1 00:00:08,717 --> 00:00:10,552 {\an8}డైనోసార్లు మన భూగ్రహాన్ని పాలించాయి... 2 00:00:10,552 --> 00:00:12,179 {\an8}డేవిడ్ అటెన్బరో సమర్పణ 3 00:00:12,179 --> 00:00:14,806 {\an8}...దాదాపు పదిహేను కోట్ల సంవత్సరాల కాలం. 4 00:00:15,682 --> 00:00:18,727 అవి మన భూమిలో దాదాపు ప్రతి ప్రాంతాన్ని ఆక్రమించాయి 5 00:00:19,311 --> 00:00:23,148 ఇంకా మనం ఊహించగల ప్రతి రూపంలో, ప్రతి పరిమాణంలో అవి పుట్టుకొచ్చాయి. 6 00:00:24,358 --> 00:00:27,402 కొన్ని నిజంగా అసాధారణంగా ఉండేవి. 7 00:00:30,822 --> 00:00:34,535 టి. రెక్స్ చాలా గొప్పగా ఈదగలుగుతుందని, 8 00:00:36,787 --> 00:00:40,082 వెలోసిరాప్టర్స్ చాలా కుతంత్రాలు పన్నుతాయని, ఈకలు ఉన్న వేట జంతువులని, 9 00:00:42,000 --> 00:00:45,963 అలాగే కొన్ని డైనోసార్స్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాయని మనకి ఇప్పుడు తెలిసింది. 10 00:00:48,841 --> 00:00:52,594 కానీ దాదాపు ప్రతి రోజూ చోటు చేసుకుంటున్న కొత్త ఆవిష్కరణలు 11 00:00:52,594 --> 00:00:57,641 మన గ్రహం మీద ఆరు కోట్ల అరవై లక్షల సంవత్సరాల కిందట జీవనం ఎలా ఉండేదో మనకి తెలియజేస్తున్నాయి. 12 00:01:02,604 --> 00:01:05,482 ప్రీహిస్టారిక్ ప్లానెట్ లో ఈసారి, 13 00:01:05,482 --> 00:01:08,026 మేము కొత్త జంతువులను వెల్లడించబోతున్నాము... 14 00:01:09,403 --> 00:01:13,740 ఇంకా అవి తమ భాగస్వాములను అన్వేషించే పద్ధతుల గురించి, 15 00:01:15,576 --> 00:01:18,203 కుటుంబాన్ని పెంచి పోషించుకునే క్రమంలో అవి ఎదుర్కొనే సవాళ్ల గురించి... 16 00:01:19,496 --> 00:01:21,415 ఇంకా వాటి అసాధారణ పోరాటాల గురించి కొత్త విషయాలు వెల్లడించబోతున్నాం. 17 00:01:29,506 --> 00:01:33,969 ప్రకృతి ఎన్నో అత్యద్భుత ఘట్టాలను ప్రదర్శించిన ఆ కాలానికి ప్రయాణిద్దాం. 18 00:01:37,514 --> 00:01:41,727 ఇది Prehistoric Planet 2. 19 00:01:54,740 --> 00:02:00,037 బంజరు భూములు 20 00:02:00,037 --> 00:02:07,044 భూమి మీద దాదాపు పది కోట్ల సంవత్సరాలలో ఇదే అతిపెద్ద లావా విస్ఫోటనం కావచ్చు. 21 00:02:09,755 --> 00:02:12,633 ఇది భారతదేశం మధ్య ప్రాంతంలో ఉన్న డెక్కన్ పీఠభూమి, 22 00:02:14,176 --> 00:02:15,594 ఇది ఒక నరకప్రాయమైన ప్రదేశం 23 00:02:16,678 --> 00:02:20,349 అందుకే డైనోసార్లు ఇక్కడ ఉంటాయని మనం ఖచ్చితంగా ఊహించము. 24 00:02:22,559 --> 00:02:26,897 అయినా కూడా, భారీ జంతువులు వాటి ప్రాణాలకు తెగించి ఇక్కడికి ప్రయాణిస్తాయి. 25 00:02:35,697 --> 00:02:37,157 ఐసిసార్స్. 26 00:02:40,661 --> 00:02:42,996 ఇంకా అవన్నీ ఆడ జంతువులే. 27 00:02:55,259 --> 00:02:59,388 డెక్కన్ భూములలో చాలా కాలంగా లావా ప్రవహిస్తూనే ఉంది 28 00:02:59,388 --> 00:03:02,558 అది కొన్ని ప్రదేశాలలో అయితే, మైలు దూరం వ్యాపించి ఉంది. 29 00:03:17,239 --> 00:03:21,869 ప్రతి సంవత్సరం వసంత రుతువు సమయంలో, ఆడ జంతువులు అడవులలో తమ నివాసాలను వదిలి 30 00:03:21,869 --> 00:03:26,415 ఈ బంజరు భూములకు ప్రాణాంతకమైన ప్రయాణాన్ని సాగిస్తాయి. 31 00:03:44,975 --> 00:03:49,646 అప్పటికే చల్లబడి, గట్టిపడిన లావా మీదుగా అవి సురక్షితమైన మార్గాన్ని ఎంచుకుంటాయి... 32 00:03:52,733 --> 00:03:55,652 కానీ ఇక్కడ వేరే ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. 33 00:04:02,159 --> 00:04:08,332 ఇక్కడ వేడి గాలులకు తోడు, విషపూరితమైన కార్బన్ డైయాక్సైడ్ ఇంకా హైడ్రోజన్ సల్ఫైడ్ మిశ్రమాన్ని 34 00:04:08,332 --> 00:04:11,251 అగ్నిపర్వతం బయటకు కక్కుతూ ఉంటుంది. 35 00:04:14,463 --> 00:04:17,132 తెల్లవారుజామున చల్లని గాలులకు 36 00:04:17,132 --> 00:04:19,218 ఈ భారీ వాయువులు మట్టిలో ఇంకిపోయి 37 00:04:19,218 --> 00:04:23,096 పైకి కనిపించని ఒక గాఢమైన ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణాన్ని సృష్టిస్తాయి. 38 00:04:25,224 --> 00:04:28,352 వాటిని కొద్దిగా పీల్చుకుంటే చాలు, ప్రాణాలు పోతాయి. 39 00:04:32,272 --> 00:04:36,109 కానీ ఐసిసార్స్ కి ఇక్కడ ఒక కీలకమైన అనుకూలత ఉంటుంది. 40 00:04:38,153 --> 00:04:43,825 ఆ విషపదార్థాల వాతావరణాన్ని మించి వాటి పొడవైన తలలు పైకి ఉంటాయి. 41 00:04:55,587 --> 00:04:59,675 కానీ అది కూడా కష్టమయ్యే ప్రదేశం ఒకటి ముందుముందు రాబోతోంది. 42 00:05:07,975 --> 00:05:10,352 ఆ జంతువులు లోతట్టు ప్రదేశంలోకి ప్రవేశిస్తున్నాయి 43 00:05:10,352 --> 00:05:13,730 విషవాయువులు మరింత గాఢంగా ఉండే ప్రదేశం ఇది. 44 00:05:16,733 --> 00:05:21,572 ఈ ఆడ జంతువుల విషయంలో, ఏదో ఇప్పటికే తేడా జరిగిపోయింది. 45 00:05:26,201 --> 00:05:29,997 ఇంకా ఘోరం ఏమిటంటే, సూర్యుడు ఉదయించి వాతావరణాన్ని వేడెక్కించాడంటే, 46 00:05:29,997 --> 00:05:32,749 ఈ గాలులు ఉపరితలం మీద మరింత పైకి తేలుతాయి. 47 00:05:37,963 --> 00:05:41,258 పొడవైన మెడలు కూడా ఈ జంతువులని ఇప్పుడు కాపాడలేవు. 48 00:05:46,471 --> 00:05:50,392 ఇవి వీలైనంత వేగంగా ఎత్తయిన ప్రదేశాలకు తరలి వెళ్లాలి. 49 00:05:57,524 --> 00:06:01,653 ఎత్తయిన కొండ ఎక్కడం కష్టమే కావచ్చు కానీ అది తాజా గాలుల్ని అందిస్తుంది. 50 00:06:16,168 --> 00:06:18,128 ఎట్టకేలకి కాస్త ఉపశమనం. 51 00:06:19,379 --> 00:06:22,758 ఇంకా ముందుకు వెళితే, వాటి చివరి గమ్యం చేరుకుంటాయి. 52 00:06:26,595 --> 00:06:29,598 ఆకాశంలో ఇది ఒక అగ్నిపర్వతపు ద్వీపం 53 00:06:31,266 --> 00:06:35,020 ఈ కఠినమైన బంజరు భూముల మధ్య ఎత్తయిన కొండగా రూపాంతరం చెందింది. 54 00:06:50,452 --> 00:06:56,416 ఈ భారీ బిలం, కల్డెరా, ఈ ఆడ జంతువులు గుడ్లు పొదగడానికి క్షేమమైన ప్రదేశంగా మారింది. 55 00:06:57,960 --> 00:07:03,340 ఈ బిలం చుట్టూ ఆవరించిన విషవాయువుల వల్ల వేట జంతువులు ఈ దరిదాపుల్లోకి రాలేవు... 56 00:07:06,552 --> 00:07:12,182 ఇంకా ఆ వెచ్చని భూమి ఉపరితలం పుట్టబోయే పసికూనలకు ఇంక్యుబేటర్ గా ఉపయోగపడుతుంది. 57 00:07:27,698 --> 00:07:32,452 ప్రతి తల్లి డైనోసార్ ఈ వెచ్చని ఇసుకలోకి ఏడు అడుగుల లోతు గొయ్యిని తవ్వుతుంది 58 00:07:32,452 --> 00:07:36,832 ఆ తరువాత పుచ్చకాయ సైజు ఉండే పెద్ద గుడ్లు ఇరవై వరకూ ఆ గోతిలో పెడుతుంది. 59 00:07:44,464 --> 00:07:47,718 అగ్నిపర్వతపు బిలంలో ఆ గుడ్లు ఇప్పటికి క్షేమం, 60 00:07:47,718 --> 00:07:51,221 కానీ వాటి కథకి ఇది ఆరంభం మాత్రమే. 61 00:07:53,724 --> 00:07:54,933 కొద్ది నెలలలో, 62 00:07:54,933 --> 00:08:00,022 వందల కొద్దీ పసికూనలు గుడ్లు పొదుగుకుని ఈ నిర్జన ప్రదేశంలోకి వస్తాయి. 63 00:08:02,191 --> 00:08:04,276 అవి ఇక్కడ మనుగడ సాగించాలంటే, 64 00:08:04,276 --> 00:08:07,988 సరిగ్గా ఆ సమయానికి వాతావరణంలో మార్పులు రావాలి. 65 00:08:22,085 --> 00:08:25,422 చరిత్ర పూర్వపు భూగ్రహం మీద బంజరు భూములు 66 00:08:25,422 --> 00:08:28,800 డైనోసార్ల సత్తాని కూడా తీవ్రంగా పరీక్షించేవి. 67 00:08:35,640 --> 00:08:37,768 ఈ విచిత్రమైన ప్రకృతి దృశ్యం 68 00:08:37,768 --> 00:08:41,813 ఈదురు గాలులు ఇంకా విస్తారమైన ప్రాచీన నదుల వల్ల ఇలా రూపాంతరం చెంది 69 00:08:41,813 --> 00:08:44,483 జీవం లేనిదిగా మనకి కనిపిస్తుంది. 70 00:08:52,658 --> 00:08:53,992 కానీ ఆసియా ఖండంలో ఇక్కడ, 71 00:08:54,743 --> 00:08:56,995 ఈ ఇరుకైన లోతయిన లోయలలో... 72 00:09:00,457 --> 00:09:05,504 వెలోసిరాప్టర్ల కొత్త కుటుంబం ఒకటి దాగి ఉంది. 73 00:09:14,346 --> 00:09:17,224 ఈ పసికూనల వయస్సు కొద్ది వారాలు మాత్రమే. 74 00:09:43,417 --> 00:09:50,007 ఇటువంటి బంజరు భూమిలో, వాటి భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించవచ్చు. 75 00:09:52,384 --> 00:09:58,390 వాటి మనుగడ ఒక విచిత్రమైన ఘట్టం మీద ఆధారపడి ఉంది, అయితే అది ఇక్కడ కాదు, వాటి స్వస్థలానికి కొన్ని మైళ్ల దూరంలో. 76 00:10:04,021 --> 00:10:09,651 ఈ ఉడుకెత్తించే ఎడారిలో సుదూరంగా ఇసుక తిన్నెల మధ్య ఒక అడవి ఉంది. 77 00:10:11,987 --> 00:10:16,200 రుతువులు మారినప్పుడు అరుదైన నీరు ఈ ప్రాంతానికి వచ్చి చేరుతుంది. 78 00:10:19,286 --> 00:10:21,580 పొడవుగా పెరిగిన చెట్లు 79 00:10:21,580 --> 00:10:25,250 తాజాగా దట్టంగా మొలిచిన మంచి పోషకాలు ఉన్న ఆకులతో ఇప్పుడు కళకళలాడుతున్నాయి. 80 00:10:28,545 --> 00:10:31,548 ఆకలితో అలమటిస్తున్న చాలా జంతువులని ఆకర్షించే అయస్కాంతాలు ఇవి. 81 00:10:38,555 --> 00:10:44,186 పొడవైన మెడలు ఉన్న నెమెగ్టొసార్స్ ఇంకా మంగోలియన్ టైటనోసార్స్ ఇక్కడ కలుస్తాయి... 82 00:10:55,197 --> 00:10:57,950 ఇంకా వాటితో పాటు, చాలా చిన్న జంతువులైన ప్రెనోసెఫలీ కూడా చేరుతున్నాయి. 83 00:11:05,958 --> 00:11:08,001 కానీ వాటి దారికి ఒకటి మాత్రం అడ్డుగా నిలుస్తోంది. 84 00:11:13,924 --> 00:11:15,926 ఈ విస్తారమైన పీఠభూమి. 85 00:11:21,974 --> 00:11:27,145 ఆ అడవిని చేరడానికి ఒకే ఒక్క మార్గం, ఈ చిక్కు దారుల లోయల గుండా ప్రయాణించడమే. 86 00:11:37,281 --> 00:11:40,951 అవి ఇక్కడికి ప్రవేశించడంతోనే, ఆ గుంపులో భయం మొదలవుతుంది. 87 00:11:45,998 --> 00:11:49,334 ఆకస్మిక దాడులకి ఇది అనువైన ప్రదేశం. 88 00:11:59,303 --> 00:12:01,763 వెలోసిరాప్టర్లు ఇక్కడ వేచి ఉన్నాయి. 89 00:12:10,272 --> 00:12:13,233 కానీ అవి ఒక టైటానోసార్ ని బహుశా ఎదుర్కోలేకపోవచ్చు. 90 00:12:15,777 --> 00:12:20,449 విజయం అనేది మిగతా వేట జంతువులు చేసే దాడుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. 91 00:13:04,409 --> 00:13:05,786 టార్బోసార్స్. 92 00:13:11,917 --> 00:13:16,296 ఇది టైరనోసారస్ రెక్స్ కి ఆసియా రూపం. 93 00:13:23,387 --> 00:13:27,224 వేట జంతువులు దగ్గరకు వస్తున్న కొద్దీ, భయం ఎక్కువ అవుతుంది. 94 00:13:47,327 --> 00:13:51,164 కేవలం ప్రెనోసెఫలీ మాత్రమే ఎత్తయిన ప్రదేశాలకు తప్పించుకుని పోగలవు. 95 00:13:57,421 --> 00:14:01,258 సరిగ్గా వీటి కోసమే వెలోసిరాప్టర్లు వేచి ఉన్నాయి. 96 00:14:09,850 --> 00:14:14,354 ఇప్పుడు, వెలోసిరాప్టర్లు మెరుపుదాడికి దిగాయి. 97 00:14:23,238 --> 00:14:24,239 మొత్తానికి సాధించాయి. 98 00:14:27,618 --> 00:14:32,080 కలిసికట్టుగా దాడి చేసి, అవి తమ మొత్తం కుటుంబానికి ఆహారాన్ని సంపాదించగలిగాయి. 99 00:14:38,921 --> 00:14:41,715 టార్బోసార్స్ కూడా ఇక్కడ విజయం దక్కించుకున్నాయి. 100 00:14:44,343 --> 00:14:47,888 ఈ వేట జంతువులకు, ఇది నిజానికి మంచి సమయం. 101 00:14:52,643 --> 00:14:57,981 అలాగే వెలోసిరాప్టార్లకు, ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకోవడానికి ఇది అనువైన సమయం. 102 00:15:13,622 --> 00:15:18,293 తమని బాధ్యతగా చూసుకునే తెలివైన తల్లిదండ్రులు తమ పసికూనలకు మంచి ఆరంభాన్ని ఇవ్వగలుగుతాయి. 103 00:15:20,295 --> 00:15:22,464 ఆసియాలో ఉన్న ఈ బంజరు భూములలో, 104 00:15:22,464 --> 00:15:26,635 వీటిని మించి తమ పిల్లల్ని బాధ్యతగా చూసుకునే డైనోసార్లు మరికొన్ని ఉన్నాయి. 105 00:15:28,846 --> 00:15:32,140 ఇది గుడ్లు పొదుగుతున్న కోరిథొరాప్టర్ల కాలనీ. 106 00:15:40,274 --> 00:15:45,529 కొద్ది రోజుల కిందటే, ఈ గుండ్రని మట్టి దిబ్బల మీద ఆడ జంతువులు గుడ్లు పెట్టాయి. 107 00:15:50,701 --> 00:15:54,413 కానీ వాటిని పొదిగే బాధ్యత మగ జంతువులదే. 108 00:15:57,249 --> 00:15:59,126 పైగా అది అంత తేలికయిన పని కాదు. 109 00:16:13,682 --> 00:16:18,854 మధ్యాహ్నం సూర్యుడి వేడికి ఈ గుడ్లు ఉడికిపోయే ప్రమాదం ఉంది. 110 00:16:25,986 --> 00:16:29,990 కానీ ఈ తండ్రులు వాటి విశాలమైన తోకల్ని ఇంకా వాటి రెక్కల ఈకల్ని అడ్డు పెట్టి 111 00:16:29,990 --> 00:16:31,742 ఆ గుడ్ల గూడుకి నీడనిస్తాయి. 112 00:16:36,205 --> 00:16:37,706 అందుకు అవి భారీ మూల్యం చెల్లించుకుంటాయి. 113 00:16:40,876 --> 00:16:45,005 మండే ఉష్ణోగ్రతలో గంటల తరబడి అవి ఓర్చుకుని నిలబడాలి. 114 00:17:21,124 --> 00:17:26,839 ఎట్టకేలకు, సాయంత్రం కాస్త చల్లబడిన తరువాత, ఆ మగ జంతువులు ఆహారం కోసం కాసేపు బయటకు వస్తాయి. 115 00:17:30,300 --> 00:17:34,012 ఇలాంటి సమయంలోనే ఒకే ప్రదేశంలో గుడ్లు పొదగడం అనేది కొన్ని ప్రయోజనాలని అందిస్తుంది. 116 00:17:37,474 --> 00:17:42,104 ఈ మగ జంతువులన్నీ ఒకేసారి ఆహారానికి వెళ్లే బదులు, కోరిథొరాప్టర్లు వంతుల వారీగా వెళ్లి వస్తాయి. 117 00:17:45,524 --> 00:17:49,319 అందువల్ల, ఎప్పుడూ ఒక పొరుగు జంతువు ఆ గుడ్లకు ఏమీ కాకుండా రక్షణగా ఉంటుంది. 118 00:17:52,489 --> 00:17:57,369 కానీ ఇలా పొరుగు జంతువులు గమనిస్తున్నా ఆ గుడ్లు భద్రంగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేము. 119 00:18:12,593 --> 00:18:17,347 ఈ ఆడ జంతువు కురు కుల్లా, ఇది వెలోసిరాప్టర్ల బంధువు. 120 00:18:18,807 --> 00:18:21,560 ఇది విపరీతంగా ఆకలి మీద ఉంది 121 00:18:21,560 --> 00:18:25,063 కానీ ఇది కోరిథొరాప్టర్ల బలమైన ముక్కులు ఇంకా పంజాలని చూసి జంకుతోంది. 122 00:18:31,320 --> 00:18:34,156 కానీ దీనికి అనుకూలమైన అంశం ఒకటి ఉంది. 123 00:18:37,367 --> 00:18:42,039 రాత్రి వేళ దాని కంటి చూపు ఆ గుడ్ల తండ్రుల చూపు కన్నా మెరుగ్గా ఉంటుంది. 124 00:18:50,380 --> 00:18:55,761 తను నిశ్శబ్దంగా ఉంటే, ఆ గుడ్ల ప్రదేశంలోకి ఎవరి కంటా పడకుండా ప్రవేశించగలుగుతుంది. 125 00:18:58,847 --> 00:19:01,266 అది తన లక్ష్యాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటుంది. 126 00:19:17,324 --> 00:19:19,243 ఇదే ఆ ఆడ కురు కుల్లాకి మంచి అవకాశం. 127 00:19:26,458 --> 00:19:28,001 కానీ అది దాడి చేయకూడదు. 128 00:19:30,003 --> 00:19:33,632 ఈ వేట జంతువు ఒక దొంగ. 129 00:20:05,539 --> 00:20:09,376 ఇది వీలైనంత వేగంగా చాలా గుడ్లని తినేయగలదు. 130 00:20:18,886 --> 00:20:21,555 దాని సమయం అయిపోయింది. ఆ ఆడ జంతువుని అవి కనిపెట్టేశాయి. 131 00:20:23,724 --> 00:20:25,809 చివరిగా ఒక గుడ్డుని అది తీసుకుపోతోంది. 132 00:20:50,250 --> 00:20:54,796 తను దొంగిలించి తెచ్చుకున్న గుడ్డుని ఇప్పుడు ఇది ప్రశాంతంగా తినగలుగుతోంది. 133 00:20:59,927 --> 00:21:03,222 కానీ ఈ దొంగ తను దొంగిలించినవి దాని పిల్లలతో కలిసి పంచుకుంటుంది. 134 00:21:05,057 --> 00:21:10,062 గుర్రుమంటూ ఈ జంతువు శబ్దాలు చేస్తూ, తన పిల్లల్ని పిలుస్తోంది. 135 00:21:27,454 --> 00:21:31,124 ఈ పసికూనలు తమ గూడు వదిలి స్వయంగా బయటకి రాలేవు. 136 00:21:39,424 --> 00:21:43,679 ఈ కొత్త వస్తువు తమ ఆహారమే అని అవి తెలుసుకోవాలి. 137 00:21:45,848 --> 00:21:48,433 ఆ గుడ్డుని ఎలా బద్దలు కొట్టాలో అవి నేర్చుకోవాలి. 138 00:21:55,148 --> 00:22:01,446 బహుశా వాటి ముక్కుతోనో లేదా పంజాతోనో ఆ పని చేయాలి. 139 00:22:21,508 --> 00:22:27,139 సాధించాయి, కానీ వాటి నేర్పరితనం కన్నా ఎక్కువగా అది అదృష్టంతో జరిగిందనే చెప్పాలి. 140 00:22:29,391 --> 00:22:35,355 అయినా కూడా, ఈ గుడ్ల దొంగల తరువాతి తరానికి ఇది ఒక కీలకమైన పాఠం. 141 00:22:44,740 --> 00:22:47,951 ఈ బంజరు భూములలో, చల్లని రాత్రుళ్లు ఇచ్చే స్వాంతన ముగిసిపోయి 142 00:22:47,951 --> 00:22:53,624 ఉదయించే సూర్యుడి భగభగమండే కిరణాలతో వాతావరణం వేడెక్కిపోతుంది. 143 00:22:57,669 --> 00:23:04,676 ఈ ఇసుక తిన్నెల మీద ఉష్ణోగ్రత దాదాపు 71 సెల్సియస్ వరకూ చేరుకోగలదు. 144 00:23:07,888 --> 00:23:12,392 ఇక్కడ ఎక్కడైనా తడి ఉంటే అది ఇంకిపోతుంది లేదా క్షణాలలో ఆవిరి అయిపోతుంది. 145 00:23:14,853 --> 00:23:18,899 భూమి మీద అత్యంత పొడి ప్రదేశాలలో ఇది ఒకటి. 146 00:23:30,744 --> 00:23:34,289 నీళ్లు లేకుండా, ఏ జంతువు జీవించలేదు. 147 00:23:37,042 --> 00:23:40,546 అయినా కూడా చిన్న టార్చియా జంతువులకి ఇది నివాస స్థలం. 148 00:23:50,222 --> 00:23:53,433 ఇవి ఎడారులలో జీవించే అంకైలాసార్స్. 149 00:23:59,690 --> 00:24:03,360 పొడవైన, ముళ్లతో ఉండే తోకలు ఈ జంతువులకి ఆయుధాలుగా ఉంటాయి. 150 00:24:07,656 --> 00:24:12,536 టార్చియాల శరీరం మీద ఉండే నల్లని పెచ్చులు, మండే సూర్యుడి నుండి వాటి కళ్లని కాపాడతాయి. 151 00:24:22,796 --> 00:24:25,174 ఇక ఈ శబ్దం 152 00:24:25,174 --> 00:24:28,343 టార్చియాకి మాత్రమే సొంతమైన ప్రత్యేకమైన ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ. 153 00:24:30,596 --> 00:24:34,683 అవి శ్వాస విడిచినప్పుడు, వాటి పొడవైన ముక్కులు ఆ గాలిని చల్లబరుస్తాయి, 154 00:24:34,683 --> 00:24:39,229 తద్వారా ప్రతి శ్వాసతోనూ అవి నీటి ఆవిర్లని నీరుగా మార్చుకుని భద్రపర్చుకోగలుగుతాయి. 155 00:24:43,984 --> 00:24:48,488 అందువల్ల నీళ్లు తాగకపోయినా ఆహారం కోసం అన్వేషించే సమయంలో 156 00:24:48,488 --> 00:24:50,157 సుదీర్ఘమైన కాలంపాటు అవి మనుగడ సాగించగలుగుతాయి. 157 00:24:54,494 --> 00:24:58,415 ఇక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ఈదురు గాలులు ఏర్పడి 158 00:24:58,415 --> 00:25:01,793 ఈ రాళ్ల ఆకృతుల్ని అసాధారణంగా మలుస్తాయి. 159 00:25:05,964 --> 00:25:08,509 కానీ అవి నేలపై ఇసుకను నెట్టేస్తాయి కూడా. 160 00:25:12,471 --> 00:25:17,226 కొన్ని మొక్కలు, ఏదో విధంగా, ఆ రాళ్ల పగుళ్ల మధ్య నుంచి ఎలాగో మొలకెత్తి ఎదుగుతాయి. 161 00:25:24,191 --> 00:25:27,110 కొద్దిగా నోటికి అందే ఆహారం ఏదైనా పోటీ పడటానికి అర్హమైనదే. 162 00:25:43,627 --> 00:25:46,880 ప్రతి నిమిషం గడుస్తున్న కొద్దీ, సూర్యుడు మరింత పైకొస్తాడు. 163 00:25:48,715 --> 00:25:51,051 త్వరలో, ఎక్కడా నీడ అనేది ఉండదు. 164 00:25:54,096 --> 00:25:59,768 ఈ ఎడారి జంతువులు సైతం అప్పుడప్పుడు నీళ్లు తాగాలని ఆశిస్తాయి. 165 00:26:05,983 --> 00:26:07,442 చాలా సంచార జాతుల మాదిరిగానే, 166 00:26:07,442 --> 00:26:10,571 టార్చియా కి కూడా ఎడారి పరిధుల గురించి మనసులోనే ఒక మ్యాప్ ఉంటుంది 167 00:26:11,196 --> 00:26:15,951 అందువల్ల ఇవి ఈ ఖాళీ ప్రదేశాలలో సైతం ఖచ్చితమైన స్పష్టతతో తమ గమ్యాలని చేరుకోగలవు. 168 00:26:22,165 --> 00:26:27,004 అరుదైన, సహజమైన నీటి మడుగులు ఎక్కడ ఉంటాయో అవి గుర్తు పెట్టుకోగలవు. 169 00:26:31,675 --> 00:26:34,303 ఎడారిలో ఇటువంటి ఒయాసిస్ లని. 170 00:26:39,308 --> 00:26:42,269 ఆ ఒయాసిస్ లని అన్వేషించగల జంతువులకి ఇవి ప్రాణాలు నిలుపుతాయి. 171 00:26:49,484 --> 00:26:50,527 ప్రెనోసిఫలీ. 172 00:27:17,054 --> 00:27:20,641 ఒయాసిస్ పరిసరాలలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడతాయి... 173 00:27:24,353 --> 00:27:28,440 కానీ ఈ జంతువుల బలప్రదర్శనల వల్ల ఒక ప్రమాదకరమైన యుద్ధం నివారించబడుతుంది. 174 00:27:38,492 --> 00:27:42,538 ఎట్టకేలకు, ప్రెనోసిఫలీలతో పెద్దగా ప్రమాదం లేదు. 175 00:27:47,835 --> 00:27:50,879 కానీ పెద్ద వయసులో ఉన్న టార్చియా ఎదురుపడితే అది మరింత ప్రమాదకరం. 176 00:27:57,010 --> 00:28:01,056 ముఖ్యంగా చిన్న టార్చియాలతో పోలిస్తే అవి బరువులో రెండింతలు ఉంటాయి. 177 00:28:13,819 --> 00:28:17,698 దీని తోక చివర గడ్డ దాదాపు 23 కిలోల బరువు ఉంటుంది. 178 00:28:27,624 --> 00:28:32,087 ఇది గనుక కొట్లాటకి దిగితే, చిన్న టార్చియా గెలవలేదు. 179 00:28:46,727 --> 00:28:50,397 కానీ అదనపు బలగాలు వచ్చేస్తున్నాయి. 180 00:28:56,987 --> 00:28:59,698 ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకటయ్యారు. 181 00:29:02,993 --> 00:29:07,748 ఇప్పుడు ఆ పెద్ద టార్చియా రెండు తోకల దెబ్బలకి సిద్ధపడాలి. 182 00:29:21,303 --> 00:29:25,098 ఇక్కడ అందరూ తాగడానికి సరిపడా నీరు ఉంది 183 00:29:25,098 --> 00:29:26,850 ఈ పెద్ద జంతువు ఒక నిర్ణయానికి వచ్చింది. 184 00:29:46,787 --> 00:29:50,332 చిన్న టార్చియా జంతువు ఇక ప్రశాంతంగా ఆ నీటిని తాగచ్చు. 185 00:29:55,754 --> 00:29:59,383 కానీ అవి తమ విశ్రాంత సమయాన్ని ఎక్కువ సేపు గడిపే అవకాశం కనిపించడం లేదు. 186 00:30:04,680 --> 00:30:09,393 ఈ బంజరు భూములలో, వాతావరణంలో మార్పులు సంభ్రమం గొలిపే వేగంతో మారిపోతుంటాయి. 187 00:30:16,441 --> 00:30:20,654 తీవ్రమయ్యే వేసవి ఉష్ణోగ్రతల వల్ల 188 00:30:20,654 --> 00:30:22,281 వందల మైళ్ల విస్తీర్ణంలో మెరుపు తుఫానులు ఏర్పడతాయి. 189 00:30:26,660 --> 00:30:31,999 ఈ డెక్కన్ పీఠభూములలో, ఈ సీజనల్ తుఫానుల వల్ల గాలి గమనం మారిపోతుంటుంది. 190 00:30:33,542 --> 00:30:35,419 ఇంకా అగ్నిపర్వతపు బిలం చుట్టూ 191 00:30:35,419 --> 00:30:39,590 కొద్ది నెలల కిందట ఐసీసార్ ఆడ జంతువులు గుడ్లు పెట్టిన ప్రదేశంలో, 192 00:30:39,590 --> 00:30:42,676 విషవాయువులు ఇప్పుడు మళ్లిపోయాయి, 193 00:30:43,260 --> 00:30:46,305 దీనితో గుడ్లు పొదగడానికి ఒక చక్కని అవకాశం ఏర్పడింది. 194 00:30:57,524 --> 00:31:01,820 ఇసుక లోపలి నుండి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. 195 00:31:03,155 --> 00:31:07,618 పసికూనలైన ఐసిసార్స్ గుడ్ల లోపలే ఉండి ఒకరినొకరు పిలుచుకుంటున్నాయి. 196 00:31:09,494 --> 00:31:11,914 ఈ ప్రక్రియ గుడ్లు ఏకకాలంలో పొదగడానికి ఉపయోగపడుతుంది. 197 00:31:51,036 --> 00:31:55,457 ఈ పసికూనలు చాలా చిన్నవి, దాదాపు అడుగు పొడవు కూడా ఉండవు. 198 00:32:01,129 --> 00:32:05,551 వాటి తల్లులు విడిచిన పేడ తప్ప అక్కడ అవి తినడానికి మరే ఆహారం లేదు. 199 00:32:08,512 --> 00:32:09,763 ఆశ్చర్యకరంగా, 200 00:32:09,763 --> 00:32:15,853 ఆ పేడ చాలా పోషకాలతో ఉండటమే కాకుండా ఆ పసికూనలకి మరికొన్ని విధాలుగా కూడా ప్రయోజనకరమైనది. 201 00:32:20,607 --> 00:32:24,361 అది వాటి పేగులకి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని అందిస్తుంది, 202 00:32:24,361 --> 00:32:28,615 అంతే కాకుండా, ఆ పేడలోని ఫిరోమోన్లు, ఒక విధమైన వాసన అందించి, 203 00:32:28,615 --> 00:32:31,159 వాటి తల్లుల గుంపు ఎక్కడ ఉందో కనుక్కునేలా చేస్తుంది. 204 00:32:35,330 --> 00:32:38,542 అడవిలో సురక్షితమైన ప్రదేశానికి ఆ పసికూనలకు ఆ వాసన తోడ్పడుతుంది. 205 00:32:52,723 --> 00:32:54,975 కానీ ఆ ప్రయాణం అంత తేలిక కాదు. 206 00:33:00,689 --> 00:33:03,567 గాలులు వాటికి అనుకూలంగా మారి ఉండవచ్చు, 207 00:33:05,027 --> 00:33:09,573 కానీ ఈ చిన్నారి ఐసిసార్స్ కి ముందు ముందు చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. 208 00:33:15,204 --> 00:33:19,499 వేడి నీటి చెలమలు ఇంకా బుడగలు ఎగజిమ్మే బురద మడుగులు. 209 00:33:22,002 --> 00:33:23,587 ఇది ప్రాణాంతకమైన ఉచ్చు. 210 00:33:56,453 --> 00:33:58,956 రెండు రోజుల పాటు కొండల మీదికి ప్రయాణించాక, 211 00:33:58,956 --> 00:34:01,792 ఆ పసికూనలలో సత్తువ సన్నగిల్లుతోంది, 212 00:34:04,461 --> 00:34:07,339 కానీ వాటి తల్లులు ఇప్పుడు మళ్లీ వాటిని ఆదుకుంటున్నాయి. 213 00:34:09,591 --> 00:34:12,886 బీటలు వారిన లావా మధ్య నుండి చిన్న మొక్కలు మొలిచాయి, 214 00:34:13,719 --> 00:34:17,516 ఇవి ఆ తల్లులు వేసిన పేడలోని విత్తనాల ద్వారా మొలిచినవి. 215 00:34:25,524 --> 00:34:28,277 కానీ మరొక ప్రమాదం వాటి వైపు వస్తోంది. 216 00:34:31,154 --> 00:34:37,661 ఇక ఆ ప్రాంతంలో విషవాయువులు మళ్లిపోవడంతో, వేట జంతువులకు వాతావరణం అనుకూలంగా మారింది. 217 00:34:40,789 --> 00:34:42,123 దీని పేరు రాజాసార్. 218 00:34:47,880 --> 00:34:52,885 చాలా పసికూనలు ఇలా బాహాటంగా రావడంతో, దీనికి చక్కని విందు దొరికింది. 219 00:35:13,071 --> 00:35:17,201 ఆ లావాలోని బీటలలోనే ఆ పసికూనలు ఇక దాక్కోవాలి. 220 00:36:09,336 --> 00:36:11,755 మరిన్ని రాజాసార్స్ అక్కడికి చేరుకున్నాయి. 221 00:37:26,747 --> 00:37:31,877 ఇంతటి ప్రమాదాల మధ్య కూడా, వందల కొద్దీ పసికూనలు విజయవంతంగా అడవికి చేరుకున్నాయి. 222 00:37:35,506 --> 00:37:40,385 ఇక్కడ, అవి కలిసికట్టుగా పొదల మధ్య చాలా సంవత్సరాల పాటు దాక్కుని జీవిస్తాయి. 223 00:37:46,183 --> 00:37:47,518 మొత్తానికి అవి 224 00:37:47,518 --> 00:37:50,562 పెద్దగా ఎదిగి తమ తల్లుల గుంపులోకి చేరేవరకూ అక్కడే జీవిస్తాయి. 225 00:38:00,989 --> 00:38:05,577 అదృష్టం ఉంటే, వాటిల్లోని ఆడ జంతువులు మళ్లీ కొన్ని సంవత్సరాల తరువాత 226 00:38:05,577 --> 00:38:09,581 గుడ్లు పెట్టడానికి ఈ అగ్నిపర్వతపు బిలానికి తిరిగి వస్తాయి. 227 00:38:12,376 --> 00:38:16,380 మనుగడ సాగించడానికి కష్టమైన ఇటువంటి ప్రదేశాలలో జీవించే చాలా జంతువుల మాదిరిగా, 228 00:38:16,380 --> 00:38:18,257 ఇవి కూడా ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటాయి. 229 00:38:22,511 --> 00:38:29,518 చరిత్ర పూర్వపు భూగ్రహంలో బంజరు భూములలో ఎన్నో గొప్ప అవకాశాలు కూడా ఉండేవి. 230 00:38:34,147 --> 00:38:40,571 Prehistoric Planet: ఆవిష్కరణ 231 00:38:40,571 --> 00:38:43,866 డైనోసార్లు మంచి తల్లిదండ్రులా? 232 00:38:44,825 --> 00:38:48,829 ఒక భారీ డైనోసార్ కి చెందిన గుడ్డు శిలాజం ఇది. 233 00:38:48,829 --> 00:38:50,247 ఇది టైటానోసార్ గుడ్డు. 234 00:38:50,998 --> 00:38:52,457 దీనిని తాజాగా పెట్టినప్పుడు, 235 00:38:52,457 --> 00:38:55,752 ఇది సుమారుగా కిలోన్నర బరువు ఉండేది కావచ్చు, 236 00:38:55,752 --> 00:38:59,381 ఇంకా దీని పెంకు రెండు మిల్లీమీటర్ల మందంగా ఉండి ఉండచ్చు. 237 00:39:02,384 --> 00:39:04,845 ఈ గుడ్లు ఖచ్చితంగా గట్టివే కావచ్చు, 238 00:39:06,221 --> 00:39:08,682 అయినా కూడా వాటిని భద్రంగా, వెచ్చగా ఉంచడం అవసరం అయ్యేది. 239 00:39:12,644 --> 00:39:16,106 అయితే మరి డైనోసార్లు వాటి గుడ్లని ఎలా జాగ్రత్తగా చూసుకునేవి? 240 00:39:19,276 --> 00:39:21,361 వేట జంతువుల నుండి తమ గుడ్లని కాపాడుకోవడం కోసం 241 00:39:21,361 --> 00:39:24,489 {\an8}ఇంకా ఆ గుడ్లకి వెచ్చదనం అందించడం కోసం డైనోసార్లు చాలా వ్యూహాలు రచించేవి. 242 00:39:24,489 --> 00:39:25,991 {\an8}డాక్టర్ డారెన్ నయీష్ ప్రధాన సైంటిఫిక్ సలహాదారు 243 00:39:25,991 --> 00:39:27,701 {\an8}వాటిలో ఒక వ్యూహం ఏమిటంటే 244 00:39:27,701 --> 00:39:30,037 {\an8}ఒక గూడు కట్టి ఆ గూడు మీద కూర్చోవడం. 245 00:39:31,663 --> 00:39:33,540 డైనోసార్లు ఈ పని చేసేవని మనకి ఖచ్చితంగా తెలిసింది 246 00:39:33,540 --> 00:39:38,837 ఎందుకంటే గూళ్ల మీద కూర్చున్న డైనోసార్ల శిలాజాలను మనం కనుగొన్నాం. 247 00:39:41,048 --> 00:39:45,719 ఈ గూళ్లలో ఉన్న పిల్లలు 248 00:39:45,719 --> 00:39:46,803 పెద్ద డైనోసార్ల జాతికి చెందినవే, 249 00:39:48,138 --> 00:39:49,681 అందువల్ల కొన్ని డైనోసార్లు 250 00:39:49,681 --> 00:39:53,268 తమ పిల్లలని భద్రంగా చూసుకునేవి అని ఇవి రుజువు చేస్తున్నాయి. 251 00:39:56,480 --> 00:40:00,234 వాతావరణం నుండి ఇవి రక్షణని, నీడని కల్పించినప్పటికీ, 252 00:40:00,901 --> 00:40:04,154 గుడ్లని ఈ విధంగా పొదగడంలో ఒక ప్రతికూల అంశం కూడా ఉండేది. 253 00:40:06,281 --> 00:40:09,034 ఒక గుడ్డు మీద కూర్చుని దానిని భద్రంగా చూసుకుంటున్నాయంటే 254 00:40:09,034 --> 00:40:12,871 ఆ గుడ్లు పొదగడానికి పట్టే సమయం అంతా కూడా అవి వాటి గుడ్లని జాగ్రత్తగా చూసుకోవడానికి 255 00:40:12,871 --> 00:40:14,623 బాధ్యత కలిగి ఉండేవని 256 00:40:14,623 --> 00:40:16,625 మనకి అర్థం అవుతోంది. 257 00:40:18,377 --> 00:40:21,755 కొన్ని డైనోసార్ల విషయంలో, అంతటి బాధ్యత తీసుకోవడం వల్ల ప్రయోజనం కనిపిస్తుంది. 258 00:40:25,759 --> 00:40:30,138 కానీ సౌరోపాడ్స్ లాంటి జంతువులు మరొక విధమైన సవాళ్లని ఎదుర్కొనేవి. 259 00:40:32,057 --> 00:40:34,434 కొన్ని డైనోసార్లు ఎప్పుడూ వాటి గుడ్ల మీద కూర్చుని ఉండకపోవచ్చు. 260 00:40:34,434 --> 00:40:36,520 {\an8}ఎందుకంటే, వీటిలో చాలా జంతువులు టన్నుల కొద్దీ బరువు ఉంటాయి... 261 00:40:36,520 --> 00:40:38,021 {\an8}ప్రొఫెసర్ పౌల్ బారెట్ నేచురల్ హిస్టరీ మ్యూజియమ్ 262 00:40:38,021 --> 00:40:41,066 {\an8}...అందువల్ల వాటిని పొదగడానికి కూర్చుని ఉంటే ఆ గుడ్లు చితికిపోయి ఉండేవి. 263 00:40:44,528 --> 00:40:46,405 అయితే మరి, దీనికి పరిష్కారం ఏమిటి? 264 00:40:49,199 --> 00:40:51,451 కొన్ని సౌరోపాడ్ గుడ్ల గుంపు ప్రదేశాలలో 265 00:40:51,451 --> 00:40:55,873 ఆడ జంతువు దాని వెనుక పాదంతో పెద్ద గోతులు తవ్వేది. 266 00:40:58,542 --> 00:41:02,671 ఆ గోతిలో గుడ్లు పెట్టి తరువాత ఆ గోతిని మట్టితో కప్పేసేది. 267 00:41:04,298 --> 00:41:06,717 ఈ రకమైన ప్రక్రియ ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. 268 00:41:07,885 --> 00:41:11,597 వేట జంతువుల నుంచి కాపాడుకోవడం కోసం తాబేళ్లు తమ గుడ్లని ఈ విధంగా పూడ్చిపెడతాయి, 269 00:41:12,723 --> 00:41:17,269 ఇంకా సూర్య రశ్మితో ఆ నేలలు వెచ్చగా ఉండి గుడ్లకు అనువైన వాతావరణాన్ని అందిస్తాయి. 270 00:41:19,396 --> 00:41:23,192 కానీ కొన్ని డైనోసార్లు తమ గుడ్లకి వెచ్చదనం అందించడం కోసం మరొక ఉపాయాన్ని అమలు చేసేవి. 271 00:41:25,068 --> 00:41:28,447 కొన్ని డైనోసార్ గుంపులు 272 00:41:28,447 --> 00:41:30,657 ఎండిన ఆకుల్ని కొమ్మలని ప్రత్యేకంగా సేకరించి గుట్టగా పేర్చేవి. 273 00:41:31,700 --> 00:41:36,079 అవి గుడ్లు పెట్టిన గూళ్ల మీద ఒక కంపోస్ట్ గుట్టని ఏర్పాటు చేసేవి. 274 00:41:38,415 --> 00:41:42,127 ఈ ప్రత్యేకమైన ప్రక్రియని ఆస్ట్రేలియాలోని బుష్ టర్కీలు ఇప్పటికీ ఉపయోగిస్తున్నాయి. 275 00:41:43,420 --> 00:41:45,339 ఆ ఆకులు ఎండుతూ, 276 00:41:45,339 --> 00:41:48,759 వాటి గుడ్లని పొదగడానికి అవసరమైన వేడిని 277 00:41:48,759 --> 00:41:50,677 దాదాపు ఏడు వారాల వరకూ విడుదల చేస్తాయి. 278 00:41:53,055 --> 00:41:55,724 కానీ 2010లో ఒక ఆవిష్కరణలో 279 00:41:56,517 --> 00:42:01,522 డైనోసార్లు తమ గుడ్లకి వెచ్చదనం కల్పించడం కోసం 280 00:42:01,522 --> 00:42:03,148 అసాధారణమైన పద్ధతులు అనుసరించేవని వెల్లడయింది. 281 00:42:04,858 --> 00:42:07,569 అవి భూమి నుండి వేడిని స్వయంగా ఉపయోగించుకునేవి. 282 00:42:09,488 --> 00:42:11,323 అర్జెంటీనాలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో 283 00:42:11,323 --> 00:42:13,700 సౌరోపాడ్ గుడ్ల క్షేత్రాలని కనుగొన్నారు, 284 00:42:13,700 --> 00:42:16,703 ఆ క్షేత్రాలు సరిగ్గా కొన్ని భూగర్భపు వేడి చెలమల పక్కనే ఉండటాన్ని గమనించారు. 285 00:42:17,287 --> 00:42:20,624 సౌరోపాడ్ డైనోసార్లు అగ్నిపర్వతపు స్థితిగతులను ఉపయోగించుకుని 286 00:42:20,624 --> 00:42:22,292 తమ గుడ్లకి వెచ్చదనం అందించేవని అనుకుంటున్నాం. 287 00:42:24,628 --> 00:42:28,215 మరొక ప్రదేశంలో, భారతదేశంలోని డెక్కన్ ప్రాంతంలో, 288 00:42:28,215 --> 00:42:32,052 క్రెటాసియస్ కాలపు చివరి రోజులలో ఒక అగ్నిపర్వతపు ప్రదేశంలో 289 00:42:32,052 --> 00:42:33,971 మనకి మరిన్ని ఆధారాలు దొరికాయి. 290 00:42:35,556 --> 00:42:38,308 లావా పొరలు పొరలుగా పేరుకుని ఉన్నాయి, 291 00:42:38,976 --> 00:42:42,396 ఆ పొరల మధ్యలో, మేము డైనోసార్ గుడ్లని కనుగొన్నాం. 292 00:42:46,441 --> 00:42:48,569 డైనోసార్లు ఈ ప్రదేశానికి వచ్చేవని, 293 00:42:48,569 --> 00:42:50,988 అగ్నిపర్వతం లావాని వెదజల్లుతున్న సమయంలో కూడా అవి గుడ్లు పెట్టేవని, 294 00:42:50,988 --> 00:42:55,117 అందుకు ఈ ప్రదేశాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు ఎంచుకున్నాయని తెలుస్తోంది. 295 00:43:01,164 --> 00:43:05,127 తమ గుడ్లని పొదగడానికి ఎన్నో మార్గాలను డైనోసార్లు అనుసరించేవి... 296 00:43:07,296 --> 00:43:09,548 అయితే ఒక విషయం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలం. 297 00:43:11,758 --> 00:43:14,553 వాటి పద్ధతులు చాలా సమర్థంగా పని చేశాయి, 298 00:43:15,262 --> 00:43:20,684 తద్వారా అవి 15 కోట్ల సంవత్సరాల పాటు ఈ ప్రపంచాన్ని ఏలడానికి అవి తోడ్పడ్డాయి. 299 00:45:51,418 --> 00:45:53,420 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్