1 00:00:23,720 --> 00:00:25,960 ఎ ప్రైవేట్ ఎఫైర్ 2 00:00:31,000 --> 00:00:33,840 మన్నించు, హెక్టర్, మనం అతని కంటే ముందే చేరుకోవాలి. 3 00:00:33,920 --> 00:00:36,320 చింతించకు, మనం ఒక జట్టు. 4 00:00:43,640 --> 00:00:47,200 -ఈ విషయంలో కచ్చితమేగా? -ఈ చుట్టుపక్కల ఉన్నది ఈ ఇల్లు ఒకటే. 5 00:00:47,280 --> 00:00:49,920 నది పక్కన రంపపుమర అని లియోపోల్డో అన్నాడు. 6 00:01:01,120 --> 00:01:03,200 ఇక్కడి నుంచి వెళ్లిపోదాం! ఆమెకు పిచ్చి! 7 00:01:03,280 --> 00:01:04,680 -చేతి రుమాలు! -ఏంటి? 8 00:01:04,720 --> 00:01:06,200 చేతి రుమాలు బయటకు తియ్! 9 00:01:06,280 --> 00:01:07,960 మా చోటు నుంచి బయటకు పొండి! 10 00:01:08,000 --> 00:01:10,680 మీ అన్న మమ్మల్ని పంపాడు! 11 00:01:10,760 --> 00:01:12,920 -ఇక్కడి నుంచి పొండి! -దయచేసి కాల్చకు! 12 00:01:13,920 --> 00:01:14,920 మీకు ఏం కావాలి? 13 00:01:15,280 --> 00:01:18,160 నీ రక్షణకు మీ అన్న పంపాడు, ప్రమాదంలో ఉన్నావు! 14 00:01:21,400 --> 00:01:22,360 దగ్గరకు రా. 15 00:01:23,040 --> 00:01:25,080 నిన్ను కాదు! నువ్వు అక్కడే ఉండు. 16 00:01:25,160 --> 00:01:26,400 నేను మగాళ్లను నమ్మను. 17 00:01:26,480 --> 00:01:28,360 నేను కూడా ఆమెను నమ్మను. 18 00:01:32,520 --> 00:01:33,360 అలాగే. 19 00:01:33,440 --> 00:01:36,520 సరే, కానీ నన్ను కాల్చనని మాటివ్వు. 20 00:01:36,600 --> 00:01:40,560 నీకు సాయం చేయాలనే మేము కోరుకుంటున్నాం. 21 00:01:47,600 --> 00:01:49,800 దయచేసి కాల్చకు. 22 00:01:54,000 --> 00:01:56,000 మా అన్న ఎక్కడ? 23 00:01:56,080 --> 00:02:00,240 మార్గో, మీ అన్న దీనిపై నిన్ను హెచ్చరించాలనుకున్నాడు... 24 00:02:03,720 --> 00:02:04,760 హెక్టర్? 25 00:02:06,280 --> 00:02:08,720 -నాకిది నచ్చలేదు. -నాకు కూడా. 26 00:02:12,360 --> 00:02:13,400 జాగ్రత్త! 27 00:02:13,480 --> 00:02:15,600 -నాకు ప్రమాదం! -అలాగే హెక్టర్‌కు కూడా! 28 00:02:26,560 --> 00:02:27,600 హెక్టర్! 29 00:02:28,800 --> 00:02:30,760 హెక్టర్. 30 00:02:30,840 --> 00:02:33,320 రా, పైకి లే. వెళదాం పద. 31 00:02:34,040 --> 00:02:35,320 కిటికీలు! 32 00:02:35,400 --> 00:02:36,760 నేనిది నమ్మలేను. 33 00:02:37,520 --> 00:02:38,800 అయ్యో దేవుడా! 34 00:02:39,520 --> 00:02:41,360 -స్టార్ట్ కావడం లేదు! -కారు నడుపు! 35 00:02:41,440 --> 00:02:42,800 -పద. -కారు స్టార్ట్ చెయ్. 36 00:02:48,960 --> 00:02:50,600 నాకు ఇది నచ్చలేదు. 37 00:02:53,640 --> 00:02:54,640 స్టార్ట్ అవ్వు! 38 00:02:56,200 --> 00:02:57,160 సాయం చేయండి! 39 00:03:17,400 --> 00:03:18,680 దీనిలో నాకు సాయం చెయ్. 40 00:03:21,240 --> 00:03:22,600 తలుపు తెరవండి! 41 00:03:23,880 --> 00:03:25,680 -కాస్టానో. -ఎవరు? 42 00:03:25,760 --> 00:03:27,000 -పోలీసు. -బాగానే ఉన్నావా? 43 00:03:27,080 --> 00:03:28,240 -అవును! -వద్దు! 44 00:03:28,320 --> 00:03:32,840 వద్దు! హౌస్ ఆఫ్ వాటర్‌లో జరిగిన నేరాలకు అతనే బాధ్యుడు. 45 00:03:33,400 --> 00:03:35,160 మేడమ్, బాగానే ఉన్నారా? 46 00:03:39,000 --> 00:03:40,000 ఇక్కడ. 47 00:03:42,000 --> 00:03:43,120 మేడమ్! 48 00:03:45,120 --> 00:03:47,520 -తలుపు తెరవు. -ఏంటి? 49 00:03:47,600 --> 00:03:50,040 -తలుపు తెరువు! -మేడమ్! 50 00:03:50,120 --> 00:03:51,280 ఒక నిమిషం! 51 00:03:59,280 --> 00:04:01,400 -నీకు ఏం కావాలి? -మార్గో. 52 00:04:01,480 --> 00:04:02,800 నేను నీకు తెలుసా? 53 00:04:05,120 --> 00:04:07,280 -నువ్వు ఇక్కడ ఉంటావని తెలుసు. -తెలుసా? 54 00:04:25,120 --> 00:04:29,360 మాకు స్పష్టంగా మాస్క్ కనబడింది, దానికి రాక్షసి ముఖం ఉంది. 55 00:04:29,480 --> 00:04:31,800 -మాస్క్? -రాక్షసి ముఖంతో. 56 00:04:31,920 --> 00:04:33,080 చాలా భయానకంగా. 57 00:04:33,720 --> 00:04:36,440 దెయ్యం ముఖంతో మాస్క్, మీకు వినబడిందా? 58 00:04:36,520 --> 00:04:38,760 అందరూ మాస్క్ కోసం వెతకడం ఆరంభించండి! 59 00:04:41,640 --> 00:04:43,760 నీకు ఇంకా ఏం గుర్తుంది? 60 00:04:43,800 --> 00:04:46,440 మేము కారులో ఉండగా, 61 00:04:46,520 --> 00:04:49,680 అతను పెద్ద కత్తితో అద్దం బద్దలుకొట్టాడు. 62 00:04:57,440 --> 00:04:58,720 నాకతను ఎప్పుడూ నచ్చలేదు. 63 00:05:05,680 --> 00:05:07,720 మనం జట్టుగా పని చేద్దామని అన్నాను. 64 00:05:08,520 --> 00:05:11,000 నీకు నాతో కలిసి పని చేసే అవకాశం ఇచ్చాను. 65 00:05:11,080 --> 00:05:12,440 నువ్వు నాకు ద్రోహం చేశావు. 66 00:05:12,520 --> 00:05:15,240 -ఆ వేశ్య ఎక్కడుంది? -ఓ బాధితురాలిని అలా ఎలా అనగలవు? 67 00:05:15,320 --> 00:05:16,440 ఆమె పేరు మార్గో. 68 00:05:16,520 --> 00:05:19,080 నువ్వు ఆ సమూహానికి కొత్త చట్ట ప్రతినిధివా? 69 00:05:19,160 --> 00:05:20,240 అవసరం అయితే. 70 00:05:21,360 --> 00:05:23,000 -నిజంగా చెబుతున్నా. -నేను కూడా. 71 00:05:23,080 --> 00:05:25,880 తన రక్షణపై హామీ ఇచ్చేవరకూ తనెక్కడ ఉందో నీకు చెప్పను. 72 00:05:25,920 --> 00:05:28,760 రక్షణా? ఇప్పుడే అపరాధిని అరెస్ట్ చేశాం. 73 00:05:28,840 --> 00:05:32,120 అవును, కానీ హంతుకుడు ఓ పోలీసు అనే విషయం పరిగణిస్తే, 74 00:05:32,200 --> 00:05:33,880 ఇది సున్నిత విషయమని అర్థమవుతుంది. 75 00:05:33,960 --> 00:05:35,640 మార్గోకు రక్షణ అడుగుతున్నాను. 76 00:05:37,960 --> 00:05:41,960 ఆఫీసర్లు, క్యాబిన్ బయటకు వెళ్లండి. నా సోదరితో కాసేపు ఒంటరిగా మాట్లాడాలి. 77 00:05:42,040 --> 00:05:43,680 అలాగే, సర్. అందరూ బయటకు. 78 00:05:43,760 --> 00:05:45,120 బయటకు వెళదాం పదండి. 79 00:05:48,200 --> 00:05:49,640 నీకు ఏం కావాలి? 80 00:05:49,720 --> 00:05:52,800 ఎవరికీ కనబడకుండా ఆమెను సురక్షిత చోటు తీసుకెళ్లాలి. 81 00:05:54,560 --> 00:05:56,400 ఆమె ఇక్కడే ఉందా? ఎక్కడుంది? 82 00:05:58,480 --> 00:06:01,320 ఎందుకో చెప్పకుండా ఆమెకు సురక్షిత ప్రదేశం చూడలేను. 83 00:06:01,400 --> 00:06:03,920 "అందరికంటే ముందు బలహీనుల రక్షణ," గుర్తుందా? 84 00:06:04,000 --> 00:06:06,240 -నేను నాన్నను కాదు. -అవును, నాకు తెలుసు. 85 00:06:06,360 --> 00:06:07,840 అలాగే నువ్వు కూడా కాదు. 86 00:06:08,920 --> 00:06:09,960 చాలా మంచిది. 87 00:06:10,040 --> 00:06:12,920 నువ్వు ఆమెకు సురక్షిత ప్రదేశం చూడలేకపోతే... 88 00:06:13,000 --> 00:06:15,760 -నువ్వు స్పృహలోకి రా. -...తనను ఇంటికి తీసుకెళదాం. 89 00:06:15,840 --> 00:06:16,760 ఏంటి? 90 00:06:16,840 --> 00:06:20,320 నువ్వు ఆమెను రక్షించే దారి వెతుకుతుంటే నా దగ్గర ఉందని ఎవరూ అనుకోరు. 91 00:06:20,400 --> 00:06:23,000 పిచ్చిగా మాట్లాడకు. అమ్మ సంగతి ఏంటి? 92 00:06:23,440 --> 00:06:24,480 సర్! 93 00:06:25,000 --> 00:06:27,360 సర్. నాకు వీలైనంత వేగంగా వచ్చాను. 94 00:06:27,440 --> 00:06:29,640 ఎక్కడ ఉన్నావు, జార్కో? రెండు గంటలు అయింది. 95 00:06:29,720 --> 00:06:31,560 ఇక్కడకు నువ్వే మొదట రావాల్సింది. 96 00:06:31,680 --> 00:06:33,640 అవును, దారిలో కారు సమస్య ఇచ్చింది. 97 00:06:34,120 --> 00:06:36,080 -కారు సమస్యా? -అవును. 98 00:06:36,160 --> 00:06:40,560 ప్రవేశ మార్గం ఖాళీ చేసి, అడవికి అవతల వైపు చూడు. 99 00:06:40,640 --> 00:06:42,880 ఎవరూ చూడకుండా ఒకరిని బయటకు తీసుకెళ్లాలి. 100 00:06:43,000 --> 00:06:45,000 -అదిరింది. -అలాగే, సర్. 101 00:06:46,920 --> 00:06:48,120 కబనియస్, రా. 102 00:06:48,200 --> 00:06:50,760 ఆమె ఉండేందుకు నేను వేరే చోటు వెతికేవరకే. 103 00:06:57,640 --> 00:06:59,000 నీ సామాన్లు తెచ్చుకో. 104 00:07:15,600 --> 00:07:18,240 -నువ్వేమీ మాట్లాడలేదు... -పెదవి దాటితే చేటు. 105 00:07:18,320 --> 00:07:21,240 -అదేమైనా పొడుపుకథా? -నాకు తెలియదు. నువ్వే చెప్పు. 106 00:07:23,160 --> 00:07:25,840 ఏం జరుగుతోందో తెలియడం లేదు, కానీ నాకది నచ్చలేదు. 107 00:07:25,920 --> 00:07:26,920 నాకూ నచ్చలేదు. 108 00:07:27,760 --> 00:07:30,920 మార్గో, నేను నీకు తెలియదు, కానీ ఈ కేసుకు ఇన్‌చార్జ్‌ని. 109 00:07:31,000 --> 00:07:33,160 -సరే, సాంకేతికంగా... -సాంకేతికంగా కూడా. 110 00:07:33,240 --> 00:07:35,200 నీకు ఏమీ జరగనివ్వను. 111 00:07:36,800 --> 00:07:39,720 -ఎవరినీ నమ్మరాదని జీవితం నాకు నేర్పింది. -జీవితం తెలివైనది. 112 00:07:39,800 --> 00:07:41,400 కానీ మేము నీకు గతంలో తెలియదు. 113 00:07:42,120 --> 00:07:44,680 మేము లిల్లీ పూవు హంతకుడిని కనుగొంటాం. 114 00:07:50,080 --> 00:07:52,800 ఇటు వైపు. రా. 115 00:07:54,160 --> 00:07:55,480 -తనిక్కడే ఉంటుందా? -అవును. 116 00:07:55,560 --> 00:07:56,760 -స్పష్టంగా. -లేదు. 117 00:07:56,840 --> 00:07:59,560 -ఏంటి? -మా అన్న తర్వాత ఆమెను తీసుకెళతాడు. 118 00:08:00,480 --> 00:08:02,520 నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, 119 00:08:02,600 --> 00:08:05,640 -కానీ నేనింకా అదే వ్యక్తిని. -దానికి అర్థం లేదు. 120 00:08:05,720 --> 00:08:07,480 -ఏంటి? -ఏమీ లేదు. 121 00:08:09,520 --> 00:08:13,600 చింతించకు, మి. పాబ్లో. మేము కొన్ని గంటలుగా నిద్రపోలేదు. 122 00:08:14,200 --> 00:08:16,240 -అదే అయుండాలి. -ధన్యవాదాలు. 123 00:08:17,120 --> 00:08:20,440 ఏదైమైనా, నీకు ఏమైనా కావాలంటే, నన్నెక్కడ కలవాలో నీకు తెలుసు. 124 00:08:23,120 --> 00:08:24,680 నేను పాబ్లోను-- 125 00:08:25,360 --> 00:08:26,600 కచ్చితంగా. 126 00:08:28,400 --> 00:08:29,560 ఉంటాను. 127 00:08:32,920 --> 00:08:34,200 నేను అతనిని నమ్మను. 128 00:08:35,200 --> 00:08:38,040 అతను మనతో రైలులో ఉన్నాడు, కానీ ఇక్కడకు చివరగా వచ్చాడు. 129 00:08:38,120 --> 00:08:41,720 స్పష్టంగా అతని కారుకు అడవిలో సమస్య వచ్చింది, అంతే. 130 00:08:45,840 --> 00:08:47,280 మార్గో ఎక్కడ? 131 00:08:47,880 --> 00:08:48,880 మార్గో? 132 00:08:49,400 --> 00:08:51,960 -దేవుడా. -హెక్టర్, ముష్టిది ఇంట్లోకి వచ్చింది! 133 00:08:52,040 --> 00:08:57,640 ఆమె మరీనా స్నేహితురాలు, సంరక్షణాలయం నుంచి వచ్చింది. 134 00:08:57,720 --> 00:09:00,760 క్వీన్ క్రిస్టీనాస్ రాయల్ కన్జర్వేటరీ ఆఫ్ మ్యూజిక్ నుంచా? 135 00:09:00,840 --> 00:09:01,880 అక్కడి నుంచే. 136 00:09:02,520 --> 00:09:06,720 కానీ, మరీనా! నీ స్నేహితురాలిని తీసుకొస్తున్నట్లు నాకు చెప్పలేదే? 137 00:09:06,760 --> 00:09:10,280 నేను వేరేవి వేసుకునే దాన్ని, బంగారం. ఎలా ఉన్నానో చూడు! 138 00:09:10,360 --> 00:09:13,520 ఇందాక అలా అన్నందుకు మన్నించు, కానీ అలా కనబడితే... 139 00:09:14,600 --> 00:09:15,640 అలా కానీయ్. 140 00:09:16,240 --> 00:09:18,440 బాధపడకు, ఇది... 141 00:09:18,520 --> 00:09:20,400 ఇదొక వేషధారణ, కదా? 142 00:09:20,480 --> 00:09:23,520 అవును, మేము సాధన చేసే ఓ ప్రదర్శనకు చెందిన వేషం ఇది. 143 00:09:23,640 --> 00:09:25,840 నీ దగ్గర వేష వస్త్రాలు, అన్నీ ఉన్నాయి. 144 00:09:25,880 --> 00:09:28,960 నేను మరీనా అమ్మను, ఆసున్‌సియోన్ బియెంపికా. 145 00:09:29,040 --> 00:09:34,040 ఆమెను ఛాంబర్ సంగీతం మళ్లీ తీసుకోమని ఒప్పించేందుకు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నా, 146 00:09:34,120 --> 00:09:36,520 కానీ ఇది తప్ప ఏదైనా ఊహించేదాన్ని. 147 00:09:37,600 --> 00:09:39,080 నీ పేరు ఏంటి? 148 00:09:40,320 --> 00:09:41,160 పురి. 149 00:09:42,720 --> 00:09:46,240 -పురిఫికాసియోన్. -పురిఫికాసియోన్, అది అందమైన పేరు. 150 00:09:46,320 --> 00:09:47,280 అమ్మా... 151 00:09:49,040 --> 00:09:51,880 పురి చాలా సుదీర్ఘ ప్రయాణం చేసొచ్చింది, 152 00:09:51,960 --> 00:09:55,200 సాంటాడర్‌లోనే ఉంటుంది, అందుకే నీకు తెలియకపోవచ్చు. 153 00:09:55,280 --> 00:09:58,840 తను కోరుకునే విషయం తన గదికి వెళ్లి విశ్రాంతి తీసుకోవడమే. 154 00:09:58,880 --> 00:10:01,880 నాకు పూర్తిగా అర్థమైంది, కానీ రేపు మర్కియోనెస్ పార్టీలో 155 00:10:01,960 --> 00:10:03,480 నువ్వు మా అతిథిగా ఉండాలి. 156 00:10:03,520 --> 00:10:06,400 -రేపేనా? -అవును, ప్రతి ఏడాది జరిగేదే. 157 00:10:06,480 --> 00:10:09,880 ఇంకా మీకు కావాలంటే, మీరు సాయంత్రం ఓ పాట పాడవచ్చు. 158 00:10:10,000 --> 00:10:12,720 -ఇప్పుడే వస్తాను. -పురి, నీ గది చూపిస్తాను. 159 00:10:12,760 --> 00:10:15,360 -మిమ్మల్ని కలవడం సంతోషం. -నాదే సంతోషం, పురి. 160 00:10:19,640 --> 00:10:20,840 ఇది పిచ్చిగా ఉంది. 161 00:10:20,880 --> 00:10:23,520 నిన్ను తీసుకెళ్లమని ఆర్టురోను ఉదయం అడుగుతాను. 162 00:10:23,600 --> 00:10:26,240 -నీకేదో పని ఉందంటా... -ఎందుకు? నాకర్థం కాలేదు. 163 00:10:27,000 --> 00:10:29,400 ఓ క్షణం క్రితం, ఇక్కడ ఉండడమే సురక్షితం. 164 00:10:29,480 --> 00:10:33,360 అవును, కానీ పార్టీకి వెళ్లలేవు. అదెలా ఉంటుందో నీకు తెలియదు. 165 00:10:33,440 --> 00:10:36,480 జనాలు అతిథులపై మాట్లాడుకుంటారు. నీ గురించి అడుగుతారు. 166 00:10:36,520 --> 00:10:39,400 మరీనా, ఈ సమాజాలలో తిరిగే అలవాటు నాకు ఎక్కువే. 167 00:10:39,480 --> 00:10:41,720 ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. 168 00:10:42,520 --> 00:10:44,960 బహుశా ఆమె నీ దుస్తులు వేసుకోవచ్చు. 169 00:10:45,040 --> 00:10:45,880 ఏంటి? 170 00:10:46,000 --> 00:10:47,080 అలా చేయడం మంచిది. 171 00:10:49,040 --> 00:10:52,000 మంచిది. ఆమె వేసుకునేందుకు ఏవైనా వెతుకుతాను. 172 00:10:57,800 --> 00:10:59,360 ఆమె కోసం ఓ డ్రెస్ దొరికింది. 173 00:10:59,440 --> 00:11:02,760 ఆ అతిథులలో ఎవరూ హౌస్ ఆఫ్ వాటర్ క్లయింట్లు కాకూడదని ఆశిస్తాను. 174 00:11:02,840 --> 00:11:07,160 వాళ్లే తమ భార్యలు, తల్లులతో సమస్యలు పడేవాళ్లు అవుతారు. 175 00:11:09,080 --> 00:11:10,880 నువ్వు ఇది అలా వేసుకుంటే... 176 00:11:12,240 --> 00:11:15,520 -నీకేం తెలిసింది? -మిసెస్ ఆసున్‌సియోన్, ఏం చేస్తున్నారు? 177 00:11:15,600 --> 00:11:17,240 మీరు నిద్రపోయారని అనుకున్నా. 178 00:11:17,320 --> 00:11:21,120 -నేనెలా నిద్రపోగలను? -సరే, సహజంగా నిద్రపోతాను, ఒకటికే. 179 00:11:21,200 --> 00:11:25,520 మరీనాపై సమాచారం నాకు చెప్పాల్సి ఉంది. నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నాను. 180 00:11:25,600 --> 00:11:28,880 -తను నీకేం చెప్పింది? -ఏమీ లేదు, కానీ ఏమీ తెలియదు. 181 00:11:28,960 --> 00:11:32,400 -ఎందుకు చెవిని తాకుతున్నావు? -ఏదోరోజు ఇది కోసేసుకుంటాను. 182 00:11:32,480 --> 00:11:37,280 -నువ్వది చూసుకుంటానని చెప్పావు. -చెప్పాను. చూడండి, ఓ ఫ్రెండ్‌ను తెచ్చింది, 183 00:11:37,360 --> 00:11:40,160 ఇంకా రేపు నేను చాకలివాళ్ల దగ్గరకు వెళ్లాలి. 184 00:11:40,240 --> 00:11:42,400 లేదా చర్చి, కారణం... 185 00:11:42,480 --> 00:11:46,080 చెప్పు, హెక్టర్, వాళ్లు సాధన చేస్తున్న ఆ ప్రదర్శన ఏంటి? 186 00:11:48,160 --> 00:11:49,080 ఎవరికి తెలుసు? 187 00:11:50,880 --> 00:11:52,720 సరే, నీకు తెలిసి తీరాలి, హెక్టర్. 188 00:11:52,800 --> 00:11:55,680 మన చుట్టూ రహస్యం ఉంది! 189 00:11:57,320 --> 00:11:59,680 -నువ్వు ఏదైనా దాస్తున్నావా? -నేనా? 190 00:11:59,760 --> 00:12:04,280 అవును, నువ్వే! నీది ఎప్పుడూ డేగ కన్నే, నీకు అన్నీ తెలుస్తుంటాయి! ఇప్పుడు... 191 00:12:04,360 --> 00:12:06,200 నేను ముసలివాడిని అవుతూ ఉండాలి. 192 00:12:06,280 --> 00:12:08,080 శుభరాత్రి, మేడమ్. 193 00:12:09,080 --> 00:12:10,600 అంతేనని నేను అనుకోను! 194 00:12:10,680 --> 00:12:11,640 శుభరాత్రి. 195 00:12:12,640 --> 00:12:13,920 బాగా నిద్రపో, హెక్టర్. 196 00:12:17,200 --> 00:12:19,280 హాళ్లలో దీనిపై ఏమీ మాట్లాడకూడదు. 197 00:12:19,360 --> 00:12:21,720 -ఇంటరాగేషన్ గదిని సిద్ధం చెయ్. -ఈ సమయంలోనా? 198 00:12:21,800 --> 00:12:24,320 నేరాలు 10:00 నుంచి 12:00 మధ్య జరగవు. 199 00:12:24,400 --> 00:12:25,360 కచ్చితంగా, సర్. 200 00:12:25,440 --> 00:12:27,960 ఈ అరెస్టు విషయం ఎవరైనా పత్రికలకు చెప్పారంటే, 201 00:12:28,040 --> 00:12:31,600 బాధ్యుడిని కనుగొనేవరకూ మీ అందరూ సస్పెండ్ అవుతారు. 202 00:12:33,160 --> 00:12:35,040 మీకు కమిషనర్ మాట వినబడింది. 203 00:12:35,120 --> 00:12:37,760 కాస్టానోను వెంటనే ఇంటరాగేషన్ గదికి తీసుకురండి. 204 00:12:41,160 --> 00:12:43,000 నేనే ఆ పని చేస్తాను, చింతించకండి. 205 00:12:59,320 --> 00:13:00,160 సర్? 206 00:13:01,840 --> 00:13:03,480 నువ్వు కూర్చుని ఉండాలి. 207 00:13:04,520 --> 00:13:06,680 నువ్విది ఆనందిస్తున్నావు, అంతేగా? 208 00:13:07,320 --> 00:13:10,240 కబనియస్, సంకెళ్లు తీసేసెయ్. 209 00:13:21,800 --> 00:13:24,920 నన్ను వదలించుకోవాలని జీవితమంతా ప్రయత్నిస్తూ గడిపావు, 210 00:13:26,000 --> 00:13:29,480 అది నేను చివరకు నీకు సులభతరం చేశాను. 211 00:13:29,560 --> 00:13:32,000 మాలో ఒకరు హంతకుడు అనే కంటే ఈ పోలీస్ స్టేషన్‌కు 212 00:13:32,080 --> 00:13:34,240 చెడ్డ వార్త ఏమీ లేదు. 213 00:13:34,320 --> 00:13:37,360 హౌస్ ఆఫ్ వాటర్‌లో జరిగిన హత్యలకు నాకేమీ సంబంధం లేదు. 214 00:13:37,440 --> 00:13:39,440 తరచుగా అక్కడకు వెళతావని అందరికీ తెలుసు. 215 00:13:39,520 --> 00:13:41,960 హంతకుడు ఉన్న అదే రైలులో ఉన్నావు, 216 00:13:42,040 --> 00:13:45,000 దాడి తర్వాత క్యాబిన్ దగ్గరకు మొదటగా వెళ్లావు. 217 00:13:45,080 --> 00:13:47,280 -అభ్యంతరాలు ఉన్నాయా? -మరీనా మొదట చేరుకుంది. 218 00:13:47,360 --> 00:13:49,360 మరీనాను హంతకురాలు అంటున్నావా? 219 00:13:50,000 --> 00:13:53,360 మరీనా మాత్రమే హంతకుడిని కనిపెడుతుందని తెలుసు అంటున్నాను. 220 00:13:53,440 --> 00:13:55,120 నేను ఆమెను అనుసరించానంతే. 221 00:13:55,200 --> 00:13:57,920 కారులో ఆమెపై దాడి జరిగితే తనకెందుకు సాయం చేయలేదు? 222 00:13:58,000 --> 00:14:00,120 వాళ్లు నా దృష్టి నుంచి దాటిపోవడంతో. 223 00:14:00,200 --> 00:14:02,440 అంతా చీకటి, మంచుతో ఉంది, క్యాబిన్ నుంచి 224 00:14:02,520 --> 00:14:05,280 అరుపులు వినబడేవరకూ వాళ్లు నాకు కనబడలేదు. 225 00:14:05,360 --> 00:14:07,120 ఒప్పేసుకో, కాస్టానో. 226 00:14:07,200 --> 00:14:09,960 ఎందుకిలా చేశావు? ఒప్పుకో. 227 00:14:10,840 --> 00:14:13,080 ఆ మహిళలపై ఎందుకు దాడి చేశావు? 228 00:14:14,520 --> 00:14:16,760 వాళ్లలో ఎవరితోనైనా నువ్వు శృంగారం చేసుంటే, 229 00:14:16,840 --> 00:14:21,920 నేను వాళ్లపై కనీసం వేలు కూడా ఎందుకు వేయనో నీకు అర్థం అయ్యేది. 230 00:14:22,000 --> 00:14:24,840 -నువ్వొక నీచుడివి. -ఆర్టురో, శాంతించు. 231 00:14:24,920 --> 00:14:27,640 నేను శృంగారం గురించి చెప్పాను, అంతవరకే. 232 00:14:27,720 --> 00:14:30,200 ఆనందాన్ని ఇచ్చి పుచ్చుకోవడం. 233 00:14:30,280 --> 00:14:34,400 కానీ అయితే, నీ భార్యతో చివరగా ఎప్పుడు శృంగారం చేశావు? 234 00:14:36,200 --> 00:14:39,760 నన్ను మరోసారి అగౌరవపరిస్తే ఈ నేరాలతో సంబంధమున్నా, లేకపోయినా 235 00:14:39,840 --> 00:14:42,360 నిన్ను జైలులోనే మగ్గిపోయేలా చేస్తాను. 236 00:14:47,680 --> 00:14:49,120 అతనిని సెల్‌లో వేయండి. 237 00:14:50,680 --> 00:14:51,560 సర్. 238 00:14:52,120 --> 00:14:53,760 ఇవాళ మన పని పూర్తయింది. 239 00:14:57,800 --> 00:14:59,360 నువ్వు అనుమతిస్తే... 240 00:15:05,080 --> 00:15:06,200 డిటెక్టివ్. 241 00:15:16,400 --> 00:15:18,840 నేను లిల్లీ పువ్వు హంతకుడిని కాను. 242 00:15:22,480 --> 00:15:24,840 నీ చుట్టూ ఉన్న మనుషులపై కన్నేసి ఉంచు. 243 00:15:42,080 --> 00:15:44,840 ద క్రైమ్స్ ఆఫ్ నైటింగేల్ 244 00:15:59,320 --> 00:16:00,360 లోపలకు రావచ్చా? 245 00:16:01,280 --> 00:16:03,200 నీకు నువ్వే డ్రెస్ చేసుకున్నావా? 246 00:16:06,920 --> 00:16:10,640 కాస్టానో గురించి ఆలోచించ కుండా ఉండలేక పోయాను. అతను అమాయకుడయితే? 247 00:16:10,720 --> 00:16:15,200 అతను ఆకర్షణీయం, లొంగదీసుకునే రకం, కానీ తను నేరస్తుడు. 248 00:16:15,280 --> 00:16:18,480 -అదే ఆలోచించడం ఆపు. -లేదు. దీని గురించి ఆలోచించు. 249 00:16:18,560 --> 00:16:20,800 అతను సరైన బలిపశువు. 250 00:16:20,880 --> 00:16:24,200 బ్లూ హౌస్‌కు కాస్టానో ఓ క్లయింట్, ఇంకా పోలీసు. 251 00:16:24,280 --> 00:16:27,200 ఇంకా అతని శృంగార ప్రాధాన్యతలతో నీకా ఆలోచన ఉండవచ్చు... 252 00:16:27,280 --> 00:16:28,320 అతనే హంతకుడు. 253 00:16:28,400 --> 00:16:30,080 కానీ అతను కాదు. 254 00:16:30,800 --> 00:16:32,520 దీనిపై ఆలోచించు. చూడు. 255 00:16:33,960 --> 00:16:38,320 కాస్టానో తన ఇంటిలో పార్టీ ఇచ్చి, మార్గోలా ఉండేందుకు నన్ను పిలిచాడు. 256 00:16:40,840 --> 00:16:42,200 కానీ... 257 00:16:42,280 --> 00:16:47,080 నేను బతికున్నాను, అందుకు కారణం, అడవిలో అతను నన్ను చంపేందుకు పథకం వేసిన చోట, 258 00:16:47,160 --> 00:16:50,480 నా మాస్క్ ఊడిపోవడంతో నేను మార్గోను కానని గ్రహించాడు. 259 00:16:50,560 --> 00:16:53,720 అతనే హంతకుడు అయుంటే, మళ్లీ నాకు మాస్క్ పెట్టేసి, 260 00:16:53,800 --> 00:16:57,240 మార్గోతో ఉన్నట్లుగా తన శృంగార ఊహా కల్పనను కొనసాగించేవాడు. 261 00:16:59,440 --> 00:17:02,360 -అదేమీ చెడ్డ అంచనా కాదు. -నాకందులో అనుమానమేమీ లేదు. 262 00:17:02,440 --> 00:17:06,080 బహుశా దీని అంతటి గురించి మార్గో చెప్పగలదు. 263 00:17:07,520 --> 00:17:08,360 చెప్పవచ్చేమో. 264 00:17:08,440 --> 00:17:10,440 మనం వెళ్లి ఆమెతో మాట్లాడాలి. 265 00:17:10,960 --> 00:17:13,400 ఆ తరువాత మనం కాస్టానోను విచారించాలి. 266 00:17:15,440 --> 00:17:16,520 నేను లోపలకు రానా? 267 00:17:18,560 --> 00:17:20,200 -తప్పకుండా. -శుభోదయం. 268 00:17:21,200 --> 00:17:22,200 శుభోదయం. 269 00:17:22,280 --> 00:17:26,440 ఏదైనా ప్రత్యేకమైనది తినగలిగినప్పుడు అల్పాహారంగా పాతవే తినడం ఎందుకు? 270 00:17:26,520 --> 00:17:28,920 -బాగా నిద్ర పోయావా? -ఇది నా కోసమేనా? 271 00:17:29,000 --> 00:17:31,480 మార్గో, ఇది నీకు కష్టంగా ఉంటుందని తెలుసు, 272 00:17:31,560 --> 00:17:34,760 కానీ హంతకుడిని కనుగొనాలంటే, మాకు కొన్ని విషయాలు తెలియాలి. 273 00:17:34,800 --> 00:17:38,960 -అతన్ని నిన్న అరెస్ట్ చేశారుగా. -అవును, డిటెక్టివ్ కాస్టోనో ఓ అనుమానితుడు. 274 00:17:39,040 --> 00:17:42,080 అసలైన హంతకుడు ఇంకా బయటే ఉన్నాడని నాకు అర్థమైంది. 275 00:17:42,200 --> 00:17:45,400 కొన్ని వివరాలు తెలియాలి. మీ అమ్మాయిలు ప్రమాదంలో బతుకుతారా? 276 00:17:45,480 --> 00:17:48,640 మాకు తెలియాల్సిన పరిష్కరించని సమస్యలు ఏవైనా ఉన్నాయా? 277 00:17:50,400 --> 00:17:54,520 అవును, నీకు సాయం చేసేందుకు, మాకు నీ జీవితం గురించి తెలియాలి. 278 00:17:58,800 --> 00:18:01,560 నాకు ఎప్పుడూ ఏ క్లయింట్‌తోనూ వ్యక్తిగత బంధం లేదు. 279 00:18:02,320 --> 00:18:04,480 వేరే అమ్మాయిలతో కూడా. 280 00:18:04,560 --> 00:18:06,960 అయితే మిసెస్ ఎమీలియా ఎవరు? 281 00:18:07,040 --> 00:18:09,880 హౌస్ ఆఫ్ వాటర్‌కు మిసెస్ ఎమీలియా యజమాని. 282 00:18:10,720 --> 00:18:14,080 ఆవిడ మమ్మల్ని వీధుల నుంచి తెచ్చి సొంత పిల్లలలా పెంచింది. 283 00:18:14,200 --> 00:18:16,720 ఆమె మమ్మల్ని ప్రత్యేక ప్రేమికులుగా మార్చింది. 284 00:18:16,800 --> 00:18:18,680 మాకు ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది, 285 00:18:18,760 --> 00:18:21,200 లొంగదీసుకోవడానికి, ప్రేమించడానికి, 286 00:18:21,280 --> 00:18:22,680 మోసం చేయడానికి. 287 00:18:22,760 --> 00:18:25,720 అమ్మాయిల గురించి మరిన్ని వివరాలు చెప్పగలవా? 288 00:18:25,800 --> 00:18:29,800 కార్మెన్ అందరిలో పెద్దది. విన్యాసాలు చేసి, శరీరం ఎలాగైనా వంచగలదు. 289 00:18:30,440 --> 00:18:32,400 ఆమె మగవాళ్లకు పిచ్చెక్కిస్తుంది. 290 00:18:32,480 --> 00:18:33,760 ఏంజెలా... 291 00:18:33,800 --> 00:18:35,480 ఏంజెలా మనోహరమైనది. 292 00:18:36,240 --> 00:18:38,080 తను మంచంపై విశృంఖలంగా ఉంటుంది. 293 00:18:38,160 --> 00:18:40,440 మనోలి ఆధిపత్యం చూపుతుంది. 294 00:18:40,520 --> 00:18:43,440 ఇంకా ఏంజెలాది పరదేశ సౌందర్యం. 295 00:18:44,520 --> 00:18:46,800 ఆమెకు వ్యాపారం ఎలా నడపాలో బాగా తెలుసు. 296 00:18:46,880 --> 00:18:48,560 అదీ మిసెస్ ఎమీలియా అంటే. 297 00:18:48,680 --> 00:18:50,720 ఓ వ్యాపార మహిళ. 298 00:18:51,720 --> 00:18:55,760 మిగతా అన్నిటి కంటే ముఖ్యమైనది డబ్బు. మాకంటే కూడా. 299 00:18:56,520 --> 00:19:00,760 ఈ అమ్మాయిలు, మిసెస్ ఎమీలియా చనిపోయారని నీకు తెలుసు... 300 00:19:02,440 --> 00:19:04,320 ఇంకా మీ అన్నయ్య... 301 00:19:07,080 --> 00:19:08,280 మా అన్నకు ఏమైంది? 302 00:19:09,800 --> 00:19:11,080 అతను కూడా చనిపోయాడు. 303 00:19:25,960 --> 00:19:28,160 హెక్టర్, ఇంజిన్ నడుస్తూనే ఉండనీ. 304 00:19:48,280 --> 00:19:49,720 కదలకు! ఎవరక్కడ? 305 00:19:49,800 --> 00:19:51,280 పాబ్లో, నేనే! 306 00:19:51,320 --> 00:19:52,800 నన్ను భయపెట్టావు. 307 00:19:54,640 --> 00:19:57,200 నువ్వే నన్ను భయపెట్టావు! ఇక్కడ ఏం చేస్తున్నావు? 308 00:19:57,280 --> 00:19:58,320 నాకు సాయం చెయ్. 309 00:20:08,880 --> 00:20:11,400 -కాస్టానోనూ కలిసేందుకు వచ్చాను. -సరే, మంచిది. 310 00:20:11,480 --> 00:20:14,080 దీని నుంచి తప్పించుకోగలనని భావించి చొరబడ్డావు. 311 00:20:14,200 --> 00:20:17,240 నీ మాట నిజం, నా వల్ల కాదు. నా భుజం చిరిగింది. 312 00:20:17,320 --> 00:20:18,280 ఏంటి? 313 00:20:18,320 --> 00:20:19,640 -లాగు. -ఏంటి? 314 00:20:19,720 --> 00:20:22,520 నేను ఇలా కనబడతానని అనుకుంటావా? 315 00:20:22,560 --> 00:20:23,960 నిజంగా... 316 00:20:24,040 --> 00:20:25,520 నిజంగానే, నేను... 317 00:20:26,720 --> 00:20:29,640 కాస్టానోను అరెస్ట్ చేశారు. తప్పు అధికారిని పట్టారు. 318 00:20:30,480 --> 00:20:32,240 ఏంటి? మరీనా... 319 00:20:32,320 --> 00:20:36,200 మరీనా, అన్ని సాక్ష్యాలు తననే చూపుతున్నాయి. వాళ్లను పని చేయనివ్వు. 320 00:20:36,320 --> 00:20:38,920 అవును. కానీ నేనేం గమనించానంటే ఆ వివరాలు 321 00:20:39,000 --> 00:20:40,920 నా కిడ్నాప్‌తో సరిపోవడం లేదు. 322 00:20:41,000 --> 00:20:44,440 అందుకే నిన్ను కలవాల్సి వచ్చింది. ఓ క్షణం పాటు నీ సాయం కావాలి. 323 00:20:44,520 --> 00:20:45,760 ఇంకా నువ్వు చేయకపోతే, 324 00:20:45,800 --> 00:20:49,520 -నువ్వు దాచేది ఏదో ఉందని అనుకుంటాను. -అది చాలా అన్యాయం. 325 00:20:49,560 --> 00:20:53,640 నీ కారు కథ నమ్మడం కష్టం, ఇంకా క్యాబిన్‌కు ఆఖరిగా వచ్చావు. 326 00:20:54,640 --> 00:20:57,040 సరే. కానీ త్వరగా పూర్తి చెయ్. 327 00:20:57,080 --> 00:21:00,000 -నిన్ను ఒంటరిగా వదలను. -మంచిది, కాపలా కాస్తూ ఉండు. 328 00:21:02,240 --> 00:21:04,680 -చెరసాల గదులు ఎడమవైపు. -నేను పెరిగింది ఇక్కడే. 329 00:21:04,760 --> 00:21:06,080 నీకు పది నిమిషాలు ఉంది. 330 00:21:06,200 --> 00:21:08,960 -నాకు కావాల్సినది అంతే. -ఎవరైనా వస్తారేమో చూస్తాను. 331 00:21:09,040 --> 00:21:10,640 ఇది ఎంత మంచి ఆలోచనో చూశావా? 332 00:21:10,720 --> 00:21:14,200 నీ కోసం మళ్లీ నా ఉద్యోగం ప్రమాదంలో పడేయడాన్ని గ్రహించావా? 333 00:21:14,280 --> 00:21:16,800 కొంచెం ప్రమాదం కూడా లేకపోతే జీవితం ఏముంటుంది? 334 00:21:18,440 --> 00:21:19,880 మరీ నాటకీయంగా ఉంటావు. 335 00:21:23,720 --> 00:21:24,960 చివరి గది. 336 00:21:33,920 --> 00:21:35,280 నిశ్శబ్దం! 337 00:21:42,560 --> 00:21:46,040 నువ్వు తప్పు చేశావని గ్రహించే తెలివి గల దానివి. 338 00:21:46,680 --> 00:21:48,320 అది నిజం. 339 00:21:48,440 --> 00:21:50,240 ఇంకా నాకు సాయం చేసేందుకు వచ్చావు. 340 00:21:50,320 --> 00:21:52,560 నాకు నిజం చెబుతావని వచ్చాను. 341 00:21:55,680 --> 00:21:56,960 చెప్పు, కాస్టానో. 342 00:21:58,480 --> 00:22:00,680 ఎవరైనా వస్తే నేను వెళ్లిపోవాలి. 343 00:22:00,760 --> 00:22:04,320 ఇక్కడి నుంచి బయటపడే ఏకైక మార్గాన్ని పోగొట్టుకుంటావు. 344 00:22:08,280 --> 00:22:09,280 నాకు సిగరెట్ కావాలి. 345 00:22:10,240 --> 00:22:12,000 -ఇప్పుడా? -అవును. 346 00:22:13,440 --> 00:22:14,480 ఓ క్షణం ఆగు. 347 00:22:20,240 --> 00:22:21,920 -ఏంటి? -నీ సిగరెట్లు. 348 00:22:22,000 --> 00:22:24,080 -నా సిగరెట్లా? -నీ సిగరెట్ ఇలా ఇవ్వు! 349 00:22:24,160 --> 00:22:26,360 -నా సిగరెట్లా? -నువ్వు సిగరెట్ తాగవుగా. 350 00:22:26,440 --> 00:22:28,920 -ఎందుకు? -ఒకటి ఇవ్వమన్నా! చాలా ముఖ్యం! 351 00:22:29,000 --> 00:22:30,480 మెల్లగా మాట్లాడు, తగ్గించు! 352 00:22:31,880 --> 00:22:34,240 కాస్టానోకు సిగరెట్ కావాలట. 353 00:22:34,320 --> 00:22:35,440 కాస్టానో? 354 00:22:38,560 --> 00:22:40,120 కాస్టానోకు ఓ సిగరెట్. 355 00:22:41,120 --> 00:22:42,760 -కానివ్వు! -సరే. 356 00:22:44,040 --> 00:22:45,880 -ఇదుగో. -ధన్యవాదాలు. 357 00:22:45,960 --> 00:22:48,080 అతను అది అస్వాదించాలి. నీకు స్వాగతం. 358 00:22:53,640 --> 00:22:54,480 ధన్యవాదాలు. 359 00:23:01,760 --> 00:23:03,480 ఇది ఏ సంవత్సరానిది? 360 00:23:06,040 --> 00:23:09,920 కాస్టానో, నిన్ను బయటకు తేవాలంటే, నువ్వు నాకు అన్నీ చెప్పాలి. 361 00:23:10,000 --> 00:23:12,480 నీ దర్యాప్తు నేను పూర్తి చేస్తాను. 362 00:23:12,560 --> 00:23:15,000 నిజమైన కిరోగాలా మాట్లాడావు. 363 00:23:15,080 --> 00:23:18,680 నేను మీ తండ్రితో పని చేయలేదు, కానీ మీ తాతయ్యతో పని చేశాను. 364 00:23:18,760 --> 00:23:20,560 అకాడమీలో నాకు ఆయన శిక్షణ ఇచ్చారు. 365 00:23:20,640 --> 00:23:21,840 మా తాతయ్యా? 366 00:23:23,720 --> 00:23:25,280 ఆయన నాకు తండ్రి లాంటి వాడు. 367 00:23:25,360 --> 00:23:28,320 కానీ తర్వాత పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. 368 00:23:28,920 --> 00:23:30,040 నువ్వు ఏమంటున్నావు? 369 00:23:32,200 --> 00:23:34,360 నన్ను బయటకు తీసుకొస్తావా? 370 00:23:34,440 --> 00:23:36,160 నిజానికి, ఎలాగో నాకు తెలియదు. 371 00:23:39,120 --> 00:23:40,760 మార్గో ఎక్కడుంది? 372 00:23:40,840 --> 00:23:43,320 తను నాతో ఉంది. భయపడకు, తనకు ప్రమాదం లేదు. 373 00:23:43,400 --> 00:23:47,680 మార్గోకు ఎప్పుడూ ప్రమాదమే, తను నీతో ఉంటే, ఇద్దరికీ ప్రమాదమే. 374 00:23:47,760 --> 00:23:51,000 ఈ దర్యాప్తులో కీలక పురోగతి ఎలా వస్తుందో నాకు చెప్పు. 375 00:23:51,080 --> 00:23:55,880 హౌస్ ఆఫ్ వాటర్‌లో ఓ అమ్మాయి అసలైన గుర్తింపు ఏంటో ఎవరికీ తెలియదు. 376 00:23:55,960 --> 00:23:57,520 ఆమెపై దర్యాప్తు చేస్తున్నాను. 377 00:23:57,600 --> 00:23:59,920 -ఎవరి గురించి చెబుతున్నావు? -మనోలి. 378 00:24:01,400 --> 00:24:03,160 ఆమె కుటుంబం మెయిరాలో ఉంది. 379 00:24:03,240 --> 00:24:07,040 అక్కడకు ఒంటరిగా వెళ్లాలనే ఆలోచన కూడా చేయకు. అది ప్రమాదం. 380 00:24:07,120 --> 00:24:09,880 మనకు సాయం చేయగలిగేది ఆమె చెల్లెలు మాత్రమే. 381 00:24:09,960 --> 00:24:10,800 మరీనా! 382 00:24:10,880 --> 00:24:13,680 ఈ స్టేషన్లో ఎవరూ కనిపిస్తున్నట్టు ఉండరు. 383 00:24:13,760 --> 00:24:16,640 నీ చుట్టూ జరిగేవాటిపై చాలా అప్రమత్తంగా ఉండు. 384 00:24:18,440 --> 00:24:19,800 మరీనా. 385 00:24:21,080 --> 00:24:22,680 మనం వెళ్లాలి. 386 00:24:24,200 --> 00:24:25,080 ఎవరూ ఉండరు. 387 00:24:31,560 --> 00:24:33,440 వెళదాం పద, దయచేసి, రా. 388 00:24:39,920 --> 00:24:42,680 -అతనేం చెప్పాడు? -ఎవరూ వారు కనిపిస్తున్నట్టు ఉండరు. 389 00:24:43,520 --> 00:24:46,160 -గొప్ప విషయం చెప్పాడు. -నీ దగ్గర వివరాలేంటి? 390 00:24:46,240 --> 00:24:48,360 తను ఆర్టురో! ఇలా రా. తను ఆర్టురో. 391 00:24:48,440 --> 00:24:51,160 -అది వాళ్లు కాదు. -వాళ్లు ఎక్కడున్నారు? 392 00:24:51,240 --> 00:24:52,840 లోపలకు పద. రా. 393 00:24:52,920 --> 00:24:54,920 -అది అలమరా! -మనకు మరో దారి లేదు! 394 00:24:58,480 --> 00:25:02,440 కమిషనర్, అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడని చెప్పారు. 395 00:25:03,600 --> 00:25:05,200 నాకు వెంటనే ఎందుకు చెప్పలేదు? 396 00:25:05,280 --> 00:25:08,200 మన్నించండి, కమిషనర్, నాకిప్పుడే తెలిసింది. 397 00:25:14,360 --> 00:25:15,680 వెళదాం పద. 398 00:25:15,760 --> 00:25:17,920 రమ్మంటున్నా! 399 00:25:29,840 --> 00:25:31,040 ధన్యవాదాలు. 400 00:25:31,960 --> 00:25:33,560 అంతా బాగానే జరిగిందా? 401 00:25:33,640 --> 00:25:35,680 -మనం మెయిరాకు వెళ్లాలి. -ఏంటి? 402 00:25:35,760 --> 00:25:39,080 మార్గో బట్టలు చాకలి దగ్గరకు తీసుకెళ్లలేదని చెప్పు. 403 00:25:44,200 --> 00:25:47,560 నిజంగా చెబుతున్నా. మా అన్న ఎవరినో కాపాడుతూ ఉండవచ్చు. 404 00:25:47,640 --> 00:25:50,280 ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. 405 00:25:50,360 --> 00:25:52,880 తన నిశ్శబ్దం కోసమే పదోన్నతి పొందాడా? 406 00:25:52,960 --> 00:25:56,160 నువ్వు, మీ అన్నయ్య పోలీస్ కమిషనర్ కుటుంబం నుంచి వచ్చారు. 407 00:25:56,240 --> 00:25:59,840 -ఆర్టురో విషయంలో కొత్తేమీ కాదు... -మనం దీనితో గుడ్డిగా ఉండకూడదు. 408 00:25:59,920 --> 00:26:02,440 ఇంతకీ, ఇప్పుడు దీని గురించి ఆలోచన ఎందుకు? 409 00:26:02,520 --> 00:26:06,080 మన చుట్టూ జరిగే అన్నిటిపై అప్రమత్తంగా ఉండాలి. కాస్టానో చెప్పినట్లు. 410 00:26:06,160 --> 00:26:10,520 తను చెప్పినదానిలో అర్థం ఏదో నిశ్చితంగా ఉందని తెలుసు. ఆ "ఏదో" ఏదైనా కావచ్చు. 411 00:26:20,240 --> 00:26:23,040 -మనం ఇది పథకం వేశాం అనుకుంటారు. -అవును. 412 00:26:23,120 --> 00:26:24,760 బూట్లు కూడా నా సైజువి కావు. 413 00:26:24,840 --> 00:26:27,680 సరే, అవి కాస్త పాతవి. 414 00:26:27,760 --> 00:26:29,960 సరే, అవి సౌకర్యంగా కూడా లేవు. 415 00:26:30,960 --> 00:26:32,480 అదే అయ్యుండాలి. 416 00:26:32,560 --> 00:26:36,640 గుర్తుంచుకో, మనోలి ఓ చిన్ననాటి నేస్తం, నువ్వు నా మామయ్యవు. 417 00:26:39,440 --> 00:26:42,880 హలో. మేము మనోలి తల్లిదండ్రులను వెతుకుతున్నాం. 418 00:26:43,640 --> 00:26:44,720 పాకో! 419 00:26:57,560 --> 00:26:58,440 హలో. 420 00:26:58,520 --> 00:27:00,000 మీరు ఇక్కడేం చేస్తున్నారు? 421 00:27:01,640 --> 00:27:05,320 నా పేరు పకీతా. ఈయన మా మామయ్య బర్తోలో. 422 00:27:06,000 --> 00:27:07,560 గతంలో మెయిరాలో ఉన్నాము, 423 00:27:07,640 --> 00:27:09,840 చిన్నప్పుడు మనోలి నా స్నేహితురాలు. 424 00:27:09,920 --> 00:27:12,000 నిన్ను ఇక్కడ చూసిన గుర్తు నాకు లేదు. 425 00:27:12,080 --> 00:27:14,040 నాకు అతను కూడా గుర్తు లేడు, 426 00:27:14,120 --> 00:27:16,680 బహుశా మనం ఇంకా సరైన సమయంలో రావాలి... 427 00:27:16,760 --> 00:27:19,960 మేము మనోలి చావుకు బాధ్యుడైన వ్యక్తిని వెతకాలి. 428 00:27:20,040 --> 00:27:21,920 అందుకు మీ సహకారం కావాలి. 429 00:27:22,000 --> 00:27:24,000 ఇక్కడ ఏ సహకారం దొరకదు. 430 00:27:24,520 --> 00:27:28,000 మీ అనుబంధం సంక్లిష్టమని మాకు తెలుసు కానీ చావు అనేది... 431 00:27:28,080 --> 00:27:31,080 -నువ్వు ఎవరని అనుకుంటున్నావు? -చూడండి... 432 00:27:31,720 --> 00:27:33,800 మనోలికి తగిన శాస్తి జరిగింది. 433 00:27:33,880 --> 00:27:37,960 ధనికుల కోసం ఆ వేశ్యాగృహంలో పని చేసి తను కుటుంబ పేరు చెడగొట్టింది. 434 00:27:42,880 --> 00:27:44,440 -లేదు... -దీనిని చంపు. 435 00:27:44,520 --> 00:27:45,440 ఏంటి? 436 00:27:45,520 --> 00:27:48,600 నా మాట విన్నావుగా! ఈ కోడి మెడ విరువు. 437 00:27:57,960 --> 00:28:00,640 నా వల్ల కాదు, మిస్! నా వల్ల కాదు. 438 00:28:05,200 --> 00:28:09,560 ఇక్కడి వ్యక్తులు ఎవరైనా అయితే ఆ కోడి మెడ కొరికేసేవారు. 439 00:28:09,640 --> 00:28:13,080 అసలు నువ్వెవరు? ఎందుకు ఇక్కడకు వచ్చావు? 440 00:28:13,160 --> 00:28:17,480 నిజంగా, మాకు మనోలి హంతకుడు ఎవరో తెలియాలంతే. అది నిజం. 441 00:28:19,800 --> 00:28:21,640 ఇక్కడి నుంచి వెళ్లిపోండి. పొండి! 442 00:28:22,480 --> 00:28:25,000 -బయటకు పొండి! -సరే. వెళదాం పద. 443 00:28:32,200 --> 00:28:34,080 మనల్ని చంపినంత పని చేశావు. 444 00:28:34,160 --> 00:28:36,800 మనం ప్రమాదకర చోట్లకు వెళ్లలేము. 445 00:28:38,240 --> 00:28:41,920 మనం జగజ్జేతల మాదిరిగా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లిపోకూడదు. 446 00:28:42,760 --> 00:28:44,720 మనం హంతకుడి గురించి మాట్లాడుతున్నాం, 447 00:28:44,800 --> 00:28:48,840 -అతని చుట్టూ ప్రతిదీ ప్రమాదమే! -నా వెనుక రా. ఇటు వైపు. 448 00:28:49,680 --> 00:28:51,640 -ఏంటి? -నాకు తెలియదు. 449 00:28:52,560 --> 00:28:53,960 నేనిక్కడే ఎదురుచూస్తా. 450 00:28:54,480 --> 00:28:55,600 ఇది తీసుకో. 451 00:28:56,440 --> 00:28:58,480 నా పేరు రాయ్, మనోలి చెల్లెలిని. 452 00:28:58,560 --> 00:29:00,920 తను చనిపోయే కొన్ని రోజుల ముందు ఈ లేఖ వచ్చింది. 453 00:29:01,000 --> 00:29:04,240 ఆమెతో సంప్రదింపులో ఉన్నది నేనొక్కదాన్నే. మా నాన్నను కలిశావు. 454 00:29:04,320 --> 00:29:06,000 న్యాయం జరగాలని నా కోరిక. 455 00:29:06,080 --> 00:29:08,600 "ప్రియమైన, రాయ్, నిన్ను తీసుకెళ్లేందుకు వస్తాను. 456 00:29:08,680 --> 00:29:10,760 ఓ పెద్ద క్లయింట్ గుర్తింపు కనుగొన్నాను. 457 00:29:10,840 --> 00:29:12,640 ఆ విషయం బయటపడకుండా, అతనిచ్చే డబ్బుతో 458 00:29:12,720 --> 00:29:14,440 మనిద్దరం కొత్త జీవితం ఆరంభించగలం." 459 00:29:14,520 --> 00:29:17,040 ఆమె జీవితం ఇలా ముగియకూడదు. 460 00:29:17,120 --> 00:29:18,240 ధన్యవాదాలు, రాయ్. 461 00:29:22,800 --> 00:29:24,640 -నీ తల చూసుకో. -పద. 462 00:29:26,520 --> 00:29:29,560 బెదిరింపు! తనను బెదిరించిందని అతను ఆమెను చంపాడు. 463 00:29:32,840 --> 00:29:35,760 మన దగ్గర ఇంకేదో ఉందని నా ఆలోచన. 464 00:29:35,840 --> 00:29:36,680 కొత్త క్లూ. 465 00:29:36,760 --> 00:29:37,760 మనోలి కార్టాయ్ 75, టోలెడో వీధి 466 00:29:37,840 --> 00:29:40,520 మరో జన్మలో నువ్వు గొప్ప పోలీసు అధికారివి. 467 00:29:40,600 --> 00:29:44,160 -అది నాకు గుర్తు లేకపోవడం సిగ్గు చేటు. -పద, మనకు సమయం లేదు. 468 00:29:49,080 --> 00:29:51,880 జాగ్రత్త, ఎవరైనా ఉండి ఉండవచ్చు. 469 00:29:52,600 --> 00:29:54,840 పొరపాటున వేరే ఇంటిలోకి వచ్చామని చెబుదాం. 470 00:30:16,000 --> 00:30:18,600 -చూడు. -మనోలి ఇక్కడ వేరే ఎవరితోనో ఉంది. 471 00:30:18,680 --> 00:30:21,640 మనకు ఫోటో దొరికితే మాత్రమే... 472 00:30:27,000 --> 00:30:30,840 "నల్లని దుస్తులు ధరించి నా బాహువులలో ఉండి ఆమె ఏడిచింది. 473 00:30:30,920 --> 00:30:33,440 "ఆమె హృదయ స్పందనలు వినబడతాయి. 474 00:30:33,520 --> 00:30:36,760 "ఆమె ముంగురుల ఒంపులు తన మెడను దాచేశాయి. 475 00:30:36,840 --> 00:30:39,680 "తను భయం, ప్రేమతో మునిగిపోయింది." 476 00:30:43,240 --> 00:30:44,640 దేవుడా. 477 00:30:47,400 --> 00:30:49,720 హెక్టర్, ఇలా రా, ఇది చూడు. 478 00:30:58,720 --> 00:31:00,080 ఓరి దేవుడా! 479 00:31:01,040 --> 00:31:02,480 ఎంత ఘోరం. 480 00:31:03,320 --> 00:31:05,680 ఇది చూడు, మిస్. చూడు. 481 00:31:08,520 --> 00:31:12,280 ఇది కాలి అడుగులా ఉంది. తాజా రక్తంపై ఎవరో కాలు వేశారు. 482 00:31:12,880 --> 00:31:14,040 ఓసారి ఆగు. 483 00:31:22,320 --> 00:31:24,440 ఇది ఎలా ఉందో చూశావా? 484 00:31:25,240 --> 00:31:28,400 -ఓ అమ్మాయి పాదముద్రలా ఉంది. -నీ కాలు దానిపై ఉంచు. 485 00:31:32,200 --> 00:31:33,400 మార్గో! 486 00:31:33,480 --> 00:31:36,560 మనోలిని చంపిన రోజున మార్గో ఇక్కడకు వచ్చింది! 487 00:31:36,640 --> 00:31:37,600 మనతో అబద్ధమాడింది! 488 00:31:48,760 --> 00:31:49,600 ఓరి దేవుడా. 489 00:31:49,680 --> 00:31:52,320 -మర్కియోనెస్. -మనం సమస్యలో పడ్డాం. 490 00:31:54,080 --> 00:31:55,920 మనం చూద్దాం. శుభ సాయంత్రం. 491 00:31:56,280 --> 00:31:57,400 హలో! 492 00:31:57,640 --> 00:31:59,200 స్వాగతం! 493 00:31:59,280 --> 00:32:01,160 నిన్ను కలవడం చాలా ఆనందం. 494 00:32:01,240 --> 00:32:03,280 సుస్వాగతం. హలో! 495 00:32:03,800 --> 00:32:05,800 హలో, శుభ సాయంత్రం. 496 00:32:05,880 --> 00:32:08,200 -హలో! -మర్కియోనెస్, అభినందనలు. 497 00:32:08,280 --> 00:32:09,520 అమ్మా. 498 00:32:11,240 --> 00:32:13,560 -మరీనా కిరోగా... -మరీనా, ఎలా... 499 00:32:13,640 --> 00:32:15,680 చాలా విభిన్నంగా కనబడుతున్నావు. 500 00:32:15,760 --> 00:32:18,440 అవును, తను ఓ ప్రదర్శన కోసం వేషం వేసింది. 501 00:32:19,200 --> 00:32:21,440 -ప్రదర్శనా? -అవును. 502 00:32:21,520 --> 00:32:22,760 పురి ఎక్కడుంది? 503 00:32:22,840 --> 00:32:25,400 -అది నిజమే, పురి ఎక్కడుంది? -పురి ఎక్కడుంది? 504 00:32:25,480 --> 00:32:26,960 నీకు ప్రదర్శన ఇష్టమా? 505 00:32:27,040 --> 00:32:29,600 ఇలాంటి కార్యక్రమాలకు అవి బాగుంటాయని అనిపించింది. 506 00:32:29,680 --> 00:32:32,280 మీరు ఓసారి తప్పుకుంటే, నా స్నేహితురాలని వెతుకుతా. 507 00:32:32,360 --> 00:32:33,760 మరీనా! 508 00:32:34,640 --> 00:32:36,920 దయచేసి హెక్టర్, బట్టలు మార్చమని చెప్పు. 509 00:32:37,000 --> 00:32:38,160 తప్పకుండా. 510 00:32:42,240 --> 00:32:44,760 ఆగు. నీ డ్రెస్ మార్చుకోవాలి. 511 00:32:44,840 --> 00:32:47,440 మనం ఓ మిషన్‌లో ఉన్నాం వియెన్నా ఒపెరా హౌస్‌లో కాదు. 512 00:32:47,520 --> 00:32:48,520 అదుగో అక్కడుంది. 513 00:32:48,600 --> 00:32:51,560 ఆమె రాబర్టో లౌజాన్ లోపెజ్ డె జునీగాతో ఉంది. 514 00:32:52,480 --> 00:32:54,920 -పురి. ఓసారి చూడు. -మరీనా. 515 00:32:55,000 --> 00:32:56,200 నేను-- 516 00:32:56,680 --> 00:32:59,720 -నా బట్టలు ఎందుకు వేసుకున్నావు? -ద డ్యూక్ ఆఫ్ సోటోమయర్. 517 00:32:59,800 --> 00:33:02,960 -మిస్ మరీనా. కలిసి చాలా కాలమైంది. -ఎంతో చక్కని కలయిక. 518 00:33:03,040 --> 00:33:06,320 -పురి, నీతో ఓ నిమిషం మాట్లాడవచ్చా? -కానీ నేను ఆనందం-- 519 00:33:06,400 --> 00:33:09,440 మేము ఇప్పుడే 55, టోలెడో వీధి నుంచి వచ్చాం, 520 00:33:09,520 --> 00:33:11,440 -నా ఆలోచనలో ఇదే సమయం-- -ఏమీ అనుకోకండి, 521 00:33:11,520 --> 00:33:13,400 పౌడర్ రూమ్‌కు వెళ్లాలి. మన్నించండి. 522 00:33:13,480 --> 00:33:14,360 -మరీనా... -మార్... 523 00:33:14,440 --> 00:33:16,520 గతేడాది ఇక్కడ పార్టీ గుర్తుందా? 524 00:33:16,600 --> 00:33:18,800 -మనం తర్వాత మాట్లాడదాం, ధన్యవాదాలు. -మరీనా! 525 00:33:18,880 --> 00:33:20,160 మన్నించండి. 526 00:33:25,360 --> 00:33:26,480 సారీ. తప్పుకోండి! 527 00:33:26,560 --> 00:33:27,960 తప్పుకోండి! మన్నించండి! 528 00:33:28,040 --> 00:33:30,480 -వెళ్లనివ్వండి. మన్నించండి! -తప్పుకోండి! 529 00:33:30,560 --> 00:33:31,880 వెళ్లనీయండి. మన్నించండి. 530 00:33:31,960 --> 00:33:34,600 -మన్నించండి! -తప్పుకోండి! 531 00:33:34,680 --> 00:33:35,960 -మన్నించండి! -మన్నించండి! 532 00:33:37,280 --> 00:33:39,360 ఎవరూ కదలకండి, మేము పోలీసులం! 533 00:33:41,720 --> 00:33:43,200 ఆ ముష్టిదాని దగ్గర తుపాకీ! 534 00:33:44,920 --> 00:33:46,120 నా మీద నుండి లెగు! 535 00:33:48,520 --> 00:33:51,680 ఇది ఎలాంటి ప్రదర్శన, మరీనా? మరీనా ఎక్కడ? 536 00:33:52,440 --> 00:33:54,600 ఆమెను వదులు! 537 00:34:34,160 --> 00:34:37,440 -ఎంతో అందంగా ఉంది! -ఎంత అందంగా ఉందో చూడు. 538 00:34:42,120 --> 00:34:43,960 మార్గో, మార్గో అక్కడ ఉంది! 539 00:34:44,880 --> 00:34:46,360 వంటగదిలో! 540 00:34:48,600 --> 00:34:50,160 నాకు అది నచ్చింది! 541 00:34:56,400 --> 00:34:58,800 మార్గో! ఎలాంటి పిచ్చి పని చేయకు. 542 00:34:58,920 --> 00:35:00,760 తుపాకీ పడెయ్, లేదా ఈమెను చంపేస్తా. 543 00:35:01,200 --> 00:35:02,840 అలాగే. 544 00:35:02,920 --> 00:35:04,200 చూడు. 545 00:35:07,400 --> 00:35:08,600 పెట్టేశా. 546 00:35:08,640 --> 00:35:10,840 నన్ను వెళ్లనివ్వు, ఆమెకు ఏమీ జరగదు. 547 00:35:10,920 --> 00:35:14,520 విను. నువ్వెందుకు పారిపోతున్నావో చెబితే నీకు ఏమీ జరగదు. 548 00:35:17,160 --> 00:35:19,360 మనోలి హత్యతో నీకేంటి సంబంధం? 549 00:35:20,160 --> 00:35:22,480 నీకు సాయం చేయాలనే ప్రయత్నిస్తున్నాం. 550 00:35:22,560 --> 00:35:24,880 మేము నీ వైపే ఉన్నామని నిరూపించుకున్నాం. 551 00:35:24,960 --> 00:35:27,640 మాకెందుకు అబద్ధం చెప్పావు? అక్కడెందుకు ఉన్నావు? 552 00:35:29,160 --> 00:35:31,880 దయచేసి, మమ్మల్ని నమ్ము. 553 00:35:32,640 --> 00:35:34,520 మేమంతా నీతో ఉంటాం. 554 00:35:37,160 --> 00:35:38,400 మార్గో... 555 00:35:46,040 --> 00:35:48,400 నా జీవిత ప్రేమను చంపుకున్నాను. 556 00:36:00,360 --> 00:36:02,400 మనోలి, నేను పరస్పరం ప్రేమించుకున్నాం. 557 00:36:03,400 --> 00:36:04,760 రహస్యంగా. 558 00:36:06,760 --> 00:36:08,960 కానీ మనోలి స్వేచ్ఛ కోరుకుంది. 559 00:36:09,560 --> 00:36:12,120 అమెరికాలో అన్నీ సాధ్యమని ఆమె చెప్పింది. 560 00:36:15,680 --> 00:36:19,640 ఆమె ఎవరిని బెదిరించి డబ్బు గుంజాలని చూసిందో నాకు తెలియదు. 561 00:36:22,640 --> 00:36:26,440 కానీ ఓ క్లయింట్ గుర్తింపు కనిపెట్టిందని 562 00:36:26,520 --> 00:36:29,440 మాట్లాడకుండా ఉండేందుకు డబ్బు అడిగిందని తెలుసు. 563 00:36:32,640 --> 00:36:35,640 మా ఇంటిలో సా 7:00 గంటలకు కలవాలని నిర్ణయించారు. 564 00:36:36,920 --> 00:36:39,280 మా ఇంటి ముందు బెంచీ మీద ఎదురుచూశాను, 565 00:36:39,360 --> 00:36:41,280 ఆమె సిగ్నల్ ఇస్తుందేమోనని. 566 00:36:43,920 --> 00:36:46,880 ఎందుకంటే ఏదైనా తేడా జరిగిందంటే 567 00:36:47,920 --> 00:36:49,680 నేను వెళ్లి తనను కాపాడాలని. 568 00:36:50,640 --> 00:36:53,160 కానీ నేను వెళ్లలేదు ఎందుకంటే... 569 00:36:54,040 --> 00:36:58,160 నా సూట్‌కేసులను సర్దుతుండగా మిసెస్ ఎమీలియా నన్ను చూసింది. 570 00:37:01,680 --> 00:37:04,080 నేను ఇంటికి వెళ్లేసరికి, 571 00:37:05,160 --> 00:37:07,280 ఆమె నేలపై పడి ఉంది, 572 00:37:08,560 --> 00:37:10,560 చుట్టూ అంతా రక్తమే. 573 00:37:18,600 --> 00:37:19,600 నేనే తనను చంపాను. 574 00:37:21,080 --> 00:37:22,840 తనను ఒంటరిగా వదిలేశాను. 575 00:37:25,640 --> 00:37:28,600 ఇది నా తప్పు. నేనే చంపాను. 576 00:37:33,080 --> 00:37:34,920 నా ప్రేమ... 577 00:37:38,400 --> 00:37:40,520 పర్వాలేదు. నీకు ఏమీ జరగదు. 578 00:37:40,600 --> 00:37:42,320 నేను అన్నీ చూసుకుంటాను. 579 00:37:45,520 --> 00:37:49,200 ఆమె పోలీసులకు దూరంగా ఉండడం తనకు మంచిది. 580 00:37:50,080 --> 00:37:51,520 నేనా సంగతి చూసుకుంటాను. 581 00:37:55,360 --> 00:37:58,480 నన్ను బలంగా కొడితే, మెట్ల కిందకు వచ్చి పడ్డాను. 582 00:37:58,560 --> 00:38:01,600 నా ముత్యాల హారం తెగిపోయి పడిపోయింది. 583 00:38:01,640 --> 00:38:05,120 అది కౌంటెస్ ఆఫ్ ఫిఫినేన్స్. అది రాసుకోండి, ఆఫీసర్. 584 00:38:05,160 --> 00:38:08,320 జరిగిన దానిలో అంతా నా తప్పే. అరెస్ట్ చెయ్, డిటెక్టివ్. 585 00:38:08,400 --> 00:38:10,200 మిస్ కిరోగా. 586 00:38:10,320 --> 00:38:12,800 అలా చెప్పడం ఆపు, లేదా నేనే అరెస్ట్ చేయాలి. 587 00:38:12,880 --> 00:38:14,400 నువ్వు చేయాల్సిన పని అదే. 588 00:38:14,480 --> 00:38:17,320 నా ఊహ నాకు వ్యతిరేకంగా మారుతుందని నీకు తెలుసు. 589 00:38:17,400 --> 00:38:20,680 నువ్వు నేరస్తురాలిని కనుగొన్నానని మిగతావాళ్లకు చెప్పు. 590 00:38:20,800 --> 00:38:22,840 మా ఇంటి నుండి పోలీసులను పంపించెయ్. 591 00:38:22,920 --> 00:38:25,680 మా అమ్మకు ఇకపై భంగం కలిగించరాదని నిర్ణయించుకున్నాను. 592 00:38:27,400 --> 00:38:28,520 సరే అయితే. 593 00:38:37,440 --> 00:38:38,520 అదుగో. 594 00:38:38,600 --> 00:38:41,960 నా సహోద్యోగులకు చెబుతాను. మొదటి కారులో నాకోసం ఎదురుచూడు. 595 00:39:01,360 --> 00:39:02,840 పాబ్లో! 596 00:39:02,920 --> 00:39:04,680 ఇక్కడినుండి వెళ్లిపోదాం. 597 00:39:34,960 --> 00:39:39,760 ఎ ప్రైవేట్ ఎఫైర్ ఎపిసోడ్ 6: ఆఖరి అమ్మాయి 598 00:41:45,600 --> 00:41:47,600 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల 599 00:41:47,640 --> 00:41:49,640 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్