1 00:00:08,717 --> 00:00:10,552 {\an8}డైనోసార్లు మన భూగ్రహాన్ని పరిపాలించాయి... 2 00:00:10,552 --> 00:00:12,179 {\an8}డేవిడ్ అటెన్బరో సమర్పణ 3 00:00:12,179 --> 00:00:14,806 {\an8}...దాదాపు పదిహేను కోట్ల సంవత్సరాల కాలం. 4 00:00:15,682 --> 00:00:18,727 అవి మన భూమిలో దాదాపు ప్రతి ప్రాంతాన్ని ఆక్రమించాయి 5 00:00:19,311 --> 00:00:23,148 ఇంకా మనం ఊహించగల ప్రతి రూపంలో, ప్రతి పరిమాణంలో అవి పుట్టుకొచ్చాయి. 6 00:00:24,358 --> 00:00:27,402 కొన్ని నిజంగా అసాధారణమైనవి. 7 00:00:30,822 --> 00:00:34,535 టి. రెక్స్ చాలా గొప్పగా ఈదగలుగుతుందని, 8 00:00:36,787 --> 00:00:40,082 వెలోసిరాప్టర్స్ చాలా కుతంత్రాలు పన్నుతాయని, ఈకలు ఉన్న వేట జంతువులని, 9 00:00:42,000 --> 00:00:45,963 అలాగే కొన్ని డైనోసార్స్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాయని మనకి ఇప్పుడు తెలిసింది. 10 00:00:48,841 --> 00:00:52,594 కానీ దాదాపు ప్రతి రోజూ చోటు చేసుకుంటున్న కొత్త ఆవిష్కరణలు 11 00:00:52,594 --> 00:00:57,641 మన గ్రహం మీద ఆరు కోట్ల అరవై లక్షల సంవత్సరాల కిందట జీవనం ఎలా ఉండేదో మనకి తెలియజేస్తున్నాయి. 12 00:01:02,604 --> 00:01:05,482 Prehistoric Planet లో ఈసారి, 13 00:01:05,482 --> 00:01:08,026 మేము కొత్త జంతువులను వెల్లడించబోతున్నాము... 14 00:01:09,403 --> 00:01:13,740 ఇంకా అవి తమ భాగస్వాములను అన్వేషించే పద్ధతుల గురించి, 15 00:01:15,576 --> 00:01:18,203 కుటుంబాన్ని పెంచి పోషించుకునే క్రమంలో అవి ఎదుర్కొనే సవాళ్ల గురించి... 16 00:01:19,496 --> 00:01:21,415 ఇంకా వాటి అసాధారణ పోరాటాల గురించి కొత్త విషయాలు వెల్లడించబోతున్నాం. 17 00:01:29,506 --> 00:01:33,969 ప్రకృతి అత్యద్భుత ఘట్టాలను ప్రదర్శించిన ఆ కాలానికి ప్రయాణిద్దాం. 18 00:01:37,514 --> 00:01:41,727 ఇది Prehistoric Planet 2. 19 00:01:55,991 --> 00:02:01,163 ద్వీపాలు 20 00:02:02,456 --> 00:02:07,836 ఆరు కోట్ల అరవై లక్షల సంవత్సరాల కిందట ఇది దక్షిణ యూరోప్ లోని ఒక నది పుట్టిన ప్రదేశం. 21 00:02:11,507 --> 00:02:16,970 ఒక పెను తుపాను బీభత్సం తరువాత, విరిగిపడిన చెట్ల కొమ్మలు దిగువ తీరానికి కొట్టుకొస్తున్నాయి. 22 00:02:22,809 --> 00:02:28,065 పచ్చని చెట్లతో నేలని చీల్చుకు వచ్చిన ఒక చెరియ కూడా ఇలా కొట్టుకు వచ్చింది. 23 00:02:31,235 --> 00:02:35,948 దిక్కు తోచని టెరోసార్ కి, సేద తీరడానికి ఇది ఒక చక్కని ప్రదేశం కావచ్చు... 24 00:02:42,287 --> 00:02:44,540 కానీ అది ఏమాత్రం సురక్షితం కాదు. 25 00:03:05,769 --> 00:03:09,231 ఒక భారీ మోసాసార్, నీటి అడుగున సంచరించే ఈ భీకరమైన వేట జంతువు, 26 00:03:09,731 --> 00:03:11,775 ఇప్పుడు తేలికగా దొరికే విందు కోసం వెతుకుతోంది. 27 00:03:16,822 --> 00:03:21,535 ఇలాంటి ఒక చిన్న డైనోసార్, జల్మోక్సిస్ కోసం. 28 00:03:27,332 --> 00:03:29,501 ఇక్కడ ఉండటం చాలా ప్రమాదకరం. 29 00:03:31,253 --> 00:03:34,715 ఈ జంతువుకి ఒక పెద్ద తెడ్డు కావాలి, అది కూడా తక్షణం. 30 00:03:41,597 --> 00:03:43,849 ఇప్పుడు ఈదడం తప్ప మరో మార్గం లేదు. 31 00:04:12,586 --> 00:04:14,630 ఇది మాత్రమే ఇక్కడికి మొదటిగా రాలేదు. 32 00:04:20,219 --> 00:04:21,553 దారి తప్పిన మరొక జంతువు. 33 00:04:22,763 --> 00:04:24,139 ఆడ జంతువు. 34 00:04:29,978 --> 00:04:32,356 ఆ చెరియ క్రమంగా సముద్రంలోకి కొట్టుకుపోతోంది. 35 00:04:45,827 --> 00:04:48,914 కొన్నిసార్లు, ఇలాంటి చెరియల మీద దారి తప్పి వచ్చిన జంతువులు 36 00:04:49,706 --> 00:04:53,252 సుదూరమైన దీవుల తీరాలకు వచ్చి చిక్కుకుంటాయి. 37 00:04:57,548 --> 00:05:02,010 అదృష్టం కలిసి వస్తే, ఈ జంట కూడా అలాంటి ద్వీపాలకు చేరిన తొలి జంతువులు అవుతాయి. 38 00:05:14,106 --> 00:05:20,153 అక్కడ తమ సంతతిని పెంచుకోగలుగుతాయి, అవి అక్రమంగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 39 00:05:25,409 --> 00:05:27,286 సరికొత్త జీవరాశులుగా అవతరిస్తాయి. 40 00:05:35,002 --> 00:05:37,629 ఒక ద్వీపం ఎంత కాలం నిర్జన ప్రదేశంగా ఉంటే, 41 00:05:38,463 --> 00:05:41,758 దానిని ఆశ్రయించిన జంతువులు అంత భిన్నంగా తయారవుతాయి. 42 00:05:45,095 --> 00:05:47,556 దక్షిణ యూరోప్ లో ఈ చిన్న ద్వీపాలు 43 00:05:48,182 --> 00:05:52,853 విచిత్రమైన, ఇంకా కొద్దిగా పిరికిగా ఉండే హెడ్రోసార్ నివసించే ప్రదేశాలు. 44 00:05:59,943 --> 00:06:05,949 ఈ పైన్ మొక్కలని తింటూ జీవించే ఈ జంతువు, టెథిషెడ్రోస్. 45 00:06:25,844 --> 00:06:29,431 ప్రధాన భూభాగంలో తన బంధువులైన భారీ డైనోసార్లతో పోలిస్తే పరిణామంలో ఇవి నాలుగో వంతు చిన్నగా ఉంటాయి, 46 00:06:30,098 --> 00:06:33,143 ఇవి దాదాపు మనుషుల ఎత్తులోనే ఉంటాయి. 47 00:06:40,108 --> 00:06:44,780 రంపం మాదిరిగా ఉండే దీని ప్రత్యేకమైన మూతి, ఎంత దట్టమైన కొమ్మలనైనా వంచగలదు. 48 00:06:54,164 --> 00:06:58,460 టి. రెక్స్ లాంటి వేట జంతువులు ఈ చిన్న ద్వీపానికి ఎప్పుడూ చేరుకోలేవు, 49 00:06:59,711 --> 00:07:03,674 కాబట్టి ఈ తల్లి జంతువుకి తన సంతానాన్ని పెంచుకోవడానికి ఇదే సురక్షితమైన ప్రదేశం. 50 00:07:11,598 --> 00:07:14,226 కానీ ఇది కూడా అంత సురక్షితం కాకపోవచ్చు. 51 00:07:48,260 --> 00:07:49,970 హెట్జగోప్టరిక్స్. 52 00:07:54,099 --> 00:07:56,560 భారీ వేట జంతువులైన టెరోసార్స్. 53 00:08:00,647 --> 00:08:05,360 ఇవి ప్రమాదం నుండి తప్పించుకోవాలి అంటే పొడవాటి చెట్ల పందిరి కింద దాక్కోవడమే శరణ్యం. 54 00:08:16,121 --> 00:08:19,708 వాటి సంతానంలో ఈ చిన్న కూనలు వెనుకబడిపోయాయి. 55 00:08:24,755 --> 00:08:26,965 తల్లీ బిడ్డా వేరుపడిపోయారు. 56 00:08:38,852 --> 00:08:42,397 హెట్జగోప్టరిక్స్ అనేవి చాలా తెలివైన టెరోసార్స్ జాతి పక్షులు. 57 00:08:44,691 --> 00:08:48,987 ఇప్పుడు ఇక హఠాత్తుగా దాడి చేసే అవకాశం లేకపోవడంతో, ఇవి తమ వ్యూహాలని మార్చేశాయి. 58 00:08:51,782 --> 00:08:53,575 అడవిలో ఖాళీ ప్రదేశాలలో ఇవి విస్తరించి, 59 00:08:53,575 --> 00:08:56,828 అక్కడ ఉన్న ఆహారాన్ని క్రమంగా ఏరివేయడానికి చూస్తున్నాయి. 60 00:09:05,712 --> 00:09:09,550 ఈ పసికూనలు వాటి నుండి తప్పించుకోవాలంటే పూర్తిగా కదలకుండా నిశ్శబ్దంగా ఉండాలి... 61 00:09:15,597 --> 00:09:18,642 కానీ పరిగెత్తకూడదు. 62 00:09:51,967 --> 00:09:55,137 ఈ రెండు పసికూనలు అదృష్టం కొద్దీ తమ తల్లిని చేరుకోగలిగాయి. 63 00:10:09,193 --> 00:10:14,239 ద్వీపాలు దాటే టెరోసార్స్ మరొక చోట తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బయలుదేరాయి. 64 00:10:27,169 --> 00:10:29,963 హెడ్రోసార్స్ తిరిగి తమ ఆహారం వేటని మొదలుపెట్టవచ్చు. 65 00:10:43,060 --> 00:10:46,396 మడగాస్కర్ ద్వీపం 66 00:10:46,396 --> 00:10:50,442 ఆఫ్రికన్ ప్రధాన భూభాగం నుండి ఎనిమిది కోట్ల సంవత్సరాల కిందట విడిపోయింది. 67 00:10:53,570 --> 00:10:57,366 అది ఎంత సుదీర్ఘ కాలం అంటే, ఆ ద్వీపంలోని జంతువులు 68 00:10:58,075 --> 00:10:59,910 మిగతా చోట్ల జంతువులతో పోలిస్తే, చాలా భిన్నంగా మారిపోయాయి. 69 00:11:19,721 --> 00:11:21,849 ఇది సైమోసూకస్ జంతువు. 70 00:11:25,310 --> 00:11:29,690 ఇది డైనోసార్ కాదు కానీ మొసలి జాతికి చిన్న బంధువు. 71 00:11:30,732 --> 00:11:33,360 ఇది పూర్తిగా భూమి మీద నివసించే 72 00:11:34,403 --> 00:11:38,574 పూర్తి శాకాహారి. 73 00:11:52,212 --> 00:11:57,092 సైమోసూకస్ జంతువుల శరీరాలు గట్టి కవచాలతో ఉండి 74 00:11:57,092 --> 00:11:58,802 ఆ ద్వీపంలోని వేట జంతువుల నుండి రక్షణ కల్పిస్తాయి. 75 00:12:00,888 --> 00:12:03,724 కాబట్టి అవి భయపడాల్సిన అవసరం లేదు... 76 00:12:07,895 --> 00:12:08,896 కానీ కొన్నిసార్లే. 77 00:12:18,155 --> 00:12:23,702 మజంగాసారస్, ఇది మడగాస్కర్ లో ప్రధానమైన వేట జంతువు. 78 00:12:34,338 --> 00:12:37,341 ముఖ్యంగా ఈ ఆడ జంతువుకి ఒక కన్ను గుడ్డిది, 79 00:12:38,634 --> 00:12:44,473 అందువల్ల అది వేటాడి చంపడానికి చాలా కష్టపడాలి, ముఖ్యంగా అది ఇప్పుడు ఆకలితో ఉంది. 80 00:13:03,408 --> 00:13:06,995 ఈ సైమోసూకస్ జంతువులకు తప్పించుకునే మార్గాలు చాలానే ఉన్నాయి 81 00:13:06,995 --> 00:13:09,414 అవి తమ భూగర్భంలోని కలుగులకు దారి తీస్తాయి. 82 00:13:12,584 --> 00:13:16,880 ఒకసారి అవి లోపలికి వెళ్లిపోతే, అవి పెద్ద కవచంలా ఉండే తమ వీపులతో ఆ ప్రవేశ మార్గాన్ని కప్పివేస్తాయి. 83 00:13:32,020 --> 00:13:34,648 ఈ చిన్న మగ జంతువుకి పాపం అదృష్టం లేకపోయింది. 84 00:13:38,694 --> 00:13:40,988 కానీ అది నిస్సహాయురాలు కాదు. 85 00:13:55,836 --> 00:14:00,340 వెనక్కి తిరిగి దాడి మొదలుపెట్టింది, తోక విసురుతూ బలంగా తంతోంది. 86 00:14:17,191 --> 00:14:20,694 ఆ వేట జంతువు మూతి మరీ పెద్దగా ఉండటంతో లోపలికి దూరడం సాధ్యం కావడం లేదు. 87 00:14:33,165 --> 00:14:38,921 కానీ మరింత భద్రత కోసం, సైమోసూకస్ మరింత లోతుగా నేలని తవ్వుతోంది. 88 00:14:47,554 --> 00:14:52,226 మజంగాసారస్ కి మరొక వేట ప్రయత్నం విఫలమైంది. 89 00:15:03,946 --> 00:15:09,034 పరిణామ క్రమంలో భిన్నమైన జంతువుగా మడగాస్కర్ లో మనుగడ సాగిస్తున్నది సైమోసూకస్ మాత్రమే కాదు. 90 00:15:14,581 --> 00:15:19,920 ఈ ద్వీపం మరికొన్ని విచిత్రమైన జంతు సమూహాలకు కూడా జన్మస్థలం. 91 00:15:24,091 --> 00:15:25,092 క్షీరదాలు. 92 00:15:34,226 --> 00:15:36,728 ఇది అడాలథీరియమ్ జాతికి చెందిన ఆడ జంతువు. 93 00:15:38,939 --> 00:15:40,774 ఇది రెండు అడుగుల కన్నా తక్కువే ఉంటుంది. 94 00:15:40,774 --> 00:15:45,279 అయినా కూడా, ఇప్పటికి జీవం పోసుకున్న అది పెద్ద క్షీరదాలలో ఇవీ ఒకటి. 95 00:15:51,243 --> 00:15:54,830 ఈ ఆడ జంతువు మేలుకొన్న సమయంలో ఎక్కువ భాగం ఆహారం కోసం వెతకుతూ గడుపుతుంది. 96 00:16:03,463 --> 00:16:08,051 ఈ సొరంగం చివరి వైపు, గుడ్లు ఉన్నాయి... 97 00:16:11,638 --> 00:16:14,474 అవి మంచి పోషకాలు ఉన్న ఆహారం. 98 00:16:21,565 --> 00:16:24,568 ముఖ్యంగా ఈ గుడ్లని ఈ ఆడ జంతువు తినదు. 99 00:16:28,071 --> 00:16:30,824 ఎందుకంటే ఇవి తను పెట్టిన గుడ్లు. 100 00:16:32,576 --> 00:16:34,912 ఇంకా ఇది ఆమె కలుగు. 101 00:16:48,258 --> 00:16:50,552 ఆ గుడ్లు పొదుగుతున్నాయి. 102 00:17:15,743 --> 00:17:18,829 గుడ్ల నుండి బయటకు వచ్చిన ఆ పసికూనల కళ్లు ఇంకా తెరుచుకోనే లేదు, 103 00:17:18,829 --> 00:17:24,837 కానీ అవి అలవోకగా, పాల కోసం తమ తల్లి చెంతకు చేరుకుంటాయి. 104 00:17:28,882 --> 00:17:32,553 ఆ తల్లి తన పొట్టమీద రూపాంతరం చెందిన స్వేద గ్రంథుల ద్వారా పాలను తన పిల్లలకి అందిస్తుంది, 105 00:17:33,554 --> 00:17:36,557 ఇప్పటికి, వాటికి కావలసిన ఆహారం అదే. 106 00:17:50,279 --> 00:17:54,741 రెండు నెలల తరువాత, ఆ పసికూనలు నాలుగు రెట్లు పెద్దగా ఎదిగాయి. 107 00:17:56,994 --> 00:17:58,829 తన పిల్లలకి మరిన్ని పాలు ఉత్పత్తి చేయడం కోసం, 108 00:17:58,829 --> 00:18:01,832 ఆ తల్లి చాలా ఎక్కువ ఆహారాన్ని తినాల్సి వస్తుంది. 109 00:18:04,251 --> 00:18:09,173 దాని కోసం ప్రతి రాత్రి, ఆ ఆడ జంతువు తన కలుగు భద్రతని పణంగాపెట్టి మరీ తినడానికి బయటకు వెళుతుంది. 110 00:18:27,858 --> 00:18:31,236 మిగతా కలుగులో నివసించే జంతువుల మాదిరిగా 111 00:18:31,236 --> 00:18:33,071 తన కంటి చూపు అంత సూక్ష్మంగా ఏమీ ఉండదు. 112 00:18:37,326 --> 00:18:40,537 అందువల్ల ఆ ఆడ జంతువు తన అతి సున్నితమైన వినికిడి శక్తి మీద ఆధారపడుతుంది. 113 00:18:45,209 --> 00:18:47,920 ఏదైనా ప్రమాదం అనిపించే శబ్దాలను ఆ జంతువు వింటే గనుక, 114 00:18:47,920 --> 00:18:49,963 అది పూర్తిగా కదలకుండా నిలిచిపోతుంది. 115 00:18:56,970 --> 00:18:58,514 ప్రమాదం తప్పిపోయింది. 116 00:19:01,642 --> 00:19:06,021 అది భూమిలో వేర్లు ఇంకా విత్తనపు గింజల కోసం వెతకడాన్ని మళ్లీ మొదలుపెడుతుంది. 117 00:19:21,995 --> 00:19:26,667 ఆ పసికూనలు వేగంగా ఎదుగుతున్నాయి వాటితో పాటే వాటి ఆకలి కూడా పెరుగుతోంది. 118 00:19:32,673 --> 00:19:37,052 దానితో ఆ తల్లి నిరంతరం ఆహారం కోసం వెతుకులాట సాగిస్తూనే ఉంటుంది. 119 00:19:44,476 --> 00:19:48,146 అందువల్ల దాని పసికూనలు గంటల తరబడి ఒంటరిగా కలుగులో ఉండిపోతాయి. 120 00:19:58,699 --> 00:20:00,242 మషియాకసారస్. 121 00:20:05,080 --> 00:20:06,081 ఇది వేట జంతువు. 122 00:20:06,081 --> 00:20:10,627 ఇది ముఖ్యంగా కలుగులో ఉన్న ఆహారాన్ని వేటాడి తినడానికి అలవాటు పడి ఉంది. 123 00:20:14,923 --> 00:20:17,134 దీని పొడవాటి మెడ ఇంకా సన్నని తల వల్ల, 124 00:20:17,134 --> 00:20:20,429 ఇది ఏ కలుగులోకి అయినా తల దూర్చి తనకి ఆహారం ఉందో లేదో తెలుసుకోగలదు. 125 00:20:55,005 --> 00:20:59,218 కానీ ఒక్కోసారి వేట జంతువులు కూడా వేటాడబడచ్చు. 126 00:21:11,396 --> 00:21:17,152 మడ్సోయా, ఇది దాదాపు ఇరవై ఐదు అడుగుల పొడవు ఉండి, తన ఆహారాన్ని ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తుంది. 127 00:21:20,739 --> 00:21:23,867 ఈ చుట్టుపక్కల ప్రాంతం ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. 128 00:21:46,932 --> 00:21:52,771 రాత్రి చీకటి పడిన తరువాత, మొదటిసారిగా ఆ తల్లి తన పసికూనల్ని ఆ కలుగు నుండి బయటకు తీసుకువచ్చింది. 129 00:22:01,238 --> 00:22:04,992 ఇప్పటికి, కనీసం, అవి దగ్గరగా ఉండి ప్రయాణిస్తాయి. 130 00:22:19,840 --> 00:22:24,928 భూ గ్రహం మీద దక్షిణపు అంచులలో, అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని ద్వీపాలలో, 131 00:22:25,470 --> 00:22:28,557 శీతాకాలంలో నెలల తరబడి గడ్డ కట్టే శీతల వాతావరణం ఉంటుంది. 132 00:22:32,227 --> 00:22:35,981 ఇక్కడ కూడా, కుటుంబంతో కలిసి ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. 133 00:22:43,071 --> 00:22:47,284 థర్మల్ కెమెరాలో చూస్తే వెలుగుతున్న శరీరాల సమూహం కనిపిస్తుంది. 134 00:22:55,959 --> 00:22:57,169 ఇంప్రొబాటర్. 135 00:22:58,504 --> 00:22:59,505 ఇవి వేట జంతువులు. 136 00:23:04,051 --> 00:23:07,596 చాలా డైనోసార్ల మాదిరిగా, ఇవి కూడా వేడి రక్తాన్ని కలిగి ఉంటాయి. 137 00:23:10,182 --> 00:23:13,310 కానీ అవి వెచ్చగా ఉండటం కోసం, వాటికి చాలా ఆహారం అవసరం. 138 00:23:14,978 --> 00:23:18,148 కాబట్టి అవి సాధ్యమైనంత వరకూ తరచు ఆహారం కోసం వేటాడాలి. 139 00:23:25,614 --> 00:23:28,951 తాజా మంచు వల్ల వాటి అడుగుల చప్పుడు మంద్రంగా వినిపిస్తుంది, 140 00:23:28,951 --> 00:23:33,205 అందువల్ల అవి ఎవ్వరి కంటా పడకుండా ఆహారం కోసం ఆ అడవి అంతా తిరగగలుగుతాయి. 141 00:23:38,836 --> 00:23:40,254 ఇది మోరొసారస్. 142 00:23:46,593 --> 00:23:51,390 మొక్కల ఆకులు తినే ఈ జంతువుకి శీతాకాలం ఆహారం దొరకడం చాలా కష్టం అయిపోతుంది. 143 00:24:06,780 --> 00:24:10,284 అటువంటి జంతువుల్ని వేటాడటంలో ఇంప్రొబాటర్స్ ప్రత్యేక మెళకువలు కలిగి ఉంటాయి. 144 00:24:23,422 --> 00:24:26,133 తనని వేటాడే జంతువుల కన్నా మోరొసారస్ వేగంగా పరిగెత్తగలదు. 145 00:24:32,639 --> 00:24:34,683 కానీ వేట జంతువులు గుంపుగా దాడి చేయడం వల్ల దాని మీద పైచేయి సాధిస్తాయి. 146 00:24:49,072 --> 00:24:53,952 ఇంప్రొబాటర్స్ కి పొడవైన ఈకలు గల తోకలు అవి చాకచక్యంగా కదలడానికి సహకరిస్తాయి. 147 00:25:05,047 --> 00:25:07,925 ఆ వేట అడవి అంచు వరకూ సాగింది. 148 00:25:10,511 --> 00:25:14,473 ఆ పైన ఒక గడ్డ కట్టిన సరస్సు, దాదాపు అర మైలు దూరం వ్యాపించి ఉంది. 149 00:25:15,974 --> 00:25:21,355 దాక్కునే అవకాశం లేని ఈ ఖాళీ ప్రదేశం మోరొసారస్ వేటకి అనుకూలించే అవకాశం ఉంది. 150 00:25:24,066 --> 00:25:26,485 కానీ చలికి గడ్డకట్టిన ఈ ఉపరితలం మీద అడుగుపెట్టడం చాలా హింసగా ఉంటుంది. 151 00:25:35,994 --> 00:25:39,665 ఇంప్రొబాటర్ వేట జంతువులు చుట్టుముడుతుండటంతో దానికి మరో మార్గం కనిపించడం లేదు. 152 00:26:17,661 --> 00:26:19,079 ఒక తప్పటడుగు. 153 00:26:19,788 --> 00:26:24,251 వేట జంతువుల నుంచి తప్పించుకుపోవడానికి మోరొసారస్ కి ఒక చక్కని అవకాశం. 154 00:26:28,338 --> 00:26:30,257 కానీ ఈ ద్వీపంలో, 155 00:26:30,257 --> 00:26:33,552 వేట జంతువులు, వేటాడబడే జంతువులు మళ్లీ ఖచ్చితంగా ఎదురుపడుతూనే ఉంటాయి. 156 00:26:44,646 --> 00:26:47,107 కొన్ని ద్వీపాలు చిన్నగా ఉంటాయి 157 00:26:47,107 --> 00:26:50,027 అందువల్ల వీటి మీద జంతువులు ఏవీ స్థిరనివాసం ఉండలేవు. 158 00:26:53,238 --> 00:26:56,408 కానీ ఈ ద్వీపాలకు ఎప్పుడయినా, అతిథులు వస్తుంటాయి. 159 00:27:03,665 --> 00:27:05,000 హెట్జగోప్టరిక్స్. 160 00:27:13,592 --> 00:27:18,472 ఈ మగ పక్షి 18 కిలోల బరువు ఉండే టెథిషెడ్రోస్ కళేబరాన్ని మోసుకొచ్చింది. 161 00:27:19,598 --> 00:27:21,725 తాజా వేటలో దానికి దొరికిన బహుమతి అది. 162 00:27:29,691 --> 00:27:34,404 ఈ మగ పక్షి పొడవు 15 అడుగులు, దాని రెక్కల విస్తీర్ణం 30 అడుగులు. 163 00:27:36,323 --> 00:27:39,868 హెట్జగోప్టరిక్స్ పక్షులు యూరోప్ లో ప్రధానమైన వేట జంతువులు. 164 00:27:42,538 --> 00:27:47,459 కానీ ఈ మగ పక్షి తనలోని మరొక కోణాన్ని వెల్లడించడానికి ఇక్కడికి వచ్చింది. 165 00:28:21,702 --> 00:28:26,999 ఇది ఇక్కడ ఒక ప్రదర్శనని ఏర్పాటు చేసి అటుగా వచ్చే ఆడ పక్షుల దృష్టిని ఆకర్షించి 166 00:28:27,708 --> 00:28:30,043 జత కూడటానికి తను సిద్ధంగా ఉన్నానని చాటుతోంది. 167 00:28:32,671 --> 00:28:36,508 కానీ దాని ప్రయత్నానికి స్పందన రావడానికి చాలా సమయం వేచి ఉండాల్సి వస్తోంది. 168 00:28:57,404 --> 00:29:00,324 ఎట్టకేలకు వచ్చింది. ఒక ఆడ పక్షి. 169 00:29:04,870 --> 00:29:06,455 ఆ ఆడ పక్షి తన ఆసక్తిని చూపుతున్నట్లే ఉంది, 170 00:29:06,455 --> 00:29:09,166 కానీ మరి కాస్త ఒప్పించడం అవసరంలా కనిపిస్తోంది. 171 00:29:10,709 --> 00:29:12,753 పైగా ఆ మగ పక్షి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 172 00:29:14,004 --> 00:29:16,173 అది గురి చూసి తన ముక్కుని సరిగ్గా ఆన్చగలిగితే 173 00:29:16,673 --> 00:29:20,010 తన జత కట్టే సీజన్ త్వరగా ముగింపు దశకు రావచ్చు. 174 00:29:25,766 --> 00:29:29,937 తన ప్రదర్శన ద్వారా అది ఏం ప్రకటించాలి అంటే 175 00:29:29,937 --> 00:29:32,606 తమకు పుట్టబోయే పిల్లలకు తన ద్వారా మంచి జీన్స్ సంక్రమిస్తాయని చాటాలి. 176 00:29:35,442 --> 00:29:38,904 తను మంచి వేట జంతువుని అని ఆ చనిపోయిన డైనోసార్ సూచిస్తోంది 177 00:29:38,904 --> 00:29:42,449 ఇంకా దాన్ని ఇంత దూరం మోసుకురావడం ద్వారా తాను బలంగా ఎగరగలుగుతుందని చాటుతోంది. 178 00:29:45,953 --> 00:29:51,416 కానీ ఆ ఆడ జంతువు మెచ్చుకుందా లేదా అనేది, అది ఇంకా బయటకి ప్రదర్శించడం లేదు. 179 00:29:55,754 --> 00:30:00,300 తనకు ఉన్న మరొక కొత్త అర్హతని చాటాల్సిన సమయం వచ్చింది. 180 00:30:04,513 --> 00:30:08,016 తల పైకెత్తడం అనేది దగ్గరగా రావాలని సూచన. 181 00:30:22,322 --> 00:30:25,659 ఇప్పుడు, ఆ ఆడ పక్షి కూడా కొద్దిగా ప్రోత్సహిస్తోంది. 182 00:30:52,436 --> 00:30:56,356 ఒక లయబద్ధమైన నాట్యం వాళ్లిద్దరి మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తుంది. 183 00:31:19,463 --> 00:31:20,589 మరొక మగ పక్షి. 184 00:31:22,633 --> 00:31:26,345 ఇది వయసులో చాలా చిన్నది, కానీ అది ప్రత్యర్థిగా పోటీకి రాగలదు. 185 00:31:48,992 --> 00:31:50,410 పోటీని అది సమర్థంగా తప్పించింది. 186 00:31:56,458 --> 00:31:59,586 ఘోరం జరిగిపోయింది. ఆ ఆడపక్షి వెళ్లిపోయింది. 187 00:32:07,344 --> 00:32:09,513 మగ పక్షి మంచి అవకాశాన్ని కోల్పోయి ఉండచ్చు. 188 00:32:25,320 --> 00:32:26,321 ఆడ పక్షి తిరిగి వచ్చింది. 189 00:32:28,824 --> 00:32:33,495 తన ప్రత్యర్థిని ఓడించి పంపించడం ఈ మగ పక్షికి మరొక అనుకూలించే అంశం అవుతోంది. 190 00:32:42,254 --> 00:32:45,215 అది ఎక్కడ ఆపిందో మళ్లీ అక్కడే మొదలుపెట్టింది. 191 00:32:54,057 --> 00:32:56,727 తన బలాన్ని చివరిసారిగా ప్రకటించింది. 192 00:33:01,857 --> 00:33:05,068 తండ్రి కావడానికి ఇది మాత్రమే అది చేయగలుగుతుంది. 193 00:33:15,245 --> 00:33:17,998 కొద్ది క్షణాలలో అంతా అయిపోయింది. 194 00:33:20,417 --> 00:33:25,422 కానీ ఈ భారీ ఎగిరే వేట జంతువుల కొత్త తరానికి ఇది నాంది. 195 00:33:32,429 --> 00:33:34,890 ఇటువంటి ద్వీపాలు చిన్నవే కావచ్చు, 196 00:33:36,058 --> 00:33:38,769 ఇలాంటి ప్రపంచం అంతటా ఉండే ఇలాంటి అసంఖ్యాకమైన ద్వీపాలు, 197 00:33:40,437 --> 00:33:43,065 అత్యంత అసాధారణ జీవరాశుల జీవితాలలో 198 00:33:43,065 --> 00:33:46,401 ఎన్నో కీలకమైన ఘట్టాలకు 199 00:33:47,194 --> 00:33:49,571 Prehistoric Planet లో సాక్షులుగా నిలిచాయి. 200 00:33:59,748 --> 00:34:04,253 Prehistoric Planet: ఆవిష్కరణ 201 00:34:06,129 --> 00:34:08,924 {\an8}భారీ టెరోసార్స్ జంతువులు భూమి ఉపరితలం మీద నిజంగా వేటాడగలవా? 202 00:34:09,842 --> 00:34:12,219 డైనోసార్లు జీవించిన కాలంలో, 203 00:34:12,761 --> 00:34:18,433 ఆకాశమంతా టెరోసార్స్ అనే ఎగిరే సరీసృపాల ఆధిపత్యం ఉండేది. 204 00:34:23,397 --> 00:34:26,440 అవి దాదాపు 250 రకాల జాతులు... 205 00:34:28,443 --> 00:34:30,612 ఇంకా వాటిలో కొన్ని అతి భారీ ఆకారాలు. 206 00:34:33,824 --> 00:34:36,493 వాటిలో ఒకటి అత్యంత ఆసక్తికరమైన జంతువు, ఎందుకంటే అవి చాలా విచిత్రంగా ఉంటాయి, 207 00:34:36,493 --> 00:34:37,995 {\an8}అవే అజ్డార్కిడ్ టెరోసార్స్. 208 00:34:37,995 --> 00:34:39,663 {\an8}డాక్టర్ మార్క్ వీటన్ ప్రాచీన చిత్రకారుడు, శిలాజాల పరిశోధకుడు 209 00:34:39,663 --> 00:34:40,831 {\an8}ఒక విధంగా 210 00:34:40,831 --> 00:34:43,292 {\an8}అజ్డార్కిడ్ టెరోసార్ ని వర్ణించడం చాలా కష్టమైన పని. 211 00:34:44,251 --> 00:34:46,170 అవి జిరాఫీల అంత పొడవుగా ఉంటాయి. 212 00:34:46,795 --> 00:34:49,255 వాటి తలలు రెండు మీటర్ల పొడవు ఉంటాయి, 213 00:34:49,922 --> 00:34:51,341 వాటి రెక్కలు దాదాపు 32 అడుగుల పొడవు ఉంటాయి. 214 00:34:52,967 --> 00:34:56,096 ఈ భూమి మీద అవతరించిన అత్యంత విచిత్రంగా కనిపించే జీవరాశులు అవి. 215 00:34:58,557 --> 00:35:03,145 వాటి పరిమాణం ఎంత పొడవు ఉన్నా, ఈ భారీ పక్షులు సమర్థంగా ఎగురగలుగుతాయి. 216 00:35:04,813 --> 00:35:08,025 కాబట్టి అవి భూమి మీద వేటాడతాయని మనం ఎందుకు భావించాలి? 217 00:35:10,485 --> 00:35:12,905 {\an8}ఈ అజ్డార్కిడ్ పక్షుల రెక్క దాని చర్మపు పొరతో తయారై ఉంటుంది... 218 00:35:12,905 --> 00:35:14,448 {\an8}డాక్టర్ డారెన్ నయీష్ ప్రధాన సైంటిఫిక్ సలహాదారు 219 00:35:14,448 --> 00:35:17,743 {\an8}...కానీ పూర్తిగా దాని బాగా పొడవైన నాలుగో వేలు సహాయంతో అది సంచరించగలుగుతుంది. 220 00:35:18,243 --> 00:35:19,369 {\an8}అజ్డార్కిడే రెక్క పొడవు 221 00:35:19,369 --> 00:35:23,248 {\an8}ఈ చర్మపు పొర దాని భారీ నాలుగో వేలు అంచు నుంచి 222 00:35:23,248 --> 00:35:26,001 {\an8}దాని మోకాలి పై భాగం వరకూ విస్తరించి ఉంటుంది. 223 00:35:28,086 --> 00:35:31,465 అజ్డార్కిడ్స్ సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి అలవాటు పడి ఉంటాయి, 224 00:35:31,465 --> 00:35:34,635 కానీ ఆ పక్షులు మాత్రం మలుపులు తిరగడం పల్టీలు కొట్టడం 225 00:35:34,635 --> 00:35:37,012 ఇంకా ఎగిరే సమయంలో చురుకైన కదలికలు ప్రదర్శించడం వంటివి చేయలేవు. 226 00:35:39,431 --> 00:35:42,476 ఈ కారణంగా అజ్డార్కిడ్స్ కి 227 00:35:42,476 --> 00:35:44,811 ఎగిరే పక్షులను వేటాడటం కష్టం అయి ఉండచ్చు. 228 00:35:46,563 --> 00:35:48,690 అవి వేటాడటానికి వేరే మార్గం ఉండి ఉండవచ్చు. 229 00:35:50,609 --> 00:35:54,988 అజ్డార్కిడ్ టెరోసార్స్ ఆహారాన్ని ఎలా పొంది ఉండేవన్న ఆలోచనలలో ప్రధానమైనది 230 00:35:54,988 --> 00:35:59,284 అవి స్కిమ్ ఫీడింగ్ అనే విచిత్రమైన పద్ధతిని అనుసరించేవని తెలుస్తోంది. 231 00:36:00,494 --> 00:36:04,706 ఈ రోజుల్లో, బ్లాక్ స్కిమ్మర్స్ వంటి పక్షులు ఆ విధంగా ఆహారాన్ని పొందుతున్నాయి. 232 00:36:06,291 --> 00:36:09,211 మీరు ఊహించలేనంత హాస్యాస్పదంగా అవి ఆహారాన్ని పొందుతుంటాయి. 233 00:36:09,211 --> 00:36:11,547 అవి కింది దవడని నీటి లోపలికి ఉంచి 234 00:36:11,547 --> 00:36:13,048 దాని ఆహారాన్ని ఈ విధంగా ఢీ కొడుతుంది. 235 00:36:14,967 --> 00:36:18,971 ఒక స్కిమ్మర్ మెడ హఠాత్తుగా ఏర్పడే ఎలాంటి ఒత్తిళ్లనయినా తట్టుకోగలిగేలా ఉంటుంది. 236 00:36:21,682 --> 00:36:25,811 కానీ అజ్డార్కిడ్స్ ఇటువంటి పద్ధతులు ఏవీ పాటించలేదని వాటి శిలాజాలు తెలియజేస్తున్నాయి. 237 00:36:27,104 --> 00:36:31,066 నిజానికి, నీటిలోకి వాటి కింది ముక్కుని జొప్పించడం వల్ల 238 00:36:31,066 --> 00:36:33,485 దాదాపుగా వాటి మెడలు విరిగిపోయే ప్రమాదం ఉండవచ్చు. 239 00:36:36,363 --> 00:36:38,532 అజ్డార్కిడ్ కి మరో అవకాశం లేదు. 240 00:36:39,908 --> 00:36:42,369 అది ఆహారం కోసం ఖచ్చితంగా భూమి మీదకి దిగవలసిందే. 241 00:36:45,998 --> 00:36:48,792 కానీ వేటాడటానికి అది అంత వేగంగా నడవగలిగేదా? 242 00:36:51,253 --> 00:36:54,423 ఆ పక్షులు కేవలం మెల్లగా నడవడం కన్నా మరేదయినా చేసేవి అని చెప్పడానికి 243 00:36:54,423 --> 00:36:57,551 సైంటిస్టులకు తగిన ఆధారాలు కావలసి వచ్చింది. 244 00:36:59,678 --> 00:37:04,057 ఆ ఆధారం ఆరు కోట్ల అరవై లక్షల సంవత్సరాల కిందటి పాద ముద్రల ద్వారా లభించింది. 245 00:37:06,059 --> 00:37:08,437 ఈ ప్రపంచంలో అతి పెద్ద టెరోసార్ పాద ముద్రలు 246 00:37:08,437 --> 00:37:10,355 అజ్డార్కిడ్ భారీ పక్షులు ఏర్పరచినవే. 247 00:37:11,273 --> 00:37:12,816 అది మాత్రమే మనకి తెలిసిన మంచి విషయం కాదు, 248 00:37:12,816 --> 00:37:15,903 అవి ఎంత సమర్థంగా నడిచేవో కూడా ఆ పాద ముద్రలు తెలియజేస్తున్నాయి. 249 00:37:15,903 --> 00:37:17,321 {\an8}దక్షిణ కొరియా 250 00:37:18,405 --> 00:37:20,073 ఆ పాద ముద్రలు మనకి ఏం వెల్లడిస్తాయంటే 251 00:37:20,073 --> 00:37:23,160 అవి తమ అవయవాలను తమ శరీరాల కిందే పట్టి ఉంచేవి, 252 00:37:24,536 --> 00:37:26,747 దాని ద్వారా అవి నిటారుగా నిలబడటానికి వీలు కలిగేది. 253 00:37:28,749 --> 00:37:30,250 వాటి పాదాలు మెత్తగా ఉండేవి. 254 00:37:32,252 --> 00:37:34,671 మిగతా చిన్న టెరోసార్స్ మాదిరిగా కాకుండా, 255 00:37:34,671 --> 00:37:38,175 వాటి పొడవైన కాళ్లు అవి పెద్ద అంగలు వేయడానికి ఉపయోగపడేవి. 256 00:37:40,385 --> 00:37:42,804 అజ్డార్కిడ్స్ పక్షులు విచిత్రంగా కనిపించే జంతువులే అయినా కూడా, 257 00:37:42,804 --> 00:37:44,139 అవి చాలా చాకచక్యంగా సంచరించగలిగేవి. 258 00:37:49,102 --> 00:37:53,315 అజ్డార్కిడ్స్ పక్షులు తమ పొడవైన భారీ కొంగ మాదిరి తలలతో కూడా 259 00:37:53,315 --> 00:37:55,526 భూమి ఉపరితలం మీద సమర్థంగా నడవగలిగేవి. 260 00:37:56,693 --> 00:37:59,071 అవి ఖచ్చితంగా వేట జంతువులే 261 00:37:59,071 --> 00:38:02,574 అందువల్ల అవి భూమి మీద నడుస్తూ మెడలు వంచి జంతువులని వేటాడేవి. 262 00:38:07,412 --> 00:38:08,830 మనం గుర్తుంచుకోవలసిన విషయం, ఏమిటంటే, 263 00:38:08,830 --> 00:38:11,333 దీని గొంతు వెడల్పు అర మీటరు ఉంటుంది. 264 00:38:11,333 --> 00:38:13,377 అంటే అది దాదాపు నా భుజాల వెడల్పు అంత. 265 00:38:14,253 --> 00:38:18,173 అవి గనుక ఈ రోజు జీవించి ఉంటే మనల్ని తేలికగా ఆహారంగా తినగలిగి ఉండేది. 266 00:38:22,553 --> 00:38:27,057 టెరోసార్స్ ఆకాశంలో ఎగురుతుంటే వీక్షించడం గొప్ప దృశ్యం అయి ఉండచ్చు. 267 00:38:31,228 --> 00:38:36,275 కానీ ఈ భారీ పక్షులు భూమి మీద కూడా మరింత ఆకర్షణీయంగా, భయానకంగా ఉండేవి కావచ్చు. 268 00:41:05,174 --> 00:41:07,176 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్