1 00:00:11,678 --> 00:00:15,182 డేవిడ్ అటెన్బరో సమర్పణ 2 00:00:16,517 --> 00:00:21,563 భూమి మీద ఇప్పటివరకూ జీవించిన జీవరాశులలో ఖచ్చితంగా అత్యంత ప్రత్యేకమైనదీ, 3 00:00:22,105 --> 00:00:26,318 అత్యంత ప్రముఖమైనదీ, డైనోసార్ 4 00:00:27,361 --> 00:00:29,613 టైరనోసారస్ రెక్స్. 5 00:00:30,656 --> 00:00:35,202 ఈ జంతువు మన అందరిలోనూ ఒక ఊహను ప్రేరేపించగలదు. 6 00:00:35,285 --> 00:00:38,247 ఇది ఏ రకమైన జంతువు? 7 00:00:38,330 --> 00:00:41,542 అది ఎలా ఉండేది? ఎలా జీవించేది? 8 00:00:41,625 --> 00:00:45,587 ఇప్పుడు, శాస్త్రీయ పరిశోధనలు ఈ ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్నాయి. 9 00:00:45,671 --> 00:00:47,923 అవి కేవలం టి. రెక్స్ కి సంబంధించి మాత్రమే కాదు, 10 00:00:48,006 --> 00:00:51,343 దానితో పాటు జీవించిన ఇతర జీవరాశుల గురించి కూడా తెలియజేస్తున్నాయి. 11 00:00:51,426 --> 00:00:58,016 వాటిని సజీవంగా దర్శించడానికి ఆధునికమైన ఇమేజింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. 12 00:01:01,436 --> 00:01:05,440 భూగ్రహం, 66 మిలియన్ సంవత్సరాల క్రితం. 13 00:01:13,949 --> 00:01:17,494 ఆకాశం అంతా భారీ పక్షులతో నిండిపోయింది. 14 00:01:20,038 --> 00:01:24,084 సముద్రాలలో, రాక్షస సరీసృపాలు అగాథాల అంచుల వరకూ పహారా కాస్తున్నాయి. 15 00:01:26,128 --> 00:01:29,256 ఇక భూమి మీద, అన్ని జాతుల డైనోసార్లు, 16 00:01:30,465 --> 00:01:33,218 మనుగడ సాగించడానికి పోరాటం చేస్తున్నాయి. 17 00:01:39,391 --> 00:01:45,689 డైనోసార్లు రాజ్యం ఏలిన ఈ ప్రపంచం గురించి మనకి ఇప్పుడు చాలా విషయాలు తెలుసు. 18 00:01:49,651 --> 00:01:52,196 ఇది వాటి గురించిన కథ. 19 00:02:08,544 --> 00:02:11,673 ఎడారులు 20 00:02:11,757 --> 00:02:14,301 దక్షిణ అమెరికాలో పశ్చిమ ప్రాంతం 21 00:02:14,384 --> 00:02:19,097 చరిత్రపూర్వ యుగపు భూగ్రహంలో అత్యంత నిర్జన ప్రదేశాలలో ఒకటి. 22 00:02:20,682 --> 00:02:23,477 ఇక్కడికి రావడానికి జంతువులు సాహసించేవి కావు, 23 00:02:23,560 --> 00:02:28,524 అయినప్పటికీ ఈ భూమి మీద అత్యంత అసాధారణ సమ్మేళనాలకు ఇది వేదికగా ఉంది. 24 00:02:49,878 --> 00:02:51,380 డ్రెడ్నోటస్. 25 00:03:15,404 --> 00:03:21,326 టైటానోసార్స్. ఎనభై అయిదు అడుగుల పొడవు ఇంకా నలభై టన్నుల బరువు. 26 00:03:33,255 --> 00:03:35,257 ఇవన్నీ మగ జంతువులే, 27 00:03:35,841 --> 00:03:39,595 తమకు సమృద్ధిగా ఆహారం అందించే అడవులను విడిచి కొన్ని మైళ్ల దూరం వచ్చేశాయి. 28 00:03:42,222 --> 00:03:47,519 అవి ఇక్కడికి రావడానికి ఒకే ఒక్క కారణం: సంభోగం కోసం పోరాటం. 29 00:03:49,813 --> 00:03:53,609 కొత్తగా వచ్చే మగ జంతువులను గుంపులుగా ఉన్న ఆడ జంతువులు నిశితంగా పరిశీలిస్తాయి, 30 00:03:54,693 --> 00:03:57,362 వాటి శక్తి సామర్థ్యాలనీ, అనుకూలతల్ని బేరీజు వేసుకుంటాయి. 31 00:04:05,621 --> 00:04:08,123 టైటానోసార్స్ పొడవైన మెడలు 32 00:04:08,207 --> 00:04:12,711 అతి తేలికైన గాలి నిండిన ఎముకల గూడు మీద ఆధారపడి ఉంటాయి. 33 00:04:15,339 --> 00:04:18,884 గుల్లగా ఉండే వాటి మెడ ఎముకలు కొన్ని వరుసల గాలితిత్తులకు అనుసంధానించబడి 34 00:04:18,966 --> 00:04:22,721 గొంతులో పళ్లెం మాదిరి గులార్ అనే విచిత్రమైన గాలి సంచులను అవి గాలితో నింపుతుంటాయి. 35 00:04:35,609 --> 00:04:41,823 సొగసుగా గాలి సంచుల్ని ప్రదర్శించే మగ జంతువులు ఎక్కువ ఆడ జంతువుల్ని ఆకర్షిస్తాయి. 36 00:04:48,622 --> 00:04:53,001 దుమ్ము ధూళితో కప్పబడి ఉన్న ఈ భారీ జంతువు 37 00:04:53,585 --> 00:04:56,547 రెండు వారాలుగా మిగతా జంతువుల్ని ఆకర్షిస్తోంది. 38 00:04:59,842 --> 00:05:02,928 ఆ మగ జంతువు బరువు 50 టన్నులు. 39 00:05:11,728 --> 00:05:14,189 ఆ మగ జంతువు ప్రదర్శన ఇప్పటివరకూ 40 00:05:15,315 --> 00:05:17,818 మిగతా ప్రత్యర్థులను మట్టి కరిపించింది. 41 00:05:35,502 --> 00:05:36,753 కానీ కొత్తగా వస్తున్న మగజంతువులు... 42 00:05:42,634 --> 00:05:43,760 భయపడటం లేదు. 43 00:06:39,149 --> 00:06:42,778 అంత భారీ కాయాన్ని పైకి లేపటం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. 44 00:06:47,407 --> 00:06:49,910 కానీ ఇది సామర్థ్యాన్ని నిరూపించుకునే యుద్ధం. 45 00:06:52,621 --> 00:06:58,168 ఈ ఘర్షణ తీవ్రతరం అయి, ప్రతి జంతువు తన ప్రత్యర్థిని గాయపర్చడానికి ప్రయత్నిస్తుంది, 46 00:06:58,252 --> 00:07:01,964 తన బొటనవేలికి ఉంటే చురకత్తుల్లాంటి గోళ్లతో ప్రత్యర్థి శరీరాన్ని పోట్లు పొడుస్తుంది, 47 00:07:03,507 --> 00:07:05,884 తన పదునైన దంతాలతో ప్రత్యర్థి చర్మాన్ని చీల్చి వేస్తుంది. 48 00:07:15,310 --> 00:07:17,229 చిట్టచివరిగా... 49 00:07:26,989 --> 00:07:28,615 మట్టికరిపించే బలమైన దెబ్బ. 50 00:07:39,960 --> 00:07:45,924 ఆ పాత జంతువు ఏలుబడి ఇంక ముగిసింది. 51 00:07:54,516 --> 00:07:59,646 ఈ యువ విజేత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 52 00:08:09,489 --> 00:08:13,952 కొన్ని జంతువులకి, ఓటమికి చెల్లించుకునే మూల్యం, చాలా ఎక్కువగా ఉంటుంది. 53 00:08:40,102 --> 00:08:44,107 కొన్ని జంతువులు ఎడారి వాతావరణానికి ఎంత అలవాటు పడినా, 54 00:08:45,400 --> 00:08:48,153 వాటి మనుగడ అప్పుడప్పుడు కత్తి మీద సాములా ఉంటుంది. 55 00:08:49,530 --> 00:08:51,281 ముఖ్యంగా ఈ ఆసియా ఖండంలో, 56 00:08:52,032 --> 00:08:53,825 వేసవి తీవ్రత అధికంగా ఉండే ఈ ప్రదేశంలో, 57 00:08:53,909 --> 00:08:58,038 ఉష్ణోగ్రతలు అరవై డిగ్రీల సెల్సియస్ మించిపోతాయి... 58 00:09:04,753 --> 00:09:07,965 దానితో నీరు క్షణాలలో ఆవిరైపోతుంటుంది. 59 00:09:14,930 --> 00:09:18,016 ఇక్కడ భీకరంగా కనిపించే సరీసృపాలు కూడా ఉన్నాయి. 60 00:09:24,982 --> 00:09:29,444 కానీ ఈ చిన్న బల్లి కేవలం కొద్ది అంగుళాలు మాత్రమే ఉంది. 61 00:09:34,241 --> 00:09:37,661 ఇక్కడ, ఆహారం అంత తేలికగా దొరకదు. 62 00:09:51,758 --> 00:09:54,845 ఈ భారీ మృతకళేబరం ఆశాజనకంగా ఉంది. 63 00:10:00,267 --> 00:10:02,352 మరణించిన సౌరోపాడ్. 64 00:10:03,353 --> 00:10:06,440 చాలా జీవాలకు ఇది చక్కని విందు అందించగలదు. 65 00:10:11,195 --> 00:10:13,739 కానీ, విచిత్రంగా, అంతా నిశ్శబ్దంగా ఉంది. 66 00:10:17,159 --> 00:10:18,827 టార్బోసారస్... 67 00:10:20,162 --> 00:10:23,707 ఈ ఎడారిలో టి. రెక్స్ కి సరిసమానమైన జంతువు. 68 00:10:27,294 --> 00:10:30,088 అవి మిగతా జంతువులను తరిమివేస్తాయి. 69 00:10:39,056 --> 00:10:42,768 కానీ ఒక బల్లికి, ఆ టార్బోసారస్ లు మంచి విందు అవకాశాలని అందించగలవు. 70 00:10:55,739 --> 00:11:00,369 ఒక జంతు కళేబరం కన్నా ఎక్కువ ఈగలను ఆకర్షించేది ఏదైనా ఉందీ అంటే అది... 71 00:11:05,499 --> 00:11:10,504 ఆ కళేబరాన్ని తిని నిద్రిస్తున్న టార్బోసార్. 72 00:11:32,943 --> 00:11:34,778 ఇది ధైర్యం చేయాల్సిన సమయం. 73 00:11:55,424 --> 00:11:57,467 వెలోసిరాప్టర్. 74 00:12:13,442 --> 00:12:15,611 ఇది జాగ్రత్తపడవలసిన సమయం. 75 00:12:19,323 --> 00:12:23,702 ఎందుకంటే, వెలోసిరాప్టర్లు తరచూ కలసికట్టుగా వేటాడతాయి. 76 00:13:28,642 --> 00:13:30,519 టార్బోసార్స్ కదిలి వెళతాయి. 77 00:13:39,862 --> 00:13:42,072 ఇంక ఇప్పుడు టేరోసార్స్ రంగంలోకి దిగుతాయి... 78 00:13:44,575 --> 00:13:46,827 ఆ కళేబరంలో తమ వాటాని ఆరగిస్తాయి. 79 00:14:09,933 --> 00:14:15,439 పాపం ఆ చిట్టి బల్లి విందు అవకాశాన్ని కోల్పోయింది. 80 00:14:22,487 --> 00:14:27,868 నిలకడ లేని అవకాశాలను వీలైనంతగా అందిపుచ్చుకుంటేనే ఎడారులలో మనుగడ సాధ్యమవుతుంది, 81 00:14:28,493 --> 00:14:33,457 ఈ విషయంలో కొన్ని డైనోసార్లు చాలా సమర్థంగా వ్యవహరిస్తాయి. 82 00:14:41,548 --> 00:14:44,676 మొనోనైకస్ ఒక ఎడారి నిపుణురాలు. 83 00:14:49,640 --> 00:14:51,558 చాలా ఎడారి జంతువుల మాదిరిగానే, 84 00:14:51,642 --> 00:14:55,812 తగినంత ఆహారం సేకరించాలి అంటే విస్తారమైన ప్రదేశాన్ని అది గస్తీ కాయాలి. 85 00:14:59,775 --> 00:15:03,028 ఏ ఆచ్ఛాదన లేని వాటి వట్టి కాళ్లు శరీరాన్ని చల్లగా ఉంచగలుగుతాయి. 86 00:15:04,029 --> 00:15:08,116 దాని శరీరం మీద ఉండే ఈకలు సూర్యకిరణాల వేడి నుండి కాపాడతాయి, 87 00:15:08,200 --> 00:15:11,078 అలాగే అవి ఆ జంతువులకు అసాధారణమైన స్పర్శాజ్ఞానాన్ని అందిస్తాయి. 88 00:15:18,836 --> 00:15:23,590 వాటి ముఖం మీద ఈకలు గుండ్రని ఆకారంలో ఏర్పడి అతి సూక్ష్మమైన శబ్దాలను కూడా గ్రహించేలా చేస్తాయి. 89 00:15:45,612 --> 00:15:48,490 అటువంటి అతి సూక్ష్మమైన వినికిడి శక్తి వల్ల 90 00:15:48,574 --> 00:15:54,580 అది ఈ డొల్ల చెక్క దుంగలో ఏముందో తేలికగా పసిగడుతుంది. 91 00:16:09,595 --> 00:16:13,724 ఇప్పుడు ఈ వేటజంతువు తనకి ఈ పేరు రావడానికి గల ఆయుధాన్ని ఉపయోగిస్తుంది. 92 00:16:15,642 --> 00:16:20,814 మొనోనైకస్, పెద్ద ఒంటి పంజా. 93 00:16:22,316 --> 00:16:26,862 ఈ చెదలు పట్టిన దుంగని తెరవడానికి దానికి అవసరమైన ఆయుధం ఇది. 94 00:16:36,413 --> 00:16:39,666 దీనికి మరొక ప్రత్యేకమైన పరికరం కూడా ఉంది. 95 00:16:42,753 --> 00:16:46,590 తన తలకాయ కన్నా రెండింతలు పొడవైన అనువైన నాలుక. 96 00:16:52,429 --> 00:16:54,932 సమృద్ధిగా ప్రొటీన్లు ఉన్న చక్కని విందు, 97 00:16:55,557 --> 00:16:58,769 కానీ చెదపురుగులు కుట్టి చిరాకు పెడితే తప్ప. 98 00:17:05,901 --> 00:17:10,656 ఈ నిర్జల ఎడారిలో మొనోనైకస్ లాంటి నిపుణత ఉన్న వేట జంతువులు మనుగడ సాగించగలవు. 99 00:17:14,034 --> 00:17:16,869 కానీ అటువంటి వాతావరణం ఎప్పుడూ అలాగే ఉండిపోదు. 100 00:17:18,288 --> 00:17:19,873 అరుదైన సందర్భాలలో, 101 00:17:19,957 --> 00:17:25,587 చల్లని పర్వతాల నుంచి వచ్చే గాలులు అతి వేడి గాలులతో కలుస్తాయి. 102 00:17:26,505 --> 00:17:31,468 ఎడారిలో తుపాను ఏర్పడి, దానితో పాటు వానలను కురిపిస్తుంది. 103 00:17:47,067 --> 00:17:51,321 నేల ఇలా తడవడాన్ని ఆ వేట జంతువు ఎప్పుడూ చూసి ఉండదు. 104 00:17:58,954 --> 00:18:03,041 ఆ వాన నీరు ఈ ఎడారి ప్రాంతాన్ని అనూహ్యంగా మార్చి వేస్తుంది. 105 00:18:13,427 --> 00:18:17,639 వృథాగా పడి ఉన్న విత్తనాలు ప్రాణం పోసుకుని మొలకెత్తుతాయి. 106 00:18:29,860 --> 00:18:34,573 చాలా కొద్ది రోజులలోనే ఈ నిర్జల ప్రదేశాన్ని అవి సమూలంగా మార్చివేస్తాయి. 107 00:18:38,911 --> 00:18:43,081 పచ్చదనంతో పాటు సమృద్ధిగా ఆహారం కూడా అందుతుంది, 108 00:18:44,374 --> 00:18:46,210 కానీ దాన్ని ఎలా ఒడిసిపట్టుకోవాలో తెలియాలి అంతే. 109 00:18:58,639 --> 00:19:03,018 ఎనాంటియోమిథైన్స్ అనేది ఒక ప్రాచీన పక్షి జాతి. 110 00:19:04,144 --> 00:19:06,480 కానీ అవి వేటాడటానికి కొద్దిగా పెద్దవి. 111 00:19:12,569 --> 00:19:16,573 ఇటువంటి అపరిచిత, భిన్నమైన ప్రపంచానికి అలవాటుపడటం కొంత కష్టం అవుతుంది. 112 00:19:22,788 --> 00:19:23,789 అయ్యో పాపం. 113 00:19:44,017 --> 00:19:46,395 ఎట్టకేలకు, దానికి కొద్ది ఆహారం దొరికింది. 114 00:19:49,147 --> 00:19:52,234 కానీ ఈ కొత్త సవాళ్లు కొద్దికాలమే ఉంటాయి. 115 00:19:52,317 --> 00:19:54,945 ఏడారిలో ఒక్క విషయం మాత్రం స్పష్టం. 116 00:19:55,028 --> 00:19:58,949 భగభగ మండే వేడిమి ఇంకా కాలే నేల త్వరలోనే తిరిగి వస్తాయి. 117 00:20:00,701 --> 00:20:04,538 పువ్వులు ఒక పురాతన జ్ఞాపకంగా మారిపోతాయి. 118 00:20:11,920 --> 00:20:15,299 ఎడారులను నిర్జన ప్రదేశాలుగా మార్చేది 119 00:20:15,382 --> 00:20:18,260 ఎడతెగని సూర్యుడి వేడి మాత్రమే కాదు. 120 00:20:18,343 --> 00:20:20,429 హోరు గాలులు కూడా అందుకు కారణమే. 121 00:20:24,349 --> 00:20:28,145 మధ్య ఆసియా ప్రాంతంలో ఇక్కడి విస్తారమైన ప్రదేశంలో గాలులు హోరుగా వీస్తాయి, 122 00:20:28,228 --> 00:20:32,524 దానితో భూమిలో నీటిని మరింత వేగంగా ఆవిరిగా మార్చి పచ్చదనాన్ని సమూలంగా హరించి వేస్తాయి. 123 00:20:42,951 --> 00:20:45,287 ఈ కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి ప్రయత్నిస్తూ 124 00:20:45,370 --> 00:20:48,207 భారీ డైనోసార్లు తరలిపోతూ ఉంటాయి. 125 00:20:51,168 --> 00:20:55,380 ఈ బాతు ముక్కు డైనోసార్స్ ని బార్స్ బోల్డియా అంటారు. 126 00:21:14,441 --> 00:21:17,611 సుదూర ప్రాంతాలలో విహరించడంలో ఇవి నైపుణ్యం కలిగి ఉండి, 127 00:21:18,362 --> 00:21:22,699 ఆశ్చర్యం కలిగించే రీతిలో సుదీర్ఘ కాలం పాటు నీరు లేకుండా ఇవి విహరించగలుగుతాయి. 128 00:21:24,034 --> 00:21:27,579 కానీ చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే, నీరు సమృద్ధిగా దొరుకుతుంది. 129 00:21:33,919 --> 00:21:35,045 వానలు పడినప్పుడు, 130 00:21:35,128 --> 00:21:40,551 అవి నేలలో ఇంకిపోయి భూగర్భంలో చాలా లోతుల్లోకి చేరిపోతాయి. 131 00:21:41,385 --> 00:21:46,139 కానీ, కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో మాత్రం, ఆ నీరు ఉపరితలం వరకూ చేరి, 132 00:21:46,223 --> 00:21:48,267 ఒయాసిస్ ని ఏర్పరుస్తుంది. 133 00:21:51,562 --> 00:21:56,733 ఈ బహిరంగ జలాలు మైళ్ల దూరంలో ఉండే అన్ని రకాల ఎడారి జంతువులను ఆకర్షిస్తాయి. 134 00:22:02,406 --> 00:22:05,284 కొన్ని భారీ జంతువుల ముందు మిగతా జంతువులు చిన్నబోతాయి. 135 00:22:07,870 --> 00:22:10,205 ఆ భారీ జంతువే, మంగోలియన్ టైటన్. 136 00:22:12,583 --> 00:22:14,334 అవి అతి భారీ జంతువులు. 137 00:22:14,418 --> 00:22:16,295 వాటి బరువు దాదాపు డెబ్బై టన్నులు, 138 00:22:16,378 --> 00:22:20,507 ఈ భూమి మీద తిరుగాడిన అత్యంత భారీ జంతువులలో అవి కూడా ఒకటి. 139 00:22:23,468 --> 00:22:27,931 ఇక్కడ నీరు తాగడానికి వచ్చే చిట్టి మొనోనైకస్ కి ఇది ప్రమాదకరమైన ప్రదేశం. 140 00:22:34,563 --> 00:22:36,356 ఇక్కడ చాలా రద్దీ ఉండవచ్చు, 141 00:22:36,440 --> 00:22:41,570 కానీ ఈ భూమి మీద అతి పొడవైన మెడలు గల జంతువులు, ఈ గుంపుని దాటి తేలికగా నీళ్లు అందుకోగలవు. 142 00:23:11,099 --> 00:23:13,977 అటువంటి గుంపు కొందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 143 00:23:20,984 --> 00:23:22,319 టార్బోసార్. 144 00:24:33,015 --> 00:24:39,563 కానీ మిగతా అన్ని జంతువుల మాదిరిగానే, ఈ వేట జంతువు కూడా నీళ్ల కోసమే వచ్చింది. 145 00:24:56,371 --> 00:25:00,417 దాహార్తితో అలమటించే ఎన్నో జంతువులు పగలూ రాత్రీ నీళ్లను తాగేయడం వల్ల, 146 00:25:00,501 --> 00:25:02,419 ఆ నీళ్లు కూడా ఎక్కువ కాలం ఉండవు. 147 00:25:04,379 --> 00:25:06,423 జంతువులు తిరుగు ప్రయాణం అవుతాయి, 148 00:25:06,507 --> 00:25:10,886 ఇక కఠినమైన, నిర్జల, నిర్జన పరిస్థితులు ఆ ఎడారిలో మళ్లీ ఏర్పడుతున్నాయి. 149 00:25:17,893 --> 00:25:21,939 కొన్ని కోట్ల సంవత్సరాలుగా, నీటి ప్రవాహం కారణంగా కొన్ని ఎడారులు 150 00:25:22,022 --> 00:25:24,483 అత్యంత సుందరమైన ప్రకృతి ప్రదేశాలుగా రూపాంతరం చెందాయి... 151 00:25:27,236 --> 00:25:30,072 ఇక్కడ ఉత్తర ఆఫ్రికాలో మాదిరిగా. 152 00:25:30,155 --> 00:25:35,452 ఈ లోయ ప్రదేశాలు ఎడారి సందర్శకులకు ప్రత్యేకమైన అవకాశాలను అందిస్తాయి. 153 00:25:38,288 --> 00:25:43,669 టేరోసార్ జాతి పక్షి, బార్బరిడాక్టిలస్, తన పదిహేడు అడుగుల పొడవైన రెక్కలతో, 154 00:25:43,752 --> 00:25:47,256 వేడి గాలులను తట్టుకుంటూ తన సహజ నైపుణ్యంతో 155 00:25:50,425 --> 00:25:52,594 ఎన్నో దూరాలను అలవోకగా దాటుకొస్తుంది, 156 00:25:52,678 --> 00:25:57,099 దానికి తోడు, ఆ జాతిలో కొన్ని పక్షులు తలలపైన పొడవైన కొమ్ములతో ప్రయాణం సాగిస్తాయి. 157 00:26:15,492 --> 00:26:20,622 ప్రతి సంవత్సరం, వేల సంఖ్యలో మగ ఇంకా ఆడ పక్షులు 158 00:26:20,706 --> 00:26:22,583 ఆకాశంలోని ఈ ప్రత్యేక ప్రదేశాలలో గుమిగూడతాయి. 159 00:26:37,681 --> 00:26:42,936 ఈ ఒంటరి పీఠభూముల శిఖర భాగాలలో వేట జంతువులు ఏవీ చేరుకునే అవకాశం లేదు గనుక 160 00:26:43,020 --> 00:26:45,355 ఈ పక్షులు వాలడానికి సురక్షితమైన ప్రదేశాలు. 161 00:26:45,939 --> 00:26:50,652 భారీ మగ పక్షులు తమ ప్రతాపాలను ప్రదర్శించడానికి కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసుకుంటాయి 162 00:26:52,279 --> 00:26:55,699 మరికొన్ని యువ బ్రహ్మచారి పక్షులు వాటి చుట్టూ చేరతాయి. 163 00:27:01,163 --> 00:27:03,874 ఎవరైనా ప్రత్యర్థి ఆ వలయంలోకి చొరబడితే ఈ సరిహద్దు కాపాలాదారులు హెచ్చరిస్తాయి. 164 00:27:08,253 --> 00:27:12,216 ఆ హెచ్చరికలను కొన్నిసార్లు చాలా హింసాత్మకంగా అమలు చేస్తాయి. 165 00:27:55,259 --> 00:27:59,680 కానీ విజయం సాధించాలంటే ఈ పక్షులకు భారీ కాయాలు ఉండవలసిన అవసరం లేదు. 166 00:28:00,973 --> 00:28:05,310 కొన్ని మగ పక్షులకు నెత్తి మీద కొమ్ములు అభివృద్ధి చెందవు. 167 00:28:14,278 --> 00:28:18,657 అవి ఆడ పక్షులు మాదిరిగా కనిపించే దొంగ మగ పక్షులు 168 00:28:20,158 --> 00:28:23,078 అందువల్ల, అవి ఎవ్వరూ పసిగట్టకుండా జాగ్రత్త పడతాయి. 169 00:28:35,257 --> 00:28:37,718 ఇది చాలా ప్రమాదకరమైన ఆట... 170 00:28:40,637 --> 00:28:44,808 ఎందుకంటే భారీ మగ పక్షులు క్రమం తప్పకుండా గస్తీ తిరుగుతుంటాయి. 171 00:28:49,396 --> 00:28:51,648 ఇంక అవి తమ ప్రదర్శనని ప్రారంభిస్తాయి. 172 00:29:08,582 --> 00:29:11,168 ఆ దొంగ మగ పక్షి బాగోతం బయటపడింది. 173 00:29:37,486 --> 00:29:38,904 కానీ వాస్తవంగా... 174 00:29:40,072 --> 00:29:43,200 ఆ దొంగ మగ పక్షి మరో మగ పక్షి దృష్టిని ఆకర్షించింది. 175 00:29:57,422 --> 00:30:01,051 కానీ ఆ దొంగ మగ పక్షి ఒక నిరాసక్త ఆడ పక్షిలా నటిస్తూ... 176 00:30:07,015 --> 00:30:09,393 ఆ భారీ మగ పక్షి ప్రయత్నాలను తిరస్కరించింది. 177 00:30:13,438 --> 00:30:16,149 ఇప్పుడు, చేయవలసిన పనికి మళ్లీ సిద్ధమయింది... 178 00:30:17,651 --> 00:30:19,778 మరో ఆడ పక్షి దృష్టిలో పడటానికి ప్రయత్నం ప్రారంభించింది. 179 00:30:38,881 --> 00:30:40,090 విజయం వరించింది. 180 00:31:06,283 --> 00:31:09,203 భారీ మగ పక్షులు ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించవచ్చు, 181 00:31:10,287 --> 00:31:14,208 కానీ, చూడబోతే, ఆడ పక్షులు చాలా ఆరోగ్యకరమైన పిల్లలను కనడం కోసం 182 00:31:14,291 --> 00:31:17,794 వీలైనన్ని మగ పక్షులతో సంభోగానికి మక్కువ చూపిస్తాయి... 183 00:31:20,380 --> 00:31:24,510 ఆ మగ పక్షులు గొప్ప ప్రదర్శన చేసి మెప్పు పొందినా లేదా దొంగచాటుగా చెంత చేరినా అవి పట్టించుకోవు. 184 00:31:39,316 --> 00:31:42,444 ఇది అసాధారణమైన విషయం మాత్రమే కాదు, 185 00:31:42,528 --> 00:31:45,531 చరిత్రపూర్వ యుగపు భూగ్రహంలో ఎడారులను ఆశ్రయించి ఎన్నో జీవరాశులు జీవించాయి. 186 00:31:48,408 --> 00:31:52,454 ఇవి కాకుండా మరికొన్ని విచిత్రమైన, ఇతర ప్రకృతి ప్రదేశాలు కూడా ఉన్నాయి. 187 00:31:54,206 --> 00:31:56,583 దక్షిణ అమెరికాలో ఇక్కడ లాంటి ప్రదేశాలు. 188 00:32:01,839 --> 00:32:04,550 ఇది చూడటానికి మంచు పొగలా కనిపిస్తుంది, 189 00:32:04,633 --> 00:32:10,556 కానీ ఈ భారీ మేటలు ఇసుకతో కాకుండా జిప్సమ్ తో ఏర్పడినవి. 190 00:32:11,306 --> 00:32:16,311 జిప్సమ్ ఒక మెత్తని, తెల్లని లవణం, అది తేలికగా నీటిలో కరిగిపోతుంది, 191 00:32:16,395 --> 00:32:21,191 అది భూమి మీద అత్యంత పొడి ప్రదేశాలలో మాత్రమే ఘనపదార్థంగా ఉండగలదు. 192 00:32:26,488 --> 00:32:30,993 ఈ జిప్సమ్ మేటలు చాలా పొడిగా ఉండటం వల్ల ఇక్కడ జీవించడం ఏ జీవికైనా దాదాపు అసాధ్యం. 193 00:32:32,828 --> 00:32:36,123 అయినా కొన్ని డైనోసార్స్ మాత్రం ఎలాగోలా ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి. 194 00:32:39,459 --> 00:32:43,005 సిసెర్నోసారస్ అనేది చిన్న హెడ్రోసార్ జాతి జంతువు. 195 00:32:47,801 --> 00:32:50,846 అవి నాసిరకపు ఆహారాన్ని తిని కూడా బతికేయగలవు, 196 00:32:50,929 --> 00:32:55,309 కానీ ప్రతి దశాబ్ద కాలంలో ఒకసారి ఈ ప్రాంతం పూర్తిగా ఎండిపోయి 197 00:32:55,392 --> 00:32:59,104 దాదాపు పచ్చదనం అంతా ఎండిపోయి చెట్లూ మొక్కలు చనిపోతాయి. 198 00:33:02,524 --> 00:33:07,070 సంరక్షణలో ఉన్న పసికూనలతో సహా ఈ గుంపు మొత్తం అంతరించిపోయే ప్రమాదంలో పడింది. 199 00:33:12,326 --> 00:33:15,829 అయితే కొన్ని వృద్ధ జంతువులు, ఎంతో అనుభవం గడించి ఉన్నాయి, 200 00:33:15,913 --> 00:33:19,583 అవి ఆహారం ఇంకా నీరు దొరికే ప్రాంతాలను గుర్తుంచుకున్నాయి. 201 00:33:21,126 --> 00:33:25,797 మనుగడ సాగించాలంటే ఈ ఎడారిని వదిలి వెళ్లడానికి ప్రయత్నించకూడదని, 202 00:33:25,881 --> 00:33:29,760 కానీ మండిపోతున్న మేటలను దాటుకుంటూ ప్రయాణం సాగించాలని వాటికి తెలుసు. 203 00:33:36,725 --> 00:33:42,022 హోరు గాలులు ఇంకా తరలిపోయే ఇసుక కారణంగా ఎడారి ఎప్పుడూ రూపు మారుతూ ఉంటుంది. 204 00:33:44,983 --> 00:33:47,110 అందువల్ల ఎడారుల్లో దారి కనుక్కోవడం కష్టం అవుతుంది. 205 00:34:08,215 --> 00:34:11,301 ఈ గుంపు రాత్రి వేళల్లో ప్రయాణించడానికి మొగ్గు చూపుతుంది. 206 00:34:30,654 --> 00:34:32,197 ఆ సమయంలో చల్లగా ఉండటమే కాకుండా 207 00:34:32,281 --> 00:34:37,077 ఒక రూపు అంటూ లేని, నిరంతరం మారిపోయే 208 00:34:37,159 --> 00:34:40,414 ఎడారిలో ఆ జంతువులు తేలికగా తమ తోవను గుర్తించి గమ్యం వైపు సాగగలుగుతాయి. 209 00:34:42,291 --> 00:34:45,210 వారికి దారి చూపించేది ఆకాశమే. 210 00:34:48,172 --> 00:34:50,132 చాలా వలస జంతువుల మాదిరిగానే, 211 00:34:50,215 --> 00:34:54,178 హెడ్రోసార్స్ కూడా ఖగోళ సూచికలను గుర్తించగలుగుతాయి. 212 00:35:00,475 --> 00:35:04,563 పగటి వేళ, మండే సూర్యుడు నడినెత్తి మీద నిప్పుల వర్షం కురిపిస్తుంటాడు. 213 00:35:14,239 --> 00:35:19,953 వాటికి కొద్దిగా నీడ దొరికినా కూడా, ఆ గుంపులో కొన్నింటికి ఇదే అంతిమ ప్రయాణం అవుతుంది. 214 00:35:28,003 --> 00:35:30,881 కానీ వాటికి మరొకటి సహకరించగలదు. 215 00:35:35,928 --> 00:35:40,140 లోతయిన, శబ్ద తరంగాల ప్రతిధ్వనులు మైళ్ల దూరం నుండి ప్రయాణిస్తూ 216 00:35:40,224 --> 00:35:42,768 ఈ ఇసుక మేటల మీద నుండి సాగి దూరంగా ఉండే తీర ప్రదేశాన్ని తాకుతాయి. 217 00:35:44,978 --> 00:35:49,274 ఈ శబ్దం ఎంత మంద్రంగా ఉంటుందంటే చాలా జంతువులు దానిని వినలేవు. 218 00:35:49,358 --> 00:35:54,696 కానీ హెడ్రోసార్స్ మాత్రం వినగలవు, అందువల్ల అవి తీర ప్రాంతానికి దారి కనుక్కోగలుగుతాయి. 219 00:35:57,115 --> 00:36:01,787 అయితే ఈ ఎడారిలో అవి ఛేదించవలసిన మరొక అవరోధం మిగిలి ఉంది. 220 00:36:03,580 --> 00:36:07,376 భారీ తీర ప్రాంత ఇసుక దిబ్బలు వాటి గమనానికి అడ్డుగా నిలుస్తున్నాయి. 221 00:36:23,767 --> 00:36:28,981 ఏటవాలుగా, జారిపోయే ఇసుక వల్ల ఆ జంతువుల శక్తి అడుగు అడుగుకీ హరించిపోతోంది. 222 00:37:20,115 --> 00:37:21,491 అవి మొత్తానికి గమ్యాన్ని చేరుకున్నాయి. 223 00:37:32,794 --> 00:37:38,383 సముద్రము ఇంకా ఇసుక మేటలు కలిసే ఆ చోట తేమ ఏర్పడి మొదటి బహుమతిగా 224 00:37:38,467 --> 00:37:42,304 వాటి చర్మం మీద ఘనీభవించి నీటి తుంపరులుగా మారగా అవి నాకుతూ దాహం తీర్చుకుంటాయి, 225 00:37:53,232 --> 00:37:57,986 తీర ప్రదేశంలో అందమైన స్వర్గాన్ని ఈ తేమ సృష్టిస్తుంది. 226 00:38:10,123 --> 00:38:13,752 ఇప్పటికి, ఈ గుంపు తినడానికి ఇక్కడ సరిపడ ఆహారం దొరుకుతుంది, 227 00:38:14,253 --> 00:38:18,090 కానీ తరువాత ఇది ఎండిపోయాక, ఆ గుంపు మరొక చోటుకి వెళ్లిపోవలసి వస్తుంది, 228 00:38:22,219 --> 00:38:25,222 అలా మరోసారి తమ మనుగడ కోసం తాపత్రయపడాల్సి వస్తుంది, 229 00:38:25,806 --> 00:38:29,142 చరిత్రపూర్వ యుగపు ఎడారులలో. 230 00:38:35,816 --> 00:38:37,568 తరువాయి భాగంలో, 231 00:38:37,651 --> 00:38:41,071 ఈ భూమిపై జీవించిన అత్యంత విచిత్రమైన డైనోసార్స్. 232 00:38:41,154 --> 00:38:46,159 ఒక అనాకారి, బాతు ముక్కు భారీ డైనోసార్ నీటి మడుగులలో మొక్కలను ఆహారంగా తీసుకుంటుంది. 233 00:38:48,078 --> 00:38:50,497 మంచి నీరు అది పుట్టిన ప్రదేశం నుండి సముద్రం వరకూ ప్రవహించే మార్గంలో, 234 00:38:50,581 --> 00:38:53,834 అది స్పృశించే అన్ని జీవరాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. 235 00:38:55,127 --> 00:38:58,213 కథల వెనుక శాస్త్రీయ మర్మాలని తెలుసుకోవడానికి, 236 00:38:58,297 --> 00:39:02,718 మా షో పేజీని చూడండి. 237 00:40:30,764 --> 00:40:32,766 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్