1 00:00:09,885 --> 00:00:11,470 ఊరినిండా ప్రెట్ సాండ్ విచ్ షాప్ షాపులున్నాయి, 2 00:00:11,553 --> 00:00:13,972 మనం వెళ్ళాల్సిన ప్రదేశం ఏ షాపు పక్కన ఉందో తెలుసుకోవడం ఎలా? 3 00:00:14,473 --> 00:00:15,891 ఎక్కడో స్కాట్ నే అడగొచ్చుగా? 4 00:00:15,974 --> 00:00:17,851 లేదు, నేను వస్తున్నట్టు అతనికి తెలీదు. 5 00:00:17,935 --> 00:00:18,936 సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. 6 00:00:22,940 --> 00:00:24,441 మన వాళ్ళు అంత నెమ్మదిగా ఎందుకు నడుస్తున్నారు? 7 00:00:24,525 --> 00:00:26,068 ఒక పిల్లిని చూసి దానితో ఆడటానికి ఆగారు. 8 00:00:26,151 --> 00:00:27,569 -ఏంటి? పిల్లితోనా? -అవును. 9 00:00:27,653 --> 00:00:28,654 దేవుడా. 10 00:00:29,071 --> 00:00:30,155 త్వరగా రండి! 11 00:00:32,406 --> 00:00:34,826 పుస్తకం లాంచ్ కి కప్ కేకులు ఎందుకు తీసుకొస్తున్నావు? 12 00:00:34,910 --> 00:00:35,953 "గొప్ప పని" చేసావని అభినందించడానికి. 13 00:00:36,745 --> 00:00:38,664 ఫ్రెడ్డీ మాకు వీటిని అస్తమాను పంపుతున్నాడు. 14 00:00:39,164 --> 00:00:41,166 అలా చేస్తే జనం అతను మంచివాడనుకుంటారనేమో! 15 00:00:43,085 --> 00:00:44,920 అయితే, జేసన్ కీ నీకూ మధ్య పరిస్థితి ఎలా ఉంది? 16 00:00:45,629 --> 00:00:47,464 -అతన్ని ఇంకా క్షమించలేదా? -లేదు. 17 00:00:47,548 --> 00:00:50,384 ముందు మా ఫ్లాట్ కొనడం గురించి అబద్దం చెప్పాడు, కారణంగా ఇప్పుడు అది పోతుంది, 18 00:00:50,467 --> 00:00:53,262 తర్వాత బెవ్ కి కొన్ని విషయాలు చెప్పాడు, ఆవిడేమో వాటిని ఆధారం చేసుకొని పిల్లల్ని దూరం చేయడానికి చూస్తోంది, 19 00:00:53,345 --> 00:00:57,140 ఆ తర్వాత, పోయిపోయి స్కాట్ చేతికి మా డబ్బు అప్పగించి, పది వేల పౌండ్లు జూదంలో పోసాడు. 20 00:00:59,393 --> 00:01:02,479 పోయిపోయి అంటే, ఆ పనికి సరైన వ్యక్తి అని నా ఉద్దేశం. 21 00:01:03,272 --> 00:01:04,480 -సర్లే. -అయినా కూడా. 22 00:01:04,565 --> 00:01:06,024 -అక్కడే ఉంది. -సరే. 23 00:01:06,108 --> 00:01:07,860 ఇలా వినండి… కార్యక్రమం అక్కడ జరుగుతోంది! 24 00:01:07,943 --> 00:01:11,029 ఆర్థికశాస్త్రంపై పుస్తకం అంటే గొప్పే. నిజంగా ప్రశంసనీయం. 25 00:01:11,113 --> 00:01:12,489 అవును, నాకు చాలా సంతోషంగా ఉంది. 26 00:01:13,156 --> 00:01:17,786 చెప్పాలంటే జిల్లీ, నిక్కి, నువ్వు, నేను, అతని కుటుంబం, అతని ఫ్రెండ్స్, 27 00:01:17,870 --> 00:01:22,624 మన ఫ్రెండ్స్ ఇంకా మన ఇంటి దగ్గరలో ఉన్న బిల్డర్ ఇంకా కెరెన్ అతని గురించి అనుకున్నది తప్పని నిరూపించాడు. 28 00:01:22,708 --> 00:01:24,293 అతన్ని తలచుకుంటే చాలా సంతోషంగా ఉంది. 29 00:01:24,376 --> 00:01:27,546 అంటే, మన కూతురిని సంతోషంగా చూసుకుంటే చాలు, 30 00:01:27,629 --> 00:01:30,966 తన భర్త ఏం పని చేసినా ఏమీ అనుకోము అంటుంటాం, కానీ అది నిజం కాదు. 31 00:01:31,049 --> 00:01:33,468 మనం ముందెన్నడూ ఇలాంటి సాహిత్య పార్టీలకు వెళ్లనేలేదు. 32 00:01:33,552 --> 00:01:35,888 అక్కడ మనం ఇమడగలం అనుకుంటున్నావా? మనమేం తలదించుకునేలా ఉండం కదా? 33 00:01:36,513 --> 00:01:37,681 అలా ఏం ఉండదు, జిల్. ఏం కాదు. 34 00:01:41,351 --> 00:01:42,978 రావడానికి ఇంత సేపా? 35 00:01:43,061 --> 00:01:45,314 పిల్లితో ఆడటానికి మీకు ఎంత సమయం కావాలి? 36 00:01:45,397 --> 00:01:48,192 అది చాలా అందంగా ఉంది, అలాగే దానికోసం చాలా మంది క్యూలో ఉన్నారు. 37 00:01:50,485 --> 00:01:51,570 సరేలే, ఇక రండి. 38 00:02:07,127 --> 00:02:08,127 ఏంటిది… 39 00:02:14,843 --> 00:02:16,386 స్కాట్ ఫిల్బర్ట్ - గొప్ప బ్యాంకర్ మీరు ద్వేషించడానికి ఇష్టపడే వ్యక్తి 40 00:02:19,348 --> 00:02:20,682 గొప్ప బ్యాంకర్! 41 00:02:21,266 --> 00:02:22,684 వావ్. నైస్. 42 00:02:22,768 --> 00:02:23,769 అద్భుతం. 43 00:02:28,023 --> 00:02:29,024 ఓహ్, అయ్యో. 44 00:02:29,858 --> 00:02:30,859 కామ్డెన్ లాక్ 45 00:02:45,415 --> 00:02:46,834 నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 46 00:02:47,417 --> 00:02:49,795 నువ్వు… స్కూల్ పూర్తి అయిన తర్వాత ఫుట్బాల్ ప్రాక్టీసు చేయించడం లేదా? 47 00:02:49,878 --> 00:02:51,421 లేదు, ఆ పని ఏమీకి అప్పజెప్పాను. 48 00:02:51,505 --> 00:02:53,090 స్కాట్, అసలేం జరుగుతోంది? 49 00:02:53,173 --> 00:02:55,801 అయ్యో, నా కోసం నువ్వు నీ ప్లాన్స్ మార్చుకోవద్దు, కెరెన్. సరేనా? 50 00:02:55,884 --> 00:02:58,053 నువ్వు వెనక్కి వెళ్ళాలి అనుకుంటే, నేను ఏమీ అనుకోను. 51 00:02:58,136 --> 00:02:59,179 లేదు, అదేం పర్లేదు. 52 00:02:59,263 --> 00:03:01,890 అసలు ఏంటిది? నా ఉద్దేశం, నువ్వు ఏం చేస్తున్నావు? 53 00:03:01,974 --> 00:03:04,017 నిజ జీవితంలో కూడా అచ్చం అలాగే ఉన్నాడు. 54 00:03:05,978 --> 00:03:06,979 ఆమె అంటున్నదానికి అర్థం ఏంటి? 55 00:03:07,062 --> 00:03:10,774 అలాగే ఈ ఫోటోలలో ఎందుకు మొహం అలా వింతగా పెట్టావు? 56 00:03:14,444 --> 00:03:15,654 అవును. 57 00:03:15,737 --> 00:03:16,905 కనాపే కావాలా? 58 00:03:20,868 --> 00:03:22,035 థాంక్స్. 59 00:03:24,162 --> 00:03:25,581 మీరు కచ్చితంగా తీసుకోనవసరం లేదు. 60 00:03:26,623 --> 00:03:28,041 అవునా? 61 00:03:31,795 --> 00:03:32,796 ఒక్క క్షణం. 62 00:03:38,552 --> 00:03:40,137 -ఆ చేప ముక్కలు బాగున్నాయా? -అవును. 63 00:03:40,888 --> 00:03:42,973 వీటిని కూడా నా నుండి తీసుకొని స్కాట్ కి ఇద్దామని అనుకుంటున్నావా? 64 00:03:43,056 --> 00:03:45,601 బహుశా ఇంకొక ఆరునెలల్లో అతను ఇందులో ముప్పావు వంతు నీకు తిరిగి ఇస్తాడేమో. 65 00:03:45,684 --> 00:03:48,228 ఊరుకో. నిక్కి… నిక్… 66 00:03:48,729 --> 00:03:50,606 నా వెనుక వచ్చేటట్టు అయితే ఆ చేప ముక్కలు ఇంకా తీసుకురా. 67 00:03:52,149 --> 00:03:54,568 అంటే, అందరూ నువ్వు పుస్తకంలో ఉన్న ఒక పాత్రవి అనుకుంటున్నారా? 68 00:03:55,068 --> 00:03:58,280 అవును, అంటే, నా ఉద్దేశంలో ఇది ఒక సాహిత్యపరమైన విషయం, తెలుసా? 69 00:03:58,363 --> 00:04:00,657 అంటే రచయితకు ఉండే కలం పేరు లాంటిది. చాలా మంది రచయితలు ఇలా చేస్తుంటారు. 70 00:04:00,741 --> 00:04:02,075 జార్జ్ ఎలియట్ కూడా చేసాడు. 71 00:04:02,159 --> 00:04:03,660 ఆయన్ని కూడా జనం చాలా గౌరవిస్తుంటారు. 72 00:04:03,744 --> 00:04:06,038 స్కాట్, వీళ్లంతా నిన్ను చూసి నవ్వుతున్నారు. 73 00:04:06,747 --> 00:04:09,291 అంటే, జనం జీసస్ ని చూసి కూడా నవ్వారు, 74 00:04:09,374 --> 00:04:11,001 కానీ ఇప్పుడు ఆయన అందరి మనసులో ఉన్నాడు. సరేనా? 75 00:04:11,084 --> 00:04:13,504 నేను గనుక ఈ క్రిస్మస్ సీజన్ లో ఆయన పొందిన పేరులో సగం పొందినా… 76 00:04:13,587 --> 00:04:14,505 వద్దు! 77 00:04:14,588 --> 00:04:18,132 స్కాట్, నీకోసం హెల్మెట్ ఇంకా గార్డు తీసుకొచ్చా. 78 00:04:19,801 --> 00:04:21,637 మనీ కేనన్ విషయంలో చిన్న అపార్థం చోటుచేసుకుంది. 79 00:04:21,720 --> 00:04:23,931 జనం అందులో నోట్లకు బదులు చిల్లర వేశారు. 80 00:04:24,014 --> 00:04:26,517 ఇవి వేసుకుంటే నీకు ఎలాంటి దెబ్బలు తగలవు. 81 00:04:28,810 --> 00:04:32,397 వద్దు. నువ్వు ఇలాంటి రచయితవి కావాలనుకోలేదు. 82 00:04:32,481 --> 00:04:35,275 నేను ప్రయత్నించా. కెరెన్, కానీ… ఇంతకంటే నేను సాధించలేకపోయాను. 83 00:04:36,485 --> 00:04:38,695 మళ్ళీ ప్రయత్నించే స్ఫూర్తి నాకు లేదు. 84 00:04:54,169 --> 00:04:56,380 ఫ్లాట్ విషయంలో నీకు అబద్దం చెప్పినందుకు నన్ను క్షమించు. 85 00:04:56,463 --> 00:04:59,633 నిన్ను అడగకుండా పెట్టుబడి పెట్టడానికి డబ్బును స్కాట్ కి ఇచ్చినందుకు నన్ను క్షమించు. 86 00:04:59,716 --> 00:05:00,968 -జూదం ఆడటానికి. -అది జూదం కాదు. 87 00:05:01,051 --> 00:05:02,427 అవును, అది జూదమే. 88 00:05:03,345 --> 00:05:05,180 అందరూ ధనవంతులు కాలేరు, జేసన్. 89 00:05:05,264 --> 00:05:08,767 మనలాంటి వారి నుండి డబ్బులు దండుకోవడానికి అవన్నీ వాళ్ళు చెప్పే కథలు అంతే. 90 00:05:08,851 --> 00:05:10,894 డబ్బు ఇచ్చేముందు నన్ను అడగాలన్న ఆలోచన కూడా నీకు రాలేదు. 91 00:05:10,978 --> 00:05:12,896 నేను నీకు పరిష్కారాన్ని ఇవ్వాలనుకున్నాను, సమస్యలను కాదు. 92 00:05:12,980 --> 00:05:15,607 నాకోసం నువ్వు దారి సిద్ధం చేయడానికి నేనేం చిన్న పిల్లని కాదు. 93 00:05:15,691 --> 00:05:18,527 -పరిష్కారం పొందడానికి నేను నీకు సహాయం చేయగలను. -మన సమస్యకు పరిష్కారం నాకు కనిపించలేదు, బేబ్. 94 00:05:18,986 --> 00:05:20,320 మనం… 95 00:05:21,238 --> 00:05:22,489 మనం ఆ డబ్బు మా అమ్మా నాన్నలను అడిగి ఉండేవారం. 96 00:05:22,573 --> 00:05:23,991 అంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు. 97 00:05:24,074 --> 00:05:26,660 గ్యాసు అయిపోతుందేమో అని పాపం వాళ్ళు పొయ్యి మీద పెద్ద మంట కూడా పెట్టరు. 98 00:05:27,160 --> 00:05:29,454 అయినా కూడా, నాకు మరొకరి డబ్బుతో ఇల్లు కొనాలని లేదు. 99 00:05:29,538 --> 00:05:32,249 మన బెస్ట్ అవకాశం స్కాట్ ద్వారానే అనిపించింది. వాడు డబ్బును షార్ట్ చేయగలడనుకున్నా. 100 00:05:32,958 --> 00:05:34,168 -అంటే ఏంటి అర్ధం? -షార్ట్ చేయగలడు. 101 00:05:34,251 --> 00:05:36,128 ఫైనాన్స్ రంగంలో ఉన్న వారు డబ్బు సంపాదించడానికి చేసే పని అది. 102 00:05:36,211 --> 00:05:37,713 వాళ్ళు షార్ట్ చేసి అమ్ముతారు. షార్ట్ చేస్తారు. 103 00:05:37,796 --> 00:05:39,339 "షార్ట్ చేస్తారు" అంటే ఏంటి నీ ఉద్దేశం? 104 00:05:39,423 --> 00:05:40,757 నీకు తెలుసు కదా, షార్ట్ చేయడం. 105 00:05:41,842 --> 00:05:44,219 -షార్ట్ చేయడం! -"షార్ట్ చేయడం" అనడం ఆపు! 106 00:05:44,303 --> 00:05:46,388 నేనేం ఆ డబ్బును లంకె బిందెలు కొనమని ఇవ్వలేదు, సరేనా? 107 00:05:46,471 --> 00:05:49,183 అతనొక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. మరీ అంత సన్నాసి అయ్యుండడు కదా అని ఇచ్చా. 108 00:05:50,559 --> 00:05:52,394 భలే సమయానికి దాన్ని తెచ్చావు, బాబు. చాలా థాంక్స్. 109 00:05:53,854 --> 00:05:55,022 నేను పరిస్థితిని చక్కబెట్టడానికి చూస్తున్నా. 110 00:05:55,105 --> 00:05:57,191 అందుకే ట్యాక్సీ కూడా నడుపుతున్నా. డబ్బు బాగానే వస్తోంది. 111 00:05:57,274 --> 00:05:59,610 అవును, నన్ను అడగకుండా నువ్వు తీసుకున్న మరొక నిర్ణయం కదా అది. 112 00:06:00,360 --> 00:06:02,404 అన్నిటికీ మించి, 113 00:06:02,905 --> 00:06:05,616 నువ్వు మన సమస్యల గురించి బెవ్ కి చెప్పావు. 114 00:06:05,699 --> 00:06:08,327 మనకు, మన పిల్లలకు అడ్డుగా నిలబడుతున్న వ్యక్తికి. 115 00:06:08,410 --> 00:06:09,244 నేను ఆమెకు చెప్పడానికి కారణం 116 00:06:09,328 --> 00:06:12,206 మన జీవితాలు ఆమె జీవితం కంటే మెరుగ్గా ఉన్నాయని ఆమె అనుకోకుండా ఉండాలని, 117 00:06:12,289 --> 00:06:14,833 మనదొక పర్ఫెక్ట్ కుటుంబం అని భ్రమ పడకూడదని. 118 00:06:14,917 --> 00:06:15,918 కానీ అది పెద్ద పొరపాటైంది. 119 00:06:16,001 --> 00:06:17,461 -అవునా? -అవును! 120 00:06:18,795 --> 00:06:21,256 ఇలాంటి చెత్త నిర్ణయాలన్నీ మనం కలిసి తీసుకునేవారం. 121 00:06:24,384 --> 00:06:25,886 అలాగే మనం ఇప్పుడు ఒకప్పటిలా మాట్లాడుకోవడం లేదు. 122 00:06:27,888 --> 00:06:31,183 -ఓరి, దేవుడా. -చూడు, ప్రస్తుతం సర్జ్ రేటు నడుస్తోంది, సరేనా? 123 00:06:32,017 --> 00:06:33,602 సరే, నేను ఇక వెళ్తాను. 124 00:06:33,685 --> 00:06:35,312 చూడు, నేను ఇక్కడ ఉండటం కంటే 125 00:06:35,395 --> 00:06:37,105 బయటకు పోయి మన కుటుంబం కోసం పని చేయడం మంచిది, సరేనా? 126 00:06:37,189 --> 00:06:39,316 కాబట్టి నేను ఇక వెళ్తా, మనం మళ్ళీ మాట్లాడుకుందామా? 127 00:06:41,151 --> 00:06:42,194 నిక్? 128 00:06:43,820 --> 00:06:45,697 సరే. 129 00:06:52,871 --> 00:06:55,290 నేను ఇంటికి వెళ్ళాక ఉడకబెట్టిన గుడ్డు తింటా. 130 00:06:55,791 --> 00:06:56,625 సరే. 131 00:06:56,708 --> 00:06:59,461 అడుగుతున్నానని ఏం అనుకోవద్దు. ఆర్థిక శాస్త్రంపై రాసిన పుస్తకాన్ని ఇలాగే అమ్ముతారా? 132 00:07:00,045 --> 00:07:02,840 ఏ… ఏమో. నేను ఆర్దికశాస్త్ర పుస్తకాలను అమ్మను. 133 00:07:02,923 --> 00:07:04,550 అంటే, నాకు తెలిసి ఎవరూ ఆ పుస్తకాలను అమ్మరు. 134 00:07:05,175 --> 00:07:07,219 -నాకు తెలుసు, కానీ మీరు… మీరు ఈయనతో… -లేదు. 135 00:07:07,302 --> 00:07:08,762 ఇది ఒక కామెడీ పుస్తకం. 136 00:07:08,846 --> 00:07:12,182 నిజం చెప్పాలంటే, ఇతను రాసిన ఈ మాత్రం దానికి… 137 00:07:12,599 --> 00:07:13,642 డబ్బులు ఇవ్వడమే గొప్ప. 138 00:07:14,643 --> 00:07:15,811 అయితే, డబ్బు ఎప్పుడు ఇస్తారు? 139 00:07:15,894 --> 00:07:17,229 ఈ మార్కెటింగ్ ఖర్చులకు చెల్లించిన తర్వాత, 140 00:07:17,312 --> 00:07:18,730 ఎందుకంటే, ఈ ఏర్పాట్లకు తక్కువేం కాదు. 141 00:07:19,231 --> 00:07:20,983 అంటే, దీనికి ఖర్చు అంతా ఈయనే పెట్టుకుంటున్నాడా? 142 00:07:21,066 --> 00:07:23,443 అవును, నిజమే, అలాగే ఇంత చేసినందుకు నేను ఇతన్ని మెచ్చుకుంటున్నాను. 143 00:07:23,527 --> 00:07:25,737 నేను ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. 144 00:07:26,530 --> 00:07:30,284 అంటే, ప్రస్తుతం ఈ కంపెనీ చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉంది. 145 00:07:30,367 --> 00:07:31,743 పబ్లిషింగ్ అంతా ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది. 146 00:07:31,827 --> 00:07:34,621 చెఫ్ల చేత వ్రాయబడితే తప్ప చాలా పుస్తకాలకు అడ్వాన్స్ కూడా రాదు. 147 00:07:34,705 --> 00:07:36,081 నీకు వంటలు వచ్చా? 148 00:07:38,166 --> 00:07:39,668 -లేదు. -సరే. 149 00:07:39,751 --> 00:07:41,920 కానీ నీకు గనుక ఎవరైనా చెఫ్ తెలిసినా లేక, ఎవరినైనా కలిస్తే, 150 00:07:42,004 --> 00:07:43,672 నాకు కొంచెం చెప్తావా? 151 00:07:44,256 --> 00:07:45,257 నన్ను క్షమించండి, కానీ… 152 00:07:45,924 --> 00:07:49,094 కానీ ఈ పుస్తకం కామెడీ విభాగంలో లాంచ్ కావాలని ఆయన అనుకోలేదు. 153 00:07:49,178 --> 00:07:53,432 చూడండి, స్కాట్ కి మరియు బుకర్ ప్రైజ్ కి మధ్య నేనేం అడ్డుగా లేను. 154 00:07:53,932 --> 00:07:55,392 నేను నీలాంటి వారితో కలిసి పెరిగాను, స్కాట్. 155 00:07:55,475 --> 00:07:57,060 నేను లేకపోతే, నువ్వేం సాధించలేవు. 156 00:07:57,144 --> 00:08:00,397 సాయంత్రం పూట వీధి చివర్లలో వింత బట్టలు వేసుకొని 157 00:08:00,480 --> 00:08:04,318 చిన్న పిల్లలకు డప్పు వాయిస్తూ కట్టుకథలు చెప్పుకొనే ఒక అనామకుడిగా మిగిలిపోతావు. 158 00:08:04,401 --> 00:08:06,945 నువ్వేం పెద్ద రచయితవి కాలేవు, 159 00:08:07,863 --> 00:08:09,907 నీ జీవితంలో ప్రచురించబడే పుస్తకం ఏదైనా ఉండబోతుందంటే అది ఇదే. 160 00:08:11,116 --> 00:08:12,201 ఇక మేము వెళతాం, సరేనా? 161 00:08:12,701 --> 00:08:13,952 మిమ్మల్ని కలవడం సంతోషం. 162 00:08:14,036 --> 00:08:15,037 ఎంజాయ్ చేయండి. 163 00:08:19,208 --> 00:08:22,294 సరే, ఇప్పుడు నీకు స్ఫూర్తి కలిగినట్టు ఉంది కదా. 164 00:08:23,921 --> 00:08:24,963 పదా. 165 00:08:25,547 --> 00:08:27,174 నీ కలను సగమే నిజం చేసుకొని నువ్వు సాధించబోయేది ఏమీ లేదు. 166 00:08:28,425 --> 00:08:31,303 నన్ను క్షమించండి, కానీ ఇవి మావి. 167 00:08:31,803 --> 00:08:33,679 బాగా ఎంజాయ్ చేస్తున్నారా, అమ్మాయిలు? 168 00:08:33,764 --> 00:08:35,182 సరే, లెగండి. మనం వెళ్ళాలి. 169 00:08:35,265 --> 00:08:37,058 మీకు వీలైనంత ఆహారాన్ని తీసుకోండి. పదండి. 170 00:08:37,142 --> 00:08:38,894 సరేలే, ఇక అవి నాకు ఇవ్వు. థాంక్స్. 171 00:08:38,977 --> 00:08:41,813 మరీ కరువు ప్రాంతం నుండి వచ్చినట్టు తినకండి. సరే. పదండి. చిరుతిళ్ళను తెచ్చేయండి. 172 00:08:41,897 --> 00:08:43,565 వీటి కోసం డబ్బు ఇచ్చింది మేమే. 173 00:08:47,110 --> 00:08:50,280 పదండి. వెళ్ళండి! 174 00:08:50,364 --> 00:08:51,448 వస్తున్నాం! 175 00:08:52,658 --> 00:08:53,992 మా ఆర్థిక సలహాదారుడిని చూడండి. 176 00:08:54,076 --> 00:08:56,119 ప్లేటులో తిండి పెట్టుకొని రోడ్డు మీద పరిగెడుతున్నాడు. 177 00:08:57,246 --> 00:08:58,247 పదండి! 178 00:09:00,332 --> 00:09:03,043 పై అంతస్తు ఆఫర్ లో ఉంది 179 00:09:17,432 --> 00:09:20,811 ఈ ఆహారం అంతా పూర్తయ్యేవరకు ఆగలేకపోతున్నా, అప్పుడు తిరిగి ఫ్రెడ్డీపై కోపపడొచ్చు. 180 00:09:21,311 --> 00:09:22,521 పంపడం ఆపమని నేను వాడితో చెప్తా. 181 00:09:22,604 --> 00:09:24,690 మరీ గట్టిగా లాగేయకు. ఇవి మంచి క్వాలిటీ కేకులు. 182 00:09:25,899 --> 00:09:26,984 సరే, ఇదేంటి? 183 00:09:27,359 --> 00:09:31,280 రెంచ్ కి బదులుగా నేను టైలర్ కోసం సర్ప్రైజ్ ఇద్దామని తెచ్చాను. 184 00:09:31,905 --> 00:09:34,157 జేస్, నువ్వు బలవంతంగా ప్రేమను పుట్టించలేవు. 185 00:09:35,242 --> 00:09:36,493 అయినా వీడు చాలా చిన్నగా ఉన్నాడు. 186 00:09:37,077 --> 00:09:39,454 -చాలా చిన్నగా ఉన్నాడు. -కానీ అందంగా ఉన్నాడు. 187 00:09:39,538 --> 00:09:42,165 లేదు, నాకు నచ్చలేదు. హత్తుకోవడానికి కూడా సరిపోడు. 188 00:09:42,249 --> 00:09:43,709 అయితే ఏం చేద్దామనుకుంటున్నావు? 189 00:09:43,792 --> 00:09:47,671 టైలర్ ని తలచుకుంటే బాధగా ఉంది, కానీ మనం వెనక్కి పంపేసి ఇంకొక పెద్ద వాడిని తీసుకుంటే మంచిది. 190 00:09:47,754 --> 00:09:49,339 చాలా అందంగా ఉన్నాడు, కానీ చేసేది ఏమీ లేదు. 191 00:10:12,905 --> 00:10:14,740 టైలర్ 192 00:10:40,098 --> 00:10:40,933 ఇదంతా ఏంటి? 193 00:10:41,725 --> 00:10:43,810 రాత్రికి మా అమ్మాయిలం ఎంజాయ్ చేద్దామని జెన్ ని ఇంటికి రమ్మన్నాను. 194 00:10:44,186 --> 00:10:46,146 ఇంట్లో ప్రశాంతంగా స్పా ఏర్పాటు చేస్తున్నా. 195 00:10:48,232 --> 00:10:49,858 తర్వాత తనని పనిలో నుండి తీసేస్తా. 196 00:10:51,318 --> 00:10:53,487 కానీ జేస్, తను వచ్చేలోగా మనం మాట్లాడుకోవచ్చా? 197 00:10:53,570 --> 00:10:55,030 క్షమించు, బేబ్. నేను బయటకు వెళ్తున్నాను. 198 00:10:55,113 --> 00:10:57,616 సీరియస్ గా అంటున్నావా? మనం ఇంకా మాట్లాడుకోలేదు. 199 00:10:57,699 --> 00:10:59,451 నాకు తెలుసు, కానీ ఇది పీక్ టైమ్, సరేనా? 200 00:10:59,535 --> 00:11:02,246 ఇప్పుడు రెండు గంటలు పనిచేస్తే, నాలుగు గంటలు చేసినట్టు. క్షమించు… రేపు మాట్లాడుకుందామా? 201 00:11:02,329 --> 00:11:03,539 -సరేనా? -జేస్. 202 00:11:03,622 --> 00:11:04,790 క్షమించు, నిక్. క్షమించేసేయ్. 203 00:11:10,754 --> 00:11:11,755 బై. 204 00:11:19,805 --> 00:11:21,056 ఇది భలే ఉంది. 205 00:11:22,140 --> 00:11:23,642 మా జిమ్ లో కూడా ఇలా చేస్తుంటారు. 206 00:11:24,518 --> 00:11:26,687 అలాగే కొన్నిసార్లు జిమ్ నుండి ఇంటికి వెళ్లిన తర్వాత ఇంట్లో కూడా చేసుకుంటా. 207 00:11:37,155 --> 00:11:38,156 సరే, అయితే… 208 00:11:39,032 --> 00:11:40,826 జెన్, నీకు… 209 00:11:40,909 --> 00:11:41,910 హాయ్, జెన్. 210 00:11:42,661 --> 00:11:44,079 హాయ్, ప్రిన్సెస్. 211 00:11:44,162 --> 00:11:45,163 నీకు నా పచ్చబొట్టు నచ్చిందా? 212 00:11:46,331 --> 00:11:48,000 ఇది భలే ఉంది. 213 00:11:48,083 --> 00:11:51,044 నాకు ఆరు పచ్చబొట్లు ఉన్నాయి, కానీ వాటిని నీకు చూపలేను. 214 00:11:52,254 --> 00:11:53,672 నేను… 215 00:11:54,840 --> 00:11:57,176 దానిని సూచించినంత సేపు ఉంచుకొని తర్వాతే తియ్యి. 216 00:11:57,259 --> 00:11:58,260 సరే. 217 00:11:58,343 --> 00:12:01,388 ఆ పిల్ల అలాగే యవ్వనంగా ఉంటే, బస్సులో ఫ్రీగా తీసుకెళ్లడం ఎక్కువ రోజులు వీలవుతుంది. 218 00:12:07,978 --> 00:12:08,979 సరే. 219 00:12:10,355 --> 00:12:12,649 -అయితే, జెన్… -నాదొక చిన్న ప్రశ్న. 220 00:12:14,443 --> 00:12:15,903 నీకు డిప్రెషన్ ఉందని ఎలా తెలుసుకుంటావు? 221 00:12:16,987 --> 00:12:18,614 జెన్, ఏమైంది? 222 00:12:18,697 --> 00:12:22,034 నాకు టింకిల్ తో ఉండాలని ఉంది, కానీ తనకు నాతో ఉండాలని లేదు అనిపిస్తుంది. 223 00:12:22,117 --> 00:12:24,745 నీతో ఉండాలని అనుకోని వారు కావాలని నువ్వు మాత్రం ఎందుకు అనుకుంటున్నావు? 224 00:12:24,828 --> 00:12:26,330 ఎందుకంటే సహజంగా వాళ్ళే అందరికన్నా బెస్ట్. 225 00:12:26,413 --> 00:12:27,331 అవును, నిజమే. 226 00:12:27,915 --> 00:12:28,957 మేము వేర్వేరు వారితో డేటింగ్ చేస్తున్నాం, 227 00:12:29,041 --> 00:12:31,418 కానీ ఇప్పటికే ఆమె "సరదా డేటింగ్" అని 17 సార్లు అంది. 228 00:12:31,502 --> 00:12:32,544 ఓరి, దేవుడా. 229 00:12:32,628 --> 00:12:36,507 ప్రతీ తరం వారు తమ మధ్య ఎలాంటి కట్టుబడి లేకుండా సెక్స్ చేయడం సాధ్యమే అనుకుంటారు. 230 00:12:36,590 --> 00:12:38,634 జెన్, అది ఎవరికీ సాధ్యం కాదు. 231 00:12:38,717 --> 00:12:42,930 మనందరికీ కట్టుబాటు కావాలి. కట్టుబాట్లు మనకే మంచివి. కట్టుబాటు ఉంటేనే ఏదైనా నిలుస్తుంది. 232 00:12:44,348 --> 00:12:47,100 నేను చాలా కాలంగా నా వృత్తిపై మాత్రమే దృష్టి పెట్టాను. 233 00:12:48,602 --> 00:12:50,562 ఇక ఇప్పుడు నేను అనుకున్నది సాధించా అనిపిస్తుంది… 234 00:12:51,063 --> 00:12:53,398 కాబట్టి ఇక నా ప్రేమ జీవితంపై కూడా దృష్టి పెట్టే సమయం అయిందని అనిపిస్తుంది. 235 00:12:53,482 --> 00:12:55,609 నాకు ఆధారపడగల ఒక వ్యక్తి కావాలి. 236 00:12:55,692 --> 00:12:57,945 డ్రగ్స్ మత్తులో తేలే అందగాళ్ళ వెంటపడటం మానేసి 237 00:12:58,028 --> 00:13:00,656 స్థిరత్వం ఉన్న వ్యక్తిని వెతుక్కుంటే మంచిది అనిపిస్తుంది, సరేనా? 238 00:13:02,157 --> 00:13:04,409 నేను ప్రేమలో పడాలి. 239 00:13:06,119 --> 00:13:08,205 కానీ ప్రేమ అనుకున్న వెంటనే నీ దగ్గరకు వచ్చేయదు. 240 00:13:09,248 --> 00:13:10,582 అదేం మంత్రం కాదు. 241 00:13:11,667 --> 00:13:12,918 ప్రేమ ఒక ఉద్యోగం లాంటిది. 242 00:13:14,169 --> 00:13:15,629 దానికోసం కష్టపడి పని చేయాలి. 243 00:13:17,130 --> 00:13:19,466 కానీ మనస్ఫూర్తిగా కావాలనుకుటే, కచ్చితంగా దొరుకుతుంది. 244 00:13:21,260 --> 00:13:22,636 నువ్వు నాతో చాలా మంచిగా మాట్లాడతావు. 245 00:13:23,428 --> 00:13:25,264 నాకు తెలిసిన అత్యంత మంచి మనిషివి నువ్వు. 246 00:13:27,307 --> 00:13:29,184 నాతో ఏదో మాట్లాడాలి అన్నావు కదా, ఏంటది? 247 00:13:31,603 --> 00:13:33,397 -అదేం లేదులే. -సరే. 248 00:13:43,282 --> 00:13:45,409 స్ఫూర్తి అందించే గోడ కథ కోసం ఐడియాలు 249 00:13:45,492 --> 00:13:47,619 రోజువారీ రచనా రొటీన్ కథ విధానం 250 00:13:55,878 --> 00:13:58,046 మరపు తెప్పించే టెలీఫోన్ స్కాట్ ఫిల్బర్ట్ రచన 251 00:13:58,130 --> 00:13:59,673 ఆకాశం కారు మబ్బులతో భయోత్పాతంగా ఉంది. 252 00:14:00,841 --> 00:14:02,092 నువ్వు ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు? 253 00:14:02,176 --> 00:14:05,470 నా ఆఫీసు వంటగదికి మరీ దగ్గరగా ఉంది, అక్కడి శబ్దాలతో దృష్టి పెట్టలేకపోతున్నాను. 254 00:14:11,101 --> 00:14:12,936 -రైటింగ్ ఎలా సాగుతోంది? -బాగానే ఉంది. అవును. 255 00:14:13,020 --> 00:14:14,730 చాలా స్పీడుగా రాస్తున్నాను. 256 00:14:14,813 --> 00:14:17,232 కథ ఐడియాలు బ్యాంక్ దొంగతనం 257 00:14:17,858 --> 00:14:20,485 గుర్తుంది కదా, నిద్రపోయే సమయానికి అయిదు పేజీలు పూర్తి కావాలి. 258 00:14:20,569 --> 00:14:21,820 తప్పకుండా రాస్తాను. 259 00:14:21,904 --> 00:14:23,947 ఇవాళ రాత్రికే కదా? పూర్తి చేస్తా. 260 00:14:25,407 --> 00:14:26,950 ఫాంట్ కొంచెం పెద్దగా చేయొచ్చా? 261 00:14:27,034 --> 00:14:28,577 లేదు. అలా ఏం చేయకూడదు. 262 00:14:29,661 --> 00:14:31,538 కథ ఇంకా… అప్పుడే… ఇంకా చదివేంతగా ఏమీ లేదు. 263 00:14:31,622 --> 00:14:32,706 ఓహ్, నోరు మూసుకో. 264 00:14:34,082 --> 00:14:35,667 ఆకాశం కారు మబ్బులతో భయోత్పాతంగా ఉంది. 265 00:14:35,751 --> 00:14:37,169 జరిగిన దారుణానికి చక్కగా సరిపడేలా ఉంది. 266 00:14:38,754 --> 00:14:41,256 బాగానే ఉంది. కానీ… 267 00:14:41,715 --> 00:14:43,550 కానీ మరీ ఇన్ని అనవసర పదాలు అవసరమా? 268 00:14:43,634 --> 00:14:45,344 ఈ పదాలు నా పిల్లల్లాంటివి, కెరెన్. 269 00:14:45,844 --> 00:14:47,221 వాటిని వాడకుండా నేను ఉండలేను. 270 00:14:47,304 --> 00:14:51,141 కానీ నేను నా క్లాసు పిల్లలకు చెప్పేదే నీకు కూడా చెప్తా, "క్లుప్తంగా, స్పష్టంగా రాయి." 271 00:14:51,767 --> 00:14:52,768 నా మాట విను. 272 00:14:52,851 --> 00:14:54,937 ప్రతీ రాత్రి 30 మంది పిల్లల హోమ్ వర్క్ దిద్దుతుంటా, కాబట్టి నేరుగా 273 00:14:55,020 --> 00:14:56,772 పాయింట్ కి రావడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. 274 00:14:56,855 --> 00:14:58,774 సరే, పద. పక్కకి జరుగు. వెళ్ళు. 275 00:14:58,857 --> 00:14:59,900 సరే. 276 00:15:00,776 --> 00:15:01,777 మంచిది. 277 00:15:01,860 --> 00:15:03,195 మనకు ఇదంతా అవసరం లేదు. 278 00:15:06,073 --> 00:15:08,450 -సరే. అసలు ఇంతకీ కథలో ఏం జరుగుతుంది? -నాకు అక్కడ… 279 00:15:10,369 --> 00:15:13,789 ఆమె తనకు విడాకులు కావాలని తన భర్తకు చెప్పడానికి వెళ్తుంది, కానీ వెళ్లేసరికి, 280 00:15:13,872 --> 00:15:16,542 అతను అక్కడ రక్తపు మడుగులో పడి ఉండటం చూస్తుంది. 281 00:15:17,292 --> 00:15:19,753 సరే. అయితే మరి ఆ విషయమే రాయొచ్చు కదా? 282 00:15:22,130 --> 00:15:23,215 వెళ్లేసరికి… 283 00:15:24,299 --> 00:15:27,386 ఎక్కడ చూసినా రక్త సిక్తమై ఉంది, 284 00:15:28,095 --> 00:15:32,891 రక్తపు వాసనతో ఆమె కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. 285 00:15:33,517 --> 00:15:35,519 అతనికి దూరం కావాలనుకుంది, 286 00:15:37,062 --> 00:15:38,105 కానీ ఈ విధమైన ఎడబాటును కాదు. 287 00:15:44,736 --> 00:15:48,282 అది చాలా బాగుంది, కదా? చాలా… అవును. 288 00:15:49,741 --> 00:15:50,784 భలే వ్రాసావు కదా? 289 00:15:53,245 --> 00:15:54,454 చాలా చక్కగా వ్యక్తపరచావు. 290 00:15:55,664 --> 00:15:56,665 నిజంగా? 291 00:15:57,416 --> 00:15:58,417 అవును. 292 00:16:00,627 --> 00:16:01,712 ఇలాగే కొనసాగించు. 293 00:16:03,922 --> 00:16:05,007 ఇంకా వ్రాయి. 294 00:16:09,344 --> 00:16:10,345 అయితే సరే. 295 00:16:26,361 --> 00:16:28,614 మీ ట్యాక్సీ వచ్చింది 296 00:16:41,502 --> 00:16:42,503 ఇక్కడ ఏం చేస్తున్నావు? 297 00:16:44,922 --> 00:16:47,549 మనం మాట్లాడుకోవాలి, కానీ నిన్ను కలవడానికి నాకు ఇలా తప్ప వేరే దారి తోచలేదు. 298 00:16:48,217 --> 00:16:50,511 నేను నీకు డబ్బులు ఇస్తున్నా. నన్ను దించడానికి కుదరదు. 299 00:16:50,594 --> 00:16:51,762 కానీ ఇది పిచ్చితనం. 300 00:16:51,845 --> 00:16:53,180 మనం ఒక బండి లాంటి వారం, జేసన్. 301 00:16:53,263 --> 00:16:54,973 ఈ కుటుంబం ఒక బండి. 302 00:16:55,057 --> 00:16:58,977 ఆ బండి ఏమాత్రం దారి తప్పినా, మార్గం నుండి కొంచెం వైదొలగినా, మనం… 303 00:16:59,061 --> 00:17:00,854 మనం అనుకున్న గమ్యానికి వెళ్లలేము. 304 00:17:02,022 --> 00:17:03,023 లేదా ప్రమాదం బారిన పడాల్సిందే. 305 00:17:04,191 --> 00:17:06,318 ఏది ఏమైనా, సమస్యను ప్రారంభంలోనే పరిష్కరించాలి. 306 00:17:06,401 --> 00:17:07,903 సర్జ్ టైమ్ లో కాకుండా ఇతర సమయంలో పరిష్కరిద్దామా, ప్లీజ్? 307 00:17:07,986 --> 00:17:09,863 లేదు, ఈ సర్జ్ టైమ్ అస్తమాను ఉంటూనే ఉంటుంది. 308 00:17:10,446 --> 00:17:12,782 నాకు తెలిసి అది వాళ్లు పని చేయించుకోవడానికి కల్పించిన కల్పన అంతే. 309 00:17:12,866 --> 00:17:14,826 సరే, డ్రైవింగ్ చేయనప్పుడు పెట్రోల్ తగలేసుకోవడం దండగ. 310 00:17:14,910 --> 00:17:17,412 సరే, అలాగే. ఏం పర్లేదు. ఇక్కడే కూర్చుని మాట్లాడుకుందాం. 311 00:17:19,248 --> 00:17:20,290 కలిసి. 312 00:17:22,416 --> 00:17:24,086 -నువ్వు గనుక మాట్లాడకపోతే… -ఏంటి? 313 00:17:24,169 --> 00:17:25,671 …నీకు ఒక్కటే స్టార్ ఇస్తాను. 314 00:17:26,547 --> 00:17:29,299 పని ప్రారంభంలోనే అలా జరిగితే నీ రేటింగ్ ఏమవుతుందో కదా? 315 00:17:29,383 --> 00:17:30,634 -అలా చేయకు. -నేను అదే చేస్తాను. 316 00:17:30,717 --> 00:17:33,011 -నేను అదే చేస్తాను… అదే చేస్తా. కచ్చితంగా చేస్తా. -అలా చేయకు. 317 00:17:33,095 --> 00:17:34,263 సరే! 318 00:17:35,138 --> 00:17:36,181 అలాగే. మాట్లాడుకుందాం. 319 00:17:38,392 --> 00:17:40,435 -ఆగు. పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు? -జెన్. 320 00:17:40,519 --> 00:17:41,645 ఏంటి? 321 00:17:41,728 --> 00:17:44,231 ఏం పర్లేదు. తను బాధ్యతగా చూసుకోగలదు. 322 00:17:51,405 --> 00:17:52,239 స్కిట్టిల్స్ 323 00:17:52,322 --> 00:17:53,991 సరే, హోమ్ వర్క్ గురించి చెప్పాలంటే, 324 00:17:54,074 --> 00:17:55,284 మనం స్కూల్ లో ఎంత కష్టపడి చదివినా కూడా, 325 00:17:55,367 --> 00:17:58,745 చివరికి పెరిగి పెద్ద అయిన తర్వాత మన నిజ జీవితంలో దాన్ని పెద్దగా వాడము. 326 00:17:58,829 --> 00:18:02,165 కాబట్టి, అది చేయడానికి బదులు ఎంజాయ్ చేస్తూ గడపడమే మంచిది, ఏమంటారు? 327 00:18:06,003 --> 00:18:07,629 అది నీకు పెద్దదయింది. 328 00:18:09,339 --> 00:18:10,549 వీటిలాగ. 329 00:18:11,300 --> 00:18:13,427 -హేయ్? -నాకు కాఫీ ఇస్తావా? 330 00:18:13,510 --> 00:18:15,137 లేదు, టైలర్. ఇవ్వను. 331 00:18:16,597 --> 00:18:17,806 అది కాదు అడిగే విధానం. 332 00:18:17,890 --> 00:18:19,516 ప్లీజ్, నేను కొంచెం కాఫీ త్రాగొచ్చా? 333 00:18:19,600 --> 00:18:21,476 ఇది పర్లేదు. సరే, త్రాగు. 334 00:18:23,979 --> 00:18:25,189 టైలర్! 335 00:18:26,231 --> 00:18:27,482 నువ్వు కాఫీని వృధా చేయకూడదు. 336 00:19:11,151 --> 00:19:12,152 పరిస్థితులు దిగజారుతున్నాయి. 337 00:19:12,236 --> 00:19:13,779 "దిగజారుతున్నాయి" అంటే ఏంటి? ఏం దిగజారుతుంది? 338 00:19:13,862 --> 00:19:16,323 మనం. మన పరిస్థితులు. 339 00:19:18,033 --> 00:19:21,495 ఏమో. నాకు తెలీదు, జేస్. కానీ నా మనసుకు… తెలుస్తోంది. 340 00:19:24,623 --> 00:19:25,916 పిల్లల్ని పెంచే సామర్ధ్యం మనకు లేదా? 341 00:19:25,999 --> 00:19:27,584 మనకు లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? 342 00:19:27,668 --> 00:19:30,546 వాళ్ళు ముందే అన్నారు కదా? పిల్లల పెంపకం చాలా కష్టం అని. 343 00:19:30,629 --> 00:19:33,298 అవును, కానీ నేను వాళ్ళ మాట వినలేదు. 344 00:19:33,382 --> 00:19:35,884 మనకు అలా ఏం జరగదు అనుకున్నాను. 345 00:19:36,468 --> 00:19:38,679 ఎందుకంటే బంధాన్ని నిలబెట్టుకోవడం కష్టం అని అందరూ అంటూ ఉంటారు, 346 00:19:38,762 --> 00:19:40,764 కానీ మనకు ఆ విషయంలో ఎలాంటి సమస్యా రాలేదు. 347 00:19:41,390 --> 00:19:46,311 నా జీవితంలో మిగతావి అన్నీ కష్టంగానే ఉన్నా, మన బాంధవ్యం ఏనాడూ కష్టం అనిపించలేదు. 348 00:19:48,438 --> 00:19:54,570 బహుశా మనం ఒకరితో ఒకరం మరొక విధంగా 349 00:19:54,653 --> 00:19:56,238 ఉండటం అలవాటు చేసుకోవాలేమో? 350 00:19:56,321 --> 00:19:59,658 బహుశా మనం మరింత బలంగా ప్రయత్నించడం… అలవాటు చేసుకోవాలేమో. 351 00:20:02,202 --> 00:20:06,206 మనం నిజాయితీగా మనసులో ఉన్న మాట చెప్పుకుందామా? 352 00:20:07,040 --> 00:20:09,001 సరే, అలాగే. తప్పకుండా. 353 00:20:12,671 --> 00:20:14,715 అంటే ముందు నీ మనసులో ఉన్నది… చెప్పమని. 354 00:20:16,592 --> 00:20:19,344 ఆర్థికంగా మన కుటుంబానికి నీలా సహకరించలేకపోవడం 355 00:20:19,428 --> 00:20:20,429 నాకు చాలా బాధగా ఉంటుంది. 356 00:20:20,512 --> 00:20:23,307 అవును. కానీ అందుకు కారణం నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటున్నావు కాబట్టి. 357 00:20:25,893 --> 00:20:27,728 అది తలచుకుంటే నాకు కూడా బాధగా ఉంటుంది. 358 00:20:30,606 --> 00:20:31,607 అలాగే నాకు… 359 00:20:33,233 --> 00:20:34,818 బెవ్ సరిగ్గానే అన్నది ఏమో అని భయంగా ఉంది. 360 00:20:39,114 --> 00:20:41,450 మన పిల్లలకు మనం సరైన వారం కాకపోతే ఏంటి సంగతి? 361 00:20:41,533 --> 00:20:42,743 అంటే, సరైన వారమో కాదో ఎలా తెలుసుకోవడం? 362 00:20:45,120 --> 00:20:47,873 అసలు వాళ్లకు మనతో ఉండాలని ఉందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? 363 00:20:58,550 --> 00:21:01,136 -టైలర్, నిద్రపోకుండా నువ్వు ఏం చేస్తున్నావు? -నాకు నిద్ర రావడం లేదు. 364 00:21:01,637 --> 00:21:03,138 బహుశా కాఫీ త్రాగడం వల్ల అనుకుంట. 365 00:21:03,722 --> 00:21:05,474 నువ్వు డీకాఫ్ కాఫీ త్రాగితే మంచిదేమో. 366 00:21:06,350 --> 00:21:08,477 జెన్, నేను ఎప్పుడు పెద్దోడిని అవుతాను? 367 00:21:08,560 --> 00:21:11,855 అంటే, నిజానికి నువ్వు పెద్ద అయినట్టు నీకే తెలీదు. 368 00:21:11,939 --> 00:21:14,149 నువ్వే ఒకరోజు మాములుగా నిద్ర లేచేసరికి పెద్దోడివి అయ్యుంటావు. 369 00:21:16,276 --> 00:21:18,862 ఇక నిద్రపో. నేను నీ పైజామాలను ఉతకాలి. 370 00:21:49,017 --> 00:21:51,186 మనం ఇలా మాట్లాడుకుని చాలా రోజులు అవుతుంది, కదా? 371 00:21:51,270 --> 00:21:52,354 లేదు. 372 00:21:55,732 --> 00:21:59,152 మనం ఒకరికి ఒకరం ఎదురుగా లేనప్పుడు ఇలా ఎమోషనల్ గా మాట్లాడుకోవడం సులభం. 373 00:21:59,945 --> 00:22:01,196 అవునా? 374 00:22:01,780 --> 00:22:04,074 -పిల్లల పెంపకం పుస్తకాలు అన్నిటిలో ఆ విషయం రాసారు. -పిల్లల పెంపకం పుస్తకాలు. 375 00:22:04,658 --> 00:22:07,327 నువ్వు ఆ పుస్తకాలలో పేజీలు మడతపెట్టి వదిలేస్తున్నావని అనుకున్నాను. 376 00:22:07,411 --> 00:22:10,289 నేనేం పేజీలు మడతపెట్టి వదిలేయడం లేదు. నేను అవన్నీ చదివాను. 377 00:22:13,709 --> 00:22:14,835 టిష్యులు ఏమైనా ఉన్నాయా? 378 00:22:14,918 --> 00:22:16,003 -గ్లోవ్ బాక్సులో ఉన్నాయి. -సరే. 379 00:22:21,967 --> 00:22:23,427 జేసన్. 380 00:22:23,510 --> 00:22:25,512 దాన్ని టిప్స్ ఎక్కువ వస్తాయని పెట్టాను అంతే. 381 00:22:32,686 --> 00:22:34,104 నన్ను ఇంటి వరకు తీసుకెళ్లి దించుతావా, ప్లీజ్? 382 00:22:35,355 --> 00:22:36,356 తప్పకుండా. 383 00:22:53,165 --> 00:22:54,541 అంతా బాగానే ఉంటుంది. 384 00:22:57,127 --> 00:22:59,505 ఎందుకంటే మన మధ్య మంచి ప్రేమ ఉంది. 385 00:23:01,548 --> 00:23:02,966 దేనినైనా తట్టుకొని నిలబడగల ప్రేమ. 386 00:23:15,145 --> 00:23:16,146 ఏంటి? 387 00:23:16,897 --> 00:23:19,900 ప్రస్తుతం నేను ఎదుర్కోవాల్సిన చాలా కష్టమైన విషయాలు ఇంట్లో ఉన్నాయి. 388 00:23:25,030 --> 00:23:26,573 కొంచెం సేపు నాకు కారు ఇస్తావా? 389 00:23:29,201 --> 00:23:30,994 చూస్తుంటే మళ్ళీ డేటింగ్ యాప్స్ వాడే సమయం వచ్చినట్టు ఉంది. 390 00:23:31,078 --> 00:23:32,120 అవును. 391 00:23:32,496 --> 00:23:33,914 నాకు ఇలాంటివి చూస్తే చిరాకు పుడుతుంది. 392 00:23:33,997 --> 00:23:34,998 అంటే, ఒకసారి చూడు. 393 00:23:36,708 --> 00:23:39,461 కుక్క నీది కాకపోతే, దాన్ని ప్రొఫైల్ ఫొటోలో పెట్టకూడదు. 394 00:23:39,545 --> 00:23:40,671 చూసేవారిని తప్పుదారి పట్టించడమే. 395 00:23:42,506 --> 00:23:44,174 జెన్, నేను నీకు ఒక విషయం చెప్పాలి. 396 00:23:44,258 --> 00:23:47,469 చూస్తుంటే కుక్క వీడి అత్తది అంట, అంటే వీడు దానితో సమయం గడుపుతుంటాడు. 397 00:23:47,553 --> 00:23:49,763 కానీ ఫోటోని చూస్తే ఆ కుక్క వాడి సొంతది అన్నట్టు ఉంది, 398 00:23:49,847 --> 00:23:50,973 -కావాలనే అలా పెట్టినట్టు ఉన్నాడు. -జెన్. 399 00:23:51,056 --> 00:23:52,099 ఏంటి? 400 00:23:53,684 --> 00:23:55,811 లేదు, నాకు ఇది చెప్పడం చాలా కష్టంగా ఉంది, 401 00:23:55,894 --> 00:23:57,563 కాబట్టి మనం ఇద్దరం ముందుకు చూడడం మంచిది. 402 00:23:58,564 --> 00:23:59,606 డ్రైవింగ్ చేస్తున్నందుకా? 403 00:24:00,357 --> 00:24:02,609 సరే, డ్రైవింగ్ చేస్తున్నావు కాబట్టి ముందుకే చూడు. 404 00:24:07,155 --> 00:24:08,156 నన్ను క్షమించు. 405 00:24:08,240 --> 00:24:09,241 నిన్ను ఉద్యోగంలోంచి తీసేయాలి. 406 00:24:11,285 --> 00:24:13,036 -ఏంటి? -ముందుకు చూడు. 407 00:24:13,120 --> 00:24:15,914 ప్లీజ్, జెన్. నువ్వు ముందుకే చూడాలి, లేదంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. 408 00:24:21,170 --> 00:24:22,963 ఈ విషయం నీకు నేనే చెప్పాలని అనుకున్నాను. 409 00:24:24,298 --> 00:24:25,382 సరే. 410 00:24:25,465 --> 00:24:26,592 ఐ లవ్ యు. 411 00:24:28,260 --> 00:24:30,387 నీ జీవితానికి ఇదే ఆరంభం. 412 00:24:30,470 --> 00:24:31,805 ముగింపు కాదు. 413 00:24:34,016 --> 00:24:36,185 నీ మీద, అలాగే నీకు ఉన్న సత్తా మీద నాకు నమ్మకముంది. 414 00:24:37,686 --> 00:24:39,938 కాబట్టి నీ భవిష్యత్తును సీరియస్ గా తీసుకో. 415 00:24:40,022 --> 00:24:42,024 ఏదైతే ఏముందిలే అన్నట్టు ఉండకు. 416 00:24:43,108 --> 00:24:44,276 జీవితంలో మరింత పొందడానికి చూడు. 417 00:24:45,194 --> 00:24:48,822 నీ జీవితంలో నీకు ఏం కావాలో నిర్ణయించుకుని, దాన్ని సాధించడం వైపు అడుగులు వెయ్. 418 00:24:49,823 --> 00:24:51,074 సరేనా? 419 00:24:52,326 --> 00:24:53,327 సరే. 420 00:25:02,252 --> 00:25:03,504 నేను కావాలనుకుంటుంది ఒకటి ఉంది. 421 00:25:53,178 --> 00:25:54,179 కార్యనిర్వాహక బాధ్యతలు స్కాట్ ఫిల్బర్ట్ 422 00:26:48,984 --> 00:26:50,194 సూపర్! 423 00:26:51,737 --> 00:26:53,322 నేను పెద్దోడిని అయిపోయాను! 424 00:26:53,906 --> 00:26:54,907 సరే. 425 00:27:00,704 --> 00:27:02,873 నా స్నేహితునిగా ఉన్నందుకు థాంక్స్ ప్రేమతో ఫ్రెడ్డీ 426 00:27:05,542 --> 00:27:07,377 పై అంతస్తు అమ్మబడింది 427 00:27:15,636 --> 00:27:17,095 సబ్జెక్టు: దత్తతు ప్రకటన నోటీసు 428 00:27:17,179 --> 00:27:18,222 వచ్చే వారమా? 429 00:28:19,992 --> 00:28:21,994 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్