1 00:00:08,717 --> 00:00:10,552 {\an8}డైనోసార్స్ మన భూగ్రహాన్ని పాలించాయి... 2 00:00:10,552 --> 00:00:12,179 {\an8}డేవిడ్ అటెన్బరో సమర్పణ 3 00:00:12,179 --> 00:00:14,806 {\an8}...దాదాపు పదిహేను కోట్ల సంవత్సరాల కాలం. 4 00:00:15,682 --> 00:00:18,727 అవి మన భూమిలో దాదాపు ప్రతి ప్రాంతాన్ని ఆక్రమించాయి 5 00:00:19,311 --> 00:00:23,148 ఇంకా మనం ఊహించగల ప్రతి రూపంలో, ప్రతి పరిమాణంలో అవి పుట్టుకొచ్చాయి. 6 00:00:24,358 --> 00:00:27,402 కొన్ని నిజంగా అసాధారణంగా ఉంటాయి. 7 00:00:30,822 --> 00:00:34,535 టి. రెక్స్ చాలా గొప్పగా ఈదగలుగుతుందని... 8 00:00:36,787 --> 00:00:40,082 వెలోసిరాప్టర్స్ చాలా కుతంత్రాలు పన్నుతాయని, ఈకలు ఉన్న వేట జంతువులని, 9 00:00:42,000 --> 00:00:45,963 అలాగే కొన్ని డైనోసార్స్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాయని మనకి ఇప్పుడు తెలిసింది. 10 00:00:48,841 --> 00:00:52,594 కానీ దాదాపు ప్రతి రోజూ చోటు చేసుకుంటున్న కొత్త ఆవిష్కరణలు 11 00:00:52,594 --> 00:00:57,641 మన గ్రహం మీద ఆరు కోట్ల అరవై లక్షల సంవత్సరాల కిందట జీవనం ఎలా ఉండేదో మనకి తెలియజేస్తున్నాయి. 12 00:01:02,604 --> 00:01:05,482 Prehistoric Planet లో ఈసారి, 13 00:01:05,482 --> 00:01:08,026 మేము కొత్త జంతువులను వెల్లడించబోతున్నాము 14 00:01:09,403 --> 00:01:13,740 ఇంకా అవి తమ భాగస్వాములను అన్వేషించే పద్ధతుల గురించి, 15 00:01:15,576 --> 00:01:18,203 కుటుంబాన్ని పెంచి పోషించుకునే క్రమంలో అవి ఎదుర్కొనే సవాళ్ల గురించి, 16 00:01:19,496 --> 00:01:21,415 ఇంకా వాటి అసాధారణ పోరాటాల గురించి కొత్త విషయాలు వెల్లడించబోతున్నాం. 17 00:01:29,506 --> 00:01:33,969 ప్రకృతి ఒక అత్యద్భుత ఘట్టాలను ప్రదర్శించిన ఆ కాలానికి ప్రయాణిద్దాం. 18 00:01:37,514 --> 00:01:41,727 ఇది Prehistoric Planet 2. 19 00:01:54,823 --> 00:02:00,078 సముద్రాలు 20 00:02:04,499 --> 00:02:05,584 సముద్రం. 21 00:02:06,877 --> 00:02:10,172 చరిత్రపూర్వపు భూమి మీద అతి పెద్ద ఆవాసం... 22 00:02:14,426 --> 00:02:18,514 ఈ భూమి మీద జీవించిన అతిపెద్ద వేట జంతువు... 23 00:02:24,937 --> 00:02:27,064 భారీ మోసాసార్ కి అది నివాసం. 24 00:02:46,792 --> 00:02:51,463 కానీ అన్ని మోసాసార్స్ 50 అడుగుల పొడవైన రాకాసి క్రూర జంతువులు కావు. 25 00:02:52,965 --> 00:02:56,677 ఈ పగడపు దిబ్బని ఆశ్రయించిన జంతువు ఫాస్ఫరోసారస్. 26 00:02:58,470 --> 00:03:00,722 ఇది కూడా మోసాసార్ జాతికి చెందినదే. 27 00:03:01,265 --> 00:03:04,560 ఆ జాతి జంతువులలో అతి చిన్నది, కేవలం పది అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. 28 00:03:08,313 --> 00:03:11,775 ఇది పగటి వేళల్లో ప్రమాదానికి దూరంగా దాక్కుంటూ ఉంటుంది. 29 00:03:15,821 --> 00:03:21,034 కానీ గంటలో ఒకసారో రెండుసార్లో ఈ జంతువు గాలి పీల్చుకోవడానికి నీటి ఉపరితలానికి రావలసి వస్తుంది. 30 00:03:25,914 --> 00:03:29,459 ఆ జాతి జలచరాల మాదిరిగా ఇది కూడా గాలిని పీల్చుకుని జీవిస్తుంది. 31 00:03:37,092 --> 00:03:39,928 అతి పెద్ద మోసాసార్స్ తో పోలిస్తే ఇది చాలా చిన్నది. 32 00:03:47,728 --> 00:03:51,106 కానీ ఇది కూడా చాలా క్రూరమైన వేట జంతువే... 33 00:03:54,359 --> 00:03:57,154 ఇంకా ఇది ఎప్పుడూ నీడలలోనే దాక్కుని ఉండదు. 34 00:04:00,032 --> 00:04:03,160 అనుకూలమైన సమయం ఆసన్నమైతే, ఇది వేట జంతువుగా మారుతుంది. 35 00:04:07,956 --> 00:04:11,084 అయితే అది సూర్యాస్తమయం సమయంలోనే జరుగుతుంది. 36 00:04:30,771 --> 00:04:35,400 చీకటి పడుతున్న సమయంలో సముద్రగర్భం కొత్త రూపం సంతరించుకుంటుంది. 37 00:04:52,709 --> 00:04:57,464 ఇప్పుడు, కోట్లాది జీవరాశాలు సముద్ర లోతుల్లోంచి కదిలి 38 00:04:57,464 --> 00:04:59,466 ఆహారం కోసం అన్వేషిస్తూ ఉపరితలానికి వస్తాయి. 39 00:05:04,137 --> 00:05:10,060 మన భూమి మీద అతి భారీ సంఖ్యలో సమూహాలు పూర్తి చీకటి సమయాలలోనే వలసలు పోతుంటాయి 40 00:05:11,812 --> 00:05:15,649 కేవలం ప్రత్యేకమైన నైట్ విజన్ కెమెరాలు ఉంటేనే వీటిని మనం చూడగలం. 41 00:05:22,197 --> 00:05:27,744 రాత్రివేళల్లో సంచరించే అద్భుతమైన జీవరాశులలో ఒకటి ఈ లాంతరు చేపలు. 42 00:05:32,291 --> 00:05:37,796 ఈ చేపల శరీరాల లోపల జరిగే రసాయనిక ప్రక్రియ కారణంగా అవి సన్నటి, మిణుకుమనే కాంతిని ఉత్పత్తి చేయగలుగుతాయి. 43 00:05:44,761 --> 00:05:49,641 ఈ జీవకాంతుల మెరుపులు వేట జంతువులని అయోమయానికి గురి చేయగలవు. 44 00:05:52,811 --> 00:05:58,233 ఇంకా సముద్ర గర్భం లోతు నుండి చూస్తే, మిణుకుమిణుకుమనే వీటి వెలుగులు 45 00:05:58,233 --> 00:06:01,528 సముద్రం ఉపరితలం మీద పడే చందమామ వెలుగులతో కలిసి అవి తప్పించుకుని తిరుగుతుంటాయి. 46 00:06:05,782 --> 00:06:10,495 కానీ అవి ఫాస్ఫరోసారస్ నుండి మాత్రం తప్పించుకోలేవు. 47 00:06:14,499 --> 00:06:18,462 దాని సైజుకి, ఏ మోసాసార్ కన్నా పెద్ద కళ్లు ఈ జంతువుకే ఉంటాయి... 48 00:06:21,548 --> 00:06:25,928 అందువల్ల ఆ చేపలు కల్పించే భ్రాంతి నుంచి కూడా తన ఆహారాన్ని అది స్పష్టంగా ఎంచుకోగలుగుతుంది. 49 00:06:46,782 --> 00:06:48,784 సూర్యోదయం సమయానికి, 50 00:06:48,784 --> 00:06:52,412 వలస పోయే పెద్ద సమూహాలన్నీ మళ్లీ సముద్ర గర్భంలోకి వెళ్లిపోతాయి. 51 00:06:55,082 --> 00:07:01,004 ఫాస్ఫరోసారస్ కూడా పగటిపూట అవి తలదాచుకునే చోటుకు చేరిపోవాలి. 52 00:07:07,302 --> 00:07:10,931 భారీ మోసాసార్స్ ఇప్పుడు వేటకు బయలుదేరతాయి. 53 00:07:27,614 --> 00:07:31,577 అందువల్ల ఈ చిన్న జంతువులు తమ వేటకు ఎలాంటి ప్రమాదం లేకుండా రాత్రి వరకూ ఎదురుచూస్తాయి. 54 00:07:41,587 --> 00:07:45,716 ఉదయం వేళల్లో, చరిత్రపూర్వపు సముద్రాలు 55 00:07:45,716 --> 00:07:48,010 చాలా భిన్నమైన వేట జంతువు కోసం మంచి అవకాశాలను అందిస్తాయి. 56 00:07:53,724 --> 00:07:56,560 ఉత్తర అమెరికాలో వెచ్చని లోతులేని సముద్ర ప్రాంతాలలో, 57 00:07:56,560 --> 00:08:01,148 రాత్రివేళ సంచరించే లాంతరు చేపల సమూహాలకు దాదాపు సమాన సంఖ్యలో చేపల సమూహాలు సంచరిస్తాయి. 58 00:08:10,240 --> 00:08:16,580 ఆరు అడుగుల పొడవు ఉండే హెస్పరోర్నిస్ జంతువుని ఇవి అయిస్కాంతంలా ఆకర్షిస్తాయి. 59 00:08:33,429 --> 00:08:39,520 హెస్పరోర్నిస్ ఎగరలేకపోవచ్చు, కానీ సముద్ర జీవనానికి అది చక్కగా అలవాటుపడిపోయింది. 60 00:08:56,870 --> 00:09:00,874 పెద్దవైన, బలమైన పాదాలు అది గొప్ప వేగంగా దూసుకువెళ్లడానికి ఉపయోగపడతాయి. 61 00:09:03,502 --> 00:09:06,797 అది గురి పెట్టిన ఏ దురదృష్టపు చేప అయినా 62 00:09:06,797 --> 00:09:10,968 సూది మొనల్లాంటి పళ్లతో ఉండే దాని ముక్కుకి చిక్కిందంటే దాని నుండి తప్పించుకోవడం అసాధ్యం. 63 00:09:25,107 --> 00:09:28,819 హెస్పరోర్నిస్ జంతువులు ఎక్కువ కాలం సమూహాలుగా సంచరించవు. 64 00:09:31,989 --> 00:09:35,325 గ్జిపక్టయినస్ కి ఎక్స్-ఫిష్ అని కూడా పేరు. 65 00:09:37,661 --> 00:09:41,623 ఆహారం పొందే అవకాశం వాటిని త్వరగా పెద్ద సమూహాలలో ఆకర్షిస్తుంది. 66 00:09:47,045 --> 00:09:53,051 దాదాపు పదిహేడు అడుగుల పొడవు ఉండే ఈ జంతువు, సముద్రంలో అత్యంత భారీ ఇంకా వేగంగా సంచరించే చేపల్లో ఒకటి. 67 00:10:07,524 --> 00:10:12,654 పెద్ద నోరు ఉండే గ్జిపక్టయినస్ ఒక్కసారిగా చాలా చేపల్ని మింగేయగలుగుతుంది 68 00:10:12,654 --> 00:10:16,950 దానిలో సగం సైజు ఉండే జంతువుల్ని కూడా అది నోటితో మింగేయగలగడం దాని ప్రత్యేకత. 69 00:10:22,706 --> 00:10:25,292 మొదటిలో, ప్రతి ఒక్కదానికి చాలా ఆహారం దొరుకుతుంది. 70 00:10:27,628 --> 00:10:33,008 కానీ చేపల సంఖ్య క్రమంగా తగ్గిపోయినప్పుడు, ఈ ఎక్స్-ఫిష్ తమ దృష్టిని వేరే వైపు మళ్లిస్తాయి. 71 00:10:37,137 --> 00:10:39,973 వేట జంతువే ఇక ఇప్పుడు వేటాడబడుతుంది. 72 00:10:57,824 --> 00:11:04,206 హెస్పరోర్నిస్ కి కేవలం ఒకే ఒక్క దారి ఉంది: ప్రాణాలు కాపాడుకోవడానికి అవి వేగంగా ఈదాలి. 73 00:11:22,933 --> 00:11:24,977 గ్జిపక్టయినస్ మరింత వేగంగా ఈదగలదు. 74 00:11:27,229 --> 00:11:29,731 కానీ హెస్పరోర్నిస్ చాలా చురుకైనది. 75 00:11:44,204 --> 00:11:49,126 అయితే, ఎక్స్-ఫిష్ దృష్టిలో ఏదైనా తినదగ ఆహారమే... 76 00:11:54,047 --> 00:11:56,258 వాటి జాతికే చెందిన చేపలయినా సరే. 77 00:12:05,517 --> 00:12:08,937 కేవలం క్షణాలలో, ఆహారం అంతా అయిపోయింది... 78 00:12:11,732 --> 00:12:13,775 దానితో ఆ వేట జంతువులు మరొక చోటుకి తరలిపోతున్నాయి. 79 00:12:24,703 --> 00:12:29,082 సముద్రంలో ప్రమాదాలు కేవలం క్రూరమైన వేట జంతువులతోనే రావు. 80 00:12:29,082 --> 00:12:32,002 అవి సముద్రంతో కూడా వస్తుంటాయి. 81 00:12:42,971 --> 00:12:46,016 ఇదిగో, చరిత్ర పూర్వపు యూరోప్ లోని ఈ ద్వీపాలు చుట్టూ, 82 00:12:46,016 --> 00:12:50,521 బలమైన అలలు జలచరాలకు ప్రమాదకరమైన సవాళ్లను సృష్టిస్తున్నాయి. 83 00:12:54,107 --> 00:12:56,902 మరీ ముఖ్యంగా చిన్నగా ఉండే జీవరాశులకి. 84 00:13:11,625 --> 00:13:14,169 ఇవి అమొనైట్ గుడ్లు. 85 00:13:16,088 --> 00:13:17,381 వేల సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. 86 00:13:23,387 --> 00:13:25,681 వాటిని అలలు సముద్రం లోపలికి లాక్కుపోయాయి... 87 00:13:30,060 --> 00:13:31,770 రాళ్ల గుట్టల్లోకి. 88 00:13:41,321 --> 00:13:45,492 ఇక్కడ, అవి ఎలాంటి ప్రమాదం లేకుండా జీవం పోసుకోవడానికి అవకాశం ఉంది. 89 00:13:49,830 --> 00:13:53,458 ఈ గుడ్లు చాలా చిన్నగా, అంగుళంలో చిన్న భాగమంతే ఉంటాయి. 90 00:13:57,796 --> 00:14:01,341 ఆ గుడ్లలో ఉన్న కూనలు ఇక బయటకి విడుదల కావలసిన సమయం వచ్చింది. 91 00:14:12,603 --> 00:14:15,063 అవి నీటిని తోసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. 92 00:14:15,981 --> 00:14:19,109 కానీ కొత్తగా ఈత నేర్చుకోవడం అంత సుళువు కాదు. 93 00:14:29,369 --> 00:14:33,415 ఇప్పటివరకూ, ఈ మడుగులు వాటికి ఆశ్రయం ఇచ్చాయి. 94 00:14:34,750 --> 00:14:39,254 కానీ అలలు వెనక్కి తగ్గినప్పుడు, ఆ మడుగులు ఖాళీ అయిపోతాయి. 95 00:14:46,929 --> 00:14:49,181 కొన్ని అమొనైట్లు తప్పించుకుపోగలుగుతాయి. 96 00:14:54,269 --> 00:14:56,230 కానీ మిగతా అమొనైట్స్ నిస్సహాయంగా ఉండిపోవడంతో, 97 00:14:56,230 --> 00:15:00,067 ఇప్పటివరకూ ఆశ్రయం ఇచ్చిన ఈ మడుగులే ప్రమాదకరమైన ఉచ్చులుగా మారిపోతాయి. 98 00:15:07,616 --> 00:15:12,704 మధ్యాహ్నపు ఎండ వేడిలో, ఈ మడుగులలో నీరు ఆవిరి కావడం మొదలవుతుంది. 99 00:15:15,249 --> 00:15:18,585 ఆ నీరు గనుక పూర్తిగా ఎండిపోతే, ఇవి మొత్తం చనిపోతాయి. 100 00:15:24,049 --> 00:15:25,801 కానీ అన్నింటి పరిస్థితి అలా ఉండదు. 101 00:15:27,302 --> 00:15:30,013 పసికూనలైన అమొనైట్లు ఒక అసాధారణమైన పనిని చేయగలుగుతాయి. 102 00:15:31,849 --> 00:15:36,186 ప్రతి ఒక్కటీ స్వేచ్ఛ కోసం ప్రయత్నిస్తుంది, ఫలితంగా అవి సమూహంగా కదలగలుగుతాయి. 103 00:15:39,523 --> 00:15:43,402 ఈ సామూహిక ప్రయత్నం కారణంగా అవి ఒక్కటిగా సమర్థంగా ముందుకు కదలగలుగుతాయి. 104 00:15:46,613 --> 00:15:50,534 చాలావరకూ ఎండిపోగా మిగిలిన చిన్న అల, 105 00:15:52,202 --> 00:15:55,372 అక్కడ స్థిరంగా పాతుకున్న రాళ్లను తాకి తిరిగి సముద్రంలోకి వెళ్లినప్పుడు... 106 00:16:00,836 --> 00:16:04,298 ఆ అలతో పాటు అవి సముద్రం లోపలికి వెళ్లి ఆపద నుండి మొత్తానికి తప్పించుకుంటాయి. 107 00:16:09,178 --> 00:16:12,347 ఇప్పుడు అవి ఎగసిపడే అలల కోసం ఎదురుచూస్తున్నాయి. 108 00:16:42,836 --> 00:16:44,755 కానీ ప్రతి ఒక్కటీ తప్పించుకోలేకపోవచ్చు. 109 00:16:49,468 --> 00:16:52,054 చాలా అమొనైట్ కూనలు రాళ్ల మధ్య ఇరుక్కుపోతాయి... 110 00:16:57,726 --> 00:17:02,981 అవి ఇటువంటి పైరోరాప్టర్స్ పిల్లలకు ఆహారంగా మారిపోతాయి. 111 00:17:13,407 --> 00:17:17,996 మిగతా అమొనైట్ కూనలు బలమైన అలల తాకిడికి తీరం నుండి చాలా మైళ్ల దూరం సముద్రంలోకి వెళ్లిపోతాయి. 112 00:17:23,335 --> 00:17:28,799 కొన్ని అయితే మరింత దూరం వెళ్లి పసిఫిక్ మహాసముద్రం మధ్య వరకూ వెళ్లిపోతాయి. 113 00:17:31,510 --> 00:17:35,013 ఆ మహాసముద్రం మధ్యలో ఉండే విస్తారమైన పగడపు దిబ్బలు ఇంకా దీవులు 114 00:17:35,013 --> 00:17:38,684 ఈ అమొనైట్ కూనలకి వేల మైళ్ల దూరంలో ఆశ్రయం కల్పిస్తాయి. 115 00:17:46,233 --> 00:17:52,614 ఈ ప్రత్యేకమైన ప్రదేశంలో, ఎలాస్మోసార్ జాతికి చెందిన టౌరాంగిసారస్, సురక్షితమైన ఆశ్రయం పొందుతుంది. 116 00:18:04,334 --> 00:18:08,088 కానీ ఈ లోతులేని ప్రదేశాల అవతల వైపు, కథ ఇందుకు భిన్నంగా ఉంటుంది. 117 00:18:13,719 --> 00:18:18,390 ప్రతి రోజు, ఎలాస్మోసార్స్ సముద్రం లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. 118 00:18:24,104 --> 00:18:30,110 పగడపు దిబ్బల గోడల మధ్య లోయలు ఆహారం సమృద్ధిగా దొరికే ప్రదేశాలకు దారి చూపుతాయి. 119 00:18:34,823 --> 00:18:38,869 ఈ లోతయిన సముద్ర గర్భం కేవలం ఆకలిగొన్న ఎలాస్మోసార్స్ ని మాత్రమే ఆకర్షించవు 120 00:18:39,745 --> 00:18:42,080 కానీ వాటిని వేటాడటం కోసం వచ్చే వేట జంతువులని కూడా ఆకర్షిస్తాయి. 121 00:18:49,338 --> 00:18:51,340 అవి ఈ సముద్రంలోనే అతి భారీ జంతువులు. 122 00:18:55,677 --> 00:18:58,597 యాభై అడుగుల పొడవైన మోసాసారస్. 123 00:19:13,946 --> 00:19:19,993 సముద్ర గర్భంలోని నేల నుండి ఉత్పత్తి అయ్యే పోషకాల కారణంగా అక్కడ చేపల సరఫరా సమృద్ధిగా ఉంటుంది. 124 00:19:25,666 --> 00:19:29,711 తీరైన శరీర ఆకృతి ఇంకా నాలుగు బలమైన ఫ్లిప్పర్లు 125 00:19:29,711 --> 00:19:32,631 ఎలాస్మోసార్స్ కదలికలు చాకచక్యంగా సాగడానికి తోడ్పడతాయి. 126 00:19:39,054 --> 00:19:43,016 కానీ వాటి రోజువారీ ఆహారపు అలవాట్లు కారణంగా వాటి కదలికల్ని 127 00:19:44,351 --> 00:19:47,396 ఒక తెలివైన ఇంకా ఓర్పుగా ఎదురుచూసే వేట జంతువు తేలికగా పసిగట్టేస్తుంది. 128 00:20:00,784 --> 00:20:04,121 మోసాసారస్ అకస్మాత్తుగా దాడి చేసే వేట జంతువు. 129 00:20:09,418 --> 00:20:15,883 ఈ భారీ జంతువు దాని అతి పెద్ద తోకని ఉపయోగిస్తూ సంభ్రమం కలిగించే వేగంతో దూసుకువెళ్లగలుగుతుంది. 130 00:20:29,188 --> 00:20:31,273 ఈసారి, దానిని దురదృష్టం వెన్నాడింది. 131 00:20:41,533 --> 00:20:44,036 వాస్తవానికి, చాలా వేటలు విఫలం అవుతుంటాయి. 132 00:20:47,206 --> 00:20:50,334 కానీ ఇక్కడ పెద్ద సంఖ్యలో ఎలాస్మోసార్స్ నివసిస్తుంటాయి గనుక, 133 00:20:50,334 --> 00:20:53,921 వేటకు మరొక అవకాశం రావడానికి ఎక్కువ సమయం పట్టదు. 134 00:21:10,771 --> 00:21:17,236 లోతయిన లోయల నేలల మీద చీకట్లలో కలిసిపోయే మోసాసార్ ఏ జంతువు కంటా పడకుండా... 135 00:21:19,780 --> 00:21:23,951 అనుభవం లేని కుర్ర జంతువుల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 136 00:21:24,826 --> 00:21:26,578 ఇది వేటకు అనుకూలంగా ఉంది. 137 00:21:50,394 --> 00:21:53,897 మోసాసారస్ తనకు ఆహారం కాబోయే జంతువు మీద ఎంత బలంగా దాడి చేస్తాయంటే 138 00:21:53,897 --> 00:21:56,233 వాటి బలమైన తాకిడికే అవి చచ్చిపోతాయి. 139 00:21:58,402 --> 00:22:04,449 దాని దాడి ఎంత మెరుపువేగంతో ఉంటుందంటే, ఎలాస్మోసార్ కనీసం గమనించలేకపోతుంది. 140 00:22:09,955 --> 00:22:16,920 సముద్ర గర్భంలో జీవనం ప్రమాదకరంగా ఉంటుంది, అది కేవలం ఈ భారీ జలచరాల కారణంగా మాత్రమే కాదు. 141 00:22:19,214 --> 00:22:22,384 రాళ్ల గుట్టల నుండి తప్పించుకుని వచ్చిన అమొనైట్ కూనలలో, 142 00:22:22,384 --> 00:22:26,597 కేవలం వందలో ఒకటి మాత్రమే సముద్రంలో కొన్ని నెలల పాటు జీవించగలుగుతుంది. 143 00:22:29,850 --> 00:22:32,728 కానీ ఈ కొద్ది అమొనైట్స్ కూడా అదృష్టం చేసుకున్నాయి. 144 00:22:34,271 --> 00:22:38,692 సముద్రంలో ప్రవాహం వీటిని జీవించడానికి అనుకూలమైన ప్రదేశాలకు చేర్చాయి: 145 00:22:40,319 --> 00:22:43,280 యూరోప్ తీరప్రాంతాలలోని సముద్రపు పచ్చికబయళ్లు. 146 00:22:53,498 --> 00:22:59,004 ఇక్కడ, అమొనైట్ల సమూహాలు ఆశ్చర్యకరంగా వివిధ పరిమాణాలలో... 147 00:23:00,422 --> 00:23:01,590 ఇంకా వివిధ ఆకృతులలో కనిపిస్తాయి. 148 00:23:24,321 --> 00:23:28,742 ఈ విచిత్రమైన ఆరు అడుగుల పొడవైన భారీ జంతువు పేరు బాక్యులైటీస్, 149 00:23:28,742 --> 00:23:31,328 ఇది సముద్రపు నేలల్లో ఆహారాన్ని తింటూ ఉంటుంది. 150 00:23:39,211 --> 00:23:41,922 ఇంకా దాదాపుగా అంతే పరిమాణంలో ఉంటుంది, 151 00:23:41,922 --> 00:23:46,468 డిప్లొమోసెరస్, ఇది ఒక పెద్ద పేపర్ క్లిప్ మాదిరిగా కనిపిస్తుంది. 152 00:23:54,476 --> 00:23:59,189 ఇక్కడ సరిపడా ఆహారం అందుబాటులో ఉండటం వల్ల ఆ జంతువులన్నీ ఇక్కడ వృద్ధి చెందుతున్నాయి. 153 00:24:02,025 --> 00:24:07,948 నాచు మొక్కలు. చిన్న చిన్న పీతలు. కొన్ని అమొనైట్లు అయితే చిన్న చేపల్ని కూడా ఆరగిస్తాయి. 154 00:24:19,751 --> 00:24:22,337 ఈ అమొనైట్ కూనలు క్రమంగా ఎదిగి 155 00:24:22,337 --> 00:24:26,091 అసాధారణం అనిపించే ఆకృతులలో వృద్ధి చెందుతాయి. 156 00:24:28,552 --> 00:24:33,223 ఇలా పైకి పొడుచుకువచ్చిన చుట్టతో కనిపించేవి చిన్న వయసు నోస్టోసెరస్ గా గుర్తించవచ్చు. 157 00:24:39,855 --> 00:24:42,316 ఇవి పెద్ద వయసు నోస్టోసెరస్. 158 00:24:44,067 --> 00:24:47,446 సముద్ర లోతుల్లో నేలలకు ఇవి ఉపయోగపడతాయి. 159 00:25:10,636 --> 00:25:14,223 అమొనైట్లు ఈ చరిత్రపూర్వ సముద్రాలలో 160 00:25:14,223 --> 00:25:17,434 దాదాపు నలభై కోట్ల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్నాయి. 161 00:25:24,733 --> 00:25:26,652 వాటిలో వేల రకాల జాతులు ఉన్నాయి. 162 00:25:37,079 --> 00:25:41,333 ఈ భూమి మీద జీవించిన అత్యంత విజయవంతమైన జంతు సమూహాలలో ఇవి కూడా ఒకటి... 163 00:25:44,586 --> 00:25:51,385 ఇవి వెచ్చని, సమశీతోష్ణ సముద్రాలలోనే కాకుండా ధ్రువ ప్రాంతాలలోని అతి శీతల సముద్రపు నీటిలో సైతం జీవించాయి. 164 00:25:57,850 --> 00:26:02,729 ఇదిగో ఇక్కడ, అంటార్కిటిక్ చుట్టూ సముద్రం గడ్డకట్టి ఉంది. 165 00:26:13,115 --> 00:26:19,288 పూర్తిగా చీకటి ఆవరించిన శీతాకాలం తరువాత వెచ్చని సూర్యుడు క్రమంగా మంచుని కరిగిస్తున్నాడు... 166 00:26:21,206 --> 00:26:25,711 వాతావరణం మార్పు కారణంగా ఈ భారీ జంతువు సందర్శనకు ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా ఉంది. 167 00:26:30,465 --> 00:26:34,344 మొర్టుర్నెరియా, ఒక విచిత్రమైన ఎలాస్మోసార్ జాతి జంతువు. 168 00:26:36,388 --> 00:26:38,098 దీని రక్తం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది, 169 00:26:38,098 --> 00:26:42,895 దీని శరీరం చుట్టూ మందంగా చేప కొవ్వు కలిగి ఉండటంతో అది ఒంటి వేడిని భద్రపరుస్తుంటుంది. 170 00:26:48,150 --> 00:26:52,321 ఇవి ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ఇంకా అంతుచిక్కని జంతువులు. 171 00:26:56,116 --> 00:27:01,163 ఈ జంతువు దక్షిణ అమెరికా నుండి సుమారు మూడు వేల కిలోమీటర్ల దూరం వలస వచ్చింది... 172 00:27:02,831 --> 00:27:05,501 ...వసంత రుతువు కాలానికి అది ఇక్కడికి చేరుకుంది. 173 00:27:09,338 --> 00:27:14,718 ఈ ఏడాదిలోనే పుట్టిన ఈ జంతువు పిల్లలు మొదటిసారిగా సముద్రపు మంచుని ఎదుర్కోబోతున్నాయి. 174 00:27:18,013 --> 00:27:21,016 గాలిని పీల్చుకునే ఈ సరీసృపానికి ఈ ప్రాంతం ప్రమాదకరం కావచ్చు. 175 00:27:26,813 --> 00:27:30,817 మంచు పొర మధ్య ఖాళీలలో మాత్రమే అవి గాలిని పీల్చుకోవడానికి పైకి రాగలవు. 176 00:27:33,195 --> 00:27:36,281 ఆ మంచు ఫలకాల మధ్య ఖాళీలను పెద్ద జంతువులు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి, 177 00:27:37,032 --> 00:27:39,326 ఇంకా వాటి పిల్లలు పెద్ద జంతువులకు దగ్గరగానే ఉండాలి. 178 00:27:54,424 --> 00:28:00,097 ఈ భారీ జంతువులకు ఇష్టమైన ఆహారానికి ఈ చల్లటి సముద్రపు నీరు చక్కని ఆవాసం. 179 00:28:03,851 --> 00:28:08,522 పూర్తిగా చిన్న చిన్న జీవాలతో ఉండే ధ్రువ ప్రాంతపు బురద. 180 00:28:14,278 --> 00:28:19,575 సముద్రం నేలపైన ప్రతి చదరపు అడుగులో సూక్ష్మ జీవాలు వందల సంఖ్యలో ఉంటాయి. 181 00:28:26,164 --> 00:28:30,627 ఆ బురద మట్టిలో తినదగ్గ ఆహారాన్ని వేరు చేసుకోవడమే పెద్ద సవాలు. 182 00:28:34,131 --> 00:28:36,675 కానీ వాటి దగ్గర చక్కని పరిష్కారం ఉంది. 183 00:28:39,094 --> 00:28:43,390 నోటి నిండా కొంత భాగాన్ని పైకి లేపుతాయి, అప్పుడు అవి పాక్షికంగా దవడలు మూసి ఉంచుతాయి, 184 00:28:45,309 --> 00:28:49,438 దాని ద్వారా ఆహారాన్ని వేరు చేయడానికి భారీ జల్లెడని రూపొందించగలుగుతాయి. 185 00:28:54,610 --> 00:28:59,823 ఈ విధంగా ఆహారాన్ని స్వీకరించే దంతాలు కలిగిన ఏకైక జంతువులు ఇవి మాత్రమే. 186 00:29:31,355 --> 00:29:34,775 ఈ మొర్టుర్నెరియా జంతువులు వేసవి కాలం అంతా ఇక్కడ ఆహారాన్ని ఆరగించి, 187 00:29:34,775 --> 00:29:38,862 మళ్లీ ధ్రువ ప్రాంతపు శీతాకాలం వచ్చి నీరు అంతా గడ్డకట్టుకుపోయాక తరలి వెళ్లిపోతాయి. 188 00:29:51,250 --> 00:29:55,128 వెచ్చని నీళ్లల్లో, అవి వేరే సవాళ్లను ఎదుర్కొంటాయి. 189 00:29:58,298 --> 00:30:03,011 కానీ చాలా చాకచక్యమైన జంతువులు 190 00:30:04,429 --> 00:30:08,100 చరిత్ర పూర్వపు భూగ్రహంలో, ఈ విశాలమైన సముద్రాలలో ఎప్పుడూ అవకాశాలను పొందుతూనే ఉంటాయి. 191 00:30:19,570 --> 00:30:24,575 {\an8}Prehistoric Planet: ఆవిష్కరణ 192 00:30:24,575 --> 00:30:28,370 {\an8}మోసాసార్ ఎంత వేగంగా కదులుతుంది? 193 00:30:29,371 --> 00:30:34,001 చరిత్ర పూర్వపు భూములని డైనోసార్లు పాలించాయి. 194 00:30:34,668 --> 00:30:38,964 కానీ సముద్రాలలో మాత్రం చాలా భిన్నమైన సరీసృపాలు ఆధిపత్యం చెలాయించాయి: 195 00:30:38,964 --> 00:30:40,340 మోసాసార్స్. 196 00:30:40,841 --> 00:30:43,385 ఇది ఆ జంతు జాతిలో ఒకదాని కపాలం. 197 00:30:49,558 --> 00:30:53,312 మోసాసార్స్ ప్రధానంగా నీటిలో సంచరించే బల్లులు. 198 00:30:53,312 --> 00:30:57,733 {\an8}ఒక భారీ, ఈదగల, తిమింగలం సైజులో ఉండే కొమొడో డ్రాగన్ ని ఊహించండి. 199 00:30:57,733 --> 00:30:59,902 {\an8}డాక్టర్ మైఖేల్ హబీబ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా 200 00:31:01,153 --> 00:31:06,325 మొనలా ముందుకు పొడుచుకువచ్చిన ముఖం, గరుకు చర్మం, మామూలు కాళ్లకు బదులు నాలుగు రెక్కలు 201 00:31:06,825 --> 00:31:11,872 ఇంకా పొడవుగా తోక, అది షార్క్ తోక మాదిరిగా కనిపిస్తుంది కానీ తలకిందులుగా ఉంటుంది. 202 00:31:12,998 --> 00:31:14,791 అది సాధారణంగా మోసాసార్ రూపం. 203 00:31:19,296 --> 00:31:22,883 వాటిలో అతి పెద్దది మాత్రం మోసాసారస్ హాఫ్మెనాయ్. 204 00:31:25,010 --> 00:31:26,887 ఇది ఆకస్మికంగా దాడి చేసే వేట జంతువు. 205 00:31:27,846 --> 00:31:30,599 కానీ దాని విజయ రహస్యం ఏమై ఉంటుంది? 206 00:31:34,394 --> 00:31:36,522 {\an8}ఇవి కదలకుండా స్థిరంగా ఉండగలవు, కొద్దిగా కూడా కదలకుండా ఉంటూ... 207 00:31:36,522 --> 00:31:38,607 {\an8}కీర్సెన్ ఫోర్మోసో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా 208 00:31:38,607 --> 00:31:41,026 {\an8}...మన కళ్ల ముందే హఠాత్తుగా ఎంతో వేగంగా దూసుకుపోగలవు. 209 00:31:41,735 --> 00:31:45,864 ఈ ఆధునిక ప్రపంచంలో, మొసళ్ల వంటి సరీసృపాలలో మనం ఈ సామర్థ్యాన్ని చూడగలుగుతాం. 210 00:31:54,164 --> 00:31:58,168 వాటి కండరాలు చాలా తక్కువ కాలంలో విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేయగలవు. 211 00:32:01,922 --> 00:32:04,842 మోసాసారస్, అవి సరీసృపాలు, అవి బల్లుల తరహా జంతువులు, 212 00:32:04,842 --> 00:32:07,636 కాబట్టి బహుశా వాటికి కూడా అటువంటి కండరాలు ఉండి ఉండవచ్చు. 213 00:32:11,807 --> 00:32:14,434 అవి మరొక విధానాన్ని కూడా అవలంబించేవి 214 00:32:15,018 --> 00:32:17,604 అవి ఆకస్మికంగా చాలా వేగంగా దాడి చేయగలిగేవి. 215 00:32:19,189 --> 00:32:21,900 ఈతలో ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే 216 00:32:21,900 --> 00:32:25,279 మనం త్వరగా ప్రారంభించడానికి ఒక ప్రత్యేకమైన నేర్పు ఉండాలి 217 00:32:25,279 --> 00:32:28,323 ఒక స్ప్రింటర్ పరుగుని ప్రారంభించినంత వేగంగా ఈత కూడా ప్రారంభించగలగాలి. 218 00:32:28,323 --> 00:32:33,829 అలా ప్రారంభించడానికి చక్కని ఉపాయం ఏమిటంటే సి ఆకారంలో వంపు తిరగాలి 219 00:32:33,829 --> 00:32:36,874 ఆ తరువాత శరీరం పక్క వైపు నుండి నీటిని పక్కకు తోయాలి. 220 00:32:37,958 --> 00:32:40,210 ఈ ఆధునిక కాలంలో చేపలు అటువంటి పద్ధతిని అవలంబిస్తాయి. 221 00:32:41,378 --> 00:32:42,921 సి స్టార్ట్ అనబడే ఈ పద్ధతిలో, 222 00:32:43,505 --> 00:32:49,052 {\an8}స్థిరంగా నిలిచి ఉన్న చోటు నుండి క్షణంలో పూర్తి వేగాన్ని పొందగలగడం సాధ్యం అవుతుంది. 223 00:32:49,052 --> 00:32:50,429 {\an8}వేగం - వేగక్రమం - గడియారం 224 00:32:50,429 --> 00:32:53,765 {\an8}మోసాసార్స్ దాదాపుగా అలాంటి పద్ధతినే అవలంబించేవి, 225 00:32:53,765 --> 00:32:55,893 అయితే వాస్తవానికి అది భారీ స్థాయిలో జరిగేది. 226 00:33:02,107 --> 00:33:08,572 కాబట్టి, ఒక భారీ జంతువు అయిన మోసాసారస్ హాఫ్మెనాయ్ ఖచ్చితంగా ఎంత వేగంగా ఈదగలదు? 227 00:33:09,531 --> 00:33:16,079 ఇది తెలుసుకోవడానికి, ప్రీహిస్టారిక్ ప్లానెట్ టీమ్ ఒక ప్రత్యేకమైన సైంటిఫిక్ అధ్యయనాన్ని ప్రారంభించింది. 228 00:33:18,957 --> 00:33:22,753 ఇటీవలి కాలం వరకూ, ఎవ్వరూ కూడా ఆ జంతువుల సామర్థ్యాన్ని 229 00:33:22,753 --> 00:33:25,881 ఇంత వివరంగా లెక్కించడానికి ప్రయత్నించలేదు. 230 00:33:25,881 --> 00:33:27,674 ఈ జంతువుల సామర్థ్యాలని అంకెల రూపంలో కొలిచే పని 231 00:33:27,674 --> 00:33:31,637 వాస్తవంగా ఒక రకంగా తొలి ప్రయత్నమనే చెప్పాలి. 232 00:33:31,637 --> 00:33:35,641 ఇంకా ఆ అధ్యయనంలో మాకు లభించిన ఫలితాలు నిజంగా ఆశ్చర్యపరిచాయి. 233 00:33:35,641 --> 00:33:37,267 {\an8}శరీరం పొడవు 234 00:33:38,352 --> 00:33:40,521 {\an8}మా టీమ్ నాలుగుసార్లు లెక్కించి చూసింది... 235 00:33:40,521 --> 00:33:41,605 {\an8}పన్నెండు టన్నులు 42 అడుగులు 236 00:33:41,605 --> 00:33:42,856 {\an8}...ఆ ఫలితాలు సరైనవో కావో బేరీజు వేసింది. 237 00:33:42,856 --> 00:33:45,275 {\an8}తోక పొడవు 238 00:33:45,275 --> 00:33:49,196 {\an8}వివిధ పద్ధతులలో నాలుగుసార్లు గణించాక కూడా దాదాపుగా ఒకే విధమైన ఫలితాలు వచ్చాయి. 239 00:33:50,572 --> 00:33:53,992 ఈ జంతువులు విశేషమైన వేగాన్ని అందుకోగలిగేవి. 240 00:34:11,844 --> 00:34:15,931 ఈ మోసాసార్, దాని శరీరం పొడవులో 75 శాతం దూరాన్ని 241 00:34:15,931 --> 00:34:17,641 కేవలం ఒక్క సెకనులో దాటగలిగేవి. 242 00:34:18,766 --> 00:34:23,397 దాని అర్థం, ఒక మోసాసార్ మనకి 17 మీటర్ల దూరంలో ఉన్నట్లయితే, 243 00:34:23,397 --> 00:34:26,900 అది ఒక్క సెకనులో, 75 శాతం మనకి సమీపంగా వచ్చేయగలదు. 244 00:34:26,900 --> 00:34:29,360 ఇంకా రెండో సెకనులో, అది మనల్ని దాటి వెళ్లిపోగలదు 245 00:34:29,360 --> 00:34:31,154 బహుశా ఆ సమయానికి అది మనల్ని మింగేసి కూడా ఉంటుంది. 246 00:34:33,657 --> 00:34:36,201 ఒక మోసాసారస్ దాడికి గురి కావడం అనేది 247 00:34:36,201 --> 00:34:39,288 ఒక పూర్తి సైజు సెమీ ట్రక్కుని ఢీకొనడం లాంటిదే. 248 00:34:39,955 --> 00:34:44,710 అది కొరకడం మాట పక్కన పెడితే, అది దాడి చేసిన తీవ్రతకే, 249 00:34:45,377 --> 00:34:48,297 దానికి ఆహారం కాగల చాలా జంతువులు తక్షణం చనిపోతాయి. 250 00:34:52,426 --> 00:34:54,928 మోసాసార్స్ గంటకు 48.28 కిలోమీటర్ల వేగాన్ని 251 00:34:54,928 --> 00:34:56,972 కేవలం ఒక్క సెకనులో అందుకోగలవు. 252 00:35:00,934 --> 00:35:07,024 ఆ లక్షణమే దానిని, ఎప్పటికీ అత్యంత వేగవంతమైన ఎదురులేని వేట జంతువుగా నిలపగలిగింది. 253 00:37:49,269 --> 00:37:51,271 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్