1 00:00:13,055 --> 00:00:16,099 ఈ సిరీసులోని పాత్రలు, సంఘటనలు అన్నీ కల్పితాలే. 2 00:00:16,183 --> 00:00:18,769 యధార్థ సంఘటనలను, లేదా బతికి ఉన్న వారినైనా, లేదా మరణించిన వారినైనా పోలి ఉంటే, 3 00:00:18,852 --> 00:00:19,937 అది పూర్తిగా యాధృచికమే. 4 00:00:24,233 --> 00:00:25,609 తమార్ ఏమైనా చెప్పిందా? 5 00:00:26,151 --> 00:00:28,237 ఔల్ టచ్ లోనే ఉన్నాడు, కానీ అతనికి తమార్ టచ్ లో లేదు. 6 00:00:28,320 --> 00:00:29,321 ఆమె ఎక్కడ ఉందో కనిపెట్టు. 7 00:00:39,581 --> 00:00:40,791 మళ్లీ కలిశాం మనం. 8 00:00:43,001 --> 00:00:45,879 - నేనెక్కడ ఉన్నానో నీకు ఎలా తెలుసు? - ఘసేమీ. 9 00:00:45,963 --> 00:00:49,007 అతని రెస్టారెంట్ బయట నిన్ను అరెస్ట్ చేశారు. 10 00:00:49,091 --> 00:00:50,801 అతడిని ట్రాక్ చేస్తే, నువ్వు దొరుకుతావేమో అని అనుకున్నా. 11 00:01:00,978 --> 00:01:01,979 హలో. 12 00:01:02,771 --> 00:01:04,690 ఇప్పుడు మీ ఏజెంటుపైనే తుపాకీ ఎక్కు పెట్టి ఉన్నా. 13 00:01:08,318 --> 00:01:09,194 అవును. 14 00:01:12,406 --> 00:01:14,616 - ఏం కావాలి నీకు? - నాకు ఏం కావాలంటే… 15 00:01:15,117 --> 00:01:16,702 ఈమెని నా జీవితంలో ఇక ఎప్పుడూ నేను చూడకూడదు. 16 00:01:18,036 --> 00:01:21,456 నీ వల్ల నా భార్య ఎంత క్షోభ అనుభవించిందో నీకు తెలుసా? 17 00:01:22,332 --> 00:01:24,459 మీరు మాకు రుణపడి ఉన్న దాన్ని తీర్చాలి. 18 00:01:24,543 --> 00:01:25,544 ఏంటది? 19 00:01:25,627 --> 00:01:26,753 సురక్షితంగా వేరే చోటికి తరలించాలి. 20 00:01:26,837 --> 00:01:28,172 కొత్త గుర్తింపులు కావాలి. 21 00:01:28,672 --> 00:01:31,425 నాహీద్ కి, నాకు నార్వేలో ఆశ్రయం కావాలి. 22 00:01:32,217 --> 00:01:33,677 మమ్మల్ని ఇరాన్ నుండి బయటకు పంపించండి! 23 00:02:34,154 --> 00:02:35,489 ఆ పని మేమెందుకు చేయాలి? 24 00:02:35,572 --> 00:02:37,616 బదులుగా నేను మీకు చాలా ఇవ్వగలను కాబట్టి. 25 00:02:37,699 --> 00:02:39,743 సెపా కార్యకలాపాల గురించి నాకు తెలిసినదంతా చెప్తాను. 26 00:02:39,826 --> 00:02:41,370 ఆఫర్ బాగుంది. 27 00:02:41,453 --> 00:02:42,663 కానీ ఇప్పుడే ఎందుకు? 28 00:02:43,247 --> 00:02:44,790 నాపై అనుమానం వచ్చింది. 29 00:02:46,834 --> 00:02:47,835 తమార్? 30 00:02:50,045 --> 00:02:51,755 నాహీద్ కి వేరే దేశం వెళ్లిపోవాలనుందని నాకు తెలుసు. 31 00:02:57,010 --> 00:02:58,637 ఇది నిజంగా నీ భార్య గురించే అయితే, 32 00:02:59,471 --> 00:03:00,973 నువ్వేమైనా అటుఇటు చేస్తే, నీ భార్యకి ప్రమాదం కాగలదు. 33 00:03:02,057 --> 00:03:04,142 నువ్వు మమ్మల్ని మోసం చేయాలని చూస్తే, కమాలి, 34 00:03:04,226 --> 00:03:05,644 ఆమె మాకు బందీ అయిపోతుంది. 35 00:03:08,397 --> 00:03:10,315 ఇదే పరిస్థితి మాకు ఎదురైతే, నువ్వు కూడా ఇలాగే అంటావు. 36 00:03:10,399 --> 00:03:11,692 నేను అర్థం చేసుకోగలను. 37 00:03:11,775 --> 00:03:13,026 అయితే, మన మధ్య ఒప్పందం కుదిరినట్టేగా. 38 00:03:25,664 --> 00:03:27,708 కమాలి ఇంటికి వెంటనే ఒక టాక్టిటల్ టీమ్ ని పంపండి. 39 00:03:28,792 --> 00:03:31,587 ఇక నువ్వు అక్కడి నుండి బయలుదేరు. నేను ఎక్కడికి వెళ్లాలో చెప్తాను, అందాకా ఆగు. 40 00:03:31,670 --> 00:03:33,881 అతని భార్య మా గుప్పెట్లోకి వచ్చిందని మేము నిర్ధారించేదాకా ఆగు. 41 00:03:36,175 --> 00:03:37,259 మనం బయలుదేరాలి. 42 00:03:37,342 --> 00:03:39,344 రమీన్ మొబైల్ ఫోనుకు ఎవరో కాల్ చేస్తున్నారు. 43 00:03:42,264 --> 00:03:44,183 - ఏమైంది? - నీ ఆఫర్ నాకు ఓకే. 44 00:03:44,266 --> 00:03:46,310 "నీ ఆఫర్ నాకు ఓకే." 45 00:03:46,894 --> 00:03:48,562 నేను చర్చలకు సిద్ధంగా ఉన్నా. 46 00:03:49,104 --> 00:03:50,314 సరే. 47 00:03:52,024 --> 00:03:53,358 రమీన్, చెప్పేది జాగ్రత్తగా విను! 48 00:03:53,901 --> 00:03:57,070 నువ్వు నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తే, డాక్టరును నేను చంపేస్తా. అర్థమైందా? 49 00:03:57,154 --> 00:03:58,780 అతని జీవితం… 50 00:03:58,864 --> 00:03:59,948 నీ చేతుల్లోనే ఉంది. 51 00:04:01,992 --> 00:04:03,994 - నేను మాటిస్తున్నా. - "నేను మాటిస్తున్నా." 52 00:04:04,077 --> 00:04:05,495 - ఎక్కడికి రావాలి? - "నేను ఎక్కడికి రావాలి?" 53 00:04:07,372 --> 00:04:08,665 ఎక్కడికో నీకు తెలుసు. 54 00:04:08,749 --> 00:04:09,875 "ఎక్కడికో నీకు తెలుసు." 55 00:04:11,793 --> 00:04:12,711 కాల్ ముగిసింది 56 00:04:12,794 --> 00:04:14,463 అతని ఫోన్ మన గుప్పెట్లోనే ఉంది కదా. ట్రాక్ చేయండి. 57 00:04:26,600 --> 00:04:28,101 నువ్వు నా స్నేహితుడికి సాయపడాలి. 58 00:04:41,782 --> 00:04:43,575 ఘసేమీ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాడు. 59 00:04:43,659 --> 00:04:44,535 ఆ విషయం ఔల్ కి చెప్పు. 60 00:04:50,332 --> 00:04:51,583 ఇక్కడ అదిమి పెట్టు. 61 00:04:53,961 --> 00:04:55,128 కుట్లు వేయడం కుదరదా? 62 00:04:55,963 --> 00:04:58,340 తూటా ప్రధాన అవయవాల గుండా వెళ్లింది. 63 00:04:58,924 --> 00:05:01,760 చాలా రక్తస్రావం అవుతోంది. కాబట్టి కుట్లు వేయడానికి అవకాశమే లేదు. 64 00:05:03,846 --> 00:05:05,097 పక్కానా? 65 00:05:05,180 --> 00:05:07,933 బోర్డర్ యుద్ధంలో, క్షేత్ర స్థాయి వైద్యునిగా పని చేశాను నేను. 66 00:05:08,016 --> 00:05:09,017 అంగోలా. 67 00:05:09,810 --> 00:05:11,270 నా స్నేహితుడికి కూడా ఇలాగే తూటా దిగింది. 68 00:05:12,688 --> 00:05:13,981 మోర్ఫీన్. 69 00:05:18,193 --> 00:05:21,488 ఇది రష్యా వాళ్లది, చాలా పాతది, ఇతనికి నొప్పి తెలీకుండా చేయగలదు ఇది. 70 00:05:22,197 --> 00:05:23,574 నువ్వు ఇతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. 71 00:05:25,784 --> 00:05:28,078 అలా చేస్తే, ఇతనికి మరణం ఇంకా ఆలస్యం అవుతుంది, అంతేగా. 72 00:05:32,499 --> 00:05:33,667 చూడు, ఇస్సా. 73 00:05:37,045 --> 00:05:38,380 నేను ఇలాంటి గాయాలను చాలానే చూశాను. 74 00:05:40,299 --> 00:05:41,717 ఇతను బతకడం కష్టం. 75 00:05:43,760 --> 00:05:46,930 కానీ నీకు ఇతనికి సాయపడాలనుంటే, నిజంగా సాయపడాలనుంటే, 76 00:05:47,514 --> 00:05:49,057 ఈ సీసాలో ఉన్నదంతా అతనికి ఎక్కించు. 77 00:05:49,141 --> 00:05:50,142 లేదు. 78 00:06:15,334 --> 00:06:17,044 నువ్వు అటు తిరిగితే మంచిదేమో. 79 00:06:49,826 --> 00:06:52,037 దీన్ని బట్టి నువ్వు గెలిచేశావు అనుకుంటున్నావా? 80 00:06:54,748 --> 00:06:56,333 నేను అలా అనుకోవట్లేదు. 81 00:06:59,378 --> 00:07:02,631 నేను చేసేది నాకే చాలా అసహ్యంగా ఉంది. 82 00:07:04,591 --> 00:07:05,592 కానీ నాకు మరో దారి లేదు. 83 00:07:11,932 --> 00:07:13,183 అయిపోయింది. 84 00:07:54,141 --> 00:07:55,684 నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 85 00:07:56,560 --> 00:07:58,145 తమార్, ఔల్ కోసం ఆగు. 86 00:07:58,228 --> 00:08:00,439 టెహ్రాన్ లో ఉండే నా ఇన్ఫార్మర్ నుండి తాజా సమాచారం కోసం ఎదురు చూస్తూ ఉన్నా. 87 00:08:01,607 --> 00:08:03,025 ఇంజిన్ ఆఫ్ చేయ్. 88 00:08:18,916 --> 00:08:20,125 ఫోనులోని వ్యక్తితో మాట్లాడు. 89 00:08:22,294 --> 00:08:26,131 నాహీద్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. 90 00:08:29,343 --> 00:08:31,595 వాళ్లు మనల్ని దేశం దాటిస్తారు. 91 00:08:35,307 --> 00:08:36,892 అంతా ముగిసిందిలే. 92 00:08:37,768 --> 00:08:39,436 నేనేం చెప్తున్నానో అర్థమవుతోందా? 93 00:08:39,937 --> 00:08:41,355 హా. అర్థమవుతోంది. 94 00:08:42,813 --> 00:08:48,195 ఫరాజ్, నువ్వు ఎంతటి త్యాగం చేస్తున్నావో నాకు తెలుసు. 95 00:08:49,363 --> 00:08:51,031 ఇదే నీకు కావాలి. 96 00:08:52,324 --> 00:08:53,867 ఇదే నీకు న్యాయంగా దక్కాలి. 97 00:08:56,078 --> 00:08:57,329 థ్యాంక్యూ, ఫరాజ్. 98 00:08:58,330 --> 00:08:59,998 నాకు అండగా ఉన్నందుకు థ్యాంక్యూ. 99 00:09:01,583 --> 00:09:02,876 సరే మరి. 100 00:09:06,630 --> 00:09:09,383 అంతా సిద్ధం చేసుకొని ఉండు, సరేనా? 101 00:09:09,967 --> 00:09:11,301 సరే. 102 00:09:13,053 --> 00:09:14,263 నేను బయట ఉంటా. 103 00:09:43,709 --> 00:09:46,170 - ఔల్ ఎక్కడ ఉన్నాడు? - ఒక నిమిషంలో వెళ్లిపోతాడు. 104 00:09:54,428 --> 00:09:55,846 దిగు! 105 00:09:57,598 --> 00:09:58,682 త్వరగా కానివ్వు! 106 00:10:02,394 --> 00:10:03,896 లోపలికి పద. 107 00:10:07,608 --> 00:10:09,151 - ఏం చేస్తున్నావు? - నోర్మూసుకో. 108 00:10:10,277 --> 00:10:13,322 ఇదంతా నా చేతుల్లోనే కనుక ఉండుంటే, నా బండిని దొంగిలించినందుకు నిన్ను కాల్చి పారేసేవాడిని. 109 00:10:13,405 --> 00:10:15,324 కూర్చో. కూర్చో! 110 00:10:16,325 --> 00:10:17,201 ఏంటి ఇదంతా? 111 00:10:19,786 --> 00:10:21,580 మన మధ్య ఒక అంగీకారం కుదిరింది కదా. 112 00:10:23,040 --> 00:10:25,125 నువ్వు చిన్న అలికిడి చేసినా, నీ భార్య ప్రమాదంలో పడిపోతుంది. 113 00:10:25,209 --> 00:10:27,211 మా పని అయ్యాక, మళ్లీ నీ దగ్గరికి వస్తాం. 114 00:10:27,294 --> 00:10:28,462 ఏ పని అయ్యాక? 115 00:10:28,545 --> 00:10:30,464 మిమ్మల్ని నమ్మకూడదు. 116 00:10:36,470 --> 00:10:37,971 శాస్త్రవేత్త విషయంలో ఒక సమాచారం అందింది. 117 00:10:56,323 --> 00:10:58,158 - రిపోర్ట్ చేయండి. - మేము మళ్లీ వ్యాన్ ఎక్కాం. 118 00:10:58,742 --> 00:10:59,910 అయిదు నిమిషాల్లో టార్గెట్ ని చేరుకుంటాం. 119 00:10:59,993 --> 00:11:01,703 - మరి కమాలి? - ప్రస్తుతానికి అతడిని ఓ చోట బంధించాం. 120 00:11:01,787 --> 00:11:03,664 మనం అందరికన్నా ముందు చంపాల్సింది అతడినే. 121 00:11:03,747 --> 00:11:05,040 ఆ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు కాదు. 122 00:11:15,592 --> 00:11:18,136 - ఏంటి? - మనిద్దరం నీ వల్లే వేరయ్యాం. 123 00:11:18,220 --> 00:11:19,221 నా వల్లనా? 124 00:11:19,972 --> 00:11:21,306 నీ బండి అతని చేతికి చిక్కేలా చేసుకుంది నువ్వే. 125 00:11:21,390 --> 00:11:23,809 నీకు బ్యాకప్ గా ఉందామని బయటకు వెళ్లాను. నీకేం అయిందో నాకు తెలీలేదు. 126 00:11:27,062 --> 00:11:28,021 అయితే… 127 00:11:29,731 --> 00:11:30,774 థ్యాంక్యూ. 128 00:12:40,511 --> 00:12:42,095 ఇది కనిపిస్తోందా? అదే చోటు. 129 00:12:42,179 --> 00:12:43,722 రమీన్ కారును కనిపెట్టేశాం. 130 00:12:44,306 --> 00:12:45,516 నాకు కూడా కనిపిస్తోంది. 131 00:12:48,143 --> 00:12:49,895 నేను ఇక్కడ ఉంటా. 132 00:12:49,978 --> 00:12:51,605 ఏమైనా గడబిడ అయితే, వెళ్లిపో. 133 00:12:51,688 --> 00:12:53,565 - పక్కానా? - హా, పక్కా. 134 00:13:07,412 --> 00:13:08,580 మేము సిద్ధంగా ఉన్నాం. 135 00:13:08,664 --> 00:13:10,791 - మీకు టార్గెట్ కనిపిస్తున్నాడా? - హా. 136 00:13:10,874 --> 00:13:11,750 మీ ప్లాన్ ఏంటి? 137 00:13:11,834 --> 00:13:14,503 రమీన్ అతడిని బయటకు తెచ్చేదాకా ఆగుతాం, వచ్చాక మెరుపుదాడి చేస్తాం. 138 00:13:45,492 --> 00:13:46,660 ఇస్సా! 139 00:13:50,205 --> 00:13:51,999 ఆ చోటికి రెండు దళాలు బయలుదేరాయి. 140 00:13:53,083 --> 00:13:54,001 మనకి ఒక సమస్య వచ్చి పడింది. 141 00:13:54,084 --> 00:13:55,711 సెపా రేడియో ఛానెళ్ల నుండి కొంత సమాచారం తెలిసింది. 142 00:13:55,794 --> 00:13:57,254 మీరున్న చోటుకు ఒక బృందం వస్తోంది. 143 00:13:58,005 --> 00:13:59,673 ఏంటి? ఎలా? 144 00:13:59,756 --> 00:14:00,757 కమాలి కారణం కావచ్చా? 145 00:14:00,841 --> 00:14:03,010 అవకాశం లేదు. అతని దగ్గరున్న ఫోన్ తీసేసుకున్నాం. 146 00:14:03,093 --> 00:14:05,762 ఏదేమైనా, మేము అతడిని బంధించినప్పుడు రమీన్ ఎక్కడికి వెళ్తున్నాడో మనకి తెలీదుగా. 147 00:14:05,846 --> 00:14:07,639 ఘసేమీయే అతని మిత్రుడి గురించి వాళ్లకి చెప్పేసుంటాడు. 148 00:14:08,265 --> 00:14:10,267 - వాళ్లు ఎంత సేపటిలో చేరుకుంటారు? - ఏడు నిమిషాల్లో. 149 00:14:10,350 --> 00:14:12,227 - మనం లోపలికి వెళ్లాలి. - వెనుక వైపు నుండి వెళ్దాం. 150 00:14:12,811 --> 00:14:14,688 నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. 151 00:14:14,771 --> 00:14:18,233 నేనే కనుక నీ స్థానంలో ఉండుంటే, కనీసం నాలుగు సార్లయినా నేను ఉండే చోటును మార్చుండేవాడిని. 152 00:14:18,734 --> 00:14:19,651 ఒక్కడివే వచ్చావా? 153 00:14:20,611 --> 00:14:21,904 మనిద్దరం తప్ప ఇంకెవరూ లేరు. 154 00:14:21,987 --> 00:14:22,905 తుపాకీతో వచ్చావా? 155 00:14:23,614 --> 00:14:25,199 తుపాకీ తేవద్దని నువ్వు చెప్పలేదుగా. 156 00:14:33,081 --> 00:14:34,625 సెపా వాళ్లు దగ్గరికి వచ్చేస్తున్నారు. 157 00:14:35,751 --> 00:14:37,419 ఇక్కడ కాస్త లైట్ వేయి. 158 00:14:46,178 --> 00:14:47,304 దాన్ని ఇక్కడికి విసిరేయ్. 159 00:14:50,474 --> 00:14:51,391 ఆవేశపడకు… 160 00:14:53,393 --> 00:14:54,520 మనకి పరిచయం కాలేదు. 161 00:14:55,187 --> 00:14:56,188 నా పేరు రమీన్. 162 00:14:56,271 --> 00:14:57,314 నువ్వెవరో నాకు తెలుసు. 163 00:14:58,649 --> 00:14:59,691 ఉబ్బితబ్బిబైపోతున్నా. 164 00:15:15,958 --> 00:15:17,459 టార్గెట్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టారా? 165 00:15:17,543 --> 00:15:19,253 ఈ చోటు పద్మవ్యూహంలా ఉంది. 166 00:15:22,631 --> 00:15:23,674 నువ్వు దేశద్రోహివి! 167 00:15:23,757 --> 00:15:25,759 మళ్లీ మొదలుపెట్టకు… 168 00:15:25,843 --> 00:15:28,178 నేను చెడ్డవాడినని అంటావు. 169 00:15:28,262 --> 00:15:30,889 నా వాళ్లు కష్టాలు పడకూడదని, ఆంక్షలను తప్పించుకొని, వాళ్లకి ఆహారాన్ని, 170 00:15:30,973 --> 00:15:33,642 మందులని, కావాల్సిన వస్తువులను సమకూరుస్తున్నాను. నన్ను చెడ్డవాడినని అంటున్నావా? 171 00:15:33,725 --> 00:15:35,185 - నువ్వేం చేస్తున్నావు? - మేము తిరగబడుతున్నాం! 172 00:15:36,645 --> 00:15:38,105 సెపా వాళ్లు వచ్చేశారు. 173 00:15:41,275 --> 00:15:43,151 చచ్చాక ఎలా ఎదిరిస్తావు? 174 00:15:45,988 --> 00:15:47,281 అతను అన్నదానిలో నిజం ఉంది. 175 00:15:48,448 --> 00:15:50,325 అతను నిన్ను ప్రభుత్వానికి అప్పగించేస్తాడు, అది తెలుసా నీకు? 176 00:15:50,409 --> 00:15:51,910 చాలా లాభదాయకమైన వ్యాపారం కదా? 177 00:15:52,661 --> 00:15:54,454 నాకు ఉన్న దారుల్లో తక్కువ ప్రమాదకరమైనది అదేనేమో. 178 00:15:54,538 --> 00:15:55,831 నా ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నా. 179 00:15:55,914 --> 00:15:57,124 నేను నీకు పాస్ పోర్ట్ ఇప్పిస్తా, 180 00:15:57,207 --> 00:15:59,042 ఇల్లు ఇస్తా, 181 00:15:59,126 --> 00:16:02,045 కారుతో పాటు డబ్బులు కూడా ఇస్తా, కానీ నువ్వు విదేశాలకు వెళ్లిపోవాలి. 182 00:16:03,172 --> 00:16:05,132 - ఇక్కడ ఉంటే ప్రాణాలతో ఉండవు. - ఏది పడితే అది వాగకు. 183 00:16:05,215 --> 00:16:07,134 - నాకేం కావాలో నీకు తెలుసు. - నీకేమీ కాదని హామీ ఇవ్వగలను. 184 00:16:07,217 --> 00:16:10,512 - నా మాతృభూమిని వదిలి వెళ్లిపోవాలా? నాకేమైనా పిచ్చా? - ఆ విషయంలో హామీ ఇవ్వగలను. 185 00:16:11,972 --> 00:16:13,348 నీ స్నేహితుడిగా చెప్తున్నా. 186 00:16:16,560 --> 00:16:17,895 బయలుదేరు! 187 00:16:23,233 --> 00:16:24,443 సెపా వాళ్లం వచ్చాం. 188 00:16:26,361 --> 00:16:28,655 - వాళ్లని తీసుకొచ్చావా! చెత్త వెధవా! - లేదు. లేదు. 189 00:16:34,995 --> 00:16:35,954 కదలకు! 190 00:16:41,084 --> 00:16:43,045 మజీద్ తో పాటు మిగతా వాళ్లందరూ తలుపు దగ్గర కాపలాగా ఉండండి. 191 00:16:43,837 --> 00:16:45,380 పద! పద! 192 00:16:47,508 --> 00:16:49,259 నేల మీద కూర్చో. కూర్చో! 193 00:16:50,552 --> 00:16:51,553 కూర్చో! 194 00:16:57,184 --> 00:16:58,352 నాకు వేరే దారి లేదు. 195 00:17:01,313 --> 00:17:02,731 మనం బయలుదేరాలి. 196 00:17:02,814 --> 00:17:04,358 నాతో పాటు రండి, డాక్టర్. 197 00:17:12,532 --> 00:17:13,909 - పదండి! - సెపా వాళ్లం, కదలకండి! 198 00:17:16,118 --> 00:17:20,582 సెపా వాళ్లం! కదలకండి! కూర్చోండి! కూర్చోండి! 199 00:17:21,834 --> 00:17:23,167 ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా? 200 00:18:06,628 --> 00:18:07,629 ఆగండి. 201 00:18:09,715 --> 00:18:10,549 ఇక్కడే ఉండండి. 202 00:18:10,632 --> 00:18:13,051 బతుకు మీద ఆశ ఉంటే, తనేం చెప్తే అది చేయ్. 203 00:18:32,362 --> 00:18:34,239 దయచేసి కాల్చవద్దు! 204 00:18:34,323 --> 00:18:36,491 ఎవరు నువ్వు? నీకు ఇక్కడేం పని? 205 00:18:36,992 --> 00:18:38,160 నేనెవరినా? 206 00:18:38,243 --> 00:18:42,289 ఈ చెత్త ప్రదేశంలో పనివాడిగా ఉన్నా, పైసా జీతం కూడా దక్కని పిచ్చోడిని. 207 00:18:42,664 --> 00:18:44,458 ఇక్కడ కాల్పులు జరుగుతుంటాయని ఎవరూ చెప్పలేదు! 208 00:18:45,125 --> 00:18:47,336 పనిలో ఇది కూడా భాగమే అని చెప్పలేదు! 209 00:18:47,878 --> 00:18:50,881 నేను నా వ్యాన్ ఎక్కేసి, ఇక్కడి నుండి వెళ్లిపోతా! 210 00:18:51,924 --> 00:18:52,883 కదలకు! 211 00:18:52,966 --> 00:18:55,010 ఏంటి ఆ శబ్దం? అక్కడేం జరుగుతోంది? 212 00:19:16,740 --> 00:19:17,866 ఎవరు నువ్వు? 213 00:19:29,920 --> 00:19:30,921 పదండి. 214 00:19:36,885 --> 00:19:37,886 కారు ఎక్కండి. 215 00:19:38,887 --> 00:19:39,721 ఎక్కండి! 216 00:19:49,857 --> 00:19:51,650 శాస్త్రవేత్త మా వద్దే ఉన్నాడు. 217 00:19:51,733 --> 00:19:53,110 అతని పరిస్థితి ఎలా ఉంది? 218 00:19:54,611 --> 00:19:56,530 షాక్ లో ఉన్నాడు. చిన్న గాయం అయింది. 219 00:19:56,613 --> 00:19:57,990 మిమ్మల్ని ఒక సురక్షితమైన చోటుకు పంపిస్తున్నాం. 220 00:19:58,073 --> 00:20:00,492 అక్కడికి త్వరగా వెళ్లండి. వాళ్లని సురక్షితంగా తరలించడానికి ఏర్పాట్లు చేద్దాం. తామిర్. 221 00:20:04,538 --> 00:20:05,539 అతనికి ఇది ఇవ్వు. 222 00:20:08,625 --> 00:20:10,252 మీ చేతిని దానిపై పెట్టండి. 223 00:20:14,006 --> 00:20:15,841 - నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? - మాట్లాడవద్దు. 224 00:20:15,924 --> 00:20:18,218 నన్ను ఏం చేస్తారు? తుపాకీతో కాలుస్తారా, కత్తితో పొడుస్తారా? 225 00:20:18,302 --> 00:20:19,678 ఏం చేసినా నేను పట్టించుకోను. 226 00:20:19,761 --> 00:20:23,390 నేనెంత అనుభవించానో మీకు తెలీదు, అస్సలంటే అస్సలు తెలీదు. 227 00:20:23,473 --> 00:20:25,100 నేనేమీ తోలుబొమ్మని కాదు. 228 00:20:29,479 --> 00:20:30,689 మీరు మొసాద్ వాళ్లు. 229 00:20:31,440 --> 00:20:33,442 హీబ్రూ ఎలా ఉంటుందో అతనికి తెలుసు. 230 00:20:33,525 --> 00:20:34,526 ఓ పతకం ఇచ్చేద్దాం అతనికి. 231 00:20:35,235 --> 00:20:38,447 హీబ్రూ కాదు. మీ కత్తిలాంటి సమర్థత చూసి నాకు అనిపించింది. 232 00:20:39,823 --> 00:20:42,910 ఊరి బయట ఉన్న గిడ్డంగిలో ముసావీ మీకు ఏం చూపించాడు? 233 00:20:44,620 --> 00:20:46,622 దాని గురించి నేను ఎవరికీ చెప్పలేదే. మీకెలా తెలిసింది? 234 00:20:46,705 --> 00:20:47,956 మీకు ఏం చూపించాడు? 235 00:20:49,875 --> 00:20:53,629 ఒక విడిభాగాన్ని, అంటే ఒక ఇంజినీరింగ్ భాగాన్ని… గుర్తించమని అడిగాడు. 236 00:20:53,712 --> 00:20:55,589 అణ్వాయుధ భాగమా అది? 237 00:20:56,089 --> 00:20:58,008 అయ్యుండవచ్చు. అవును. 238 00:21:02,387 --> 00:21:03,680 బదులుగా వాళ్లు మీకేం ఇస్తామన్నారు? 239 00:21:05,557 --> 00:21:08,477 ఆ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తే, 240 00:21:08,560 --> 00:21:10,020 నాకు మంచిదని చెప్పారు. 241 00:21:10,103 --> 00:21:11,980 నేను బెదిరింపులకు భయపడే రకం కాదని చెప్పాను. 242 00:21:12,981 --> 00:21:15,734 - మీ నుండి ఇంకా సాయం ఆశించారా? - అది నాకు తెలీదు. 243 00:21:15,817 --> 00:21:17,819 వాళ్ల దగ్గర ఏముందో వాళ్లకి బాగా తెలుసు. 244 00:21:17,903 --> 00:21:20,531 నేను దేనికి ఒప్పుకుంటానో చూద్దాం అన్నదే వాళ్ల ప్లాన్ ఏమో. 245 00:22:58,879 --> 00:23:00,464 ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? 246 00:23:04,551 --> 00:23:05,844 ఇక్కడ కూర్చోండి. 247 00:23:22,444 --> 00:23:23,904 నేను ఆఫీసుకు రిపోర్ట్ చేసి వస్తా. 248 00:23:37,000 --> 00:23:38,252 గాయాన్ని చూస్తా, ఆగండి. 249 00:23:38,335 --> 00:23:40,337 పర్వాలేదు, నాకేం కాలేదు. నాకేం కాలేదు. 250 00:23:40,420 --> 00:23:42,172 ఆగండి, నేను ఊరికే చూస్తానంతే. 251 00:24:14,705 --> 00:24:16,582 క్షమించు. క్షమించు. 252 00:24:21,837 --> 00:24:23,172 ఇప్పుడేం పర్వాలేదు. 253 00:24:24,381 --> 00:24:25,382 అంతా ముగిసింది. 254 00:24:35,017 --> 00:24:37,978 అతని నుండి పూర్తి సమాచారం మాకు కావాలి, కాబట్టి అతడిని టెల్ అవీవ్ కి తీసుకురండి. 255 00:24:38,061 --> 00:24:39,980 మాకేమైనా తెలియాలా? 256 00:24:43,609 --> 00:24:46,486 అతనికి సంబంధించిన కొన్ని విషయాల్లో ఇప్పటికీ మనకి పూర్తి సమాచారం అందుబాటులో లేదు. 257 00:24:46,570 --> 00:24:47,988 ఎరిక్ విక్టర్ పీటర్సన్ దక్షిణాఫ్రికా 258 00:24:48,071 --> 00:24:51,825 1980ల కాలంలో, అతను ఇజ్రాయెల్ అణు కార్యక్రమంలో పని చేశాడు. 259 00:24:52,492 --> 00:24:54,161 ఇరాన్ వాళ్లకి అతనేం చెప్పాడో మనకి తెలియాలి. 260 00:24:57,414 --> 00:24:58,498 ఇంకో విషయం. 261 00:25:00,292 --> 00:25:02,044 నీ ఏజెంట్ గురించి ఒకటి చెప్పాలి. 262 00:25:08,967 --> 00:25:10,928 నన్ను ఇజ్రాయెల్ కి తీసుకెళ్తున్నారా? 263 00:25:13,931 --> 00:25:14,932 తీసుకెళ్లవచ్చు. 264 00:25:18,936 --> 00:25:22,022 మీ ప్రభుత్వం కానీ, మీ వాళ్లు కానీ నా గురించి ప్రపంచానికి చెప్తారని నీకు అనిపిస్తోందా? 265 00:25:23,690 --> 00:25:25,442 లెక్క ప్రకారం మీరు ఎవిన్ జైలులో ఉండాలి. 266 00:25:26,443 --> 00:25:28,946 కానీ మిమ్మల్ని జైలు నుండి తప్పించామని మా రాజకీయ నాయకులు గర్వంగా చెప్పుకోవడానికి వెనుకాడరు. 267 00:25:31,365 --> 00:25:36,912 జీవితంలో ఎన్నో సాధించాను, ఎన్నో చేశాను, చివరికి నా పేరు చరిత్రలో ఇలా మిగిలిపోతుంది అన్నమాట. 268 00:25:40,249 --> 00:25:41,291 ఇది అదృష్టంగా భావించండి. 269 00:25:42,626 --> 00:25:44,044 ఆ జైలు నుండి బతికి బయటపడాలంటే అదృష్టముండాలి. 270 00:26:07,401 --> 00:26:09,319 నేను బాత్రూమ్ కి వెళ్లవచ్చా? 271 00:26:11,238 --> 00:26:12,739 వెళ్లండి. 272 00:27:09,254 --> 00:27:11,548 నా కారు జోలికి రాకు! నా సెల్ ఫోన్ ఎక్కడ? 273 00:27:12,925 --> 00:27:14,551 నన్నేం చేయవద్దు. క్షమించండి! 274 00:27:14,635 --> 00:27:15,844 దరిద్రుడా. 275 00:27:36,448 --> 00:27:38,617 - విచారణల విభాగం. - నేనే. 276 00:27:38,700 --> 00:27:41,203 నీకు ఒక నంబరు పంపిస్తా. దాన్ని ట్రేస్ చేయ్. 277 00:27:44,498 --> 00:27:51,380 912, 36, 9625, 85. 278 00:28:02,224 --> 00:28:04,142 అతడిని ఇరాన్ నుండి బయటకు తీసుకెళ్లాలని వాళ్ల ప్లాన్. 279 00:28:05,018 --> 00:28:07,020 ఈలోపు, మనం ఇంకోసారి మన చోటును మార్చాలి. 280 00:28:07,104 --> 00:28:09,106 పరిస్థితులు చల్లబడ్డాక, మనం అతడిని మళ్లీ ఇంకో చోటుకు మార్చాలి. 281 00:28:11,149 --> 00:28:12,693 మరి ఫరాజ్ సంగతి? 282 00:28:13,318 --> 00:28:16,405 అతను మన వైపు వస్తే, అది మన కార్యాలయానికి చాలా పెద్ద విజయం అవుతుంది. 283 00:28:18,115 --> 00:28:20,617 - మరి నాహీద్? - తను కూడా ఒప్పందంలో భాగమే. 284 00:28:21,869 --> 00:28:22,953 నీకు ఇది నచ్చట్లేదు. 285 00:28:24,288 --> 00:28:25,956 ఈ కార్యంలో భాగంగా మనం చేసేవేవీ నాకు అర్థం కావట్లేదు. 286 00:28:26,623 --> 00:28:28,709 మన ఏజంట్లనే చంపమని ఒకసారి ఆదేశాలు ఇస్తారు, 287 00:28:28,792 --> 00:28:31,128 ఇప్పుడేమో ఫరాజ్ కమాలిని అక్కున చేర్చుకుంటున్నారు. 288 00:28:34,298 --> 00:28:35,299 ఇంకో విషయం. 289 00:28:36,425 --> 00:28:39,636 శాస్త్రవేత్తను తీసుకురావాల్సిందిగా కార్యాలయం నిన్ను ఆదేశిస్తోంది. 290 00:28:39,720 --> 00:28:41,096 స్వయంగా నువ్వే వెళ్లి అప్పగించాలి. 291 00:28:42,347 --> 00:28:43,682 నువ్వు స్వదేశానికి వెళ్తున్నావు. 292 00:28:53,400 --> 00:28:55,402 కానీ నువ్వు చాలా బాగా పని చేశావు, తమార్. 293 00:28:57,779 --> 00:28:59,698 ఇద్దరం చక్కగా పని చేశాం. 294 00:29:00,949 --> 00:29:02,784 నేను ఈ కాలానికి సెట్ అయ్యే రకం కాదు. 295 00:29:03,869 --> 00:29:05,996 నేను తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 296 00:29:07,414 --> 00:29:10,876 ఎప్పుడు తప్పుకుంటే మంచిదో, మంచి ఏజెంటుకు తెలిసిపోతుంది. 297 00:29:19,301 --> 00:29:20,511 నన్ను మిస్ అవుతావా? 298 00:29:22,763 --> 00:29:25,933 ఒకరిని కంటికి రెప్పలా చూసుకోవడం బాగుంది. 299 00:29:34,399 --> 00:29:36,109 నేను వెళ్లి బండి నంబర్ ప్లేట్ మారుస్తాను. 300 00:30:15,941 --> 00:30:19,027 కొంచెం తీసుకోండి. షాక్ నుండి బయటపడటంలో చక్కెర సాయపడుతుంది. 301 00:30:21,530 --> 00:30:23,782 నా టీలో నాలుగు స్పూన్లు చక్కెర వేయ్. 302 00:30:24,992 --> 00:30:26,159 థ్యాంక్యూ. 303 00:30:28,620 --> 00:30:29,663 నీ పేరేంటి? 304 00:30:34,418 --> 00:30:37,379 నాకు జెన్ అనే కూతురు ఉంది, తన వయస్సు కూడా దాదాపుగా నీ అంతే ఉంటుంది. 305 00:30:40,257 --> 00:30:41,842 తనని నేను చూసి చాలా కాలమైంది. 306 00:30:42,551 --> 00:30:44,261 తను ఇరాన్ కి ఎప్పుడైనా వచ్చిందా? 307 00:30:46,388 --> 00:30:48,265 లేదు, తను ఎప్పుడూ రాలేదు. 308 00:30:50,392 --> 00:30:54,313 ఇక ఇప్పుడు, నేను కూడా ఇరాన్ కి ఇంకెప్పుడూ రాలేను. 309 00:30:57,065 --> 00:30:58,734 దాని గురించి మీకు బాధగా ఉన్నట్టుందే. 310 00:31:01,862 --> 00:31:03,447 మనకి తెలీకుండానే మనం దానికి ఆకర్షితులమైపోతాం. 311 00:31:04,907 --> 00:31:05,908 నాకు అయితే అలానే జరిగింది. 312 00:31:27,971 --> 00:31:31,767 నా పనితో ఈ దేశంలో మార్పు తీసుకువద్దామనుకున్నాను. 313 00:31:33,101 --> 00:31:34,436 చాలా అందమైన దేశం ఇది. 314 00:31:37,981 --> 00:31:41,693 ఇరాన్ అంటే నాకు చాలా ప్రేమ పుట్టేసింది, దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. 315 00:31:43,445 --> 00:31:47,032 నేను ఎక్కడ ఉన్నా, నా మనస్సంతా ఇరాన్ లోనే ఉంటుందని జెన్ అనేది. 316 00:31:53,288 --> 00:31:54,873 మీ విషయంలో మనస్సు, నా విషయంలో హృదయం. 317 00:31:58,210 --> 00:31:59,628 నేను ఇక్కడే పుట్టాను. 318 00:32:02,089 --> 00:32:04,258 ఇప్పుడు నువ్వే… నువ్వే శత్రువు అయిపోయావు. 319 00:32:08,637 --> 00:32:09,805 లేదు. 320 00:32:12,015 --> 00:32:13,559 నేను అలా అర్థం చేసుకోవట్లేదు. 321 00:32:18,105 --> 00:32:19,648 నేను కూడా మీలానే. 322 00:32:22,734 --> 00:32:24,611 నేను కూడా మార్పు తీసుకువద్దామనుకున్నా. 323 00:32:28,073 --> 00:32:29,867 నేను ఇక్కడి నుండి… 324 00:32:30,576 --> 00:32:32,244 పని పూర్తి చేయకుండానే వెళ్లిపోతున్నాను అనిపిస్తోందా? 325 00:32:36,748 --> 00:32:39,459 మన మజిలీ మన చేతుల్లో లేదు, కదా? 326 00:32:42,421 --> 00:32:45,257 తలరాతను ఎవరైనా ఎలా తప్పించుకోగలరు? 327 00:32:45,340 --> 00:32:47,801 విధికి ఎవరైనా తలవంచాల్సిందే కదా? 328 00:32:49,803 --> 00:32:50,971 అది ఫిర్దౌసీ రాశారు. 329 00:32:51,638 --> 00:32:53,599 "షా-నమే" పుస్తకం. నాకు అది తెలుసులెండి. 330 00:32:59,521 --> 00:33:00,814 నొప్పిని తగ్గించే మాత్ర కావాలా? 331 00:33:02,482 --> 00:33:03,483 దయచేసి ఇవ్వు. 332 00:33:32,721 --> 00:33:36,308 23 సెపిడే వీధి దగ్గర ఉండే యూనిట్లన్నీ వినండి, 333 00:33:36,391 --> 00:33:40,187 ఒక ఉగ్రవాది ఒకరిని బందీగా తీసుకున్నారని సమాచారం. 334 00:33:40,270 --> 00:33:42,898 అత్యంత జాగ్రత్తగా కొనసాగండి. 335 00:33:53,867 --> 00:33:55,244 నాకొక సందేహం కలిగింది. 336 00:33:57,287 --> 00:33:59,957 గిడ్డంగిలో నేను ఉన్నానని నీకెలా తెలుసు? 337 00:34:03,669 --> 00:34:07,214 ఇప్పుడు మీకు కలగాల్సిన సందేహం, సెపా వాళ్ళకి రమీన్ ఎందుకు కాల్ చేశాడు అని. 338 00:34:27,192 --> 00:34:28,735 సెపా వాళ్లకి సమాచారం అందించింది నేనే. 339 00:35:36,470 --> 00:35:38,472 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్