1 00:00:11,678 --> 00:00:15,182 డేవిడ్ అటెన్బరో సమర్పణ 2 00:00:16,517 --> 00:00:21,563 భూమి మీద ఇప్పటివరకూ జీవించిన జీవరాశులలో ఖచ్చితంగా అత్యంత ప్రత్యేకమైనదీ, 3 00:00:22,105 --> 00:00:26,318 అత్యంత ప్రముఖమైనదీ, డైనోసార్ 4 00:00:27,361 --> 00:00:29,613 టైరనోసారస్ రెక్స్. 5 00:00:30,656 --> 00:00:35,202 ఈ జంతువు మన అందరిలోనూ ఒక ఊహను ప్రేరేపించగలదు. 6 00:00:35,285 --> 00:00:38,247 ఇది ఏ రకమైన జంతువు? 7 00:00:38,330 --> 00:00:41,542 అది ఎలా ఉండేది? ఎలా జీవించేది? 8 00:00:41,625 --> 00:00:45,587 ఇప్పుడు, శాస్త్రీయ పరిశోధనలు ఈ ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్నాయి. 9 00:00:45,671 --> 00:00:47,923 అవి కేవలం టి. రెక్స్ కి సంబంధించి మాత్రమే కాదు, 10 00:00:48,006 --> 00:00:51,343 దానితో పాటు జీవించిన ఇతర జీవరాశుల గురించి కూడా తెలియజేస్తున్నాయి. 11 00:00:51,426 --> 00:00:58,016 వాటిని సజీవంగా దర్శించడానికి ఆధునికమైన ఇమేజింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. 12 00:01:01,436 --> 00:01:05,440 భూగ్రహం, 66 మిలియన్ సంవత్సరాల క్రితం. 13 00:01:13,949 --> 00:01:17,494 ఆకాశం అంతా భారీ పక్షులతో నిండిపోయింది. 14 00:01:20,038 --> 00:01:24,084 సముద్రాలలో, రాక్షస సరీసృపాలు అగాథాల అంచుల వరకూ పహారా కాస్తున్నాయి. 15 00:01:26,128 --> 00:01:29,256 ఇక భూమి మీద, అన్ని జాతుల డైనోసార్లు, 16 00:01:30,465 --> 00:01:33,218 మనుగడ సాగించడానికి పోరాటం చేస్తున్నాయి. 17 00:01:39,391 --> 00:01:45,689 డైనోసార్లు రాజ్యం ఏలిన ఈ ప్రపంచం గురించి మనకి ఇప్పుడు చాలా విషయాలు తెలుసు. 18 00:01:49,651 --> 00:01:52,196 ఇది వాటి గురించిన కథ. 19 00:02:05,250 --> 00:02:10,589 మంచి నీరు 20 00:02:16,470 --> 00:02:19,556 లక్షల సంవత్సరాలుగా మన భూగ్రహం మీద భూమి 21 00:02:19,640 --> 00:02:21,433 నీటి కారణంగా రూపాంతరం చెందింది. 22 00:02:22,518 --> 00:02:26,772 ఇక్కడ ప్రవహించే నదులు ఈ గొప్ప లోయలను ఇప్పటికీ రూపొందిస్తూనే ఉన్నాయి. 23 00:02:32,319 --> 00:02:36,365 ఎగిరే సరీసృపాలకు ఇటువంటి ప్రదేశాలే ఆవాసాలు. 24 00:02:40,536 --> 00:02:41,703 టేరోసార్స్. 25 00:02:47,876 --> 00:02:52,548 వాటి వేలి నుండి మడమ వరకూ చాచబడిన చర్మమే వాటికి రెక్కలు. 26 00:02:58,971 --> 00:03:02,766 ఆ రాకాసి పక్షులు ఒక్క రోజులో వందల మైళ్ల దూరం ప్రయాణించగలవు. 27 00:03:38,510 --> 00:03:39,511 ప్రతి సాయంత్రం, 28 00:03:39,595 --> 00:03:45,350 ఈ లోయలకు భారీ సంఖ్యలో వచ్చి వాటి సన్నని అంచుల మీద సేద తీరుతాయి. 29 00:03:49,605 --> 00:03:51,648 సంఖ్యలలో భద్రత ఉంటుంది. 30 00:03:54,693 --> 00:03:58,071 కానీ, కొన్ని వేటాడే జంతువులు ఇక్కడికి రావడానికి భయపడతాయి. 31 00:04:01,116 --> 00:04:02,701 కానీ ఒక్క జంతువు మాత్రం సాహసిస్తుంది. 32 00:04:08,040 --> 00:04:11,210 అది ఒక డైనోసార్ జాతి జంతువు. వెలోసీరాప్టర్. 33 00:04:14,546 --> 00:04:18,175 వాటి మీద ఉండే ఈకలు వాటి శరీరాలకు వెచ్చదనం ఇస్తాయి, కానీ అవి ఎగరలేవు. 34 00:04:19,885 --> 00:04:23,055 అయితే అవి అసాధారణమైన చురుకుదనం కలిగి ఉంటాయి. 35 00:04:31,313 --> 00:04:32,481 ఇప్పుడు అదే చేయబోతోంది. 36 00:04:34,900 --> 00:04:37,903 ఇక్కడ ఒక్క తప్పటడుగు పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. 37 00:04:44,910 --> 00:04:47,079 టేరోసార్స్ పిరికి జంతువులు. 38 00:04:47,162 --> 00:04:50,332 ప్రమాదం గురించి సంకేతాలు అందగానే అవి వెంటనే గాల్లోకి ఎగిరిపోతాయి. 39 00:04:55,420 --> 00:05:01,051 వెలోసిరాప్టర్స్ గనుక వీటిని వేటాడాలంటే, హఠాత్తుగా దాడి చేయడం ఎంతో కీలకం. 40 00:05:21,280 --> 00:05:24,199 తేలికైన శరీరాలు ఇంకా ఈకలతో కప్పిన చేతులు ఉన్న కారణంగా 41 00:05:24,283 --> 00:05:25,993 అవి దూకినప్పుడు నియంత్రించుకోగలవు. 42 00:05:31,623 --> 00:05:36,044 అవి పట్టు తప్పకుండా ఉండేలా వాటి పొడవైన తోకలు సహకరిస్తాయి. 43 00:05:45,179 --> 00:05:47,848 కొండ అంచున విశ్రాంతి తీసుకుంటున్న టేరోసార్స్ 44 00:05:47,931 --> 00:05:50,809 ఈ వేట జంతువులకు సుళువైన లక్ష్యాలు. 45 00:06:23,091 --> 00:06:27,846 జలపాతపు హోరులో రాళ్లు విరిగిపడే శబ్దాలు వినిపించవు. 46 00:06:50,953 --> 00:06:53,205 ఆడ జంతువు ఎత్తయిన ప్రదేశానికి చేరుకుంటుంది. 47 00:06:55,749 --> 00:06:58,085 రెండు మగ జంతువులు కింద సిద్ధంగా ఉంటాయి. 48 00:07:15,352 --> 00:07:19,106 కొన్ని టేరోసార్స్ దాదాపు దాడి చేయదగ్గ దూరంలో ఉన్నాయి. 49 00:07:39,334 --> 00:07:44,173 ఆడ జంతువు ఒక పక్షిని వేటాడింది, కానీ ఇప్పుడు ఆ పక్షుల సమూహం మొత్తం అప్రమత్తం అయింది. 50 00:08:06,278 --> 00:08:09,198 ఈ గందరగోళంలో, దాని ఆహారం కొండ అంచు నుండి జారిపోయింది. 51 00:08:18,707 --> 00:08:22,753 ఆ ఆడజంతువు తన ఈకల తోక పనితీరుని ఇప్పుడు పరీక్షించదలుచుకుంది. 52 00:08:27,591 --> 00:08:30,636 చివరికి, ఆడజంతువు తన ఆహారాన్ని సొంతం చేసుకోగలిగింది. 53 00:08:33,847 --> 00:08:37,726 మగజంతువులు టేరోసార్లను ఎదుర్కోవడానికి వదిలివేయబడ్డారు. 54 00:08:47,152 --> 00:08:50,948 మంచి నీటి శక్తి ఈ ప్రపంచం అంతటా ప్రభావం చూపుతూనే ఉంటుంది. 55 00:08:57,037 --> 00:08:58,789 ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. 56 00:09:00,082 --> 00:09:03,252 తుఫాను బీభత్సాలు ఇంకా ఎడతెగని వానలు సంభవిస్తున్నాయి. 57 00:09:15,681 --> 00:09:19,977 ఉత్తర అమెరికాలో ఎక్కువ భాగం దట్టమైన, పచ్చని అడవులతో నిండి ఉంది. 58 00:09:25,065 --> 00:09:30,070 ఇంతవరకూ జీవించిన జీవరాశుల్లో మొక్కలు తినే అతి భారీ జంతుజాతి ఇక్కడే జీవిస్తోంది. 59 00:09:33,115 --> 00:09:38,453 మరో వైపు, అత్యంత క్రూరమైన వేట జంతువులకు ఇవి ఆహారం కాబోతున్నాయి. 60 00:10:09,776 --> 00:10:12,487 టైరానోసారస్ రెక్స్. 61 00:10:14,823 --> 00:10:19,077 ఈ వృద్ధ మగ జంతువు కొద్దిసేపటి కిందటే ట్రైసెరాటాప్స్ ఒకదానిని చంపేసింది. 62 00:10:25,292 --> 00:10:27,920 కానీ ఈ ప్రయత్నంలో, అది గాయపడింది. 63 00:10:37,679 --> 00:10:41,225 భారీ శాకాహారులను వేటాడటం కోసమే టి. రెక్స్ అవతరించాయి... 64 00:10:43,936 --> 00:10:47,314 అయితే వాటిలో చాలా జంతువులు తమ రక్షణ కోసం ఆయుధాలను రూపొందించుకున్నాయి. 65 00:10:55,030 --> 00:10:59,034 ఆ ఆయుధాలు కలిగిన శాకాహార జంతువులతో పోరాటాలు చేసి టి. రెక్స్ శరీరం మచ్చలమయం అయింది. 66 00:11:07,668 --> 00:11:10,546 ఒక పోరాటంలో దాని తోక ముక్క కూడా ఊడింది. 67 00:11:19,555 --> 00:11:22,724 ఈ కొత్త గాయాలు చాలా తీవ్రమైనవి. 68 00:11:28,105 --> 00:11:32,818 అది ఉన్న వయసులో, అంటువ్యాధులు చాలా ప్రమాదకరం. 69 00:11:46,999 --> 00:11:49,918 నది నీళ్లు దాని గాయాలను శుభ్రం చేస్తాయి. 70 00:12:02,055 --> 00:12:06,226 ఈ జంతువు మరొక రోజు పోరాటం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. 71 00:12:10,189 --> 00:12:12,691 కానీ ఆ క్షణం అనుకున్న సమయం కన్నా ముందే వచ్చేసింది. 72 00:12:28,498 --> 00:12:30,167 మరొక టి. రెక్స్. 73 00:12:38,425 --> 00:12:39,468 అపరిచిత జంతువు. 74 00:12:53,232 --> 00:12:56,777 కానీ ఈ కొత్త జంతువు కొత్త వాసన కలిగి ఉంది. 75 00:13:02,282 --> 00:13:03,367 అది ఆడ జంతువు. 76 00:13:04,159 --> 00:13:06,912 అది వయస్సులోనూ, పరిమాణంలోనూ కూడా చిన్నది. 77 00:13:12,459 --> 00:13:15,629 అయినా కూడా, అది కూడా ఒక శత్రువు కావచ్చు. 78 00:13:25,430 --> 00:13:29,852 అయితే, ఆ మగజంతువు తనకు యుద్ధం మీద ఆసక్తి లేదని స్పష్టం చేస్తోంది. 79 00:13:35,315 --> 00:13:37,192 తను సంభోగం ఇష్టపడుతున్న సంకేతం అందిస్తోంది. 80 00:13:47,828 --> 00:13:49,496 ఆమె కూడా అందుకు సమ్మతమే అని సంకేతం ఇస్తోంది. 81 00:14:00,048 --> 00:14:04,553 టైరానోసార్ ముఖం ముందు భాగం స్పర్శకు చాలా సున్నితమైనది, 82 00:14:06,471 --> 00:14:07,598 అవి ముక్కుతో రాసుకుంటున్నాయి. 83 00:14:13,270 --> 00:14:18,901 అతని భారీ శరీరము ఇంకా యుద్ధ గాయాలు అతడొక వీరుడని రుజువు చేస్తున్నాయి. 84 00:14:21,195 --> 00:14:25,449 బహుశా, ఆమె దృష్టిలో, అతడు ఒక ఆకర్షణీయమైన భాగస్వామి కాగలిగాడు. 85 00:14:44,718 --> 00:14:46,720 అందుకని, అవి జత కలుస్తాయి. 86 00:14:47,221 --> 00:14:50,557 ఆ తరువాత కొద్ది వారాల పాటు, అవి తరచుగా సంభోగంలో పాల్గొంటాయి. 87 00:14:52,851 --> 00:14:56,522 ఫలితంగా, ఆడజంతువు దాదాపు పదిహేను గుడ్లు పెడుతుంది. 88 00:14:58,982 --> 00:15:02,694 వాటి ద్వారా తరువాత తరం పుట్టుకురావడానికి అవకాశం ఏర్పడింది. 89 00:15:14,414 --> 00:15:20,087 మంచి నీరు ఆధారంగా జీవించే నివాసాలు చాలా వేగంగా ఇంకా విపరీతంగా మారిపోగలవు. 90 00:15:26,176 --> 00:15:27,970 మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో, 91 00:15:28,053 --> 00:15:32,099 భారీ వర్షాలు నదులను నీళ్లతో నింపివేస్తాయి, ఫలితంగా అవి వరదలై 92 00:15:32,182 --> 00:15:34,017 నదీ పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతాయి. 93 00:15:37,771 --> 00:15:40,274 చుట్టుపక్కల ప్రాంతాలు జలమయం అవుతాయి. 94 00:15:53,370 --> 00:15:59,334 ఈ వరద నీటిలో ఈదుకుంటూ వస్తోంది డైనోసార్ల జాతిలోనే అతి విచిత్రమైన జీవి. 95 00:16:19,229 --> 00:16:20,898 డైనోకైరస్. 96 00:16:23,942 --> 00:16:26,486 ఇది టి. రెక్స్ కన్నా చాలా పొడవైనది. 97 00:16:28,572 --> 00:16:32,034 దాని అతి భారీ కొంగ తరహా ముక్కుపుటాలు 98 00:16:32,117 --> 00:16:33,869 నీటి మొక్కలను తినడంలో ఎంతో ఉపయోగపడతాయి. 99 00:16:35,829 --> 00:16:38,582 ఈ జాతి మగజంతువు తిండి విపరీతంగా తింటుంది, 100 00:16:38,665 --> 00:16:41,960 అందుకు కారణం, వానాకాలానికి ముందు వచ్చే వేసవిలో దీనికి ఆహారం ఎక్కువ లభించకపోవడమే. 101 00:16:46,131 --> 00:16:48,926 నీటి మొక్కలు మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. 102 00:16:50,135 --> 00:16:53,514 వాటి ఎనిమిది అంగుళాల పెద్ద, వంకీలు తిరిగిన పంజాలు, 103 00:16:53,597 --> 00:16:57,351 నీటి లోతుల్లోంచి మొక్కలను పెకిలించి తీయడానికి ఉపయోగపడతాయి. 104 00:17:08,904 --> 00:17:12,741 ఈ డైనోకైరస్ స్వయంగా కొన్ని చిన్న జీవులకు ఆహారాన్ని అందిస్తుంది. 105 00:17:17,496 --> 00:17:21,916 రక్తాన్ని పీల్చే దోమలు, ఆ జంతువు చర్మాన్ని ఆశ్రయిస్తాయి. 106 00:17:29,216 --> 00:17:31,969 అవి చిరాకునీ, బాధనీ కలిగిస్తుంటాయి. 107 00:17:32,928 --> 00:17:36,682 దాని భారీ పంజాలతో అది గోక్కోగలదు కానీ... 108 00:17:39,643 --> 00:17:43,564 తన శరీరంలో కొన్ని భాగాలను అది అందుకోలేకపోతుంది. 109 00:17:51,029 --> 00:17:54,074 ఆ శరీర భాగాలను అందుకోవాలి అంటే, ఆ జంతువుకు సహాయం అవసరం. 110 00:17:58,078 --> 00:18:01,999 ఒక మృత వృక్షం. అది పరిష్కారం చూపుతుంది. 111 00:18:23,520 --> 00:18:25,105 ఇది కొంత మెరుగు. 112 00:18:40,037 --> 00:18:42,497 ఇప్పుడు అది తినడానికి తిరిగి వెళుతుంది. 113 00:18:48,086 --> 00:18:52,299 కానీ పూర్తిగా తడిసిన ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకోవడం వలన 114 00:18:52,382 --> 00:18:56,303 అది అనివార్యమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. 115 00:19:09,691 --> 00:19:15,739 ఒక జీవికి ఆహారం మరి కొన్నింటికి ఎరువు అవుతుంది. 116 00:19:21,286 --> 00:19:24,873 అతి భారీ జంతువు అయిన డైనోకైరస్ 117 00:19:24,957 --> 00:19:28,126 ప్రతి సంవత్సరం ఇరవై టన్నులకు పైగా మలాన్ని విసర్జిస్తుంది. 118 00:19:39,805 --> 00:19:41,265 ఆఫ్రికా దక్షిణ ప్రాంతం. 119 00:19:43,976 --> 00:19:47,187 ఇక్కడ కూడా, వార్షిక వానలు వరదలను సృష్టిస్తున్నాయి. 120 00:19:50,065 --> 00:19:53,819 దీనితో ఇక్కడి నేల అంతా చిన్న చిన్న వాగులతో 121 00:19:53,902 --> 00:19:56,738 మధ్యమధ్య లెక్కలేనన్ని చిన్న ద్వీపాలతో ఒక ప్రహేళికలా మారిపోయింది. 122 00:20:03,370 --> 00:20:06,373 ఇది ఇప్పుడు ఒక చిత్తడి అడవిలా మారింది. 123 00:20:13,672 --> 00:20:18,760 భూమి మీద నివసించిన అత్యంత భారీ ఎగిరే జంతువులను 124 00:20:18,844 --> 00:20:20,179 ఈ అడవి ఆకర్షిస్తుంది. 125 00:20:31,690 --> 00:20:36,069 ఒక భారీ టేరోసార్. క్వెట్జల్కోల్టస్. 126 00:20:49,416 --> 00:20:50,751 ఇది ఒక ఆడ జంతువు. 127 00:20:51,418 --> 00:20:54,254 దాని రెక్కలు ముప్పై అడుగుల వెడల్పు ఉంటాయి. 128 00:20:57,090 --> 00:21:00,260 అయితే ఇది ఒక ప్రత్యేకమైన కారణంతో ఇక్కడికి వచ్చింది. 129 00:21:28,914 --> 00:21:31,792 నీటి మట్టం పెరగడం వల్ల ఏర్పడిన చిన్న ద్వీపాలు 130 00:21:32,793 --> 00:21:35,504 ఈ జంతువు గుడ్లు పెట్టడానికి అనుకూలమైన ప్రదేశాలు. 131 00:21:50,561 --> 00:21:53,814 గాలిలో ఎగరడంలో క్వెట్జల్కోల్టస్ పక్షులు ఎంతో నైపుణ్యం కలిగి ఉంటాయి. 132 00:21:53,897 --> 00:21:58,235 కానీ ఆశ్చర్యకరంగా, అవి నేల మీద కూడా చాలా సమర్థంగా వ్యవహరిస్తాయి. 133 00:22:00,779 --> 00:22:05,659 ఈ పక్షి నాలుగో వేలు యొక్క భారీ పొడవైన ఎముక 134 00:22:05,742 --> 00:22:07,286 ఆధారంగా ప్రతి రెక్క పని చేస్తుంది. 135 00:22:08,245 --> 00:22:10,247 దాని రెక్కలు పైకి ఆడించడం ద్వారా, 136 00:22:10,330 --> 00:22:13,667 తన నాలుగు కాళ్ల మీద అది చక్కగా నడవగలదు. 137 00:22:25,387 --> 00:22:28,223 ఈ ఆడజంతువు ఇక్కడ గూడు కట్టుకోవడానికి వచ్చింది. 138 00:22:35,689 --> 00:22:39,526 మెత్తగా ఉండే దాని గుడ్లు త్వరగా ఎండిపోకుండా ఉండటానికి 139 00:22:39,610 --> 00:22:43,197 అది చిత్తడి, బురద నేలను ఎంపిక చేసుకుంటుంది. 140 00:23:10,849 --> 00:23:13,560 ఈ మొదటి రెండు కూడా కేవలం మొదలు మాత్రమే. 141 00:23:25,864 --> 00:23:29,910 ఆ తరువాత వచ్చే మూడు వారాల వరకూ, ఈ బహిరంగమైన గూడుని ఈ ఆడజంతువు కాపలా కాస్తుంది... 142 00:23:37,000 --> 00:23:40,796 ఆ తరువాత ప్రతి కొద్ది రోజులకు రెండేసి గుడ్లు చొప్పున పెడుతూ ఉంటుంది. 143 00:23:50,764 --> 00:23:54,434 గుడ్లు పెట్టడానికి ఎంతో శ్రమ ఇంకా బలం కావాలి. 144 00:23:55,269 --> 00:23:58,939 ప్రతి గుడ్డు చాలా పెద్దది, దాదాపు కిలో బరువు ఉంటుంది. 145 00:24:12,578 --> 00:24:16,331 ఎట్టకేలకు, ఈ ఆడజంతువు ఒక డజను లేదా అంతకుమించి గుడ్లను పెట్టగలుగుతుంది. 146 00:24:19,501 --> 00:24:22,754 వాటిని పచ్చటి ఆకులతో కప్పి ఎవరి కంటా పడకుండా దాచుతుంది. 147 00:24:34,725 --> 00:24:37,102 ఇప్పుడు, అది ఆహారం తినాలి. 148 00:24:39,563 --> 00:24:44,651 ఈ ఆడజంతువు పెట్టిన గుడ్లు పొదిగిన తరువాత వాటికి ఈ ద్వీపంలో తగినంత ఆహారం లభించాలి. 149 00:24:46,236 --> 00:24:51,366 కానీ దాని ఆకలిని తీర్చగలిగేంత ఆహారం ఇక్కడ అందుబాటులో లేదు. 150 00:24:56,455 --> 00:25:00,083 అందుకే ఆ ఆడజంతువు మరో ప్రదేశంలో వేటాడటానికి వెళ్లాలి... 151 00:25:02,127 --> 00:25:07,674 కానీ తను లేని సమయంలో తన గూడులో పెట్టిన పొదగని గుడ్లు సురక్షితంగా ఉంటాయని 152 00:25:07,758 --> 00:25:09,176 ఆ ఆడజంతువు నమ్మాలి. 153 00:25:29,363 --> 00:25:32,741 మరొక క్వెట్జల్కోల్టస్, ఈ ఆడ జంతువు వయస్సులో మరింత పెద్దది. 154 00:25:45,963 --> 00:25:49,675 ఈ ఆడజంతువు కూడా గుడ్లు పెట్టడానికి సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకుతోంది. 155 00:25:52,010 --> 00:25:57,516 అయితే రెండు భారీ పక్షుల పిల్లలకు తగినంత ఆహారం ఇక్కడ దొరకకపోవచ్చు. 156 00:25:58,851 --> 00:26:01,228 కానీ ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం ఉంది. 157 00:26:12,281 --> 00:26:15,492 గుడ్లు పోషక విలువులున్న ఆహారం. 158 00:26:43,145 --> 00:26:45,480 ఈ గూడు యజమాని తిరిగి వచ్చింది. 159 00:27:24,728 --> 00:27:27,231 పెద్ద ఆడజంతువుని తరిమికొట్టింది. 160 00:27:35,155 --> 00:27:37,866 కానీ యువ ఆడజంతువు గూడు చెదిరిపోయింది. 161 00:28:01,932 --> 00:28:06,603 తను పెట్టిన డజను గుడ్లలో కేవలం మూడు మాత్రమే మిగిలాయి. 162 00:28:12,860 --> 00:28:18,615 తన సంతానోత్పత్తి కాలం విజయవంతం కావడం అనేది ఈ మూడు గుడ్లను పొదగడం మీద ఆధారపడి ఉంది. 163 00:28:23,579 --> 00:28:28,750 వచ్చే కొద్ది నెలల్లో ఈ గుడ్లు పొదిగే వరకూ వాటిని రక్షించడానికి శాయశక్తులా పోరాడుతుంది. 164 00:28:31,795 --> 00:28:35,966 కానీ ఆ తరువాత, ఆ పిల్లలు తమ ఆహారాన్ని తామే సేకరించుకోవాలి. 165 00:28:42,723 --> 00:28:44,975 ఈ నది దిగువ ప్రాంతాలకు ప్రహిస్తుంది కాబట్టి, 166 00:28:45,058 --> 00:28:51,273 అది కోట్ల టన్నుల ఇసుకనీ, కంకర రాళ్లనీ ఇంకా భారీ బండరాళ్లని కూడా కోతకు గురి చేస్తుంది. 167 00:28:54,443 --> 00:28:58,197 నున్నని అవక్షేపాలు ఆ ప్రవాహంలో కొన్ని వందల మైళ్ల దూరం ప్రయాణిస్తాయి, 168 00:28:58,280 --> 00:29:01,283 కానీ ఆ నది విస్తృతం అయ్యే కొద్దీ, ఈ తరలింపు నిదానిస్తుంది. 169 00:29:02,868 --> 00:29:07,122 ఫలితంగా, కొంత భాగం అవక్షేపాలు ఒక చోట పేరుకుపోయి మేటలు ఏర్పడుతుంటాయి. 170 00:29:13,629 --> 00:29:18,425 ఎన్నో తరాలుగా సముద్రంలో జీవించిన జంతువులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. 171 00:29:24,264 --> 00:29:25,265 పీతలు. 172 00:29:30,020 --> 00:29:33,273 కొన్ని ప్రదేశాలలో, ఒక చదరపు మీటరులో డజన్ల కొద్దీ పీతలు కనిపిస్తాయి. 173 00:29:48,080 --> 00:29:50,832 దీని పేరు మషీకాసారస్. 174 00:29:51,667 --> 00:29:53,919 ఈ ఆడజంతువు పొడవు ఆరు అడుగులు. 175 00:29:54,002 --> 00:29:56,839 దీని నోటి నిండా పదునైన సూదిలాంటి దంతాలు. 176 00:29:59,383 --> 00:30:03,679 కొన్ని జతల కాళ్లతో వికారంగా కనిపించే ఈ జీవిని కరచుకు తినడానికి తగినట్లుగా దంతాలు. 177 00:30:23,073 --> 00:30:28,370 పీతలు పైన గట్టి పెంకుని కలిగి ఉంటాయి, కానీ వాటిలో పోషక విలువలు ఎక్కువ. 178 00:30:31,748 --> 00:30:34,209 ఇది వదులుకోలేని ఒక గొప్ప అవకాశం. 179 00:30:44,845 --> 00:30:46,430 కేవలం ఈ ఆడజంతువుకే కాదు. 180 00:30:51,852 --> 00:30:53,562 ఈ ఆడజంతువుకి ముగ్గురు పిల్లలు. 181 00:30:57,024 --> 00:30:59,359 వీటి పొడవు కేవలం నాలుగు అంగుళాలు. 182 00:31:03,197 --> 00:31:06,533 పెద్ద పీతలని తినడానికి ఇంకా ఇవి సిద్ధంగా లేవు. 183 00:31:15,167 --> 00:31:18,003 అవి ఇంకా తన తల్లి తినగా మిగిలిన ఆహారం మీదే ఆధారపడి ఉన్నాయి. 184 00:31:23,759 --> 00:31:27,346 కానీ కొన్ని పిల్లలు వేటాడే మెళకువలను ముందుగానే అలవర్చుకుంటాయి. 185 00:31:37,397 --> 00:31:38,565 ఎంతో నోరూరిస్తోంది. 186 00:31:45,489 --> 00:31:48,242 చిన్న పీతలను మొత్తంగా మింగేయవచ్చు. 187 00:31:54,456 --> 00:32:00,087 దురదృష్టవశాత్తూ, ఆ పీతలు చిన్నవే అయినా, వాటికి వేగం ఎక్కువ. 188 00:32:18,105 --> 00:32:21,775 ఈ పిల్ల జంతువు ఎక్కువ దూరం దారి తప్పకుండా ఉంటే మంచిది. 189 00:32:45,299 --> 00:32:48,886 బీల్జిబూఫో, ఇదొక రాక్షస కప్ప. 190 00:32:50,721 --> 00:32:54,183 ఈ భూమి మీద జీవించిన అతి పెద్ద కప్పల్లో ఇది ఒకటి. 191 00:33:05,861 --> 00:33:09,323 మరొక నెల వరకూ దీనికి ఆహారం అవసరం లేదు. 192 00:33:19,208 --> 00:33:22,252 ఈ ఇసుక మేటలు సమృద్ధిగా ఆహారం అందించే ప్రదేశాలు, 193 00:33:22,336 --> 00:33:25,923 కానీ ఇక్కడ మనుగడ సాగించాలంటే అందుకు భారీ మూల్యం చెల్లించాలి. 194 00:33:35,140 --> 00:33:38,477 నదీ జలాలు ఇక్కడ సముద్రం వైపు ప్రవహిస్తున్నాయి. 195 00:33:42,022 --> 00:33:45,859 ఆ నీళ్లు ఉప్పగా మారడం ఇప్పటికే గమనించవచ్చు. 196 00:33:53,700 --> 00:33:54,868 సముద్ర కెరటాలు ఎగసిపడినప్పుడు, 197 00:33:54,952 --> 00:33:59,289 సముద్రంలోని కొన్ని జంతువులు ఈ నదులలో ఆహార అన్వేషణకు వస్తాయి. 198 00:34:35,909 --> 00:34:37,661 ఎలాస్మోసార్స్. 199 00:34:39,830 --> 00:34:43,333 ఇవి స్వచ్ఛంగా సముద్రజీవనం గడిపే సరీసృపాలు. 200 00:34:45,793 --> 00:34:50,215 కానీ ఆ జంతువులలో కొన్ని ఉప్పునీటిలో ఆహార అన్వేషణ కోసం ఈ సంగమ ప్రదేశాలకు వస్తాయి. 201 00:35:29,296 --> 00:35:32,007 ఇప్పుడు, నదీ జలాలు తరలించిన లక్షల టన్నుల అవక్షేపాలు 202 00:35:32,090 --> 00:35:35,636 ఈ ప్రవేశమార్గం ద్వారా సముద్రంలోకి చేరవేయబడతాయి. 203 00:35:41,391 --> 00:35:45,604 సముద్రంలో కలవడానికి నదీ జలాలకు కొంత సమయం పడుతుంది, అందుకే, 204 00:35:45,687 --> 00:35:48,607 కొంత దూరం పాటు ఈ రెండు జలాలు పక్కపక్కనే ప్రవహిస్తాయి. 205 00:35:51,485 --> 00:35:52,486 అయితే, 206 00:35:52,569 --> 00:35:57,533 భారీ చేపల గుంపులు ఈ నీటిలో తగినంత ఆహారాన్ని పొందగలుగుతాయి. 207 00:36:01,662 --> 00:36:06,625 ఇసుక అవక్షేపాల తెట్టు చేపలు కనిపించకుండా కాపాడతాయి. 208 00:36:09,670 --> 00:36:14,550 కానీ ఈ ఎలాస్మోసార్స్ తమ ఆహారం కోసం 209 00:36:14,633 --> 00:36:16,218 ఎంతటి మురికి నీటిలోకి అయిన జొరబడతాయి. 210 00:36:35,779 --> 00:36:37,990 ఈ చేపలు తప్పించుకునే అవకాశం లేదు... 211 00:36:45,706 --> 00:36:47,791 నీటి ఉపరితలం పైన కూడా. 212 00:37:07,936 --> 00:37:12,441 ఈ ఎలాస్మోసార్స్ సముద్ర జలాల్లో పూర్తిగా కనుమరుగు కావడానికి ముందు 213 00:37:12,524 --> 00:37:19,198 నదీ జలాలు అందించే చివరి బహుమతులను అందుకుంటాయి. 214 00:37:31,543 --> 00:37:33,587 తరువాయి భాగంలో, 215 00:37:33,670 --> 00:37:38,008 తల్లి ఇంకా పిల్లలు మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితులలో 216 00:37:38,091 --> 00:37:40,093 వాటి మధ్య అనుబంధం తీవ్రంగా పరీక్షింపబడుతుంది. 217 00:37:40,802 --> 00:37:44,932 ప్రాచీన శత్రువులు ఒకరితో ఒకరు ఇంకా గడ్డ గట్టే మంచు తుఫానులతో పోరాటాలు చేస్తాయి. 218 00:37:46,141 --> 00:37:49,978 ఈకల గల డైనోసార్ల ఏలుబడిలో మంచు ప్రపంచాలు. 219 00:37:50,646 --> 00:37:53,649 కథల వెనుక శాస్త్రీయ మర్మాలని తెలుసుకోవడానికి, 220 00:37:53,732 --> 00:37:58,070 మా షో పేజీని చూడండి. 221 00:39:26,283 --> 00:39:28,285 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్