1 00:00:11,721 --> 00:00:15,976 డేవిడ్ అటెన్బరో సమర్పణ 2 00:00:16,560 --> 00:00:21,606 ఈ భూమి మీద ఇప్పటివరకూ జీవించిన వాటిలో ఖచ్చితంగా అత్యంత విశిష్టమైన జంతువు, 3 00:00:22,148 --> 00:00:26,361 అన్ని జీవరాశులలో ప్రముఖమైనది, డైనోసర్. 4 00:00:27,404 --> 00:00:29,656 టైరనోసారస్ రెక్స్. 5 00:00:30,699 --> 00:00:35,245 మన అందరిలో ఒక ఊహను ప్రేరేపించగల జంతువు. 6 00:00:35,328 --> 00:00:38,290 ఇది ఏ రకమైన జంతువు? 7 00:00:38,373 --> 00:00:41,585 అది ఎలా ఉండేది? ఎలా జీవించేది? 8 00:00:41,668 --> 00:00:45,630 ఇప్పుడు, శాస్త్రీయ పరిశోధనలు ఈ ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్నాయి. 9 00:00:45,714 --> 00:00:47,966 ఇది కేవలం టి. రెక్స్ కి సంబంధించి మాత్రమే కాదు, 10 00:00:48,049 --> 00:00:51,386 దానితో పాటు జీవించిన ఇతర జీవరాశుల గురించి కూడా తెలియజేస్తున్నాయి. 11 00:00:51,469 --> 00:00:58,059 వాటిని సజీవంగా దర్శించడానికి ఆధునికమైన ఇమేజింగ్ టెక్నాలజీ దోహదపడుతోంది. 12 00:01:01,980 --> 00:01:05,901 భూగోళం, 66 మిలియన్ సంవత్సరాల క్రితం. 13 00:01:13,992 --> 00:01:17,537 ఆకాశం అంతా భారీ పక్షులతో నిండిపోయింది. 14 00:01:20,081 --> 00:01:24,127 సముద్రాలలో, రాక్షస సరీసృపాలు అగాథాల అంచువరకూ పహారా కాస్తున్నాయి. 15 00:01:26,171 --> 00:01:29,299 ఇక భూమి మీద, అన్ని రకాల డైనోసార్లు, 16 00:01:30,508 --> 00:01:33,261 మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నాయి. 17 00:01:39,434 --> 00:01:45,732 డైనోసర్లు రాజ్యం ఏలిన ఈ ప్రపంచం గురించి మనం ఇప్పుడు చాలా తెలుసుకున్నాము. 18 00:01:49,694 --> 00:01:52,239 ఇది వాటి గురించిన కథ. 19 00:02:05,085 --> 00:02:09,296 సముద్ర తీరాలు 20 00:02:09,381 --> 00:02:12,884 ఉత్తర అమెరికా భూభాగాన్ని చీల్చే 21 00:02:12,968 --> 00:02:14,970 గొప్ప లోతట్టు సముద్రపు దక్షిణ తీరాలు ఇవి. 22 00:02:23,311 --> 00:02:27,107 ఈ భూభాగంలో అతి పెద్ద మాంసాహారి జాడలు ఇవి. 23 00:02:32,612 --> 00:02:36,533 ఒక టైరనోసారస్ రెక్స్ ఈత కొడుతోంది. 24 00:02:39,869 --> 00:02:43,164 డొల్లగా, లోపల గాలితో నిండిన ఎముకలు ఇంకా బలమైన వెనుక అవయవాలు 25 00:02:43,248 --> 00:02:46,418 కారణంగా టి. రెక్స్ సమర్థంగా ఈత కొట్టగలదు. 26 00:02:52,424 --> 00:02:58,638 తన యువ సంతానంతో ఉన్న మగ రాకాసి బల్లి ఇది. 27 00:03:02,267 --> 00:03:06,479 ఈ సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఎన్నో ద్వీపాలలో ఒక ద్వీపానికి 28 00:03:06,980 --> 00:03:10,984 ప్రయాణమైన రాకాసి బల్లిని దాని యువ సంతానం అనుసరిస్తున్నాయి. 29 00:03:34,466 --> 00:03:38,845 ఈదడానికి దూరం తక్కువే, కానీ ఇది చాలా ప్రమాదకరమైన ప్రయాణం. 30 00:03:44,309 --> 00:03:45,727 ఇది ఒక మొసాసార్. 31 00:03:45,810 --> 00:03:49,981 టైరనోసార్ కన్నా రెండింతలు పెద్దదయిన భారీ సముద్రపు బల్లి 32 00:03:50,065 --> 00:03:52,484 దాదాపు 15 టన్నుల బరువుంటుంది. 33 00:04:03,161 --> 00:04:05,622 ఈ భూగోళం మీద ఇదే అతిపెద్ద మాంసాహారి. 34 00:04:13,797 --> 00:04:17,007 మొసాసార్ సాధారణంగా తినే ఆహారం తాబేళ్లు. 35 00:04:19,344 --> 00:04:23,557 కానీ ఈ చిన్నారి రాకాసి బల్లులు దీనికి నోరూరిస్తున్నాయి. 36 00:04:33,900 --> 00:04:36,570 పెద్ద టి. రెక్స్ నీటిలో కూడా, 37 00:04:36,653 --> 00:04:39,322 తనని తాను చాలా సమర్థంగా రక్షించుకోగలుగుతుంది. 38 00:04:43,827 --> 00:04:45,912 కానీ ఈ చిన్నారి రాకాసి బల్లులు దగ్గరగా ఉండాలి. 39 00:05:30,373 --> 00:05:34,002 టైరనోసారస్ రెక్స్ పదిహేను పిల్లలని కంటే అందులో కనీసం మూడింట రెండు వంతుల సంతానాన్ని 40 00:05:34,085 --> 00:05:38,215 తొలి సంవత్సరంలోనే కోల్పోతుంది. 41 00:05:45,597 --> 00:05:48,225 ఇప్పుడు అవి నాలుగు మాత్రమే మిగిలాయి. 42 00:05:57,776 --> 00:06:01,196 ఈ ద్వీపంలో రక్షణతో పాటు ఆహారం కూడా లభిస్తుంది. 43 00:06:02,113 --> 00:06:05,825 అతి భారీ రెండు టన్నుల తాబేళ్లు ఇక్కడ గుడ్లు పొదుగుతూ ఉంటాయి. 44 00:06:10,163 --> 00:06:12,832 కానీ ఈ రాకాసి బల్లి ఇక్కడకు రావడానికి కారణం ఈ తాబేలు. 45 00:06:17,254 --> 00:06:21,174 అది మరణించింది, కానీ దాని కుళ్లిన శరీరాన్ని ఈ టైరనోసార్ వాసన చూసింది. 46 00:06:33,019 --> 00:06:35,438 ఈ తాబేలుని బోర్లా తిరగవేయగలిగితే, 47 00:06:35,522 --> 00:06:39,109 అది కనీసం 900 కిలోల కన్నా ఎక్కువ మాంసాన్ని తేలికగా అందివ్వగలదు. 48 00:06:54,791 --> 00:06:58,587 జీవరాశులలోనే అత్యంత శక్తిమంతమైన దవడలు ఉన్న జంతువు టి. రెక్స్ 49 00:07:00,714 --> 00:07:04,509 సుమారు అయిదు టన్నుల బలంతో అది కొరకగలదు. 50 00:07:06,469 --> 00:07:12,017 పిల్ల డైనోసార్లు రుచి చూడాలని ఆతృతగా ఉన్నాయి, కానీ తండ్రి డైనోసార్ మాంసాన్ని పంచుకోవడం లేదు. 51 00:07:12,601 --> 00:07:15,520 అవి సొంతంగా వేటాడటం నేర్చుకునే సమయం ఆసన్నమయింది. 52 00:07:18,106 --> 00:07:21,151 అయితే, ఈ సముద్రతీరం అంత అనుకూలంగా కనిపించడం లేదు. 53 00:07:27,574 --> 00:07:31,953 కానీ సాయంత్రం అయ్యే సరికి, పరిస్థితులు మారడం మొదలయింది. 54 00:07:38,043 --> 00:07:43,506 చిట్టి తాబేళ్లు పొదుగుకుని ఇసుక నుండి బయటకు వచ్చి సముద్రం వైపు వెళుతున్నాయి. 55 00:07:55,268 --> 00:07:59,272 చిన్నారి టి. రెక్స్ లు సరైన శిక్షణా ప్రదేశానికే వచ్చాయి. 56 00:08:06,112 --> 00:08:10,116 అప్పుడే పొదుగుకుని బయటపడిన తాబేళ్లను ఈ అమాయకపు డైనోసార్ పిల్లలు తేలికగా పట్టుకోగలవు. 57 00:08:19,042 --> 00:08:23,004 ఏ వేటగాడికైనా విషయాసక్తి ఉంటే లాభాలు ఉంటాయి. 58 00:08:40,020 --> 00:08:42,440 నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. 59 00:08:55,662 --> 00:09:00,375 తండ్రికి ఇంకా పిల్లలకి సంతృప్తిగా తినగలిగేంత ఆహారం ఇక్కడ సమృద్ధిగా ఉంది. 60 00:09:09,676 --> 00:09:11,303 అన్ని ఉపాయాలూ విఫలమయితే, 61 00:09:11,386 --> 00:09:14,764 వేరొకరి నుండి ఆహారాన్ని దొంగిలించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. 62 00:09:35,785 --> 00:09:37,078 భూగోళం అంతటా, 63 00:09:37,162 --> 00:09:43,168 అంతగా లోతు లేని తీర సముద్రాలు సుమారు నాలుగు కోట్ల కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్నాయి. 64 00:09:43,251 --> 00:09:46,171 అతిపెద్ద ఖండం కన్నా ఇది చాలా ఎక్కువ. 65 00:09:48,215 --> 00:09:51,009 విస్తారంగా ఉండటంతో పాటు వాటి జలాల సుసంపన్నత జత కలిసి, 66 00:09:51,092 --> 00:09:53,720 ఈ ప్రదేశాలు అతి ముఖ్యమైన స్థావరాలుగా మారుతున్నాయి. 67 00:09:59,935 --> 00:10:02,145 భూమి ఎక్కడయితే సముద్రంతో కలుస్తుందో, 68 00:10:02,229 --> 00:10:06,650 సముద్ర లోతుల్లోంచి పోషకాలు వెలికి వచ్చి జీవజాలం అభివృద్ధికి సహకరిస్తాయి. 69 00:10:09,402 --> 00:10:12,697 ముఖ్యంగా నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, 70 00:10:12,781 --> 00:10:16,785 అందువల్ల భారీగా చేపల గుంపులు తీరానికి చేరువగా వస్తుంటాయి. 71 00:10:26,670 --> 00:10:32,384 అటువంటి ప్రదేశాలలో జీవిస్తూ పెద్ద సంఖ్యలో స్థిరపడే ఒక జంతువు ఉంది. 72 00:10:37,556 --> 00:10:40,600 ఎగిరే సరీసృపాలు. టెరోసార్స్. 73 00:10:41,518 --> 00:10:46,398 ఇక్కడ, నార్త్ ఆఫ్రికా సముద్ర తీరాలలో, ఆ జంతువుకు చెందిన ఏడు జాతులు ఉన్నాయి. 74 00:10:49,192 --> 00:10:53,780 అవి ఇక్కడికి ఆహారం కోసం వచ్చి, విశ్రాంతి తీసుకుని తమ పిల్లలను పెంచి పెద్ద చేస్తాయి. 75 00:10:56,658 --> 00:11:00,453 భూమి మీద ఎక్కువ సమయం గడపడానికి అలవాటు పడిన జంతువు జాతి టెథిడ్రాకో 76 00:11:00,537 --> 00:11:04,749 ఇక్కడ గూళ్లు కట్టుకోవడమే కాకుండా తమ సంతతిని కాపాడుకోవడం కోసం కాపలా కాస్తాయి. 77 00:11:10,005 --> 00:11:12,966 వాటి పిల్లలకు తప్పనిసరిగా రక్షణ అవసరం. 78 00:11:17,554 --> 00:11:20,599 కత్తిలాంటి పదునైన ముక్కు ఉన్న ఫోస్ఫటోడ్రాకో. 79 00:11:28,106 --> 00:11:31,902 తొమ్మిది అడుగుల పొడవైన ఈ మాంసాహారి ఈ పక్షుల నివాస ప్రదేశాలలో వేచి ఉండి, 80 00:11:31,985 --> 00:11:35,572 కాపలా లేని జంతు పిల్లని తన్నుకుపోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. 81 00:11:41,786 --> 00:11:45,957 కానీ టేరోసార్స్ లో కొన్ని తరహా జంతువులు భూమి మీద జీవించడానికి ఎక్కువ అలవాటు పడలేదు. 82 00:11:46,041 --> 00:11:49,502 గుడ్లు పొదగడానికి వాటికి భిన్నమైన వ్యూహం ఉంది. 83 00:11:52,464 --> 00:11:56,635 వేటాడే జంతువుల దృష్టిని తక్కువగా ఆకర్షించే ప్రదేశాలలో అవి గూళ్లు ఏర్పాటు చేస్తాయి. 84 00:11:58,011 --> 00:12:00,889 దూరంగా ఉండే ఈ కొండల వంటివి వాటికి అనుకూలమైనవి. 85 00:12:03,475 --> 00:12:07,687 టేరోసార్ గుడ్లు చర్మం మాదిరిగా ఉండి త్వరగా ఎండిపోతాయి, 86 00:12:07,771 --> 00:12:09,981 కాబట్టి వాటిని కప్పి ఉంచడం తప్పనిసరి. 87 00:12:11,691 --> 00:12:15,904 ఈ సముద్రపు కలుపు మొక్కల అడుగున ఏదో కదులుతోంది. 88 00:12:22,202 --> 00:12:25,872 చిట్టి ఆల్సియోనె పిట్ట, కొద్ది అంగుళాలు మాత్రమే పొడవుండి 89 00:12:25,956 --> 00:12:28,250 యాభై ఆరు గ్రాముల కన్నా తక్కువ బరువు ఉంటుంది. 90 00:12:34,047 --> 00:12:37,467 వాటి తల్లులు సుమారు రెండు నెలల కిందట ఇక్కడ గుడ్లు పెట్టాయి. 91 00:12:51,565 --> 00:12:54,568 ఒకరినొకరు పిలుచుకుంటూ, గుడ్లన్నీ సమన్వయంతో పొదగబడతాయి. 92 00:12:55,610 --> 00:12:58,113 వాటి సంఖ్యలో భద్రత కనిపిస్తుంది. 93 00:13:02,617 --> 00:13:05,495 వాటి మొదటి ఆలోచన కొండ ఎక్కడం. 94 00:13:29,394 --> 00:13:33,315 వందల గూళ్లలో పొదిగిన పిట్టలు ఆ కొండ పైన గుమిగూడి 95 00:13:33,398 --> 00:13:35,650 మొదటిసారి ఎగరడానికి అవి సిద్ధమవుతాయి. 96 00:13:44,159 --> 00:13:46,411 కానీ వాటి రెక్కలు ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు. 97 00:13:47,662 --> 00:13:51,082 వాటి రెక్కల పొరకు దన్నుగా ఉండే పొడవు వేలి ఎముకలు 98 00:13:51,166 --> 00:13:56,171 ముందుగా తిన్నగా ఏర్పడి తరువాత ఒక దానికి ఒకటి జోడవ్వాలి, అందుకు కొద్ది గంటలు పడుతుంది. 99 00:13:59,090 --> 00:14:00,884 కానీ అవి ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు. 100 00:14:08,350 --> 00:14:12,270 వాటి ఎముకలు విపరీతమైన తేలికగా ఉంటాయి, దాదాపు తొంభై శాతం గాలితో నిండి ఉంటాయి, 101 00:14:12,354 --> 00:14:15,815 అందువల్ల అవి ఎగరడానికి ఎక్కువ శ్రమపడే అవసరం ఉండదు. 102 00:14:18,652 --> 00:14:21,696 అయినా కూడా, ఎగరడాన్ని పరీక్షించుకోవడం తప్పనిసరి. 103 00:14:23,073 --> 00:14:26,034 ఎగిరే సమయం ఆసన్నమైనప్పుడు, అవి సరిగ్గా ఎగరాలంటే 104 00:14:26,117 --> 00:14:28,078 ఒకే ఒక్క అవకాశం లభిస్తుంది. 105 00:14:35,669 --> 00:14:39,506 కొండ అంచులు ఎత్తుగా ఉండటం వల్ల, అవి ఎగరడానికి అనుకూలంగా ఉంటాయి. 106 00:14:39,589 --> 00:14:43,718 కాబట్టి, ప్రధాన భూభాగం దిక్కుగా చూస్తూ వీచే గాలులను ఎదుర్కొంటూ 107 00:14:43,802 --> 00:14:45,929 అక్కడ గుమిగూడటం వల్ల వాటికి మేలు జరుగుతుంది. 108 00:14:49,391 --> 00:14:52,602 కానీ వాటిలో ఏదీ కూడా ముందుగా ఎగరడానికి సిద్ధంగా ఉండదు. 109 00:14:59,693 --> 00:15:04,906 కానీ, చివరికి, ఒక చిట్టి పక్షి మిగతా పక్షులకు దారి చూపిస్తూ ఎగురుతుంది. 110 00:15:44,821 --> 00:15:47,490 అవి సముద్ర తీరానికి ఇంకా వాటి స్థావరాలకి వెళ్లడం లేదు. 111 00:15:47,574 --> 00:15:52,078 వాటి వెనుకగా ఉన్న పొగమంచు అడవుల్లోకి అవి ముందుగా వెళ్లాలి. 112 00:16:00,795 --> 00:16:02,255 బార్బరిడాక్టిలస్. 113 00:16:02,964 --> 00:16:06,927 బలమైన, వేటాడే టేరోసార్స్ సాధారణంగా చేపలను వేటాడతాయి. 114 00:16:07,719 --> 00:16:10,680 కానీ ఈ చిట్టి పక్షులను అది వదులుకోలేదు. 115 00:16:19,856 --> 00:16:24,945 దాని నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం తమ రెక్కలు ముడిచి కిందకి పడిపోవడమే. 116 00:16:32,077 --> 00:16:36,039 కానీ ఎత్తు తగ్గిపోతే అడవులు చేరుకోవడం వాటికి కష్టం అవుతుంది. 117 00:17:13,159 --> 00:17:15,411 ఒకటి నివాస ప్రదేశంలోకి నేలకూలింది. 118 00:17:15,495 --> 00:17:18,540 ఆ చిట్టి పక్షులకి స్వంత కాళ్ల మీద జీవించే ప్రదేశం కాదు ఇది. 119 00:17:42,814 --> 00:17:46,651 మొదటి విడత పొదిగిన పక్షులలో అదృష్టవశాత్తూ బతికిపోయిన చిట్టి పక్షి 120 00:17:49,195 --> 00:17:51,489 సరైన మార్గంలో ముందుకు సాగిపోతుంది. 121 00:18:10,508 --> 00:18:11,760 అభయారణ్యము. 122 00:18:14,596 --> 00:18:18,975 పొదిగిన పక్షి పిల్లలలో కొన్ని మాత్రమే మిగిలి ఇంత దూరం చేరుకోగలుగుతాయి. 123 00:18:21,853 --> 00:18:23,021 కానీ వాటికి, ఈ అడవి 124 00:18:23,104 --> 00:18:28,318 ఆ చిట్టి టేరోసార్ పక్షికి అవసరమైన ఆశ్రయం ఇంకా ఆహారం అందిస్తుంది. 125 00:18:31,029 --> 00:18:34,449 మరో అయిదు సంవత్సరాల వరకూ ఆ అడవే వాటికి ఇల్లు అవుతుంది. 126 00:18:35,659 --> 00:18:38,954 తరువాత, అవి ఎదిగి పెద్ద పక్షులతో చేరడానికి సిద్ధమవుతాయి, 127 00:18:39,037 --> 00:18:41,915 సముద్రంలో చేపలను వేటాడుతూ పెద్దవి అవుతాయి. 128 00:18:52,467 --> 00:18:57,222 కొన్ని సముద్ర జంతువులు తమ జీవిత కాలం అంతా సముద్రంలో చేపలను వేటాడుతూ గడుపుతాయి 129 00:18:57,305 --> 00:19:01,726 కానీ ఒక ప్రత్యేకమైన పని మీద మాత్రం అవి అప్పుడప్పుడు తీరానికి రావలసి వస్తుంది. 130 00:19:03,520 --> 00:19:07,691 సముద్ర గర్భంలో కలిసిపోయిన జీలాండియా ఖండపు సముద్ర జలాలలో, 131 00:19:07,774 --> 00:19:10,277 ఒక సుదీర్ఘ ప్రయాణం ముగింపునకు సిద్ధమవుతోంది. 132 00:19:11,444 --> 00:19:13,780 ఇవి టౌరంగిసార్స్, 133 00:19:13,863 --> 00:19:17,701 సుమారు ముప్పై అడుగుల పొడవైన భారీ సముద్ర సరీసృప జీవి. 134 00:19:24,916 --> 00:19:29,421 ఈ ఆడ జంతువుని తన ఆరు నెలల పసికూన అనుసరిస్తూ ఉంటుంది. 135 00:19:34,301 --> 00:19:38,263 ఆ ఆడజంతువు ప్రతి రెండేళ్లకో ఎప్పుడో ఒకే ఒక్క పిల్లకి జన్మనిస్తుంది. 136 00:19:38,346 --> 00:19:39,973 అది చాలా భారీ పెట్టుబడి, 137 00:19:40,056 --> 00:19:44,144 ఆ తల్లికీ పిల్లకీ మధ్య అనుబంధానికి అదే చాలా ముఖ్యమైనది. 138 00:19:55,113 --> 00:20:00,118 ఈ ఆడజంతువు తన పసికూనని మైళ్ల దూరంలో ఉన్న ఈ తీరానికి తీసుకువచ్చింది. 139 00:20:12,172 --> 00:20:13,590 అవి ఒంటరివి కావు. 140 00:20:14,174 --> 00:20:17,886 టౌరంగిసార్స్ దక్షిణ పసిఫిక్ మహాసముద్రం నుంచి కూడా ఇక్కడికి వస్తాయి. 141 00:20:34,319 --> 00:20:40,033 మగజంతువులు కూడా ఇక్కడికి వచ్చి ఆడ జంతువులను మచ్చిక చేసుకోవాలని చూస్తాయి. 142 00:20:46,915 --> 00:20:51,628 అయితే ప్రస్తుతానికి, జత కలవడం అనేది ఆడ జంతువు ప్రధాన లక్ష్యం కాదు. 143 00:20:56,508 --> 00:21:00,595 మిగతా ఎక్కడా దొరకనిది ఏదో ఇక్కడ ఈ తీర ప్రాంతం అందిస్తోంది. 144 00:21:17,237 --> 00:21:22,200 గులకరాళ్లు విశిష్టంగా నున్నగా, గట్టిగా ఇంకా గుండ్రంగా ఉంటాయి. 145 00:21:24,744 --> 00:21:29,332 నదీ జలాల ప్రవాహం కారణంగా అవి ఆ రూపులోకి మారతాయి, కానీ వాటిని కనుగొనడం కష్టం. 146 00:21:36,548 --> 00:21:40,051 అయితే, ఇక్కడ, ఈ జలపాతం అడుగు భాగంలోని కొలనులో, 147 00:21:40,135 --> 00:21:41,636 అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. 148 00:21:41,720 --> 00:21:44,222 ఈ టౌరంగిసార్స్ వాటిని ఏరుకుంటాయి. 149 00:21:50,020 --> 00:21:52,314 ఆ తరువాత అవి చాలా ప్రత్యేకమైన పని ఒకటి చేస్తాయి. 150 00:21:52,981 --> 00:21:54,316 వాటిని అవి మింగేస్తాయి. 151 00:21:56,192 --> 00:22:01,740 ఆ రాళ్లు వాటి కడుపులో బరువును పెంచి, అరుగుదలకు ఉపయోగపడతాయి. 152 00:22:01,823 --> 00:22:05,619 తమ కడుపుల్లో నమలకపోవడం వల్ల పేరుకుపోయిన ఆహారాన్ని మెత్తగా నలగ్గొట్టి 153 00:22:05,702 --> 00:22:08,038 అవి అరిగేలా చేస్తాయి ఈ గులకరాళ్లు. 154 00:22:16,338 --> 00:22:17,589 ఒక చిట్టి జంతువుకి, 155 00:22:17,672 --> 00:22:21,343 మొదటిసారి గులకరాళ్లను మింగడం అంత తేలికైన విషయం కాదు. 156 00:22:22,385 --> 00:22:24,429 అందుకు కొద్దిగా సాధన చేయాలి. 157 00:22:27,390 --> 00:22:33,021 కానీ తల్లి జంతువుకి తనకు తగిన మగ జంతువుని వెతకడానికి ఇది ఒక అవకాశం కల్పిస్తుంది. 158 00:23:13,937 --> 00:23:17,315 ఆ పసికూన చివరికి సాధించింది. 159 00:23:22,654 --> 00:23:25,198 ఇప్పుడు అది వీలైనన్ని రాళ్లను మింగగలుగుతుంది. 160 00:23:25,282 --> 00:23:29,327 ఇది పెద్దదయ్యే కొద్దీ మరిన్ని రాళ్లు మింగడానికి ఇక్కడికి వస్తుంది. 161 00:23:35,917 --> 00:23:39,045 ఈ కుటుంబం ఈ తీర ప్రాంతాన్ని వదిలి 162 00:23:39,129 --> 00:23:41,381 మళ్లీ సముద్రంలోకి వెళ్లే సమయం వచ్చింది. 163 00:23:41,464 --> 00:23:43,842 ఈ చిన్నారి టౌరంగిసార్ విషయంలో, 164 00:23:43,925 --> 00:23:47,470 అది పెద్దయ్యే క్రమంలో ఇది చాలా ముఖ్యమైన దశ. 165 00:23:58,481 --> 00:23:59,774 దక్షిణ యూరోప్ లో, 166 00:23:59,858 --> 00:24:02,736 అట్లాంటిక్ సముద్రం ప్రసిద్ధమైన టెథిస్ సముద్రం కలిసే ప్రదేశంలో, 167 00:24:02,819 --> 00:24:06,656 సముద్ర తీరాలలో భిన్నమైన జంతుజాతులు మనుగడ సాగిస్తున్నాయి. 168 00:24:09,034 --> 00:24:13,371 సముద్ర మట్టం పెరగడం అంటే ఎన్నో ద్వీపాలు మునిగిపోయి 169 00:24:13,455 --> 00:24:16,875 ఇప్పుడు స్పాంజ్ లు, పుట్టగొడుగులు ఇంకా కొరల్స్ తో కప్పబడిపోయాయి. 170 00:24:27,010 --> 00:24:31,264 ఈ లోతులేని తీరాలలోని పగడపు దిబ్బలు ఇక్కడ సూర్యరశ్మిని ఉపయోగించుకుంటూ, 171 00:24:31,348 --> 00:24:35,268 తమ పొరల లోపల పెరిగే శైవలాలతో అవి జత కలుస్తాయి. 172 00:24:43,944 --> 00:24:48,573 సముద్రంలో ప్రవాహపు తరంగాలలో తేలియాడే చిన్న చిన్న ఆహార పదార్థాలను అవి సేకరిస్తాయి. 173 00:25:05,131 --> 00:25:09,594 ఈ సముద్ర జీవులు అసంఖ్యాకంగా బండ రాళ్ల మీద విస్తరిస్తాయి. 174 00:25:14,391 --> 00:25:18,395 కానీ ఇక్కడ ఒక్క రాతిబండ మాత్రం బోసిగా ఉండి ఆశ్చర్యపరుస్తుంది. 175 00:25:21,565 --> 00:25:25,569 దీనికి అవతల సముద్రపు లోతుల్లో, 176 00:25:25,652 --> 00:25:28,280 వేటాడే జంతువులకు అది ఆవాసం... 177 00:25:43,920 --> 00:25:47,549 అమాయకపు రీఫ్ చేపలకు అది ప్రమాదం. 178 00:26:14,659 --> 00:26:19,039 కానీ ఈ జాతి చేపలు భయపడాల్సిన అవసరం లేదు. 179 00:26:20,332 --> 00:26:24,753 ఇది హాఫ్మాన్ కనుగొన్న మొసాసార్, ఇది సముద్రంలోనే అత్యంత ప్రమాదకర వేట జంతువు. 180 00:26:25,337 --> 00:26:29,216 కానీ ఇది ఇక్కడికి వేటాడటానికి రాలేదు. అది శుభ్రం చేయించుకోవడానికి వచ్చింది. 181 00:26:34,888 --> 00:26:40,518 మొసాసార్లు భారీ పరిమాణంలోని బల్లులు, వీటికి బల్లికి ఉన్నట్లే నాలుక చీలి ఉంటుంది, 182 00:26:40,602 --> 00:26:44,439 ఇవి జత కలిసే కాలంలో, బల్లి తరహా రంగురంగుల చర్మం కలిగి ఉంటుంది. 183 00:26:47,108 --> 00:26:50,612 ఆ పాత చర్మాన్ని వదలగొట్టుకోవడానికి ఇది సమయం. 184 00:27:02,415 --> 00:27:04,376 పైగా మనం చూడచక్కగా ముస్తాబు కావాలంటే, 185 00:27:04,459 --> 00:27:08,088 శరీరం అంతా రుద్దుకోవడానికి మించినది మరేమీ ఉండదు. 186 00:27:18,974 --> 00:27:23,395 ఈ వేటజంతువు శరీరం మీద పొరలను చేపలు ఇంకా రొయ్యలు పీకేస్తాయి. 187 00:27:39,202 --> 00:27:43,832 సముద్రంలో సంచరిస్తూ, గాలి పీలుస్తూ బతికే ఈ భారీ రాకాసి బల్లి సముద్ర ఉపరితలంలో 188 00:27:43,915 --> 00:27:46,126 తన ఊపిరితిత్తులను గాలితో నింపుకుంటూ, 189 00:27:47,460 --> 00:27:49,838 విశ్రాంతి తీసుకుంటుంది. 190 00:28:06,938 --> 00:28:08,148 ఒక ప్రత్యర్థి. 191 00:28:08,231 --> 00:28:10,942 ఒక యుక్తవయస్సులో ఉన్న మగ మొసాసార్ ఆ ప్రాంతంలో ఆధిపత్యం కోసం పోరాడుతోంది. 192 00:28:37,135 --> 00:28:40,680 ఈ వృద్ధ మగ మొసాసార్ పదిహేను టన్నుల భారీ కాయపు జంతువు. 193 00:28:40,764 --> 00:28:43,183 కానీ దాని ప్రత్యర్థి చాలా చురుకైనది. 194 00:28:56,655 --> 00:29:01,243 అవి గనుక ఈ విధంగా సమవుజ్జీలు అయితే, ఆ పోరాటాలు చాలా హింసాత్మకంగా ఉంటాయి. 195 00:29:03,620 --> 00:29:07,499 మొసాసార్లను కనుగొన్నప్పుడు వాటి పుర్రెలలో ప్రత్యర్థి జంతువుల 196 00:29:07,582 --> 00:29:09,376 దంతపు ముక్కలు ఇరుక్కుపోయి కనిపించాయి. 197 00:29:16,508 --> 00:29:18,593 ముసలి మగ జంతువు గట్టిగా ఊపిరి పీల్చుకుంది. 198 00:29:26,601 --> 00:29:28,937 ఇప్పుడు దానికి అనుకూలంగా ఉంది. 199 00:29:34,067 --> 00:29:37,487 తన ప్రత్యర్థిని సముద్ర లోతుల్లోకి లాక్కెళ్లి దానిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 200 00:30:24,326 --> 00:30:26,870 వృద్ధ మగ మొసాసార్ గెలిచింది. 201 00:30:27,704 --> 00:30:31,958 ఇప్పటికి అయితే, ఈ పగడపు దిబ్బ దాని సామ్రాజ్యంగానే ఉంటుంది. 202 00:30:40,217 --> 00:30:44,971 ఉత్తర అమెరికా తీర ప్రాంతంలో ఆకాశంలో నెలవంక. 203 00:30:49,684 --> 00:30:56,107 ఆ ప్రశాంతమైన, చీకటి రాత్రులలో ఒక అరుదైన అందమైన సంఘటన జరగబోతోంది. 204 00:31:04,783 --> 00:31:08,828 ఈ రాత్రివేళ, సముద్ర లోతుల్లో కూడా, వెలుగు ఉండబోతోంది. 205 00:31:21,841 --> 00:31:25,887 మెరిసే అమొనైట్లు అగాథాల్లోంచి పైకి వస్తాయి. 206 00:31:34,813 --> 00:31:38,942 అమొనైట్లు నత్తల జాతికి చెందిన జీవులు, అక్టోపస్ ఇంకా స్క్విడ్ లకు సంబంధించినవి. 207 00:31:39,651 --> 00:31:43,947 ఈ స్కఫైడిట్ అమొనైట్లు ఒక మనిషి అరచేతి కన్నా పెద్దగా ఉండవు. 208 00:31:52,163 --> 00:31:55,917 కొద్ది వారాలుగా, అవి సముద్ర తీర ప్రాంతపు లోతులలో గుమిగూడుతున్నాయి. 209 00:32:02,382 --> 00:32:06,845 సముద్ర గర్భంలో, ఈ కాంతులతో ప్లాంక్టన్ ని ఆకర్షించి ఆహారంగా మార్చుకుంటాయి. 210 00:32:07,554 --> 00:32:11,016 కానీ ఈ రాత్రి, ఇవి భిన్నమైన పని చేయబోతున్నాయి. 211 00:32:13,643 --> 00:32:17,105 అవి జత కలవడం కోసం సముద్ర ఉపరితలానికి వస్తున్నాయి. 212 00:32:17,188 --> 00:32:21,151 ప్రతి సమూహంలో వేల సంఖ్యలో అమొనైట్లు చేరాయి. 213 00:32:34,331 --> 00:32:39,753 ఒకదానికి ఒకటి తగులుతూ, అవి ప్రకృతి సహజమైన కాంతి తరంగాలను సృష్టిస్తాయి. 214 00:32:49,095 --> 00:32:51,723 వాటి నాడీ వ్యవస్థ సంక్లిష్టమైనది, 215 00:32:51,806 --> 00:32:55,268 ఫోటోసైట్స్ అనే కాంతిని ఉత్పత్తి చేసే కణాలను ఈ నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. 216 00:33:04,236 --> 00:33:09,115 తమ కన్నా పెద్దగా ఉండే ఆడ అమొనైట్ల చుట్టూ మగ అమొనైట్లు చక్కర్లు కొడతాయి. 217 00:33:10,659 --> 00:33:16,623 అవి ప్రసరించే కాంతి తరంగాలు అనుసరించి ఎవరు సరిజోడి ఎవరు కాదు అనేది నిర్ధారించబడుతుంది. 218 00:33:21,503 --> 00:33:25,966 ఆడ మగ జంట సంభోగించినప్పుడు, అవి తమ కాంతి తరంగాలను సమన్వయం చేసుకుంటాయి. 219 00:33:32,597 --> 00:33:37,060 ఆమె కాంతి తరంగాల లయని అతను అందుకోలేకపోతే అతడు తిరస్కరించబడతాడు. 220 00:33:42,148 --> 00:33:44,359 కానీ ఇక్కడ సంపూర్ణమైన సమన్వయం కుదిరింది. 221 00:33:47,737 --> 00:33:51,992 ఈ జంట ఇప్పుడు సంభోగించి మరొక తరాన్ని పుట్టించడానికి సమాయత్తం అవుతోంది. 222 00:33:57,455 --> 00:33:59,040 ఫలదీకరణ జరిగాక, 223 00:33:59,124 --> 00:34:02,711 ఆడ అమొనైట్లు గుడ్లు పెట్టడం కోసం గూళ్లలోకి చేరిపోతాయి. 224 00:34:11,595 --> 00:34:13,722 తక్కువ కాలం జీవించే చాలా సెఫెలోపోడ్స్ జాతి సముద్ర జీవులలో 225 00:34:13,805 --> 00:34:17,224 సంతానోత్పత్తి అనేది వాటి చివరి దశ. 226 00:34:22,856 --> 00:34:27,110 మరుసటి రోజు ఉదయానికి, ఈ వెలుగులు ఆరిపోయి అవి మరణించి ఉంటాయి. 227 00:34:37,495 --> 00:34:41,499 ఆ అందమైన రాత్రే వాటికి చివరి రాత్రి. 228 00:34:54,596 --> 00:34:58,975 అసంఖ్యాకమైన జీవరాశులు సంభోగించడానికి, తమ సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికీ, 229 00:34:59,059 --> 00:35:04,898 ఆహారాన్ని సమకూర్చుకోవడానికీ భూగోళం అంతటా ఉన్న సముద్ర తీరాలు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాయి. 230 00:35:11,988 --> 00:35:14,449 జీలాండియా సముద్రపు లోతులేని ప్రదేశాలలో 231 00:35:15,367 --> 00:35:19,162 టౌరంగిసార్స్ పెద్ద సంఖ్యలో గుంపులుగా గుమిగూడాయి. 232 00:35:34,010 --> 00:35:39,558 వాటి నాలుగు రెక్కలతో అవి ఈదుతూ సునాయాసంగా ప్రయాణం సాగిస్తూ 233 00:35:39,641 --> 00:35:43,019 వేసవిలో ఇక్కడ గుంపులుగా గుమిగూడే చేపల మందలను వేటాడటానికి వస్తాయి. 234 00:35:44,938 --> 00:35:47,857 మధ్యమధ్యలో, అవి సముద్ర ఉపరితలం చేరుకుని గట్టిగా గాలి పీల్చుకుని 235 00:35:47,941 --> 00:35:51,278 తిరిగి సముద్ర గర్భంలో తమ వేటను కొనసాగిస్తాయి. 236 00:36:00,078 --> 00:36:04,457 కానీ ఒక్క ఆడ జంతువు మాత్రం దాని సహజమైన లక్షణంతో ఈదడం లేదు. 237 00:36:05,709 --> 00:36:10,922 ఆమె ఇంకా తన రెండు సంవత్సరాల పసికూన మిగతా గుంపు కంటే వెనుకబడి ఉన్నారు. 238 00:36:14,843 --> 00:36:17,679 ఈ ఆడ జంతువు అతి కష్టంగా ఈదుతోంది. 239 00:36:20,098 --> 00:36:23,226 అయితే అది ఎవరి కంటా పడకుండా ఉండలేదు. 240 00:36:26,396 --> 00:36:30,025 ప్రమాదకారి అయిన వేటాడే జంతువు, కైకైఫిలు. 241 00:36:35,864 --> 00:36:39,993 బలహీనంగా ఉన్న ఆడ జంతువు ఒక ఊరించే లక్ష్యంగా మారింది. 242 00:36:43,705 --> 00:36:47,375 సముద్ర గర్భం లోతుకు వెళ్లడం ద్వారా అది ప్రమాదాన్ని తగ్గించుకోగలదు. 243 00:36:53,215 --> 00:36:57,761 అయితే ఆ మొసాసార్ దృష్టిని మరల్చడం అనేది ఆ పసికూనకు ప్రమాదకరమైన ఆట. 244 00:36:59,679 --> 00:37:01,848 కానీ అది సమయాన్ని తీసుకుంటోంది. 245 00:37:07,312 --> 00:37:10,774 తల్లి ఇంకా పిల్ల పూర్తిగా ఒంటరిగా లేరు. 246 00:37:21,534 --> 00:37:23,995 ఈ ప్రతి జంతువు బహుశా సంబంధం కలిగి ఉండచ్చు, 247 00:37:24,079 --> 00:37:28,667 అందుకే కైకైఫిలు ని తరిమికొట్టడం ఆ జంతువులన్నింటికీ అవసరం. 248 00:37:53,191 --> 00:37:57,737 ఈ ఆడజంతువు బలహీనంగా ఉండటానికి ఒక కారణం ఉంది. 249 00:37:58,780 --> 00:38:00,323 ఆమె గర్భవతి. 250 00:38:24,890 --> 00:38:28,643 ఏడాదిన్నర గర్భం ధరించిన తరువాత, ఇంక ఇప్పుడు, 251 00:38:29,519 --> 00:38:30,812 ఒక పసిబిడ్డ జన్మించింది. 252 00:38:36,902 --> 00:38:41,740 తన తల్లి పొడవులో దాదాపు సగం ఉండి సుమారు పది అడుగుల పొడవు ఉంది. 253 00:38:42,407 --> 00:38:45,660 సృష్టిలోనే అతిపెద్ద పసికూన ఇది. 254 00:38:53,710 --> 00:38:58,590 మొదటిసారి గాలి పీల్చుకోవడం కోసం సముద్ర ఉపరితలానికి అది చేరుకోవాలి. 255 00:39:19,819 --> 00:39:24,199 ఈ యువ టౌరంగిసార్ సుమారు ఎనభై సంవత్సరాల పాటు జీవించగలదు. 256 00:39:26,243 --> 00:39:28,954 ఇప్పుడు, తన కుటుంబం అండగా ఉండటంతో, 257 00:39:29,037 --> 00:39:32,040 ఒక వేటజంతువుగా దాని స్థానాన్ని అది సొంతం చేసుకోగలదు... 258 00:39:35,126 --> 00:39:38,004 మన భూగోళంలోనే సహజ సంపన్నమైన ప్రదేశం, 259 00:39:39,130 --> 00:39:44,052 మన చరిత్రపూర్వ భూగోళంలో సముద్ర తీరాల చుట్టూ ఆవరించి ఉన్న సముద్రాలు. 260 00:39:59,276 --> 00:40:01,820 తరువాయి భాగంలో, 261 00:40:01,903 --> 00:40:07,284 ఉడుకెత్తించే ఉష్ణోగ్రతలు ఉన్న ఎడారుల మధ్య ఆడ జత కోసం భారీ డైనోసార్ల పోరు. 262 00:40:08,243 --> 00:40:09,661 ఇంకా భూగోళం అంతటా, 263 00:40:09,744 --> 00:40:14,583 నివాసయోగ్యం కాని అత్యంత ప్రతికూల పరిస్థితులలో 264 00:40:14,666 --> 00:40:17,878 మనుగడ సాగించడానికి విశిష్టమైన ప్రత్యేక జీవులు తమకు తెలిసిన ప్రతి ఉపాయాన్నీ అమలు చేయాలి. 265 00:40:18,879 --> 00:40:21,923 కథల వెనుక శాస్త్రీయ మర్మాన్ని తెలుసుకోవడానికి, 266 00:40:22,007 --> 00:40:26,469 షో వెబ్ సైట్ ని వెంటనే చూడండి. 267 00:41:54,516 --> 00:41:56,518 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్