1
00:00:08,469 --> 00:00:11,972
భయం అనేది చెడు కోసం
2
00:00:11,972 --> 00:00:16,602
ఎదురుచూడడం నుంచి ఉత్పన్నమయ్యే బాధ
3
00:00:16,602 --> 00:00:22,024
{\an8}అరిస్టాటిల్
4
00:00:22,024 --> 00:00:24,693
అరిష్టం
5
00:00:34,828 --> 00:00:37,706
- ఇవాలి పాఠానికి మీరు సిద్ధమా?
- అవును, సర్.
6
00:00:37,706 --> 00:00:41,502
అయితే మీ నాన్న మాట విని,
నాతో పాటు చెప్పండి.
7
00:00:43,504 --> 00:00:46,423
- నేను ఎదగను
- నేను ఎదగను
8
00:00:46,423 --> 00:00:49,218
- నాకు బడికి వెళ్లాలని లేదు
- నాకు బడికి వెళ్లాలని లేదు
9
00:00:49,468 --> 00:00:52,346
- చిలుకలా ఉండేందుకే నేర్చా
- చిలుకలా ఉండేందుకే నేర్చా
10
00:00:52,346 --> 00:00:55,307
- ఓ కొంటె నియమం పఠిస్తా
- ఓ కొంటె నియమం పఠిస్తా
11
00:00:55,307 --> 00:00:58,393
ఎదగడం అంటే ఉంటుంది ఇలాగే
12
00:00:58,519 --> 00:01:01,396
చెట్టు ఎక్కడం అనేది నా పరువు తక్కువ
13
00:01:02,773 --> 00:01:06,819
{\an8}ధెం: ద స్కేర్
14
00:01:17,371 --> 00:01:19,832
లాస్ ఏంజెల్స్
1991
15
00:01:43,230 --> 00:01:45,774
ఫ్రిజ్ నుంచి వెనక్కు పో.
16
00:01:46,733 --> 00:01:47,651
హ్యాపీ బర్త్‌డే.
17
00:01:47,651 --> 00:01:49,820
నీపట్ల మీ నాన్న ఎంతో గర్వపడతారు.
18
00:01:49,820 --> 00:01:51,321
- థాంక్స్, అమ్మా.
- కెల్విన్!
19
00:01:51,321 --> 00:01:53,657
మీ అమ్మ పనికి వెళ్లే ముందే ఆమెను పలకరించు.
20
00:01:53,657 --> 00:01:55,534
పుట్టినరోజు శుభాకాంక్షలు, అమ్మా.
21
00:01:58,954 --> 00:02:00,581
అత్యవసరం అత్యవసరం
1227 ఈ 35వ వీధి
22
00:02:01,582 --> 00:02:03,417
సరే. వెళ్లాలి.
23
00:02:04,543 --> 00:02:05,878
నువ్వంటే ఇష్టం.
24
00:02:08,797 --> 00:02:09,965
{\an8}జాగ్రత్తగా ఉండు.
25
00:02:24,813 --> 00:02:28,483
{\an8}1227, ఈస్ట్ 35వ వీధి.
ఆగ్నేయ మూల. ఒంటరి కుటుంబ నివాసం.
26
00:02:28,483 --> 00:02:31,695
ఒలింపిక్‌లో ఎల్ చాటో,
నగరంలో మంచి అల్పాహార బురిటో, బాస్.
27
00:02:31,695 --> 00:02:34,156
నేర ప్రదేశంలో తిండి వద్దు.
నన్ను బాస్ అనకు.
28
00:02:34,156 --> 00:02:36,950
నీకు చెప్పాగా, నేస్తం.
ఆమెది నేను తీసుకుంటాను.
29
00:02:37,367 --> 00:02:38,493
రాత్రి ఆలస్యమైందా?
30
00:02:39,077 --> 00:02:40,954
ఆలస్యమయ్యావని అడిగానంతే.
31
00:02:40,954 --> 00:02:42,748
నువ్వు వెధవవి కాబట్టి అడిగావు.
32
00:02:42,748 --> 00:02:44,124
రెస్పాండింగ్ ఆఫీసరువా?
33
00:02:44,124 --> 00:02:46,335
ఉ. 6:30 కి కొంచెం ముందు కాల్ వచ్చింది.
34
00:02:46,335 --> 00:02:48,795
మృతురాలు మిస్ బెర్నీస్ మాట్,
ఆశ్రమంలో ఆయా.
35
00:02:48,795 --> 00:02:49,838
కాల్ చేసిందెవరు?
36
00:02:49,838 --> 00:02:52,174
పిల్లలలో ఒకరు. మాల్కమ్, వయసు 16.
37
00:02:52,174 --> 00:02:53,425
మాల్కమ్ ఎక్కడ?
38
00:02:53,425 --> 00:02:56,178
విచారణకు పీఏబీ కి పంపించాం.
సాక్షిగా మాత్రమే.
39
00:02:56,428 --> 00:02:57,429
ఇప్పటికి.
40
00:02:57,554 --> 00:02:58,513
మరి మిగతా పిల్లలు?
41
00:02:59,348 --> 00:03:01,183
నగరకేంద్రంలో డీసీఎఫ్ఎస్ దగ్గర.
42
00:03:01,767 --> 00:03:02,809
అర్థమైంది.
43
00:03:02,935 --> 00:03:04,019
ధన్యవాదాలు.
44
00:03:06,438 --> 00:03:08,815
వసారా లైట్, బయట లైట్ వెలగడం లేదు.
45
00:03:08,815 --> 00:03:12,027
సమీప వీధి లైటుకు
ఉత్తరాన దాదాపు 60 అడుగుల దూరం.
46
00:03:17,157 --> 00:03:18,325
ఓరి బాబోయ్.
47
00:03:22,037 --> 00:03:23,538
ప్రధాన ఫ్యూజ్ పోయింది.
48
00:03:35,175 --> 00:03:37,678
ముందు తలుపుపై
బలవంతపు ప్రవేశ ఆనవాళ్లు లేవు.
49
00:03:39,304 --> 00:03:43,266
నివాస, భోజన గదులలో
కర్టెన్‌లు లాగి ఉన్నాయి.
50
00:03:45,852 --> 00:03:51,566
పైకప్పు, గోడల మీద
చెమ్మ పట్టి ఉంది.
51
00:03:53,944 --> 00:03:57,864
ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో,
ఆమె మంచి లే-జీ-బోయ్ వస్తువులు కొనలేదా?
52
00:03:57,864 --> 00:04:00,534
- వచ్చినప్పుడు ఇంత వేడిగా ఉందా?
- ఇంకా ఎక్కువ.
53
00:04:00,659 --> 00:04:02,411
థర్మోస్టాట్ 32 డిగ్రీలకు పెంచారు.
54
00:04:09,751 --> 00:04:13,255
భోజన గదిలో గోడ మీద
నక్షత్ర ఆకార గడియారం ఉంది.
55
00:04:14,297 --> 00:04:16,258
3:17 కి ఆగిపోయింది.
56
00:04:17,634 --> 00:04:19,052
అద్దం పగిలింది.
57
00:04:19,928 --> 00:04:21,221
పోరాడిన సంకేతమా?
58
00:04:27,019 --> 00:04:29,604
భోజన గదిలో గాజు తలుపు పగిలింది.
59
00:04:34,443 --> 00:04:35,610
జాగ్రత్త.
60
00:04:42,951 --> 00:04:45,620
మేము వచ్చేసరికి
పిల్లలు ఈ మంచంపై ఉన్నారు.
61
00:05:45,472 --> 00:05:47,015
మురికి డయాపర్లు,
62
00:05:47,808 --> 00:05:49,017
విరిగిన బొమ్మలు,
63
00:05:50,519 --> 00:05:54,106
ప్రధాన పడకగదిలోని అలమరాలో
గచ్చుపై చదరపు అచ్చు ముద్ర.
64
00:05:55,649 --> 00:05:58,276
ఇక్కడేదో ఉండాలి. దానిని తీసేశారు.
65
00:06:10,914 --> 00:06:11,915
డిటెక్టివ్?
66
00:06:13,750 --> 00:06:14,918
బాగానే ఉన్నారా?
67
00:06:15,377 --> 00:06:16,545
హా. బాగున్నా.
68
00:06:16,545 --> 00:06:19,256
- సరే.
- మీరు వచ్చి ఇది చూడాలి.
69
00:06:33,854 --> 00:06:37,023
హాలు నుంచి వంటగది దారిలో
శుభ్రతా సామాగ్రి వరుస ఉంది.
70
00:06:42,487 --> 00:06:43,905
అసలు ఏంటిది?
71
00:07:12,726 --> 00:07:13,727
ఛ.
72
00:07:30,535 --> 00:07:31,661
మృతురాలి...
73
00:07:32,329 --> 00:07:35,957
మృతురాలి కుడి కాలు విరిగిపోయి,
74
00:07:37,125 --> 00:07:39,419
వెనక్కు తిప్పి ఉంది.
75
00:07:40,754 --> 00:07:42,714
సంక్లిష్ట గాయాల గుర్తింపు.
76
00:07:45,467 --> 00:07:48,637
మృతురాలి మెడ విరిగిపోయింది.
77
00:07:49,846 --> 00:07:50,972
ఆమె తల
78
00:07:51,890 --> 00:07:53,058
తిప్పేసి ఉంది.
79
00:07:53,683 --> 00:07:55,977
పలు వెన్నుపూస గాయాల గుర్తింపు.
80
00:07:57,562 --> 00:08:00,649
మిస్ మాట్ నోరు తెరచి ఉంది,
81
00:08:02,150 --> 00:08:03,735
చాలా అసహజంగా.
82
00:08:13,495 --> 00:08:16,289
మిమ్మల్ని భయం నుంచి
విడుదల చేసుకునేందుకు సిద్ధమా?
83
00:08:18,541 --> 00:08:19,876
ఊహించండి.
84
00:08:21,336 --> 00:08:25,006
భయం అనేది ఎంపిక కాకపోతే,
ఏం జరగవచ్చో,
85
00:08:25,382 --> 00:08:27,467
అలాగే ఏది అందుబాటులో ఉంటుందో ఊహించండి.
86
00:08:30,637 --> 00:08:31,805
మీరు సిద్ధమా?
87
00:08:32,931 --> 00:08:37,102
సందేహాన్ని వదిలేసి, అత్యంత వాస్తవికమైన
మీతో స్నేహం చేయడానికి మీరు సిద్ధమా?
88
00:08:37,102 --> 00:08:38,395
మీరు సిద్ధమా...
89
00:08:51,408 --> 00:08:53,243
మీకు భయంగా ఉందా?
90
00:08:59,749 --> 00:09:01,042
భయపడకండి.
91
00:09:22,522 --> 00:09:24,691
పిల్లలు అందరికీ నచ్చే పిగ్గీ ఎవరు?
92
00:09:24,899 --> 00:09:28,820
అది నిజం. తనే చెడర్!
93
00:09:28,820 --> 00:09:31,656
తను వెంటనే వచ్చేస్తున్నాడు!
94
00:09:33,575 --> 00:09:34,993
అందరికీ హాయ్.
95
00:09:36,536 --> 00:09:38,455
పార్టీకి ఎవరు సిద్ధం?
96
00:10:07,650 --> 00:10:09,027
అసలు ఏమిటది?
97
00:10:10,445 --> 00:10:12,197
ఏదో కొత్తగా ప్రయత్నించానంతే.
98
00:10:12,947 --> 00:10:17,494
నా స్క్రిప్ట్‌ని కార్పొరేట్ ఆమోదించిందని
నువ్వు "కొత్తగా ప్రయత్నం" చేయవచ్చనా?
99
00:10:17,494 --> 00:10:18,912
అదేగా మెరుగు చేయడం.
100
00:10:18,912 --> 00:10:21,498
అది బాధ్యత అంటారు,
చుట్టూ అలా డాన్స్ చేయడం.
101
00:10:21,498 --> 00:10:24,501
ఎవరైనా పిల్లాడికి తగిలి,
దవడ వదులయ్యేలా చేసేవాడివి.
102
00:10:24,501 --> 00:10:25,919
దానికి ఎవరు చెల్లిస్తారు?
103
00:10:29,422 --> 00:10:30,799
సరిగ్గా అంతే.
104
00:10:30,799 --> 00:10:32,509
కానీ పిల్లలకు అది నచ్చింది.
105
00:10:33,134 --> 00:10:37,222
ఓ పిల్లాడు స్కీ-బాల్ మింగాలని చూశాడు.
వాళ్లు సిస్కెల్ అండ్ ఈబర్ట్ కారు.
106
00:10:38,014 --> 00:10:39,140
ఇక అంతేనా?
107
00:10:39,808 --> 00:10:41,476
నాకు ఆడిషన్ ఉంది.
108
00:10:41,476 --> 00:10:44,229
సరే. అందులో నీకు
అదృష్టం కలగాలి, బిల్లీ డీ.
109
00:11:07,794 --> 00:11:11,381
నమూనాలు దేశవ్యాప్తంగా
చట్ట అమలుకు ఉపయోగించబడ్డాయి.
110
00:11:11,381 --> 00:11:12,799
ఇది ఉల్లంఘించడం.
111
00:11:12,799 --> 00:11:15,051
ఇది ఎప్పటికీ జరగకూడని విషయం.
112
00:11:15,051 --> 00:11:16,678
డారిల్ గేట్స్
పోలీస్ చీఫ్, ఎల్.ఏ.పీ.డీ.
113
00:11:16,678 --> 00:11:20,056
ఇది జరగకుండా నిరోధించే
అన్ని విధానాలు మనకు ఉన్నాయి.
114
00:11:20,056 --> 00:11:22,559
మానవ తప్పిదం కారణంగా
విధానాలు దారితప్పవచ్చు,
115
00:11:22,559 --> 00:11:25,103
మనం ఆ మానవ తప్పిదాలను సరిచేసుకుందాం.
116
00:11:25,603 --> 00:11:26,980
అది వదిలెయ్. అతనితో వేగలేం.
117
00:11:27,605 --> 00:11:30,525
అవును, సర్. అతను పెద్ద ముసలివాడు.
118
00:11:32,402 --> 00:11:33,611
ఏమన్నారు?
119
00:11:35,572 --> 00:11:37,907
దీని గురించి అంతా,
పోలీసు విభాగం...
120
00:11:37,907 --> 00:11:39,617
నువ్వు వెనక్కు తగ్గాలంటాను.
121
00:11:43,705 --> 00:11:44,789
ఆ బేడీలు వెయ్.
122
00:12:00,972 --> 00:12:01,973
లెఫ్టినెంట్.
123
00:12:03,475 --> 00:12:04,934
ఈస్ట్ 35 నుంచి వచ్చాను.
124
00:12:04,934 --> 00:12:08,271
- సరే, అది చాలా క్రూరం.
- అవును, సర్. అది నాకు కావాలి.
125
00:12:08,271 --> 00:12:09,814
నన్ను ఆశ్చర్యపరిచావు.
126
00:12:10,648 --> 00:12:15,028
జనాలు లోపలకు వచ్చేయకుండా
నాకు తలుపు ఉండడం చాలా సంతోషం.
127
00:12:15,653 --> 00:12:18,198
- మాట్ హత్య, సర్.
- ఆ నిర్ణయం అయిపోయింది.
128
00:12:21,117 --> 00:12:23,161
- నువ్వే చూస్తావు.
- మంచిది. ధన్యవాదాలు.
129
00:12:23,161 --> 00:12:24,954
మెక్‌కిన్నీతో భాగస్వామిగా.
130
00:12:25,997 --> 00:12:26,998
తను నీ పైఅధికారి.
131
00:12:26,998 --> 00:12:28,082
ఛ!
132
00:12:28,082 --> 00:12:30,418
నీకు చివరి రెండు పదోన్నతులు ఎవరిచ్చారో
133
00:12:30,418 --> 00:12:32,378
గుర్తుంచుకుని, మరుసటి మాటలు చెప్పు.
134
00:12:32,378 --> 00:12:35,715
అది కేవలం... ఆయనది తన సొంత శైలి.
135
00:12:36,257 --> 00:12:37,383
అదిగో, చూశావా?
136
00:12:37,383 --> 00:12:40,428
- నీకు దౌత్యం నప్పుతుంది.
- ఆయన త్వరగా ముగిస్తారు, సర్.
137
00:12:40,428 --> 00:12:43,306
అనువాదం, అతను అతిగా చేయడు.
నేల మీదే ఉంటాడు.
138
00:12:43,306 --> 00:12:44,849
దాని అర్థం ఏంటి?
139
00:12:45,433 --> 00:12:47,894
స్లేయర్ కేసు నుంచి
రెండేళ్ల క్రితం తీసేశారు.
140
00:12:47,894 --> 00:12:50,271
ప్రాయశ్చిత్త పరిమితులపై శాసనం లేదా?
141
00:12:50,271 --> 00:12:51,940
నా జ్ఞాపకశక్తి అమోఘం,
142
00:12:51,940 --> 00:12:54,526
డీ2ల మీద రహస్య వేగు
శారీరక దాడి చేసి,
143
00:12:54,526 --> 00:12:56,110
ఓ దర్యాప్తు చెడగొట్టడం.
144
00:12:56,110 --> 00:12:59,989
- నేను చెడగొట్టలేదు.
- నువ్వే దర్యాప్తు చెడగొట్టలేదు కూడా.
145
00:12:59,989 --> 00:13:02,075
అలా అనుకుంటే, నన్ను కేటాయించడం ఎందుకు?
146
00:13:02,075 --> 00:13:05,078
నా దురదృష్టం కొద్దీ, కష్టపడతావు,
147
00:13:05,787 --> 00:13:07,080
తెలివైనదానివి.
148
00:13:08,540 --> 00:13:11,000
అలా మళ్లీ జరగనివ్వవు.
149
00:13:12,919 --> 00:13:14,087
అలాగే, సర్.
150
00:13:14,087 --> 00:13:15,463
హలో, మాల్కమ్.
151
00:13:16,422 --> 00:13:17,966
నేను డిటెక్టివ్ మెక్‌కిన్నీ.
152
00:13:19,092 --> 00:13:21,010
ఈవిడ డిటెక్టివ్ రీవ్.
153
00:13:22,470 --> 00:13:25,723
మీ ఆశ్రమ ఆయాకు జరిగినదానికి
నేను విచారిస్తున్నాను.
154
00:13:26,266 --> 00:13:27,600
వణికిపోయి ఉంటావు.
155
00:13:28,309 --> 00:13:30,311
నీకు మరింత బాధ కలిగించాలని అనుకోం.
156
00:13:31,020 --> 00:13:32,730
నువ్వేం చూశావే మాకు తెలియాలంతే.
157
00:13:36,067 --> 00:13:37,193
ఏమీ చూడలేదు.
158
00:13:38,152 --> 00:13:39,153
సరే.
159
00:13:40,196 --> 00:13:41,948
అయితే, ఏం విన్నావో చెప్పు.
160
00:13:45,535 --> 00:13:48,496
మాల్కమ్, మిస్ మాట్‌కి
నువ్వలా చేయలేదని నాకు తెలుసు.
161
00:13:50,290 --> 00:13:53,126
తప్పకుండా నువ్వేదో విన్నావని కూడా
నాకు తెలుసు.
162
00:13:58,840 --> 00:14:00,925
నువ్వు పెద్దోడివి, మాల్కమ్.
163
00:14:02,051 --> 00:14:03,136
ఫుట్‌బాల్ ఆడతావా?
164
00:14:04,262 --> 00:14:05,513
నేను ఆడాను.
165
00:14:06,848 --> 00:14:08,141
లైన్‌బ్యాకర్‌గా.
166
00:14:08,850 --> 00:14:09,851
నువ్వు?
167
00:14:10,476 --> 00:14:12,895
నన్ను ఊహించనీ. ఫుల్‌బ్యాక్?
168
00:14:14,731 --> 00:14:16,316
భారీగా ఉంటావు, బలవంతుడివి.
169
00:14:17,942 --> 00:14:20,403
ఇప్పుడు, ఆ ఇంటిలో
చిన్నతనం నుంచి ఉన్నావుగా?
170
00:14:20,945 --> 00:14:23,448
నీకు ఎన్నేళ్ల వయసు నుంచి
మిస్ మాట్‌తో ఉన్నావు?
171
00:14:25,366 --> 00:14:26,367
మూడు.
172
00:14:27,827 --> 00:14:30,413
మూడేళ్లు అంటే భారీ, బలవంతుడివి కావు.
173
00:14:31,748 --> 00:14:34,667
నన్ను ఆ ఇంటికి అడపా దడపా పిలిచేవారు.
174
00:14:34,667 --> 00:14:37,128
అప్పట్లో గస్తీ అధికారిని.
175
00:14:37,128 --> 00:14:39,756
కొందరు పిల్లలను చూడడంతో
నాకు గుర్తుంది,
176
00:14:40,381 --> 00:14:43,217
ఆ పిల్లలు
మిస్ మాట్‌ని చూసి చాలా భయపడేవాళ్లు.
177
00:14:43,760 --> 00:14:45,428
ఇక, నీకు ఆవిడంటే భయమా?
178
00:14:49,891 --> 00:14:51,142
ఇప్పుడు కాదు,
179
00:14:51,142 --> 00:14:52,602
కానీ అప్పట్లో.
180
00:14:55,605 --> 00:14:57,774
- ఆమె నిన్ను కొట్టేదా?
- ఆవిడ చనిపోయింది.
181
00:14:57,774 --> 00:14:59,567
- ఎవడికి కావాలి?
- మాల్కమ్...
182
00:14:59,567 --> 00:15:01,027
అది ఎలా జరిగింది, మాల్కమ్?
183
00:15:01,152 --> 00:15:04,447
కొందరు స్నేహితుల సాయం పొందావా?
పీసీపీ మత్తు ఎక్కువైందేమో?
184
00:15:04,447 --> 00:15:07,742
ఆమె చనిపోవడం నేను పట్టించుకోను,
కానీ నేనలా చేయలేదు!
185
00:15:12,580 --> 00:15:13,748
ఇక్కడ చూడు!
186
00:15:16,459 --> 00:15:18,252
ఇప్పుడు భయం నటించకు.
187
00:15:18,252 --> 00:15:20,672
మొద్దోడా, గుర్తుంచుకో? ఈమెను చూడు!
188
00:15:27,595 --> 00:15:30,973
- ఏం జరిగిందో నాకు గుర్తు లేదు.
- కన్నీళ్లు నీకు సాయపడవు.
189
00:15:30,973 --> 00:15:33,851
- నా చెల్లెలి దగ్గరకు వెళ్లవచ్చా?
- మాకు నిజం చెప్పు!
190
00:15:33,851 --> 00:15:35,687
ఏం జరిగిందో నాకు గుర్తు లేదు.
191
00:15:35,687 --> 00:15:38,356
మాల్కమ్? మాల్కమ్,
నీకు న్యాయవాదిని పొందే హక్కుంది.
192
00:15:38,356 --> 00:15:40,358
న్యాయవాది కావాలని అంటావా?
193
00:15:40,358 --> 00:15:42,902
- అవును, అవును. అవును, మేడం. దయచేసి.
- సరే.
194
00:15:42,902 --> 00:15:44,696
- దయచేసి.
- సరే. సరే.
195
00:15:45,363 --> 00:15:47,115
నావల్ల కాదు... ప్లీజ్.
196
00:15:53,371 --> 00:15:55,456
కెమెరాకు నీ పేరు, పాత్రను చెప్పండి.
197
00:15:55,456 --> 00:15:57,959
హాయ్. నా పేరు ఎడ్మండ్ గెయిన్స్,
198
00:15:57,959 --> 00:16:00,503
నేను పూకీ జీ పాత్రకు చదువుతున్నాను.
199
00:16:21,816 --> 00:16:23,776
చెత్తవెధవలు మా బస్తీకి వచ్చి,
200
00:16:24,819 --> 00:16:26,404
వాళ్లు ఈ తుపాకీని తెచ్చి,
201
00:16:26,904 --> 00:16:28,656
నేరుగా వారి చెత్త...
202
00:16:29,240 --> 00:16:30,324
చెత్త...
203
00:16:31,868 --> 00:16:33,453
- చెత్త వృషణాలు...
- ఎడ్మండ్.
204
00:16:33,453 --> 00:16:35,163
నిన్ను అక్కడే ఆగమంటాను.
205
00:16:35,788 --> 00:16:38,666
పూకీ జీ ఒక రౌడీ ముఠాలో వాడని
నీకు గుర్తు చేయాలి.
206
00:16:39,250 --> 00:16:42,170
సరేనా? దురుసైన నేరస్తుడు. రైకర్స్ జైలు.
చాలా నేరాలు.
207
00:16:42,170 --> 00:16:43,254
హా. సరే. తప్పకుండా.
208
00:16:43,254 --> 00:16:47,425
మరింత వీధి రకం, కదా? అతను కటువైనవాడు.
అందుకే, నీకు తెలసుగా.
209
00:16:49,594 --> 00:16:51,763
మనం మొదటి నుంచి మళ్లీ చేద్దాం.
210
00:17:11,949 --> 00:17:14,994
చెత్తవెధవలు వచ్చి...
చెత్తవెధవలు వచ్చి...
211
00:17:19,332 --> 00:17:21,542
చెత్తవెధవలు మా బస్తీకి వచ్చి,
212
00:17:23,711 --> 00:17:25,338
వాళ్లు ఈ తుపాకీని తెచ్చి,
213
00:17:26,172 --> 00:17:28,132
నేరుగా వారి వృషణాలకు గురి పెడతారు.
214
00:17:31,260 --> 00:17:33,471
నేను... నేను నేరుగా...
215
00:17:35,890 --> 00:17:37,183
నిన్ను చావగొడతాను.
216
00:17:37,850 --> 00:17:39,435
నాతో పెట్టుకోకు, సన్నాసి.
217
00:18:21,727 --> 00:18:23,354
హే, లోపల ఎలా జరిగింది?
218
00:18:28,442 --> 00:18:30,194
అది నాకోసం కాదనుకుంటా.
219
00:18:31,112 --> 00:18:33,531
- కానీ మరుసటిది నాదే.
- అది నిజమని తెలుసు.
220
00:18:33,531 --> 00:18:35,992
ఓటమి అంగీకరించని వారిని
లోకం వదిలేయదు.
221
00:18:37,326 --> 00:18:41,080
నేను నటిని కాను,
కానీ ఇక్కడకు చాలామంది రావడం చూస్తాను,
222
00:18:41,080 --> 00:18:43,708
ఎవరినైనా తీసుకోవడం ఆగే విషయం కాదు.
223
00:18:44,834 --> 00:18:47,962
ఒక రోజున, సరైన పాత్రను కలుస్తావు.
నాకది తెలుస్తోంది.
224
00:18:50,965 --> 00:18:52,300
ధన్యవాదాలు.
225
00:18:57,930 --> 00:18:59,056
నీ కొడుకు కోసం.
226
00:18:59,557 --> 00:19:00,725
నీకు గుర్తున్నాడా?
227
00:19:01,517 --> 00:19:02,768
అన్నీ గుర్తుంచుకుంటాను.
228
00:19:04,103 --> 00:19:05,229
సరే, ధన్యవాదాలు.
229
00:19:05,229 --> 00:19:07,023
వాడికి వీడియో గేమ్‌లు ఇష్టం.
230
00:19:07,023 --> 00:19:10,818
రెస్టారెంట్‌కి తీసుకురా.
మీ అందరికీ పిజ్జా, సోడా ఇస్తాను.
231
00:19:10,818 --> 00:19:13,154
వాడికి సోడా అవసరంపై దేవునికే తెలియాలి,
232
00:19:13,863 --> 00:19:16,073
కానీ అది నేను తీసుకోగలను.
233
00:19:18,910 --> 00:19:21,370
- సలహాకు ధన్యవాదాలు.
- ఏం పర్వాలేదు.
234
00:20:02,536 --> 00:20:04,038
నిన్ను చావగొడతాను.
235
00:20:04,956 --> 00:20:06,874
నాతో పెట్టుకోకు, సన్నాసి.
236
00:20:08,376 --> 00:20:10,127
నిన్ను చావగొడతాను.
237
00:20:11,170 --> 00:20:13,255
నాతో పెట్టుకోకు, సన్నాసి.
238
00:20:14,465 --> 00:20:16,175
నిన్ను చావగొడతాను.
239
00:20:17,385 --> 00:20:19,095
నాతో పెట్టుకోకు, సన్నాసి.
240
00:20:20,513 --> 00:20:21,514
నిన్ను...
241
00:21:09,353 --> 00:21:10,563
ఇప్పుడే వచ్చేస్తున్నా.
242
00:21:25,286 --> 00:21:27,204
హ్యాపీ బర్త్‌డే, బేబీ.
243
00:21:29,373 --> 00:21:31,250
నాకు ఏమైనా చెప్పాలా?
244
00:21:33,085 --> 00:21:34,837
దాదాపు మరిచిపోయాను.
245
00:21:38,257 --> 00:21:39,467
ఇంకేమైనా ఉన్నాయా?
246
00:21:44,221 --> 00:21:45,389
అతనికి గుర్తుంది.
247
00:21:45,389 --> 00:21:46,474
అది మంచి విషయమేగా?
248
00:21:46,474 --> 00:21:48,392
తండ్రి పంపాడని కెల్విన్‌కి తెలుసా?
249
00:21:48,392 --> 00:21:49,727
తెలియదు.
250
00:21:52,772 --> 00:21:55,900
అబ్బా. మీ పెళ్లి జరిగినప్పుడు
మీరు చిన్నవాళ్లు,
251
00:21:55,900 --> 00:21:57,359
అయినా అతనికి గుర్తుంది.
252
00:21:57,359 --> 00:21:58,819
అయితే, కార్ సంగతేంటి?
253
00:21:58,819 --> 00:22:01,906
నీకు చెప్పబోతున్నాను,
నువ్వేమీ చింతించే అవసరం లేదు.
254
00:22:01,906 --> 00:22:04,784
- నేనెంత బకాయి ఉన్నానమ్మా?
- అది అలా కాదులే.
255
00:22:04,784 --> 00:22:07,036
దుకాణం వెనుక ఉన్న
కొన్ని చెత్త కుండీలే.
256
00:22:07,036 --> 00:22:10,456
త్వరగా ఇంటికి వచ్చి,
నీ పుట్టినరోజు విందు కోసం హడావిడి...
257
00:22:10,456 --> 00:22:11,624
నీ చేతులెలా ఉన్నాయి?
258
00:22:13,375 --> 00:22:15,753
- ఇదిగో చూడు.
- ఇప్పుడు నిన్నో ప్రశ్న అడిగాను.
259
00:22:15,753 --> 00:22:18,297
బాగానే ఉన్నాయని, నీకు చెబుతున్నానుగా.
260
00:22:19,090 --> 00:22:20,633
నేను బాగానే ఉన్నాను.
261
00:22:32,228 --> 00:22:34,271
భలే అందంగా ఉంది,
నాకు తెరవాలనే లేదు.
262
00:22:34,271 --> 00:22:36,649
అందుకే అమ్మమ్మ బోలెడు డబ్బు ఇచ్చింది.
263
00:22:36,649 --> 00:22:39,276
పదేళ్లుగా నడుస్తున్న దుకాణంలో
చక్కని బహుమతి కవర్.
264
00:22:39,276 --> 00:22:41,278
ఇక, నీ చేతులతో తెరుస్తావా?
265
00:22:41,278 --> 00:22:42,571
కానివ్వమ్మా. తెరువు.
266
00:22:42,571 --> 00:22:43,989
సరే.
267
00:22:45,616 --> 00:22:46,617
ఇదిగో.
268
00:22:50,996 --> 00:22:52,039
అమ్మా!
269
00:22:56,168 --> 00:22:59,421
- నిజంగానా?
- అబ్బా.
270
00:22:59,421 --> 00:23:02,133
- ఓరి దేవుడా.
- పెద్ద మేధావిలా ఎందుకు చూశావు?
271
00:23:02,133 --> 00:23:04,135
నా జుట్టు! అమ్మ!
272
00:23:04,135 --> 00:23:06,303
ఏదైనా కొత్తగా చేయాలని చూశాను.
273
00:23:06,303 --> 00:23:08,430
ఆ రోజు నుంచి నీకు క్షవరం ఆపేశాను.
274
00:23:08,430 --> 00:23:11,809
బడి అయిపోయాక మీ అమ్మ ప్రతి రోజూ
తన గదిలో కూర్చుని
275
00:23:11,809 --> 00:23:13,060
పజిల్‌లతో ఆడేది.
276
00:23:13,060 --> 00:23:15,271
ఆమెను ఏమీ లేకుండా వదలలేకపోయాను.
277
00:23:15,271 --> 00:23:16,856
ఆమెకు స్నేహితులు లేరు.
278
00:23:16,856 --> 00:23:18,482
విను, మాట్లాడుతూ ఉన్నావంటే,
279
00:23:18,482 --> 00:23:21,026
ఆ గారేజీని పజిల్ గదిలా మార్చేస్తాను.
280
00:23:25,614 --> 00:23:28,450
ఎంతో తెలివి, కల్పనాశక్తి.
281
00:23:29,201 --> 00:23:30,369
ఇంకా అన్నిటిలో దూరడం.
282
00:23:30,995 --> 00:23:33,747
ఆమె ఎప్పుడూ ఏదైనా గుర్తించాలని చూసేది.
283
00:23:33,747 --> 00:23:34,957
అప్పట్లో కూడా.
284
00:23:35,958 --> 00:23:37,209
నా చిన్ని డిటెక్టివ్.
285
00:23:38,419 --> 00:23:39,503
ధన్యవాదాలు, అమ్మా.
286
00:23:40,546 --> 00:23:41,672
ధన్యవాదాలు.
287
00:23:42,298 --> 00:23:43,424
ఐ లవ్ యూ.
288
00:23:44,550 --> 00:23:47,428
- సరే ఇక...
- కానీ నీకు ఆ ఫోటో నచ్చలేదు కదా?
289
00:23:47,428 --> 00:23:50,764
తెలుసుగా, అది అందంగా ఉంది. మనోహరంగా.
290
00:23:51,891 --> 00:23:53,350
అది ముందువైపు పెట్టవచ్చు.
291
00:23:53,350 --> 00:23:54,727
అవును, గొప్పగా ఉంది.
292
00:24:49,657 --> 00:24:50,950
ఎడ్మండ్.
293
00:24:54,286 --> 00:24:55,621
ఎడ్మండ్.
294
00:24:57,748 --> 00:24:59,875
హాయ్.
295
00:25:02,253 --> 00:25:03,212
వీడి పేరు కెన్నీ.
296
00:25:04,546 --> 00:25:06,674
ఇప్పుడు కొంచెం సిగ్గుపడుతున్నాడు.
297
00:25:09,426 --> 00:25:12,721
హే, నీకు పెప్పరోని పిజ్జా కావాలా?
298
00:25:16,225 --> 00:25:17,977
కావాలా? సరే, హై ఫైవ్ కొట్టు.
299
00:25:18,894 --> 00:25:20,187
ఓరి నాయనో.
300
00:25:23,065 --> 00:25:24,275
నీవి సూపర్‌పవర్‌లా?
301
00:25:24,984 --> 00:25:26,151
నువ్వు సూపర్‌హీరోవా?
302
00:25:28,070 --> 00:25:29,863
పిల్లలతో బాగా ఆడతావు.
303
00:25:31,156 --> 00:25:33,367
అది నా తల్లిదండ్రులు, వాళ్లు...
304
00:25:33,367 --> 00:25:36,620
వాళ్లు ఇద్దరూ టీచర్లు,
అందుకే వాళ్ల నుంచి నేర్చుకున్నానేమో.
305
00:25:36,620 --> 00:25:40,541
సరే, తన తండ్రి, నా మాజీ...
నాకు దానిపై మాట్లాడాలని లేదు.
306
00:25:40,541 --> 00:25:43,961
కానీ ఆయన
పిల్లలను, మనసులను పట్టించుకోడు.
307
00:25:44,545 --> 00:25:45,546
నువ్వలా కాదులే.
308
00:25:46,672 --> 00:25:48,007
నేను అనుకోవడం...
309
00:25:48,716 --> 00:25:50,384
అందుకే నాకు నటన ఇష్టమేమో.
310
00:25:51,010 --> 00:25:55,180
నన్ను దేనిలోకీ ఇంకా తీసుకోకపోవడంతో,
ఇంకా బాగా చేయలేక పోతున్నానేమో.
311
00:25:55,180 --> 00:25:58,851
నీది మంచి మనసు.
బాగా నటిస్తావు, నీది ప్రత్యేక మనస్తత్వం.
312
00:25:58,851 --> 00:26:01,687
నీలాంటి సోదరులకు
తగినన్ని పాత్రలు లేవు.
313
00:26:01,687 --> 00:26:05,232
అది "రౌడీ ముఠా నెంబర్ ఒకటి,"
లేదా "డ్రగ్ డీలర్ నెంబర్ రెండు."
314
00:26:05,899 --> 00:26:07,234
అదంతా సోది.
315
00:26:07,234 --> 00:26:08,402
నీకొకటి తెలుసా?
316
00:26:09,903 --> 00:26:13,157
నా బల్ల దగ్గరకు
అన్ని రచనలు వస్తుంటాయి.
317
00:26:13,157 --> 00:26:15,617
నీకు సరిపోయే దేనినైనా వెతుకుతాను.
318
00:26:16,577 --> 00:26:17,786
నిజంగానా?
319
00:26:17,786 --> 00:26:19,288
నా కోసం అలా చేస్తావా?
320
00:26:19,913 --> 00:26:21,081
కచ్చితంగా.
321
00:26:22,541 --> 00:26:23,584
సరే.
322
00:26:27,546 --> 00:26:29,048
ఇదిగో నా నెంబర్.
323
00:26:30,507 --> 00:26:34,845
నీకు ఏదైనా కనబడితే,
నాకు కాల్ చేస్తావా?
324
00:26:35,596 --> 00:26:37,097
మనం అక్కడకు వెళదామా?
325
00:26:37,097 --> 00:26:38,682
తప్పకుండా.
326
00:26:38,682 --> 00:26:40,309
ఇదిగో.
327
00:26:40,309 --> 00:26:41,560
నువ్వు కూడా
328
00:26:43,145 --> 00:26:44,563
నా నెంబర్ రాసుకో.
329
00:26:48,400 --> 00:26:49,401
వచ్చెయ్.
330
00:26:49,401 --> 00:26:51,320
వెళ్లు, చిన్నా. సరదాగా ఉండు.
331
00:26:52,780 --> 00:26:54,782
నిన్ను ఓడిస్తా. రా, వెళదాం.
332
00:26:54,782 --> 00:26:56,200
ఎంత ఎత్తు ఎగరగలవు?
333
00:27:19,515 --> 00:27:23,102
ఈ ఏడాది మాట్ హౌస్‌కి
శిశు సేవల నుండి ఎన్ని కాల్స్ చేసింది?
334
00:27:23,102 --> 00:27:25,479
నా దగ్గర ఆ సమాచారం లేదు.
335
00:27:25,479 --> 00:27:28,774
కానీ మన నగర కేంద్ర శాఖ
నెంబర్ ఇది.
336
00:27:28,774 --> 00:27:31,944
వాళ్లు ఎలాంటి సమాచారం అయినా
సంతోషంగా అందిస్తారు.
337
00:27:31,944 --> 00:27:33,237
ఇక్కడి నుంచి చూసుకుంటా.
338
00:27:40,994 --> 00:27:42,496
నింజా టర్టిల్స్ కదా?
339
00:27:43,997 --> 00:27:45,624
మా అబ్బాయికి అవి నచ్చేవి.
340
00:27:46,250 --> 00:27:50,087
"కావబంగా, బాబూ!" గురించి మాట్లాడుతూ
ఇల్లంతా పరిగెట్టేవాడు.
341
00:27:51,797 --> 00:27:56,176
వాడికి రఫేల్ ఇష్టమనుకుంటా.
లేదా తను మైకెలేంజెలో అనుకుంటా?
342
00:27:56,802 --> 00:27:59,138
- డోనాటెల్లో సరదావాడు.
- డోనాటెల్లో?
343
00:27:59,680 --> 00:28:02,891
సరే. అలాగే.
నా నింజా టర్టిల్స్ జ్ఞానం పెంచుకోవాలి.
344
00:28:02,891 --> 00:28:03,976
తప్పనిసరిగా.
345
00:28:05,060 --> 00:28:07,187
సరే, నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చా.
346
00:28:07,729 --> 00:28:11,150
నిన్న మీ అన్నయ్యతో మాట్లాడాను.
తనకు నువ్వంటే చాలా ఇష్టం.
347
00:28:11,859 --> 00:28:13,318
మీరు అతనిని తీసేసుకుంటారా?
348
00:28:13,318 --> 00:28:15,863
లేదు, అస్సలు లేదు. నేనలా చేయను.
349
00:28:15,863 --> 00:28:17,531
తను చాలా సహాయపడతాడు.
350
00:28:18,323 --> 00:28:19,658
వాడు ఎక్కువ తింటాడు.
351
00:28:21,743 --> 00:28:23,996
సరే, తను ఉండడం నీ అదృష్టం.
352
00:28:24,955 --> 00:28:27,207
నీలాంటి చెల్లెలు ఉండడం
అతని అదృష్టం.
353
00:28:29,877 --> 00:28:30,961
తను అందంగా ఉంది.
354
00:28:30,961 --> 00:28:32,129
దాని పేరు ఏంటి?
355
00:28:32,880 --> 00:28:33,881
కీకి.
356
00:28:33,881 --> 00:28:35,466
కీకి?
357
00:28:35,466 --> 00:28:36,967
హాయ్, కీకి.
358
00:28:37,843 --> 00:28:40,888
నాకు బొమ్మలలో ఆడే వయసు దాటిపోయిందని
మిస్ బెర్నీస్ అనేది.
359
00:28:41,555 --> 00:28:43,015
నీకు ఓ రహస్యం చెప్పనా?
360
00:28:44,224 --> 00:28:45,726
నేను చిన్నపిల్లగా ఉండగా,
361
00:28:46,310 --> 00:28:49,855
నేను ఓ ఊహానేస్తంతో
నిరంతరం ఆడుతూ ఉండేదాన్ని.
362
00:28:49,855 --> 00:28:53,150
నీకు కీకి కనబడుతోంది.
నేను నేస్తాన్ని ఊహించానంతే.
363
00:28:53,150 --> 00:28:54,568
అది విచిత్రం.
364
00:28:56,528 --> 00:28:58,947
నేను, మా అన్నయ్య
మళ్లీ అక్కడికి వెళ్లాలా?
365
00:28:58,947 --> 00:29:00,782
అస్సలు వెళ్లనవసరం లేదు.
366
00:29:00,782 --> 00:29:03,911
మంచిది, ఎందుకంటే
అక్కడ నాకు నచ్చదు. బాగుండదు.
367
00:29:04,828 --> 00:29:06,205
ఎలా బాగుండదు?
368
00:29:07,414 --> 00:29:09,750
మిస్ బెర్నీస్, ఆమె చాలా కటువు.
369
00:29:10,542 --> 00:29:13,003
బెర్నీస్ ఈ వారంలో
మీ ఇద్దరిని ఏమైనా చేసిందా?
370
00:29:13,003 --> 00:29:14,630
ఆమె భయపడింది.
371
00:29:17,174 --> 00:29:19,593
మిస్ బెర్నీస్ దేనికి భయపడిందో తెలుసా?
372
00:29:21,386 --> 00:29:22,554
అతనికి.
373
00:29:25,682 --> 00:29:26,892
నీకు అతను తెలుసా?
374
00:29:28,477 --> 00:29:30,521
మిస్ బెర్నీస్ భయపడిన అతను.
375
00:29:33,315 --> 00:29:35,359
ఆమె నిద్రపోకూడదని అనుకుంది.
376
00:29:38,737 --> 00:29:41,698
మేము కూడా నిద్ర పోవద్దని ఆమె కోరుకుంది.
377
00:29:47,663 --> 00:29:48,914
వాడు ఇంట్లోనే ఉన్నాడు!
378
00:29:48,914 --> 00:29:52,501
- వాడు ఇంట్లోనే ఉన్నాడు!
- దయచేసి! ఇదంతా ఆపు, వద్దు!
379
00:29:52,501 --> 00:29:54,545
- వాడు ఇంట్లోనే ఉన్నాడు!
- దయచేసి ఆపు!
380
00:29:54,545 --> 00:29:56,213
- వాడు ఇంట్లోనే ఉన్నాడు!
- ఆపు!
381
00:29:56,213 --> 00:29:58,298
దయచేసి ఆపు!
382
00:29:58,298 --> 00:29:59,550
ఆపు!
383
00:29:59,550 --> 00:30:03,345
వాడు ఇంట్లోనే ఉన్నాడు! వాడు ఇంట్లో...
384
00:31:12,956 --> 00:31:13,999
కెల్?
385
00:31:21,048 --> 00:31:22,049
ఇప్పుడే వస్తున్నా.
386
00:33:46,234 --> 00:33:49,863
1227, ఈస్ట్ 35వ వీధి.
ఆగ్నేయ మూల. ఒంటరి కుటుంబ నివాసం.
387
00:33:50,947 --> 00:33:54,785
వసారా లైట్, బయట లైట్ వెలగడం లేదు. సమీప
వీధి లైటుకు ఉత్తరాన దాదాపు 60 అడుగుల దూరం.
388
00:33:56,036 --> 00:33:58,455
ముందు తలుపుపై
బలవంతపు ప్రవేశ ఆనవాళ్లు లేవు.
389
00:34:00,040 --> 00:34:04,044
నివాస, భోజన గదులలో
కర్టెన్‌లు లాగి ఉన్నాయి.
390
00:34:09,841 --> 00:34:10,967
పోరాడిన సంకేతమా?
391
00:34:18,558 --> 00:34:19,559
మృతురాలి మెడ
392
00:34:21,853 --> 00:34:22,896
విరిగిపోయింది.
393
00:34:26,066 --> 00:34:27,317
ఆమె తల
394
00:34:28,068 --> 00:34:29,402
తిప్పేసి ఉంది.
395
00:34:32,322 --> 00:34:34,950
పలు వెన్నుపూస గాయాల గుర్తింపు.
396
00:34:41,748 --> 00:34:44,125
మృతురాలి కుడి కాలు
397
00:34:44,125 --> 00:34:45,752
విరిగిపోయింది,
398
00:34:45,752 --> 00:34:48,171
వెనక్కు తిప్పి ఉంది.
399
00:34:49,589 --> 00:34:51,591
సంక్లిష్ట గాయాల గుర్తింపు.
400
00:35:05,188 --> 00:35:06,857
...గాయాల గుర్తింపు.
401
00:35:32,841 --> 00:35:33,842
నీకు భయంగా ఉందా?
402
00:35:53,278 --> 00:35:58,033
మా మిత్రుడు డామినిక్ ఒర్లాండో
జ్ఞాపకార్థం
403
00:37:51,146 --> 00:37:53,148
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల
404
00:37:53,148 --> 00:37:55,233
క్రియేటివ్ సూపర్‌వైజర్
సమత