1 00:00:13,055 --> 00:00:16,182 ఈ సిరీసులోని పాత్రలు, సంఘటనలు అన్నీ కల్పితాలే. 2 00:00:16,183 --> 00:00:18,851 యధార్థ సంఘటనలను, లేదా బతికి ఉన్న వారినైనా, లేదా మరణించిన వారినైనా పోలి ఉంటే, 3 00:00:18,852 --> 00:00:19,937 అది పూర్తిగా యాధృచికమే. 4 00:00:22,022 --> 00:00:23,314 సెపాకి కాల్ చేసింది నువ్వేనా? 5 00:00:23,315 --> 00:00:26,693 కాల్ చేయలేదు. చనిపోయిన వ్యక్తి ఫోన్ నుండి ఒక మెసేజ్ పంపాను. 6 00:00:27,694 --> 00:00:31,365 ఒకటి చెప్పు, ఇక్కడ ఉన్నది మీ ఇద్దరేనా, లేకపోతే ఇంకా ఎక్కువ మంది వస్తున్నారా? 7 00:00:32,323 --> 00:00:33,575 ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? 8 00:00:34,284 --> 00:00:36,703 నీకు అర్థమయ్యే అవకాశం కూడా లేదులే. 9 00:00:37,496 --> 00:00:38,788 చెప్పి చూడండి. 10 00:00:38,789 --> 00:00:40,999 ఇక్కడ ఉన్నది మీరిద్దరేనా? 11 00:01:16,577 --> 00:01:17,869 నీ ఫోన్ ఇవ్వు. 12 00:01:17,870 --> 00:01:20,789 - ఎవరికి కాల్ చేయాలనుకుంటున్నారు? - ఫోన్ ఇవ్వు. 13 00:01:36,638 --> 00:01:37,472 కదలకు. 14 00:01:52,613 --> 00:01:53,989 - నా వెనుక కవర్ చేయ్! - నీ కుడి వైపు కూడా! 15 00:01:55,657 --> 00:01:57,367 నీ పక్కన గుట్టపై ఫరాజ్ ఉన్నాడు! ఒంగే ఉండు! 16 00:02:02,456 --> 00:02:03,415 త్వరగా ఎక్కు! 17 00:02:10,506 --> 00:02:11,423 వాడి తూటా తగిలింది… 18 00:02:23,143 --> 00:02:25,561 - ఇంకెవరైనా ఉన్నారా? - ఇప్పుడు పారిపోయిన ఆ ఇద్దరు. 19 00:02:25,562 --> 00:02:26,772 ఇంకా మనం, అంతే. 20 00:02:27,481 --> 00:02:28,482 నాకు అంతా తెలుసు. 21 00:03:31,128 --> 00:03:32,629 ఆ గాయాన్ని దేనితోనైనా అదిమిపట్టు. 22 00:03:34,590 --> 00:03:36,508 శాస్త్రవేత్తతో ఉన్నప్పుడు ఏమైంది? 23 00:03:38,343 --> 00:03:41,763 మనం పొరపాటు చేశాం. వాడు ఇరాన్ వాళ్లతో పని చేస్తున్నాడు. 24 00:03:43,265 --> 00:03:45,517 వాడు నన్ను కాల్చి ఉండవచ్చు. కానీ ఎందుకు కాల్చలేదో తెలీట్లేదు… 25 00:03:46,852 --> 00:03:48,353 అక్కడికి ఫరాజ్ ఎలా వచ్చాడు? 26 00:03:51,940 --> 00:03:53,650 సెపా చచ్చినోడు! 27 00:03:55,110 --> 00:03:58,447 మనం పుర్తిగా చెడదొబ్బాం. నేరుగా వాడిని పీటర్సన్ దగ్గరికి చేర్చాం! 28 00:04:42,449 --> 00:04:43,950 - పదండి. - మనం వెళ్లిపోతున్నామా? 29 00:04:43,951 --> 00:04:45,952 త్వరగా పదండి. మనకి సమయం లేదు. 30 00:04:45,953 --> 00:04:48,538 - పదండి. మనకి అస్సలు సమయం లేదు. ఇలా రండి. - నా సూట్ కేసు! 31 00:04:48,539 --> 00:04:50,749 - ఎందుకు ఇలా చేస్తున్నారు? - నిశ్శబ్దంగా ఉండండి. 32 00:04:51,291 --> 00:04:54,460 - ఏం చేస్తున్నారు? - మాట్లాడకండి. 33 00:04:54,461 --> 00:04:56,380 - నా భర్త ఎక్కడ ఉన్నాడు? - ఏమీ మాట్లాడవద్దు. 34 00:05:02,177 --> 00:05:04,012 తలుపు వేయండి. వేసేయండి. 35 00:05:11,770 --> 00:05:13,564 వీడు ఒక్కడే ఉన్నాడా? 36 00:05:14,815 --> 00:05:15,983 మిసెస్ కమాలి! 37 00:05:22,698 --> 00:05:23,949 వీడు ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? 38 00:05:24,658 --> 00:05:25,701 మిసెస్ నాహీద్! 39 00:05:26,785 --> 00:05:28,370 వీడు ఒక్కడే ఉన్నాడా? 40 00:05:37,004 --> 00:05:38,462 ఇదంతా ముగిసింది, 41 00:05:38,463 --> 00:05:39,756 ముగిసింది… 42 00:05:43,719 --> 00:05:45,053 ఊపిరి తీసుకోండి… 43 00:05:52,311 --> 00:05:53,394 ఆమె బాగానే ఉన్నారు, సర్. 44 00:05:53,395 --> 00:05:55,438 ఒక ఉగ్రవాది ఉన్నాడు. చంపేశాను. 45 00:05:55,439 --> 00:05:57,816 ఆమెకి కాపలాగా మన మనిషి ఒకడు ఉన్నాడు, ఇంకా కొందరు వస్తున్నారు కూడా. 46 00:05:58,275 --> 00:05:59,901 తనకి ఏమీ కాకుండా చూసుకోండి. 47 00:05:59,902 --> 00:06:00,903 నేను ఇంటికి వచ్చేదాకా. 48 00:06:03,322 --> 00:06:05,281 మీరు ఇంటికి వెళ్లే లోపు… 49 00:06:05,282 --> 00:06:07,159 ఆ సన్నాసులను పట్టుకుంటే మంచిది. 50 00:06:08,493 --> 00:06:12,663 నా అరెస్ట్ అంతా బూటకమని మీకు తెలిసిపోయింది, అంటే, నేనెందుకు ఇక్కడ ఉన్నానో కూడా మీకు తెలిసి ఉండాలి. 51 00:06:12,664 --> 00:06:15,374 మీకు అర్థమవుతోందా? వాళ్లిద్దరూ బండారాం అంతటినీ బయట పెట్టేయగలరు! 52 00:06:15,375 --> 00:06:18,045 పాశ్చాత్య దేశాలలో ఉండే నిఘా ఏజెన్సీలన్నీ నన్ను పట్టుకోవాలని చూస్తాయి. 53 00:06:20,214 --> 00:06:21,547 లేదు. 54 00:06:21,548 --> 00:06:22,924 లేదా? 55 00:06:22,925 --> 00:06:24,176 మిమ్మల్ని చంపాలని చూస్తాయి. 56 00:06:27,346 --> 00:06:28,347 తుపాకీని ఇవ్వండి. 57 00:06:34,603 --> 00:06:35,937 {\an8}మొసాద్ ప్రధాన కార్యాలయం, ఇజ్రాయెల్ 58 00:06:35,938 --> 00:06:37,313 {\an8}ఇప్పుడు అసలేం జరిగింది? 59 00:06:37,314 --> 00:06:39,650 ఇరాన్ వాళ్ళు అతడిని అరెస్ట్ చేసిన తర్వాత, ఒప్పించి పనిలోకి పెట్టుకున్నారా? 60 00:06:40,609 --> 00:06:41,985 అదే అయ్యుంటే, అతను మనతో పాటే వచ్చేసేవాడు. 61 00:06:42,819 --> 00:06:45,029 టైమింగ్ ని గమనించాలి మనం. అణ్వాయుధం తాలూకు ఆఖరి భాగాలు 62 00:06:45,030 --> 00:06:46,447 స్మగుల్ అయినప్పుడే, అతను ఇక్కడికి వచ్చాడు. 63 00:06:46,448 --> 00:06:48,032 వాడు మొదట్నుంచీ వాళ్లతో పని చేస్తున్నాడు. 64 00:06:48,033 --> 00:06:49,992 ఇప్పుడు వాళ్ల కోసం బాంబును బిగించబోతున్నాడు. 65 00:06:49,993 --> 00:06:51,036 ఇది నొప్పి కలిగించవచ్చు. 66 00:06:52,037 --> 00:06:53,330 ఇలా పట్టుకో. 67 00:06:55,457 --> 00:06:56,750 తమార్? 68 00:06:57,543 --> 00:06:59,503 అతని బండారం బయటపడకుండా ఉంచడానికే ఈ నాటకమంతా. 69 00:07:00,546 --> 00:07:02,338 అతడిని వాళ్లు అరెస్ట్ చేయడం, ఎవిన్ జైలులో వేయడం. 70 00:07:02,339 --> 00:07:04,091 అవన్నీ చేస్తే, అతని మీద అనుమానం కలగదు కదా. 71 00:07:05,175 --> 00:07:06,635 మనం అతని బండారాన్ని బయటపెడుతున్నామా? 72 00:07:08,011 --> 00:07:09,596 అదంత తేలికైన పని కాదు. 73 00:07:10,681 --> 00:07:11,932 అతని గతం ఎలా ఉందంటే… 74 00:07:15,185 --> 00:07:18,856 అతడిని మనం చెప్పుచేతుల్లో ఉంచుకునే అవకాశం ఏమైనా ఉందా? అతని కుటుంబం ద్వారా అయినా కానీ? 75 00:07:19,815 --> 00:07:21,400 అతని భార్య చనిపోయింది. ఇద్దరూ విడిపోయారు. 76 00:07:21,942 --> 00:07:24,570 అతనికి ఒక కూతురు ఉంది. తన గురించి నాకు చెప్పాడు. 77 00:07:25,237 --> 00:07:27,030 ఆమె ఫోన్ ని ట్యాప్ చేయండి. 78 00:07:27,823 --> 00:07:30,200 దీన్ని వాళ్లు చాలా ఏళ్లుగా ప్లాన్ చేస్తున్నారు. 79 00:07:30,826 --> 00:07:33,912 దాని గురించి మనకి అస్సలు తెలీకూడదని. నొఫార్. 80 00:07:36,456 --> 00:07:37,708 అందరూ వినండి. 81 00:07:38,834 --> 00:07:41,878 ఎరిక్ పీటర్సన్ ఒక ఇరాన్ ఏజెంట్. 82 00:07:41,879 --> 00:07:44,755 అతనికి సహచరులు, పరిచయాలు ఉండవచ్చు. 83 00:07:44,756 --> 00:07:49,010 అతను టెహ్రాన్ కి వచ్చినప్పటి నుండి ఏం చేశాడో, నాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి. 84 00:07:49,011 --> 00:07:53,098 అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మనకి తెలిపే ప్రతి విషయం గురించి, ప్రతి మనిషి గురించి నాకు తెలియాలి. 85 00:07:54,266 --> 00:07:57,102 శాస్త్రవేత్త ఎక్కడ ఉన్నాడో కనుగొంటే, మనం బాంబును కనిపెట్టవచ్చు. 86 00:07:58,228 --> 00:08:00,271 ఇప్పుడు మన ఆపరేషన్ లో మార్పు చేస్తున్నాను. 87 00:08:00,272 --> 00:08:01,106 నా మాటలు వింటున్నారా? 88 00:08:02,691 --> 00:08:03,525 వింటున్నా. 89 00:08:04,151 --> 00:08:07,028 ఇప్పుడు మన మిషన్ అదుపులోకి తీసుకోవడం కాదు, హతమార్చడం. 90 00:08:07,029 --> 00:08:08,238 అర్థమైంది. 91 00:08:09,114 --> 00:08:11,992 ఎరిక్ విక్టర్ పీటర్సన్ 92 00:08:25,547 --> 00:08:27,341 డాక్టర్ ఎరిక్ పీటర్సన్. 93 00:08:28,217 --> 00:08:29,967 ఇప్పటికి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినందుకు ఆనందంగా ఉంది. 94 00:08:29,968 --> 00:08:33,013 మీరు అనుభవించిన నరకానికి చింతిస్తున్నాను. మీకు ఏమీ కానందుకు ఆనందంగా ఉంది. దయచేసి రండి. 95 00:08:34,597 --> 00:08:37,851 డాక్టర్ ని కాపాడగలిగాను, కానీ, 96 00:08:38,852 --> 00:08:41,313 మొసాద్ ఏజెంట్లు ఇంకా పరారీలోనే ఉన్నారు. 97 00:08:42,481 --> 00:08:43,857 వాళ్లని ఎలాగైనా పట్టుకుంటా. 98 00:08:45,734 --> 00:08:47,736 మీరు ఈ జైయనిస్టులతో ఏం చెప్పారో చెప్పగలరా? 99 00:08:48,529 --> 00:08:49,821 వాళ్లకి నేనేమీ చెప్పలేదు. 100 00:08:50,739 --> 00:08:51,740 కానీ వాళ్లకి చాలా తెలుసు. 101 00:08:52,533 --> 00:08:54,910 ఇందులో మీకున్న పాత్ర గురించి వాళ్లు ప్రపంచానికి చెప్పగలరు. 102 00:08:55,577 --> 00:08:57,245 మీరేం చేయవచ్చో చెప్పనా? 103 00:08:57,246 --> 00:09:00,499 మీరు నన్ను మీడియా ముందు కూర్చోబెట్టండి, వాళ్ల గురించి నాకు తెలిసినవన్నీ లోకానికి చెప్పేస్తాను. 104 00:09:04,127 --> 00:09:05,212 నేను మాట్లాడవచ్చా? 105 00:09:06,880 --> 00:09:11,218 ఆ రోజుల్లో, ఇంచుమించుగా మీరు అయతుల్లాకి తిరిగి స్వాగతం పలికే సమయంలో, 106 00:09:11,885 --> 00:09:14,137 అణ్వాయుధాలపై ఇజ్రాయెల్ వాళ్లకే ఎక్కువ మక్కువ ఉండేది. 107 00:09:14,721 --> 00:09:18,058 అప్పుడు వాళ్లకి మద్దతుగా దక్షిణాఫ్రికా తప్ప ఇంకే ప్రభుత్వం ముందుకు రాలేదు. 108 00:09:20,769 --> 00:09:22,062 నేను అప్పుడు యువకుడిని. 109 00:09:23,522 --> 00:09:25,023 కానీ ఆ ప్రాజెక్టులో నేను కూడా పని చేశాను. 110 00:09:26,275 --> 00:09:28,610 మా తీరానికి సమీపంలో చాలా అణు పరీక్షలు చేశారు. 111 00:09:31,572 --> 00:09:35,951 ఇజ్రాయెల్ వాళ్లు, ప్రపంచం ముందు తమకి ఏం సంబంధం లేదని బుకాయించారు అనుకోండి. 112 00:09:36,535 --> 00:09:38,287 మీరు మా శత్రువుకు ఆయుధాలను సమకూర్చారు. 113 00:09:39,246 --> 00:09:40,247 అంతే అంటారా? 114 00:09:42,332 --> 00:09:45,209 ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధం ఉందా, లేదా అనేది ఎవరికీ ఖచ్చితంగా తెలీదు, 115 00:09:45,210 --> 00:09:48,629 కానీ ఆ పరీక్షల వలన, వాళ్ల దగ్గర అణ్వాయుధం ఉండవచ్చని 116 00:09:48,630 --> 00:09:49,965 నేటికి కూడా అందరూ భావిస్తున్నారు. 117 00:09:50,507 --> 00:09:54,719 అందుకే నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నాను… ఇదే నేను జనరల్ మొహమ్మదికి కూడా చెప్పాను, 118 00:09:54,720 --> 00:09:57,472 నేను ఈ మిస్సైల్ ని నిర్మించేటప్పుడు, నేను నిర్మించేది ఆయుధాన్ని కాదు. 119 00:09:58,056 --> 00:09:59,183 ఇరాన్ కి ఏం కావాలంటే, 120 00:09:59,892 --> 00:10:03,686 తనకి శక్తిని అందించేది, తనకి దక్కాల్సిన గౌరవాన్ని అందించేది ఏంటంటే, 121 00:10:03,687 --> 00:10:05,230 భయం. 122 00:10:06,106 --> 00:10:07,857 నిజాయితీగా ఒక విషయం చెప్తాను. 123 00:10:07,858 --> 00:10:09,109 నాకు దేవుని మీద నమ్మకం లేదు. 124 00:10:10,360 --> 00:10:12,279 కానీ న్యాయం మీద ఉంది. 125 00:10:12,863 --> 00:10:16,992 అన్ని పక్షాల మధ్య సమన్యాయం ఉండాలని, సమతుల్యత ఉండాలని నమ్ముతాను. 126 00:10:19,077 --> 00:10:21,205 గతంలోని పనుల వల్ల సమతుల్యత దెబతిన్న చోట్ల, 127 00:10:22,539 --> 00:10:24,082 వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని నమ్ముతా. 128 00:10:28,921 --> 00:10:31,089 మీ సేవలను ఇరాన్ ఎన్నటికీ మర్చిపోలేదు, డాక్టర్. 129 00:10:33,008 --> 00:10:35,302 ఇవాళ జరిగిన సంఘటనలను బట్టి చూస్తే, మేము ఇక ఆగలేము. 130 00:10:36,845 --> 00:10:39,139 పరీక్షని ఎంత త్వరగా నిర్వహించగలం? 131 00:10:40,933 --> 00:10:42,142 చాలా త్వరగానే. 132 00:10:43,268 --> 00:10:45,229 అదీ నేను బతికి ఉంటే. 133 00:10:47,022 --> 00:10:48,190 మీరు రేపే పని మొదలుపెడతారు. 134 00:10:49,399 --> 00:10:51,985 మీ గుట్టును బయటపడనివ్వకుండా ఉండటానికి మా శతవిధాలా మేము ప్రయత్నిస్తాం. 135 00:10:52,736 --> 00:10:55,404 మీ భద్రత, రక్షణ బాధ్యతలను 136 00:10:55,405 --> 00:10:57,074 సర్దార్ కమాలికి అప్పగిస్తున్నాను. 137 00:11:00,536 --> 00:11:04,039 మీకు ఏమైనా అవసరమైతే, అదేదైనా కానీ, మీరు నేరుగా ఆయన్ని సంప్రదించవచ్చు. 138 00:11:05,666 --> 00:11:08,126 సరే మరి. మన భవిష్యత్తు అందంగా ఉండబోతోంది. 139 00:11:17,845 --> 00:11:19,012 ఈయన్ని ఇంటి వద్ద దింపి రండి. 140 00:11:27,104 --> 00:11:29,106 నీకు తూటా గాయం అవ్వడం ఇదే మొదటిసారా? 141 00:11:32,609 --> 00:11:34,069 మరి నీకు? 142 00:11:39,616 --> 00:11:41,201 లెక్కలేనన్ని సార్లు. 143 00:11:53,255 --> 00:11:55,757 ఇది తీసుకో. శుభం జరుగుతుంది. 144 00:12:01,930 --> 00:12:04,016 నేను ఇంకా ఇక్కడే ఉన్నా కదా, అది శుభమే కదా. 145 00:12:26,496 --> 00:12:28,123 అతను ఉగ్రవాదా? 146 00:12:31,502 --> 00:12:32,753 నాకు… నాకు తెలీదు. 147 00:12:33,545 --> 00:12:34,837 మాకు ఆదేశం వచ్చినప్పుడు, 148 00:12:34,838 --> 00:12:38,884 మిస్టర్ కమాలి… అతడిని ఉగ్రవాదనే అన్నారు. 149 00:12:42,221 --> 00:12:43,930 నేను చంపిన వ్యక్తిని అన్నమాట. 150 00:12:43,931 --> 00:12:48,018 అతను సూట్ కేసును సర్దుకోమని మీకు చెప్పాడా? 151 00:12:50,103 --> 00:12:51,313 గదిలో సూట్ కేసు సర్ది ఉంది. 152 00:12:51,897 --> 00:12:53,815 మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చెప్పాడా? 153 00:12:56,443 --> 00:13:00,948 మీరు ఇవాళ చేసిన సాయానికి ధన్యవాదాలు, కానీ నాకు చాలా అసలటగా ఉంది. 154 00:13:07,496 --> 00:13:08,622 మిసెస్ కమాలి… 155 00:13:09,164 --> 00:13:11,083 నాకు నిజం ఎలాగైనా తెలుస్తుంది, 156 00:13:12,918 --> 00:13:16,213 కానీ మీకు తెలిసింది మీరు చెప్తే, అది అందరికీ చాలా మేలు చేస్తుంది. 157 00:13:17,589 --> 00:13:19,633 ఇలా బతకడం మీకు బాగుందా? 158 00:13:23,011 --> 00:13:27,599 మీరు నాకు చెప్తే, ఈ నరకం నుండి నేను మీకు విముక్తి ప్రసాదించగలను. 159 00:13:28,433 --> 00:13:31,227 ఇవాళ నిజంగా ఏం జరిగిందో చెప్పండి. 160 00:13:31,228 --> 00:13:33,104 మిమ్మల్ని బతిమాలుతున్నాను… 161 00:13:33,105 --> 00:13:35,691 మర్జాన్ మొంతాజెమీ విషయంలో అసలేం జరిగిందో చెప్పండి. 162 00:13:36,900 --> 00:13:38,277 నా భార్య ఎక్కడ ఉంది? 163 00:13:39,987 --> 00:13:41,280 నా కార్డ్ ఇదిగోండి. 164 00:13:42,072 --> 00:13:42,990 నాహీద్. 165 00:13:44,658 --> 00:13:45,742 ఇంటికి వచ్చేశావా. 166 00:13:46,243 --> 00:13:47,994 నీకు ఏమీ కాలేదు కదా? 167 00:13:47,995 --> 00:13:49,162 నిన్నేమైనా చేశారా? హా? 168 00:13:52,958 --> 00:13:54,209 హలో, జనరల్. 169 00:13:54,960 --> 00:13:58,129 కాల్ వచ్చినప్పుడు దేవుని దయ వల్ల నేను దగ్గర్లోనే ఉన్నా. 170 00:13:58,130 --> 00:13:59,381 చాలా అదృష్టమని చెప్పాలి. 171 00:14:01,925 --> 00:14:02,759 సరే. 172 00:14:03,468 --> 00:14:04,635 థ్యాంక్యూ. 173 00:14:04,636 --> 00:14:05,679 పర్వాలేదు. 174 00:14:07,347 --> 00:14:11,309 ఈ ఉగ్రవాదితో పాటు అతనికి సహకరించిన వాళ్లందరి గుర్తింపులను 175 00:14:11,310 --> 00:14:14,897 కనిపెట్టడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తాను. 176 00:14:15,564 --> 00:14:19,484 ఇంకేమీ చేయకుండా వాళ్ళని నిరోధించడానికి. దేవుని దయ వల్ల అలా ఏమీ జరగదనే ఆశిస్తున్నా. 177 00:14:21,612 --> 00:14:22,821 మంచిది, ఇక వెళ్లండి. 178 00:14:23,322 --> 00:14:24,698 అలాగే. 179 00:14:36,084 --> 00:14:37,710 ఇరాన్ తీసుకుంటున్న చర్యలపై 180 00:14:37,711 --> 00:14:40,796 అంతర్జాతీయ సమాజం చేస్తున్న ఖండనలు కొనసాగుతూనే ఉన్నాయి. 181 00:14:40,797 --> 00:14:44,175 మరో వైపు దేశాలన్నీ ఇందులో తమకి భాగం లేదని చెప్తూనే ఉన్నాయి, 182 00:14:44,176 --> 00:14:48,387 డాక్టర్ పీటర్సన్ బాధ్యతలు, అతని సహచరులకి అప్పగించబడ్డాయి, 183 00:14:48,388 --> 00:14:51,974 దీనితో ఆయన పోలీసుల అదుపులో ఎక్కువ కాలమే ఉండవచ్చని తెలుస్తోంది. 184 00:14:51,975 --> 00:14:56,395 మరో వైపు ఇరాన్, డాక్టర్ పీటర్సన్, సున్నితమైన ప్రభుత్వ కేంద్రాలకు తనకి ఉన్న ప్రవేశాన్ని 185 00:14:56,396 --> 00:15:00,900 దుర్వినియోగపరిచారని, పాశ్చాత్య ప్రభుత్వాల తరఫున అక్రమంగా నిఘా కార్యకలాపాలకి పాల్పడ్డారనే 186 00:15:00,901 --> 00:15:04,820 తన వాదనని పునరుద్ఘాటిస్తూనే ఉంది. 187 00:15:04,821 --> 00:15:06,447 దక్షిణాఫ్రికా దౌత్య కార్యాలయం వాళ్లు 188 00:15:06,448 --> 00:15:10,535 డాక్టర్ పీటర్సన్ విడుదల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు, 189 00:15:10,536 --> 00:15:13,246 {\an8}ఆయనపై న్యాయంగా విచారణ జరిగే అవకాశం లేదని… 190 00:15:13,247 --> 00:15:14,914 {\an8}ప్రపంచ వార్తలు - అణు శాస్త్రవేత్తపై గూఢచర్య ఆరోపణలు 191 00:15:14,915 --> 00:15:16,792 …దాని వల్ల ఆయనకి మరణ శిక్ష కూడా పడవచ్చని భావిస్తున్నారు. 192 00:15:17,876 --> 00:15:20,754 థ్యాంక్యూ, డేవ్. ఇప్పుడు ఇతర అంతర్జాతీయ వార్తలను చూద్దాం. 193 00:15:21,588 --> 00:15:24,298 ఫ్రాన్స్ లో ఈరోజు, నిరసనలో భాగంగా… 194 00:15:24,299 --> 00:15:25,676 డాక్టర్, మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు. 195 00:15:26,176 --> 00:15:29,513 …నిరసనకారులకు, పోలీసులకి మధ్య తోపులాటలు జరిగాయి. 196 00:15:34,226 --> 00:15:35,477 షపరక్. 197 00:15:41,733 --> 00:15:42,817 ఏమైంది నీకు? 198 00:15:42,818 --> 00:15:43,986 ఇదేమీ పెద్ద గాయం కాదులే. 199 00:15:45,070 --> 00:15:48,240 ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకేమీ కాలేదు, నేను పనిని కొనసాగించగలను కూడా. 200 00:15:49,408 --> 00:15:50,409 నిన్ను చూడటం బాగుంది. 201 00:15:51,994 --> 00:15:53,245 నిన్ను చూడటం కూడా. 202 00:15:54,746 --> 00:15:57,708 - చూడు, ఎరిక్, నేను… - మనం, అక్కడికి వెళ్లి మాట్లాడుకుందామా? 203 00:15:58,333 --> 00:15:59,334 సరే. 204 00:16:12,347 --> 00:16:14,850 నువ్వు… సంపాదించగలిగావా… 205 00:16:20,314 --> 00:16:22,064 నువ్వు అడిగిన పని చేశా. 206 00:16:22,065 --> 00:16:26,111 ఒక్కో భాగం వచ్చినప్పుడల్లా, దాని పనితీరు విశ్లేషణ గణాంకాలను యాక్సెస్ చేశాను. 207 00:16:27,362 --> 00:16:30,448 నీ ఆందోళన నిజమైనదే. ఫైరింగ్ సెట్ లో 208 00:16:30,449 --> 00:16:31,617 ఏదో లోపం ఉన్నట్లు గుర్తించాను. 209 00:16:35,287 --> 00:16:37,456 భాగాలను ఎవరో మార్చినట్టు అనిపిస్తోంది. 210 00:16:40,042 --> 00:16:41,126 ముసావీ దాన్ని గమనించలేదు. 211 00:16:42,419 --> 00:16:45,464 పేలుడు తర్వాత విడుదలయ్యే శక్తికి, ప్రోగ్రామ్ లక్ష్యానికి చాలా వ్యత్యాసం ఉంది. 212 00:16:48,050 --> 00:16:49,635 దీని గురించి నువ్వు ఎవరికైనా చెప్పావా? 213 00:16:52,262 --> 00:16:54,639 భాగాలకు, కోడ్ కి స్వయంగా నేను యాక్సెస్ చేస్తే కానీ, 214 00:16:54,640 --> 00:16:57,518 లోపం ఎక్కడ ఉందో చెప్పలేను. 215 00:16:59,436 --> 00:17:00,938 - నాకు యాక్సెస్ దక్కే అవకాశముందా… - వద్దు, వద్దు. 216 00:17:01,522 --> 00:17:02,773 ఇప్పటి దాకా నువ్వు చేసింది చాలు. 217 00:17:03,899 --> 00:17:04,942 ఇక నువ్వు ఇంటికి బయలుదేరు. 218 00:17:07,694 --> 00:17:08,987 నేను మళ్లీ నిన్ను కలుస్తానా? 219 00:17:11,323 --> 00:17:12,366 తెలీదు. 220 00:17:13,575 --> 00:17:14,576 కలుస్తావనే అనుకుంటున్నా. 221 00:17:29,383 --> 00:17:31,260 గుడ్ మార్నింగ్. నీ భుజం ఎలా ఉంది? 222 00:17:31,760 --> 00:17:32,719 ఇంకా నొప్పిగా ఉంది. 223 00:17:35,222 --> 00:17:37,015 ఇందులో నాహీద్ కి కూడా భాగం ఉందంటావా? 224 00:17:38,684 --> 00:17:39,560 తెలీదు. 225 00:17:41,061 --> 00:17:42,061 అతను ఆమెకి అబద్ధం చెప్పాడు. 226 00:17:42,062 --> 00:17:44,397 తనకి బయటకు వెళ్లిపోవాలనుంది. అది మాత్రం నిజం. 227 00:17:44,398 --> 00:17:46,440 అయితే, ఇక్కడి నుండి ఆమెకి సమస్యలు మొదలవుతాయి. 228 00:17:46,441 --> 00:17:48,026 ఆమెకి సాయం కావాలి. 229 00:17:49,486 --> 00:17:51,655 నువ్వు తనకి రుణపడి ఏమీ లేవు. ఆమె ఒక సెపా మనిషికి భార్య. 230 00:17:52,739 --> 00:17:54,741 కానీ నేను తనకి రుణపడే ఉన్నా. తనకి మాటిచ్చాను. 231 00:18:00,205 --> 00:18:01,832 రా. ఆఫీసు వాళ్లకి ఏదో లభించినట్టుంది. 232 00:18:05,961 --> 00:18:08,337 యుఎన్ మిషన్ వచ్చినప్పటి నుండి, ఆ శాస్త్రవేత్త అణు శుద్ధి కేంద్రానికి 233 00:18:08,338 --> 00:18:09,672 రెండుసార్లు వెళ్లినట్టు మనకి తెలిసింది, 234 00:18:09,673 --> 00:18:11,591 అణు కేంద్రానికి వెళ్లడానికి తప్ప, అతను హోటల్ గడపని దాటనే లేదు, 235 00:18:11,592 --> 00:18:16,304 కానీ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మేము ఒకరి రాకపోకలని గమనించాం. 236 00:18:16,305 --> 00:18:18,056 షపరక్ నౌరీ. 237 00:18:18,557 --> 00:18:20,100 ఫర్జీన్ నౌరీ భార్య ఈమె. 238 00:18:22,227 --> 00:18:24,979 అతను అణు శుద్ధి ప్రోగ్రాముకు హెడ్. ఏడేళ్ల క్రితం అతను హత్యకు గురయ్యాడు. 239 00:18:24,980 --> 00:18:27,273 ఇప్పుడు ఈమె శాస్త్రవేత్తతో కలిసి పని చేస్తోంది. 240 00:18:27,274 --> 00:18:30,735 ఫర్జీన్ ఇన్ ఛార్జీగా ఉన్నప్పుడు కూడా, ఈ శాస్త్రవేత్తే యుఎన్ ఇన్ స్పెక్టర్ల మిషన్ కి నాయకత్వం వహించారు. 241 00:18:30,736 --> 00:18:32,987 అతని హత్య తర్వాత, మిషన్ లో సభ్యులు తమ భాగస్వామ్యాన్ని ముగించేశారు, 242 00:18:32,988 --> 00:18:35,740 కానీ శాస్త్రవేత్త మాత్రం కొంత కాలం పాటు ఇరాన్ లోనే ఉన్నారు. 243 00:18:35,741 --> 00:18:37,366 కొందరితో పరిచయాలు పెంచుకున్నారు. 244 00:18:37,367 --> 00:18:39,285 షపరక్ ని మేము ఎలా కనుగొనగలం? 245 00:18:39,286 --> 00:18:41,662 మేము ఇంకా ఆమె చిరునామాని కనిపెట్టే పనిలో ఉన్నాం. 246 00:18:41,663 --> 00:18:47,043 ఆమెని అదుపులోకి తీసుకొని, విచారించండి. శాస్త్రవేత్త విషయంలో ఏదోక ఆధారం కోసం, ఏమైనా చేయండి. 247 00:18:47,044 --> 00:18:49,253 వాళ్లు ఈ కథనాన్ని ఇంకా కొనసాగేలా చేస్తున్నారు, 248 00:18:49,254 --> 00:18:52,548 అంటే, తమ లక్ష్యానికి చేరువవుతున్నారని అర్థం. 249 00:18:52,549 --> 00:18:54,676 ఆ పని మనం జరగనివ్వకూడదు. 250 00:18:56,178 --> 00:18:57,179 సరే. 251 00:19:08,023 --> 00:19:09,942 ఔల్ తో మాట్లాడటానికి ప్రైవేట్ లైన్ ని సెట్ చేయండి. 252 00:19:21,787 --> 00:19:23,037 ఔల్? 253 00:19:23,038 --> 00:19:23,872 నేనే. 254 00:19:24,790 --> 00:19:26,208 ఈ పనిలో ఏదైనా సమస్య ఎదురయ్యే అవకాశం ఉందా? 255 00:19:27,125 --> 00:19:29,001 నీకు పోయిన సారి ఏం జరిగిందో గుర్తుందా? 256 00:19:29,002 --> 00:19:32,130 ఏ సమస్యా ఉండదు. మాకు చిరునామా పంపండి. 257 00:19:51,149 --> 00:19:52,025 నాహీద్. 258 00:19:53,110 --> 00:19:55,236 నా కారణంగా నువ్వు ఇబ్బంది పడ్డావు… 259 00:19:55,237 --> 00:19:56,738 అందుకు మన్నించు. 260 00:19:58,282 --> 00:19:59,533 కానీ నాకు మరో దారి కనిపించలేదు. 261 00:20:03,996 --> 00:20:05,080 నువ్వు అబద్ధమాడావు. 262 00:20:06,331 --> 00:20:07,248 అవును. 263 00:20:07,249 --> 00:20:09,501 మనల్ని కాపాడుకోవడానికే. 264 00:20:10,836 --> 00:20:12,545 మనం వెళ్లాల్సిన అవసరం ఉందని 265 00:20:12,546 --> 00:20:14,506 వాళ్లని నమ్మించక తప్పలేదు. 266 00:20:16,508 --> 00:20:18,552 మనల్ని కాపాడటానికి నాకు అదొక్క దారే కనిపించింది. 267 00:20:20,304 --> 00:20:21,680 నిన్ను కాపాడుకోవడానికి. 268 00:20:22,764 --> 00:20:24,308 నీకు అర్థమవుతోందా? 269 00:20:26,018 --> 00:20:28,395 నువ్వు నన్ను వాడుకున్నావు! 270 00:20:29,646 --> 00:20:32,316 నా ఆకాంక్షలను వాడుకున్నావు… 271 00:20:33,734 --> 00:20:35,986 మనం నిజంగానే విదేశాలకు వెళ్లిపోతున్నామని నమ్మేశాను. 272 00:20:39,531 --> 00:20:41,908 కానీ మనం వెళ్లిపోవాల్సిన అవసరమే లేదు. 273 00:20:41,909 --> 00:20:43,035 తెలుసా? 274 00:20:44,077 --> 00:20:46,914 మనం వెళ్లిపోవాలి అనడానికి లక్ష కారణాలు ఉన్నాయి! 275 00:20:53,962 --> 00:20:57,132 ఇలా నేను ఇంకో క్షణం కూడా ఉండలేను! 276 00:20:58,425 --> 00:21:01,553 తలుపును ఎవరైనా తట్టినప్పుడల్లా భయంతో వణికిపోవడం! 277 00:21:02,304 --> 00:21:04,555 ఏదైనా కారు ఇటు వెళ్లినప్పుడల్లా! 278 00:21:04,556 --> 00:21:07,725 ఫోన్ మోగినప్పుడల్లా! 279 00:21:07,726 --> 00:21:08,727 ఇలా రా. 280 00:21:10,020 --> 00:21:11,647 నీకు ఒకటి చూపిస్తాను. 281 00:21:13,357 --> 00:21:14,441 నాహీద్! 282 00:21:15,150 --> 00:21:16,193 నాతో రా. 283 00:21:16,818 --> 00:21:17,736 నాతో రా. 284 00:21:24,034 --> 00:21:25,160 రా. 285 00:21:26,453 --> 00:21:27,496 రా. 286 00:21:32,000 --> 00:21:32,918 చూడు. 287 00:21:33,669 --> 00:21:34,837 బయట చూడు. 288 00:21:35,462 --> 00:21:36,712 అంతా కనిపిస్తోందా? 289 00:21:36,713 --> 00:21:39,883 మనల్ని ఇంకెవరూ ఏమీ చేయలేరు. 290 00:21:40,634 --> 00:21:42,218 మనం ఎక్కడికి వెళ్లినా, 291 00:21:42,219 --> 00:21:44,136 ఏం చేసినా. 292 00:21:44,137 --> 00:21:45,764 నీకు అర్థమవుతోందా? 293 00:21:50,394 --> 00:21:51,895 నీ క్షేమానికి ఇప్పుడు ఏ ఢోకా లేదు. 294 00:21:53,480 --> 00:21:55,315 ఎప్పుడూ లేనంత నిశ్చింతగా ఉండవచ్చు నువ్వు. 295 00:22:04,366 --> 00:22:06,660 {\an8}రహాస్య కేంద్రం, సెంట్రల్ టెహ్రాన్ 296 00:23:12,476 --> 00:23:15,395 {\an8}ఐ.ఆర్.జీ.సీ నిఘా శాఖ ప్రధాన కార్యాలయం, టెహ్రాన్ 297 00:23:16,355 --> 00:23:17,688 చెప్పండి. 298 00:23:17,689 --> 00:23:19,649 మేము క్షుణ్ణంగా తనిఖీ చేశాం. 299 00:23:19,650 --> 00:23:22,109 ఇతనికి, బ్రదర్హుడ్ తో కానీ, లేదా మనకి తెలిసిన ఏ ఉగ్రవాద సంస్థతో కానీ 300 00:23:22,110 --> 00:23:24,238 సంబంధాలు లేవు. 301 00:23:26,156 --> 00:23:27,490 అతని తుపాకీని తనిఖీ చేశారా? 302 00:23:27,491 --> 00:23:29,325 ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది. 303 00:23:29,326 --> 00:23:30,826 రెండు నెలల క్రితం జరిగిన 304 00:23:30,827 --> 00:23:35,039 హత్యాయత్నంలో వాడిన తుపాకీకి, ఈ తుపాకీకి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి, 305 00:23:35,040 --> 00:23:36,999 అంటే వీళ్లు జైయనిస్టులతో కలిసి పని చేస్తూ ఉండవచ్చు. 306 00:23:37,000 --> 00:23:38,544 ఈసారి నేను నీకు భోజనం పార్టీ ఇస్తా. 307 00:23:45,592 --> 00:23:46,927 తలుపును తెరువు. 308 00:24:02,901 --> 00:24:03,944 ఘసేమీ. 309 00:24:05,654 --> 00:24:07,447 నీకు దెబ్బలు పడి ఉంటాయని అనుకున్నానే. 310 00:24:08,991 --> 00:24:10,701 నిరాశపరిచినందుకు క్షమించాలి. 311 00:24:12,119 --> 00:24:13,287 నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. 312 00:24:22,087 --> 00:24:25,883 పీటర్సన్ నిన్ను ఒక మొసాద్ ఏజెంటుతో ఉండగా చూశాడు. 313 00:24:30,053 --> 00:24:31,804 సారా, మొసాద్ ఏజెంటా? 314 00:24:31,805 --> 00:24:33,890 నీకు తెలిసి ఉంటే, ఏం చేసుండేవాడివి? 315 00:24:33,891 --> 00:24:35,309 నాకు తెలిసి ఉంటే… 316 00:24:37,561 --> 00:24:40,022 తను నిన్ను కలవడానికి వచ్చిందని నాకు తెలుసు. 317 00:24:42,441 --> 00:24:46,403 నేను అక్కడికి పీటర్సన్ ని తీసుకొద్దామనే వెళ్లా, తను అక్కడ ఉంటుందని నాకు తెలీదు. 318 00:24:47,487 --> 00:24:49,197 - ఇప్పుడు తను ఎక్కడ ఉంది? - అది నాకెలా తెలుస్తుంది? 319 00:24:49,198 --> 00:24:50,782 - తను ఎక్కడ ఉంది? - నాకు తెలీదు! 320 00:25:00,375 --> 00:25:01,752 నీ విధేయతని నిరూపించుకో. 321 00:25:04,213 --> 00:25:05,713 తన ఆచూకీని కనిపెట్టు. 322 00:25:05,714 --> 00:25:07,590 తనని నా దగ్గరికి తీసుకురా, 323 00:25:07,591 --> 00:25:09,301 లేదంటే చచ్చేదాకా 324 00:25:10,052 --> 00:25:11,261 ఇక్కడే ఉంటావు నువ్వు. 325 00:25:11,762 --> 00:25:13,472 అర్థమైందా? 326 00:26:06,733 --> 00:26:10,486 డాక్టర్ పీటర్సన్, ఇవాళ నిజంగానే చాలా మంచి రోజు. 327 00:26:10,487 --> 00:26:12,072 ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. 328 00:26:13,115 --> 00:26:14,116 ఎట్టకేలకు. 329 00:26:15,284 --> 00:26:17,451 మొన్న సాయంత్రం జరిగిన సంఘటనకి చింతిస్తున్నాను. 330 00:26:17,452 --> 00:26:20,205 ఆయుధ భాగాలకు ఏమవుతుందా అనే దానికే తొలి ప్రాధాన్యతనిచ్చాను. 331 00:26:22,291 --> 00:26:23,959 మీ ప్రాణాలకు ఏమీ కానందుకు ఆనందంగా ఉంది, డాక్టర్. 332 00:26:25,711 --> 00:26:26,962 నిజంగానే ఆనందంగా ఉందా? 333 00:26:34,011 --> 00:26:35,262 దయచేసి తలుపు తెరవండి. 334 00:26:42,227 --> 00:26:43,645 థ్యాంక్యూ. 335 00:26:57,784 --> 00:26:58,785 ఇదుగోండి. 336 00:26:59,536 --> 00:27:01,121 మీరు దీన్ని వేసుకోవాల్సి ఉంటుంది. 337 00:27:03,665 --> 00:27:06,460 మేము అంతస్స్ఫోటనాన్ని, సంకోచనాన్ని, దిగుబడిని మోడలింగ్ చేస్తున్నాము. 338 00:27:07,294 --> 00:27:08,629 ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. 339 00:27:10,130 --> 00:27:11,340 దయచేసి ఇలా రండి. 340 00:27:17,179 --> 00:27:18,721 బిగించడం ఎలా సాగుతోంది? 341 00:27:18,722 --> 00:27:19,556 చాలా బాగా. 342 00:27:21,391 --> 00:27:22,684 సూపర్. 343 00:27:30,400 --> 00:27:31,735 ఏం చేస్తున్నారు? 344 00:27:32,486 --> 00:27:34,071 మేము బిగించే పని చేస్తున్నాం. 345 00:27:35,614 --> 00:27:37,406 ఓరి నాయనోయ్. 346 00:27:37,407 --> 00:27:39,075 గిడ్డంగిలోనే మీకు చెప్పా కదా. 347 00:27:39,076 --> 00:27:42,828 ఈ భాగాలు, ప్రపంచంలోని ఇతర అణు ప్రోగ్రామ్స్ నుండి వస్తున్నాయి. 348 00:27:42,829 --> 00:27:46,958 బిగించడానికి ముందే, నేను ఒక్కో భాగాన్ని పరీక్షించాలి కదా. 349 00:27:46,959 --> 00:27:48,961 పని త్వరగా కానివ్వమని లారిజాని చెప్పారు. 350 00:27:50,003 --> 00:27:52,380 మీరు ఇక్కడికి వచ్చే అవకాశం కూడా పెద్దగా లేదని నాకు చెప్పారు. 351 00:27:52,381 --> 00:27:53,382 కానీ, నేను వచ్చాగా! 352 00:27:54,675 --> 00:27:57,344 ఫైరింగ్ సెట్ లో లోపం ఉందని నేను భావిస్తున్నాను. 353 00:28:00,973 --> 00:28:01,974 అది మీకెలా తెలుసు? 354 00:28:03,517 --> 00:28:06,978 నౌరీ అమ్మాయే చెప్పింది కదా. మీ విశ్వసనీయ సహచరురాలు. 355 00:28:06,979 --> 00:28:08,313 ఆమె మీ దగ్గరికి వచ్చింది. 356 00:28:09,565 --> 00:28:13,568 నా సమ్మతి లేకుండా ఈ ప్రాజెక్టుపై ఏ పని జరిగినా నాకు నచ్చదు. 357 00:28:13,569 --> 00:28:17,113 వృత్తిపరంగా మీకు ఉన్న అహంభావాన్ని పరిగణనలోకి తీసుకునే స్థితిలో నేను లేను. 358 00:28:17,114 --> 00:28:21,869 మీరు అంటున్న ఆ నౌరీ మహిళ, నా ప్లానులో ఎప్పట్నుంచో భాగంగా ఉంది. మీ కన్నా ముందే. 359 00:28:22,786 --> 00:28:24,204 మా ఉత్తమ వ్యక్తులు ఇక్కడ పని చేస్తున్నారు. 360 00:28:25,998 --> 00:28:27,374 లేదు. 361 00:28:28,333 --> 00:28:30,169 మీ ఉత్తమ వ్యక్తులు చనిపోయారు. 362 00:28:31,545 --> 00:28:34,338 ఈ ప్రోగ్రాములో భాగం అయినందుకు విదేశీ ప్రభుత్వాలు వారిని చంపేశాయి. 363 00:28:34,339 --> 00:28:37,550 నేను ఇక్కడ ఉన్నానంటే, ఎంత రిస్క్ తీసుకుంటున్నానో మీకు అర్థమవుతోందా? 364 00:28:37,551 --> 00:28:42,431 నేను పూర్తిగా నమ్మేవారు ఒకరు అయినా ఉండాలి కదా. నాకు షపరక్ తెలుసు. ఆమె భర్త తెలుసు. 365 00:28:43,599 --> 00:28:46,684 ఎప్పటిలాగే ఇప్పుడు కూడా విశ్లేషణలను తనే జరపాలి. 366 00:28:46,685 --> 00:28:50,438 మీరు ఫైరింగ్ సెట్ భాగాలన్నీ వేరు చేసేయాలి, సరైన తనిఖీలు చేశాకే, మళ్లీ బిగించాలి. 367 00:28:50,439 --> 00:28:53,691 తుస్సుమనే బాంబు కోసం ఇంత కష్టపడలేదు నేను. 368 00:28:53,692 --> 00:28:54,943 ఒక విషయం స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తా. 369 00:28:55,861 --> 00:28:57,696 కార్యకలాపాల పరంగా ఇక్కడ అధికారం నాకే ఉంది. 370 00:29:00,282 --> 00:29:01,283 నేను కమాలికి కాల్ చేస్తాను. 371 00:29:05,329 --> 00:29:08,165 మిమ్మల్ని ఇప్పటిదాకా ఎవరూ ఎందుకు చంపలేదో మీకెప్పుడూ సందేహం కలగలేదా? 372 00:29:16,590 --> 00:29:19,008 ఇక్కడ ఉండవద్దని నీకు చెప్పా కదా? 373 00:29:19,009 --> 00:29:20,010 చెప్పారు. 374 00:29:21,261 --> 00:29:22,803 మీకు డాక్టర్ అవసరం ఉందా? 375 00:29:22,804 --> 00:29:23,805 లేదు, మరేం పర్వాలేదు. 376 00:29:53,460 --> 00:29:55,546 ఫ్లాట్ 304. నేను ఓ కన్నేసి ఉంచుతాను. 377 00:30:00,050 --> 00:30:01,467 మూడవ అంతస్థు. 378 00:30:01,468 --> 00:30:02,760 వింటున్నావా? 379 00:30:02,761 --> 00:30:04,805 హా, నేను… నేను ఈ పని చేయాలి. 380 00:30:06,014 --> 00:30:07,266 నాకు ఇది నచ్చట్లేదు. 381 00:30:08,433 --> 00:30:10,269 ఇప్పుడు నీ దృష్టంతా మిషన్ మీద పెట్టు. 382 00:30:23,949 --> 00:30:28,495 రాజ్మండేగన్ పార్క్. మసూద్ అబ్బాసీ. మీరు విదేశాలకు వెళ్లడానికి దారి. 383 00:31:08,243 --> 00:31:09,285 నౌరీ 384 00:31:09,286 --> 00:31:11,288 త్వరగా రా. పద వెళ్దాం. 385 00:31:12,873 --> 00:31:14,457 నువ్వు ఏదో మర్చిపోతున్నట్టున్నావు. 386 00:31:14,458 --> 00:31:17,711 - సారీ, అమ్మా. నా బ్యాగ్ మర్చిపోయా. - బంగారం. 387 00:31:19,046 --> 00:31:20,506 తీసుకొని త్వరగా రా. 388 00:31:33,727 --> 00:31:35,103 ఏం జరుగుతోంది? 389 00:31:36,855 --> 00:31:38,731 లోపలికి వెళ్లే అవకాశం ఇంకా రాలేదు. 390 00:31:38,732 --> 00:31:42,736 ఏమైంది? మనకి ఇప్పుడు కావాల్సిన సమాచారం ఈ మహిళ దగ్గర ఉంది. 391 00:31:43,445 --> 00:31:44,655 నీకే అర్థమవుతుందిలే. 392 00:31:57,543 --> 00:32:00,878 - హాయ్, ఎలా ఉన్నారు? - హలో, మేడమ్, ఎలా ఉన్నారు? 393 00:32:00,879 --> 00:32:02,673 ఇందుకే ఆగావా? 394 00:32:06,051 --> 00:32:08,095 తనతో పాప కూడా ఉంది. నువ్వు అయితే ఏం చేసి ఉండేవాడివి? 395 00:32:24,486 --> 00:32:25,695 తను మళ్లీ లోపలికి వెళ్తోంది. 396 00:32:25,696 --> 00:32:27,698 ఇప్పుడు నీకు ఏ సమస్యా ఉండదుగా. 397 00:32:45,048 --> 00:32:47,383 - ఏంటిది? ఏం చేస్తున్నావు? - లోపలికి పద. 398 00:32:47,384 --> 00:32:49,427 - ఎవరు నువ్వు? - ఇలా రా. 399 00:32:49,428 --> 00:32:51,345 దయచేసి, నన్నేం చేయవద్దు. 400 00:32:51,346 --> 00:32:53,306 నేను కూర్చుంటాను. నన్నేం చేయవద్దు. నాకొక చిన్న పాప ఉంది. 401 00:32:53,307 --> 00:32:55,641 నన్నేం చేయవద్దు, అసలు నేనేం చేశాను? 402 00:32:55,642 --> 00:32:58,270 - నాకొక చిన్న పాప ఉంది. - నోర్మూసుకో! 403 00:32:59,062 --> 00:32:59,938 బతిమాలుతున్నా! 404 00:33:02,274 --> 00:33:04,776 చూడు, నాకు ఒక కూతురు ఉంది, దయచేసి నన్నేం చేయవద్దు. 405 00:33:05,694 --> 00:33:08,822 తను చాలా చిన్నది. చూశారా? అక్కడ చూడండి. 406 00:33:12,534 --> 00:33:14,786 - ప్లీజ్, మేడమ్. - పీటర్సన్ ఎక్కడ? 407 00:33:20,918 --> 00:33:21,752 ఎవరు? 408 00:33:22,628 --> 00:33:23,504 ఎవరా? 409 00:33:32,137 --> 00:33:34,264 హోటల్ లో నువ్వు పీటర్సన్ గదికి వెళ్లావని మాకు తెలుసు. 410 00:33:37,226 --> 00:33:39,311 నీ తొక్కలో సోది వినేంత సమయం నాకు లేదు. 411 00:33:40,103 --> 00:33:41,647 అతను ఇప్పుడు ఎవిన్ జైల్లో లేడని మాకు తెలుసు, 412 00:33:42,272 --> 00:33:43,815 నిజంగా అతను ఏం చేస్తున్నాడో కూడా మాకు తెలుసు. 413 00:33:44,816 --> 00:33:46,360 కాబట్టి, అతను ఎక్కడ ఉన్నాడో చెప్పు. 414 00:33:49,947 --> 00:33:51,365 నువ్వు మొసాద్ ఏజెంటువి. 415 00:33:52,199 --> 00:33:56,202 అంటే, నువ్వు ఎవరికైనా కాల్ చేస్తే, నిన్ను చంపేస్తాను, నిన్ను కాపాడటానికి ఎవరు వచ్చినా, వాళ్లని కూడా చంపేస్తాను. 416 00:33:56,203 --> 00:33:57,287 స్పష్టంగా అర్థమైందా? 417 00:33:59,248 --> 00:34:00,374 నీ ఫోన్ ఇవ్వు. 418 00:34:02,084 --> 00:34:03,335 నీ ఫోన్ నాకు ఇవ్వు! 419 00:34:18,809 --> 00:34:20,600 లారిజాని అర్థం చేసుకోవాలి. 420 00:34:20,601 --> 00:34:23,729 జనరల్ మొహమ్మదితో అంగీకారం కుదిరినట్టుగా 421 00:34:23,730 --> 00:34:25,774 ఆ కేంద్రం పూర్తిగా నా గుప్పెట్లోకి రావాలి. 422 00:34:26,692 --> 00:34:28,192 ఆయన మీకు ఆ మాట ఇచ్చాడా? 423 00:34:28,193 --> 00:34:31,236 అలా లేకపోతే, లారిజాని షెడ్యూల్ కి నేను హామీ ఇవ్వలేను. 424 00:34:31,237 --> 00:34:32,322 ముసావీ ఏమన్నాడు? 425 00:34:33,364 --> 00:34:35,701 అతనికి బుర్ర ఉంటే, మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు ఉండేది కాదు. 426 00:34:36,994 --> 00:34:39,412 మీరు అడిగేది జరగదు, డాక్టర్. 427 00:34:39,413 --> 00:34:41,206 నేనేమన్నానో విన్నారా? 428 00:34:42,541 --> 00:34:46,836 మీకు ప్రాణ హాని కలగకుండా నేను చూసుకుంటే, షెడ్యూల్ ప్రకారం వెళ్లవచ్చని మీరు లారిజానితో అన్నారు. 429 00:34:46,837 --> 00:34:48,964 మరి మీ ప్రాణాలకి ఏమీ కాలేదు కదా. 430 00:34:49,630 --> 00:34:55,678 చూడండి, మనం ప్రతీ విడిభాగాన్ని ప్రతీ దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి… 431 00:34:55,679 --> 00:34:56,762 ప్రతీ దాన్ని తనిఖీ చేసి… 432 00:34:56,763 --> 00:34:58,306 ఎవరైనా ఏమైనా చేశారేమో చూడాలి. 433 00:34:58,307 --> 00:35:00,641 ఏ క్షణంలోనైనా వాటిలో చాలా వరకు పని చేయకుండా పోవచ్చు. 434 00:35:00,642 --> 00:35:01,976 ఎవరైనా ఏమైనా చేసుంటారు అంటున్నారేంటి? 435 00:35:01,977 --> 00:35:06,106 ఫైరింగ్ సెట్ ఇక్కడికి రాక ముందే, దాన్ని ఎవరైనా ఏమైనా చేసుంటారేమో అని అనుమానంగా ఉంది. 436 00:35:07,608 --> 00:35:09,026 పక్కాగా తెలియాలంటే, నేను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. 437 00:35:10,277 --> 00:35:12,404 ఆ పని ఎవరు చేసుంటారు? 438 00:35:13,155 --> 00:35:14,156 మొసాద్. 439 00:35:16,408 --> 00:35:18,619 వాళ్లకు ముందే ఈ ప్లాన్ గురించి తెలీదు కదా. 440 00:35:19,912 --> 00:35:20,746 వాళ్లకి తెలీదని పక్కాగా తెలుసా? 441 00:35:22,372 --> 00:35:23,373 నాకు తెలుసు. 442 00:35:24,833 --> 00:35:26,585 వెంటనే నేను లారిజానితో మాట్లాడతాను. 443 00:35:32,341 --> 00:35:33,550 ఇక నా ప్లాన్… 444 00:35:36,553 --> 00:35:38,347 నా అరెస్ట్, జైల్లో ఉంచడం… 445 00:35:41,141 --> 00:35:44,770 నేను ఇక్కడున్న దాన్ని బాగు చేసేసి, తిరిగి నా పాత జీవితానికి వెళ్లిపోతాను… 446 00:35:46,939 --> 00:35:48,899 అది కూడా మెరుగైన, ప్రశాంతమైన చోట అన్నమాట. 447 00:35:50,150 --> 00:35:51,902 మళ్లీ నా కూతురుని కూడా కలుస్తానేమో. 448 00:35:54,154 --> 00:35:56,073 ఇప్పుడు అది జరుగుతుందని నాకు అనిపించట్లేదు. 449 00:35:59,201 --> 00:36:00,202 జరగదు. 450 00:36:00,744 --> 00:36:01,745 మీ భార్య. 451 00:36:03,121 --> 00:36:05,249 నేను అడగలేదు. అంతా ఓకేనా? 452 00:36:17,261 --> 00:36:19,179 పీటర్సన్ తో నువ్వు దేని గురించి మాట్లాడావు? 453 00:36:24,393 --> 00:36:25,477 తూర్పుకు తిరిగి దండం పెట్టు. 454 00:36:30,607 --> 00:36:33,068 ప్రోగ్రామ్ లో భాగమైనందుకే ఫర్జీన్ చనిపోయాడు. 455 00:36:34,027 --> 00:36:35,779 అతను చేసిన తప్పే నువ్వు కూడా చేయకు. 456 00:36:36,613 --> 00:36:39,283 అతని పని అతను చేస్తున్నందుకు మీ వాళ్లలో ఒకరు అతడిని చంపేశారు. 457 00:36:39,950 --> 00:36:41,451 అది కూడా నా కళ్ళ ముందే. 458 00:36:42,452 --> 00:36:45,163 - తన దేశాన్ని ప్రేమిస్తున్నందుకు చంపేశారు. - మరి నా దేశం సంగతేంటి? 459 00:36:46,874 --> 00:36:50,126 అతను ఎవరి కోసం అయితే బాంబును నిర్మించే ప్రయత్నం చేశాడో, వాళ్లు మా దేశాన్ని సర్వనాశనం చేయాలని భావిస్తున్నారు. 460 00:36:50,127 --> 00:36:53,588 నీ లాంటి వాళ్ల వల్లే, నా భర్త, తన కూతురి బాల్యాన్ని చూడలేకపోయాడు. 461 00:36:53,589 --> 00:36:56,174 - నువ్వు నాకు సాయపడకపోతే, తను అనాథ అయిపోతుంది. - పనికిమాలినదానా. 462 00:36:56,175 --> 00:36:57,176 పీటర్సన్ ఎక్కడ ఉన్నాడు? 463 00:36:59,595 --> 00:37:01,221 పీటర్సన్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు. 464 00:37:04,057 --> 00:37:05,350 నా లాంటి వాళ్లకి వాళ్లు చెప్పరు. 465 00:37:09,188 --> 00:37:10,981 అయితే, నువ్వు నాకు వేరే దారి ఇవ్వట్లేదు. 466 00:37:11,607 --> 00:37:12,941 ఆగు! 467 00:37:16,445 --> 00:37:17,696 ఒక పెన్ డ్రైవ్ ఉంది. 468 00:37:19,948 --> 00:37:21,491 నాకు సెక్యూరిటీ యాక్సెస్ ఉంది. 469 00:37:23,535 --> 00:37:25,162 దాన్ని నువ్వు ఉపయోగించగలవేమో. 470 00:37:28,999 --> 00:37:29,833 ఎక్కడ ఉంది అది? 471 00:37:30,876 --> 00:37:31,877 నా బీరువాలో ఉంది. 472 00:37:33,253 --> 00:37:34,880 త్వరగా. దాన్ని తీసుకురా. 473 00:37:35,589 --> 00:37:36,757 సరే. 474 00:37:38,133 --> 00:37:39,384 సరే, సరే. 475 00:37:44,848 --> 00:37:45,849 వెళ్లు! 476 00:37:52,397 --> 00:37:54,066 దాని తాళం చెవి పడక గదిలోని డ్రాయరులో ఉంది. 477 00:38:02,241 --> 00:38:05,536 నేను మీకు సాయపడితే, ఈ… ఈ పని చేసింది నేనేనని వాళ్లకి తెలీకుండా మీరు చూసుకోగలరా? 478 00:38:12,709 --> 00:38:14,044 నా కూతురు. 479 00:38:15,921 --> 00:38:16,964 తనకి నేను తప్ప ఇంకెవరూ లేరు. 480 00:38:30,185 --> 00:38:31,144 తమార్? 481 00:38:51,164 --> 00:38:52,123 కాపాడండి! 482 00:38:52,124 --> 00:38:53,083 అరవకు! 483 00:38:56,920 --> 00:38:58,255 చుట్టుపక్కల వారెవరైనా నన్ను కాపాండి! 484 00:38:59,590 --> 00:39:00,590 పనికిమాలినదానా? 485 00:39:00,591 --> 00:39:01,466 నిన్ను చంపిపారేస్తా! 486 00:39:04,803 --> 00:39:07,848 ముసలోడా, చేతులు పైకెత్తు, లేదా నీ తలని పుచ్చకాయ పేల్చినట్టు పేల్చి పారేస్తా. 487 00:39:15,939 --> 00:39:17,649 నీ వల్ల నేను చాలా సమస్యల్లో చిక్కుకున్నా. 488 00:40:26,093 --> 00:40:28,095 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్