1 00:00:24,441 --> 00:00:28,445 చురకత్తుల్లాంటి కోరలు ఉన్న పులుల గుంపు. 2 00:00:36,036 --> 00:00:40,624 వేల సంవత్సరాలుగా ఇవి మంచుతో నిండిన ఉత్తర ప్రాంతంలో హాయిగా బ్రతికాయి. 3 00:00:43,752 --> 00:00:47,297 కానీ ఇప్పుడు ఇవి ఆకలితో అలమటిస్తున్నాయి. 4 00:00:52,052 --> 00:00:56,974 ఈ పులులు వేటాడే జీవులు ఇప్పుడు ఈ లోయల్లో తిరగడం అరుదైపోయింది… 5 00:01:00,143 --> 00:01:02,563 వాతావరణం వేడెక్కుతుండటంతో, 6 00:01:03,188 --> 00:01:06,942 మేత మేసే జంతువులు ఆహారం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. 7 00:01:10,654 --> 00:01:13,740 ఇవాళ వీటికి కలిసొచ్చేలా ఉంది. 8 00:01:17,911 --> 00:01:21,999 ఒక మామత్ ఏనుగుల మంద, దక్షిణానికి నూతన మార్గాన్ని ట్రై చేస్తున్నాయి. 9 00:01:37,931 --> 00:01:42,436 ఇంత శక్తివంతమైన జంతువులను వేటాడాలంటే చాలా పెద్ద రిస్క్ తీసుకోవాలి. 10 00:01:45,772 --> 00:01:47,691 కానీ వీటికి వేరే దారి లేదు. 11 00:01:51,403 --> 00:01:54,448 ఇవి మంచు యుగపు ఆఖరి సంవత్సరాలు. 12 00:01:56,408 --> 00:02:02,289 ప్రపంచం వేడెక్కుతుండటంతో, భూమిపై ప్రతీ నివాసస్థలం మారుతోంది. 13 00:02:06,418 --> 00:02:10,964 మంచు కరుగుతుండటంతో, నీరు తిరిగి భూమికి చేరుకుని 14 00:02:11,632 --> 00:02:14,259 అడవి జంతువులు బాగా అభివృద్ధి చెందాయి. 15 00:02:19,097 --> 00:02:21,183 కానీ మంచు యుగంలో ఏలిన జంతువులు 16 00:02:21,266 --> 00:02:24,019 వాటికి తెలిసిన ప్రపంచం అంతమవుతుండటంతో… 17 00:02:25,979 --> 00:02:28,273 మనుగడ కోసం కష్టపడుతున్నాయి. 18 00:02:47,125 --> 00:02:50,754 బిగ్ మెల్ట్ 19 00:03:02,391 --> 00:03:06,311 వ్యాఖ్యానం చేసినది టామ్ హిడిల్ స్టన్ 20 00:03:08,689 --> 00:03:11,483 పులులు తమ మొదటి అడుగు వేసాయి. 21 00:03:13,485 --> 00:03:15,404 వాటికి ఎదురయ్యే పెద్ద ప్రమాదం? 22 00:03:15,904 --> 00:03:17,656 ఈ భారీ మగది. 23 00:03:28,834 --> 00:03:31,253 అనూహ్యమైనది అలాగే శక్తివంతమైంది. 24 00:04:10,292 --> 00:04:14,922 దీనికి గాయమైంది, కానీ ఈ పులులు ప్రయత్నం విరమించుకోవు. 25 00:04:19,176 --> 00:04:22,346 వేడెక్కుతున్న వాతావరణం ప్రపంచంలోని ఈ భూభాగంలో 26 00:04:22,429 --> 00:04:24,014 వలస మార్గాలను మార్చేశాయి. 27 00:04:25,432 --> 00:04:29,937 నదీ తీరాన, దీని ప్రభావం భారీగా కనిపిస్తోంది. 28 00:04:34,066 --> 00:04:37,736 ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఐసు భారీ మోతాదులో పడి 29 00:04:37,819 --> 00:04:41,031 లోతులేని సముద్ర నీటిని పోషకాలతో నింపుతోంది. 30 00:04:50,290 --> 00:04:56,380 ఇక్కడి అడవిలో కరిగిన మంచు నీటి కారణంగా పుష్కలంగా పెరిగిన కేల్ప్ ని తినడానికి 31 00:04:57,631 --> 00:04:59,758 ఈ సముద్ర ఆవుల మంద వచ్చింది. 32 00:05:11,144 --> 00:05:15,899 ఈ మంచు యుగ భారీకాయులు మానటీల జాతికి చెందినవి… 33 00:05:18,443 --> 00:05:21,280 కానీ తిమింగలం అంత పెద్దగా ఉండేవి. 34 00:05:27,244 --> 00:05:29,496 వీటికి కెల్ప్ మొక్క అంటే మహా ఇష్టం. 35 00:05:31,748 --> 00:05:35,586 కానీ ఈ మొక్క తీరప్రాంతంలో ఉన్న లోతులేని నీళ్లలో మాత్రమే పెరుగుతుంది… 36 00:05:37,504 --> 00:05:40,966 కాబట్టి ఇక్కడ మేత మేయడం కాస్త ప్రమాదకరం. 37 00:05:48,223 --> 00:05:52,019 సముద్ర పోటు తగ్గిపోయినప్పుడు, నేలపై ఇరుక్కుపోవడం చాలా కామన్. 38 00:05:55,230 --> 00:05:58,275 దీని బరువు కారణంగా నీటి బయట కదల్లేదు. 39 00:05:59,818 --> 00:06:05,324 అలాగే ఇవాళ, బీచ్ లో ఇరుక్కుపోవడంతో ప్రమాదంలో పడింది. 40 00:06:17,127 --> 00:06:19,296 ఒక చిన్న మొహం ఎలుగుబంటి. 41 00:06:21,340 --> 00:06:24,635 పోలార్ ఎలుగుబంటి కంటే 227 కిలోలు బరువైంది 42 00:06:25,636 --> 00:06:28,013 అలాగే దానికంటే ప్రమాదకరమైంది కూడా. 43 00:06:41,860 --> 00:06:46,865 డైనోసార్ల తర్వాత భూమిపై నడిచిన అతిపెద్ద క్రూరమృగాల్లో ఇది ఒకటి. 44 00:06:53,664 --> 00:06:55,415 దీనికి ఒక వాసన తగిలింది. 45 00:07:14,142 --> 00:07:16,144 ఇది ఇంతకు ముందెప్పుడూ ఇలాంటిదాన్ని చూడలేదు. 46 00:07:20,732 --> 00:07:23,235 కానీ వాసన చూస్తుంటే ఆహారంలాగే ఉంది. 47 00:07:27,114 --> 00:07:29,241 దీనికి ఇదంతా అయోమయంగా ఉంది. 48 00:07:50,095 --> 00:07:54,600 ఒక చిన్న మొహం ఎలుగుబంటి సహజంగా ఎలాంటి జంతువునైనా చీల్చేయగలదు. 49 00:08:00,022 --> 00:08:01,815 అదృష్టవశాత్తు ఈ సముద్ర ఆవుకు 50 00:08:01,899 --> 00:08:06,069 అంగుళం మందం ఉండే మందపాటి తోలు రక్షణ కల్పిస్తోంది. 51 00:08:14,411 --> 00:08:18,081 ఈ ఎలుగుబంటి దాడి దీనికి చిన్న చికాకులా అనిపిస్తోంది. 52 00:08:21,919 --> 00:08:25,339 లేదా బహుశా వీపు గోకినట్టు ఉండొచ్చు. 53 00:08:31,136 --> 00:08:33,347 మళ్ళీ సముద్ర పోటు పెరుగుతోంది. 54 00:08:35,849 --> 00:08:37,100 వేగంగా. 55 00:08:41,063 --> 00:08:44,566 ఎలుగుబంటికైతే కడుపు నింపుకునే అవకాశం చేజారిపోతోంది. 56 00:09:05,420 --> 00:09:08,465 తిరిగి తన కుటుంబాన్ని కలుసుకునే సమయమమైంది. 57 00:09:10,425 --> 00:09:13,762 వాటితో ముచ్చటించడానికి దీని దగ్గర బోలెడన్ని విషయాలు ఉన్నాయి. 58 00:09:22,104 --> 00:09:27,985 బిగ్ మెల్ట్ వల్ల తీరంలో సముద్ర ఆవులు తినే కెల్ప్ మొక్కకి పోషకాలు పుష్కలంగా అందుతున్నాయి… 59 00:09:31,613 --> 00:09:33,866 కానీ చాలా మంచు యుగ భారీ జంతువులకు మాత్రం 60 00:09:35,534 --> 00:09:37,953 మనుగడ కష్టం అవుతోంది. 61 00:09:54,678 --> 00:09:58,015 దక్షిణాన అనేక వేల మైళ్ళ దూరంలో నివసిస్తున్న జంతువుల విషయానికి వస్తే, 62 00:09:58,807 --> 00:10:04,855 వేడెక్కుతున్న వాతావరణం పొదలతో నిండిన ఈ ప్రాంతాన్ని ప్రమాదకరమైన చోటుగా మార్చుతోంది. 63 00:10:14,823 --> 00:10:20,162 రాత్రిపూట ఒక కొలొంబియన్ మామత్ ఇక్కడ సురక్షితంగా మేత మేయగలదు. 64 00:10:29,713 --> 00:10:31,798 కానీ ఒక్కసారి సూర్యుడు ఉదయించాక… 65 00:10:38,430 --> 00:10:41,600 ఈ భారీ జీవి కూడా ప్రమాదంలో పడినట్టే. 66 00:11:13,757 --> 00:11:15,884 ఒక తారుతో నిండిన కొలను. 67 00:11:24,518 --> 00:11:28,522 ఇది భూమి పైభాగంలో లోతైన ప్రాంతం నుండి ఉపరితలానికి ఊరుతుంది. 68 00:11:30,691 --> 00:11:35,362 చల్లబడినప్పుడు దీనిపై సురక్షితంగా నడవచ్చు. 69 00:11:37,281 --> 00:11:40,075 కానీ ఒకసారి ఉష్ణోగ్రత 64 డిగ్రీలకు చేరాక… 70 00:11:42,077 --> 00:11:45,747 ఇదొక ప్రాణాంతకమైన జిగురు ఉచ్చుగా మారుతుంది. 71 00:11:50,043 --> 00:11:52,838 ఇవాళ ఇది మరొక జీవిని బలిదీసుకుంది. 72 00:12:35,714 --> 00:12:40,552 ఉత్తర అమెరికన్ సేబర్ కోరల పులులు భయంకరమైన క్రూరమృగాలు. 73 00:12:43,430 --> 00:12:47,518 కానీ సులభంగా దొరికే ఆహారాన్ని వద్దనుకునే రకాలు కాదు. 74 00:12:56,985 --> 00:13:01,823 సూర్యుడు ఇంకా పైకి రాలేదు, కాబట్టి తారు ఇంకా గట్టిగానే ఉంది. 75 00:13:39,278 --> 00:13:40,863 డైర్ తోడేళ్ళు. 76 00:13:42,739 --> 00:13:46,034 సేబర్ కోరల పులులకు బద్ద శత్రువులు. 77 00:13:51,415 --> 00:13:55,460 ఎముకలను పిండి చేయగల బలమైన దంతాలు ఉన్న వేట గుంపు. 78 00:14:14,897 --> 00:14:19,776 అవకాశం దొరికిందంటే ఈ గుంపు పిల్లల్ని చంపేస్తుంది. 79 00:14:33,290 --> 00:14:36,960 సేబర్ టూత్ పులులు, డైర్ తోడేళ్ళు సమమైన ప్రత్యర్థులు. 80 00:14:40,631 --> 00:14:44,426 కానీ తారు కారణంగా పరిస్థితి పూర్తిగా ఎదురుతిరిగింది. 81 00:14:52,434 --> 00:14:58,190 డైర్ తోడేళ్ళు వాటి బలమైన వాసన పసిగట్టే శక్తితో సురక్షితమైన మార్గాన్ని కనిపెట్టాయి. 82 00:15:36,520 --> 00:15:39,064 తన పిల్లలు ప్రాణాంతకమైన ప్రమాదంలో ఉండటంతో… 83 00:15:45,404 --> 00:15:48,991 అది ఎలాగోలా విడిపించుకుని బయటపడింది. 84 00:16:05,215 --> 00:16:07,885 తన గుంపు సాయం చేయలేని పరిస్థితిలో ఉంది. 85 00:16:16,310 --> 00:16:21,064 తారు గుంతలు మంచు యుగంలో వేల జంతువులను బలితీసుకున్నాయి. 86 00:16:22,566 --> 00:16:26,195 ఈ కుటుంబానికి కలిసొచ్చింది. 87 00:16:32,034 --> 00:16:34,661 ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో, 88 00:16:34,745 --> 00:16:40,000 మంచు యుగ పచ్చిక బయళ్లు కూడా బాగా మారుతున్నాయి. 89 00:16:42,169 --> 00:16:44,546 ఈ రైన్ డీర్లు జీవనాన్ని నెట్టుకొస్తున్నాయి. 90 00:16:47,758 --> 00:16:53,180 కానీ మెగలోసరస్ కి మాత్రం మనుగడ చాలా కష్టం అవుతోంది… 91 00:16:55,516 --> 00:16:58,852 ఒక భారీ మంచు యుగ జింక. 92 00:17:15,410 --> 00:17:18,872 దీని జీవనానికి విశాలమైన మైదానాలు కావాలి. 93 00:17:22,000 --> 00:17:24,586 కానీ నీరు భూభాగానికి తిరిగి చేరుతుండటంతో 94 00:17:25,671 --> 00:17:29,174 మళ్ళీ అడవులు భూమిపై బాగా విస్తరిస్తున్నాయి. 95 00:17:36,390 --> 00:17:42,479 చరిత్రలో అతిపెద్ద కొమ్ములు ఉన్న జంతువు ఇది. 96 00:17:44,898 --> 00:17:47,401 పన్నెండు అడుగుల వెడల్పు. 97 00:17:55,117 --> 00:17:58,704 జతకట్టే సీజన్ లో జోడీని ఆకర్షించడానికి అవి పనికొస్తాయి. 98 00:17:59,830 --> 00:18:03,417 కానీ ఏడాదిలో ఈ సమయంలో కొమ్ములతో వీటికి సమస్యే. 99 00:18:12,885 --> 00:18:14,887 గుహ హైనాలు. 100 00:18:20,184 --> 00:18:25,022 తోడేలుకు రెండింతలు ఉండే క్రూరమైన మాంసాహారులు. 101 00:18:25,772 --> 00:18:28,692 అనేక వేల సంవత్సరాలుగా ఈ భారీ జంతువులను వేటాడాయి. 102 00:18:36,575 --> 00:18:38,493 మెగలోసరస్లు వేగంగా పరిగెత్తగలవు. 103 00:18:39,328 --> 00:18:44,333 ఒకసారి పరుగు అందుకుంటే గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. 104 00:18:51,006 --> 00:18:54,510 ముందుగా పరుగు లంకించుకుంటే హైనాలను వదిలించుకోగలదు. 105 00:19:01,558 --> 00:19:03,185 కానీ అవి సులభంగా విరమించుకోవు. 106 00:19:04,686 --> 00:19:06,939 వాటికి బాగా తెలిసిన ఎత్తుగడ ఒకటి ఉంది. 107 00:19:07,523 --> 00:19:10,734 దాన్ని ఆగకుండా పరిగెత్తేలా చేసేంత దగ్గరగా అవి ఉండగలిగితే… 108 00:19:11,276 --> 00:19:13,779 అప్పుడు అది అలసట తీర్చుకునే అవకాశం ఉండదు… 109 00:19:15,072 --> 00:19:17,115 కారణంగా ఆఖరికి దాన్ని పడగొట్టొచ్చు. 110 00:19:22,037 --> 00:19:24,456 అవి అనుకునేదానికన్నా అది త్వరగానే జరిగేలా ఉంది. 111 00:19:31,296 --> 00:19:33,924 దీనికి ఇప్పుడు ఒక్కటే దారి. 112 00:19:53,151 --> 00:19:54,236 సురక్షితం… 113 00:19:56,905 --> 00:19:58,240 ప్రస్తుతానికి. 114 00:20:07,666 --> 00:20:09,293 ఐసు పలకలు కరుగుతున్న క్రమంలో, 115 00:20:09,877 --> 00:20:13,213 భూమిపై వాతావరణం మరింత తడిగా మారుతోంది. 116 00:20:15,007 --> 00:20:16,884 ఈ ఉష్ణమండల ప్రాంతాలలో, 117 00:20:16,967 --> 00:20:20,971 ఉత్తరం కంటే వేగంగా అడవులు పెరుగుతున్నాయి. 118 00:20:21,847 --> 00:20:24,850 కారణంగా వింతైన జంతువులతో నిండిపోయాయి… 119 00:20:28,437 --> 00:20:30,355 ఈ టెన్రెక్ లాంటివి. 120 00:20:32,608 --> 00:20:34,776 వీటికి కీటకాలను తినడం అంటే చాలా ఇష్టం… 121 00:20:36,695 --> 00:20:38,864 అలాగే పక్షుల గుడ్లను కూడా. 122 00:20:42,117 --> 00:20:46,038 కానీ ఈ గుడ్డును తినే సీన్ దీనికి లేదు. 123 00:20:51,168 --> 00:20:55,130 ఎంతైనా ఇది చరిత్రలోనే అతిపెద్ద గుడ్డు. 124 00:20:56,173 --> 00:21:00,677 అలాగే ఇది చరిత్రలోనే అతిపెద్ద పక్షికి చెందిన గుడ్డు. 125 00:21:03,555 --> 00:21:05,557 ఒక ఏనుగు పక్షి. 126 00:21:08,185 --> 00:21:12,940 మెరిసే రంగులు ఉండే దీని మెడ జోడీని ఆకర్షించడానికి సాయపడుతుంది. 127 00:21:18,111 --> 00:21:22,032 ఈ భారీ జంతువు తండ్రి కాబోతోంది. 128 00:21:28,121 --> 00:21:30,457 కానీ ఏదో తప్పు జరిగింది. 129 00:21:34,253 --> 00:21:36,338 ఈ గుడ్డు పొదగడానికి టైమ్ పడుతోంది. 130 00:21:38,006 --> 00:21:39,758 ఇవి వెళ్లడం ఇప్పటికే ఆలస్యమైంది. 131 00:21:44,847 --> 00:21:47,933 ఏనుగు పక్షులు వాటి గుడ్లన్నిటినీ ఒకేసారి పెడతాయి, 132 00:21:48,016 --> 00:21:50,811 అలా అయితే పిల్లలన్నీ ఒకేసారి బయటకు వస్తాయి. 133 00:22:05,200 --> 00:22:09,371 అప్పుడు మంద మొత్తం ఒకేసారి వాటి ప్రయాణాన్ని మొదలెడతాయి. 134 00:22:16,253 --> 00:22:21,091 టన్ను బరువు ఉంటే గాల్లో ఎగిరే సీన్ ఉండదు. 135 00:22:27,598 --> 00:22:30,267 వదిలేయబడటం ఎవరికీ నచ్చదు కదా. 136 00:22:33,437 --> 00:22:36,273 కానీ ఈ పిల్ల త్వరలో బయటకు వచ్చేలా లేదు. 137 00:22:54,875 --> 00:22:56,919 మిగతావి ఇప్పటికే వెళ్లిపోయాయి, 138 00:22:57,002 --> 00:23:00,339 వేసవిలో చిత్తడినేల ఉన్న ప్రదేశంలో నివాసాన్ని ఏర్పరచుకోవడానికి. 139 00:23:19,983 --> 00:23:23,070 కానీ ఇది ఇంకా నడవడానికి కష్టపడుతోంది. 140 00:23:40,128 --> 00:23:45,592 రానున్న తొమ్మిది నెలలు తండ్రే దీనికి తిండి పెట్టి కాపాడుతుంది. 141 00:23:52,683 --> 00:23:55,519 ఇవి వీలైనంత త్వరగా సమూహాన్ని చేరుకోవాలి. 142 00:24:09,658 --> 00:24:13,078 ఏనుగు పక్షులు ఒక మంచి కారణంగా వేగంగా ప్రయాణిస్తాయి. 143 00:24:17,374 --> 00:24:20,419 ఈ అడవి చాలా ప్రమాదకరమైన చోటు. 144 00:24:27,885 --> 00:24:30,470 అడ్డదారుల్లో వెళ్ళేవి ముఖ్యంగా లక్ష్యం అవుతాయి. 145 00:24:51,325 --> 00:24:53,076 భారీ ఫోస్స. 146 00:24:56,079 --> 00:25:00,459 మాటు వేసి పట్టే మాంసాహారి, వేగంగా, చురుగ్గా కదలగలదు. 147 00:25:09,343 --> 00:25:12,179 ఇది తిండి తినే టైమ్ కాదు. 148 00:26:05,023 --> 00:26:08,402 ఈ గుంపు చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరుకుంది. 149 00:26:10,946 --> 00:26:12,865 ఈ ప్రదేశంలో వర్షం పడింది… 150 00:26:14,283 --> 00:26:16,285 కారణంగా ఈ చిత్తడి నేలలు ఏర్పడి… 151 00:26:17,703 --> 00:26:21,456 అన్నిటికీ తిండి, నీరు పుష్కలంగా దొరుకుతుంది. 152 00:26:30,340 --> 00:26:32,676 మరి దారి తప్పిపోయిన వాటి సంగతి ఏంటి? 153 00:26:43,520 --> 00:26:47,649 ఆఖరిగా పొదగబడిన పిల్ల కూడా చివరికి చేరుకుంది. 154 00:26:56,867 --> 00:27:02,206 చిత్తడి నేలలు విస్తరిస్తుండటంతో, వీటి సంఖ్య ఏళ్ళు గడిచేకొలది పెరుగుతోంది. 155 00:27:05,375 --> 00:27:10,881 బిగ్ మెల్ట్ ఆరంభంతో ఏనుగు పక్షుల స్వర్ణ యుగం కూడా మొదలైంది. 156 00:27:13,133 --> 00:27:18,972 కానీ ఈ భారీ జింక విషయానికి వస్తే, దీని ప్రపంచం కుంచించుకుపోతోంది. 157 00:27:24,353 --> 00:27:29,358 అడవిలో సంచరిస్తుండగా, 12-అడుగుల కొమ్ములు ఇబ్బందిగా మారతాయి. 158 00:27:44,540 --> 00:27:49,211 దిగువ ప్రాంతంలో హైనాలు నదిని దాటడానికి ఒక ప్రదేశాన్ని కనిపెట్టాయి. 159 00:28:27,666 --> 00:28:28,792 చిక్కుకుపోయింది. 160 00:29:20,761 --> 00:29:23,430 అద్భుతమైన రీతిలో తప్పించుకుంది. 161 00:29:33,148 --> 00:29:36,735 తన కొమ్ములు వదలడం వల్ల ఇది బ్రతికింది. 162 00:29:42,866 --> 00:29:46,328 తరువాతి జతకట్టే సీజన్ వచ్చేసరికి మరొక జత కొమ్ములు పెరుగుతాయి. 163 00:29:49,206 --> 00:29:55,546 కానీ దీని జాతికి, అలాగే హైనాలకు సమయం మించిపోతుంది. 164 00:30:05,806 --> 00:30:11,019 సేబర్ కోరల పులులు మామత్ మందను రెండు రోజులుగా అనుసరిస్తున్నాయి. 165 00:30:21,405 --> 00:30:24,157 వీటి ఓర్పు చివరికి ఫలితాన్ని ఇచ్చింది. 166 00:30:32,082 --> 00:30:33,375 మగది, 167 00:30:33,458 --> 00:30:38,046 పులుల మొదటి దాడిలో గాయపడింది వెనుక ఉండిపోయింది. 168 00:30:46,471 --> 00:30:47,931 అది బలహీనమైపోయింది. 169 00:30:54,271 --> 00:30:58,358 పులుల జాతిలో వీటి జాతి ప్రత్యేకమైంది. 170 00:30:59,943 --> 00:31:02,654 దీనికి ఒక సింహానికి ఉన్న బలం… 171 00:31:05,365 --> 00:31:08,243 అలాగే చిరుతపులికి ఉన్న చురుకుదనం ఉంది. 172 00:31:47,324 --> 00:31:50,661 ఈ పులులు మరొక శీతాకాలాన్ని తట్టుకుని బ్రతకగలవు. 173 00:31:58,710 --> 00:32:01,505 అలాగే ఈ మామత్ మంద కూడా. 174 00:32:10,013 --> 00:32:12,015 కానీ వీటి ప్రపంచం మారుతోంది. 175 00:32:17,104 --> 00:32:20,816 మంచు యుగంలో పుట్టుకొచ్చిన మరొక కొత్త క్రూరమృగం 176 00:32:21,650 --> 00:32:24,987 ప్రపంచంలోని ప్రతీ మూలకు వెళుతోంది. 177 00:32:26,321 --> 00:32:31,076 కానీ దాని కథ ప్రస్తుతానికి ఇంకా నడుస్తోంది. 178 00:32:37,833 --> 00:32:41,879 ఐసు క్రింద 179 00:32:45,257 --> 00:32:48,260 మంచు యుగంలో భారీ జంతువులు రాజ్యమేలాయి. 180 00:32:52,347 --> 00:32:56,685 కానీ బిగ్ మెల్ట్ సమయంలో వాటిలో దాదాపు అన్ని జాతులు కనుమరుగైపోయాయి. 181 00:32:59,813 --> 00:33:02,274 ఒకప్పుడు సంచరించిన భారీ జంతువులు 182 00:33:02,357 --> 00:33:06,945 అన్నీ పూర్తిగా కనుమరుగైపోయాయి అని అనుకోవడం చాలా వింతగా ఉంది. 183 00:33:08,197 --> 00:33:09,781 వాటికి ఏమైంది? 184 00:33:11,450 --> 00:33:12,534 ఎందుకు మాయమైపోయాయి? 185 00:33:14,703 --> 00:33:19,499 భారీ జీవులన్నీ ఏమైపోయాయి? 186 00:33:19,583 --> 00:33:22,836 ఆశ్చర్యకరమైన ఒక ప్రదేశంలో కొన్ని సమాధానాలు దొరికాయి. 187 00:33:23,754 --> 00:33:24,796 లాస్ ఏంజెలెస్. 188 00:33:26,256 --> 00:33:31,678 మీరు ఎల్ఏకి వచ్చి ఇక్కడి భారీ రోడ్డు వ్యవస్థని చూస్తే, 189 00:33:31,762 --> 00:33:34,306 ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనంత గొప్ప మంచు యుగ… 190 00:33:34,389 --> 00:33:35,974 డాక్టర్ ఎమిలీ లిండ్సి అసోసియేట్ క్యూరేటర్ 191 00:33:36,058 --> 00:33:38,352 …రికార్డులు ఇక్కడ ఉన్నాయి అని అస్సలు ఊహించలేరు. 192 00:33:39,269 --> 00:33:41,772 ఆఫ్రికన్ సవన్నా అడవులకు స్టెరాయిడ్స్ ఇచ్చినట్టు అన్నమాట. 193 00:33:43,398 --> 00:33:46,318 ఎల్ఏకి వచ్చే వారిలో చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు కావడానికి రారు. 194 00:33:46,401 --> 00:33:48,862 కానీ మాలాంటోళ్ళు కొందరు అందుకే వస్తారు. 195 00:33:48,946 --> 00:33:50,447 నేను కూడా అందుకే వచ్చాను. 196 00:33:51,657 --> 00:33:55,285 ఈ ప్రదేశం ఒక అసాధారణమైన చోటు కావడంతో ఎమిలీ ఇక్కడికి వచ్చింది. 197 00:33:55,369 --> 00:34:01,291 ఈ పురాతన తారు గుంటని ల బ్రెయ టార్ పిట్స్ అంటారు. 198 00:34:02,543 --> 00:34:07,047 ల బ్రెయ టార్ పిట్స్ అనేది ప్రపంచంలోనే అత్యధిక మంచు యుగ శిలాజాలు ఉన్న ప్రదేశం. 199 00:34:08,090 --> 00:34:10,926 ఇక్కడ దాదాపుగా యాభై లక్షల శిలాజాలు దొరికాయి… 200 00:34:11,009 --> 00:34:12,386 ల బ్రెయ టార్ పిట్స్ మరియు మ్యూజియం లాస్ ఏంజెలెస్ 201 00:34:12,469 --> 00:34:16,681 …అయినా ఇంకా ప్రతీ రోజూ మేము ఎన్నో శిలాజాలను వెలికితీస్తూనే ఉన్నాం. 202 00:34:18,934 --> 00:34:21,018 ఈ తారు గుంతలు 203 00:34:21,103 --> 00:34:25,482 ఉచ్చుల్లా పనిచేసి వీటిలోకి అడుగు పెట్టిన 204 00:34:25,565 --> 00:34:29,360 దేన్నైనా పట్టుకుని వాటిని భద్రపరిచి 205 00:34:30,362 --> 00:34:34,949 మంచు యుగపు జీవనం ఎలా ఉండేది అనే విషయంపై ఒక అద్భుతమైన రికార్డును సృష్టించాయి. 206 00:34:43,917 --> 00:34:48,755 ల బ్రెయలో నమ్మశక్యం కాని అద్భుతమైన శిలాజాలు ఉన్నాయి. 207 00:34:48,839 --> 00:34:50,090 ఆ ప్రదేశం నుండి వెలువడిన… 208 00:34:50,174 --> 00:34:51,675 డాక్టర్ విక్టోరియా హెరిడ్జ్ పరిణామ జీవశాస్త్రవేత్త 209 00:34:51,757 --> 00:34:53,552 …ఎముకల సంఖ్య నిజంగా అసాధారణం అనే చెప్పాలి. 210 00:34:54,344 --> 00:34:58,348 మేము దాదాపుగా 3,000 సేబర్ కోరల పులుల ఎముకలు సేకరించాం. 211 00:34:58,849 --> 00:35:00,517 5,000 డైర్ తోడేళ్ళ ఎముకలు. 212 00:35:01,310 --> 00:35:04,730 అది శిలాజాలను కనిపెట్టాలి అనుకునేవారికి అలాదిన్ గుహ లాంటిది. 213 00:35:06,231 --> 00:35:10,652 ఇక్కడ వింతైన విషయం ఏంటంటే ఒక్కసారిగా జంతువులు… 214 00:35:11,945 --> 00:35:15,532 కనుమరుగైనట్టు ఒకేసారి ఆ శిలాజాల సంఖ్య పడిపోతుంది. 215 00:35:17,826 --> 00:35:20,579 మేము ఎముకలపై రేడియో కార్బన్ విశ్లేషణ చేసి 216 00:35:20,662 --> 00:35:24,041 ఆ జంతువులు ఎప్పుడు కనుమరుగయ్యాయో చెప్పగలం. 217 00:35:25,209 --> 00:35:28,962 మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏంటంటే దాదాపుగా ఆ జాతులు అన్నీ 218 00:35:29,046 --> 00:35:31,673 ఒక సమయంలో, ఒకేసారి కనుమరుగయ్యాయి. 219 00:35:31,757 --> 00:35:37,179 అన్నీ 13,000 వేల సంవత్సరాల క్రితం వరకు ఇక్కడికి వచ్చాయి, తర్వాత ఉన్నట్టుండి మాయమైపోయాయి. 220 00:35:38,555 --> 00:35:43,185 ఈ విశాలమైన భూభాగాలు భారీ మంచు యుగ జంతువుల 221 00:35:43,268 --> 00:35:46,480 మందలతో నిండి ఉన్నా, ఉన్నట్టుండి అన్నీ మాయమైపోయాయి. 222 00:35:47,606 --> 00:35:50,859 ఆ జంతువులన్నీ అలా మాయమైపోవడంతో మనకు 223 00:35:50,943 --> 00:35:53,654 "అంత సడన్ గా ఏమైంది?" అనిపిస్తుంది. 224 00:35:53,737 --> 00:35:56,156 ఒక కారణం ఏంటంటే, మంచు యుగం చివరిలో 225 00:35:56,240 --> 00:35:58,784 ఉన్నట్టుండి వాతారణం మారింది. 226 00:35:59,493 --> 00:36:04,998 కేవలం కొన్ని వేల సంవత్సరాలలో కాలిఫోర్నియా పది డిగ్రీలు వేడెక్కింది. 227 00:36:05,082 --> 00:36:07,084 చెట్లలో సగం మాయమైపోయాయి. 228 00:36:07,167 --> 00:36:09,962 అనేక దశాబ్దాల పాటు కరువులు రావడం మొదలైంది. 229 00:36:10,838 --> 00:36:14,174 బహుశా ఆ జంతువులు అవసరమైనంత వేగంగా 230 00:36:14,258 --> 00:36:18,720 మారుతున్న వాతావరణానికి అనుగుణంగా పరిణామం చెందలేకపోయాయి ఏమో. 231 00:36:21,849 --> 00:36:26,061 కానీ ల బ్రెయలో జరిపే పరిశోధన వేరే పరిమాణం ఒకటి చోటుచేసుకుందని చూపిస్తోంది. 232 00:36:27,354 --> 00:36:32,067 మా బృందం దగ్గరలో ఉన్న ఒక కొలనులోని కోర్ శాంపిల్స్ చెక్ చేసి 233 00:36:32,150 --> 00:36:36,446 ఆ కాలంలో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో తెలుసుకోవడానికి చూసింది. 234 00:36:36,530 --> 00:36:41,952 అక్కడ మేము ఆశ్చర్యకరంగా ఉన్నట్టుండి బొగ్గు నిలువలు ఏర్పడినట్టు చూసాం. 235 00:36:43,871 --> 00:36:46,623 ఒక కొత్త జాతి వచ్చింది. 236 00:36:47,624 --> 00:36:51,420 దాంతో ఒక వినాశకరమైన శక్తిని తీసుకొచ్చింది. 237 00:36:56,300 --> 00:36:59,011 అగ్ని మనుషులు కనిపెట్టిన అత్యంత శక్తివంతమైన సాధనం. 238 00:36:59,720 --> 00:37:05,642 మనం వండటానికి, రాత్రుళ్ళు చూడటానికి, వేట కోసం భూభాగాన్ని ఖాళీ చేయడానికి అగ్నిని వాడతాం. 239 00:37:06,476 --> 00:37:13,150 ఇక్కడికి వచ్చిన మొట్టమొదటి మనుషుల జీవన విధానం పూర్తిగా వేరేగా ఉండేది. 240 00:37:14,151 --> 00:37:16,570 మనుషులు మంట పుట్టించడానికి అవసరమైనదాన్ని తీసుకొచ్చారు. 241 00:37:18,238 --> 00:37:20,282 వేల సంవత్సరాల పాటు 242 00:37:20,365 --> 00:37:24,203 ఇంత దారుణమైన అగ్ని చర్య ఈ ప్రాంతంలో ఎక్కడా కనిపించలేదు. 243 00:37:25,787 --> 00:37:27,456 ఒక బాంబు పేలినట్టు అయింది. 244 00:37:27,956 --> 00:37:30,167 దాని కారణంగా పర్యావరణం పూర్తిగా దెబ్బతింది… 245 00:37:30,250 --> 00:37:31,502 డాక్టర్ ఎల్లా గిల్బర్ట్ వాతావరణ శాస్త్రవేత్త 246 00:37:31,585 --> 00:37:34,046 …కారణంగా అక్కడ నివసిస్తున్న జంతువులపై భయంకరమైన ఒత్తిడి పడింది. 247 00:37:35,631 --> 00:37:40,636 ఆ మంటలు ఉద్దేశపూర్వకంగా పెట్టబడినవో, లేక ప్రమాదవశాత్తు ఏర్పడినవో తెలీదు, 248 00:37:41,178 --> 00:37:43,847 కానీ అవి జంతువుల నివాసస్థలాలని నాశనం చేసాయి. 249 00:37:44,765 --> 00:37:48,060 అలాగే మన పూర్వీకుల వేటాడే సామర్థ్యం తోడవ్వడంతో 250 00:37:49,019 --> 00:37:51,063 జంతువుల కాలం చెల్లింది. 251 00:37:52,022 --> 00:37:53,065 ప్రపంచ వ్యాప్తంగా, 252 00:37:53,148 --> 00:37:57,194 ఈ వాతావరణ మార్పు అలాగే మానవ చర్య కలయిక కారణంగా 253 00:37:57,945 --> 00:38:01,323 దాదాపుగా అన్ని మంచు యుగ భారీ జంతువులు చనిపోయాయి, 254 00:38:02,032 --> 00:38:04,868 దాంతో నేడు మనం చూస్తున్న ఈ ప్రపంచం ఏర్పడింది. 255 00:40:28,971 --> 00:40:30,973 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్