1 00:00:12,012 --> 00:00:13,013 హేయ్. 2 00:00:15,015 --> 00:00:16,015 జేసన్. 3 00:00:18,268 --> 00:00:19,269 జేసన్. 4 00:00:20,270 --> 00:00:21,522 జేసన్. 5 00:00:23,232 --> 00:00:24,608 లేచే ఉన్నావా? 6 00:00:25,108 --> 00:00:26,485 - ఏంటి? - లేదు, నేను… 7 00:00:26,568 --> 00:00:27,569 నేను… వెళ్తున్నాను. 8 00:00:29,196 --> 00:00:31,281 పనికి వెళ్ళడానికి ముందు నిన్ను చూడాలి అనుకున్నా అంతే. 9 00:00:31,365 --> 00:00:33,659 ఎందుకు? నన్ను అస్తమాను చూస్తూనే ఉంటావు కదా. 10 00:00:35,077 --> 00:00:36,119 సరే, ఇక పడుకో. 11 00:00:36,203 --> 00:00:37,871 సరే. నేను పడుకుంటా. 12 00:00:40,958 --> 00:00:43,544 మేము ఇవాళ ఆఫీస్ లో లేటెస్ట్ సేల్స్ డేటా మొత్తం చూస్తున్నాం. 13 00:00:44,628 --> 00:00:46,421 హోండురాస్18% పెరిగింది. 14 00:00:46,922 --> 00:00:48,215 హోండురాస్ నా ఐడియానే. 15 00:00:48,298 --> 00:00:49,299 అది మంచి విషయమా? 16 00:00:49,383 --> 00:00:51,051 అవును, చెప్పాను కదా. 17 00:00:51,552 --> 00:00:54,263 జనాన్ని సెలవులకు అక్కడికి పంపడం చాలా కష్టం. 18 00:00:54,346 --> 00:00:55,597 అక్కడ చాలా హత్యలు జరుగుతాయి. 19 00:00:55,681 --> 00:00:57,015 - భలే. గొప్ప విషయం. - భలే. 20 00:01:03,981 --> 00:01:06,984 నా కొత్త ఉద్యోగం కోసం ఇలా పొద్దున్నే వెళ్లడం నాకు నచ్చడం లేదు. 21 00:01:08,026 --> 00:01:10,070 మీతో కలిసి ఉదయం గడపడం మిస్ అవుతున్నాను. 22 00:01:11,446 --> 00:01:14,199 పిల్లలు ఒక గంట ముందే నిద్ర లేవడానికి ఒప్పుకుంటారు అనుకుంటున్నావా? 23 00:01:14,283 --> 00:01:16,118 ఆ ఐడియాకి ఒప్పుకుంటారని అనిపించడం లేదు. 24 00:01:16,201 --> 00:01:18,912 ఇప్పుడు క్యాట్ ఇక్కడికి తరచుగా వస్తోంది కాబట్టి ప్రిన్సెస్ ఇంకా టైలర్ కి 25 00:01:18,996 --> 00:01:21,748 మనది ఒక బలమైన కుటుంబం అని తెలిసేలా చేయడం ఇంకా ముఖ్యం అనిపిస్తోంది. 26 00:01:21,832 --> 00:01:22,958 చూడు, మనం ఇది మాట్లాడుకున్నాం. 27 00:01:23,750 --> 00:01:25,794 ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురయ్యేవరకు అదంతా తలచుకుని భయపడకు. 28 00:01:25,878 --> 00:01:27,254 - సరేనా? - సరే. 29 00:01:32,509 --> 00:01:33,635 రాత్రికి పిజ్జా తిందామా? 30 00:01:33,719 --> 00:01:35,596 - మనం నలుగురిమే? మనకు పిజ్జా ఇష్టం కదా. - నిక్… సరే. 31 00:01:35,679 --> 00:01:37,389 - నేను మేనేజ్ చేస్తాలే, సరే. - సరే, మంచిది. 32 00:01:37,472 --> 00:01:39,183 - ఇక నువ్వు పడుకో. - బై. 33 00:01:54,072 --> 00:01:55,407 కామ్డెన్ లాక్ 34 00:02:17,513 --> 00:02:18,931 నువ్వు ఇంకా ఎందుకు రోవ్ చేస్తున్నావు? 35 00:02:19,014 --> 00:02:21,308 అంటే, అమెరికాకి బక్క చేతులతో వెళ్ళలేను కదా. 36 00:02:21,892 --> 00:02:24,394 నా చేతులు నిజంగానే అట్లాంటిక్ లో తెడ్డు వేసినట్టు కనిపించాలి. 37 00:02:25,229 --> 00:02:26,480 - ఇదుగో. - థాంక్స్. 38 00:02:26,563 --> 00:02:28,106 ప్రోటీన్ షేక్ ఇంకా స్రాంబుల్డ్ గుడ్డు పొడి. 39 00:02:28,190 --> 00:02:30,108 మరొక 15 నిమిషాలలో తీసుకుంటా. 40 00:02:30,192 --> 00:02:31,735 ఇవాళ ఒక్క మైలు మాత్రమే కవర్ చేశా. 41 00:02:31,818 --> 00:02:33,320 కానీ నువ్వు చాలా గంటలుగా తెడ్డు వేస్తున్నావు. 42 00:02:33,403 --> 00:02:35,072 బలమైన ఎదురుగాలి నన్ను వెనక్కి పంపేసింది. 43 00:02:35,906 --> 00:02:37,491 - ఏంటి? - నేను ఇప్పుడు ఉండాల్సిన ప్రదేశంలో 44 00:02:37,574 --> 00:02:39,493 బలమైన ఎదురుగాలి వీస్తోంది. అజోర్స్ తీరానికి దగ్గరలో. 45 00:02:39,576 --> 00:02:40,869 ఉత్తర అట్లాంటిక్ సముద్రం 46 00:02:41,537 --> 00:02:43,330 కానీ, స్కాట్, నువ్వు అక్కడ లేవు కదా. 47 00:02:43,413 --> 00:02:44,456 నాకు తెలుసు. 48 00:02:44,540 --> 00:02:45,832 నేను వీలైనంత నిజంగా అట్లాంటిక్ సముద్రం 49 00:02:45,916 --> 00:02:48,544 దాటినట్టు అనిపిస్తేనే అబద్ధం చెప్పేటప్పుడు నాకు కొంచెం నమ్మకంగా ఉంటుంది. 50 00:02:50,379 --> 00:02:51,380 అది ఎవరు? 51 00:02:51,922 --> 00:02:52,923 నాడ్యకి రావొద్దు అని చెప్పడం మర్చిపోయా. 52 00:02:53,006 --> 00:02:55,717 సరే, నువ్వు ఇక్కడే ఉండు లేదంటే ఆమె నిన్ను చూస్తుంది. 53 00:02:56,969 --> 00:02:58,345 నిశ్శబ్దంగా తెడ్డు వెయ్. 54 00:02:58,428 --> 00:02:59,805 హలో? 55 00:03:03,058 --> 00:03:04,268 హాయ్, నాడ్య. 56 00:03:04,351 --> 00:03:06,603 ఇవాళ్టికి వద్దులే. ఇవాళ శుభ్రం చేయాల్సింది ఏం లేదు. 57 00:03:06,687 --> 00:03:08,188 ఎందుకు? నేను సరిగ్గా శుభ్రం చేయడం లేదా? 58 00:03:08,272 --> 00:03:10,732 నేను… ఈ వారం నేను శుభ్రం చేస్తున్నాను. 59 00:03:12,609 --> 00:03:14,987 నువ్వు విక్టర్ కోక్ల్యూష్కిన్ లాగ భలే జోకులు వేస్తున్నావు. 60 00:03:15,070 --> 00:03:17,406 - అతను ఎవరో నాకు తెలీదు. - చాలా తమాషా మనిషి. 61 00:03:17,489 --> 00:03:19,658 ప్రభుత్వం మీద సెటైర్లు వేస్తుంటాడు. 62 00:03:19,741 --> 00:03:21,159 అతని ఆత్మకి శాంతి కలగాలి. 63 00:03:22,411 --> 00:03:23,829 స్టీవి గురించి అంటున్నా. 64 00:03:23,912 --> 00:03:25,080 దానికి ఆరోగ్యం బాలేదు. 65 00:03:25,163 --> 00:03:26,415 నా చిట్టి కొండకా? 66 00:03:26,999 --> 00:03:28,125 స్టీవి… 67 00:03:28,208 --> 00:03:29,793 దానికి అంటువ్యాధి సోకింది. 68 00:03:29,877 --> 00:03:31,295 ఏం పర్లేదు. నేను తనని చూస్తా. 69 00:03:31,378 --> 00:03:33,380 స్టీవి, నీకు ఐస్ స్నానం చేయిస్తాను. 70 00:03:33,463 --> 00:03:34,840 అది పడుకుంది. 71 00:03:34,923 --> 00:03:36,800 హోవర్ శబ్దం వింటే నిద్ర లేచిపోతుంది. 72 00:03:36,884 --> 00:03:38,844 నేను చేతులతో దుమ్ము తీస్తాలే. 73 00:03:38,927 --> 00:03:40,971 కాదు, నాడ్య. అదేం అవసరం లేదు. 74 00:03:41,054 --> 00:03:42,931 అది కోలుకున్న తర్వాత నేను నీకు కాల్ చేస్తా. 75 00:03:44,099 --> 00:03:45,100 నా జీతం కొయ్యవు కదా? 76 00:03:46,643 --> 00:03:48,312 లేదు, నీ జీతం తగ్గించను. 77 00:03:49,271 --> 00:03:50,272 సరే. 78 00:03:58,697 --> 00:04:00,574 అందరూ వాళ్ళ తిండికి స్టిక్కర్లు ఎందుకు పెడుతున్నారు? 79 00:04:01,283 --> 00:04:02,409 తహీని. 80 00:04:02,993 --> 00:04:04,786 నేనేం నీ తాహీనిని తీసేసుకోను. 81 00:04:04,870 --> 00:04:06,496 ఆశ్చర్యార్థకాలు కూడా రాసారు. 82 00:04:07,497 --> 00:04:08,665 ఇంకా హోండురాస్ విషయం నమ్మలేకపోతున్నా. 83 00:04:08,749 --> 00:04:10,250 అద్భుతమైన పని చేసావు. 84 00:04:10,918 --> 00:04:11,919 థాంక్స్. 85 00:04:12,836 --> 00:04:14,213 ఏదో కొంచెం పెరిగింది అంతే. 86 00:04:14,880 --> 00:04:15,923 లేదు, బాగా అదరగొట్టావు. 87 00:04:16,005 --> 00:04:17,673 చాలా హత్యలు జరిగే చోటు. 88 00:04:19,551 --> 00:04:21,595 మేము ఆ సిటీలని "సందడిగా ఉండే నగరాలు" అన్నాం. 89 00:04:21,678 --> 00:04:24,056 మన ఇండస్ట్రీలో ఆ పదానికి అర్థం "బోలెడన్ని హత్యలు" అంట. 90 00:04:24,598 --> 00:04:26,850 నిజం చెప్పాలంటే, అక్కడి మాయన్ శిథిలాలు చాలా బాగుంటాయి. 91 00:04:26,934 --> 00:04:27,935 సోజోర్న ట్రావెల్ 92 00:04:28,018 --> 00:04:29,019 నువ్వు… అక్కడికి వెళ్ళావా? 93 00:04:29,978 --> 00:04:34,733 నేను మెక్సికోలో ఒక పాత జీప్ ని తిరిగి నిర్మించి సెంట్రల్ అమెరికా మొత్తం తిరిగాను. 94 00:04:34,816 --> 00:04:36,610 - భలే విషయమే. - నీకు చూపిస్తా ఉండు. 95 00:04:40,989 --> 00:04:42,115 ఇది ఎవరు? 96 00:04:42,866 --> 00:04:45,285 - చంటీకో. - చంటీకో. 97 00:04:45,369 --> 00:04:48,330 బెలీజ్ లో నా దగ్గరకి వచ్చినప్పుడు అది కుక్కపిల్లగా ఉన్నప్పుడు దత్తతు తీసుకున్నా. 98 00:04:49,498 --> 00:04:51,834 చూస్తేనే దాని మొహం పట్టుకుని ముద్దులాడాలని ఉంటుంది కదా? 99 00:04:51,917 --> 00:04:53,293 నిజమే. 100 00:04:58,632 --> 00:04:59,633 నిజమే. 101 00:05:01,844 --> 00:05:06,056 సరే, ఇతను డెస్ కదా? డెస్? అవును. 102 00:05:06,139 --> 00:05:08,517 సరే. అది వినడానికి పేరులా లేదు, కానీ పర్లేదులే. 103 00:05:09,142 --> 00:05:10,561 ఇతను పెస్ట్ కంట్రోల్ నుండి వచ్చాడు. 104 00:05:10,644 --> 00:05:12,020 ఇక్కడ ఎలుకలు బాగా పెరిగాయి అంట. 105 00:05:12,688 --> 00:05:15,065 అవును, ఎందుకో తెలీడం లేదు. నాకు తెలిసి ఇక్కడి మహిళలు ఆఫీస్ లో 106 00:05:15,148 --> 00:05:17,860 రోజుకు 1,000 పేస్ట్రీలు ప్లేట్ వాడకుండా… 107 00:05:19,236 --> 00:05:20,612 తినడం వల్ల ఏమో. 108 00:05:21,196 --> 00:05:22,656 ఆడవారికి పేస్ట్రీలు అంటే చాలా ఇష్టం. 109 00:05:23,365 --> 00:05:25,075 సరే, డెస్, నువ్వు ఎలుకల సంగతి చూడు. 110 00:05:28,871 --> 00:05:29,872 నువ్వు ఏం చేయబోతున్నావు? 111 00:05:30,539 --> 00:05:31,832 స్నాప్కోర్9ఎక్స్. 112 00:05:31,915 --> 00:05:33,584 ఎలుక లోనికి వెళ్లి విషం తిన్న తర్వాత… 113 00:05:34,543 --> 00:05:35,752 పేలిపోతుంది. 114 00:05:36,420 --> 00:05:38,714 అంటే మరి వాటిని… వేరే చోటుకు తీసుకెళ్లి వదలడం కుదరదా? 115 00:05:38,797 --> 00:05:40,382 అంటే, రీలొకేట్ చేయొచ్చు కదా? 116 00:05:40,465 --> 00:05:42,384 వాటిని పేల్చి చంపేయడమే చవకైన మార్గం. 117 00:05:43,343 --> 00:05:44,720 సరే, అలాగే. అది కూడా మంచి ఐడియానే. 118 00:05:53,979 --> 00:05:55,772 - హాయ్. - సరేనా? 119 00:05:55,856 --> 00:05:57,524 మీరు ఇవాళ రాత్రికి మిక్సర్ కి వస్తున్నారా, మిస్టర్ రాస్? 120 00:05:57,608 --> 00:05:59,443 మళ్ళీ చెప్తున్నాను, జేసన్ అని పిలువు. 121 00:05:59,526 --> 00:06:00,944 మిస్టర్ రాస్ కాదు. 122 00:06:01,028 --> 00:06:03,697 లేదు. ఏం మిక్సర్? నన్ను ఎవరూ ఏ మిక్సర్ కీ పిలవలేదు. 123 00:06:03,780 --> 00:06:06,366 - వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసారు. - అదా, నేను దాన్ని మ్యూట్ చేశా. 124 00:06:06,450 --> 00:06:08,535 అది ప్రతీ అయిదు నిమిషాలకు మోగుతుంటే నాకు తలనొప్పి వస్తోంది. 125 00:06:08,619 --> 00:06:12,372 సరే, ఈసారి మీ ఇంటి న్యూస్ ఏజెంట్స్ విండోలో మీకోసం కార్డు పెడతాంలే. 126 00:06:12,456 --> 00:06:14,333 అలాగే, మా అంచనా ప్రకారం మీరు ఇంట్లో కూర్చుని 127 00:06:14,416 --> 00:06:16,084 పరిసరాల్లో అనుమానాస్పదంగా పార్క్ చేయబడిన కార్లను కిటికీ నుండి 128 00:06:16,168 --> 00:06:17,461 - చూస్తూ బిజీగా ఉంటారు అనుకున్నాం. - సర్లే. 129 00:06:17,544 --> 00:06:18,545 మీకు రావాలని ఉంటే రండి. 130 00:06:18,629 --> 00:06:22,341 కాకపోతే ముసలోడిలా రెడీ అయి బంగాళదుంప సలాడ్ లాంటిది ఏం తీసుకురావొద్దు. 131 00:06:22,424 --> 00:06:24,051 సరే. ఈ ఏడాది మొత్తం ఇవే జోకులు కొనసాగుతాయా? 132 00:06:24,134 --> 00:06:25,302 - మీరు కొనసాగేటట్టు అయితే అంతే. - అవునా? 133 00:06:26,053 --> 00:06:27,638 సరే, ఇవాళ "థియరీస్ అండ్ మాడ్యూల్స్" కదా? 134 00:06:27,721 --> 00:06:31,642 కాదు, ఇది "అప్రోచ్స్ అండ్ మెథడ్స్." "థియరీస్ అండ్ మాడ్యూల్స్" గురువారం ఉంటుంది. 135 00:06:31,725 --> 00:06:32,935 నేను ఇవాళే మంగళవారం అనుకున్నాను. 136 00:06:33,018 --> 00:06:34,603 మీ మందుల డబ్బా మీద ఇవాళ ఏం రోజో రాసి లేదా? 137 00:06:34,686 --> 00:06:37,064 సరే, జోకులు క్వాలిటీ తగ్గుతోంది, అది తెలుసుకోండి. 138 00:06:42,778 --> 00:06:43,862 ఇమేజ్లు 139 00:06:43,946 --> 00:06:47,032 స్నాప్కోర్ ఎలుక ఉచ్చు 140 00:06:50,577 --> 00:06:51,870 నంబర్ 1 - స్నాప్కోర్9ఎక్స్ 141 00:06:54,623 --> 00:06:56,500 స్నాప్కోర్9ఎక్స్. 142 00:06:56,583 --> 00:06:58,752 మార్కెట్ లో ఉన్న అత్యంత ప్రాణాంతక ఎలుక ఉచ్చు. 143 00:06:59,336 --> 00:07:00,379 ఆకర్షిస్తుంది. 144 00:07:03,298 --> 00:07:04,383 ఇరికిస్తుంది. 145 00:07:06,176 --> 00:07:07,177 నాశనం చేస్తుంది. 146 00:07:09,221 --> 00:07:11,431 స్నాప్కోర్9ఎక్స్. 147 00:07:26,196 --> 00:07:29,366 నేనెలా క్లీనర్ పనులు చేయగలను, స్కాట్? 148 00:07:29,449 --> 00:07:32,995 నేను వేసుకునే బట్టలు అన్నీ డిజైనర్ బట్టలే. 149 00:07:33,579 --> 00:07:35,539 ఈ టాప్ ని డ్రై-క్లీన్ చేయలేము. 150 00:07:35,622 --> 00:07:37,624 ఇది గనుక మురికి అయితే దీన్ని పాడేయాల్సిందే. 151 00:07:39,042 --> 00:07:40,502 నువ్వు ఏం చేస్తున్నావు? 152 00:07:40,586 --> 00:07:41,920 సెల్ఫ్-టాన్ వేసుకుంటున్నాను. 153 00:07:42,004 --> 00:07:44,631 - ఓరి నాయనో. - తెడ్డు వేసేవారిలా నా చర్మం ట్యాన్ అవ్వాలి, 154 00:07:44,715 --> 00:07:48,302 ఎందుకంటే బేస్మెంట్ లో ఉండటం వల్ల కాస్త తెల్లబడ్డాను. 155 00:07:49,219 --> 00:07:50,304 ఆగు. 156 00:07:50,387 --> 00:07:53,015 అది నా సిలీక్ హైడ్రేటింగ్ సెల్ఫ్-ట్యానింగ్ ఫేస్ క్రీమా? 157 00:07:53,891 --> 00:07:55,767 అది నీ కాళ్ళకు రాసుకుంటున్నావా? 158 00:07:57,269 --> 00:07:59,188 అది ఒక్కో డబ్బా 200 పౌండ్లు! 159 00:07:59,980 --> 00:08:01,064 అది ఇలా ఇవ్వు! 160 00:08:02,691 --> 00:08:05,068 బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న కొత్త డబ్బాని వాడకు, 161 00:08:05,152 --> 00:08:06,361 ఎందుకంటే అది మొన్నే కొన్నాను. 162 00:08:09,198 --> 00:08:10,782 ఇదే బాత్రూమ్ లో ఉన్న కొత్త డబ్బానా? 163 00:08:11,408 --> 00:08:12,701 కాదు. 164 00:08:37,808 --> 00:08:38,809 ఇలా రా! 165 00:08:42,898 --> 00:08:43,899 హాయ్! 166 00:08:46,735 --> 00:08:48,362 అందరి రోజు ఎలా గడిచింది? 167 00:08:50,197 --> 00:08:51,281 ప్రిన్సెస్? 168 00:08:52,074 --> 00:08:53,534 ఏంటి? ఓహ్, అవును, బాగానే గడిచింది. 169 00:08:53,617 --> 00:08:54,618 - అవునా? - అవును. 170 00:08:55,744 --> 00:08:56,995 నువ్వు ఏం చేసావు? 171 00:08:57,079 --> 00:08:59,540 ఒకటి చెప్పనా? నా సోషల్ మీడియాలో అంతా చూపించాను. 172 00:08:59,623 --> 00:09:01,333 అందులో చూస్తే త్వరగా తెలుసుకోవచ్చు. 173 00:09:02,334 --> 00:09:03,502 అలాగే. 174 00:09:03,585 --> 00:09:06,713 సరే. మరి, రాత్రికి పిజ్జా తినాలని ఎవరికి ఉంది? 175 00:09:07,923 --> 00:09:10,425 టైలర్, నువ్వు తినాలనుకునే పిజ్జా ఎంచుకుంటావా? 176 00:09:10,509 --> 00:09:11,844 నేను భోజనానికి బార్బరా వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. 177 00:09:11,927 --> 00:09:13,345 ఓహ్, దేవుడా. వీడికి కాస్త చెప్తావా? 178 00:09:13,428 --> 00:09:14,429 వినడానికి దారుణంగా ఉంది. 179 00:09:14,513 --> 00:09:16,807 - బార్బరా. - అది తన పేరు. 180 00:09:16,890 --> 00:09:17,891 నీ పేరు ప్రిన్సెస్. 181 00:09:17,975 --> 00:09:20,060 సరే, పిల్లలూ. చాలా థాంక్స్. 182 00:09:20,644 --> 00:09:22,479 ఆమెకు ముద్దు పేరు లేదా ఇంకొక పేరు ఏమైనా ఉందా? 183 00:09:22,563 --> 00:09:24,439 - లేదు. - ఎందుకంటే నేను బాబ్స్ అందాం అనుకుంటున్నా. 184 00:09:24,523 --> 00:09:25,732 - జేస్. వద్దు. - ఇంకా దారుణంగా ఉంది. 185 00:09:25,816 --> 00:09:28,193 సరే మరి. అయితే మనమే ఎలాగోలా పేరుకు అలవాటు పడాలి, ఏమంటారు? 186 00:09:28,277 --> 00:09:29,444 దారుణంగా ఉంది. 187 00:09:29,528 --> 00:09:31,363 అదేం దారుణంగా లేదు. బాబ్స్ దారుణంగా ఉంది. 188 00:09:31,446 --> 00:09:33,115 - ప్రిన్సెస్ ఇంకా దారుణంగా ఉంది. - నీ సంగతి ఏంటి? 189 00:09:33,198 --> 00:09:34,700 చిన్న… వెజ్జీ సుప్రీమ్. ఇది చూడటానికి బాగుంది. 190 00:09:34,783 --> 00:09:38,161 ఓహ్, లేదు, క్షమించు. నేను అమ్మ కొత్త ఇంటిని డెకరేట్ చేయడానికి అక్కడికి వెళ్తున్నా. 191 00:09:38,245 --> 00:09:40,330 తనకు ఒక అద్భుతమైన వేర్హౌస్ కమ్యూనిటీ దొరికింది. 192 00:09:40,998 --> 00:09:41,999 ఏమన్నావు? 193 00:09:42,082 --> 00:09:44,126 అది సృజనాత్మకమైన వారు అలాగే విడాకులు 194 00:09:44,209 --> 00:09:47,254 తీసుకుంటున్న మామూలు వారు కలిసి 195 00:09:47,337 --> 00:09:49,381 ఒక సమాజంగా నివసించడానికి ఏర్పాటు చేసుకున్న ప్రదేశం. 196 00:09:49,464 --> 00:09:50,924 - వినడానికి బాగుంది. - అవును. 197 00:09:51,425 --> 00:09:53,510 - సరే, ఇక నేను వెళితే మంచిది. - సరే. అలాగే. వెళ్ళు. 198 00:09:53,594 --> 00:09:55,679 - సరే, ఎంజాయ్. - బై. 199 00:09:55,762 --> 00:09:57,306 - బై. - బై-బై. బై. 200 00:09:58,557 --> 00:10:00,225 నువ్వు వీళ్ళకి ప్లాన్ గురించి చెప్పలేదా? 201 00:10:00,309 --> 00:10:02,561 క్షమించు. చూడు, మనం చేయగలిగింది ఏం ఉంది? వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు. 202 00:10:02,644 --> 00:10:03,645 జేస్, ఇలాగే దూరమైపోతాం. 203 00:10:03,729 --> 00:10:05,606 - మనం తనని ఇలాగే కోల్పోతాం. - అంటే, ఏమో, నిక్. 204 00:10:05,689 --> 00:10:07,524 మొన్నేమో నువ్వు క్యాట్ వెళ్లిపోతుందేమో అని భయపడ్డావు. 205 00:10:07,608 --> 00:10:08,942 ఇవాళ ఆమె ఉండిపోతుందేమో అని భయపడుతున్నావు. 206 00:10:09,026 --> 00:10:10,527 సరే. అలాగే. 207 00:10:11,695 --> 00:10:13,280 సరే. కానివ్వు. నీ పిజ్జాని ఎంచుకో. 208 00:10:16,408 --> 00:10:17,409 ఏంటి? 209 00:10:17,492 --> 00:10:19,203 ఇవాళ కాలేజ్ లో ఒక మిక్సర్ ఉంది. 210 00:10:19,286 --> 00:10:20,454 దాని గురించి నీకు చెప్పాను. 211 00:10:20,954 --> 00:10:23,040 - అవునా? - చాలా రోజుల క్రితమే క్యాలెండర్ మీద రాశాను. 212 00:10:23,123 --> 00:10:24,166 - అవునా? - అవును. 213 00:10:25,834 --> 00:10:26,835 అవును. 214 00:10:26,919 --> 00:10:28,879 నేను ఇక వెళ్ళాలి. అక్కడికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాలి. 215 00:10:28,962 --> 00:10:30,547 - సరే. - నేను రావడానికి టైమ్ పడుతుంది, సరేనా? 216 00:10:30,631 --> 00:10:32,174 - సరే. సరే. - ఐ లవ్ యు. ఏం అనుకోకు. 217 00:10:32,257 --> 00:10:34,092 - సరే. అలాగే, డార్లింగ్. బై-బై. - సరే. బై. 218 00:10:34,176 --> 00:10:36,136 - లవ్ యు. జాగ్రత్తగా ఉండు. - సరే. వెళ్తాను. 219 00:10:48,941 --> 00:10:50,108 కాలేజ్ మిక్సర్ 220 00:10:51,193 --> 00:10:52,861 నమ్మలేకపోతున్నాను! 221 00:10:54,905 --> 00:10:55,989 1 మంగళవారం - టైలర్ హైజినిస్ట్ సాయంత్రం 3:45 222 00:11:04,540 --> 00:11:06,083 కామ్డెన్ 223 00:11:23,475 --> 00:11:24,726 హాయ్, మిస్టర్ రాస్. 224 00:11:24,810 --> 00:11:25,811 నన్ను జేసన్ అని పిలవండి. 225 00:11:25,894 --> 00:11:27,729 ఇదేంటి? 226 00:11:27,813 --> 00:11:29,189 నేనింకా రాత్రికి పెద్ద పార్టీ ఉంటుంది అనుకున్నా. 227 00:11:29,273 --> 00:11:31,233 ఇది పెద్ద పార్టీనే. ఒక జిగ్సా రేస్ ఉంది. 228 00:11:31,316 --> 00:11:35,153 జిగ్సా రేస్ ని పెద్ద పార్టీ అనరు, సరేనా? 229 00:11:35,237 --> 00:11:36,405 - ఎలా ఉన్నావు? - ఇదుగోండి. 230 00:11:38,115 --> 00:11:39,241 లేదు. నేను సెక్యూరిటీ వాడిని కాదు. 231 00:11:39,324 --> 00:11:41,243 - కాదు, నేను… - సరే. 232 00:11:43,537 --> 00:11:45,205 అంటే, మరి పెద్ద పార్టీ అంటే ఎలా ఉంటుంది? 233 00:11:45,289 --> 00:11:46,623 ఏమో. నోటీస్ నైట్ లో లాగ ఉంటుంది. 234 00:11:46,707 --> 00:11:49,126 అంటే, బాగా తాగి, డాన్స్ లు వేస్తూ, 235 00:11:49,209 --> 00:11:51,420 కొట్లాడుకుని, ఇంటికి వెళ్ళేటప్పుడు కబాబ్ తింటారు. ఇలా చూడండి… 236 00:11:52,379 --> 00:11:54,339 కాదు. మళ్ళీ చెప్తున్నాను, వద్దు, నేను సెక్యూరిటీని కాదు. 237 00:11:54,423 --> 00:11:56,300 నేను విద్యార్థిని. నాకు తెలుసు. చూడటానికి… 238 00:11:56,383 --> 00:11:58,385 నేను ఇది వేసుకున్నందుకు అలా అనుకుంటున్నారు. నేను సైకిల్ మీద వచ్చా. 239 00:11:58,468 --> 00:12:00,220 - మీరు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. - హెల్మెట్. 240 00:12:00,304 --> 00:12:01,680 మీ జెనెరేషన్ కి అసలు ఏమైంది? 241 00:12:01,763 --> 00:12:04,474 హెల్మెట్స్ పెట్టుకోండి, డాక్టర్స్ దగ్గరకి వెళ్ళండి, సన్స్క్రీన్ పూసుకోండి. 242 00:12:04,558 --> 00:12:06,143 దయచేసి మీ క్షేమం గురించి ఆలోచించండి. 243 00:12:06,226 --> 00:12:08,020 సరే, ఏదోకటి. ఆగండి, పిల్లలు. ఐడీలు చూపించండి. 244 00:12:09,354 --> 00:12:10,898 సరే, వెళ్ళండి. పోండి. ఎంజాయ్ చేయండి. 245 00:12:10,981 --> 00:12:12,566 కొంచెం ఆలోచించండి, పిల్లలు. 246 00:12:12,649 --> 00:12:14,651 రాత్రిని బాగా ఎంజాయ్ చేద్దాం. షాట్స్ తాగాలని ఎవరికి ఉంది? 247 00:12:15,277 --> 00:12:16,278 - సరే. - అలాగే. 248 00:12:16,361 --> 00:12:17,654 పదండి! 249 00:12:17,738 --> 00:12:21,074 నాకొక గోధుమ గడ్డి షాట్, అల్లం షాట్ ఇంకా పసుపు షాట్ కావాలి. 250 00:12:21,575 --> 00:12:22,784 అలాగే ఒక పైంట్ స్టెల్లా ఇవ్వు. 251 00:12:22,868 --> 00:12:24,161 - సరే. - థాంక్స్. 252 00:12:24,244 --> 00:12:26,330 భలే! నాకు ఇంకొక కార్నర్ పీస్ దొరికింది. 253 00:12:29,291 --> 00:12:30,667 దేవుడా. 254 00:12:30,751 --> 00:12:33,212 చూస్తుంటే కాన్పులో తనకు నచ్చిన దాన్ని పియర్స్ ఎంచుకున్నట్టు ఉన్నాడు. 255 00:12:33,295 --> 00:12:38,425 కానీ ముందుగా, చూస్తుంటే కార్ల్ మళ్ళీ ఇరకాటంలో పడినట్టు ఉన్నాడు, ఎందుకంటే జెన్నా ఇంకా మెల్… 256 00:12:55,025 --> 00:12:56,026 పదండి, కుర్రాళ్ళూ. 257 00:12:56,109 --> 00:12:58,070 బయటకు వెళ్లి సరిగ్గా ఎంజాయ్ చేద్దాం, హహ్? 258 00:12:58,153 --> 00:12:59,613 నేను రాత్రికి త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకున్నా. 259 00:12:59,696 --> 00:13:01,323 ఊరుకో. నీ కృతజ్ఞత జర్నల్ తర్వాత రాసుకోవచ్చులే. 260 00:13:01,406 --> 00:13:03,867 అలాగే నిజం చెప్పాలంటే, నువ్వు దేనికి కృతజ్ఞతగా ఉన్నావో నీకే తెలీకపోతే 261 00:13:03,951 --> 00:13:06,620 మరి కృతజ్ఞత జర్నల్ పెట్టుకుని ఏం లాభం ఉంటుంది చెప్పు? 262 00:13:06,703 --> 00:13:08,789 అది నిజానికి నా కృతజ్ఞత జర్నల్ కాదు. 263 00:13:09,915 --> 00:13:10,916 అది నా నిద్ర జర్నల్. 264 00:13:11,667 --> 00:13:12,793 అలాగే దాని వల్ల నాకు చాలా లాభం ఉంటోంది. 265 00:13:12,876 --> 00:13:14,127 చూడు, మీరంతా ఒకేలాంటోళ్ళు అనడం లేదు, 266 00:13:14,211 --> 00:13:16,630 కానీ మీ తరంలోని ప్రతీ ఒక్కరు నార్సిసిస్టులే. 267 00:13:16,713 --> 00:13:18,590 ఎందుకు? మేము స్వీయ-సంరక్షణ పాటిస్తున్నామనా? 268 00:13:18,674 --> 00:13:20,592 అవును. అది చాలా దారుణం. 269 00:13:21,093 --> 00:13:22,678 అలాగే మీరు అస్సలు సరదాగా లేరు. మీరు మీ శరీరాన్ని అదేదో 270 00:13:22,761 --> 00:13:24,847 గుడిలాగ చూసుకుంటే ఎలా ఎంజాయ్ చేయగలరు? 271 00:13:24,930 --> 00:13:27,099 ఒక మాట చెప్తాను వినండి, మీ శరీరం గుడి కాదు, అదొక రెంట్ కి తీసుకున్న కారు. 272 00:13:27,182 --> 00:13:29,852 అది మీతో కొన్నాళ్లే ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంత వరకు వాడగలరో చూద్దాం, సరేనా? 273 00:13:29,935 --> 00:13:32,771 నిజం చెప్పాలంటే, ఇలాగే ఉంటే మీరంతా మీ చక్కని ఉదర బాక్టీరియాతో 274 00:13:32,855 --> 00:13:35,315 ఆఖరికి 103 ఏళ్ళకి ఒంటరిగా చనిపోతారు. 275 00:13:41,655 --> 00:13:42,990 బ్లూ లైట్ చూడటం ఆపాల్సిన టైమ్ అయింది. 276 00:13:43,073 --> 00:13:44,116 మిత్రమా. 277 00:13:45,534 --> 00:13:49,204 మీలోని అత్యంత కూల్ పిల్లల్ని కూడా 1990లలో పుస్తకాల పురుగులు అనేవారు. 278 00:13:49,288 --> 00:13:52,291 నేను నా ఉదర బాక్టీరియ గురించి నిజంగానే చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటా. 279 00:13:53,041 --> 00:13:54,626 సరే. బయటకు వెళదాం. 280 00:13:54,710 --> 00:13:55,711 అలా అన్నావు బాగుంది. 281 00:13:58,672 --> 00:14:00,257 - కెఫీన్ తాగడం ఆపాల్సిన టైమ్. - సరే. 282 00:14:00,340 --> 00:14:01,925 మనం అక్కడ ఎస్ప్రెస్సో మార్టీనీలు తాగము కదా? 283 00:14:02,009 --> 00:14:03,093 లేదు, అలా ఏం జరగదు. 284 00:14:03,594 --> 00:14:05,470 మీ ఫోన్లు ఇవ్వండి. అవి జీవితానికి ఆటంకం మాత్రమే. 285 00:14:05,554 --> 00:14:08,182 ఒక విషయం తెలుసుకోండి, అది నీళ్లు తాగమని గుర్తుచేయడానికి ప్రతీ అరగంటకి మోగుతుంది. 286 00:14:08,265 --> 00:14:10,809 తాగమని గుర్తుచేయడానికి నీకు అది అవసరం లేదు. నేను ఉన్నాను కదా. 287 00:14:10,893 --> 00:14:11,894 ఇక వెళదాం. 288 00:14:20,736 --> 00:14:21,862 ఈజీ పని. 289 00:14:24,448 --> 00:14:27,034 - సరే. నిన్ను తర్వాత కలుస్తా. - సరే, తర్వాత కలుద్దాం. 290 00:14:48,680 --> 00:14:49,848 హాయ్. 291 00:14:51,308 --> 00:14:52,309 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 292 00:14:52,392 --> 00:14:55,646 రేపటికి నేను పూర్తి చేయాల్సిన పని కొంచెం ఉంది. 293 00:14:55,729 --> 00:14:57,773 - నీ సంగతి ఏంటి? - అవును, నాకు కూడా. 294 00:14:57,856 --> 00:14:59,608 - సరే. - అయితే ఇక పని ముగిద్దాం. 295 00:14:59,691 --> 00:15:01,443 సరే. వెళ్తాను. 296 00:15:08,492 --> 00:15:09,493 సరే. థాంక్స్. 297 00:15:09,576 --> 00:15:12,829 సరే, నైట్ అవుట్ లోని మొదటి రూల్ ఏంటంటే మొదట తాగబోయేదాన్ని సరిగ్గా ఎంచుకోవాలి. 298 00:15:12,913 --> 00:15:13,997 ఫ్యాన్సీగా ఏం తీసుకోకూడదు. 299 00:15:14,081 --> 00:15:16,208 అడ్మిషన్ ఫీజులు, వెల్వెట్ తాడు నాన్సెన్స్ మనకు వద్దు. 300 00:15:16,291 --> 00:15:19,211 వద్దు. మంచి నైట్ అవుట్ అంటే ఫ్యాన్సీ కల్చర్ కాదు. 301 00:15:19,294 --> 00:15:22,339 మనుషులు ముఖ్యం. బోలెడంత మంది మనుషులు ఉండాలి. అందరూ సమానమే. 302 00:15:22,422 --> 00:15:25,133 ఎప్పుడూ కూల్ గా ఉండేవాళ్ళ దగ్గరకి వెళ్ళాలి అనుకోకూడదు. 303 00:15:25,759 --> 00:15:28,303 - చూస్తుంటే మనం అది కరెక్టుగానే చేసినట్టు ఉన్నాం. - తాగండి. 304 00:15:30,931 --> 00:15:33,058 ఏదో ఆయిస్టర్ ని తింటున్నట్టు ఎందుకు అలా అమాంతం తాగుతున్నారు? 305 00:15:33,725 --> 00:15:35,143 ఎందుకంటే దీని రుచి దారుణంగా ఉంటుంది. 306 00:15:36,061 --> 00:15:39,398 కానీ మనం ముందుగా ఒక బేస్ లెవెల్ మత్తులోకి జారుకోవాలి. 307 00:15:39,481 --> 00:15:41,316 నన్ను నమ్ము. తర్వాత నువ్వే నాకు థాంక్స్ చెప్తావు. 308 00:15:41,400 --> 00:15:42,693 ఇది భలే ఉంటుంది. 309 00:15:43,735 --> 00:15:44,736 అంతే. 310 00:15:45,696 --> 00:15:47,114 అంతే. తాగేయండి. 311 00:15:47,197 --> 00:15:48,824 సరే, నా 20లలో ఇదే నా బ్రేక్ ఫాస్ట్. 312 00:15:50,576 --> 00:15:52,578 ఇప్పుడిక అదిరిపోతుంది చూసుకోండి! 313 00:16:04,131 --> 00:16:06,341 అది… అది నీదేనా? 314 00:16:07,509 --> 00:16:08,969 కాదు, నువ్వు వెళ్లనక్కరలేదు. వద్దు, నిక్కి. నేను… 315 00:16:09,052 --> 00:16:10,888 - అదేం పర్లేదు. - వద్దు, వద్దు. 316 00:16:12,055 --> 00:16:13,140 ద వైట్ లయన్ కెర్రీ హోవెల్ 317 00:16:13,223 --> 00:16:14,224 నువ్వొక బ్యాండ్ లో ఉన్నావు. 318 00:16:15,517 --> 00:16:16,894 అవును. అవును. 319 00:16:18,103 --> 00:16:19,521 అంటే, కాదు. నేను ఒక్కడినే పాడతాను. 320 00:16:21,106 --> 00:16:22,691 ఇది ప్రింట్ తీయడానికి నాకు వేరే చోటు లేదు. 321 00:16:23,400 --> 00:16:25,235 అయితే నువ్వు అందుకే వచ్చావన్నమాట? 322 00:16:26,069 --> 00:16:28,530 అవును. నేను ఈ పనికి ఆఫీస్ పరికరం వాడకూడదని తెలుసు. 323 00:16:29,698 --> 00:16:30,866 ఈ రహస్యాన్ని దాస్తావా? 324 00:16:34,578 --> 00:16:36,205 వాల్ట్ 47 325 00:16:36,288 --> 00:16:39,082 సరే. 1990లలోని గొప్ప విషయం ఏంటంటే ఎవరి దగ్గరా కెమెరా ఫోన్స్ ఉండేవి కాదు. 326 00:16:39,166 --> 00:16:41,752 కాబట్టి కూల్ గా కనిపించాల్సిన అవసరమే లేదు. ఇష్టమొచ్చినట్టు డాన్స్ వేయొచ్చు. 327 00:16:42,252 --> 00:16:44,171 సరే. నా మాట వినండి, డాన్స్ ఫ్లోర్ రూల్స్ చెప్తాను, సరేనా? 328 00:16:44,254 --> 00:16:45,547 కమిట్ కాకపోతే వెళ్లిపోవడమే మేలు. 329 00:16:46,131 --> 00:16:49,134 శరీరాన్ని బాగా ఊపాలి. మనసు పెట్టండి. ఎవరూ ఏం అనుకోరు. 330 00:16:50,052 --> 00:16:52,763 అలాగే బీట్ వచ్చినప్పుడు చేతులు గాల్లోకి ఎత్తండి, సరేనా? 331 00:16:53,931 --> 00:16:54,973 వస్తోంది. 332 00:16:55,933 --> 00:16:57,434 రెడీ అవ్వండి. 333 00:16:58,060 --> 00:17:00,187 వస్తోంది. ఏ క్షణమైనా రావొచ్చు. 334 00:17:01,146 --> 00:17:02,147 వస్తోంది. 335 00:17:20,207 --> 00:17:21,208 అంతే! 336 00:17:26,839 --> 00:17:28,674 నువ్వు వీటిని తీసేసావని జనానికి తెలిసిపోతుంది కదా? 337 00:17:28,757 --> 00:17:30,592 అంటే, లేదు, ఎందుకంటే నేను వీటిని నా లాకర్ లో దాస్తాను, 338 00:17:30,676 --> 00:17:31,760 రేపు పొద్దున్నే వచ్చేసి 339 00:17:31,844 --> 00:17:34,221 - మళ్ళీ బయట పెడతా. - సరే. 340 00:17:34,304 --> 00:17:36,181 నా రీసెర్చ్ ప్రకారం మనం అంతర్లీనంగా ఉన్న సమస్యను 341 00:17:36,265 --> 00:17:38,267 పరిష్కరించకపోతే ఎలుకలను పోగొట్టలేం. 342 00:17:38,350 --> 00:17:40,686 అయితే మరి ఆ అంతర్లీనమైన సమస్యల్లో ఒకటి 343 00:17:40,769 --> 00:17:43,063 ఎవరో ఒకరు ఎలుక బోనులు తీసేయడం అయి ఉంటుందా? 344 00:17:43,939 --> 00:17:46,775 కావొచ్చు. అవును, అవును. ఇది చాలా అన్యాయం. 345 00:17:46,859 --> 00:17:49,111 జనం రోజూ వాళ్ళ కుక్కల్ని ఆఫీస్ తీసుకొస్తారు, 346 00:17:49,194 --> 00:17:51,572 అవి వాటిని అవి నాక్కుంటూ, ప్రతీదాన్ని వాసన చూస్తుంటాయి. 347 00:17:51,655 --> 00:17:53,323 ఇంత వరకు ఏనాడూ ఒక ఎలుక నా కాళ్ళ మధ్య 348 00:17:53,407 --> 00:17:54,992 తల పెట్టి వాసన చూడటానికి ట్రై చేయలేదు. 349 00:17:55,075 --> 00:17:56,118 ఇది జంతు జాతి వివక్ష. 350 00:17:56,785 --> 00:17:57,786 మరి… 351 00:18:00,581 --> 00:18:01,582 నువ్వు ఏం చేస్తున్నావు? 352 00:18:02,416 --> 00:18:03,584 అంటే, నేను జాత్యహంకారిని కాదు. 353 00:18:06,837 --> 00:18:09,089 - అక్కడ ఇంకొకటి ఉంది. - సరే. 354 00:18:09,882 --> 00:18:12,426 సరే, నువ్వు సోషల్ వర్కర్ వి కావాలని ఎప్పటి నుండి అనుకున్నావు? 355 00:18:12,509 --> 00:18:13,760 అదొక పెద్ద కథ. 356 00:18:13,844 --> 00:18:16,096 సరే, మా ఇంట్లో కూడా రెండు పెద్ద కథలు ఉన్నాయిలే. 357 00:18:19,933 --> 00:18:21,185 నేను పెంపుడు ఇంట్లో ఉండేదాన్ని. 358 00:18:21,935 --> 00:18:24,646 నువ్వు నన్ను జాలిగా చూసి సానుభూతి తెలపాల్సిన అవసరం లేదు. 359 00:18:24,730 --> 00:18:26,064 లేదు. అలా చేయను. నువ్వు చెప్పింది నిజమే. 360 00:18:26,773 --> 00:18:28,609 అలాగే నాకు ఫ్రెండ్స్ కూడా పెద్దగా లేరు. 361 00:18:28,692 --> 00:18:30,194 అందుకే నేను గుర్రాలపై ఆసక్తి పెంచుకున్నాను. 362 00:18:30,277 --> 00:18:31,278 అంటే, అది… 363 00:18:32,237 --> 00:18:33,697 హెరాయినా? స్కాగ్? 364 00:18:33,780 --> 00:18:36,950 - కాదు, గుర్రాలు. - నిజమైన గుర్రాలు, సరే. అలాగే. 365 00:18:37,034 --> 00:18:39,286 ఆ టైమ్ లో ఒక సోషల్ వర్కర్ ని కలిసాను. 366 00:18:39,369 --> 00:18:40,579 ఆమె నన్ను ఆదరించింది. 367 00:18:41,163 --> 00:18:43,540 ప్రతి వారం గుర్రపు స్వారీకి వెళ్ళే అవకాశం ఉన్న ఈ స్కీమ్ కనిపెట్టింది. 368 00:18:44,208 --> 00:18:47,252 ఇతర అమ్మాయిలతో పాటు నన్ను కూడా ప్రతీ శనివారం తీసుకెళ్లేది. 369 00:18:47,336 --> 00:18:48,629 నేను నా పీఈ కిట్ వేసుకునేదాన్ని. 370 00:18:49,213 --> 00:18:51,215 - ఆ గుర్రాలకి నేనే ఫేవరెట్. - సందేహమే లేదు. 371 00:18:52,424 --> 00:18:55,511 అలా ఉండగా, ఒకరోజు, గుర్రాలను చూసుకునే ఒక మహిళ సోషల్ వర్కర్ కి 372 00:18:55,594 --> 00:18:56,762 ఇమ్మని నాకు ఒక కవర్ ఇచ్చింది. 373 00:18:56,845 --> 00:18:58,889 - సరే. - నేను అది తెరిచాను. 374 00:18:58,972 --> 00:19:01,016 అది ఒక బిల్లు. ఆమెకి. 375 00:19:01,600 --> 00:19:02,809 స్కీమ్ ఏం లేదు. 376 00:19:03,644 --> 00:19:04,853 - ఫీజులు తను కడుతోంది. - సరే. 377 00:19:04,937 --> 00:19:06,396 రెండేళ్లుగా ప్రతీ వారం. 378 00:19:06,480 --> 00:19:08,565 వావ్. ఆమెతో ఏమన్నావు? 379 00:19:08,649 --> 00:19:09,816 ఏమీ అనలేదు. 380 00:19:10,734 --> 00:19:11,735 తను కూడా ఏం అనలేదు. 381 00:19:12,569 --> 00:19:13,946 మేము మామూలుగానే కొనసాగాం. 382 00:19:15,948 --> 00:19:17,991 ఏదైతేనేం, ఏదొక రోజు నేను కూడా ఇంకొకరికి ఆమెలా అవ్వాలి అనుకుంటున్నా. 383 00:19:18,575 --> 00:19:19,868 ఈ సోషల్ వర్కర్… 384 00:19:21,036 --> 00:19:23,789 ఆమె పేరు పెన్నీ అయి ఉండదు కదా? 385 00:19:23,872 --> 00:19:25,457 కాదు, క్యాలీ. 386 00:19:26,208 --> 00:19:27,793 - పెన్నీ ఎవరు? - లేదు, ఆమె ఒక… 387 00:19:28,502 --> 00:19:30,462 అంటే, మా జీవితంలో కూడా ఒక క్యాలీ ఉండేది. 388 00:19:32,381 --> 00:19:34,007 సరే, ఇక ఆ విషయాలు చాలులే. పదా. 389 00:19:34,508 --> 00:19:35,926 వెళ్లి కొన్ని ఎస్ప్రెస్సో మార్టీనీలు తాగుదాం. 390 00:19:36,677 --> 00:19:39,221 - చూడు, అది అక్కడ ఉంది. - దానికి ఆకలిగా ఉన్నట్టు ఉంది. 391 00:19:41,974 --> 00:19:45,102 జీనెట్ తెచ్చిన హాలూమిలో డాన్ తెచ్చిన స్వీట్ చిల్లి సాస్ వేసి ట్రై చెయ్. 392 00:19:45,185 --> 00:19:46,186 సరే. 393 00:19:49,147 --> 00:19:50,148 అయితే… 394 00:19:51,733 --> 00:19:52,734 ఏం జరుగుతోంది? 395 00:19:53,318 --> 00:19:54,403 అంతా బానే ఉందా? 396 00:19:54,486 --> 00:19:55,487 ఏంటి నీ ఉద్దేశం? 397 00:19:55,571 --> 00:19:58,365 అంటే, నీ బ్యాగ్ లో ఎలుకల బోనులు పెట్టుకుని 398 00:19:58,448 --> 00:20:00,367 అర్థరాత్రి సమయంలో ఆఫీస్ లో కూర్చొని ఎలుకల్ని గమనిస్తున్నాం కదా. 399 00:20:00,450 --> 00:20:01,910 నాకు ఎలుకలు అంటే చాలా ఇష్టం. 400 00:20:03,620 --> 00:20:05,998 అంటే, వాటి గురించి ఆలోచించేవాళ్ళు కూడా ఎవరొకరు ఉండాలి కదా? 401 00:20:07,165 --> 00:20:09,209 వాటికి బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలీదు, పాపం… 402 00:20:10,210 --> 00:20:13,338 అమాయకంగా తిరుగుతూ అలా బ్రతికేస్తున్నాయి. 403 00:20:14,173 --> 00:20:16,425 అవి ప్రమాదాలను పసిగట్టలేవు కదా? 404 00:20:16,508 --> 00:20:19,344 జుట్టుకు రంగు వేసుకున్నంత మాత్రాన ఏదో పెద్దవాళ్ళం అయిపోయాం అనుకుంటాయి. 405 00:20:19,428 --> 00:20:21,680 నువ్వు ఎలుకల గురించి మాట్లాడటం లేదు అనిపిస్తోంది. 406 00:20:24,516 --> 00:20:27,477 మా పిల్లల అసలు తల్లి తిరిగొచ్చింది, 407 00:20:28,395 --> 00:20:30,397 కానీ అది చూసి నేను తప్ప వేరెవ్వరూ కంగారుపడటం లేదు. 408 00:20:30,480 --> 00:20:32,691 వింటుంటే ఈ విషయంలో నువ్వు ఒంటరిదానివి అయ్యావు అనిపిస్తోంది. 409 00:20:32,774 --> 00:20:34,735 నాకు ఆమె గురించి అన్నీ ప్రతికూలమైన ఆలోచనలే వస్తున్నాయి. 410 00:20:35,319 --> 00:20:36,570 అవి మరీ అంత దారుణమైన ఆలోచనలు అయ్యుండకపోవచ్చులే. 411 00:20:36,653 --> 00:20:38,322 నిన్న రాత్రి నేను ఆమెని కారుతో గుద్దినట్టు కల కన్నాను. 412 00:20:38,405 --> 00:20:40,240 - సరే… - లేదు. 413 00:20:40,324 --> 00:20:41,533 వద్దు, అలా నవ్వకు. 414 00:20:41,617 --> 00:20:44,286 మంచోళ్ళు ఎవరూ నిద్రలో కూడా అలా అనుకోరు. 415 00:20:47,706 --> 00:20:49,958 కెర్రీ, నేను… నాకు ఆమె ఎలాంటిదో తెలుసు. 416 00:20:50,667 --> 00:20:52,085 ముందు అందరూ ఆమెను ఇష్టపడేలా చేస్తుంది, 417 00:20:52,169 --> 00:20:54,171 తర్వాత ఆమె అది హ్యాండిల్ చేయలేక కంగారుపడి 418 00:20:54,254 --> 00:20:55,547 ఎవరికీ చెప్పకుండా మాయమైపోతుంది. 419 00:20:55,631 --> 00:20:58,884 కానీ ఈ సమస్యని నేను ఒక్కదాన్నే పసిగడుతున్నాను ఏమో అనిపిస్తోంది. 420 00:20:59,468 --> 00:21:02,304 ఆమెకి సెలవులకు ఎక్కడికైనా వెళ్లాలని ఉందా? 421 00:21:02,387 --> 00:21:04,223 బహుశా హోండురాస్ కి వెళితే బావుంటుందేమో? 422 00:21:04,306 --> 00:21:07,434 ఎందుకంటే ఆమె సందర్శించగల కొన్ని సందడిగా ఉండే నగరాలు నాకు తెలుసు. 423 00:21:07,518 --> 00:21:09,728 "కొన్ని సందడిగా ఉండే నగరాలు." 424 00:21:13,815 --> 00:21:15,817 నేను మరొక విధమైన 425 00:21:16,777 --> 00:21:19,863 మనిషిని అయి ఉంటే కొంచెం బాగుండేది అనిపిస్తోంది. 426 00:21:19,947 --> 00:21:22,074 నిన్ను నువ్వు చాలా తక్కువగా చూసుకుంటావు, కదా? 427 00:21:22,157 --> 00:21:23,867 అంటే, ఏమో, నాకు నా గురించి తెలుసు. 428 00:21:23,951 --> 00:21:24,952 నేను నేనే. 429 00:21:25,035 --> 00:21:26,870 నీ గురించి ఒక్క మంచి విషయం చెప్పు. 430 00:21:26,954 --> 00:21:27,955 కెర్రీ. 431 00:21:28,038 --> 00:21:30,916 నీ గురించి ఒక్క మంచి విషయం చెప్పు. కానివ్వు. 432 00:21:32,793 --> 00:21:36,672 నేను వంట చేసేటప్పుడు ఎంత మోతాదు పాస్తా వండాలో కొలవడం బాగా వచ్చు. 433 00:21:36,755 --> 00:21:38,799 సరే. అలాగే, మంచి ఆరంభం. 434 00:21:38,882 --> 00:21:39,883 అవును. 435 00:21:40,509 --> 00:21:43,554 ఎందుకంటే నీ గురించి తెలీని మా అందరికీ నిన్ను చూసినప్పుడు… 436 00:21:45,389 --> 00:21:46,640 గొప్పగానే కనిపిస్తావు. 437 00:21:51,270 --> 00:21:53,063 సరే, నాకు డెజర్ట్ కావాలి. 438 00:21:54,773 --> 00:21:56,942 పాట్ కొంత తిరమీసు తెచ్చినట్టు ఉంది. 439 00:22:04,700 --> 00:22:06,076 - ఓహ్, లేదు. - ఏమైంది? 440 00:22:09,162 --> 00:22:10,289 మనం ఒకటి తీయలేదు. 441 00:22:11,540 --> 00:22:13,333 ఓహ్, లేదు. 442 00:22:13,417 --> 00:22:14,918 - అది… - నాకు తెలీదు. 443 00:22:17,004 --> 00:22:18,964 - నువ్వు అందులో ఒకవేళ… - సరే. సరే, సరే, సరే. 444 00:22:29,224 --> 00:22:30,225 ఇది… 445 00:22:30,809 --> 00:22:31,810 పేలింది. 446 00:22:33,562 --> 00:22:36,648 ఒకటి చెప్పనా? నిజానికి ఇది సరదాగా ఉంది. 447 00:22:36,732 --> 00:22:39,860 అంటే ఇప్పుడు పదకొండు పావే అయిందనుకోండి. అయితే ఇంకొక చోటుకు వెళదామా? 448 00:22:39,943 --> 00:22:40,944 నేను చాలా అలసిపోయా. 449 00:22:41,028 --> 00:22:42,779 సరే, కనీసం కబాబ్ తిందాం. పదండి. ఏమంటారు? 450 00:22:42,863 --> 00:22:44,656 కబాబ్ తినాల్సిందే. అప్పుడే మన రాత్రి సంపూర్ణమైనట్టు, ఏమంటారు? 451 00:22:44,740 --> 00:22:47,826 మీ గురించి మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి, నిజాలు అర్థమవుతాయి. 452 00:22:47,910 --> 00:22:49,244 కబాబ్ షాప్ అంటే ఒకప్పుడు థెరపీ లాంటిదే. 453 00:22:49,328 --> 00:22:51,705 అందుకు బదులు మా అమ్మా నాన్న నాకు నిజమైన థెరపీకి డబ్బులు కడతారు. 454 00:22:51,788 --> 00:22:52,789 అవునా? 455 00:22:54,917 --> 00:22:56,084 ఫోన్స్, కావాలా? 456 00:22:56,960 --> 00:22:57,961 సరే. 457 00:22:59,171 --> 00:23:00,506 - సరే, అయితే… - థాంక్స్, మిస్టర్ రాస్. 458 00:23:00,589 --> 00:23:02,257 - సరే, ఇంటికి సురక్షితంగా వెళ్ళండి, సరేనా? - సరే. 459 00:23:02,341 --> 00:23:03,592 - నైట్. - బై. 460 00:23:04,593 --> 00:23:08,263 - ఏం జరుగుతోంది? మీకు ఏం అయింది? - ఏంటి? ఏమీ లేదు. ఏం జరగడం లేదు. 461 00:23:08,347 --> 00:23:10,933 మనం దృష్టి మళ్ళించుకోవడానికి ఫోన్లు మాత్రమే మార్గం కాదని తెలుసు కదా? 462 00:23:11,725 --> 00:23:13,852 బయటకు వెళ్లి ఎంజయ్ చేయాలని ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు? 463 00:23:16,355 --> 00:23:18,649 మనం ఇక్కడికి ఎవరిని స్మరించుకోవడానికి వచ్చామంటే… 464 00:23:19,191 --> 00:23:20,192 ఎలుక. 465 00:23:22,319 --> 00:23:23,946 ఫ్రెండ్, సహోద్యోగి… 466 00:23:25,531 --> 00:23:26,907 తండ్రి. 467 00:23:29,243 --> 00:23:32,955 ఈ ఎలుక ఎప్పుడూ నవ్వుతూ, కులాసాగా ఉండేది, 468 00:23:33,038 --> 00:23:36,291 ఇది ఎలాంటి ఎలుక అంటే… 469 00:23:36,375 --> 00:23:39,419 క్షమించు, అది మంచి ఎలుక అని వింటుంటే ఇంకా బాధగా ఉంది. 470 00:23:39,503 --> 00:23:40,504 సరే. 471 00:23:43,882 --> 00:23:45,843 నిజానికి ఇదొక చెత్త ఎలుక. 472 00:23:45,926 --> 00:23:47,427 - అవునా? నిజంగా? - అవును. 473 00:23:48,178 --> 00:23:49,179 ఇది పార్టీలకు వెళ్ళినప్పుడు 474 00:23:49,263 --> 00:23:52,391 ఖరీదైన వైన్ కొన్నది నేనే అని చాట్ లో రాసే రకం. 475 00:23:52,474 --> 00:23:53,559 ఇది ఎప్పుడూ 476 00:23:53,642 --> 00:23:56,395 "నేను తెచ్చిన దాన్ని తాగచ్చు కదా? అది చాలా బాగుంది" అని చెప్పే రకం. 477 00:23:56,478 --> 00:23:57,938 అసలు అలా… అలా మాట్లాడాల్సిన పనే లేదు. 478 00:23:58,021 --> 00:24:00,899 మనం అందరం ఫ్రెండ్స్, అలాగే ఎవరూ ఖరీదైన మందు తెమ్మని అడగలేదు 479 00:24:00,983 --> 00:24:02,359 - కాబట్టి… - అవును. 480 00:24:02,442 --> 00:24:05,904 అలాగే దీన్ని సోషల్ ఈవెంట్స్ కి ఆహ్వానించినప్పుడు తన కొడుకుని తీసుకొచ్చేది. 481 00:24:06,655 --> 00:24:08,574 కాబట్టి ఫ్రీగా మాట్లాడుకోలేం కూడా. అవును. 482 00:24:08,657 --> 00:24:11,243 కానీ ఇదేమో, "పర్లేదు, మిత్రమా. ఇప్పుడు మన వైబ్ వేరు" అనే రకం. 483 00:24:13,328 --> 00:24:14,371 వదిలించుకుని మంచి పనిచేశాం. 484 00:24:27,342 --> 00:24:28,343 - నువ్వు బానే ఉన్నావా? - అవును. 485 00:24:30,429 --> 00:24:31,430 అంటే, నువ్వు… 486 00:24:32,431 --> 00:24:34,892 మనం ఎంత కష్టపడినా ఒక్క క్షణం ఫోకస్ తప్పేసరికి 487 00:24:34,975 --> 00:24:38,478 మనం తిరిగి వెనక్కి తీసుకోలేనిది ఏదోకటి జరుగుతుంది. 488 00:24:41,940 --> 00:24:43,483 - క్షమించు. - లేదు. 489 00:24:47,696 --> 00:24:49,781 - నేను… నేను వెళ్ళాలి… - సరే. సరే. 490 00:24:50,282 --> 00:24:51,658 - సరే. హేయ్, నిక్కి? - సరే. 491 00:24:53,660 --> 00:24:54,953 నీకు రావాలని ఉంటే… 492 00:24:57,414 --> 00:24:58,582 సరే. అలాగే. 493 00:24:58,665 --> 00:25:01,293 - సరేనా? - సరే. థాంక్స్. 494 00:25:01,376 --> 00:25:02,377 మంచిది. 495 00:25:03,754 --> 00:25:04,755 సరే… 496 00:25:13,388 --> 00:25:14,389 కబాబ్స్ 497 00:25:14,473 --> 00:25:16,808 - అంటే ఆమె ఉన్నట్టుండి మీ ఫ్లాట్ కి వచ్చిందా? - ఉన్నట్టుండి వచ్చింది. 498 00:25:17,601 --> 00:25:20,479 అలాగే నా మాట విను, ఇది బాధగా ఉంటుందని నాకు తెలుసు, 499 00:25:20,562 --> 00:25:23,774 కానీ నిక్కి పూర్తిగా ఆందోళనలో మునిగిపోయింది. 500 00:25:23,857 --> 00:25:26,235 మనం ఆ బంధం వికసించడానికి కొంచెం టైమ్ ఇవ్వాలి కదా. 501 00:25:26,318 --> 00:25:28,987 రోజంతా దాన్నే గమనిస్తూ కూర్చుని 502 00:25:29,071 --> 00:25:32,449 బాణాసంచా గోడోన్ పేలినట్టు ఎప్పుడు ఆ బంధం పేలుతుందా అని ఎదురుచూడకూడదు. 503 00:25:33,033 --> 00:25:36,411 అలాగే, మా తోడల్లుడు అట్లాంటిక్ సముద్రం దాటుతూ తెడ్డు వేస్తున్నాడు. 504 00:25:36,495 --> 00:25:40,374 అమ్మ వెళ్ళిపోయింది, భార్య బాధపడుతోంది, తోడల్లుడు అట్లాంటిక్ లో ఉన్నాడు. 505 00:25:40,457 --> 00:25:41,834 దారుణమైన పరిస్థితే. 506 00:25:41,917 --> 00:25:44,086 చూడు, ప్రిన్సెస్ తన అమ్మతో సమయం గడపాలి అనుకోవడంలో తప్పు లేదు. 507 00:25:44,169 --> 00:25:46,421 కన్న తల్లి. తన అమ్మతో. అస్సలు నమ్మలేకపోతున్నా. 508 00:25:46,505 --> 00:25:47,631 ఏదైతేనేం, ఇది… 509 00:25:48,465 --> 00:25:49,842 నాకు అవన్నీ తలచుకుంటే ఒత్తిడిగా ఉంటోంది, 510 00:25:49,925 --> 00:25:52,594 పైగా… నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. 511 00:25:53,345 --> 00:25:55,556 సరే, ఒకసారి అన్నిటికీ మూలిగే వాస్తవం తెలియని అమ్మాయిలా ఇది మీకే బాధాకరమైన విషయం 512 00:25:55,639 --> 00:25:57,224 అన్నట్టు ఆలోచించకుండా ఉండటానికి ట్రై చేసారా? 513 00:25:57,307 --> 00:25:59,393 అంటే, ప్రస్తుత పరిస్థితి వల్ల నిక్కి ఎంత బాధపడుతుందో అర్థమవుతుంది కదా? 514 00:25:59,476 --> 00:26:00,727 - అయితే? - మరి మీరు ఆమెకు తోడుగా ఉన్నారా? 515 00:26:00,811 --> 00:26:02,187 - నేను తనకి తోడుగా ఎప్పుడూ ఉంటాను. - నిజంగా? 516 00:26:02,271 --> 00:26:04,690 ఎందుకంటే ప్రస్తుతం మీరు అర్థరాత్రి కబాబ్ షాప్ లో కూర్చున్నారు. 517 00:26:06,024 --> 00:26:09,778 ఎందుకంటే ఒకవేళ సీన్ లో గనుక మరొక తండ్రి ఉండి ఉంటే, మీరు నా ముందు మాట్లాడుతున్నట్టు 518 00:26:09,862 --> 00:26:13,907 "ప్రేమ ఉంటే చాలు" అని ఉత్తుత్తి బోధలు చేస్తారని నాకు అనిపించడం లేదు. 519 00:26:13,991 --> 00:26:16,159 ఒకదాని బుర్ర ఒకటి బద్దలుకొట్టడానికి ప్రయత్నించే గొర్రెపోతుల్లా కొట్లాడుకునేవారు. 520 00:26:16,243 --> 00:26:17,786 ఒకటి చెప్పనా? ప్రిన్సెస్ ఒకసారి తన 521 00:26:17,870 --> 00:26:20,163 గదిలో హ్యారీ స్టైల్స్ పోస్టర్ పెట్టినప్పుడు నాకు చాలా అసూయగా అనిపించింది. 522 00:26:20,664 --> 00:26:22,666 నేను కంగారు పడిపోయి వెల్వెట్ జాకెట్ కొనుక్కున్నాను. 523 00:26:22,749 --> 00:26:26,420 లేదు, మీరైతే ఆమె 18వ పుట్టిన రోజు పార్టీలో 524 00:26:26,503 --> 00:26:27,838 ప్రెజెంట్ల టేబుల్ మీద చేయి కుస్తీ చేసేవారు. 525 00:26:28,922 --> 00:26:31,175 నేనే గనుక మీ స్థానంలో ఉండి ఉంటే, ప్రిన్సెస్ వాళ్ళ చేతకాని 526 00:26:31,258 --> 00:26:35,804 పచ్చబొట్లతో నిండిపోయి, తనకూ, తన ఫ్రెండ్స్ కి ఫ్రీగా లాటేలు ఇచ్చే తన బరిస్టా నాన్న తిరిగి రావడానికి ముందే 527 00:26:35,888 --> 00:26:37,639 కొంచెం ఆమె దృష్టిలో నా విలువని పెంచుకోవడానికి ట్రై చేస్తా. 528 00:26:38,223 --> 00:26:39,641 చూసావా, ఇందుకే అన్నాను. ఇలా జరుగుతుందనే. 529 00:26:40,142 --> 00:26:42,644 కబాబ్ షాప్ కి ఉన్న మ్యాజిక్ ఇదే. 530 00:26:43,353 --> 00:26:44,980 ఇక్కడ నువ్వు కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. 531 00:26:45,564 --> 00:26:46,982 ఒకటి చెప్పనా? మనం ప్రతీ వారం ఇక్కడికి వస్తే మంచిది. 532 00:26:47,065 --> 00:26:48,192 - లేదు. - మాట్లాడుకోవడానికి. 533 00:26:48,275 --> 00:26:51,153 - మీకు అర్థమైందని నాకు అనిపించడం లేదు. - నువ్వు ఏదోక రోజు ఒక గొప్ప క్యాలీవి… 534 00:26:52,321 --> 00:26:54,323 అవుతావు. కచ్చితంగా. 535 00:26:56,700 --> 00:26:58,744 - మిత్రమా. - ఏంటి? 536 00:26:58,827 --> 00:27:00,704 మీ దగ్గర పిజ్జాలు ఉన్నాయా? 537 00:27:05,167 --> 00:27:07,211 హేయ్. నిద్ర లెగు. 538 00:27:08,253 --> 00:27:09,630 టైమ్ ఎంత అయింది? 539 00:27:10,130 --> 00:27:11,507 ఆరున్నర. 540 00:27:12,799 --> 00:27:14,259 నువ్వు పిజ్జా మార్నింగ్ మిస్ అవుతున్నావు. 541 00:27:29,566 --> 00:27:31,026 దారుణం. 542 00:28:23,662 --> 00:28:26,665 ఆఫీస్ లోని అమ్మాయి 543 00:29:21,720 --> 00:29:23,722 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్