1 00:00:08,717 --> 00:00:10,552 {\an8}డైనోసార్లు మన భూగ్రహాన్ని పాలించాయి... 2 00:00:10,552 --> 00:00:12,179 {\an8}డేవిడ్ అటెన్బరో సమర్పణ 3 00:00:12,179 --> 00:00:14,806 {\an8}...దాదాపు పదిహేను కోట్ల సంవత్సరాల కాలం. 4 00:00:15,682 --> 00:00:18,727 అవి మన భూమిలో దాదాపు ప్రతి ప్రాంతాన్ని ఆక్రమించాయి 5 00:00:19,311 --> 00:00:23,148 ఇంకా మనం ఊహించగల ప్రతి రూపంలో, ప్రతి పరిమాణంలో అవి పుట్టుకొచ్చాయి. 6 00:00:24,358 --> 00:00:27,402 కొన్ని నిజంగా అసాధారణంగా ఉండేవి. 7 00:00:30,822 --> 00:00:34,535 టి. రెక్స్ చాలా గొప్పగా ఈదగలుగుతుందని... 8 00:00:36,787 --> 00:00:40,082 వెలోసిరాప్టర్స్ చాలా కుతంత్రాలు పన్నుతాయని, ఈకలు ఉన్న వేట జంతువులని, 9 00:00:42,000 --> 00:00:45,963 అలాగే కొన్ని డైనోసార్స్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాయని మనకి ఇప్పుడు తెలిసింది. 10 00:00:48,841 --> 00:00:52,594 కానీ దాదాపు ప్రతి రోజూ చోటు చేసుకుంటున్న కొత్త ఆవిష్కరణలు 11 00:00:52,594 --> 00:00:57,641 మన గ్రహం మీద ఆరు కోట్ల అరవై లక్షల సంవత్సరాల కిందట జీవనం ఎలా ఉండేదో మనకి తెలియజేస్తున్నాయి. 12 00:01:02,604 --> 00:01:05,482 Prehistoric Planet లో ఈసారి, 13 00:01:05,482 --> 00:01:08,026 మేము కొత్త జంతువులను వెల్లడించబోతున్నాము, 14 00:01:09,403 --> 00:01:13,740 ఇంకా అవి తమ భాగస్వాములను అన్వేషించే పద్ధతుల గురించి, 15 00:01:15,576 --> 00:01:18,203 కుటుంబాన్ని పెంచి పోషించుకునే క్రమంలో అవి ఎదుర్కొనే సవాళ్ల గురించి, 16 00:01:19,496 --> 00:01:21,415 ఇంకా వాటి అసాధారణ పోరాటాల గురించి వెల్లడించబోతున్నాం. 17 00:01:29,506 --> 00:01:33,969 ప్రకృతి అత్యద్భుత ఘట్టాలను ప్రదర్శించిన ఆ కాలానికి ప్రయాణిద్దాం. 18 00:01:37,514 --> 00:01:41,727 ఇది Prehistoric Planet 2. 19 00:01:54,656 --> 00:02:00,078 చిత్తడి నేలలు 20 00:02:01,121 --> 00:02:04,625 ఈశాన్యపు ఆసియాలో చిత్తడి నేలలు విస్తారంగా ఉన్నాయి. 21 00:02:08,211 --> 00:02:13,425 ఈ లోతట్టు వరద ముంపు ప్రాంతాలలో, అసంఖ్యాకంగా ద్వీపాలు ఉన్నాయి. 22 00:02:19,348 --> 00:02:23,101 ప్రతి ద్వీపం చుట్టూ నదులు నిదానంగా ప్రవహిస్తుంటాయి... 23 00:02:26,522 --> 00:02:31,068 దాని ఫలితంగా కొత్త జీవరాశులు పుట్టుకురావడానికి అవి చక్కని అభయారణ్యాలుగా మారతాయి. 24 00:02:36,740 --> 00:02:42,788 ఇది చిన్న టెరోసార్, అజ్డార్కిడ్ జాతికి చెందినది. దీని వయస్సు కేవలం కొన్ని గంటలు మాత్రమే. 25 00:02:51,547 --> 00:02:53,298 ఒక దీవిలో ఉండటం వల్ల 26 00:02:53,298 --> 00:02:57,511 ఈ పక్షి తన తొలి అడుగులు వేసే దశలో క్షేమంగా ఉండగలుగుతుంది. 27 00:03:09,690 --> 00:03:15,487 ఇది అడుగులు వేయగలుగుతోంది, ఇక రెక్కలపై ఎగరడానికి ప్రయత్నించే సమయం వచ్చింది. 28 00:03:18,448 --> 00:03:22,286 రెక్కలు సరిగ్గా ఆడించాలంటే కొద్దిగా ప్రాక్టీస్ అవసరం. 29 00:03:25,998 --> 00:03:28,166 ఈ పక్షి కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉన్నా, 30 00:03:28,166 --> 00:03:32,504 ఇది 30 అడుగుల పొడవైన రెక్కలతో ఒక భారీ జంతువుగా ఎదుగుతుంది. 31 00:03:33,630 --> 00:03:36,967 కానీ అలా పెరగాలంటే దానికి చాలా ఆహారం అవసరం అవుతుంది... 32 00:03:40,095 --> 00:03:43,807 అయితే అంత ఆహారాన్ని ఈ చిన్న ద్వీపం అందించలేదు. 33 00:03:48,979 --> 00:03:50,522 ఈ పక్షి పిల్ల ఈ దీవిని వదిలి 34 00:03:51,190 --> 00:03:55,360 చుట్టుపక్కల చిత్తడి నేలల్లో ఉన్న అడవులు అందించే ఆహారం వెతుక్కుంటూ వెళ్లాలి. 35 00:04:04,494 --> 00:04:09,291 తొలిసారి ఎగరడం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది, ముఖ్యంగా చుట్టూ నీరు ఉన్నప్పుడు అది మరీ కష్టం. 36 00:04:12,461 --> 00:04:14,546 ఈ రోజు కొద్దిపాటి గాలి వీస్తోంది. 37 00:04:15,047 --> 00:04:17,925 ఈ పక్షి పిల్ల పైకి ఎగరడానికి అది అదనపు బలం అందిస్తుంది. 38 00:04:36,109 --> 00:04:39,363 కానీ ఈ పక్షి పిల్లకి ఇంకా అంత బలం లేదు. 39 00:05:01,301 --> 00:05:05,097 షేమోసూకస్. పదిహేను అడుగుల పొడవైన వేట జంతువులు. 40 00:05:07,891 --> 00:05:10,018 ఈ ద్వీపంలో భద్రత ఉంటుంది, 41 00:05:10,519 --> 00:05:13,856 కానీ చుట్టూ ఉన్న నీటిలో ఖచ్చితంగా భద్రత ఉండదు. 42 00:05:19,236 --> 00:05:23,323 ఈ పక్షి పిల్లలు బలంగా పైకి లేవలేకపోతే, అవి ఎత్తులో ఎగరడం కష్టం అవుతుంది. 43 00:05:29,580 --> 00:05:32,249 కానీ అవి ఇంత ఎత్తులో ఎగిరితే సరిపోదు. 44 00:05:43,552 --> 00:05:45,304 బలంగా ఎగరగలుగుతున్న కొన్ని పక్షి పిల్లలు 45 00:05:45,304 --> 00:05:48,432 ఈ అడవికి భద్రంగా చేరుకోగలిగాయి. 46 00:05:51,018 --> 00:05:53,687 మిగతా పక్షి పిల్లలు ఇంకా ప్రయత్నించాల్సి ఉంది. 47 00:06:54,248 --> 00:06:56,625 ఒక అద్భుతం లాంటిది జరిగి తప్పించుకుంది. 48 00:06:58,293 --> 00:07:01,672 ఇప్పుడు ఆ పక్షి పిల్లకి ప్రకృతి అందించే కానుకల్ని స్వీకరించే అవకాశం దక్కింది. 49 00:07:14,184 --> 00:07:18,647 ఈ చక్కని చిత్తడి అడవులు, ఈ పక్షి పిల్లకి అవసరమైన ఆహారం సమృద్ధిగా అందించేవి. 50 00:07:32,244 --> 00:07:34,872 ఈ దక్షిణ అమెరికా చిత్తడి నేలల్లో, 51 00:07:34,872 --> 00:07:39,334 సుదీర్ఘమైన వేసవి కాలం దానికి పసందైన విందుని అందిస్తోంది. 52 00:07:40,961 --> 00:07:44,673 ఈ చిత్తడి నేలలు ఎన్నో జీవరాశులతో కళకళలాడుతున్నాయి. 53 00:07:53,724 --> 00:07:55,642 దానితో వేట జంతువులు ఇక్కడికి తరలి వస్తున్నాయి. 54 00:08:04,943 --> 00:08:08,238 మూడు అడుగుల పొడవైన క్రూరమైన సూది చేప. 55 00:08:16,163 --> 00:08:19,875 ఒక భారీ ఆస్ట్రోరాప్టర్ కి ఇది ఆహారం. 56 00:08:25,714 --> 00:08:30,677 ఇవి వెలోసిరాప్టర్స్ జాతికి సంబంధించినవే, కానీ వాటికన్నా చాలా, చాలా భారీగా ఉంటాయి. 57 00:08:37,226 --> 00:08:42,147 తల నుండి తోక వరకూ దీని పొడవు ఇరవై అడుగులు ఇంకా దీని బరువు సుమారు 362 కిలోలు. 58 00:08:56,036 --> 00:08:59,540 దీని దంతాలు మొసళ్లకు ఉన్నట్లుగా ఉంటాయి, 59 00:08:59,540 --> 00:09:03,794 అయితే ఈ డైనోసార్లు చేపలను పట్టుకోవడంలో మంచి నేర్పరులు. 60 00:09:12,302 --> 00:09:15,556 ఏడాదిలో చాలా రోజులు, ఇవి ఒంటరిగానే వేటాడుతుంటాయి. 61 00:09:17,307 --> 00:09:20,352 కానీ వేసవి కాలంలో చేపల సంఖ్య పెరిగినప్పుడు, 62 00:09:21,728 --> 00:09:24,815 ఆస్ట్రోరాప్టర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. 63 00:09:32,489 --> 00:09:36,785 ఈ డైనోసార్లలో పెద్దవి ఎక్కువ చేపలు ఉండే ప్రాంతాలను తమ ఆధిపత్యంలో ఉంచుకుంటాయి. 64 00:09:41,331 --> 00:09:43,125 అవి ప్రత్యర్థులని ఏ మాత్రం సహించవు. 65 00:10:01,101 --> 00:10:05,480 ఇంకా పెద్ద వయసులోకి రాని ఈ డైనోసార్లకు, ఏడాదిలో ఈ కాలం మాత్రం ఒక సవాలుగా ఉంటుంది. 66 00:10:08,734 --> 00:10:12,821 ఈ యువ జంతువులో ఇంకా పసితనపు ఛాయలు పోలేదు, 67 00:10:12,821 --> 00:10:16,366 కానీ చేపలను వేటాడటానికి అనువైన ప్రదేశం తనకి దొరుకుతుందన్న ఆశతో ఉంది. 68 00:10:21,371 --> 00:10:25,042 అయితే, ఇక్కడ ఆహారాన్ని సంపాదించుకోవడానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి. 69 00:10:30,714 --> 00:10:35,344 చుట్టూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుండటం వల్ల, పెద్ద జంతువులు చాలా ఆహారాన్ని వృథా చేస్తుంటాయి. 70 00:10:38,847 --> 00:10:42,351 అవి చేపలలో తమకు నచ్చిన భాగాలని మాత్రమే ఆరగిస్తాయి. 71 00:10:49,399 --> 00:10:54,196 కానీ ఒక చిన్న జంతువుకి, ఆ మిగిలిన ఆహారమే చక్కని విందు కాగలదు. 72 00:10:56,365 --> 00:10:57,950 అయితే అది ప్రమాదకరం. 73 00:11:08,627 --> 00:11:11,547 అది ఆ ఆహారాన్ని పొందాలంటే, దొంగచాటుగా వెళ్లాలి. 74 00:11:34,319 --> 00:11:37,281 గాయపడి వొట్టి చేతులతో తిరిగి వచ్చింది. 75 00:11:40,033 --> 00:11:43,036 కానీ తన చుట్టూ మరికొన్ని పెద్ద జంతువులు వేటాడి తింటుండటంతో, 76 00:11:43,036 --> 00:11:44,955 ఈ చిన్న జంతువుకి మరొక అవకాశం దొరకచ్చు. 77 00:12:02,389 --> 00:12:05,893 చేపల వేటకి అనువైన ప్రదేశం కోసం రెండు పెద్ద జంతువులు గొడవ పడుతున్నాయి. 78 00:12:28,332 --> 00:12:31,168 ఆ చిన్న జంతువు ఆ ఆహారాన్ని కాజేయడానికి ఇదే అదను... 79 00:12:33,712 --> 00:12:35,923 ఇంక ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 80 00:12:40,135 --> 00:12:41,136 సాధించింది. 81 00:12:42,012 --> 00:12:44,515 మిగిలిపోయిన చిన్న ముక్కల కన్నా ఇది ఎక్కువగానే ఉంది. 82 00:12:47,267 --> 00:12:48,519 ఒక పాఠం నేర్చుకుంది. 83 00:12:49,436 --> 00:12:52,231 వచ్చే ఏడాది మళ్లీ మంచి కాలం వచ్చినప్పుడు, 84 00:12:52,231 --> 00:12:56,652 ఈ చిన్న జంతువు చేపల వేటకు అనువైన ప్రదేశాన్ని తనే సొంతంగా సంపాదించుకుంటుందేమో. 85 00:13:05,744 --> 00:13:10,541 మడగాస్కర్ ఉత్తర ప్రాంతంలో, వాతావరణం అప్పటికే మారిపోతోంది. 86 00:13:12,292 --> 00:13:17,422 కొద్ది నెలలుగా ఎండిపోయిన బీడు భూముల్ని తొలకరి జల్లులు తడుపుతున్నాయి. 87 00:13:25,597 --> 00:13:30,185 కుంటలు, మడుగులు నీటితో నిండుతుండటంతో జంతువులు ఇక్కడికి తిరిగి వస్తున్నాయి. 88 00:13:53,333 --> 00:13:55,586 అయితే ఆ జంతువులన్నీ డైనోసార్లు కాదు. 89 00:14:04,094 --> 00:14:06,430 ఈ బురద గుంటలలో పొంచి ఉన్న ఈ జంతువు... 90 00:14:08,807 --> 00:14:11,560 ఒక రాకాసి జంతువు. 91 00:14:25,032 --> 00:14:28,702 బీయెల్జీబూఫో, ఒక రాకాసి కప్ప. 92 00:14:32,122 --> 00:14:37,044 ఇది ఎంత పెద్దదంటే, ఒక చిన్న డైనోసార్ ని మొత్తంగా మింగేయగలుగుతుంది. 93 00:14:39,880 --> 00:14:41,965 కానీ ఈ మగ కప్ప ఇక్కడ వేట కోసం రాలేదు. 94 00:14:44,218 --> 00:14:46,762 ఇది తన జత కోసం వెతుకుతోంది. 95 00:14:49,890 --> 00:14:55,729 ఆడ రాకాసి కప్పలు చాలా ఖచ్చితంగా ఉంటాయి, అందుకే ఇది మంచి ప్రదేశాన్ని ఎంచుకోవాలి. 96 00:14:58,190 --> 00:15:00,817 అప్పుడే ఇది ఆడ కప్పలని ఇక్కడికి రప్పించగలుగుతుంది. 97 00:15:15,207 --> 00:15:18,544 ఇది బిగ్గరగా పెట్టే కేకలు చాలా దూరం వరకూ వినిపిస్తాయి. 98 00:15:45,612 --> 00:15:48,657 ఆ రాకాసి కప్ప ఎదురుచూస్తున్నది దీని కోసం కాదు. 99 00:15:53,871 --> 00:15:56,957 యాభై అడుగుల పొడవైన రాపీటోసార్స్. 100 00:16:05,591 --> 00:16:10,137 బురదలో స్నానం చేయడం కోసం అవి ఈ ప్రాంతానికి తరలి వస్తున్నాయి. 101 00:16:14,099 --> 00:16:18,103 ఆ పెద్ద జంతువుల రాక, బీయెల్జీబూఫోకి గడ్డు పరిస్థితిని తెస్తోంది. 102 00:16:34,286 --> 00:16:39,458 దాని బురద మడుగులు ఇక డెబ్బై టన్నుల బరువైన సౌరోపాడ్ ల కింద అణిగిపోతాయి. 103 00:16:47,174 --> 00:16:49,343 సమయం తక్కువగా ఉంది. 104 00:16:51,678 --> 00:16:56,266 ఆడ రాకాసి కప్పలు కేవలం వానా కాలం ప్రారంభంలో మాత్రమే జత కూడటానికి వస్తాయి. 105 00:17:01,271 --> 00:17:03,023 మగ కప్పకి కొత్త బురద మడుగు కావాలి. 106 00:17:08,362 --> 00:17:09,363 అక్కడ ఒకటి దొరికింది. 107 00:17:21,165 --> 00:17:23,085 కానీ దాని దగ్గరకు వెళ్లడం ప్రమాదకరం. 108 00:18:05,085 --> 00:18:07,337 మొత్తానికి మగ కప్ప అక్కడికి చేరుకుంది... 109 00:18:09,923 --> 00:18:12,259 కానీ ఒక పెద్ద జంతువు దాన్ని చూసింది. 110 00:18:23,729 --> 00:18:27,274 ఈ కప్పని రాకాసి కప్ప అని ఊరికే పిలవరు. 111 00:18:32,279 --> 00:18:34,656 ఇప్పుడు ఇక మళ్లీ పాట అందుకునే సమయం... 112 00:18:38,410 --> 00:18:45,167 ...కానీ బురద స్నానాలు చేస్తూ సంతృప్తి పడుతున్న సౌరోపాడ్ ల కేకల మధ్య ఆ మగ కప్ప పిలుపు వినిపించదు. 113 00:18:54,635 --> 00:18:55,719 ఆ మగ కప్పకి అదృష్టం కొద్దీ, 114 00:18:55,719 --> 00:19:00,849 ఈ రాపీటోసార్ జంతువులు బురదలో పొర్లాడటం కన్నా ఎక్కువ ఇష్టపడే విషయం ఒకటి ఉంది... 115 00:19:03,810 --> 00:19:06,271 అదే, ఆహారం. 116 00:19:10,734 --> 00:19:12,778 ఆకలితో ఉన్న ఆ జంతువుల గుంపు బయలుదేరింది... 117 00:19:14,988 --> 00:19:19,409 అయితే, ఏదో ఉపయోగకరమైనదే అవి విడిచి వెళ్తుండటం ఒక విశేషం. 118 00:19:23,539 --> 00:19:28,544 డజన్ల కొద్దీ భారీ పాదముద్రలు, వాటి నిండా నీళ్లు. 119 00:19:37,886 --> 00:19:42,599 బీయెల్జీబూఫో తన జత కోసం చేసే ప్రయత్నానికి ఇది చక్కగా అనువుగా ఉంటుంది. 120 00:20:04,830 --> 00:20:07,666 రాకాసి కప్ప ఇక్కడ మాత్రమే జీవించగలుగుతుంది 121 00:20:07,666 --> 00:20:12,462 ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చే వర్షాల వల్ల ఇక్కడ నేలలు వరద ముంపునకు గురవుతాయి. 122 00:20:15,048 --> 00:20:18,552 అయితే, మరికొన్ని ప్రదేశాలలో వాతావరణం మారినప్పుడు 123 00:20:18,552 --> 00:20:20,888 వర్షాలు పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 124 00:20:26,643 --> 00:20:32,524 ఉత్తర అమెరికాలో ఈ లోతట్టు ప్రదేశం ఒకప్పుడు, నీటిలో చాలా అడుగుల లోతులో ఉండేది. 125 00:20:36,361 --> 00:20:40,282 కానీ దశాబ్దాల కాలం పాటు కరువు తాండవించడంతో, అది ఇప్పుడు ఎండిపోయింది. 126 00:20:47,664 --> 00:20:51,460 అయినా కూడా, కొన్ని డైనోసార్లు ఇప్పటికీ ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి. 127 00:21:02,137 --> 00:21:04,723 ఇది పాకీసెఫలోసార్ జంతువుల గుంపు, 128 00:21:06,058 --> 00:21:09,811 దట్టమైన గోపురం మాదిరి తలలతో విచిత్రంగా ఉంటాయి. 129 00:21:22,282 --> 00:21:25,369 ఇవి పండ్లు ఇంకా ఆకులు తినడానికి ఎక్కువ ఇష్టపడతాయి... 130 00:21:28,622 --> 00:21:33,961 కానీ ఇప్పుడు అవి తప్పనిసరిగా చెట్ల వేర్లు ఇంకా పురుగుల్ని తినాల్సి వస్తోంది. 131 00:21:48,976 --> 00:21:51,937 ఈ గుంపుకి ఒక పెద్ద మగ జంతువు సారథ్యం వహిస్తుంది. 132 00:21:54,523 --> 00:22:00,445 అది అందరినీ కట్టడి చేస్తుంది, అందువల్ల ఆ గుంపులో ప్రతి జంతువు ప్రశాంతంగా ఆహారాన్ని వెతుక్కోగలుగుతుంది. 133 00:22:17,379 --> 00:22:21,300 అయితే ఆ గుంపులోనే ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. 134 00:22:24,386 --> 00:22:27,139 ఒక యువ జంతువు ఆధిపత్యం కోసం గొడవకి దిగుతోంది. 135 00:22:40,027 --> 00:22:45,991 నాయకత్వం వహిస్తున్న మగ జంతువు ఆ కుర్ర జంతువుకి బుద్ధి చెప్పాలి లేదా బయటకి తరిమేయాలి. 136 00:22:55,876 --> 00:22:58,128 అది తన తల మీద ఉన్న రంగుల మూపురాన్ని ప్రదర్శించి... 137 00:23:05,385 --> 00:23:07,679 ఆ కుర్ర జంతువు పొగరు అణచాలని ప్రయత్నిస్తుంది. 138 00:23:14,978 --> 00:23:17,314 కానీ ఆ కుర్ర జంతువుని లొంగదీయడం అంత తేలికగా కనిపించడం లేదు. 139 00:24:07,155 --> 00:24:12,411 వాటి తలలు పది అంగుళాల మందంగా ఉండటం వల్ల అవి బలమైన దాడులను తట్టుకోగలుగుతాయి. 140 00:24:34,558 --> 00:24:36,518 పెద్ద వయస్సు మగ జంతువు ఎక్కువ బరువు ఉంటుంది, 141 00:24:37,936 --> 00:24:41,732 కానీ కుర్ర జంతువుకి చురుకుదనంతో పాటు సత్తువ కూడా ఎక్కువ, 142 00:24:42,733 --> 00:24:45,569 అందువల్ల అది గెలుపుని తన వైపు తిప్పుకోగలుగుతుంది. 143 00:24:57,164 --> 00:24:58,999 గెలుపు గర్జన అది. 144 00:25:10,219 --> 00:25:12,387 కానీ అది మరీ త్వరపడింది. 145 00:25:28,070 --> 00:25:31,073 ఓడిపోయిన జంతువు పెద్ద మూల్యం చెల్లించుకోవాలి. 146 00:25:38,622 --> 00:25:39,623 బహిష్కరణ. 147 00:25:45,045 --> 00:25:49,216 ఒంటరిగా, అది స్వయంగా ఆహారాన్ని వెతుక్కోవాలి. 148 00:25:55,097 --> 00:25:58,684 ఇప్పటికి అది విజేత కావచ్చు కానీ ఈ ప్రాంతాలు త్వరగా నీటితో నిండకపోతే 149 00:25:58,684 --> 00:26:03,772 దాని జీవితం కూడా సునాయాసంగా ఉండదు. 150 00:26:12,072 --> 00:26:14,491 ఈ విశాలమైన ఖండం అంతటా, 151 00:26:14,491 --> 00:26:19,079 దాదాపు రెండున్నర లక్షల చదరపు కిలోమీటర్ల వరకూ చిత్తడి నేలలు ఉన్నాయి... 152 00:26:21,957 --> 00:26:25,794 వాటిలో ఎక్కువ ప్రాంతాలు ఏడాది పొడవునా వరద నీటిలో మునిగి ఉంటాయి. 153 00:26:33,051 --> 00:26:34,636 ఇక్కడ వసంత రుతువు రాగానే, 154 00:26:34,636 --> 00:26:39,808 కొత్త మొక్కలు చిగురించడం ఇక్కడకి తరలివచ్చే జంతువుల గుంపులలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. 155 00:26:55,324 --> 00:26:59,036 కానీ ఎక్కడయితే మొక్కలను తినే జంతువులు పెద్ద సంఖ్యలో గుమిగూడతాయో... 156 00:27:01,663 --> 00:27:03,707 అక్కడ గొప్ప వేట జంతువులు కూడా ప్రత్యక్షం అవుతాయి. 157 00:27:15,260 --> 00:27:16,261 టి. రెక్స్... 158 00:27:18,847 --> 00:27:22,142 ఈ భూమి మీద అత్యంత శక్తిమంతమైన వేట జంతువు. 159 00:27:24,895 --> 00:27:27,105 సాధారణంగా అవి ఆకస్మిక దాడులు చేసి ఆహారాన్ని వేటాడతాయి... 160 00:27:30,359 --> 00:27:32,736 కానీ ఇక్కడ చాలా జంతువులు గమనిస్తుండటం వల్ల... 161 00:27:34,905 --> 00:27:37,908 దాడి చేయడానికి ఇది సరైన సమయం కాదు. 162 00:27:48,752 --> 00:27:50,629 చీకటి పడిన తరువాత, 163 00:27:50,629 --> 00:27:54,758 బహిరంగ ప్రదేశాలలో మేత మేస్తున్న జంతువుల గుంపులు 164 00:27:54,758 --> 00:27:57,344 చీకటి పడిన తరువాత అడవిలోకి తిరిగి వెళ్లి తలదాచుకుంటాయి. 165 00:28:01,557 --> 00:28:05,519 ఇది వేట జంతువులకు బాగా అనుకూలించే సమయం. 166 00:28:19,199 --> 00:28:23,245 అన్ని డైనోసార్లలోకి టైరనోసార్స్ కళ్లు పెద్దవిగా ఉంటాయి, 167 00:28:24,913 --> 00:28:27,958 అందువల్ల వాటికి చీకటిలో కూడా కంటి చూపు చాలా స్పష్టంగా ఉంటుంది. 168 00:28:48,687 --> 00:28:53,025 వాటి కాళ్లకి మెత్తని దళసరి కండరాలు ఉంటాయి, 169 00:28:53,692 --> 00:28:56,445 అందువల్ల అవి ఆ అడవిలో దాదాపుగా నిశ్శబ్దంగా కదలికలు సాగించగలుగుతాయి. 170 00:29:07,581 --> 00:29:09,917 ఎడ్మాంటొసార్స్ గుంపు ఇది. 171 00:29:21,220 --> 00:29:22,721 వాటికి ఎటువంటి ఆయుధాలు ఉండవు, 172 00:29:22,721 --> 00:29:26,934 కానీ అవి టి. రెక్స్ అంత పెద్దగా ఉండి వాటి కన్నా రెండింతలు వేగంతో పరిగెడతాయి. 173 00:29:31,438 --> 00:29:33,899 వీటిని వేటాడాలంటే కుట్రపూరితంగా చేయాల్సిందే. 174 00:29:46,245 --> 00:29:50,457 ప్రతి వేట జంతువు జాగ్రత్తగా దాని స్థానంలో సిద్ధంగా ఉంటుంది. 175 00:30:00,634 --> 00:30:04,263 అప్పుడు వాటిలో ఒకటి కావాలని శబ్దం చేస్తుంది. 176 00:30:16,692 --> 00:30:19,528 ఎడ్మాంటోసార్లు అప్రమత్తం అవుతాయి. 177 00:30:28,829 --> 00:30:30,956 వేట జంతువులు దగ్గరగా వచ్చేశాయని అవి గ్రహించాయి, 178 00:30:32,040 --> 00:30:34,543 కానీ అవి ఎక్కడ నక్కి ఉన్నాయో వాటికి ఖచ్చితంగా తెలియదు. 179 00:30:37,713 --> 00:30:39,631 ఇక ఉచ్చు బిగించే సమయం ఆసన్నమైంది. 180 00:30:43,218 --> 00:30:44,928 ఒక టి. రెక్స్ దూసుకొస్తుంది. 181 00:30:55,272 --> 00:31:01,737 ఆ గుంపు భయపడి పారిపోవాలని ప్రయత్నిస్తుండగా మరొక టి. రెక్స్ మెరుపుదాడికి సిద్ధంగా ఉంది. 182 00:31:42,361 --> 00:31:44,947 పక్కాగా అమలు చేసిన ప్లాన్ ఇది... 183 00:31:49,117 --> 00:31:53,330 ఈ భూమి మీద సంచరించిన అత్యంత శక్తిమంతమైన వేట జంతువులు... 184 00:31:58,794 --> 00:32:02,714 చరిత్రపూర్వపు భూమి మీద చిత్తడి నేలల్లో వేటాడిన తీరు ఇది. 185 00:32:12,975 --> 00:32:15,978 Prehistoric Planet: ఆవిష్కరణ 186 00:32:19,273 --> 00:32:22,109 పాకీసెఫలోసార్ నిజంగానే తలతో పోరాడేదా? 187 00:32:22,109 --> 00:32:26,363 ఇది పాకీసెఫలోసార్ పుర్రె, 188 00:32:26,363 --> 00:32:28,824 ఇది పదహారు అడుగుల పొడవు ఉండి మొక్కలని తినే జంతువు. 189 00:32:29,950 --> 00:32:32,202 ఎన్నో సంవత్సరాలు పరిశోధించినా కూడా, 190 00:32:32,202 --> 00:32:37,374 దీనికి ఈ విచిత్రమైన తల ఎందుకు ఉందో ఇప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. 191 00:32:48,051 --> 00:32:50,220 {\an8}పాకీసెఫలోసార్స్ లో విలక్షణమైన అంశం ఏమిటంటే, నిజానికి... 192 00:32:50,220 --> 00:32:51,680 {\an8}డాక్టర్ సుసానా మెయిడ్మెంట్ నేచురల్ హిస్టరీ మ్యూజియమ్ 193 00:32:51,680 --> 00:32:53,515 {\an8}...ఇది వాటి తల మీద ఉండే ఒక విచిత్రమైన మూపురం. 194 00:32:56,768 --> 00:33:01,815 అది చుట్టూ విచిత్రమైన గడ్డలు, నీటి బుడగలు ఇంకా బొబ్బలతో నిండి ఉంటుంది. 195 00:33:02,441 --> 00:33:04,484 అవి కొద్దిగా డ్రాగన్ మాదిరిగా కనిపిస్తాయి. 196 00:33:06,528 --> 00:33:07,821 {\an8}ప్రొఫెసర్ పౌల్ బారెట్ నేచురల్ హిస్టరీ మ్యూజియమ్ 197 00:33:07,821 --> 00:33:09,573 {\an8}ఈ దళసరి, మూపురం ఉన్న పుర్రెలని చూసినప్పుడు, 198 00:33:09,573 --> 00:33:11,867 {\an8}ఈ మూపురాలు ముప్పై సెంటీమీటర్ల మందం ఉంటాయని భావించారు, 199 00:33:12,701 --> 00:33:14,536 ఇంకా ఇవి చాలా గట్టిగా బలంగా ఉంటాయి అనుకున్నారు. 200 00:33:14,536 --> 00:33:17,664 తమ గుంపులో ఆధిపత్యం కోసం జరిగే పోరాటాలలో తలతో ఢీకొనడం కోసం 201 00:33:17,664 --> 00:33:19,875 ఈ జంతువులు ఈ మూపురాలను ఉపయోగించేవని మొదట్లో భావించేవారు. 202 00:33:22,211 --> 00:33:26,757 ఈ రోజుల్లో, పెద్ద కొమ్ములున్న గొర్రెలు ఈ విధంగా తలలని ఉపయోగిస్తున్నాయి. 203 00:33:28,717 --> 00:33:32,137 ఇలా ఢీ కొన్నప్పుడు మెదడుకు దెబ్బ తగలకుండా మందంగా ఉండే తలలు వాటికి రక్షణ కల్పిస్తాయి. 204 00:33:35,307 --> 00:33:39,686 కానీ పాకీసెఫలోసార్ మూపురపు తల గురించి ఇది పూర్తి వివరణ ఇవ్వగలుగుతుందా? 205 00:33:43,232 --> 00:33:46,401 చాలామంది పురాజీవ శాస్త్రవేత్తలు ఈ పుర్రె లోపలి భాగాలను అధ్యయనం చేయాలని భావించారు. 206 00:33:47,736 --> 00:33:50,864 వాళ్లు కొన్ని పాకీసెఫలోసార్ మూపురాలను ముక్కలుగా చేసి పరిశోధించారు, 207 00:33:50,864 --> 00:33:54,243 కానీ వాళ్ల పరిశోధనల్లో తేలింది ఏమిటంటే, అవి తలలతో ఢీ కొట్టినప్పుడు 208 00:33:54,243 --> 00:33:57,204 అవి అనుకున్నంత బలంగా ఉండేవి కావని తెలుసుకున్నారు. 209 00:33:58,372 --> 00:34:04,419 అయితే, వాళ్లు వేరే విషయాన్ని కనుగొన్నారు, అదేమిటంటే, ఆ మూపురానికి మరొక ప్రయోజనం ఉంది. 210 00:34:05,629 --> 00:34:09,591 ఆ మూపురపు పైపొర నిండా చిన్న చిన్న పీచు పదార్థపు అల్లిక కనిపించింది. 211 00:34:11,176 --> 00:34:14,137 అందువల్ల వాటి చర్మం రంగులతో కాంతివంతంగా ఉండి, తమతో జత కట్టడానికి 212 00:34:14,137 --> 00:34:16,139 జంతువుల్ని ఆకర్షించేదని తెలిసింది. 213 00:34:17,808 --> 00:34:24,147 ఈ కొత్త సిద్ధాంతాన్ని 2013 వరకూ అందరూ ఆమోదించారు, 214 00:34:24,857 --> 00:34:27,317 కానీ ఆ తరువాత మరొక కొత్త సిద్ధాంతం వచ్చింది. 215 00:34:29,360 --> 00:34:31,237 పాకీసెఫలోసార్ ని కనుగొన్నప్పుడు, 216 00:34:31,237 --> 00:34:37,034 వాటి తలల మీద అనేక గాయాలతో అవి జీవించాయి అనడానికి కొన్ని గుర్తులు కనిపించాయి, 217 00:34:38,661 --> 00:34:40,956 అయితే అవి కేవలం ఒక తలలో మాత్రమే కనిపించిన గుర్తులు కావు. 218 00:34:41,998 --> 00:34:45,127 పరిశోధకులు పురాజీవ చరిత్ర మ్యూజియంలలో భద్రపరిచిన మరికొన్ని తలలను పరిశీలించి 219 00:34:45,127 --> 00:34:48,172 అన్ని పాకీసెఫలోసార్స్ పుర్రెలపైనా దాదాపు ఒకే ప్రదేశంలో 220 00:34:48,172 --> 00:34:51,925 ఇంచుమించు అవే గాయాల గుర్తులు ఉన్నట్లు కనుగొన్నారు. 221 00:34:53,802 --> 00:34:56,679 అవి తలలతో ఢీ కొట్టేవి అనడానికి ఇది చక్కని ఆధారం. 222 00:35:02,394 --> 00:35:04,646 కాబట్టి, ఆ పుర్రెలు 223 00:35:04,646 --> 00:35:07,816 పాకీసెఫలోసార్ మెదడుకి రక్షణ కల్పించేంత గట్టిగా ఉండేవా? 224 00:35:11,153 --> 00:35:15,490 ఈ విషయం తేల్చడానికి, సైంటిస్టులు అత్యాధునికమైన స్కానింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. 225 00:35:17,159 --> 00:35:20,996 ఎముకల వర్చువల్ నమూనాలని రూపొందించడానికి మనం సిటి స్కాన్ టెక్నాలజీని ఉపయోగించాము, 226 00:35:20,996 --> 00:35:24,124 ఒక విమానమో లేదా కృత్రిమ తుంటి భాగానికి సంబంధించి ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించినట్లే 227 00:35:24,124 --> 00:35:28,337 ఈ ఎముకల పైన కూడా కొన్ని పరీక్షలు నిర్వహించాము. 228 00:35:29,588 --> 00:35:33,258 ఈ విధంగా పరీక్షించినప్పుడు అసలైన ఆధారం లభించింది. 229 00:35:37,429 --> 00:35:39,181 ఆ పరీక్షల్లో ఏమి తేలిందంటే, పాకీసెఫలోసార్ మూపురాలు 230 00:35:39,181 --> 00:35:42,059 నిజానికి చాలా బలమైన దెబ్బలను కూడా తట్టుకునేవి. 231 00:35:44,311 --> 00:35:47,397 ఆ దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే అమెరికన్ ఫుట్ బాల్ ఆటగాళ్లు 232 00:35:47,397 --> 00:35:49,066 ఒకరినొకరు ఢీ కొన్నంత గట్టిగా ఉంటుంది. 233 00:35:54,780 --> 00:35:58,325 పాకీసెఫలోసార్ జంతువులు వాటి తలలను 234 00:35:58,325 --> 00:35:59,952 ఒక బలమైన ఆయుధంగా... 235 00:36:02,287 --> 00:36:04,206 ఇంకా తమ రంగులని ప్రదర్శించడానికి ఉపయోగించేవని గ్రహించాము. 236 00:36:07,292 --> 00:36:12,297 చరిత్రపూర్వపు ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని ప్రకటించడానికి రెండు విధాలుగా ఆ మూపురాలు ఉపయోగపడేవి. 237 00:38:46,201 --> 00:38:48,203 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్