1 00:00:11,678 --> 00:00:15,182 డేవిడ్ అటెన్బరో సమర్పణ 2 00:00:16,517 --> 00:00:21,563 ఈ భూమి మీద ఇప్పటివరకూ జీవించిన జీవరాశుల్లో ఖచ్చితంగా అత్యంత ప్రత్యేకమైన జంతువు, 3 00:00:22,105 --> 00:00:26,318 అలాగే ఎంతో ప్రముఖమైనది, డైనోసార్. 4 00:00:27,361 --> 00:00:29,613 టైరనోసారస్ రెక్స్. 5 00:00:30,656 --> 00:00:35,202 మన అందరిలో ఒక ఊహను ప్రేరేపించగల జంతువు. 6 00:00:35,285 --> 00:00:38,247 ఇది ఏ రకమైన జంతువు? 7 00:00:38,330 --> 00:00:41,542 అది ఎలా ఉండేది? ఎలా జీవించేది? 8 00:00:41,625 --> 00:00:45,587 ఇప్పుడు, శాస్త్రీయ పరిశోధనలు ఈ ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్నాయి. 9 00:00:45,671 --> 00:00:47,923 కేవలం టి. రెక్స్ కి సంబంధించి మాత్రమే కాదు, 10 00:00:48,006 --> 00:00:51,343 దానితో పాటు జీవించిన ఇతర జీవరాశుల గురించి కూడా తెలియజేస్తున్నాయి. 11 00:00:51,426 --> 00:00:58,016 వాటిని సజీవంగా దర్శించడానికి అత్యాధునిక ఇమేజింగ్ టెక్నాలజీ దోహదపడుతోంది. 12 00:01:01,436 --> 00:01:05,440 భూగోళం, 66 మిలియన్ సంవత్సరాల క్రితం. 13 00:01:13,949 --> 00:01:17,494 ఆకాశం అంతా భారీ పక్షులతో నిండిపోయి ఉంది. 14 00:01:20,038 --> 00:01:24,084 సముద్ర జలాల్లో, అగాథాలను భారీ రాకాసి సరీసృపాలు పహారా కాస్తున్నాయి. 15 00:01:26,128 --> 00:01:29,256 ఇక భూమి మీద, ఎన్నో రకాల డైనోసార్లు, 16 00:01:30,465 --> 00:01:33,218 మనుగడ సాగించడానికి అన్నీ పోరాడూనే ఉన్నాయి. 17 00:01:39,391 --> 00:01:45,689 డైనోసార్లు రాజ్యం ఏలిన ఈ ప్రపంచం గురించి మనకి ఇప్పుడు చాలా విషయాలు తెలుసు. 18 00:01:49,651 --> 00:01:52,196 ఇది వాటి గురించిన కథ. 19 00:02:05,167 --> 00:02:10,631 అడవులు 20 00:02:14,468 --> 00:02:20,224 దక్షిణ అమెరికాలోని అడవులు ప్రపంచంలోనే ఎత్తయిన చెట్లను కలిగి ఉన్నాయి. 21 00:02:24,603 --> 00:02:28,023 అవి మూడు వందల అడుగుల ఎత్తుకు పైగా పెరగగలవు. 22 00:02:33,570 --> 00:02:36,573 కానీ ఇక్కడ కూడా భారీ జంతువులు ఉన్నాయి. 23 00:03:01,098 --> 00:03:03,433 ఆకులు తినే డైనోసార్లు. 24 00:03:11,108 --> 00:03:13,694 వీటి పేరు ఆస్ట్రోపొసైడన్. 25 00:03:14,278 --> 00:03:16,738 ఇవి ఎనభై అడుగుల పొడవు ఉంటాయి. 26 00:03:27,499 --> 00:03:30,043 వాటికి విపరీతమైన ఆకలి ఉంటుంది. 27 00:03:32,838 --> 00:03:36,758 వాటి దంతాలను నమలడానికి ఉపయోగించవు, 28 00:03:37,342 --> 00:03:39,011 కోయడానికి మాత్రమే ఉపయోగిస్తాయి. 29 00:03:44,349 --> 00:03:50,522 ఇలాంటి ఒక గుంపు ప్రతి రోజూ దాదాపు పది టన్నుల ఆకులను ఆరగిస్తుంది. 30 00:03:55,402 --> 00:04:01,450 కొమ్మల అంచున పెరిగే నవనవలాడే లేత ఆకులను ఇవి ఇష్టపడతాయి. 31 00:04:03,035 --> 00:04:06,872 కానీ వాటికన్నా పొడవైన చెట్లు కనిపించాయంటే, 32 00:04:06,955 --> 00:04:08,498 అవి ఓడిపోవు. 33 00:04:21,386 --> 00:04:25,933 వాటి భారీ శరీరపు బరువుని ఇంకా వాటి ఎనిమిది అంగుళాల మందం ఉండే ఛాతి ఎముకని 34 00:04:26,016 --> 00:04:29,144 ఉపయోగించి ఆ పొడవాటి చెట్లను నెట్టేస్తాయి. 35 00:05:03,095 --> 00:05:04,263 విజయం. 36 00:05:07,432 --> 00:05:10,477 కానీ అడవిలో జీవితం ఎప్పుడూ పోరాటాల మయం. 37 00:05:12,271 --> 00:05:15,399 ముఖ్యంగా కొత్తగా స్థలం ఏర్పడినప్పుడు. 38 00:05:33,333 --> 00:05:36,211 వెలుగుని అందుకోవడానికి మొక్కలు పోటీ పడతాయి... 39 00:05:38,255 --> 00:05:42,467 తమ ఆధిపత్యం నిలుపుకొనేందుకు ప్రతి ఉపాయాన్ని ఉపయోగిస్తాయి. 40 00:05:51,852 --> 00:05:55,063 పందిరిలో ఖాళీలు త్వరగానే మూసుకుపోతాయి. 41 00:06:01,153 --> 00:06:05,782 భూమి మీద మూడు వంతుల నేల మొక్కలు ఇంకా చెట్లతో కప్పబడి ఉంది. 42 00:06:09,870 --> 00:06:13,832 ఈ చరిత్రపూర్వ భూగోళం ఆకుపచ్చ గ్రహం. 43 00:06:18,086 --> 00:06:21,882 ఎన్నో రకాల డైనోసార్ జాతులు ఎక్కువగా అడవులలో నివసిస్తాయి. 44 00:06:25,052 --> 00:06:29,890 ట్రైసెరటాప్స్, ఉత్తర అమెరికాలో అతి భారీ జంతువులలో ఒక జాతి. 45 00:06:35,646 --> 00:06:38,065 అవి 26 అడుగుల పొడవు ఉంటాయి. 46 00:06:43,111 --> 00:06:47,866 వాటి తలల మీద ఉండే భారీ కవచం అవి పోరాడినప్పుడు రక్షణ ఇస్తుంది. 47 00:06:52,246 --> 00:06:54,665 కానీ మొక్కలకు కూడా రక్షణ వ్యవస్థలు ఉంటాయి. 48 00:07:00,337 --> 00:07:02,005 విషపదార్థాలు. 49 00:07:09,721 --> 00:07:12,724 ముఖ్యంగా అవి పిల్ల జంతువులకు చాలా ప్రమాదకరం. 50 00:07:15,936 --> 00:07:20,774 ఈ కూన తన తల్లి బరువులో యాభైయ్యో వంతు మాత్రమే ఉంటుంది. 51 00:07:23,861 --> 00:07:28,198 అయితే ఈ మొక్కలు విడుదల చేసే విషపదార్థాలు ఈ కూనని అనారోగ్యం పాలు చేస్తాయి. 52 00:07:38,959 --> 00:07:43,088 కానీ అటువంటి విషాల నుంచి బయటపడే మార్గాలు ట్రైసెరాటాప్స్ కి తెలుసు. 53 00:07:44,965 --> 00:07:47,092 అవి ఆ విషానికి విరుగుడుని ఉపయోగిస్తాయి. 54 00:07:54,057 --> 00:07:59,104 అటువంటి విరుగుడు ఈ గుహలో దొరుకుతుంది కాబట్టి తరచు అవి ఈ గుహకు వస్తుంటాయి. 55 00:08:14,786 --> 00:08:19,124 ఈ పసికూన మాత్రం ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. 56 00:08:41,897 --> 00:08:44,232 ఒక సన్నని తోవ గుండా అవి తమ దారిని వెతుక్కుంటూ వెళ్లాలి 57 00:08:44,316 --> 00:08:49,363 అది, భూగర్భంలో కొన్ని లక్షల సంవత్సరాలుగా నది ప్రవహించడం వల్ల కోతకు గురైన ప్రదేశం. 58 00:09:09,800 --> 00:09:13,178 అవి ఇప్పుడు వెలుతురు ప్రసరించని ప్రదేశానికి చేరాయి. 59 00:09:15,806 --> 00:09:17,641 వాటికి ఏమీ కనిపించవు. 60 00:09:23,146 --> 00:09:25,983 ఆ పసికూన మాత్రం తన కుటుంబానికి సమీపంలోనే నడవాలి. 61 00:09:34,741 --> 00:09:36,243 కానీ మరీ దగ్గరగా లేదు. 62 00:09:56,889 --> 00:10:01,101 ఇప్పుడు, పొరపాటున మరో పక్కకు వెళితే ఘోరం జరిగిపోతుంది. 63 00:10:40,432 --> 00:10:44,394 ఎట్టకేలకు, ఈ గుంపు తాము చేరుకోవలసిన ప్రదేశానికి చేరుకుంది. 64 00:10:54,821 --> 00:10:59,535 ఇదే ఆ విషానికి విరుగుడు: ఒక ప్రత్యేకమైన మట్టి. 65 00:11:02,621 --> 00:11:07,751 వీటిని మట్టి నాకే ప్రాంతాలు అంటారు, అందుకు ఆ జంతువులు తరచూ ఇక్కడికి వస్తుంటాయి. 66 00:11:28,188 --> 00:11:30,190 కానీ ఎవరో తప్పిపోయారు. 67 00:11:36,613 --> 00:11:38,240 ఆ పసికూన ఎక్కడకి పోయింది? 68 00:12:06,351 --> 00:12:08,729 అదృష్టం ఈ పసికూన వైపు నిలిచింది. 69 00:12:24,786 --> 00:12:27,331 ఒకసారి అది తన కడుపులో ఈ మట్టిని నింపుకుంటే, 70 00:12:27,414 --> 00:12:32,503 అది తినే ఆకులు వెదజల్లే విషాల నుంచి అది రక్షించబడుతుంది. 71 00:12:37,508 --> 00:12:42,054 ఆ తరువాత ఆ గుంపు తిరిగి అడవిలోకి ఇంకా వెలుతురులోకి ప్రయాణం సాగిస్తుంది. 72 00:12:47,309 --> 00:12:50,354 వాస్తవంగా, ఈ దట్టమైన అడవులలో 73 00:12:50,437 --> 00:12:53,524 సూర్యుడి వెలుగు నేలను తాకడం చాలా అరుదు. 74 00:12:55,567 --> 00:12:56,693 పటగోనియా ప్రాంతంలో, 75 00:12:56,777 --> 00:13:01,156 దట్టమైన వృక్ష సంపద వందల మైళ్ల కొద్దీ అఖండంగా విస్తరించి ఉంటుంది. 76 00:13:04,701 --> 00:13:09,414 కానీ అప్పుడప్పుడు మాత్రం, అంతుచిక్కని విధంగా అడవులు ఇలా శుభ్రం అవుతుంటాయి. 77 00:13:28,475 --> 00:13:35,107 ఆ పని చేసినది, రెండు టన్నుల బరువు, 12 అడుగుల పొడవు గల కార్నోటారస్. మగ జంతువు. 78 00:13:39,862 --> 00:13:43,574 ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి దీనికి చాలా కాలం పట్టింది. 79 00:13:46,285 --> 00:13:50,372 ఇది శుభ్రంగా ఉండాలంటే ఈ ప్రదేశం మీద నిరంతరం దృష్టి సారించాలి. 80 00:13:58,005 --> 00:14:01,884 ఈ మగజంతువు తన ఆడ తోడుని మెప్పించడానికి చేసుకున్న వేదిక ఇది. 81 00:14:05,220 --> 00:14:08,807 అంతా సిద్ధమయింది, ఇక ఆ విషయాన్ని ఈ మగజంతువు ప్రకటించాలి. 82 00:14:22,321 --> 00:14:24,156 ఆ మగజంతువు పిలుపులు మంద్రస్థాయిలో ఉంటాయి 83 00:14:24,239 --> 00:14:27,284 అయితే, హెచ్చు స్థాయిలో అరుపుల కన్నా వేగంగా ఈ దట్టమైన అడవుల గుండా 84 00:14:27,367 --> 00:14:29,494 ఆ అరుపులు వేగంగా చాలా దూరం ప్రయాణిస్తాయి. 85 00:14:53,143 --> 00:14:56,230 ఎట్టకేలకు, ఒక ఆడజంతువు వచ్చింది. 86 00:15:04,196 --> 00:15:07,824 అది మగ జంతువు కన్నా పెద్దగా ఉంది ఇంకా ఎక్కువ బలీయంగా ఉంది. 87 00:15:22,214 --> 00:15:25,509 ఇప్పుడు, ఎలాగైనా సరే, ఈ ఆడజంతువుని మగజంతువు మెప్పించాలి. 88 00:15:30,305 --> 00:15:33,016 పైగా ఆ మగజంతువుకి ఈ ఒక్క అవకాశమే దక్కవచ్చు. 89 00:15:36,645 --> 00:15:38,689 ఆడజంతువు మగజంతువుని జాగ్రత్తగా గమనిస్తుంది. 90 00:15:42,901 --> 00:15:44,778 మగజంతువు గనుక ఆడజంతువుని మెప్పించాలంటే, 91 00:15:45,529 --> 00:15:49,032 ఏదైనా అత్యంత అసాధారణమైన పని చేయాలి. 92 00:15:59,710 --> 00:16:03,881 దానికి పెద్ద పెద్ద కొమ్ములు లేవు, అలాగే అబ్బురపరిచే తోక కూడా లేదు. 93 00:16:06,216 --> 00:16:11,263 కానీ దానికి ఎందుకూ ఉపయోగపడని ఒక జత చిట్టి చేతులు ఉన్నాయి. 94 00:16:15,434 --> 00:16:18,812 ప్రతి చేతికీ దాని మొదలు భాగంలో ఒక బంతి ఇంకా ఒక కీలు ఉంటాయి 95 00:16:18,896 --> 00:16:22,566 ఫలితంగా చేతుల్ని వేటికవే ఆడించడానికి దానికి వీలవుతుంది. 96 00:16:51,595 --> 00:16:52,721 ఈ రోజు కాదు. 97 00:17:00,020 --> 00:17:03,398 అది ఇంకా ఎలా చేస్తే బాగుండేది? ఎవరికి తెలుసు? 98 00:17:08,694 --> 00:17:12,366 ఇక ఇప్పటి నుండి, అది తిరిగి చెత్త ఏరుకునే పనిలో నిమగ్నం అయింది. 99 00:17:20,582 --> 00:17:23,001 ఇది తూర్పు ఆసియా ప్రాంతం. 100 00:17:27,422 --> 00:17:31,677 ఈ పర్వత అడవులలో ఆకురాలు కాలం ముందస్తుగానే వచ్చేసింది. 101 00:17:37,516 --> 00:17:40,853 ఈ కాలంలోనే చాలా చెట్లు ఫలాలను ఉత్పత్తి చేస్తుంటాయి. 102 00:17:44,857 --> 00:17:49,987 ఆ పండ్లలో అత్యంత విలువైనవి గింక్గో చెట్టు పప్పులే. 103 00:17:56,952 --> 00:18:01,498 కొరితోరాప్టర్స్ అనే పేరు గల ఈ డైనోసార్లకు పంట పండినట్లే. 104 00:18:06,211 --> 00:18:09,256 వాటికి ఈకలు ఉన్నా కూడా అవి ఎగరలేవు. 105 00:18:13,552 --> 00:18:17,389 ఈ పండ్లు సమృద్ధిగా నేల రాలడాన్ని ఈ జంతువులు గుర్తించాయి. 106 00:18:18,974 --> 00:18:22,978 అయితే ఇలా అవి గుమిగూడితే వేటాడే జంతువుల నుంచి ప్రమాదం ఉండచ్చు. 107 00:18:28,358 --> 00:18:33,447 కియంజౌసారస్, ఇది ఈ ఆసియా అడవుల్లో గొప్ప వేటాడే జంతువు. 108 00:18:40,829 --> 00:18:43,832 ఇది ఆడ జంతువు, పొడవు 30 అడుగుల పైనే ఉంటుంది. 109 00:18:48,587 --> 00:18:53,091 అది గనుక కొరితోరాప్టర్ ని వేటాడాలంటే, అది వాటికి దగ్గరగా రావాలి. 110 00:19:01,183 --> 00:19:03,143 అయితే ఇక్కడ పెద్దగా చాటు ప్రదేశం లేదు. 111 00:19:08,232 --> 00:19:12,361 కానీ బలి కాబోయే కొరితోరాప్టర్లు తమని వేటాడబోయే జంతువుని ఇంకా గమనించలేదు. 112 00:20:02,494 --> 00:20:04,037 దాని ప్రయత్నం విఫలం అయింది. 113 00:20:04,121 --> 00:20:05,873 కానీ, జీవరాశి చరిత్ర మొత్తాన్ని గమనిస్తే, 114 00:20:05,956 --> 00:20:10,252 ఎన్నో వేటలు ఎక్కువగా విఫలమై ఉంటాయి. 115 00:20:18,343 --> 00:20:20,596 రుతు పవనాలు బలపడినప్పుడు, 116 00:20:20,679 --> 00:20:25,726 ఈ సమశీతోష్ణ అడవులలో చాలా చెట్లు ఆకులను కోల్పోతుంటాయి. 117 00:20:29,688 --> 00:20:32,274 అడవులలో నీటి ఎద్దడి ఏర్పడుతుంది. 118 00:20:38,155 --> 00:20:43,160 ఏది ఏమైనా, తుఫాను వచ్చినప్పుడు వేట జంతువులకు ఒక చిన్న అవకాశం చిక్కుతుంది. 119 00:20:45,746 --> 00:20:47,247 ఈ ఆడజంతువు మళ్లీ ప్రయత్నిస్తుంది. 120 00:20:51,710 --> 00:20:57,341 ఆ చీకటిలో ఆమె స్పష్టంగా కనిపించదు, పైగా హోరుగా వీచే గాలి దృష్టిని మరలుస్తుంది. 121 00:21:48,642 --> 00:21:50,811 ఒక 36 కిలోల బహుమతి. 122 00:21:53,981 --> 00:21:57,985 ఇక శీతాకాలం కూడా దగ్గర పడుతుండటం వల్ల దీని విలువ ఇంకా పెరుగుతుంది. 123 00:22:06,618 --> 00:22:08,662 ఉత్తర అమెరికాలోని అడవులలో, 124 00:22:09,246 --> 00:22:14,626 నివసించే జీవులకు ప్రతి యేటా అదనంగా ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. 125 00:22:24,928 --> 00:22:28,974 పిడుగుపాటుకు అడవిలో మంటలు చెలరేగాయి. 126 00:22:38,150 --> 00:22:43,363 ఆ దావానలం విస్తరిస్తుంటే, ఉష్ణోగ్రతలు సుమారు వెయ్యి డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయి. 127 00:22:57,628 --> 00:23:01,048 మంటలు కొన్ని వందల అడుగుల ఎత్తున గాలిలోకి ఎగసిపడుతుంటాయి. 128 00:23:16,146 --> 00:23:17,814 చాలా జంతువులు పారిపోతున్నాయి. 129 00:23:19,942 --> 00:23:24,154 కానీ ఈ ఎడ్మోంటోసారస్ తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. 130 00:23:26,573 --> 00:23:28,242 ఆమె తన కుటుంబాన్ని విడిచి వెళ్లదు. 131 00:23:30,327 --> 00:23:35,791 ఆ మంటలు ఆరిపోయే వరకూ దాని కన్నా ఒక అడుగు ముందే ఉండాలి. 132 00:23:47,302 --> 00:23:50,264 ఇది చూడబోతే ఒక విపత్తులా మారింది. 133 00:23:57,312 --> 00:24:01,316 కానీ ప్రత్యేకంగా చెప్పాలంటే, కొన్ని మొక్కలు వాటి జీవిత చక్రాన్ని 134 00:24:01,400 --> 00:24:04,027 పూర్తి చేయాలంటే అవి తప్పనిసరిగా కాలిపోవలసిందే. 135 00:24:08,240 --> 00:24:12,911 పైన్ చెట్లకు ఉన్న ఫలాలు తెరుచుకోవాలంటే, ఇంత తీవ్రమైన ఉష్ణోగ్రత అవసరం... 136 00:24:15,372 --> 00:24:17,249 అప్పుడే అవి తమ విత్తనాలను విడుదల చేయగలుగుతాయి. 137 00:24:28,260 --> 00:24:31,597 ఈ మంటలు ఆరిపోయిన కొద్ది గంటల తరువాత, 138 00:24:33,348 --> 00:24:36,101 జంతువులు అడవిలోకి తిరిగి రావడం ప్రారంభిస్తాయి. 139 00:24:39,980 --> 00:24:42,316 ముందుగా వచ్చేవి బీటిల్స్ రెక్కల పురుగులు. 140 00:24:45,736 --> 00:24:47,696 అవి గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. 141 00:24:49,156 --> 00:24:52,618 ఆ గుడ్లను పొదిగినప్పుడు, బయటకు వచ్చే లార్వా 142 00:24:52,701 --> 00:24:56,121 అక్కడ అపరిమితంగా ఉన్న కాలిన చెక్కను ఆహారంగా చేసుకుంటాయి. 143 00:25:06,757 --> 00:25:10,260 ఈ అట్రాసిరాప్టర్ ఒక అవకాశవాది. 144 00:25:18,227 --> 00:25:21,939 కాలిన అడవుల్లో చనిపోయిన జంతువులను తినడానికి ఇది వెంటనే తిరిగి వచ్చేస్తుంది. 145 00:25:27,152 --> 00:25:29,530 అయితే ఇక్కడ లబ్ధి పొందడానికి మరొకటి దొరికింది. 146 00:25:40,332 --> 00:25:42,960 పొగ క్రిమిసంహారకమైనది... 147 00:25:47,214 --> 00:25:51,218 దాని వల్ల జంతువులను ఆశ్రయించే పరాన్నబుక్కులను తొలగించడానికి పొగ ఉపయోగపడుతుంది. 148 00:25:57,224 --> 00:25:59,351 కానీ ఆ జంతువులు చాలా జాగ్రత్త పడాలి. 149 00:26:15,450 --> 00:26:18,537 ఇది రెండు టన్నుల బరువుండే అంకైలోసార్. 150 00:26:23,083 --> 00:26:26,920 మంటలు చెలరేగిన తరువాత అది తినడానికి కావలసిన పదార్థం సిద్ధంగా ఉంది. 151 00:26:36,096 --> 00:26:37,181 బొగ్గు. 152 00:26:39,766 --> 00:26:45,230 దాని కడుపులో అప్పటికే ఉన్న మొక్కల విషపదార్థాలకు బొగ్గు విరుగుడుగా పని చేస్తుంది. 153 00:26:57,242 --> 00:27:01,246 ఆడ ఎడ్మాంటోసారస్ అడవిని విడిచి వెళుతోంది. 154 00:27:08,337 --> 00:27:12,716 ప్రతికూల పరిస్థితులలో, ఆ ఆడజంతువు తన కూనలను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళుతోంది. 155 00:27:27,189 --> 00:27:32,486 అడవి మొక్కలు మళ్లీ పచ్చగా చిగురించే వరకూ అవి వేరే వృక్ష సంపదని వెతుక్కోవాలి. 156 00:27:42,329 --> 00:27:46,750 కొన్ని అడవుల్లో అగ్నిప్రమాదాలు అరుదుగా వచ్చినా చెట్లు మాత్రం ఎల్లకాలం బతకవు. 157 00:27:47,292 --> 00:27:52,422 అవి చనిపోయాక కూడా, చెట్లు అనేక రకాల జీవరాశులకు ఆహారం అవుతాయి. 158 00:27:57,636 --> 00:28:02,057 రాత్రి వేళ, వాటిలో కొన్ని విచిత్రంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 159 00:28:05,936 --> 00:28:08,313 అడవి నేల మీద... 160 00:28:11,525 --> 00:28:13,527 శిలీంధ్రాలు పుట్టుకొస్తాయి... 161 00:28:15,487 --> 00:28:17,739 అవి క్రమంగా వెలుగులు విరజిమ్మడం మొదలవుతుంది. 162 00:28:25,831 --> 00:28:30,919 వాటి కణాల పొరల లోపల జరిగే రసాయన చర్యల కారణంగా అవి కాంతిని ఉత్పత్తి చేయగలుగుతాయి. 163 00:28:35,048 --> 00:28:37,968 కానీ అవి ఎందుకు అలా చేస్తాయో అంతుబట్టదు. 164 00:28:41,597 --> 00:28:44,266 బహుశా ఆ కాంతి కొన్ని కీటకాలను ఆకర్షించవచ్చు, 165 00:28:44,349 --> 00:28:47,728 ఆ కీటకాలు ఆ ఫంగస్ యొక్క బీజాంశ కణాలను వ్యాపింప చేయడంలో సహకరించవచ్చు. 166 00:28:56,236 --> 00:28:58,322 ఇక్కడ, మధ్య ఆసియా ప్రాంతంలో, 167 00:28:58,405 --> 00:29:03,076 రాత్రివేళల్లో అడవులలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. 168 00:29:09,791 --> 00:29:12,753 భారీ సోరోపాడ్స్ నిద్రపోతున్నాయి. 169 00:29:19,259 --> 00:29:22,054 వాటి తలలో ఇంకా మెడలో గాలి సంచీలు ఉంటాయి, 170 00:29:22,137 --> 00:29:26,350 అవి వాటి బరువును తగ్గిస్తాయి కానీ గురక శబ్దాన్ని మాత్రం పెద్దగా చేస్తాయి. 171 00:29:30,979 --> 00:29:33,398 అయితే ఆ రాత్రివేళ జంతువులన్నీ నిద్రపోవు. 172 00:29:37,569 --> 00:29:42,783 కొన్ని చిన్న జంతువులకు, పగటి వేళ కన్నా రాత్రి వేళ సంచరించడం సురక్షితం. 173 00:29:45,661 --> 00:29:50,791 ఈ తెరిజీనోసారస్ ఆరు నెలల కిందటే పొదగబడ్డాయి. 174 00:29:55,879 --> 00:30:00,634 ఆ వయస్సులో అవి మూడు అడుగుల పొడవు మించవు, కానీ వాటి పెద్దలతో పోలిస్తే పదోవంతు చిన్నవి. 175 00:30:03,387 --> 00:30:08,892 వాటి పంజాలు చురకత్తుల్లా కనిపిస్తాయి, కానీ అవి పండ్లు కోసే కత్తుల్లా మాత్రమే పనికొస్తాయి... 176 00:30:12,521 --> 00:30:15,315 ఎందుకంటే ఈ జంతువులు కేవలం మొక్కలను తింటూ బతుకుతాయి. 177 00:30:18,151 --> 00:30:23,907 ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవాలే కానీ ఈ అడవి అన్ని రకాల ఆహారాన్ని అందిస్తుంది. 178 00:30:26,076 --> 00:30:27,077 తేనె. 179 00:30:29,371 --> 00:30:33,125 చెట్టు కొమ్మల పైన తేనెటీగల గూడు నుంచి చుక్కలుగా పడుతోంది. 180 00:30:36,837 --> 00:30:41,091 తేనెటీగలు సాధారణంగా వాటి గూళ్లను నేల మీద తిరిగే జీవులకు అందకుండా ఏర్పరుచుకుంటాయి. 181 00:30:42,801 --> 00:30:45,262 కానీ ఇది మిగతా తేనె గూళ్ల కన్నా కిందిగా ఉంది. 182 00:30:47,764 --> 00:30:49,766 దీనిని వదులుకోవడం కష్టం. 183 00:31:08,410 --> 00:31:13,790 మిగతా డైనోసార్ల మాదిరి కాకుండా, తెరిజీనోసారస్ కూనలు చెట్లు ఎక్కగలవు. 184 00:31:19,004 --> 00:31:21,798 అయితే చెట్లు ఎక్కడంలో వాటికి నైపుణ్యం లేదు. 185 00:31:55,791 --> 00:32:01,839 కోపంతో ఉన్న తేనెటీగలు తన గూళ్ల దగ్గరకి వచ్చే వారిని మెక్సికన్ వేవ్ తో భయపెడతాయి... 186 00:32:08,387 --> 00:32:10,222 అయినా ఆగకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాలి. 187 00:32:39,543 --> 00:32:42,254 ఇది పెద్ద తెరిజీనోసారస్. 188 00:32:47,634 --> 00:32:53,098 అతి భారీ జంతువు, సుమారు ముప్పై అడుగుల పొడవుతో అయిదు టన్నుల బరువుతో ఉంటుంది. 189 00:33:13,118 --> 00:33:16,496 తేనెటీగలు ఏం చేసినా ఇది మాత్రం పట్టు వదలలేదు. 190 00:33:35,015 --> 00:33:37,476 చివరికి, కొద్దిపాటి తేనెల విందు. 191 00:33:39,478 --> 00:33:42,564 ఇంకా మరికొన్ని తేనెటీగలు కుట్టి చేసిన గాయాలు. 192 00:33:57,871 --> 00:34:03,126 ఉదయం పూట కూడా, ఈ దట్టమైన అడవులు చీకటి కమ్ముకునే ఉంటాయి, 193 00:34:03,210 --> 00:34:05,546 యూరప్ లోని ఈ అడవి మాదిరిగా. 194 00:34:09,174 --> 00:34:12,844 అడవిలో ఏ జంతువు ఏదో పోల్చుకోవడం కష్టం. 195 00:34:18,934 --> 00:34:20,811 అయితే, అవి అన్నిచోట్లా ఉన్నాయి. 196 00:34:26,233 --> 00:34:29,485 టెల్మాటోసారస్ చాలా అరుదుగా తన రక్షణ వలయాన్ని దాటి బయటకు వస్తుంది. 197 00:34:39,413 --> 00:34:42,123 అదే సమయంలో వాటిని గమనించడం కూడా కష్టం. 198 00:34:46,043 --> 00:34:47,420 జాల్మోక్సీస్. 199 00:34:49,965 --> 00:34:53,302 అతి ప్రాచీనమైన డైనోసార్ వంశంలో ఇది చివరిది. 200 00:34:56,929 --> 00:35:00,809 జాల్మోక్సీస్ జాతికి మిగిలిన అతికొద్ది బలమైన ప్రదేశాలలో ఈ అడవి ఒకటి. 201 00:35:04,771 --> 00:35:10,944 ఏడు అంగుళాల పొడవైన ఈ బేబీ జాల్మోక్సీస్ కొన్ని వేటాడే జంతువులకు అల్పాహారంగా పనికొస్తాయి. 202 00:35:11,695 --> 00:35:14,740 కానీ అల్పాహారం ఎంతైనా రుచిగానే ఉంటుంది... 203 00:35:16,533 --> 00:35:18,327 కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. 204 00:35:48,524 --> 00:35:52,694 హాట్జేగోప్టెరిక్స్ పదిహేను అడుగుల పొడవు ఉంటుంది. 205 00:36:03,247 --> 00:36:07,918 అది నిజానికి ఒక టేరోసార్, రెక్కలతో ఉండే సరీసృపం, 206 00:36:08,001 --> 00:36:12,965 అయితే, చెట్ల నడుమ ఇది ఆహారం కోసం వెతకడం వల్ల పూర్తిగా ముడుచుకుని నడుస్తుంది. 207 00:36:25,227 --> 00:36:30,858 ఎన్నో చిన్న జీవులు సమృద్ధిగా ఉండే ఈ అడవి టేరోసార్స్ కి నిత్యం వేటాడే ప్రదేశం. 208 00:36:38,991 --> 00:36:42,035 ఈ జంతువులు దక్షిణ యూరప్ లో చిట్టిచివరి ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాయి. 209 00:37:09,521 --> 00:37:12,691 ఎగిరే జాతులలో అత్యంత బరువు ఉండే జంతువు ఇదే, 210 00:37:12,774 --> 00:37:17,738 మరే ప్రదేశంలోనూ అది తన పొడవైన రెక్కలను పూర్తిగా తెరవలేదు, 211 00:37:17,821 --> 00:37:20,199 ఎందుకంటే ఆ రెక్కలు ముప్పై అడుగుల పొడవు ఉంటాయి. 212 00:37:29,583 --> 00:37:34,296 అడవిలో స్థిరనివాసం ఉండే చాలా జంతువులు తరచూ ఇక్కడికి వస్తుంటాయి... 213 00:37:37,841 --> 00:37:40,928 ఎందుకంటే ఇక్కడి మొక్కలు సముద్రపు నీటి తుంపరలతో తడిసి ఉంటాయి 214 00:37:41,762 --> 00:37:44,681 అందువల్ల ఆ జంతువులు ఉప్పు కూడా తినగలుగుతాయి. 215 00:38:10,707 --> 00:38:15,754 ఇక్కడ, సోరోపాడ్స్ ఒకరినొకరు కలుసుకుంటూ, తమ కుటుంబ అనుబంధాలను పెంచుకుంటాయి... 216 00:38:18,632 --> 00:38:20,634 కొత్త సంతానాన్ని సృష్టిస్తుంటాయి. 217 00:38:34,565 --> 00:38:38,485 కానీ హాట్జేగోప్టెరిక్స్ కి మాత్రం, ఈ సముద్రతీరం ఎగిరేందుకు అనువైన ప్రదేశం. 218 00:38:54,001 --> 00:38:57,754 దాని రెక్కలు ఆ జీవిని మరొక అడవికి తీసుకువెళతాయి, 219 00:38:57,838 --> 00:39:02,509 అక్కడ జీవం మరింత విస్తారంగా మరింత సమృద్ధిగా మనుగడ సాగిస్తూ ఉంటుంది 220 00:39:02,593 --> 00:39:07,181 చరిత్రపూర్వ భూగ్రహం మీద మరెక్కడా లేని విధంగా. 221 00:39:22,112 --> 00:39:25,115 కథల వెనుక శాస్త్రీయ మర్మాన్ని తెలుసుకోవడానికి, 222 00:39:25,199 --> 00:39:29,995 ఇప్పుడే షో పేజీని చూడండి. 223 00:40:57,624 --> 00:40:59,626 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్