1 00:00:24,775 --> 00:00:27,986 అమ్మ 2 00:00:28,070 --> 00:00:31,448 సెప్టెంబర్ 14 ఇండియన్ వెల్స్ 3 00:00:31,532 --> 00:00:34,910 నవంబర్ 9 రిబ్బన్ ఉడ్ / శాన్ డియాగో 4 00:00:42,543 --> 00:00:43,544 అమ్మా? 5 00:00:46,922 --> 00:00:48,757 స్కైలార్ 6 00:00:51,176 --> 00:00:52,177 హేయ్. 7 00:00:52,261 --> 00:00:53,345 ఓకే, వెళ్ళావా? 8 00:00:53,428 --> 00:00:56,890 అవును, నేను ఇంటి ముందున్నాను. నా ఉద్దేశం, మన పాత ఇల్లు. 9 00:00:56,974 --> 00:00:58,141 ఓకే, గుడ్. 10 00:00:58,225 --> 00:00:59,518 నిజం చెప్పాలంటే, కొంచెం భయమేస్తోంది. 11 00:00:59,601 --> 00:01:01,895 మరేం పరవాలేదు, ధైర్యంగా ఉండు. 12 00:01:02,688 --> 00:01:05,858 ఇల్లు చాలా వేరుగా కనిపిస్తోంది. దెయ్యాల కొంపలాగా. 13 00:01:05,941 --> 00:01:08,318 ఆగు. ఓకే, నేను... నేను ఇప్పుడే రిబ్బన్ ఉడ్ లోకి ప్రవేశించబోతున్నా. 14 00:01:08,402 --> 00:01:11,363 అప్పుడే అది జరుగుతుంది. 15 00:01:11,446 --> 00:01:13,282 సరిగ్గా ఏం జరగాలి? 16 00:01:13,365 --> 00:01:14,491 అంతరాయం. 17 00:01:14,575 --> 00:01:16,994 అవును, నాకు తెలుసు. కానీ, నా ఉద్దేశం, సరిగ్గా ఏమవుతుంది? 18 00:01:17,077 --> 00:01:19,079 నాకు తెలీదు. నాకు తెలీదు. అందులో... ఆ పోస్టులో అదే రాసుంది. 19 00:01:19,162 --> 00:01:22,749 అందులో "ఇండియన్ వెల్స్ బయటున్న ఎడారిలో నడుపుకుంటూ వెళితే, 20 00:01:22,833 --> 00:01:27,087 రిబ్బన్ ఉడ్ దగ్గరలో, మీ ఫోనులో అంతరాయం కలుగుతుంది, అప్పుడు..." 21 00:01:27,171 --> 00:01:30,174 అవును, నాకు తెలుసు. అప్పుడు నువ్వు భవిష్యత్తులో ఎవరితోనో కనెక్ట్ అవుతావు. 22 00:01:30,257 --> 00:01:32,467 లేదా గతంలో ఎవరితోనో. గతంలో అయితే బాగుండు. 23 00:01:32,551 --> 00:01:35,804 అవును. లేదంటే బహుశా అది ఇంటర్నెట్ చెత్తకూడా అయ్యుండొచ్చు. 24 00:01:35,888 --> 00:01:36,889 కమాన్. 25 00:01:36,972 --> 00:01:39,808 వేర్వేరు, సంబంధం లేని వ్యక్తుల నుండి ఎన్నో కథలు ఎలా సాధ్యం? 26 00:01:39,892 --> 00:01:42,519 నా ఉద్దేశం, అందులో ఎంతో కొంత నిజం ఉండుండాలి. 27 00:01:42,603 --> 00:01:44,771 అవును, సరే, అది నిజం కాకూడదని కోరుకుంటున్నా. 28 00:01:45,772 --> 00:01:47,024 ఎందుకలా అంటున్నావు? 29 00:01:47,107 --> 00:01:51,278 జనం అలాంటి కాల్స్ చేసినపుడు, వాళ్ళకు జరుగుతున్న భయంకరమైన, 30 00:01:51,361 --> 00:01:52,946 చెడు విషయాల వల్ల. 31 00:01:53,030 --> 00:01:55,574 ఒకవేళ మనం కనెక్ట్ అయినా కూడా, మనం దేన్నీ మార్చకూడదు. 32 00:01:55,657 --> 00:01:57,659 మనం దేన్నీ మార్చం, ఓకేనా? 33 00:01:58,243 --> 00:01:59,828 -మాటిస్తావా? -అవును, ఒట్టు. 34 00:01:59,912 --> 00:02:02,497 ఓకే, ఇప్పుడు ఏం జరిగినా కూడా, నాతో ఫోనులోనే ఉండు. 35 00:02:02,581 --> 00:02:06,919 నువ్వు అమ్మ పాత సెల్ వాడుతున్నావు, కాబట్టి లైన్ కట్ అవ్వొచ్చు, 36 00:02:07,002 --> 00:02:09,630 నాకు తెలీదు, ఎలాగోలా, మనం తనతో కనెక్ట్ అవ్వొచ్చు లేదా... 37 00:02:10,380 --> 00:02:12,090 ఇది ఖచ్చితంగా జరుగుతుందన్నట్లు నువ్వు మాట్లాడుతున్నావు. 38 00:02:12,174 --> 00:02:13,509 ఇది జరుగుతుంది. 39 00:02:13,592 --> 00:02:15,010 నాకు తెలీదు, కానీ నాకు తెలుసంతే. 40 00:02:15,761 --> 00:02:19,056 ఛ. ఓకే, నాకు రిబ్బన్ ఉడ్ కనిపిస్తోంది. 41 00:02:19,139 --> 00:02:20,182 ఓకే. 42 00:02:20,265 --> 00:02:21,517 రెడీ? 43 00:02:21,600 --> 00:02:22,601 అనుకుంటున్నా. 44 00:02:22,684 --> 00:02:28,524 అయితే అంతరాయం దాదాపు సరిగ్గా... ఇప్పుడే కలగాలి, 45 00:02:30,651 --> 00:02:32,528 లేదా ఇప్పుడు. 46 00:02:34,196 --> 00:02:35,322 హలో? 47 00:02:35,405 --> 00:02:37,032 -ఇంకా నేనే ఉన్నాను. -ఛ. 48 00:02:37,783 --> 00:02:39,117 నాకు వేరేగా ఏదీ వినిపించడం లేదు. 49 00:02:40,035 --> 00:02:41,036 నాక్కూడా లేదు. 50 00:02:41,703 --> 00:02:42,955 ఆశ్చర్యపోవద్దు. 51 00:02:44,373 --> 00:02:45,207 అవును. 52 00:02:47,292 --> 00:02:48,126 ఏంటి? 53 00:02:48,752 --> 00:02:50,170 నేను ఏం చేస్తున్నాను? 54 00:02:50,838 --> 00:02:53,841 నేను ఎడారి మధ్యలో ఉన్నాను, ఇంకా... 55 00:02:53,924 --> 00:02:55,551 నేను... 56 00:02:56,927 --> 00:02:59,847 నీతో ఇలా చేయిస్తున్నందుకు సారీ, జస్టిన్. ఇదంతా చెత్తపని. నేను... 57 00:03:00,681 --> 00:03:02,641 నేను తన గొంతు మళ్ళీ బాగా వినాలని అనుకున్నాననుకుంటా. 58 00:03:03,308 --> 00:03:04,309 గుడ్ బై చెప్పాలని కూడా. 59 00:03:05,060 --> 00:03:07,855 చూడు, నా ఉద్దేశం, నీకు 17, నీకిది పెద్ద విషయంలా అనిపించి ఉండకపోవచ్చు. 60 00:03:07,938 --> 00:03:12,818 కానీ నీకు 21 వచ్చినపుడు, కొన్ని కారణాలవల్ల నీకు ఇవన్నీ పెద్ద విషయాల్లాగా కనిపిస్తాయి. 61 00:03:13,652 --> 00:03:16,154 ఏంటి? నేను పట్టించుకోను అనుకుంటున్నావా? 62 00:03:16,238 --> 00:03:19,741 లేదు. నేను చెప్పేది... ఇది నీకు తేలికైన విషయమని నా అభిప్రాయం. 63 00:03:19,825 --> 00:03:20,826 అప్పుడు నువ్వు చిన్న వాడివి కదా. 64 00:03:20,909 --> 00:03:21,743 ఏంటి? 65 00:03:21,827 --> 00:03:24,705 కమాన్. అంత్యక్రియల దగ్గర నువ్వు ఏడ్చినట్లు కూడా నాకు గుర్తులేదు. 66 00:03:26,456 --> 00:03:28,333 హేయ్. జస్టిన్? 67 00:03:28,417 --> 00:03:29,835 -హలో? -హేయ్, జస్టిన్? 68 00:03:31,545 --> 00:03:32,546 అది వింతగా ఉంది. 69 00:03:33,714 --> 00:03:36,216 హలో? వినిపిస్తోందా? 70 00:03:36,300 --> 00:03:38,552 ఓహ్, సారీ. ఎవరిది? 71 00:03:39,887 --> 00:03:44,099 నేను నమ్మలేకపోతున్నాను. అమ్మ, నేనే. 72 00:03:45,142 --> 00:03:48,562 మీరు రాంగ్ నెంబరుకు కాల్ చేసినట్లున్నారు. 73 00:03:48,645 --> 00:03:51,064 కాదు, నేనే. 74 00:03:52,482 --> 00:03:54,818 నేను స్కైలార్ ని. నువ్వు ఇంట్లోనే ఉన్నావా? 75 00:03:54,902 --> 00:03:58,071 ఆగు. మీరు ఎవరితో మాట్లాడాలి? 76 00:03:58,155 --> 00:04:03,076 నీతోనే, అమ్మా. నీతోనే. నేనే, స్కైలార్, నీ... నీ కూతురిని? 77 00:04:04,036 --> 00:04:07,080 చూడు, నేను... నాకు స్కైలార్ పేరున్న కూతురుంది, 78 00:04:07,164 --> 00:04:09,666 కానీ తనకి ఈ వారాంతంలో ఎనిమిదేళ్ళు నిండుతాయి. 79 00:04:09,750 --> 00:04:12,002 నీకు ఎనిమిదేళ్ళు ఉన్నట్లు నాకు అనిపించలేదు. 80 00:04:12,085 --> 00:04:14,296 ఛ. ఎనిమిదేళ్ళా, ఓకే. 81 00:04:14,796 --> 00:04:17,089 -సారీ? -ఓహ్, ఆగు. ఆగు. 82 00:04:17,173 --> 00:04:20,802 నేను చెప్పేది విను. అమ్మా... 83 00:04:22,930 --> 00:04:24,640 నేను స్కైలార్ ని. 84 00:04:24,723 --> 00:04:27,226 నాకిప్పుడు 21. 85 00:04:27,809 --> 00:04:32,481 నేను నిజానికి, నేను భవిష్యత్తు నుండి కాల్ చేస్తున్నాను. 86 00:04:33,815 --> 00:04:36,276 అవును, వింతగా ఉంది, కదూ? 87 00:04:37,653 --> 00:04:42,199 అదీ, నీ గొంతు తెలిసిన గొంతులాగే ఉంది. 88 00:04:42,282 --> 00:04:45,244 కానీ చూడు, నాకిప్పుడు... ఇప్పుడీ ఆటలు ఆడడానికి నాకు సమయం లేదు. 89 00:04:45,327 --> 00:04:48,413 నేను కొంచెం షాపింగ్ చేయాలి. నువ్వు నా స్టూడెంటువా? 90 00:04:48,497 --> 00:04:49,957 ఓకే. 91 00:04:50,040 --> 00:04:52,459 ఒకవేళ నాకు ఎనిమిదేళ్ళు నిండుతున్నాయంటే, ఆగు.అప్పుడు... 92 00:04:52,960 --> 00:04:55,337 ఓహ్, దేవుడా. అప్పుడు నువ్వు... 93 00:04:55,420 --> 00:04:58,799 వంకాయ రంగు ఉన్న గుడ్లగూబ బొమ్మ ఉన్న స్కేట్ బోర్డు కొనబోతున్నావు. 94 00:04:58,882 --> 00:05:01,009 నాకు ఆ స్కేట్ బోర్డు చాలా నచ్చుతుంది. 95 00:05:01,093 --> 00:05:04,930 వేసవి చివరి నాటికి, దానిపై నేను కిక్-ఫ్లిప్ చేయగలుగుతాను. 96 00:05:09,142 --> 00:05:13,897 నేను... అదీ, నేను సరిగ్గా అదే ప్లాన్ చేస్తున్నాను. 97 00:05:13,981 --> 00:05:17,109 ఓకే, ఆగు. దాని గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేదు. 98 00:05:17,985 --> 00:05:20,237 నీకెలా తెలుసు... ఇంతకీ నువ్వెవరు? 99 00:05:20,737 --> 00:05:24,366 స్కైలార్ మెకెంజీ విలియమ్స్. 100 00:05:25,367 --> 00:05:28,328 మా నాన్న గురించి నాకు తెలీదు, కానీ నాకు ఆయన కనుబొమ్మలు వచ్చాయని చెప్పేదానివి. 101 00:05:28,412 --> 00:05:31,248 నన్ను నిద్ర లేపడానికి నా బొటనవేలిని నొక్కడానికి ఇష్టపడే దానివి. 102 00:05:31,331 --> 00:05:33,584 నేను నిజంగా దాన్ని మిస్సవుతున్నాను. 103 00:05:35,002 --> 00:05:36,545 ఇక్కడసలు ఏం జరుగుతోంది? 104 00:05:36,628 --> 00:05:37,838 అమ్మా, ఓకే, విను. 105 00:05:37,921 --> 00:05:41,425 నేను నీకు చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఒకటుంది. 106 00:05:42,593 --> 00:05:46,054 -ఛ. అమ్మా? -నేను వింటున్నాను. 107 00:05:46,847 --> 00:05:51,018 ఓకే, 2015 ఫిబ్రవరి 12 రాత్రి, 108 00:05:51,101 --> 00:05:54,438 నా ఫ్రెండ్ వాలరీ ఇంట్లో రాత్రి గడపడానికి వెళ్ళినపుడు, నేను నీకు కాల్ చేస్తాను, 109 00:05:54,521 --> 00:05:56,815 నన్ను పికప్ చేసుకోమని నిన్ను అడుగుతాను 110 00:05:56,899 --> 00:05:58,358 ఎందుకంటే ఆ రాత్రి నేను వాల్ తో గొడవపడ్డాను. 111 00:05:58,442 --> 00:06:01,195 కానీ దయచేసి, దయచేసి నన్ను తీసుకెళ్ళడానికి రావొద్దు. 112 00:06:01,278 --> 00:06:02,946 ఎందుకంటే నువ్వు అక్కడికి వచ్చే దారిలో, 113 00:06:03,030 --> 00:06:04,781 నీకు ఒక భయంకరమైన ప్రమాదం జరుగుతుంది 114 00:06:04,865 --> 00:06:06,033 సెడార్ అండ్ డీ లాంగ్ ప్రే వీధిలో. 115 00:06:06,116 --> 00:06:10,120 ఇంకా... నాకు తెలుసు... నీతో ఇలా చెప్పకూడదని నాకు తెలుసు. 116 00:06:10,204 --> 00:06:12,789 కానీ నేను చెప్పాలి. నేను... నేను కేవలం... చెప్పాలంతే. 117 00:06:13,457 --> 00:06:16,084 అమ్మా... అమ్మా, నేను చెప్పింది విన్నావా? 118 00:06:17,294 --> 00:06:19,463 -అమ్మా? -లేదు, నేనే. 119 00:06:20,130 --> 00:06:23,008 నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చా? ఇక్కడ చాలా చలిగా, చీకటిగా ఉంది. 120 00:06:23,091 --> 00:06:24,801 నేను నిజంగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. 121 00:06:24,885 --> 00:06:29,223 అరె ఛ. ఓరి దేవుడా. నేను కేవలం... అది తనే, జస్టిన్. 122 00:06:29,306 --> 00:06:30,849 నేను తనతో మాట్లాడాను. 123 00:06:31,391 --> 00:06:34,394 ఏంటి? అమ్మతో మాట్లాడావా? ఇప్పుడేనా? 124 00:06:34,478 --> 00:06:37,231 అవును. ఒట్టు. నీమీదొట్టు. 125 00:06:37,314 --> 00:06:40,442 ఓహ్, ఓరి దేవుడా. నా గుండె పగిలిపోతుందా అన్నంత ఉద్విగ్నంగా ఉంది. 126 00:06:49,618 --> 00:06:53,121 ఓకే, బేబీ. ప్రశాంతంగా ఉండు. ఏం జరిగిందో చెప్పు. 127 00:06:53,205 --> 00:06:56,041 తను నాకు నచ్చలేదు, అమ్మా. ఐ హేట్ హర్. 128 00:06:56,124 --> 00:06:57,626 నాకు అర్థమయింది. 129 00:06:57,709 --> 00:06:59,378 నువ్వు వెంటనే వచ్చి, నన్ను తీసుకెళ్ళు. 130 00:06:59,461 --> 00:07:00,879 వస్తావా? ప్లీజ్? 131 00:07:00,963 --> 00:07:04,591 ఓహ్, బేబీ. కమాన్. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. అలసిపోయాను. 132 00:07:04,675 --> 00:07:07,135 నువ్వు అక్కడ నిద్రపోవాలనే కదా వెళ్లావు. ఏం జరిగింది? 133 00:07:07,219 --> 00:07:09,221 నేను వాల్ తో గొడవ పడ్డాను, ఓకే? 134 00:07:09,304 --> 00:07:12,516 కాబట్టి నేనిక్కడ ఉండాలని అనుకోవట్లేదు. నన్ను తీసుకెళ్లడానికి వస్తావా, ప్లీజ్? 135 00:07:14,309 --> 00:07:15,519 అమ్మా? 136 00:07:16,937 --> 00:07:19,273 నువ్వు ఉన్నావా? అమ్మా! 137 00:07:19,356 --> 00:07:22,442 అవును. నేను... సారీ, బేబీ. నేను... 138 00:07:23,277 --> 00:07:25,737 -ఇది చాలా వింతగా ఉంది. -అమ్మా. 139 00:07:25,821 --> 00:07:27,489 దయచేసి వచ్చి నన్ను తీసుకెళ్ళు. 140 00:07:29,074 --> 00:07:30,075 వద్దు. 141 00:07:31,243 --> 00:07:32,578 ఎందుకు వద్దు? 142 00:07:32,661 --> 00:07:36,290 నేను... బేబీ, విను. వివరించడం కొంచెం కష్టం. 143 00:07:36,373 --> 00:07:42,004 ఎన్నో ఏళ్ళ క్రితం, నీ ఎనిమిదవ పుట్టినరోజు ముందు, నాకో కాల్ వచ్చింది. 144 00:07:42,546 --> 00:07:46,175 ఇంకా... దీని గురించి ఎవరో నాకు చెప్పారు. 145 00:07:46,258 --> 00:07:48,468 ఈ క్షణంలో జరుగుతున్న విషయం జరుగుతుందని చెప్పారు. 146 00:07:49,136 --> 00:07:51,680 -ఏంటి? -చూడు. ఓకే. 147 00:07:51,763 --> 00:07:55,058 మర్చిపో. దాని గురించి మర్చిపో. 148 00:07:55,142 --> 00:07:56,852 నువ్వు వస్తున్నావా లేదా? 149 00:07:56,935 --> 00:07:59,563 లేదు, బేబీ. నేను రావట్లేదు. 150 00:07:59,646 --> 00:08:02,149 వాలరీకి నువ్వంటే ఇష్టం. తను నీ ప్రాణ స్నేహితురాలు. 151 00:08:02,232 --> 00:08:04,610 తనతో మాట్లాడి దాన్ని పరిష్కరించుకుంటే మంచిది, ఓకే? 152 00:08:05,194 --> 00:08:06,528 సమస్య నుండి పారిపోకు. 153 00:08:06,612 --> 00:08:08,697 మంచిది. ఇప్పుడు నిన్ను కూడా ద్వేషిస్తున్నాను. 154 00:08:08,780 --> 00:08:11,116 నీకు 16 ఏళ్ళే. కొన్నాళ్ళకు ఇదంతా మారుతుంది. 155 00:08:11,200 --> 00:08:13,327 -బై. -లవ్ యు. 156 00:08:16,413 --> 00:08:19,791 ఓహ్, బేబీ. కమాన్. నేనిప్పుడే ఇంటికి వచ్చాను. అలసిపోయాను. 157 00:08:19,875 --> 00:08:22,085 అమ్మా. దయచేసి వచ్చి నన్ను తీసుకెళ్ళు. 158 00:08:23,212 --> 00:08:25,631 ...ఇది జరుగుతుందని ముందే తెలుసు. 159 00:08:29,968 --> 00:08:31,845 -హేయ్. -స్కైలార్? ఎక్కడున్నావ్? 160 00:08:32,179 --> 00:08:34,890 హైవే మీదున్నాను. కాసేపట్లో ఇంటికి వస్తాను. 161 00:08:34,972 --> 00:08:36,308 వావ్, దేవుడా. 162 00:08:36,390 --> 00:08:39,144 నేను అమ్మతో మాట్లాడానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. 163 00:08:39,227 --> 00:08:41,230 నువ్వు వాలరీ వాళ్ళింట్లో ఉన్నావని అనుకున్నానే. 164 00:08:41,313 --> 00:08:44,066 ఏంటి? వాలరీస్? నువ్వు వింతగా మాట్లాడుతున్నావు. 165 00:08:44,149 --> 00:08:45,776 నువ్వు వాళ్ళింట్లో స్లీప్ ఓవర్ కోసం వెళ్ళావని అనుకున్నాను. 166 00:08:47,236 --> 00:08:54,201 ఓహ్, ఓరి దేవుడా. ఆగు, ఓకే. వింత ప్రశ్నే. నాకు ఎన్నేళ్ళు? 167 00:08:55,160 --> 00:09:00,082 నాకు 12, నీకు 16. నువ్వు వింతగా మాట్లాడుతున్నావు. 168 00:09:00,624 --> 00:09:02,501 ఆగు. నేను వాలరీ వాళ్ళింట్లో ఉన్నానని అన్నావు కదూ? 169 00:09:02,584 --> 00:09:03,585 అవును. 170 00:09:03,669 --> 00:09:07,130 రెండు గంటల క్రితం నువ్వు కాల్ చేసి వాలరీతో గొడవ పడినట్లు అమ్మ చెప్పింది. 171 00:09:07,214 --> 00:09:10,342 అమ్మ? ఆ, అమ్మ బానే ఉందా? అమ్మ ఇంట్లోనే ఉందా? 172 00:09:11,885 --> 00:09:12,719 అవును. 173 00:09:12,803 --> 00:09:14,054 -మంచిది. మంచిది. -అవును. 174 00:09:14,137 --> 00:09:15,722 అద్భుతమైన విషయం. 175 00:09:17,933 --> 00:09:20,227 చూడు, మొద్దూ, ఇప్పుడు నేను చేసిన పని వల్ల, 176 00:09:20,310 --> 00:09:22,771 నీకు, నీ అక్కకి ఎంత మేలు జరుగుతుందో 177 00:09:22,855 --> 00:09:24,106 నీకు ఎంతమాత్రం తెలీదు. 178 00:09:24,189 --> 00:09:27,192 -నా ఉద్దేశం, నాకు. నీకు, నాకు. -ఓహ్, ఓరి దేవుడా! 179 00:09:28,026 --> 00:09:29,695 తనకు ఏదో జరుగుతోంది. 180 00:09:30,404 --> 00:09:31,405 ఏంటి నీ ఉద్దేశం? 181 00:09:31,488 --> 00:09:32,823 నాకు తెలీదు. 182 00:09:34,408 --> 00:09:39,121 ఆమె తన గదిలో ఉంది. తను ఏదో వింత వింత శబ్దాలు చేస్తోంది. 183 00:09:40,205 --> 00:09:42,291 ఎలాంటి వింత శబ్దాలు? 184 00:09:42,374 --> 00:09:44,710 నాకు ఏంటో... ఇంటికి రా, స్కై. భయంగా ఉంది. 185 00:09:44,793 --> 00:09:50,174 అవును. రావాలనే ఉంది, కానీ నేను నీ దగ్గరికి రాలేదు. 186 00:09:51,091 --> 00:09:54,219 -ప్లీజ్. -నేను నిజంగా... నిజంగా రాలేను. 187 00:09:54,303 --> 00:09:56,889 నేను ఏది అడిగినా నువ్వు అదే చెబుతావు. 188 00:09:56,972 --> 00:09:59,099 ఏంటి? అది నిజం కాదు. 189 00:10:01,185 --> 00:10:04,563 ఓకే, అమ్మ ఇప్పుడు కూడా అలాగే శబ్దాలు చేస్తోందా? 190 00:10:04,646 --> 00:10:08,108 ఆగు. నాకు వినిపించడం లేదు. 191 00:10:08,192 --> 00:10:09,568 నేను మన గదిలో ఉన్నాను. 192 00:10:09,651 --> 00:10:14,072 ఓకే. తన గది దగ్గరికి వెళ్లి, ఎలా ఉందో చూడు. 193 00:10:14,156 --> 00:10:17,367 -తను బాగుందని నేను నిర్ధారించుకోవాలి. -ఓకే. 194 00:10:20,454 --> 00:10:21,705 నేను హాల్లోకి వచ్చాను. 195 00:10:21,788 --> 00:10:22,789 ఓకే, గుడ్. 196 00:10:24,458 --> 00:10:26,293 తన బెడ్ రూమ్ గది మూసి ఉంది. 197 00:10:26,835 --> 00:10:30,130 ఓకే, తలుపు తట్టు. తను ఎలా ఉందో ఒకసారి అడుగు. 198 00:10:30,214 --> 00:10:31,215 అవును, సరే అయితే. 199 00:10:33,550 --> 00:10:35,802 అమ్మా? నువ్వు బానే ఉన్నావా? 200 00:10:40,724 --> 00:10:44,686 వెళ్ళిపో. వెళ్ళిపో! 201 00:10:44,770 --> 00:10:46,438 -ఓహ్, ఛ. ఛ. ఛ. -ఏంటది? 202 00:10:46,522 --> 00:10:48,398 తన గొంతు గాయపడినట్లుగా ఉంది. నేను... 203 00:10:48,482 --> 00:10:51,193 తలుపు తెరువు, జస్టిన్. తను బాగానే ఉందని నువ్వు నిర్ధారించుకోవాలి. 204 00:10:51,652 --> 00:10:53,403 -చేయమంటావా? -అవును! అవును. 205 00:10:53,487 --> 00:10:55,155 బహుశా తనకేదైనా సాయం కావాలేమో. 206 00:10:56,031 --> 00:10:57,616 అవును, ఓకే. 207 00:11:01,620 --> 00:11:04,498 అమ్మా? అమ్మా! 208 00:11:04,581 --> 00:11:06,166 వెళ్ళిపో అన్నానా! 209 00:11:07,543 --> 00:11:09,127 వెళ్ళిపో! 210 00:11:09,920 --> 00:11:11,088 ఏంటి? ఏంటి, ఏంటి, ఏంటి, ఏంటి? 211 00:11:12,297 --> 00:11:13,465 ఏం జరుగుతోంది అసలక్కడ? 212 00:11:14,216 --> 00:11:16,718 జస్టిన్, నువ్వు బానే ఉన్నావా? నువ్వు ఎక్కడున్నావ్? 213 00:11:16,802 --> 00:11:18,762 నేను మన గదిలోకి వచ్చాను. 214 00:11:18,846 --> 00:11:19,972 నువ్వు దయచేసి వెంటనే ఇంటికి రా. 215 00:11:20,055 --> 00:11:21,515 అమ్మకి ఏం జరుగుతోంది? 216 00:11:21,598 --> 00:11:22,724 -ఏం జరుగుతోంది? -తను... 217 00:11:22,808 --> 00:11:26,395 తన చేతులు, అవి, వాటికి... ఏదో అయింది... 218 00:11:26,478 --> 00:11:29,857 వాటికి ఏదో అయింది. తన ముఖమేమో... 219 00:11:29,940 --> 00:11:30,983 ఏంటి? ఏమైందో చెప్పు? 220 00:11:31,066 --> 00:11:33,861 తన మొహం కాలిపోయింది. 221 00:11:34,444 --> 00:11:36,446 -ఓహ్, ఓరి దేవుడా. -ఏం జరుగుతోంది, స్కై? 222 00:11:36,530 --> 00:11:37,614 ఓహ్, లేదు. ఓహ్, లేదు. 223 00:11:37,698 --> 00:11:39,283 -లేదు, లేదు, లేదు, లేదు. -ఏంటి? ఏంటి? 224 00:11:39,366 --> 00:11:41,577 నేనలా... నేనలా చేసి ఉండాల్సింది కాదు... 225 00:11:41,660 --> 00:11:43,078 దయచేసి ఇంటికి రా, స్కై. ప్లీజ్. 226 00:11:43,161 --> 00:11:44,580 నేను నిజంగా రాలేను. 227 00:11:49,418 --> 00:11:53,380 -జస్టిన్. జస్టిన్. జస్టిన్! -ఓహ్, దేవుడా. తను వస్తోంది. 228 00:11:53,463 --> 00:11:54,882 -తను వస్తోంది. నా గది దగ్గరికి వస్తోంది. -జస్టిన్! 229 00:11:55,966 --> 00:11:57,050 తనకసలు ఏం జరుగుతోంది? 230 00:11:57,134 --> 00:11:58,343 నాకు తెలీదు. ఖచ్చితంగా చెప్పలేను. 231 00:11:58,427 --> 00:12:01,013 నాకు తెలీదు, కానీ ఇది నా తప్పే అని అనుకుంటున్నాను. 232 00:12:01,096 --> 00:12:03,390 నీ తప్పా? నేను ఏం చేయాలి? 233 00:12:03,473 --> 00:12:04,725 -జస్టిన్! -తలుపు లాక్ చేయి. త్వరగా. 234 00:12:04,808 --> 00:12:06,727 నా దగ్గర తాళాలు లేవు. నువ్వు ఎప్పుడూ దాచి పెడుతూ ఉంటావు. 235 00:12:06,810 --> 00:12:08,228 ఓహ్, ఛ. అవును. 236 00:12:08,312 --> 00:12:11,106 సరే, అవి ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయో చెప్పు? కమాన్! 237 00:12:11,940 --> 00:12:14,401 నా డ్రెస్సింగ్ టేబుల్ లో, కింద అరలో, 238 00:12:14,484 --> 00:12:15,569 -ఎడమవైపు. -ఛ. 239 00:12:15,652 --> 00:12:16,945 -వెళ్లి చూడు. వెళ్ళు! -ఛ. ఛ. 240 00:12:18,113 --> 00:12:19,865 -అవి ఇక్కడ లేవు. -వెనకవైపు చూడు. 241 00:12:19,948 --> 00:12:20,949 బాగా లోపలికి, వెనకవైపు చూడు. 242 00:12:21,033 --> 00:12:22,034 ఓకే. 243 00:12:24,119 --> 00:12:25,537 ఓకే. దొరికాయి. 244 00:12:25,621 --> 00:12:27,331 ఓకే. తలుపు లాక్ చేయి. ఇప్పుడే లాక్ చేయి. 245 00:12:27,414 --> 00:12:30,834 ఓకే. ఓకే, అయిపోయింది. 246 00:12:31,502 --> 00:12:33,045 తలుపు లాక్ చేశావా? 247 00:12:33,128 --> 00:12:36,423 జస్టిన్! హెల్ప్! హెల్ప్! 248 00:12:36,507 --> 00:12:38,675 -వెళ్ళిపో! -తలుపు తెరువు! 249 00:12:38,759 --> 00:12:41,929 -వెళ్ళిపో! -తలుపు తెరువు! తలుపు తెరువు! 250 00:12:42,012 --> 00:12:42,846 జస్టిన్? 251 00:12:43,514 --> 00:12:45,098 జస్టిన్, ఏం జరుగుతోంది? 252 00:12:45,182 --> 00:12:47,226 తను తలుపు తెరిచిందా? నువ్వు బానే ఉన్నావా? 253 00:12:47,976 --> 00:12:50,229 జస్టిన్? జస్టిన్? 254 00:12:51,396 --> 00:12:58,111 లేదు. నా చేతికి ఏదో తగిలింది. ఏదో పదునైనది. 255 00:12:58,195 --> 00:12:59,029 ఓకే. 256 00:12:59,988 --> 00:13:02,407 తనని మళ్ళీ నీ దగ్గరికి రానివ్వకు, ఓకే? 257 00:13:02,491 --> 00:13:03,867 -నేను అనుకునేది... -ఓకే. 258 00:13:03,951 --> 00:13:07,079 తనని ఏదైతే బాధ పెడుతోందో, అది నిన్ను కూడా బాధ పెట్టొచ్చు. 259 00:13:07,162 --> 00:13:08,956 -తను నీకు దగ్గరగా వస్తే, ఓకే? -ఓకే, అవును. 260 00:13:11,583 --> 00:13:13,293 నాకు చాలా భయంగా ఉంది, స్కైలార్. 261 00:13:14,336 --> 00:13:16,630 నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి, సరేనా? 262 00:13:16,713 --> 00:13:20,175 తనకంటే వీలైనంత వరకు దూరంగా వెళ్ళు, వీలైనంత వేగంగా వెళ్ళు. 263 00:13:20,259 --> 00:13:23,011 నీకు బాగా భయంగా ఉందని తెలుసు, కానీ తన గొంతు వినిపిస్తోందా? 264 00:13:24,221 --> 00:13:25,347 లేదు. 265 00:13:25,430 --> 00:13:26,431 ఓకే. 266 00:13:26,515 --> 00:13:29,685 తాళం బయటికి తీసి, రంధ్రంలోంచి చూడు. 267 00:13:32,229 --> 00:13:33,272 తను కనిపించడం లేదు. 268 00:13:33,355 --> 00:13:34,773 ఓకే, గుడ్. 269 00:13:34,857 --> 00:13:38,193 నేను... నేను చెప్పినపుడు, తలుపు తెరుచుకుని 270 00:13:38,277 --> 00:13:41,905 కిందికి పరిగెత్తు, నేరుగా ముందు తలుపులోంచి వెళ్ళిపో, ఓకే? 271 00:13:42,531 --> 00:13:44,533 లేదు. లేదు. నాకలా చేయాలని లేదు. 272 00:13:44,616 --> 00:13:46,535 నాకు తెలుసు, కానీ జస్టిన్, నువ్వు చేసి తీరాలి. 273 00:13:46,618 --> 00:13:49,830 నాకు... నువ్వు ఇంటి లోపల క్షేమంగా ఉంటావని నాకు అనిపించడం లేదు. 274 00:13:49,913 --> 00:13:51,373 కానీ నాకు బయటికి వెళ్ళాలని లేదు. 275 00:13:51,456 --> 00:13:53,667 నువ్వు ఇప్పుడే అక్కడినుండి బయటపడాలని నేను అనుకుంటున్నాను. 276 00:13:53,750 --> 00:13:56,879 నా వల్ల కాదు. నువ్వు ఇంటికి వచ్చేవరకూ మన గదిలోనే ఉండాలనుకుంటున్నా. 277 00:13:56,962 --> 00:14:00,966 జస్టిన్. విను. నన్ను నమ్ముతావా? 278 00:14:01,633 --> 00:14:03,051 లేదు, నమ్మను. 279 00:14:03,844 --> 00:14:06,722 ఏంటి? ఎందుకు? నన్ను ఎందుకు నమ్మవు? 280 00:14:07,639 --> 00:14:08,640 జస్టిన్? 281 00:14:08,724 --> 00:14:10,225 నాతో ఎప్పుడూ సరిగా ప్రవర్తించవు, 282 00:14:10,309 --> 00:14:12,728 స్కూల్లో మా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇష్టమొచ్చినట్లు పిలుస్తావు. 283 00:14:12,811 --> 00:14:14,229 నా గురించి నీకసలు లెక్కే లేదు. 284 00:14:15,731 --> 00:14:18,901 ఎందుకంటే నేనొక పిచ్చి, అల్లరి టీనేజర్. 285 00:14:18,984 --> 00:14:21,653 జీవితంలో ఏది ముఖ్యమో నాకు అస్సలు తెలీదు. 286 00:14:22,237 --> 00:14:24,072 నేను త్వరలోనే మారతానని నీకు చెప్పగలిగితే బాగుండు, 287 00:14:24,156 --> 00:14:27,868 కానీ అందుకు కొంచెం సమయం పడుతుంది, ఓకే? 288 00:14:27,951 --> 00:14:29,536 నిజానికి నేను అందుకోసం పనిచేస్తున్నాను. 289 00:14:29,620 --> 00:14:33,790 నేను... ఇన్నాళ్ళూ నేనొక మంచి అక్కగా ఉన్నానని 290 00:14:33,874 --> 00:14:35,542 అనుకోవడం లేదు. 291 00:14:35,626 --> 00:14:39,046 కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. 292 00:14:40,297 --> 00:14:42,424 -నిజమా? -ఖచ్చితంగా ఇష్టం. 293 00:14:43,133 --> 00:14:48,555 ఇప్పుడు, ప్లీజ్ జస్టిన్, నేను ఎలా చెబుతానో నువ్వు అలాగే చేయాలి, ఓకే? 294 00:14:49,806 --> 00:14:52,059 -సరే అయితే. -ఓకే. 295 00:14:52,142 --> 00:14:56,230 తలుపు తెరువు, కానీ నిశ్శబ్దంగా. 296 00:14:57,314 --> 00:14:58,857 అవును. ఓకే. 297 00:15:06,657 --> 00:15:08,784 తను... తను కిందే ఉందనుకుంటా. 298 00:15:08,867 --> 00:15:10,577 ఓకే, ష్. ఎక్కడ? 299 00:15:14,039 --> 00:15:15,707 వంటగదిలో ఉందనుకుంటా. 300 00:15:15,791 --> 00:15:17,417 నువ్వు కిందికి వెళ్ళాలి. 301 00:15:17,501 --> 00:15:22,381 చాలా నిశ్శబ్దంగా వంటగది తలుపు ముందునుండి వెళ్ళాలి. 302 00:15:23,257 --> 00:15:27,135 ఓకే. ఓకే. ఓకే. 303 00:15:40,524 --> 00:15:42,109 లైన్లో ఉన్నావా? నువ్వు కిందికి వెళ్ళావా? 304 00:15:42,192 --> 00:15:44,653 కిందికి వచ్చేశాను. కిందే ఉన్నాను, అవును. 305 00:15:47,364 --> 00:15:51,118 జస్టిన్, మాట్లాడకు. తనకు బదులివ్వకు, ఓకే? తను నిన్ను చూడలేదు. 306 00:15:53,704 --> 00:15:57,124 -అస్సలు మాట్లాడకు. -ఎటు చూసినా రక్తం. 307 00:15:57,207 --> 00:15:58,500 ఎక్కడ చూసినా రక్తమే! 308 00:15:58,584 --> 00:15:59,710 -ఏంటి? -అంతా రక్తం. 309 00:16:00,085 --> 00:16:01,086 నేను... 310 00:16:01,170 --> 00:16:06,383 ఓహ్... తన... తన చేయి నేలపై పడి ఉంది. 311 00:16:06,466 --> 00:16:10,095 నువ్వు నడుస్తూనే ఉండు, జస్టిన్. దాదాపు వచ్చేశావు. 312 00:16:15,392 --> 00:16:16,393 జస్టిన్? 313 00:16:16,476 --> 00:16:17,519 ఓహ్, తను నన్ను చూసింది. నన్ను చూసేసింది. 314 00:16:17,603 --> 00:16:20,147 పరిగెత్తు, జస్టిన్! పరిగెత్తు! 315 00:16:21,148 --> 00:16:24,276 పరిగెత్తు! జస్టిన్? 316 00:16:25,903 --> 00:16:29,323 జస్టిన్? ఎక్కడున్నావు? 317 00:16:30,032 --> 00:16:34,536 ఓకే. నేను బయటికి వచ్చా. బయటికి వచ్చేశాను. 318 00:16:34,620 --> 00:16:37,164 ఓకే, గుడ్. తను నీ వెనకే వచ్చిందా? 319 00:16:37,247 --> 00:16:41,084 రాగలదని నాకు అనిపించడం లేదు. తన శరీరం, ఏమో, నాకు తెలీదు. 320 00:16:41,168 --> 00:16:44,379 కాలిపోయి, ముక్కలైపోయి ఉంది. 321 00:16:44,922 --> 00:16:47,508 ఇప్పుడు... ఇప్పుడు ఎక్కడున్నావు? 322 00:16:47,591 --> 00:16:50,135 నేను, కొన్ని ఇళ్ళు దాటి వచ్చేశాను. 323 00:16:50,219 --> 00:16:51,512 దాదాపు బస్టాప్ దగ్గరికి వచ్చేశాను. 324 00:16:52,513 --> 00:16:54,556 -అది బస్ శబ్దమేనా? -అవును. 325 00:16:54,640 --> 00:16:59,728 -ఓకే. అది ఎక్కేసెయ్. వెంటనే. -అవును. 326 00:17:00,395 --> 00:17:01,980 ఇంటి నుండి దూరంగా వెళ్ళిపో. 327 00:17:02,064 --> 00:17:03,899 -అందులో ఎక్కు. -ఓకే. ఓకే. 328 00:17:03,982 --> 00:17:05,526 ఆగు. ఆగు! 329 00:17:07,694 --> 00:17:08,694 థాంక్యూ. 330 00:17:11,656 --> 00:17:14,952 -ఓకే. స్కై? -చెప్పు? చెప్పు? 331 00:17:15,035 --> 00:17:18,163 -నేను బస్ ఎక్కాను. -అయితే నువ్వు క్షేమంగా ఉన్నావు. 332 00:17:18,872 --> 00:17:20,832 నువ్వు క్షేమంగా ఉన్నావు. క్షేమంగా ఉన్నావు. 333 00:17:20,915 --> 00:17:21,959 తనకి ఏం జరిగింది? 334 00:17:22,626 --> 00:17:25,170 అమ్మకి ఏం జరిగింది? నీ తప్పేనని నువ్వు అన్నావు కదా. 335 00:17:25,753 --> 00:17:27,631 నేను ఖచ్చితంగా చెప్పలేను. 336 00:17:27,714 --> 00:17:30,259 కానీ విను, ఆన్లైన్ లో ఒక పోస్ట్ ఉంది, 337 00:17:30,342 --> 00:17:34,638 అందులో ఏముందంటే ఎవరికైనా భవిష్యత్తు నుండి సమాచారం అందితే, 338 00:17:34,721 --> 00:17:39,059 వారి విధి మారిపోతుంది, విశ్వం దాన్ని సరి చేస్తుంది, కానీ అది బాధాకరంగా ఉంటుంది, 339 00:17:39,142 --> 00:17:41,854 నేను... ఆఖరి భాగాన్ని నేను నమ్మాలని అనుకోవడం లేదు. 340 00:17:41,937 --> 00:17:45,858 నేను అమ్మని రక్షించాలనుకున్నాను, కానీ అది జరగలేదు. నేనేమీ చేయలేకపోయా. 341 00:17:47,234 --> 00:17:52,531 -స్కైలార్. నువ్వు... -జస్టిన్. జస్టిన్? 342 00:17:53,115 --> 00:17:55,117 నువ్వు నా విధిని కూడా మార్చావా? 343 00:17:56,785 --> 00:18:00,539 -ఓహ్, ఓరి దేవుడా. ఓహ్, లేదు. -బాధగా ఉంది. 344 00:18:03,292 --> 00:18:09,089 నా చేయి నొప్పి పెడుతోంది. అవి... అవి సాగుతున్నాయి. నొప్పిగా ఉంది. 345 00:18:09,590 --> 00:18:12,551 లేదు. నువ్వు ఇంట్లోనే ఉండాల్సింది. 346 00:18:13,302 --> 00:18:14,845 ఇదేదీ నీకు జరిగి ఉండాల్సింది కాదు. 347 00:18:14,928 --> 00:18:18,849 నువ్వు ఇంట్లో ఉండాలి, బస్సులో కాదు. నేను మార్చేశాను, అంతా నా తప్పే. 348 00:18:18,932 --> 00:18:21,935 -స్కై. స్కై. -ఓహ్, జస్టిన్! 349 00:18:24,229 --> 00:18:25,647 ఒరేయ్, నన్ను క్షమించు. 350 00:18:28,567 --> 00:18:29,735 జస్టిన్! 351 00:18:36,116 --> 00:18:37,492 నేను ఏం చేశాను? 352 00:19:37,803 --> 00:19:39,805 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ