1 00:01:04,897 --> 00:01:07,943 లేజర్ అరేయ్ ఫ్రీక్వెన్సీ టెస్ట్ 19-బి, 2 00:01:08,777 --> 00:01:09,778 మొదలవుతుంది. 3 00:01:19,830 --> 00:01:20,914 లెవెల్స్ చెక్ చేయండి. 4 00:01:22,124 --> 00:01:23,125 లెవెల్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయి. 5 00:01:23,917 --> 00:01:25,919 సరే. పని మొదలుపెట్టొచ్చు. 6 00:01:27,671 --> 00:01:29,214 -నేను బయటకు వస్తున్నాను. -అలాగే. 7 00:01:52,070 --> 00:01:54,615 యమాటో? వస్తున్నావా? 8 00:01:58,994 --> 00:02:00,162 వస్తున్నాను. 9 00:02:33,445 --> 00:02:35,447 నలభై నాలుగు కిలోహెర్ట్జ్ కి వెళ్ళు. 10 00:02:38,742 --> 00:02:39,743 యుహెచ్ఎఫ్ కి మారు. 11 00:02:40,702 --> 00:02:42,162 ఏం మారలేదు. 12 00:02:42,746 --> 00:02:44,289 మనం ఆంప్లిట్యూడ్ ని మార్చొచ్చు. 13 00:02:44,790 --> 00:02:46,041 ఇది ఎందుకు పనిచేయడం లేదు? 14 00:02:49,753 --> 00:02:50,754 అరెరే. 15 00:02:51,713 --> 00:02:54,007 ఎంత పని జరిగింది. నేను కనీసం రేపటి వరకైనా విఫలం కాము అనుకున్నాను. 16 00:02:57,636 --> 00:02:58,637 ఇది ఏంటి? 17 00:02:59,721 --> 00:03:02,099 ఒక్కొక్కసారి, ఏలియన్ ఈ సిగ్నల్ ని పంపుతుంటుంది. 18 00:03:02,850 --> 00:03:05,227 ఎందుకో తెలీదు, కానీ ఎప్పుడూ ఇదొక్కటే వదులుతుంది. 19 00:03:05,811 --> 00:03:07,646 ఇదుగో. ఇది చూడు. 20 00:03:09,273 --> 00:03:11,316 -ఇప్పుడు. -ఇప్పుడు. 21 00:03:13,068 --> 00:03:14,069 అంతే. 22 00:03:18,115 --> 00:03:19,241 అది ఏం చేస్తోంది? 23 00:03:19,950 --> 00:03:21,326 ఏమో తెలీదు. 24 00:03:21,952 --> 00:03:22,953 నిఖిల్ కి పంపండి. 25 00:03:23,453 --> 00:03:26,373 -పంపాను. -అది బహుశా ఆఖరి శ్వాస తీసుకుంటుంది ఏమో. 26 00:03:27,291 --> 00:03:30,335 షిప్ మొత్తం దెబ్బ తిన్న ఒక భారీ జీవిలాంటిది. 27 00:03:31,211 --> 00:03:32,212 ఏలియన్ పిత్తుతోంది. 28 00:03:37,342 --> 00:03:38,635 ఇలా ఎంత తరచుగా అవుతుంటుంది? 29 00:03:39,303 --> 00:03:42,472 కొన్నిసార్లు రోజులు, ఇంకొన్ని సార్లు గంటలపాటు జరుగుతుంది. 30 00:03:42,973 --> 00:03:44,641 ప్రారంభంలో నిఖిల్ చాలా ఉత్సాహపడ్డాడు, 31 00:03:44,725 --> 00:03:46,935 కానీ ఇప్పుడు ఈ వివరాలన్నింటిన్నీ సేవ్ చేసి పెద్దగా పట్టించుకోవడం లేదు. 32 00:03:47,477 --> 00:03:49,396 ప్రపంచం అంతమయ్యే సమయంలో అంత డేటాను పరిశీలించే సమయం ఉండదు. 33 00:03:49,479 --> 00:03:50,981 మూడో బేస్ క్యాంప్, స్పందించండి. 34 00:03:52,107 --> 00:03:53,233 మేము మూడవ బేస్ క్యాంప్ నుండి. 35 00:03:53,317 --> 00:03:55,360 మిత్సుకి యమాటోని క్లినిక్ కి రమ్మని పిలుస్తున్నాం. 36 00:03:55,986 --> 00:03:57,070 అలాగే. అవుట్. 37 00:03:57,779 --> 00:03:59,990 నీ మెదడు స్కాన్ తీసే సమయమైంది. 38 00:04:00,490 --> 00:04:03,660 అది అవసరం లేదు. నేను బానే ఉన్నాను. నేను తిరిగి పనిమొదలెట్టాలి. 39 00:04:03,744 --> 00:04:07,623 నీ ఆంగ్యులర్ జైరస్ ఇంకా వేర్నికీలు చాలా ఉత్తేజితం అయ్యాయి. 40 00:04:08,540 --> 00:04:12,127 ఎక్కడి నుండి వస్తున్నాయో తెలీని శబ్దాలు లేదా స్వరాలు ఏమైనా వినిపిస్తున్నాయా? 41 00:04:15,964 --> 00:04:18,634 నేను ఇంకా ఏం సమాధానం ఇవ్వలేదు. మరి ఎందుకు రాస్తున్నావు? 42 00:04:18,716 --> 00:04:21,094 నువ్వు ఇది పూర్తి అయ్యాకా నా ప్రశ్నకు సమాధానం చెప్తాను అంటే… 43 00:04:21,178 --> 00:04:23,764 అయితే నేను ఇది అంతా పూర్తి అయిన తర్వాత నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. 44 00:04:23,847 --> 00:04:26,016 నాకు ఏం కాలేదు. ఏమైనా తేడాగా అయితే నీకు చెప్తాను. 45 00:04:26,099 --> 00:04:28,936 నిజం చెప్పాలంటే, నీకు ఎప్పుడు బాలేదో చెప్పే పని నాది. 46 00:04:31,271 --> 00:04:32,898 కానీ ప్రస్తుతానికి నిన్ను తిరిగి పని చేయనిస్తాను. 47 00:04:37,736 --> 00:04:39,488 ఎలా సాగుతోంది? 48 00:04:40,197 --> 00:04:41,198 మీ పని. 49 00:04:42,282 --> 00:04:44,826 సంప్రదింపులు చేయడానికి ఏమైనా మార్గం దొరికిందా? 50 00:04:47,412 --> 00:04:48,497 ఇంకా లేదు. 51 00:04:51,124 --> 00:04:52,125 కానీ నేను… 52 00:04:55,337 --> 00:04:57,047 కొన్నిసార్లు నాకు ఎలా ఉంటుంది అంటే… 53 00:05:00,592 --> 00:05:04,221 అది నన్ను చూడడం నాకు తెలుస్తుంది అన్నట్టు ఉంటుంది. 54 00:05:05,013 --> 00:05:06,765 లోపల జాగ్రత్తగా ఉండు, సరేనా? 55 00:05:07,641 --> 00:05:09,309 దాని రహస్యాలను నువ్వు ఎలా బయటపెట్టకూడదు అనుకుంటుందో 56 00:05:09,393 --> 00:05:11,979 అలాగే నువ్వు కూడా అది నీ మనసును చదవకుండా చూసుకో. 57 00:05:30,914 --> 00:05:31,915 మిత్సుకి? 58 00:05:32,499 --> 00:05:33,500 అతను నాకు తెలుసు. 59 00:05:35,961 --> 00:05:36,962 ఓలెగ్ వార్గ. 60 00:05:37,754 --> 00:05:40,048 మూడేళ్ళ క్రితం ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి గెలుచుకున్నాడు. 61 00:05:41,508 --> 00:05:42,509 నువ్వు బానే ఉన్నావా? 62 00:05:43,051 --> 00:05:44,511 -అవును, నేను… -ఏం కాలేదు. 63 00:05:45,262 --> 00:05:46,263 ఒకటి తెలుసా, 64 00:05:46,763 --> 00:05:48,724 నువ్వు నన్ను ప్రశ్నలు అడగడానికి ఇదే మంచి సమయం. 65 00:05:49,224 --> 00:05:51,185 నీ అవసరం నాకంటే వారికే ఎక్కువ ఉందని అనిపిస్తోంది. 66 00:06:25,844 --> 00:06:26,845 నువ్వు ఏం చేశావు? 67 00:06:27,596 --> 00:06:30,182 ఏమీ లేదు. మేము ఇంకా సీక్వెన్స్ లు రన్ చేస్తున్నాం. ఇంకా ఎలాంటి స్పందన లేదు. 68 00:06:30,265 --> 00:06:31,433 చివరిగా చేసినది మళ్ళీ చేయండి. 69 00:06:32,434 --> 00:06:33,560 ఏంటి? 70 00:06:33,644 --> 00:06:34,645 మళ్ళీ చేయండి. 71 00:06:41,610 --> 00:06:43,070 92 రన్ చేస్తున్నాం. మొదలు. 72 00:06:45,656 --> 00:06:46,698 రీడింగ్ స్థిరంగా ఉంది. 73 00:06:47,699 --> 00:06:48,867 ఆమె ఏం చేస్తోంది? 74 00:06:48,951 --> 00:06:49,952 ఏమో. 75 00:06:50,035 --> 00:06:51,370 ఇంకొకసారి వెనక్కి వెళ్ళండి. 76 00:06:52,329 --> 00:06:53,539 91 రన్ చేస్తున్నాం. మొదలు. 77 00:06:55,457 --> 00:06:56,542 స్థిరంగా ఉంది. 78 00:06:58,043 --> 00:06:59,461 తొంబై టెస్ట్ రన్ చేస్తున్నాం. మొదలు. 79 00:07:01,213 --> 00:07:02,548 అదే. దానిని మళ్ళీ చేయండి. 80 00:07:03,090 --> 00:07:04,341 ఆహ్. హేయ్, యమాటో. 81 00:07:05,050 --> 00:07:06,969 -ఏం జరుగుతోంది? -కిందకి రండి. 82 00:07:07,553 --> 00:07:08,554 ట్రాన్స్మిటర్ ని తీసుకురండి. 83 00:07:13,433 --> 00:07:16,353 -ఈమె మనసు కూడా అలసిపోయింది అంటావా? -అవును. చూద్దాం. 84 00:07:20,065 --> 00:07:22,025 వీటిని చూస్తుంటే నాకు భలే ఇబ్బందిగా ఉంటుంది. 85 00:07:27,239 --> 00:07:30,200 యమాటో, ఏం జరుగుతోంది? 86 00:07:30,993 --> 00:07:32,035 దానిని మళ్ళీ రన్ చేయండి. 87 00:07:34,663 --> 00:07:35,664 తొంబైయవ సీక్వెన్స్ రన్ చేస్తున్నా. 88 00:07:37,541 --> 00:07:38,542 మొదలు. 89 00:07:51,847 --> 00:07:52,848 ఓరి నాయనో… 90 00:09:36,577 --> 00:09:38,704 దొంగిలించిన కారుకు అలా గుర్తు ఎందుకు పెడుతున్నారు? 91 00:09:39,955 --> 00:09:40,956 ఒకవేళ వాళ్ళు చూస్తే? 92 00:09:41,874 --> 00:09:44,459 దాక్కోవడం కంటే జనం మనల్ని కనిపెట్టడమే వాళ్లకు ముఖ్యం. 93 00:09:45,210 --> 00:09:48,922 ది మూవ్మెంట్ కి ఉన్న ప్రధానమైన సూత్రాలలో మొదటిది మనం జనాన్ని వదిలి వెళ్లిపోకూడదు అనేదే. 94 00:09:51,008 --> 00:09:52,009 అది మంచి రూల్. 95 00:09:56,180 --> 00:09:57,556 మీరు ఎక్కడి నుండి వచ్చారు? 96 00:09:58,932 --> 00:10:00,267 మారియన్, ఒహాయో. 97 00:10:01,518 --> 00:10:07,441 అది పెద్ద పేరు లేని ప్రదేశంలో ఉండే పేరులేని చిన్న టౌన్. 98 00:10:08,275 --> 00:10:10,569 కానీ ప్రస్తుతం ప్రతీ ప్రాంతం మా ఊరులాగే ఏమీ కాకుండా తయారైనట్టు ఉంది. 99 00:10:11,403 --> 00:10:12,613 మీ సంగతి ఏంటి? 100 00:10:12,696 --> 00:10:13,864 న్యూ యార్క్. 101 00:10:15,157 --> 00:10:19,161 ఇవాళ ఉదయం నువ్వు, మీ అమ్మ మాట్లాడుకుంటున్న భాష ఏంటి? 102 00:10:19,828 --> 00:10:21,163 ఆమె మాకు ఫార్సీ నేర్పుతోంది. 103 00:10:22,206 --> 00:10:24,416 ఆమె సిరియాలో పెరిగింది, కానీ వాళ్ళ అమ్మ ఇరానీ మహిళ. 104 00:10:25,751 --> 00:10:28,962 ఏమో. బహుశా కొన్నిసార్లు తనకు వాళ్ళ స్వదేశం గుర్తుకొస్తుంది ఏమో. 105 00:10:29,046 --> 00:10:31,590 రై, బుజ్జి. అందరినీ వాహనాలు ఎక్కమను. 106 00:10:44,811 --> 00:10:46,813 నువ్వు అలా చేయడం మీ అమ్మకు నచ్చుతుంది అని నాకు అనిపించడం లేదు. 107 00:11:00,911 --> 00:11:03,247 హేయ్, మీ అమ్మ చూడడానికి ముందే దానిని నాకు ఇవ్వు. 108 00:11:03,330 --> 00:11:05,207 -సామ్. -లేట్ అయిపోయింది. 109 00:11:13,423 --> 00:11:14,466 లోనికి వెళ్ళు. 110 00:11:15,050 --> 00:11:16,802 నీ చెల్లి అన్నీ ప్యాక్ చేసుకుందో లేదో చూడు. 111 00:11:16,885 --> 00:11:18,053 నేను నిన్ను అక్కడ కలుస్తాను. 112 00:11:18,679 --> 00:11:21,056 అక్కడ. రెండు నిమిషాలలో. వెళ్ళు. 113 00:11:30,774 --> 00:11:31,775 ఇది ఏంటి? 114 00:11:34,570 --> 00:11:36,321 కుర్ర చేష్టల్లో ఒకటి అయ్యుంటుంది. 115 00:11:39,074 --> 00:11:41,159 మమ్మల్ని తరువాత కనిపించే శరణార్ధుల క్యాంప్ లో దించండి. 116 00:11:43,203 --> 00:11:44,663 నా పిల్లలతో మాట్లాడొద్దు. 117 00:11:46,123 --> 00:11:47,249 సరే. 118 00:11:51,003 --> 00:11:52,629 నువ్వు ఎదుటోళ్లను అనుమానించడం మానవా? 119 00:11:53,755 --> 00:11:55,090 ఏంటి? 120 00:11:55,174 --> 00:11:57,301 నేను, "ఎదుటోళ్లను అనుమానించడం మానవా?" అన్నాను. 121 00:11:59,720 --> 00:12:02,347 ఇంకొకరిని నమ్మడం నీకే చేతకానప్పుడు, నీ పిల్లలు ఎలా నమ్మగలరు అనుకుంటున్నావు? 122 00:12:03,974 --> 00:12:06,435 ఇలా అనుమానించడమే మమ్మల్ని ఇన్ని రోజులు ప్రాణాలతో ఉంచింది. 123 00:12:07,561 --> 00:12:09,605 మేము మీ వాహనంలో వస్తాం, థాంక్స్. 124 00:12:10,230 --> 00:12:11,690 త్వరలో మీకు అడ్డు తొలగిపోతాం. 125 00:12:17,863 --> 00:12:19,114 సరే, పదండి! 126 00:12:33,086 --> 00:12:34,213 గుడ్ మార్నింగ్, వేడ్. 127 00:12:37,174 --> 00:12:39,510 -మార్నింగ్, రోసీ. -అతన్ని అడిగావా? 128 00:12:39,593 --> 00:12:42,888 రోసీ, అతను బిజీగా ఉన్నాడు. మిలటరీ వారు షెరీఫ్ ని చాలా పనుల మీద తిప్పుతున్నారని తెలుసు కదా. 129 00:12:43,388 --> 00:12:47,059 -నేను ఏం చేసినా ఫలితం ఉండడం లేదు, వేడ్. -హేయ్, నిన్న రాత్రి వాళ్ళు ఒకడిని పట్టుకున్నారు. 130 00:12:47,142 --> 00:12:49,394 వాడు సెల్ లో ఉన్నాడు. సరేనా, ఇవాళ మధ్యాహ్నం వాడిని పంపిస్తారు. 131 00:12:49,478 --> 00:12:51,063 అయితే నన్ను ఏం చేయమంటావు? వాడికి తిండి పెట్టాలా? 132 00:12:51,146 --> 00:12:52,856 అవును. అంటే, ఆ పని చేస్తే బాగుంటుంది. 133 00:12:53,482 --> 00:12:56,818 -నిన్నటితో కలిపి ముప్పై ఏడు, వేడ్. -నాకు తెలుసు, రోసీ. నాకు తెలుసు. 134 00:12:56,902 --> 00:12:58,320 నేను ఇంకేం చేయాలో నాకు తెలీడం లే… 135 00:13:00,405 --> 00:13:01,406 నేను అతన్ని అడుగుతాను. 136 00:13:02,282 --> 00:13:03,283 ప్లీజ్. 137 00:13:03,992 --> 00:13:05,494 థాంక్స్. 138 00:13:12,459 --> 00:13:14,711 చివరికి పనిచేసింది! 139 00:13:14,795 --> 00:13:17,631 నేను రాత్రి అంతా ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఆన్-డ్యూటీ ఆఫీసర్లు ఎవరూ లేరా? 140 00:13:17,714 --> 00:13:19,341 సరే, పదండి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? 141 00:13:20,592 --> 00:13:24,763 క్షమించాలి. ఏలియన్స్ దండయాత్ర కారణంగా మా దగ్గర పనివారి సంఖ్య తగ్గింది. 142 00:13:26,014 --> 00:13:27,850 ఇంకొన్ని గంటల్లో రవాణా వాహనం వస్తుంది. 143 00:13:27,933 --> 00:13:29,643 అప్పటివరకు ఓర్పుగా కూర్చో. 144 00:13:36,149 --> 00:13:38,026 గుడ్ మార్నింగ్, మిస్ జిల్లి. 145 00:13:39,444 --> 00:13:42,322 సరే, చాలు. ఏదైనా వార్త తెలిస్తే మీకు ఫోన్ చేస్తానని తెలుసు కదా? 146 00:13:42,406 --> 00:13:43,907 నన్ను క్షమించండి, లేదు. 147 00:13:45,158 --> 00:13:46,368 మీరు బానే ఉన్నారా? 148 00:13:48,996 --> 00:13:51,123 నేను బాగానే ఉన్నాం, మేడం. అడిగినందుకు థాంక్స్. 149 00:13:52,124 --> 00:13:54,209 సరే, మీతో నేను రేపు మాట్లాడతాను. 150 00:13:55,836 --> 00:13:58,422 నన్ను బంధించి ఉంచడానికి మీ దగ్గర ఎలాంటి కారణం లేదు. మీ రికార్డులలో చెక్ చేయండి. 151 00:13:59,131 --> 00:14:00,299 వెళ్ళండి, చెక్ చేయండి. 152 00:14:01,758 --> 00:14:04,303 నువ్వు అదంతా చెప్పాల్సింది నాతో కాదు, బాబు. నేను ఫోన్లు మాట్లాడతా అంతే. 153 00:14:04,386 --> 00:14:05,387 సరే, అలాగే. చూడు. 154 00:14:07,890 --> 00:14:09,433 ప్లీజ్, నేను ఇక్కడికి ఒక నోట్ బుక్ తో వచ్చాను. 155 00:14:09,516 --> 00:14:11,643 అది సురక్షితంగా ఉందో లేదో, అలాగే ఎక్కడ ఉందో చెప్పు చాలు. 156 00:14:11,727 --> 00:14:13,729 నీ వస్తువులు అన్నీ సురక్షితంగానే ఉన్నాయని హామీ ఇస్తున్నా, 157 00:14:13,812 --> 00:14:16,940 అలాగే వ్యాన్ రాగానే వాటిని నీకు ఇచ్చేస్తాం. 158 00:14:17,024 --> 00:14:19,359 ఇంకాసేపటిలో నీ టిఫిన్ తీసుకొస్తాను. నాకు పని ఉంది. 159 00:14:19,443 --> 00:14:21,987 సరే, అంటే కనిపించకుండా పోయిన వారందరినీ ట్రాక్ చేయడం లాంటిదా? 160 00:14:23,405 --> 00:14:26,450 అంటే, ఆ గోడల మీద కనీసం 30 పోస్టర్లు ఉండి ఉండాలి, 161 00:14:26,533 --> 00:14:29,536 అలాగే నీకు ఈ పనిలో బాగా సాయం అవసరం అని కూడా అనిపిస్తోంది. 162 00:14:29,620 --> 00:14:31,914 మరింత మంది జనం కనిపించకుండా పోయి, వాళ్ళ పోస్టర్లు పెట్టడానికి గోడలు మిగలని 163 00:14:31,997 --> 00:14:34,541 స్థితి రాకముందే నన్ను ఈ సెల్ నుండి విడిపించి, నా నోట్ బుక్ తీసుకోనివ్వు. 164 00:14:34,625 --> 00:14:37,252 ఎందుకు? ఈ జనాన్ని కనిపెట్టడంలో నువ్వు నాకు సహాయం చేస్తావనా? 165 00:14:37,336 --> 00:14:38,921 నువ్వు నా నోట్ బుక్ ని నాకు ఇస్తే, అదే చేస్తా. 166 00:14:43,091 --> 00:14:44,343 నువ్వు నీకు దగ్గరైన వారిని కోల్పోయావు. 167 00:14:47,054 --> 00:14:48,055 చూస్తుంటే నాకు తెలుస్తుంది. 168 00:15:00,692 --> 00:15:01,693 వీళ్ళలో ఎవరు నీ వారు? 169 00:15:02,903 --> 00:15:04,363 బహుశా వాళ్ళను కనిపెట్టడానికి నేను సాయం చేయగలనేమో. 170 00:15:05,781 --> 00:15:06,823 నీ జోక్ ఏం సరదాగా లేదు. 171 00:15:06,907 --> 00:15:09,201 -నేను జోక్ చేయడం లేదు. -సరే. 172 00:15:11,370 --> 00:15:13,121 చూడు, జనానికి సాయపడాలనేది నా నైజం. 173 00:15:14,248 --> 00:15:18,210 అబ్బా, జైలులో కలిసిన ఒక అపరిచితుడికి నా పరిస్థితి అర్థం అయితే నాకు కూడా సంతోషమే, 174 00:15:18,293 --> 00:15:21,672 కానీ నేను ప్రస్తుతం మిస్టర్… క్షమించాలి, నీ పేరు ఏంటి? 175 00:15:21,755 --> 00:15:23,131 కోల్. ట్రెవాంటే కోల్. 176 00:15:23,215 --> 00:15:26,134 నేవి సీల్. ఆఫ్గనిస్తాన్ లో రెండు టూర్లు, ఇరాక్ లో ఒక టూర్ వెళ్ళాను. 177 00:15:26,218 --> 00:15:27,219 వాళ్లలో ఒకడివి. 178 00:15:30,389 --> 00:15:31,765 నేను నీకు ఒకటి చూపిస్తాను. 179 00:15:37,437 --> 00:15:38,856 నాకు అతను బాగా ఇష్టం. 180 00:15:39,982 --> 00:15:43,569 ఏలియన్ లతో పోరాడే బెటాలియన్ ఒకటి ఉంది 181 00:15:43,652 --> 00:15:46,572 అని తెలుసుకున్న తర్వాత, అతను కూడా పాల్గొనాలి అన్న కోరికతో 182 00:15:46,655 --> 00:15:47,990 అతను అలస్కా నుండి వచ్చేశాడు. 183 00:15:49,324 --> 00:15:51,493 ఈ మహిళ ఒక కలలో ముగ్గురు చిన్న పచ్చని మనుషులను చూసి, 184 00:15:51,577 --> 00:15:53,412 మాతో స్కెచ్ గీయించాలని నిర్ణయించుకుంది. 185 00:15:53,912 --> 00:15:57,499 ఈ మహిళ ఇటీవల కిడ్నాప్ కాబడిన వారితో మాట్లాడుతుంది. 186 00:15:57,583 --> 00:15:58,584 నువ్వు ఆ పని చేయగలవా? 187 00:15:59,543 --> 00:16:02,087 ఈ జనం అందరిలో కామన్ గా ఉన్న ఒక విషయం ఏంటో తెలుసా? 188 00:16:02,171 --> 00:16:06,717 వాళ్ళందరూ కూడా ఒక సమాధానం కోసం, ఒక కారణంతో, మరింత పెద్దది ఏదో చేయాలని వచ్చినవారే. 189 00:16:06,800 --> 00:16:10,262 కానీ వారిలో ఏ ఒక్కరూ ఈ టౌన్ గురించి లెక్క చేయలేదు. 190 00:16:11,680 --> 00:16:15,726 జాక్యులిన్ ఈ టౌన్ లో 20 ఏళ్ళుగా పెంపుడు జంతువుల గ్రూమింగ్ వ్యాపారాన్ని నడిపింది. 191 00:16:16,560 --> 00:16:21,732 నెల్స్ కి ముగ్గురు కొడుకులు, ఏడుగురు మనవళ్లు ఉన్నారు, అయినా అతని భార్య ప్రతీ ఉదయం ఫోన్ చేసి 192 00:16:21,815 --> 00:16:24,151 అతని గురించి ఏమైనా తెలిసిందా లేదా అని కనుక్కుంటుంది. 193 00:16:24,234 --> 00:16:26,278 అక్కడ ఉన్న ఐలీన్ గ్రేడీతో కలిసి నేను స్కూల్ కి వెళ్లాను. 194 00:16:26,361 --> 00:16:27,613 ఆమె ఇక్కడ డెప్యూటీ షెరీఫ్. 195 00:16:27,696 --> 00:16:31,033 వాళ్ళందరూ నేను కోల్పోయిన వారు. ఈ గోడల మీద ఉన్న అందరూ. 196 00:16:31,116 --> 00:16:33,535 బయట ప్రపంచంలో తమ బ్రతుకు బ్రతకడానికి చూస్తున్న వారు ఉన్నారు చూడు, 197 00:16:33,619 --> 00:16:34,912 వాళ్లందరినీ సురక్షితంగా ఉంచడానికి చూస్తున్నా. 198 00:16:34,995 --> 00:16:37,497 కాబట్టి నువ్వు ఇంకా నీ మ్యాజిక్ నోట్ బుక్ ఇంకొన్ని 199 00:16:37,581 --> 00:16:40,626 గంటలు మౌనంగా ఉంటే, నేను పని చేసుకోవాలి. 200 00:16:40,709 --> 00:16:42,669 అలాగే నువ్వు ఖచ్చితంగా ఆ వ్యాన్ ఎక్కేలా చేసే బాధ్యత నాది. 201 00:16:42,753 --> 00:16:45,964 నువ్వు మాట్లాడకుండా ఉంటే ఒక కాఫీ అలాగే కేకు కూడా ఇస్తా. 202 00:16:52,221 --> 00:16:53,972 మనం సిగ్నల్ ని బలపరచాలి. 203 00:16:56,683 --> 00:16:57,768 దానికి విషయం తెలుసు అనుకుంటున్నారా? 204 00:17:00,187 --> 00:17:01,980 మనం దాని ముసుగు సిగ్నల్ ని కదిలించాం అని? 205 00:17:06,652 --> 00:17:07,653 ఏమో. 206 00:17:08,529 --> 00:17:09,655 ఇది నమ్మశక్యంగా లేదు. 207 00:17:10,239 --> 00:17:12,199 నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్లు అయింది? కొన్ని రోజులే కదా? 208 00:17:12,950 --> 00:17:15,243 మేము ఇలాంటి ఆవిష్కరణను ముందెప్పుడూ చేయలేదు. 209 00:17:15,743 --> 00:17:19,205 సరే, ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ లోనే ఉండండి. దానిని విహెచ్ఎఫ్ ద్వారా రన్ చేయండి. 210 00:17:49,236 --> 00:17:50,237 యమాటో. 211 00:17:53,907 --> 00:17:54,950 యమాటో. 212 00:17:58,579 --> 00:17:59,580 బానే ఉన్నావా? 213 00:18:01,832 --> 00:18:02,833 అవును. 214 00:18:04,459 --> 00:18:05,460 నేను బానే ఉన్నాను. 215 00:18:08,005 --> 00:18:09,339 నాకు కాస్త గాలి కావాలి. 216 00:18:27,608 --> 00:18:29,193 మీరు గెలవరు. 217 00:18:30,819 --> 00:18:33,071 మీ షిప్స్ లో ఒకటి మేము ఇక్కడ కూల్చేశాం. 218 00:18:48,545 --> 00:18:49,963 అది ఏంటో నాకు తెలుసు! 219 00:18:50,756 --> 00:18:53,050 అదొక సహాయ అభ్యర్ధన. హిస్టరీని తెరవండి. 220 00:18:53,133 --> 00:18:54,635 -ఏంటి? -ఆ సిగ్నల్. 221 00:18:55,219 --> 00:18:57,971 గత నాలుగు నెలల్లో జరిగిన ప్రతీ ఒక్క సందర్భాన్ని నేను చూడాలి. 222 00:18:58,055 --> 00:19:01,016 -అది అంత స్థిరంగా లేదు. చూడు. -ఎలాంటి నమూనా లేదు. 223 00:19:01,683 --> 00:19:02,684 చూడండి. 224 00:19:09,358 --> 00:19:11,026 అది క్యూబిక్ స్ప్లైన్ కి సరిపోతుంది. 225 00:19:12,319 --> 00:19:13,320 అది ఆర్తనాదం కాదు. 226 00:19:14,488 --> 00:19:15,489 అత్యవసర సహాయ సిగ్నల్. 227 00:19:16,156 --> 00:19:17,866 అది కాపాడమని సంకేతం పంపుతుంది. 228 00:19:17,950 --> 00:19:19,159 ఎక్కడికి పంపుతుంది? 229 00:19:19,243 --> 00:19:20,953 నువ్వే గనుక మన ప్రపంచం మీద కూల్చబడిన షిప్ వి 230 00:19:21,036 --> 00:19:23,330 అయితే కాపాడమని సంకేతాన్ని ఎక్కడికి పంపుతావు? 231 00:19:26,375 --> 00:19:29,545 నేను అనుకునేది కరెక్టు అయితే, తరువాతి సిగ్నల్ 5:32కి వెళ్తుంది. 232 00:19:30,587 --> 00:19:32,464 నైట్ షిఫ్ట్ వారికి రావద్దు అని చెప్పాలి అనుకుంటున్నావా? 233 00:19:33,715 --> 00:19:35,342 నువ్వు ఇంతకు ముందే లోపల నాలుగు గంటలు గడిపావు. 234 00:19:35,425 --> 00:19:37,261 నీకు కేటాయించబడిన సమయాన్ని మించిపోయావు. 235 00:19:37,344 --> 00:19:39,763 అయితే నన్ను లోనికి రావద్దు అంటున్నారా? 236 00:19:41,181 --> 00:19:44,101 సరే. అంటే, తరువాతి సిగ్నల్ ఎప్పుడు వెళ్తుందో లెక్కించగలిగితే, తర్వాత ఏం చేయాలి? 237 00:19:45,477 --> 00:19:46,937 అది పంపకుండా ఆపాలా? 238 00:19:47,020 --> 00:19:49,481 కాదు, దానిని హ్యాక్ చేయాలి. 239 00:20:09,293 --> 00:20:11,211 ఇంత సమయమైనా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 240 00:20:12,296 --> 00:20:13,547 టైమ్ ఎంత అయింది? 241 00:20:13,630 --> 00:20:17,176 నీకు కేటాయించబడిన షిఫ్ట్ తర్వాత 11 గంటలు మాత్రమేనా? 242 00:20:30,355 --> 00:20:32,232 నేను ఒకటి కనిపెట్టడానికి చాలా దగ్గరలో ఉన్నాను. 243 00:20:33,025 --> 00:20:34,026 సూపర్. 244 00:20:35,986 --> 00:20:36,987 అవును, నువ్వు సూపర్. 245 00:20:40,115 --> 00:20:41,283 నీకు సమాధానం గురించి ఆలోచించడం ఇష్టం 246 00:20:41,366 --> 00:20:43,911 లేనందువల్లే నన్ను అడుగుతాను అన్న ప్రశ్న అడగలేదు. 247 00:20:46,413 --> 00:20:49,166 ఆ గదిలో ఉన్న ప్రతీ సైంటిస్ట్ మధ్య ఒక పోలిక కామన్ గా ఉంది. 248 00:20:51,585 --> 00:20:53,086 అందరూ బాగానే ఉన్నాం అన్నారు, 249 00:20:54,922 --> 00:20:57,090 కానీ వాళ్ళు బాగా లేరు. 250 00:21:00,135 --> 00:21:02,763 వాళ్ళందరూ ఆ ఏలియన్ మనసులోకి తొంగి చూడాలి అన్న ఆశతో 251 00:21:05,098 --> 00:21:06,642 వారి మతులు పోగొట్టుకున్నారు. 252 00:21:10,687 --> 00:21:12,564 నువ్వు వారిలాంటి దానివి కాదనుకుంటున్నావని నాకు తెలుసు. 253 00:21:14,900 --> 00:21:16,235 కానీ వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. 254 00:21:18,695 --> 00:21:20,447 వారిలో ప్రతీ ఒక్కరూ అలా అనుకున్నవారే. 255 00:21:21,532 --> 00:21:22,574 అవును. 256 00:21:23,742 --> 00:21:25,953 నీ ప్రశ్నకు నా సమాధానం "అవును". 257 00:21:33,085 --> 00:21:37,172 నేను హినాటా ఆ షిప్ లో ఉంది అనుకున్నాను. 258 00:21:41,593 --> 00:21:43,178 ఆమెకు జరిగిన దానికి… 259 00:21:45,305 --> 00:21:46,723 నన్ను నేనే నిందించుకుంటున్నాను. 260 00:21:49,893 --> 00:21:50,894 ప్రపంచానికి జరిగినదానికి కూడా. 261 00:21:53,272 --> 00:21:54,273 నాకు తెలుసు. 262 00:21:57,651 --> 00:22:00,779 కానీ నిన్ను నువ్వే శిక్షించుకోవడం వల్ల పరిస్థితి మెరుగవుతుంది అనుకుంటున్నావా? 263 00:22:06,034 --> 00:22:10,539 నేను వాళ్ళను శిక్షిస్తే మెరుగవుతుందేమో. 264 00:22:15,919 --> 00:22:17,087 సమయమైంది. 265 00:22:18,005 --> 00:22:19,006 నాతో రా. 266 00:22:23,844 --> 00:22:25,053 అన్ని సిస్టమ్స్ రన్ అవుతున్నాయి. 267 00:22:27,306 --> 00:22:28,849 -హాయ్, మాయ. -హేయ్, మిష. 268 00:22:33,061 --> 00:22:37,149 మూడు, రెండు, ఒకటి. 269 00:22:37,816 --> 00:22:41,695 సూపర్! అంతే, మాకు చిక్కావు! మాకు ఇక చిక్కావు, చెత్త వెధవా! 270 00:22:41,778 --> 00:22:43,405 ఇప్పుడు ఏమైంది? 271 00:22:43,488 --> 00:22:46,783 మేము… ఆమె పెద్ద షిప్ ని ఎలా హ్యాక్ చేయాలో కనిపెట్టింది. 272 00:22:49,828 --> 00:22:54,458 అంటే ఆ రక్షించమనే సిగ్నల్ పైన ఉన్న పెద్ద షిప్ కి వెళ్తోంది అనుకుంటున్నారా? 273 00:22:55,167 --> 00:22:56,168 అవును. 274 00:22:57,252 --> 00:22:59,046 బహుశా అది సిగ్నల్ తీసుకోవడం లేదు ఏమో. 275 00:22:59,129 --> 00:23:02,132 ఈ షిప్ ని తీసుకెళ్లడానికి ఏదీ కిందకు రాలేదు లేదా ఈ ఏలియన్ ని. 276 00:23:02,216 --> 00:23:03,342 ఆ విషయం మనకు తెలీదు. 277 00:23:03,425 --> 00:23:07,679 అంటే, ఒకవేళ ఏలియన్ దళాలు గనుక కిందకి వచ్చి ఉంటే నేను గమనించేవాడిని. 278 00:23:08,180 --> 00:23:10,933 బహుశా అది స్వీకరించినా, ఈ షిప్ కూలిపోయింది కాబట్టి కాపాడి ప్రయోజనం 279 00:23:11,016 --> 00:23:12,726 లేదు అనుకుంటుంది ఏమో. 280 00:23:18,273 --> 00:23:19,608 ఇది నమ్మశక్యంగా లేదు. 281 00:23:20,150 --> 00:23:22,569 అందుకే నీకు ఇది నచ్చుతుందేమో అని ఆమె అనుకుంది. 282 00:23:25,072 --> 00:23:26,823 మాయ, ఈ మొత్తం కార్యక్రమంలో నీ పాత్ర ఏంటి? 283 00:23:26,907 --> 00:23:28,450 నేను మానసిక తోడ్పాటు ఇవ్వడానికి ఉన్నాను. 284 00:23:29,117 --> 00:23:30,827 కొంతమంది నిన్ను చూసి జడుసుకోవచ్చు. 285 00:23:31,703 --> 00:23:33,580 థాంక్స్. అందుకు గాను నీకు థాంక్స్, మాయ. 286 00:23:35,666 --> 00:23:37,584 -ఆమె కాదు. -కాదు. 287 00:23:38,877 --> 00:23:44,424 అంటే నువ్వు ఇప్పుడు ఈ స్పష్టత లేని ట్రాన్స్మిషన్ ని ఆధారం చేసుకోవాలి అంటున్నావు. 288 00:23:44,508 --> 00:23:45,634 మరి… ఆ తర్వాత? 289 00:23:46,218 --> 00:23:48,220 -పెద్ద షిప్ ని కూడా హ్యాక్ చేయాలా? -అవును. 290 00:23:49,555 --> 00:23:51,473 అవును, ఈ ప్లాను ఎంత విపరీతంగా ఉందంటే, నాకు చాలా నచ్చింది. 291 00:23:54,059 --> 00:23:55,727 కానీ మన అంతిమ లక్ష్యం ఏంటి? 292 00:23:57,771 --> 00:24:01,817 ముందు… ముందు నీ… ముందు నీ అంచనా నిజమే అనుకుందాం, మనం… 293 00:24:03,569 --> 00:24:04,736 మెట్రిక్స్ ని చూడగలం అనుకుందాం. 294 00:24:05,487 --> 00:24:06,488 ఆ తర్వాత ఏంటి, హీరో? 295 00:24:07,698 --> 00:24:11,326 ఆ ఏలియన్స్, వాళ్ళు ఎలాగో భూమి మీదకు వస్తున్నారు. 296 00:24:12,286 --> 00:24:15,414 రోజు రోజుకూ, ఎక్కడ పడితే అక్కడ వారి సంఖ్య ఎందుకు పెరుగుతుందో మనకు తెలీదు. 297 00:24:16,039 --> 00:24:19,126 అందుకు కారణం వాళ్ళు ఈ క్లోకింగ్ టెక్నాలజీని వాడుతున్నారు కాబట్టే. 298 00:24:20,085 --> 00:24:23,964 మనం గనుక వాళ్ళను చూడగలిగితే, వాళ్ళను టార్గెట్ చేయగలం. 299 00:24:25,299 --> 00:24:27,593 నువ్వు వాళ్ళ రవాణా షిప్స్ ముసుగును తొలగించాలి అనుకుంటున్నావా? 300 00:24:27,676 --> 00:24:29,511 ఆ తర్వాత ఆకాశంలో ఉండగానే కాల్చేయాలి. 301 00:24:30,679 --> 00:24:31,763 దీనికి ఒక ప్రతికూల పర్యవసానం ఉంది. 302 00:24:32,389 --> 00:24:33,891 దీనికి ప్రతికూల పర్యవసానం ఏముంటుంది? 303 00:24:33,974 --> 00:24:35,893 మనం కాల్చేది ఏదైనా సరే, భూమి మీద పడుతుంది. 304 00:24:35,976 --> 00:24:38,770 పైన ఉన్న ఆ క్యారియర్ ఒక చిన్న సిటీ అంత ఉంది. 305 00:24:38,854 --> 00:24:40,981 వాళ్ళ కంటే మన వారినే మనం ఎక్కువ మందిని చంపగలం. 306 00:24:45,736 --> 00:24:46,862 స్టాలిన్ గ్రాడ్. 307 00:24:49,364 --> 00:24:51,074 స్టాలిన్ గ్రాడ్ యుద్ధం. 308 00:24:51,658 --> 00:24:54,745 అందరూ జపాన్ మీద అణుబాంబులు వేయడమే, క్షమించాలి, 309 00:24:54,828 --> 00:24:57,706 లేదా డి-డే కారణంగానో నాజీల పై పైచేయి దక్కింది అని అనుకుంటుంటారు, 310 00:24:57,789 --> 00:25:02,085 కానీ స్టాలిన్ గ్రాడ్ లో ఎదురైన దెబ్బ కారణంగానే జెర్మనీ తిరిగి కోలుకోలేకపోయింది. 311 00:25:02,836 --> 00:25:04,463 రెండవ ప్రపంచ యుద్ధంలో అత్యంత ప్రాణాంతకమైన యుద్ధం. 312 00:25:04,546 --> 00:25:08,550 సోవియెట్ వారు దాదాపు పదిలక్షలకు పైనే సైనికులను కోల్పోయారు, 313 00:25:09,676 --> 00:25:10,969 కానీ వాళ్ళను వెనక్కి పారద్రోలగలిగారు. 314 00:25:12,679 --> 00:25:14,515 ఇది మన స్టాలిన్ గ్రాడ్. 315 00:25:18,477 --> 00:25:21,730 అంతేకాక, భూమి మీద 71% నీరే ఉంది. 316 00:25:22,773 --> 00:25:23,899 నేనైతే మనమే గెలుస్తాం అంటా. 317 00:25:25,400 --> 00:25:27,152 నీకు మతి పోయిందా? 318 00:25:27,986 --> 00:25:29,988 మాయ… డాక్టర్ కాస్టిలో. 319 00:25:30,072 --> 00:25:32,616 మీ వైద్యసంబంధమైన దృక్కోణం నుండి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? 320 00:25:32,699 --> 00:25:35,244 ఆ ప్రశ్నకు ఎవరైనా ఎప్పుడైనా అవును అని సమాధానం ఇస్తారా? 321 00:25:36,453 --> 00:25:38,747 మీకు గెలుపు కావాలి కదా? నేను గెలవడానికి మీకు ఒక అవకాశాన్ని… 322 00:25:38,830 --> 00:25:42,584 మా న్యూక్లియర్ ఆయుధాల ఓపెరటివ్స్ ని ఇలా ఆర్డర్ చేయాలి అంటారు, 323 00:25:42,668 --> 00:25:46,213 "0942 యుటిసి సమయానికి ఆకాశం వైపు చూస్తూ డెఫ్కాన్ 1 దగ్గరకు రండి." 324 00:25:46,713 --> 00:25:48,131 అది నిజమే, మేడం. 325 00:25:48,215 --> 00:25:51,176 అలాగే వాళ్ళు దేనిని చూసినా, ఏమాత్రం అనుమానం కలిగినా, 326 00:25:51,260 --> 00:25:52,469 దానిని కాల్చి పారేయమనాలి. 327 00:25:52,553 --> 00:25:53,762 అవును. 328 00:25:53,846 --> 00:25:55,889 మనకు వేగం అలాగే దూరం వెళ్లగల టాక్టికల్ అణుబాంబులు కావాలి. 329 00:25:57,182 --> 00:26:01,019 మన దగ్గర ఒకటి ఉంది, బెన్యా. మన దగ్గర నిజంగానే ఒకటి ఉంది. 330 00:26:01,979 --> 00:26:04,314 నాకు తప్పుబడడం నచ్చదు, కాబట్టి మంచి అవకాశం 331 00:26:04,398 --> 00:26:06,942 ఉంది అని నాకు అనిపించకపోతే నేను అడగను అని మీకు తెలుసు. 332 00:26:07,025 --> 00:26:08,151 "చాలా మంచి అవకాశం." 333 00:26:09,570 --> 00:26:10,571 ఎంత కాలం? 334 00:26:12,030 --> 00:26:14,116 -మేడం? -ఏదోకటి వస్తుందేమో అని ఎదురుచూస్తూ 335 00:26:14,199 --> 00:26:18,078 న్యూక్లియర్ ఆపరేటివ్ లు ఎంతకాలం ఆకాశం వైపు చూస్తూ ఉండాలి? 336 00:26:21,790 --> 00:26:23,041 నాకు ఒక సమాధానం చెప్పండి. 337 00:26:23,125 --> 00:26:24,168 నాకు తెలీదు. 338 00:26:24,251 --> 00:26:25,586 అయితే గెస్ చెయ్. 339 00:26:27,171 --> 00:26:28,255 ముప్పై నిముషాలు. 340 00:26:31,466 --> 00:26:32,968 ముప్పై నిముషాలు, మేడం ప్రెసిడెంట్. 341 00:26:34,261 --> 00:26:35,304 ముప్పై నిముషాలు. 342 00:26:35,804 --> 00:26:38,724 అలాగే ఈ మాట చెప్పండి, లాక్ ఆన్ చేయడానికి టార్గెటింగ్ టీమ్ సిద్ధంగా ఉండాలి. 343 00:26:39,224 --> 00:26:41,602 వాళ్ళు సిగ్నల్ కట్ చేయడానికి ముందు మనకు ఎంత సమయం ఉంటుందో నాకు తెలీదు. 344 00:26:42,394 --> 00:26:44,521 నేను మీకోసం చేయగల పని ఇంకేమైనా ఉందా, మిస్ యమాటో? 345 00:26:46,231 --> 00:26:47,691 లేదు, అంతే. 346 00:26:48,358 --> 00:26:49,693 థాంక్స్, మేడం ప్రెసిడెంట్. 347 00:26:50,736 --> 00:26:51,737 టా-టా. 348 00:27:03,123 --> 00:27:04,208 మార్నింగ్, షెరీఫ్. 349 00:27:06,877 --> 00:27:08,086 మార్నింగ్, రోజ్. 350 00:27:08,170 --> 00:27:09,171 ఒక నిమిషం మాట్లాడొచ్చా? 351 00:27:09,838 --> 00:27:11,840 ఈ కాఫీ మెషిన్ తో ఇంకొక్క సమస్య ఎదురైంది అంటే… 352 00:27:11,924 --> 00:27:15,302 ఓహ్, లేదు, లేదు, లేదు. అంటే, నిజానికి సమస్య ఉంది. 353 00:27:15,385 --> 00:27:17,137 కానీ నేను మాట్లాడాలనుకున్నది దాని గురించి కాదు. 354 00:27:18,305 --> 00:27:19,306 నేను ఒకసారి… 355 00:27:20,015 --> 00:27:23,602 అంటే, మీరు ఈ మూడు కొత్త కేసులను చూశారో లేదో అడుగుదాం అనుకున్నాను. 356 00:27:23,685 --> 00:27:25,812 వాళ్ళను చివరిగా ఎక్కడ చూశారు అన్న విషయాన్ని పరిశీలిస్తున్నాను, 357 00:27:25,896 --> 00:27:27,689 బహుశా మనకు అక్కడ కొన్ని క్లూలు దొరకొచ్చు. 358 00:27:27,773 --> 00:27:30,943 రోజ్. మేము మాకు చేతనైనంతగా ప్రయత్నిస్తున్నాం, ఒట్టు. 359 00:27:31,026 --> 00:27:32,110 ప్రస్తుతం మనుషులు లేరు. 360 00:27:32,194 --> 00:27:35,405 నాకు తెలుసు, నాకు తెలుసు. అందుకే నేనే విషయం అంతా సేకరించాను. 361 00:27:35,489 --> 00:27:38,492 ఇతర కేసులతో ఏదైనా కనెక్షన్ ఏమైనా ఉందేమో అని వాటితో సహా అన్నీ సేకరించాను. 362 00:27:38,992 --> 00:27:41,745 రోసీ, ఆ పనిని ప్రొఫెషనల్స్ కి వదిలేయ్. 363 00:27:42,329 --> 00:27:45,707 సరే. అంటే, మీరే అన్నారు కదా. 364 00:27:45,791 --> 00:27:49,253 అసలే జనం తక్కువ ఉన్నారు, అలాగే రోజు రోజుకూ జనం తగ్గిపోతున్నారు, 365 00:27:49,336 --> 00:27:50,379 కాబట్టి అతిత్వరలోనే, 366 00:27:50,462 --> 00:27:52,339 మీకు ఇంకొకరి సహాయం అవసరం రావచ్చు అనిపిస్తుంది. 367 00:27:52,422 --> 00:27:53,590 అవసరమే. నాకు నిజంగానే కావాలి. 368 00:27:53,674 --> 00:27:54,842 థాంక్స్, రోసీ. 369 00:27:57,094 --> 00:27:59,805 సరే, ఇక ఆ కాఫీ మెషిన్ ని బాగు చేసే పని మొదలెడదామా? 370 00:28:09,314 --> 00:28:10,315 అరేయ్ ఛ. 371 00:28:13,610 --> 00:28:14,653 నువ్వు బానే ఉన్నావా? 372 00:28:14,736 --> 00:28:16,697 సమాజంలో మార్పు తీసుకొద్దామని ఉద్యోగం మానేశా, 373 00:28:16,780 --> 00:28:19,116 తీరా చూస్తే మార్పుకు బదులు కాఫీ చేస్తున్నాను. 374 00:28:20,534 --> 00:28:21,660 అది కూడా కాదు. 375 00:28:21,743 --> 00:28:24,246 -బహుశా, నేను అన్నట్టే, సాయం చేయగలనేమో. -అవునా? 376 00:28:24,329 --> 00:28:26,665 మిలటరీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అన్నారు చూడు, అలాగా? 377 00:28:28,625 --> 00:28:30,544 "మేము సాయం చేయగలం. నియమాలను ఫాలో అవ్వండి." 378 00:28:30,627 --> 00:28:32,546 మీ అందరికీ ఆ పదం అంటే చాలా ఇష్టం, "నియమాలు." 379 00:28:32,629 --> 00:28:33,672 కానీ వాళ్ళు చేసింది ఏంటి? 380 00:28:33,755 --> 00:28:37,968 వచ్చారు, అంతా ఆక్రమించుకున్నారు, లైబ్రరీని ఒక ల్యాబ్ లా చేశారు. 381 00:28:38,051 --> 00:28:41,263 అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద బేస్ ని చూస్తున్నావా? అది ఒకప్పుడు హైస్కూల్. 382 00:28:41,763 --> 00:28:44,892 బెన్ షెల్టన్ వాళ్ళ పొలాన్ని సప్లై డిపోలాగ చేసి పారేసారు. 383 00:28:44,975 --> 00:28:47,853 అమెరికన్ ఖండాలలో గౌండ్ జీరో అంట, ఎంత అదృష్టమో. 384 00:28:47,936 --> 00:28:50,731 మన ప్రజలు కనిపించకుండా పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. 385 00:28:50,814 --> 00:28:52,691 ఎందుకంటే, ప్రపంచంలో పావు వంతు ప్రజలు మాయమై 386 00:28:52,774 --> 00:28:55,319 చచ్చిపోయాకా ఒక 37 మంది కనిపించకుండా పోతే ఎవడు లెక్క చేస్తాడు? 387 00:28:55,903 --> 00:28:57,905 ఎందుకంటే వాళ్లందరికీ ఒక పేరు ఉంది. 388 00:28:58,488 --> 00:29:01,325 వాళ్ళందరూ పలానా రోజున కనిపించకుండా పోయారు అని చెప్పగలం. 389 00:29:01,408 --> 00:29:04,369 కానీ సైనికులు ఆ పేర్లను సమాధి రాయి మీద చెక్కించడానికి అన్నట్టు 390 00:29:04,453 --> 00:29:05,871 వాళ్ళు మరణించిన తేదీల్లాగా చూస్తున్నారు. 391 00:29:05,954 --> 00:29:06,955 తేదీలు. 392 00:29:15,839 --> 00:29:17,341 అదేం నక్షత్రం కాదు. 393 00:29:19,218 --> 00:29:20,302 అది ఒక బ్యాడ్జ్. 394 00:29:21,303 --> 00:29:22,846 అలాగే అవి నంబర్లు. 395 00:29:24,598 --> 00:29:26,683 అక్కడ ఉన్నది ఒక పోలీస్ ఆఫీసర్ కదా? ఆ ముసలి వ్యక్తి, టైసన్ కదా? 396 00:29:26,767 --> 00:29:29,186 అవును. అలాగే నీకు ఒకటి చెప్తాను విను, ఆయన గనుక ఇక్కడే ఉండి ఉంటే, 397 00:29:29,269 --> 00:29:30,270 ఏదోకటి చేసి ఉండేవాడు. 398 00:29:30,354 --> 00:29:31,647 ఆయనకు ఏమైంది? 399 00:29:32,147 --> 00:29:33,857 కనిపించకుండా పోయిన మొదటి వారిలో ఆయన ఒకడు. 400 00:29:33,941 --> 00:29:36,944 అయన రిటైర్మెంట్ పార్టీ రాత్రే కనిపించకుండా పోయాడు. ఎంత విడ్డురమైన విషయమో కదా? 401 00:29:38,820 --> 00:29:40,155 ఆయనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. 402 00:29:40,239 --> 00:29:42,324 -నేను ఇలాంటి జోకులు వేయమనలేదు. -నేను సీరియస్ గా అంటున్నాను. 403 00:29:42,407 --> 00:29:44,660 హేయ్, చూడు. నువ్వు నాకు వెంటనే ఆ నోట్ బుక్ తెచ్చి ఇవ్వాలి. 404 00:29:44,743 --> 00:29:48,038 -నీకు ముందే చెప్పాను. అది లాకప్ లో ఉంది. నేను… -నన్ను చూడు. నన్ను చూడు, సరేనా? 405 00:29:48,121 --> 00:29:49,373 ఈ మాట ముందే విని ఉంటావని నాకు తెలుసు, 406 00:29:49,456 --> 00:29:52,709 నా మాటలు మిగతావారి మాటల్లా పిచ్చి మాటల్లా ఉన్నా కూడా, నేను కూడా అంతా కోల్పోయానని చెప్పగలను. 407 00:29:53,210 --> 00:29:55,963 మొత్తం. ఈ క్షణం వరకు నాకు ఎలాంటి ఆశ లేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. 408 00:29:56,046 --> 00:29:57,047 దయనీయమైన స్థితిలో ఉన్నా అనుకుంటున్నావా? 409 00:29:57,130 --> 00:30:00,175 అయితే ముప్పై నిమిషాలు కేటాయించిన సమయాన్ని ఇంటర్నెట్ హబ్ లో వాడుతూ రాత్రి మొదలెట్టి 410 00:30:00,259 --> 00:30:02,594 ఉదయం నాలుగు అయ్యేంత వరకు సమాచారం సేకరించడం ఎలా ఉంటుందో ఆలోచించు. 411 00:30:02,678 --> 00:30:05,931 ఒకదాని తర్వాత ఒకటి ఆధారాలు కనుమరుగై, ఎలాంటి ప్రయోజనం లేనట్టు అనిపిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. 412 00:30:06,431 --> 00:30:10,060 ఇప్పటి వరకు. ఈ క్షణం వరకు. నేను ఒకటి కనుగొన్నాను, రోజ్. 413 00:30:10,143 --> 00:30:13,730 నువ్వు నాకు ఆ నోట్ బుక్ తీసుకొచ్చి ఇవ్వాలి, సరేనా? నేను నీకు చూపిస్తాను. 414 00:30:13,814 --> 00:30:17,067 అలాగే బహుశా, వీలైతే మనం ఒకరికి ఒకరం సాయం చేయగలం. 415 00:30:19,570 --> 00:30:22,865 నువ్వు నీ టౌన్ ని కాపాడగలవు, అలాగే నేను వీలైతే ఈ యద్ధాన్నే గెలిపించగలను. 416 00:30:24,825 --> 00:30:27,578 చూడు, రోజ్. నాకు నీ సహాయం ఎంత కావాలో నీకు నా సాయం అంతే కావాలి, సరేనా? 417 00:30:30,122 --> 00:30:33,792 నాలుగు నెలల క్రితం, ఇద్దరు అపరిచితులు నా సాయం కోసం అడిగారు. 418 00:30:34,877 --> 00:30:36,003 పిల్లలు. 419 00:30:36,086 --> 00:30:37,963 నేను వాళ్లకు సాయం చేయాలి అనుకోలేదు. అస్సలు అనుకోలేదు. 420 00:30:39,173 --> 00:30:40,841 అప్పటికే నేను అంతా కోల్పోయాను, 421 00:30:40,924 --> 00:30:43,927 కానీ సాయం చేసిన తర్వాతే నేను మొదటిసారి ఒక ప్రయోజనకరమైన పని చేశా అనిపించింది. 422 00:30:45,179 --> 00:30:47,848 కాబట్టి, నా మనసు అంతా పెట్టి నిన్ను అడుగుతున్నాను, 423 00:30:49,725 --> 00:30:50,976 నువ్వు కోల్పోగలది ఇంకేం ఉంది? 424 00:31:01,987 --> 00:31:03,614 కాపాడండి! కాపాడండి! 425 00:31:03,697 --> 00:31:05,449 -రైడర్. -కాపాడండి! ఎవరైనా ఉన్నారా? 426 00:31:05,532 --> 00:31:07,492 అత్యవసరమా? మీ స్టేటస్ ఇంకానా లొకేషన్ ఎక్కడ? 427 00:31:07,576 --> 00:31:09,745 మళ్ళీ అడుగుతున్నాను, మీ స్టేటస్ ఇంకా లొకేషన్ ఎక్కడ? 428 00:31:09,828 --> 00:31:11,371 మేము ఒక లోయలో ఇరుక్కున్నాం! 429 00:31:11,455 --> 00:31:14,458 మీ లొకేషన్ ఇవ్వండి. దయచేసి మీ లొకేషన్ ఎక్కడో చెప్పండి. 430 00:31:14,541 --> 00:31:17,169 -నాకు తెలీదు. ఎల్క్స్ పాస్. -ఎల్క్స్ పాస్. 431 00:31:18,212 --> 00:31:20,172 హేయ్, మిత్రులారా. ఒకరు ఆపదలో ఉన్నారు. 432 00:31:20,255 --> 00:31:21,256 నువ్వు ఏం చేస్తున్నావు? 433 00:31:21,340 --> 00:31:23,300 అలాగే. తరువాతి టర్న్ హైవే 6 మీద ఉంది. 434 00:31:23,383 --> 00:31:25,135 హాన్లి, జాక్సన్, క్రిస్సి, మీరు నాతో రండి. 435 00:31:25,636 --> 00:31:27,513 -అలాగే. -అలాగే. 436 00:31:30,349 --> 00:31:32,142 నువ్వు మమ్మల్ని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తా అన్నావు. 437 00:31:32,226 --> 00:31:34,978 అదే చేస్తా, కానీ ముందు ఆపదలో ఉన్నవారికి సాయం చేసిన తర్వాత. 438 00:31:35,062 --> 00:31:36,438 -మమ్మల్ని దించండి. -ఇలాంటి ఏమీ కానీ ప్రదేశంలోనా? 439 00:31:36,522 --> 00:31:38,732 -మమ్మల్ని దించు. ఇక్కడే దించేయండి! -చెప్పేది విను… 440 00:31:38,815 --> 00:31:41,693 -కారును ఆపు. -నేను మిమ్మల్ని సురక్షితమైన ప్రదేశంలో దించుతా. 441 00:31:41,777 --> 00:31:44,446 -ముందు ఈ పని చేయాలి అంతే. -ఎందుకు? 442 00:31:44,530 --> 00:31:48,283 నీకు చెప్పాను. మేము జనానికి సాయం చేస్తాం, సరేనా? మా పనే అది. 443 00:31:58,669 --> 00:32:00,879 సబ్మెరైన్లు స్థానాలకు వెళ్ళినప్పుడు నాకు చెప్పండి. 444 00:32:00,963 --> 00:32:01,964 ఇండియా సిద్ధంగా ఉంది. 445 00:32:07,386 --> 00:32:08,387 జనరల్. 446 00:32:08,470 --> 00:32:09,471 మేడం ప్రెసిడెంట్, 447 00:32:09,555 --> 00:32:12,224 అధికార ప్రక్రియని కాదని నేరుగా దాడి చేయమన్న ఈ ఆర్డర్ సమస్యాత్మకం అని 448 00:32:12,307 --> 00:32:13,308 చెప్పాలి అనుకుంటున్నా. 449 00:32:13,392 --> 00:32:17,271 తప్పడం లేదు. మనం మన ఆపరేటర్ల మీద ఆధారపడాలి. మనకు చిన్న వ్యవధి మాత్రమే దొరకొచ్చు. 450 00:32:17,354 --> 00:32:21,191 నాకు మా ఆపరేటర్ల మీద పూర్తి నమ్మకం ఉంది. మీ వారి మీదే లేదు. 451 00:32:21,984 --> 00:32:24,152 ఒక 20 ఏళ్ల కుర్రాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు అన్న కారణంగా 452 00:32:24,236 --> 00:32:26,822 నా మీద బాంబులు పడడం నాకు ఇష్టం లేదు. 453 00:32:30,325 --> 00:32:33,537 ఆపరేటర్లకు చెప్పండి, మిస్ అయితే ఆకాశంలో ఉండగానే పేల్చేయమని. 454 00:32:34,204 --> 00:32:36,039 ఒకరి మీద ఒకరం బాంబులు వేసుకోకుండా ఉండదని ప్రయత్నిద్దాం. 455 00:32:38,792 --> 00:32:41,044 -సంతోషమా? -అంత ఎక్కువగా ఏం కాదు. 456 00:32:41,628 --> 00:32:42,629 సరే, కానీ అందరి స్థితి అంతేకదా? 457 00:32:45,757 --> 00:32:48,177 హాన్లి? జాక్సన్? క్రిస్సి? వెళ్తున్నాం. 458 00:32:49,553 --> 00:32:50,554 అలాగే. 459 00:32:51,138 --> 00:32:52,139 అలాగే. 460 00:33:04,359 --> 00:33:06,361 ఒకటి చెప్పనా? నా 30వ పుట్టినరోజున, 461 00:33:06,445 --> 00:33:08,739 చరిత్రలోనే అతిపెద్ద బాణాసంచా ప్రదర్శన ఏర్పాటు చేశారు. 462 00:33:08,822 --> 00:33:09,990 ముప్పై భారీ రాకెట్లు. 463 00:33:10,991 --> 00:33:12,910 దానిని అంతరిక్షం నుండి కూడా చూడగలం అన్నారు. 464 00:33:15,204 --> 00:33:16,330 విషయం న్యూస్ లో వారం ట్రెండ్ అయింది. 465 00:33:18,707 --> 00:33:21,627 నీకు మతి ఉందో లేదో వైద్యపరమైన విశ్లేషణ ఇమ్మంటావా? 466 00:33:35,098 --> 00:33:36,099 బానే ఉన్నావా? 467 00:33:39,353 --> 00:33:41,021 క్రితంసారి మనం వాళ్ళ మీద బాంబులు వేసినప్పుడు… 468 00:33:45,609 --> 00:33:47,653 నేను ఆమె స్వరాన్ని చివరిగా విన్నాను. 469 00:33:52,491 --> 00:33:53,659 ఈ సారి అలా కాదు. 470 00:34:03,335 --> 00:34:05,003 మనం ఒకరిని పాతిపెట్టగలం… 471 00:34:08,422 --> 00:34:09,424 ఒక జ్ఞాపకాన్ని… 472 00:34:11,342 --> 00:34:12,344 ఫీలింగ్ ని పూడ్చగలం… 473 00:34:16,306 --> 00:34:18,475 కానీ ఒక్క క్షణంలో అదంతా తిరిగి గుర్తొస్తుంది. 474 00:34:23,230 --> 00:34:25,690 నా మెదడులో ఏ భాగం వల్ల అలా వుంటుంది? 475 00:34:28,860 --> 00:34:29,987 మానవత్వం వల్ల. 476 00:34:35,033 --> 00:34:37,995 మిలటరీ వారు సూర్యాస్తమయం సమయంలో వీధుల్లో నిలబడి ఆకాశంవైపు చూడమన్నారు. 477 00:34:38,078 --> 00:34:39,621 ఏదో పెద్ద పని చేయబోతున్నారు అంట. 478 00:34:39,705 --> 00:34:41,706 సరే. డేవిడ్స్, గార్సియా, సిద్ధం అవ్వండి. 479 00:34:42,331 --> 00:34:44,001 -నువ్వు నాతో వస్తున్నావు, వేడ్. -షెరీఫ్. 480 00:34:44,083 --> 00:34:45,835 పదా. నడువు, కార్మైకేల్. 481 00:34:46,335 --> 00:34:48,714 -ఏం జరుగుతోంది? -హేయ్, రోసీ. 482 00:34:48,797 --> 00:34:51,257 వాళ్ళు చేస్తున్న అదేదో పని వల్ల రవాణా వాహనం ఆలస్యం అవుతోంది. 483 00:34:51,341 --> 00:34:53,135 ఇతన్ని ఇంకొక రెండు గంటలు చూసుకోగలవా? 484 00:34:53,217 --> 00:34:56,722 అలాగే. నేను ఇక్కడే ఉంటాను. ఆ కాఫీ మెషిన్ ని బాగు చేయడానికి చూస్తా. 485 00:34:56,804 --> 00:34:58,307 నువ్వు చాలా మంచిదానివి, రోసీ. 486 00:34:58,849 --> 00:34:59,850 చాలా మంచిదానివి. 487 00:35:11,778 --> 00:35:13,530 సరే, దానిని తెరువు. 488 00:35:16,491 --> 00:35:18,452 -ఇది నీడా? -కాదు, పిల్లాడు. నేను సాయం చేసిన కుర్రాడిది. 489 00:35:18,535 --> 00:35:22,331 వాడే గీశాడు. అంటే, వాడు చాలా విషయాలు చూసేవాడు. ఏలియన్స్ చూసే విషయాలను. 490 00:35:22,831 --> 00:35:24,374 వాళ్లకు కూడా మనలాగే కామిక్ పుస్తకాలంటే ఇష్టమా? 491 00:35:24,458 --> 00:35:26,710 కొన్ని పేజీలు తిరగేయ్. మూడు లేదా నాలుగు. 492 00:35:28,420 --> 00:35:30,964 అదిగో. వాడు దానిని నాలుగు నెలల క్రితం గీశాడు. 493 00:35:31,548 --> 00:35:33,217 మొదట, నేను అది ఒక స్టార్ అనుకున్నాను. 494 00:35:33,300 --> 00:35:36,261 ఒక గ్రాహం లాంటిది ఏదో అని, కానీ దానిని నువ్వు గుర్తుపట్టగలవా? 495 00:35:37,095 --> 00:35:39,973 అది మీ షెరిఫ్ టైసన్ బ్యాడ్జి ఉన్న ఆకారంలోనే ఉంది. 496 00:35:42,643 --> 00:35:43,977 కాదు అంటావా? 497 00:35:46,939 --> 00:35:48,774 యాదృచ్చికం కావచ్చు. 498 00:35:48,857 --> 00:35:51,527 వెళ్లి ఆయన పామ్ప్లేట్ తీసుకురా, ప్లీజ్. 499 00:35:57,491 --> 00:36:00,369 ఇప్పుడు ఆ పుస్తకంలో ఉన్న నంబర్లు, అలాగే ఆయన కనిపించకుండా పోయిన తేదీని చెక్ చెయ్. 500 00:36:07,709 --> 00:36:10,128 షెరిఫ్ జిమ్ బెల్ టైసన్ చివరిగా కనబడింది 11/01 501 00:36:10,212 --> 00:36:13,006 చూసావా? సమాధానాలు అందులో ఉన్నాయి. 502 00:36:14,842 --> 00:36:16,176 వాళ్ళు నన్ను ఇక్కడికి ఒక కారణంతో తీసుకొచ్చారు. 503 00:36:16,260 --> 00:36:17,344 ఐలీన్ గ్రేడీ చివరిగా కనబడింది 11/22 504 00:36:18,470 --> 00:36:19,721 బెన్ షెల్టన్ చివరిగా కనబడింది 11/04 505 00:36:21,098 --> 00:36:22,349 చెట్ గ్రిఫిన్ చివరిగా కనబడింది 10/31 506 00:36:25,477 --> 00:36:28,105 సమాధానాలు అన్నీ అందులోనే ఉన్నాయి. 507 00:36:31,775 --> 00:36:33,819 ముగ్గురు ఉన్న కుటుంబం కారులో ఇరుక్కుంది. 508 00:36:34,945 --> 00:36:36,363 ఆరు ఏలియన్లు ఉన్నాయి. 509 00:36:36,947 --> 00:36:38,448 అవి అన్ని వైపుల నుండి వస్తున్నాయి. 510 00:36:43,287 --> 00:36:45,414 సిద్ధం అవ్వండి. మంటలు వేసేవారు. 511 00:36:52,379 --> 00:36:53,505 ఒక కుటుంబం ఇరుక్కుంది. 512 00:36:54,506 --> 00:36:56,425 ఆరు ఏలియన్స్ వాళ్ళను పట్టుకున్నాయి. 513 00:36:59,094 --> 00:37:00,512 -రై, నువ్వు ఇక్కడే ఉండాలి. -నేను నీతో వస్తాను. 514 00:37:00,596 --> 00:37:02,431 -ఇప్పుడు కాదు. రై! -లేదు, నాన్నా. నేను ఎప్పుడూ… 515 00:37:10,397 --> 00:37:12,316 మీరు సురక్షితమైన దూరంలో ఉన్నారు. మీకు ఏం కాదు. 516 00:37:12,399 --> 00:37:13,859 సురక్షితమైన దూరంలోనా? 517 00:37:13,942 --> 00:37:15,485 నేను నీకు నా మాట ఇచ్చాను. నేను మాట నిలబెట్టుకుంటా. 518 00:37:18,780 --> 00:37:20,157 కానీ ఒకవేళ అనుకోనిది ఏమైనా అయితే… 519 00:37:25,913 --> 00:37:26,914 వెళ్లిపోండి. 520 00:37:41,637 --> 00:37:44,306 -మెల్లిగా, వేగంగా పదండి. -అలాగే. జాక్సన్, నువ్వు సాయం చెయ్. 521 00:37:44,389 --> 00:37:46,683 -అలాగే. -నేను సిగ్నల్ ఇవ్వగానే. 522 00:37:48,018 --> 00:37:49,019 వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. 523 00:37:53,982 --> 00:37:56,151 వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. మీరు సిద్ధమా? 524 00:37:56,818 --> 00:37:58,445 వెళ్ళండి, వెళ్ళండి! 525 00:38:02,991 --> 00:38:07,120 ఈ మెసేజ్ అన్ని ఎమర్జెన్సీ సిగ్నల్స్ లో 30 నిముషాలు నిరంతరాయంగా ప్రసారం అవుతుంది, 526 00:38:07,621 --> 00:38:09,498 లేదా మీరు ఆపమని ఆర్డర్ ఇచ్చే వరకు. 527 00:38:18,632 --> 00:38:20,843 నా తోటి ప్రపంచ పౌరులారా. 528 00:38:22,302 --> 00:38:24,555 ఇవాళ ఉదయం 0942 యుటిసికి, 529 00:38:25,556 --> 00:38:28,725 ప్రపంచ దేశాలు అన్నీ కలిపి మన ప్రపంచాన్ని ముట్టడించిన ఏలియన్లపై 530 00:38:29,643 --> 00:38:32,729 ఒకే సమయంలో సమన్వయంతో దాడి చేయబోతున్నాయి. 531 00:38:33,897 --> 00:38:39,778 అనేక నెలలుగా, మన వారి సంఖ్యా, ఆయుధ బలం అలాగే దూరాన్ని మించి దాడులు చేశారు. 532 00:38:41,071 --> 00:38:43,240 మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం అని చెప్పలేను. 533 00:38:43,866 --> 00:38:45,117 లోడ్ సీక్వెన్స్. 534 00:38:45,200 --> 00:38:47,369 -కానీ ఒకటి మాత్రం చెప్పగలను… -లోడ్ అవుతోంది. 535 00:38:47,452 --> 00:38:50,038 …వాళ్లకు దిమ్మ తిరిగేలా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాం. 536 00:38:51,832 --> 00:38:54,042 మన బాధ వాళ్లకు తెలిసేలా చేస్తాం. 537 00:38:54,543 --> 00:38:55,794 ఇంకొకటి వస్తోంది. 538 00:38:56,336 --> 00:38:57,379 జాక్సన్, నన్ను కవర్ చెయ్. 539 00:38:57,880 --> 00:39:00,716 క్రిస్సి, క్రిస్సి. నువ్వు దానిని చూస్తున్నావా? ఎడమవైపు! నీకు ఎడమవైపు! 540 00:39:01,300 --> 00:39:03,468 మా నాన్న అంటుండేవారు, 541 00:39:03,552 --> 00:39:06,763 "వాళ్ళ ముందు ఎన్నటికీ నీ తలను ఒంచుకు" అని. 542 00:39:09,766 --> 00:39:13,061 కాబట్టి ఇప్పుడు నీ విన్నపం ఏంటంటే, పైకి చూడండి. 543 00:39:17,274 --> 00:39:19,526 -అయిదు, నాలుగు… -పైకి చూడండి. 544 00:39:19,610 --> 00:39:20,819 -ఇకపై మనం ఆకాశాన్ని, అందులోని… -మూడు. 545 00:39:20,903 --> 00:39:23,197 -…నక్షత్రాలను చూసి భయపడకూడదు. -రెండు. 546 00:39:23,280 --> 00:39:24,406 ఒకటి. 547 00:39:24,907 --> 00:39:25,908 మొదలు. 548 00:39:28,076 --> 00:39:29,119 లోనికి వెళ్లాం. 549 00:39:29,703 --> 00:39:31,747 ఆగండి. ఆగండి. 550 00:39:36,793 --> 00:39:37,794 ఆపు. 551 00:39:38,879 --> 00:39:39,880 ఇప్పుడు ఏం చేయాలి? 552 00:39:42,925 --> 00:39:43,926 ఎదురుచూడాలి. 553 00:39:52,309 --> 00:39:53,310 క్లార్క్! 554 00:39:53,393 --> 00:39:54,853 నీ వెనుక! నీ వెనుక! 555 00:39:56,438 --> 00:39:58,565 -క్లార్క్! -రైడర్! రైడర్! 556 00:40:00,567 --> 00:40:03,070 -అమ్మా! -రైడర్, వెనక్కి రా! 557 00:40:04,738 --> 00:40:08,200 అలాగే ఉండండి! జబ్ పడిపోయాడు! జబ్ పడిపోయాడు! 558 00:40:09,326 --> 00:40:13,747 అమ్మా, ప్లీజ్! మనం వాళ్లకు సాయం చేయాలి. నాన్నను వదిలినట్టు వీళ్ళను వదిలేయకూడదు! 559 00:40:13,830 --> 00:40:16,667 -జరిగింది అది కాదు! -అదే జరిగింది! అది… 560 00:40:18,293 --> 00:40:20,379 లూక్, ఏమైంది? 561 00:40:22,339 --> 00:40:23,799 లూక్. 562 00:40:23,882 --> 00:40:24,883 లూక్? 563 00:40:26,802 --> 00:40:28,011 లూక్! 564 00:40:30,639 --> 00:40:31,640 ఇంకా వస్తున్నాయి. 565 00:40:37,896 --> 00:40:42,067 మరిన్ని వస్తున్నాయి! పశ్చిమం నుండి ఏలియన్స్! దేవుడా! అవి ఎక్కడి నుండి వచ్చాయి? 566 00:40:42,150 --> 00:40:43,485 -లూక్! -మంటలు వేయండి. 567 00:40:43,569 --> 00:40:45,362 -చుట్టుముట్టండి! చుట్టుముట్టండి! -చాలా ఉన్నాయి! 568 00:40:45,445 --> 00:40:46,530 లూక్. 569 00:40:48,282 --> 00:40:50,659 -అమ్మా! -లూక్! 570 00:40:57,916 --> 00:41:01,962 ఏది ఏమైనా దీనిని వదలకు! దీనిని అస్సలు వదలకు! దీనిని అస్సలు వదలకు! 571 00:41:02,921 --> 00:41:04,089 అమ్మా! 572 00:41:21,398 --> 00:41:23,275 నువ్వు అన్నది నిజం కావాలి, నిఖిల్. 573 00:41:42,753 --> 00:41:44,087 ఏదో జరుగుతోంది. 574 00:41:45,088 --> 00:41:48,133 మనం ఇలా ఇంకెంత సేపు చూడాలి అనుకుంటున్నావు? 575 00:41:50,093 --> 00:41:52,095 నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? 576 00:41:57,559 --> 00:41:59,895 -వెనక్కి వచ్చేయండి! -కిందకు ఉండండి! మనం కిందకు ఉండాలి. 577 00:41:59,978 --> 00:42:01,271 దానిని ఎవరైనా చూస్తున్నారా? 578 00:42:01,813 --> 00:42:03,482 మనం ఇంకా చావలేదు, సరేనా? పదండి. 579 00:42:11,281 --> 00:42:12,282 అది జరుగుతోంది. 580 00:42:14,368 --> 00:42:15,452 అదేంటి? 581 00:42:17,412 --> 00:42:20,541 ఓరి, నాయనో. అది ఎంత పెద్దగా ఉందో. 582 00:42:24,545 --> 00:42:26,964 క్యారియర్స్, చూస్తున్నారా? చూస్తున్నారా? 583 00:42:34,054 --> 00:42:36,431 టార్గెట్ కనిపించింది. మళ్ళీ చెప్తున్నా, టార్గెట్ కనిపించింది. 584 00:42:36,932 --> 00:42:38,058 కాల్చేయండి. 585 00:43:04,418 --> 00:43:06,128 నేరుగా తగిలింది! శత్రుషిప్ కూలింది. 586 00:43:16,889 --> 00:43:18,390 ఓహ్, భలే! 587 00:43:18,974 --> 00:43:20,559 దేవుడా, నాకు గెలుపు అంటే చాలా ఇష్టం! 588 00:43:24,688 --> 00:43:27,149 నన్ను ఎవరు హత్తుకుంటున్నారు? నన్ను ఎవరు హత్తుకుంటున్నారు? 589 00:43:27,232 --> 00:43:30,319 అది నేను ఇప్పటివరకు చూసిన అతిపెద్ద బాణాసంచా కార్యక్రమంలా ఉంది! 590 00:43:39,578 --> 00:43:41,038 మీరంతా ఇది చూస్తున్నారా? 591 00:43:46,168 --> 00:43:47,419 ఏం జరుగుతోంది? 592 00:43:48,545 --> 00:43:49,880 అవి చస్తున్నాయి! 593 00:43:50,714 --> 00:43:52,424 కుటుంబం సురక్షితం! 594 00:43:52,508 --> 00:43:54,760 పదండి! పదండి! అందరూ, నడవండి! 595 00:44:00,933 --> 00:44:02,768 వాళ్ళ షిప్స్ లో ఏడు కూలిపోయాయి. 596 00:44:02,851 --> 00:44:06,396 పసిఫిక్ సముద్రంలో నాలుగు, అంటార్కిటికాలో రెండు, తూర్పు రష్యాలో ఒకటి. 597 00:44:08,690 --> 00:44:11,151 వాళ్లను సంప్రదించండి. సాయం చేస్తాం అనండి. 598 00:44:14,863 --> 00:44:15,948 అవును. 599 00:44:17,074 --> 00:44:18,283 మేము ఏంటో మీకు ఇప్పుడు తెలిసింది. 600 00:44:30,546 --> 00:44:31,880 నువ్వు సాధించావు, మిత్సుకి. 601 00:44:34,091 --> 00:44:35,759 అవును, అంతే! 602 00:44:55,571 --> 00:44:56,613 చిక్కింది. 603 00:44:57,364 --> 00:45:00,492 అంతే. సరే. ఆ చివరికి వెళ్ళండి. 604 00:45:01,994 --> 00:45:02,995 హేయ్, హలో. 605 00:45:05,789 --> 00:45:06,874 నేను మీకు కొంచెం ఆహారం తెస్తా. 606 00:45:06,957 --> 00:45:07,958 హేయ్. 607 00:45:09,084 --> 00:45:10,085 బాగా పోరాడావు. 608 00:45:11,712 --> 00:45:12,963 నువ్వు కూడా. 609 00:45:14,464 --> 00:45:16,133 వాహనాల దగ్గరకు వెళ్ళండి, సరేనా? 610 00:45:19,928 --> 00:45:21,263 థాంక్స్. 611 00:45:21,763 --> 00:45:23,182 -బాగా పోరాడావు. -పదండి. 612 00:45:23,265 --> 00:45:24,808 అతన్ని నేను పట్టుకున్నా. 613 00:45:25,767 --> 00:45:27,519 అసలు ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? 614 00:45:27,603 --> 00:45:28,979 ఏలియన్స్ ఉన్నట్టుండి ఆగిపోయాయి. 615 00:45:29,062 --> 00:45:31,064 పోరాడుతున్నది మనం మాత్రమే కాదు అనుకుంట. 616 00:45:36,278 --> 00:45:38,488 సారా. సారా. 617 00:45:39,781 --> 00:45:41,074 సారా, తల్లి! 618 00:45:42,784 --> 00:45:44,036 సారా! 619 00:45:55,380 --> 00:45:56,423 సారా! 620 00:45:58,342 --> 00:45:59,426 సారా! 621 00:46:04,056 --> 00:46:05,891 -సారా! -సారా! 622 00:46:06,600 --> 00:46:07,601 తల్లి! 623 00:46:10,521 --> 00:46:12,564 -సారా. -సారా! 624 00:47:46,575 --> 00:47:48,577 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్