1 00:00:18,393 --> 00:00:20,479 (కొరియన్ భాషలో) నాన్నా, ఇంటికి వచ్చాను. 2 00:00:28,612 --> 00:00:30,405 హన్సు, నువ్వు మళ్ళీ లేట్ గా వచ్చావు. 3 00:00:31,323 --> 00:00:34,243 నేను ఒక సందేశం ఇవ్వడానికి ఊరు అవతలకు వెళ్లాల్సి వచ్చింది. 4 00:00:35,452 --> 00:00:37,788 నువ్వు పాఠాలు చెప్పేవాడివి, పనోడివి కాదు. 5 00:00:38,372 --> 00:00:40,582 ఒకసారి వాళ్లకు ఆ విషయం చెప్తే బాగుంటుంది. 6 00:00:41,750 --> 00:00:42,876 సరేలే. 7 00:00:44,086 --> 00:00:46,296 కానివ్వు! నాకు ఆకలిగా ఉంది. 8 00:00:46,380 --> 00:00:48,215 వెళ్లి మన విందు ఎలా ఉందో చూద్దాం. 9 00:00:51,385 --> 00:00:52,594 పదా. 10 00:01:38,640 --> 00:01:41,852 హన్సు! హన్సు! 11 00:01:53,238 --> 00:01:55,741 (జపనీస్ భాషలో) మీ నాన్న చెప్పింది నిజమేనా? 12 00:01:56,325 --> 00:01:59,453 నువ్వు ఆయన కన్నా బాగా లెక్కలు వేయగలవా? 13 00:02:02,664 --> 00:02:05,417 ఆయన అలాంటి మాట అన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను, 14 00:02:05,959 --> 00:02:08,044 ఎందుకంటే ఆయన నా తప్పులను తప్ప మరేం ఎత్తి చూపరు. 15 00:02:09,170 --> 00:02:10,797 ఒక మంచి తండ్రికి ఉండే లక్షణమే అది. 16 00:02:11,590 --> 00:02:14,384 చేతకాని వాళ్ళే తమ పిల్లల్ని అన్నిటికీ మెచ్చుకుంటారు. 17 00:02:21,808 --> 00:02:23,894 అయితే నాకోసం ఎప్పటి నుండి పని చేయడం మొదలుపెడతావు? 18 00:02:25,020 --> 00:02:28,524 ప్రస్తుతం నేను చూసుకోవాల్సిన వ్యాపారాలు చాలా ఉన్నాయి. 19 00:02:29,191 --> 00:02:31,610 అబాకస్ బాగా చేయగలవారి కోసం నేను వెతుకుతున్నాను. 20 00:02:31,693 --> 00:02:34,238 మీకోసం పని చేయడం వాడి భాగ్యం, సార్, 21 00:02:35,072 --> 00:02:38,033 కానీ ఇప్పటికే గణిత మాస్టారుగా ఒక డబ్బున్న అమెరికన్ 22 00:02:38,116 --> 00:02:40,661 కుటుంబంలో పిల్లలకు పాఠాలు చెప్తున్నాడు. 23 00:02:41,537 --> 00:02:42,663 మీకు తెలిసిందే కదా, 24 00:02:43,288 --> 00:02:47,042 మాలాంటి వారికి అలాంటి ఉద్యోగమంటే కోటి రూపాయలతో సమానం. 25 00:02:48,877 --> 00:02:51,046 అంటే మీరు అమెరికన్లను కూడా మంచి చేసుకోవడానికి చూస్తున్నారా? 26 00:02:51,547 --> 00:02:55,425 హోమ్స్ కుటుంబం వారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. 27 00:02:55,509 --> 00:02:56,718 ఎందుకు చూసుకోరు? 28 00:02:57,427 --> 00:03:00,180 తమకు నష్టం కలిగించేది లేకపోతే ఎవరైనా మంచిగానే చూసుకుంటారు. 29 00:03:00,848 --> 00:03:02,057 ప్రతిభ అంతా వృధా అయిపోతుంది. 30 00:03:06,436 --> 00:03:07,563 నీ జపనీస్ భాష, 31 00:03:08,355 --> 00:03:10,023 చాలా మెరుగైంది. 32 00:03:12,192 --> 00:03:15,696 కానీ మాలో ఒకడివి కావాలంటే నువ్వు చాలా కష్టపడాలి. 33 00:03:23,787 --> 00:03:26,081 గెంటా, నువ్వు చాలా మెరుగయ్యావు. 34 00:04:33,482 --> 00:04:37,611 యోకోహమా 1923 35 00:05:01,426 --> 00:05:04,638 అందరు అనేటట్టు నువ్వు నిజంగానే దద్దమ్మలా ప్రవర్తిస్తావు. 36 00:05:05,222 --> 00:05:08,892 నువ్వు జీవితంలో ఎదగాలి అనుకుంటే, కష్టపడి తీరాలి. 37 00:05:08,976 --> 00:05:10,394 మీ నాన్నను అడుగు. 38 00:05:10,894 --> 00:05:14,106 కచ్చితంగా అవసరం అయితేనే తప్ప నేను ఆ సాహసం చేయదలచుకోలేదు. 39 00:05:14,189 --> 00:05:15,774 దాన్నే సాహసం అంటావా? 40 00:05:15,858 --> 00:05:18,610 కనీసం రోజు ముగిసేవరకైనా కాస్త ఉత్సాహంగా ఉండలేవా? 41 00:05:18,694 --> 00:05:20,654 అప్పుడైతే నీ బాధను వినడానికి నాకు కాస్త సమయం, ఓపిక ఉంటాయి. 42 00:05:20,737 --> 00:05:22,698 నువ్వు పరిహాసం చేస్తావు కానీ, నేనైతే నిజంగా ఆందోళన పడుతున్నాను, అమ్మా. 43 00:05:23,198 --> 00:05:26,034 అవునా? ఎందుకు ఆందోళన, బంగారం? 44 00:05:26,702 --> 00:05:28,537 నీకు సరైన తిండి లేదా? 45 00:05:28,620 --> 00:05:30,831 ఉండడానికి నీడ లేదా? 46 00:05:30,914 --> 00:05:34,293 లేదా బహుశా చికిత్స లేని రోగంతో భాదపడుతున్నావా? 47 00:05:34,376 --> 00:05:37,129 -వెళ్లి డాక్టర్ ని తీసుకురానా? -నువ్వు ఇలా ఎగతాళి చేస్తే నాకు నచ్చదు. 48 00:05:37,212 --> 00:05:38,589 కానీ తప్పదు కదా. 49 00:05:39,173 --> 00:05:44,219 సరిగ్గా తొమ్మిదింటికి భోజనం సిద్ధంగా ఉండాలని వంట మనిషితో చెప్పు. 50 00:05:44,303 --> 00:05:48,557 ఇవాళ ముఖ్యమైన అతిథులు వస్తున్నారు. అంతా సక్రమంగా జరగాలి. 51 00:05:52,519 --> 00:05:54,563 "సంఖ్యల సిద్ధాంతంపై వ్యాసాలు" 52 00:05:54,646 --> 00:05:56,857 హన్సు, ఇదంతా నీకు నిజంగానే అర్థమవుతుందా? 53 00:05:58,108 --> 00:05:59,359 అనే అనుకుంటున్నాను. 54 00:06:00,527 --> 00:06:02,863 అద్భుతం. మెచ్చుకోదగ్గ విషయం. 55 00:06:05,991 --> 00:06:09,036 కానీ, అమ్మా, నాకు ఒక ఆలోచన వచ్చింది. హన్సుని మనతో తీసుకెళ్తే బాగుంటుంది కదా? 56 00:06:09,703 --> 00:06:12,331 వచ్చే ఏడాది యేల్ కళాశాలలో నాకు ఎంతగానో ఉపయోగపడతాడు. 57 00:06:12,831 --> 00:06:15,083 లేదంటే, నేను ఫెయిల్ అయిపోతా. నీకు తెలుసు కదా. 58 00:06:15,167 --> 00:06:16,543 అది మంచి ఆలోచనే. 59 00:06:19,713 --> 00:06:21,340 తను మా నాన్నతో మాట్లాడుతుంది. 60 00:06:22,299 --> 00:06:23,592 నాన్న అంటే గుర్తుకువచ్చింది, 61 00:06:24,510 --> 00:06:27,095 హన్సు, కొంచెం దీనిని తీసుకెళ్లి ఆయనకు ఇస్తావా? 62 00:06:29,014 --> 00:06:30,015 నేనిక వెళ్ళాలి. 63 00:06:30,098 --> 00:06:33,185 కానీ నువ్వు కాస్త చలాకీగా ఉండడానికి ప్రయత్నించు. 64 00:06:33,769 --> 00:06:34,978 కనీసం ప్రయత్నించు, సరేనా? 65 00:07:27,155 --> 00:07:28,991 నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. 66 00:07:29,074 --> 00:07:31,326 మనది కానీ దేశంలో పెద్ద మొత్తం 67 00:07:31,410 --> 00:07:33,954 పెట్టుబడి పెట్టడం గురించి మాట్లాడుతున్నావు. 68 00:07:34,037 --> 00:07:36,415 అసలు, మనల్ని గాని, మన డబ్బును గాని ఈ దేశంలో కావాలనుకుంటారా అనేది కూడా చెప్పలేం. 69 00:07:36,498 --> 00:07:37,708 అయితే ఏంటి? 70 00:07:37,791 --> 00:07:39,585 మనం డబ్బు చేసుకుంటున్నంత కాలం మంచే కదా. 71 00:07:39,668 --> 00:07:41,044 కానీ ఇలా ఎంత కాలం? 72 00:07:41,128 --> 00:07:44,006 యోకోహమాలో మనల్ని స్వాగతించవచ్చు, కానీ మిగతా దేశం సంగతి? 73 00:07:44,089 --> 00:07:46,550 మన భావజాలాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. 74 00:07:46,633 --> 00:07:49,094 ఇక, ఇప్పుడైతే, 75 00:07:49,178 --> 00:07:52,347 ఒకసారి మరొక దేశం ఇంకొక దేశంపై చెరగని ముద్ర వేసాక పరిస్థితులు మళ్ళీ మాములవుతాయా? 76 00:07:52,431 --> 00:07:54,933 చెప్తున్నా కదా, మార్పుకు వ్యతిరేకంగా 77 00:07:55,017 --> 00:07:57,269 నిలబడే వాడివి కాకు. 78 00:07:57,352 --> 00:07:59,563 అలా చేసే వారికి ఏమవుతుందో తెలుసా? 79 00:07:59,646 --> 00:08:02,566 అప్పుడు మనలాంటి వారి చేతికి వాళ్ళ డబ్బు చిక్కుతుంది. 80 00:08:02,649 --> 00:08:03,901 అంటే... 81 00:08:03,984 --> 00:08:04,985 చూడు. 82 00:08:05,068 --> 00:08:08,488 నన్ను నీ నుండి కాపాడడానికి వచ్చిన ఈ యువ హీరో ఎవరు? 83 00:08:08,572 --> 00:08:09,615 ఇంకొక సందేశం పంపిందా? 84 00:08:18,749 --> 00:08:21,210 సందేశం అందిందని చెప్పు. 85 00:08:21,293 --> 00:08:22,461 సరే కానీ, ఒక మాట చెప్పు. 86 00:08:23,086 --> 00:08:25,631 నా కొడుకు ఈ మధ్య ఎలా చదువుతున్నాడు? 87 00:08:25,714 --> 00:08:28,342 తనకు వీలైనంతగా ప్రయత్నిస్తున్నాడు, సార్. 88 00:08:29,301 --> 00:08:32,179 అయితే ఇంకా పురోగతి లేదంటావు. 89 00:08:34,765 --> 00:08:35,974 సరే, ఇక వెళ్లి సరదాగా గడుపు. 90 00:08:40,938 --> 00:08:42,481 వాడు చాలా తెలివైన పిల్లాడు. 91 00:08:42,563 --> 00:08:44,942 మరి ఎంత విజయవంతం అవుతాడో చూడాలి. 92 00:09:01,834 --> 00:09:04,586 మనకంటూ మంచి ఆటగాడు దొరికే భాగ్యం లేదంటావా? 93 00:09:05,170 --> 00:09:09,174 అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నీ మనసును పాడు చేసుకోకు. 94 00:09:09,258 --> 00:09:12,219 ఒకటి గుర్తుంచుకో, నువ్వు వాళ్లలో ఒకడివి కాదు. 95 00:09:13,720 --> 00:09:16,932 కానీ ఈ అమెరికన్లు, అన్ని విషయాల్లో ఎలా రాణిస్తున్నారు? 96 00:09:17,599 --> 00:09:19,852 నువ్వు ఒక్క విషయంలో బాగా రాణించగలిగితే చాలు. 97 00:09:19,935 --> 00:09:21,061 ఒక్కటే. 98 00:09:21,144 --> 00:09:24,231 కానీ ఏది ఏమైనా సరే, నీకు పోటీగా ఎవడూ నిలబడలేనంతగా నువ్వు రాణించాలి. 99 00:09:24,815 --> 00:09:26,400 నీ విషయంలో అది అబాకస్ ఆహ్? 100 00:09:27,067 --> 00:09:28,485 అది కేవలం ఒక సాధనం మాత్రమే. 101 00:09:28,986 --> 00:09:31,780 కాదు, నేను ఇతరులకు డబ్బు చేసిపెట్టడంలో బాగా రాణించగలను. 102 00:09:32,739 --> 00:09:35,242 అయితే మనకు కూడా డబ్బు చేసిపెట్టొచ్చు కదా? 103 00:09:36,118 --> 00:09:37,619 నేనేమన్నాను? 104 00:09:38,203 --> 00:09:41,206 ఒక్క విషయంలో మాత్రమే రాణించగలిగితే చాలు అన్నాను. 105 00:09:42,708 --> 00:09:45,627 మరైతే నేను ఎందులో రాణించాలి? 106 00:09:47,337 --> 00:09:49,965 నీకు వేరే అవకాశం ఉంది అనుకుంటున్నావా? 107 00:09:50,549 --> 00:09:53,427 సాధారణంగా, నీకు అవకాశం ఉన్నా లేకపోయినా, 108 00:09:53,510 --> 00:09:54,553 ఈ విషయం మాత్రం నిజం కాక మానదు. 109 00:09:56,847 --> 00:09:58,432 ముందు నువ్వు తిను, నాన్న. 110 00:10:02,394 --> 00:10:05,022 నా వయసులో ఉన్నపుడు నీకు తెలుసా? 111 00:10:07,900 --> 00:10:10,611 నేను మా నాన్నలాగే చేపల జాలరిని అవుతా అనుకున్నాను. 112 00:10:11,737 --> 00:10:13,655 అప్పట్లో అలాగే ఉండేది. 113 00:10:17,576 --> 00:10:19,286 కానీ నువ్వు, 114 00:10:19,369 --> 00:10:21,205 చేపలు పట్టేవాడివి కాదు. 115 00:10:22,956 --> 00:10:25,125 అలాగే బెట్టింగులు రాయడం, ఒప్పందాలు చేయడం, 116 00:10:25,209 --> 00:10:26,919 రక్తపు నేలపై నడవడం కూడా చేయవు. 117 00:10:27,836 --> 00:10:31,715 నువ్వు ఏమైనా సరే, దాని ద్వారా మనం ఆ బాక్సింగ్ హాల్ నుండి బయటపడతాం. 118 00:10:39,848 --> 00:10:44,228 వాళ్ళు నన్ను తమతో అమెరికా రమ్మంటారు అని అనుకుంటున్నాను. 119 00:10:44,311 --> 00:10:45,312 యేల్ కళాశాలకు. 120 00:10:46,063 --> 00:10:47,523 నీ చదువుకు వాళ్ళు డబ్బులు ఇస్తారా? 121 00:10:47,606 --> 00:10:48,649 కాదు. 122 00:10:48,732 --> 00:10:51,401 నా కోసం కాదు, ఆండ్రూ కోసం. 123 00:10:51,485 --> 00:10:53,320 వాళ్ళ చేతకాని కొడుకు కోసమా? 124 00:10:55,197 --> 00:10:58,534 వాడి భాగ్యం వల్ల కాకపోతే, ఈ ప్రపంచంలో నిలబడలేకపోయేవాడు. 125 00:11:02,329 --> 00:11:07,251 కానీ ఇప్పుడు వాడి భారం నా కొడుకుపై పడుతుంది. 126 00:11:13,423 --> 00:11:14,466 కానీ, నాన్నా, 127 00:11:15,300 --> 00:11:18,887 అమెరికాలో మనలాంటి వారు కూడా ఎగదగలరని విన్నాను. 128 00:11:22,140 --> 00:11:23,183 "మన లాంటి వారు." 129 00:11:24,893 --> 00:11:27,771 మన ఆశలను, కోరికలను మనకే ఎరగా చూపించి, 130 00:11:28,647 --> 00:11:31,525 మనల్ని వాళ్ళు మోసపుచ్చుతున్నారు. 131 00:11:39,908 --> 00:11:41,159 అయినా కూడా, 132 00:11:41,869 --> 00:11:43,787 ఆ అవకాశాన్ని వదులుకోకు. 133 00:11:44,663 --> 00:11:46,206 నువ్వు అమెరికా వెళ్ళాలి. 134 00:11:47,624 --> 00:11:48,959 మరి నీ సంగతి ఏంటి? 135 00:11:50,169 --> 00:11:51,211 నా సంగతి ఏంటి? 136 00:11:51,753 --> 00:11:53,422 మనం ఒక జట్టు అంటుంటావు కదా, 137 00:11:54,006 --> 00:11:56,133 మనం ఎప్పటికీ కలిసే ఉంటామని అంటుంటావు. 138 00:11:59,970 --> 00:12:03,098 బహుశా నీ దృక్కోణాన్ని మార్చుకొనే సమయం ఇది. 139 00:12:03,807 --> 00:12:07,519 పైకి ఎదగగలినప్పుడు, క్రిందకి చూస్తావు ఎందుకు? 140 00:12:08,729 --> 00:12:11,481 ఇప్పుడు ముందడుగు వేసే సమయమైంది. 141 00:12:13,317 --> 00:12:14,526 హన్సు, 142 00:12:15,068 --> 00:12:19,990 నేను చేయడానికి వీలు లేని ఎన్నో చేసే అవకాశం నీకు ఉంది. 143 00:12:27,581 --> 00:12:30,501 రాత్రి ఆకాశంలో రెండు నక్షత్రాలు ఉంటాయి. 144 00:12:31,418 --> 00:12:35,714 చూడడానికి ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నట్టే కనిపించినా, నిజానికి చాలా దూరంగా ఉంటాయి. 145 00:12:37,341 --> 00:12:40,719 మనం ఊహించలేనంత దూరం. 146 00:12:41,678 --> 00:12:43,222 అయినా కూడా, 147 00:12:43,305 --> 00:12:44,890 ఇక్కడి నుండి, 148 00:12:46,391 --> 00:12:48,435 అవి వేరు చేయలేనంత దగ్గరగా, ఉన్నట్టు కనిపిస్తాయి. 149 00:12:49,645 --> 00:12:50,812 అవునా? 150 00:13:06,745 --> 00:13:07,746 ఒక మాట. 151 00:13:47,119 --> 00:13:48,620 ఏంటిది? 152 00:13:48,704 --> 00:13:50,372 నేనిలా ముందెన్నడూ చేయలేదు. 153 00:13:50,455 --> 00:13:51,498 నిజం చెప్తున్నాను. 154 00:13:52,749 --> 00:13:54,751 ఏదో కొంత డబ్బు తీసుకున్నాను. 155 00:13:54,835 --> 00:13:58,130 నాకు డబ్బు అందగానే తిరిగి ఇద్దామనుకున్నాను. 156 00:13:59,006 --> 00:14:01,091 నాకు ఆ డబ్బు బాగా అవసరం పడింది, 157 00:14:01,175 --> 00:14:03,802 లేదంటే, మిమ్మల్ని అడిగి ఉండేవాడిని. 158 00:14:03,886 --> 00:14:05,387 నాకు చాలా సిగ్గుగా ఉంది. 159 00:14:06,221 --> 00:14:09,433 దయచేసి నాకు కొన్ని గంటల సమయం ఇవ్వండి. మీ డబ్బును తెస్తాను. 160 00:14:10,434 --> 00:14:12,394 నువ్వు పారిపోతే ఏమవుతుందో తెలుసు కదా. 161 00:14:12,477 --> 00:14:14,188 నేను ఎక్కడికి పారిపోగలను చెప్పండి? 162 00:14:14,897 --> 00:14:16,148 నాకు ఒక కొడుకు ఉన్నాడు. 163 00:14:16,940 --> 00:14:20,360 నేను పారిపోతుండగా వాడు చూడడం నేను ఒప్పుకోలేను. 164 00:14:21,195 --> 00:14:23,530 మధ్యాహ్న గంట మోగేవరకు నీకు సమయం ఇస్తున్నాను. 165 00:14:24,198 --> 00:14:25,991 అవును, మధ్యాహ్నానికి తెస్తాను. 166 00:14:26,658 --> 00:14:27,659 ఒట్టు. 167 00:14:29,203 --> 00:14:31,872 ఆ అమ్మాయితో సమస్య వస్తుందని నీకు చెప్పాను. 168 00:14:47,387 --> 00:14:48,764 నాన్నా. 169 00:14:51,850 --> 00:14:53,018 నాన్నా! 170 00:14:55,729 --> 00:14:56,813 ఎంత డబ్బు ఇవ్వాలి? 171 00:14:57,648 --> 00:14:58,690 రెండు వందలు. 172 00:14:59,274 --> 00:15:00,943 కానీ నా మాటలు విన్నావు కదా. 173 00:15:01,026 --> 00:15:02,736 నేను ఆ డబ్బును ఇచ్చేయదలచుకున్నాను. 174 00:15:04,404 --> 00:15:05,989 నువ్వు ఆ డబ్బు దొంగిలించావు. 175 00:15:06,782 --> 00:15:07,783 లేదు. 176 00:15:08,784 --> 00:15:10,494 ఆమె నన్ను ప్రాధేయపడింది. నేనేం చేయగలను? 177 00:15:10,577 --> 00:15:12,621 ఇవ్వలేను అని చెప్పాలి. 178 00:15:16,208 --> 00:15:18,377 నీకు సింపుల్ గానే ఉంటుంది 179 00:15:19,294 --> 00:15:21,421 ఎందుకంటే ముందెప్పుడూ నువ్వు ఒక స్త్రీతో గడిపిందే లేదు కాబట్టి. 180 00:15:22,881 --> 00:15:24,675 కానీ ఒక రోజు, నువ్వు కూడా ప్రేమలో పడతావు, 181 00:15:24,758 --> 00:15:28,303 అప్పుడు, నువ్వు కూడా ఆమెకు దాసోహం అవుతావు. 182 00:15:33,600 --> 00:15:34,810 నువ్వు చేసినట్టు నేను చేయను. 183 00:15:36,270 --> 00:15:37,312 ఎప్పటికీ చేయను. 184 00:15:46,613 --> 00:15:49,157 మీకు ఇంత ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. 185 00:15:52,536 --> 00:15:56,206 కానీ పరిస్థితి ఇంత దూరం వెళ్తుందని నేను అనుకోలేదు. 186 00:15:59,585 --> 00:16:02,462 నేను బీద వాడిని అని మీకు తెలుసు. 187 00:16:10,470 --> 00:16:11,513 అవును. 188 00:16:11,597 --> 00:16:13,348 సరే, 189 00:16:13,432 --> 00:16:14,808 జరిగింది ఏదో జరిగిపోయింది. 190 00:16:15,601 --> 00:16:17,686 కానీ నేను ఆ డబ్బును వెంటనే తిరిగి ఇచ్చేయాలి. 191 00:16:20,105 --> 00:16:21,190 ఎంత మిగిలి ఉంది? 192 00:16:28,405 --> 00:16:30,115 మీరు కొన్న దాన్ని తిరిగి ఇవ్వగలరా? 193 00:16:30,199 --> 00:16:32,201 అది నా కోసం కాదు. 194 00:16:35,245 --> 00:16:38,081 ఆ డబ్బును ఇంకొక మిత్రునికి ఇచ్చాను. 195 00:16:38,165 --> 00:16:39,499 ఆ డబ్బు నువ్వు అప్పుగా ఇచ్చావా? 196 00:16:41,835 --> 00:16:43,170 లేదు. 197 00:16:44,379 --> 00:16:46,548 నాకు ఆ డబ్బు తిరిగి రాదు. 198 00:16:47,382 --> 00:16:50,802 అతను... అతను అలాంటి వ్యక్తి. 199 00:16:59,269 --> 00:17:03,899 నువ్వు నాకు తెలిసిన అత్యంత తెలివైన వాడివి, కానీ... 200 00:17:14,492 --> 00:17:16,161 నేను మిస్టర్ హోమ్స్ తో మాట్లాడతా. 201 00:17:17,329 --> 00:17:18,329 వద్దు. 202 00:17:18,955 --> 00:17:20,374 నేను ఆయనకు పరిస్థితి ఇలా ఉందని చెప్తే, 203 00:17:20,457 --> 00:17:21,959 ఆయన నాకు కచ్చితంగా డబ్బు అప్పు ఇస్తాడు. 204 00:17:25,212 --> 00:17:27,297 దానివల్ల నిను అమెరికా తీసుకెళ్ళకూడదని నిర్ణయించుకుంటే? 205 00:17:28,382 --> 00:17:30,008 ఇప్పుడు అదంతా ఎవడికి కావాలి? 206 00:17:31,552 --> 00:17:34,012 ర్యోచి ఎంత ప్రమాదకరమైన వ్యక్తో నీకు తెలియడం లేదా? 207 00:17:34,805 --> 00:17:37,349 నువ్వు వెళ్ళాలి. ఇక వాదన వద్దు. 208 00:17:37,975 --> 00:17:38,976 నేను వెళ్ళను. 209 00:17:39,643 --> 00:17:41,228 చెత్త వెధవ! 210 00:17:41,311 --> 00:17:44,189 నేను నీకోసం ఇంత త్యాగం చేసాక కూడా నువ్వు నా మాట కాదంటావా? 211 00:17:45,190 --> 00:17:46,191 నాన్నా. 212 00:17:47,276 --> 00:17:48,694 నీ కళ్ళలో, 213 00:17:49,528 --> 00:17:52,781 నేను హాస్యాస్పదంగా కనిపిస్తున్నానని తెలుస్తుంది. 214 00:17:55,492 --> 00:17:57,077 కానీ నేను నిన్ను అలా చూడడం లేదు. 215 00:17:57,160 --> 00:17:59,162 వెళ్ళు! వెళ్ళు! 216 00:17:59,663 --> 00:18:01,415 నువ్వు ఎలాగైనా ఆ ఓడ ఎక్కాలి 217 00:18:01,498 --> 00:18:03,292 ఈ చెత్త ప్రదేశం నుండి బయట పడాలి! 218 00:18:04,793 --> 00:18:06,128 నేను వెళ్ళను! 219 00:18:06,211 --> 00:18:07,462 విను! 220 00:18:08,630 --> 00:18:09,923 పో. 221 00:18:12,134 --> 00:18:13,927 ఎన్నటికీ తిరిగి రాకు. 222 00:18:14,428 --> 00:18:15,429 ఎన్నటికీ! 223 00:18:18,056 --> 00:18:19,057 నేను ఒప్పుకోను. 224 00:18:21,977 --> 00:18:23,854 నేను నిన్ను వదిలి వెళ్ళను. 225 00:18:32,362 --> 00:18:33,906 నిన్ను ఎప్పటికీ చూడాలని నేను అనుకోవడం లేదు, సరేనా? 226 00:18:34,656 --> 00:18:37,409 నీ బ్రతుకు నువ్వు బతుకు! ఇక్కడి నుండి పో! 227 00:18:42,873 --> 00:18:43,916 నాన్నా! 228 00:18:45,042 --> 00:18:46,418 ఇక నుండి... 229 00:18:48,921 --> 00:18:50,839 నీ గుండెల్లో నన్ను చంపెయ్. 230 00:18:53,967 --> 00:18:55,969 అదే నీకు మంచిది. 231 00:19:01,850 --> 00:19:03,769 అదొక్కటే మార్గం. 232 00:19:26,124 --> 00:19:27,793 ఆగు. అది నువ్వు చూడడం మంచిది కాదు. 233 00:19:41,932 --> 00:19:45,644 నా అప్పు తీరేవరకు నేను ఇక్కడే పని చేస్తాను. 234 00:19:48,647 --> 00:19:50,023 దీనితో వీడికి సంబంధం లేదు. 235 00:19:51,984 --> 00:19:53,277 దయచేసి వాడిని పోనివ్వండి. 236 00:19:59,241 --> 00:20:01,159 ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు పని చేస్తాను. 237 00:20:01,243 --> 00:20:02,661 నాకు మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. 238 00:20:04,496 --> 00:20:07,583 కానీ ఇందులో నా కొడుకు ఇరుక్కోకూడదు. 239 00:20:10,210 --> 00:20:11,628 నువ్వు నా నుండి డబ్బు దొంగిలించిన తర్వాత 240 00:20:12,296 --> 00:20:16,884 నేను ఏం చేయలేదని జనం వింటే ఏమవుతుంది అనుకుంటున్నావు? 241 00:20:19,219 --> 00:20:23,682 ఈ ప్రపంచంలో, జనం మనల్ని చూసే విధానం చాలా ముఖ్యం. 242 00:20:24,183 --> 00:20:27,561 ఇలాంటి తలవంపు కూడా జీవితాంతం ఉండేదే. 243 00:20:28,353 --> 00:20:30,606 నేను నా గురించి పట్టించుకోను. 244 00:20:31,106 --> 00:20:33,650 నాకు నా కొడుకు బాగుంటే చాలు. 245 00:20:34,234 --> 00:20:38,322 వీడు పాఠాలు చెప్పే కుటుంబం వీడిని అమెరికా తీసుకెళ్తుంది. 246 00:20:40,324 --> 00:20:42,534 నన్ను చనిపొమ్మంటే, నేను చనిపోతాను! 247 00:20:42,618 --> 00:20:44,119 కానీ వీడికి ఈ అవకాశం మళ్ళీ రాదు. 248 00:20:44,203 --> 00:20:45,287 దయచేసి వాడిని వదిలేయండి. 249 00:20:45,370 --> 00:20:47,414 ఈ అప్పు నాది. 250 00:20:48,582 --> 00:20:49,583 బాస్! 251 00:20:50,292 --> 00:20:51,418 నాన్నా. 252 00:20:52,753 --> 00:20:53,754 లేదు, నాన్నా. 253 00:20:54,838 --> 00:20:56,048 గెంటా. 254 00:21:04,806 --> 00:21:07,184 ఒక తండ్రి ప్రేమ చాలా విలువైంది. 255 00:21:08,143 --> 00:21:09,853 నేను కూడా ఒక తండ్రినే. 256 00:21:11,730 --> 00:21:13,232 కానీ సమాజంలో పేరు ఉన్న వ్యక్తి 257 00:21:13,732 --> 00:21:17,152 జనానికి భ్రమ పుట్టించి అయినా అన్నీ తన అదుపులో ఉన్నాయని చూపించుకోవాలి. 258 00:21:21,698 --> 00:21:26,411 కరుణ భయం కంటే చాలా బలమైనది నేను నమ్ముతున్నాను. 259 00:21:31,041 --> 00:21:34,336 కరుణతో నువ్వు జీవితంలో ఎంత దూరం వెళ్తావో నేను కూడా చూస్తా, బాబు. 260 00:21:38,131 --> 00:21:39,550 ఏం జరు... 261 00:21:44,805 --> 00:21:47,182 ఇక్కడి నుండి పో! హన్సు, పారిపో! 262 00:21:50,269 --> 00:21:51,311 హన్సు! 263 00:22:04,032 --> 00:22:05,158 హన్సు! 264 00:22:08,203 --> 00:22:09,329 హన్సు! 265 00:22:17,421 --> 00:22:18,630 హన్సు. 266 00:22:18,714 --> 00:22:20,007 హన్సు! 267 00:22:21,842 --> 00:22:23,218 హన్సు! 268 00:22:29,558 --> 00:22:33,520 మధ్యాహ్నం 12:10 269 00:23:55,227 --> 00:23:58,313 స్పృహలోకి రా! లెగు! 270 00:23:58,397 --> 00:23:59,690 ఎత్తైన ప్రాంతానికి వెళ్ళండి! 271 00:24:01,024 --> 00:24:03,902 మరిన్ని కంపనాలు రావచ్చు. పారిపోండి! 272 00:24:09,491 --> 00:24:10,701 ఇటు రండి! 273 00:24:30,762 --> 00:24:32,931 మనం ఇక్కడే వేచి ఉండాలి. 274 00:24:49,948 --> 00:24:52,159 నువ్వు నిజంగానే చేసి ఉండేవాడివా? 275 00:24:54,286 --> 00:24:55,871 నువ్వు నిజంగానే నా తండ్రిని చంపేసేవాడివా? 276 00:24:57,623 --> 00:24:59,333 ఆయన గౌరవార్థం, 277 00:25:00,209 --> 00:25:02,753 ఆయన చెల్లించాల్సిన మూల్యం ఉంది. 278 00:25:05,506 --> 00:25:07,716 కానీ ఆయన పొందిన మరణం... 279 00:25:12,763 --> 00:25:14,264 ఇక్కడికి వచ్చిన తర్వాత, 280 00:25:16,141 --> 00:25:21,855 నేను నా తండ్రి అవమానపడుతుండగా ఎన్నో సార్లు చూడాల్సి వచ్చింది. 281 00:25:24,733 --> 00:25:27,945 కానీ ఆయన్ని అలా వదిలేయాల్సి రావడం... 282 00:25:38,539 --> 00:25:42,125 నాకోసం పని చేయడానికి మీ నాన్న తన ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సి వచ్చిందని నాకు తెలుసు. 283 00:25:43,460 --> 00:25:45,629 కాబట్టి ఆయన చేసిన త్యాగాన్ని వృధా చేయకు. 284 00:25:46,338 --> 00:25:47,422 నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు. 285 00:25:50,926 --> 00:25:53,178 ఆ అమెరికన్ల కుటుంబంతో అమెరికా వెళ్ళు, సరేనా? 286 00:25:53,846 --> 00:25:56,348 ఇదంతా మర్చిపో, ఆయన్ని కూడా. 287 00:26:02,271 --> 00:26:04,147 నాకు ఏం చేయాలో తెలియడం లేదు. 288 00:26:04,731 --> 00:26:06,441 ఆయన నా తండ్రి. 289 00:26:06,525 --> 00:26:08,777 -నాకు ఉన్నది ఆయనే! -నిలబడు! 290 00:26:11,488 --> 00:26:12,823 ఒకసారి బాగా చూడు! 291 00:26:15,742 --> 00:26:17,578 ఇవాళ బాధపడుతున్నది నువ్వు మాత్రమే కాదు. 292 00:26:18,954 --> 00:26:21,415 ఇవాళ, లెక్కలేనంత మంది అనాథలయ్యారు. 293 00:26:22,624 --> 00:26:24,251 కానీ ఇలాంటి సమయాల్లోనే, 294 00:26:24,960 --> 00:26:26,920 ఒక మనిషి తన విధిని రాసుకోగలడు. 295 00:26:28,422 --> 00:26:30,507 బాధపడి, తిరిగి నిలబడి ముందుకెళ్ళేవారు ఉంటారు, 296 00:26:32,426 --> 00:26:34,845 అలాగే అదే బాధలో మునిగి ఏమీ కాకుండా పోయేవారు కూడా ఉంటారు. 297 00:26:37,639 --> 00:26:39,433 నువ్వు అలా ఉండకు. 298 00:26:41,810 --> 00:26:43,187 నేను వెళ్లి నా కుటుంబాన్ని కనిపెట్టాలి. 299 00:26:43,270 --> 00:26:44,771 నువ్వు కూడా వెళ్ళు. 300 00:26:45,355 --> 00:26:47,107 వెళ్లి ఒక కొత్త జీవితాన్ని ఏర్పరచుకో. 301 00:27:10,631 --> 00:27:11,924 హన్సు? 302 00:27:12,007 --> 00:27:13,008 ఆండ్రూ. 303 00:27:14,510 --> 00:27:16,470 ఎలా ఉన్నావో. దేవుడా. 304 00:27:17,596 --> 00:27:18,931 మీ నాన్న ఎక్కడ? 305 00:27:21,099 --> 00:27:22,267 ఓహ్, హన్సు. 306 00:27:23,018 --> 00:27:24,353 చాలా దారుణం. 307 00:27:25,604 --> 00:27:27,356 నువ్వు మాతో వస్తున్నావు, కదా? 308 00:27:28,899 --> 00:27:30,609 మనం వెనక్కి తిరిగి రాము, నీకు ఆ విషయం తెలుసు కదా. 309 00:27:32,486 --> 00:27:33,779 నాకు వెళ్లాలనే ఉంది. 310 00:27:35,239 --> 00:27:36,907 ఇవన్నీ ఎక్కించడం పూర్తి చేయండి. 311 00:27:37,699 --> 00:27:41,286 అలాగే వెండి కొవొత్తుల స్టాండ్. అది పనోళ్ల గదిలో ఉంది. 312 00:27:42,538 --> 00:27:44,289 అతను ఇంట్లోకి వెనక్కి వెళ్ళలేడు. 313 00:27:44,373 --> 00:27:46,208 త్వరగానే వచ్చేస్తాడులే. అవును కదా? 314 00:27:46,959 --> 00:27:48,627 నాకు కొంత సహాయం చెయ్. 315 00:27:51,713 --> 00:27:53,048 ఆగు. 316 00:28:07,980 --> 00:28:09,439 అవును, మనం వెళ్ళాలి. 317 00:28:11,400 --> 00:28:12,776 మిస్టర్ హోమ్స్? 318 00:28:12,860 --> 00:28:14,111 ఆయన... 319 00:28:14,194 --> 00:28:17,197 ఆయన బోట్ సిద్ధం చేయడానికి వెళ్ళాడు. మనం వెంటనే బయలుదేరాలి. 320 00:28:17,281 --> 00:28:18,866 బండి వదిలేద్దాం. 321 00:28:18,949 --> 00:28:20,742 రోడ్లు పాడైపోయాయి. 322 00:28:20,826 --> 00:28:22,953 అయితే నీటి వరకు మనం ఎలా వెళ్ళేది? 323 00:28:26,290 --> 00:28:29,126 -లేదు, మనం అలా వెళ్ళలేం. -అదొక్కటే దారి. 324 00:28:31,712 --> 00:28:33,380 బండిని వదిలేయండి. 325 00:28:34,256 --> 00:28:35,757 రోడ్లు ఇక లేవు. 326 00:28:36,717 --> 00:28:38,302 మీ కుటుంబాలను కనిపెట్టుకోండి. 327 00:29:45,244 --> 00:29:47,079 -అమ్మా? -ఆండ్రూ! 328 00:29:48,413 --> 00:29:50,666 -అమ్మా! -శ్రీమతి హోమ్స్! 329 00:29:54,586 --> 00:29:56,338 అమ్మా! హన్సు! 330 00:29:56,421 --> 00:29:57,422 ఆండ్రూ! 331 00:30:18,360 --> 00:30:20,362 అమ్మా, త్వరగా రా! ఇలా రా! పరిగెత్తు! 332 00:31:21,840 --> 00:31:23,175 మీరు. 333 00:31:39,024 --> 00:31:45,572 రాత్రి 8:48కి 334 00:33:24,630 --> 00:33:26,089 ఏమైంది? 335 00:33:46,401 --> 00:33:48,654 ఏం చేస్తున్నావు? 336 00:34:25,440 --> 00:34:26,817 నువ్వు ఇక బయటకు రావచ్చు. 337 00:34:27,525 --> 00:34:29,235 ఇక దాక్కోవాల్సిన పని లేదు. 338 00:34:30,279 --> 00:34:31,362 పదండి. 339 00:34:32,197 --> 00:34:34,241 నేను ఇక్కడే ఉన్నాను. 340 00:34:39,996 --> 00:34:40,998 ఆగండి. 341 00:34:49,172 --> 00:34:51,007 నీ దగ్గర మద్యం ఉందా? 342 00:34:51,091 --> 00:34:55,012 దురదృష్టవశాత్తు, మొత్తం నాశనమైంది. 343 00:34:55,094 --> 00:34:57,181 మేము టీ ఇవ్వగలం. 344 00:35:54,947 --> 00:35:57,407 నీ కుటుంబం సురక్షితంగా ఉందా? 345 00:35:58,575 --> 00:36:03,288 నేను ఇంటికి వెళ్లలేకపోయా. గుడి దగ్గర వంతెన కూలిపోయింది. 346 00:36:05,582 --> 00:36:07,876 అలాగే స్టేషన్ వెనుక ఉన్న రోడ్లు తగలడిపోతున్నాయి. 347 00:36:09,753 --> 00:36:12,923 పార్క్ దగ్గర ఉన్న వంతెన వైపు వెళ్తుండగా నువ్వు కనిపించావు. 348 00:36:15,259 --> 00:36:18,846 కానీ మనం ఇదే రోడ్ మీద ఉంటే వాళ్ళని కలుసుకోగలము. 349 00:36:20,597 --> 00:36:21,932 వాళ్ళు సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. 350 00:36:34,236 --> 00:36:36,655 ఏంటది? ఏమైంది? 351 00:36:37,823 --> 00:36:40,868 నెగిషి జైలు నుండి పెద్ద మొత్తంలో ఖైదీలు తప్పించుకున్నారు. 352 00:36:41,577 --> 00:36:44,538 వారిలో మూడు వందలమంది కొరియన్ ఖైదీలు ఉన్నారు. 353 00:36:45,122 --> 00:36:47,374 వారంతా ఇప్పుడు ఇటే వస్తున్నారు. 354 00:36:47,457 --> 00:36:51,295 వాళ్ళు తప్పించుకోవడానికి ఛానళ్ల నుండి ప్లాన్ చేస్తునారని విన్నాను. 355 00:36:51,378 --> 00:36:54,798 ఇప్పుడు ఈ కల్లోలం సహాయంతో తప్పించుకోవడానికి చూస్తున్నారు. 356 00:36:54,882 --> 00:36:56,717 వాళ్ళు ఇంకే చేయాలి చెప్పు? 357 00:36:56,800 --> 00:36:58,510 మంటల్లో కాలి చావాలా? 358 00:36:59,094 --> 00:37:02,931 కానీ వాళ్ళు ఏం చేస్తారని ఎవరూ చెప్పలేరు కదా. 359 00:37:03,015 --> 00:37:05,017 మన స్త్రీలు, పిల్లలకు ఎలాంటి హాని తలపెడతారో. 360 00:37:05,100 --> 00:37:07,186 అలాంటి ప్రమాదకరమైన వారి నుండి మనం వాళ్ళని ఎలా కాపాడాలి? 361 00:37:07,269 --> 00:37:08,854 శాంతించు. 362 00:37:10,814 --> 00:37:12,858 విన్నారా? కొంతమంది కొరియన్ గ్యాంగు వారు తప్పించుకున్నారు! 363 00:37:13,442 --> 00:37:17,446 వాళ్ళు ఇక్కడికి నడుచుకొని రావడానికి గంటలు పడుతుంది... 364 00:37:17,529 --> 00:37:19,615 కానీ వాళ్ళు ఇప్పటికే వచ్చి దొంగతనం చేస్తున్నారని విన్నాను. 365 00:37:19,698 --> 00:37:22,951 ఏమండీ, ఇవన్నీ ఎక్కడి నుండి వింటున్నారు? 366 00:37:23,035 --> 00:37:25,954 -ఎవరు నువ్వు? -ప్రశ్నలు అడిగే వాడిని. ఇప్పుడు సమాధానం చెప్పు. 367 00:37:27,039 --> 00:37:29,166 ఆ నూతిలో నుండి నీళ్లు త్రాగకు. 368 00:37:29,249 --> 00:37:31,126 కొరియన్లు ఆ నీటిలో విషం కలిపారని అంటున్నారు. 369 00:37:31,210 --> 00:37:32,711 ఉత్తుత్తి పుకార్లు చెప్పకు. 370 00:37:32,794 --> 00:37:35,088 నడువు. నేను నా కుటుంబాన్ని వెతుక్కోవాలి. 371 00:37:36,381 --> 00:37:38,217 ధన్యవాదాలు. నేను ఏమి ఇవ్వాలి? 372 00:37:38,300 --> 00:37:40,052 ఇవాళ ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. 373 00:37:45,641 --> 00:37:49,186 ఏదో జరుగుతుంది. దగ్గరగా ఉండు. 374 00:37:55,359 --> 00:37:57,569 వాడు వాళ్లలో ఒకడు. వాడిని ఎలా నమ్మడం? 375 00:37:57,653 --> 00:37:59,780 మాకు సహాయం చెయ్! 376 00:37:59,863 --> 00:38:01,490 ఈ కొట్టాం యజమాని నాకు తెలుసు. 377 00:38:01,573 --> 00:38:03,075 కొట్టాంలోకి వెళ్ళండి. 378 00:38:03,158 --> 00:38:05,410 మిమ్మల్ని అక్కడ ఉండచడానికి ఆయన కాదనడు. 379 00:38:05,911 --> 00:38:07,996 త్వరపడండి! వెళ్ళండి! 380 00:38:08,080 --> 00:38:10,290 -ఏమంటున్నాడు? -అతనికి యజమాని తెలుసు. 381 00:38:10,791 --> 00:38:12,167 కొట్టాంలోకి వెళ్ళమని అన్నాడు. త్వరగా! 382 00:38:21,718 --> 00:38:23,512 నువ్వు కూడా వాళ్లతో దాక్కోవాలి. 383 00:38:24,680 --> 00:38:26,807 సమయం లేదు. బండిలోకి ఎక్కు! 384 00:38:28,225 --> 00:38:29,518 త్వరగా! 385 00:38:37,943 --> 00:38:39,862 కదలకు. శ్వాస కూడా తీసుకోకు. 386 00:38:46,285 --> 00:38:48,537 -త్వరగా! -వాళ్ళని వెతకండి! 387 00:38:51,039 --> 00:38:53,834 నలుగురు ఇటుగా పరిగెత్తారు. వాళ్ళు ఎక్కడికి పోయారు? 388 00:38:55,586 --> 00:38:56,753 వాళ్ళు ఏం చేసారు? 389 00:38:56,837 --> 00:38:59,756 కొరియన్లు సిటీలో గోల చేస్తున్నారు అని విన్నాను. 390 00:38:59,840 --> 00:39:00,924 అంతే కాదు. 391 00:39:01,550 --> 00:39:04,553 కూలిన ఇళ్లలోకి వెళ్లి విలువైన వాటిని దోచేస్తున్నారు. 392 00:39:04,636 --> 00:39:06,930 మనం వాళ్ళని పట్టుకోవాలి, లేదా అన్నీ తీసుకుపోతారు. 393 00:39:09,224 --> 00:39:10,976 ఎంత క్రూరులో. 394 00:39:13,103 --> 00:39:14,813 ఇలా చేయడానికి వాళ్లకు ఎంత ధైర్యం? 395 00:39:15,564 --> 00:39:17,649 మనం వాళ్ళను రానిచ్చి, 396 00:39:18,233 --> 00:39:20,152 వాళ్లకు ఉద్యోగాలు ఇస్తే, 397 00:39:20,986 --> 00:39:22,738 వాళ్ళు మనకు చేసేది ఇది. 398 00:39:22,821 --> 00:39:25,407 వాళ్ళను చూసావా లేదా? నాకు చెప్పు. 399 00:39:25,490 --> 00:39:26,575 వాళ్ళు పారిపోతున్నారు. 400 00:39:28,619 --> 00:39:30,454 అవును, మేము వాళ్ళను చూసాం. 401 00:39:31,371 --> 00:39:33,207 నలుగురిని. 402 00:39:42,090 --> 00:39:43,217 అటువైపు! 403 00:39:45,636 --> 00:39:46,803 పదండి! 404 00:39:48,555 --> 00:39:50,015 లోపల ఏముంది? 405 00:39:52,100 --> 00:39:53,519 అదొక కొట్టాం అంతే. 406 00:39:55,437 --> 00:39:57,814 యజమాని లేకపోవడం మంచిదైంది. 407 00:39:57,898 --> 00:40:02,611 కానీ వచ్చి చూస్తే, అక్కడ జరిగిన అల్లకల్లోలానికి షాక్ అయిపోతాడు. 408 00:40:09,409 --> 00:40:10,452 ఏముందో చూద్దాం. 409 00:40:12,412 --> 00:40:15,541 మీరు ఆ ముసలోడి మాటలు వినలేదా? వాళ్ళు అటు వెళ్లలేదని చెప్పాడు. 410 00:40:17,292 --> 00:40:19,294 నువ్వు చూడనప్పుడు వాళ్ళు లోపలికి వెళ్లి దాక్కున్నారేమో. 411 00:40:20,003 --> 00:40:21,588 వాళ్ళు పెద్ద వంచకులు. 412 00:40:25,676 --> 00:40:27,928 దొరికారు! వాళ్ళు ఇక్కడే ఉన్నారు! 413 00:40:28,428 --> 00:40:29,513 పదండి! 414 00:40:35,102 --> 00:40:36,812 అంతా తగలబెట్టండి! 415 00:40:51,034 --> 00:40:52,202 మనం వెళ్ళాలి. 416 00:40:53,370 --> 00:40:54,621 నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. 417 00:40:54,705 --> 00:40:56,331 నిన్ను కూడా తగలబెట్టేస్తారు. 418 00:41:50,636 --> 00:41:55,098 తెల్లవారుజాము 2:12కి 419 00:42:16,787 --> 00:42:18,413 వీళ్ళలో కొంతమంది నాకు తెలుసు. 420 00:42:30,759 --> 00:42:31,969 నాన్నా! 421 00:42:39,685 --> 00:42:42,896 మేము మీ కోసం ఎదురుచూశాం, మిమ్మల్ని కోల్పోయాం అనుకున్నాను. 422 00:42:43,605 --> 00:42:47,150 పోయి ఉంటే బాగుండు అనుకుని ఉంటావు. 423 00:42:47,901 --> 00:42:49,236 నిన్ను నిరాశపరచినందుకు క్షమించు. 424 00:42:49,319 --> 00:42:51,822 ఇలాంటి సమయంలో ఆ జోక్ ఎలా వేయగలిగారు? 425 00:42:55,450 --> 00:42:56,869 ఎందుకంటే మనం తిరిగి కలిసాం కాబట్టి. 426 00:43:17,764 --> 00:43:20,309 హన్సు, రా. 427 00:43:26,440 --> 00:43:28,358 వీడిని కొంత కాలం మనం చూసుకోవాలి. 428 00:43:32,529 --> 00:43:34,865 నువ్వు ఇంకా నీ తండ్రి మూల్యాన్ని చెల్లించాలి. 429 00:45:41,575 --> 00:45:43,076 సెప్టెంబర్ 1, 1923 రోజున, 430 00:45:43,160 --> 00:45:47,623 కాంటో ప్రదేశంలో, 7.9 పరిమాణంలో ఒక భూకంపం ఏర్పడింది. 431 00:45:49,666 --> 00:45:54,546 లక్షకు పైగా జనం ప్రాణాలు కోల్పోయారు, 432 00:45:56,465 --> 00:45:58,175 ఎందరో అమాయకులైన కొరియన్లు 433 00:45:58,258 --> 00:46:00,928 తర్వాత జపనీస్ ఉద్యమకారులు చేసిన దారుణాలకు 434 00:46:01,011 --> 00:46:02,846 బలైపోయారు కూడా. 435 00:46:05,098 --> 00:46:09,686 హత్య చేయబడిన కొరియన్ల సంఖ్య ఒక కొలిక్కి రాలేదు... 436 00:46:12,022 --> 00:46:17,402 కానీ ఎందరో చరిత్రకారులు వేలమంది చనిపోయారని అంచనా వేస్తున్నారు. 437 00:46:25,869 --> 00:46:27,829 మిన్ జిన్ లీ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 438 00:47:37,858 --> 00:47:39,860 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్