1 00:00:09,301 --> 00:00:12,095 ఈ ధారావాహికంలో వివరించబడిన అన్ని పాత్రలు మరియు సంఘటనలు పూర్తిగా కల్పితం. 2 00:00:12,179 --> 00:00:14,723 వాస్తవ సంఘటనలు లేదా మరణించిన లేదా జీవించిన వ్యక్తులుతో సారూప్యత 3 00:00:14,806 --> 00:00:15,933 పూర్తిగా యాదృచ్చికం. 4 00:00:33,116 --> 00:00:37,788 తమార్! తమార్, ఇది నేను, "ఈగిల్" ని. 5 00:00:41,375 --> 00:00:42,501 నువ్వు బాగానే ఉన్నావా? 6 00:00:51,802 --> 00:00:53,011 ఇతను ఆమె బాస్. 7 00:00:53,637 --> 00:00:55,305 ఆ. అతను నన్ను మానభంగం చేయబోయాడు. 8 00:00:55,389 --> 00:00:57,307 అతను జీలాని వేధిస్తున్నాడు. 9 00:00:57,391 --> 00:00:59,101 నీకు దీని గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? 10 00:01:00,435 --> 00:01:02,354 మీ ఇద్దరినీ ఎవరైనా చూసారా? 11 00:01:02,437 --> 00:01:03,814 లేదు, చూడలేదనుకుంటాను. 12 00:01:04,730 --> 00:01:06,775 పరవాలేదు, అక్కడ కెమెరాలేవీ లేవు. 13 00:01:17,327 --> 00:01:18,537 తమార్, నాకు సహాయం చెయ్యి. 14 00:01:19,746 --> 00:01:21,957 తమార్, అతని కాళ్ళు పట్టుకో. 15 00:01:30,424 --> 00:01:31,425 ఇలా రా. 16 00:01:43,228 --> 00:01:44,855 -రా. -సరే. 17 00:01:47,232 --> 00:01:48,817 -నీ సంచీ తెచ్చుకో. -సరే, సరే. 18 00:01:54,615 --> 00:01:55,866 సరే, సరే. 19 00:02:56,635 --> 00:02:59,638 అంతా సురక్షితంగా ఉంది. దాని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. 20 00:03:00,180 --> 00:03:03,058 నా మనుషులు వస్తున్నారు, ఈ ప్యేకేజీని మేము చూసుకుంటాము. 21 00:03:03,141 --> 00:03:06,395 ఆమె సంగతి ఏంటి? ఆమె తిరిగి వెళ్ళే పరిస్థితిలో ఉందా? 22 00:03:12,276 --> 00:03:13,694 అది చెప్పడం కష్టం. 23 00:03:14,027 --> 00:03:15,445 మనకు ఎంత సమయం ఉంది? 24 00:03:15,529 --> 00:03:16,989 ఒక గంట కన్నా తక్కువ. 25 00:03:18,365 --> 00:03:21,994 అది నీ ఇష్టం, కానీ మనం ఇది ఇప్పుడు చేయకపోతే, ఈ చోటు అందరికీ తెలిసిపోతుంది. 26 00:03:22,786 --> 00:03:24,246 నన్ను ఆమెతో మాట్లాడనివ్వు. 27 00:03:25,163 --> 00:03:26,164 సరే. 28 00:03:28,125 --> 00:03:29,501 ఆమె నీతో మాట్లడతానని అంటోంది. 29 00:03:34,381 --> 00:03:35,507 నన్ను క్షమించు. 30 00:03:35,591 --> 00:03:37,759 అలా అనకు, నీకు వేరే దారి లేదు. 31 00:03:37,843 --> 00:03:39,052 నేను తప్పించుకోలేకపోయాను. 32 00:03:39,136 --> 00:03:40,345 అది ఇప్పుడు అనవసరం. 33 00:03:41,013 --> 00:03:42,639 నువ్వు తిరిగి లోపలికి వెళ్ళగలనని అనుకుంటున్నావా? 34 00:03:42,723 --> 00:03:43,724 వెళ్ళగలను. 35 00:03:43,807 --> 00:03:45,100 ఒక్క క్షణం ఊపిరి తీసుకో. 36 00:03:49,104 --> 00:03:50,147 నేనిది చేయగలను. 37 00:03:51,315 --> 00:03:53,066 మనకు 50 నిమిషాల కన్నా తక్కువ సమయం ఉంది. 38 00:03:53,150 --> 00:03:54,151 అది చాలా ఎక్కువే. 39 00:04:19,760 --> 00:04:21,094 మనం కొనసాగుతున్నాము. 40 00:04:26,558 --> 00:04:28,477 -నువ్వు బాగానే ఉన్నావా? -ఉన్నాను. 41 00:04:28,560 --> 00:04:29,478 ఏకాగ్రతతో ఉన్నావా? 42 00:04:32,564 --> 00:04:33,690 సరే. 43 00:04:33,774 --> 00:04:37,528 ఇప్పుడు ఇక్కడ జరిగిన దాన్ని, నీ మనసులోంచి తీసేసేయ్. 44 00:04:37,611 --> 00:04:39,404 -అర్థమయిందా? -అయింది. 45 00:04:39,488 --> 00:04:42,991 సరే. నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యడానికి నీకు 47 నిమిషాల సమయం ఉంది, 46 00:04:43,617 --> 00:04:45,536 -ఆ తరువాత నిన్ను ఇక్కడి నుంచి తప్పిస్తాను. -సరే. 47 00:04:47,120 --> 00:04:49,540 -రేపు మధ్యాహ్నం కల్లా ఇంటికి వెళతావు. -సరే. 48 00:04:53,252 --> 00:04:55,212 -నాతో మాట్లాడుతూ ఉండు. -సరే. 49 00:05:13,063 --> 00:05:15,065 రషీద్, ఎక్కడున్నావు? 50 00:05:15,899 --> 00:05:18,110 మేమక్కడికి మూడు నిమిషాలలో వస్తాము. 51 00:05:45,762 --> 00:05:46,889 రూట్: పాస్వర్డ్: 52 00:05:51,685 --> 00:05:53,187 కనెక్షన్ ఆన్లైన్ 53 00:05:53,854 --> 00:05:56,315 -టెహ్రాన్కు కనెక్షన్ పునరుద్ధరించబడింది. -పరిస్థితి? 54 00:05:56,398 --> 00:05:58,192 రేడార్ వ్యవస్థ ఇంకా సిద్ధంగా లేదు. 55 00:05:58,275 --> 00:06:01,069 "హెచ్" సమయానికి ఇంకా 20 నిమిషాలు ఉంది. మీ ఏజెంట్ సంగతి ఏంటి? 56 00:06:01,528 --> 00:06:06,450 ఆమె పనిపూర్తి చేసే ముందు పైకెళ్లి సెంట్రల్ టెర్మినల్ కు కనెక్టవడానికి సమయం కావాలి. 57 00:06:10,412 --> 00:06:14,249 "హోషెన్", బయలుదేరడానికి 20 నిమిషాలు, మీ వ్యవస్థలన్నీ చూసుకోండి. 58 00:07:47,009 --> 00:07:50,179 మోసిన్! ఒక శవం! 59 00:07:50,888 --> 00:07:51,805 ఇక్కడ చాలా రక్తం ఉంది. 60 00:07:51,889 --> 00:07:53,056 మేము లోపలికి వెళ్తున్నాము. 61 00:07:53,140 --> 00:07:55,559 కాదు, కాదు, కాదు. వెనక్కి తగ్గండి. వెనక్కి వెళ్ళండి. 62 00:07:56,143 --> 00:07:57,352 కానీ మేము ఇక్కడున్నాము. 63 00:07:57,436 --> 00:07:58,687 అక్కడి నుంచి వెళ్ళండి! 64 00:07:59,479 --> 00:08:02,608 ఇదంతా ఆపేయబడింది, రషీద్! అక్కడి నుంచి వెళ్ళండి! 65 00:08:02,691 --> 00:08:05,402 అర్థం అయింది, బాస్. అక్కడి నుంచి వెళ్ళండి, మేము ఆగుతున్నాము. 66 00:08:31,929 --> 00:08:33,931 -ఏంటి? -ఎవరో శవాన్ని చూసారు. 67 00:08:36,225 --> 00:08:37,643 నీకింకా ఎంత సమయం కావాలి? 68 00:08:38,519 --> 00:08:42,981 నాకు ఖచ్చితంగా తెలియదు. బహుశా 15, 20 నిమిషాలు. 69 00:08:43,065 --> 00:08:45,317 అది చాలా ఎక్కువ. నువ్వు చేయగలిగినంత తొందరగా చెయ్యి. 70 00:08:51,573 --> 00:08:56,036 టెహ్రాన్ ఐఆర్జిసి కౌంటర్ ఇంటలిజెన్స్ ప్రధానకార్యాలయము 71 00:10:12,029 --> 00:10:13,614 -అద్భుతం. -ఏమైంది? 72 00:10:13,697 --> 00:10:15,490 ఆమె కనెక్షన్ ను స్థిరీకరించింది. 73 00:10:15,574 --> 00:10:17,826 ఆమె వార్మ్ ని కాపీ చేయాలి అంతే, మిగతాది నేను చేస్తాను. 74 00:10:39,932 --> 00:10:42,392 నేను కొన్ని ధృవీకరణలను అప్డేట్ చేస్తే నా పని అయిపోతుంది. 75 00:10:42,476 --> 00:10:45,062 పోలీసులు వచ్చారు, నువ్వు వెనుక తలుపు నుండి బయటకు వెళ్ళాలి. 76 00:10:46,605 --> 00:10:48,065 ఇది దాదాపు అయిపోయింది. 77 00:10:48,148 --> 00:10:49,316 నేను చెప్పేది వింటున్నావా? 78 00:10:49,399 --> 00:10:52,861 ఐదు నిమిషాలు. మనకు మరో అవకాశం దొరకదు. 79 00:10:52,945 --> 00:10:54,363 అక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళు! 80 00:10:59,743 --> 00:11:01,537 దయచేసి వినండి. 81 00:11:01,912 --> 00:11:07,626 ఉద్యోగులందరూ ప్రధాన హాల్ లో వెంటనే రిపోర్టు చేయండి. 82 00:11:14,049 --> 00:11:15,133 నువ్వు వస్తున్నావా, జీలా? 83 00:11:16,510 --> 00:11:17,511 ఏంటి? 84 00:11:17,594 --> 00:11:19,429 అందరూ కిందకి వెళ్తున్నారు. 85 00:11:20,389 --> 00:11:23,225 ఆ, వెళ్ళు. నాకోసం ఆగవద్దు. 86 00:11:41,869 --> 00:11:42,870 హే! 87 00:11:43,787 --> 00:11:44,997 ఏం చేస్తున్నావు? 88 00:11:48,667 --> 00:11:51,295 దాన్ని ఆపేయ్. విన్నావా? 89 00:11:51,378 --> 00:11:52,796 నాది అయిపోవచ్చింది. 90 00:11:52,880 --> 00:11:54,840 ఒక్క క్షణంలో అయిపోతుంది. సరేనా? 91 00:11:55,215 --> 00:11:57,342 తరువాతది నీ తల మీద పడుతుంది. 92 00:11:57,801 --> 00:11:59,219 లేచి వెళ్ళు, వెంటనే. 93 00:11:59,761 --> 00:12:01,388 నేను నా బ్యాగ్ తీసుకోవచ్చా? 94 00:12:01,471 --> 00:12:02,306 త్వరగా! 95 00:12:12,566 --> 00:12:15,152 ప్రోటోకాల్ లు తొలగించబడుతున్నాయి. మీ వైపు తనిఖీ చేయండి. 96 00:12:18,238 --> 00:12:19,239 ఇక్కడ కూడా. 97 00:12:20,991 --> 00:12:23,202 -ఏంటిది? -"ఫాక్స్ ఆన్ ది రన్" ని క్రియాశీలంచేసింది. 98 00:12:24,494 --> 00:12:26,205 ఆమె చేసిన దాన్నంతా తుడిచేస్తోంది. 99 00:12:39,384 --> 00:12:40,552 ఇక్కడ కూర్చో. 100 00:12:41,470 --> 00:12:44,181 ఎవరూ కూడా వారి పక్కన ఉన్నవారితో మాట్లాడరు. 101 00:12:44,848 --> 00:12:47,017 లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటారు. 102 00:12:47,100 --> 00:12:49,728 న్యాయానికి ఆటంకం కలిగిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కోవలసి ఉంటారు. 103 00:12:49,811 --> 00:12:51,188 వారి మీద కన్నేసి ఉంచండి. 104 00:13:18,298 --> 00:13:21,385 పోలీసులు భవనంలో ఉన్నారు. ఆమె నా ఫోన్ తీయడం లేదు. 105 00:13:21,468 --> 00:13:24,471 మనం తీవ్రమైన పరిణామాలకు సిద్ధంగా ఉండాలి. 106 00:13:24,555 --> 00:13:25,556 ధన్యవాదాలు. 107 00:13:26,849 --> 00:13:28,851 -నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి. -అలాగే. 108 00:13:53,333 --> 00:13:54,334 హలేలి. 109 00:13:55,460 --> 00:13:56,879 పైలట్లను ఆగమని చెప్పండి. 110 00:14:05,429 --> 00:14:07,097 ఎయిర్ కంట్రోల్, ఆగండి. 111 00:14:07,181 --> 00:14:08,849 మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. 112 00:14:10,100 --> 00:14:11,560 మనం రద్దు చేస్తున్నాం. 113 00:14:21,570 --> 00:14:23,989 వీరందరూ ఆ విమానంలో ఉన్న ప్రయాణీకులు. 114 00:14:24,072 --> 00:14:27,701 అందులో ఇరానియన్ పౌరులు ఎవరూ లేరు, మేము రెండు సార్లు తనిఖీ చేసాము. 115 00:14:29,036 --> 00:14:31,663 జోర్డాన్ లో విమానం ఎక్కిన ప్రయాణీకులు వీరేనా? 116 00:14:31,747 --> 00:14:32,789 అవును. 117 00:14:32,873 --> 00:14:36,084 ఇండియాలో దిగే వారి జాబితా మన వద్ద లేదు. 118 00:14:36,168 --> 00:14:37,503 విమానం ఇంకా దిగలేదు. 119 00:14:38,295 --> 00:14:41,381 కానీ మన అత్యుత్తమ పనిమంతులు దాని మీద పని చేస్తున్నారు. 120 00:14:41,465 --> 00:14:44,885 అతను మనకు ఇండియాలో దిగిన వారి పాస్పోర్ట్ స్కానులు వెంటనే తీసుకువస్తాడు. 121 00:14:45,677 --> 00:14:48,597 వెంటనే విమానాశ్రయానికి వెళ్లి, ఏమైనా దొరుకుతుందేమో చూడు. 122 00:14:48,680 --> 00:14:51,683 ఆ ఇద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆ ఇద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? 123 00:14:51,767 --> 00:14:54,228 సెక్యూరిటీ టేప్ కూడా చూడండి. 124 00:14:55,938 --> 00:14:57,481 మీ దగ్గర ఈటిఏ ఉందా? 125 00:14:57,564 --> 00:14:58,899 రెండు లేదా మూడు గంటలు. 126 00:14:59,525 --> 00:15:02,861 మీకు కావాలంటే వెళ్లి విశ్రాంతి తీసుకోండి, నేను మీకు సంచారం తెలియజేస్తాను. 127 00:15:03,946 --> 00:15:05,280 ధన్యవాదాలు, అలీ. 128 00:15:39,690 --> 00:15:41,316 నేను నిన్ను ఆపుకోమని చెప్పానా? 129 00:15:41,400 --> 00:15:43,110 నేను ఆపుకోలేను, ఆఫీసర్. 130 00:15:43,819 --> 00:15:44,862 ఇది... 131 00:15:45,988 --> 00:15:47,114 ఆ మామూలు విషయం కాదు. 132 00:15:47,739 --> 00:15:48,740 ఏంటి? 133 00:15:50,492 --> 00:15:51,785 ఇది... 134 00:15:52,536 --> 00:15:54,121 నేను మార్చుకోవాలి... 135 00:15:55,497 --> 00:15:56,498 త్వరగా చెయ్యి. 136 00:15:56,582 --> 00:15:58,792 ధన్యావాదాలు, ఆఫీసర్. దేవుడు మిమ్మల్ని దీవించు గాక. 137 00:16:32,159 --> 00:16:33,160 ఎలా ఉన్నావు? 138 00:16:33,952 --> 00:16:36,830 నేను బాలేను. ఇక్కడ వారు అందరినీ ప్రశ్నిస్తున్నారు. 139 00:16:37,247 --> 00:16:38,832 ఎవరైనా మమ్మల్ని విన్నారేమో. 140 00:16:38,916 --> 00:16:43,337 అక్కడున్న ఉద్యోగులలో ఎవరికైనా అతనేం చేస్తున్నాడో తెలుసా? 141 00:16:43,795 --> 00:16:45,047 కనీసం ఒక మహిళ. 142 00:16:45,506 --> 00:16:48,258 సరే. ఆమె వారికి దాని గురించి మీ చెప్పకూడదు. 143 00:16:49,176 --> 00:16:50,469 నువ్వు ఆమెతో మాట్లాడాలి. 144 00:16:51,136 --> 00:16:52,638 ఘేసార్ కి కూడా తెలుసు. 145 00:16:52,721 --> 00:16:53,722 ఆమె భర్త. 146 00:16:54,473 --> 00:16:55,766 ఘేసార్? 147 00:16:56,183 --> 00:16:57,267 నీకు ఖచ్చితంగా తెలుసా? 148 00:16:57,351 --> 00:17:01,271 అతను జీలా ఇరాన్ కి తిరిగి రాదని చెప్పాడు. ఎందుకో ఇప్పుడు నాకు అర్థం అయింది. 149 00:17:02,689 --> 00:17:03,774 సరే. 150 00:17:04,983 --> 00:17:06,484 మానభంగం గురించి ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. 151 00:17:07,069 --> 00:17:10,030 నువ్వు వీలయినంత వరకు దీనిని ఆపడం చాలా ముఖ్యమైన విషయం. 152 00:17:10,864 --> 00:17:13,032 నేను నిన్ను అక్కడి నుంచి తప్పిస్తాను. సరేనా? 153 00:17:17,454 --> 00:17:18,413 త్వరగా ముగించు! 154 00:17:19,080 --> 00:17:20,290 నేను వస్తున్నాను. 155 00:17:29,091 --> 00:17:32,427 "అతనితో జరిగిన దాని గురించి ఏమీ అనవద్దు." 156 00:18:16,722 --> 00:18:18,140 సారా ఫరామాంద్! 157 00:18:48,545 --> 00:18:50,297 -అవును. -నువ్వు బయలుదేరావా? 158 00:18:50,964 --> 00:18:52,174 ఆ, బయలుదేరాను. 159 00:18:52,257 --> 00:18:53,550 అయితే, నీకేం చేయాలో తెలుసు కదా? 160 00:18:55,093 --> 00:18:56,094 తెలుసు, మేడం. 161 00:18:58,931 --> 00:18:59,932 మసూద్. 162 00:19:00,015 --> 00:19:02,434 నువ్వు ఆమెని నా దగ్గరకు వ్యక్తిగతంగా తీసుకురావాలి. 163 00:19:04,186 --> 00:19:05,854 నేను ఏం చేయవలసి వస్తే అది చేస్తాను. 164 00:19:07,898 --> 00:19:08,899 సరే. 165 00:19:55,863 --> 00:19:57,865 హలో, ఘేసార్. నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించు. 166 00:19:57,948 --> 00:19:59,116 అంతా బాగానే ఉందా? 167 00:19:59,199 --> 00:20:00,200 బాగానే ఉంది. 168 00:20:00,742 --> 00:20:02,995 -ఏమైనా జరిగిందా? -లేదు, అంతా బాగానే ఉంది, మిత్రమా. 169 00:20:03,078 --> 00:20:05,163 నేను నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. 170 00:20:05,247 --> 00:20:06,665 నేను లోపలికి రావచ్చా? 171 00:20:09,001 --> 00:20:10,043 ఆ, రా. 172 00:20:10,127 --> 00:20:11,879 చాలా ధన్యవాదాలు. 173 00:20:12,671 --> 00:20:13,797 ధన్యవాదాలు. 174 00:20:28,353 --> 00:20:29,396 హలో, అలీ. 175 00:20:29,479 --> 00:20:30,647 హే, బాస్. 176 00:20:30,731 --> 00:20:31,982 నీకు ఏం తెలిసింది? 177 00:20:32,608 --> 00:20:35,527 ఆమెని తీసుకు వెళ్ళిన టాక్సీ డ్రైవర్ తో మాట్లాడాను. 178 00:20:36,111 --> 00:20:39,698 ఆమె ఫార్సీ బాగా మాట్లాడిందని చెప్పాడు. స్థానికులలా మాట్లాడిందని చెప్పాడు. 179 00:20:40,782 --> 00:20:43,327 కానీ ఆమె కొంత యాసతో మాట్లాడిందని చెప్పాడు. 180 00:20:44,161 --> 00:20:48,957 అతను చెప్పిన చివరి మాట, ఆమెని రివల్స్యూషన్ స్ట్రీట్ లో దింపానని చెప్పాడు. 181 00:20:49,041 --> 00:20:50,292 ఇంకేంటి? 182 00:20:50,918 --> 00:20:53,629 అతను... 183 00:20:53,712 --> 00:20:55,797 ఆమె ఆకర్షణీయంగా ఉందని చెప్పాడు. 184 00:20:58,467 --> 00:21:02,346 సరే. మనం ఇండియా నుంచి సమాచారం కోసం ఎదురు చూద్దాము. 185 00:21:02,429 --> 00:21:04,348 సరే. గుడ్ నైట్. 186 00:21:41,385 --> 00:21:42,594 కమాలిని మాట్లాడుతున్నాను. 187 00:21:42,678 --> 00:21:45,305 మీరు ఎంత సీరియస్ గా ఉంటారో నేను మర్చిపోయాను. 188 00:21:45,389 --> 00:21:47,391 చాలా మంది కేవలం, "హలో" అంటారు. 189 00:21:47,474 --> 00:21:49,351 నేను సీరియస్ మనిషిని. 190 00:21:49,434 --> 00:21:51,436 చాలా సీరియస్. 191 00:21:53,814 --> 00:21:55,440 నీతో ఉన్నప్పుడు కూడానా? 192 00:21:56,775 --> 00:22:00,070 మీరు మరింత తరచుగా నవ్వితే బాగానే ఉంటుందని అంటాను. 193 00:22:02,072 --> 00:22:05,409 నా నవ్వు బాగుండదు. కానీ నా జోకులు బాగుంటాయి. 194 00:22:05,993 --> 00:22:07,578 కొన్నిసార్లు. 195 00:22:09,955 --> 00:22:11,456 ఎలా ఉన్నావు, ప్రియా? 196 00:22:11,957 --> 00:22:14,751 నేను బాగానే ఉన్నాను. నేను హోటల్ లో ఉన్నాను. 197 00:22:14,835 --> 00:22:16,295 డాక్టర్ ఏమన్నారు? 198 00:22:16,378 --> 00:22:17,671 ఆయన ఆశావహంగా ఉన్నారు. 199 00:22:18,297 --> 00:22:20,299 అదృష్టవశాత్తు, ఆయన ఆశావహంగా ఉన్నారు. 200 00:22:21,633 --> 00:22:22,718 సరే. 201 00:22:22,801 --> 00:22:25,220 నాకు మీ మంచి జోకులలో ఒకటి చెప్తారా? 202 00:22:27,264 --> 00:22:30,976 నాకు తెలియదు. నువ్వు అన్నీ ఇంతకుముందు విన్నావు. 203 00:22:31,560 --> 00:22:33,520 ఆ. నాకొక జోకు చెప్పండి. 204 00:22:33,937 --> 00:22:35,230 సరే. 205 00:22:35,314 --> 00:22:40,611 సరే. ఇది కొత్తది. నేను ఇవాళే విన్నాను. 206 00:22:42,738 --> 00:22:47,868 ఒక యువకుడు తన తల్లితో, "అమ్మా, నేనొక పెళ్ళికూతుర్ని వెతికాను!" అన్నాడు. 207 00:22:48,952 --> 00:22:50,829 ఆమె, "నిజంగా?" అంది. అతను, "నిజంగా. 208 00:22:50,913 --> 00:22:55,000 రేపు నేను ముగ్గురు అమ్మాయిలని భోజనానికి తీసుకువస్తాను, 209 00:22:55,083 --> 00:22:57,294 ఆమె ఎవరో నువ్వు కనిపెట్టవచ్చు." 210 00:22:58,295 --> 00:23:04,718 తరువాతి రోజు, ఆ అబ్బాయి ముగ్గురమ్మాయిలను తీసుకు వచ్చి లైన్లో నుంచో పెట్టి, 211 00:23:04,801 --> 00:23:08,055 "నా పెళ్లి కూతురు ఎవరో కనుక్కో" అంటాడు. 212 00:23:09,139 --> 00:23:11,934 ఆమె వారిని చూసి, 213 00:23:12,976 --> 00:23:14,144 "కుడి వైపున ఉన్న అమ్మాయి!" అంటుంది. 214 00:23:14,686 --> 00:23:18,190 అతను, "వావ్, అమ్మా, నీకెలా తెలుసు?" 215 00:23:19,233 --> 00:23:23,195 ఆమె, "ఎందుకంటే నాకీ అమ్మాయి ఇప్పుడే నచ్చలేదు!" 216 00:23:24,154 --> 00:23:25,489 అది బాగుంది, కదా? 217 00:23:26,698 --> 00:23:29,034 ఓహ్, నాకు తలనొప్పిగా ఉంది. 218 00:23:31,036 --> 00:23:33,497 ప్రియా, నీతో అక్కడ లేనందుకు 219 00:23:34,831 --> 00:23:36,375 నన్ను క్షమించు. 220 00:23:39,169 --> 00:23:42,256 దేవుడి దయ వలన, రేపు సర్జరీ బాగానే అవుతుంది. 221 00:23:43,549 --> 00:23:45,342 నేను కేవలం నీ గురించే ఆలోచిస్తున్నాను. 222 00:23:45,425 --> 00:23:49,012 మనం దీని గురించి మాట్లాడుకోనవసరం లేదు. పరవాలేదు. 223 00:23:49,096 --> 00:23:53,517 ప్రియా. జాగ్రత్త, రాత్రికి చక్కగా పడుకో. 224 00:23:53,600 --> 00:23:56,353 సరే. ఇన్షా అల్లా. మీరు కూడా. 225 00:23:56,436 --> 00:23:58,564 గుడ్ నైట్, ప్రియా, గుడ్ నైట్. 226 00:23:58,647 --> 00:23:59,815 మీకు ముద్దులు. 227 00:24:26,592 --> 00:24:28,010 జీలా గోర్బానిఫా! 228 00:24:34,141 --> 00:24:35,309 లోపలికి. 229 00:24:38,770 --> 00:24:39,855 కూర్చో. 230 00:24:45,527 --> 00:24:47,821 జీలా గోర్బానిఫా, అవునా? 231 00:24:48,530 --> 00:24:49,865 అవును, ఆఫీసర్. 232 00:24:50,240 --> 00:24:56,205 మీ బాస్, అష్కాన్, మీ మీద అరుస్తూ, నీ వెనుక బయటకు ఎందుకు వచ్చాడు? 233 00:24:57,372 --> 00:24:58,832 అతనికి నీ నుంచి ఏం కావాలి? 234 00:25:01,793 --> 00:25:04,171 నేను పని చేయడానికి కిందకి వెళ్లాను, 235 00:25:05,172 --> 00:25:08,550 అప్పుడు ఆయన నా వెనుక వచ్చి నా మీద అరిచాడు. 236 00:25:09,343 --> 00:25:11,386 నాకు ఆయనంటే భయం, అందుకని నేను బయటకు వెళ్లాను. 237 00:25:14,556 --> 00:25:16,517 అతను నీ మీద ఎందుకు అరిచాడు? 238 00:25:17,476 --> 00:25:18,644 నాకు తెలియదు. 239 00:25:19,561 --> 00:25:22,814 ఆయన నైట్ షిఫ్ట్ చేయవలసి వచ్చిందని కోపంగా ఉన్నారేమో. 240 00:25:23,732 --> 00:25:26,193 నీ స్నేహితురాలు సారా మాకు చెప్పింది అది కాదు. 241 00:25:29,947 --> 00:25:32,699 అతనికి నీ మీద కోపంగా ఉందని చెప్పింది. 242 00:25:33,492 --> 00:25:37,120 అతను నువ్వు పని చేయకుండా వ్యక్తిగత ఫోన్ కాల్స్ చేసుకుంటున్నావని అనుకున్నాడు. 243 00:25:38,330 --> 00:25:39,623 ఆమె అలా చెప్పిందా? 244 00:25:40,123 --> 00:25:43,752 ఆమె అబద్ధం చెప్పిందని అంటున్నావా? ఆమె నాకు అబద్ధాలకోరులా కనిపించలేదు. 245 00:25:43,836 --> 00:25:47,965 ఆమె అబద్దాలకోరు కాదు కానీ ఆమె పని ఆమె చూసుకుని ఉంటే బాగుండేది. 246 00:25:48,048 --> 00:25:50,008 నాతో ఆటలాడకు! 247 00:25:51,009 --> 00:25:52,845 ఒక మనిషి హత్య చేయబడ్డాడు! 248 00:25:53,470 --> 00:25:55,222 ఇప్పుడు చెప్పు, 249 00:25:55,305 --> 00:25:58,308 అతనికి కోపంగా ఉన్నపుడు సాధారణంగా అతనిలానే ప్రవర్తించేవాడా? 250 00:25:58,725 --> 00:26:00,227 అవును, ఆఫీసర్. 251 00:26:00,686 --> 00:26:03,105 ఆయన అలానే ఉండేవారు. అందరితో. 252 00:26:04,982 --> 00:26:06,900 నీ ముక్కుకు ఆపరేషన్ ఎప్పుడు అయింది? 253 00:26:08,193 --> 00:26:09,361 రెండు రోజుల క్రితం. 254 00:26:10,237 --> 00:26:11,780 ఆ యాస ఎక్కడిది? 255 00:26:12,948 --> 00:26:15,993 నేను టెహ్రాన్ లో పుట్టాను కానీ మా నాన్న ఒక వర్తకుడు. 256 00:26:16,618 --> 00:26:18,412 ఆయన ఎమిరేట్స్ లో పని చేసారు. 257 00:26:18,829 --> 00:26:21,206 నేను కతార్ లో పెరిగాను. 258 00:26:22,791 --> 00:26:24,835 అక్కడే నా భర్తని కలిసాను. 259 00:26:25,335 --> 00:26:28,797 మేము పెళ్లి చేసుకున్నాము, టెహ్రాన్ కి తిరిగి వద్దామని నిర్ణయించుకున్నాము. 260 00:26:31,550 --> 00:26:33,177 మీరిక్కడ ఎంత కాలం నుంచి ఉంటున్నారు? 261 00:26:33,886 --> 00:26:36,430 మేమిక్కడికి వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతోంది. 262 00:26:39,600 --> 00:26:43,228 అయితే బయట ఏమయింది? మీ గొడవ కొనసాగిందా? 263 00:26:46,064 --> 00:26:49,359 అతను అరుస్తూ ఉన్నాడు. నేను ప్రతిస్పందించలేదు. 264 00:26:50,360 --> 00:26:55,616 ఆ తరువాత ఒక మౌనపు క్షణంలో నేను లోపలికి వచ్చాను. 265 00:26:57,034 --> 00:26:58,035 అతని సంగతి ఏంటి? 266 00:26:59,411 --> 00:27:02,623 నాకు తెలియదు. అతను కూడా లోపలికి వెళ్ళాడని అనుకుంటాను. 267 00:27:04,333 --> 00:27:09,213 ఇప్పుడు చెప్పు, మీ గొడవ శారీరకంగా మారే అవకాశం ఉందా? 268 00:27:09,796 --> 00:27:11,340 లేదు, ఆఫీసర్. 269 00:27:11,423 --> 00:27:16,845 మీరు గొడవపడ్డారు, అతను నీ వెనుక బయటకు వచ్చాడు, 270 00:27:16,929 --> 00:27:20,349 నీ మీద అరిచాడు, 271 00:27:20,432 --> 00:27:22,684 నువ్వు ప్రతిస్పందించలేదు, నువ్వు వెళిపోయావు 272 00:27:22,768 --> 00:27:25,062 తరువాత ఎవరో వచ్చి అతని మెడ విరిచి ఎలా పారిపోయారో నాకు వివరిస్తావా? 273 00:27:25,604 --> 00:27:29,816 నేను ఒక వ్యక్తి మెడ విరక్కొట్టగలనని మీరు అనుకుంటున్నారా? 274 00:27:29,900 --> 00:27:34,196 నేనేమనుకుంటున్నానో నీకు చెబుతాను. నువ్వు అబద్ధం చెప్తున్నావనుకుంటాను. 275 00:27:34,279 --> 00:27:37,783 ఏదో సరిగ్గా లేదు. ఇది పని గురించిన గొడవలా లేదు. 276 00:27:37,866 --> 00:27:40,244 మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోంది. 277 00:27:40,661 --> 00:27:43,247 నువ్వు మాకు చెప్పు లేదా మేమే తెలుసుకుంటాము! 278 00:27:43,330 --> 00:27:45,749 నేను ఒట్టు వేసి చెబుతున్నాను. మా మధ్య ఏమీ జరగడం లేదు. 279 00:27:46,250 --> 00:27:49,253 మీరు తెలుసుకోండి. మీరు ఎవరినైనా అడగవచ్చు. 280 00:27:49,336 --> 00:27:51,088 నీకు ఆలోచించుకోవడానికి సమయం ఉంది. 281 00:27:51,547 --> 00:27:54,508 నువ్వు ఇవాళ రాత్రికి కస్టడీలో ఉంటావు. నీకు కావలసినంత సమయం ఉంది. 282 00:27:54,591 --> 00:27:55,592 ఆమెని బయటకు తీసుకువెళ్ళండి. 283 00:27:56,593 --> 00:27:59,012 లే. 284 00:28:04,017 --> 00:28:05,143 వెళ్లి కూర్చో. 285 00:28:26,707 --> 00:28:28,208 ఇదంతా రికార్డులో ఉందా? 286 00:28:28,959 --> 00:28:30,085 ఆమె ఎలా ఉంది? 287 00:28:30,169 --> 00:28:32,379 ఆమె ఇంకా ఇతర ఉద్యోగులతో పాటు నిర్బంధంలో ఉంది. 288 00:28:32,838 --> 00:28:34,590 ఈగిల్ రక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. 289 00:28:35,090 --> 00:28:38,010 విమానాలు తిరిగి ఇజ్రాయెల్ వచ్చేవరకు ఆమెని తీసుకురావద్దు. 290 00:28:38,969 --> 00:28:40,262 దాడి చేయబోతున్నారా? 291 00:28:40,345 --> 00:28:42,848 ప్లాన్ ఏ విఫలం అయినప్పుడు, మనం ప్లాన్ బి కి వెళతాము, కదోష్. 292 00:28:44,766 --> 00:28:48,061 మనం దాని గురించి మాట్లాడుకున్నాము, అది చాలా ప్రమాదకరమని నిర్ణయించాము కదా. 293 00:28:48,437 --> 00:28:50,355 నేను నువ్వు, నీ ఏజెంట్ ప్లాన్ కి ఒప్పుకున్నాను. 294 00:28:50,439 --> 00:28:53,650 అది గొడవ లేకుండా, తక్కువ ఖర్చుతో అయిపోతుందని నన్ను ఒప్పించావు. 295 00:28:53,734 --> 00:28:55,652 కానీ అది పని చేయలేదు. 296 00:28:58,113 --> 00:29:01,575 మన పైలట్లను షూట్ చేసే అవకాశం ఉంటే ప్రధాని రియాక్టర్ల మీద బాంబు వేయడానికి ఒప్పుకోరు. 297 00:29:02,075 --> 00:29:03,827 నేను ఆయనకు గోడవలేని ఆకాశం ఉంటుందని మాట ఇచ్చాను, 298 00:29:03,911 --> 00:29:06,538 దాని అర్థం మనం ఇరాన్ ప్లాన్ కి తిరిగి వెళ్తున్నాం. 299 00:29:39,613 --> 00:29:40,614 నేను కమాలి. 300 00:29:41,365 --> 00:29:44,660 మిమ్మల్ని లేపినందుకు క్షమించండి. జీలా గోర్బానిఫా. 301 00:29:45,702 --> 00:29:49,081 -ఏంటి? -జోర్డేనియన్ విమానం న్యూఢిల్లీలో దిగింది. 302 00:29:49,164 --> 00:29:52,125 మీరు సరిగ్గా చెప్పారు, బాస్. మార్పిడి జరిగింది. 303 00:29:52,209 --> 00:29:56,004 జోర్డేనియన్ పాస్పోర్ట్ ఉన్న ఒక ప్రాయాణీకురాలు, ఇబ్తిసాం బద్రాన్, 304 00:29:56,088 --> 00:29:59,466 టెహ్రాన్ లో ఒక ఫోటోతో దిగింది, ఢిల్లీలో మరో ఫోటోతో దిగింది. 305 00:29:59,550 --> 00:30:02,052 నేను ఆమె ముఖాన్ని మన డేటాబేస్ లో ఇప్పటికే చూసాను. 306 00:30:02,135 --> 00:30:03,762 ఇండియాలో దిగిన ఆ మహిళ, 307 00:30:03,846 --> 00:30:06,348 జీలా గోర్బానిఫా అనే పేరున్న ఇరానియన్ పౌరురాలు. 308 00:30:06,431 --> 00:30:07,933 మనకి ఆమె గురించి ఏం తెలుసు? 309 00:30:08,350 --> 00:30:10,060 ఆమె ఒక విద్యుత్ సంస్థకి పని చేస్తుంది. 310 00:30:10,143 --> 00:30:14,314 ఆ మరో మహిళ బహుశా మనం వెతుకుతున్న ఏజెంట్ అయి ఉంటుంది. 311 00:30:14,398 --> 00:30:15,899 నాకు అంతా పంపించు! 312 00:30:16,859 --> 00:30:18,902 నేను దాన్ని మీకు మెయిల్ చేసేసాను. 313 00:30:19,361 --> 00:30:20,404 ధన్యవాదాలు. 314 00:30:28,245 --> 00:30:30,706 ఇబిత్సాం అబ్దల్లా ఇబ్రహీం బద్రాన్ 315 00:31:08,410 --> 00:31:10,329 లే. 316 00:31:10,412 --> 00:31:12,039 లే. మనం వెళ్తున్నాం. లే. 317 00:31:55,999 --> 00:31:57,042 పద. 318 00:32:05,759 --> 00:32:06,760 తొందరగా. 319 00:32:23,026 --> 00:32:26,071 సమాద్, నువ్వు మెట్ల మీద నుంచి రా. నువ్వు, లోపలికి. 320 00:32:35,622 --> 00:32:38,250 ఏమైంది? 321 00:32:39,918 --> 00:32:41,962 -తల్లీ... -ప్లీజ్. 322 00:32:42,045 --> 00:32:44,673 మీకు ఏమైనా కావాలంటే నేను నా తలుపు తెరిచి ఉంచుతాను. 323 00:32:48,177 --> 00:32:51,763 జీలా, తల్లీ, నాతో రా. 324 00:32:52,598 --> 00:32:53,932 నీకు ఎలా అనిపిస్తోంది? 325 00:32:55,684 --> 00:32:56,852 రా, తల్లీ, వచ్చి కూర్చో. 326 00:32:56,935 --> 00:32:58,437 పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? 327 00:32:58,520 --> 00:33:00,022 కూర్చో, తల్లీ. కూర్చో. 328 00:33:00,105 --> 00:33:01,440 ఘేసార్ ఎక్కడున్నారు? 329 00:33:01,523 --> 00:33:02,816 కూర్చో. 330 00:33:03,775 --> 00:33:07,362 జీలా, నా పేరు మోజ్గాన్. నేనొక సామాజిక కార్యకర్తని. 331 00:33:07,988 --> 00:33:09,781 ఇది నీ భర్త గురించి. 332 00:33:10,782 --> 00:33:12,492 ఏంటి? ఆయన బాగానే ఉన్నారా? 333 00:33:12,576 --> 00:33:15,579 మీ భర్త ఒక గంట క్రితం మరణించారు. 334 00:33:17,122 --> 00:33:18,540 ఎలా? ఏమైంది? 335 00:33:18,624 --> 00:33:20,083 ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 336 00:33:23,295 --> 00:33:28,592 జీలా, ఒక్క క్షణం ఊపిరి తీసుకుని దీన్ని అర్థం చేసుకో. 337 00:33:28,675 --> 00:33:30,511 -నీకు తాగడానికి మంచి నీళ్ళు కావాలా? -ఎందుకు? 338 00:33:31,053 --> 00:33:32,471 ఆయనలా ఎందుకు చేస్తారు? 339 00:33:32,971 --> 00:33:37,017 ఆయన నీకు ఒక ఉత్తరం రాసారు, అందులో అంతా వివరించారు. 340 00:33:37,935 --> 00:33:39,436 ఆయన ఒకరిని హత్య చేసాడు, 341 00:33:40,229 --> 00:33:42,856 ఆ పపం ఆయనకీ చాలా భారం అయింది. 342 00:33:52,658 --> 00:33:55,118 ఘేసార్ కి కూడా తెలుసు. ఆమె భర్త. 343 00:33:55,202 --> 00:33:56,995 ఘేసార్? నీకు ఖచ్చితంగా తెలుసా? 344 00:33:59,540 --> 00:34:00,541 జీలా, తల్లీ... 345 00:34:00,624 --> 00:34:02,918 -తలుపు ముయ్యండి! -జీలా, నాకేసి చూడు 346 00:34:03,001 --> 00:34:05,712 జీలా, తల్లీ, నాకేసి చూడు. 347 00:34:08,799 --> 00:34:10,801 -హలో. -బాస్, ఎక్కడున్నావు? 348 00:34:10,884 --> 00:34:13,053 ఆమె ఇంటికి వెళుతున్నాను. నేనక్కడికి కాసేప్లట్లో వెళతాను. 349 00:34:13,136 --> 00:34:16,598 పోలీసులు ఆమెని ఆమె అపార్ట్మెంట్ కి తీసుకు వెళ్ళారు. ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. 350 00:34:16,681 --> 00:34:18,641 ఏంటి? అతనేం చేసాడు? 351 00:34:18,725 --> 00:34:21,228 ఆమె బాస్ ని హత్య చేసినట్లు అతను ఒక ఉత్తరం రాసాడు. 352 00:34:23,188 --> 00:34:26,024 సరే. నేను బయలుదేరాను. 353 00:34:26,108 --> 00:34:28,068 -సరే, బాస్. -బై. 354 00:34:36,284 --> 00:34:37,369 నువ్వు నాతో ఉండు. 355 00:34:39,830 --> 00:34:40,831 జీలా, తల్లీ... 356 00:34:50,007 --> 00:34:53,969 రా, కూర్చో. నా కేసి చూడు. నాతో ఉండు. 357 00:34:54,969 --> 00:34:56,346 కూర్చో. 358 00:34:59,558 --> 00:35:01,310 రా. ఇలా రా. 359 00:35:06,607 --> 00:35:09,067 ఆగు, తల్లీ. ఆగు. 360 00:35:11,361 --> 00:35:14,114 చూడు. చూడు. ఆగు. 361 00:35:15,574 --> 00:35:18,076 జీలా, ఆగు. 362 00:35:18,160 --> 00:35:20,329 పక్కవాళ్ళు బయటే ఉన్నారు. జీలా! 363 00:35:20,412 --> 00:35:21,914 జీలా, ఆగు! 364 00:35:21,997 --> 00:35:23,207 అలా చేయకు! 365 00:35:23,290 --> 00:35:24,875 దూకవద్దు! 366 00:35:25,834 --> 00:35:27,836 దూకవద్దు! జీలా! 367 00:35:28,879 --> 00:35:31,465 నువ్వలా ఎందుకు చేసావు? జీలా, ఆగు! 368 00:35:31,548 --> 00:35:33,383 -ఆమె చనిపోయి ఉండాలి -ఆమె పారిపోయింది. 369 00:35:33,467 --> 00:35:36,220 -ఇక్కడ ఏమవుతోంది? -ఒక మహిళ బాల్కనీ నుంచి దూకింది. 370 00:35:37,930 --> 00:35:39,139 నువ్వేం చేస్తున్నావు? 371 00:35:42,559 --> 00:35:43,852 కాపాడండి. 372 00:35:46,313 --> 00:35:48,524 కాపాడండి! 373 00:35:53,695 --> 00:35:54,947 జీలా! 374 00:35:56,281 --> 00:35:57,491 ఆమెని పట్టుకోండి! 375 00:36:25,978 --> 00:36:27,020 జీలా! 376 00:38:08,789 --> 00:38:09,790 హలో. 377 00:38:09,873 --> 00:38:12,334 ఇది నేను. వాతావరణం... 378 00:38:13,252 --> 00:38:14,378 వాతావరణం బాగానే ఉంది. 379 00:38:16,171 --> 00:38:18,257 నీ గొంతు వింటున్నందుకు ఆనందంగా ఉంది. 380 00:38:19,675 --> 00:38:20,676 నువ్వు ఎక్కడున్నావు? 381 00:38:20,759 --> 00:38:22,010 నేను బాగానే ఉన్నాను. నేను... 382 00:38:22,427 --> 00:38:24,012 నేను ఎక్కడో ఒక చోట సురక్షితంగా ఉన్నాను. 383 00:38:24,096 --> 00:38:25,097 ఈగిల్ తో. 384 00:38:26,348 --> 00:38:28,642 లేదు. అతనితో సంపర్కం తెంపేసాను. 385 00:38:29,309 --> 00:38:30,310 ఎందుకు? 386 00:38:30,394 --> 00:38:33,939 అతను పొరపాటు చేసాడు. నేనతన్ని నమ్మను. నా అంతట నేనే ఇంటికి వస్తాను. 387 00:38:34,022 --> 00:38:36,066 తమార్, నువ్వు ఎవరికీ కనిపించకుండా ఉండాలి. 388 00:38:36,608 --> 00:38:38,485 నువ్వు సరిహద్దు సురక్షితంగా దాటే వరకు 389 00:38:38,569 --> 00:38:41,238 ఈగిల్ నిన్ను సురక్షితమైన ఇంటికి తీసుకువెళతాడు, సరేనా? 390 00:38:41,321 --> 00:38:43,073 లేదు, కదోష్, అది నాకు వద్దు. 391 00:38:43,407 --> 00:38:46,368 అతని సమాచారం మంచిది కాదు, అతను బయట పడ్డాడు, ఒక హత్యలో ఇరుక్కుపోయాడు. 392 00:38:46,451 --> 00:38:48,412 అతను నన్ను ప్రమాదంలో పడేస్తున్నాడు. 393 00:38:48,495 --> 00:38:50,247 నువ్వు ఆ నిర్ణయం మాకు వదిలి పెట్టు. 394 00:38:50,330 --> 00:38:51,373 కాదు. 395 00:38:51,707 --> 00:38:52,958 నేను సంపర్కం తెంపేసుకుంటున్నాను. 396 00:38:53,041 --> 00:38:55,210 నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చేయమని నేర్పావు. 397 00:39:20,444 --> 00:39:21,528 ఇది ఆమేనా? 398 00:39:23,238 --> 00:39:24,239 అవును. 399 00:39:25,574 --> 00:39:29,161 మంచిది. నువ్వు నిజమైన ప్రొఫెషనల్ వి, ఫరాజ్. 400 00:39:29,912 --> 00:39:30,954 ధన్యవాదాలు, సర్. 401 00:39:31,038 --> 00:39:32,206 నిజంగా. 402 00:39:32,289 --> 00:39:36,376 నువ్వు ప్రజల పట్ల విధేయతకు ఎప్పుడూ ప్రాముఖ్యత ఇస్తావు. 403 00:39:36,877 --> 00:39:38,170 నీ కుటుంబానికన్నా ఎక్కువ. 404 00:39:39,838 --> 00:39:41,131 నీ భార్య ఎలా ఉంది? 405 00:39:42,466 --> 00:39:44,301 ఆపరేషన్ రెండు గంటల్లో చేస్తారు. 406 00:39:44,384 --> 00:39:46,011 అయితే నువ్వు చేరుకోలేవు. 407 00:39:46,386 --> 00:39:48,805 దయగల దేవుడు ఆమెని రక్షిస్తాడు. 408 00:39:48,889 --> 00:39:50,891 ఆమె బాగానే ఉంటుంది. నాకది తెలుసు. 409 00:39:52,184 --> 00:39:53,810 సరే. తరువాత ఏంటి? 410 00:39:54,394 --> 00:39:56,897 ఈ ఫోటోని విస్తృతంగా విడుదల చేద్దాము. 411 00:39:56,980 --> 00:39:58,774 నాకామె ఇవాళే కస్టడీలో కావాలి. 412 00:39:59,191 --> 00:40:03,237 ఆమె కోసం వెతకండి కానీ ఆ ఫోటో పంపకండి. 413 00:40:03,320 --> 00:40:07,199 పోలీసులను ఆమె కోసం వెతకనివ్వు, ఆమె ఒక హత్య-ఆత్మహత్య కేసులో అనుమానితురాలు. 414 00:40:07,282 --> 00:40:10,661 కానీ వారు వెతుకుతోంది జీలా గోర్బానిఫా కోసం, ఆమె కోసం కాదు. 415 00:40:10,744 --> 00:40:12,996 ఇజ్రాయెలీలకు టెహ్రాన్ లో గూఢాచారులు ఉన్నారు. 416 00:40:13,080 --> 00:40:15,916 మనం వారి ఏజెంట్ కోసం వెతుకుతున్నట్టు వారికి తెలియడం నాకు ఇష్టం లేదు. 417 00:40:16,375 --> 00:40:19,086 వారు మనం ఒక ఇరానియన్ జాతీయురాలి కోసం వెతుకుతున్నామని అనుకోనిద్దాము. 418 00:40:20,003 --> 00:40:23,841 ఆ జాయినిస్టులు ఏదో పెద్దది ప్లాన్ చేస్తున్నారు. 419 00:40:24,716 --> 00:40:27,803 వారిని పెద్ద దెబ్బ కొట్టి, వారు వారి కాళ్ళ మీద పడి మోకరిల్లేలా చేయాలని ఉంది. 420 00:40:28,262 --> 00:40:30,264 పూర్తి ప్రపంచమంతా చూడడానికి. 421 00:40:30,806 --> 00:40:34,518 అందుకని మనం కనిపించేలా చేయలేము. 422 00:40:35,644 --> 00:40:37,062 పూర్తిగా వ్యతిరేకం. 423 00:40:37,813 --> 00:40:39,314 నాకు పరిస్థితులు స్థిరంగా ఉండాలి. 424 00:40:41,149 --> 00:40:43,569 ఆ చేపనే గాలం వద్దకు వచ్చేలా చేద్దాము. 425 00:41:58,894 --> 00:42:00,312 హలో. నేను మీకు సహాయం చెయ్యగలనా? 426 00:42:02,314 --> 00:42:03,482 ఆరజూ... 427 00:42:05,943 --> 00:42:07,236 చూడండి. 428 00:42:18,080 --> 00:42:20,249 నేను మీ సోదరి యాస్మిన్, కూతుర్ని. 429 00:43:27,441 --> 00:43:29,443 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి