1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 2 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 3 00:00:42,251 --> 00:00:46,004 మీ అలంకరణలన్నీ క్రిస్మస్ చెట్టు మీద చాలా అందంగా కనిపిస్తాయి. 4 00:00:46,588 --> 00:00:50,050 కట్ చేయడంలో ఎవరికైనా సాయం కావాలంటే, చేయి పైకెత్తండి, సరేనా? 5 00:00:58,851 --> 00:01:00,727 అందరూ చాలా బాగా చేశారు. 6 00:01:01,562 --> 00:01:05,190 విలియమ్, స్కూల్ లో ఇదే నీ చివరి రోజు కాబట్టి 7 00:01:05,190 --> 00:01:08,068 ఇక్కడికి వచ్చి ఏం చేశావో అందరికీ చూపించు. 8 00:01:11,822 --> 00:01:12,990 సిగ్గు పడకు. 9 00:01:16,034 --> 00:01:17,286 వచ్చి చూపించు. 10 00:01:17,911 --> 00:01:18,912 వెళ్ళు. 11 00:01:36,180 --> 00:01:37,931 అదరగొట్టేశావు, విలియమ్. 12 00:01:37,931 --> 00:01:41,435 నువ్వు చేసిన ఈ కొత్త అలంకరణని అందరి కన్నా ముందు చెట్టు మీద నువ్వే పెట్టు. 13 00:01:41,435 --> 00:01:42,686 అందరూ రండి. 14 00:02:00,913 --> 00:02:05,626 "కొంగ రెట్ట వేసింది, కానీ ఆ రెట్ట నేల మీద ఎందుకు పడలేదు?" 15 00:02:05,626 --> 00:02:07,503 ఏమో మరి. ఎందుకు? 16 00:02:07,503 --> 00:02:09,630 ఎందుకంటే ఆ కొంగ డైపర్ వేసుకొని ఉంది. 17 00:02:11,548 --> 00:02:12,549 విలియమ్. 18 00:02:15,636 --> 00:02:17,095 మీ కొత్త ఇంట్లో అంతా మీకు మంచే జరగాలి. 19 00:02:17,679 --> 00:02:18,931 మేము నిన్ను మిస్ అవుతాం. 20 00:02:21,266 --> 00:02:24,228 కొత్త ఇంట్లో నీ గది చాలా పెద్దగా ఉంటుంది, విలియమ్. 21 00:02:24,770 --> 00:02:27,064 హాలులో కూడా చాలా స్థలం ఉంది, 22 00:02:27,064 --> 00:02:29,066 అక్కడ చాలా పెద్ద క్రిస్మస్ చెట్టు పెట్టుకోవచ్చు. 23 00:02:29,733 --> 00:02:32,653 నీ బొమ్మలన్నీ పెట్టుకోవడానికి ఒక ఆటల గది కూడా ఉంది. 24 00:02:32,653 --> 00:02:34,488 ఇక గార్డెన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. 25 00:02:34,488 --> 00:02:37,783 దిగువ పక్క మైదానాలు ఉన్నాయి. ఇంకా పైకి వెళ్తే అడవి కూడా ఉంది. 26 00:02:37,783 --> 00:02:41,411 నీ కొత్త స్కూల్ లో నీ క్లాస్ మేట్స్ ని, టీచర్లను ఎప్పుడెప్పుడు కలవాలని ఉంది కదా నీకు. 27 00:02:41,411 --> 00:02:43,497 మీ టీచరుది చాలా మంచి గుణం. 28 00:02:43,497 --> 00:02:48,168 నీ క్లాసులో అమ్మాయిలు, అబ్బాయిలందరూ నిన్ను స్నేహితుడిగా చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. 29 00:03:01,765 --> 00:03:02,933 సర్. 30 00:03:03,725 --> 00:03:07,062 ఈ సామాను సర్దడంలో మాకు సాయపడతావా, అబ్బాయి? 31 00:03:10,607 --> 00:03:12,276 గుడ్ ఆఫ్టర్ నూన్, విలియమ్. 32 00:03:12,276 --> 00:03:13,735 మోమో! 33 00:03:14,278 --> 00:03:16,530 కాస్త ఆ గడప చూసుకో. 34 00:03:16,530 --> 00:03:17,865 హలో, మేరీ. 35 00:03:17,865 --> 00:03:19,324 అందరికీ గుడ్ ఆఫ్టర్ నూన్. 36 00:03:19,324 --> 00:03:22,286 మీ అమ్మానాన్నలు కుదురుకోవడానికి కొంత సమయం వాళ్లని వదిలేద్దాం, 37 00:03:22,286 --> 00:03:24,997 ఈలోపు నువ్వు కూడా అంతా తిరిగి చూడవచ్చు. 38 00:03:55,444 --> 00:03:57,154 ఇల్లు చాలా పెద్దగా ఉంది, మోమో. 39 00:03:57,154 --> 00:03:58,363 భలేగా ఉంది కదా? 40 00:03:58,363 --> 00:04:00,240 చాలా గదులు ఉన్నాయి, బోలెడన్ని సాహసాలు చేసుకోవచ్చు. 41 00:04:10,542 --> 00:04:12,544 - నిజానికి మేమిద్దరం వాయిస్తాం. - నిజంగా? 42 00:04:12,544 --> 00:04:14,671 అంటే, నేను వాయించడానికి ప్రయత్నిస్తా. 43 00:04:14,671 --> 00:04:16,298 ఆమె 18 మందికి వంట చేస్తోంది. 44 00:04:16,298 --> 00:04:18,382 మంచు మనిషి చేద్దాం వస్తావా? 45 00:04:18,382 --> 00:04:20,052 ఇప్పుడు కాదు, బంగారం. 46 00:04:20,052 --> 00:04:22,679 వాటిని పిల్లలే చేశారు. ఏడాదిలోని ఈ సమయమంటే నాకు చాలా ఇష్టం. 47 00:04:22,679 --> 00:04:24,515 - హా. నిజానికి, అంతే. - కెరోలిన్, ఈ క్రిస్మస్ 48 00:04:24,515 --> 00:04:26,391 మీ అమ్మతో గడుపుతాను అన్నావు కదా? 49 00:04:26,391 --> 00:04:27,476 అవును. 50 00:05:22,781 --> 00:05:25,409 నా పేరు విలియమ్. నాతో ఆడుకుంటావా? 51 00:05:28,787 --> 00:05:31,373 నా పేరు విలియమ్. మనిద్దరం ఆడుకుందామా? 52 00:06:24,468 --> 00:06:27,596 "ప్రియమైన విలియమ్, మేము నిన్ను చాలా మిస్ అవుతాం, 53 00:06:27,596 --> 00:06:31,892 కొత్త ఇంట్లో నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం. 54 00:06:31,892 --> 00:06:36,438 కొండంత ప్రేమతో, మేరీ, ఆర్థర్, బోనీ, 55 00:06:36,438 --> 00:06:41,068 పాల్, లిజీ, జేన్, ఆలిస్, జాన్." 56 00:06:47,115 --> 00:06:50,619 ఇక లైట్స్ ఆపేయ్, విలియమ్. రేపు చాలా ముఖ్యమైన రాజు. 57 00:07:43,297 --> 00:07:44,131 సూపర్! 58 00:07:48,677 --> 00:07:50,012 క్రిస్మస్ శుభాకాంక్షలు, బంగారం. 59 00:07:50,012 --> 00:07:53,849 క్రిస్మస్ శుభాకాంక్షలు, మోమో. నేను ఉదయం ఏడు గంటలకు లేయవచ్చని అన్నావుగా. 60 00:07:53,849 --> 00:07:55,559 ఏడు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ గడిపా. 61 00:07:55,559 --> 00:07:57,186 ఏడు అయింది కదా? 62 00:07:57,186 --> 00:07:58,687 గంట ఆరుసార్లే మోగినట్టుందే. 63 00:07:58,687 --> 00:08:00,981 నాకు ఏడుసార్లు వినిపించింది. నిజంగా చెప్తున్నా. 64 00:08:00,981 --> 00:08:03,734 ఏడు అయితే, క్రిస్మస్ తాత ఏం తెచ్చాడో చూసేయాల్సిందే. 65 00:08:03,734 --> 00:08:04,735 సూపర్! 66 00:08:06,320 --> 00:08:10,032 ఈ కానుక ఎవరికబ్బా! 67 00:08:18,081 --> 00:08:19,750 క్రిస్మస్ శుభాకాంక్షలు, బంగారం. 68 00:08:21,502 --> 00:08:22,836 హలో, కుందేలు బొమ్మా. 69 00:08:32,179 --> 00:08:33,514 కుందేలు బొమ్మా. 70 00:08:45,859 --> 00:08:47,402 వచ్చేశామే, కుందేలు బొమ్మా. 71 00:08:57,120 --> 00:08:58,413 సూపర్. 72 00:08:59,665 --> 00:09:02,251 - క్రిస్మస్ శుభాకాంక్షలు. - హా. బాగానే ఉన్నావా? 73 00:09:03,418 --> 00:09:05,420 - క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్యూ, ఫాదర్. - క్రిస్మస్ శుభాకాంక్షలు. 74 00:09:24,773 --> 00:09:25,774 ఏదో నడిచిపోయింది. 75 00:09:28,694 --> 00:09:30,571 నీకు రావడం కష్టమైతే... 76 00:09:31,071 --> 00:09:32,614 పద, బుడ్డోడా. 77 00:09:33,115 --> 00:09:34,533 పడుకుందువు పద. 78 00:09:45,085 --> 00:09:46,086 ఆ... 79 00:09:47,462 --> 00:09:48,463 తప్పకుండా. 80 00:09:49,590 --> 00:09:51,258 క్రిస్మస్ శుభాకాంక్షలు, బంగారం. 81 00:10:49,483 --> 00:10:52,486 గుడ్ ఈవినింగ్, క్రిస్మస్ శుభాకాంక్షలు. 82 00:10:53,028 --> 00:10:55,280 ఆటల గదికి సుస్వాగతం. 83 00:10:55,280 --> 00:10:56,782 నేను తెలివైన గుర్రాన్ని. 84 00:10:56,782 --> 00:10:57,908 మరి నువ్వు ఎవరు? 85 00:10:57,908 --> 00:11:01,411 నేను... నేను కుందేలును అనుకుంటా. 86 00:11:02,412 --> 00:11:04,748 తెలివైన గుర్రమా, ఎవరది? 87 00:11:04,748 --> 00:11:08,252 కొత్త బొమ్మ వచ్చింది. కుందేలు అట. 88 00:11:14,508 --> 00:11:15,342 వస్తున్నాం. 89 00:11:15,342 --> 00:11:17,052 - పద. - చూస్తా. 90 00:11:17,052 --> 00:11:18,554 అదీ లెక్క. 91 00:11:22,015 --> 00:11:24,101 అంత గొప్పగా ఏం లేదు ఈ బొమ్మ. 92 00:11:24,101 --> 00:11:26,019 ఏమంటావు, కుందేలు? 93 00:11:26,019 --> 00:11:27,855 నువ్వు అసలు నిజమైన బొమ్మవేనా? 94 00:11:28,564 --> 00:11:29,815 అంటే ఏంటో నువ్వే చెప్పాలి. 95 00:11:33,944 --> 00:11:36,947 నిజమైన కారులానే నన్ను కూడా లోహంతోనే చేశారు. 96 00:11:36,947 --> 00:11:40,742 నా నాలుగు పక్కలా, చిన్న చిన్న నల్ల సర్కిల్స్ చూశావా? 97 00:11:40,742 --> 00:11:44,121 - అసలైన కార్లకు కూడా అవి ఉంటాయి. - అవును. 98 00:11:44,121 --> 00:11:46,874 వాడుక భాషలో టైర్లు అని అంటారు వాటిని. 99 00:11:47,749 --> 00:11:48,834 టైర్లు. 100 00:11:49,585 --> 00:11:51,461 ఇంకో గొప్ప విషయం చెప్పనా... 101 00:11:51,461 --> 00:11:55,090 సింహమా, వచ్చి నాకు కీ ఇవ్వు. 102 00:11:59,386 --> 00:12:02,848 నాకు నిజంగా పని చేసే మోటర్ కూడా ఉంది. 103 00:12:02,848 --> 00:12:07,978 బుడ్డోడు నాకు కీ ఇస్తే చాలు, జుయ్యిమని దూసుకువెళ్లిపోతా. 104 00:12:10,689 --> 00:12:11,690 అంత వేగమా! 105 00:12:12,274 --> 00:12:14,610 - జాగ్రత్త. - జరుగు. 106 00:12:14,610 --> 00:12:16,028 పక్కకు జరుగు. 107 00:12:18,071 --> 00:12:19,698 ఇంకాస్త ఉంటే గుద్దేసేదాన్ని. 108 00:12:19,698 --> 00:12:22,201 ఇక్కడున్న సింహం కూడా అసలైనదే. 109 00:12:22,201 --> 00:12:24,369 అవును! నా కాళ్లు చూడు. 110 00:12:24,369 --> 00:12:28,582 అసలైన సింహాల లాగానే ఎలా తిరుగుతున్నాయో చూడు, దీని వల్ల నేను సింహంలా ఎగిరి 111 00:12:28,582 --> 00:12:30,542 ఏ జంతువునైనా మట్టికరిపించేయగలను. 112 00:12:32,377 --> 00:12:34,254 నేను కూడా అసలైన రాజునే. 113 00:12:34,254 --> 00:12:37,966 నా అద్భుతమైన వస్త్రాలు చూడు, నా అద్భుతమైన కిరీటాన్ని చూడు. 114 00:12:37,966 --> 00:12:41,637 ఇక్కడున్న రాళ్లన్నీ వజ్రాలు, వైడుర్యాలు... 115 00:12:41,637 --> 00:12:43,138 వాటిని చెక్కతో చేశారు. 116 00:12:43,138 --> 00:12:47,434 ఈ ఆటల గదికి రాజుతో మాట్లాడే పద్ధతి ఇదేనా? 117 00:12:47,434 --> 00:12:50,854 వెంటనే మోకాళ్ల మీద కూర్చొని క్షమాపణ కోరు, ఓ మదమెక్కిన గుర్రమా. 118 00:12:52,856 --> 00:12:54,483 మోకాళ్ల మీద కూర్చోకపోయినా పర్లేదులే. 119 00:12:54,483 --> 00:12:58,862 తెలివైన గుర్రం నా ముందు శిరస్సు వంచాల్సిన అవసరం లేదని తీర్మానిస్తున్నాను. 120 00:12:58,862 --> 00:13:02,741 క్షమించు, తెలివైన గుర్రమా, అప్పుడప్పుడూ నాకు పూనకం వస్తుందని నీకు తెలిసిందే కదా. 121 00:13:02,741 --> 00:13:04,368 ఈ వస్త్రాల వల్లే అదంతా. 122 00:13:04,368 --> 00:13:06,745 చాలా అద్భుతంగా ఉన్నాయి కదా, అందుకే. 123 00:13:08,664 --> 00:13:10,624 ఈ కొత్త బొమ్మ ఎలా ఉంది? 124 00:13:10,624 --> 00:13:12,209 నాకు నచ్చలేదు. 125 00:13:12,709 --> 00:13:17,214 ఈ కుందేలు అనబడే బొమ్మని మనం బొమ్మల పెట్టెలో పడుకోనిస్తే, 126 00:13:17,214 --> 00:13:20,717 పక్కలో తోడు కోసం ఈ కుందేలునే తీసుకొనే ప్రమాదం ఉంది. 127 00:13:21,802 --> 00:13:24,012 "పక్కలో తోడు కోసం" అంటే? 128 00:13:25,389 --> 00:13:26,390 రాత్రుళ్లు చాలా వరకు, 129 00:13:26,390 --> 00:13:30,102 బొమ్మల పెట్టె నుండి ఒక బొమ్మని తీసుకొని బుడ్డోడికి ఇస్తారు అన్నమాట, అతను పడుకొనేటప్పుడు. 130 00:13:30,102 --> 00:13:32,688 బుడ్డోడు ఎక్కడ? మళ్లీ ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? 131 00:13:32,688 --> 00:13:34,398 ఇక ప్రశ్నలు అడిగింది చాలు! 132 00:13:34,398 --> 00:13:36,233 మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. 133 00:13:36,233 --> 00:13:41,446 దీనికి కదిలే భాగాలు లేవు, కీళ్లు లేవు. 134 00:13:41,947 --> 00:13:44,283 ఈ బొమ్మకి మనం దూరంగా ఉండాలి అని 135 00:13:44,283 --> 00:13:47,744 ఆటల గదిలో మనకి దూరంగా ఆ మూలకి దీన్ని వెలివేయాలన్నది నా అభిప్రాయం. 136 00:13:47,744 --> 00:13:50,539 - పాపం ఆ బొమ్మని వదిలేయ్! - కారు చెప్పినదానికే నా ఓటు! 137 00:13:50,539 --> 00:13:51,582 నాది కూడా. 138 00:13:51,582 --> 00:13:52,749 ఇక పద మరి. 139 00:13:53,375 --> 00:13:58,589 దూరంగా ఉన్న ఆ మూలకి వెళ్లిపో, అక్కడైతే నువ్వు ఎవరికీ కనిపించవు. 140 00:14:01,008 --> 00:14:02,092 ఆగకుండా పద! 141 00:14:04,595 --> 00:14:06,430 బాబోయ్... 142 00:14:07,014 --> 00:14:10,017 నేను కొత్తగా వచ్చినప్పుడు, ఓ పద్ధతి అంటూ ఉండేది. 143 00:14:10,017 --> 00:14:11,935 కొత్త బొమ్మలు, పాత బొమ్మలకి మర్యాదనిచ్చేవి. 144 00:14:11,935 --> 00:14:13,812 బాబోయ్, దారుణం. 145 00:14:14,688 --> 00:14:17,232 - నేను మళ్లీ కిందికి వెళ్లవచ్చా? - ఇక చాలు. 146 00:14:17,232 --> 00:14:19,985 మంచం ఎక్కి పడుకో. రోజంతా అక్కడే ఆడుకున్నావు. 147 00:14:19,985 --> 00:14:21,904 కానీ నేనేమీ అలిసిపోలేదు. 148 00:14:21,904 --> 00:14:23,780 ఇప్పుడే కదా కుంభకర్ణుడిలా నిద్రపోయావు. 149 00:14:23,780 --> 00:14:25,616 కానీ క్రిస్మస్ ఇంకా అయిపోలేదు కదా. 150 00:14:25,616 --> 00:14:28,994 వీడికి నీళ్లు తీసుకువస్తావా, బంగారం? వచ్చేటప్పుడు ఒక బొమ్మని కూడా తీసుకురా. 151 00:14:36,376 --> 00:14:39,713 తెలివైన గుర్రమా, "అసలైన" అంటే ఏంటి? 152 00:14:40,214 --> 00:14:42,674 అంటే, కదిలే భాగాలు ఉండటమా లేక... 153 00:14:42,674 --> 00:14:45,135 ఆ బొమ్మలు అన్న మాటలు పట్టించుకోకు, కుందేలు. 154 00:14:45,135 --> 00:14:48,305 'అసలైన' అంటే, మనం ఎలా తయారు అయ్యాం అని కాదు. 155 00:14:48,305 --> 00:14:50,390 అది మనకి ఎదురయ్యే అనుభవం. 156 00:14:51,016 --> 00:14:55,145 ఏ చిన్నారి అయినా మనల్ని చాలా అంటే చాలా కాలం ప్రేమించినప్పుడు, 157 00:14:55,145 --> 00:14:56,688 ఇక్కడ ప్రేమ అంటే ఆడుకోవడం కాదు, 158 00:14:56,688 --> 00:15:01,944 మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నప్పుడు, మనం అసలైన వాళ్ళం అయిపోతాం. 159 00:15:02,611 --> 00:15:04,863 అది ఊహాలోకం యొక్క అద్భుతమైన మాయ. 160 00:15:06,031 --> 00:15:07,366 అది బాధని కలిగిస్తుందా? 161 00:15:08,700 --> 00:15:11,954 కాస్త బాధగానే అనిపిస్తుంది అనుకుంటా, ఎందుకంటే ప్రేమని అందుకున్న బొమ్మలు 162 00:15:11,954 --> 00:15:15,082 ఎన్నెన్నో సాహసాలు చేసి అలసిపోతాయి. 163 00:15:15,999 --> 00:15:19,503 కానీ చెప్తున్నా కదా, అది తప్పక అనుభవించాల్సిన విషయం. 164 00:15:20,128 --> 00:15:24,883 పిల్లలు మనల్ని మనస్పూర్తిగా ప్రేమిస్తారు. 165 00:15:26,635 --> 00:15:30,597 అంత కన్నా అద్భుతమైన ఫీలింగ్ నాకెన్నడూ కలగలేదు. 166 00:15:33,475 --> 00:15:36,979 నేను కూడా ఏదోకరోజు అసలైన బొమ్మలా మారాలనుకుంటున్నా. 167 00:15:36,979 --> 00:15:40,774 బుడ్డోడు నిన్ను ప్రేమిస్తే, తప్పక అవుతావు. 168 00:15:43,068 --> 00:15:43,902 ఎవరో వస్తున్నారు. 169 00:15:43,902 --> 00:15:45,696 - జాగ్రత్త! - జాగ్రత్త! 170 00:15:45,696 --> 00:15:46,989 ఆ సమయం అయింది! 171 00:15:48,156 --> 00:15:49,324 ఏమైనా జరగవచ్చు. 172 00:15:49,324 --> 00:15:52,077 - జరుగు. జరుగు. - తను నన్ను నెడుతోంది. 173 00:15:52,077 --> 00:15:53,579 నాకు కాస్త స్థలం ఇవ్వు. 174 00:15:54,872 --> 00:15:55,914 ఏ బొమ్మ కావాలి? 175 00:15:55,914 --> 00:15:57,291 నా కుందేలు బొమ్మ! 176 00:15:59,168 --> 00:16:00,335 హా. ఇక్కడే ఉంది. 177 00:16:08,093 --> 00:16:09,344 కంటి నిండా నిద్రపో. 178 00:16:10,387 --> 00:16:11,388 గుడ్ నైట్. 179 00:16:21,565 --> 00:16:22,983 హలో, కుందేలు. 180 00:16:22,983 --> 00:16:24,902 నాతో అడుకుంటావా? 181 00:16:27,070 --> 00:16:29,907 సూపర్. గుంతలను బాగా తవ్వేవాళ్లు నాకు కావాలి. 182 00:16:29,907 --> 00:16:34,369 నువ్వు కుందేలువి కాబట్టి, ఆ పని నువ్వైతే చక్కగా చేయగలవని అనుకున్నా. 183 00:16:35,579 --> 00:16:37,456 ఇక పని మొదలుపెడదామా? 184 00:16:45,714 --> 00:16:46,715 వావ్. 185 00:16:47,216 --> 00:16:50,427 నీ అంత అద్భుతంగా తవ్వేవాళ్లని నేనెప్పుడూ చూడనేలేదు, కుందేలు. 186 00:16:50,427 --> 00:16:53,722 ఇప్పటికే మనం ఎన్నో లక్షల కిలోమీటర్లు భూగర్భంలోకి వచ్చేసి ఉంటాం. 187 00:16:53,722 --> 00:16:55,599 మనం జాగ్రత్తగా ఉండాలి. 188 00:16:55,599 --> 00:16:59,019 నేల అంతా పొడిగా ఉంది, ఈ సొరంగం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు. 189 00:16:59,520 --> 00:17:01,939 మా కుందేళ్లకి అలాంటివి ఇట్టే తెలిసిపోతాయి. 190 00:17:03,815 --> 00:17:08,194 కానీ నా లెక్కల ప్రకారం, మనం సగం దూరం వచ్చేశాం. 191 00:17:09,363 --> 00:17:10,489 ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? 192 00:17:10,489 --> 00:17:12,115 చిసప్ కి వెళ్తున్నాం. 193 00:17:12,115 --> 00:17:14,034 నేను అక్కడే ఉండేవాడిని. 194 00:17:14,034 --> 00:17:15,618 నా స్నేహితులందరూ కూడా అక్కడే ఉన్నారు. 195 00:17:17,954 --> 00:17:19,957 ఇక్కడ నాకు స్నేహితులెవరూ లేరు. 196 00:17:22,291 --> 00:17:23,417 నేనున్నా కదా. 197 00:17:25,170 --> 00:17:26,380 నిజమే. 198 00:17:26,380 --> 00:17:30,467 నువ్వు నా కొత్త నేస్తానివి, అంటే నువ్వు నాకు ప్రాణ నేస్తానివి కూడా. 199 00:17:32,219 --> 00:17:36,306 దేవుడా, నన్ను ప్రాణ నేస్తం అన్న తొలి వ్యక్తివి నువ్వే. 200 00:17:41,979 --> 00:17:45,816 ఎంత వేగంగా తవ్వేస్తున్నామో చూడు. ఇంకాసేపట్లో వెళ్లిపోతాం. 201 00:17:48,443 --> 00:17:49,528 చేతికి ఏదో తగిలింది. 202 00:17:58,370 --> 00:18:01,123 ఏదో నిధికి మ్యాప్! 203 00:18:02,416 --> 00:18:03,417 వావ్. 204 00:18:04,793 --> 00:18:05,794 ఏంటా శబ్దం? 205 00:18:06,545 --> 00:18:07,921 సొరంగం! 206 00:18:07,921 --> 00:18:09,006 కూలిపోతోంది. 207 00:18:09,798 --> 00:18:12,384 కుందేలూ, త్వరగా పదా, మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 208 00:18:12,384 --> 00:18:13,760 నన్ను గట్టిగా పట్టుకో. 209 00:18:16,847 --> 00:18:20,309 - మనం చేరుకోలేము! - లేదు వెళ్ళిపోతాం. ఇంకెంతో దూరం లేదు. 210 00:18:22,102 --> 00:18:23,270 వచ్చేశాం, కుందేలు. 211 00:18:24,104 --> 00:18:25,189 క్షేమంగా బయటపడ్డాం. 212 00:18:29,193 --> 00:18:30,861 మనం ఇప్పుడు ప్రాణ స్నేహితులం అయిపోయాం కాబట్టి, 213 00:18:30,861 --> 00:18:35,699 ఆ నిధి కోసం కలిసి గాలిద్దాం. 214 00:18:52,508 --> 00:18:55,886 పిల్లలూ, మీ అందరికీ ఒకరిని పరిచయం చేస్తున్నాను. 215 00:18:58,013 --> 00:19:01,975 విలియమ్, ఇక్కడికి రాగలవా? 216 00:19:03,477 --> 00:19:04,478 రా. 217 00:19:16,823 --> 00:19:19,117 పిల్లలూ, విలియమ్ ని పలకరించండి. 218 00:19:19,117 --> 00:19:21,411 హలో, విలియమ్. 219 00:19:22,079 --> 00:19:26,291 విలియమ్, నీ గురించి పిల్లలకు ఏమైనా చెప్తావా? 220 00:19:36,593 --> 00:19:39,096 మరేం పర్వాలేదు, విలియమ్. ఇక కూర్చోలే. 221 00:19:41,598 --> 00:19:44,685 పోయిన వారం, మనం ఆకురాలు కాలం గురించి మాట్లాడుకున్నాం. 222 00:19:44,685 --> 00:19:47,563 ఆకురాలు కాలంలో ఏం జరుగుతుందో, ఎవరికైనా గుర్తుందా? 223 00:19:52,234 --> 00:19:53,527 హలో. 224 00:19:53,527 --> 00:19:55,654 నువ్వు పక్కింట్లో ఉండే అబ్బాయివి కదా? 225 00:19:56,989 --> 00:19:58,657 మాతో ఆడుకుంటావా? 226 00:20:01,493 --> 00:20:03,328 అతడిని వదిలేయ్, లూసీ. ఆడుకుందాం పద. 227 00:20:11,879 --> 00:20:14,923 త్వరగా వెళ్దాం! వంతెన తెరిచి ఉన్నప్పుడే కోటపై దండయాత్ర చేద్దాం. 228 00:20:14,923 --> 00:20:16,925 నిధి సింహాసనం ఉండే గదిలోనే ఉందనుకుంటా. 229 00:20:16,925 --> 00:20:19,219 విలియమ్, భోజనం సిద్ధంగా ఉంది. 230 00:20:24,099 --> 00:20:25,392 ఇంకాస్త క్యాబేజీ కావాలా? 231 00:20:25,392 --> 00:20:26,810 నాకు కూడా కడుపు నిండిపోయింది. 232 00:20:26,810 --> 00:20:33,609 కానీ నేనెంత తిన్నా కానీ, మోమో ఇంకా తినమని బలవంత పెట్టి, రెండు ముద్దలు తినిపిస్తుంది. 233 00:20:33,609 --> 00:20:37,362 చూడు, నిధి ఆచూకీని కనిపెట్టడానికి నేనొక ప్లాన్ వేశాను. 234 00:20:38,238 --> 00:20:39,615 మనకి మ్యాజిక్ అవసరం అవుతుంది. 235 00:20:40,115 --> 00:20:42,492 బయట ఫెయిరీలు జీవిస్తూ ఉంటాయని జార్జ్ అన్నాడు. 236 00:20:42,492 --> 00:20:46,121 వాటిని కలవాలంటే, వాటి కోసం ఒక చిన్న ఇల్లు కట్టివ్వాలట. 237 00:20:47,247 --> 00:20:48,248 మోమో. 238 00:20:48,749 --> 00:20:51,210 నేను, కుందేలు తినేశాము. మేము వెళ్లి మళ్లీ ఆడుకోవచ్చా? 239 00:20:51,210 --> 00:20:52,920 ఇంకో రెండు ముద్దలు తిను. 240 00:20:56,632 --> 00:20:57,883 సరిగ్గా తినాలి. 241 00:21:12,272 --> 00:21:15,359 ఇది అధికారిక ఫెయిరీ నివాసం అన్నమాట. 242 00:21:15,359 --> 00:21:18,570 ఇప్పుడు మనం ఫెయిరీల మంత్రం చెప్తే సరిపోతుంది. 243 00:21:21,406 --> 00:21:24,660 ఫెయిరీలు రెక్కలను రెపరెపలాడించుకుంటూ ఎగురుతాయి. 244 00:21:25,577 --> 00:21:29,164 ఈ తోటకి రండి, పైన ఆకాశం ఉంది. 245 00:21:29,164 --> 00:21:34,253 బెదురే లేని విలియమ్, కుందేలు కలిసి "అక్కుం బక్కుం. టిక్కుం ట్రియ్యుం! 246 00:21:34,253 --> 00:21:37,548 మాకు మీ మ్యాజిక్ తో పనుంది, కాబట్టి ఇక్కడికి తప్పక రండి!" 247 00:21:39,091 --> 00:21:41,468 ఇక మనం అస్సలు అనుకోనప్పుడు 248 00:21:41,468 --> 00:21:45,097 ఒక మ్యాజిక్ ఫెయిరీ ప్రత్యక్షమయి, నిధిని కనుగొనడంలో మనకి సాయపడుతుంది. 249 00:21:51,186 --> 00:21:52,354 గుడ్ నైట్, మోమో. 250 00:21:53,897 --> 00:21:57,401 బాబోయ్, ఆ కుందేలు బొమ్మ ఎలా ఉందో చూడు. దాన్ని తీసుకెళ్లి, బాగా కుట్టి తీసుకువస్తా. 251 00:21:57,401 --> 00:21:59,736 వద్దు! తీసుకెళ్లకు, మోమో. 252 00:21:59,736 --> 00:22:01,071 కుందేలు బొమ్మని తీసుకెళ్లకు. 253 00:22:01,071 --> 00:22:02,447 సరే, సరే. 254 00:22:02,447 --> 00:22:03,949 అయ్య బాబోయ్. 255 00:22:03,949 --> 00:22:06,201 కాస్త కుట్టుతాను అంటున్నా, అంతే కదా. 256 00:22:06,201 --> 00:22:07,828 ఒక బొమ్మ కోసం ఇంత బిల్డప్ ఇస్తున్నావే. 257 00:22:07,828 --> 00:22:10,372 ఇదేమీ బొమ్మ కాదు, మోమో. ఇది అసలైన కుందేలే. 258 00:22:10,372 --> 00:22:13,000 సరే, నువ్వేదంటే అది. 259 00:22:14,418 --> 00:22:15,502 గుడ్ నైట్. 260 00:22:30,809 --> 00:22:32,186 బుడ్డోడా? 261 00:22:32,186 --> 00:22:33,437 అవును. 262 00:22:33,437 --> 00:22:35,814 నువ్వు అసలైన దానివే అన్నాడా? 263 00:22:36,440 --> 00:22:37,774 అవును. 264 00:22:37,774 --> 00:22:39,985 - నిన్నా? - అవును. 265 00:22:39,985 --> 00:22:42,571 మరి నీకు కొత్తగా ఏమైనా అనిపించిందా? 266 00:22:42,571 --> 00:22:44,239 ఏమో మరి. 267 00:22:44,239 --> 00:22:46,074 కొత్తగా నాకేమీ అనిపించలేదు. 268 00:22:46,074 --> 00:22:50,162 ఇంతకు ముందు ఎలా ఉన్నావో, ఇప్పుడూ అలానే ఉన్నావు. బొమ్మలానే ఉన్నావు. 269 00:22:50,162 --> 00:22:53,790 కానీ మీరందరూ కూడా బొమ్మలే అయినా, అసలైన వాళ్లమే అని చెప్పారు కదా. 270 00:22:53,790 --> 00:22:56,043 అవును, కానీ అలా మేము ఊరికే అన్నాం అంతే. 271 00:22:56,043 --> 00:22:58,212 అసలైన వాళ్లమని నటిస్తున్నామంతే. 272 00:22:58,212 --> 00:23:03,800 కానీ మాకు, మేము ప్రాతినిధ్యం వహించే వాటికి చాలా పోలికలు ఉన్నాయి. 273 00:23:04,301 --> 00:23:05,928 సింహానికి జూలు ఉంది. 274 00:23:05,928 --> 00:23:08,138 - రాజుకు కిరీటం ఉంది. - అవును మరి. 275 00:23:08,138 --> 00:23:09,348 మరి నీ సంగతి చూడు. 276 00:23:09,348 --> 00:23:11,475 నువ్వు బాగా మురికిగా ఉన్నావు. 277 00:23:12,142 --> 00:23:14,311 - నువ్వు చిరిగిపోయి ఉన్నావు. - అవును. అవునవును. 278 00:23:14,311 --> 00:23:19,525 ఇంకో విషయం చెప్తే బాధపడతావు, నీ లోపల ఉండే దూది కూడా నాకు కనిపిస్తోంది. 279 00:23:19,525 --> 00:23:23,779 ఈ బొమ్మ లోపల... అయ్య బాబోయ్! నీ లోపల ఏదేదో ఉందేంటి? 280 00:23:24,988 --> 00:23:30,202 నా ఇన్నేళ్ల అనుభవంలో జాయింట్లు, యంత్రాలు లేని బొమ్మని చూడటం ఇదే మొదటిసారి! 281 00:23:30,202 --> 00:23:35,040 నీలో ఏ ఒక్కటీ సరిగ్గా లేనప్పుడు, నువ్వు అసలైన కుందేలువి ఎలా అవుతావు? 282 00:23:35,040 --> 00:23:36,291 ఇక చాలు. 283 00:23:36,291 --> 00:23:39,628 మీలో ఏ ఒక్కరికీ బొమ్మ కాకుండా నిజంగా ఉంటే ఎలా ఉంటుందో తెలీదు. 284 00:23:39,628 --> 00:23:41,547 బుడ్డోడికి అన్నీ బాగా తెలుసు, 285 00:23:41,547 --> 00:23:46,051 కుందేలు అసలైనదే అని అతను అన్నాడంటే, అది అసలైనదే. 286 00:23:46,969 --> 00:23:48,136 ఎవరో వస్తున్నారు. 287 00:23:49,930 --> 00:23:52,850 కుందేలు, ఫెయిరీ మంత్రం పని చేయలేదని నాకు తెలుసు, 288 00:23:52,850 --> 00:23:55,060 కానీ మనం ఎక్కువ సేపు వేచి ఉండకూడదు. 289 00:23:55,936 --> 00:23:58,939 నిధి ఆచూకీని ఇతరులు కనిపెట్టక ముందే మనం కనిపెట్టాలి. 290 00:24:00,482 --> 00:24:03,110 అది మాయా అడవిలో ఉందనుకుంటా. 291 00:24:37,895 --> 00:24:39,605 అక్కడ ఏదో కదిలినట్టు నాకు కనిపించింది, కుందేలు. 292 00:24:39,605 --> 00:24:41,899 నిజంగానే చెప్తున్నా, నాకేదో కనిపించింది. 293 00:24:52,659 --> 00:24:53,660 లేదు! 294 00:24:54,161 --> 00:24:56,496 అదేమంత పెద్ద సమస్య కాదు. 295 00:24:56,496 --> 00:24:58,290 కుందేలు, ఏంటది? 296 00:24:58,290 --> 00:25:00,459 వాడెప్పుడూ ఒంటరిగానే గడుపుతున్నాడు. 297 00:25:01,251 --> 00:25:03,086 అది వాడికి మంచిది కాదు. 298 00:25:03,086 --> 00:25:04,588 అది గమనించింది నేనొక్క దాన్నే కాదు. 299 00:25:04,588 --> 00:25:06,632 టీచర్లు కూడా గమనించారు. 300 00:25:07,216 --> 00:25:09,259 స్నేహితులను చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. 301 00:25:09,259 --> 00:25:10,761 ఇప్పటికే చాలా నెలలయింది. 302 00:25:10,761 --> 00:25:12,846 ఇంకా ఎన్నాళ్లని మనం వదిలేయాలి? 303 00:25:13,722 --> 00:25:15,891 వాడి కుందేలు బొమ్మతో బాగానే ఆడుకుంటున్నట్టున్నాడుగా. 304 00:25:15,891 --> 00:25:18,477 కానీ వాడికి నిజమైన మిత్రులెవరూ లేరు. 305 00:25:35,160 --> 00:25:38,121 మనం ఎలాంటి నిధిని వెతుకుతున్నాం? 306 00:25:38,121 --> 00:25:39,456 బంగారమా? 307 00:25:39,456 --> 00:25:40,749 నగలా? 308 00:25:41,291 --> 00:25:42,835 లేదా చాక్లెట్లా? 309 00:25:43,627 --> 00:25:46,630 అవేవీ కాదనుకుంటా. 310 00:25:47,214 --> 00:25:50,926 అదేంటో నాకు కూడా ఖచ్చితంగా తెలీదు, కానీ చూడగానే దాన్ని మనం కనిపెట్టేస్తామనిపిస్తోంది. 311 00:25:53,262 --> 00:25:54,680 మనం శబ్దం చేయకూడదు. 312 00:25:54,680 --> 00:25:58,141 ఈ అడవిలో క్రూర మృగాలు చాలా ఉన్నాయి. 313 00:25:58,684 --> 00:26:01,645 కుందేళ్లమైన మేము, మాట్లాడకుండానే సంభాషించుకుంటాం. 314 00:26:01,645 --> 00:26:06,900 ఉదాహరణకు, మాకు ప్రమాదం అనిపించినప్పుడు, మేము కాళ్లని ఇలా తడతాం. 315 00:26:13,031 --> 00:26:14,199 మేము ఇలా కూడా చేస్తాం. 316 00:26:16,535 --> 00:26:17,953 దానర్థం ఏంటి? 317 00:26:17,953 --> 00:26:22,457 దాని అర్థం హలో అని. బై చెప్పేటప్పుడు కూడా అలా అంటాం. 318 00:26:23,333 --> 00:26:25,252 హలో, బై, రెండూ ఒకటేనా? 319 00:26:25,252 --> 00:26:30,090 అవును, ఎందుకంటే ఒకరికి బై చెప్పేటప్పుడు, ఇంకొకరికి హలో చెప్తాం కదా. 320 00:26:30,757 --> 00:26:33,969 ప్రతీ ముగింపు కూడా ఇంకేదో వేరే దానికి ప్రారంభమే. 321 00:26:38,182 --> 00:26:41,935 నువ్వు ఇంతకు ముందే అలా అన్నావు. అంటే ఏదో ప్రమాదం... 322 00:26:42,436 --> 00:26:43,562 పరుగెత్తు! 323 00:26:50,444 --> 00:26:53,155 నన్ను వదిలేయ్. నీ ప్రాణాలు కాపాడుకో. 324 00:26:53,155 --> 00:26:54,239 అలా ఎప్పటికీ చేయను! 325 00:27:00,204 --> 00:27:02,247 అయ్యో. మనం ఇరుక్కుపోయాం. 326 00:27:06,919 --> 00:27:07,836 గట్టిగా పట్టుకో. 327 00:27:14,259 --> 00:27:16,261 అదరగొట్టేశావు. 328 00:27:16,261 --> 00:27:18,514 నువ్వు ఇలా తప్పించావంటే, నమ్మలేకపోతున్నా. 329 00:27:18,514 --> 00:27:21,517 - అవును! మనం సాధించాం, కుందేలు. - యాహూ! నువ్వు సాధించావు. 330 00:27:24,520 --> 00:27:25,729 నువ్వు బాగానే ఉన్నావా? 331 00:27:25,729 --> 00:27:26,813 బాగానే ఉన్నా. 332 00:27:37,115 --> 00:27:38,367 విలియమ్! 333 00:27:40,702 --> 00:27:42,079 నువ్వు బాగానే ఉన్నావా? 334 00:27:52,923 --> 00:27:54,091 వచ్చి చూడు. 335 00:27:56,134 --> 00:27:59,596 - ఎవరు నువ్వు? - ఎవరు నువ్వు అసలు? 336 00:27:59,596 --> 00:28:01,723 మీలానే నేను కూడా కుందేలునే. 337 00:28:02,933 --> 00:28:06,395 కానీ నువ్వు కుందేలులా కనిపించట్లేదు. బొమ్మలా ఉన్నావు. 338 00:28:07,729 --> 00:28:11,316 ఒకప్పుడు బొమ్మ కుందేలునే, కానీ ఇప్పుడు నిజమైన కుందేలుని. 339 00:28:12,776 --> 00:28:15,279 ఒక చిన్నారి మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, మనం నిజం అయిపోతాం. 340 00:28:15,988 --> 00:28:18,824 ఊహాలోకపు మాయ పనితనం ఇది. 341 00:28:20,784 --> 00:28:22,578 నువ్వు అటూ ఇటూ కదలగలవా? 342 00:28:22,578 --> 00:28:25,539 కదలలేను. 343 00:28:26,623 --> 00:28:27,791 గెంతగలవా? 344 00:28:29,459 --> 00:28:32,045 దీనికి కాళ్లు సరిగ్గా లేవు, 345 00:28:32,754 --> 00:28:36,091 గెంతకుండా అసలైన కుందేలువి ఎలా కాగలవు నువ్వు? 346 00:28:37,509 --> 00:28:38,927 నాకు తెలీదు. 347 00:28:39,428 --> 00:28:42,890 ఎవరైనా చిన్నారి ప్రేమిస్తే, నిజం అయిపోతాం అన్నావు కదా. 348 00:28:42,890 --> 00:28:47,102 అసలు ఈ చిన్నారి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని నీకు ఖచ్చితంగా తెలుసా? 349 00:28:48,228 --> 00:28:49,563 నిన్ను ప్రేమిస్తున్నానని అతను అన్నాడా? 350 00:28:50,606 --> 00:28:52,691 లేదు, నేను నిజమైన దాన్ని అన్నాడు. 351 00:28:54,318 --> 00:28:55,319 కానీ నాకు అనిపించింది ఏంటంటే... 352 00:28:55,319 --> 00:28:59,072 అతనికి నీపై ప్రేమ ఉంటే, ఎందుకు నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడు? 353 00:28:59,072 --> 00:29:00,699 అది కూడా చలిలో. 354 00:29:03,076 --> 00:29:04,077 వెళ్దాం పద. 355 00:29:04,077 --> 00:29:05,495 చీకటి పడేలా ఉంది. 356 00:29:06,038 --> 00:29:09,082 - మనం మన బోనులోకి వెళ్దాం పద. - గుడ్ లక్. 357 00:29:09,082 --> 00:29:10,918 గుడ్ లక్, కుందేలు బొమ్మా. 358 00:29:11,418 --> 00:29:12,794 పాపం. 359 00:29:35,442 --> 00:29:37,152 ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? 360 00:29:38,612 --> 00:29:41,156 రా. నిన్ను ఉండాల్సిన చోటుకు చేర్చుతాను. 361 00:29:48,497 --> 00:29:50,207 ఏమైపోయావు, కుందేలు? 362 00:29:52,000 --> 00:29:53,669 బుడ్డోడు నన్ను బయటే వదిలేశాడు. 363 00:29:54,795 --> 00:29:59,424 నిజమైన కుందేళ్లు వచ్చి, నేను ఇంకా ఒక బొమ్మ కుందేలునే అని చెప్పాయి. 364 00:30:00,884 --> 00:30:02,386 వాళ్లు చెప్పింది నిజమేనేమో అనిపిస్తోంది. 365 00:30:03,762 --> 00:30:10,185 బహుశా బుడ్డోడికి నాపై ప్రేమ లేదేమో, అందుకే ఇంకా బొమ్మలానే ఉన్నానేమో. 366 00:30:11,645 --> 00:30:14,523 బుడ్డోడికి ఆరోగ్యం బాగాలేదు, కుందేలు. 367 00:30:14,523 --> 00:30:17,150 ఏంటి? బాగాలేదు అంటే? 368 00:30:17,150 --> 00:30:19,862 బాగా జ్వరం చేసింది, బెడ్ మీద విశ్రాంతి తీసుకుంటున్నాడు. 369 00:30:20,362 --> 00:30:23,866 నిన్న రాత్రి బుడ్డోడి అమ్మతో డాక్టర్ మాట్లాడుతుంటే మేము విన్నాం. 370 00:30:23,866 --> 00:30:26,660 కానీ బుడ్డోడికి ఏమీ కాదు కదా? 371 00:30:26,660 --> 00:30:28,203 అతనికి ఏమీ కాదు. 372 00:30:28,203 --> 00:30:32,249 చాలా ఏళ్ల క్రితం, అతని అంకుల్ కి కూడా ఇలాగే జ్వరం వచ్చింది. 373 00:30:32,249 --> 00:30:34,293 కానీ ఆయన ప్రాణాలు నిలుపుకోలేకపోయాడు. 374 00:30:35,210 --> 00:30:36,503 చాలా మంది పరిస్థితి అదే. 375 00:30:37,963 --> 00:30:39,840 ఇంకో విషయం, కుందేలు. 376 00:30:41,008 --> 00:30:42,759 అతని అంకుల్ ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడు, 377 00:30:42,759 --> 00:30:47,264 ఆ సమయంలో అతను తాకిన వాటన్నింటినీ తగలబెట్టేశారు. 378 00:30:47,264 --> 00:30:49,224 అలా చేయమని డాక్టర్ చెప్పారు. 379 00:30:49,224 --> 00:30:52,227 ఆ రోగం వ్యాపించకుండా అలా చేస్తారు. 380 00:30:52,728 --> 00:30:57,024 కాబట్టి, ఈరాత్రి బొమ్మ కోసం వాళ్లు వచ్చినప్పుడు, నువ్వు దాక్కోవాలి. 381 00:30:57,024 --> 00:31:01,528 దాక్కోకపోతే, నిన్ను తీసుకెళ్తారు, ఇక నీ పని అంతే. 382 00:31:02,154 --> 00:31:03,572 అర్థమైందా? 383 00:31:07,659 --> 00:31:09,661 చూడండి. అడుగో డాక్టర్. 384 00:31:11,288 --> 00:31:12,956 - వచ్చినందుకు థ్యాంక్స్. - దానిదేముందిలే. 385 00:31:26,845 --> 00:31:29,056 మీకు నిజం చెప్పేస్తున్నాను. అతనికి... 386 00:31:31,016 --> 00:31:32,184 అతనికి చాలా అనారోగ్యంగా ఉంది. 387 00:31:33,644 --> 00:31:35,145 బాగా అయిపోతుందా? 388 00:31:36,813 --> 00:31:39,441 మన్నించాలి. ఏమీ చెప్పలేని పరిస్థితి. 389 00:31:40,442 --> 00:31:42,528 ఈ రాత్రి చాలా కష్టంగా గడుస్తుంది. 390 00:31:42,528 --> 00:31:44,446 మీరు అతని కోసం మీ గుండె ధైర్యం చేసుకోవాలి. 391 00:31:46,907 --> 00:31:47,908 నేను... 392 00:31:50,827 --> 00:31:53,038 నేను వెళ్లి బొమ్మ తెచ్చి అతని పక్కన పెడతాను. 393 00:32:08,262 --> 00:32:10,055 తను వస్తోంది. పదండి దాక్కుందాం. 394 00:32:10,055 --> 00:32:11,306 వెళ్లిపోదాం మనం. 395 00:32:11,306 --> 00:32:12,599 తను వచ్చేస్తోంది. 396 00:32:13,475 --> 00:32:16,186 కుందేలు, నువ్వు కూడా దాక్కోవాలి. 397 00:32:16,186 --> 00:32:20,315 ఆ గదిలోకి తను నిన్ను తీసుకెళ్తే, నువ్వు కూడా అగ్నికి ఆహుతి అయిపోతావు. 398 00:32:20,315 --> 00:32:25,362 మేమిద్దరం కలిసి చాలా సాహసాలు చేశాం, ఒక్కదానిలో కూడా అతను నన్ను వదిలేసి వెళ్లిపోలేదు. 399 00:32:26,572 --> 00:32:28,907 కాబట్టి, ఇప్పుడు నేను కూడా అతడిని వదిలేసి వెళ్లను. 400 00:32:28,907 --> 00:32:32,619 కుందేలు, దయచేసి తెలివిగా ఆలోచించు. 401 00:32:32,619 --> 00:32:34,621 ఇలా చేస్తే, నీ అంతం తప్పదు. 402 00:32:35,372 --> 00:32:38,667 నువ్వే అన్నావు కదా, బుడ్డోడు నిన్ను బయట వదిలేశాడని. 403 00:32:39,501 --> 00:32:42,045 బహూశా నీపై అతనికి ప్రేమ లేదేమో. 404 00:32:44,673 --> 00:32:49,928 అది నిజం కావచ్చు, కానీ అతనిపై నాకు చాలా ప్రేమ ఉంది. 405 00:33:16,121 --> 00:33:17,915 ఇదిగో నీకు ఇష్టమైన బొమ్మ, బంగారం. 406 00:33:32,471 --> 00:33:34,306 నువ్వేనా, కుందేలు? 407 00:33:35,766 --> 00:33:36,975 నేనే. 408 00:33:41,939 --> 00:33:43,148 నాకు భయంగా ఉంది. 409 00:33:44,107 --> 00:33:45,317 నాకు తెలుసు. 410 00:33:45,943 --> 00:33:47,152 నాకు కూడా భయంగానే ఉంది. 411 00:33:48,403 --> 00:33:50,322 నేను ఇంకా ధైర్యంగా ఉండుంటే బాగుండేది. 412 00:33:50,322 --> 00:33:52,491 ఎప్పుడూ అలాగే అనుకొనేవాడిని. 413 00:33:52,491 --> 00:33:54,576 నీకు ధైర్యం బాగానే ఉంది కదా? 414 00:33:54,576 --> 00:33:59,581 మనం కలిసి చేసిన సాహసాలన్నింటిలో, మనల్ని ప్రతీసారి కాపాడింది నువ్వే కదా. 415 00:33:59,581 --> 00:34:01,375 నన్నెప్పుడూ నువ్వు వదిలేసి వెళ్లిపోలేదు. 416 00:34:02,334 --> 00:34:04,670 ఇది చాలు, వేరేగా ఉండుంటే బాగుంటుందని అనుకోవాల్సిన పని లేదు. 417 00:34:04,670 --> 00:34:07,172 నీలో ఏ లోపాలూ లేవు. 418 00:34:08,130 --> 00:34:10,384 నేను ధైర్యవంతుడినని నిజంగానే అనుకుంటున్నావా? 419 00:34:11,009 --> 00:34:13,136 నీ అంత ధైర్యవంతుడు మరొకరు లేరు. 420 00:34:18,225 --> 00:34:22,603 నేను కోలుకున్నప్పుడు, బీచ్ కి వెళ్దామని అమ్మానాన్నలు అన్నారు. 421 00:34:22,603 --> 00:34:24,731 అది చాలా బాగుంటుంది కదా? 422 00:34:24,731 --> 00:34:27,025 మన నిధి అక్కడ ఉంటుందేమో. 423 00:34:28,025 --> 00:34:30,279 బహూశా దాన్ని అక్కడి ఇసుకలో దాచారేమో. 424 00:34:31,071 --> 00:34:32,989 మనం నిధిని కనుగొనాల్సిన పని లేదు. 425 00:34:33,782 --> 00:34:35,701 నేను ఎప్పుడో నిధిని కనిపెట్టేశాను. 426 00:34:36,994 --> 00:34:38,661 నువ్వంటే నాకు ప్రాణం, కుందేలు. 427 00:34:40,038 --> 00:34:41,456 నాకు కూడా. 428 00:34:59,391 --> 00:35:02,895 ఇంట్లోని కిటికీలన్నింటినీ తెరవండి. ఇంట్లోకి తాజా గాలి వచ్చేలా చేయండి. 429 00:35:02,895 --> 00:35:05,564 భోజనానికి పిల్లాడికి సూప్ చేద్దామనుకుంటున్నా, డాక్టర్. 430 00:35:05,564 --> 00:35:07,733 - పర్వాలేదు కదా? - మరేం పర్వాలేదు. 431 00:35:09,776 --> 00:35:13,447 అంటురోగం ఉన్నప్పుడు, విలియమ్ కి దగ్గరగా ఉన్నవాటన్నింటినీ తగలబెట్టేయండి. 432 00:35:13,447 --> 00:35:15,157 ఈ రోగం ఇతరులకు అంటుకోకుండా చూసుకోవాలి కదా. 433 00:35:15,157 --> 00:35:18,410 కాబట్టి, దుప్పట్లను, నైట్ డ్రెస్ లను, బొమ్మలని, అన్నింటినీ తగలబెట్టేయండి. 434 00:35:24,917 --> 00:35:26,752 నువ్వు ఇక్కడ ఉండి మంచిదైంది, జార్జ్. 435 00:35:26,752 --> 00:35:28,587 ఇవి తగలబెట్టేస్తే చాలు. 436 00:35:30,255 --> 00:35:31,298 ఆ పని ఇప్పుడే చేసేస్తాను. 437 00:35:32,257 --> 00:35:33,467 వెళ్లి అగ్గిపెట్టె తీసుకొస్తా. 438 00:35:34,176 --> 00:35:36,303 విలియమ్ కోలుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. 439 00:35:37,137 --> 00:35:39,306 ఇంకో గంటలో మళ్లీ అల్లరి చేయడం మొదలుపెడతాడు. 440 00:35:39,806 --> 00:35:41,433 అలాగే ఉండాలి కదా. 441 00:35:41,433 --> 00:35:44,645 - ఇక నేను మంట వేస్తాను. - థ్యాంక్స్, జార్జ్. 442 00:35:44,645 --> 00:35:46,230 వాతావరణం చలిగా అయిపోయింది కదా? 443 00:35:55,155 --> 00:35:57,282 లేదు! లేదు! 444 00:35:57,282 --> 00:35:59,243 దయచేసి కోపం తెచ్చుకోకు, బంగారం. 445 00:35:59,243 --> 00:36:00,661 నేనేమీ కోపం తెచ్చుకోవట్లేదు! 446 00:36:00,661 --> 00:36:01,954 అది ఏది? 447 00:36:02,829 --> 00:36:04,039 కుందేలు గురించి అడుగుతున్నాడు. 448 00:36:04,039 --> 00:36:05,791 ఆ బొమ్మ ఎక్కడ ఉందో అడుగుతున్నాడు. 449 00:36:08,836 --> 00:36:09,837 విలియమ్. 450 00:36:14,758 --> 00:36:15,759 కుందేలు బొమ్మ ఇప్పుడు లేదు. 451 00:36:16,468 --> 00:36:18,303 అంటే? ఎక్కడ ఉంది అది? 452 00:36:18,303 --> 00:36:22,808 అది పాతబడిపోయింది, చిరిగిపోయింది, అందుకని మేము దాన్ని పారేశాము. 453 00:36:22,808 --> 00:36:24,393 ఎందుకు పారేశారు? 454 00:36:24,393 --> 00:36:26,270 చూడు, నువ్వు మంచి పిల్లాడిలా మెలిగితే, 455 00:36:26,270 --> 00:36:28,605 క్రిస్మస్ తాతయ్య నీకు కొత్త బొమ్మ తెచ్చిస్తాడేమో. 456 00:36:28,605 --> 00:36:32,985 నాకు కొత్త బొమ్మ ఏమీ వద్దు, నాకు నా కుందేలే కావాలి. అది తప్ప నాకు ఇంకేమీ వద్దు. 457 00:37:03,056 --> 00:37:04,308 ఇది ఏ రోజు? 458 00:37:05,142 --> 00:37:07,186 ఓరి దేవుడా. 459 00:37:07,978 --> 00:37:09,354 అప్పుడే చలికాలం వచ్చేసిందా? 460 00:37:09,354 --> 00:37:11,190 నేను మరీ చాలా కాలం నిద్రపోయినట్టున్నాను. 461 00:37:13,275 --> 00:37:15,110 ఎవరు నువ్వు? 462 00:37:15,110 --> 00:37:19,948 నేను ఆటల గది ఫెయిరీని, కల్పనల మాయకి నేను ఇన్ ఛార్జిని. 463 00:37:20,741 --> 00:37:24,369 పాతబడిపోయిన, చిరిగిపోయిన, ఇకపై అవసరం లేని బొమ్మలను 464 00:37:24,953 --> 00:37:26,955 చూసుకోవడమే నా పని. 465 00:37:28,749 --> 00:37:30,000 ఎందుకు ఏడుస్తున్నావు? 466 00:37:31,835 --> 00:37:36,381 నేను బుడ్డోడిని మిస్ అవుతాను, అందుకే బాధగా ఉంది. 467 00:37:36,924 --> 00:37:39,343 మళ్లీ ఇంకెప్పుడూ అతనితో నేను ఆడుకోలేను. 468 00:37:41,011 --> 00:37:45,057 అతను నన్ను ప్రేమిస్తే, నిజమైన కుందేలు అయిపోతానని అనుకున్నా, అందుకు కూడా బాధగా ఉంది. 469 00:37:47,768 --> 00:37:49,811 కానీ అతను నన్ను ప్రేమించనే లేదేమో. 470 00:37:49,811 --> 00:37:51,688 అతను నిన్ను చాలా ప్రేమించాడు. 471 00:37:52,397 --> 00:37:57,277 బాబోయ్, నీపై అతనికి ఉన్నంత ప్రేమని మాటల్లో వర్ణించడం సాధ్యపడదు. 472 00:37:57,277 --> 00:37:59,947 అయితే, నేనెందుకు నిజమైన కుందేలు అయిపోలేదు? 473 00:38:00,489 --> 00:38:03,659 నిన్ను ఒకరు ప్రేమించగానే నువ్వు అసలైన కుందేలు అయిపోవు. 474 00:38:04,493 --> 00:38:09,957 నిష్కపటమైన ప్రేమ, దయ చూపినప్పుడే నువ్వు అసలైన కుందేలువి అవుతావు. 475 00:38:11,124 --> 00:38:12,876 నిన్న రాత్రి చూపావే, అలాగా. 476 00:38:15,128 --> 00:38:16,880 అయితే ఇప్పుడు నేను అసలైన కుందేలును అయిపోయానా? 477 00:38:18,882 --> 00:38:24,847 అదే నిజమైతే, నాకు బొచ్చు ఏది, సరైన కాళ్లు ఏవి? 478 00:38:25,764 --> 00:38:27,432 నేనెందుకు గెంతలేకపోతున్నాను? 479 00:38:27,933 --> 00:38:32,354 బాబోయ్, మీ బొమ్మలకి ఈ ఐడియాలన్నీ ఎక్కడి నుండి వస్తాయ్? 480 00:38:33,021 --> 00:38:36,441 అసలైన కుందేలు అంటే నీ రూపాన్ని బట్టి ఉండదు. 481 00:38:37,025 --> 00:38:39,403 నీ హృదయంలో ఏముంది అన్నదే ఇక్కడ ముఖ్యం. 482 00:38:40,612 --> 00:38:44,032 నువ్వు బుడ్డోడిని ప్రేమించావు, అతను కూడా నిన్ను ప్రేమించాడు. 483 00:38:45,075 --> 00:38:46,910 ఒకసారి నిన్ను నువ్వు చూసుకో. 484 00:38:47,619 --> 00:38:50,038 ప్రేమను పంచి పంచీ, ఏ అవస్థలో ఉన్నావో చూసుకో. 485 00:38:51,748 --> 00:38:54,376 ఇతర బొమ్మల్లో కొన్ని, నేను అందవికారంగా ఉన్నానని అంటున్నాయి. 486 00:38:55,335 --> 00:38:57,921 అయితే, వాటికి అందం అంటే ఏంటో తెలీదు. 487 00:38:59,131 --> 00:39:04,261 ఇప్పుడు, ఒక మంచి బొమ్మగా ఉన్నందుకు నీకు ఒక కానుక తెచ్చాను. 488 00:39:39,254 --> 00:39:41,965 విలియమ్, సమయం ఎనిమిది అయింది. 489 00:39:42,925 --> 00:39:46,053 ఏడు గంటలవ్వగానే కిందికి వచ్చేస్తావు అనుకున్నా. 490 00:39:47,888 --> 00:39:50,390 భలేవాడివే. ఓసారి నవ్వు. 491 00:39:51,183 --> 00:39:52,351 ఇవాళ క్రిస్మస్. 492 00:39:52,851 --> 00:39:55,646 క్రిస్మస్ దినాన నవ్వాలి. అది నియమం. 493 00:39:56,897 --> 00:39:57,940 అంతే. 494 00:39:58,815 --> 00:40:00,400 ఇక కిందికి రా. 495 00:40:01,777 --> 00:40:04,196 చాలా బరువుగా ఉందే. లోపల ఏముందో ఏమో. 496 00:40:20,629 --> 00:40:23,549 కోటు, బూట్లు వేసుకొని దీన్ని బయటకు తీసుకెళ్లి ఆడుకోరాదూ? 497 00:40:24,049 --> 00:40:25,467 ఎగరవేయగలవేమో చూడు. 498 00:41:15,058 --> 00:41:16,268 హలో, కుందేలు. 499 00:42:09,738 --> 00:42:11,156 బై, కుందేలు. 500 00:42:14,701 --> 00:42:15,702 థ్యాంక్యూ. 501 00:42:36,765 --> 00:42:39,017 హలో, నా పేరు విలియమ్. 502 00:42:39,017 --> 00:42:40,561 ఆడకుందాం వస్తారా? 503 00:42:52,781 --> 00:42:54,241 మార్గరీ విలియమ్స్ రచించిన, విలియమ్ నికల్సన్ చిత్రాల రూపంలో 504 00:42:54,241 --> 00:42:55,492 సాయం అందించిన పుస్తకం ఆధారితమైనది 505 00:44:06,396 --> 00:44:08,398 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్