1 00:00:11,345 --> 00:00:14,222 అయితే, ఒంటరి జీవితం ఎలా ఉంది? 2 00:00:14,223 --> 00:00:16,600 హా, బాగానే ఉంది. ఇప్పుడు నాకు అల్లిక పని బాగా నచ్చేసింది. 3 00:00:17,267 --> 00:00:19,228 సామానంతా తీసుకున్నాక ఇంకా బాగా ఉంటుంది. 4 00:00:19,853 --> 00:00:20,937 - మరి నీ సంగతి? - నాకు… 5 00:00:20,938 --> 00:00:22,897 నాకు అది భలే నచ్చేసింది. నేను… 6 00:00:22,898 --> 00:00:25,942 వీకెండ్ అంతా హెడ్ ఫోన్స్ తగిలించుకుని పార్కులో రౌండ్లు వేశాను. 7 00:00:25,943 --> 00:00:27,276 గంటలు గంటలు చదువుతూ గడిపా. 8 00:00:27,277 --> 00:00:29,862 చారిత్రక సాఫిక్ ఫిక్షన్ పుస్తకాలను 1.5 స్పీడులో వినడాన్ని 9 00:00:29,863 --> 00:00:32,322 "చదవడం" అని అనకూడదేమో, కానీ సరేలే. 10 00:00:32,323 --> 00:00:34,409 నేను మీడియాని ఎక్కించుకుంటున్నా, మార్గీ. 11 00:00:35,327 --> 00:00:37,496 మళ్ళీ దీని గురించి చర్చ అవసరం అంటావా? 12 00:00:38,121 --> 00:00:39,164 నాకు… 13 00:00:39,748 --> 00:00:41,582 ఓరి దేవుడా, అతను టెడ్ కదా? 14 00:00:41,583 --> 00:00:43,125 ఒక్కడే కూర్చుని హాట్ డాగ్ తింటున్నాడు. 15 00:00:43,126 --> 00:00:45,086 అయ్యో, పాపం. 16 00:00:45,087 --> 00:00:46,839 హాట్ డాగ్స్ ని నలుగురితో కలిసి తినాలి. 17 00:00:47,339 --> 00:00:50,132 పాపం, తన మీద మస్టర్డ్ సాస్ పడిందని చెప్పడానికి కూడా ఎవరూ లేరనుకుంటా, 18 00:00:50,133 --> 00:00:52,301 అందుకేనేమో ఆ న్యాప్ కిన్ ని అలా చొక్కాలో దోపుకుని తింటున్నాడు. 19 00:00:52,302 --> 00:00:53,594 అది కేవలం న్యాప్ కిన్ మాత్రమే కాదు. 20 00:00:53,595 --> 00:00:54,930 నన్ను ఎవరైనా ఆదుకోండి అనే ఆర్తనాదం. 21 00:00:56,390 --> 00:00:57,807 చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది, కదా? 22 00:00:57,808 --> 00:00:58,976 తట్టుకోలేకపోతున్నా అసలు. 23 00:00:59,643 --> 00:01:01,854 - మనం ఒక ఫోటో తీయాల్సిందే. - అవును. తీయాల్సిందే. 24 00:01:03,313 --> 00:01:05,524 దీన్ని టీమ్ చాట్లోకి పోస్ట్ చేసేస్తా. 25 00:01:11,196 --> 00:01:12,280 దేవుడా. 26 00:01:12,281 --> 00:01:13,657 నాకు ఒంటరి చావు వద్దు. 27 00:01:16,243 --> 00:01:18,787 - మళ్ళీ మనం కలిసిపోవాలంటావా? - నాకు కూడా అదే ఆలోచన వచ్చింది. 28 00:01:21,039 --> 00:01:22,040 హమ్మయ్య. 29 00:01:24,251 --> 00:01:25,960 నువ్వు అవును అన్నందుకు చాలా ఆనందంగా ఉంది. 30 00:01:25,961 --> 00:01:27,713 - ఐ లవ్ యూ. - లవ్ యూ. 31 00:01:59,578 --> 00:02:02,414 ఈ ఆట నాదే. వేట నాదే. 32 00:02:03,248 --> 00:02:04,416 ఈ ఆట నాదే. వేట నాదే. 33 00:02:04,917 --> 00:02:07,628 ఈ ఆట నాదే. వేట నాదే. 34 00:02:08,252 --> 00:02:09,338 ఈ ఆట నాదే. వేట నాదే. 35 00:02:10,172 --> 00:02:11,507 ఈ ఆట నాదే. వేట నాదే. 36 00:02:14,009 --> 00:02:15,093 {\an8}ఈ ఆట మాది. వేట మాది. 37 00:02:15,719 --> 00:02:16,969 ఏ ఎఫ్ సి రిచ్మండ్ వర్సెస్ చెల్సీ ఫుట్ బాల్ క్లబ్ 38 00:02:16,970 --> 00:02:19,096 వావ్, భలే చేశావు. 39 00:02:19,097 --> 00:02:20,181 అది చాలా… 40 00:02:20,182 --> 00:02:21,682 - ముఖ్యం, కదా? - చాలా ముఖ్యం. 41 00:02:21,683 --> 00:02:24,143 {\an8}- అందులో సందేహమే లేదు. - ఎందుకంటే ఇది ముఖ్యం కదా. 42 00:02:24,144 --> 00:02:26,145 {\an8}మనం నెల్సన్ రోడ్లో మన తొలి మ్యాచ్ ఆడబోతున్నాం. 43 00:02:26,146 --> 00:02:29,690 {\an8}ఈ వీడియో వల్ల ఆ మ్యాచ్ గురించి జనాలకి తెలియడంతో పాటు టికెట్ అమ్మకాలు కూడా పెరుగుతాయని అనుకుంటున్నా. 44 00:02:29,691 --> 00:02:31,108 {\an8}అంటే, ఒక మహిళా జట్టు తమ తొలి సీజన్లోనే 45 00:02:31,109 --> 00:02:33,445 {\an8}ప్రీమియర్ లీగ్ స్టేడియాన్ని హౌస్ ఫుల్ చేసిందంటే, అది మామూలు విషయం కాదు. 46 00:02:34,071 --> 00:02:36,239 {\an8}- అదెంత గొప్ప విషయమో అర్థమవుతోందా? - చాలా గొప్ప విషయం. 47 00:02:36,240 --> 00:02:37,949 {\an8}- ముఖ్యమైన విషయం కూడా. - అవును. 48 00:02:37,950 --> 00:02:39,033 {\an8}ఇక దేని గురించైనా మాట్లాడాలా? 49 00:02:39,034 --> 00:02:40,785 {\an8}హా, నేనేం చెప్పబోతున్నానంటే… 50 00:02:40,786 --> 00:02:42,286 {\an8}- సారీ, ఇంకొక్క విషయం ఉంది… - సరే. 51 00:02:42,287 --> 00:02:44,205 {\an8}…ఆ పది పౌండ్ల టికెట్ల విషయం మాత్రం సూపర్. 52 00:02:44,206 --> 00:02:45,414 {\an8}అంతేగా. 53 00:02:45,415 --> 00:02:48,376 {\an8}ఇంకా జెల్డా మంచి మనస్సు చేసుకుని ఇంకో 2,000 టికెట్లు కొనింది. 54 00:02:48,377 --> 00:02:49,836 {\an8}- వావ్. - నేను ఇందాకే వాటిని 55 00:02:49,837 --> 00:02:51,671 {\an8}- స్థానిక స్కూళ్ళకి డొనేట్ చేశా. - సూపర్. 56 00:02:51,672 --> 00:02:52,839 {\an8}సారీ, లెస్లీ. 57 00:02:52,840 --> 00:02:54,799 {\an8}హా, నేనేం చెప్పబోతున్నానంటే… 58 00:02:54,800 --> 00:02:56,801 {\an8}సారీ, హాఫ్ టైంలో… 59 00:02:56,802 --> 00:03:00,388 {\an8}…నీ ఫౌండేషన్ కి నువ్వు ఒక చెక్ ఇవ్వాలని మర్చిపోకు, సరేనా? 60 00:03:00,389 --> 00:03:02,723 {\an8}అవును, థ్యాంక్యూ, నేను స్పీచ్ తయారు చేసుకుంటాలే. 61 00:03:02,724 --> 00:03:04,767 {\an8}సూపర్. సారీ, లెస్లీ, నువ్వేదో చెప్పబోతున్నావు కదా? 62 00:03:04,768 --> 00:03:05,852 {\an8}పర్వాలేదులే. 63 00:03:05,853 --> 00:03:08,688 {\an8}- హా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే… - అయ్యయ్యో. సారీ, లెస్లీ. 64 00:03:08,689 --> 00:03:10,106 {\an8}ఇప్పుడే గుర్తొచ్చింది. 65 00:03:10,107 --> 00:03:13,192 {\an8}మట్టాయస్, జెల్కా విల్ వస్తున్నారు, కాబట్టి నాకు రెండు టికెట్లు కావాలి. 66 00:03:13,193 --> 00:03:15,570 {\an8}సూపర్. అతను డబ్బులిచ్చి కొనుక్కోలేడు అంటావా? 67 00:03:15,571 --> 00:03:16,654 {\an8}పది పౌండ్లే కదా. 68 00:03:16,655 --> 00:03:17,948 {\an8}అతని టికెట్ డబ్బులు నేను పెట్టుకుంటాలే. 69 00:03:18,782 --> 00:03:19,867 {\an8}ఇది నిజంగానే జరుగుతోంది, గయ్స్. 70 00:03:20,576 --> 00:03:23,077 {\an8}- చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. - నేను వెళ్ళి బార్బరాకి కాల్ చేస్తా. 71 00:03:23,078 --> 00:03:25,205 {\an8}ఏదైనా మారితే, మీకు చెప్తా. 72 00:03:29,793 --> 00:03:32,670 {\an8}లెస్లీ, దయచేసి నన్ను క్షమించు. ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్నది ఏంటి? 73 00:03:32,671 --> 00:03:36,341 {\an8}హా, ఏంటంటే, మనం ఏమైనా… 74 00:03:36,967 --> 00:03:38,468 {\an8}అది కాదు… 75 00:03:38,969 --> 00:03:40,762 {\an8}అతను, కాదు… 76 00:03:41,763 --> 00:03:43,014 {\an8}ఒకవేళ మనం… 77 00:03:43,015 --> 00:03:44,098 {\an8}అస్సలు గుర్తే లేదు. 78 00:03:44,099 --> 00:03:45,767 {\an8}అయితే, అది అంత ముఖ్యమైనది కాదనుకుంటా కదా. 79 00:03:46,435 --> 00:03:47,518 {\an8}కాదు. 80 00:03:47,519 --> 00:03:49,353 షా-న-న్. 81 00:03:49,354 --> 00:03:51,189 శఫైర్ షానన్ 82 00:03:51,190 --> 00:03:52,649 {\an8}ఓకే. 83 00:03:53,775 --> 00:03:55,318 {\an8}హా. ఇదే. 84 00:03:55,319 --> 00:03:57,112 {\an8}ఈ శనివారం ఆడబోయే మన తాత్కాలిక టీమ్ ఇదే. 85 00:03:58,864 --> 00:04:01,991 {\an8}చెల్సీతో ఆట అంటే అదంత ఈజీ-వీజీ ఏం కాదు. 86 00:04:01,992 --> 00:04:04,744 {\an8}దానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది, చెమటోడ్చాల్సి ఉంటుంది. 87 00:04:04,745 --> 00:04:06,996 {\an8}- కానీ మనం ప్రయత్నమైతే చేయాలి, కదా? - మనం చెల్సీని ఓడించలేం. 88 00:04:06,997 --> 00:04:08,581 {\an8}- మనకి అంత సీన్ లేదు. - కానివ్వు, కోచ్. 89 00:04:08,582 --> 00:04:11,459 {\an8}- కాస్త పాజిటివ్ గా ఉండవచ్చు, కదా? - అలాగే. సారీ, మీరన్నది కరెక్టే. 90 00:04:11,460 --> 00:04:13,753 {\an8}- వాళ్ళు అరివీర భయంకరులు. - థ్యాంక్యూ. 91 00:04:13,754 --> 00:04:15,421 {\an8}ఈ ఆటలో భిన్నంగా ఏం చేస్తే బాగుంటుందంటావు, కోచ్? 92 00:04:15,422 --> 00:04:18,883 {\an8}ముందు ఆ షానన్ ని తీసేసి, ప్రాక్టీస్ టీంలో వేస్తా. 93 00:04:18,884 --> 00:04:20,343 {\an8}- తను నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది. - కరెక్టే. 94 00:04:20,344 --> 00:04:21,719 {\an8}హేయ్, ఈ చర్చ వల్ల నాకు ఒకటి గుర్తొచ్చింది. 95 00:04:21,720 --> 00:04:27,225 {\an8}"ఎంత ఎక్కువ తీసుకుంటే, అంత ఎక్కువ మిగిలిపోతుంది," అని హెన్రీ నాతో చెప్పాడు. ఏంటది? 96 00:04:27,226 --> 00:04:28,643 {\an8}- ఏం చేస్తున్నారు? - మళ్ళీ చెప్పు. 97 00:04:28,644 --> 00:04:32,688 {\an8}"ఎంత ఎక్కువ తీసుకుంటే, అంత ఎక్కువ మిగిలిపోతుంది." ఏంటది? 98 00:04:32,689 --> 00:04:34,649 {\an8}- దయచేసి ఇక ఆపండి. - నేను ఆపను, 99 00:04:34,650 --> 00:04:35,692 {\an8}కానీ పాజ్ చేస్తాలే. 100 00:04:38,570 --> 00:04:39,987 {\an8}ఓకే, ఈ వీకెండ్ మనకి కీలక మ్యాచ్ ఉంది. 101 00:04:39,988 --> 00:04:41,072 {\an8}- కోచ్. - చెప్పు. 102 00:04:41,073 --> 00:04:42,740 {\an8}మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగవచ్చా? 103 00:04:42,741 --> 00:04:44,534 {\an8}అంటే ఆన్ లైన్ క్విజ్ల లాంటివా? 104 00:04:44,535 --> 00:04:47,328 {\an8}అలాంటిదే అయితే, నేను అల్లాడించేస్తా. 105 00:04:47,329 --> 00:04:48,497 {\an8}టెడ్, మీకు పెళ్లయిందా? 106 00:04:49,122 --> 00:04:51,749 {\an8}- సారీ, ఏమన్నావు? - మీరు ఎప్పుడూ ఒంటరిగా తింటారా? 107 00:04:51,750 --> 00:04:53,334 {\an8}ఎవరితో అయినా డేటింగ్ చేస్తున్నారా? 108 00:04:53,335 --> 00:04:55,294 {\an8}ఒంటరితనం వేధిస్తోందా? హోమ సిక్ గా ఉందా? లేదా ఈ రెండూనా? 109 00:04:55,295 --> 00:04:58,215 {\an8}- దానికి బాధపడాల్సిన అవసరం లేదు. - ఏది ఏమైనా పర్వాలేదులే. 110 00:04:59,132 --> 00:05:00,341 {\an8}ఇప్పుడేం జరుగుతోంది? 111 00:05:00,342 --> 00:05:01,759 {\an8}మేము మిమ్మల్ని చూశాం. 112 00:05:01,760 --> 00:05:02,970 {\an8}హా. 113 00:05:03,554 --> 00:05:05,096 {\an8}ఎప్పుడూ అదే ప్యాంట్ వేసుకుంటారా? 114 00:05:05,097 --> 00:05:06,264 {\an8}- జీన్స్ అస్సలు వేసుకోరా? - నేను… 115 00:05:06,265 --> 00:05:08,766 {\an8}బార్ట్ సింప్సన్ లా ఎప్పుడూ ఓకే నిక్కర్ మీద ఉంటారు. 116 00:05:08,767 --> 00:05:10,561 {\an8}హా, కానీ అతనిలా నా నిక్కరుని నేను తినను కదా? 117 00:05:11,228 --> 00:05:13,313 {\an8}బార్ట్ తన నిక్కరుని తినేస్తాడని అనుకుంటున్నారా ఏంటి? 118 00:05:14,314 --> 00:05:17,525 {\an8}మంచి ప్రశ్నే. అతను నిక్కర్లని తినమని ఇతరులని ప్రోత్సహిస్తాడు అనుకుంటా. 119 00:05:17,526 --> 00:05:19,360 {\an8}- సరేనా? ఓకేనా? - హా, అవునులే. 120 00:05:19,361 --> 00:05:22,572 {\an8}హేయ్. చూడండి, ఈ వీకెండ్ చెల్సీని మనం ఎలా ఓడించాలి? అదే ఇప్పుడు మన ముందున్న సవాలు. 121 00:05:22,573 --> 00:05:25,074 {\an8}సరేనా? దానికి సమాధానం కావాలంటే మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. 122 00:05:25,075 --> 00:05:26,159 {\an8}కాబట్టి, చలో! 123 00:05:29,121 --> 00:05:32,082 {\an8}ఓకేనా? చలో, చలో. సరే మరి. 124 00:05:33,333 --> 00:05:34,834 {\an8}హా, గమ్మత్తైన ప్రశ్నలే వేశారు. 125 00:05:34,835 --> 00:05:36,377 {\an8}- మలం. - ఏంటి? 126 00:05:36,378 --> 00:05:39,046 {\an8}"ఎంత ఎక్కువ తీసుకుంటే, అంత ఎక్కువ మిగిలిపోతుంది"కి సమాధానం. 127 00:05:39,047 --> 00:05:41,258 {\an8}అది కూడా కరెక్టే, కానీ నా మనస్సులో ఉన్న సమాధానం, అడుగుల జాడ. 128 00:05:42,176 --> 00:05:44,010 {\an8}అది జోక్. 129 00:05:44,011 --> 00:05:45,970 {\an8}నిజానికి అది ఒక పొడుపు కథ, కానీ అలాంటి కామెడి నచ్చేవారికి, 130 00:05:45,971 --> 00:05:48,139 {\an8}కోచ్ చెప్పిన ఆ మలమూత్రాల సమాధానం 131 00:05:48,140 --> 00:05:49,223 {\an8}కొంచెం నవ్వు తెప్పించవచ్చు. 132 00:05:49,224 --> 00:05:51,559 {\an8}- నాకు అలాంటి కామెడీ నచ్చుతుంది మరి. - అది కాదు. వాళ్ళు చేసింది. 133 00:05:51,560 --> 00:05:55,646 {\an8}అక్కడ జరిగిన విషయం. మీ డేటింగ్ గురించి వాళ్ళు అడగడం. 134 00:05:55,647 --> 00:05:57,106 {\an8}అసలేంటది? 135 00:05:57,107 --> 00:05:59,775 {\an8}అసలు అది పద్ధతే కాదు. అయినా ఎవరు పట్టించుకుంటారు? 136 00:05:59,776 --> 00:06:00,860 {\an8}అదే, పట్టించుకోకూడదు. 137 00:06:00,861 --> 00:06:03,654 {\an8}అంటే, నేను కూడా కాస్త షాక్ అయ్యా, కానీ పెద్దగా పట్టించుకోవట్లేదులే దాన్ని. 138 00:06:03,655 --> 00:06:05,949 {\an8}నీకు ఇలాంటివి ఎప్పుడూ ఎదురవుతుంటాయి కాబట్టి, నీకు ఇది నచ్చలేదేమో. 139 00:06:06,617 --> 00:06:10,913 {\an8}లేదు, వాళ్ళు నన్ను ఏమీ అడగలేదు, అందుకు నేను హ్యపీయే. 140 00:06:12,247 --> 00:06:14,207 {\an8}ఎందుకంటే, వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసా, 141 00:06:14,208 --> 00:06:16,959 {\an8}తమ కెరీర్లోనే అత్యంత ముఖ్యమైన మ్యాచ్ ఆడబోతూ ఉన్నారు కాబట్టి, అది వదిలేసి 142 00:06:16,960 --> 00:06:18,669 ఎందుకు పిచ్చి పనులు చేస్తున్నామని ప్రశ్నించుకోవాలి. 143 00:06:18,670 --> 00:06:20,213 తమని తాము ప్రశ్నించుకోవాలంటే, 144 00:06:20,214 --> 00:06:22,089 వాళ్ళు ఆ ప్రశ్నే వేసుకోవాలి. 145 00:06:22,090 --> 00:06:23,091 నన్ను అడిగితే ఇదే చెప్తా. 146 00:06:23,842 --> 00:06:25,177 కానీ నన్ను అడగరుగా. 147 00:06:25,802 --> 00:06:27,179 ఎవరూ ఏమీ అడగరుగా నన్ను. 148 00:06:28,180 --> 00:06:30,516 అది ఓకేలే. 149 00:06:31,058 --> 00:06:32,558 నిజంగానే ఓకే. అసలు నేను… 150 00:06:32,559 --> 00:06:34,269 అసలు నేను పట్టించుకోను. నాకు ఫరకే పడదు. 151 00:06:37,064 --> 00:06:38,190 నాకేం పర్వాలేదు. 152 00:06:47,199 --> 00:06:49,158 ఇది నెల్సన్ రోడ్ 153 00:06:49,159 --> 00:06:50,160 ఓయ్. 154 00:06:52,204 --> 00:06:54,372 నువ్వు ఓయ్ అన్నావా, రాయ్ అన్నావా? 155 00:06:54,373 --> 00:06:55,581 ఏదైతే ఏంటి? 156 00:06:55,582 --> 00:06:57,291 ఏదన్నా పలికేలా ఉన్నావుగా. 157 00:06:57,292 --> 00:06:59,043 హా. పలుకుతాననే అనుకుంటా. 158 00:06:59,044 --> 00:07:00,378 హా. 159 00:07:00,379 --> 00:07:01,963 సారీ, ఈ శనివారం నేను ఇక్కడ ఉండట్లేదు. 160 00:07:01,964 --> 00:07:03,464 నేను న్యూక్యాజిల్ కి వెళ్లి చావాలి, 161 00:07:03,465 --> 00:07:06,885 ఆ పనికిమాలిన, దేనికీ పనికిరాని, ఎవరూ పట్టించుకోని పురుషుల జట్టుతో! 162 00:07:08,512 --> 00:07:11,013 - పర్వాలేదులే. - కానీ నా మనస్సంతా ఇక్కడే ఉంటుంది. 163 00:07:11,014 --> 00:07:12,599 నా కోసమా, లేదా టీమ్ కోసమా? 164 00:07:13,600 --> 00:07:16,228 ఏదైతే ఏంటి? ఏదన్నా పలికేలా ఉన్నావుగా. 165 00:07:22,067 --> 00:07:23,443 ఓయ్, రాయ్. 166 00:07:24,278 --> 00:07:26,780 కుతూహలం కొద్దీ అడుగుతున్నా, ఇప్పటిదాకా ఎంత మందితో డేట్ కి వెళ్లావు? 167 00:07:28,657 --> 00:07:29,658 తొమ్మిది మందితో. 168 00:07:30,367 --> 00:07:31,785 బాగుంది. 169 00:07:44,923 --> 00:07:46,925 ఛ. 170 00:07:59,021 --> 00:08:00,397 - హాయ్. - హాయ్. 171 00:08:01,064 --> 00:08:02,857 - హలో. - హేయ్, రెబెక్కా. 172 00:08:02,858 --> 00:08:04,942 నేను పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ ఉండిన చిప్స్ ఇప్పుడూ ఉన్నాయా? 173 00:08:04,943 --> 00:08:06,527 ఉన్నాయిగా. ప్రత్యేకంగా నీకోసం తెప్పించా. 174 00:08:06,528 --> 00:08:08,197 - థ్యాంక్యూ. - ఇతర స్నాక్స్ దగ్గర ఉన్నాయి, అవన్నీ… 175 00:08:10,490 --> 00:08:11,949 లేదు, నువ్వు తగ్గమాకు! 176 00:08:11,950 --> 00:08:14,828 రెచ్చిపో, పాపా! ఎవరికీ తలొగ్గకు! 177 00:08:17,956 --> 00:08:20,500 ఈ యూనిఫారాన్ని చూస్తేనే ఏదో అయిపోయే జబ్బు నుండి నేను తేరుకుంటానా అసలు? 178 00:08:20,501 --> 00:08:22,044 అందుకేనా నువ్వు పైలట్ అయింది? 179 00:08:23,045 --> 00:08:24,922 లేదు, ఫ్లయిట్లో ఆహారం బాగుంటుందని పైలట్ అయ్యా. 180 00:08:26,882 --> 00:08:28,217 నిన్ను చాలా మిస్ అయ్యా. 181 00:08:29,218 --> 00:08:30,219 నేను కూడా. 182 00:08:34,640 --> 00:08:36,892 దాని గురించే నీకు ఒకటి చెప్పాలి. 183 00:08:37,893 --> 00:08:39,101 ఏంటి? 184 00:08:39,102 --> 00:08:42,231 వర్జిన్ అట్లాంటిక్ లో నాకు ఉద్యోగం దొరికింది. 185 00:08:43,524 --> 00:08:45,067 నేను లండన్ కి షిఫ్ట్ అవుతున్నా. 186 00:08:45,651 --> 00:08:46,652 ఏంటి? 187 00:08:48,987 --> 00:08:50,072 వావ్. 188 00:08:51,448 --> 00:08:52,782 మరి జెల్కా సంగతి ఏంటి? 189 00:08:52,783 --> 00:08:54,200 వాళ్ళు తనకి ఉద్యోగం ఇవ్వరుగా. 190 00:08:54,201 --> 00:08:55,619 తనకి పదేళ్లే కదా. 191 00:08:56,453 --> 00:08:58,955 ఏం పర్వాలేదులే. నాకు వచ్చిన ఉద్యోగం గురించి వాళ్ళ అమ్మకి చెప్పా, 192 00:08:58,956 --> 00:09:01,667 ఇక తను వాళ్ళ కంపెనీలోని లండన్ బ్రాంచీలో ఓ పొజిషన్ కి దరఖాస్తు చేసుకుంది. 193 00:09:02,251 --> 00:09:04,711 కాబట్టి నేను జెల్కాతో, అలాగే నీతో కూడా ఉండగలను. 194 00:09:06,171 --> 00:09:08,715 అది చాలా గొప్ప విషయం. దేవుడా. 195 00:09:15,472 --> 00:09:18,015 ద క్రౌన్ అండ్ యాంకర్ 196 00:09:18,016 --> 00:09:23,271 హేయ్, కోచ్. ఈ వారం ఆలిస్ ఎప్పుడూ లేనంత టెన్షన్ గా ఉన్నట్టు నీకు అనిపించట్లేదా? 197 00:09:23,272 --> 00:09:26,774 నెల్సన్ రోడ్లో మ్యాచ్ అంటే ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిగా. 198 00:09:26,775 --> 00:09:29,443 - ఓకే. ఆ టెన్షన్ అందరికీ అంటుకునే రకం ఏమో. - ఎలా? 199 00:09:29,444 --> 00:09:32,488 హాట్ డాగ్ గురించి టీమ్ అంతా కలిసి నా మీద పడిపోవడానికి 200 00:09:32,489 --> 00:09:34,949 అదే కారణం అని నాకు అనిపిస్తోంది. ఏమంటావు? 201 00:09:34,950 --> 00:09:37,911 లేదు. వాళ్ళకి నీ గురించి మరింత తెలుసుకోవాలనిపించింది, అంతే. 202 00:09:39,913 --> 00:09:41,247 ఓయ్, బియర్డ్. 203 00:09:41,248 --> 00:09:43,000 నిన్న రాత్రి జేన్ వన్-వుమెన్ షో చూశాం. 204 00:09:43,584 --> 00:09:46,461 మేము ముగ్గురమూ చూశాం. అయ్య బాబోయ్… 205 00:09:46,962 --> 00:09:48,462 - ఏం నటించిందిరా నాయనా! - హా. 206 00:09:48,463 --> 00:09:50,673 మా నాన్న నన్ను, మా అమ్మని వదిలేసి, 207 00:09:50,674 --> 00:09:52,675 మళ్ళీ వచ్చాక నేను ఎలా ఏడ్చానో, అలా ఏడ్చాను. ముష్టి గాడు. 208 00:09:52,676 --> 00:09:55,011 నీ దగ్గరికి మేము వస్తున్నాం కదా, అప్పుడే ఆపింది నేను ఏడుపు. 209 00:09:55,012 --> 00:09:56,263 హా, అది చాలా గొప్ప షో అని విన్నాను. 210 00:09:56,889 --> 00:09:58,140 నువ్వు అది ఇంకా చూడలేదా ఏంటి? 211 00:10:00,350 --> 00:10:02,977 మీకు నాటికలంటే ఇంత ఇష్టమని నాకు తెలీదే. 212 00:10:02,978 --> 00:10:04,103 మాకేం ఇష్టం లేదులే. 213 00:10:04,104 --> 00:10:05,313 అవి ఏడ్చినట్టుంటాయి. 214 00:10:05,314 --> 00:10:07,940 హా, రెండు గంటల పాటు అరుపులు, కేకలు వినాలనిపిస్తే, మా అమ్మ దగ్గరికే వెళ్తాగా! 215 00:10:07,941 --> 00:10:09,025 తొక్కలోది. 216 00:10:09,026 --> 00:10:10,651 మేము బియర్డ్ కి వీరాభిమానులం, అంతే. 217 00:10:10,652 --> 00:10:11,987 షో చూశాక కూడా. 218 00:10:20,829 --> 00:10:22,705 నేను ఆ షోని చూడాలి. 219 00:10:22,706 --> 00:10:24,875 - పక్కాగా చూడాలనుకుంటున్నావా, కోచ్? - లేదు. 220 00:10:25,501 --> 00:10:26,877 నువ్వు కూడా వస్తావా? 221 00:10:27,377 --> 00:10:28,378 ఎవరి కారులో వెళ్దాం? 222 00:10:28,879 --> 00:10:30,588 - మనం డ్రైవ్ చెయ్యట్లేదు. - లేదు, అది "టౌన్"లోది. 223 00:10:30,589 --> 00:10:32,173 - టౌన్ ఏంటి? - అది సినిమా పేరు. 224 00:10:32,174 --> 00:10:33,175 ఏ సినిమా? 225 00:10:45,812 --> 00:10:47,939 హమ్మయ్య, వీటికి బటన్స్ లేవులే. చలికి చేతులు మొద్దుబారిపోయినప్పుడు, 226 00:10:47,940 --> 00:10:49,482 ఆ బటన్స్ పెట్టడం, తీయడం చాలా కష్టమైపోతుంది. 227 00:10:49,483 --> 00:10:50,983 ఏం జరుగుతోంది? 228 00:10:50,984 --> 00:10:54,404 టీమ్ అంతా తలో చేయి వేసి, నాకొక కొత్త బ్లూ జీన్స్ ప్యాంట్ తెచ్చారు. 229 00:10:55,072 --> 00:10:56,280 నా సైజ్ కూడా కరెక్టుగా గెస్ చేశారు. 230 00:10:56,281 --> 00:11:00,535 నేను మొదటి ఉద్యోగం లీవైస్ లో చేశా. కాబట్టి వంద మీటర్ల దూరం నుండైనా సైజ్ చెప్పేస్తా. 231 00:11:00,536 --> 00:11:01,827 మంచి నైపుణ్యమే అది. 232 00:11:01,828 --> 00:11:04,789 - మన కజిన్ ఫిన్లీది మాత్రం చెప్పలేకపోయావు, చాల్లే. - వాడు అబద్ధాలకోరు. 233 00:11:04,790 --> 00:11:07,041 - అతనిది చూడగానే 30 బై 30 అని తెలిసిపోతోంది. - సరే, ఇక… 234 00:11:07,042 --> 00:11:09,710 ఇక్కడ ఇంత మంది ఉంటే, అగ్నిప్రమాదం సంభవించింది అనుకోండి, 235 00:11:09,711 --> 00:11:11,505 అప్పుడు… మనం అందరం చనిపోయే అవకాశముంది… 236 00:11:13,674 --> 00:11:14,800 ఒకవేళ మంటలు అంటుకుంటే. 237 00:11:16,635 --> 00:11:18,427 కోచ్ అన్నది కూడా పాయింటే. 238 00:11:18,428 --> 00:11:20,263 కాబట్టి, పిచ్ దగ్గర కలుసుకుందాం, సరేనా? 239 00:11:20,264 --> 00:11:22,056 ఈ ప్యాంట్ కొనిచ్చినందుకు థ్యాంక్స్. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. 240 00:11:22,057 --> 00:11:24,433 మీకు ఇంకాస్త డార్క్ కలర్ లేదా వేరే ఏదైనా మోడల్ కావాలంటే, మా దగ్గర రసీదు ఉంది. 241 00:11:24,434 --> 00:11:26,018 అది ఆయన స్కిన్ టోన్ కి మ్యాచ్ అవుతుందిలే. పర్లేదు. 242 00:11:26,019 --> 00:11:27,103 హా, చాలా గొప్ప విషయం కదా. 243 00:11:27,104 --> 00:11:28,437 బాగా ఆలోచించి తెచ్చారు పాపం. 244 00:11:28,438 --> 00:11:31,315 బాటిల్ నెక్ లో జరిగిన "కేక్" బ్యాండ్ షోకి మనం వెళ్లాం కదా, అదే చివరిసారి నిన్ను జీన్స్ లో చూడటం. 245 00:11:31,316 --> 00:11:32,400 అవును నిజమే. 246 00:11:32,401 --> 00:11:34,360 ఆ షో తర్వాత మనమిద్దరం వైబ్రాస్లాప్స్ కొన్నాం. 247 00:11:34,361 --> 00:11:36,112 ఇప్పుడు జీన్ జాకెట్ కొనాలి. 248 00:11:36,113 --> 00:11:37,905 దాన్ని ఏమని అంటారు? కెనడియన్ టక్సీడోనా? 249 00:11:37,906 --> 00:11:40,993 హా, కానీ కెనడాలో మాత్రం టక్సీడో అనే అంటారు. 250 00:11:42,035 --> 00:11:45,122 బాబోయ్, మనం చెల్సీతో పోటీ పడలేక చతికిలపడతామేమో. 251 00:11:45,831 --> 00:11:46,915 మామూలుగా కాదు. 252 00:11:55,257 --> 00:11:56,675 షానన్! 253 00:11:57,176 --> 00:11:59,927 నీ ఎడమ పక్కన జెమ్మా ఉంది, కుడి పక్కకి కనుక వెళ్లుంటే, 254 00:11:59,928 --> 00:12:01,512 షాట్ కొట్టే అవకాశం ఉంది. కానీ నువ్వేం చేయలేదు. 255 00:12:01,513 --> 00:12:04,141 కాబట్టి, ఈ జట్టుతో సంబంధం లేదనట్టు ఆడటం ఆపు. 256 00:12:05,184 --> 00:12:07,519 ఓయ్, ఆలిస్, కాస్త ఆవేశం తగ్గించుకో. 257 00:12:08,604 --> 00:12:10,062 - ఏమన్నావు? - జెమ్, వదిలేయిలే. 258 00:12:10,063 --> 00:12:11,480 - వదిలేయ్. - లేదు, వినిపించలేదా? 259 00:12:11,481 --> 00:12:12,900 తనని వదిలేయ్. 260 00:12:14,526 --> 00:12:16,319 ఓకే, షానన్, ఇప్పుడు నువ్వు ఒక పని చేయ్. 261 00:12:16,320 --> 00:12:17,403 అయిదు రౌండ్లు వేయ్. 262 00:12:17,404 --> 00:12:18,654 వద్దు, అక్కర్లేదు. 263 00:12:18,655 --> 00:12:21,366 - నువ్వు కూడా తనతో పాటు వేస్తావా? - పెద్ద పోటుగత్తెవే, వామ్మోయ్. 264 00:12:23,785 --> 00:12:24,869 ఇద్దరూ పది రౌండ్లు వేయండి. 265 00:12:24,870 --> 00:12:26,996 తొక్క కూడా వేయను. 266 00:12:26,997 --> 00:12:28,874 అందరూ 15 రౌండ్లు వేయండి. 267 00:12:31,793 --> 00:12:33,170 ఇక దొబ్బేయ్. 268 00:12:34,671 --> 00:12:35,672 పనికిమాలినదానా. 269 00:12:36,965 --> 00:12:39,384 జెమ్, జెమ్, రా. 270 00:12:55,901 --> 00:12:57,653 హేయ్, కోచ్, నీకు బార్బెక్యూ చేయడం ఎలాగో తెలుసా? 271 00:12:58,695 --> 00:13:00,989 - తెలీదు. - అది చాలా బాగా ఉంటుంది. 272 00:13:01,782 --> 00:13:04,116 హా, నేను ఏదో బర్గర్ ని గ్రిల్ చేయడం గురించి మాట్లాడటం లేదు. 273 00:13:04,117 --> 00:13:05,826 అసలైన బార్బెక్యూ గురించి మాట్లాడుతున్నా. 274 00:13:05,827 --> 00:13:07,287 లో ఫ్లేమ్ లో మెల్లగా వండటం, పొగ బాగా రావడం. 275 00:13:07,788 --> 00:13:10,624 ఆ వంట, ఆ గుబాళింపు ఎలా ఉంటుందంటే, పక్కింటోళ్ళు తొంగి తొంగి చూస్తారు అన్నమాట. 276 00:13:11,792 --> 00:13:14,878 ఆ వంట నేర్చుకోవడం మొదలుపెట్టిన కొత్తలో నాకు ఎప్పుడూ ఒకటే తొందర. ఓపిక ఉండేదే కాదు. 277 00:13:15,796 --> 00:13:19,340 ఆకలి వేసేసి, ఆత్రుతతో, పదే పదే మూత తీయడం, ఉడికిందో లేదో అని ముక్కని గుచ్చి గుచ్చి చూడటం, 278 00:13:19,341 --> 00:13:20,968 త్వరగా అయిపోవాలని మంటని పూర్తిగా పెంచేయడం చేసేవాడిని. 279 00:13:21,760 --> 00:13:23,052 దాని వల్ల ఏమవుతుందో తెలుసా? 280 00:13:23,053 --> 00:13:24,596 మాంసం గట్టిగా రబ్బరులా అయిపోతుంది. 281 00:13:25,472 --> 00:13:28,100 అలా నేను ఎప్పుడూ మెత్తగా, జ్యూసీగా కాకుండా వండేసే వాడిని. 282 00:13:29,810 --> 00:13:32,062 జనాల విషయంలో కూడా నాకు అలానే అనిపిస్తుంది. 283 00:13:32,813 --> 00:13:35,189 అయిదు నిమిషాలకొకసారి వాళ్ళని గెలుకుతూ, దెప్పుతూ ఉంటే, 284 00:13:35,190 --> 00:13:36,567 వాళ్లకి చిరాకు వచ్చేస్తుంది. 285 00:13:37,234 --> 00:13:41,279 కానీ వండే పద్ధతిని నమ్మి, మంటని ఒకేలా స్థిరంగా ఉంచి, 286 00:13:41,280 --> 00:13:44,740 అవసరమైనప్పుడు కొద్దిగా మసాలాలు జోడించి, రుచి కోసం కొంచెం సాస్ వేశామనుకో. 287 00:13:44,741 --> 00:13:48,620 చివరికి మనం గర్వంగా చెప్పుకోగలిగేలా, ఎంతో రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకోగలుగుతాం. 288 00:13:51,081 --> 00:13:52,456 దాన్ని గుర్తుపెట్టుకుంటానులే. 289 00:13:52,457 --> 00:13:53,458 సరే. 290 00:13:56,545 --> 00:13:58,338 బాబోయ్, నాకు ఆకలి దంచేస్తోంది. 291 00:14:10,601 --> 00:14:12,768 - అబ్బో, ఎవరో మంచి మూడ్లో ఉన్నట్టున్నారే. - లేదులే. 292 00:14:12,769 --> 00:14:14,729 లేదు, ఉదయం నుండి ఆ పాట నా బుర్రలోనే తిరుగుతోంది. 293 00:14:14,730 --> 00:14:17,815 "కొంపదీసి నాకేమన్నా పిచ్చి పడుతోందా, ఇది దాని లక్షణమేనా?" అని కాస్త కంగారుగా కూడా ఉంది, 294 00:14:17,816 --> 00:14:19,233 కానీ అది నోట్లో నానిపోయిన ఓ మంచి పాటే ఏమో. 295 00:14:19,234 --> 00:14:21,819 - ఇదుగో. - హమ్మయ్య. 296 00:14:21,820 --> 00:14:25,239 - ఇవి సహాయపడవచ్చు. - ఓహో, బాగా కంగారుగా ఉన్నట్టున్నావు. 297 00:14:25,240 --> 00:14:27,409 కానివ్వు, మనస్సులో ఉన్నదంతా కక్కేసేయ్, పెద్ద పాపా. 298 00:14:29,036 --> 00:14:30,661 మట్టాయస్ లండన్ కి షిఫ్ట్ అవుతున్నాడు, టెడ్. 299 00:14:30,662 --> 00:14:32,955 హేయ్, అమ్మ దీనెమ్మ బత్తాయో. 300 00:14:32,956 --> 00:14:35,291 - అది చాలా గొప్ప విషయం. - అవును, అది… 301 00:14:35,292 --> 00:14:37,002 గొప్ప విషయమే. 302 00:14:37,836 --> 00:14:40,713 కానీ నీ సమాధానం చూస్తుంటే, అది నీకు గొప్ప విషయంలా అనిపిస్తున్నట్టు లేదే. 303 00:14:40,714 --> 00:14:43,674 - లేదు, లేదు, అది గొప్ప విషయమే. - మంచిది. 304 00:14:43,675 --> 00:14:45,301 - అంతే కదా? - అంతే అనుకుంటా. 305 00:14:45,302 --> 00:14:46,802 - నాకేం తెలీట్లేదు. - నాకు కూడా. 306 00:14:46,803 --> 00:14:52,266 అంటే, మా లాంగ్ డిస్టెన్స్ బంధం ఇంతకాలం చాలా బాగానే సాగింది. 307 00:14:52,267 --> 00:14:54,769 ఇప్పటిదాకా మా బంధం డోసును కొద్దికొద్దిగా తీసుకుంటూ వచ్చా. 308 00:14:54,770 --> 00:14:57,980 కానీ ఇక నుండి గుక్క తిప్పుకోకుండా ఫుల్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. 309 00:14:57,981 --> 00:15:01,568 అంటే, పెరూలో బకెట్లో వాంతులు చేసుకోవడం లాగా… 310 00:15:07,074 --> 00:15:08,407 - అర్థమైందా? - హా… 311 00:15:08,408 --> 00:15:11,452 నువ్వు డ్రగ్స్ పోలికని వాడుతావని నేను అస్సలు అనుకోలేదు. 312 00:15:11,453 --> 00:15:14,080 - టెడ్, నేను ఆంస్టర్ డామ్ వాడితో డేటింగ్ చేస్తున్నా. - మంచి పాయింటే అది. 313 00:15:14,081 --> 00:15:16,792 కానీ నాకు అర్థం కావట్లేదు. ఏమైందో చెప్పు, అమ్మాయి? 314 00:15:17,876 --> 00:15:19,377 ఏమో. ఒకవేళ అతనికి నాపై అసహ్యం పుడితే? 315 00:15:19,378 --> 00:15:21,379 ఒకవేళ నాకే అతనిపై అసహ్యం మొదలైతే? 316 00:15:21,380 --> 00:15:23,465 మా బంధం అంతా పెంట పెంట అయిపోతే? 317 00:15:25,425 --> 00:15:27,636 మళ్ళీ ఆ బాధని, క్షోభని భరించడం నా వల్ల కాదు. 318 00:15:29,638 --> 00:15:30,764 అర్థమైంది. 319 00:15:32,224 --> 00:15:35,519 కానీ నువ్వు గతాన్ని తలుచుకుంటూ భయపడుతున్నావని నాకు అనిపిస్తోంది. 320 00:15:36,228 --> 00:15:38,939 కానీ ఒక విషయం, గతాన్ని చూపే వెనుక అద్దం కన్నా భవిష్యత్తును చూపే విండ్ షీల్డే పెద్దది. 321 00:15:41,108 --> 00:15:42,191 ఇది సాయపడుతోంది. 322 00:15:42,192 --> 00:15:43,317 అవును. 323 00:15:43,318 --> 00:15:45,027 అంటే, స్నేహితులు ఉండగా డ్రగ్స్ ఎందుకు? 324 00:15:45,028 --> 00:15:46,946 - బటర్. హా. - హా, బటర్. ఓకే. 325 00:15:46,947 --> 00:15:48,073 అవును. 326 00:15:53,078 --> 00:15:54,121 హేయ్. 327 00:15:55,831 --> 00:15:56,914 హాయ్. 328 00:15:56,915 --> 00:15:58,708 శనివారం జరిగే మీ ఆటకు గుడ్ లక్. 329 00:15:58,709 --> 00:16:00,335 థ్యాంక్స్. మీకు కూడా. 330 00:16:01,211 --> 00:16:03,922 కుదిరితే అక్కడ పదో డేట్ కి వెళ్ళు. 331 00:16:05,299 --> 00:16:07,968 ఎందుకంటే, నువ్వు తిరిగి వచ్చినప్పుడు, ఇక డేట్స్ కి వెళ్ళాల్సిన పనే ఉండదు. 332 00:16:08,677 --> 00:16:09,803 ఇక ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? 333 00:16:11,889 --> 00:16:13,639 నిన్న రాత్రి పదో డేట్ కి వెళ్ళా. 334 00:16:13,640 --> 00:16:14,933 అవునా? 335 00:16:16,351 --> 00:16:18,519 నిజానికి నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను, 336 00:16:18,520 --> 00:16:21,856 నేను చివరిగా వెళ్ళిన ఒకట్రెండు డేట్స్ ఓకే అమ్మాయితో వెళ్ళా. 337 00:16:21,857 --> 00:16:22,941 అవునా? 338 00:16:23,609 --> 00:16:25,402 హా, ఒకట్రెండు కాదు, ఇంకా ఎక్కువే. 339 00:16:27,529 --> 00:16:28,947 ఇంకా ఎక్కువే అంటే? 340 00:16:29,948 --> 00:16:31,783 ఆరవ డేట్ నుండి పదవ డేట్ వరకు. 341 00:16:33,619 --> 00:16:34,995 వావ్, అది చాలా గొప్ప విషయం. 342 00:16:36,163 --> 00:16:37,247 అవును. 343 00:16:38,874 --> 00:16:40,626 అయ్యయ్యో, తాళం చెవులు మర్చిపోయా. 344 00:16:41,210 --> 00:16:42,211 నేను… 345 00:16:42,711 --> 00:16:44,004 తింగరిదాన్ని అబ్బా. 346 00:16:47,007 --> 00:16:48,926 ఈ వీకెండ్ మ్యాచ్ అదరగొట్టేయండి. 347 00:16:57,851 --> 00:16:59,602 ఆరెంజ్ ట్రీ థియేటర్ 348 00:16:59,603 --> 00:17:01,813 బేబీ జేన్ కి ఏమైంది? 349 00:17:08,569 --> 00:17:12,366 ఈ కొత్త జీన్స్ వల్ల నేను ఫ్రీగా కూర్చోలేకపోతున్నా. 350 00:17:13,282 --> 00:17:14,576 క్షమించండి. 351 00:17:20,332 --> 00:17:22,459 ఆర్డర్. కోర్టులో నిశ్శబ్దం పాటించాలి. 352 00:17:23,126 --> 00:17:24,210 జేన్ పేన్. 353 00:17:24,211 --> 00:17:27,380 నీ పార్టనర్ బియర్డ్ ని పెళ్ళాడాలని నువ్వు గర్భవతివి అని చెప్పి 354 00:17:27,381 --> 00:17:30,926 అతడిని మోసం చేసినందుకు, ఇప్పుడు నీపై ఈ విచారణ జరుగుతోంది. 355 00:17:31,593 --> 00:17:32,719 దానికి నీ సమాధానం ఏంటి? 356 00:17:33,804 --> 00:17:37,391 నేను నిరపరాధినే, దొంగ మొహమా. 357 00:17:41,270 --> 00:17:42,271 ఇంకొక్కసారి చేద్దాం. 358 00:17:49,653 --> 00:17:51,070 - హేయ్. - హాయ్. 359 00:17:51,071 --> 00:17:52,447 ఓకే, నేను వచ్చేసరికి ఆలస్యమవుతుంది. 360 00:17:53,365 --> 00:17:55,534 మీరిద్దరూ మంచిగా ఉండండి. 361 00:17:59,121 --> 00:18:01,789 ఒక మాట, పడుకునే ముందు తీపి పదార్థాల జోలికి వెళ్ళవద్దు. 362 00:18:01,790 --> 00:18:04,376 అవి తింటే పీడకలలు వస్తాయి. ఇది నీకు కూడా వర్తిస్తుంది, జెల్కా. 363 00:18:06,461 --> 00:18:07,880 అలగలగే, కెప్టెన్. 364 00:18:14,344 --> 00:18:16,804 - పీడకలలు కనడానికి నువ్వు రెడీయా? - రెడీ! 365 00:18:16,805 --> 00:18:17,890 నేను కూడా. 366 00:18:19,183 --> 00:18:21,434 - జేన్? - చెప్పు. 367 00:18:21,435 --> 00:18:24,103 నేను నీ ప్రేమికుడిని, నీ ఏకైక నేస్తాన్ని, 368 00:18:24,104 --> 00:18:28,191 నీకు తల్లిని, తండ్రిని, అకౌంటెంట్ ని, మాస్టర్ ని, అన్నీ నేనే. 369 00:18:28,192 --> 00:18:29,318 బియర్డ్. 370 00:18:30,027 --> 00:18:32,945 నాకు అన్నీ నువ్వే. నీకోసం నేను ఏమైనా చేస్తాను. 371 00:18:32,946 --> 00:18:35,532 ఏమైనా చేస్తా. 372 00:18:37,034 --> 00:18:42,455 హేయ్, మిత్రులారా, నేను కోచ్ బియర్డ్ ని కాన్సాస్ సిటీకి తీసుకెళ్ళి, బార్బెక్యూ తినిపిస్తా. 373 00:18:42,456 --> 00:18:43,664 హేయ్, అది నేనే అనుకుంటా. 374 00:18:43,665 --> 00:18:46,542 కానీ వెళ్ళే ముందు ఒక మాట, జేన్, 375 00:18:46,543 --> 00:18:48,127 నాకు నీతో పడుకోవాలని ఉంది. 376 00:18:48,128 --> 00:18:49,420 అది నేను కాదు. 377 00:18:49,421 --> 00:18:50,756 సారీ. 378 00:18:52,549 --> 00:18:54,927 అందరికీ నాతో పడుకోవాలనే ఉంది. 379 00:18:59,139 --> 00:19:00,682 కడుపులో పెరుగుతున్న బిడ్డ నిజమైనదేనా? 380 00:19:04,144 --> 00:19:09,607 నా భర్త, నా కుటుంబం, దేవుడు, ఇంకా అతని ప్రత్యర్థుల దృష్టిలో నిజం కాదు. 381 00:19:09,608 --> 00:19:11,401 నేను వాళ్ళందరినీ పిచ్చోళ్లని చేశా కాబట్టి. 382 00:19:12,152 --> 00:19:17,157 కానీ నా దృష్టిలో, ఈ అబద్ధం ఒక్కటే నిజం. 383 00:19:35,425 --> 00:19:37,051 సరే, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది. 384 00:19:37,052 --> 00:19:38,135 నేను తనని కలవాలి. 385 00:19:38,136 --> 00:19:40,221 - వద్దు… ఓకే. - ఎక్స్ క్యూజ్ మీ. 386 00:19:40,222 --> 00:19:41,722 ఎక్స్ క్యూజ్ మీ. ఎక్స్ క్యూజ్ మీ. 387 00:19:41,723 --> 00:19:44,059 - ఇందాక డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఎక్స్ క్యూజ్ మీ. - పెద్ద స్ట్రాబెర్రీ. 388 00:19:44,810 --> 00:19:46,270 తల జివ్వున లాగుతోంది. 389 00:19:47,062 --> 00:19:48,730 త్వరగా నాలుకను నీ నోటి పైభాగానికి అంటించు. 390 00:19:51,942 --> 00:19:53,985 వావ్, డాక్టర్ లా మీకు అన్నీ తెలుసే. 391 00:19:53,986 --> 00:19:56,320 నిజానికి, ఒకసారి చెక్ చేస్తాను ఆగు. 392 00:19:56,321 --> 00:19:57,447 అయ్య బాబోయ్. 393 00:19:58,156 --> 00:19:59,657 అర్థమైపోయింది, ఇంకో 200 మిల్లీగ్రాముల 394 00:19:59,658 --> 00:20:02,870 స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఇస్తే అంతా సెట్ అయిపోతుంది. 395 00:20:03,537 --> 00:20:04,788 మార్చుకుందాం. 396 00:20:06,957 --> 00:20:07,958 అయితే… 397 00:20:09,042 --> 00:20:11,795 లండన్ కి షిఫ్ట్ అవ్వడం నీకెలా అనిపిస్తోంది? 398 00:20:12,671 --> 00:20:14,506 ఆనందంగానే ఉంది అనుకుంటా. 399 00:20:15,591 --> 00:20:17,759 హా, అమ్మకి పెద్ద పొజిషన్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. 400 00:20:18,260 --> 00:20:19,468 అది మంచి విషయమే. 401 00:20:19,469 --> 00:20:23,055 కానీ మీ నాన్నకి వచ్చిన ఉద్యోగం వల్లే కదా మీ అమ్మ కూడా లండన్ కి షిఫ్ట్ అయ్యేది. 402 00:20:23,056 --> 00:20:24,016 కాదు, అది నిజం కాదు. 403 00:20:24,975 --> 00:20:27,102 అమ్మ కోసమే నేను, నాన్న లండన్ కి షిఫ్ట్ అవుతున్నాం. 404 00:20:28,061 --> 00:20:30,647 ఓకే. మంచిదే. అది మంచి విషయమే. 405 00:20:31,732 --> 00:20:33,108 మంచి విషయమే అది. 406 00:20:35,527 --> 00:20:37,321 మనకి ఇంకాస్త ఐస్ క్రీమ్ కావాలనుకుంటా. 407 00:20:38,655 --> 00:20:39,907 లోపలికి రండి. 408 00:20:44,369 --> 00:20:45,495 హలో, జేన్. 409 00:20:46,747 --> 00:20:48,248 హలో, ఎవరండి మీరు? 410 00:20:49,625 --> 00:20:52,669 - నా పేరేంటో నీకు బాగా తెలుసు. - అవును. 411 00:20:53,378 --> 00:20:57,173 నువ్వు షోని చూడటానికి వస్తావని నాకు తెలుసు, ఎందుకంటే నీ మనస్సు లోలోతుల్లో 412 00:20:57,174 --> 00:21:01,594 నాపై ప్రేమ, ద్వేషం రెండూ ఒకేచోట ఉన్నాయి, అది నీకు నచ్చుతోంది కూడా. 413 00:21:01,595 --> 00:21:03,680 నువ్వు ఈ షోని ఇంతటితో ఆపేయాలి. 414 00:21:05,307 --> 00:21:06,433 ఎందుకు ఆపాలో చెప్పు! 415 00:21:26,119 --> 00:21:28,163 ఏం చేస్తున్నారు? 416 00:21:29,081 --> 00:21:30,540 మీరు ఇక్కడ ఈల వేయలేరు. 417 00:21:30,541 --> 00:21:32,917 - బ్రహ్మాండంగా వేయగలను. వినండి. - అది కాదు, 418 00:21:32,918 --> 00:21:34,920 నా ఉద్దేశం ఈల వేయవద్దు అని. 419 00:21:35,796 --> 00:21:38,215 - దాని వల్ల దురదృష్టం వస్తుంది. - అయ్యయ్యో, సారీ. 420 00:21:38,924 --> 00:21:40,800 మూఢ నమ్మకం. అర్థమైందిలే, హా. 421 00:21:40,801 --> 00:21:42,802 తనని తాను శాంతపరుచుకోవడానికి ఒకడు ఏ ఆలోచనా లేకుండా చేసే 422 00:21:42,803 --> 00:21:44,470 ఒక చిన్న పని, అతను ఉన్న చోటుని బట్టి 423 00:21:44,471 --> 00:21:47,099 పెద్ద వినాశనానికి దారి తీయవచ్చు. వినడానికి ఇది చాలా వింతగా ఉంది కదూ! 424 00:21:48,976 --> 00:21:49,977 హా. 425 00:21:50,894 --> 00:21:52,395 ఇక్కడ పని చేయడం సరదాగా ఉండుంటుంది, కదా? 426 00:21:52,396 --> 00:21:54,230 హా, అప్పుడప్పుడూ. 427 00:21:54,231 --> 00:21:55,691 ఓకే. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? 428 00:21:56,525 --> 00:22:00,111 - నేను స్టేజ్ మేనేజర్ ని. - సూపర్. స్టేజ్ మేనేజర్. 429 00:22:00,112 --> 00:22:02,030 స్టేజ్ మేనేజర్ ఎలా అయ్యారు మీరు? 430 00:22:02,906 --> 00:22:04,323 మీకు నిజంగా తెలుసుకోవాలనుందా? 431 00:22:04,324 --> 00:22:08,620 అవును. మీకు కావాలంటే, నేను ఇక్కడే నిలబడి, ఫోన్ చూసుకుంటూ గడపగలను. 432 00:22:11,415 --> 00:22:18,462 ఓకే. నేను షేక్ స్పియర్ రాసిన ఒక స్కాటిష్ నాటిక ప్రొడక్షన్ చూశాను, 433 00:22:18,463 --> 00:22:22,675 నాకు పదేళ్ళు ఉన్నప్పుడు, నాటిక జరుగుతున్నంత సేపూ నాకు ఒకటే ఆలోచనలు, 434 00:22:22,676 --> 00:22:26,637 ఒక సీన్లో వేదిక మీద బాల్కనీ ఉంది కదా, అది అక్కడికి ఎలా వచ్చింది, 435 00:22:26,638 --> 00:22:29,183 మరునిమిషంలో పెద్ద బాంక్వెట్ టేబుల్ ఎలా వచ్చింది? 436 00:22:29,808 --> 00:22:32,394 నాటికలో ఏం జరుగుతూ ఉండిందో నాకు అస్సలు తెలీదు. 437 00:22:33,520 --> 00:22:36,397 అవును, ఎందుకంటే మీ దృష్టి అంతా తెర చాటున ఏముందో చూడటం పైనే ఉంది. 438 00:22:36,398 --> 00:22:37,774 హా. అవును. 439 00:22:38,734 --> 00:22:40,276 కానీ నటి కావాలని మీరు ఎప్పుడూ అనుకోలేదా? 440 00:22:40,277 --> 00:22:42,028 అయ్య బాబోయ్, లేదు. 441 00:22:42,029 --> 00:22:43,571 వాళ్ళంతా తేడాగాళ్ళే. 442 00:22:43,572 --> 00:22:46,324 అంటే, నటులు షోలో పెద్ద ధీరులమని వర్ణించుకుంటుంటారు, కానీ అది నిజం కాదు, 443 00:22:46,325 --> 00:22:48,993 కానీ నేను అలా చేయలేనుగా. 444 00:22:48,994 --> 00:22:54,540 వారు బాగా చేయగల పనుల్లో సాయపడటమే నాకు సెట్ అవుతుందేమో. 445 00:22:54,541 --> 00:22:56,668 హా. థియేటర్ కోచ్ లా అన్నమాట. 446 00:22:57,252 --> 00:22:59,129 స్టేజ్ మేనేజర్ లా అనుకోండి. 447 00:22:59,671 --> 00:23:01,840 ఓకే, దానికి ప్రత్యేకమైన పేరు ఉందన్నమాట అయితే. 448 00:23:04,551 --> 00:23:07,136 - సారీ, ఇంతకీ ఎవరు మీరు? - నేను నా స్నేహితుని కోసం వేచి చూస్తున్నా. 449 00:23:07,137 --> 00:23:08,679 నా పేరు టెడ్. టెడ్ లాసో. 450 00:23:08,680 --> 00:23:10,681 - అంటే, నాటికలో మీ పాత్ర ఉంది కదా. మీరు, జేన్. - హా. 451 00:23:10,682 --> 00:23:12,391 లేదు, లేదు, అది నిజం కాదు. 452 00:23:12,392 --> 00:23:14,894 కానీ అది కేవలం ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అన్నమాట. 453 00:23:14,895 --> 00:23:17,939 ఒకరి వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను పూర్తిగా గౌరవిస్తాను. 454 00:23:17,940 --> 00:23:20,483 ఆమె ఎమోషన్ ని బాగానే పండించింది, కానీ అది నిజం కాదు. 455 00:23:20,484 --> 00:23:22,568 "ఏ" జోన్లో ఏదో బాగా లీక్ అవుతోంది. 456 00:23:22,569 --> 00:23:24,655 - హా, నేను వెళ్ళాలి అనుకుంటా. - తప్పకుండా. 457 00:23:25,948 --> 00:23:27,448 అన్నట్టు, మీ జీన్స్ చాలా బాగుంది. 458 00:23:27,449 --> 00:23:30,577 థ్యాంక్యూ. అంటే, 22 మంది యువతులు కలిసి దీన్ని నాకు కొని ఇచ్చారు. 459 00:23:36,291 --> 00:23:37,543 నేను ఈల వేసినందుకే అలా జరిగిందా? 460 00:23:38,585 --> 00:23:39,586 అవును. 461 00:23:46,468 --> 00:23:47,469 బాగానే ఉన్నావా? 462 00:23:48,011 --> 00:23:51,597 మంచి విషయం ఏంటంటే, జేన్ ఇకపై ఈ షోని చేయనంది. 463 00:23:51,598 --> 00:23:53,099 - సూపర్. - కానీ చెడు విషయం ఏంటంటే, 464 00:23:53,100 --> 00:23:55,309 తన ప్రొడ్యూసర్లు దీన్ని వెస్ట్ ఎండ్ థియేటర్లో ప్రదర్శించాలని చూస్తున్నారు, 465 00:23:55,310 --> 00:23:57,728 తన పాత్రలో జెన్నిఫర్ లారెన్స్ ని కానీ, ఎమ్మా స్టోన్ ని కానీ పెట్టి తీసి, 466 00:23:57,729 --> 00:24:00,690 - లండన్లోనే టాప్ షో చేయాలనుకుంటున్నారు. - అందుకని అద్దాన్ని చేత్తో గుద్దావా? 467 00:24:00,691 --> 00:24:04,610 - లేదు, తలతో కొట్టా. - ఓకే. 468 00:24:04,611 --> 00:24:06,737 హా, నువ్వు ఇక్కడ ఉండకూడదు. పద. 469 00:24:06,738 --> 00:24:08,447 - ఇక్కడ ఎవరైనా ఈల వేశారా? - హా, ఎవరో వేశారు. 470 00:24:08,448 --> 00:24:10,450 ఎవరు వేశారో నాకు తెలీదు. నువ్వు "మ్యాక్ బెత్" సినిమా చూశావా? 471 00:24:13,745 --> 00:24:14,746 ఓకే. 472 00:24:26,049 --> 00:24:27,801 - గుడ్ మార్నింగ్. - గుడ్ మార్నింగ్. 473 00:24:31,847 --> 00:24:33,599 - అంతా ఓకేనా? - ఓకే. 474 00:24:37,060 --> 00:24:38,061 సరే మరి. 475 00:24:40,272 --> 00:24:42,064 ఐ లవ్ యూ, 476 00:24:42,065 --> 00:24:44,067 కానీ నువ్వు విషయం ఏంటో చెప్పాలి. 477 00:24:45,194 --> 00:24:46,737 ఏం లేదు. నేను బాగానే ఉన్నా. 478 00:24:47,613 --> 00:24:50,239 మానవ జాతి చరిత్ర మొత్తం పిండేసి చెప్తున్నా, 479 00:24:50,240 --> 00:24:53,952 ఒక మహిళ తను బాగున్నాను అని అందంటే, తను అస్సలు బాగాలేదని అర్థం. 480 00:24:56,038 --> 00:24:57,039 సరే. 481 00:24:58,790 --> 00:24:59,791 చూడు. 482 00:25:01,084 --> 00:25:04,253 నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి షిఫ్ట్ అవ్వవచ్చు, అందులో సందేహం అక్కర్లేదు. 483 00:25:04,254 --> 00:25:08,132 కానీ ముందు మనం దాని గురించి చర్చించుకుని ఉంటే బాగుండేది అనిపిస్తోంది, 484 00:25:08,133 --> 00:25:10,093 కానీ మనం ఆ పని చేయలేదు. 485 00:25:11,261 --> 00:25:12,262 అవును. 486 00:25:13,138 --> 00:25:15,682 నువ్వు అన్నది నిజమే, సారీ. 487 00:25:17,351 --> 00:25:19,937 నువ్వు సంతోషపడతావని అనుకున్నా. 488 00:25:22,564 --> 00:25:25,525 కానీ అసలు విషయం వేరే ఏదో ఉందని అనిపిస్తోంది నాకు. 489 00:25:25,526 --> 00:25:28,486 అవును, నువ్వు… నువ్వు ఎందుకు లండన్ కి షిఫ్ట్ అవుతున్నావు? 490 00:25:28,487 --> 00:25:30,029 - ఏంటి? - నిజం చెప్పు. 491 00:25:30,030 --> 00:25:33,199 నీ మాజీ భార్య ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తోంది కాబట్టే ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నావు కదా. 492 00:25:33,200 --> 00:25:35,786 నువ్వు వస్తున్నావని తను రావట్లేదు. తనకి ఉద్యోగం వచ్చిందని వస్తున్నావు. 493 00:25:36,703 --> 00:25:38,788 కాస్త ఆగుతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలేం… 494 00:25:38,789 --> 00:25:40,915 - ఎందుకలా అనిపిస్తోంది నీకు? - జెల్కా చెప్పింది నాకు. 495 00:25:40,916 --> 00:25:44,001 తను పొరబడింది. కన్ఫ్యూస్ అయింది. పదేళ్ళ పిల్ల కదా. 496 00:25:44,002 --> 00:25:46,212 కానీ దీని గురించి మీరు ఎందుకు మాట్లాడుకున్నారు? 497 00:25:46,213 --> 00:25:48,714 లేదు, నేను… నేను షిఫ్టింగ్ గురించి తనని మామూలుగా అడిగానంతే. 498 00:25:48,715 --> 00:25:50,592 నువ్వు అడిగి ఉండాల్సింది కాదు. 499 00:25:51,218 --> 00:25:54,429 నాకు, తన అమ్మకి మధ్య తను ఇప్పటికే నలిగిపోతోంది. 500 00:25:56,890 --> 00:26:01,102 చూడు, దాని ప్రభావం తనపై పడకుండా చూసుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. 501 00:26:01,103 --> 00:26:03,479 మళ్ళీ తనకి అదంతా గుర్తు చేయాలని నాకు అస్సలు లేదు. 502 00:26:03,480 --> 00:26:05,022 సరే, అలాగే. చూడు, ఓకేలే. 503 00:26:05,023 --> 00:26:06,441 కాదు, ఓకే కాదు. 504 00:26:07,568 --> 00:26:12,865 చూడు, మన మధ్య అంతా బాగుంది, కలిసి ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోనే ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకున్నా. 505 00:26:17,452 --> 00:26:18,996 ఓకే. క్షమించు. 506 00:26:21,373 --> 00:26:23,166 మనం కాస్త బ్రేక్ తీసుకోవాలనుకుంటా. 507 00:26:24,418 --> 00:26:29,590 నిజంగా మనకి ఇది ఓకేనా? సెట్ అవుతుందా? అనేది చూడటానికి కాస్త బ్రేక్ తీసుకోవాలనుకుంటా. 508 00:26:30,174 --> 00:26:31,341 మనిద్దరమూ. 509 00:26:31,967 --> 00:26:32,968 నాన్నా! 510 00:26:35,679 --> 00:26:37,805 నాన్నా, పాన్ కేకులు చేద్దామా? 511 00:26:37,806 --> 00:26:39,600 - ప్లీజ్. - సారీ. 512 00:26:44,605 --> 00:26:45,856 అబ్బా. 513 00:26:49,902 --> 00:26:52,361 ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న 514 00:26:52,362 --> 00:26:56,365 ఏ ఎఫ్ సి రిచ్మండ్ మహిళల జట్టు తొలిసారిగా, ఒక ఉత్కంఠభరితమైన ఎఫ్ఏ కప్ మ్యాచ్ కోసం 515 00:26:56,366 --> 00:26:59,493 తమ అభిమానులను తమ పూర్వీకుల ఆవాసమైన, స్వయంగా డాగ్ ట్రాక్ అయిన 516 00:26:59,494 --> 00:27:02,580 నెల్సన్ రోడ్ స్టేడియానికి శక్తివంతమైన చెల్సీతో పోరుకి స్వాగతం పలుకుతోంది. 517 00:27:02,581 --> 00:27:03,998 వీఐపీ మాత్రమే టికెట్ కలెక్షన్ 518 00:27:03,999 --> 00:27:07,210 నేను రెబెక్కా లోవ్ ని, నాతో పాటు ఇక్కడ ఇంగ్లండ్ లెజెండ్ జిల్ స్కాట్ ఉన్నారు. 519 00:27:07,211 --> 00:27:10,214 జిల్, రిచ్మండ్ జట్టు ఇవాళ గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? 520 00:27:10,714 --> 00:27:13,132 అది ఎప్పటికీ తేలని ప్రశ్నే కదా, రెబెక్కా? 521 00:27:13,133 --> 00:27:17,262 ఏ ఆటలో ఎవరు గెలుస్తారో, అదృష్టం ఎవరిని వరిస్తుందో ఎప్పటికీ చెప్పలేం. 522 00:27:17,971 --> 00:27:19,055 కాబట్టి ఉంది అనే అంటాను. 523 00:27:19,056 --> 00:27:20,431 జిల్ స్కాట్ & రెబెక్కా లోవ్ 524 00:27:20,432 --> 00:27:23,059 ఇది రిచ్మండ్ చరిత్రలోనే టీవీలో ప్రసారమవుతున్న మొట్టమొదటి మ్యాచ్ కూడా. 525 00:27:23,060 --> 00:27:25,144 ఇంకొద్ది సేపట్లో మ్యాచ్ మొదలుకానుంది. 526 00:27:25,145 --> 00:27:27,314 - ఓకే. మన సత్తా చూపిద్దాం, లేడీస్. పదండి. - పదండి. చలో. 527 00:27:28,732 --> 00:27:30,233 జనాలను చూసి బెంబేలెత్తిపోకండి. 528 00:27:30,234 --> 00:27:31,902 నేను బెంబేలెత్తిపోయే రకం కాదులే. 529 00:27:32,528 --> 00:27:35,864 సింథియా ఎరీవో విషయంలో తప్ప. కానీ తన మీద ఉన్న అభిమానం వల్లనే అది. 530 00:27:37,074 --> 00:27:38,700 వాళ్ళకి చుక్కలు చూపిద్దాం. 531 00:27:43,539 --> 00:27:46,624 ఈ క్రీడాకారులు హౌస్ ఫుల్ అయిన నెల్సన్ రోడ్లో 532 00:27:46,625 --> 00:27:49,794 మొదటిసారి మైదానంలోకి అడుగుపెడుతున్న వేళ, ప్రేక్షకుల కోలాహలాన్ని విందాం. 533 00:27:49,795 --> 00:27:51,295 అంతగా వినడానికి ఏమీ లేదు. 534 00:27:51,296 --> 00:27:54,174 టిక్కెట్లయితే అమ్ముడయ్యాయి కానీ, చూస్తుంటే సగం ఖాళీగానే ఉంది. 535 00:27:55,717 --> 00:27:58,720 - ఈ ఆట నాదే. వేట నాదే. - ఈ ఆట నాదే. వేట నాదే. 536 00:27:59,388 --> 00:28:02,306 ఈ ఆట నాదే. వేట నాదే. 537 00:28:02,307 --> 00:28:05,726 స్టేడియం ఖాళీగా ఉండటం వల్ల వీడియో సౌండ్ చాలా గట్టిగా వినిపిస్తోంది. 538 00:28:05,727 --> 00:28:07,270 - ట్రాఫిక్ జామ్ ఏమో. - ఈ ఆట నాదే. వేట నాదే. 539 00:28:07,271 --> 00:28:11,190 లేదు, ఎప్పటికంటే తక్కువే ఉంది. ఎందుకంటే, నేను ఇక్కడికి చాలా ముందే వచ్చేశా. 540 00:28:11,191 --> 00:28:14,111 బాత్రూమ్ స్టాల్ లో కూర్చొని నా పుస్తకం చదువుకున్నా. 541 00:28:15,195 --> 00:28:16,697 నిజానికి… 542 00:28:18,323 --> 00:28:20,325 హా, మర్చిపోయా. దాన్ని అక్కడే మర్చిపోయా. ఇప్పుడు వెళ్లి… 543 00:28:24,413 --> 00:28:26,289 పది నిమిషాలు గడిచాయి, ఆట అంతా చెల్సీదే పైచేయిగా సాగుతోంది. 544 00:28:26,290 --> 00:28:28,541 వాళ్లు జెమ్మా జే ఆటను పూర్తిగా కట్టడి చేశారు. 545 00:28:28,542 --> 00:28:31,043 బంతి 95% వాళ్ల దగ్గరే ఉంది, 546 00:28:31,044 --> 00:28:33,880 రిచ్మండ్ వాళ్లను కనీసం తాకలేకపోతున్నారు కూడా. 547 00:28:33,881 --> 00:28:36,549 అంతేకాదు, ఇక్కడ చుక్కలు చుక్కలుగా ఉన్న జనాన్ని చూస్తుంటే, 548 00:28:36,550 --> 00:28:39,218 ఒకరికొకరు తాకేంత దగ్గరగా కూడా ఎవరూ లేరనిపిస్తోంది! 549 00:28:39,219 --> 00:28:41,429 నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. 550 00:28:41,430 --> 00:28:43,472 మట్టాయస్, జెల్కా కనీసం రాను కూడా రాలేదే. 551 00:28:43,473 --> 00:28:45,142 హా, అతనికి… 552 00:28:46,018 --> 00:28:47,853 పని ఉందట. సారీ. 553 00:28:48,395 --> 00:28:50,689 హలో, అదృష్టవంతులారా. 554 00:28:51,231 --> 00:28:52,523 ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 555 00:28:52,524 --> 00:28:54,067 ఎవరూ లేరు కదా? లేరా? సూపర్. 556 00:28:56,361 --> 00:28:59,281 నా బ్యాగ్ కి కూడా ఒక కుర్చీ. సూపరో సూపర్. 557 00:28:59,907 --> 00:29:02,576 బాబోయ్, స్టేడియం బాగా ఖాళీగా ఉందే. 558 00:29:04,912 --> 00:29:07,079 బాధపడకు, కీలీ. 559 00:29:07,080 --> 00:29:08,831 పరిస్థితులను దాటుకుని ముందుకు వెళ్ళడమే ఏకైక మార్గం, 560 00:29:08,832 --> 00:29:14,171 కానీ కొన్నిసార్లు అలా దాటాలంటే, దెబ్బల మీద దెబ్బలు తినాల్సి వస్తుంది. 561 00:29:15,631 --> 00:29:16,714 కదా? హా? 562 00:29:16,715 --> 00:29:19,133 మీరు కానివ్వండి, సరేనా? ఇవాళ నేను ఇప్పటికే బాగా దొబ్బెట్టాను. 563 00:29:19,134 --> 00:29:21,094 లేదు. మళ్ళీ వస్తా. పర్వాలేదు, థ్యాంక్స్. 564 00:29:24,515 --> 00:29:25,516 సరే మరి. 565 00:29:33,065 --> 00:29:34,148 - తాగేయ్. - తొక్కలే. 566 00:29:34,149 --> 00:29:35,442 గుక్కెడు తాగు. 567 00:29:36,026 --> 00:29:38,237 సూపర్. తాగి తూగుదాం. 568 00:29:42,699 --> 00:29:44,867 ఛాంపియన్ జట్టు ఆటని ఏకపక్షం చేస్తూ, 569 00:29:44,868 --> 00:29:47,286 తమ తొలి ఎఫ్ఏ కప్ ఆడుతున్న జట్టును చాలా సులువుగా ఓడిస్తున్నారు. 570 00:29:47,287 --> 00:29:48,704 గ్రామర్ క్రాస్ షాట్ కొట్టింది, 571 00:29:48,705 --> 00:29:52,875 గ్రివల్ హెడ్ షాట్ కొట్టింది, పావుగంటలో చెల్సీ టీమ్ 1-0తో ముందంజ సాధించింది. 572 00:29:52,876 --> 00:29:54,085 చెల్సీ చాలా అద్భుతంగా ఆడుతోంది. 573 00:29:54,086 --> 00:29:55,462 అబ్బా. 574 00:29:58,924 --> 00:29:59,967 నాకు అర్థం కావట్లేదు. 575 00:30:00,467 --> 00:30:03,387 ఆ వీడియోకి ఆన్ లైన్లో చాలా సపోర్ట్ వచ్చింది. 576 00:30:03,887 --> 00:30:05,264 కానీ ఇక్కడికి మాకు సపోర్ట్ గా ఎవరూ రాలేదు. 577 00:30:05,848 --> 00:30:09,183 స్క్రీన్ మీద లైక్ కొట్టడానికి, స్వయంగా వచ్చి సపోర్ట్ ఇవ్వడానికి చాలా తేడా ఉంది, 578 00:30:09,184 --> 00:30:10,227 ఏమంటావు? 579 00:30:15,315 --> 00:30:18,651 నువ్వు ఏదైతే చేస్తున్నావో, అది నీకు చాలా ముఖ్యమని నాకు తెలుసు. 580 00:30:18,652 --> 00:30:23,489 ముఖ్యం కాకపోతే, నువ్వు కేబీపీఆర్ ని వదిలేసి దీనిపై అంత ఫోకస్ చేయవు కదా. 581 00:30:23,490 --> 00:30:26,285 కానీ… కానీ ఇందులో నువ్వు సరదాగా కూడా ఉండవచ్చు. 582 00:30:27,911 --> 00:30:31,956 అంటే, సరదాగా కూడా ఉండాలని, అలా… అలా ఉండటం ఎంత ముఖ్యమో 583 00:30:31,957 --> 00:30:34,042 నాకు… నాకు చూపింది నువ్వే కదా. 584 00:30:36,253 --> 00:30:37,254 నువ్వు అన్నది నిజమే. 585 00:30:38,088 --> 00:30:40,214 బహుశా నా ఫోకస్ అంతా దీని మీదే పెట్టడం కరెక్టే కాదేమో. 586 00:30:40,215 --> 00:30:41,966 లేదు, లేదు, నువ్వు ఫోకస్ పెట్టాలి. 587 00:30:41,967 --> 00:30:43,968 ఎందుకంటే, కంపెనీని నేను చూసుకోగలను. 588 00:30:43,969 --> 00:30:45,261 దాని గురించి ఆలోచించకు. 589 00:30:45,262 --> 00:30:46,596 బాస్ గా ఉండటం అంటే నాకు చాలా ఇష్టం. 590 00:30:46,597 --> 00:30:49,891 అంటే, ఆఫీసుకు త్వరగా వెళ్లి, నా డెస్క్ దగ్గర కూర్చోవడం అంటే నాకు భలే ఇష్టం, 591 00:30:49,892 --> 00:30:51,434 అప్పుడు అందరూ లోపలికి వచ్చేటప్పుడు, 592 00:30:51,435 --> 00:30:53,186 నన్ను చూసి, "అయిపోయాంరా బాబు" అనుకుంటారు కదా. 593 00:30:53,187 --> 00:30:55,731 అంటే, నాకు… నాకు అది భలే నచ్చుతుంది. నిజంగానే అంటున్నా. 594 00:30:56,315 --> 00:30:58,024 ఫోకస్ మిస్ అవ్వద్దు. 595 00:30:58,025 --> 00:30:59,108 అది ముఖ్యం. 596 00:30:59,109 --> 00:31:03,405 కాకపోతే, నువ్వు నీ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే, ఇంకాస్త సరదాగా ఉండొచ్చని నా ఉద్దేశం. 597 00:31:07,492 --> 00:31:09,785 - థ్యాంక్యూ, బార్బరా. - హా. ఓకే, సరే మరి. 598 00:31:09,786 --> 00:31:11,078 నువ్వు ఆట చూస్తూ ఉండు. 599 00:31:11,079 --> 00:31:12,830 నేను వెళ్లి ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివేస్తాను, 600 00:31:12,831 --> 00:31:15,082 మళ్ళీ హాఫ్ టైం అయ్యేసరికి క్యూ పెరిగిపోతుంది. 601 00:31:15,083 --> 00:31:16,959 - సరే. - సరే. 602 00:31:16,960 --> 00:31:18,795 - ఈ సీట్ నీ కోసం ఎత్తిపెడతాలే. - ఓకే. 603 00:31:25,302 --> 00:31:27,803 చెల్సీ వాళ్ళు రచ్చరచ్చ చేస్తున్నారు. 604 00:31:27,804 --> 00:31:29,847 పెద్ద సమయమేం పట్టదు… 605 00:31:29,848 --> 00:31:30,849 మల్లన్! 606 00:31:31,391 --> 00:31:32,476 స్కోర్ 2-0 అయిపోయింది. 607 00:31:35,020 --> 00:31:36,646 క్విన్ ఎంత అరిచినా లాభం లేదు, 608 00:31:36,647 --> 00:31:40,316 దానికి బదులు తను గ్లవ్స్ కొనుక్కుని ఉంటే బాగుండేది. 609 00:31:40,317 --> 00:31:41,901 రిచ్మండ్ కోచింగ్ స్టాఫ్ కి 610 00:31:41,902 --> 00:31:44,028 ఈ హాఫ్ టైమ్ చాలా కష్టమైనదే. 611 00:31:44,029 --> 00:31:47,698 గ్రేహౌండ్స్ జట్టుని ఈ చిక్కుల్లోంచి బయటకు తీసుకురావాలంటే వాళ్లంతా కలిసికట్టుగా ప్లాన్ చేయాల్సిందే. 612 00:31:47,699 --> 00:31:50,244 - ఆ లాసో మార్క్ పాజిటివిటీని ఎక్కించాలి. - ఒక మాట, ఇక్కడ… 613 00:31:51,411 --> 00:31:52,954 - డిఫెన్స్. అదేం లేదు. - అవును. 614 00:31:52,955 --> 00:31:54,247 నేను అలా బయటకి వెళ్లి వస్తాను, సరేనా? 615 00:31:54,248 --> 00:31:57,584 - సరే, సరే. సారీ మా వల్ల… - సారీ ఎందుకు! 616 00:31:58,126 --> 00:31:59,253 కాసేపట్లో వస్తా. 617 00:31:59,795 --> 00:32:01,255 ఓకే. హా. 618 00:32:06,176 --> 00:32:08,636 - పాపం తన రాత అస్సలు బాగోలేదు. - ఎందుకలా? 619 00:32:08,637 --> 00:32:13,517 తను కళ్ల నిండా కలలు దాచుకున్న పిల్ల కదా? అలాంటి వాళ్లని జీవితం చాలా ఇబ్బంది పెడుతుంది. 620 00:32:14,059 --> 00:32:16,602 అందుకే తనకి నీ అవసరం ఉంది, ఎందుకంటే నువ్వు పనులని పూర్తిచేసే రకం. 621 00:32:16,603 --> 00:32:18,939 - అవును, అవును. - నువ్వూ నాలా పని ఎలా చేయాలో తెలిసిన దానివి. 622 00:32:19,439 --> 00:32:21,315 కాకపోతే, కళ్ళ నిండా కలలను దాచుకున్న ఆ మనిషి 623 00:32:21,316 --> 00:32:24,235 నా మాటలని అప్పుడప్పుడైనా వింటే ఇంకా చాలా పనులని పూర్తి చేయగలను. 624 00:32:24,236 --> 00:32:27,072 పెద్ద పెద్ద ఆశలు, కలలు ఉన్నప్పుడు, మనసు చెప్పే చిన్న నిజం ఎవరికీ ఎక్కదులే. 625 00:32:27,698 --> 00:32:28,990 కానీ, ఏదేమైనా, 626 00:32:28,991 --> 00:32:31,158 లోకంలో ఆ రెండు రకాల వాళ్ళూ ఉండాలి. 627 00:32:31,159 --> 00:32:33,536 - కలలు కనేవారు ఉండాలి, పని చేసేవారూ ఉండాలి. - హా. 628 00:32:33,537 --> 00:32:34,663 యురిత్మిక్స్ బ్యాండ్ లా అనుకో. 629 00:32:35,163 --> 00:32:37,123 - నాకు యురిత్మిక్స్ అంటే చచ్చేంత ఇష్టం. - నాకు అయితే పిచ్చి. 630 00:32:37,124 --> 00:32:39,542 నాకు యురిత్మిక్స్ అంటే ప్రాణం, నేను వాళ్ళ మొదటి షోకి వెళ్లాను. 631 00:32:39,543 --> 00:32:40,710 - జోక్ చేస్తున్నారు కదా. - నేను వెళ్ళా, 632 00:32:40,711 --> 00:32:43,797 కానీ ప్రేక్షకుల కన్నా వేదిక మీదే ఎక్కువ మంది ఉన్నారు. 633 00:32:44,756 --> 00:32:46,675 - వేదిక మీద ఇద్దరే ఉంటారుగా. - తెలుసు. వెళ్ళింది నేను ఒక్కదాన్నే. 634 00:32:48,677 --> 00:32:49,802 రెబెక్కా. 635 00:32:49,803 --> 00:32:50,804 ఏంటి? 636 00:32:51,930 --> 00:32:53,556 లెస్లీ. 637 00:32:53,557 --> 00:32:56,642 హాఫ్ టైం అయింది. రెడీగా ఉన్నావా? పిల్లలకి చెక్ ఇవ్వాలి కదా. 638 00:32:56,643 --> 00:32:58,895 హా, ఇప్పుడే కదా. 639 00:32:58,896 --> 00:33:01,230 వస్తున్నా. వస్తున్నా. 640 00:33:01,231 --> 00:33:02,523 పని చేసేవాళ్లు, చేస్తూనే ఉంటారు. 641 00:33:02,524 --> 00:33:03,525 సరే. 642 00:33:05,944 --> 00:33:08,154 దూసుకుపో, పనిమంతురాలా! 643 00:33:08,155 --> 00:33:09,572 హా, దూసుకుపోతా! 644 00:33:09,573 --> 00:33:11,199 చాలా దరిద్రంగా ఆడారు. 645 00:33:11,200 --> 00:33:13,826 టీవీలో ప్రసారమవుతున్న మన తొలి మ్యాచ్ ఇది, మీరేమో ఇలా ఆడుతున్నారు. 646 00:33:13,827 --> 00:33:15,286 ఈ వారం మా చేత మరీ ఎక్కువ పరుగెత్తించావేమో. 647 00:33:15,287 --> 00:33:16,997 మీరు దరిద్రంగా ఆడుతుంటే నేనేం చేయను! 648 00:33:18,123 --> 00:33:20,667 మీ పరువు పోగొట్టించుకోవడమే కాక, మా అందరి పరువు పోగొడుతున్నారు. 649 00:33:22,586 --> 00:33:23,794 హేయ్, కోచ్, 650 00:33:23,795 --> 00:33:26,757 మ్యాచ్ అయ్యాక, నీతో ఒక నిమిషం మాట్లాడాలి, సరేనా? 651 00:33:30,260 --> 00:33:32,345 ఇది మంచి ఐడియా కాదనిపిస్తోంది. 652 00:33:32,346 --> 00:33:34,931 లేదు, లెస్లీ. ఇది చాలా మంచి ఐడియా. 653 00:33:34,932 --> 00:33:41,479 నిజానికి ఇంత గొప్ప ఐడియా ఇప్పటిదాకా ఎవరికీ రాలేదు. 654 00:33:41,480 --> 00:33:43,564 సరే. దేవుడా. 655 00:33:43,565 --> 00:33:45,108 {\an8}అక్షరాలా లక్ష పౌండ్లే … & ఆర్ ఫౌండేషన్ కి 656 00:33:47,152 --> 00:33:48,403 ఓయ్! 657 00:33:49,530 --> 00:33:53,116 ఏ ఎఫ్ సి రిచ్మండ్ మొదట్నుంచీ కూడా ఈ కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ వచ్చింది. 658 00:33:54,034 --> 00:33:58,663 కాబట్టి ఇవాళ ఏ ఎఫ్ సి రిచ్మండ్ కి సపోర్ట్ చేసిన 659 00:33:58,664 --> 00:34:01,500 ఈ కమ్యూనిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. 660 00:34:04,169 --> 00:34:06,128 {\an8}ఏ ఎఫ్ సి రిచ్మండ్ ఓనర్ … & ఆర్ ఫౌండేషన్ కి చెక్ ఇస్తున్నారు 661 00:34:06,129 --> 00:34:08,422 {\an8}కానీ… కానీ ఇవాళ ఇక్కడికి రాని 662 00:34:09,550 --> 00:34:13,886 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ ప్రేమికులకి 663 00:34:13,887 --> 00:34:16,263 {\an8}నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. 664 00:34:16,264 --> 00:34:18,140 {\an8}ఎక్కడ ఉన్నారు మీరు? 665 00:34:18,141 --> 00:34:19,642 నేను అన్నదానిలో తప్పేమైనా ఉందా? 666 00:34:19,643 --> 00:34:22,812 - కరెక్టే! ఎక్కడ ఉన్నారు మీరు? - ఎక్కడ ఉన్నారు మీరు? 667 00:34:22,813 --> 00:34:29,901 ఎక్కడ ఉన్నారు మీరు? ఎక్కడ ఉన్నారు మీరు? 668 00:34:29,902 --> 00:34:31,904 - ఎక్కడ ఉన్నారు మీరు? అంతే. - ఎక్కడ ఉన్నారు మీరు? 669 00:34:31,905 --> 00:34:33,363 ఎక్కడ చచ్చారు మీరు? 670 00:34:33,364 --> 00:34:34,532 యా! 671 00:34:34,533 --> 00:34:38,620 అవును! ఎక్కడ ఉన్నారు మీరు? 672 00:34:39,161 --> 00:34:40,413 మనం ఆ ఆటకి వెళ్ళుండాల్సిందేమో. 673 00:34:40,414 --> 00:34:44,042 అందరూ రండి! రండయ్యా! 674 00:34:49,590 --> 00:34:51,465 అలా కుమ్మిపడేయాలంతే! 675 00:34:51,466 --> 00:34:52,717 అంతే! 676 00:34:53,260 --> 00:34:54,719 బాగుంది. చాలా బాగుంది. 677 00:34:59,933 --> 00:35:01,392 సరే మరి. 678 00:35:01,393 --> 00:35:05,188 చెల్సీ ఆటగాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, అది మనకి తెలియని విషయం కాదు. 679 00:35:05,189 --> 00:35:06,648 మనందరం గేమ్ ఫిల్మ్ చూశాం కదా. 680 00:35:07,357 --> 00:35:09,443 "రియల్ హౌస్ వైఫ్"కి ఉండే హైలైట్స్ కంటే, వీళ్ళకే ఎక్కువ హైలైట్స్ ఉన్నాయి. 681 00:35:10,110 --> 00:35:11,986 కానీ, మనం రెండే గోల్స్ వెనుకంజలో ఉన్నాం. 682 00:35:11,987 --> 00:35:14,739 విషయం ఏంటంటే, రెండు అంటే మూడు కాదు కదా, 683 00:35:14,740 --> 00:35:16,158 మైదానంలో మీరందరూ గట్టిగానే ప్రయత్నించారు. 684 00:35:17,326 --> 00:35:20,996 కాబట్టి నన్ను అడిగితే, మీరు సిగ్గుపడాల్సినంత ఏం జరగలేదు ఇక్కడ. 685 00:35:23,040 --> 00:35:24,041 సిగ్గు. 686 00:35:27,336 --> 00:35:31,088 చూడండి, కోచ్ లమైన మేము మీ నుండి చాలా ఆశిస్తామని నాకు తెలుసు. 687 00:35:31,089 --> 00:35:33,300 అప్పుడప్పుడూ, మీ ఫలితాలు మేము ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. 688 00:35:34,051 --> 00:35:37,887 అదే సమయంలో, మీరు కూడా మా నుండి కొన్ని ఆశిస్తుంటారని, 689 00:35:37,888 --> 00:35:40,307 మీతో మాట్లాడటం కానీ, చర్చించడం కానీ మేం మరింత బాగా చేయాలని కూడా నాకు తెలుసు. 690 00:35:40,974 --> 00:35:41,975 కాబట్టి నేను మొదలుపెడతాను. 691 00:35:43,894 --> 00:35:45,145 లేదు, నేను వివాహితుడిని కాదు. 692 00:35:46,021 --> 00:35:48,481 గతంలో వైవాహిక బంధంలోనే ఉండేవాడిని. 693 00:35:48,482 --> 00:35:50,358 నిజానికి, నాకు నా మాజీ భార్య ఎంత కాలంగా తెలుసు అంటే, 694 00:35:50,359 --> 00:35:52,319 మీలో కొందరి వయస్సు కూడా అంత ఉండదు. 695 00:35:53,362 --> 00:35:56,072 మా అబ్బాయి హెన్రీ బాధ్యతలని ఇద్దరం కలిసి పంచుకుంటున్నాం. 696 00:35:56,073 --> 00:35:57,991 మా అబ్బాయిని మీరు ఒకట్రెండు సార్లు కలిశారు కదా. 697 00:35:58,492 --> 00:36:01,370 ఇక ఆదివారం మార్చి ఆదివారం వాడిని వాళ్ళ అమ్మ ఇంట్లో డ్రాప్ చేశాక, 698 00:36:02,663 --> 00:36:04,414 నేనే కావాలని ఒంటరిగా తింటాను. 699 00:36:07,209 --> 00:36:09,002 లేదు, నేను ఎవరితోనూ డేటింగ్ చెయ్యట్లేదు. 700 00:36:10,337 --> 00:36:11,797 కానీ నేను దానికి సిద్ధంగానే ఉన్నాను అనుకుంటా. 701 00:36:13,340 --> 00:36:14,466 అనుకుంటా. 702 00:36:15,676 --> 00:36:19,805 ఇంకా నా దృష్టిలో నేనేం ఒంటరివాడిని కాదు. 703 00:36:20,681 --> 00:36:23,724 దానికి కారణం ఏంటంటే, నాకు మీరు ఉన్నారు, మీరూ ఉన్నారు. 704 00:36:23,725 --> 00:36:26,478 ఇంకా ఇక్కడ కొందరు కొలీగ్స్ కూడా ఉన్నారు కదా. 705 00:36:28,105 --> 00:36:29,188 ఉన్న మాట చెప్పేస్తున్నా. 706 00:36:29,189 --> 00:36:31,441 మీరు తీసిన నా ఫోటో చూసి నేనే కాస్త షాక్ అయ్యా. 707 00:36:33,569 --> 00:36:35,821 ఎందుకంటే, మీలా నాకూ నా గురించి తెలీకుండా ఉండి, నన్ను నేనలా చూసినప్పుడు, 708 00:36:36,488 --> 00:36:39,115 నాకు కూడా నా అంత ఒంటరోడు లేడనే అనిపిస్తుంది. 709 00:36:39,116 --> 00:36:40,242 తెలుసా? 710 00:36:42,077 --> 00:36:43,161 హా. 711 00:36:43,745 --> 00:36:45,122 అప్పుడు నాకు కూడా సిగ్గుగా అనిపించింది. 712 00:36:47,833 --> 00:36:49,168 సిగ్గు. 713 00:36:50,377 --> 00:36:53,088 అది ఎంత పనికిమాలిన ఎమోషన్ అంటే, దాన్ని చూసి అదే సిగ్గుపడాలి. 714 00:36:54,631 --> 00:36:56,800 ఏదేమైనా, అది మనల్ని ఎవరినైనా బంధించేయగలదు. 715 00:36:57,801 --> 00:37:00,429 దాని నుండి బద్దలు కొట్టుకుని బయటపడే వరకు 716 00:37:01,388 --> 00:37:03,264 అది మనల్ని పిరికివాళ్లుగా, అణగిమణగి ఉండేలా చేస్తుంది. 717 00:37:03,265 --> 00:37:04,933 ఏదో కొటేషన్ ఉండాలి కదా. ఏంటది? 718 00:37:05,684 --> 00:37:09,729 "మొగ్గలా ఉండిపోవడానికి సిగ్గు పడుతున్నప్పుడు…" 719 00:37:09,730 --> 00:37:11,147 "మొగ్గలాగే ఉండిపోవడానికి పడే బాధ కంటే." 720 00:37:11,148 --> 00:37:13,942 అదే. హా, ఆ కొటేషన్ ఏంటి? 721 00:37:15,861 --> 00:37:18,196 "మొగ్గలాగే ముడుచుకుని ఉండిపోవడానికి పడే బాధ కంటే, 722 00:37:18,197 --> 00:37:20,824 వికసించడానికి చేసే సాహసమే మేలనిపించే రోజు ఒకటి వస్తుంది." 723 00:37:22,659 --> 00:37:24,035 అదే. 724 00:37:24,036 --> 00:37:25,037 థ్యాంక్యూ, కోచ్. 725 00:37:26,038 --> 00:37:28,414 "మొగ్గలాగే ముడుచుకుని ఉండిపోవడానికి పడే బాధ కంటే, 726 00:37:28,415 --> 00:37:31,793 వికసించడానికి చేసే సాహసమే మేలు." 727 00:37:33,086 --> 00:37:35,254 ఓడిపోతే సిగ్గుపడాల్సి వస్తుందేమో అనే భయంతో పడే బాధ కంటే, 728 00:37:35,255 --> 00:37:39,092 ఏదేమైనా ప్రయత్నించి చూద్దాం అన్న ఆలోచనే మనసుకు మేలు చేస్తుంది. 729 00:37:39,843 --> 00:37:41,762 ఆ రెండింటిలో నేను ఏ రిస్క్ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. 730 00:37:42,596 --> 00:37:43,597 ఏది తప్పక తీసుకోవాలో తెలుసు. 731 00:37:44,640 --> 00:37:48,393 ఇక్కడ, అలాగే పిచ్ లో కూడా మీ అందరి విషయంలో నేను కోరుకునేది అదే. 732 00:37:49,686 --> 00:37:51,480 కాబట్టి, సెకండ్ హాఫ్ లో, 733 00:37:53,232 --> 00:37:54,441 గోల్ కొట్టే ప్రయత్నం చేద్దాం. 734 00:37:56,777 --> 00:38:00,029 ఆ తర్వాత, కాసేపాగి, ఇంకో గోల్ కొట్టే ప్రయత్నం చేద్దాం. 735 00:38:00,030 --> 00:38:02,240 ఇక స్కోర్ టై అయిపోయాక, 736 00:38:02,241 --> 00:38:04,825 సరదాసరదాగా ఆడి, ఇంకో గోల్ కొట్టే ప్రయత్నం చేద్దాం. 737 00:38:04,826 --> 00:38:06,160 ఓకేనా? ఏమంటారు? 738 00:38:06,161 --> 00:38:08,204 - ఓకే. - ఓకేనా? 739 00:38:08,205 --> 00:38:09,705 - సరే మరి. - హా. హా. 740 00:38:09,706 --> 00:38:12,124 ఓకే, పిచ్ లోకి వెళ్ళడానికి ఇంకొన్ని నిమిషాల సమయం ఉంది. 741 00:38:12,125 --> 00:38:13,961 కాబట్టి ఇంకెవరైనా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? 742 00:38:14,962 --> 00:38:17,381 హా. సరే. 743 00:38:17,965 --> 00:38:20,424 ఫస్ట్ హాఫ్ ఒకలా సాగింది, సెకండ్ హాఫ్ ఇంకోలా సాగుతోంది. 744 00:38:20,425 --> 00:38:23,803 రిచ్మండ్ జట్టు పూర్తిగా మారిపోయింది. గట్టిగా పోరాడుతున్న ఆ జట్టుతో తలపడటం 745 00:38:23,804 --> 00:38:26,265 చెల్సీకి ఇప్పుడు కాస్త సవాలుగానే మారింది. 746 00:38:27,224 --> 00:38:28,684 - హా, అక్కడ. - కానివ్వాలి. 747 00:38:32,563 --> 00:38:34,690 హ్యారిగన్ దగ్గర బంతి ఉంది. ఆమె మరో హ్యారిగన్ కి పాస్ చేసింది. 748 00:38:36,149 --> 00:38:38,277 జెమ్మా జే వేటాడే సొరచేపలా వేచి చూస్తోంది! 749 00:38:38,777 --> 00:38:40,737 హ్యారిగన్, భలే షాట్ కొట్టింది. 750 00:38:46,034 --> 00:38:47,535 సూపర్ గోల్! 751 00:38:47,536 --> 00:38:50,788 - రిచ్మండ్ కోలుకుని గోల్ కొట్టింది, స్కోరు 2-1 అయ్యింది. - హేయ్! అంతే! 752 00:38:50,789 --> 00:38:54,125 జెమ్మా జే బాహుబలిలా రెచ్చిపోతోంది. 753 00:38:54,126 --> 00:38:55,877 ఆమె దారికి అడ్డు వెళ్లకుండా ఉంటే మంచిది. 754 00:38:55,878 --> 00:38:58,171 {\an8}ఏ ఎఫ్ సి రిచ్మండ్ - 1 చెల్సీ ఫుట్ బాల్ క్లబ్ - 2 755 00:38:58,172 --> 00:39:01,299 గోల్ కొట్టినప్పటి నుండి, జే చిరుతపులిలా విరుచుకుపడుతోంది. 756 00:39:01,300 --> 00:39:03,760 చెల్సీకి తన వేగానికి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలీట్లేదు. 757 00:39:05,470 --> 00:39:07,764 అలా అడ్డుకట్ట వేయవచ్చు. 758 00:39:09,933 --> 00:39:11,184 - హేయ్! - ఇదేందిరా అయ్యా! 759 00:39:11,185 --> 00:39:12,686 తనకేం కాలేదు కదా? 760 00:39:14,688 --> 00:39:16,105 - నువ్వు బాగానే ఉన్నావా? - హా. 761 00:39:16,106 --> 00:39:17,648 - బాగానే ఉన్నావు కదా? - హా, బాగున్నా. 762 00:39:17,649 --> 00:39:19,650 ఫ్రీ కిక్ దగ్గర జే, ఎల్ షెరిఫ్ ఉన్నారు, 763 00:39:19,651 --> 00:39:21,611 కానీ అది కొట్టేది ఎవరో ఇక్కడ ఉండేవాళ్ళందరికీ తెలుసు. 764 00:39:21,612 --> 00:39:23,238 రాబీ షాటా? గారీ షాటా? 765 00:39:25,157 --> 00:39:30,995 బాల్ ఎవరి దగ్గర ఉంది? జెమ్మా జే. 766 00:39:30,996 --> 00:39:33,080 అందరి చూపూ జే మీదే ఉంది. 767 00:39:33,081 --> 00:39:35,666 జెమ్మా జే. బాల్ ఎవరి దగ్గర ఉంది? 768 00:39:35,667 --> 00:39:38,002 జెమ్మా జే. 769 00:39:38,003 --> 00:39:39,754 తను కదిలింది. 770 00:39:39,755 --> 00:39:41,006 అయ్యో! 771 00:39:45,427 --> 00:39:50,933 మార్గీ ఎల్ షెరిఫ్ అదిరిపోయే షాట్ కొట్టి స్కోరుని సమం చేసేసింది! 772 00:39:54,436 --> 00:39:56,730 ఈ ఆట ఇప్పుడు వాళ్లకి బందీ అయిపోయింది. 773 00:39:58,607 --> 00:40:02,235 ఇంకా పది నిమిషాల అట ఉంది, కానీ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. 774 00:40:02,236 --> 00:40:03,654 దూరం నుండి పావెల్ కొట్టింది! 775 00:40:04,905 --> 00:40:06,364 రిచ్మండ్ వాళ్లకి మరో కార్నర్ షాట్ కొట్టే అవకాశం! 776 00:40:06,365 --> 00:40:08,491 అట భలే మలుపు తిరిగింది కదా, రెబెక్కా. 777 00:40:08,492 --> 00:40:10,701 గ్రేహౌండ్స్ లో ఇంత సత్తా ఉందని నేను ఊహించనే లేదు. 778 00:40:10,702 --> 00:40:12,245 వాళ్ళు అసలు పట్టు విడవట్లేదు, జిల్. 779 00:40:12,246 --> 00:40:13,747 సాంగ్ కార్నర్ షాట్ కొట్టనుంది. 780 00:40:17,543 --> 00:40:18,669 డేవిస్! 781 00:40:19,670 --> 00:40:21,170 పోస్ట్ కి తగిలింది! 782 00:40:21,171 --> 00:40:24,383 ఈ అవకాశాలను వాళ్ళు జారవిడుచుకోకూడదు. 783 00:40:24,967 --> 00:40:26,050 చెల్సీ వాళ్ళు దాడి చేస్తున్నారు. 784 00:40:26,051 --> 00:40:27,886 గ్రామర్… డ్రమిస్! 785 00:40:29,096 --> 00:40:30,264 పెరెట్టి! 786 00:40:30,889 --> 00:40:32,014 - సూపర్! - వావ్! బూట్స్! 787 00:40:32,015 --> 00:40:35,601 బూట్స్ క్విన్ అద్భుతంగా మూడు వరుస గోల్స్ ని ఆపింది. నా సామి రంగా! 788 00:40:35,602 --> 00:40:38,813 గ్లవ్స్ లేని గ్లవ్ కీపర్ ని, కట్నం అడగని మగాడిని నమ్మకూడదని 789 00:40:38,814 --> 00:40:41,567 అందరూ అంటుంటారు. 790 00:40:43,277 --> 00:40:44,986 కానీ ఇవాళ్టికి దాన్ని పక్కకు పెట్టేస్తున్నా. 791 00:40:44,987 --> 00:40:46,070 పోస్టుకు కుడి వైపు వెనుక ఉండాలి! 792 00:40:46,071 --> 00:40:48,991 {\an8}ఏ ఎఫ్ సి రిచ్మండ్ - 2 చెల్సీ ఫుట్ బాల్ క్లబ్ - 2 793 00:40:54,830 --> 00:40:56,163 జెమ్మా జే సిద్ధంగా ఉంది. 794 00:40:56,164 --> 00:40:58,625 కీపర్ పక్కాగా ఉంది. ఇప్పుడు గోల్ పడుతుందా? 795 00:41:01,253 --> 00:41:03,881 అయ్యో! బారుకి తగిలి పక్కకి పోయింది! 796 00:41:06,383 --> 00:41:08,802 హ్యాండ్లర్ అద్భుతంగా గాల్లోకి కొట్టింది. 797 00:41:09,887 --> 00:41:12,263 మల్లన్ బాల్ ని భలే ఆపింది. 798 00:41:12,264 --> 00:41:14,057 ఇప్పుడు మళ్ళీ చెల్సీ వాళ్ళు దూకుడు పెంచారు. 799 00:41:16,268 --> 00:41:17,936 పెరెట్టి, బాల్ తో ముందుకు కదులుతోంది! 800 00:41:19,396 --> 00:41:20,606 అయ్యయ్యో! 801 00:41:22,441 --> 00:41:24,066 తను గోల్ కొట్టింది! 802 00:41:24,067 --> 00:41:25,735 చెల్సీ ఖాతాలో గోల్ పడింది. 803 00:41:25,736 --> 00:41:28,446 ఒక ఘోరమైన డిఫ్లెక్షన్ రిచ్మండ్ ని దెబ్బతీసింది, 804 00:41:28,447 --> 00:41:32,200 సెకండ్ హాఫ్ లో వారు చూపిన తెగువ, పట్టుదలతో కూడిన ప్రదర్శనను 805 00:41:32,201 --> 00:41:35,037 కళ్లారా చూసిన వారెవ్వరూ అంత త్వరగా మర్చిపోలేరు. 806 00:41:41,043 --> 00:41:42,669 నేను వెళ్లి వాళ్ళని కలిసి వస్తా. 807 00:41:47,591 --> 00:41:48,966 సూపరో సూపర్. 808 00:41:48,967 --> 00:41:51,719 ఇవాళ అన్నీ ఎదురుదెబ్బలే. 809 00:41:51,720 --> 00:41:54,472 బంగారం, నీకు అర్థం కావడం లేదు అనుకుంటా, 810 00:41:54,473 --> 00:41:56,183 ఇప్పుడు జరిగినది చాలా అంటే చాలా మంచిదే. 811 00:41:57,100 --> 00:41:58,809 ఆ మాటకి నవ్వాలనే ఉన్నా, ఫుల్ డిప్రెషన్లో ఉన్నా కనుక నవ్వలేకున్నా. 812 00:41:58,810 --> 00:42:00,019 నీకు అర్థం కావట్లేదా? 813 00:42:00,020 --> 00:42:02,939 నీ ముద్దుల కలల రాణి కీలీ ఆశల రెక్కలు విరిగిపోయాయి. 814 00:42:02,940 --> 00:42:06,151 హా, ఇవాళ తను బాధగానే ఉంది. కానీ రేపటికి సర్దుకుంటుందిలే. 815 00:42:06,902 --> 00:42:11,365 అన్నింటికన్నా ముఖ్యంగా, తను నీ మాట వినే ప్రయత్నం చేస్తుంది. 816 00:42:16,078 --> 00:42:17,787 మీరందరూ అద్భుతంగా ఆడారు, బాగా ఆడారు. 817 00:42:17,788 --> 00:42:19,248 తృటిలో పోయింది. 818 00:42:19,915 --> 00:42:21,999 చాలా గట్టిగా పోరాడారు, కదా? 819 00:42:22,000 --> 00:42:23,084 హేయ్. 820 00:42:23,085 --> 00:42:27,171 స్టేడియం అంత ఖాళీగా ఉన్నందుకు సారీ. నేను… నేను విఫలమయ్యాను. 821 00:42:27,172 --> 00:42:29,131 - ఏం మాట్లాడుతున్నావు? - ఏంటి? 822 00:42:29,132 --> 00:42:32,343 మన హోమ్ గ్రౌండ్లో సాధారణంగా వచ్చే జనాలకు రెట్టింపు జనాలను చూశాం ఇక్కడ. నీకది తెలుసు కదా? 823 00:42:32,344 --> 00:42:35,388 మా ఆటల్లో ఇంతమంది జనాన్ని మేమెప్పుడూ చూడలేదు, సరేనా? 824 00:42:35,389 --> 00:42:39,726 కాబట్టి నీ బుర్రలో తిరుగుతున్న పిచ్చి పిచ్చి ఆలోచనలను పీకి పడేయ్, సరేనా? 825 00:42:40,644 --> 00:42:42,019 నువ్వు అదరగొట్టేశావ్. 826 00:42:42,020 --> 00:42:43,021 ఓకే. 827 00:42:49,486 --> 00:42:50,487 ఒకటి చెప్పనా, టెడ్, 828 00:42:51,780 --> 00:42:53,198 మనకి కోచ్ సమస్య ఉంది. 829 00:42:54,741 --> 00:42:56,285 అంటే మనకి ఓ సమస్య ఉందనే కదా నీ ఉద్దేశం, కోచ్? 830 00:42:59,997 --> 00:43:00,998 కాదు. 831 00:43:02,708 --> 00:43:03,834 - సరే మరి. - ఇద్దరికీ బై. 832 00:43:04,751 --> 00:43:06,003 బై. 833 00:43:12,551 --> 00:43:14,428 నాతో మాట్లాడాలని అన్నారు కదా? 834 00:43:15,179 --> 00:43:16,513 అవును. 835 00:43:23,228 --> 00:43:26,523 జట్టు పట్ల కాస్తంత సౌమ్యంగా ఉండమని నీకు చెప్పా, కదా? 836 00:43:27,649 --> 00:43:29,443 హా, బార్బెక్యూ కథ ద్వారా చెప్పారు కదా? 837 00:43:30,027 --> 00:43:31,987 కానీ ఈ ఆట అంతకన్నా చాలా కీలకమైనది. 838 00:43:32,571 --> 00:43:34,198 ఓ బలమైన సందేశాన్ని పంపడానికి ఇది వాళ్లకి దక్కిన అవకాశం. 839 00:43:34,781 --> 00:43:38,075 క్రీడల్లో ఉండే గొప్ప విషయం అదే. ఇంకో అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. 840 00:43:38,076 --> 00:43:39,995 హా, నా అనుభవంలో మరో అవకాశం రానే లేదు. 841 00:43:42,873 --> 00:43:43,956 ఒకటి చెప్పనా, ఆలిస్, 842 00:43:43,957 --> 00:43:47,252 నీలాంటి కసే ఉన్న ఓ కోచ్ తో గతంలో పని చేశా. 843 00:43:48,504 --> 00:43:51,423 దురదృష్టవశాత్తు, అతని లోలోపల ఏం రగులుతూ ఉండిందో అప్పుడు గమనించలేదు… 844 00:43:52,132 --> 00:43:54,176 దాని వల్ల అది అతడిని దహించి వేసింది. 845 00:43:55,135 --> 00:43:58,095 కాబట్టి, పొరపాట్ల నుండి పాఠం నేర్చుకుంటావన్న ఆశతో, 846 00:43:58,096 --> 00:44:00,098 నీపై వేరే పద్ధతిని ప్రయోగించి చూస్తా. 847 00:44:02,392 --> 00:44:04,436 ఒక ఆటకి గాను నిన్ను సస్పెండ్ చేస్తున్నా. 848 00:44:07,397 --> 00:44:10,442 కానీ ఇప్పుడు ఒక ఆటే ఉంది, ఆ తర్వాత క్రిస్మస్ వచ్చేస్తుంది. 849 00:44:11,026 --> 00:44:14,028 మంచిదే, నీకు ఏం అవుతోందో తెలుసుకునే అవకాశం నీకు దక్కుతుంది కదా. 850 00:44:14,029 --> 00:44:16,240 కొన్ని సర్దుబాట్లు చేసుకొనే వీలుంటుంది. వచ్చే ఏడాది కలుస్తామని ఆశిస్తున్నా. 851 00:44:39,137 --> 00:44:42,098 …హాయిగా ఉన్నా, పార్టీ చేసుకోవడానికి 852 00:44:42,099 --> 00:44:46,310 - సిద్ధంగా ఉన్నా… - సిద్ధంగా ఉన్నా! 853 00:44:46,311 --> 00:44:49,063 - …ఆ అరివీర భయంకరులతో. - …ఆ అరివీర భయంకరులతో. 854 00:44:49,064 --> 00:44:52,901 ఇక నేను నది ఒడ్డుకు వెళ్తున్నాను… 855 00:44:53,527 --> 00:44:56,029 ఇవాళ మ్యాచ్ దగ్గర నువ్వు అచ్చం అలానే ప్రవర్తించావు. 856 00:44:56,947 --> 00:45:00,741 - దేవుడా, నేను అంతా పెంట పెంట చేశా. - లేదు, అదేం లేదులే. 857 00:45:00,742 --> 00:45:01,826 భలే తమాషాగా అనిపించిందిలే. 858 00:45:01,827 --> 00:45:04,288 సర్లే, నన్ను కలవడానికి కనీసం ఏడుగురు అయినా వచ్చారు, చాలు అది. 859 00:45:12,462 --> 00:45:13,713 ఓరి దేవుడా. 860 00:45:13,714 --> 00:45:15,339 ఓరి దేవుడా, నేను చాలా… 861 00:45:15,340 --> 00:45:18,552 నీ మనోభావాలని పట్టించుకోలేదు… చాలా దారుణమైన జోక్ వేశా. 862 00:45:19,761 --> 00:45:23,348 లేదు, అది మంచి జోకే. నీ జోక్ బాగుంది. 863 00:45:24,641 --> 00:45:26,684 నా మీద జోకులు వేస్తూ నన్ను ఆటపట్టించే నేస్తం దొరకడం 864 00:45:26,685 --> 00:45:32,232 నా అదృష్టం, ఎందుకంటే నీ మనసు ఎంత మంచిదో నాకు తెలుసు. 865 00:45:35,068 --> 00:45:38,321 నాకు… నాకు రాయ్ విషయంలో చాలా బాధగా ఉంది. 866 00:45:38,322 --> 00:45:39,948 అయ్యయ్యో. ఏమైంది? 867 00:45:41,867 --> 00:45:43,326 అతనికి ఒకావిడ పరిచయమైంది, 868 00:45:43,327 --> 00:45:44,410 ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడు, 869 00:45:44,411 --> 00:45:46,287 వాళ్ళిద్దరికీ పిల్లలు పుడతారు, నేనంతా పెంట చేసుకున్నా. 870 00:45:46,288 --> 00:45:48,539 లేదులే, నువ్వేం అలా చేసుకోలేదు. 871 00:45:48,540 --> 00:45:49,917 నేనే అంతా పెంట పెంట చేసుకున్నా. 872 00:45:51,919 --> 00:45:55,172 మట్టాయస్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నాడని నాతో అన్నాడు, కానీ నేను… 873 00:45:56,465 --> 00:45:59,884 నేను కంగారుపడిపోయి, అంతా పాడు చేసుకున్నా, ఇప్పుడు మేమిద్దరం కాస్త దూరంగా ఉంటున్నాం. 874 00:45:59,885 --> 00:46:01,719 - ఓరి దేవుడా. - అవును. 875 00:46:01,720 --> 00:46:05,139 - అయ్యో. అది చాలా దారుణమైన విషయం. - అవును, కదా? 876 00:46:05,140 --> 00:46:06,600 కాబట్టి నేనే అంతా పెంట పెంట చేసేసుకున్నా. 877 00:46:08,143 --> 00:46:09,602 అయ్యయ్యో. 878 00:46:09,603 --> 00:46:11,104 మనిద్దరం పెంట పెంట చేసుకున్నాం. 879 00:46:12,898 --> 00:46:13,982 అవును. 880 00:46:15,817 --> 00:46:18,361 - చాలా చాలా సారీ. - దేవుడా. 881 00:46:18,362 --> 00:46:20,906 నా తల వెనుక పక్క నొస్తోంది. 882 00:46:21,490 --> 00:46:24,283 అవునులే. నువ్వు ఇవాళ షేక్ చేశావు. 883 00:46:24,284 --> 00:46:26,078 నాకు వోడ్కా కూడా ఇష్టం లేదు. 884 00:46:26,954 --> 00:46:28,121 నువ్వు కోలుకుంటావులే. 885 00:46:30,707 --> 00:46:32,125 నాకు తెలీదు. 886 00:46:35,796 --> 00:46:37,714 జోయెల్ స్టీవెన్స్ జ్ఞాపకార్థం 887 00:47:33,770 --> 00:47:35,772 ఉపశీర్షికలు అనువదించినది: రాంప్రసాద్