1 00:00:07,841 --> 00:00:13,805 జపనీస్ డైలాగ్ సబ్ టైటిల్ నీలం రంగులో ఉంటుంది. కొరియన్ డైలాగ్ సబ్ టైటిల్ పసుపు రంగులో ఉంటుంది. 2 00:00:42,626 --> 00:00:43,836 (కొరియన్ లో) నోవా! 3 00:00:43,836 --> 00:00:46,505 సూన్జా, మేము ఇక్కడ ఉన్నాం. 4 00:00:52,302 --> 00:00:53,303 వాడు అక్కడ ఉన్నాడు! 5 00:00:58,475 --> 00:00:59,852 నాకు వాడు కనిపించాడు! 6 00:01:01,103 --> 00:01:02,771 నువ్వు ఎక్కడికి పోయావు? 7 00:01:02,771 --> 00:01:04,188 మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. 8 00:01:08,235 --> 00:01:09,778 నా భర్త చనిపోయాడు. 9 00:01:10,821 --> 00:01:13,532 సూన్జా, ఈ మనుషులంతా ఎవరు? 10 00:01:13,532 --> 00:01:16,952 ఇతను కోహ్ హన్సు, మా కుటుంబానికి తెలిసిన వ్యక్తి. 11 00:01:16,952 --> 00:01:19,371 ఈయన మన కోసం ఒక పల్లెటూరులో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసాడు. 12 00:01:20,372 --> 00:01:22,624 మనల్ని షెల్టర్ కి వెళ్ళమని చెప్పారు కదా. 13 00:01:22,624 --> 00:01:24,585 ఆ షెల్టర్లు మిమ్మల్ని కాపాడలేవు. 14 00:01:24,585 --> 00:01:27,337 కానీ నా భర్త ఇంకా ఇక్కడికి రాలేదు. 15 00:01:27,337 --> 00:01:29,006 ఆయన అనుమతి లేకుండా మేము ఇక్కడి నుండి రాలేము. 16 00:01:29,006 --> 00:01:31,633 ఆ అనుమతి వచ్చేసరికి, మీరంతా చనిపోతారు. 17 00:01:31,633 --> 00:01:35,304 ఒకసారి బాంబులు వేయడం మొదలైతే, అమెరికన్లు ఏకధాటిగా వేస్తారు. 18 00:01:35,304 --> 00:01:36,722 మీరు వెంటనే బయలుదేరాలి. 19 00:01:37,639 --> 00:01:40,225 సడన్ గా చెప్తున్నానని నాకు తెలుసు, కానీ మనం వీళ్ళను నమ్మొచ్చు. 20 00:01:40,225 --> 00:01:42,311 మిస్టర్ కోహ్ మనల్ని సురక్షితంగా ఉంచగలడు. 21 00:01:43,353 --> 00:01:45,314 లోనికి వెళ్ళండి. మీకు అవసరమైన వాటిని మాత్రమే సర్దుకోండి. 22 00:01:45,314 --> 00:01:47,232 - త్వరగా. - పదండి. 23 00:01:52,279 --> 00:01:54,531 నోవా, ఇంకొక దుప్పటి తీసుకో! 24 00:02:03,290 --> 00:02:05,000 నువ్వు ఏం చేస్తున్నావు? మనకు టైమ్ లేదు. 25 00:02:07,211 --> 00:02:08,794 నేను వీటిని ఇలా వదిలేయలేను. 26 00:02:09,505 --> 00:02:12,174 ఇవి మా కుటుంబ వారసత్వ సంపద. నా భర్త అలాగే నేను... 27 00:02:12,174 --> 00:02:14,092 ఏం జరుగుతుందో నీకు అర్థం అవుతుందా? 28 00:02:14,092 --> 00:02:16,011 నేను అంత వెర్రిదాన్ని కాదు! 29 00:02:17,304 --> 00:02:19,681 కానీ ఇవి మాతో అనేక తరాలుగా ఉన్నాయి. 30 00:02:20,182 --> 00:02:21,767 నేను వీటిని కోల్పోలేను. 31 00:02:24,853 --> 00:02:25,896 పక్కకి తప్పుకో. 32 00:02:26,688 --> 00:02:28,232 వెళ్లి బట్టలు సర్దడం ముగించు. ఇది నేను చేస్తా. 33 00:02:31,985 --> 00:02:33,153 త్వరగా రండి. 34 00:02:36,240 --> 00:02:38,075 మోజసు, నీ టోపీ ఎక్కడ? 35 00:02:38,075 --> 00:02:39,576 నేను దాన్ని ప్యాక్ చేసేసా! 36 00:03:12,401 --> 00:03:14,319 త్వరగా ఎక్కండి. 37 00:03:17,239 --> 00:03:18,240 వెంటనే. 38 00:03:42,014 --> 00:03:42,931 జియున్... 39 00:03:42,931 --> 00:03:45,434 ఆమెకు ఎవరూ లేరు. 40 00:03:45,434 --> 00:03:48,604 అది సాధ్యం కాదు. ఇప్పుడు మనం కారు ఆపలేం. 41 00:03:48,604 --> 00:03:50,397 ఆపితే మనం బయటకు వెళ్లలేం. 42 00:03:54,067 --> 00:03:57,237 ఆమె అలాగే ఆమె పిల్లలు సురక్షితంగా షెల్టర్ కి వెళ్లి ఉంటారులే. 43 00:03:57,738 --> 00:03:59,031 మనం ఆమెను మళ్ళీ కలవొచ్చు. 44 00:04:00,574 --> 00:04:02,451 (జపనీస్ లో) బకెట్లు నింపండి! 45 00:04:15,547 --> 00:04:19,259 లోనికి రండి! రండి! త్వరగా! పైకప్పు వేయండి! 46 00:04:24,806 --> 00:04:28,227 మమ్మల్ని లోనికి రానివ్వండి! 47 00:04:28,227 --> 00:04:30,479 మమ్మల్ని కరుణించండి! 48 00:04:30,479 --> 00:04:33,190 నా కూతురు! ఆమె ఆరోగ్యం బాలేదు! 49 00:04:35,192 --> 00:04:36,568 మమ్మల్ని లోనికి రానివ్వండి! 50 00:06:32,392 --> 00:06:34,269 నువ్వు నిద్ర లేచావు. 51 00:06:35,521 --> 00:06:36,522 మనం ఆఖరికి చేరుకున్నాం. 52 00:07:24,361 --> 00:07:25,779 మోజసు, జాగ్రత్త. 53 00:07:37,165 --> 00:07:40,210 సూన్జా, మనం నిజంగానే ఇక్కడ ఉండబోతున్నామా? 54 00:07:40,210 --> 00:07:41,503 ఇది నిజంగానే జరుగుతుందా? 55 00:07:42,629 --> 00:07:45,048 నేను ఈ స్థలాన్ని శుభ్రం చేయడానికి కొంతమందిని పిలిచాను. 56 00:07:45,048 --> 00:07:47,092 వాళ్ళు అవసరమైన వస్తువులను తీసుకొస్తారు. 57 00:07:47,092 --> 00:07:48,427 దుప్పట్లు ఇంకా మిగతావి. 58 00:07:48,427 --> 00:07:50,679 కానీ ఇది మట్టి నేల. 59 00:07:51,305 --> 00:07:52,514 అలాగే వంటగది ఏమీ లేదు. 60 00:07:52,514 --> 00:07:54,683 మేము ఇంటికి ఎప్పుడు వెళ్ళగలం? 61 00:07:54,683 --> 00:07:56,560 ముందు యుద్ధం ఆగాలి. 62 00:07:57,603 --> 00:07:59,646 అసలు మీ ఇల్లు ఇంకా ఉండి ఉండొచ్చు అని నేను అనుకోను. 63 00:07:59,646 --> 00:08:02,024 నేను మీతో ఉండమని కిమ్ చాంగోని కూడా అడిగాను. 64 00:08:04,401 --> 00:08:06,028 అది అసాధ్యం. 65 00:08:06,695 --> 00:08:08,405 అతను ఎవరో మాకు తెలీదు. 66 00:08:08,405 --> 00:08:11,325 సూన్జా, యోసెబ్ దీనికి అస్సలు ఒప్పుకోడు అని నీకు తెలుసు. అస్సలు ఒప్పుకోడు. 67 00:08:11,325 --> 00:08:12,659 ఈమె చెప్పింది నిజం. 68 00:08:12,659 --> 00:08:15,245 మాకు పరిచయమే లేని వ్యక్తితో మేము ఎలా ఉండగలం? 69 00:08:15,245 --> 00:08:16,955 ఇలాంటి పిచ్చి వాగుడు వాగొద్దు. 70 00:08:17,539 --> 00:08:19,208 ఇదేమైనా సిటీ అనుకుంటున్నావా? 71 00:08:19,208 --> 00:08:20,751 మీరు పిల్లల గురించి ఆలోచించాలి. 72 00:08:20,751 --> 00:08:23,003 నేను పల్లెటూరులో పెరిగాను అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. 73 00:08:23,003 --> 00:08:25,214 - నేను కూడా. - ఏమీ అనుకోవద్దు, 74 00:08:25,214 --> 00:08:27,132 నీ అవసరాలు అన్నీ తీర్చడానికి నీకు పనోళ్ళు ఉండేవారు. 75 00:08:28,008 --> 00:08:29,259 అలాగే నువ్వు... 76 00:08:29,259 --> 00:08:31,720 నువ్వు పల్లెటూరుకి వెళ్లి దాదాపు 14 ఏళ్ళు అవుతుంది. 77 00:08:32,554 --> 00:08:34,306 ఇలాంటి సమయాలలో, మనుషులు మారతారు. 78 00:08:34,306 --> 00:08:37,392 వేరే దారి లేని వారు ఏం చేయగలరు అనే విషయం నీకు తెలీదు. 79 00:08:38,184 --> 00:08:39,311 నేను చెప్పేది విను. 80 00:08:40,854 --> 00:08:43,190 అతను ఉంటాడు. నేను అతన్ని నమ్ముతున్నా. 81 00:08:45,651 --> 00:08:46,860 ఇక్కడ చేయాల్సిన పని చాలా ఉంది. 82 00:08:49,947 --> 00:08:51,865 నోవా, కారులోని సామాన్లు దించడానికి సాయం చెయ్. 83 00:08:51,865 --> 00:08:55,327 సన్ఈ, మనం ఆశించింది ఇది కాదని నాకు తెలుసు... 84 00:08:55,327 --> 00:08:57,079 నేను చెప్పేది విను. 85 00:08:57,829 --> 00:09:00,123 నా భయం మన దయనీయ స్థితిని చూసి కాదు. అది నేను తట్టుకోగలను. 86 00:09:00,123 --> 00:09:02,376 లేదా కష్టపడి పని చేయాల్సి వస్తుందని కూడా కాదు. 87 00:09:02,376 --> 00:09:03,877 నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. 88 00:09:08,423 --> 00:09:09,800 కానీ ఇదంతా చూస్తుంటే... 89 00:09:10,717 --> 00:09:12,719 నా బ్రతుకు ఒక జంతువు బ్రతుకుకంటే గొప్పదేం కాదని తెలిసినా... 90 00:09:15,055 --> 00:09:16,849 అలాగే యోసెబ్ కూడా ఎక్కడో ఉన్నాడు... 91 00:09:30,571 --> 00:09:32,823 మేము వెళ్ళడానికి వేరే చోటే లేదా? 92 00:09:32,823 --> 00:09:33,907 లేదు. 93 00:09:34,616 --> 00:09:36,660 మనలాంటి వారికి వేరే చోటు లేదు. 94 00:09:38,161 --> 00:09:40,873 ఇక్కడ నువ్వు సౌకర్యంగా ఉండటానికి నాకు చేతనైంది అంతా చేస్తాను. 95 00:09:41,456 --> 00:09:42,875 నాకు అదేం అవసరం లేదు. 96 00:09:42,875 --> 00:09:44,710 నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. 97 00:09:45,794 --> 00:09:48,088 నువ్వు చేసిన దానికి నేను నీకు కృతజ్ఞురాలినే, 98 00:09:49,631 --> 00:09:51,425 కానీ నాకు ఇక నీ నుండి ఇంకేం వద్దు. 99 00:09:52,384 --> 00:09:56,346 నా సాయాన్ని పొందడం నీకు అంత కష్టంగా ఉందా? 100 00:09:58,098 --> 00:10:00,267 - మీ ఇద్దరికీ సాయం చేయడం... - నాకు చాలా భయంగా ఉంది. 101 00:10:03,228 --> 00:10:05,147 నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాడికి ఎప్పటికీ తెలీదు. 102 00:10:05,147 --> 00:10:06,440 వాడు తెలివైన కుర్రాడు. 103 00:10:07,441 --> 00:10:09,860 - వాడు ఏదోకటి గ్రహహిస్తాడు... - వాడికి ఎలాంటి అనుమానం రాదు. 104 00:10:09,860 --> 00:10:11,570 ఈ విషయాన్ని వాడు ఊహించలేడు. 105 00:10:11,570 --> 00:10:12,863 అలా అనుకోవడం ప్రమాదకరం. 106 00:10:12,863 --> 00:10:15,490 నా కొడుకు జీవితాన్ని పాడు చేసే పనిని నేను చేస్తానని అనుకుంటున్నావా? 107 00:10:18,702 --> 00:10:20,454 అది నాకెలా తెలుస్తుంది? 108 00:10:21,455 --> 00:10:23,790 మనిద్దరికీ పెద్ద పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. 109 00:10:25,667 --> 00:10:26,752 అలాంటిది ఏమీ లేదు. 110 00:10:28,420 --> 00:10:29,588 అది నిజం కాదు. 111 00:10:31,840 --> 00:10:33,675 పద్నాలుగు ఏళ్ళు. 112 00:10:34,968 --> 00:10:37,179 నేను ఇప్పుడు ఆ కొలను దగ్గర కనిపించిన ఆ అమ్మాయిని కాదు. 113 00:10:40,766 --> 00:10:42,351 ఇప్పుడు నేను... 114 00:10:56,198 --> 00:10:58,158 ఇప్పుడు నేను ఒక విధవరాలిని. 115 00:10:59,409 --> 00:11:00,994 మా అమ్మలాగే. 116 00:11:26,228 --> 00:11:27,312 సూన్జా. 117 00:12:57,194 --> 00:12:59,446 మిన్ జిన్ లీ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 118 00:13:38,527 --> 00:13:40,612 జూన్ 1945 119 00:13:48,161 --> 00:13:51,081 ఇది నిజమో కాదో నేను పెద్ద కాపును అడుగుదాం అనుకుంటున్నాను. 120 00:13:51,748 --> 00:13:53,417 అదంతా ఆలోచించకు. 121 00:13:53,417 --> 00:13:56,336 ఒకసారి వాళ్ళను చూడు! వాళ్ళు ఎంత లావెక్కిపోయారో చూడు. 122 00:13:57,129 --> 00:13:59,715 వాళ్లకు మనకంటే ఎక్కువ తిండి అందుతుందని చూస్తేనే చెప్పొచ్చు. 123 00:14:02,009 --> 00:14:03,302 వాళ్ళను పట్టించుకోకు. 124 00:14:03,302 --> 00:14:06,221 అలా ఎలా ఉండగలను? వాళ్ళు ఆగకుండా వాగుతూనే ఉన్నారు. 125 00:14:07,681 --> 00:14:10,684 వాళ్ళు ఏమంటున్నారో నువ్వు నాకు చెప్తే బాగుండు. 126 00:14:10,684 --> 00:14:12,853 నువ్వు తెలుసుకుని ఏం లాభం? 127 00:14:15,272 --> 00:14:17,566 వాళ్ళు నేను లావుగా ఉన్నాను అన్నారు, కదా? 128 00:14:17,566 --> 00:14:19,401 కనీసం ఆ పదం నాకు అర్థమైంది. 129 00:14:20,694 --> 00:14:22,029 మనం అందరం ఒకే పని చేస్తున్నాం, 130 00:14:22,029 --> 00:14:24,281 కానీ మనం ఏదో బద్దకంగా పని మానుతున్నట్టు మాట్లాడుతున్నారు. 131 00:14:24,281 --> 00:14:26,366 వాళ్ళు ఇలా మాట్లాడటం నువ్వు వినడం ఇదేమి మొదటిసారి కాదు. 132 00:14:26,366 --> 00:14:27,910 నీకు ఇంత కోపంగా ఎందుకు ఉంది? 133 00:14:28,577 --> 00:14:31,079 ఆ అందంగా ఉన్న పిల్లే నాకు కోపం తెప్పిస్తుంది. 134 00:14:31,830 --> 00:14:33,415 ఆమెను చూడు! 135 00:14:33,415 --> 00:14:35,292 మనకంటే తానేదో గొప్పదాన్ని అనుకుంటోంది. 136 00:14:36,251 --> 00:14:39,296 నిజంగా, అసలు ఆమెకు అంత పొగరు ఎలా వచ్చింది? 137 00:14:39,838 --> 00:14:42,257 మాటల మీద ఉన్న ఉత్సాహాన్ని పని మీద పెట్టండి, 138 00:14:42,257 --> 00:14:44,092 అప్పుడైతే కనీసం కొంచెమైన పని జరుగుతుంది. 139 00:14:44,092 --> 00:14:47,304 చూడండి! ఎవరు పని తగ్గించినా మిగతావారు అది చేయాల్సి వస్తుంది. 140 00:14:47,304 --> 00:14:49,348 మేము ఏం చేయాలో మాకు చెప్పడానికి నువ్వు ఎవరివి? 141 00:14:50,307 --> 00:14:53,143 మేము మీలాంటి వారికి పని చేయము! 142 00:14:57,356 --> 00:14:58,982 అలా అని ఖచ్చితంగా చెప్పగలవా? 143 00:15:00,609 --> 00:15:02,653 ఎందుకు ఇన్ని మాటలు వినిపిస్తున్నాయి? 144 00:15:03,612 --> 00:15:05,322 తిరిగి పని మొదలెట్టండి. 145 00:15:16,792 --> 00:15:18,335 ఏమైనా సమస్యా? 146 00:15:29,346 --> 00:15:30,722 వెళ్ళు! ఇక్కడి నుండి పో! 147 00:15:30,722 --> 00:15:31,890 అది పారిపోతోంది! 148 00:15:31,890 --> 00:15:32,975 నాకు సాయం చెయ్! 149 00:15:32,975 --> 00:15:34,852 దానికి స్వేచ్ఛగా ఉండాలని ఉంది! 150 00:15:34,852 --> 00:15:37,062 వెళ్తూనే ఉండు! వాడికి దొరకొద్దు! 151 00:15:41,483 --> 00:15:42,317 త్వరగా, పారిపో! 152 00:15:42,317 --> 00:15:45,487 - మోజసు, అది పారిపోతోంది! - వెళ్తూనే ఉండు! వెళ్ళు! 153 00:15:45,487 --> 00:15:46,572 సాయం చేయండి! 154 00:15:49,199 --> 00:15:51,451 - మాకు సాయం చేయండి. - వెళ్ళు! 155 00:15:52,077 --> 00:15:53,579 మిస్టర్ కిమ్, ఇక్కడ, ఇక్కడ! 156 00:15:55,581 --> 00:15:56,498 దొరికింది. 157 00:15:56,498 --> 00:15:59,418 అది అన్యాయం. ఇద్దరు కలిసి ఒకదాన్ని పట్టుకున్నారు. 158 00:15:59,418 --> 00:16:01,003 నువ్వు సాయం చేయలేదు కదా. 159 00:16:01,003 --> 00:16:02,462 దీన్ని వెనక్కి తీసుకెళ్లొచ్చా? 160 00:16:07,801 --> 00:16:10,095 స్కూల్ కంటే ఇక్కడే నాకు సరదాగా ఉంది. 161 00:16:10,095 --> 00:16:11,847 నువ్వేమంటావు? 162 00:16:12,472 --> 00:16:14,516 మనం ఎప్పటికీ వెనక్కి వెళ్లకపోతే బాగుండు. 163 00:16:15,976 --> 00:16:18,645 యుద్ధం శాశ్వతంగా జరుగుతూ ఉండదు. 164 00:16:19,438 --> 00:16:23,317 అంతేకాక, నువ్వు నిజంగానే జీవితాంతం ఇలాగే గడపాలి అనుకుంటున్నావా? 165 00:16:23,817 --> 00:16:26,862 కోళ్లను వెంటాడుతు, అవి పాడు చేసిన చోట్లను శుభ్రం చేస్తావా? 166 00:16:27,946 --> 00:16:29,907 వింటుంటే నాకు అది మంచి పనిలాగే ఉంది. 167 00:16:30,908 --> 00:16:35,162 ఒకవేళ కోహ్ హన్సు మనల్ని ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే? 168 00:16:35,996 --> 00:16:38,373 మనం చాలా అదృష్టవంతులం, అవునా? 169 00:16:38,373 --> 00:16:39,958 కానీ అమ్మ చేసిన పని ఏమీ బాలేదు. 170 00:16:39,958 --> 00:16:42,878 కోహ్ గారిని ఆమె మనకు ఇన్నేళ్ళుగా ఎందుకు పరిచయం చేయలేదు? 171 00:16:43,629 --> 00:16:47,132 మనం ఎన్ని మిఠాయిలు తిని ఉండేవారిమో ఊహించుకో. 172 00:16:47,716 --> 00:16:49,384 ఎంత దారుణమో. 173 00:16:56,850 --> 00:16:58,560 ఏమండీ. 174 00:17:00,687 --> 00:17:05,233 మీకు బహుశా నేను గుర్తులేను ఏమో. 175 00:17:06,108 --> 00:17:08,444 నేను మొన్న రాత్రి ఇక్కడికి వచ్చాను. 176 00:17:09,655 --> 00:17:10,989 నాకు గుర్తుంది. 177 00:17:10,989 --> 00:17:13,659 నాకు భయం వేసింది. 178 00:17:13,659 --> 00:17:15,368 మీ మనవడు, 179 00:17:16,453 --> 00:17:17,746 ఇప్పుడు ఎలా ఉన్నాడు? 180 00:17:22,125 --> 00:17:25,921 వాడు మొన్న పలికిన మాటలు మాట్లాడి ఉండకపోతే బాగుండేది. 181 00:17:25,921 --> 00:17:28,590 వాడు సాధారణంగా అలా మాట్లాడడు. 182 00:17:29,258 --> 00:17:32,469 లేదు, అలా కాదు. 183 00:17:34,388 --> 00:17:38,058 ఆ కౌంటర్ దగ్గర పని చేసిన వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడాడు. 184 00:17:38,058 --> 00:17:42,312 అలా మాట్లాడటానికి మీ మనవడు చాలా ధైర్యం కూడగట్టుకున్నాడు. 185 00:17:47,025 --> 00:17:48,902 నాతో మాట్లాడటం మీకు ఇబ్బందిగా ఉందని తెలుస్తోంది. 186 00:17:49,820 --> 00:17:51,613 మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. 187 00:17:52,197 --> 00:17:53,198 క్షమించండి. 188 00:18:35,032 --> 00:18:36,658 నీకు ఏం కావాలి, సోలొమన్? 189 00:18:41,246 --> 00:18:43,498 ఆ స్థలం యజమాని, ఆమె అమ్మడానికి ముందుకు వచ్చింది. 190 00:18:44,750 --> 00:18:46,126 ఈసారి నిజంగానే అమ్ముతుంది. 191 00:18:46,919 --> 00:18:49,630 అబ్బా, నీ స్థితి మరీ దయనీయంగా ఉన్నట్టు ఉంది. 192 00:18:50,714 --> 00:18:52,090 అందులో ఆశ్చర్యం లేదులే. 193 00:18:52,090 --> 00:18:54,885 నువ్వు పోగేయడానికి చూసిన ఫండ్ గురించి విన్నాను. 194 00:18:55,469 --> 00:18:57,095 నీకు కలిసి రానందుకు బాధగా ఉంది. 195 00:18:59,348 --> 00:19:02,726 అబే. అతనే నా లక్ష్యం. 196 00:19:09,566 --> 00:19:11,443 ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు ఇంకా మారలేదు. 197 00:19:12,694 --> 00:19:13,737 కానీ నేను మారాను. 198 00:19:15,155 --> 00:19:17,991 బ్యాంక్ అకౌంట్ లో ఇంకొక్క మూడు నెలలకు సరిపడే డబ్బుతో ఉన్నాను, 199 00:19:17,991 --> 00:19:20,702 ప్రస్తుతం నన్ను కోల్పోవడానికి ఏదీ లేని వాడిని అనొచ్చు. 200 00:19:20,702 --> 00:19:22,454 అవునా? కానీ నీకు నా సహాయం కావాలి, అవునా? 201 00:19:23,038 --> 00:19:24,456 - అవును. - సరే. 202 00:19:24,456 --> 00:19:25,791 నేనెందుకు నీకు సాయం చేస్తా? 203 00:19:29,419 --> 00:19:31,046 ఎందుకంటే ప్రస్తుతం నువ్వు చేస్తున్న పని, 204 00:19:31,964 --> 00:19:34,132 ఆ డెస్క్ వెనుక కూర్చుని, 205 00:19:34,132 --> 00:19:36,260 ఒక మంచి కార్మికుడిలా పనిచేస్తూ జీవితం సాగిస్తున్నావు చూడు, 206 00:19:37,928 --> 00:19:40,097 కానీ ఒకప్పుడు వరుసగా ఎనిమిది ఏళ్ళు లీడర్ బోర్డులో టాప్ లో నిలబడిన 207 00:19:40,097 --> 00:19:41,557 టామ్ ఆండ్రూస్ అలాంటోడు కాదు. 208 00:19:44,393 --> 00:19:46,937 కాకపోతే ఇప్పుడు ఉన్నట్టు అప్పట్లో నిన్ను ఎవరూ లక్ష్యం చేసుకోలేదు, కదా? 209 00:19:46,937 --> 00:19:48,856 నువ్వు ఏం మాట్లాడుతున్నావు, సోలొమన్? 210 00:19:48,856 --> 00:19:51,400 నేను నువ్వు నిజంగా ఇక్కడ ఎందుకు ఉన్నావనే కారణం గురించి మాట్లాడుతున్నా, టామ్. 211 00:19:53,569 --> 00:19:55,112 న్యూ యార్క్ వారు నిన్ను ఎందుకు పంపారో చెప్తున్నా. 212 00:20:09,751 --> 00:20:12,838 నేను నా క్లైంట్స్ ఆస్తులను నిర్లక్ష్యం చేసిన విషయం గురించి విన్నావు, ఆహ్? 213 00:20:21,889 --> 00:20:24,516 నా వ్యవహారాన్ని నీకు వివరించాల్సిన పని నాకు లేదు, 214 00:20:24,516 --> 00:20:30,230 కానీ నన్ను పడగొట్టడానికి... పడగొట్టడానికి ఒక్క వెధవ పూనుకున్నాడు. 215 00:20:31,481 --> 00:20:35,569 వాడు చేసే ఏ పనీ విజయవంతం కాదు అని నేను వాడితో చెప్పిన కారణంగా. 216 00:20:35,569 --> 00:20:37,487 అందుకని వాడు నాకు వ్యతిరేకంగా చెలరేగిపోయాడు, 217 00:20:37,487 --> 00:20:41,825 నేను చేసిన ప్రతీ ఒక్క ట్రేడ్ ని తవ్వి పరిశీలించాడు. 218 00:20:43,327 --> 00:20:44,453 ఏ ట్రేడ్ వల్ల ఇలా అయిందో చెప్పగలవా? 219 00:20:45,787 --> 00:20:46,955 బాల్డ్ విన్ యునైటెడ్. 220 00:20:46,955 --> 00:20:49,291 అది ఎవరు అనుకుంటున్నావా? ఎవరైనా అనవసరం. 221 00:20:49,291 --> 00:20:50,542 అదంతా ఇప్పుడు అనవసరం, సోలొమన్. 222 00:20:50,542 --> 00:20:52,753 ఫామ్లలో కొన్ని అవకతవకలు జరిగాయి. 223 00:20:52,753 --> 00:20:54,463 ఇంతకీ వాటిని నింపింది నేను కాదు. 224 00:20:54,463 --> 00:20:57,633 నాకు సంబంధమే లేదు. నీలాంటి ఒక పనికిమాలిన అనలిస్ట్ నింపాడు. 225 00:20:57,633 --> 00:20:59,259 కానీ కంపెనీ నీ తప్పు లేదు అంది కదా. 226 00:20:59,259 --> 00:21:00,385 తర్వాత ఎప్పటికో, అవును. 227 00:21:01,094 --> 00:21:02,304 అయినా నన్ను తీసేసారు. 228 00:21:04,556 --> 00:21:09,228 దాంతో ఈ టోక్యో అనబడే జైలుకు వచ్చి పడ్డా. 229 00:21:14,191 --> 00:21:15,734 అయితే నీకు ఏం కావాలి, టామ్? 230 00:21:21,073 --> 00:21:24,034 నేను నా పిల్లల్ని ఏడాదికి ఒకసారి కంటే ఎక్కువసార్లు చూడాలి అనుకుంటున్నా. 231 00:21:26,203 --> 00:21:28,664 వాళ్ళు నన్ను ద్వేషించకుండా ఉంటే చాలు. 232 00:21:28,664 --> 00:21:31,166 కాదు, నాకు నిజంగా కావాల్సింది 233 00:21:31,166 --> 00:21:35,671 నా మాజీ భార్య ఒక ధనవంతుడైన భర్తను కనుగొనడమే, 234 00:21:35,671 --> 00:21:37,297 అప్పుడైతే నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేస్తుంది. 235 00:21:37,297 --> 00:21:38,924 అలా జరిగితే ఎంత బాగుంటుందో. 236 00:21:45,597 --> 00:21:47,474 కాదు, నీకు నిజంగా కావాల్సింది అది కాదు, టామ్. 237 00:21:49,768 --> 00:21:50,978 నీకు ఇంటికి వెళ్లాలని ఉంది. 238 00:21:51,603 --> 00:21:52,813 అదే కదా? 239 00:22:04,658 --> 00:22:08,954 వచ్చే ఏడాది ఈపాటికి నువ్వు ఇంటికి వెళ్లేలా చేస్తా అంటే ఏమంటావు? 240 00:22:09,997 --> 00:22:11,832 ఈ కంపెనీని వదిలేసి, 241 00:22:11,832 --> 00:22:14,585 నీ డబ్బుతో సొంతంగా ఇంకొక వ్యాపారాన్ని చేసుకోగలుగుతావు, 242 00:22:14,585 --> 00:22:18,589 ఈ ప్రపంచానికి టామ్ ఆండ్రూస్ ఇంకా చేతకానివాడు కాలేదు అని చూపగలుగుతావు. 243 00:22:23,468 --> 00:22:25,387 నిజంగా అంటున్నా. అలా జరిగేలా చేయగలను. 244 00:22:27,723 --> 00:22:29,558 కాకపోతే, అందుకు నువ్వు బదులుగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. 245 00:22:53,498 --> 00:22:56,460 అమ్మా! ఆయన వస్తాడని నాకు తెలుసు! 246 00:22:56,460 --> 00:22:57,711 మోజసు! 247 00:22:58,629 --> 00:23:00,297 హేయ్, ఆగు! 248 00:23:06,470 --> 00:23:07,804 మిస్టర్ కోహ్! 249 00:23:12,976 --> 00:23:14,436 అమ్మా, చూడు! 250 00:23:15,812 --> 00:23:17,814 నేను మ్యూజిక్ ని ఎంతగా మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది. 251 00:23:18,482 --> 00:23:20,234 సూన్జా, అది విను. 252 00:23:21,109 --> 00:23:23,362 ఇదేమి పెద్ద విషయం కాదు, కానీ ఇది మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. 253 00:23:24,321 --> 00:23:25,906 మాకోసం ఇంకేం తీసుకొచ్చారు? 254 00:23:25,906 --> 00:23:27,991 - మోజసు! - ఇదుగో. 255 00:23:29,117 --> 00:23:30,369 వావ్! 256 00:23:30,369 --> 00:23:33,038 చూడు, నోవా! ఈయన కొన్ని తెస్తాడని చెప్పా కదా. 257 00:23:33,038 --> 00:23:34,414 నాకు ఇవి చాలా ఇష్టం. 258 00:23:34,414 --> 00:23:36,333 నోవా, ఇవి నీకు. 259 00:23:37,042 --> 00:23:39,336 నువ్వు వీటిని బాగా చదవాలి. జాగ్రత్తగా. 260 00:23:39,336 --> 00:23:41,964 వీటిని మీకోసం అనువదించాలా? 261 00:23:41,964 --> 00:23:44,800 వాటిని ఎలా చదవాలో నాకు తెలుసు. నువ్వు చదవగలవో లేదో నాకు తెలియాలి అంతే. 262 00:23:44,800 --> 00:23:46,760 నేను ఆ భాష గురించి మాట్లాడటం లేదు, 263 00:23:46,760 --> 00:23:49,596 కానీ అందులో ఏమన్నారు, ఏం అనలేదు అనే విషయం. 264 00:23:49,596 --> 00:23:53,892 ఇంకొక మాటలో చెప్పాలంటే, అందులో ఏముంది, ఏమి లేదు అనేది నువ్వు చదివి తెలుసుకోవాలి. 265 00:23:55,185 --> 00:23:57,771 వావ్, ఇక్కడ చాలా ఉంది. 266 00:24:01,024 --> 00:24:03,068 ఇది ఏంటి? 267 00:24:03,652 --> 00:24:05,112 దాన్ని జాగ్రత్తగా పట్టుకో. 268 00:24:05,863 --> 00:24:07,072 నువ్వు ఎప్పుడైనా గాలిపటాన్ని ఎగరేసావా? 269 00:24:07,072 --> 00:24:08,699 లేదు, ఒక్కసారి కూడా వేయలేదు. 270 00:24:10,576 --> 00:24:12,661 అయితే మీరిద్దరూ ఎలా ఎగరేయగలరో చూద్దామా? 271 00:24:12,661 --> 00:24:13,954 సరే! 272 00:24:15,497 --> 00:24:17,833 - పదండి. - నది దగ్గరకు వెళదాం. 273 00:24:17,833 --> 00:24:19,543 అక్కడైతే బాగుంటుంది! 274 00:24:19,543 --> 00:24:20,627 పదండి! 275 00:24:22,421 --> 00:24:23,797 నువ్వు ఏం చేస్తున్నావు? 276 00:24:25,549 --> 00:24:29,344 సూన్జా, ప్రతీ పిల్లాడికి గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తెలియాలి. 277 00:24:36,351 --> 00:24:37,519 అబ్బాయిలూ. 278 00:24:41,148 --> 00:24:43,066 తెలుసా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 279 00:24:44,193 --> 00:24:47,738 ఇంతకు ముందు ఈ ఆఫీసులో కూర్చుని పనిచేసిన వాడి గతి ఇప్పుడంత బాలేదు అంట. 280 00:24:47,738 --> 00:24:51,783 ఈ ఆఫీసు వల్ల అతను నాశనమైపోయాడు అనుకుంటున్నావా? 281 00:24:51,783 --> 00:24:53,493 ఆ విషయం నాకు తెలీదు. 282 00:24:54,119 --> 00:24:55,370 కానీ నేను విన్నదాన్ని బట్టి... 283 00:24:56,413 --> 00:24:59,082 అతనికి గర్వం ఎక్కువ. 284 00:25:01,460 --> 00:25:04,421 బాగా పొగరుగా ఉండేవాడు అంట. 285 00:25:05,130 --> 00:25:09,510 అతను తనను తాను అమెరికన్ అనుకునేవాడని విన్నాను. 286 00:25:11,178 --> 00:25:13,096 బహుశా అందువల్లే నాశనమైపోయాడు ఏమో. 287 00:25:16,934 --> 00:25:18,602 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 288 00:25:18,602 --> 00:25:20,896 టామ్ కి మంచి విషయం చెప్పడానికి వచ్చాను. 289 00:25:21,730 --> 00:25:24,191 ఆ స్థలం యజమాని అమ్మడానికి ఒప్పుకుంది. 290 00:25:26,360 --> 00:25:28,487 ఇందులో నీ చేయి కూడా ఉంది అనుకుంట, కదా. 291 00:25:29,404 --> 00:25:30,656 అవును. 292 00:25:30,656 --> 00:25:33,158 - నీ వాటా ఎంత? - అయిదు శాతం. 293 00:25:36,537 --> 00:25:37,579 అర్థమైంది. 294 00:25:39,581 --> 00:25:40,874 అభినందనలు. 295 00:25:40,874 --> 00:25:42,000 థాంక్స్. 296 00:25:48,549 --> 00:25:49,883 ఇంకేమైనా చెప్పాలా? 297 00:25:53,887 --> 00:25:55,305 నీకు ఒకటి చెప్పాలి... 298 00:25:57,224 --> 00:25:59,810 నిజానికి ఈ చోటును మేనేజ్ చేయాల్సిన వ్యక్తివి నువ్వే. 299 00:26:05,357 --> 00:26:08,443 అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేసేది నువ్వే. 300 00:26:08,443 --> 00:26:10,487 తెలివైనదానివి కూడా. 301 00:26:11,947 --> 00:26:15,701 ఇది తెలిసి కూడా ఇలా ఉండిపోవడం వల్ల నీకు కోపంగా ఉండి ఉండొచ్చు. 302 00:26:17,244 --> 00:26:21,832 ఎందుకంటే ఆ రోజు ఎప్పటికీ రాదు, 303 00:26:23,041 --> 00:26:24,918 ఆ విషయం మన ఇద్దరికీ తెలుసు. 304 00:26:30,340 --> 00:26:32,885 నీకు ఎంత అర్హత ఉన్నా సరే. 305 00:26:35,971 --> 00:26:37,472 నాకు చాలా బాధగా ఉంది. 306 00:26:49,860 --> 00:26:51,153 నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. 307 00:26:52,321 --> 00:26:53,572 నిజంగా అంటున్నా. 308 00:27:05,125 --> 00:27:06,543 ఒక్క క్షణం. 309 00:27:38,116 --> 00:27:39,826 నాతో కలిసి డిన్నర్ కి వస్తావా? 310 00:27:41,495 --> 00:27:44,373 అంటే ఒక డేట్ కి వెళదామా? 311 00:27:46,291 --> 00:27:48,544 అమెరికన్లు ఇలాగే మాట్లాడతారా? 312 00:27:48,544 --> 00:27:51,797 ప్రతీదాన్ని వివరిస్తారా? 313 00:27:51,797 --> 00:27:56,301 కాదు. నేను ముందు స్నానం చేయాలో వద్దో తెలుసుకోవడానికి అడిగా. 314 00:27:59,680 --> 00:28:00,973 దయచేసి స్నానం చెయ్. 315 00:28:04,768 --> 00:28:06,103 ఒక్క కండిషన్. 316 00:28:06,770 --> 00:28:07,771 ఏంటది? 317 00:28:09,064 --> 00:28:10,399 మనం ఎక్కడికి వెళ్లాలో నేను చెప్తా. 318 00:28:59,573 --> 00:29:00,991 తీసుకోండి. 319 00:29:04,119 --> 00:29:06,955 ఇవాళ ఇవి ఏది పెట్టినా తినేస్తున్నాయి. 320 00:29:07,748 --> 00:29:09,875 ఎవరైనా చూస్తే పది రోజులుగా ఇవి ఏమీ తినలేదు అనుకుంటారు. 321 00:29:10,375 --> 00:29:15,005 అది నిజం కాదు.నేను వీటికి నిన్నే మేత పెట్టా. 322 00:29:16,507 --> 00:29:18,884 మీరు రోజూ వస్తుంటారా? 323 00:29:19,426 --> 00:29:21,011 వారాంతాలలో తప్ప. 324 00:29:22,137 --> 00:29:23,972 వారాంతాలలో ఇక్కడికి పిల్లలు ఎక్కువగా వస్తారు. 325 00:29:25,557 --> 00:29:27,518 మీకు పిల్లలు నచ్చరా? 326 00:29:27,518 --> 00:29:29,144 కాదు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. 327 00:29:29,144 --> 00:29:31,021 అంటే, అందరూ కాదు అనుకో. 328 00:29:31,897 --> 00:29:34,858 కానీ వీటికి పిల్లలంటే భయం. 329 00:29:37,653 --> 00:29:39,154 ఇవి కొన్ని తీసుకోండి. 330 00:29:46,537 --> 00:29:48,497 ఓహ్, నాకు అది నచ్చలేదు. 331 00:29:48,497 --> 00:29:52,042 ఆ మగది ఆహారాన్ని లాగేసుకుంటోంది. 332 00:29:52,042 --> 00:29:54,002 అది మగపక్షి అని ఎందుకు అనుకుంటున్నారు? 333 00:29:54,002 --> 00:29:55,963 అది ఆడది. 334 00:29:57,673 --> 00:29:58,799 నిజంగా? 335 00:29:59,800 --> 00:30:02,678 కానీ దాన్ని గమనిస్తూ ఉండండి. 336 00:30:02,678 --> 00:30:06,181 ఒకసారి ఆ మగది మొదలెడితే, ఎప్పుడు ఆపాలో దానికే తెలీదు. 337 00:30:07,766 --> 00:30:10,561 అవి ఇకైనో వార్డులో ఉండే పందులకంటే దారుణంగా ఉన్నాయి. 338 00:30:12,271 --> 00:30:14,648 మీరు పెరిగింది అక్కడేనా? 339 00:30:15,148 --> 00:30:16,859 కాదు. 340 00:30:17,818 --> 00:30:20,028 నేను యంగ్డోలో పుట్టాను. 341 00:30:21,154 --> 00:30:23,365 యంగ్డో? అది ఎక్కడ? 342 00:30:28,120 --> 00:30:29,872 అది ఇక్కడ కాదు. 343 00:30:33,083 --> 00:30:35,419 నేను చేయాల్సిన పని చాలా ఉంది. 344 00:30:35,419 --> 00:30:37,087 ఇక నేను వెళ్తాను. 345 00:30:42,092 --> 00:30:45,596 నా మనవడు. 346 00:30:45,596 --> 00:30:46,763 వాడు మంచి కుర్రాడు. 347 00:30:48,098 --> 00:30:51,643 కానీ ప్రస్తుతం కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. 348 00:30:54,980 --> 00:30:57,191 జీవితంలో సవాళ్ళను ఎదుర్కొంటున్నాడు ఏమో. 349 00:30:59,443 --> 00:31:02,362 కష్టపడుతున్నాడు. 350 00:31:03,405 --> 00:31:08,202 వాడి విషయానికి వస్తే, వాడి జీవితం వేరేగా ఉంటే బాగుండని ఆశపడ్డాను. 351 00:31:10,078 --> 00:31:12,539 వాడి వయసులో నేనైతే, 352 00:31:13,332 --> 00:31:18,086 రేషన్ లైన్లలో నిలబడి, విమాన రైడ్ డ్రిల్స్ కి ట్రైనింగ్ తీసుకున్నాను. 353 00:31:18,086 --> 00:31:21,882 ఆ అమెరికన్లు వచ్చి మమ్మల్ని చంపేస్తారేమో అనుకున్నాం. 354 00:31:26,762 --> 00:31:31,767 భయంకరమైన పరిస్థితుల మధ్య బ్రతకనందుకు 355 00:31:31,767 --> 00:31:34,102 మనం వాడిని తప్పుబట్టలేము, అవునా? 356 00:31:35,479 --> 00:31:40,567 మరి అలాంటప్పుడు వాడు తన జీవితంలో ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కోకూడదు కదా? 357 00:31:41,944 --> 00:31:42,945 కాదు. 358 00:31:43,987 --> 00:31:47,991 కాలం ఏదైనా, జీవితంలో కష్టాలు ఉంటూనే ఉంటాయి. 359 00:31:48,700 --> 00:31:50,452 మనం దేవుళ్ళం అయితే తప్ప. 360 00:31:58,043 --> 00:32:00,462 ఇక మీరందరూ ఎగిరే టైమ్ అయింది! 361 00:32:20,482 --> 00:32:21,942 ఇంకా పైకి ఎగరేయ్! 362 00:32:21,942 --> 00:32:23,235 అంతే! 363 00:32:24,444 --> 00:32:25,904 వేగంగా, వేగంగా! 364 00:32:27,531 --> 00:32:29,283 దాన్ని ఇంకా పైకి పంపు. 365 00:32:29,283 --> 00:32:30,742 వెళ్తూనే ఉండు! 366 00:32:31,827 --> 00:32:34,538 - అది కింద పడనివ్వకు! - వేగంగా! 367 00:32:34,538 --> 00:32:37,958 ఇంకా! అంతే! 368 00:32:39,418 --> 00:32:42,504 మోజసు, పడిపోతావు చూసుకో! 369 00:32:42,504 --> 00:32:45,841 ఇది భలే ఉంది! నా కోసం ఆగండి! 370 00:33:04,526 --> 00:33:06,028 నోవా! మోజసు! 371 00:33:07,362 --> 00:33:08,572 నోవా! 372 00:33:13,368 --> 00:33:14,703 అమ్మా! 373 00:33:14,703 --> 00:33:17,789 - మోజసు, నా దగ్గరకు రా. - అమ్మా. 374 00:33:38,018 --> 00:33:39,978 వాళ్ళు ఉత్తరం వైపుకు వెళ్తున్నారు. 375 00:33:39,978 --> 00:33:43,774 వాళ్ళు గనుక నాగసాకికి వెళ్ళేటట్టు అయితే, వ్యతిరేక దిశలో వెళ్లేవారు. 376 00:33:46,652 --> 00:33:48,445 ఆ విమానాలు నీ భర్త ఉన్న ఊరు వైపు వెళ్లడం లేదు. 377 00:33:55,744 --> 00:33:57,871 - సన్ఈ! - ఆమెను కాసేపు వదిలేయ్. 378 00:34:17,683 --> 00:34:19,935 అంతే. పని పూర్తి అయింది. 379 00:34:22,771 --> 00:34:27,693 ఇంత మంచి ప్యాజేజి పొందుతున్నందుకు బావగారు చాలా అదృష్టవంతులు. 380 00:34:28,819 --> 00:34:30,904 వాళ్ళందరూ ఆయన్ని చూసి కుళ్లిపోతూ ఉంటారు. 381 00:34:31,572 --> 00:34:32,906 నా కోరిక కూడా అదే. 382 00:34:33,489 --> 00:34:34,949 ఇది సరిపోతే బాగుండు. 383 00:34:36,827 --> 00:34:38,328 నేను వీటిని ఇచ్చేసి వస్తా. 384 00:34:38,328 --> 00:34:40,621 రాత్రి అయింది. రేపు ఉదయం ఇవ్వొచ్చు కదా. 385 00:34:40,621 --> 00:34:43,083 పెద్ద కాపు రేపు ఉదయమే పోస్ట్ దగ్గరకు వెళతానని అని చెప్పాడు. 386 00:34:43,958 --> 00:34:46,210 నేను వీటిని వీలైనంత త్వరగా పంపాలి అనుకుంటున్నాను. 387 00:34:47,379 --> 00:34:49,755 అంతేకాదు, నాకు రాత్రికి నిద్ర వచ్చేలా లేదు. 388 00:34:53,969 --> 00:34:55,094 సన్ఈ, 389 00:34:56,889 --> 00:34:59,391 ఆయనకు ఏమీ అయ్యుండదు. 390 00:35:02,728 --> 00:35:03,937 నాకు తెలుసు. 391 00:35:07,441 --> 00:35:08,859 కానీ రేపు ఏమవుతుంది? 392 00:35:10,152 --> 00:35:11,528 లేదా ఎల్లుండు? 393 00:35:16,867 --> 00:35:20,037 ఆయన ఎప్పటికీ సురక్షితంగా ఉంటాడని నువ్వు నాకు మాట ఇవ్వలేవు. 394 00:35:20,037 --> 00:35:21,330 అది సాధ్యం కాదు. 395 00:35:23,540 --> 00:35:25,667 మనమంతా కలిసి ఉన్నాం... 396 00:35:26,418 --> 00:35:28,587 కానీ ఆయన ఒక్కడే ఒంటరిగా... 397 00:35:30,464 --> 00:35:32,132 తలచుకుంటే అది అన్యాయం అనిపిస్తోంది. 398 00:35:51,527 --> 00:35:52,528 నోవా. 399 00:35:54,613 --> 00:35:56,240 ఇక చదివింది చాలు. 400 00:35:56,240 --> 00:35:57,407 పడుకో. 401 00:36:07,918 --> 00:36:09,086 నువ్వు... 402 00:36:11,797 --> 00:36:13,131 మీ నాన్నను, 403 00:36:14,383 --> 00:36:16,051 అస్సలు మర్చిపోకూడదు. 404 00:36:16,927 --> 00:36:18,178 ఆ విషయం తెలుసు కదా? 405 00:36:20,430 --> 00:36:22,474 నేనెలా మర్చిపోగలను? 406 00:36:42,369 --> 00:36:46,081 నాకు తెలుసు. మన దగ్గర దొంగ పడ్డాడు! 407 00:36:47,416 --> 00:36:49,585 ఎవరో గుడ్లను దొంగతనం చేస్తున్నారు! 408 00:36:51,128 --> 00:36:52,671 ఏమైంది? 409 00:36:52,671 --> 00:36:54,298 గత కొన్ని రోజులుగా, 410 00:36:54,298 --> 00:36:56,592 రోజు రోజుకూ నేను సేకరించే గుడ్లు తగ్గిపోతున్నాయి. 411 00:36:56,592 --> 00:36:59,011 ఈ విషయం పెద్ద కాపుతో చెప్పినప్పుడు, 412 00:36:59,011 --> 00:37:01,013 నా అంచనా కరెక్టు అన్నాడు. 413 00:37:01,722 --> 00:37:03,932 ఆయన చాలా కోపపడ్డాడు. 414 00:37:04,558 --> 00:37:07,853 కానీ ఆ దొంగని నేను పట్టుకుంటా అని నేను ఆయనకు మాట ఇచ్చా. 415 00:37:07,853 --> 00:37:10,022 ఆయనకు అలాంటి ప్రమాణం నువ్వెందుకు చేసావు? 416 00:37:10,022 --> 00:37:11,481 వాడిని నువ్వు ఎలా పట్టుకుంటావు? 417 00:37:13,609 --> 00:37:15,986 మనం ఒక ఉచ్చు పన్నితే బాగుంటుంది అనుకుంటున్నాను. 418 00:37:16,945 --> 00:37:18,864 - ఒక ఉచ్చా? - అంటే ఏంటి? 419 00:37:18,864 --> 00:37:20,657 అది పని చేయదు. 420 00:37:20,657 --> 00:37:24,661 నువ్వు నిజంగా ఆ దొంగను పట్టుకోవాలి అనుకుంటే, మనం మాటు వేయాలి. 421 00:37:24,661 --> 00:37:26,496 వాడు దొంగతనం చేస్తుండగా పట్టుకోవాలి. 422 00:37:26,496 --> 00:37:27,706 అవును! 423 00:37:27,706 --> 00:37:30,209 అమ్మా, నేను కూడా వెళ్ళనా? ప్లీజ్. 424 00:37:31,460 --> 00:37:34,755 ఇది సురక్షితమేనా? అది ఎవరైనా ప్రమాదకరమైన వ్యక్తి అయితే? 425 00:37:34,755 --> 00:37:37,966 నా ఉద్దేశంలో ఈ ఇద్దరు పిల్లలు, అలాగే నేను వెళితే చాలు అనుకుంటున్నా. 426 00:37:37,966 --> 00:37:39,134 అది ఎవరైనా సరే. 427 00:37:39,134 --> 00:37:42,554 మనం ప్రారంభంలోనే వాడిని పట్టుకుని ఇలాంటివి జరగకుండా ఆపితే మంచిది. 428 00:37:43,305 --> 00:37:45,933 అమ్మా, ఈయనకు ఇలాంటివి బాగా తెలుసు. 429 00:37:45,933 --> 00:37:47,809 ఈయన్ని చూస్తేనే చెప్పొచ్చు. 430 00:37:48,560 --> 00:37:51,104 - ఈ పని చేయడం వల్ల... - అయితే అలా చేద్దాం. 431 00:37:51,104 --> 00:37:52,731 వెళ్లి నీ అన్నతో చెప్పు. 432 00:37:52,731 --> 00:37:56,568 భోజనం తర్వాత, మనం మాటు వేయడానికి సరైన ప్రదేశాన్ని కనిపెడదాం. 433 00:37:56,568 --> 00:37:59,446 - ఎలా ఉంది ప్లాన్? - నాకు ఈ ప్లాన్ నచ్చింది. 434 00:37:59,446 --> 00:38:01,114 నేను నా అన్నతో ఇది చెప్తాను. 435 00:38:01,865 --> 00:38:03,700 ఇక్కడ రోజు రోజుకి సరదాగా ఉంటోంది. 436 00:38:05,327 --> 00:38:06,703 ఇది సురక్షితమేనా? 437 00:38:07,287 --> 00:38:08,664 నువ్వేం కంగారు పడకు. 438 00:38:08,664 --> 00:38:12,251 బహుశా ఆకలితో దొంగిలిస్తున్న గ్రామస్తులు ఎవరైనా అయ్యుండొచ్చు. 439 00:38:13,418 --> 00:38:16,088 నేను కూడా వస్తే పర్లేదా? 440 00:38:18,048 --> 00:38:19,925 నీకు కూడా మాతో రావాలని ఉందా? 441 00:38:19,925 --> 00:38:22,886 మాటు వేసి పట్టుకోవడం గురించి నేను వినడం ఇదే మొదటిసారి. 442 00:38:22,886 --> 00:38:24,179 వినడానికి చాలా ఉత్సాహంగా ఉంది. 443 00:38:28,267 --> 00:38:29,977 కానీ నేను గనుక మీకు అడ్డుగా ఉంటాను అనిపిస్తే... 444 00:38:29,977 --> 00:38:31,979 నువ్వు వస్తే కుర్రాళ్లకు కూడా నచ్చుతుందిలే. 445 00:38:44,241 --> 00:38:46,493 నువ్వు ఇంతకు ముందు యాకీటోరి తిన్నావు కదా? 446 00:38:46,493 --> 00:38:47,578 అవును. 447 00:38:49,872 --> 00:38:50,873 స్వాగతం! 448 00:38:53,041 --> 00:38:54,084 రెండు బీర్లు ఇవ్వండి, ప్లీజ్. 449 00:39:08,891 --> 00:39:10,475 ఇక్కడ తిండి భలే రుచిగా ఉంటుంది. 450 00:39:11,602 --> 00:39:12,936 అలాగే చవక కూడా. 451 00:39:13,604 --> 00:39:15,564 ప్రస్తుతం నా స్థితికి సరైన చోటు. 452 00:39:18,984 --> 00:39:20,152 థాంక్స్. 453 00:39:35,626 --> 00:39:36,752 తెలుసా... 454 00:39:39,171 --> 00:39:42,716 మన మధ్య కొన్ని మనస్పర్థలు ఉండేవని నాకు తెలుసు. 455 00:39:44,927 --> 00:39:47,304 అందుకు బాధ్యుడిని నేనే. 456 00:39:48,222 --> 00:39:52,518 కానీ ప్రస్తుతం నా పరిస్థితి ఇది. 457 00:39:53,852 --> 00:39:55,479 ఇక నటించే ఉద్దేశం నాకు లేదు. 458 00:39:58,941 --> 00:40:01,443 నీకు నేను ఇలా నచ్చకపోతే... 459 00:40:03,445 --> 00:40:04,780 నువ్వు వెళ్లిపోవచ్చు. 460 00:40:06,448 --> 00:40:07,824 నేను ఏమీ అనుకోను. 461 00:40:09,284 --> 00:40:13,121 కానీ ఒకటి తెలుసుకో. 462 00:40:16,875 --> 00:40:19,378 నేను ఎప్పటికీ ఇలాగే పతనావస్థలో ఉండను. 463 00:40:20,379 --> 00:40:22,214 నేను తెలివైనవాడిని. 464 00:40:22,214 --> 00:40:23,674 ఆకలితో ఉన్నా. 465 00:40:25,050 --> 00:40:28,095 ఇప్పుడు నాకు ఆట ఎలా ఆడాలో తెలుసు. 466 00:40:28,095 --> 00:40:33,350 అలాగే అమాయకులను దెబ్బ తీసి పైకి ఎదగడం నాకు ఇష్టం లేదు. 467 00:40:35,185 --> 00:40:36,854 కానీ అక్రమార్కుల విషయానికి వస్తే... 468 00:40:40,023 --> 00:40:43,360 ఏదైనా చేస్తాను. 469 00:40:47,197 --> 00:40:51,743 అలాగే, నీకు గనుక నేను ఉండబోయే విధానం నచ్చకపోతే, 470 00:40:54,121 --> 00:40:55,247 నేను అర్థం చేసుకోగలను. 471 00:41:15,601 --> 00:41:16,810 చీర్స్. 472 00:41:23,609 --> 00:41:24,818 చీర్స్. 473 00:41:34,328 --> 00:41:36,413 మనం వచ్చి చాలా సేపు అవుతుంది. 474 00:41:37,623 --> 00:41:40,042 మనం ఇంకెంత సేపు ఎదురుచూడాలి? 475 00:41:41,043 --> 00:41:42,628 మనం వచ్చి రెండు గంటలే అవుతుంది. 476 00:41:43,170 --> 00:41:45,047 అలాగే మాట్లాడకుండా ఉండు. 477 00:41:45,047 --> 00:41:46,924 మాట్లాడితే అది విని దొంగ పారిపోవచ్చు. 478 00:41:46,924 --> 00:41:48,425 మోజసు. 479 00:41:48,425 --> 00:41:50,677 ఇవాళ రాత్రి మనకు ఎవరూ దొరకకపోవచ్చు. 480 00:41:50,677 --> 00:41:53,597 వాడు గనుక తెలివైనవాడు అయ్యుంటే, కొన్ని రాత్రులు రాడు. 481 00:41:54,556 --> 00:41:57,184 అంటే ఇవాళ రాత్రి ఎవరూ దొరకకపోవచ్చా? 482 00:41:57,184 --> 00:41:58,894 ఏమో ఎవరికి తెలుసు? 483 00:42:03,148 --> 00:42:07,736 మిస్టర్ కిమ్, మీరు మిస్టర్ కోహ్ ని ఎక్కడ కలిశారు? 484 00:42:09,238 --> 00:42:10,239 నోవా. 485 00:42:11,031 --> 00:42:12,407 అలా అడగడం గౌరవం కాదు. 486 00:42:12,407 --> 00:42:13,784 అదేం పర్లేదు. 487 00:42:15,869 --> 00:42:18,455 నువ్వు చాలా రోజులుగా ఈ ప్రశ్న అడగాలి అనుకుంటున్నావని నేను చెప్పగలను. 488 00:42:21,500 --> 00:42:24,253 నేను ఆయన్ని 15 ఏళ్ల క్రితం రేవు దగ్గర కలిసాను. 489 00:42:24,920 --> 00:42:26,296 అప్పుడు నేను అక్కడ పనిచేసేవాడిని. 490 00:42:27,130 --> 00:42:29,550 నాకు దొరికిన పనులు చేస్తూ 491 00:42:30,092 --> 00:42:32,010 అస్తమాను ఏదొక వివాదంలో చిక్కుకునేవాడిని. 492 00:42:32,845 --> 00:42:34,263 ఎలాంటి వివాదం? 493 00:42:34,263 --> 00:42:36,807 కొట్లాటలు పెట్టుకోవడం. 494 00:42:36,807 --> 00:42:38,058 తెలివితక్కువ పనులు చేసేవాడిని. 495 00:42:39,643 --> 00:42:41,144 ఏదీ తెలిసేది కాదు. 496 00:42:41,144 --> 00:42:42,646 బాగా కోపిష్ఠిని కూడా. 497 00:42:43,939 --> 00:42:45,232 అలాంటోళ్ళు చాలా ప్రమాదకరం. 498 00:42:46,024 --> 00:42:47,776 మీకు కోపంగా ఎందుకు ఉండేది? 499 00:42:59,371 --> 00:43:03,041 కొరియాలో మా నాన్నకు చిన్న పొలం ఉండేది. 500 00:43:03,667 --> 00:43:06,670 అది పెద్దది కాకపోయినా, ఆయన మాకు సరిపడేంత పండించేవారు. 501 00:43:07,504 --> 00:43:09,381 కానీ ఈ జపనీస్ వారు వచ్చిన తర్వాత, 502 00:43:09,381 --> 00:43:13,844 రైతులను తమ పొలాల విస్తీర్ణాన్ని రిజిస్టర్ చేసుకోమని ఆదేశించారు. 503 00:43:14,428 --> 00:43:19,057 ఒక క్లర్క్ తప్పు చేసి, మా నాన్న పొలం చాలా పెద్దదిగా చూపించాడు. 504 00:43:21,268 --> 00:43:26,940 తర్వాత పన్ను కట్టమని రసీదు వచ్చినప్పుడు, మా నాన్న అంత డబ్బు కట్టలేకపోయాడు. 505 00:43:28,108 --> 00:43:31,570 అందుకని ఆయన పొలాన్ని వాళ్ళు లాగేసుకున్నారు. 506 00:43:34,364 --> 00:43:35,365 ఆ తర్వాత, 507 00:43:37,242 --> 00:43:40,787 నా తమ్ముళ్లు, చెల్లెళ్లను వేర్వేరు కుటుంబీకుల ఇళ్లకు పంపేశారు. 508 00:43:43,081 --> 00:43:46,126 అది జరిగిన తర్వాత మా అమ్మ చాలా ఏడ్చింది. 509 00:43:49,713 --> 00:43:51,673 అలాగే మా నాన్నపై ఆమెకు ఉన్న ప్రేమ 510 00:43:53,175 --> 00:43:54,551 తగ్గిపోయింది. 511 00:44:00,390 --> 00:44:03,227 ఒక ఉదయం మా నాన్న పొలం దగ్గరకు వెళ్లారు. 512 00:44:04,728 --> 00:44:06,897 ఒకప్పుడు ఆయన సొంతమైన పొలం దగ్గరకు. 513 00:44:10,150 --> 00:44:11,985 అక్కడి నుండి ఆయన తిరిగి రాలేదు. 514 00:44:16,990 --> 00:44:19,284 ఆయన ఎక్కడైతే ఒకప్పుడు బంగాళదుంపలు పండించారో... 515 00:44:22,704 --> 00:44:25,123 అక్కడే నేను ఆయన్ని ఖననం చేయాల్సి వచ్చింది. 516 00:44:28,210 --> 00:44:30,003 ఆ తర్వాత కొంతకాలానికి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయా. 517 00:44:45,269 --> 00:44:46,603 అక్కడ చూడండి! 518 00:44:48,605 --> 00:44:50,732 వాళ్ళు ఎంతమంది అక్కడ ఉండి ఉండొచ్చు? 519 00:44:55,737 --> 00:44:56,947 గేట్లకు గస్తీ కాయండి. 520 00:45:03,871 --> 00:45:05,289 దొరికేశాము! పారిపోండి! 521 00:45:05,289 --> 00:45:07,958 - వెళ్ళండి, వెళ్ళండి! - అన్నా, ఏమీ కాలేదు కదా? 522 00:45:07,958 --> 00:45:09,168 వాళ్లు పారిపోతున్నారు! 523 00:45:09,168 --> 00:45:10,711 వాళ్ళ గురించి వదిలేయండి. 524 00:45:12,045 --> 00:45:13,046 నాకు ఒకడు దొరికాడు. 525 00:45:18,093 --> 00:45:19,261 ఇది వాడే! 526 00:45:21,013 --> 00:45:22,181 నీకు ఈ పిల్లాడు తెలుసా? 527 00:45:22,181 --> 00:45:24,892 నోవాని స్కూల్ లో ఏడిపించింది వీడే. 528 00:45:24,892 --> 00:45:27,895 ప్లీజ్. గుడి దగ్గర ఉన్న టీచర్లకు ఇది తెలిస్తే, వాళ్ళు నన్ను కొడతారు. 529 00:45:29,021 --> 00:45:30,606 నువ్వు ఊరు ఖాళీ చేసిన వారిలో ఒకడివా? 530 00:45:32,399 --> 00:45:34,693 మా గుడ్లు నువ్వు ఎందుకు దొంగిలిస్తున్నావు? 531 00:45:34,693 --> 00:45:37,279 మా 20 మందికి అక్కడ సరిపడే ఆహారం లేదు. 532 00:45:38,113 --> 00:45:39,615 మాకు ఎప్పుడూ ఆకలిగానే ఉంటుంది. 533 00:45:40,949 --> 00:45:43,952 అయితే వీడిని ఏం చేద్దాం అంటావు? 534 00:45:47,164 --> 00:45:48,165 నేనా? 535 00:45:48,165 --> 00:45:52,753 నిర్ణయించు. వీడిని బెదిరించి వదలడానికి నాకు అభ్యంతరం లేదు. 536 00:45:54,129 --> 00:45:57,508 లేదా వీడిని గుడి దగ్గరకు తీసుకెళ్లి ఏది జరిగితే అది జరగడానికి వదిలేస్తాను. 537 00:46:06,266 --> 00:46:07,809 వాడిని వదిలేయండి. 538 00:46:07,809 --> 00:46:11,104 కానీ వీడు నిన్ను చాలా విధాలుగా బాధపెట్టాడు! 539 00:46:12,773 --> 00:46:15,817 వెళ్ళు. నోవా మనసు మార్చుకునేలోగా వెళ్ళు. 540 00:46:18,654 --> 00:46:19,655 హేయ్! 541 00:46:29,498 --> 00:46:31,959 అది మిగతావారికి కూడా చెప్పు. సరేనా? 542 00:46:38,215 --> 00:46:40,175 వాడిని అలా ఎలా వదలగలిగావు? 543 00:46:40,175 --> 00:46:41,802 నువ్వు ప్రతీకారం తీర్చుకుని ఉండొచ్చు. 544 00:46:42,469 --> 00:46:44,179 నీ అన్న చేసిన పని సరైంది. 545 00:46:44,179 --> 00:46:47,891 ఒక శత్రువుకు రుణపడి ఉండటం కంటే, మన శత్రువే మనకు రుణపడి ఉండటం మంచిది. 546 00:46:49,309 --> 00:46:51,311 ఈ విషయం నోవాకి ముందే తెలుసు అనుకుంట. 547 00:46:51,311 --> 00:46:52,563 అవునా? 548 00:46:52,563 --> 00:46:54,731 నేను కూడా అది గుర్తుంచుకోవాలి. 549 00:47:00,112 --> 00:47:01,446 పదండి. లేట్ అయింది. 550 00:47:02,281 --> 00:47:04,032 ఇది భలే ఉత్కంఠగా ఉంది కదా, ఆంటీ? 551 00:47:04,032 --> 00:47:06,326 చాలా. 552 00:47:06,326 --> 00:47:09,454 నాకు ఇవాళ రాత్రికి నిద్ర వస్తుందో లేదో. 553 00:47:18,463 --> 00:47:19,756 హలో? 554 00:47:19,756 --> 00:47:21,175 పని పూర్తి అయింది. 555 00:47:21,758 --> 00:47:24,303 ఆ స్థలం ఇప్పుడు అబే గారిది. 556 00:47:27,055 --> 00:47:30,517 ఇందులో ఇప్పుడు అందరి ప్రమేయం ఉంది. ఈ ప్లాన్ పనిచేస్తే మంచిది. 557 00:47:31,643 --> 00:47:33,645 పని చేస్తుంది. నాకు తెలుసు. 558 00:50:32,950 --> 00:50:34,952 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్