35,239 ఇవాళ మీ అందరితో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నందకు, అలాగే నాకు మెయిల్ ద్వారా 57 00:02:35,322 --> 00:02:37,783 వచ్చిన ఈ కొత్త ఆటని ప్రయత్నిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 58 00:02:38,283 --> 00:02:40,077 ఇది నా స్పాన్సర్లలో ఒకరు నాకు పంపారు. 59 00:02:40,160 --> 00:02:42,788 ఏదో తేడాగా ఉంది. తను కలత చెందినట్టుగా అనిపిస్తుంది. 60 00:02:42,871 --> 00:02:43,997 అవును. 61 00:02:45,541 --> 00:02:47,084 సరేమరి. ఇక మొదలుపెడదాం. 62 00:02:47,167 --> 00:02:48,919 నువ్వు ముఖకవళికలను చదవకుండా ఉండలేవా? 63 00:02:49,336 --> 00:02:51,171 అది ఉన్మాదులలో కనబడే ప్రధాన లక్షణం. 64 00:02:51,463 --> 00:02:53,006 నేను ఉన్మాదిని కాదు, లూ. 65 00:02:54,633 --> 00:02:57,302 అవును, కాకపోవచ్చులే. సాధారణంగా ఉన్మాదులు ఆకట్టుకొనే విధంగా ఉంటారు. 66 00:02:58,011 --> 00:03:00,848 తనని ఏ విషయమైనా కలచివేస్తున్నప్పుడు నాకు తెలిసిపోతుంది, సరేనా? 67 00:03:01,723 --> 00:03:03,767 పాన్ కేకులు, చక్కగా మెత్తగా ఉంటాయి. 68 00:03:03,851 --> 00:03:05,727 వేఫుల్స్, కరకరమంటాయి. 69 00:03:05,811 --> 00:03:06,937 నేను ఏదోకటి చేయాలి. 70 00:03:07,271 --> 00:03:09,439 మంచిది, కానీ నీ పథకం ఏంటి? ఆశపెట్టి తనని అడవులలోకి తీసుకెళ్తావా? 71 00:03:09,523 --> 00:03:11,316 నేను ఉన్మాదిని కాదు, లూ! అర్థమైందా? 72 00:03:11,400 --> 00:03:12,901 నేను తనని ఆశపెట్టి... 73 00:03:13,861 --> 00:03:16,280 బయటకు తీసుకెళ్లి, నవ్వులు చిందించేలా చేస్తాను. 74 00:03:17,489 --> 00:03:20,117 రేచల్, నన్ను మన్నించు. కానీ తనని హత్య చేయకు. 75 00:03:20,534 --> 00:03:21,618 ఇప్పుడు నేనెందుకు నీవైపు తిరిగాను? 76 00:03:21,702 --> 00:03:23,370 ఎందుకంటే నీకు నా మీద మనసు ఉంది. 77 00:03:23,453 --> 00:03:26,999 కానీ నేను నీకు స్పష్టంగా చెప్పేశాను. నీ పట్ల నాకు అలాంటిదేమీ లేదని. 78 00:03:30,836 --> 00:03:31,712 గ్రిమ్ 79 00:03:35,299 --> 00:03:37,384 మనం ఇక్కడికి వచ్చేశాం మరి. ప్రధాన రహదారి మీదకి. 80 00:03:40,095 --> 00:03:45,058 ఇది ప్రధాన రహదారి. ప్రధాన... ఈ సంగీతాన్ని కాస్త తగ్గిస్తాను! 81 00:03:45,142 --> 00:03:46,143 అలాగే. 82 00:03:46,435 --> 00:03:48,187 ప్రధాన రహదారి. 83 00:03:49,897 --> 00:03:51,607 మరి, మనం ఎక్కడికి వెళ్తున్నాం? 84 00:03:51,940 --> 00:03:53,942 అది నీకు చెప్పలేను, పాప్. నువ్వు నన్ను నమ్మాలి. 85 00:03:54,026 --> 00:03:58,030 కానీ నువ్వు ఇక్కడ నాతో పాటు ఉండటం నాకు ముఖ్యమని మాత్రం తెలుసుకో. 86 00:03:59,031 --> 00:04:02,242 ఇది నేను ఎంతోకాలం క్రిందటే చూసుకొని ఉండవలసిన విషయం. 87 00:04:03,452 --> 00:04:04,453 అవును. 88 00:04:04,912 --> 00:04:08,707 అవును, అప్పుడప్పుడూ విషయాలు పెద్దవి కాకముందే వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 89 00:04:09,499 --> 00:04:11,877 నేటికి మనం ఎంత కాలం నుండి కలిసి పనిచేస్తున్నాం? 90 00:04:11,960 --> 00:04:13,253 సుమారు ఎనిమిదేళ్ళ నుండి? 91 00:04:14,087 --> 00:04:15,839 ఏమో. క్యాలండర్ల విషయాలు నాకు పెద్దగా గుర్తుండవు. 92 00:04:15,923 --> 00:04:17,216 అవును, అవునులే. 93 00:04:17,841 --> 00:04:21,094 నేను ఏం చెప్తున్నానంటే, జీవితం చిత్రమైనది, కదా? 94 00:04:23,972 --> 00:04:24,973 -కాదు. -అలాగే. 95 00:04:25,057 --> 00:04:27,100 అయితే, నా ఆలోచనని చెప్పేస్తాను విను. 96 00:04:27,768 --> 00:04:30,103 మనం ఒకరికొకరం చాలా కాలం నుండి తెలుసు. 97 00:04:30,187 --> 00:04:32,231 నా ఉద్దేశం, నాకు 19 ఏళ్ళప్పుడు 98 00:04:32,314 --> 00:04:35,567 నువ్వు ఎంఐటీ నుండి ఎంచుకున్నప్పటికీ, నేటికీ నేను పూర్తిగా మారిపోయాను. 99 00:04:35,651 --> 00:04:37,277 ఇంకా... ఇంకా అప్పుడప్పుడు, ఐయాన్... 100 00:04:37,361 --> 00:04:39,905 నా అసలు పేరు "ఈయన్" అని నీకు తెలుసా? 101 00:04:40,906 --> 00:04:41,990 ఏంటి? 102 00:04:42,074 --> 00:04:43,784 "ఈయన్" మా నాన్న పేరు. 103 00:04:44,660 --> 00:04:47,204 అతను... మంచి వాడు కాదు. 104 00:04:50,707 --> 00:04:55,462 నింటెండో ఆటని సమయానికి ఆపనందుకు మా నాన్న నాకు పెట్టిన సిగరెట్ వాత ఇది. 105 00:04:55,879 --> 00:04:58,215 అయ్యయ్యో. అది దారుణమైన విషయం. 106 00:04:59,341 --> 00:05:00,717 నీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయా? 107 00:05:02,845 --> 00:05:03,846 లేదు. 108 00:05:06,056 --> 00:05:07,432 అది గొప్పదేం కాదులే. 109 00:05:08,350 --> 00:05:12,020 ఏదేమైనా, అతని పేరు నాకు ఉండకూడదని ఒకరోజు నేను నిర్ణయించుకున్నాను. 110 00:05:12,104 --> 00:05:15,232 అందుకని నన్ను నేను "ఐయాన్" అని పిలుచుకోవడం మొదలుపెట్టాను. 111 00:05:16,149 --> 00:05:17,442 నా పేరు అలా మారింది మరి. 112 00:05:19,903 --> 00:05:21,864 ఈ విషయం ఇంతవరకూ నేనెవ్వరీకి చెప్పలేదు. 113 00:05:23,365 --> 00:05:25,200 మరి ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? 114 00:05:28,579 --> 00:05:29,955 ఏమో. 115 00:05:32,916 --> 00:05:36,461 హేయ్, పాప్. నేను నీకు ఎంత విలువ ఇస్తానో, అది నీకు ఎప్పుడూ చెప్తూ ఉండనని తెలుసు, 116 00:05:36,545 --> 00:05:38,172 అదే, నువ్వు చేసే పని విషయంలో, 117 00:05:38,255 --> 00:05:40,674 కానీ నేను గట్టిగా ప్రయత్నిస్తాను. 118 00:05:41,300 --> 00:05:44,052 గట్టిగా ప్రయత్నిస్తానని, మాటిస్తున్నాను. ఖచ్చితంగా మెరుగవుతాను. 119 00:05:47,014 --> 00:05:50,809 ఎందుకు, గురూ? ఎందుకు? ఇప్పుడే ఎందుకు? ఎందుకు? 120 00:05:50,893 --> 00:05:53,228 ఎప్పుడు చెప్పినా ఒకటే కదా? 121 00:05:55,230 --> 00:05:59,234 సరే, ఇది నేను అనుకున్నట్టు అస్సలు జరగడం లేదు. 122 00:06:07,367 --> 00:06:09,119 అదుగో కథానాయకుడు వచ్చేశాడు. 123 00:06:09,203 --> 00:06:10,621 అభినందనలు, మిత్రమా. 124 00:06:12,080 --> 00:06:16,418 ఇప్పుడే మనం అదేదో కాలానుబంధ ఖడ్గం ద్వారా పావు మిలియన్ డాలర్లని సంపాదించాం, 125 00:06:16,502 --> 00:06:18,795 ఏంటది? చెప్పు. 126 00:06:20,172 --> 00:06:22,090 అది అసంభవం. నేను ఇప్పుడే దాన్ని విపణిలోకి ప్రవేశపెట్టాను. 127 00:06:22,174 --> 00:06:24,134 రెండు లక్షలా యాభై వేల డాలర్లు. అద్భుతం. 128 00:06:24,218 --> 00:06:25,427 నువ్వు సంబరపడిపోతూ ఉండాలి. 129 00:06:26,261 --> 00:06:28,472 అవును, ఉండాలి. నా ఉద్దేశం, సంబరపడిపోతున్నాను. 130 00:06:29,640 --> 00:06:30,933 నేను సంబరపడటం లేదు. నాకు వాంతి వచ్చేలా ఉంది. 131 00:06:31,016 --> 00:06:33,977 భగవంతుడా. ఒక బంగళాని కొనేంత ధరకి నేను గాలిలో మేడని అమ్మానా? 132 00:06:34,061 --> 00:06:35,395 సరే, నేను కాస్త కుదురుగా కూర్చోవాలి. 133 00:06:35,479 --> 00:06:37,022 నీకు... నీకు ఏమీ కాలేదు కదా, మిత్రమా? 134 00:06:37,105 --> 00:06:39,733 లేదు. ఈ సౌదీ యువరాజులూ, ఆ సిలికాన్ వ్యాలీ దద్దమ్మలూ 135 00:06:39,816 --> 00:06:41,568 నేను ఏ చెత్త పెట్టినా అది కొనేస్తారబ్బా. 136 00:06:41,652 --> 00:06:44,196 దానర్థం నా ఉద్యోగం వృధా అని. 137 00:06:46,156 --> 00:06:47,533 నేనసలు ఏం చేస్తున్నాను? 138 00:06:48,242 --> 00:06:51,703 ఐయాన్, నన్ను కాదని పాపిని తన అసిస్టెంట్ గా పెట్టుకున్ననాటి నుండీ నాక్కూడా అలాగే ఉంది. 139 00:06:52,120 --> 00:06:54,289 పాపి ఏమీ ఐయాన్ అసిస్టెంట్ కాదు. నువ్వు కూడా కాదు. 140 00:06:54,373 --> 00:06:56,375 నువ్వు పుండు మీద కారం చల్లనవసరం లేదు, డేవిడ్. 141 00:07:00,295 --> 00:07:03,006 సరే. వినండి. 142 00:07:03,549 --> 00:07:08,303 నా సిబ్బంది కుదేలైనప్పుడు, ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నేను వాళ్ళకి సహకరించాలి. 143 00:07:08,387 --> 00:07:10,889 చింతించకండి. ఇలాంటి వాటిని నేను గతంలో చాలా విజయవంతంగా వ్యవహరించాను. 144 00:07:11,515 --> 00:07:13,517 డిజిటల్ అసెట్స్ లోని టెడ్డీ విల్లారియల్ ని మినహాయించి, 145 00:07:13,600 --> 00:07:15,936 అతను ఏదేమైనా ఆ బండ రాళ్ళ క్వారీలోకి దూకాలని నిశ్చయించేసుకున్నాడు. 146 00:07:16,019 --> 00:07:17,813 సరే, ఏదేమైనా, మనం మొదలుపెడదాం, 147 00:07:17,896 --> 00:07:21,024 చిటికెలో మీరు మళ్లీ చిరునవ్వులు చిందించేలా చేస్తాను. 148 00:07:21,692 --> 00:07:23,735 బాగుంది కదా? ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? 149 00:07:25,821 --> 00:07:27,865 -అడుగు. -టెడ్డీకి ఏమైంది? 150 00:07:27,948 --> 00:07:30,075 మీరేమనుకుంటున్నారో సరిగ్గా అదే జరిగింది. 151 00:07:30,158 --> 00:07:31,493 -ఏంటి? -అతని శవం దొరికిందా? 152 00:07:31,577 --> 00:07:33,370 చాలినంత దొరికిందిలే. టెడ్డీ గురించి ఇక అడగవద్దు. 153 00:07:33,453 --> 00:07:35,080 మనం చేయబోయేదాని గురించి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? 154 00:07:35,163 --> 00:07:36,540 ఇక కొనసాగిద్దాం కానివ్వండి. మొదలుపెడదాం. 155 00:07:40,043 --> 00:07:42,462 బాగుంది! హోటల్. నాకు తినాలనుంది. 156 00:07:43,422 --> 00:07:46,091 పాప్, నువ్వు ఈ కారులోనే ఉండు. 157 00:07:46,758 --> 00:07:48,093 ఈ పనిని నేనొక్కడినే చేయాలి. 158 00:07:48,427 --> 00:07:49,970 కానీ నీతో రమ్మని నన్ను నువ్వు పిలిచావు. 159 00:07:50,053 --> 00:07:52,431 అవును. ఇప్పటిదాకా చాలా చక్కని పనితీరును కనబరిచావు. 160 00:07:53,974 --> 00:07:56,685 సరే. అలాగే, కానివ్వు. 161 00:07:56,768 --> 00:07:57,603 అలాగే. 162 00:07:57,686 --> 00:07:59,897 నిజానికి, నేను లోపలికి వెళ్లేసి, బాత్రూమ్ కి అలా వెళ్ళేసి ఇలా వచ్చేయనా? 163 00:07:59,980 --> 00:08:00,981 వద్దు. 164 00:08:01,064 --> 00:08:02,399 అలాగే. 165 00:08:02,482 --> 00:08:05,652 సరే, నువ్వు ఏం చేస్తున్నా కానీ, దానికి నీకు గుడ్ లక్. 166 00:08:06,945 --> 00:08:08,197 నిజంగా, ధన్యవాదాలు... 167 00:08:09,948 --> 00:08:10,991 భాగస్వామి. 168 00:08:12,993 --> 00:08:16,079 అలాగే... భాగస్వామి. 169 00:08:39,352 --> 00:08:42,147 హేయ్, డాన్ విలియమ్స్. నేను పాపిని. 170 00:08:42,563 --> 00:08:43,565 మళ్లీ నేనే. 171 00:08:43,649 --> 00:08:47,319 చూడు, ఇక్కడ నా పరిస్థితి మారిపోయింది. 172 00:08:47,402 --> 00:08:49,571 ఐయాన్, నేనూ ఓ అంగీకారానికి వచ్చాం, 173 00:08:49,655 --> 00:08:51,740 ఇప్పట్నుండీ పరిస్థితులలో మార్పు ఉంటుంది. 174 00:08:51,823 --> 00:08:54,326 మన్నించాలి, కానీ మనస్పూర్తిగా చెప్పాలంటే, 175 00:08:54,409 --> 00:08:56,912 ఇప్పుడు నేనిక్కడే ఉండాలి అని అనుకుంటున్నాను. 176 00:08:58,163 --> 00:09:00,666 నన్ను క్షమించు. 177 00:09:01,542 --> 00:09:03,919 సరే, ఉంటాను. 178 00:09:24,398 --> 00:09:25,899 హలో, బ్రెండన్. 179 00:09:26,775 --> 00:09:27,860 హలో, డాడ్. 180 00:09:31,071 --> 00:09:35,617 ఏ ఉద్యోగమైనా ఎక్కువ కాలం పాటు పనిచేస్తే పసలేనట్టు అనిపించడం మొదలవుతుంది. 181 00:09:35,701 --> 00:09:37,369 అందుకనే ఒక పనిదినాన్ని 182 00:09:37,452 --> 00:09:40,831 నిర్ణీత కార్యాలుగా విభజించి, ఆ తర్వాత నిర్ణీత బహుమానాలను ఇవ్వగల 183 00:09:40,914 --> 00:09:43,458 వ్యవస్థని నేను ప్రవేశపెట్టబోతున్నాను. 184 00:09:43,542 --> 00:09:45,836 నాకు ఆనందానిచ్చే ఒక చిన్ని వస్తువును 185 00:09:46,545 --> 00:09:49,548 నాకు నేను బహుమానంగా ఇచ్చుకుంటున్నాను. 186 00:09:50,883 --> 00:09:51,884 కుకీయా? 187 00:09:51,967 --> 00:09:54,344 నా జాబితాలోని కార్యాలన్నింటినీ నేను పూర్తిచేసేస్తే, 188 00:09:54,428 --> 00:09:56,847 ఈ రుచికరమైన తినుబండారాన్ని నాకు నేను బహుమానంగా ఇచ్చుకుంటాను. 189 00:09:58,974 --> 00:10:00,058 నాకు చాకొలెట్లు అంటే ప్రాణం. 190 00:10:00,142 --> 00:10:02,936 నీ పని నువ్వు చేయడానికి నీకు నువ్వు కుకీ ఇచ్చుకుంటావా? 191 00:10:03,645 --> 00:10:04,730 అది దారుణం. 192 00:10:04,813 --> 00:10:09,151 లేదు, లేదు. నా పని కొంచెం చేసినందుకు నాకు నేను కుకీని ఇచ్చుకుంటాను. 193 00:10:09,234 --> 00:10:10,652 ఇప్పుడు అంత దారుణంగా అనిపిస్తుందా? 194 00:10:10,736 --> 00:10:13,155 టెడ్డీ, రాళ్ళ క్వారీలోకి కిందికి తల పెట్టి ఎందుకు దూకాడో ఇప్పుడు నాకర్థమవుతోంది. 195 00:10:13,238 --> 00:10:14,489 లేదు! అది కాదు... 196 00:10:14,573 --> 00:10:17,492 చూడండి, ఒక మానసిక రుగ్మతని కుకీ ఇచ్చి నేను బాగుచేయలేను. 197 00:10:18,035 --> 00:10:19,578 మీకు మరో విషయం చెప్తాను, అతనికి చావాలని ఉంది. 198 00:10:19,661 --> 00:10:22,581 టెడ్డీ, తన డర్ట్ బైక్ తో సహా ఆ క్వారీలోకి దూకడాన్ని ఎవ్వరూ ఆపగలిగేవారు కాదు. 199 00:10:23,165 --> 00:10:24,917 ఎంత వెలుగు ఉన్నా, అతను అంధకారాన్ని మాత్రమే చూసేవాడు. 200 00:10:25,000 --> 00:10:29,671 ఇప్పుడు, మీరందరూ పనిచేయడానికి మీకు నచ్చే బహుమానం గురించి మనం చర్చించాలి. 201 00:10:29,755 --> 00:10:32,174 మరి, బ్రాడ్, నీకు చిరు ఆనందాన్ని కలిగించే వస్తువు ఏంటి? 202 00:10:32,966 --> 00:10:35,469 -జంతువులు వేటాడే వీడియోలు. -ఏంటది? అదేంటో నాకు తెలియదు. 203 00:10:35,552 --> 00:10:37,554 అదే, కిల్లర్ వేల్ సీల్ ని వేటాడి తినడం, 204 00:10:37,638 --> 00:10:40,140 లేదా ఒక చిరుత ఒక జింకని వెంటాడి దాని మెడను కొరికేయడం. 205 00:10:40,224 --> 00:10:41,225 అలాంటి వీడియోలు. 206 00:10:41,308 --> 00:10:43,352 నువ్వు ఈ వీడియోని చూశావా, దానిలో ఒక మొసలి ఓ కొండ చిలువని కరుస్తుంది, 207 00:10:43,435 --> 00:10:46,230 కానీ ఆ కొండ చిలువ మొసలిని పెనవేసుకుంటుంది, దానితో రెండూ చనిపోతాయి కదా? 208 00:10:46,313 --> 00:10:47,481 -అది అద్భుతంగా ఉంటుంది. -సరేమరి. 209 00:10:47,564 --> 00:10:49,399 కుకీతో సరిపెట్టుకుందాంలే, మిత్రులారా. 210 00:10:49,483 --> 00:10:51,693 ఇది తేలికైన బహుమానంలాగా అనిపిస్తుంది. 211 00:10:51,777 --> 00:10:54,947 మరి, తరువాత మనం ఒక నిర్వహణీయ కార్యాన్ని గుర్తించాలి. 212 00:10:55,030 --> 00:10:57,199 మరి, బ్రాడ్, తరువాత నువ్వు ఏం సాధించగలవని అనుకుంటున్నావు? 213 00:10:57,282 --> 00:10:59,618 ఏమో. బహుశా మనం కొలీజియం యొక్క నామకరణ హక్కులను 214 00:10:59,701 --> 00:11:01,203 ఒక మిలియన్ డాలర్లకు అమ్మవచ్చేమో. 215 00:11:01,870 --> 00:11:04,164 అది చాలా మంచి ఆలోచన. భలే వాడివి నువ్వు! 216 00:11:04,248 --> 00:11:06,875 "కొలీజియం యొక్క నామకరణ హక్కులు." ఇది నాకు భలే నచ్చింది. 217 00:11:07,292 --> 00:11:11,338 హేయ్, ఓ విషయం చెప్పనా? దీన్నే నేను విజయవంతమైన కార్యమని పిలుస్తాను. 218 00:11:11,421 --> 00:11:13,924 బ్రాడ్ ఒక కుకీని దక్కించుకున్నాడు. 219 00:11:15,092 --> 00:11:16,927 దీన్ని సగం చేస్తాను. 220 00:11:18,136 --> 00:11:19,721 దీన్ని మళ్లీ ఇంకో సగం చేస్తాను. 221 00:11:19,805 --> 00:11:22,099 దాన్ని చూడు. ఆ ముక్కలో చాకొలెట్ ముక్కలు చాలా వచ్చాయి. 222 00:11:22,182 --> 00:11:23,559 అది చాలా రుచికరంగా ఉంటుంది. 223 00:11:23,642 --> 00:11:26,854 సరేమరి. జో, ఈరోజు నువ్వేం సాధించాలనుకుంటున్నావు? 224 00:11:27,396 --> 00:11:30,399 నేను రోజూ కోరుకునేదే సాధించాలనుకుంటున్నా: తమ లక్షాలను సాధించడంలో జనాలకు సాయపడటం. 225 00:11:30,482 --> 00:11:31,984 అది అద్భుతంగా ఉంది, ఇంకా విచిత్రంగా వింతగా ఏం లేదు. 226 00:11:32,067 --> 00:11:34,152 నువ్వు దాన్ని ఇవాళ సాధించవచ్చు. నీ పని అదే. 227 00:11:34,236 --> 00:11:35,487 కానీ ఐయాన్ ఇక్కడ లేడు. 228 00:11:35,571 --> 00:11:38,991 కానీ నేనున్నాను కదా, నీ బాస్ ని నేనే, అర్థమైందా? 229 00:11:39,074 --> 00:11:41,201 నాకు సహకరించు. అర్థమైందా? 230 00:11:42,160 --> 00:11:44,496 -అర్థమైందనే అనుకుంటా. -తను అనుకుంటుంది. చూశావా. 231 00:11:44,580 --> 00:11:46,540 మనం పురోగతి సాధిస్తున్నాం. అద్భుతంగా ఉంది. 232 00:11:46,623 --> 00:11:50,169 సరేమరి, కాబట్టి, ఇవాళ మీకు సహకరించడమే నా పని. 233 00:11:50,252 --> 00:11:54,840 కాబట్టి, ఒక విధంగా, మీకు సహకరించడం ద్వారా నేను మీకు ఓ మంచి అసిస్టెంట్ కాగలను. 234 00:11:55,799 --> 00:11:58,760 ఇదంతా చాలా గందరగోళంగా ఉంది. నేను మాట్లాడకుండా కేవలం నోట్స్ తీసుకుంటాను. 235 00:11:59,261 --> 00:12:00,679 ఆవిడని చూడు. 236 00:12:00,762 --> 00:12:02,931 హేయ్, జో, నువ్వు నాకు సహకరించే పనిలో ఉన్నావు. 237 00:12:03,473 --> 00:12:05,642 కుకీని దక్కించుకున్నావు. ఇదిగో. 238 00:12:06,518 --> 00:12:08,854 దీన్ని సగం చేస్తాను. ఇదిగో. 239 00:12:09,980 --> 00:12:11,315 సరే, మిత్రులారా. 240 00:12:13,025 --> 00:12:14,026 చీర్స్. 241 00:12:26,121 --> 00:12:27,289 మీరేనా కొత్తవారు? 242 00:12:27,998 --> 00:12:29,249 మన్నించండి, మళ్లీ చెప్తారా? 243 00:12:30,334 --> 00:12:32,419 -మీరు ఇక్కడికి ఐయాన్ తో వచ్చారు, కదా? -అవును. 244 00:12:32,503 --> 00:12:34,046 మీరు కారు నిలుపుతున్నప్పుడు చూశాను. నా పేరు షానన్. 245 00:12:34,505 --> 00:12:36,590 హాయ్. నేను బ్రెండన్ అమ్మని. 246 00:12:37,925 --> 00:12:39,092 -హాయ్, షానన్. -హాయ్. 247 00:12:39,176 --> 00:12:40,719 మన్నించండి, కానీ బ్రెండన్ ఎవరు? 248 00:12:40,802 --> 00:12:43,013 దేవుడా. అది చాలా బాగుంది. పూటీ. 249 00:12:43,096 --> 00:12:45,933 అవును. బ్రెండన్, పూటీ షూ అనమాట. 250 00:12:46,016 --> 00:12:48,227 ఐయాన్ పూటీని ఎందుకు కలుస్తున్నాడు? 251 00:12:48,310 --> 00:12:50,103 దేవుడా. అతను నీకది చెప్పలేదా? 252 00:12:50,562 --> 00:12:53,398 అతని స్వభావం అదేలే. వావ్. చెప్పడులే. 253 00:12:53,482 --> 00:12:55,859 ఎందుకు చెప్తాడులే? అతను తన కొడుకు, అంతే. 254 00:12:56,235 --> 00:12:57,319 మన్నించండి. 255 00:12:58,362 --> 00:13:00,739 పూటీ షూ, ఐయాన్ కొడుకా? 256 00:13:00,822 --> 00:13:02,866 బాబోయ్, అతను మీకు నిజంగా ఏ విషయం చెప్పడు కదా? 257 00:13:04,701 --> 00:13:06,119 మేమిద్దరమూ కలిసి ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేవాడు. 258 00:13:06,203 --> 00:13:08,330 అయ్యయ్యో. మేము... మేము కలిసి ఉండటం లేదు. 259 00:13:08,413 --> 00:13:10,332 మేము సహచరులమంతే. సహోద్యోగులం. 260 00:13:10,415 --> 00:13:12,793 సమాన సహోద్యోగులం. నిజానికి, భాగస్వామ్యులం. 261 00:13:12,876 --> 00:13:17,798 మీకు కూడా అతను గర్భం తెప్పించకముందే నేను మీకొక సలహా ఇవ్వవచ్చా? 262 00:13:17,881 --> 00:13:20,425 అతను నాకేమీ గర్భం తెప్పించడు. మేమసలు కలిసి... మేమెప్పటికీ కలిసి... 263 00:13:20,509 --> 00:13:23,679 ఓహ్, కాదు, కాదు. మీ మీద శ్రద్ద ఏ విధంగా పెట్టాలో అతనికి తెలుసు, 264 00:13:23,762 --> 00:13:28,809 ప్రపంచంలో మిమ్మల్ని మించిన వ్యక్తి తనకి ఎవ్వరూ లేరని మీకు అనిపించేలా, 265 00:13:28,892 --> 00:13:31,603 అలాగే ఎప్పటికీ కలిసుంటారని అనిపించేలా చేస్తాడు. 266 00:13:31,687 --> 00:13:32,938 మీరు భాగస్యామ్యులు. 267 00:13:33,021 --> 00:13:34,731 ఆ తర్వాత మీకు అత్యంత భద్రంగా అనిపించినప్పుడు, 268 00:13:35,232 --> 00:13:37,317 తన శ్రద్దని ఇంకొకరివైపుకు మళ్లించేస్తాడు. 269 00:13:37,401 --> 00:13:38,694 ఎక్కువశాతం తన మీదకే అనుకోండి. 270 00:13:38,777 --> 00:13:42,573 మళ్లీ ఎప్పుడైనా వేరొక మెరుగైనదాని గురించి మీరు ఆలోచిస్తున్నారని తనకి అనిపించగానే... 271 00:13:43,866 --> 00:13:44,908 దాన్ని అతను పసిగట్టేస్తాడు. 272 00:13:45,742 --> 00:13:49,621 మళ్లీ ఆ శ్రద్ద మీ మీదకి వచ్చేస్తుంది. 273 00:13:50,247 --> 00:13:51,623 కానీ అదంతా ఒట్టి అబద్ధం. 274 00:13:53,750 --> 00:13:55,002 తనకు కావలసినదల్లా, 275 00:13:55,085 --> 00:13:57,296 తను భావోద్వేగానికి లోనైన ప్రతీసారీ, తన పక్కన ఉండటానికి ఒక వస్తువు, అంతే. 276 00:13:57,379 --> 00:13:58,422 మీకు అర్థమైందా? 277 00:13:59,131 --> 00:14:00,549 ఎప్పుడూ అతనికి మద్దతుగా ఉండటం, 278 00:14:00,632 --> 00:14:03,260 మీ అవసరాలని పక్కనపెట్టేసి మరీ ఎప్పుడూ అతనికి అండగా ఉండటం, 279 00:14:03,969 --> 00:14:07,264 ఇంకా అతని రాక కోసం వేచి చూస్తూ ఉండటం. 280 00:14:09,600 --> 00:14:10,976 నిజమే అనిపిస్తుంది కదా? 281 00:14:12,853 --> 00:14:15,272 సరే, షానన్. 282 00:14:15,355 --> 00:14:19,151 మీరు ఒక మంచి... మంచి మేధావిలాగా అనిపిస్తున్నారు. 283 00:14:19,776 --> 00:14:21,987 కానీ నేను తిరిగి... 284 00:14:22,070 --> 00:14:23,322 ఇక్కడ కూర్చునే పనిని చూసుకోవాలి. 285 00:14:24,907 --> 00:14:25,908 వేచి చూస్తూ ఉండాలి. 286 00:14:44,259 --> 00:14:46,178 దరిద్రుడు. 287 00:14:48,472 --> 00:14:49,765 ఇదిగో తీసుకోండి. 288 00:14:51,433 --> 00:14:52,643 -ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 289 00:14:55,270 --> 00:14:56,855 అయితే... 290 00:14:58,899 --> 00:15:02,444 నీ జీవితం ఎలా సాగుతోంది? 291 00:15:02,528 --> 00:15:03,612 నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? 292 00:15:05,280 --> 00:15:08,867 నీ పాల పళ్ళన్నీ రాలిపోయాయా? 293 00:15:08,951 --> 00:15:10,369 ఎందుకంటే నీకోసం నేనొకటి తెచ్చాను. 294 00:15:10,744 --> 00:15:12,204 నాకు ఇప్పుడు 14 ఏళ్ళు, నాన్నా. 295 00:15:12,871 --> 00:15:15,207 అవును, అవును, అది సరైన... 296 00:15:15,290 --> 00:15:16,583 ఇది సరైన సందర్భం కాదు. 297 00:15:16,917 --> 00:15:18,669 మన్నించు, నేను కాస్త అయోమయంలో ఉన్నాను. 298 00:15:18,752 --> 00:15:21,839 పద్నాలుగు. పద్నాలుగు, అవును. అయితే, ఎవరితోనైనా సంభోగం చేస్తున్నావా? 299 00:15:21,922 --> 00:15:24,174 -ఏం మాట్లాడుతున్నావు, నాన్నా? -అవును, ఇది కూడా సరైనది కాదు. 300 00:15:24,258 --> 00:15:26,218 నేనేమీ సంభోగాల్లాంటివి చేయడం లేదు. నువ్వేమైనా... 301 00:15:26,927 --> 00:15:30,597 మన్నించు. నాకు... నాకు ఈ విషయంలో అంతగా అనుభవం లేదు. 302 00:15:30,681 --> 00:15:32,850 -నాతో కాస్త ఓపికగా ఉంటావా? -అలగే, కానీ కాదు. 303 00:15:32,933 --> 00:15:36,103 ఈ సమావేశంలో ముందుగా నీ అవసరాల గురించి మాట్లాడుకుందాం. 304 00:15:36,728 --> 00:15:37,729 సరే, చూడు. 305 00:15:37,813 --> 00:15:40,399 బ్రెండన్, నీకు ఈ విషయం అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు, 306 00:15:40,482 --> 00:15:44,361 కానీ నేను వెళ్లిపోవడమనేది, నేనూ, మీ అమ్మా కలిసి తీసుకున్న నిర్ణయం. 307 00:15:44,444 --> 00:15:46,613 ఆ తర్వాత ఉన్నట్టుండి, ఎన్నో ఏళ్ళ తర్వాత, హఠాత్తుగా, 308 00:15:46,697 --> 00:15:50,325 నువ్వు ఎంక్యూని ప్రసారం చేయడం మొదలుపెట్టి, ఎదుగుతూ, ఎదుగుతూ, బాగా ఎదిగిపోయావు, 309 00:15:50,409 --> 00:15:51,910 ఇంక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 310 00:15:51,994 --> 00:15:54,162 నేను నీతో మాట్లాడటానికి ఒక దారి కోసం చూస్తున్నాను, అంతే. 311 00:15:54,246 --> 00:15:56,540 కానీ నాతో మాట్లాడటానికి ఈ దారి మరీ పెద్దదైనట్టు నీకు అనిపించలేదా? 312 00:15:56,623 --> 00:15:59,251 నన్ను మన్నించు. ఏంటంటే, పది సంవత్సరాలుగా చూడని ఒక తండ్రితో 313 00:15:59,334 --> 00:16:01,253 ఎలా మాట్లాడాలో, ఆ విషయం మీద నాకు అంతగా అనుభవం లేదులే, 314 00:16:01,336 --> 00:16:05,591 కాబట్టి, నా బుర్ర సరిగ్గా పని చేయనందుకు నన్ను మన్నించు, దరిద్రుడా! 315 00:16:05,674 --> 00:16:08,218 ముసుగు మనిషి నువ్వేనని నాకు తెలీదు, లేకపోతే నేనలా చేసేవాడినే కాదు. 316 00:16:08,302 --> 00:16:10,971 ఓహ్, వావ్. నన్ను చచ్చిపొమ్మన్నావు కదా, మరి అప్పుడు? 317 00:16:11,054 --> 00:16:13,015 -నిన్ను నేను చచ్చిపొమ్మనలేదు. -అవును, ఇతనే అన్నాడు. 318 00:16:13,098 --> 00:16:14,933 అది చెప్పింది నేను కాదు. నేను కాదు. 319 00:16:15,017 --> 00:16:18,353 అది జో చేసిన పని. తను నా అసిస్టెంట్. నిజానికి, తను డేవిడ్ కి అసిస్టెంట్. 320 00:16:19,062 --> 00:16:21,899 తను అటూ ఇటూ తిరిగే సమస్యల సుడిగండానికి ప్రతిరూపం. 321 00:16:21,982 --> 00:16:23,317 మేము తనని పని నుంచి తీసేయాలనుకుంటా. 322 00:16:23,400 --> 00:16:26,195 వావ్. చూస్తుంటే, కార్యాలయ నిర్వహణలో నువ్వు చాలా శ్రమపడుతున్నట్టున్నావు, నాన్నా. 323 00:16:26,278 --> 00:16:27,529 చూడు, బ్రెండన్. 324 00:16:28,071 --> 00:16:30,949 నేను ఒక మంచి తండ్రిని ఎప్పటికీ కాలేను. 325 00:16:31,366 --> 00:16:33,035 కానీ అన్నింటినీ చూసుకోవడం మాత్రం నేను ఆపలేదు. 326 00:16:33,118 --> 00:16:36,580 పాఠశాల, ఇల్లు. అన్నింటినీ నేనే చూసుకుంటున్నాను. 327 00:16:37,080 --> 00:16:40,417 ఇంకా నిజమేమిటంటే, నువ్వు నేను లేకుండానే బాగా బ్రతుకుతున్నావు, 328 00:16:40,501 --> 00:16:42,336 ఓసారి నిన్ను నువ్వు చూసుకో. 329 00:16:42,419 --> 00:16:44,338 నీకు అద్భుతమైన వృత్తి జీవితం ఉంది, 330 00:16:44,421 --> 00:16:46,965 నీ వద్ద డబ్బులున్నాయి, మీ అమ్మతో విడదీయలేని మంచి అనుబంధం ఉంది. 331 00:16:47,049 --> 00:16:48,342 నాకు తెలియడం లేదు. 332 00:16:48,884 --> 00:16:54,681 నిజానికి, నా నిర్ణయం సరైనదేనని నాకనిపిస్తుంది. 333 00:16:56,975 --> 00:16:59,895 -"నేను" అనే పదాన్ని 9 సార్లు చెప్పావు. -అవునా? 334 00:16:59,978 --> 00:17:02,105 -ఇప్పుడు పదవసారి. -వావ్, నువ్వలాంటి చెత్తవి లెక్కపెట్టగలవా? 335 00:17:02,189 --> 00:17:04,147 నువ్వు "రేయిన్ మ్యాన్" లాంటివాడివి. దేవుడా. 336 00:17:04,942 --> 00:17:06,652 నువ్వు నిజంగా మేధావి లాంటివాడివి. 337 00:17:06,983 --> 00:17:08,069 హేయ్, నా పిల్లాడు ఒక మేధావి. 338 00:17:09,444 --> 00:17:10,739 హేయ్, నా కొడుకు ఒక మేధావి. 339 00:17:11,949 --> 00:17:15,160 వావ్. వావ్, అంతా నీ గురించే కదా. 340 00:17:15,242 --> 00:17:18,413 నీకు కాస్త పశ్చాత్తాపం కలిగిందేమోనని, అందుకని ఎట్టకేలకు 341 00:17:18,497 --> 00:17:21,500 మళ్లీ కలవడానికి వస్తున్నావేమోనని అనుకున్నాను. 342 00:17:21,583 --> 00:17:22,960 -కానీ అందుకు కాదు. కాదు. -అవును. 343 00:17:23,041 --> 00:17:26,171 నువ్వు ఏ తప్పూ చేయలేదు, నువ్వు చెడ్డవాడివి కాదు, 344 00:17:26,255 --> 00:17:28,549 నువ్వేమీ చెడగొట్టలేదు, ఇలాంటివి నాతో చెప్పించాలనుకున్నావు, అంతే. 345 00:17:28,632 --> 00:17:31,468 ఎందుకంటే ఎప్పుడూ అంతా నీ గురించే కదా. 346 00:17:31,552 --> 00:17:33,887 -లేదు, లేదు. అది నిజం కాదు. నేను... -"నేను." 347 00:17:33,971 --> 00:17:35,764 -నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే... -"నేను." 348 00:17:35,848 --> 00:17:37,057 -నాకు తెలుసు, కానీ నేను... -మరో రెండు. 349 00:17:37,140 --> 00:17:38,517 -సరే. కానీ నేను... -"నేను." 350 00:17:39,893 --> 00:17:44,147 "నేను", "నాకు" లాంటివి వాడకుండా ఒక మనిషి ఎలా మాట్లాడగలడు? 351 00:17:44,231 --> 00:17:47,150 సరే, ఓ విషయం చెప్పనా, ఈ సంభాషణని కొనసాగించేంత వయసు నాకు ఇంకా రాలేదు. 352 00:17:47,234 --> 00:17:49,069 ఆగు, ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నావు? 353 00:17:49,152 --> 00:17:51,613 మళ్లీ నాతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దు, ఐయాన్. 354 00:17:52,030 --> 00:17:53,740 -సరే, బాబూ... -కాదు! 355 00:17:56,326 --> 00:17:57,786 ఇక నీతో వేగడం నా వల్ల కాదు. 356 00:18:03,333 --> 00:18:06,670 నీకు ఓ విషయం తెలుపుతున్నాను, ఈ సంభాషణకి నేను సున్నా తలకాయలు ఇస్తున్నాను. 357 00:18:09,965 --> 00:18:11,049 పూటీ సెలవు తీసుకుంటున్నాడు! 358 00:18:17,514 --> 00:18:19,391 హేయ్, డాన్ విలియమ్స్. 359 00:18:19,474 --> 00:18:22,269 నేను పాపిని, మీ కొత్త క్రియటివ్ డైరెక్టర్ ని. 360 00:18:22,352 --> 00:18:23,437 అవును, నేను తిరిగి వచ్చేస్తున్నాను. 361 00:18:23,520 --> 00:18:25,230 నేను ఇంతకముందు చెప్పినదాన్ని పట్టించుకోవద్దు. 362 00:18:25,314 --> 00:18:28,734 మిథిక్ క్వెస్ట్ ని ఇక నేను భరించలేను, ఈ నాటకీయతని అస్సలు భరించలేను. 363 00:18:28,817 --> 00:18:31,486 ఈ సారి నిజంగా చెప్తున్నాను. కాబట్టి, నాకు మీ ఉద్యోగం కావాలి. 364 00:18:31,904 --> 00:18:34,698 అద్భుతం. నాకు తిరిగి కాల్ చేయండి, ధన్యవాదాలు. ఉంటాను. 365 00:18:37,326 --> 00:18:39,620 హేయ్, లోపల ఎలా గడిచింది? నువ్వు బాగానే ఉన్నావా? 366 00:18:40,037 --> 00:18:41,663 నాకు దాని గురించి మాట్లాడాలని లేదు. 367 00:18:42,414 --> 00:18:45,000 నిజంగానా? ఇంత దూరం నువ్వు లాక్కు వచ్చిన మనిషితో 368 00:18:45,083 --> 00:18:47,586 నీకు కొంచెం కూడా పంచుకోవాలని అనిపించటం లేదా? 369 00:18:48,962 --> 00:18:50,589 లేదు. అనిపించడం లేదు. ఇక మనం బయలుదేరుదామా? 370 00:18:50,672 --> 00:18:54,259 లేదు. నువ్వు నాకు నిజంగా చెప్పడం లేదా? 371 00:18:55,219 --> 00:18:58,889 పూటీ నీ కొడుకేనని నాకు తెలుసు. ఇందాకే నీ మాజీ భార్యని కలిశాను. తనే చెప్పింది. 372 00:18:58,972 --> 00:19:01,141 షానన్. తను చూడటానికి ఎలా ఉంది? 373 00:19:01,225 --> 00:19:03,769 -పరమ కోపంగా! -అవును. 374 00:19:03,852 --> 00:19:05,812 నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు? 375 00:19:06,230 --> 00:19:07,314 నాకు స్థైర్యం కోసం. 376 00:19:07,731 --> 00:19:09,983 అవునులే. ఎందుకంటే నువ్వు భావోద్వేగానికి లోనైనప్పుడు నీకు స్థైర్యమిచ్చే జంతువుని, 377 00:19:10,067 --> 00:19:13,487 అక్కడున్న కుక్కలాగే, నేను ఈ వేడి కారులో గంట సేపు కూర్చున్నాను. 378 00:19:14,696 --> 00:19:16,031 ఏ కుక్క? 379 00:19:17,491 --> 00:19:20,953 ఇంతకముందు అక్కడ ఓ కుక్క ఉండింది, 380 00:19:21,036 --> 00:19:23,288 ఇంకా అది సరైన పోలిక! 381 00:19:23,372 --> 00:19:25,374 సరే, మనం దీని గురించి తర్వాత చర్చించుకుందామా, పాపి? 382 00:19:25,457 --> 00:19:28,126 నువ్వన్నది నిజమే. ఇక మన మధ్య ఇలాంటివేమీ వద్దు. నేను మానేస్తున్నాను. 383 00:19:29,086 --> 00:19:32,673 నేను కోల్డ్ అలయన్స్ లో చేరుతున్నాను. నాకు క్రియేటివ్ డైరెక్టర్ పదవి ఇస్తున్నారు. 384 00:19:32,756 --> 00:19:33,757 నువ్వు... 385 00:19:35,717 --> 00:19:37,344 ఈ విషయంలో నీ ఉద్దేశం ఏమిటి? 386 00:19:39,137 --> 00:19:41,098 నీకు అదే చేయాలనుంటే, నేను నిన్ను ఆపలేను. 387 00:19:44,226 --> 00:19:45,435 అదేనా నీ స్పందన? 388 00:19:45,519 --> 00:19:46,520 అవును. 389 00:19:47,980 --> 00:19:50,858 ఏదోకటిలే, బాసూ. కారు ఎక్కు. నేను నడుపుతాను. 390 00:19:52,067 --> 00:19:54,987 కుక్క! అదే ఆ కుక్క! అదుగో, చూడు. అది నిజంగానే ఉంది. 391 00:19:55,070 --> 00:19:57,698 అది నిజంగానే ఉంది, కనీసం దానికైనా బయటకెళ్లి ఒంటేలు పోసే అదృష్టం దక్కింది. 392 00:19:57,781 --> 00:20:01,535 ఓ విషయం చెప్పనా, ఐయాన్, ఇప్పట్నుంచీ కుక్కని నేను కాదు! నువ్వే కుక్కవి! 393 00:20:02,661 --> 00:20:05,956 -ఎందుకు నీకు కుక్కలంటే అంత అసహ్యం? -నాకు కుక్కలంటే అసహ్యం లేదు. 394 00:20:06,039 --> 00:20:08,584 నేను చెప్పేది బాగా జాగ్రత్తగా విను, ఐయాన్. 395 00:20:09,084 --> 00:20:12,838 నాకు నువ్వంటే అసహ్యం. 396 00:20:14,631 --> 00:20:17,009 నన్ను మన్నించు. ఇప్పుడే నేను ఓ విషయాన్ని గమనించాను. 397 00:20:17,092 --> 00:20:19,553 నీ తల మీద పాపిడిని నువ్వు సరైన చోటు నుండి తీయలేదు. 398 00:20:19,636 --> 00:20:22,973 దాన్ని మరోవైపుకు మారిస్తే, అది నీ ముఖాన్ని విచ్చుకునేలా చేస్తుంది. 399 00:20:24,683 --> 00:20:26,810 నీ ముఖాన్ని నేను విచ్చుకునేలా చేస్తాను! 400 00:20:27,269 --> 00:20:28,395 కారు ఎక్కు! 401 00:20:30,230 --> 00:20:31,315 సరే. 402 00:20:37,779 --> 00:20:40,699 సరే, బ్రాడ్. ఇప్పుడు నువ్వు నీ తదుపరి ఖరీదైన వస్తువును గుర్తించేశావు కాబట్టి, 403 00:20:40,782 --> 00:20:42,576 ఇప్పుడు మనం చేయవలసిందల్లా, డానా ద్వారా దాన్ని ప్రచారం చేయించడమే, 404 00:20:42,659 --> 00:20:45,454 ఇక నీ కుకీ యొక్క రెండవ ముక్కకి నువ్వు సమీపంలోనే ఉన్నావు. 405 00:20:46,079 --> 00:20:48,498 -డానా ఎక్కడ? -వెళ్లిపోయింది, నాన్నగారు. 406 00:20:48,582 --> 00:20:49,708 ఏదోకటిలే. సరేమరి. 407 00:20:49,791 --> 00:20:53,003 ఆహ్... చూస్తుంటే మన తదుపరి పని డానా ఎక్కడుందో కనిపెట్టడంలాగా ఉంది. 408 00:20:53,086 --> 00:20:54,087 ఆ పని నేను చేయగలను. 409 00:20:54,171 --> 00:20:57,883 నేను డానాని కనిపెడితే, బ్రాడ్ కి సాయపడినట్టు, తద్వారా నీకు సాయపడినట్టే కదా. 410 00:20:57,966 --> 00:20:59,301 నేను ఆ పని మీదే ఉంటాను. 411 00:21:00,093 --> 00:21:01,595 తను ఆ వ్యవస్థలోకి బాగా మునిగిపోయింది. 412 00:21:02,387 --> 00:21:04,223 సీ.డబ్ల్యూ., నువ్వేం చేస్తున్నావు? 413 00:21:04,306 --> 00:21:07,226 ఈ పర్పుల్ బఫూన్ చేసే విచిత్రమైన చేష్టలు చూస్తూ, 414 00:21:07,518 --> 00:21:10,270 అమెరికాలో అత్యధికంగా అమ్ముడైన మద్యాన్ని తాగుతూ ఆస్వాదిస్తున్నాను. 415 00:21:11,522 --> 00:21:12,898 రోస్కో. అది అద్భుతమైనది. 416 00:21:12,981 --> 00:21:15,234 అవును. వీడికి అభిమానులు కోట్లల్లో ఉన్నారు. 417 00:21:15,317 --> 00:21:17,611 కాబట్టి, మంచిదే అయ్యుండాలి, కదా? 418 00:21:17,694 --> 00:21:18,695 అతను అలిగి ఉన్నాడా? 419 00:21:18,779 --> 00:21:20,197 అవును, ఎనిమిదేళ్ళ పిల్లాడిలాగా. 420 00:21:20,280 --> 00:21:22,658 సరే, మంచిది. నిన్ను కూడా మా వ్యవస్థలోకి చేర్చుకోగలను. 421 00:21:22,741 --> 00:21:25,577 కానీ, నీకు బహుమానంగా ఇవ్వడానికి కావలసినంత కుకీ నా దగ్గర ఉందో లేదో నాకు తెలీదు. 422 00:21:27,204 --> 00:21:28,205 ఓహ్, పాపి ఓ సందేశం పెట్టింది. 423 00:21:31,416 --> 00:21:32,876 భగవంతుడా. 424 00:21:36,713 --> 00:21:37,714 ఏమైంది? 425 00:21:38,924 --> 00:21:42,177 ముసుగు మనిషి ఎవరో కాదు, స్వయానా ఐయాన్ కొడుకే! 426 00:21:42,928 --> 00:21:44,763 అతని కొడుకే! 427 00:21:44,847 --> 00:21:47,558 కథలోని వృత్తాంతం ఇప్పుడు సరిపోయింది. 428 00:21:47,975 --> 00:21:52,563 నాణ్యమైన సాహిత్యానికి దక్కవలసిన సింహాసనం ఎట్టకేలకు దక్కింది! 429 00:21:58,610 --> 00:21:59,736 -బాబోయ్. -అయ్యయ్యో! 430 00:22:00,237 --> 00:22:02,781 -నన్ను కొడుతోంది! అది నన్ను కొడుతోంది! -ఆగు, ఆగు! వాడిని చంపేయ్! 431 00:22:02,865 --> 00:22:05,534 నేను ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నిస్తున్నా. అంత వేగంగా కదులుతున్నాయేంటి? 432 00:22:05,617 --> 00:22:06,618 కొనసాగిస్తారా? 433 00:22:06,702 --> 00:22:08,203 -అయ్యో. -ఛ. 434 00:22:09,621 --> 00:22:11,123 మన ముఖాలని తినేశాయి. 435 00:22:13,292 --> 00:22:15,627 నన్ను బయటకు తీసుకువచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు ఇది అత్యవసరం. 436 00:22:16,295 --> 00:22:17,629 అవును. పర్వాలేదులే. 437 00:22:17,713 --> 00:22:19,798 నీకు జాంబీల రక్తాన్ని చిందించడమంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, 438 00:22:19,882 --> 00:22:21,592 అందుకే ఇక్కడ నువ్వు ఆనందంగా గడుపుతావని అనుకున్నాను. 439 00:22:22,092 --> 00:22:24,720 మనం ఒక్క చిన్న గదిలో పక్కపక్కనే కూర్చొని 440 00:22:24,803 --> 00:22:27,347 ఆటలాడుతున్నామన్న విషయాన్ని నువ్వు గ్రహించావా? 441 00:22:27,931 --> 00:22:30,058 మనం కార్యాలయంలో పనిచేస్తున్నట్టుగానే ఇక్కడ కూడా చేశాం. 442 00:22:31,518 --> 00:22:35,772 అవును. అంటే, ఒకప్పుడు పనిచేసినట్టుగా అనమాట. 443 00:22:36,732 --> 00:22:38,650 అవును. నువ్వన్నది నిజమే అనుకుంటా. 444 00:22:41,653 --> 00:22:43,113 నిన్ను నిజంగా చాలా మిస్ అవుతున్నాను, రేచ్. 445 00:22:46,450 --> 00:22:47,534 నిజంగా మిస్ అవుతున్నావా? 446 00:22:48,744 --> 00:22:49,745 అవును. 447 00:22:52,706 --> 00:22:53,790 హేయ్! 448 00:22:53,874 --> 00:22:55,125 -అయ్యబాబోయ్! -మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? 449 00:22:55,209 --> 00:22:57,586 దేవుడా, జో. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? 450 00:22:58,921 --> 00:23:02,216 నేను నా పని చేస్తున్నాను, మీ ఇద్దరూ కనీసం అప్పుడప్పుడైనా మీ వాటి గురించి ఆలోచించాలి. 451 00:23:02,299 --> 00:23:03,842 మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలుసు? 452 00:23:03,926 --> 00:23:05,052 అదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. 453 00:23:05,135 --> 00:23:08,722 మీరు మామూలు జీవితాలు జీవించే మామూలు మనుషులు. ఇక పని చేయడానికి బయలుదేరండి. 454 00:23:08,805 --> 00:23:10,182 మేమేం చేయాలో నువ్వు మాకు చెప్పలేవు. 455 00:23:10,265 --> 00:23:12,434 అవును, గూఢాచారిలా ప్రవర్తించకు, జో. 456 00:23:12,518 --> 00:23:14,144 నేను గూఢాచారిని కాదు. 457 00:23:14,728 --> 00:23:17,481 నేను డేవిడ్ బ్రిటిల్స్బీ యొక్క అసిస్టెంట్ ని. 458 00:23:17,564 --> 00:23:18,732 ఇక, పదండి! 459 00:23:40,128 --> 00:23:42,130 ఇక నవ్వండి, యువరాణి గారు. 460 00:23:43,549 --> 00:23:44,591 అలాగే, పాప్. 461 00:23:44,675 --> 00:23:46,051 "అలాగే, పాప్." 462 00:23:46,510 --> 00:23:49,513 బాబోయ్, నువ్వు మామూలు విరక్తిగాడివి కాదు. 463 00:23:51,557 --> 00:23:52,558 అవును. 464 00:23:53,684 --> 00:23:54,810 -తల్లీ. -వీళ్ళను తీసుకువచ్చాను, డేవిడ్. 465 00:23:54,893 --> 00:23:56,061 అది నొప్పిగా ఉంది. 466 00:23:56,144 --> 00:23:59,106 బడి ఎగ్గొట్టే చిన్నపిల్లల్లాగా, పని ఎగ్గొట్టి ఓ ఆర్కేడ్ లో ఆటలాడుకుంటున్నారు. 467 00:23:59,189 --> 00:24:01,191 వావ్. దొరికిపోయారు. 468 00:24:01,275 --> 00:24:03,110 హేయ్, చక్కని పనితీరును కనబరిచావు, జో. 469 00:24:03,193 --> 00:24:04,444 ఇక మేము వెళ్లి మా పనులను చేసుకోవచ్చా? 470 00:24:04,528 --> 00:24:06,864 ఆగు. ఒక్క నిమిషం. బ్రాడ్ దగ్గర తను సాధించవలసిన పని ఒకటుంది. 471 00:24:06,947 --> 00:24:08,031 అవును కదా, బ్రాడ్? 472 00:24:09,575 --> 00:24:12,494 డానా, మనం కొలీజియం యొక్క నామకరణ హక్కులను ఒక మిలియన్ డాలర్లకు అమ్ముతున్నాం. 473 00:24:12,578 --> 00:24:15,122 దీని గురించి ప్రత్యక్ష ప్రసారంలో నీకు ఏం కావాలంటే అది చెప్పు. ఏం పర్వాలేదు. 474 00:24:15,205 --> 00:24:17,791 ఎవడోక పిచ్చోడు, దాన్ని కొని, "పిచ్చి రాజు యొక్క పిచ్చి పట్టణం" అని పిలుచుకుంటాడు. 475 00:24:17,875 --> 00:24:19,168 మంచిది. అర్థమైందా, డానా? 476 00:24:20,002 --> 00:24:21,086 అర్థమైందనే అనుకుంటా. 477 00:24:21,170 --> 00:24:22,546 మంచిది. ఇక నువ్వు బయలుదేరు. 478 00:24:23,589 --> 00:24:25,299 -నువ్వు కూడా. -వెళ్తున్నాను. 479 00:24:27,718 --> 00:24:29,094 మిత్రులారా. రండి. చుట్టూ నిలబడండి. 480 00:24:30,053 --> 00:24:31,138 రా. 481 00:24:31,638 --> 00:24:33,974 నేనొక మాట చెప్పవచ్చా? మన మీద నాకు చాలా గర్వంగా ఉంది. 482 00:24:34,057 --> 00:24:36,518 మనం ఈరోజు ఏం చేయాలనుకున్నామో వాటినన్నింటినీ సాధించేశాము. 483 00:24:36,602 --> 00:24:38,395 జో, నువ్వు నాకు చాలా అద్భుతంగా సహకరించావు. 484 00:24:38,729 --> 00:24:40,480 ఇంకా, బ్రాడ్, నీ జీవితం అర్థరహితమైనదని 485 00:24:40,564 --> 00:24:42,733 నీకు అనిపించినా, నువ్వు శక్తినంతా కూడదీసుకొని నీ పనిని నిర్వర్తించావు. 486 00:24:42,816 --> 00:24:45,235 ఇక నా విషయానికి వస్తే, మీ ఇద్దరి పనులను పూర్తి చేయడంలో నేను తోడ్పడ్డాను, 487 00:24:45,319 --> 00:24:47,779 ఇంకా ఎవ్వరూ కూడా తల కింద పెట్టి రాళ్ళ క్వారిలోకి దూకలేదులే. 488 00:24:48,197 --> 00:24:49,907 అవును కదా? అది నాకు చాలా పెద్ద విజయం. 489 00:24:49,990 --> 00:24:55,204 అంతేకాకుండా, మనం మన కుకీ యొక్క ఆఖరి ముక్కలని గెలుచుకున్నాం. 490 00:24:58,624 --> 00:24:59,917 రెండు ముక్కలే ఉన్నాయి. 491 00:25:01,627 --> 00:25:03,545 ఓ విషయం చెప్పనా? వీటిని మీరే తీసుకోండి. 492 00:25:04,630 --> 00:25:06,548 -నీకు పర్వాలేదా? -పర్వాలేదు. 493 00:25:08,592 --> 00:25:09,801 తీసుకోండి. 494 00:25:11,428 --> 00:25:12,679 కానివ్వండి, తినండి. 495 00:25:16,183 --> 00:25:18,852 నా జీవితంలో దీనికన్నా రుచికరమైనది ఇంతవరకూ నేను తిననేలేదు. 496 00:25:18,936 --> 00:25:21,438 అవును. ఆఖరిది ఏదైనా కానీ... 497 00:25:22,105 --> 00:25:23,899 అది చాలా రుచికరంగా ఉంటుంది. 498 00:25:25,776 --> 00:25:26,902 బ్రాడ్. 499 00:25:27,319 --> 00:25:30,030 నీ ఆ అధిక ధర ఖడ్గాన్ని కొన్నది ఎవరో నేను కనిపెట్టాను. 500 00:25:30,113 --> 00:25:31,281 అది కొన్నది సౌదీ యువరాజు కాదు. 501 00:25:31,365 --> 00:25:34,326 ఒక ట్రైలర్ పార్క్ లాంటిదాంట్లో నివాసం ఉంటున్న ఒక పెద్దాయన కొన్నాడు. భలే విషయంలే. 502 00:25:34,409 --> 00:25:35,994 ఆగు. ట్రైలర్ పార్కా? మరి అతనెలా కొనగలిగాడు? 503 00:25:36,370 --> 00:25:37,788 జీవితాంతం దాచుకున్నదానితో కొన్నాడేమో. 504 00:25:39,540 --> 00:25:41,124 దేవుడా. అదీ విషయం. 505 00:25:41,917 --> 00:25:44,962 ఏంటంటే, అది ఒక కోటీశ్వరుడి నుండి లక్షలు రాబట్టడం గురించి కాదు. 506 00:25:45,045 --> 00:25:48,465 ఏమీలేని బీదవాడి దగ్గరి నుండి, ఆ ఆఖరి కుకీ ముక్కని తీసేసుకోవడం గురించి. 507 00:25:48,549 --> 00:25:49,883 నేను ఏమీ అనలేను. 508 00:25:49,967 --> 00:25:52,219 అది మన ఆటగాళ్ళ ఆఖరి రూపాయిని కూడా తీసుకోవడం గురించి. కాదు, ఆఖరి పైసా. 509 00:25:52,302 --> 00:25:55,722 కాదు, ఆఖరి అణా పైసా గురించి. సూక్ష్మాతి-సూక్ష్మ లావాదేవిలు. 510 00:25:55,806 --> 00:25:59,059 కాదు, అతిసూక్ష్మ లావాదేవిలు. ఎవరెంత బీదవారైనా కానీ, వారికి భరోసా లేదు. 511 00:25:59,142 --> 00:26:00,686 అందుకే నేను ఈ పని చేస్తున్నాను. 512 00:26:01,478 --> 00:26:02,980 ధన్యవాదాలు, డీ-మ్యాన్. 513 00:26:03,063 --> 00:26:04,439 కానీ గుణపాఠం అది కాదు. 514 00:26:04,940 --> 00:26:06,859 ఓయ్, ఎందుకు దాన్ని పారేశావు? 515 00:26:07,317 --> 00:26:09,152 ఈ చెత్త ముక్కని నేను తినను. 516 00:26:15,576 --> 00:26:17,119 ఇప్పుడే దీన్ని నువ్వు చెత్తబుట్ట నుండి తీశావు. 517 00:26:17,494 --> 00:26:19,413 అవును, బాస్. 518 00:26:23,333 --> 00:26:25,127 -ధన్యవాదాలు, జో. -ఏం పర్వాలేదు. 519 00:26:42,102 --> 00:26:44,688 వచ్చేశావా. ఎక్కడికి వెళ్లిపోయావు? 520 00:26:44,771 --> 00:26:47,191 ఎవరి గొంతైనా నులిమి చంపేశావా? 521 00:26:47,941 --> 00:26:48,984 ఓ విషయం చెప్పనా, లూ? 522 00:26:49,067 --> 00:26:50,777 నువ్వెంత చెత్త వాగుడైనా వాగుకో, బాసూ. 523 00:26:51,904 --> 00:26:53,989 ఎందుకంటే, నాకు ఈ రోజు కలిగిన ఆనందాన్ని ఎవ్వరూ కూడా లాక్కోలేరు. 524 00:26:54,531 --> 00:26:55,991 భగవంతుడా! 525 00:26:56,909 --> 00:26:58,327 వైల్డ్_డీ. 526 00:26:59,328 --> 00:27:02,956 నేనిప్పుడే ఒక అసలైన ఆర్కేడ్ లో నేను చిన్నప్పుడు ఆడిన 527 00:27:03,040 --> 00:27:04,499 ఆటలను ఆడేసి వస్తున్నాను. 528 00:27:04,583 --> 00:27:07,961 ఇక, మీకందరికీ తెలుసు నాకు కొత్త విషయాలంటే ప్రాణమని, 529 00:27:08,045 --> 00:27:10,297 కానీ అప్పుడప్పుడూ, మీరు అలనాటి మధురమైన ఆటలని ఆడుతూ ఉండాలి, 530 00:27:10,380 --> 00:27:13,008 అప్పుడే అవి మీకు ఎంత ముఖ్యమో తెలుస్తుంది. 531 00:27:13,091 --> 00:27:15,469 ఇప్పుడు మనం షాడో వుల్ఫ్ డంజియోన్ కి తిరిగి వచ్చేద్దామా? 532 00:27:16,094 --> 00:27:18,347 అంతేకాకుండా, నేను స్పెల్ కాంబోల అభ్యర్ధనలను స్వీకరిస్తున్నాను. 533 00:27:18,430 --> 00:27:19,681 కాబట్టి, ఏవైనా ఉంటే చాట్ లో పెట్టండి. 534 00:27:19,765 --> 00:27:20,766 కామెంట్! 535 00:27:21,850 --> 00:27:24,228 "మరో నకిలీ గేమర్ పిల్ల." 536 00:27:25,604 --> 00:27:28,190 సరేమరి, నేను విద్వేషకులని పట్టించుకోవడం లేదు. 537 00:27:28,607 --> 00:27:29,733 బై, విద్వేషకులారా. 538 00:27:29,816 --> 00:27:30,817 విద్వేషకులు 539 00:27:30,901 --> 00:27:33,028 "ఈ తిరుగుబోతుది మిథిక్ క్వెస్ట్ లో పని చేస్తుంది." 540 00:27:35,322 --> 00:27:36,573 ఏం జరుగుతోంది? 541 00:27:36,657 --> 00:27:39,076 ఎందుకు తన చాట్ అంతా విద్వేషపు సందేశాలలో నిండిపోతోంది? 542 00:27:39,159 --> 00:27:41,286 మిత్రులారా, నేనేమీ నకిలీ గేమర్ ని కాదు. 543 00:27:41,370 --> 00:27:43,914 నాకు అన్నింటికన్నా వీడియో గేములంటే చాలా ఇష్టం. 544 00:27:44,373 --> 00:27:48,585 ఉద్యోగి అయిన నీ పిల్లని అక్కడ నాటారని వాళ్ళకి తెలిసిపోయింది. తన కథ సమాప్తం. 545 00:27:48,669 --> 00:27:53,507 అది చాలా అసభ్యకరమైనది, జాతిని కించపరిచేది. ఆ నోరేసుకొని చెత్త వాగుడు వాగుతుంటావా? 546 00:27:53,590 --> 00:27:55,467 నీ ఆనందాన్ని ఈరోజు ఎవ్వరూ లాక్కోలేరు కాబట్టి సరిపోయింది. 547 00:28:01,932 --> 00:28:04,059 పార్కింగ్ రిజర్వుడ్ ఐయాన్ గ్రిమ్ 548 00:28:08,355 --> 00:28:09,356 నువ్వు వస్తున్నావా? 549 00:28:10,107 --> 00:28:11,108 లేదు. 550 00:28:12,609 --> 00:28:15,696 ఒక చిన్నపిల్లాడిలాగా కారులోనే కూర్చొనుంటావా? 551 00:28:17,614 --> 00:28:18,615 అవును అనుకుంటా. 552 00:28:18,699 --> 00:28:20,617 ఓ విషయం చెప్పనా, కోల్డ్ అలయన్స్ లో చేరుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, 553 00:28:20,701 --> 00:28:23,871 ఎందుకంటే కనీసం అక్కడైనా నా మాటకి విలువ ఇచ్చి, నా దూరదృష్టి ప్రకారం నడుచుకుంటారు. 554 00:28:24,288 --> 00:28:26,790 బహుశా దాన్ని వాళ్ళు ఒక ఆల్గోరితం ద్వారా ఎక్కిస్తారేమో, 555 00:28:26,874 --> 00:28:29,418 కానీ కనీసం ఇక్కడిలాగా నా ముందుకు ఏ చెత్త పనిని తీసుకొస్తారో అనే కంగారుతో 556 00:28:29,501 --> 00:28:31,003 ఒంటి నిండా చారలు తెచ్చుకొని, 557 00:28:31,086 --> 00:28:34,214 ఒళ్ళంతా చెమటలు కార్చుకుంటూ ఉండాల్సిన పనయితే ఉండదులే. 558 00:28:42,306 --> 00:28:44,641 హేయ్. హేయ్, డాన్ మిత్రమా. 559 00:28:44,725 --> 00:28:47,644 నేను పాపి, క్రియేటివ్ డైరెక్టర్ ని. 560 00:28:47,728 --> 00:28:50,772 ఏంటి సంగతి? రెండు వారాలలోనే నిన్ను కలవబోతున్నాను. 561 00:28:51,273 --> 00:28:55,110 విను, పాపి, ఇది జరిగే పనిలాగా అనిపించడం లేదు. 562 00:28:55,194 --> 00:28:57,070 నీ ప్రతిభ పట్ల నాకు నిజంగా చాలా గౌరవముంది, 563 00:28:57,529 --> 00:29:02,951 కానీ నీ ఆర్టిస్టిక్ టెంపరమెంట్ మా స్టూడియోకి సరిపడదని చింతిస్తున్నాను. 564 00:29:03,035 --> 00:29:06,914 లేదు. లేదు, లేదు, ఎందుకంటే నాలో నిజానికి... 565 00:29:07,998 --> 00:29:09,166 అంత కాళాత్మకమైనదేమీ లేదు. 566 00:29:09,249 --> 00:29:10,834 కొందరు నన్ను మెకానిక్ అని పిలుస్తారు. 567 00:29:10,918 --> 00:29:13,295 కానీ నిజానికి... నేను వివేకవంతురాలిని. 568 00:29:13,378 --> 00:29:15,255 నువ్వు నా మీద నమ్మకముంచాలి, డాన్. నేను... 569 00:29:16,215 --> 00:29:18,342 ఇక్కడున్నవాళ్ళల్లో వివేకం ఉండేది నాకే. 570 00:29:18,425 --> 00:29:20,469 నన్ను మన్నించు, పాపి. ఉంటాను. 571 00:29:24,181 --> 00:29:25,390 అయ్యయ్యో. 572 00:29:26,975 --> 00:29:28,477 -హేయ్, పాప్. -భగవంతుడా. 573 00:29:29,728 --> 00:29:32,981 నేను అంతా వినేశాను. అది దురదృష్టకరం. 574 00:29:35,025 --> 00:29:36,360 మరి, నిన్ను లోపల కలుస్తాను. 575 00:29:55,170 --> 00:29:57,631 నేను అతని చైనీస్ ప్రియురాలిని కలిశాను. 576 00:29:58,048 --> 00:30:00,551 వావ్. అది జాత్యాహంకారపూరితమైనది, అమ్మా. 577 00:30:00,968 --> 00:30:04,179 నిజంగా తను చైనీస్ అయితే తప్ప, కానీ నీ గురించి తెలుసు కనుక, తను చైనీస్ కాదు. 578 00:30:04,596 --> 00:30:06,431 కనీసం నేను డేటింగ్ చేస్తున్న విషయమైనా చెప్పావా? 579 00:30:07,933 --> 00:30:10,102 చెప్పాను, మాటల మధ్యలో నన్ను వదిలేసిన నా తండ్రితో, 580 00:30:10,185 --> 00:30:13,188 నువ్వు ఎవరుపడితే వారితో గడుపుతున్నావన్న విషయాన్ని చెప్పాను. 581 00:30:13,730 --> 00:30:16,400 దేవుడా, నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేదాకా నేను ఆగలేకపోతున్నాను. 582 00:30:19,695 --> 00:30:21,572 నీకు చికెన్ నగ్గెట్స్ ఏమైనా కావాలా, బంగారం? 583 00:30:23,699 --> 00:30:24,741 కావాలి. 584 00:30:25,951 --> 00:30:27,077 నాకు కూడా కావాలి. 585 00:31:30,474 --> 00:31:32,476 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య