1 00:01:05,440 --> 00:01:06,567 మిస్టర్ అండ్ మిసెస్ అమెరికన్ పై ఆధారితమైంది 2 00:01:06,650 --> 00:01:07,651 రచయిత: జూలియట్ మెక్ డేనియల్ 3 00:01:25,127 --> 00:01:27,421 తను ఇక్కడ గడిపింది ఒక సీజనే అయినా, 4 00:01:27,504 --> 00:01:30,883 మాక్సీన్ డెలాకోర్ట్ మరణం తర్వాత పామ్ బీచ్ ఒకేలా ఉండదన్నది మాత్రం నిజం. 5 00:01:30,966 --> 00:01:32,092 మాక్సీన్ డెలాకోర్ట్ చనిపోయింది 6 00:01:32,176 --> 00:01:33,802 తనని ప్రేమించే వారు 7 00:01:33,886 --> 00:01:36,763 చాలా అంటే చాలా, ఊహకందని స్థాయిలో బాధపడుతున్నారు. 8 00:01:39,099 --> 00:01:41,602 సీరియల్ కిల్లర్లు, తాము చంపిన వారి అంత్యక్రియలకి వెళ్తూ ఉంటారు, 9 00:01:41,685 --> 00:01:44,271 కాబట్టి, నీ అంత్యక్రియల సమయంలో నార్మాని పట్టుకోవడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది. 10 00:01:44,354 --> 00:01:47,024 అప్పటిదాకా, నువ్వు కదలకుండా, మెదలకుండా ఒకే చోట ఉండాలి. 11 00:01:47,107 --> 00:01:49,526 నా వల్ల కాదు అది. నాకు కాళ్లూ చేతులూ ఆడట్లేదు. 12 00:01:50,235 --> 00:01:51,737 మిరబెల్ నా సోదరి. 13 00:01:51,820 --> 00:01:55,657 తనకి సొంతంగా అంత్యక్రియలు జరగాలి. ఇది చాలా… చాలా దారుణమైన పని. 14 00:01:55,741 --> 00:01:58,285 అవును దారుణమైనదే. నార్మాని వల పన్ని పట్టే పని దారుణమైనదే. 15 00:01:58,869 --> 00:02:00,996 దారుణమైనది కానే కాదు, నార్మాని వల పన్ని పట్టే పని దారుణమైనదే కాదు. 16 00:02:01,079 --> 00:02:02,915 ఇంకా దారుణాతి దారుణంగా ఏముంటుందో చెప్పనా? 17 00:02:02,998 --> 00:02:05,292 నార్మాకి నువ్వు చిక్కితే, అప్పుడు నీ స్థితి. 18 00:02:06,043 --> 00:02:08,169 రేపు మాక్సీన్ ని ఖననం చేస్తున్నాం. 19 00:02:09,295 --> 00:02:11,798 తనకి జీవితంలో దక్కని శాంతి ఇప్పుడైనా దక్కాలని కోరుకుంటున్నా. 20 00:02:11,882 --> 00:02:14,092 నాకు దారి చూపించు, ఓ ఆత్మా. 21 00:02:14,718 --> 00:02:18,138 నాకు కావాల్సినప్పుడు నన్ను ఎందుకు వదిలేసి వెళ్లిపోయావు? 22 00:02:18,722 --> 00:02:20,974 నా ఇంట్లోనే నేను బందీని అయిపోయా. 23 00:02:21,058 --> 00:02:25,395 తనని హత్య చేసిన, నార్మా డెలాకోర్ట్ కి శిక్ష పడే దాకా. 24 00:02:25,479 --> 00:02:26,813 నీ ఇంట్లో సిరియల్ అయిపోయింది. 25 00:02:27,564 --> 00:02:33,987 మాక్సీన్ కోసం, ఇంకా మా భద్రత కోసం న్యాయం జరగాలని కోరుకుంటున్నా. 26 00:02:39,826 --> 00:02:41,995 డైనాహ్, నువ్వు ఎందుకు వస్తున్నావు? 27 00:02:42,079 --> 00:02:43,914 శవాన్ని గుర్తించడానికి వస్తున్నా. 28 00:02:45,457 --> 00:02:48,836 డగ్లస్ బాధతో రాలేకపోతున్నాడు. మరి నువ్వు? 29 00:02:48,919 --> 00:02:50,587 నేను మాక్సీన్ సంరక్షకురాలిని. 30 00:02:50,671 --> 00:02:52,673 తన విడుదల పత్రంపై నేనే సంతకం చేయాలి. 31 00:02:53,549 --> 00:02:54,800 ఆఖరిసారిగా. 32 00:02:54,883 --> 00:02:59,388 ఎంత నిస్వార్థం అబ్బా నీది. తన అంత్యక్రియలని కూడా జరిపిస్తూ నిస్వార్థపరురాలివని నిరూపించుకుంటున్నావు. 33 00:02:59,972 --> 00:03:01,306 పూల్ లో పలుకుబడి ఉన్న వ్యక్తి శవం తేలింది. 34 00:03:01,390 --> 00:03:04,101 విషాదం జరిగితే చాలు, అన్నీ మానుకుని వింతగా చూసేవారందరూ దేశ నలుమూలల నుండి వస్తారు, 35 00:03:04,184 --> 00:03:05,185 తామూ అక్కడే ఉన్నామని చెప్పడానికి. 36 00:03:05,269 --> 00:03:07,688 మాక్సీన్, పామ్ రాయల్ లోనే చనిపోయింది కాబట్టి, పామ్ రాయల్ మూతపడకుండా ఉండాలంటే, 37 00:03:07,771 --> 00:03:11,984 అది చాలా… అవసరం. 38 00:03:18,699 --> 00:03:20,868 లోపలికి నాతో పాటు నువ్వు కూడా వస్తావా? 39 00:03:24,955 --> 00:03:26,039 లేడీస్. 40 00:03:27,207 --> 00:03:29,126 ఆన్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? 41 00:03:30,085 --> 00:03:31,712 మాక్సీన్ నా స్నేహితురాలు. 42 00:03:32,462 --> 00:03:38,552 కానీ తన గుర్తింపును ధృవీకరించడానికి ఒక మీడియా సభ్యురాలిగా ఇక్కడికి వచ్చా. 43 00:03:40,137 --> 00:03:42,139 నేనైతే అలాగే చెప్పుకుంటున్నా. 44 00:03:43,390 --> 00:03:45,058 మరి దాని వల్ల ఫలితం ఉంటోందా? 45 00:03:47,102 --> 00:03:48,645 నో కామెంట్. 46 00:03:50,480 --> 00:03:51,982 తినడం ఆపు! 47 00:03:54,067 --> 00:03:55,402 నేను బాధతో తింటున్నా. 48 00:03:56,236 --> 00:03:57,237 బాధతో తింటున్నావా? 49 00:03:58,071 --> 00:04:02,075 మిరబెల్ విషయంలో, ఇంకా నా విషయంలో బాధగా ఉండి తింటున్నా. 50 00:04:02,159 --> 00:04:05,454 ఇద్దరి విషయంలో బాధపడుతున్నా నేను. డగ్లస్ పాపం కుమిలిపోతూ ఉంటాడు. 51 00:04:05,537 --> 00:04:06,830 డగ్లస్ గురించి మాట్లాడకు, మాక్సీన్. 52 00:04:06,914 --> 00:04:09,583 నువ్వు అర్థం చేసుకుంటావని అనుకోలేదులే. ఎప్పుడూ ఆమెకే వత్తాసు పలుకుతావు. 53 00:04:09,666 --> 00:04:12,419 ఎందుకంటే, నార్మా నువ్వనుకుని మిరబెల్ ని చంపిందని అనుకోవడం ఆపు. 54 00:04:12,503 --> 00:04:15,464 ఏదైతేనేం, నీ బంగారు నార్మాలా డగ్లస్ నాకు విషమిచ్చో, నీట్లో ముంచేసో చంపే ప్రయత్నమైతే చేయలేదులే. 55 00:04:15,547 --> 00:04:17,841 డగ్లస్ కి నీపై ప్రేమ ఉంటే, నీతో అలా వ్యవహరించడు. 56 00:04:17,925 --> 00:04:20,594 డగ్లస్ నీకు చేసిందే, టామ్ నాకు చేసుంటే, ఇక అంతే! 57 00:04:20,677 --> 00:04:23,430 టామ్ కూడా అలాంటోడే. కానీ మిట్జీలా నువ్వు గర్భవతివి కాలేవంతే. 58 00:04:29,228 --> 00:04:30,854 హేయ్, మనం ఎక్కడికీ వెళ్లకూడదని వర్జీనియా చెప్పింది! 59 00:04:35,651 --> 00:04:37,152 దానర్థం ఏంటో నాకు తెలుసు! 60 00:04:41,198 --> 00:04:42,824 మనకి శవాలేం కొత్త కాదు కదా. 61 00:04:42,908 --> 00:04:44,868 - నేను శవాన్ని ఎప్పుడూ చూడలేదు. - వావ్. 62 00:04:45,369 --> 00:04:47,371 దేవుడా. చాలా దారుణంగా ఉంది. 63 00:04:47,454 --> 00:04:49,164 ఏంటి ఆ వాసన? 64 00:04:49,248 --> 00:04:50,499 ఓరి దేవుడా. 65 00:04:50,582 --> 00:04:52,918 - వీళ్లు మరీ అతి చేస్తున్నారు. - నాకది నచ్చట్లేదు. 66 00:04:53,001 --> 00:04:55,045 - సరే, మనం వెనక్కి తిరగాలి. - తప్పదు. 67 00:04:55,128 --> 00:04:56,797 సరే, నేను… నేను మూడు లెక్కపెట్టాక తిరుగుదాం. 68 00:04:56,880 --> 00:04:57,923 - సరే. - సరే. 69 00:04:58,006 --> 00:05:01,385 ఒకటి, రెండు, మూడు. 70 00:05:03,637 --> 00:05:04,721 - తనెలా ఉంది? - తెలీదు. 71 00:05:04,805 --> 00:05:05,806 - చూశావా? - లేదు. 72 00:05:05,889 --> 00:05:07,766 - బాబోయ్. దేవుడా. ఇది నా వల్ల కాదు. - నేను చూడలేను. 73 00:05:07,850 --> 00:05:09,560 - ఓరి దేవుడా. - ఇది అవసరమా? 74 00:05:09,643 --> 00:05:11,019 - అవసరమా ఇది? - అవసరమే. 75 00:05:11,103 --> 00:05:16,692 సరే మరి. ఒకటి, రెండు, మూడు… 76 00:05:18,944 --> 00:05:22,239 మూడున్నర… నాలుగు. 77 00:05:25,200 --> 00:05:27,160 - తను మాక్సీన్ కాదు. - ఆమె మాక్సీన్ కాదు. 78 00:05:27,244 --> 00:05:28,537 - ఏంటి? - తను మాక్సీన్ కాదు. 79 00:05:28,620 --> 00:05:31,456 ఈమె ఎవరో నాకు తెలీదు, కానీ ఈమె మా స్నేహితురాలైతే కాదు, కాబట్టి… కాబట్టి… 80 00:05:31,540 --> 00:05:33,500 - పక్కానా? - మీకు గుడ్ లక్… 81 00:05:33,584 --> 00:05:34,751 - బయటకు రండి. - బయటకు దొబ్బేయండి. 82 00:05:34,835 --> 00:05:36,170 - దేవుడా. - వస్తున్నా! చనిపోయింది! 83 00:05:37,337 --> 00:05:39,423 వాళ్లని చుట్టుముట్టి, ఒక సురక్షితమైన చోటికి తరలించండి, 84 00:05:39,506 --> 00:05:42,593 ఈ శవం ఇంకెవరూ చూడకూడదు. అస్సలంటే అస్సలు చూడకూడదు. 85 00:05:44,094 --> 00:05:45,179 అలాగే, మేడమ్. 86 00:05:52,769 --> 00:05:56,398 హేయ్, పిల్లా! అక్కడ దొంగచాటుగా ఏం చేస్తున్నావు? 87 00:05:57,107 --> 00:05:59,067 ఇక్కడ కత్తిలాంటి బర్గర్లు ఉన్నాయి కదా? 88 00:05:59,151 --> 00:06:00,235 అవి నాకు సెట్ అవ్వవు. 89 00:06:00,319 --> 00:06:03,822 నేను ఒక బాధపడుతున్న అందగాడితో ఉంటున్నా. 90 00:06:04,406 --> 00:06:06,742 అక్కడ ఇద్దరూ దాక్కొని ఏం చేస్తున్నారు? 91 00:06:07,326 --> 00:06:11,288 నేను ఎవరికీ కనిపించకూడదు. నేను చనిపోయా. ఇంతకీ నీ పేరు… 92 00:06:11,371 --> 00:06:14,791 నా స్నేహితులు బ్రూస్ అని పిలుస్తారు, నీ రహస్యం నేనెవరికీ చెప్పను, మిస్… 93 00:06:14,875 --> 00:06:18,545 మాక్సీన్… ఉత్త మాక్సీన్, అంతే. 94 00:06:19,880 --> 00:06:22,591 ఓరి దేవుడా! 95 00:06:23,217 --> 00:06:25,636 రేపు అంత్యక్రియలు ఉన్న ఆ చనిపోయిన బడా వ్యక్తివి నువ్వేనా? 96 00:06:25,719 --> 00:06:27,930 - మాక్సీన్ డెలాకోర్ట్? - నేనెవరో నీకు తెలుసా? 97 00:06:28,597 --> 00:06:32,809 ఇది దారుణం. దారుణాతి దారుణం. 98 00:06:32,893 --> 00:06:36,021 ఇది… ఇది ట్రాజెడీ. "మాతృదేవోభవ" సినిమా కన్నా ట్రాజెడీ ఇది. 99 00:06:36,104 --> 00:06:38,148 నా గురించి ఇంకొకరు ఏడవడం నేను భరించలేను. 100 00:06:38,232 --> 00:06:42,402 లేదు, నీ గురించి ఏడవట్లేదు. నా దోస్తానా "దోస్త్" గాడు నీ అంత్యక్రియల కోసమని 101 00:06:42,486 --> 00:06:45,781 వేరే ఊరి నుండి రావాల్సి ఉంది, కానీ నువ్వు బతికే ఉన్నావు, కాబట్టి… 102 00:06:45,864 --> 00:06:48,408 అతను పామ్ బీచ్ కి రాడేమో. 103 00:06:50,494 --> 00:06:52,329 నీకు ఇది చెప్పకూడదేమో, కానీ… 104 00:06:53,205 --> 00:06:57,543 మంచి విషయం ఏంటంటే, అంత్యక్రియలు జరుగుతున్నాయి. 105 00:06:59,044 --> 00:07:02,297 అయితే నువ్వు వెంటనే ఈ హాట్ టబ్ దగ్గరికి రా. 106 00:07:03,340 --> 00:07:06,844 - ఏంటి? ఓహ్. - టబ్ దగ్గరికి రావాలి! టబ్ దగ్గరికి రావాలి! 107 00:07:06,927 --> 00:07:10,681 రావాలి! టబ్ దగ్గరికి రావాలి! టబ్ దగ్గరికి రావాలి! 108 00:07:10,764 --> 00:07:14,560 - టబ్ దగ్గరికి రావాలి! టబ్ దగ్గరికి రావాలి! - సరే. 109 00:07:14,643 --> 00:07:18,021 తను వస్తోంది! టబ్ దగ్గరికి వస్తోంది! 110 00:07:18,105 --> 00:07:19,273 వస్తున్నా! వస్తున్నా! 111 00:07:19,356 --> 00:07:22,359 ఇక్కడికి రండి, మేడమ్! 112 00:07:22,442 --> 00:07:25,279 కానివ్వండి! ఎంట్రెన్స్ అదిరింది! 113 00:07:25,362 --> 00:07:27,823 చనిపోయిన మాక్సీన్ ని ఆహ్వానిస్తూ అందరూ చప్పట్లు కొట్టండి! 114 00:07:31,201 --> 00:07:32,452 ఇది చేయాలని నాకు లేదు. 115 00:07:32,536 --> 00:07:37,207 అంత్యక్రియలు, భారీ వివాహ వేడుక, జనాల ముందు నిత్యం తలదించుకోవాల్సి రావడం. 116 00:07:37,291 --> 00:07:39,376 నాకొక మాట ఇవ్వు, బిడ్డ పుట్టాక, 117 00:07:39,459 --> 00:07:42,129 నా చేత ఈ విన్యాసాలని చేయించడం లేదా మాజీ భార్య అంత్యక్రియలకు వెళ్లడం వంటి 118 00:07:42,212 --> 00:07:44,548 - పనులేవీ పెట్టవని. - మాటిస్తున్నా. 119 00:07:44,631 --> 00:07:46,967 కానీ మనం ముందు స్విట్జర్లాండ్ కి వెళ్లాలి. 120 00:07:48,302 --> 00:07:49,636 స్విట్జర్లాండ్ కి ఎందుకు వెళ్లాలి? 121 00:07:49,720 --> 00:07:53,223 మన బిడ్డ పుట్టాక, ట్రస్ట్ డబ్బులను బ్యాంక్ నుండి తీసుకోవడానికి. 122 00:07:53,307 --> 00:07:57,728 పత్రాల పని ఉంటుందిలే. క్షమించు, దీని గురించి నీకు ముందే చెప్పుండాల్సింది. 123 00:07:57,811 --> 00:07:59,980 డైనాహ్! 124 00:08:00,063 --> 00:08:01,732 నార్మా మరొక లేఖను పంపింది! 125 00:08:04,776 --> 00:08:06,403 - డైనాహ్ ఎక్కడుంది? - శవాగారానికి వెళ్లింది. 126 00:08:06,486 --> 00:08:07,529 అయ్యయ్యో, నేను చేయగలిగింది ఏమీ లేదే. 127 00:08:07,613 --> 00:08:08,739 నిజంగానే శవాగారానికి వెళ్లింది, పెర్రీ. 128 00:08:08,822 --> 00:08:11,283 మాక్స్ శవాన్ని గుర్తించడానికి నా తరఫున వెళ్లింది. 129 00:08:13,243 --> 00:08:16,496 "నీ కోసమే వస్తున్నా. అంత్యక్రియల్లో కలుసుకుంటా." 130 00:08:16,580 --> 00:08:18,665 నా బదులు తనని నేను పంపించి ఉండాల్సిందే కాదు. 131 00:08:18,749 --> 00:08:20,834 - నార్మా కంటే ముందే డైనాహ్ ని కనుగొనాలి. - నేను కూడా వస్తా. 132 00:08:20,918 --> 00:08:22,711 - సరే. - అబ్బా. ముందు నేను బట్టలు మార్చుకోవాలి. 133 00:08:22,794 --> 00:08:24,379 ఇక్కడ నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోకు, డగ్లస్. 134 00:08:25,297 --> 00:08:29,092 నీ కడుపులో డెలాకోర్ట్ రక్తం ఉంది. నార్మా నీకు ఏ హానీ తలపెట్టదు. 135 00:08:31,428 --> 00:08:33,804 నాకొక కవల సోదరి ఉందని, తన పేరు మిరబెల్ అని ఈ మధ్యనే తెలిసింది, 136 00:08:33,889 --> 00:08:37,017 కానీ నా భర్తకి… అంటే, నా మాజీ భర్తకి ఆంటీ అయిన, నార్మా అనే ఒక మహిళ, 137 00:08:37,100 --> 00:08:38,936 నన్ను చంపే ప్రయత్నంలో భాగంగా, నేను అనుకుని, 138 00:08:39,019 --> 00:08:41,480 - మిరబెల్ ని చంపేసింది. - నువ్వు నాకు నచ్చేశావు. 139 00:08:42,648 --> 00:08:44,358 నీ అంత గమ్మత్తైన మహిళని నేను కలవడం ఇదే మొదటిసారి. 140 00:08:44,441 --> 00:08:45,526 నువ్వూ డోరిస్ డే లాంటి మనిషివే, 141 00:08:45,609 --> 00:08:47,736 - కాకపోతే తను తిక్క మొహంది. - థ్యాంక్యూ. 142 00:08:47,819 --> 00:08:51,156 నా మాజీ లవర్లందరికీ ఒక మాట చెప్పా, నేను వెళ్లిపోతే నన్ను మిస్ అవుతారని చెప్పా, కానీ నువ్వు? 143 00:08:51,240 --> 00:08:53,951 నీ మాజీ భర్త నిన్ను మిస్ అవ్వడం కళ్లారా చూసే అవకాశం నీ ముందుంది. 144 00:08:54,034 --> 00:08:56,870 నువ్వు వాళ్ళ బాధని, వెక్కి వెక్కి ఏడవడాన్ని చూడవచ్చు. 145 00:08:56,954 --> 00:08:58,830 అబ్బా, నేను అవేవీ చూడలేనే. 146 00:08:58,914 --> 00:09:02,668 మాక్సీన్, నా దగ్గర కారు ఉంది. 147 00:09:02,751 --> 00:09:06,213 అతడు ఏడుస్తూ ఉండగా నాకు చూడాలని ఉంది. 148 00:09:06,922 --> 00:09:09,925 మన మగవాళ్లపై నిఘా పెట్టబోయే ప్రాణ స్నేహితులం అయిపోయినట్టున్నాం మనం, కదా? 149 00:09:10,008 --> 00:09:12,553 - అంతే అనుకుంటా. - చలో! 150 00:09:12,636 --> 00:09:14,596 మాక్సీన్ కి జయహో! 151 00:09:23,063 --> 00:09:27,067 నమస్తే అండీ, నేను ఎజెంట్ ట్రెయినీ, టామ్ శాంకాతో 152 00:09:27,150 --> 00:09:28,777 మాక్సీన్ డెలాకోర్ట్ హత్య గురించి మాట్లాడాలి. 153 00:09:28,861 --> 00:09:30,237 టామ్ శాంకా ఇప్పుడు ఇక్కడ పని చేయట్లేదు. 154 00:09:30,320 --> 00:09:31,363 ఏంటి? 155 00:09:31,446 --> 00:09:34,575 పామ్ బీచ్ లో పెళ్లైన ఆడవాళ్ల ప్రాణాలకి ముప్పు ఉంటే, ఎఫ్.బి.ఐ. వాళ్లకి ఏం పట్టదా? 156 00:09:34,658 --> 00:09:35,659 రాబర్ట్? 157 00:09:35,742 --> 00:09:37,578 నార్మా డెలాకోర్ట్, మీ భార్యని ఎందుకు చంపాలనుకుంటుంది? 158 00:09:37,661 --> 00:09:41,665 ఎందుకంటే, ఆక్సెల్ రోసెన్ హిప్స్ ని చంపింది నార్మాయేనని డైనాహ్ కి తెలిసిపోయిందని నార్మాకి తెలిసిపోయింది. 159 00:09:41,748 --> 00:09:43,584 తను చనిపోయిందంటే నమ్మలేకపోతున్నా. 160 00:09:45,294 --> 00:09:46,920 ఇది చాలా దారుణమైన పరిస్థితి. 161 00:09:47,546 --> 00:09:49,756 నిజం చెప్పావు, బ్రో. నిజమే చెప్పావు. 162 00:09:52,009 --> 00:09:55,846 పామ్ బీచ్ కి ఫస్ట్ లేడీ కాగల అవకాశమున్న నా భార్యకి, 163 00:09:55,929 --> 00:09:58,765 బాధపడిపోతున్న ఇతని మాజీ భార్య, ఊర్లో ఇంకో పక్కనున్న శవాగారంలో 164 00:09:58,849 --> 00:10:02,186 పడటానికి కారణమైన వ్యక్తి, చంపుతానని బెదిరిస్తూ లేఖలు పంపిస్తున్నారు. 165 00:10:02,269 --> 00:10:03,729 - అయితే? - అయితే 166 00:10:03,812 --> 00:10:08,275 అతని మాజీ భార్య శవాన్ని గుర్తించడానికి నా భార్యని పంపించాం, 167 00:10:08,358 --> 00:10:10,194 ఇప్పుడు నా భార్య ప్రమాదంలో పడింది. 168 00:10:10,777 --> 00:10:13,280 తన నుండి 24 గంటల్లోపు మీకు ఏ సమాచారమూ అందకపోతే, 169 00:10:13,363 --> 00:10:15,365 మీరు మళ్లీ ఇక్కడికి వచ్చి, తను కనిపించట్లేదని ఫిర్యాదు చేయవచ్చు. 170 00:10:15,991 --> 00:10:19,036 ఒకసారి అతడిని చూడండి. చూడండి జాగ్రత్తగా, 171 00:10:19,119 --> 00:10:20,704 ఇంతలా కుమిలిపోయే మనిషిని మీరు చూసి ఉండరు. 172 00:10:20,787 --> 00:10:26,210 ఎఫ్.బి.ఐ. వాళ్ల ఆదేశాల ప్రకారం, ఇతని మాజీ భార్యని ఎవరూ చూడటానికి వీల్లేదని శవాగారం వాళ్లు మాకు చెప్పారు. 173 00:10:26,293 --> 00:10:28,212 అంత్యక్రియల దాకా తనని ఎవరూ చూడకూడదు. 174 00:10:28,295 --> 00:10:30,547 తనని ఐస్ మీద పెడతారా మీరు? 175 00:10:30,631 --> 00:10:32,966 తనకి ఏం కావాలో, ఏం వద్దో నాకు తెలుసా, మీకు తెలుసా? 176 00:10:33,884 --> 00:10:34,968 మీరు సిగ్గుపడాలి. 177 00:10:39,056 --> 00:10:42,976 ఇది చాలా దారుణమైన పరిస్థితి, డాగ్ బాసూ. అందులో ఏ సందేహమూ లేదు. దారుణమైన పరిస్థితి ఇది. 178 00:10:43,602 --> 00:10:47,481 మాక్సీన్ ని ఒక షో పీస్ గా అలా అందరి ముందూ పెట్టడం తనకి ఇష్జముండదు. 179 00:10:49,775 --> 00:10:51,985 తను నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేది, మొదట తను చనిపోతే, 180 00:10:52,569 --> 00:10:56,156 నా విమానం నుండి గాల్లోకి తన అస్తికలని విసిరేయాలని. 181 00:10:58,575 --> 00:10:59,743 హేయ్… 182 00:11:01,745 --> 00:11:04,248 నీకు… కౌగిలి ఏమైనా కావాలా? 183 00:11:04,831 --> 00:11:06,083 హా. 184 00:11:10,712 --> 00:11:11,713 అంతే. 185 00:11:14,258 --> 00:11:16,844 - సారీ. - వదిలేయిలే. 186 00:11:19,179 --> 00:11:23,183 దేవుడా… తనకి గౌరవ సత్కారాలను ఇవ్వాలనుంది. 187 00:11:24,393 --> 00:11:27,271 జీవితంలో తనకి ఇవ్వలేని గౌరవ సత్కారాలని ఇవ్వాలనుంది. 188 00:11:28,897 --> 00:11:30,399 నేను మిట్జీ దగ్గరికి వెళ్లాలి. 189 00:11:31,567 --> 00:11:34,903 - డ్రాప్ చేస్తాను ఆగు. - వద్దు, బ్రో. నేను… నేను నడుచుకుంటూ వెళ్తా. 190 00:11:49,668 --> 00:11:53,463 బాబోయ్, నాకు డగ్లస్ ని మిస్ అవ్వాలని లేదు. అతను ఏడవడం చూడాలని చాలా ఉంది. 191 00:11:54,131 --> 00:11:57,384 చూడు, నా అంత్యక్రియలకి వస్తున్న ఆ తెలియని వ్యక్తి ఎవరు? 192 00:11:59,720 --> 00:12:02,931 ఇదేమీ "కౌన్ బనేగా కరోడ్ పతి" ప్రోగ్రామ్ కాదు. అతనెవరో చెప్పు. 193 00:12:03,015 --> 00:12:06,894 చెప్పలేను. అతనికి చాలా పేరు ఉంది. సెలబ్రిటీ అతను. 194 00:12:09,313 --> 00:12:12,316 సరే, నాకు చెప్పవచ్చులే. లెక్క ప్రకారం నేను చనిపోయా, కదా? 195 00:12:12,399 --> 00:12:14,234 - కనీసం హింట్ అయినా ఇవ్వు. - సరే, హింట్ ఇస్తానంతే. 196 00:12:14,318 --> 00:12:16,361 - సరే. - ఓకే. 197 00:12:17,321 --> 00:12:22,492 పేరులో ఒక బండరాయి, ఇంకా న్యూయార్కులోని ఓ నీటి ప్రదేశం ఉంటుంది. 198 00:12:26,496 --> 00:12:27,664 - తెలీదా? - తెలీదు. 199 00:12:28,373 --> 00:12:29,374 సరే… 200 00:12:30,334 --> 00:12:33,045 డోరిస్ డే బెస్ట్ ఫ్రెండ్. 201 00:12:34,880 --> 00:12:35,881 టోనీ రాండాల్? 202 00:12:35,964 --> 00:12:37,841 కాదు, కానీ అతను కూడా వచ్చాడు. 203 00:12:38,675 --> 00:12:44,097 సరే, సోక్ సడ్సన్ తో ప్రాస కలుస్తుంది. 204 00:12:44,765 --> 00:12:45,849 రాక్… 205 00:12:46,600 --> 00:12:48,519 - నా అంత్యక్రియలకి రాక్ హడ్సన్ వస్తున్నాడా? - అరవకు! 206 00:12:49,102 --> 00:12:50,938 - అది అందరికీ తెలిస్తే, అంతే ఇక. - ఓరి దేవుడా. 207 00:12:51,021 --> 00:12:53,023 - చాలా ఉద్రేకంగా ఉంది. - అవును! 208 00:12:53,607 --> 00:12:55,859 ఓరి దేవుడా. చెప్తున్నా కదా, ఇవాళ నక్క తోక తొక్కి వచ్చా. 209 00:12:55,943 --> 00:12:58,445 - అయ్య బాబోయ్. - అంటే, ఇది కలో నిజమో తెలీట్లేదు. 210 00:12:58,529 --> 00:13:00,864 - ఇతర మగాళ్లు నేను కథ చెప్తున్నానని అనుకుంటారు. - నీకు నిజం అనిపిస్తే చాలు, 211 00:13:00,948 --> 00:13:03,033 లోకం ఏమనుకుంటే ఏంటి! 212 00:13:03,951 --> 00:13:07,871 ఆయన సినిమా స్టార్ అయితే ఏంటి? మాజీ భర్త అయితే ఏంటి? 213 00:13:08,455 --> 00:13:09,873 ఇప్పుడు నీ సంగతి చూద్దాం. 214 00:13:10,415 --> 00:13:13,335 అతను నీ మాజీ భర్త కదా, మరి ఎందుకు అతని చుట్టూనే తిరుగుతున్నావు? 215 00:13:15,295 --> 00:13:18,215 నా గురించి తప్పుగా అనుకోకూడదు, అంతేగాక అతడిని వదిలేయమని కానీ, 216 00:13:18,298 --> 00:13:20,551 అతను చేసిన అన్యాయాలన్నింటినీ వివరంగా చెప్పమని కానీ నన్ను అడగకూడదు మరి. 217 00:13:20,634 --> 00:13:21,969 నేనెవరని అనుకుంటున్నావమ్మా? 218 00:13:23,637 --> 00:13:24,721 సరే మరి. 219 00:13:26,807 --> 00:13:29,268 ఒకరిని వదలి వెళ్లనప్పుడు, మళ్లీ వాళ్ల దగ్గరికి వెళ్లడమనే మాట ఎలా వస్తుంది! 220 00:13:31,061 --> 00:13:34,982 ఇక ఈ మధ్యే నాకొక కవల సోదరి, మిరబెల్ ఉందని తెలిసింది, 221 00:13:35,065 --> 00:13:38,819 నేను డగ్లస్ ని తప్ప ఇంకెవరినీ ప్రేమించలేననే అతిపెద్ద రహస్యం తనతో పంచుకున్నా. 222 00:13:38,902 --> 00:13:41,572 ఆ తర్వాత, మిరబెల్ ని నేను అనుకుని, నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో 223 00:13:41,655 --> 00:13:43,824 అతను తనతో పంచుకున్నాడు, ఆ తర్వాత మిరబెల్ చనిపోయింది. 224 00:13:44,908 --> 00:13:47,244 - తెలుసు, ఇదంతా అర్థమవ్వడానికి చాలా సమయం పడుతుంది. - హా. 225 00:13:48,036 --> 00:13:51,790 నీ చెల్లి మరణం గురించి కానీ, నీ విడాకుల గురించి కానీ బాధపడే సమయం నీకు దక్కలేదు. 226 00:13:52,916 --> 00:13:53,959 నువ్వు చాలా తెలివైనోడివి. 227 00:13:54,042 --> 00:13:56,420 - మాకు చాలా తెలివి ఉంటుంది. - అవును. 228 00:14:00,841 --> 00:14:03,760 - ఆమె బాధపడుతోంది చూడు. - ఆమేనా కొత్త మనిషి? 229 00:14:03,844 --> 00:14:06,513 - అవును బాబూ. - పోష్ అమ్మాయిలు ఏడుస్తుంటే చూడలేను నేను. 230 00:14:07,848 --> 00:14:09,057 ఇది పట్టుకో. 231 00:14:11,643 --> 00:14:13,645 ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? 232 00:14:13,729 --> 00:14:15,939 ఒకరు ఏడుస్తుంటే నేను చూడలేను, అది తనైనా, ఇంకెవరైనా. 233 00:14:16,023 --> 00:14:18,775 మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? అందరూ ఏడుస్తుంటే చూడటానికే కదా. 234 00:14:18,859 --> 00:14:22,863 నువ్వు చెప్పినవన్నీ చేశా… 235 00:14:25,741 --> 00:14:27,534 కానీ ఇక చేయలేను. 236 00:14:29,786 --> 00:14:31,788 ఎవరికీ ఏమీ కాదని అన్నావు. 237 00:14:38,378 --> 00:14:39,463 ఏమైంది? 238 00:14:39,546 --> 00:14:40,714 మూర్ఛపోయింది. 239 00:14:52,392 --> 00:14:53,560 బ్రూమెల్ బ్రోస్. మూవింగ్ కంపెనీ 240 00:14:57,105 --> 00:14:58,899 ఏజెంట్ శాంకా ఉన్నాడా? 241 00:14:58,982 --> 00:15:01,151 టామ్ వెళ్లిపోయాడు, రాబర్ట్. 242 00:15:01,235 --> 00:15:03,070 అయ్యయ్యో. 243 00:15:06,156 --> 00:15:10,827 అతనికి ఇబ్బంది కలిగించే పని నేనేదీ చేయను, తన ఉద్యోగం పోతుందని నాకు ముందే తెలిసుంటే… 244 00:15:10,911 --> 00:15:14,915 తన ఉద్యోగమేం పోలేదు. స్వయాన జే. ఎడ్గార్ హూవరే ఆసక్తి చూపారు. 245 00:15:15,666 --> 00:15:18,836 వేరే చోటకి బదిలీ చేస్తామన్నారు, అనుకోనిది ఏదైనా జరగక ముందే, 246 00:15:18,919 --> 00:15:20,504 దానికి ఒప్పుకోమని నేను గట్టిగా చెప్పాను. 247 00:15:21,338 --> 00:15:22,339 మళ్లీ. 248 00:15:23,924 --> 00:15:27,177 ఇక్కడ పామ్ బీచ్ లో మీరు ఏ నియమాల ప్రకారం జీవిస్తారో నాకు తెలీదు, 249 00:15:28,095 --> 00:15:30,264 కానీ కొన్నింటిని మీరు సొంతం చేసుకోలేరు, 250 00:15:31,181 --> 00:15:33,016 నా భర్తతో సహా. 251 00:15:33,684 --> 00:15:35,185 మా ఇద్దరికీ పిల్లలున్నారు. 252 00:15:37,437 --> 00:15:38,772 అంటే ఏంటో, ఎలా ఉంటుందో తెలుసా? 253 00:15:41,316 --> 00:15:42,526 మీకు తెలీదులే. 254 00:15:44,778 --> 00:15:46,280 నేను వీడ్కోలు చెప్పడానికి వచ్చానని చెప్పగలరా? 255 00:15:47,072 --> 00:15:48,073 ప్లీజ్. 256 00:15:48,657 --> 00:15:50,784 హా, చెప్పగలను… 257 00:15:52,661 --> 00:15:53,871 కానీ చెప్పను. 258 00:16:05,090 --> 00:16:06,466 తనకి ఏమీ కాలేదు కదా? 259 00:16:06,550 --> 00:16:08,177 బిడ్డ సంగతేంటి? బిడ్డకి కూడా ఏమీ కాలేదు కదా? 260 00:16:08,260 --> 00:16:09,803 తను కార్పెట్ కి అతుక్కుపోయి ఉంది. 261 00:16:09,887 --> 00:16:11,430 నా ఇరవైల ప్రాయంలో నేనిలానే గడిపా. తనకేం కాలేదు. 262 00:16:11,513 --> 00:16:12,973 - సరే, బెడ్ ఎక్కిద్దాం పద. - సరే. 263 00:16:13,056 --> 00:16:15,642 - నువ్వు తల ఎత్తు, నేను కాళ్లు ఎత్తుతా. - జుట్టు చెదరకుండా చూసుకుంటా. 264 00:16:15,726 --> 00:16:17,144 సరే, మోకాళ్ల దగ్గర ఎత్తు. 265 00:16:19,146 --> 00:16:20,397 - ఓకే. - ఓకే. 266 00:16:20,480 --> 00:16:23,233 - ఒకటి, రెండు, మూడు, హైలెస్సా. - మెట్టు. రెండు… 267 00:16:24,651 --> 00:16:25,736 తలకి ఏమీ కాకుండా దిండు పెడతా. 268 00:16:25,819 --> 00:16:28,405 - ఓకే. - ఓకే. సూపర్. 269 00:16:29,323 --> 00:16:30,699 వావ్. 270 00:16:30,782 --> 00:16:31,867 తనని బాగా భయపెట్టినట్టున్నా, కదా? 271 00:16:31,950 --> 00:16:35,162 నీ భర్తని దొంగిలించిన మహిళ వెంట నువ్వు నిజంగానే దెయ్యంలా పడుతున్నావు. 272 00:16:36,371 --> 00:16:38,749 వావ్, భలే ప్రతీకారం తీర్చుకున్నా. 273 00:16:39,750 --> 00:16:41,585 తనని ఇంకొంచెం సేపు ఇలానే వదిలేద్దామా? 274 00:16:42,169 --> 00:16:45,005 హా, హాట్ టబ్ దగ్గరికి వెళ్లిపోయి, మనం సాధించిన విజయాన్ని తలుచుకుంటూ మురిసిపోదాం. 275 00:16:45,756 --> 00:16:47,174 బాగా నిద్రపో, మిట్జీ. 276 00:16:48,592 --> 00:16:52,763 టమాటో సూప్ ఏడ్చినట్టు ఉంటుందని గతంలో అనుకునే వాడిని, కానీ ఇప్పుడు అలా అనుకోవట్లేదు. 277 00:16:52,846 --> 00:16:54,181 కార్న్ సూప్ గురించి నేనూ అలాగే అనుకునే దాన్ని. 278 00:16:54,264 --> 00:16:56,892 - అయ్య బాబోయ్. సూప్ లవర్స్ మనం. - సూప్ లవర్స్ 279 00:16:57,559 --> 00:16:59,353 ఎక్కడికి వెళ్లిపోయావు, మహాతల్లీ? 280 00:17:01,980 --> 00:17:03,482 డగ్లస్ ని చూడటానికి వెళ్లా. 281 00:17:03,565 --> 00:17:05,943 చనిపోయింది నేనేనని అనుకుంటున్నారు కాబట్టి, అతని బాధని తగ్గించడానికని వెళ్లా, 282 00:17:06,026 --> 00:17:07,778 కానీ కంగారుపడవద్దు, అతను నన్ను చూడలేదు. 283 00:17:07,861 --> 00:17:09,905 కానీ మిట్జీ మాక్సీన్ ని చూసి, దెయ్యం అనుకుంది. 284 00:17:09,988 --> 00:17:11,198 నువ్వు ఎవరు? 285 00:17:11,281 --> 00:17:13,367 సారీ. సంస్కారం మర్చిపోయా. 286 00:17:13,450 --> 00:17:15,618 ఇతను బ్రూస్, నా కొత్త ప్రాణ స్నేహితుడు. ఇతను స్వలింగ సంపర్కుడు. 287 00:17:15,702 --> 00:17:17,996 - అది అందరికీ చెప్పకపోతే మంచిదేమో. - సారీ. 288 00:17:18,079 --> 00:17:20,415 ఓకే, ఇలా చూడు, ఇప్పుడు రెండు విషయాల్లో ఏదోకటి జరిగే అవకాశముంది. 289 00:17:20,499 --> 00:17:22,376 ఒకటి, చనిపోయింది నువ్వేనని నటిస్తూ, నార్మాని పట్టుకోవడం. 290 00:17:22,459 --> 00:17:25,170 ఇంకోటి, ఈ పామ్ బీచ్ లో తర్వాత జరగబోయే చావు నీది కావడం. 291 00:17:25,253 --> 00:17:26,713 వేరే వాళ్లెవరూ నిన్ను చూడకూడదు. 292 00:17:27,297 --> 00:17:29,633 అసలే ఈ స్వలింగ్ సంపర్కుల హోటల్, ఎక్కువ మంది మహిళలకు రూమ్స్ ఇవ్వదు. 293 00:17:30,467 --> 00:17:31,468 ఇక్కడ ఇతర మహిళలు కూడా ఉన్నారా? 294 00:17:33,303 --> 00:17:35,722 నార్మా మనల్ని ఏం చేసినా కానీ, అది ఈ రూమ్ కంటే దారుణంగా ఏమీ ఉండదు. 295 00:17:35,806 --> 00:17:37,266 కానీ ఈ పరుపు నాకు నచ్చింది. 296 00:17:37,349 --> 00:17:39,643 గెస్ట్ బుక్ లో జనాలు రాసిన కామెంట్స్ చదివాక మనస్సు మార్చుకుంటావులే. 297 00:17:44,314 --> 00:17:45,941 నేను వెళ్లి బాత్ టబ్బులో పడుకుంటా. 298 00:17:47,860 --> 00:17:49,236 అది సరైన పని కాదేమో. 299 00:17:49,319 --> 00:17:50,320 ఏంటి? 300 00:17:50,946 --> 00:17:52,364 - హాయ్, మిత్రులారా. - మాక్సీన్? 301 00:17:52,447 --> 00:17:54,783 నువ్వు బతికి ఉన్నందుకు ఆనందంగా ఉంది. 302 00:17:54,867 --> 00:17:56,159 ఇప్పుడు నిన్ను నేనే చంపవచ్చు. 303 00:17:56,243 --> 00:17:59,371 ఇప్పుడు మీకంతా వివరంగా చెప్తాను, మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలిస్తాను. 304 00:18:00,372 --> 00:18:03,000 కానీ ఆ ప్రోగ్రామ్, కింద ఉన్న జకూజీ హాట్ టబ్బులో పెట్టుకుందామా? 305 00:18:03,083 --> 00:18:06,712 ఏంటంటే, నా కొత్త స్వలింగ సంపర్క మిత్రుడు, బ్రూస్, మనందరినీ పూల్ పార్టీకి ఆహ్వానించాడు. 306 00:18:06,795 --> 00:18:07,796 దాన్ని అతను జకూజీ మిక్సర్ అంటాడు. 307 00:18:07,880 --> 00:18:10,507 గెస్ట్ బుక్ లో దాని పేరు ఎగ్ డ్రాప్ సూప్ అని ఉంది. 308 00:18:10,591 --> 00:18:13,177 మనం ఎవరికీ కనిపించకూడదని వర్జీనియా అంది. 309 00:18:13,260 --> 00:18:16,680 మనం జకూజీలో చేరి హడావిడి చేయలేం. నాకు ప్రాణహాని ఉంది, మాక్సీన్. 310 00:18:16,763 --> 00:18:18,098 ఈ మగవాళ్లు విషయాలను బయటకు పొక్కనివ్వరు. 311 00:18:18,182 --> 00:18:20,058 నీతో కలిసి స్వలింగ సంపర్కుల పార్టీకి మేమెందుకు రావాలి? 312 00:18:21,185 --> 00:18:25,063 ఎందుకంటే, ఏదైనా విషాదం జరిగినప్పుడు, మన చుట్టూ ఉన్న వాళ్లే మనకి తోడుగా ఉంటారు. 313 00:18:26,732 --> 00:18:28,942 మినీబార్లు లేవు కానీ, మందు మాత్రం బాగానే దొరుకుతుంది. 314 00:18:29,651 --> 00:18:31,653 - మందని టచ్ చేశావు. - అదీ లెక్క. రా. 315 00:18:32,571 --> 00:18:34,156 ఆ ముక్క నువ్వు ముందే చెప్పుండాల్సింది. 316 00:18:34,239 --> 00:18:36,033 దీని గురించి ఎలా రాయాలో నాకు అర్థం కావట్లేదు, కానీ… 317 00:18:36,116 --> 00:18:40,829 తెల్ల కర్చీఫ్, అంటే వాళ్లు చూసుకుంటూ, చేసుకుంటారని అర్థం. 318 00:18:42,831 --> 00:18:43,916 మీరెప్పుడైనా చేసుకున్నారా? 319 00:18:45,667 --> 00:18:46,752 చేసుకున్నా. 320 00:18:47,628 --> 00:18:49,296 కానీ నాకది అంతగా ఇష్టం లేదు. 321 00:18:49,379 --> 00:18:52,341 మగాడి మగతనమంతా వాడి పొగరులోనే ఉంటుంది. 322 00:18:52,424 --> 00:18:53,926 ఇంకా చనుమొనలపై వారికి ఉన్న ఆసక్తిలో. 323 00:18:54,009 --> 00:18:58,347 నేనెప్పుడూ కంగారుపడిపోతుంటా, అది నా వల్ల కాదు, నాకెలా అనిపిస్తుందంటే… 324 00:18:58,430 --> 00:19:00,098 - ఏంటి? - నేను పనికిరానేమో అని. 325 00:19:00,182 --> 00:19:02,476 నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండాలి, 326 00:19:03,352 --> 00:19:07,731 సుదీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా ప్రశాంతంగా ఉండటం ఎలానో నువ్వు తెలుసుకోవాలి. 327 00:19:08,815 --> 00:19:10,150 మీ ఇంట్లో సింక్ ఉందా? 328 00:19:10,234 --> 00:19:12,819 - ఒక్క నిమిషం… - మీరు, మీ భర్త… 329 00:19:12,903 --> 00:19:15,489 దాన్ని చూస్తే బోర్డింగ్ స్కూల్ గుర్తొస్తుందని పెర్రీ అంటాడు. 330 00:19:16,073 --> 00:19:18,325 భలే వారే, మాకేమీ శృంగారమంటే మితిమీరిన పిచ్చి లేదు. 331 00:19:18,408 --> 00:19:19,618 అలా పందులకే ఉంటుంది. 332 00:19:20,619 --> 00:19:21,620 ఓకే. 333 00:19:22,829 --> 00:19:27,084 మరి తిమింగలాన్ని ఎలాంటి మగవాడితో పోల్చవచ్చు? 334 00:19:27,167 --> 00:19:28,293 నాకు ఊదడమంటే ఇష్టం. 335 00:19:28,877 --> 00:19:29,878 నాకదంటే భలే ఇష్టం. 336 00:19:29,962 --> 00:19:33,298 - లైట్ బ్లూ. లైట్ బ్లూ, ఎడమ జేబు. - ఇది సూపర్ గా ఉంది. 337 00:19:33,382 --> 00:19:36,468 "బెల్ జార్"లోని రూమ్ మేట్ కి స్ఫూర్తిగా నన్నే తీసుకున్నారని తెలుసా? 338 00:19:37,469 --> 00:19:39,721 - దేవుడా, మీ వాళ్లందరూ నాకు భలే నచ్చేశారు. - అరె, భలే దానివే. 339 00:19:39,805 --> 00:19:42,099 మమ్మల్ని కూడా పిలిచి, మాకు ఏ బెరుకూ లేకుండా చూసుకున్నందుకు థ్యాంక్స్. 340 00:19:42,182 --> 00:19:43,684 మేము కూడా కాస్తంత స్వార్థంతోనే ఈ పని చేశాం. 341 00:19:44,184 --> 00:19:46,728 పార్టీలో మహిళలుంటే పోలీసులు దాడులు చేయరు. 342 00:19:48,522 --> 00:19:49,606 ఏం చేస్తున్నావు? 343 00:19:49,690 --> 00:19:52,276 ఇక్కడ చేరి జనాలతో ముచ్చట్లు పెడుతూ, నీ అంత్యక్రియల గురించి చెప్తున్నావా? 344 00:19:52,359 --> 00:19:53,694 బ్రూస్ మా అందరినీ ఈ పార్టీకి ఆహ్వానించాడు. 345 00:19:53,777 --> 00:19:55,445 మిత్రులారా, ఈమె పేరు వర్జీనియా! 346 00:19:55,529 --> 00:19:56,947 తనొక ఫెడరల్ ఏజెంట్. 347 00:19:58,240 --> 00:20:01,827 లేడీస్, మీతో కాస్త ఏకాంతంగా మాట్లాడవచ్చా? 348 00:20:01,910 --> 00:20:04,496 ఈ మహిళ జిడ్డులా తగులుకుందిరా నాయనా. 349 00:20:04,580 --> 00:20:06,665 అయ్యయ్యో. తనని వదిలించుకోండి. 350 00:20:08,125 --> 00:20:09,459 - ఇది తీసుకో, బాగుంటుంది. - థ్యాంక్స్. 351 00:20:12,754 --> 00:20:15,465 అమ్మాయిలూ, రేపు ఏ సమస్యా చోటు చేసుకోకూడదు. 352 00:20:15,549 --> 00:20:19,553 ఎవెలిన్, అంత్యక్రియల బాధ్యత నీది. డైనాహ్, నువ్వు బెంచీల మీద కూర్చొని వేచి ఉండు. 353 00:20:19,636 --> 00:20:21,638 దేనికి? నార్మా నన్ను చంపడానికా? 354 00:20:22,347 --> 00:20:26,643 నాకు భద్రతని అయినా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని అయినా కల్పిస్తారా? 355 00:20:26,727 --> 00:20:30,355 రహస్యంగా ఉంచడమే కీలకం. దీని గురించి మీరెవరికీ చెప్పకూడదు, మీ భర్తలకి కూడా. 356 00:20:30,439 --> 00:20:33,483 సూపర్. మనమిద్దరమూ బాల్కనీ మీద ఉందాం, 357 00:20:33,567 --> 00:20:36,862 అక్కడి నుండి మనం ఆ ప్రాంతంపై కన్నేసి ఉంచుదాం. 358 00:20:36,945 --> 00:20:39,364 నువ్వు కూడా అంత్యక్రియల్లో పాల్గొంటేనే మంచిది, ఆన్. 359 00:20:39,990 --> 00:20:41,783 మీడియా మనిషివి కాబట్టి ఇంకా బలంగా ఉంటుంది. 360 00:20:41,867 --> 00:20:44,036 కానీ ఇది మన కేసు కదా. మొదట్నుంచీ మనం కలిసి పని చేస్తున్నాం కదా. 361 00:20:44,119 --> 00:20:45,829 అవును, కానీ ఇప్పుడు ఎఫ్.బి.ఐ. కేసు అయిపోయింది. 362 00:20:46,705 --> 00:20:48,457 ఇప్పటికి నాపై నమ్మకం ఉంచి, ఈ కేసు ఇచ్చారు. 363 00:20:50,626 --> 00:20:52,419 మీ సిబ్బంది, ఇచ్చిన సూచనల ప్రకారం నడుచుకుంటారు. 364 00:20:52,503 --> 00:20:57,674 డైనాహ్ లా, నా భాగస్వామ్యం వల్ల అక్కడ ఒరిగేదేం లేదు కదా? 365 00:20:58,258 --> 00:21:00,719 ఓకే. మరి నా సంగతేంటి? నా పాత్ర ఏంటి? 366 00:21:00,802 --> 00:21:03,430 - నీ పాత్ర నీ సోదరి పోషిస్తోందిలే. - నా అంత్యక్రియలకి నేను రావాలి. 367 00:21:03,514 --> 00:21:05,516 నార్మాని పట్టుకోవడం నేను చూడాలి. కాబట్టి నేను అక్కడ ఉండాలి. 368 00:21:05,599 --> 00:21:07,184 మిమ్మల్నందరినీ రేపు కలుస్తా. 369 00:21:07,267 --> 00:21:08,727 మాక్సీన్ ని తప్ప. 370 00:21:15,150 --> 00:21:16,485 వచ్చాడయ్యా పిస్తా బాబూ. 371 00:21:18,695 --> 00:21:21,323 బాయ్స్. బాయ్స్, మిమ్మల్నందరినీ ఒకటి అడుగుతా. 372 00:21:21,406 --> 00:21:24,284 మీ బెస్ట్ ఫ్రెండ్ పై ఒక ముసలావిడ హత్యాయత్నం చేసి, 373 00:21:24,368 --> 00:21:29,122 తనని చంపాలనుకుని, ఆ ముసలావిడ అనుకోకుండా తన కవల సోదరిని చంపేస్తే, 374 00:21:29,206 --> 00:21:30,749 మీరు ఎవరి వైపు నిలబడతారు, హా? 375 00:21:30,832 --> 00:21:32,709 మీ బెస్ట్ ఫ్రెండ్ వైపా? ఆ దుష్ట ముసలావిడ వైపా? 376 00:21:35,337 --> 00:21:37,089 - బెస్ట్ ఫ్రెండ్ వైపు. - థ్యాంక్యూ, బ్రూస్. 377 00:21:37,589 --> 00:21:39,758 - చూశావా? - నేను డగ్లస్ ని చూశా. 378 00:21:39,842 --> 00:21:41,301 అతను నీ మరణాన్ని తీసుకోలేకపోతున్నాడు. 379 00:21:42,052 --> 00:21:43,303 నాకు కూడా తనని చూస్తే బాధగా ఉంది, 380 00:21:43,387 --> 00:21:46,139 కానీ నీ కొత్త స్నేహితులతో నువ్వు పండగ చేసుకో, ఇదంతా నీకెందుకులే! 381 00:22:15,335 --> 00:22:16,420 నేనా? 382 00:22:18,255 --> 00:22:19,298 నిజంగా. 383 00:22:19,381 --> 00:22:21,133 నీ దగ్గర ఉండిందా, ఏంటంటే… 384 00:22:21,216 --> 00:22:22,384 ఉండింది! 385 00:22:22,467 --> 00:22:24,178 ఒక స్నేహితుడి నుండి ఇంత కామెడీ విషయం… 386 00:22:24,261 --> 00:22:25,888 - అంటే, నేను కేవలం… - …నేనెప్పుడూ వినలేదు. 387 00:22:27,681 --> 00:22:29,099 అంత లేదులే! 388 00:22:29,975 --> 00:22:31,560 ఓరి దేవుడా. 389 00:22:31,643 --> 00:22:34,646 సరే మరి. అంటే, చూడు, ఒక ఫోటో, చిత్రం అయితే ఓకే, కానీ… 390 00:22:36,982 --> 00:22:38,442 అయ్య బాబోయ్, ఏంటిదంతా? 391 00:22:38,525 --> 00:22:40,527 ఎక్స్ క్యూజ్ మీ, ఇక్కడికి రావడానికి మీకు అనుమతి లేదు. 392 00:22:40,611 --> 00:22:42,279 వాటిని తీసుకెళ్లకండి. అసలేం… 393 00:22:42,905 --> 00:22:44,198 వాటిని పెట్టేయండి! 394 00:22:45,365 --> 00:22:46,366 హలో? 395 00:22:47,034 --> 00:22:49,828 వర్జీనియా, నా ఆఫీసు నుండి మీ ఆఫీసర్లని పంపించేయ్. 396 00:22:49,912 --> 00:22:51,121 ఇది నా పరిధిలో లేని విషయం. 397 00:22:51,205 --> 00:22:53,582 మరణంపై, పన్నులపై ఏదో నానుడి ఉంది కదా? 398 00:22:53,665 --> 00:22:55,584 ఎఫ్.బి.ఐ. వాళ్లు కూడా ఫెడరల్ ఆడిట్ ని ఆపలేదు. 399 00:22:55,667 --> 00:22:56,919 పన్నులా? నీ ఉద్దేశం, నేను… 400 00:22:57,002 --> 00:22:59,129 పింకీ విషయం నాకు వదిలేయండని నీకు, మాక్సీన్ కి చెప్పా. 401 00:22:59,213 --> 00:23:00,756 కానీ మీరేమో ఐఆర్ఎస్ వాళ్లకి కాల్ చేశారు. 402 00:23:00,839 --> 00:23:02,466 వాళ్లు నిన్న రాత్రి వచ్చారు. 403 00:23:02,549 --> 00:23:04,384 ఏమైపోయావు నువ్వు? పడుకోవడానికి రాలేదే. 404 00:23:04,468 --> 00:23:05,802 అంటే… 405 00:23:05,886 --> 00:23:07,095 వద్దు, వద్దు. 406 00:23:07,763 --> 00:23:10,766 నిన్న రాత్రి అంత్యక్రియలకి అంతా సిద్ధం చేసే పనులు చూస్తూ ఉన్నా. ఈ సీజన్లో ఇదే కదా అతి పెద్దది. 407 00:23:11,391 --> 00:23:12,476 దానితో నాకు నిద్రే పట్టలేదు. 408 00:23:13,018 --> 00:23:14,853 ఇది మీకు సాయపడగలదని అనుకున్నా, మేడమ్. 409 00:23:14,937 --> 00:23:18,023 మీ బాధ విషయంలో, ఇంకా ఐఆర్ఎస్ దాడుల విషయంలో. 410 00:23:18,106 --> 00:23:19,107 జెడ్, థ్యాంక్యూ. 411 00:23:19,191 --> 00:23:21,360 నువ్వు సాయం చేయనా అని అడగవు, చేసేస్తావంతే. 412 00:23:21,944 --> 00:23:23,028 నాకది నచ్చింది. 413 00:23:25,906 --> 00:23:27,533 వెళ్లి పూల్ ని శుభ్రం చేయవా, జెడ్? 414 00:23:27,616 --> 00:23:29,660 నిజానికి, జెడ్ తలుపు దగ్గర గార్డ్ డ్యూటీ చేస్తే బాగుంటుంది. 415 00:23:29,743 --> 00:23:33,413 హత్య జరిగిన ఈ చోట ఇంకా దర్యాప్తు పనులు జరుగుతున్నాయి, కాబట్టి అదనపు భద్రత అవసరమవుతుంది. 416 00:23:34,164 --> 00:23:37,000 మేడమ్, మనకి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. 417 00:23:37,793 --> 00:23:41,380 నాకు నువ్వెంత కాలంగా తెలుసో, నా సోదరి కూడా అంతే కాలంగా తెలుసు, కాబట్టి బాధపడలేకపోతున్నా. 418 00:23:41,463 --> 00:23:44,466 కానీ నా జ్ఞాపకార్థంగా జరుగుతున్న ఆఫ్-సీజన్లోని 419 00:23:44,550 --> 00:23:46,009 ముఖ్యమైన ఈవెంట్ కి నేను వెళ్లలేని పరిస్థితి. 420 00:23:46,093 --> 00:23:49,805 నువ్వు నాకు అన్నీ వివరంగా చెప్పాలి. రాతపూర్వకంగా ఇస్తే మరీ మంచిది. 421 00:23:50,848 --> 00:23:52,182 నేను వెళ్లట్లేదు. 422 00:23:53,600 --> 00:23:55,853 ఏంటి? మనిద్దరమూ వెళ్లకపోతే ఎలా? 423 00:23:56,478 --> 00:23:57,563 రాక్ ఒక వర్తమానం పంపాడు. 424 00:23:57,646 --> 00:24:00,732 "పబ్లిసిటీ చాలా ఎక్కువగా ఉంది. మళ్లీ ఎప్పుడైనా కలుద్దాం." 425 00:24:01,608 --> 00:24:05,362 మళ్లీ కాల్ చేస్తా అని అన్నాడు, కానీ నాకు ఆ నమ్మకం కుదరట్లేదు. 426 00:24:05,445 --> 00:24:08,657 ఏ మగాడైనా నీ మాటలు వినాలంటే, ముందు అతను నిన్నుచూసేలా చేసుకోవాలి. 427 00:24:08,740 --> 00:24:09,741 మంచి సలహానే. 428 00:24:09,825 --> 00:24:12,119 తన సలహా మాత్రం తీసుకోకు, మరీ ముఖ్యంగా మగాళ్లకు సంబంధించి ఇచ్చేవి. 429 00:24:12,202 --> 00:24:14,371 ఆ ఫ్యాన్సీ సూట్ కేసు వేసుకొని ఎక్కడికి బయలుదేరావు? 430 00:24:14,454 --> 00:24:18,208 నీ నకిలీ అంత్యక్రియలకి, నకిలీ అమెరికన్ హీరోగా వెళ్తున్నా. నీ గురించి నాలుగు నకిలీ ముక్కలు చెప్పడానికి. 431 00:24:18,292 --> 00:24:20,711 అర్థమైంది. అంతా నకిలీయే. కానీ ఆ బ్యాగులో ఏముంది? 432 00:24:20,794 --> 00:24:23,505 నార్మా కోసం తీసుకెళ్తున్నా ఇది. తనని అరెస్ట్ చేసే పరిస్థితే వస్తే, ఎందుకైనా మంచిదని. 433 00:24:23,589 --> 00:24:24,840 నీకు బాగా అనుభవముంది కదా, మాక్సీన్. 434 00:24:24,923 --> 00:24:26,592 సాటి మనిషి అని కూడా చూడకుండా, 435 00:24:26,675 --> 00:24:28,886 ఒక పేపర్ గౌను వేసి, జైల్లో వేస్తే ఎలా ఉంటుందో. 436 00:24:31,513 --> 00:24:33,140 నా సోదరిని చంపింది నేను కాదు కదా! 437 00:24:35,309 --> 00:24:36,560 మళ్లీ అదే సంజ్ఞ. 438 00:24:37,561 --> 00:24:38,812 బాబోయ్, త్వరగా వెళ్దాం పద. 439 00:24:38,896 --> 00:24:39,938 సరే. 440 00:24:45,235 --> 00:24:47,196 వావ్. నువ్వు ఇందులో స్పెషలిస్టువి, బ్రూస్. 441 00:24:47,946 --> 00:24:50,115 ఇదేం చూశావు! "ఐస్ స్టేషన్ జీబ్రా" ప్రీమియర్ బయట అయితే అల్లాడించా. 442 00:24:50,657 --> 00:24:51,742 అన్నట్టు, ఆమెని చూడు. 443 00:24:51,825 --> 00:24:53,243 తను కుమిలిపోతోంది. 444 00:24:53,911 --> 00:24:56,580 హా, ఆమె ప్లాస్టిక్ సర్జన్ పెద్ద తాగుబోతు. 445 00:24:56,663 --> 00:24:59,374 ఆమె తుమ్మితే, చిన్న సైజు వేటకుక్కలా ఉంటుందని అంటూ ఉంటా నేను. 446 00:25:01,251 --> 00:25:02,294 వామ్మోయ్. 447 00:25:03,003 --> 00:25:06,256 వెస్పా వేసుకొని ఎవరు వచ్చారో చూడు. 448 00:25:08,509 --> 00:25:11,512 - ఓరి దేవుడా. అతనొచ్చాడు. - ఎవరు? 449 00:25:12,429 --> 00:25:13,514 నా రాక్. 450 00:25:15,641 --> 00:25:18,060 అబ్బా. అతను రీగన్ తో ఉన్నాడు. 451 00:25:18,977 --> 00:25:20,562 క్యాలిఫోర్నియా గవర్నరా? 452 00:25:20,646 --> 00:25:22,773 కాదు, అతని భార్య. 453 00:25:23,273 --> 00:25:24,816 రాక్ కి వేరే సెక్సువల్ ఓరియంటేషన్ల విషయంలో తను సపోర్ట్. 454 00:25:25,484 --> 00:25:27,110 తన పేరు న్యాన్సీ అనుకుంటా. 455 00:25:28,362 --> 00:25:29,488 నువ్వు చాలా నేర్చుకోవాలి. 456 00:25:29,571 --> 00:25:31,281 న్యాన్సీ కూడా నా నుండి చాలా నేర్చుకుంది. 457 00:25:31,365 --> 00:25:34,201 ఇప్పుడు తను శృంగారంలో ఆరితేరడానికి కారణం నేనే. 458 00:25:36,912 --> 00:25:37,955 బాబోయ్. 459 00:25:38,872 --> 00:25:40,207 అక్కడ మిరబెల్ ఉంది, 460 00:25:40,290 --> 00:25:43,585 ఇక్కడ నేనేమో సినిమా స్టార్ల గురించి, ఆట పాటల గురించి ముచ్చట్లాడుతూ కూర్చున్నా. 461 00:25:43,669 --> 00:25:46,338 నేను తనకి సరైన వీడ్కోలు ఇవ్వాలి. నేను వెళ్తున్నా. 462 00:25:46,421 --> 00:25:48,674 మాక్సీన్, నువ్వు ముందు గుమ్మం నుండి లోపలికి వెళ్లనే లేవు. 463 00:25:49,341 --> 00:25:52,386 నాకు బాగా తెలిసిన విషయం ఏదైనా ఉందంటే, అది పామ్ రాయల్ లోకి దొంగచాటుగా ప్రవేశించడం. 464 00:25:54,680 --> 00:25:56,348 నువ్వు కూడా నా అంత్యక్రియలకి రావచ్చు. 465 00:25:56,431 --> 00:25:58,517 ఈ డ్రెస్సులో నన్ను లోపలికి రానివ్వరు. 466 00:25:58,600 --> 00:25:59,518 నాకు గుడ్ లక్ చెప్పు. 467 00:25:59,601 --> 00:26:00,853 గుడ్ లక్, మాక్సీన్. 468 00:26:00,936 --> 00:26:02,688 అతను నిన్ను చూసేలా చేస్తావని మాటివ్వు. 469 00:26:31,550 --> 00:26:32,968 మిరబెల్. 470 00:26:36,096 --> 00:26:38,098 నిన్ను ఆఖరిసారిగా చూద్దామని వచ్చా. 471 00:26:41,059 --> 00:26:43,270 నీ తల ఇక్కడ ఉంటుందని అనుకుంటున్నా. 472 00:26:52,070 --> 00:26:54,573 నాకంటూ ఒక సొంత కుటుంబం ఉండాలని నేను కోరుకోని క్షణం లేదు. 473 00:26:57,868 --> 00:26:59,828 ఒక విషయం తెలుసుకో… 474 00:27:00,871 --> 00:27:02,831 మనం గడిపిన క్షణాలన్నీ నాకు మధురమైనవే. 475 00:27:05,542 --> 00:27:07,377 నిన్ను మిస్ అవుతా, బంగారం. 476 00:27:19,181 --> 00:27:21,183 మిరబెల్ ఏమైపోయింది? 477 00:27:22,809 --> 00:27:24,311 నీ భయాందోళనలు నాకు అర్థమయ్యాయి. 478 00:27:24,394 --> 00:27:25,854 ఇంకా నేను… 479 00:27:26,522 --> 00:27:27,940 అయ్య బాబోయ్. 480 00:27:29,733 --> 00:27:32,069 మనకి ఈ పరిస్థితి దాపురించిందంటే నమ్మలేకపోతున్నా. 481 00:27:32,152 --> 00:27:34,321 అందరూ ఆ శవపేటికలో ఉండేది మాక్సీనే అనుకుంటున్నారు, 482 00:27:34,404 --> 00:27:37,115 కానీ తనేమో అక్కడ ఓ హాట్ టబ్బులో స్వలింగ సంపర్కుడైన కొత్త నేస్తంతో పండగ చేసుకుంటోంది. 483 00:27:38,242 --> 00:27:40,744 ఇది నీకు ఊరట కలిగిస్తుందో లేదో తెలీదు కానీ, ఆ శవపేటికలో ఎవరూ లేరు. 484 00:27:42,788 --> 00:27:43,997 నేను వెళ్లలేను. 485 00:27:44,081 --> 00:27:46,875 మాక్సీన్ ని చంపింది నేనేనని ఊరంతా అనుకుంటున్నారు. 486 00:27:46,959 --> 00:27:49,795 లేదు, తనని చంపింది నార్మా అని మనందరికీ తెలుసు. 487 00:27:50,462 --> 00:27:52,047 నేను తన మనస్సును చంపేశానని అనుకుంటున్నారు. 488 00:27:52,714 --> 00:27:54,591 అందుకే తను నన్ను దెయ్యమై వెంటాడుతోంది. 489 00:27:54,675 --> 00:27:57,636 నీకు అపరాధ భావంగా ఉంది, అందుకే నీకలా ఉంది. కాలం గడిచే కొద్దీ, అది కూడా పోతుందిలే. 490 00:27:57,719 --> 00:28:00,514 తను మన ఇంటి వెనుక గుమ్మం దగ్గర కనిపించింది. నిజమే చెప్తున్నా. 491 00:28:02,099 --> 00:28:05,269 తన అంత్యక్రియలకి వచ్చి తన శవాన్ని చూసే ధైర్యం నాకు లేదు. 492 00:28:05,853 --> 00:28:09,022 నేను మళ్లీ నా భార్యని చూడలేకపోవచ్చు, కానీ ఇదిగో నీది. 493 00:28:09,982 --> 00:28:11,024 ఏంటిది? 494 00:28:11,108 --> 00:28:12,192 మాక్సీన్. 495 00:28:13,485 --> 00:28:16,488 బాధలో ఉన్న నువ్వు కోరిన కోరికని నెరవేర్చడానికి ఇది తెచ్చా, నా జింక సోదరా. 496 00:28:19,324 --> 00:28:20,617 విమానం నుండి వెదజల్లు. 497 00:28:20,701 --> 00:28:22,786 పెర్రీ డోనహ్యూ శవాగారానికి వెళ్లి 498 00:28:22,870 --> 00:28:25,205 శవాన్ని దహింపజేసే వరకు, నానా హంగామా చేశాడట. 499 00:28:25,289 --> 00:28:28,667 ఇదేం ఊరురా నాయనా! 500 00:28:30,085 --> 00:28:32,171 ఈ ఊర్లో ఉన్న వారిలో అత్యంత దారుణమైన వ్యక్తి ఎవరో తెలుసా? 501 00:28:33,380 --> 00:28:36,967 మాక్సీన్. నేను చంపాలనుకున్న వ్యక్తి గురించి నా నోటితోనే నాలుగు మంచి మాటలు చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. 502 00:28:37,843 --> 00:28:41,054 ఇవాళ కాస్త ఓపిక పట్టు. నార్మా పామ్ బీచ్ లోనే ఉంది. 503 00:28:41,138 --> 00:28:43,307 తను రాకుండా ఉండలేదని నీకు తెలుసు. 504 00:28:47,561 --> 00:28:52,858 మిరబెల్, నువ్వెవరో ఏమో కానీ, నీ పట్టుదల నాకు నచ్చింది. 505 00:28:53,609 --> 00:28:57,946 కానీ, నా మనస్సును దోచుకున్న ఆ ఆత్మ కనిపించేదాకా, ఇవాళ నేను ఏ సందేశాలనూ చేరవేయను. 506 00:28:58,030 --> 00:29:01,200 నువ్వొక సందేశాన్ని చేరవేయాలి, మేరీ. 507 00:29:01,283 --> 00:29:05,579 తెలుసు. తంతు మొదలవ్వగానే నా పని నేను చేయాలి, అప్పుడు నువ్వు… 508 00:29:05,662 --> 00:29:07,247 నా గురించి ఆలోచించకు. 509 00:29:08,373 --> 00:29:11,168 నీ పాత్ర నువ్వు పోషించు, మిగతా దాని సంగతి నాకు వదిలేయి. 510 00:29:12,085 --> 00:29:14,463 అదయ్యాక, నాకు స్వేచ్ఛ లభిస్తుందా? 511 00:29:16,423 --> 00:29:17,716 మనందరికీ స్వేచ్ఛ లభిస్తుందిలే. 512 00:29:18,759 --> 00:29:20,260 కానివ్వు, నార్మా. 513 00:29:20,844 --> 00:29:22,095 ఇక్కడికి రా. 514 00:29:28,393 --> 00:29:29,394 రాక్ హడ్సన్. 515 00:29:29,478 --> 00:29:31,230 దగ్గరి నుండి చూస్తుంటే, ఇంకా అందంగా కనిపిస్తున్నాడే. 516 00:29:31,313 --> 00:29:33,106 అంత్యక్రియలు మొదలవ్వగానే, 517 00:29:33,190 --> 00:29:34,858 నువ్వు వెళ్లి పూల్ ని శుభ్రం చేయడం మొదలుపెట్టు. 518 00:29:34,942 --> 00:29:36,902 పూల్ లో మాక్సీన్ కుళ్లిన శవం తాలూకు అవశేషాలు తేలుతూ ఉంటే, 519 00:29:36,985 --> 00:29:39,655 ఎవరు మాత్రం ఈదుతారు. 520 00:29:39,738 --> 00:29:40,739 ఇప్పుడే ఆ పని మొదలుపెడతా, మేడమ్. 521 00:29:41,240 --> 00:29:42,491 హేయ్. హేయ్. 522 00:29:43,450 --> 00:29:44,493 ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? 523 00:29:44,576 --> 00:29:46,662 లేదు, ఏమీ మాట్లాడాలనుకోవట్లేదు. 524 00:29:46,745 --> 00:29:49,081 పూల్ లో శవం తాలూకు అవశేషాలు లేకుండా శుభ్రపరచమని జెడ్ కి చెప్పా. 525 00:29:49,998 --> 00:29:51,375 ఓరి దేవుడా. 526 00:29:51,458 --> 00:29:53,085 హ్యాపీ రాకఫెల్లర్. 527 00:29:55,045 --> 00:29:57,172 ఓహో, బేబ్ పేలీ కూడా వచ్చింది. 528 00:30:03,345 --> 00:30:05,597 ఎక్స్ క్యూజ్ మీ. ఎక్స్ క్యూజ్ మీ. 529 00:30:09,393 --> 00:30:11,687 డైనాహ్, నువ్వు చనిపోయావనుకున్నా. 530 00:30:12,604 --> 00:30:14,356 పెర్రీ, ఇప్పుడు వద్దు. తట్టుకో. 531 00:30:14,439 --> 00:30:17,276 నార్మా ఎక్కడైనా ఉండవచ్చు. అందరి దృష్టీ నాపై పడకూడదు. 532 00:30:17,359 --> 00:30:19,945 నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలీనే తెలీదు. ఇప్పుడు మాక్సీన్ కూడా చనిపోయింది. 533 00:30:20,028 --> 00:30:21,238 కాస్త అన్నింటినీ దిగమింగుకో, పెర్రీ. 534 00:30:21,321 --> 00:30:23,949 వావ్, పెర్రీ. మనిద్దరి మధ్య అంత పరిచయం ఉందని నేను అనుకోలేదే. 535 00:30:24,616 --> 00:30:27,411 నువ్వు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని ఉన్నావా? 536 00:30:27,494 --> 00:30:29,663 రెండు వేసుకున్నా. నువ్వు రావనుకుని నీది కూడా వేసుకున్నా. 537 00:30:29,746 --> 00:30:30,956 ఇప్పుడే ఒకటి ఇచ్చేయ్. 538 00:30:31,039 --> 00:30:33,000 - ఇచ్చేయ్. - ఇప్పటికిప్పుడే ఎలా ఇవ్వను! ఆగు కాస్త. 539 00:30:33,083 --> 00:30:35,544 నన్ను కాపాడే ధైర్యం నీకు లేదు. 540 00:30:35,627 --> 00:30:38,839 నన్ను నేను కాపాడుకుంటా. 541 00:30:38,922 --> 00:30:39,965 ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? 542 00:30:40,048 --> 00:30:44,136 ఈ ప్రపంచంలో ఏ మహిళకైనా సురక్షితంగా అనిపించే ఏకైక చోటుకి. 543 00:30:44,887 --> 00:30:46,138 లేడీస్ బాత్రూమ్. 544 00:30:46,972 --> 00:30:48,682 చాలా చాలా థ్యాంక్స్. 545 00:30:49,516 --> 00:30:50,559 ఎక్స్ క్యూజ్ మీ. 546 00:30:55,022 --> 00:30:57,774 చూశావా? అందరూ నన్నే చూస్తున్నారు. 547 00:30:58,734 --> 00:30:59,985 మాక్సీన్ కూడా. 548 00:31:01,278 --> 00:31:02,404 తను నా వెంట పడుతోంది. 549 00:31:03,322 --> 00:31:04,364 తను అలా చేయడం న్యాయం కూడా. 550 00:31:04,448 --> 00:31:06,450 నేను తనకి చాలా అన్యాయం చేశా. 551 00:31:06,533 --> 00:31:09,536 ఒట్టేసి చెప్తున్నా, మాక్సీన్ కౌంటర్ మీదనే అస్తికల రూపంలో ఉంది. మనం అక్కడే పెట్టాం కదా. 552 00:31:12,456 --> 00:31:14,625 లేదు, తనక్కడ లేదు. అక్కడ ఉంది! 553 00:31:14,708 --> 00:31:17,002 తను అక్కడ ఉంటే, మన దగ్గరున్న అస్తికలు ఎవరివి మరి? 554 00:31:17,085 --> 00:31:18,712 డైనాహ్ వాళ్ల ఇంట్లో కిచెన్ లో ఒకరు ఉన్నారు. 555 00:31:18,795 --> 00:31:20,214 క్షమించాలి. 556 00:31:20,297 --> 00:31:22,257 అస్తికలు అటూఇటూ అయ్యుండవచ్చేమో కానీ, 557 00:31:22,341 --> 00:31:25,844 ఆ శవపేటికలో మాత్రం ఎవరూ లేరని పక్కాగా చెప్పగలను. 558 00:31:25,928 --> 00:31:27,221 చూశావా, మిట్జ్? అంతా ఓకే. 559 00:31:27,304 --> 00:31:28,388 పద. 560 00:31:30,974 --> 00:31:32,142 అందరికీ సుస్వాగతం. 561 00:31:33,894 --> 00:31:36,313 జరుగుతున్న తంతును చూస్తే నమ్మలేకపోతున్నా. 562 00:31:36,396 --> 00:31:40,067 ఇదంతా నిజంగా జరుగుతోందా అన్న ఫీలింగ్ కలుగుతోంది. 563 00:31:41,193 --> 00:31:45,614 ఎందుకో తెలీదు కానీ, ఏదోక రోజు మాక్సీన్ మళ్లీ తప్పకుండా వస్తుందనిపిస్తోంది. 564 00:31:46,615 --> 00:31:48,325 కానీ ఇవాళ మనం ఇక్కడికి వచ్చి 565 00:31:48,408 --> 00:31:53,247 మాక్సీన్ కి తుది వీడ్కోలు పలుకుతున్నాం. 566 00:31:53,872 --> 00:31:55,457 ఇప్పుడు తన ఇంటి పేరు ఏంటో ఎవరికి తెలుసు? 567 00:31:56,041 --> 00:31:59,545 మాక్సీన్ మన దగ్గరికి ఒక బయటి వ్యక్తిగా వచ్చింది, 568 00:31:59,628 --> 00:32:03,632 కానీ కష్టపడి మెల్లమెల్లగా 569 00:32:03,715 --> 00:32:07,386 మన హృదయాల్లో చోటు సంపాదించుకుని, అక్కడే పాతుకుపోయింది… 570 00:32:08,011 --> 00:32:09,012 జిడ్డులా… 571 00:32:09,096 --> 00:32:11,932 - జిడ్డా? - …వదిలించుకోవడానికి వీలుపడని విధంగా 572 00:32:12,015 --> 00:32:13,851 అక్కడే ఉండిపోయింది అన్నమాట. 573 00:32:15,561 --> 00:32:18,564 అయ్య బాబోయ్. మేరీ. మేరీ, అక్కడే ఆగు. 574 00:32:20,983 --> 00:32:22,067 మేరీ. 575 00:32:22,818 --> 00:32:24,069 మేరీ, నువ్వేం… 576 00:32:26,697 --> 00:32:30,868 ఆత్మల లోకం నుండి మాక్సీన్ ఒక సందేశం పంపింది. 577 00:32:31,535 --> 00:32:36,039 కాబట్టి, మీరందరూ మాకు ఒక నిమిషం ఏకాంతాన్ని ఇస్తే… 578 00:32:36,957 --> 00:32:39,334 వద్దు, వద్దు. ఆ పని మాత్రం చేయకు, మేరీ. మేరీ! 579 00:32:45,716 --> 00:32:47,634 వద్దు. నాకొక నిమిషం ఏకాంతం కావాలంతే. ఒకే ఒక్క నిమిషం. 580 00:32:57,477 --> 00:32:59,980 ఓరి నాయనోయ్! 581 00:33:02,316 --> 00:33:06,737 మిరబెల్ అని ఒకరు నా దగ్గరికి వచ్చారు. 582 00:33:07,863 --> 00:33:09,031 ఆమె… 583 00:33:10,616 --> 00:33:12,409 తన గురించి చింతించవద్దని అంది. 584 00:33:12,492 --> 00:33:14,828 చాలా సరదాగా గడుపుతోందట తను. 585 00:33:15,787 --> 00:33:16,872 నువ్వంటే తనకి చాలా ఇష్టమట. 586 00:33:16,955 --> 00:33:20,250 ఇంకా ఈ ముక్క నాకు అర్థం కాలేదు, కానీ తను ఏమందంటే, 587 00:33:20,334 --> 00:33:24,755 "స్వర్గంలో మగరాయుళ్లు బాగానే ఉన్నారు," అంది. 588 00:33:24,838 --> 00:33:25,923 సరే, మేరీ. 589 00:33:26,006 --> 00:33:28,217 ఇవాళ్టికి ఆత్మల లోకం నుండి తెచ్చిన సందేశాలు చాలు. 590 00:33:28,926 --> 00:33:30,844 ఇక మేము అంత్యక్రియలను కొనసాగిస్తాం. 591 00:33:30,928 --> 00:33:34,640 నిజానికి, నేను చేరవేయాల్సిన సందేశం ఇంకోటి ఉంది. 592 00:33:34,723 --> 00:33:36,308 అక్కర్లేదు. ఇక బయలుదేరు, మేరీ. 593 00:33:38,060 --> 00:33:39,978 మీరందరూ ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. 594 00:33:40,771 --> 00:33:42,523 "అసలు ఇక్కడికి రావాల్సిన అర్హతే నాకు లేదు, 595 00:33:43,398 --> 00:33:45,901 అలాంటిది మాట్లాడటం కూడానా?" అని. కానీ నేను మాట్లాడతాను. 596 00:33:56,703 --> 00:33:59,540 మాక్సీన్, నేను ఇరవై ఏళ్ల పాటు భార్యాభర్తలుగా ఉన్నాం. 597 00:34:01,792 --> 00:34:02,793 తనని నేను చాలా ప్రేమించా. 598 00:34:03,752 --> 00:34:07,256 మాక్సీన్, నేను ఇప్పటి దాకా చేసిన వాటన్నింటికీ 599 00:34:07,339 --> 00:34:09,132 క్షమించమని కోరుతున్నా. 600 00:34:09,882 --> 00:34:13,344 నువ్వు నన్ను ఎంచుకున్నావో, నేనే నిన్ను ఎంచుకున్నానో తెలీదు. 601 00:34:14,471 --> 00:34:17,474 లేదా, ఇద్దరు ఒకే సమయంలో ఒకరినొకరు ఎంచుకుంటే, 602 00:34:17,558 --> 00:34:21,978 ప్రేమ అనేది దానికదే పుట్టేస్తుందేమో. 603 00:34:22,896 --> 00:34:24,063 ఒక లావాదేవీలా. 604 00:34:24,857 --> 00:34:28,193 ఆ అందమైన, అదే సమయంలో బలహీనమైన లావాదేవీ, 605 00:34:28,277 --> 00:34:30,654 - ఏ వ్యక్తి విషయంలో అయినా ఒకేసారి జరుగుతుంది… - దేవుడా. 606 00:34:30,737 --> 00:34:32,739 …కానీ జీవితాంతం ఉండిపోతుంది. 607 00:34:35,033 --> 00:34:39,580 ఆ ఇద్దరూ, ఆ అద్భుతమైన మాయకి తమను తాము అంకితం చేసుకుంటే. 608 00:34:41,415 --> 00:34:42,833 - నన్ను క్షమించు. - డాగ్! 609 00:34:42,916 --> 00:34:44,835 నిన్ను నిరాశపరిచినందుకు క్షమించు. 610 00:34:44,918 --> 00:34:46,587 ఓకే. ఓకే. 611 00:34:47,713 --> 00:34:49,840 ఇంత సెంటిమెంట్ నేను తట్టుకోలేనురా బాబూ. 612 00:34:57,389 --> 00:34:59,892 ఇంకెవరికైనా తమ మనస్సులోని భావాలను పంచుకోవాలనిపిస్తే, 613 00:34:59,975 --> 00:35:01,894 దయచేసి వాటిని అణచివేసుకోండి. 614 00:35:02,728 --> 00:35:05,647 ఇప్పుడు మన షెడ్యూల్ ని కొనసాగిద్దాం, 615 00:35:05,731 --> 00:35:09,318 దాని ప్రకారం, మాక్సీన్ కి అత్యంత ఆప్తుడు, 616 00:35:09,401 --> 00:35:13,989 దేశభక్తుడు, యోధుడు, అమెరికన్ హీరో అయిన, మిస్టర్ రాబర్ట్ డీయజ్ నాలుగు ముక్కలు చెప్తాడు. 617 00:35:31,089 --> 00:35:34,384 మీ అందరి గురించి నాకు తెలీదు కానీ, నాకు అయితే తనని చూడాలన్నా చాలా కష్టంగా ఉంది. 618 00:35:40,682 --> 00:35:43,644 ఇప్పుడు మాక్సీనే మనతో పాటు ఉండుంటే, 619 00:35:45,187 --> 00:35:47,564 బాధను దిగమింగేసుకుని, జీవితంలో ముందుకు సాగమని కోరుకుని ఉండేది. 620 00:35:48,315 --> 00:35:49,441 అవును. 621 00:35:49,525 --> 00:35:52,653 సెంటిమెంటల్ గాథలను, హృదయాన్ని కదిలించే సంఘటనలను 622 00:35:53,320 --> 00:35:55,864 చెప్పుకుంటూ ఉండిపోవాలని తను అనుకోదు. 623 00:35:55,948 --> 00:35:57,616 లేదు, నాకు అలాంటి సంఘటనలంటే చాలా ఇష్టం. 624 00:35:58,158 --> 00:36:03,205 మాక్సీన్ తన భావాలను వ్యక్తపరిచే రకం కాదు, అందరూ వేరేగా అనుకుంటుంటారని నాకు తెలుసు. 625 00:36:03,288 --> 00:36:04,414 అవునా? 626 00:36:04,498 --> 00:36:08,168 కాబట్టి, మాక్సీన్ గురించి ఇంకెప్పుడూ మనం మాట్లాడుకోకూడదని 627 00:36:08,752 --> 00:36:11,713 అందరం గట్టిగా అనుకోవాలని నా విన్నపం. 628 00:36:12,548 --> 00:36:13,799 జీవితం చాలా అంటే చాలా చిన్నది. 629 00:36:17,553 --> 00:36:18,804 థ్యాంక్యూ. 630 00:36:19,555 --> 00:36:25,060 ఇక పామ్ రాయల్ వెయిటర్ల సిబ్బంది మాక్సీన్ ఆత్మని… 631 00:36:26,728 --> 00:36:29,940 స్వర్గలోకం దాకా సాగనంపే ముందు, 632 00:36:30,023 --> 00:36:36,071 అందరం కలిసి మాక్సీన్ కి చాలా ఇష్టమైన పాట పాడదామా? 633 00:36:36,154 --> 00:36:37,698 ఆ పాటలో తన సొంతూరు చాటనూగాను 634 00:36:38,365 --> 00:36:39,366 కీర్తించడం జరుగుతుందన్నమాట. 635 00:36:40,200 --> 00:36:42,035 ఓకే. సరే మరి. 636 00:36:42,119 --> 00:36:45,581 పాట లిరిక్స్, మీ ప్రేయర్ కార్డుల వెనుక ఉన్నాయి. 637 00:36:47,416 --> 00:36:49,751 హలో రైలు పట్టాలు 638 00:36:50,377 --> 00:36:52,796 ఇవేనా రైలు పట్టాలు? 639 00:36:53,755 --> 00:36:56,758 నాకు టెనెసీకి వన్-వే టికెట్ కావాలి 640 00:36:56,842 --> 00:37:00,470 నేను చాటనూగాను వదిలేసి వస్తున్నా 641 00:37:00,554 --> 00:37:04,516 క్షమించండి, అబ్బాయిలూ అది చాటనూగా ఎక్స్ ప్రెస్సా? 642 00:37:08,937 --> 00:37:10,606 నాకు ఆనందాన్ని పంచు, అబ్బాయి 643 00:37:12,149 --> 00:37:13,901 మార్జోరీ మెర్రీవెదర్ పోస్ట్. 644 00:37:16,111 --> 00:37:18,197 మేయర్ ప్రచారం ఎలా సాగుతోంది, డైనాహ్? 645 00:37:18,780 --> 00:37:23,827 ఈ కాలంలో రాజకీయాల్లో ఉంటే బతుకు బస్టాండే అని అర్థమైంది. 646 00:37:23,911 --> 00:37:25,787 నువ్వు హోస్ట్ చేసిన స్క్వేర్ డ్యాన్స్ ఫంక్షన్లో ప్రసంగించిన నాటి నుండి, 647 00:37:25,871 --> 00:37:28,207 ఎవరో మమ్మల్ని బాగా బెదిరిస్తున్నారు. 648 00:37:41,053 --> 00:37:42,054 నువ్వేనా… 649 00:37:43,722 --> 00:37:47,643 బెదిరింపుల లేఖలని పంపుతూ ఉన్నది? 650 00:37:50,187 --> 00:37:51,188 ఎందుకు? 651 00:37:51,271 --> 00:37:54,316 ఎందుకంటే నువ్వు నా డిక్ ని లాగేసుకున్నావు. 652 00:37:54,399 --> 00:37:56,360 - ఏమన్నావు? - నా డిక్. 653 00:37:56,443 --> 00:37:58,403 రిచర్డ్ మిల్హౌస్ నిక్సన్. 654 00:37:58,487 --> 00:37:59,655 నా బంగారు రిక్కీ. 655 00:38:00,155 --> 00:38:01,365 నా చిట్టి డికీ. 656 00:38:01,949 --> 00:38:03,951 నా చిట్టి పొట్టి బంగారం. 657 00:38:05,994 --> 00:38:07,162 నన్ను క్షమించు, 658 00:38:07,246 --> 00:38:09,748 నీకు, అధ్యక్షుడికి మధ్య అంత సాన్నిహిత్యం ఉందని నాకు తెలీదు. 659 00:38:09,831 --> 00:38:11,166 నీకు తెలీదులే. 660 00:38:11,250 --> 00:38:13,627 ఆ తర్వాత కేరొలినాలో చికెన్, గుడ్లు తిందాం 661 00:38:13,710 --> 00:38:17,005 రైలు కూత హై-పిచ్ లో కూసినప్పుడు 662 00:38:17,089 --> 00:38:20,259 టెనెసీ దగ్గర్లోనే ఉందని అర్థమైపోతుంది 663 00:38:20,342 --> 00:38:21,885 బొగ్గునంతా వేసేయ్ 664 00:38:21,969 --> 00:38:26,306 ఈ ప్రపంచంలో మహిళ దగ్గర శక్తి ఉండాలంటే, మూడు విషయాలను తను దక్కించుకోవాలి. 665 00:38:26,890 --> 00:38:29,101 కట్టల కట్టల డబ్బులు, లెక్కలేనన్ని తుపాకులు, 666 00:38:29,184 --> 00:38:32,980 ఇంకా ఈ దేశంలోని శక్తిమంతమైన మగాడి నమ్మకం. 667 00:38:34,231 --> 00:38:37,943 డిక్ అవసరాలను కొన్ని దశాబ్దాల నుండి నేనే చూసుకుంటున్నా. 668 00:38:38,026 --> 00:38:40,070 అతను నిద్రలేచిన తర్వాత నుండి 669 00:38:40,153 --> 00:38:43,657 మళ్లీ పడుకునే దాకా, అతని అవసరాలన్నింటినీ నేనే తీర్చా. 670 00:38:44,449 --> 00:38:47,119 అతనికి ఏం కావాలంటే అది ఇచ్చా. 671 00:38:51,707 --> 00:38:53,584 ఎంత బాగా చూసుకున్నావో! 672 00:38:53,667 --> 00:38:55,836 తెలుసు. నేను పుణ్య స్త్రీని. 673 00:38:56,712 --> 00:38:59,131 దురదృష్టవశాత్తూ, ఎవరో సన్నాసి అతడిని చంపాలని చూశాడు, 674 00:38:59,214 --> 00:39:02,301 ఇప్పుడు అతను పామ్ బీచ్ కి రావాలనే ఆలోచన కూడా చేయట్లేదు! 675 00:39:02,384 --> 00:39:04,261 కాబట్టి, అతడిని మచ్చిక చేసుకోవాలని చూశా. 676 00:39:04,344 --> 00:39:08,223 మార్-అ-లాగోని స్వేచ్ఛ కోసం జరిగే పోరాటానికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పా. 677 00:39:08,807 --> 00:39:10,893 దాన్ని వింటర్ వైట్ హౌస్ గా వాడుతూ, 678 00:39:10,976 --> 00:39:15,022 రియల్ ఎస్టేట్ ముసుగులో మా లోకంలో మేము విహరించవచ్చని ప్లాన్ వేశా. 679 00:39:15,105 --> 00:39:18,483 కానీ, అతను రాకుండా ఉండటానికి గల అసలైన కారణమేంటో ఇప్పుడు తెలిసింది. 680 00:39:18,984 --> 00:39:20,736 అతను రానిది, తుపాకీ చేత పట్టి ఎవరైనా చంపుతారని కాదు. 681 00:39:20,819 --> 00:39:23,197 అంతకన్నా చాలా ప్రమాదకరమైన కారణముంది. 682 00:39:23,280 --> 00:39:24,740 - ఏంటి? నేనా? - నువ్వు. 683 00:39:24,823 --> 00:39:25,824 నువ్వే. 684 00:39:25,908 --> 00:39:28,577 తెల్లని పళ్లు, మంచి ఫిగర్ గల నువ్వే. 685 00:39:28,660 --> 00:39:30,996 హేయ్, క్షమించు, అబ్బాయి 686 00:39:31,079 --> 00:39:33,457 అది చాటనూగా ఎక్స్ ప్రెస్సా? 687 00:39:33,540 --> 00:39:37,419 ట్రాక్ 29 మీదకే వస్తోంది, నేను ఫుల్ హ్యాపీ 688 00:39:37,503 --> 00:39:39,046 నాకు ఆనందాన్ని పంచు, అబ్బాయి 689 00:39:39,129 --> 00:39:41,757 నువ్వు కోపంగా ఉన్నావని అర్థమవుతోంది. 690 00:39:43,634 --> 00:39:45,093 దీనికి ప్రతిఫలంగా ఏం ఇస్తే కోపం తగ్గుతుంది? 691 00:39:45,177 --> 00:39:46,345 ఒక హింట్ ఇస్తా. 692 00:39:46,845 --> 00:39:49,723 దాన్ని నువ్వు పగలగొట్టి, దానిపై పాలు, కొన్ని హెర్బ్స్ పోసినా, 693 00:39:49,806 --> 00:39:51,308 ఆమ్లెట్ రాదు. 694 00:39:52,351 --> 00:39:54,061 ఆక్సెల్ దగ్గరుండే ఫాబర్జే గుడ్డు అన్నమాట. 695 00:39:56,480 --> 00:39:57,648 నిజంగా చెప్తున్నా… 696 00:39:58,315 --> 00:40:01,860 నా ఇంట్లో ఒక్క అంగుళం కూడా మిస్ కాకుండా మొత్తం వెతికాను. 697 00:40:01,944 --> 00:40:03,487 చెప్తున్నా కదా, మేము కూడా వెతికాం. 698 00:40:03,570 --> 00:40:06,657 - మీరు… - అవును. మీ ఇంట్లో మా మనుషులు వెతికారు. 699 00:40:06,740 --> 00:40:09,451 నువ్వు కిచెన్లో దోశలు లాగిస్తున్నప్పుడు, వాళ్ళు అన్నింటినీ ఛిన్నాభిన్నం చేసి వెతికారు, 700 00:40:09,535 --> 00:40:11,161 మళ్లీ ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టేశారు. 701 00:40:12,204 --> 00:40:13,455 నాకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీట్లేదు. 702 00:40:13,539 --> 00:40:16,041 మంచిది. మేము మీ ఇంట్లో అంతా వెతికాక, 703 00:40:16,124 --> 00:40:20,587 స్విట్జర్లాండ్ లో ఆక్సెల్ కి అత్యంత రహస్యమైన లాకర్ ఒకటి ఉందని తెలుసుకున్నాను. 704 00:40:21,672 --> 00:40:26,134 ఆ ఆఖరి రాచరిక గుడ్డు ఇక అక్కడే ఉండాలి. 705 00:40:26,218 --> 00:40:30,848 కాబట్టి, నేను స్విట్జర్లాండ్ కి వెళ్లి, ఆ గుడ్డును తెస్తే, నన్ను క్షమించేస్తావా? 706 00:40:30,931 --> 00:40:32,349 క్షమించేస్తా. 707 00:40:35,269 --> 00:40:36,770 ఒకవేళ ఆ గుడ్డును నేను తీసుకురాలేకపోతే? 708 00:40:36,854 --> 00:40:38,647 - నిన్ను చంపేస్తా. - ఏంటి? 709 00:40:38,730 --> 00:40:39,731 జనం దృష్టిలో నీ వ్యక్తిత్వాన్నిలే. 710 00:40:39,815 --> 00:40:41,817 నువ్వు నిక్సన్ ఉంపుడుగత్తెవని అందరికీ చెప్పేస్తా. 711 00:40:41,900 --> 00:40:44,152 - కానీ దాని వల్ల నిక్సన్ కి చెడ్డ పేరు రాదా? - రాదు. 712 00:40:44,236 --> 00:40:46,238 మగాడు ఏం చేసినా ఈ లోకం పట్టించుకోదు. 713 00:40:46,738 --> 00:40:47,739 మహిళ చేసినవే కావాలి. 714 00:40:47,823 --> 00:40:50,492 ఆ మచ్చని నువ్వు జీవితాంతం మోయాల్సి ఉంటుంది. 715 00:40:54,872 --> 00:40:55,998 గుడ్డు. 716 00:40:56,957 --> 00:40:59,168 - క్షమించు, అబ్బాయి - అందరూ పాడాలి! 717 00:40:59,251 --> 00:41:01,795 అది చాటనూగా ఎక్స్ ప్రెస్సా? 718 00:41:01,879 --> 00:41:04,840 ట్రాక్ 29 మీదకే వస్తోంది 719 00:41:04,923 --> 00:41:07,384 నాకు ఆనందాన్ని పంచు, అబ్బాయి 720 00:41:07,467 --> 00:41:09,928 ఎక్కువ ఆనందాన్ని పంచు 721 00:41:23,108 --> 00:41:24,109 హలో, నేస్తమా. 722 00:41:25,402 --> 00:41:26,862 నీకొక సందేశం చేరవేయడానికి వచ్చా. 723 00:41:27,988 --> 00:41:28,989 నార్మా చేరవేయమని చెప్పింది. 724 00:41:30,282 --> 00:41:32,659 "ఇంటికి వెళ్లు. వెంటనే." 725 00:41:32,743 --> 00:41:35,245 నేను జోకర్ ముఖం అని అనే దాన్ని 726 00:41:35,746 --> 00:41:39,541 ఇక తను ఏడ్చేది నేను తనకి చెప్పేదాకా, నా ఉద్దేశం… 727 00:41:52,596 --> 00:41:53,597 నార్మా. 728 00:42:00,896 --> 00:42:03,023 వర్జీనియా. వర్జీనియా. 729 00:42:03,106 --> 00:42:05,442 ఆన్, అంత్యక్రియలకు వచ్చిన వారితో కూర్చోమన్నా కదా నిన్ను. 730 00:42:05,526 --> 00:42:06,902 తను ఇప్పుడే లేడీస్ బాత్రూమ్ కి వెళ్లింది. 731 00:42:06,985 --> 00:42:07,986 ముసుగేసుకున్న నార్మా. 732 00:42:08,862 --> 00:42:09,863 అదుగో! 733 00:42:15,953 --> 00:42:19,039 నార్మా నా కళ్లెదుటే ఉంది. అనుమానితురాలు ఇక్కడికి వచ్చింది. 734 00:42:19,122 --> 00:42:20,707 ఎక్కడి వాళ్లక్కడే అప్రమత్తంగా ఉండండి. 735 00:42:41,854 --> 00:42:42,855 దొరికావే! 736 00:42:56,201 --> 00:42:57,286 హేయ్. 737 00:42:57,369 --> 00:42:58,370 బ్రూస్? 738 00:42:58,912 --> 00:43:00,789 కాల్చవద్దు! దయచేసి ఎవరూ కాల్చవద్దు! 739 00:43:00,873 --> 00:43:02,124 తుపాకులను దించేయండి. 740 00:43:03,125 --> 00:43:04,376 ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? 741 00:43:04,459 --> 00:43:05,878 నువ్వు చెప్పిన పనే. 742 00:43:09,673 --> 00:43:10,883 నేను మాట్లాడాలనుకుంటున్నా, అంతే. 743 00:43:12,384 --> 00:43:13,760 అతనితో మాట్లాడాలనుకుంటున్నా, అంతే. 744 00:43:13,844 --> 00:43:15,262 రాక్, దయచేసి నా మాట విను. 745 00:43:16,054 --> 00:43:17,097 రాక్, వెళ్లిపోకు. 746 00:43:18,098 --> 00:43:19,933 న్యాన్సీ, నువ్వు బ్రహ్మ రాక్షసివి! 747 00:43:20,976 --> 00:43:22,519 చెప్పేది జాగ్రత్తగా విను, రాక్ హడ్సన్. 748 00:43:22,603 --> 00:43:24,354 తను నీకు స్నేహితురాలు కాదు! 749 00:43:24,438 --> 00:43:26,440 తను కూడా సాదాసీదా నటే! 750 00:43:26,523 --> 00:43:28,317 కానీ మహా పనికిమాలినది! 751 00:43:28,400 --> 00:43:31,236 న్యాన్సీ రీగన్, కష్టాల్లో తోడు ఉండే రకం కాదు! 752 00:43:31,320 --> 00:43:32,321 రిలాక్స్ అవ్వండి. 753 00:43:32,404 --> 00:43:33,822 మనకి కావాల్సిన మనిషి కాదు. 754 00:43:33,906 --> 00:43:36,742 రాక్! రాక్! 755 00:43:36,825 --> 00:43:38,327 నేను వివరణ ఇస్తాను. 756 00:43:40,078 --> 00:43:41,079 విషయం ఏంటంటే… 757 00:43:41,580 --> 00:43:43,457 నా చేత బలవంతంగా ఇలా… 758 00:43:43,540 --> 00:43:45,000 ఇది విచిత్రంగా అనిపించవచ్చు. 759 00:43:45,083 --> 00:43:48,462 ఇలా ఫెడరల్ ప్రభుత్వం వాళ్లే చేయించారు. నాకు వాళ్లే చేయమని చెప్పారు ఇలా… 760 00:43:48,545 --> 00:43:50,714 వీళ్లందరికీ చెప్పు, వర్జీనియా! చెప్పు! 761 00:43:50,797 --> 00:43:53,050 వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. 762 00:43:53,133 --> 00:43:56,803 రేపు ఉదయం 11 గంటలకి బయటి వాళ్లు కూడా వచ్చి స్విమ్మింగ్ లో పాల్గొనవచ్చు. 763 00:44:02,351 --> 00:44:04,436 నువ్వు చనిపోయావని నన్ను కూడా నమ్మించావా? 764 00:44:04,520 --> 00:44:05,896 నేను అస్సలు అనుకోలేదు… 765 00:44:05,979 --> 00:44:07,731 ఇక నా మానాన నన్ను బతకనివ్వు. 766 00:44:11,985 --> 00:44:13,070 డగ్లస్. 767 00:44:22,996 --> 00:44:23,997 నార్మా. 768 00:44:53,819 --> 00:44:57,322 ఈ ఇంటిని అందరూ నరకంగా మారుస్తుంటే, నువ్వు నిజంగానే పట్టించుకోలేదు, కదా? 769 00:44:58,949 --> 00:45:01,743 నార్మా, ఊరు ఊరంతా నీ కోసం గాలిస్తోంది. 770 00:45:02,536 --> 00:45:04,121 ఎఫ్.బి.ఐ. నీ కోసం గాలిస్తోంది. 771 00:45:04,621 --> 00:45:07,124 టర్బన్ ని వదిలేశా, మూమూ డ్రెస్సును కూడా వదిలేశా. 772 00:45:07,791 --> 00:45:11,044 ఒక పండు ముసలమ్మని ఎవరు పట్టించుకుంటారులే. 773 00:45:12,588 --> 00:45:14,965 ఈ డ్రెస్సులో మర్డర్ చేసి కూడా తప్పించుకోగలను. 774 00:45:16,675 --> 00:45:17,968 నేను నిన్ను పోలీసులకు అప్పగించాలి. 775 00:45:18,051 --> 00:45:19,595 కానీ నువ్వు ఆ పని చేయవు. 776 00:45:20,554 --> 00:45:22,431 మనిద్దరం కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లం. 777 00:45:23,056 --> 00:45:24,308 ఇక్కడికి ఎందుకు వచ్చావు? 778 00:45:25,475 --> 00:45:26,476 బంగారం, 779 00:45:27,603 --> 00:45:29,479 నీ ముఖంలో కనిపిస్తోంది. 780 00:45:30,189 --> 00:45:33,192 ఈ ఊరు నీ పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తోంది. 781 00:45:33,817 --> 00:45:37,905 ఇక్కడి నుండి నీకు విముక్తి కలిగించడానికే నేను వచ్చా. 782 00:45:38,530 --> 00:45:43,452 నేను మొదట్నుంచీ నిన్ను నా కొడుకులానే చూశానని తెలీలేదా నీకు? 783 00:45:46,205 --> 00:45:49,374 పద, ఇక్కడి నుండి వెళ్లిపోదాం. 784 00:45:52,794 --> 00:45:53,795 అలాగే, అమ్మా. 785 00:45:56,048 --> 00:45:57,049 చేయి ఇవ్వు. 786 00:46:09,561 --> 00:46:12,898 మిసెస్ మార్టినెజ్, మా దర్యాప్తు ముగిసింది. 787 00:46:13,649 --> 00:46:15,651 మా తుది పరిశీలనా రిపోర్ట్ అంతా ఇందులో ఉంది. 788 00:46:16,360 --> 00:46:17,528 ఓరి దేవుడా. 789 00:46:19,363 --> 00:46:20,364 ఎవెలిన్? 790 00:46:22,824 --> 00:46:23,909 ఏం జరుగుతోంది? 791 00:46:23,992 --> 00:46:26,995 పూల్ లో శవం తేలింది, 792 00:46:27,079 --> 00:46:29,748 మాక్సీన్ శవపేటిక నుండి లేచి, ఎఫ్.బి.ఐ. వాళ్ల రహస్య ఆపరేషన్ ని చెడగొట్టింది, 793 00:46:29,831 --> 00:46:33,460 ఇప్పుడు పామ్ రాయల్ పన్నుల రూపంలో ఎనభై లక్షల డాలర్లు చెల్లించాలి, 794 00:46:33,544 --> 00:46:35,796 కాబట్టి ఆ బకాయి చెల్లించేదాకా ఐఆర్ఎస్ వాళ్లు పామ్ రాయల్ ని సీజ్ చేసేస్తున్నారు. 795 00:46:35,879 --> 00:46:36,964 జరుగుతోంది అదే. 796 00:46:37,047 --> 00:46:38,799 ఈసారి అబద్ధం చెప్పనందుకు సంతోషం. 797 00:46:38,882 --> 00:46:41,885 ఎఫ్.బి.ఐ. వాళ్లతో కలిసి పని చేసినందుకు క్షమించు. నాదే తప్పు. 798 00:46:41,969 --> 00:46:43,971 నా మొగుడు మంచి వాడు అనిపించుకోవాలని ఏమీ పట్టనట్టు ఉంటే, 799 00:46:44,054 --> 00:46:45,806 మన జీవితాలని బాగుపరిచే బాధ్యత నేనే తీసుకున్నా, అందుకు సారీ. 800 00:46:47,182 --> 00:46:49,017 అలా అనడం సబబు కాదు. 801 00:46:49,101 --> 00:46:50,686 పామ్ రాయల్ కథ ముగిసింది. 802 00:46:50,769 --> 00:46:52,771 ఇంత ప్రతికూల పరిస్థితి నుండి మనం బయటపడలేం, 803 00:46:52,855 --> 00:46:55,983 అంతేగాక ఈ సమస్య నుండి కూడా మనల్ని గట్టెక్కించడానికి నేనే ఏదోకటి చేయాలి! 804 00:46:56,066 --> 00:46:58,819 నువ్వు అలా జరగాలని కోరుకున్నావు కాబట్టే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైంది. 805 00:46:58,902 --> 00:47:00,487 ఎందుకంటే, నీకు అలా జరగడమే ఇష్టం! 806 00:47:01,029 --> 00:47:02,865 నువ్వు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం ఆపు ముందు, సరేనా? 807 00:47:02,948 --> 00:47:06,577 నువ్వు జెడ్ కి కాస్త ఆ పూల్ ని శుభ్రం చేయమని చెప్పు, సరేనా? 808 00:47:08,120 --> 00:47:10,122 ఆ పూల్ ని నువ్వే శుభ్రం చేసుకో. 809 00:47:20,090 --> 00:47:21,341 సిటీ సెంటర్ 810 00:47:21,425 --> 00:47:22,634 వెస్ట్ పామ్ బీచ్ 811 00:47:27,848 --> 00:47:29,183 ఎక్కడికి వెళ్తున్నావు? 812 00:47:29,933 --> 00:47:30,934 నాతో మాట్లాడకు. 813 00:47:31,018 --> 00:47:32,519 ఏంటి? నేనేం చేశా? 814 00:47:32,603 --> 00:47:34,188 రాక్, నాకొకటి చెప్పమని రిసెప్షన్ వాళ్లకి చెప్పాడట. 815 00:47:35,105 --> 00:47:36,440 నన్ను ఇక జీవితంలో చూడడట. 816 00:47:37,357 --> 00:47:38,859 నువ్వు చేసింది సరైన పనే. 817 00:47:40,277 --> 00:47:41,278 నువ్వన్నది నిజమే, 818 00:47:41,862 --> 00:47:43,113 అయినా కానీ నాకు చాలా బాధగా ఉంది. 819 00:47:43,197 --> 00:47:44,489 కాబట్టి, థ్యాంక్స్. 820 00:47:47,409 --> 00:47:48,911 మళ్లీ కలుస్తా. కలుస్తానేమో. 821 00:47:49,995 --> 00:47:52,247 ఓకే. బై. 822 00:48:00,631 --> 00:48:01,715 డగ్లస్. 823 00:48:03,175 --> 00:48:05,302 మిరబెల్ విషయంలో జరిగింది ఏంటో 824 00:48:06,720 --> 00:48:07,721 వర్జీనియా నాకు చెప్పింది. 825 00:48:07,804 --> 00:48:09,139 కాబట్టి… 826 00:48:09,223 --> 00:48:12,893 కాబట్టి నేను… నేను తన అస్తికలని తెచ్చా. నీకు… నీకు వీటిని ఇవ్వాలనిపించింది. 827 00:48:14,478 --> 00:48:19,191 నువ్వు మొదట్నుంచీ కావాలనుకుంది ఒక కుటుంబాన్నే అని నాకు తెలుసు, మాక్స్. నన్ను… నన్ను క్షమించు. 828 00:48:22,236 --> 00:48:23,237 నా… 829 00:48:24,321 --> 00:48:25,572 నా హృదయాన్ని టచ్ చేశావు… 830 00:48:41,964 --> 00:48:43,131 జెడ్? 831 00:48:43,924 --> 00:48:44,925 ఇది నా 832 00:48:45,968 --> 00:48:47,094 వ్యక్తిగత రూమ్. 833 00:48:48,512 --> 00:48:49,721 నువ్వు ఇక్కడికి రాకూడదు. 834 00:48:50,305 --> 00:48:53,725 మీకు ఏమైనా కావాలేమో అని వచ్చాను. 835 00:48:54,268 --> 00:48:56,144 పూల్ ని శుభ్రం చేశావా? 836 00:49:01,358 --> 00:49:02,359 బహుశా చేశానేమో. 837 00:49:04,152 --> 00:49:05,529 బహుశా చేయలేదేమో. 838 00:49:14,162 --> 00:49:15,163 బాబోయ్. 839 00:49:22,212 --> 00:49:23,797 పైకి ఎక్కవచ్చా? 840 00:49:23,881 --> 00:49:25,174 ఎక్కవచ్చు. 841 00:49:38,228 --> 00:49:40,898 మిరబెల్ అస్తికలు తెచ్చి ఇచ్చినందుకు థ్యాంక్స్. 842 00:49:42,149 --> 00:49:44,860 ఈ పరిస్థితుల్లో కూడా 843 00:49:45,402 --> 00:49:47,654 నువ్వు ఇలా తెచ్చిచ్చావంటే, అది గొప్ప విషయమే. 844 00:50:06,048 --> 00:50:07,090 మాక్సీన్? 845 00:50:08,884 --> 00:50:09,885 చెప్తున్నా కదా. 846 00:50:11,970 --> 00:50:13,222 ఇక్కడే తను ఆనందంగా ఉంటుంది. 847 00:50:21,146 --> 00:50:22,898 మాక్సీన్, నేను నిన్ను ఒకటి అడగాలి. 848 00:50:22,981 --> 00:50:26,151 నేను స్విట్జర్లాండ్ కి వెళ్తున్నా, నువ్వు కూడా నాతో పాటు రాగలవా? 849 00:50:27,402 --> 00:50:29,905 నిజానికి, నువ్వు తప్పనిసరిగా నాతో రావాలి. 850 00:50:29,988 --> 00:50:31,698 నువ్వు అక్కడ వ్యక్తిగతంగా ఉండాల్సిన అవసరముంది, 851 00:50:32,991 --> 00:50:35,702 ఎందుకంటే, బేబీ ట్రస్టుపై నీకు హక్కు లేదని నువ్వు ఒక పత్రంపై సంతకం చేయాలి. 852 00:50:36,203 --> 00:50:39,456 అది… అది కేవలం ఫార్మాలిటీకే. 853 00:50:40,290 --> 00:50:42,292 అంటే, మనిద్దరం ఒకప్పుడు భార్యాభర్తలం కదా. 854 00:50:43,752 --> 00:50:46,213 ఇలా ఆఖరి నిమిషంలో చెప్తున్నందుకు సారీ. 855 00:50:46,296 --> 00:50:51,426 నువ్వు చనిపోయావని మేము అనుకున్నప్పుడు, ఇది అక్కర్లేకుండా పోయింది, కానీ నువ్వు బతికే ఉన్నందున… 856 00:50:58,976 --> 00:51:01,937 అంత్యక్రియల్లో నువ్వేం చెప్పావో విన్నా. 857 00:51:05,190 --> 00:51:06,233 నన్ను ప్రేమిస్తున్నావని అన్నది విన్నా. 858 00:51:07,401 --> 00:51:10,070 నిన్ను క్షమించేస్తున్నా. 859 00:51:11,488 --> 00:51:12,865 నిన్ను కూడా ప్రేమిస్తున్నా. 860 00:51:15,325 --> 00:51:16,410 అసలు ఇదంతా… 861 00:51:17,119 --> 00:51:18,787 చాలా దూరం వెళ్లిపోయింది. నాకు… 862 00:51:19,454 --> 00:51:21,790 నాకు ఇవాళ చాలా ఫీలింగ్స్ కలుగుతున్నాయి, కాబట్టి నేను… నేను… 863 00:51:23,083 --> 00:51:25,002 నేను ఇంటికి వెళ్లి ఫీలింగ్స్ ని ఆపుకోవాలి. 864 00:51:26,712 --> 00:51:28,463 ఇంతకీ నువ్వు అన్న మాటలన్నీ నిజాలేనా? 865 00:51:50,068 --> 00:51:51,195 దీన్ని బట్టి నిజమే అని అనుకుంటున్నా. 866 00:51:51,820 --> 00:51:53,071 నేను కూడా స్విట్జర్లాండ్ కి వస్తా. 867 00:51:54,948 --> 00:51:56,116 ఒక్క నిమిషం ఆగు. స్విట్జర్లాండ్? 868 00:51:58,452 --> 00:52:01,413 నార్మా తొలి నేరం చేసింది అక్కడే. 869 00:52:02,456 --> 00:52:03,582 మాక్స్… 870 00:52:09,338 --> 00:52:10,797 ఇంకో రౌండుకు రెడీయా? 871 00:52:11,548 --> 00:52:13,258 వెళ్లి పూల్ ని శుభ్రం చేయి. 872 00:52:14,551 --> 00:52:15,636 ఇక అంతే, జెడ్. 873 00:52:17,638 --> 00:52:18,680 అయ్యయ్యో. 874 00:52:31,527 --> 00:52:34,488 - వెళ్లి గంగలో దూకు, మాక్సీన్. - తను నీ మీద గుర్రుగా ఉంది. 875 00:52:34,571 --> 00:52:37,282 - హా, అది తెలుస్తోంది. - ఇవాళ నా ఉద్యోగం పోయినంత పనైంది, తెలుసా? 876 00:52:37,366 --> 00:52:39,201 నేనే తెల్లవాడిని అయ్యి ఉంటే, పోయి ఉండేదే ఏమో. 877 00:52:39,284 --> 00:52:41,370 ఎఫ్.బి.ఐలో జాత్యాహంకారం ఉందని ఎవరైనా ఆరోపించినప్పుడు, 878 00:52:41,453 --> 00:52:43,247 నన్ను చూపవచ్చనే ఏకైక ఉద్దేశంతో నన్ను ఉంచుకుంటున్నారు. 879 00:52:43,330 --> 00:52:44,831 దయచేసి నన్ను క్షమించు. 880 00:52:44,915 --> 00:52:46,542 తన మనస్సేం బాగా లేదు. 881 00:52:47,709 --> 00:52:48,794 మాక్సీన్. 882 00:52:50,671 --> 00:52:51,880 హలో, మేరీ. 883 00:52:53,006 --> 00:52:54,091 వర్జీనియా, 884 00:52:54,967 --> 00:52:57,928 నువ్వు ఇప్పుడు చట్ట పరిరక్షణ శాఖలో పని చేస్తున్నావు కాబట్టి, 885 00:52:58,011 --> 00:53:00,597 ఒకరు తప్పిపోయారని ఫిర్యాదు చేయడానికి వచ్చా. 886 00:53:00,681 --> 00:53:02,224 అవునా? ఎవరు? 887 00:53:02,307 --> 00:53:03,308 నేనే! 888 00:53:04,476 --> 00:53:07,646 మూడు రోజులుగా… 889 00:53:09,231 --> 00:53:12,109 నా ఇంట్లో 890 00:53:12,192 --> 00:53:14,486 - నేను బందీగా ఉన్నా… - ఏంటి? 891 00:53:14,570 --> 00:53:18,198 …అది కూడా మీరు పట్టుకోవాలని చూస్తున్న హంతకురాలే 892 00:53:18,282 --> 00:53:22,244 నన్ను బందీగా ఉంచింది, 893 00:53:22,995 --> 00:53:24,538 కానీ ఎవరూ పట్టించుకోలేదు. 894 00:53:24,621 --> 00:53:28,333 పాపం మేరీ ఏమైందా అని ఒక్కరు కూడా తన కోసం వెతికే ప్రయత్నం చేయలేదు. 895 00:53:29,126 --> 00:53:30,377 ఇంతలో, 896 00:53:31,086 --> 00:53:33,797 నా దెయ్యం లవర్ కనిపించకుండా పోయాడు. 897 00:53:35,966 --> 00:53:42,890 నార్మా వచ్చి నన్ను బందీగా చేసుకున్న మరుక్షణం, 898 00:53:43,473 --> 00:53:45,684 కలకాలం నిలిచే నిజమైన ప్రేమని 899 00:53:45,767 --> 00:53:49,730 కనుగొనడానికి నాకున్న ఏకైక అవకాశం కాస్తా ఆవిరైపోయింది. 900 00:53:50,981 --> 00:53:52,649 నాకు ప్రేమ ఎప్పుడు దక్కుతుంది? 901 00:53:54,318 --> 00:53:55,652 ఎప్పుడు? 902 00:53:56,528 --> 00:54:00,157 అది… అది నాకు తెలీదు. కానీ మనం నార్మా గురించి మాట్లాడుకుందామా? 903 00:54:00,240 --> 00:54:02,618 ఇందాక, తను… తను మీ ఇంట్లో ఉంది అని అన్నావా? 904 00:54:03,952 --> 00:54:04,953 ఉండింది. 905 00:54:05,037 --> 00:54:06,038 ఇప్పుడు వెళ్లిపోయింది. 906 00:54:06,788 --> 00:54:12,711 ఇంటికి వెళ్లిపొమ్మనే సందేశాన్ని రాబర్ట్ కి చేరవేయమంది, నేను ఆ పని చేశా. 907 00:54:13,420 --> 00:54:15,839 ఇప్పుడు నాకు స్వేచ్ఛ లభించింది. మీ వల్లేం కాదులే, 908 00:54:15,923 --> 00:54:19,593 ఇక నేను వెళ్లి నా దెయ్యం లవర్ ని వెతుక్కుంటా. 909 00:54:24,932 --> 00:54:26,183 ఇక అక్కర్లేదులే. 910 00:54:27,142 --> 00:54:32,105 "చట్ట పరిరక్షణ శాఖ" నుండి నాకు ఏ సాయమూ అక్కర్లేదు. 911 00:54:33,857 --> 00:54:35,526 ఆత్మ చాలా శక్తిమంతంగా ఉంది, 912 00:54:36,735 --> 00:54:39,196 తనే నాకు దారి చూపుతుంది. 913 00:54:44,451 --> 00:54:46,119 మనం డెలాకోర్ట్ బంగళాకి వెళ్ళాలి. 914 00:54:48,789 --> 00:54:50,123 నార్మా చాలా తెలివైనది. 915 00:54:53,126 --> 00:54:54,169 వాళ్లు అక్కడ లేరు. 916 00:54:55,003 --> 00:54:56,839 వాళ్లిద్దరూ వెళ్లిపోయారు. 917 00:54:56,922 --> 00:54:58,006 ఇద్దరా? 918 00:54:58,090 --> 00:54:59,967 నార్మా, ఇంకా రాబర్ట్. మీకు అర్థం కాలేదా? 919 00:55:00,050 --> 00:55:02,761 ఈ ఊరంతా తనని పట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే, 920 00:55:03,428 --> 00:55:05,973 తను అందరి కళ్లుగప్పి వచ్చి, అతడిని తీసుకెళ్లింది… 921 00:55:06,056 --> 00:55:07,391 - తన జాడని ట్రేస్ చేయలేని చోటికి. - అవును. 922 00:55:07,474 --> 00:55:09,434 ఆల్ప్స్ కి మేరీతో పాటు తను సెలవులకని వెళ్లే చోటికి. 923 00:55:09,518 --> 00:55:11,645 రాబర్ట్ ని, తన పెయింటింగ్స్ పంపమన్న చోటికి. 924 00:55:12,563 --> 00:55:13,605 స్విట్జర్లాండ్ కి! 925 00:55:56,273 --> 00:55:58,525 "ప్రియమైన జెడ్, కడ దాకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. 926 00:55:59,234 --> 00:56:00,777 నీ మిట్జీ." 927 00:56:02,738 --> 00:56:03,739 వావ్, 928 00:56:05,282 --> 00:56:07,784 ఇది చాల్లే. 929 00:56:13,498 --> 00:56:15,876 ఇవాళ కాస్త కష్టంగానే జరిగిందని తెలుసు, 930 00:56:15,959 --> 00:56:18,921 కానీ నేను డగ్లస్, మిట్జీలతో స్విట్జర్లాండ్ కి వెళ్తున్నా. 931 00:56:19,505 --> 00:56:20,714 పూర్తిగా పని మీదే. 932 00:56:21,465 --> 00:56:23,800 కానీ నువ్వు నా సంరక్షకురాలివి కనుక, 933 00:56:24,384 --> 00:56:28,347 నేను ప్రయాణించాలంటే నీ అనుమతి కావాలి. ఒక సంతకం పెడితే సరిపోతుంది. 934 00:56:28,430 --> 00:56:30,224 మిట్జీతోనా? వామ్మోయ్. 935 00:56:31,099 --> 00:56:32,309 తప్పదు మరి. 936 00:56:32,392 --> 00:56:33,977 నీకు ఇంకా మంచి ఆప్షన్ ఇస్తా, మాక్సీన్. 937 00:56:34,728 --> 00:56:35,729 నేను కూడా నీతో వస్తా. 938 00:56:36,480 --> 00:56:41,235 ఎడీ, నేను కొంతకాలం దూరంగా ఉంటే ఇద్దరికీ మంచిది, స్విట్జర్లాండ్ ఆ అవకాశం ఇస్తుంది. 939 00:56:50,702 --> 00:56:52,037 మిరబెల్ అంది, 940 00:56:53,622 --> 00:56:55,999 హంతకుడు పూల్ దగ్గర ఉంటాడని. 941 00:56:58,377 --> 00:56:59,378 అవును. 942 00:56:59,920 --> 00:57:02,589 ఇక్కడ బలమైన శక్తి ఉన్నట్టు తెలుస్తోంది. 943 00:57:05,425 --> 00:57:07,636 మాక్సీన్ హంతకుడా, 944 00:57:08,762 --> 00:57:10,222 నా ముందుకు వచ్చి నిలబడు. 945 00:57:21,400 --> 00:57:22,818 నా చెలికాడా. 946 00:57:23,443 --> 00:57:24,570 ఎట్టకేలకు. 947 00:57:26,113 --> 00:57:27,281 ఏమైపోయావు ఇంత కాలం? 948 00:57:29,575 --> 00:57:30,909 నిన్ను మిస్ అయ్యా. 949 00:58:32,012 --> 00:58:34,014 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్