1 00:00:24,879 --> 00:00:27,882 ప్రారంభం 2 00:00:27,966 --> 00:00:31,427 డిసెంబర్ 30 లాస్ ఏంజిల్స్ / న్యూయార్క్ 3 00:00:31,511 --> 00:00:35,431 ఫిబ్రవరి 9 ఫీనిక్స్ 4 00:00:37,809 --> 00:00:39,811 మార్క్ 5 00:00:40,812 --> 00:00:42,105 రోజ్ 6 00:00:45,108 --> 00:00:46,734 ఆ, చెప్పు? 7 00:00:46,818 --> 00:00:48,403 ఓహ్, థాంక్ గాడ్. 8 00:00:49,153 --> 00:00:53,408 నన్ను క్షమించు, నేను నీకు పిచ్చిదానిలా కాల్ చేస్తున్నాను. 9 00:00:53,491 --> 00:00:54,701 అవును, చేస్తున్నావు. 10 00:00:54,784 --> 00:00:57,412 నువ్వు ఉన్నట్టుండి వెళ్ళిపోయావ్. 11 00:00:58,204 --> 00:01:00,498 నాకు అర్థం... ఎక్కడున్నావు? 12 00:01:00,582 --> 00:01:03,668 కాసేపు తిరిగి రావాలనిపించింది. ఎక్కడో ఎడారిలో ఉన్నాను. 13 00:01:05,295 --> 00:01:07,171 ఛ, నా చేయి నుంచి రక్తం కారుతోంది. 14 00:01:08,006 --> 00:01:09,090 నన్ను క్షమించు, బేబీ. 15 00:01:09,173 --> 00:01:11,134 ఓహ్, దేవుడా, ఇది నీ తప్పు కాదు. 16 00:01:11,217 --> 00:01:13,136 -నన్ను క్షమించు. -నేనే జాగ్రత్తగా ఉండాల్సింది. 17 00:01:13,219 --> 00:01:17,181 అదీ, చూడబోతే అలాగే ఉంది. నువ్వు అంత కోపంగా ఉన్నావు. 18 00:01:17,265 --> 00:01:19,601 అవును, సరే, నేను ఇంకెలా స్పందిస్తానని అనుకున్నావ్? 19 00:01:19,684 --> 00:01:21,644 నువ్వు చాలా సంతోషిస్తావని అనుకున్నాను. 20 00:01:21,728 --> 00:01:24,981 నేను, నేనసలు నమ్మలేకపోతున్నాను. 21 00:01:25,064 --> 00:01:26,691 మా అక్క చెప్పింది నిజం. 22 00:01:26,774 --> 00:01:28,818 -మంచిది. సరే అయితే. -ఇలా జరుగుతుందని తను ముందే చెప్పింది. 23 00:01:28,902 --> 00:01:30,612 నువ్వు తనకి ముందే చెప్పావా? 24 00:01:30,695 --> 00:01:32,530 అవును. నన్ను క్షమించు. 25 00:01:32,614 --> 00:01:34,782 రోజ్, మనకి పిల్లలు వద్దని ముందే అనుకున్నాం. 26 00:01:34,866 --> 00:01:39,078 మన మొదటి డేట్ రోజే ఈ విషయంపై మనం ఒక అంగీకారానికి వచ్చాం. 27 00:01:39,162 --> 00:01:42,832 మనం పిల్లలున్న తల్లిదండ్రుల్ని చూసి ఎప్పుడూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. 28 00:01:43,791 --> 00:01:45,376 ఛ, సారీ, నా వల్ల కాదు. 29 00:01:45,919 --> 00:01:48,880 రోజ్, నేను తండ్రిగా ఉండలేను. నీకా విషయం తెలుసు. 30 00:01:48,963 --> 00:01:50,798 మార్క్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 31 00:01:52,050 --> 00:01:53,259 ఖచ్చితంగా. 32 00:01:54,052 --> 00:01:57,972 అయితే ఇంటికి రా, దీని గురించి మాట్లాడుకుందాం. 33 00:01:58,598 --> 00:02:00,308 నేను ఇంటి బయటే నిలబడి ఉన్నాను. 34 00:02:00,391 --> 00:02:03,811 నువ్వు తిరిగి వచ్చే వరకూ ఇక్కడే ఉండాల్సి వచ్చినా రాత్రంతా ఇక్కడే ఎదురుచూస్తూ ఉంటా. 35 00:02:04,395 --> 00:02:05,396 ఓకే? 36 00:02:06,856 --> 00:02:08,273 ప్లీజ్. 37 00:02:08,357 --> 00:02:10,235 లేదు. నా వల్ల కాదు. 38 00:02:10,318 --> 00:02:13,238 నేను ప్రస్తుతం ఒంటరిగా ఉండాడలనుకుంటున్నా. నన్ను క్షమించు, నేను దీన్ని డీల్ చేయలేను. 39 00:02:13,321 --> 00:02:14,948 ప్లీజ్, నన్నిలా వదిలి వెళ్ళడం న్యాయం కాదు. 40 00:02:15,031 --> 00:02:16,950 -పిచ్చి మార్క్. -ప్రస్తుతం దీన్ని డీల్ చేయలేను. 41 00:02:17,033 --> 00:02:19,244 -నీ అవసరం ఉంది. -నేను రాలేను. 42 00:02:21,704 --> 00:02:24,040 రోజ్. రోజ్? 43 00:02:26,209 --> 00:02:29,212 అవును, కట్ అయినందుకు సారీ. సిగ్నల్ సరిగా అందలేదు. 44 00:02:29,295 --> 00:02:31,256 -అదేదో శాటిలైట్... -మార్క్? 45 00:02:31,339 --> 00:02:32,715 ప్లీజ్, అలా చేయకు. 46 00:02:32,799 --> 00:02:34,175 ఎక్కడున్నావ్? 47 00:02:34,259 --> 00:02:36,928 చెప్పాను కదా. ఎడారిలో డ్రైవ్ చేస్తున్నాను. 48 00:02:37,011 --> 00:02:39,514 దక్షిణం వైపు వెళ్తున్నా. 10 గంటలకి టుస్సన్ చేరతాను, 49 00:02:39,597 --> 00:02:41,391 ఆండీ దగ్గర ఉందామని అనుకుంటున్నా. 50 00:02:41,891 --> 00:02:43,977 నేను చాలా వర్రీ అయ్యాను. 51 00:02:44,060 --> 00:02:46,813 నేను పోలీసులకి కాల్ చేశాను, మార్క్. నువ్వు బానే ఉన్నావా? 52 00:02:46,896 --> 00:02:48,439 ఏంటీ... పోలీసులకి కాల్ చేశావా? 53 00:02:48,523 --> 00:02:51,526 నీకేదైనా యాక్సిడెంట్ జరిగిందేమో, చనిపోయావేమో అనుకున్నాను. 54 00:02:51,609 --> 00:02:52,652 ఏంటి? 55 00:02:52,735 --> 00:02:55,738 లైన్ ఒక్క క్షణమే కదా కట్ అయింది. అది యాక్సిడెంట్ అనుకున్నావా? 56 00:02:55,822 --> 00:02:58,449 -ఎందుకంత మెలోడ్రామా చేస్తున్నావ్, రోజ్? -మెలోడ్రామానా? 57 00:02:58,533 --> 00:03:01,786 నువ్వు వెళ్లి మూడు రోజులయింది, మార్క్. 58 00:03:03,079 --> 00:03:04,080 లేదు. 59 00:03:04,163 --> 00:03:05,540 "లేదు" అంటే ఏంటి నీ ఉద్దేశం? 60 00:03:05,623 --> 00:03:06,666 రోజ్, చూడు, నాకు అర్థమయింది. 61 00:03:06,749 --> 00:03:09,377 నీక్కూడా ఇది కష్టంగా ఉంది, నేను స్వార్థంగా ప్రవర్తిస్తున్నా, 62 00:03:09,460 --> 00:03:11,129 కానీ నువ్వు చేయడానికి ప్రయత్నిస్తున్నవన్నీ, దయచేసి ఆపు. 63 00:03:11,963 --> 00:03:14,257 ఏంటి... ఏంటి... నేను ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నానంటావ్? 64 00:03:14,340 --> 00:03:16,175 నాకు తెలీదు, కానీ పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. 65 00:03:16,259 --> 00:03:17,343 పిచ్చిదానిలానా? 66 00:03:17,427 --> 00:03:19,345 ఓకే, నేను గర్భావతినని చెప్పాను, 67 00:03:19,429 --> 00:03:23,474 గ్యారేజీ తలుపుని గుద్ది, కారు తీసుకుని వెళ్ళిపోయావు. 68 00:03:23,558 --> 00:03:27,937 ఎంతో ప్రయత్నిస్తే గానీ, మూడు రోజుల తర్వాత ఇప్పుడు నీతో మాట్లాడగలుగుతున్నాను, 69 00:03:28,021 --> 00:03:29,230 నాకు పిచ్చి పట్టిందంటావా? 70 00:03:30,148 --> 00:03:32,066 రోజ్, ఈరోజు ఇంకా ఆదివారమేగా. 71 00:03:32,150 --> 00:03:33,735 నేను ఇల్లు వదిలి అరగంటే అయింది. 72 00:03:33,818 --> 00:03:35,278 -ఈరోజు బుధవారం, మార్క్. -ఏంటి... 73 00:03:35,361 --> 00:03:37,280 అసలు నీ సమస్య ఏంటి? 74 00:03:37,363 --> 00:03:38,531 నన్ను భయపెడుతున్నావు. 75 00:03:38,615 --> 00:03:40,450 ఓకే, మీ అక్క నీతో ఇలా చేయిస్తోందా? 76 00:03:41,576 --> 00:03:42,911 చెత్త జోహానా. 77 00:03:44,412 --> 00:03:47,165 ఓకే, పదే పదే నాకు కాల్ చేయడం మానుకో. 78 00:03:47,248 --> 00:03:48,833 మార్క్? 79 00:03:48,917 --> 00:03:51,044 -అమ్మా? -మార్క్, నువ్వేనా? 80 00:03:51,127 --> 00:03:53,671 సారీ, నేను వేరే... నేను ఇప్పుడే రోజ్ తో మాట్లాడుతున్నా. 81 00:03:53,755 --> 00:03:55,965 -నా బేబీ. -నువ్వు బానే ఉన్నావా? 82 00:03:56,049 --> 00:03:58,760 హనీ, నువ్వు క్షేమంగా ఉన్నావని ఇప్పుడు నేను కొంచెం కుదుటపడ్డాను. 83 00:03:58,843 --> 00:04:01,012 -ఏం జరుగుతోంది నీకు? ఎక్కడున్నావు? -ఏమీ లేదు. 84 00:04:01,095 --> 00:04:03,223 అమ్మా, రిలాక్స్, ఓకే? 85 00:04:03,306 --> 00:04:07,894 రోజ్ గర్భవతి, అందుకని అంతే. 86 00:04:07,977 --> 00:04:09,187 నాకు తెలుసు, హనీ. 87 00:04:11,105 --> 00:04:12,565 అప్పుడే నీకు చెప్పేసిందా? 88 00:04:12,649 --> 00:04:15,944 ఓహ్, హనీ. తను చెప్పాల్సిన అవసరం లేదు. నేనే గమనించా. 89 00:04:16,026 --> 00:04:17,653 తనకిప్పుడు నాలుగో నెల, మార్క్. 90 00:04:18,612 --> 00:04:19,697 ఏం మాట్లాడుతున్నావ్, అమ్మా? 91 00:04:19,781 --> 00:04:23,868 ఈరోజు నేను రోజ్ ని చూశాను, తనకి పెద్ద, అందమైన పొట్ట ఉంది. 92 00:04:24,452 --> 00:04:26,162 -తను చాలా బాధలో ఉంది. -ఏంటి నువ్వనేది... 93 00:04:26,246 --> 00:04:27,872 తను నిన్ను బాగా మిస్సవుతోంది, కానీ... 94 00:04:27,956 --> 00:04:29,249 అమ్మా, నేను టుస్సన్ వెళ్తున్నాను. 95 00:04:29,332 --> 00:04:31,292 ఆండీ దగ్గర రెండు రోజులు ఉంటాను. 96 00:04:31,376 --> 00:04:33,503 నేను కొంచెం కుదుటపడేవరకూ రెండు రోజులు ఉంటాను, ఓకే? 97 00:04:33,586 --> 00:04:37,298 దీని గురించి నిర్ణయం తీసుకోడానికి నాకు బోలెడంత సమయం ఉంది, ఓకే? 98 00:04:37,382 --> 00:04:40,051 తను కేవలం నాలుగు వారాల గర్భవతినని చెప్పింది. 99 00:04:40,134 --> 00:04:41,970 నాలుగు వారాలు, నాలుగు నెలలు కాదు. 100 00:04:42,053 --> 00:04:43,096 వారాలు. 101 00:04:43,179 --> 00:04:44,889 ఇప్పుడే కారు వెనక్కి తిప్పు. 102 00:04:44,973 --> 00:04:47,684 లేదమ్మా. నీకసలు... ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. 103 00:04:47,767 --> 00:04:49,227 అర్థం కావట్లేదా? 104 00:04:49,310 --> 00:04:52,272 ఆ అమ్మాయి ఎంత బాధ పడుతోందో నాకు బాగా అర్థం అవుతోంది. 105 00:04:52,355 --> 00:04:54,983 -నిన్ను నేను ఒక్కదాన్నే పెంచాను. -చూడు, నేనిప్పుడు అలా చేయలేనమ్మా? 106 00:04:55,066 --> 00:04:57,318 -హనీ, నువ్వు వెళ్ళిపోయి నాలుగు నెలలయింది. -అమ్మా? అది... అదంతే, బై. 107 00:05:01,197 --> 00:05:03,241 హేయ్, ఆండ్రూ ఐటి నుండి ఆండ్రూని. 108 00:05:03,324 --> 00:05:05,743 ఇప్పుడు ఫోన్ మాట్లాడలేను, కాబట్టి మెసేజ్ వదలండి. 109 00:05:07,036 --> 00:05:09,163 నేనే బ్రో. మార్క్ ని. 110 00:05:09,247 --> 00:05:11,791 నీకు ఈరోజు ముఖ్యమైన డేట్ లేదనే అనుకుంటున్నాను, 111 00:05:11,875 --> 00:05:14,085 ఎందుకంటే, నేను మీ ఇంటికి వస్తున్నాను. 112 00:05:14,752 --> 00:05:17,797 రోజ్ తో పెద్ద గొడవ జరిగింది. 113 00:05:17,881 --> 00:05:21,009 తను... 114 00:05:22,093 --> 00:05:23,678 తను గర్భవతి. 115 00:05:23,761 --> 00:05:24,888 నా వల్ల కాదు. 116 00:05:24,971 --> 00:05:28,224 నేను... నేను దీనికి కమిట్ అవ్వలేను, తెలుసా? 117 00:05:28,808 --> 00:05:30,018 నా మొహం కూడా చూడని నా తండ్రి ఉండగా, 118 00:05:30,101 --> 00:05:32,729 మరొకరిని ఎప్పటికీ ప్రేమిస్తానని నేను ప్రామిస్ చేయలేను. 119 00:05:33,897 --> 00:05:37,066 ఏదేమైనా, ప్రస్తుతం నాకు ఫ్రెండ్ కావాలి. 120 00:05:37,150 --> 00:05:38,693 ఇక్కడ రోడ్డు మీద ఒక్క పురుగూ లేదు, 121 00:05:38,776 --> 00:05:41,738 బహుశా పది గంటలకి నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నీకు ఓకేనా? 122 00:05:41,821 --> 00:05:43,031 కాసేపట్లో కలుస్తాను. 123 00:05:46,284 --> 00:05:47,285 హాయ్, ఫ్రెండ్. 124 00:05:48,328 --> 00:05:49,621 -మార్క్? -అవును, సారీ, 125 00:05:49,704 --> 00:05:52,582 నీ ఫోనులో ఒక పిచ్చి మెసేజీ వదిలాను. 126 00:05:52,665 --> 00:05:53,750 నేను మీ ఇంటికి రావచ్చా అని 127 00:05:53,833 --> 00:05:55,460 -అడుగుతున్నాను, మామా. -ఏంటిరా నువ్వు, మార్క్? 128 00:05:55,543 --> 00:05:57,128 వో, ఏం జరిగింది మామా? 129 00:05:57,212 --> 00:05:59,839 నీకు పిల్లలు వద్దని నాకు తెలుసు, కానీ నేను... 130 00:05:59,923 --> 00:06:01,799 నువ్వు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావని అస్సలు ఊహించలేదు. 131 00:06:02,342 --> 00:06:04,636 -ఏమంటున్నావ్? -పారిపోతావని అనుకోలేదు. 132 00:06:04,719 --> 00:06:06,137 నేను పారిపోతున్నానని ఎవరన్నారు? 133 00:06:06,221 --> 00:06:08,681 ఈరోజు ఉదయం తను గర్భవతి అని తెలిసింది, కాసేపు ఒంటరిగా ఉందామనుకున్నా. 134 00:06:08,765 --> 00:06:11,434 అంతే. తనని అబోర్షన్ చేయించుకోమని వెంటనే అడగలేను కదా. 135 00:06:11,517 --> 00:06:13,186 ఇంకా... నిజం చెప్పాలంటే అది... 136 00:06:13,269 --> 00:06:15,355 అబోర్షనా? వో, వో, వో, ఆపు, మార్క్. 137 00:06:15,438 --> 00:06:17,565 బిడ్డ పుట్టి ఆరు నెలలైంది. 138 00:06:17,649 --> 00:06:20,735 నీ భార్యకి సాయం చేయడానికి నేను ఫీనిక్స్ షిఫ్ట్ అయ్యాను. 139 00:06:20,818 --> 00:06:22,237 బాబు పుట్టినపుడు నేను అక్కడే ఉన్నాను. 140 00:06:22,320 --> 00:06:23,780 ఓహ్, మామా. 141 00:06:23,863 --> 00:06:27,242 నిజంగా? నువ్వు కూడానా? కమాన్. ఇక ఆపు. 142 00:06:27,325 --> 00:06:28,993 ఏంటి? ఏంటి నువ్వు మాట్లాడేది? 143 00:06:29,077 --> 00:06:30,161 ఏంటసలు... అది కాదు... 144 00:06:30,245 --> 00:06:33,039 ఫ్రెండ్. కమాన్, మామా, ఇదేం బాలేదు. 145 00:06:33,122 --> 00:06:34,832 వాళ్ళతో కలిసి నువ్వు కూడానా? 146 00:06:34,916 --> 00:06:36,084 వాళ్ళా? వాళ్ళెవరు? 147 00:06:36,167 --> 00:06:38,628 వాళ్ళే, ఆ జోహానా, ఇంకెవరో. 148 00:06:38,711 --> 00:06:41,381 రాబ్ విషయంలో తను చేసింది గుర్తుందా? 149 00:06:41,464 --> 00:06:43,633 ప్రతిరోజూ ఒకే సమయంలో మనం అతనికి కాల్ చేసి 150 00:06:43,716 --> 00:06:46,052 అతని చేత డ్రగ్స్ మాన్పించడానికి ప్రయత్నించాం. 151 00:06:46,135 --> 00:06:48,805 ఇది కూడా తను చేస్తున్న పిచ్చి పనే అని నా ఉద్దేశం. 152 00:06:48,888 --> 00:06:50,557 -అదేం కాదు. -అవును, అదే. 153 00:06:50,640 --> 00:06:51,808 -ఈసారి పనిచేయట్లేదు. -అదేం కాదు. 154 00:06:51,891 --> 00:06:54,018 ఎందుకో చెప్పనా, అదంతా చెత్త కాబట్టి. 155 00:06:54,102 --> 00:06:55,895 ఏమైనా, ఇలా డ్రైవింగ్ చేస్తూనే ఉండాలనిపిస్తోంది, మామా. 156 00:06:55,979 --> 00:06:57,522 మార్క్, నేను జోహానాతో మాట్లాడుతూనే ఉంటాను. 157 00:06:57,605 --> 00:07:00,525 నువ్వు చెప్పే చెత్తని నమ్మే ఏకైక వ్యక్తి తనే. 158 00:07:00,608 --> 00:07:01,943 -నా చెత్తా? -అవును. 159 00:07:02,026 --> 00:07:05,780 నువ్వు ఇప్పుడే ఇల్లు విడిచి పెట్టానని అబద్ధం చెప్పట్లేదని జోహానా అంటుంది. 160 00:07:05,864 --> 00:07:07,866 నువ్వు ఏదో జబ్బుతో బాధపడుతున్నావని... 161 00:07:07,949 --> 00:07:11,744 అంటే ఎప్పుడూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నట్లు అనిపించడం లేదా... నాకు తెలీదు. 162 00:07:11,828 --> 00:07:13,872 ఏదో దాన్ని ప్రేరేపిస్తుందని తను చెప్పింది, అవునా? 163 00:07:13,955 --> 00:07:16,499 నువ్వు ఒకేరోజుని గడుపుతున్నట్లు నీకు అనిపిస్తుందని కూడా చెప్పింది. 164 00:07:16,583 --> 00:07:18,459 ఓహ్, నిజమా? ఏ రోజుని? 165 00:07:18,543 --> 00:07:20,503 నీ జీవితాన్ని నాశనం చేసుకున్న రోజుని, మార్క్. 166 00:07:20,587 --> 00:07:23,172 నీ ప్రెగ్నెంట్ భార్యని వదిలేసి ఎడారిలోకి కారు నడుపుకుంటూ వెళ్ళిన రోజు. 167 00:07:23,256 --> 00:07:25,884 లేదు, లేదు, ఆండీ. కమాన్, ఇక ఆపు. 168 00:07:25,967 --> 00:07:26,968 ఇది ఏ రోజో చెప్పు? 169 00:07:27,927 --> 00:07:29,137 ఇది ఏ రోజో చెప్పు. 170 00:07:29,220 --> 00:07:31,931 ఇది, ఇది ఆదివారం. ఆదివారం, ఫిబ్రవరి 9. 171 00:07:32,015 --> 00:07:35,018 నేను అరగంట క్రితం ఇల్లు వదిలి వచ్చాను, బిడ్డ పుట్టలేదు. 172 00:07:35,435 --> 00:07:37,228 నీ ఫోను స్క్రీను వంక ఒకసారి చూడు. 173 00:07:37,312 --> 00:07:38,396 అందులో ఉన్న తేదీ ఏంటో చెప్పు? 174 00:07:38,479 --> 00:07:39,689 మామా, నేను డ్రైవ్ చేస్తున్నాను, నాకు కనీసం... 175 00:07:39,772 --> 00:07:42,692 ప్లీజ్, మార్క్, మార్క్. మార్క్, స్క్రీన్ మీద ఏముందో చెప్పు. 176 00:07:42,775 --> 00:07:45,570 ఓహ్, దేవుడా. ఓకే, ఒక్క క్షణం, దేవుడా. 177 00:07:45,653 --> 00:07:47,280 అదీ, అందులో ఖచ్చితంగా ఏముంటుందంటే... 178 00:07:50,575 --> 00:07:52,619 లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు. ఓకే. 179 00:07:52,702 --> 00:07:54,412 అదసలు... నువ్వెలా దాన్ని... 180 00:07:54,495 --> 00:07:57,040 అది... నువ్వు చాలా తెలివైన వాడివి మామా. ఎలా చేయగలిగావ్? 181 00:07:57,123 --> 00:07:58,333 నేనేమీ చేయలేదు. 182 00:07:58,416 --> 00:08:00,168 లేదు, నువ్వు నా ఫోనులో తేదీ మార్చేశావు, 183 00:08:00,251 --> 00:08:01,252 సంవత్సరం కూడా వేరుగా ఉంది. 184 00:08:01,336 --> 00:08:03,129 అవును, ఎందుకంటే అదే నిజం, మార్క్. 185 00:08:03,213 --> 00:08:06,507 లేదు, అదేం కాదు. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. 186 00:08:06,591 --> 00:08:07,967 మార్క్, ఐ లవ్ యు. 187 00:08:08,051 --> 00:08:11,221 నిజంగా, నువ్వు ఫోన్ ఎత్తినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 188 00:08:11,304 --> 00:08:13,056 కానీ నీకు ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, మామా. 189 00:08:13,139 --> 00:08:16,059 నువ్వు తిరిగి రావాలని కోరుకునే ఒక అందమైన, అందమైన భార్య. 190 00:08:16,142 --> 00:08:20,855 కాబట్టి, నువ్వు ఎక్కడ ఉన్నా, కారు వెనక్కి తిప్పుకుని ఇంటికి తిరిగి రా. 191 00:08:20,939 --> 00:08:22,899 ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదని ఖచ్చితంగా చెబుతున్నా. 192 00:08:22,982 --> 00:08:24,275 హలో? 193 00:08:24,359 --> 00:08:28,196 ఆండీ? ఆండీ? లైన్లో ఉన్నావా? ఆండీ? 194 00:08:28,279 --> 00:08:30,406 మార్క్? నువ్వేనా? 195 00:08:30,490 --> 00:08:32,575 అమ్మా? నువ్వు ఆండీతో ఉన్నావా? 196 00:08:32,659 --> 00:08:35,828 ఓహ్, నా బేబీ. 197 00:08:35,911 --> 00:08:37,372 నా బేబీ. 198 00:08:39,415 --> 00:08:40,666 నువ్వు బానే ఉన్నావా? 199 00:08:42,334 --> 00:08:43,336 -నేను నీకు ఎందుకు కాల్ చేశానంటే... -అమ్మా. 200 00:08:43,419 --> 00:08:47,465 ...ఐదేళ్ళ క్రితం నీ గొంతు ఆఖరిసారి ఒకరు విన్నారు. 201 00:08:47,549 --> 00:08:49,050 అదే నీ ఫ్రెండ్ ఆండీ. 202 00:08:49,133 --> 00:08:50,760 నేను ఇప్పుడే ఆండీతో మాట్లాడాను. 203 00:08:51,719 --> 00:08:52,762 నువ్వు బానే ఉన్నావా? 204 00:08:52,845 --> 00:08:56,975 మార్క్, నువ్వు కనిపించకుండా పోయినప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాలేదు. 205 00:08:57,058 --> 00:08:59,561 నేను జబ్బు పడ్డాను. బాగా జబ్బు పడ్డాను, హనీ. 206 00:08:59,644 --> 00:09:04,649 నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోలేదు, కానీ ఒక విషయం చెప్పే మరో అవకాశం దొరక్కపోవచ్చు. 207 00:09:04,732 --> 00:09:06,067 ఏం చెప్పాలనుకున్నావు? 208 00:09:06,150 --> 00:09:08,903 నువ్వు నీ కుటుంబం నుండి ఎందుకు పారిపోయావో నాకు తెలుసు. 209 00:09:08,987 --> 00:09:10,989 అది మీ నాన్న వల్ల. 210 00:09:11,072 --> 00:09:15,243 -ఎందుకంటే నువ్వు పుట్టాక ఆయన వెళ్ళిపోయాడు. -అమ్మా. 211 00:09:15,326 --> 00:09:16,536 నేను చెప్పేది విను. 212 00:09:17,287 --> 00:09:19,706 నేను తల్లిని కాబోతున్నానని మీ నాన్నకు అసలు తెలియదు. 213 00:09:21,499 --> 00:09:22,709 ఆగు, ఏంటి? 214 00:09:22,792 --> 00:09:24,919 ఆయన... ఆయన ఆర్మీలో ఉన్నారు. 215 00:09:25,003 --> 00:09:28,256 నేను గర్భవతినని తెలిసిన రోజే ఆయన డ్యూటీ మీద వెళ్ళాల్సి వచ్చింది, 216 00:09:28,339 --> 00:09:30,967 అతనికి చెప్పడానికి ధైర్యం చాలలేదు. 217 00:09:32,093 --> 00:09:35,096 కొద్ది వారాల తర్వాత యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు. 218 00:09:36,890 --> 00:09:38,933 ఏంటి నువ్వు చెప్పేది, అమ్మా? నేను... 219 00:09:39,017 --> 00:09:41,686 అతని గురించి అడగడం మొదలుపెట్టినపుడు నువ్వు చాలా చిన్నవాడివి, 220 00:09:41,769 --> 00:09:46,107 కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడో ఆయన అడ్వెంచర్ చేస్తున్నాడని చెప్పాను, 221 00:09:46,191 --> 00:09:49,194 ఏదో ఒకరోజు ఇంటికి తిరిగి రావొచ్చని చెప్పాను. 222 00:09:49,277 --> 00:09:54,240 నువ్వు పసివాడివి, ఆ కథ నీకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. 223 00:09:54,324 --> 00:09:58,661 ఆయన పురావస్తు శాస్త్రవేత్తని కొన్నిసార్లు మీ స్నేహితులకు చెప్పేవాడివి. 224 00:09:58,745 --> 00:10:03,041 తర్వాత వ్యోమగామి అని, లేదంటే సినిమా హీరో అని చెప్పేవాడివి. 225 00:10:04,167 --> 00:10:06,085 నీకు ఏది సంతోషంగా అనిపిస్తే అది. 226 00:10:06,169 --> 00:10:08,838 ఆ సంతోషాన్ని నీనుండి ఎలా దూరం చేయగలను? 227 00:10:08,922 --> 00:10:10,048 ఓహ్, అమ్మా. 228 00:10:10,131 --> 00:10:13,343 అలా ఒకరోజు అడగడమే మానేశావు. 229 00:10:14,219 --> 00:10:16,012 ఎందుకిలా చేశావు? 230 00:10:16,095 --> 00:10:19,390 మీ నాన్న నిన్ను మనస్పూర్తిగా ప్రేమించేవారు 231 00:10:19,474 --> 00:10:21,392 ఎందుకంటే నువ్వు మంచివాడివిరా, మార్క్. 232 00:10:21,476 --> 00:10:24,103 వింటున్నావా? నువ్వు మంచివాడివి. 233 00:10:27,690 --> 00:10:29,317 మార్క్? మార్క్? 234 00:10:29,776 --> 00:10:31,361 బేబీ, ఉన్నావా? 235 00:10:32,195 --> 00:10:33,279 మార్క్! 236 00:10:41,955 --> 00:10:43,581 అరె ఛ! 237 00:10:46,167 --> 00:10:47,544 ఛ. 238 00:10:50,296 --> 00:10:53,633 ఓహ్, దేవుడా, నేను ఏం చేస్తున్నాను? నేను ఏం చేస్తున్నాను? 239 00:10:57,845 --> 00:11:00,557 అమ్మా? ఉన్నావా? 240 00:11:01,724 --> 00:11:02,850 అమ్మా? 241 00:11:04,769 --> 00:11:06,980 నువ్వు ఎన్నో ఏళ్ళ క్రితమే నిజం చెప్పుంటే బాగుండేది. 242 00:11:07,564 --> 00:11:11,442 నిజంగా అంటున్నాను. కానీ నాకు అర్థమయింది. 243 00:11:11,526 --> 00:11:13,778 ఆయన చనిపోయాడని తెలిసింది కాబట్టి, నేను... 244 00:11:13,862 --> 00:11:16,614 నేను బాధగా... నాకు చాలా బాధగా ఉంది. 245 00:11:16,698 --> 00:11:19,409 నాకు చాలా బాధగా ఉంది. 246 00:11:24,622 --> 00:11:26,666 అమ్మా, నువ్వు వింటున్నావో లేదో నాకు తెలీదు. 247 00:11:26,749 --> 00:11:30,795 కానీ నేను... నేనిప్పుడే కారుని వెనక్కి తిప్పబోతున్నాను. 248 00:11:30,879 --> 00:11:34,716 నేను నా భార్యకి కాల్ చేయబోతున్నాను ఇంటికి వస్తున్నానని చెబుతాను. 249 00:11:41,055 --> 00:11:42,473 -హలో? -హాయ్. 250 00:11:42,974 --> 00:11:44,058 చెప్పండి? 251 00:11:44,142 --> 00:11:47,145 ఓహ్, సారీ, నేను, రోజ్ కోసం చూస్తున్నాను. 252 00:11:47,228 --> 00:11:49,731 లేదు, ఇక్కడ రోజ్ లేదు. నా పేరు జీసస్. 253 00:11:49,814 --> 00:11:52,775 ఇది 555-0133 కదా? 254 00:11:52,859 --> 00:11:54,819 అవును, ఇదే నా నెంబర్. 255 00:11:54,903 --> 00:11:56,696 ఓహ్, ఛ, ఓకే. 256 00:12:03,119 --> 00:12:04,329 చాల్లే ఆపు. 257 00:12:04,412 --> 00:12:06,039 ఆండీ మాట్లాడుతున్నాను. 258 00:12:06,122 --> 00:12:08,875 ఆండీ, నేనేరా మార్క్ ని. 259 00:12:08,958 --> 00:12:12,253 సరే, చెప్పేది విని కంగారుపడకు, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. 260 00:12:12,337 --> 00:12:14,380 చూడు, కొద్ది నిమిషాల క్రితం పరిస్థితులు చక్కదిద్దడానికి 261 00:12:14,464 --> 00:12:16,507 సమయం మించి పోలేదని చెప్పాను. 262 00:12:16,591 --> 00:12:18,259 ఓరి దేవుడా, మార్క్. 263 00:12:18,343 --> 00:12:20,428 అలా చెప్పి కొన్ని ఏళ్ళు అయిందని నువ్వు నాకు చెబుతావు. 264 00:12:20,511 --> 00:12:22,263 కానీ నాకు ఇప్పుడే అనిపించింది. 265 00:12:22,347 --> 00:12:25,016 నేను ఇంటికి వస్తున్నాను, నా భార్యకి ఆ విషయం చెప్పాలి. 266 00:12:25,099 --> 00:12:29,938 మార్క్. నేను... నాకు... నీకీ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. 267 00:12:30,563 --> 00:12:32,649 కానీ రోజ్ నీకు విడాకులిచ్చి ఏళ్ళయింది. 268 00:12:33,441 --> 00:12:35,693 నువ్వు అధికారికంగా చనిపోయినట్లు లెక్క. 269 00:12:36,402 --> 00:12:38,530 మీ అమ్మ అంత్యక్రియల సమయంలో, 270 00:12:38,613 --> 00:12:40,073 నువ్వు తప్పకుండా వస్తావని మేమందరం అనుకున్నాం. 271 00:12:40,156 --> 00:12:42,742 కానీ నువ్వు రాకపోయేసరికి, ఎప్పటికీ రావనుకున్నాం. 272 00:12:43,409 --> 00:12:44,827 రోజ్ ఇప్పుడు కొత్త జీవితం గడుపుతోంది. 273 00:12:46,704 --> 00:12:48,540 ఎంతకాలం గడిచింది? 274 00:12:48,623 --> 00:12:51,084 -ఏంటి నువ్వు అడిగేది? -మనం పోయినసారి మాట్లాడుకుని. 275 00:12:51,167 --> 00:12:52,460 ఛ, మార్క్, నాకు తెలీదు, మామా. 276 00:12:52,544 --> 00:12:53,545 చెప్పు. 277 00:12:55,046 --> 00:12:56,881 జూలియన్ కి ఈరోజు 12 ఏళ్ళు నిండుతున్నాయి. 278 00:12:57,590 --> 00:12:59,425 మేమిప్పుడు వాడి పుట్టినరోజు పార్టీ చేస్తున్నాం. 279 00:13:00,301 --> 00:13:01,719 జూలియన్? 280 00:13:01,803 --> 00:13:02,804 నీ కొడుకు. 281 00:13:03,555 --> 00:13:04,764 జూలియన్ నీ కొడుకు. 282 00:13:04,847 --> 00:13:07,725 నాకు... నాకు కొడుకు ఉన్నాడా? 283 00:13:07,809 --> 00:13:10,228 మామా, నేను చెప్పేది విను, నువ్విలా చేయడం న్యాయం కాదు. 284 00:13:11,062 --> 00:13:15,692 నువ్వు కొన్నేళ్ళకొకసారి ప్రత్యక్షమై గందరగోళం సృష్టిస్తానంటే కుదరదు, మామా. 285 00:13:15,775 --> 00:13:18,444 ప్లీజ్, అక్కడ రోజ్ ఉందా? తను... నీతోనే ఉందా? 286 00:13:18,528 --> 00:13:20,572 తనని ఫోన్ దగ్గరికి పిలుస్తావా, ప్లీజ్? 287 00:13:20,655 --> 00:13:22,657 లేదు. అది మంచి ఆలోచన అని నాకు అనిపించట్లేదు. 288 00:13:22,740 --> 00:13:25,577 నేను తనకి ఒక విషయం చెప్పాలి, ప్లీజ్. 289 00:13:28,288 --> 00:13:29,289 ఓకే. సరే అయితే. 290 00:13:30,498 --> 00:13:34,919 హేయ్. అవును, అవును, అతనే. మార్క్. 291 00:13:37,839 --> 00:13:40,967 -హలో? -రోజ్, నేనే. 292 00:13:41,509 --> 00:13:44,554 నేను నీకో విషయం చెప్పాలి, ఐ లవ్ యు. 293 00:13:44,637 --> 00:13:47,348 నన్ను క్షమించు, నన్ను క్షమించు. 294 00:13:48,433 --> 00:13:50,268 నీకిలా చేసినందుకు నన్ను క్షమించు. 295 00:13:51,144 --> 00:13:54,856 నేను భయపడ్డాను. చాలా చాలా భయపడ్డాను. 296 00:13:54,939 --> 00:13:56,816 నేను ఇంటికి వస్తున్నాను, ఓకే? 297 00:13:58,318 --> 00:14:00,987 మార్క్, ప్లీజ్ రావొద్దు. 298 00:14:01,070 --> 00:14:02,614 నేను వచ్చి తీరాలి. 299 00:14:02,697 --> 00:14:06,576 చూడు, 12 ఏళ్ళ తర్వాత నువ్వు ఉన్నట్టుండి 300 00:14:06,659 --> 00:14:08,620 నీ కొడుకుని కలవాలని నిర్ణయించుకుంటే, 301 00:14:08,703 --> 00:14:11,414 నేను నిన్ను ఆపను, కానీ ఈరోజు కాదు. 302 00:14:11,497 --> 00:14:14,167 అతని పుట్టినరోజు వేడుక మధ్యలో మాత్రం కాదు. 303 00:14:15,084 --> 00:14:16,502 నువ్వు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా? 304 00:14:18,046 --> 00:14:19,047 నేను... 305 00:14:19,130 --> 00:14:20,131 ప్లీజ్. 306 00:14:20,965 --> 00:14:22,842 నేనిప్పుడు ఆండీ భార్యని. 307 00:14:23,843 --> 00:14:24,886 ఏంటి? 308 00:14:24,969 --> 00:14:28,223 నువ్వు మాయమైపోయినపుడు అతను నాకోసం ఉన్నాడు, అలా జరిగిపోయింది. 309 00:14:28,306 --> 00:14:29,307 ఇంకా అతను... 310 00:14:31,059 --> 00:14:33,478 హలో? మార్క్, నువ్వు లైన్లో ఉన్నావా? 311 00:14:34,646 --> 00:14:37,440 నా చేయి. నా చేయి. 312 00:14:38,107 --> 00:14:39,108 హలో? 313 00:14:39,192 --> 00:14:41,903 పరవాలేదు. నేను కాసేపట్లో ఇంట్లో ఉంటాను, ఓకే? 314 00:14:41,986 --> 00:14:44,280 కానీ కంగారుపడకు, నేను పార్టీలోకి రాను 315 00:14:44,364 --> 00:14:47,075 ఎందుకంటే నా చేయి రక్తం కారుతోందని ఇప్పుడే చూసుకున్నాను. 316 00:14:47,158 --> 00:14:49,452 -నీ చేయా? -నా కుడి చేయి. 317 00:14:49,536 --> 00:14:51,538 నేనిప్పుడు దానివంకే చూస్తున్నాను. 318 00:14:51,621 --> 00:14:54,040 గ్యారేజీ తలుపు మీద కొట్టినందుకు నాకు ఇప్పటికీ నొప్పిగా ఉంది 319 00:14:54,123 --> 00:14:56,376 నేను నిన్ను వదిలి ఎంతోసేపు అవలేదుగా. 320 00:14:57,126 --> 00:14:58,753 నువ్వేం అంటున్నావో నాకు అర్థం కావట్లేదు. 321 00:14:58,836 --> 00:15:04,300 దానర్థం నువ్వు ఎక్కడైతే ఉన్నావో, అది మరో కాలమో లేక చోటో లేక మరేదో. 322 00:15:04,384 --> 00:15:08,513 కానీ నేను ఇంటికి చేరాక, నువ్వు... నువ్వు మాత్రమే ఉంటావు, 323 00:15:08,596 --> 00:15:12,433 నాకోసం ఇంటి ముందు ఎదురుచూస్తూ ఉంటావు, నాకు మాటిచ్చినట్లుగా. 324 00:15:12,517 --> 00:15:15,436 అది 12 ఏళ్ళ క్రితం, మార్క్. 325 00:15:15,520 --> 00:15:17,689 అది నీకు కావొచ్చు, కానీ నాకు కాదు. 326 00:15:17,772 --> 00:15:21,234 కొద్ది నిమిషాల్లో నేను ఇంటికి చేరాక, నేను సరైతే స్వయంగా తెలుసుకుంటాను. 327 00:15:21,317 --> 00:15:23,987 నువ్వు నా మనసుని ముక్కలు చేశావు, మార్క్. 328 00:15:24,070 --> 00:15:25,697 నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. 329 00:15:26,364 --> 00:15:31,828 కానీ దయచేసి ఇప్పుడు నువ్వు తిరిగి రాకు. 330 00:15:31,911 --> 00:15:33,246 ప్లీజ్, మార్క్. 331 00:15:33,788 --> 00:15:34,789 రోజ్. 332 00:15:35,456 --> 00:15:36,749 రోజ్! 333 00:15:37,917 --> 00:15:40,962 రోజ్, నేను దాదాపు ఇంటికి వచ్చేశాను, ఇంకో నిమిషం అంతే, ఓకే? 334 00:15:41,045 --> 00:15:42,463 మరో నిమిషంలో నేను ఇంటిముందు ఉంటాను. 335 00:15:44,132 --> 00:15:45,133 హలో? 336 00:15:45,216 --> 00:15:47,427 ఇది మార్క్ యేనా? 337 00:15:48,678 --> 00:15:49,679 అవును. 338 00:15:50,847 --> 00:15:53,266 నేను... నేను జూలియన్ ని. 339 00:15:53,349 --> 00:15:55,560 నేను రోజ్ వాల్ష్ కొడుకుని. 340 00:15:56,144 --> 00:15:57,312 ఓహ్, దేవుడా. 341 00:15:57,395 --> 00:15:59,606 ఇది నిజంగా మీరేనా లేక మరెవరైనానో నాకు తెలీదు, 342 00:15:59,689 --> 00:16:02,984 లేదా మా నాన్న పాత ఫోన్ నెంబర్ ఉన్న వేరే ఎవరైనానో, లేక... 343 00:16:03,067 --> 00:16:05,612 లేదు. అది నేనే. 344 00:16:05,695 --> 00:16:08,615 నేను ఈ నంబరుకి ఎన్నోసార్లు కాల్ చేశాను, నేను... 345 00:16:08,698 --> 00:16:10,700 నీకోసం నేను ఉండనందుకు నన్ను క్షమించు. 346 00:16:11,409 --> 00:16:12,410 మనస్పూర్తిగా చెబుతున్నా. 347 00:16:13,244 --> 00:16:14,245 నన్ను క్షమించు. 348 00:16:16,164 --> 00:16:17,165 అవును... 349 00:16:19,417 --> 00:16:20,418 చూడండి... 350 00:16:20,501 --> 00:16:23,087 ఏదైనా ఒకరోజు, ఏదైనా కారణం కోసం, మీరు... 351 00:16:24,214 --> 00:16:28,134 ఏమో తెలీదు, బీర్ తాగడానికో లేక దేనికైనా, కలవాలనుకుంటే... 352 00:16:29,719 --> 00:16:33,431 నాకేమీ ఇబ్బంది లేదని మీకు చెప్పాలని అనిపించింది. 353 00:16:33,514 --> 00:16:35,975 జూలియన్, నా మాట విను. 354 00:16:36,059 --> 00:16:38,144 ఖచ్చితంగా తాగుదాం, ఓకే? 355 00:16:39,812 --> 00:16:43,149 మనం అన్నీ చేద్దాం. ఇంకా మరెన్నో కూడా చేద్దాం. 356 00:16:43,233 --> 00:16:44,442 వింటున్నావా? 357 00:16:45,902 --> 00:16:49,739 నేను మాటిస్తున్నాను. నేను ఎప్పటికీ నిన్ను నిరాశపరచను. 358 00:16:49,822 --> 00:16:52,242 నిన్ను ఈ భూమి మీద సంతోషకరమైన వ్యక్తిగా మార్చేందుకు 359 00:16:52,325 --> 00:16:54,994 నా శాయశక్తులా చేయగలిగింది చేస్తాను. 360 00:16:55,078 --> 00:16:56,246 నేను మాటిస్తున్నాను. 361 00:16:57,288 --> 00:16:58,790 వినడానికి బాగుంది. 362 00:16:58,873 --> 00:17:01,960 కానీ అన్నిటికంటే ముందు, నేను మీ అమ్మని చూడాలి, ఓకే? 363 00:17:02,043 --> 00:17:03,670 ఎందుకంటే తను నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. 364 00:17:04,337 --> 00:17:05,879 అవును. సరే అయితే. 365 00:17:06,965 --> 00:17:08,174 ఐ లవ్ యు, రా. 366 00:17:09,841 --> 00:17:11,344 ఐ లవ్ యు టూ, నాన్నా. 367 00:17:14,638 --> 00:17:15,723 ఓకే. 368 00:17:16,975 --> 00:17:17,975 నేను ఇంటికి వచ్చేశాను. 369 00:17:18,768 --> 00:17:19,769 నేను ఇంటికి వచ్చేశాను. 370 00:17:20,353 --> 00:17:23,063 -గుడ్ లక్. -థాంక్స్. బై. 371 00:17:24,941 --> 00:17:28,778 రోజ్. రోజ్, నేను ఇంటికి వచ్చేశాను. రోజ్? 372 00:18:35,136 --> 00:18:37,138 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ