1 00:00:08,383 --> 00:00:13,347 జపనీస్ డైలాగ్ సబ్ టైటిల్ నీలం రంగులో ఉంటుంది. కొరియన్ డైలాగ్ సబ్ టైటిల్ పసుపు రంగులో ఉంటుంది. 2 00:00:28,820 --> 00:00:30,030 (జపనీస్ లో)సిద్ధమా? 3 00:00:32,908 --> 00:00:33,909 ఇక మొదలెడుతున్నా. 4 00:00:38,288 --> 00:00:41,500 ఇది నేను చేస్తాను, కానీ నువ్వు దగ్గరగా ఉండు. 5 00:00:43,210 --> 00:00:46,129 త్వరగా! ట్రైన్ లో ఇక కాళీ ఉండదు. 6 00:00:56,765 --> 00:00:58,725 ష్. వాళ్ళు వస్తున్నారు. 7 00:00:59,893 --> 00:01:01,019 వాళ్ళను పట్టుకో! 8 00:01:03,939 --> 00:01:05,274 వాళ్ళను తప్పించుకోనివ్వకు! 9 00:01:38,724 --> 00:01:40,517 బూమ్! బూమ్! 10 00:01:44,563 --> 00:01:48,859 కానీ నేను నీ గుండెకు ఎక్కుపెట్టాను, అనుకున్నట్టే మొదటి షాట్ కె నిన్ను కొట్టా! 11 00:01:48,859 --> 00:01:53,363 - అవును, చూసా! - ఏంటిది? మేమే నిన్ను ముందు పేల్చాము! 12 00:01:53,363 --> 00:01:56,325 ఇప్పుడు గ్యాస్ మాస్క్ వేసుకునే వంతు నాది. 13 00:01:56,325 --> 00:01:57,534 దాన్ని ఇలా ఇచ్చేయ్! 14 00:01:57,534 --> 00:01:59,411 అతను మళ్ళీ వచ్చాడు. 15 00:02:10,672 --> 00:02:12,007 అది నా ఇల్లు. 16 00:02:18,764 --> 00:02:19,765 అమ్మా? 17 00:02:31,735 --> 00:02:32,778 నేను ఇంటికి వెళ్తున్నాను. 18 00:02:33,487 --> 00:02:34,863 మీరు కూడా పోండి. 19 00:02:44,748 --> 00:02:49,336 అతని తండ్రి శరీరం... అది వారికి అప్పగించే అవకాశం ఉందా? 20 00:02:51,505 --> 00:02:55,884 అది ఎంత శరీరం మిగిలి ఉంది అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. 21 00:03:01,348 --> 00:03:04,852 కానీ, మోజసు, పాస్టర్ హ్యూ ఏమంటారో గుర్తుచేసుకో. 22 00:03:04,852 --> 00:03:07,062 దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. 23 00:03:07,062 --> 00:03:09,147 నువ్వు ఆ మాట నమ్మవు, అవునా? 24 00:03:09,147 --> 00:03:12,693 ఎవరు వచ్చారో చూడండి. 25 00:03:13,944 --> 00:03:15,445 బందో. 26 00:03:33,714 --> 00:03:34,965 {\an8}(కొరియన్ లో)మోజసు. 27 00:03:35,966 --> 00:03:37,885 త్వరగా రా. బట్టలు తీయడానికి సాయం చెయ్. 28 00:03:40,220 --> 00:03:43,098 ఆంటీ, నువ్వు ఎప్పుడూ నన్ను మాత్రమే ఎందుకు పిలుస్తావు? 29 00:03:43,098 --> 00:03:45,058 నోవాని ఎప్పుడూ పిలవవు! 30 00:03:45,058 --> 00:03:47,186 ఎందుకంటే నువ్వు ఆడుకోవడం తప్ప ఇంకేం చేయవు. 31 00:03:47,186 --> 00:03:48,729 త్వరగా రా! 32 00:03:48,729 --> 00:03:52,149 "మనం మన భాషకు పట్టిన ఆ అమెరికన్ల సామ్రాజ్యవాదుల 33 00:03:52,149 --> 00:03:56,403 కుళ్ళును తీసివేయాలని గుర్తుపెట్టుకోవాలి. 34 00:03:57,154 --> 00:04:01,992 ఒకప్పుడు మనం 'బెల్టు' అని పిలిచిన దానిని ఇక నుండి 'నడికట్టు' అని పిలవాలి. 35 00:04:01,992 --> 00:04:05,996 మన పండితులు ఇలాంటి మార్పులు చేయడానికే విద్యను అభ్యసించాలి." 36 00:04:33,690 --> 00:04:34,942 ఆంటీ! 37 00:04:38,612 --> 00:04:39,863 నువ్వు బానే ఉన్నావా? 38 00:04:41,865 --> 00:04:45,077 నీకు... నీకు నా మాట అర్థం అవుతుందా? 39 00:04:48,539 --> 00:04:49,540 ఇది నువ్వేనా, నోవా? 40 00:04:55,254 --> 00:04:58,048 - నోవా... - నన్ను పిలిచావా? 41 00:05:01,051 --> 00:05:02,177 నోవా. 42 00:05:03,262 --> 00:05:05,556 ఏంటిది? ఇతను ఎవరు? 43 00:05:06,056 --> 00:05:07,140 నాకు తెలిసి... 44 00:05:08,392 --> 00:05:11,687 నాకు తెలిసి... ఇది ఆయనే. 45 00:05:15,566 --> 00:05:16,692 ఇసాక్? 46 00:05:27,369 --> 00:05:29,955 నేను తిరిగి వచ్చేసాను, సన్ఈ. 47 00:05:33,876 --> 00:05:34,960 నేను... 48 00:05:36,753 --> 00:05:38,338 నేను ఇంటికి వచ్చేసా. 49 00:05:46,138 --> 00:05:48,015 నేను తిరిగి వచ్చేసా. 50 00:07:13,976 --> 00:07:16,228 మిన్ జిన్ లీ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 51 00:07:35,664 --> 00:07:37,833 టోక్యో 52 00:07:51,555 --> 00:07:53,307 హెనిస్సి. నీట్. 53 00:07:53,807 --> 00:07:56,018 కొన్ని నీళ్లు. 54 00:07:59,062 --> 00:08:00,898 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 55 00:08:05,194 --> 00:08:06,904 నేను క్షమాపణలు అడగడానికి వచ్చాను. 56 00:08:10,866 --> 00:08:14,953 చెప్పండి, నేను ఏం చేయాలి? 57 00:08:19,374 --> 00:08:23,629 బహుశా మనిద్దరికీ చాలా పోలికలు ఉన్నట్టు ఉన్నాయి. 58 00:08:25,380 --> 00:08:27,424 నీ తండ్రి అలాగే నా తండ్రి 59 00:08:28,300 --> 00:08:31,887 ఆర్థికంగా చాలా సాధించారు. 60 00:08:35,265 --> 00:08:38,602 అలాగే నీలాగే, ఎవరైనా నా దారికి అడ్డు నిలబడినప్పుడు, 61 00:08:39,645 --> 00:08:44,024 నేను తలవంచి, కష్టపడి, కుయుక్తిని వాడాను. 62 00:08:46,276 --> 00:08:48,445 నాతో పెట్టుకుంటే నేను ఊరికే వదలను అని 63 00:08:48,445 --> 00:08:53,534 నేను ఈ ప్రపంచానికి చూపాల్సి వచ్చింది. 64 00:08:54,993 --> 00:08:56,036 అయితే ఇప్పుడేంటి? 65 00:08:57,996 --> 00:09:01,124 జపాన్ లో ఈ ఏడాదిలో అతిగొప్ప వ్యాపారవేత్తను అయ్యా. 66 00:09:04,253 --> 00:09:08,423 ఒకప్పుడు నన్ను నాశనం చేయడానికి ప్రయత్నించిన వారే దాన్ని నాకు ఇచ్చారు. 67 00:09:12,594 --> 00:09:14,179 నేను నిన్ను కలిసిన క్షణం నుండి, 68 00:09:15,556 --> 00:09:18,517 నువ్వు నా దారికి అడ్డు వస్తావని నాకు తెలుసు. 69 00:09:20,227 --> 00:09:23,522 ఇప్పుడు నీ పతనం నా కారణంగానే జరిగింది. 70 00:09:26,900 --> 00:09:29,319 కాబట్టి క్షమించడాలు ఇక ఉండవు. 71 00:09:30,821 --> 00:09:36,243 ఎందుకంటే ఈ టౌన్ కి ఒక సందేశం పంపడానికి నేను నిన్ను వాడుకుంటున్నా. 72 00:09:38,912 --> 00:09:43,125 నాతో పెట్టుకునే నేను ఎవరినైనా నాశనం చేస్తా. 73 00:10:07,232 --> 00:10:09,776 ఆయన ఎక్కడ? లోపల ఉన్నాడా? 74 00:10:12,738 --> 00:10:13,822 సూన్జా. 75 00:10:15,365 --> 00:10:17,034 నువ్వు కొంచెం మానసికంగా సిద్ధపడాలి. 76 00:10:57,491 --> 00:10:58,534 నువ్వు ఎవరివి? 77 00:11:00,285 --> 00:11:01,662 ఇది నేనే. 78 00:11:12,047 --> 00:11:13,382 ఇది నేనే. 79 00:11:14,800 --> 00:11:16,260 సూన్జా. 80 00:11:16,969 --> 00:11:18,637 అవును, అది నేనే. 81 00:11:21,765 --> 00:11:24,893 ఏంటి ఇలా చేశారు? అందరినీ చాలా భయపెట్టేసారు. 82 00:11:30,399 --> 00:11:33,777 నేను మీ కోసం ప్రతీ రోజూ, ప్రతీ రాత్రి ప్రార్థించాను. 83 00:11:34,987 --> 00:11:37,197 నువ్వు చాలా కష్టపడి ఉంటావు. 84 00:11:41,618 --> 00:11:44,454 ఎందరో మిగతా వారితో పోల్చితే మేము చాలా అదృష్టవంతులం. 85 00:11:45,789 --> 00:11:48,500 మీ అన్న అలాగే వదినకు నేను చాలా రుణపడి ఉంటాను. 86 00:11:49,293 --> 00:11:51,587 వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. 87 00:11:51,587 --> 00:11:57,509 నా అన్న చాలా దూరం వెళ్ళిపోయాడు అని విన్నాను. 88 00:11:59,386 --> 00:12:03,724 నాకు తనని చూడాలని చాలా ఆశగా ఉంది. 89 00:12:14,318 --> 00:12:18,155 నువ్వు నన్ను ఇలా చూడకూడదు అనుకున్నా. 90 00:12:18,155 --> 00:12:19,781 అలాగే మన కుర్రాళ్లు కూడా. 91 00:12:23,452 --> 00:12:25,287 ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు? 92 00:12:27,497 --> 00:12:29,708 ముందు ఆరోగ్యం కోలుకోనివ్వండి. 93 00:12:33,378 --> 00:12:34,379 సరే. 94 00:12:35,005 --> 00:12:36,590 నేను చాలా అలసిపోయా. 95 00:12:41,678 --> 00:12:43,180 కాసేపు పడుకోండి. 96 00:12:49,436 --> 00:12:51,188 నన్ను వదిలి వెళ్ళిపోకు. 97 00:12:53,732 --> 00:12:54,942 సూన్జా. 98 00:12:56,151 --> 00:12:59,238 నేను వెళ్లి డాక్టర్ ని తీసుకొస్తా. 99 00:12:59,988 --> 00:13:01,907 అతిత్వరలో మీకు నయం అవుతుంది. 100 00:13:23,971 --> 00:13:25,848 ఆయనకు వెంటనే డాక్టర్ సాయం కావాలి. 101 00:13:27,099 --> 00:13:29,268 కానీ ఇప్పుడు మనకు డాక్టర్ ఎక్కడ దొరుకుతాడు? 102 00:13:29,268 --> 00:13:32,354 నాకు తెలిసినంత వరకు, వాళ్లందరినీ యుద్ధానికి పంపారు... 103 00:13:32,354 --> 00:13:34,189 హాస్పిటల్స్ లో ఇంకా కొందరు ఉండి ఉంటారు. 104 00:13:35,023 --> 00:13:36,316 మనం ఒకరిని కనిపెట్టాలి. 105 00:13:39,194 --> 00:13:40,195 సూన్జా! 106 00:13:46,118 --> 00:13:47,452 ఒకవేళ... 107 00:13:48,495 --> 00:13:50,247 ఒకవేళ పరిస్థితి ఇప్పటికే చేదాటిపోయి ఉంటే? 108 00:13:50,873 --> 00:13:53,125 నువ్వు ఇలాంటప్పుడు తన పక్కన ఉండాలి కదా? 109 00:13:53,834 --> 00:13:56,879 తనతో నువ్వు ఇంకెంత కాలం గడపగలవో నీకు తెలీదు. 110 00:13:59,006 --> 00:14:02,384 సన్ఈ, మర్చిపోయావా? 111 00:14:03,302 --> 00:14:05,846 ఆయన ఇంతకు ముందు ఒకసారి మరణాన్ని జయించాడు. 112 00:14:06,805 --> 00:14:10,642 ఆయనకు ఒక డాక్టర్ సాయం అందితే, మళ్ళీ మామూలు అవ్వగలడు. 113 00:14:12,019 --> 00:14:13,020 అది నాకు తెలుసు. 114 00:14:32,039 --> 00:14:34,958 మళ్ళీ నువ్వే! ఎందుకు వచ్చావు? 115 00:14:35,792 --> 00:14:37,252 ఇప్పుడు టైమ్ ఎంత అయిందో తెలుసా? 116 00:14:37,920 --> 00:14:39,880 - హల్మోని. - వెళ్ళిపో! 117 00:14:40,464 --> 00:14:42,049 నాకు వెళ్ళడానికి వేరే చోటు లేదు. 118 00:14:42,841 --> 00:14:44,343 ఇంకెవరి దగ్గరకు వెళ్ళలేను. 119 00:14:49,097 --> 00:14:50,098 హల్మోని. 120 00:15:05,239 --> 00:15:07,324 బయటకు పో! 121 00:15:11,036 --> 00:15:13,163 ముందు నేను మీకు ఒకటి చెప్పాలి. 122 00:15:16,875 --> 00:15:18,418 మీ ఇల్లు ఇలా కావడానికి 123 00:15:19,753 --> 00:15:20,921 కారణం నేనే. 124 00:15:23,841 --> 00:15:25,300 నువ్వు... 125 00:15:26,134 --> 00:15:29,513 మీకు సంతకం చేయొద్దు అని చెప్పిన తర్వాత, షిప్లీస్ వారు నన్ను పనిలో నుండి తీసేసారు. 126 00:15:30,806 --> 00:15:32,933 కాబట్టి నా వీసా రద్దు చేయబడింది. 127 00:15:33,475 --> 00:15:35,227 ఇప్పుడు నేను ఇక్కడే ఇరుక్కుపోయా. 128 00:15:36,562 --> 00:15:38,021 అంతేకాదు, అబే గారు ఇప్పుడు... 129 00:15:38,021 --> 00:15:40,858 ఇక చాలు. నా ఇంటి సంగతి ఏంటి? 130 00:15:45,737 --> 00:15:48,574 నేను ఒకరితో ఒక డీల్ చేసుకున్నాను. 131 00:15:49,157 --> 00:15:53,954 అతను తన కనెక్షన్లను వాడి మిమల్ని బయటకు పంపేయడానికి చూసాడు. 132 00:15:55,831 --> 00:15:58,917 మేము ఈ స్థలాన్ని కొని, 133 00:16:00,210 --> 00:16:03,338 దాన్ని అబే గారికి అలాగే షిప్లీస్ కి అమ్మడానికి చూశాం. 134 00:16:04,715 --> 00:16:06,925 నా బ్రతుకుదెరువు కోసం నాకు ఆ డబ్బు అవసరమైంది. 135 00:16:08,302 --> 00:16:11,138 - నాకు వేరే దారి లేదు... - అది కూడా ఒక కారణమేనా? 136 00:16:15,726 --> 00:16:17,895 కానీ మనం ఏది చేసినా ఇలాంటి ఉద్దేశంతోనే చేస్తాం కదా? 137 00:16:19,313 --> 00:16:24,109 మనుగడ కోసం మనం ఒకరిపై ఒకరం తిరగబడతాము, 138 00:16:25,319 --> 00:16:27,654 కానీ మనం వాళ్లకు పని చేస్తున్నాం అని తెలుసుకోలేకపోతున్నాం. 139 00:16:29,114 --> 00:16:31,992 వాళ్లకు కావాల్సింది కూడా ఇదే. 140 00:16:32,534 --> 00:16:34,453 బలవంతంగా క్షమించమని వాళ్ళను వేడుకునేలా చేస్తున్నారు. 141 00:16:42,503 --> 00:16:43,837 ఆఖరికి తెలిసింది. 142 00:16:45,255 --> 00:16:47,132 నీకు ఇన్నాళ్లకు అర్థమైంది. 143 00:17:22,251 --> 00:17:25,127 ఇది నేనే. నోవాని. 144 00:17:38,267 --> 00:17:42,980 నోవా, వెళ్లి సెక్స్టన్ హ్యూని... 145 00:17:42,980 --> 00:17:45,315 ఆయన ఇప్పుడు మన పాస్టర్. 146 00:17:47,317 --> 00:17:48,527 పాస్టరు? 147 00:17:49,111 --> 00:17:53,240 అవును. పాస్టర్ యో కొన్ని ఏండ్ల క్రితం చనిపోయారు. 148 00:17:54,908 --> 00:17:56,076 అలాగా. 149 00:18:01,999 --> 00:18:03,333 వెళ్ళు. 150 00:18:05,252 --> 00:18:06,962 వెళ్లి పాస్టర్ హ్యూని పిలుచుకుని రా. 151 00:18:08,297 --> 00:18:10,924 త్వరగా. తీసుకొస్తావా? 152 00:18:12,342 --> 00:18:13,427 అలాగే. 153 00:18:21,977 --> 00:18:24,688 నోవా, టెలిగ్రామ్ ఆఫీసుకు వెళ్లి రా. 154 00:18:25,397 --> 00:18:27,441 మనం మీ అంకుల్ కి ఒక సందేశం పంపాలి. 155 00:18:27,441 --> 00:18:32,362 కానీ, ఆంటీ, నాన్న పాస్టర్ హ్యూని పిలుచుకుని రమ్మన్నారు. 156 00:18:34,781 --> 00:18:35,782 అలాగా. 157 00:18:36,992 --> 00:18:38,994 తనకు ఆయనతో కలిసి ప్రార్థన చేయాలని అనిపించిందేమో. 158 00:18:38,994 --> 00:18:40,662 - అయితే వెళ్ళు. - అలాగే. 159 00:18:40,662 --> 00:18:43,916 మరి నా సంగతి ఏంటి? నేను టెలిగ్రామ్ ఆఫీసుకు వెల్లగలను. 160 00:18:48,629 --> 00:18:50,631 ఇది ఎంత ముఖ్యమైన విషయమో తెలుసా? 161 00:18:50,631 --> 00:18:52,216 నేను ఈ పని చేయగలను. 162 00:18:52,216 --> 00:18:54,718 అంకుల్ కి ఈ సందేశం ఖచ్చితంగా చేరుకునేలా చేస్తా. 163 00:19:26,416 --> 00:19:30,462 ఏమండీ, నేను నాగసాకిలో ఉన్న మా అంకుల్ కి ఒక సందేశం పంపాలి. 164 00:19:31,004 --> 00:19:33,382 ఇది చాలా ముఖ్యం. 165 00:19:39,763 --> 00:19:42,015 దాన్ని చదవగలవా? 166 00:19:51,149 --> 00:19:52,526 ఇరవై ఒక్క అక్షరాలు. 167 00:19:52,526 --> 00:19:53,610 ఎనభై సెన్. 168 00:19:57,823 --> 00:20:01,034 వ్రాతను చెక్ చేసి అంతా కరెక్టుగా ఉందో లేదో చూడు. 169 00:20:05,747 --> 00:20:08,250 {\an8}ఇసాక్ తిరిగి వచ్చాడు. 170 00:20:08,250 --> 00:20:10,294 {\an8}అతను చనిపోతున్నాడు. 171 00:20:23,182 --> 00:20:24,892 పాస్టర్! ఆయన తిరిగి వచ్చారు! 172 00:20:24,892 --> 00:20:26,226 నోవా. 173 00:20:26,226 --> 00:20:30,189 ఇన్నేళ్ల తర్వాత, మా నాన్న ఆఖరికి ఇంటికి తిరిగి వచ్చారు. 174 00:20:30,814 --> 00:20:34,026 కానీ ఆయన ఆరోగ్యం అస్సలు బాలేదు. 175 00:20:36,028 --> 00:20:39,156 దయచేసి ఆయనకు సాయం చేయండి. మీరు చేయగలరని నాకు తెలుసు. 176 00:20:39,656 --> 00:20:42,326 మాకు ఒక క్షణం టైమ్ ఇస్తారా? 177 00:20:44,411 --> 00:20:46,246 మా నాన్న ఆఖరికి ఇంటికి వచ్చారు. 178 00:20:47,414 --> 00:20:48,874 ప్లీజ్, నాతో రండి. 179 00:20:48,874 --> 00:20:50,459 ఆయన కోసం ప్రార్థన చేయండి. 180 00:20:51,335 --> 00:20:53,295 ఆయనకు ఆరోగ్యం ఇమ్మని దేవుడిని అడగండి. 181 00:20:53,962 --> 00:20:56,048 నా ప్రార్థనలు సరిపోతాయని నాకు అనిపించడం లేదు. 182 00:20:56,048 --> 00:20:59,551 దేవుడు మీ ప్రార్థనలు వింటాడని నాకు తెలుసు. 183 00:21:00,511 --> 00:21:02,262 నోవా, ఇది అంత సింపుల్ విషయం కాదు. 184 00:21:02,262 --> 00:21:03,972 కానీ ఇందులో అంత కష్టమైంది ఏం లేదు! 185 00:21:07,976 --> 00:21:10,229 నేను మంచి పిల్లాడిగా ఉన్నా, 186 00:21:11,230 --> 00:21:12,272 అవునా? 187 00:21:13,357 --> 00:21:15,609 నేను మంచి వాడిగా ఉండటానికి ఎంతో కష్టపడ్డా. 188 00:21:18,028 --> 00:21:20,614 ఈసారి దేవుడు మమ్మల్ని పట్టించుకోకుండా ఉండకూడదు. 189 00:21:22,866 --> 00:21:24,660 మళ్ళీ అలా జరగదు. 190 00:21:30,415 --> 00:21:31,708 నేను నా వస్తువులు తీసుకుని వస్తా. 191 00:21:48,392 --> 00:21:51,311 ఆయనకు డాక్టర్ కావాలి. 192 00:21:52,521 --> 00:21:54,022 అందుకే నేను వచ్చాను. 193 00:21:54,022 --> 00:21:56,817 నువ్వు, అలాగే కుర్రాళ్ళు కలిసి ఈ ఊరు వదిలి పోవడమే నువ్వు చేయాల్సిన పని. 194 00:21:57,442 --> 00:21:59,903 సాయం ఎవరికి అని కూడా నువ్వు అడగలేదు. 195 00:21:59,903 --> 00:22:01,280 నీకు విషయం తెలుసు. 196 00:22:02,698 --> 00:22:03,907 మరి చెప్పు. 197 00:22:05,534 --> 00:22:08,203 నువ్వు ఇంతకు ముందే ఆయన్ని విడిపించగలిగి ఉండేవాడివా? 198 00:22:10,247 --> 00:22:13,041 నేను ఒక జైలు అధికారికి ఈ ఊరు నుండి అతన్ని, అతని కుటుంబాన్ని 199 00:22:13,625 --> 00:22:15,169 దాటిస్తాను అని ఈసారి ప్రమాణం చేయగలిగాను 200 00:22:15,169 --> 00:22:17,880 కాబట్టే నేను వాడిని విడిపించగలిగాను. 201 00:22:18,714 --> 00:22:21,300 అందరూ బయటకు పోవడానికి చూస్తున్నారు. 202 00:22:22,092 --> 00:22:23,343 నువ్వు తప్ప అందరూ. 203 00:22:28,307 --> 00:22:29,892 నీది ఇప్పుడు దిక్కుతోచని స్థితి అనుకుంట 204 00:22:30,559 --> 00:22:32,102 అందుకే నా దగ్గరకు వచ్చావు. 205 00:22:32,686 --> 00:22:33,687 అవును. 206 00:22:43,989 --> 00:22:45,324 విషయం ఏంటో చెప్తాను. 207 00:22:46,491 --> 00:22:47,951 నీకు ఒక డాక్టర్ ని ఏర్పాటు చేస్తా. 208 00:22:48,535 --> 00:22:50,370 సిటీలో ఉన్న అతిమంచి డాక్టర్. 209 00:22:50,370 --> 00:22:51,538 బదులుగా, 210 00:22:52,706 --> 00:22:56,585 నువ్వు అలాగే పిల్లలు నాతో కలిసి రావాలి. 211 00:22:58,295 --> 00:23:00,172 వాడు రాగలిగినా, లేకపోయినా. 212 00:23:02,424 --> 00:23:03,967 నాకు ప్రమాణం చెయ్. 213 00:23:47,845 --> 00:23:52,891 మేము ఎన్నో కష్టాలు పడ్డ ఆ సంవత్సరాలను మర్చిపోవడం ఎంత సులభమో. 214 00:23:53,517 --> 00:23:55,060 కానీ ఇప్పుడు చూడు. 215 00:23:57,521 --> 00:24:00,774 ఆ రోజుల్లో నేను ఈ నేలను యుద్ధం తర్వాత కొన్నాను, 216 00:24:00,774 --> 00:24:03,902 చెప్పాలంటే నామమాత్రంగా డబ్బిచ్చి కొన్నా అంతే. 217 00:24:04,862 --> 00:24:05,863 ఏంటి? 218 00:24:06,655 --> 00:24:07,781 నేను జోక్ చేయడం లేదు. 219 00:24:07,781 --> 00:24:10,409 లేదంటే ఇంత స్థలాన్ని నేనెలా కొనగలిగేదాన్ని? 220 00:24:12,452 --> 00:24:13,453 ఎందుకై ఉంటుందో. 221 00:24:14,663 --> 00:24:17,749 ఈ స్థలం మీద మొదట్లో ఎన్నో వింత పుకార్లు చెప్పుకునేవారు. 222 00:24:18,584 --> 00:24:19,877 ఎలాంటి పుకార్లు? 223 00:24:22,880 --> 00:24:25,257 ఇలా ఆకలి కడుపులు నింపడమే నా విధి అయిపోయింది. 224 00:24:25,966 --> 00:24:28,343 ఆ కుక్కకి ఎంత పెట్టినా ఆకలి తగ్గదు. 225 00:24:32,014 --> 00:24:35,684 హల్మోని, ఆగండి. ఎలాంటి పుకార్లు? 226 00:24:36,268 --> 00:24:38,770 అవన్నీ ఇప్పుడు నాకెలా గుర్తుంటాయి? 227 00:24:39,771 --> 00:24:42,691 ఇక్కడ ఒక మిలటరీ స్కూల్ ఉండేది అని ఏవేవో చెప్పుకునేవారు. 228 00:24:44,443 --> 00:24:46,778 ఒకరోజు ఇక్కడికి ట్రక్లు రావడం మొదలైంది అంట. 229 00:24:47,613 --> 00:24:48,822 శవాలతో నిండిన ట్రక్లు. 230 00:24:54,036 --> 00:24:56,538 ఒక మిలటరీ స్కూల్ కి శవాలను ఎందుకు తీసుకొచ్చి ఉంటారు? 231 00:24:57,581 --> 00:24:58,665 నాకేం తెలుసు? 232 00:24:59,416 --> 00:25:03,045 అది యుద్ధం జరిగినప్పుడు చోటుచేసుకున్న విషయం, కాబట్టి ఎవరూ వాళ్ళను ప్రశ్నించలేదు. 233 00:25:04,129 --> 00:25:07,049 అంతేనా? పుకార్లలో ఆ ఒక్క విషయమే చెప్పేవారా? 234 00:25:08,383 --> 00:25:11,136 నెమ్మదిగా తిను, లేదంటే అనారోగ్యం చేస్తుంది. 235 00:25:11,136 --> 00:25:13,347 - హల్మోని. - ఏంటి? 236 00:25:13,347 --> 00:25:15,307 నీకు ఇంకా సందేహాలు ఉన్నాయా? 237 00:25:15,307 --> 00:25:17,017 నీకు చెప్పాను కదా! 238 00:25:17,809 --> 00:25:19,478 అది జరిగి చాలా కాలం అవుతుంది. 239 00:25:20,062 --> 00:25:23,023 చనిపోయినవారి గురించి... ఇప్పుడు మాట్లాడుకుని ఏం లాభం? 240 00:25:31,949 --> 00:25:34,952 కానీ ఆ శవాల ఎముకలు ఇంకా ఇక్కడే ఉండి ఉండొచ్చు కదా? 241 00:25:41,542 --> 00:25:42,835 హల్మోని. 242 00:25:47,631 --> 00:25:49,341 నేను అవన్నీ మర్చిపోవడానికి ట్రై చేశా. 243 00:25:50,759 --> 00:25:52,219 అర్థమైందా? 244 00:25:53,262 --> 00:25:55,430 వాటిని మర్చిపోవడానికి ఎంతో కష్టపడ్డాను. 245 00:25:56,056 --> 00:25:58,809 లేదంటే నేను ఇక్కడ అసలు ఎలా ఉండగలిగేదాన్ని? 246 00:26:01,228 --> 00:26:03,897 కానీ ఆ ఎముకలు బహుశా మనకు దేనికైనా పనికిరావొచ్చు. 247 00:26:06,191 --> 00:26:07,192 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 248 00:26:08,902 --> 00:26:10,112 మీకు అర్థం కావడం లేదా? 249 00:26:10,612 --> 00:26:12,364 మనం వాళ్ళను ఎదురుదెబ్బ తీయడానికి ఇదే దారి. 250 00:26:14,616 --> 00:26:19,788 వాటిని వాడుకుంటే, మనం వాళ్ళను మన వెంట పడకుండా ఆపగలం. 251 00:26:24,251 --> 00:26:27,504 చూశావా! ఆయన నాలాగా చిన్నగా ఉన్నప్పుడు, 252 00:26:27,504 --> 00:26:31,842 తన సొంత ఇంట్లో బస్కీల రికార్డును సృష్టించాడు అంట. 253 00:26:31,842 --> 00:26:34,428 ఇప్పుడు అతను చాలా ధనవంతుడు అనుకుంట. 254 00:26:34,428 --> 00:26:40,142 నీకు ధనవంతుడివి కావడం అంత ఇష్టమా? 255 00:26:40,809 --> 00:26:46,940 అవును! మన దగ్గర డబ్బు ఉండి ఉంటే, మనం నీకు మంచి డాక్టర్లను పెట్టి ఉండేవాళ్ళం 256 00:26:46,940 --> 00:26:49,276 అలాగే ఇంకా పెద్ద ఇల్లు కొనుక్కునేవారిమి. 257 00:26:49,860 --> 00:26:52,696 అలాగే మన దగ్గర ఏమైనా డబ్బు మిగిలితే, 258 00:26:52,696 --> 00:26:58,368 ఆంటీ బ్లాక్ మార్కెట్ లో పంచదార కొని కొన్ని మిఠాయిలు చేసేది కూడా. 259 00:27:04,791 --> 00:27:05,959 నీకేం కాలేదు కదా? 260 00:27:10,297 --> 00:27:17,304 నేను కూడా చిన్నప్పుడు ఒక పెద్ద ఇంట్లో పెరిగాను 261 00:27:19,223 --> 00:27:21,016 అందులో చాలా గదులు ఉండేవి. 262 00:27:22,518 --> 00:27:25,270 అంటే, చాలా గదుల్లోకి పిల్లల్ని వెళ్లనిచ్చేవారు కాదు. 263 00:27:25,270 --> 00:27:28,357 నేను మాత్రం వెళ్లిపోయేవాడిని అనుకో. 264 00:27:29,483 --> 00:27:31,360 నువ్వు వెళ్లే ఉంటావని నాకు తెలుసు. 265 00:27:32,986 --> 00:27:38,659 కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఆ పెద్ద ఇంటిని మిస్ అవ్వడం లేదు, 266 00:27:40,035 --> 00:27:42,829 అందులో ఉండేవారిని మిస్ అవుతున్నాను. 267 00:27:43,830 --> 00:27:46,041 నిజమైన ఆస్తి అంటే, మోజసు... 268 00:27:47,042 --> 00:27:49,670 ప్రేమించబడటమే. 269 00:27:50,838 --> 00:27:55,050 కానీ, నాన్నా, ఏదో ఒక్కటే కావాలనుకోవడం ఎందుకు? 270 00:27:55,717 --> 00:27:58,971 నాకైతే ప్రేమ అలాగే డబ్బు రెండూ కావాలి. 271 00:28:05,435 --> 00:28:06,854 ఏం జరుగుతోంది? 272 00:28:06,854 --> 00:28:08,355 మళ్ళీ కరెంట్ పోయింది. 273 00:28:09,147 --> 00:28:11,024 ఈ మధ్యన ప్రతీ రాత్రి తీసేస్తున్నారు. 274 00:28:11,024 --> 00:28:12,526 నేను ఒక లాంతరు వెలిగిస్తాను. 275 00:28:19,825 --> 00:28:21,034 తీసుకో. 276 00:28:25,205 --> 00:28:27,583 అంటే నీకు ఇక భయంగా లేదు అన్నమాట. 277 00:28:41,096 --> 00:28:43,390 థాంక్స్, బాబు. 278 00:28:47,895 --> 00:28:48,896 వాళ్ళు వచ్చారు! 279 00:28:49,897 --> 00:28:50,981 నాన్నా. 280 00:29:00,407 --> 00:29:03,744 నిన్ను మళ్ళీ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, సోదరా. 281 00:29:05,412 --> 00:29:06,872 పాస్టర్, రండి. 282 00:29:07,664 --> 00:29:08,665 నేను రాకుండా ఉండలేను కదా. 283 00:29:08,665 --> 00:29:10,542 ఆఖరికి ఇతను ఇంటికి రావడం... 284 00:29:10,542 --> 00:29:12,878 నేను పాస్టర్ తో ప్రైవేటుగా ఒక మాట మాట్లాడాలి. 285 00:29:17,549 --> 00:29:19,009 నడవండి. 286 00:29:19,009 --> 00:29:21,386 నోవా ఉండొచ్చు. 287 00:29:23,096 --> 00:29:24,348 నాన్నా. 288 00:29:25,224 --> 00:29:28,018 మోజసు, లాంతర్లు వెలిగించడంలో సాయం చెయ్. 289 00:29:35,025 --> 00:29:37,694 కానీ, హల్మోని, మీరు చెప్పేది నిజమైతే, 290 00:29:37,694 --> 00:29:41,698 కోల్టన్ లాంటి కంపెనీ ఈ స్థలాన్ని ముట్టుకోదు కూడా. 291 00:29:42,324 --> 00:29:44,076 మళ్ళీ అదంతా ఎలా ఆలోచించగలుగుతున్నావు? 292 00:29:44,076 --> 00:29:45,744 నేను చెప్పేది ఒక్కసారికి వినండి. 293 00:29:46,411 --> 00:29:48,956 మనం ఈ స్థలాన్ని అబే గారికి అమ్మిన తర్వాత, 294 00:29:48,956 --> 00:29:51,917 మనం ఆ ఎముకల గురించి పుకార్లు పుట్టిద్దాం... 295 00:29:51,917 --> 00:29:54,294 అవి ఇంకా ఇక్కడ ఉన్నాయో లేదో కూడా మనకు తెలీదు! 296 00:29:54,294 --> 00:29:59,925 అదంతా అనవసరం. అలాంటి పుకారు వింటే కోల్టన్ వాళ్ళు వెంటనే వెనుదిరుగుతారు. 297 00:30:01,051 --> 00:30:02,511 నేను ఖచ్చితంగా చెప్పగలను. 298 00:30:03,095 --> 00:30:07,891 వాళ్ళ భాగస్వామ్యం లేకపోతే, అబే గారు పెద్ద మొత్తం లోన్ తిరిగి చెల్లించాల్సి వస్తుంది. 299 00:30:07,891 --> 00:30:12,563 చనిపోయిన వారిని నీ లాభానికి వాడుకోవాలన్న ఆలోచన అసలు నీకు ఎలా వచ్చింది? 300 00:30:12,563 --> 00:30:16,733 ఆ గతానికి బాధ్యుడిని నేను కాదు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. 301 00:30:17,568 --> 00:30:18,652 చాలు! 302 00:30:28,537 --> 00:30:31,164 అయితే ఇదంతా చేసి ఏం లాభం? 303 00:30:32,124 --> 00:30:34,251 అంత కష్టపడి పని చేసింది దేనికి? 304 00:30:38,297 --> 00:30:41,508 అది నీ పనే, కదా? 305 00:30:43,969 --> 00:30:46,305 నన్ను అప్పగించింది నువ్వే. 306 00:30:53,353 --> 00:30:54,354 పాస్టర్? 307 00:30:55,731 --> 00:30:58,775 అవును. నువ్వు చెప్పింది నిజమే. 308 00:31:00,152 --> 00:31:01,361 అది నా పనే. 309 00:31:03,488 --> 00:31:07,701 నేనంటే నీకు ఇష్టం లేదేమో అని నాకు మొదటి నుండి అనుమానం ఉంది. 310 00:31:11,371 --> 00:31:12,539 ఎందుకు? 311 00:31:16,043 --> 00:31:17,878 నువ్వంటే నాకు ఇష్టం లేకపోవడం కాదు. 312 00:31:23,258 --> 00:31:25,052 నేను నిన్ను సహించలేకపోయా. 313 00:31:26,929 --> 00:31:32,142 ఇతరుల చేత ప్రేమించబడటం నీకు ఈజీ. 314 00:31:33,977 --> 00:31:35,187 కానీ నాకు... 315 00:31:38,857 --> 00:31:41,151 నన్ను నా సొంత తల్లిదండ్రులే వద్దనుకున్నారు. 316 00:31:43,070 --> 00:31:45,989 అందరూ నన్ను వద్దనుకున్నప్పుడు 317 00:31:45,989 --> 00:31:48,408 పాస్టర్ యో నన్ను చేరదీసారు. 318 00:31:49,034 --> 00:31:52,746 తన సొంత కొడుకులా నన్ను ప్రేమించి, పెంచారు, 319 00:31:52,746 --> 00:31:54,873 కానీ తర్వాత నువ్వు వచ్చావు, 320 00:31:56,083 --> 00:31:57,918 నీ రాకతో ఆయన ప్రేమ చల్లారింది. 321 00:32:11,932 --> 00:32:14,017 కాబట్టి నేను నిన్ను వాళ్లకు పట్టించాను. 322 00:32:18,605 --> 00:32:21,900 కానీ నేను పొందుతాను అనుకున్న సంతృప్తి... 323 00:32:22,818 --> 00:32:24,611 నాకు రాలేదు. 324 00:32:25,195 --> 00:32:30,492 నీ విడుదల కోసం నేను ఎంతో ప్రార్థించాను. 325 00:32:30,492 --> 00:32:34,997 నేను ఇక్కడికి రావడానికి కారణం నువ్వే అనుకుంటున్నావా? 326 00:32:37,499 --> 00:32:39,751 నీ కుటుంబం కూడా ప్రార్థించి ఉంటుంది, 327 00:32:39,751 --> 00:32:42,880 కానీ వారితో పాటు నేను కూడా ప్రార్థించానని ఖచ్చితంగా చెప్పగలను. 328 00:32:42,880 --> 00:32:45,174 నేను కేవలం దేవుడి దగ్గర మాత్రమే కాదు, 329 00:32:45,174 --> 00:32:49,052 మీ కుటుంబానికి అలాగే నోవాకి కూడా పరిహారం చెల్లించుకోవాలని చూసాను... 330 00:33:01,106 --> 00:33:03,775 నా మనస్ఫూర్తిగా నేను ప్రయత్నించా. 331 00:33:10,782 --> 00:33:12,993 నేను ఏమని చెప్పినా చేసిన దాన్ని సమర్ధించుకోలేనని తెలుసు. 332 00:33:13,702 --> 00:33:14,995 నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించలేవా... 333 00:33:14,995 --> 00:33:16,622 నేను నిన్ను క్షమిస్తున్నాను. 334 00:33:21,919 --> 00:33:23,587 నేను నిన్ను క్షమిస్తున్నాను. 335 00:33:23,587 --> 00:33:24,671 నువ్వు క్షమించకూడదు. 336 00:33:25,506 --> 00:33:28,133 నువ్వు అతన్ని క్షమించకూడదు. అస్సలు వదలకూడదు! 337 00:33:29,384 --> 00:33:31,011 ఇన్నేళ్లుగా... 338 00:33:31,595 --> 00:33:33,138 ఇతని వల్ల నువ్వు... 339 00:33:33,138 --> 00:33:34,932 నువ్వు నన్ను నమ్మాలి, నోవా. 340 00:33:35,682 --> 00:33:38,268 నేను నీ నుండి ఏం తీసుకున్నానో నాకు తెలుసు. 341 00:33:38,268 --> 00:33:41,188 బయటకు పో! మా నుండి దూరంగా ఉండు! 342 00:33:41,188 --> 00:33:43,106 - నోవా! - నన్ను క్షమించు, నోవా. 343 00:33:43,106 --> 00:33:44,316 నిజంగా, నన్ను క్షమించు! 344 00:33:45,275 --> 00:33:47,444 పాస్టర్, ఏం జరుగుతోంది? 345 00:33:48,195 --> 00:33:49,196 నోవా. 346 00:33:55,661 --> 00:33:56,745 నాన్నా. 347 00:34:01,124 --> 00:34:02,251 ఎందుకు? 348 00:34:08,382 --> 00:34:10,509 నాకు తెలుసు. మాట్లాడటానికి నేను సరిపోను కదా? 349 00:34:12,010 --> 00:34:14,638 నిజమైన వేదన గురించి నాకు మాత్రం ఏం తెలుసు? 350 00:34:17,766 --> 00:34:20,476 ఆకలి కడుపుతో నిద్రపోవడం అనే ఆలోచనే నేను... 351 00:34:22,396 --> 00:34:24,481 జీర్ణించుకోలేను. 352 00:34:29,069 --> 00:34:32,281 నేను ఎంతో సులభమైన బ్రతుకు బ్రతికాను. 353 00:34:35,074 --> 00:34:37,452 నన్ను చూసి మీరు అసహ్యపడటంలో న్యాయం ఉంది. 354 00:34:41,831 --> 00:34:43,917 మీరు నన్ను చూసే విధానాన్ని నేను చూసినప్పుడు... 355 00:34:46,085 --> 00:34:47,963 మా నాన్నమ్మ నన్ను చూసే విధానాన్ని చూసినప్పుడు... 356 00:34:50,507 --> 00:34:52,384 మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు... 357 00:34:55,721 --> 00:35:00,350 "దీని కోసమా నేను అన్ని కష్టాలు అనుభవించింది?" 358 00:35:05,898 --> 00:35:06,982 అవునా? 359 00:35:08,400 --> 00:35:10,903 మీ కష్టం వృధా అయిందని మీరు ఖచ్చితంగా అంటారు. 360 00:35:18,493 --> 00:35:21,121 ఇంత అర్థరాత్రి వరకు మిమ్మల్ని లేపి ఉంచినందుకు క్షమించండి. 361 00:35:25,834 --> 00:35:28,128 నేను ఇక ఎప్పటికీ తిరిగి రాను. ఒట్టు. 362 00:35:31,048 --> 00:35:34,176 నేను బ్రతికిన బ్రతుకుని తలచుకుని నేను బాధపడటం లేదు. 363 00:35:38,388 --> 00:35:41,850 నేను మంచి బ్రతుకే బ్రతికాను. 364 00:35:43,685 --> 00:35:46,647 నా కొడుకుల్లారా, విరిగిన ఎముకలతో నిండిన ఒక విరిగిన శరీరాన్నే... 365 00:35:46,647 --> 00:35:49,441 నేను మీకు దాన్ని మాత్రమే ఇవ్వగలుగుతున్నా. 366 00:35:50,025 --> 00:35:53,195 అయినా కూడా, ఒకటి గుర్తుంచుకోండి: 367 00:35:54,530 --> 00:35:56,782 ఆ పాస్టర్ విధి అలాగే మన విధి... 368 00:35:58,075 --> 00:36:00,577 మనం అందరం ఒకే బాటలో ఉన్నాం. 369 00:36:05,332 --> 00:36:06,708 నోవా, 370 00:36:08,168 --> 00:36:14,007 దయ అనేది ఒక బహుమతో లేక శక్తో కాదు. 371 00:36:14,007 --> 00:36:18,637 దయ అనేది ఒప్పుకోలు. 372 00:36:19,847 --> 00:36:24,685 మనుగడ కోసం చెల్లించాల్సిన ధర కొంత ఉంటుంది. 373 00:36:30,732 --> 00:36:34,486 నేను మీ ఇద్దరికీ ఎంతో చెప్పాలి అనుకుంటున్నాను. 374 00:36:35,863 --> 00:36:38,031 కానీ ఒక విషయం తెలుసుకోండి. 375 00:36:39,700 --> 00:36:41,952 ఏది ఏమైనా... 376 00:36:48,584 --> 00:36:50,294 మీరు నా కొడుకులు... 377 00:36:53,213 --> 00:36:55,174 అలాగే నేను మీ నాన్నని. 378 00:37:06,852 --> 00:37:07,895 నేను వచ్చాను! 379 00:37:09,688 --> 00:37:12,191 నేను డాక్టర్ ని తీసుకొచ్చా. ఈయన మనకు సాయం చేస్తాడు. 380 00:37:12,900 --> 00:37:14,318 ఇప్పుడు అంతా సర్దుకుంటుంది. 381 00:37:16,028 --> 00:37:19,740 - నాన్న! - ఇదేమి బాలేదు. గది కాళీ చేయండి. 382 00:37:20,532 --> 00:37:22,492 డాక్టర్ ఆయనకు సాయం చేస్తాడు. 383 00:37:22,492 --> 00:37:24,953 మోజసు, నోవా, రండి. 384 00:38:16,713 --> 00:38:18,006 అమ్మా! 385 00:38:25,848 --> 00:38:27,307 నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను. 386 00:38:28,684 --> 00:38:32,271 మీ భర్త ఊపిరి తిత్తుల్లోకి ద్రవం చేరుకుంది. 387 00:38:33,480 --> 00:38:36,233 హాస్పిటల్ లో అయితే ఆ ద్రవాన్ని తీయగలం, 388 00:38:37,150 --> 00:38:39,069 కానీ అంతకంటే పెద్ద సమస్య ఏంటంటే, 389 00:38:39,653 --> 00:38:42,322 ఆయనకు సెప్సిస్ ఉంది. 390 00:38:43,156 --> 00:38:44,241 నా దృష్టిలో... 391 00:38:47,536 --> 00:38:49,621 ఆయనకు ఎక్కువ టైమ్ లేదు. 392 00:38:53,417 --> 00:38:57,212 కానీ మీరు చేయగల పని ఏదోకటి ఉండి ఉండాలి. 393 00:38:58,463 --> 00:38:59,882 ప్లీజ్. 394 00:38:59,882 --> 00:39:02,467 మీకు డబ్బు కావాలంటే, ఏం సంకోచించకండి. 395 00:39:03,719 --> 00:39:05,512 ఆయనకు చెప్పు. 396 00:39:05,512 --> 00:39:08,557 నేను ఎంత కావాలన్నా ఇస్తాను. ఆయన డబ్బు గురించి ఆలోచించాల్సిన పనే లేదు. 397 00:39:08,557 --> 00:39:11,018 నేను... నేను డబ్బు ఏర్పాటు చేస్తా. 398 00:39:11,018 --> 00:39:14,605 మీ భర్తకు, మహా అయితే, 399 00:39:15,522 --> 00:39:17,733 ఇంకొన్ని గంటల సమయం ఉంది అంతే. 400 00:39:28,285 --> 00:39:30,704 వాళ్ళు ఆయనకు చేసినది... 401 00:39:31,205 --> 00:39:32,956 అది దారుణమైన పని. 402 00:39:33,665 --> 00:39:35,083 ఆయన స్థితిని చూస్తుంటే నాకు బాధగా ఉంది. 403 00:39:56,647 --> 00:39:58,607 నన్ను క్షమించు. 404 00:40:00,484 --> 00:40:02,611 ఇలా అవుతుందని 405 00:40:03,403 --> 00:40:06,406 నేను అనుకోలేదు. 406 00:40:06,990 --> 00:40:08,784 క్షమించడానికి ఏమీ లేదు. 407 00:40:10,285 --> 00:40:14,039 మీరు లేని ఇన్నేళ్లలో, 408 00:40:15,249 --> 00:40:20,045 మీ మంచితనం గురించి నాతో చాలా మంది చెప్పారు. 409 00:40:21,463 --> 00:40:24,633 మీరు ఇతరుల కోసం త్యాగాలు చేశారు. 410 00:40:25,926 --> 00:40:29,596 నేను 14 ఏండ్ల క్రితం కలిసిన వ్యక్తి ఆయనే, 411 00:40:30,305 --> 00:40:32,558 ఇప్పుడు నేను చూస్తున్న వ్యక్తి కూడా ఆయనే. 412 00:40:34,434 --> 00:40:36,478 ప్రపంచం మారి ఉండొచ్చు... 413 00:40:38,856 --> 00:40:41,316 కానీ మీరు మారలేదు. 414 00:40:46,572 --> 00:40:52,411 మన కుర్రాళ్ళు పెరిగి పెద్దవారు కావడం చూడాలని ఉంది. 415 00:40:56,123 --> 00:40:58,125 సూన్జా... 416 00:40:59,376 --> 00:41:04,173 నా భార్యా, నిన్ను హత్తుకోవాలని ఉంది. 417 00:41:05,674 --> 00:41:07,509 నాకు... 418 00:41:10,721 --> 00:41:13,223 నాకు బ్రతకాలని ఉంది. 419 00:41:15,475 --> 00:41:17,686 చాలా. 420 00:41:20,105 --> 00:41:23,567 బ్రతకాలన్న ఆశ నన్ను చంపుతోంది. 421 00:41:32,951 --> 00:41:35,245 నేను పోయిన తర్వాత... 422 00:41:37,706 --> 00:41:41,043 నువ్వు ఇంకొకరిని వెతుక్కోవాలి. 423 00:41:43,754 --> 00:41:46,006 అలాంటి మాటలు మాట్లాడొద్దు. 424 00:41:46,965 --> 00:41:53,472 నువ్వు పంచాల్సిన ప్రేమ ఇంకా ఎంతో ఉంది. 425 00:41:55,098 --> 00:41:56,308 అది నాకు తెలుసు. 426 00:41:57,809 --> 00:42:03,065 నా భర్త చేత ప్రేమించబడటం, 427 00:42:04,525 --> 00:42:06,360 మీ చేత గౌరవించబడటం... 428 00:42:10,155 --> 00:42:12,574 నాకు వాటికంటే ఇంకేం అక్కరలేదు. 429 00:42:17,538 --> 00:42:22,668 కానీ నువ్వు ఇంకెలా బ్రతుకుతావు? 430 00:42:29,341 --> 00:42:31,593 మా గురించి చింతించకండి. 431 00:42:33,929 --> 00:42:36,139 నేను ప్రమాణం చేస్తున్నాను. 432 00:42:37,933 --> 00:42:39,893 మన పిల్లలు... 433 00:42:41,728 --> 00:42:43,939 మంచి బ్రతకు బ్రతుకుతారు. 434 00:42:46,775 --> 00:42:48,652 నోవా అలాగే మోజసు... 435 00:42:51,196 --> 00:42:52,948 గొప్పవారవుతారు. 436 00:43:54,468 --> 00:43:58,138 మీ నాన్న లాంటి వ్యక్తి ఇంకొకరు ఎన్నటికీ ఉండరు. 437 00:44:00,390 --> 00:44:02,267 మీరు ఆ విషయాన్ని మర్చిపోకూడదు. 438 00:44:04,269 --> 00:44:05,479 ఎప్పటికీ. 439 00:45:57,049 --> 00:45:58,759 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 440 00:45:58,759 --> 00:46:00,135 డీల్ కుదిరింది. 441 00:46:00,135 --> 00:46:03,180 ఆమె 140 కోట్ల యెన్లకు అబే ఇంకా కోల్టన్ కి ఆ స్థలాన్ని అమ్ముతుంది. 442 00:46:03,180 --> 00:46:06,642 మనకు 10% ఫీజు అందుతుంది. 443 00:46:07,392 --> 00:46:10,646 కానీ ఒకటి తెలుసుకో. ఆ హోటల్ ని ఎప్పటికీ కట్టలేరు. 444 00:46:11,688 --> 00:46:13,649 ఎందుకంటే దాన్ని మనం ముంచేయబోతున్నాం. 445 00:46:14,483 --> 00:46:16,026 అప్పుడు అబే గారికి తెలుస్తుంది 446 00:46:17,236 --> 00:46:20,864 ఆయన్ని ఆ దెబ్బ తీసింది నేనే అని. 447 00:46:44,847 --> 00:46:47,724 ఇది డ్రిల్ కాదు! నిజమైన వాయుదాడి! 448 00:46:47,724 --> 00:46:49,601 వెంటనే బాంబ్ షెల్టర్ కి వెళ్ళండి! 449 00:46:50,644 --> 00:46:52,729 - త్వరగా, పారిపోండి! - త్వరగా! 450 00:46:52,729 --> 00:46:54,189 మీరు ఏం చేస్తున్నారు? మనం వెళ్ళాలి! 451 00:46:54,189 --> 00:46:55,315 పారిపోండి! పదండి! 452 00:46:55,315 --> 00:46:57,818 - ఆగు, మా అమ్మ... - అమ్మా! 453 00:46:57,818 --> 00:46:58,902 సూన్జా! 454 00:46:59,653 --> 00:47:01,196 - కానీ నా భర్త! - పారిపోండి! 455 00:47:01,196 --> 00:47:04,408 లేదు, నేను నా భర్తను వదిలి రాలేను! 456 00:48:27,783 --> 00:48:29,785 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్