1 00:00:16,642 --> 00:00:17,892 హలో, రూబెన్. 2 00:00:17,976 --> 00:00:21,226 హాయ్, లిడియా. వచ్చినందుకు ధన్యవాదాలు. అందరూ వెనక గదిలో ఉన్నారు. 3 00:00:21,313 --> 00:00:22,313 అయితే వెళ్దాం పద. 4 00:00:23,815 --> 00:00:26,145 ఇవాళ నువ్వు కాల్ చేస్తావని నాకు ముందుగానే అనిపించింది. 5 00:00:26,235 --> 00:00:28,235 అవునులే, మీకు దివ్యదృష్టి ఉంది కనుక. 6 00:00:28,320 --> 00:00:29,950 అవును, అదే కారణం. 7 00:00:31,406 --> 00:00:34,276 మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని మేము కొన్ని పెద్ద పెద్ద ప్రశ్నలు అడగాలి. 8 00:00:37,829 --> 00:00:39,789 బాబోయ్. ఇక్కడ ఏం జరిగింది? 9 00:00:40,749 --> 00:00:42,249 మేము మరమత్తుల పని... 10 00:00:43,877 --> 00:00:44,877 మధ్యలో ఉన్నాం. 11 00:00:46,463 --> 00:00:48,763 అయితే, మీరు నన్ను కొన్ని ప్రశ్నలు అడగదామనుకుంటున్నారా? 12 00:00:48,841 --> 00:00:52,801 అవును. మీరు రూబెన్ అమ్మమ్మకి పుస్తక దుకాణంలో దెయ్యం ఉందని చెప్పినప్పుడు, 13 00:00:52,886 --> 00:00:55,926 -అది ఎవరి దెయ్యమో ఆమె ఏమైనా చెప్పిందా? -లేదు, చెప్పలేదు. 14 00:00:56,014 --> 00:00:58,104 ఆ దెయ్యం ఎవరో కనిపెట్టే పనిలో మాకు మీరు సాయపడతారా? 15 00:00:58,183 --> 00:00:59,393 దానితో మాట్లాడగలరేమో? 16 00:00:59,977 --> 00:01:01,227 నేను వినగలను. 17 00:01:02,437 --> 00:01:06,357 ఆ ఆత్మ నాతో మాట్లాడాలని అనుకొంటే, నేను సంభాషణ చేయడానికి ప్రయత్నించగలను. 18 00:01:14,741 --> 00:01:18,371 మీరు కళ్ళు తెరిచుంటే మంచిది, ఎందుకంటే ఈ దెయ్యం మామూలుగా రాస్తుంది అన్నమాట. 19 00:01:21,039 --> 00:01:22,039 సరే. 20 00:01:25,836 --> 00:01:27,666 నాకు దాని ఉనికి తెలుస్తోంది. 21 00:01:29,631 --> 00:01:33,221 కానీ అది నాతో మాట్లాడాలనుకోవడం లేదు. మీ ద్వారా మాట్లాడాలనుకుంటోంది. 22 00:01:34,303 --> 00:01:35,303 మేమేం చేయాలి? 23 00:01:35,387 --> 00:01:38,637 మమ్మల్ని మా అమ్మమ్మ దెయ్యంలా వెంటాడుతోందని మేము అనుకున్నప్పుడు బాగానే ఉండింది... 24 00:01:39,308 --> 00:01:41,058 కానీ ఈ దెయ్యం ఎవరో మాకు ఏ మాత్రం తెలీదు. 25 00:01:41,143 --> 00:01:43,403 దురదృష్టవశాత్తూ, నేను మీకు సాయపడలేను. 26 00:01:44,730 --> 00:01:50,280 మీ దెయ్యానికి ఏదైనా పూర్తి చేయని పని ఉంటే, అది పూర్తయ్యేదాకా దానికి శాంతి ఉండదు. 27 00:02:01,872 --> 00:02:07,592 ఘోస్ట్ రైటర్ 28 00:02:07,669 --> 00:02:09,959 పది పుస్తకాలను కొనండి తర్వాతి పుస్తకాన్ని ఉచితంగా పొందండి! 29 00:02:10,047 --> 00:02:12,087 ఇంకా తొమ్మిది పుస్తకాలు కొంటే, తర్వాతిది ఉచితం. 30 00:02:12,174 --> 00:02:15,054 ఆ ఆఫర్ ను నేను తీసుకుంటాను. నాకు మీ పుస్తక దుకాణం అంటే ఇష్టం. 31 00:02:16,220 --> 00:02:17,850 అయితే ఎనిమిది పుస్తకాలను కొనండి చాలు. 32 00:02:19,598 --> 00:02:21,848 -జానపద గాథలను చదివి ఆనందించండి. -తప్పకుండా. 33 00:02:23,519 --> 00:02:25,269 ధన్యవాదాలు. రోజంతా ఆనందంగా గడపండి. 34 00:02:25,646 --> 00:02:27,646 విలేజ్ బుక్స్ 35 00:02:40,536 --> 00:02:43,616 విలేజ్ బుక్స్ 36 00:02:49,503 --> 00:02:50,593 లోపలికి రండి. 37 00:02:50,671 --> 00:02:51,671 హేయ్. 38 00:02:53,298 --> 00:02:54,838 నువ్వు నీ గదిని శుభ్రపరుచుకోవాలి. 39 00:02:55,092 --> 00:02:57,592 అది చెప్పడానికే ఇక్కడి దాకా వచ్చావా? 40 00:02:58,095 --> 00:03:00,255 మీ తాతయ్య, నేనూ మాట్లాడుకుంటూ ఉన్నాం, 41 00:03:00,347 --> 00:03:03,677 ఇంకా మరమత్తు వలన మాకు తీరిక లేదు కనుక, 42 00:03:03,767 --> 00:03:07,597 దుకాణంలో సాయం అందించే పని నువ్వు మొదలుపెడితే బాగుంటుందని మేము భావించాం. 43 00:03:07,688 --> 00:03:08,688 నేను సాయపడతాను. 44 00:03:09,398 --> 00:03:11,858 చిన్నతనంలో నేనెలా చేశానో అలా అన్నమాట. 45 00:03:11,942 --> 00:03:13,782 బహుశా డబ్బులను తీసుకొనే పనిని నువ్వు నేర్చుకోవచ్చేమో. 46 00:03:13,861 --> 00:03:15,951 ఆ పని బాగానే ఉంటుంది. 47 00:03:16,029 --> 00:03:18,279 కానీ నీ చిన్నప్పుడు నీకు ఆ పని అంటే నచ్చేది కాదని చెప్పావు. 48 00:03:18,657 --> 00:03:22,577 అవును, కానీ ఆ పని వల్లే ఇప్పుడు నేను మెరుగైన మనిషిని అయ్యాను. 49 00:03:22,995 --> 00:03:24,955 నిజంగా, ఇది నాకు పనిలో పద్దతిని, 50 00:03:25,038 --> 00:03:27,328 సమయ నిర్వహణని, లెక్కలని, జనాలతో ఎలా మాట్లాడాలి... 51 00:03:27,416 --> 00:03:29,706 అమ్మా, ఇక ఆపు. ఆ పని నేను చేస్తాలే. 52 00:03:30,919 --> 00:03:33,049 తాతయ్యతో గడపడం చాలా బాగుంటుంది. 53 00:03:33,547 --> 00:03:39,087 అదీగాక, నా భత్యం కన్నా ఇతరులకి ఎక్కువ ఇచ్చేంత స్తోమత నీకు లేదు. 54 00:03:40,220 --> 00:03:41,220 బాబూ... 55 00:03:42,556 --> 00:03:44,596 నీకు భత్యం ఇచ్చేంత స్తోమత కూడా నాకు లేదు. 56 00:03:53,817 --> 00:03:56,067 హేయ్, షెవాన్, ఇంటికి వచ్చేశావా? 57 00:03:56,445 --> 00:03:57,445 హాయ్, అమ్మా. 58 00:03:57,863 --> 00:04:00,533 నీకు ఏమీ కాలేదు కదా, బంగారం? మేము సందేశం కూడా పంపాము. 59 00:04:00,824 --> 00:04:03,244 మన్నించాలి. నేను నా చరిత్ర వ్యాసం మీద పని చేస్తున్నాను. 60 00:04:03,702 --> 00:04:06,662 మనం ఈ రాత్రికి బయటకు వెళ్లి సుషీ తినాలని నాకు అనిపించింది. 61 00:04:07,581 --> 00:04:08,791 మనం పార్సిల్ తెచ్చుకుందామా? 62 00:04:09,750 --> 00:04:13,670 మన్నించాలి, నేను ఈ వ్యాసాన్ని ఒక చర్చ కోసం సిద్ధం చేయాలి. 63 00:04:14,129 --> 00:04:16,709 అదీగాక, నేను నా పియానో ప్రదర్శనకి సాధన కూడా చేయాలి. 64 00:04:17,591 --> 00:04:20,221 ఇంకా నా మోడల్ యుఎన్ గురించి ప్రిన్సిపాల్ ఫాంగ్ కి ఇమెయిల్ కూడా పంపాలి. 65 00:04:20,844 --> 00:04:21,894 ఇంకా ఏమైనా ఉన్నాయా? 66 00:04:21,970 --> 00:04:24,140 నువ్వు ఏదైనా ఒక పనిని పక్కన పెట్టాలేమో. 67 00:04:24,806 --> 00:04:26,976 -లేదు, నేనే ఏదోక దారి కనిపెడతానులే. -చూడు, బంగారం, 68 00:04:27,059 --> 00:04:29,059 నువ్వు కష్టపడి పని చేయడం చూసి మాకు గర్వంగానే ఉంది, 69 00:04:29,144 --> 00:04:32,364 కానీ నువ్వు మరీ ఎక్కువ పనులు చేస్తున్నావు, కానీ నువ్వొక్క దానివే అవన్నీ చేయలేవు. 70 00:04:32,439 --> 00:04:35,189 నేను చూసుకోగలనులే. నన్ను నమ్మండి. 71 00:04:37,319 --> 00:04:39,109 సరే, నువ్వు చెప్పింది నిజమే అవ్వాలని ఆశిస్తున్నా. 72 00:04:40,322 --> 00:04:43,662 డిన్నర్ కి ఇంకేమైనా తిందామా? సూషీ పార్సెల్ తెచ్చుకున్నా అదే అనుభూతి కలగదు. 73 00:04:51,416 --> 00:04:54,376 కర్టిస్, కిటికీని మూసేయి. బాగా చలిగా ఉంది! 74 00:04:56,588 --> 00:04:58,008 లేదు, బాగా వేడిగా ఉంది! 75 00:04:58,090 --> 00:04:59,340 కనీసం నీ ఆట వాల్యూమ్ అయినా తగ్గించు. 76 00:04:59,424 --> 00:05:01,554 నీ గురకని తట్టుకోవాలంటే, ఇది ఈ మాత్రం బిగ్గరగా ఉండాలి. 77 00:05:01,635 --> 00:05:02,635 నేను గురక పెట్టను! 78 00:05:02,719 --> 00:05:04,639 నువ్వు నిద్రలో ఉంటావు, అప్పుడు నీకెలా తెలుస్తుంది? 79 00:05:04,721 --> 00:05:06,811 అయ్య బాబోయ్. నేను కిటికీ మూసేస్తున్నాను. 80 00:05:06,890 --> 00:05:07,980 లేదు, నువ్వు మూయకు... 81 00:05:08,058 --> 00:05:09,058 హేయ్! 82 00:05:10,018 --> 00:05:11,228 ఏంటి గోల? 83 00:05:11,311 --> 00:05:14,191 డోనా గురక పెడుతోంది, కిటికీ మూసేస్తే చాలా ఉక్కగా ఉంది! 84 00:05:14,273 --> 00:05:17,653 చూడండి, మీ అమ్మ ఇంట్లో ఉన్నట్లు మీకు వేర్వేరు గదులు లేనందుకు నన్ను మన్నించాలి, 85 00:05:17,734 --> 00:05:19,404 కానీ మీరు గొడవ పడటం ఆపేయాలి. 86 00:05:19,486 --> 00:05:21,356 ఎవరోకరు సోఫాలో పడుకోండి. అదెవ్వరో మీరే తేల్చుకోండి. 87 00:05:21,446 --> 00:05:23,816 నేను సోఫాలో పడుకోలేను. నాకు రేపు బాస్కెట్ బాల్ ఆట ఉంది. 88 00:05:23,907 --> 00:05:27,237 నేను ఇప్పటికే ట్యూషన్లకి, ఇంకా ఈ అదనపు సమయాన్ని హోంవర్క్ కి పెడుతున్నాను. 89 00:05:27,327 --> 00:05:30,117 మీ అన్నయ్య చెప్పింది నిజమే. సోఫాలో నువ్వు పడుకుంటావా? 90 00:05:32,499 --> 00:05:33,669 అలాగే. 91 00:05:34,168 --> 00:05:35,538 ఇప్పుడు నేను టీవీ చూడగలను. 92 00:05:35,878 --> 00:05:38,298 అది కుదరదు. ఇది పడుకొనే సమయం. 93 00:05:38,964 --> 00:05:40,134 ఇది చాలా అన్యాయం! 94 00:05:40,215 --> 00:05:41,215 ఆటని ఆపేయి. 95 00:05:49,933 --> 00:05:52,773 -ఘోస్ట్ రైటర్ ఏమైనా సందేశం పంపిందా? -లేదు, ఆమె జాడే లేదు. 96 00:05:52,853 --> 00:05:54,983 అతను కూడా అయ్యుండవచ్చు. లేకపోతే, అటుఇటు కాని వాళ్ళు కూడా అయ్యుండవచ్చు. 97 00:05:55,397 --> 00:05:56,687 విచిత్రమైన దెయ్యం. 98 00:05:56,773 --> 00:05:59,743 దీన్ని ఇంకా మరమత్తు చేయలేదా? ఒక నెల నుండి కారుతూనే ఉంది. 99 00:05:59,818 --> 00:06:01,818 ఎవరోకరు ఆ బకెట్ మీద జారిపడతారు. 100 00:06:01,904 --> 00:06:04,454 నీకు అది నచ్చకుంటే, నువ్వు విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేయాలి. 101 00:06:06,283 --> 00:06:09,913 నాకూ చేయాలనే ఉంది. కానీ నా షెడ్యూల్ వల్ల అది కుదరదు. 102 00:06:09,995 --> 00:06:11,955 హామెట్ కోసం పోటీ విద్యార్థి ప్రభుత్వం 103 00:06:12,497 --> 00:06:14,367 నేను ఇప్పటికే చాలా చేస్తున్నానని మా తల్లిదండ్రులు అనుకుంటున్నారు. 104 00:06:14,458 --> 00:06:15,998 అదీగాక, వాళ్ళకి తెలీను కూడా తెలీదు... 105 00:06:20,881 --> 00:06:22,091 ఘోస్ట్ రైటర్ మళ్లీ రంగంలోకి దిగినట్టుంది. 106 00:06:22,174 --> 00:06:23,184 నిజంగానా? 107 00:06:25,844 --> 00:06:28,514 వామ్మోయ్. ఏ పుస్తకం నుండి వచ్చిందో. 108 00:06:32,601 --> 00:06:34,851 హేయ్, చిట్టి డ్రాగన్. నీ పేరేంటమ్మా? 109 00:06:37,689 --> 00:06:39,269 మనం దీన్ని ఒంటరిగా వదిలేయాలేమో. 110 00:06:40,609 --> 00:06:42,859 మన్నించు. నిన్ను భయపెట్టాలనుకోలేదు. 111 00:06:44,488 --> 00:06:45,818 నేను నిన్ను పెంచుకోవచ్చా? 112 00:06:53,497 --> 00:06:54,667 చక్కిలిగిలిగా ఉంది. 113 00:06:59,044 --> 00:07:00,094 అబ్బా. యాక్. 114 00:07:00,170 --> 00:07:01,760 ఏంటి? ఇది చాలా ముద్దొస్తోంది. 115 00:07:02,464 --> 00:07:03,514 అదొక డ్రాగన్. 116 00:07:04,550 --> 00:07:06,550 అది నా ముఖాన్ని నాకడం నాకు నచ్చదు. 117 00:07:11,265 --> 00:07:13,425 నాకేమైందో తెలియడం లేదు. బాస్కెట్ లోకి అస్సలు వేయలేకపోతున్నాను. 118 00:07:13,517 --> 00:07:15,767 నువ్వు క్రమంగా సాధన చేయడం లేదు, అంతే. మళ్లీ ప్రయత్నించు. 119 00:07:19,106 --> 00:07:20,646 పర్వాలేదు. మళ్లీ నీ వైభవం నీకు దక్కుతుంది. 120 00:07:20,732 --> 00:07:21,902 దాని గురించి చింతించకు. 121 00:07:24,069 --> 00:07:26,149 మా నాన్న ఇంట్లోని లాండ్రీలో నా అదృష్ట స్లీవ్ ని 122 00:07:26,238 --> 00:07:27,698 పోగొట్టుకోవడం వల్ల ఇలా జరుగుతోంది. 123 00:07:27,781 --> 00:07:28,821 బాస్కెట్ లో వేయి. 124 00:07:32,077 --> 00:07:33,997 ఈ కొత్తది చెత్తదిలా ఉంది. నాకు నా పాతది కావాలి. 125 00:07:34,079 --> 00:07:36,619 నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. స్లీవ్ కి దీనికి సంబంధమే లేదు. 126 00:07:37,958 --> 00:07:40,538 కానీ గత మూడు సీజన్లలో ప్రతీ ఆటలో నేను దాన్ని వేసుకున్నాను. 127 00:07:41,044 --> 00:07:42,554 అవును, ఒకరకంగా అది చండాలమైనదే. 128 00:07:44,590 --> 00:07:47,010 హేయ్, జేక్. ఇక మేము చూసుకుంటాములే. 129 00:07:48,510 --> 00:07:49,680 కర్టిస్, ఎల్బోస్ ని లోపలికి తెచ్చుకో. 130 00:07:50,179 --> 00:07:51,349 తను సరిగ్గానే చెప్పింది. 131 00:07:51,430 --> 00:07:52,930 నేనింకా సరైన భంగిమ పెట్టను కూడా లేదు. 132 00:07:53,348 --> 00:07:54,638 వీడిని మరీ ఆలస్యమయ్యేదాకా ఉంచనివ్వవద్దు. 133 00:07:54,725 --> 00:07:57,225 నిన్ను రేపు కలుస్తా. నువ్వు మళ్లీ వచ్చినందుకు ఆనందంగా ఉంది. 134 00:08:04,276 --> 00:08:05,526 మీ ముఖాలను చూస్తుంటే, 135 00:08:05,611 --> 00:08:08,161 ఘోస్ట్ రైటర్ ఇంకో పాత్రని విడుదల చేసిందని తెలిసిపోతుంది. 136 00:08:09,156 --> 00:08:11,156 ఇది చిన్న పుస్తకంలో నుండి వచ్చుండాలని ఆశిద్దాం. 137 00:08:16,622 --> 00:08:18,622 పుస్తక దుకాణం విలేజ్ బుక్స్ 138 00:08:23,128 --> 00:08:25,298 నాన్నా, దీని మీద నీ అభిప్రాయం ఏంటి? 139 00:08:26,757 --> 00:08:27,757 ఏంటిది? 140 00:08:28,091 --> 00:08:30,511 ఇదొక కాఫీ మెషిన్, మనం వెనుక గదిని మరమత్తు చేసినప్పుడు తెప్పిద్దాం. 141 00:08:30,594 --> 00:08:33,224 వీధి ఎదురుగా కాఫీని అమ్మే వడల అంగడి ఒకటుంది. 142 00:08:33,304 --> 00:08:36,854 అవును, మన పుస్తక దుకాణానికి రావలసిన డబ్బులు ఆ వడల కొట్టుకు వెళ్లిపోతున్నాయి. 143 00:08:36,933 --> 00:08:38,273 దాన్ని కొనే స్తోమత మనకి లేదు. 144 00:08:38,352 --> 00:08:40,232 నేను దాని మీదే పని చేస్తూ ఉన్నాను. ఒకసారి వచ్చి చూడు. 145 00:08:42,272 --> 00:08:44,862 నువ్వు ఒకసారి చూడాలి... 146 00:08:45,817 --> 00:08:48,357 మన కొత్త వెబ్ సైట్ ని. 147 00:08:48,987 --> 00:08:50,407 మనకి వెబ్ సైట్ తో పనేంటి? 148 00:08:50,489 --> 00:08:52,619 ఎందుకంటే ఈ కాలంలో ఎవ్వరు కూడా ఫోన్ పుస్తకాన్ని వాడరు కనుక. 149 00:08:52,699 --> 00:08:55,869 ఇంకా మనం చేసిన పెంపుడు జంతువుల దత్తతలా మనం ఈవెంట్ లను ప్రకటించవచ్చు. 150 00:08:56,203 --> 00:08:58,833 జనాలు మన దుకాణం పట్ల ఆకర్షితులయ్యేలా ఇది సాయపడుతుందని నా దృఢ నమ్మకం. 151 00:09:00,582 --> 00:09:03,462 నువ్వు ఈ చోటును ఇప్పుడు వేరే దృష్టికోణంతో చూడాలి. 152 00:09:15,347 --> 00:09:16,597 నువ్వొక మంచి కళాకారుడివి. 153 00:09:19,059 --> 00:09:20,059 ధన్యవాదాలు. 154 00:09:21,103 --> 00:09:22,443 మీకు ఏదైనా వెతకడంలో సాయపడనా? 155 00:09:22,521 --> 00:09:25,571 పర్వాలేదు, ఊరికే చూస్తున్నా. మీ చోటు చాలా బాగుంది. 156 00:09:25,649 --> 00:09:26,729 ఇది మా తాతయ్యది. 157 00:09:27,651 --> 00:09:28,861 నీ బూట్లు నాకు నచ్చాయి. 158 00:09:28,944 --> 00:09:30,614 ధన్యవాదాలు. అవి ఫేయ్ షెన్. 159 00:09:30,696 --> 00:09:32,156 -ఏంటది? -అదొక బ్రాండ్. 160 00:09:32,239 --> 00:09:33,619 అంటే "ఎగిరే దేవుడు" అని. 161 00:09:34,283 --> 00:09:35,283 బాగుంది. 162 00:09:35,868 --> 00:09:37,198 నిన్ను అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటానేమో. 163 00:09:42,791 --> 00:09:44,381 రూబెన్, మీ అమ్మమ్మ... 164 00:09:44,459 --> 00:09:47,669 నా ఉద్దేశం, ఆ గుర్తుతెలియని దెయ్యం, మరో పాత్రని విడుదల చేసింది. 165 00:09:51,466 --> 00:09:53,086 సరేమరి, మిత్రులారా. మనకేం చేయాలో తెలుసు కదా. 166 00:09:53,177 --> 00:09:54,887 ఇది ఏ పుస్తకం నుండి వచ్చిందో కనిపెట్టాలి. 167 00:09:54,970 --> 00:09:57,310 "డ్రాగన్స్ లవ్ టాకోస్" పుస్తం నుండి వచ్చిందేమో? ఆ పుస్తకం గుర్తుందా? 168 00:09:57,389 --> 00:10:00,099 ఘోస్ట్ రైటర్ పూర్తి చేయాల్సిన పని టాకో సంబంధితమైనది నేను అనుకోను. 169 00:10:00,184 --> 00:10:01,194 ఎవరికి తెలుసు. 170 00:10:04,271 --> 00:10:06,111 రూబెన్, నీకు ఏం కాలేదు కదా? 171 00:10:07,441 --> 00:10:08,861 ఇది మీకు వింతగా అనిపించవచ్చు, 172 00:10:08,942 --> 00:10:12,702 కానీ ఈ డ్రాగన్, అచ్చం నిన్న రాత్రి నేను గీసిన డ్రాగన్ లాగానే ఉంది. 173 00:10:15,782 --> 00:10:16,872 నాకు తెలుసు. 174 00:10:16,950 --> 00:10:21,250 నిన్న రాత్రి, నేను డ్రాగన్ ని ఇక్కడ గీశాను, ఇప్పుడు అది అక్కడ ఉంది. 175 00:10:24,708 --> 00:10:26,958 ఘోస్ట్ రైటర్, దాన్ని ఆ చిత్రం నుండి విడుదల చేసుంటుంది. 176 00:10:27,044 --> 00:10:29,804 కానీ ఇప్పటిదాకా, ఘోస్ట్ రైటర్ పుస్తకాల పాత్రలను మాత్రమే విడుదల చేసింది. 177 00:10:29,880 --> 00:10:32,550 ఇప్పటిదాకా, రూబెన్ అమ్మమ్మనే మనం ఘోస్ట్ రైటర్ అని అనుకున్నాం. 178 00:10:32,633 --> 00:10:34,013 ప్రస్తుతం, ఏదైనా జరిగే అవకాశముంది. 179 00:10:36,053 --> 00:10:37,473 నువ్వు ఇంకేమైనా గీశావా? 180 00:10:37,554 --> 00:10:38,564 గీశాను. 181 00:10:42,184 --> 00:10:43,694 -అయ్యయ్యో. -ఏమైంది? 182 00:10:45,854 --> 00:10:50,114 షెవాన్, విను, నేను ఆర్ట్ క్లాస్ కోసం రోజూ ఒక చిత్రాన్ని గీయాలి. 183 00:10:50,192 --> 00:10:52,952 ఒక డైరీలాగా అన్నమాట. అది నేను తప్ప ఇంకెవ్వరూ చూడకూడదు. 184 00:10:53,028 --> 00:10:54,698 ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? 185 00:10:55,072 --> 00:10:58,412 నేను "చీలీపీ" అని అంటున్నప్పుడు, ఆ రోజంతా 186 00:10:58,492 --> 00:11:00,912 నువ్వు నేను తప్పుగా అంటున్నాను అని అన్నావు కదా. 187 00:11:00,994 --> 00:11:02,664 "చిలిప్" అని అనాలి. 188 00:11:03,330 --> 00:11:04,540 నాకు అంతా తెలుసు 189 00:11:07,584 --> 00:11:09,504 తను షెవాన్ యొక్క క్లోన్. 190 00:11:10,170 --> 00:11:11,260 ఇద్దరూ ఒకేలా ఉన్నారు. 191 00:11:11,630 --> 00:11:13,920 అదేం కాదు. నాకు అంతా తెలుసు. 192 00:11:14,258 --> 00:11:16,008 ఎందుకంటే నీ గురించి రూబెన్ అలాగే అనుకుంటాడు. 193 00:11:16,093 --> 00:11:17,853 అందుకే, నేను "నాకు అంతా తెలుసు" అని రాసున్న చొక్కా వేసుకున్నా. 194 00:11:21,181 --> 00:11:22,641 నాకు అంతా తెలుసని అనుకుంటున్నావా? 195 00:11:23,392 --> 00:11:25,852 లేదు, మన్నించు. నేను నా చిరాకును చూపించాను, అంతే. 196 00:11:25,936 --> 00:11:28,646 మనం ఏది గీసినా, దానికి ఘోస్ట్ రైటర్ ప్రాణం పోస్తుందంటావా? 197 00:11:28,730 --> 00:11:30,230 అది కనిపెట్టడానికి ఒకే ఒక దారుంది. 198 00:11:31,233 --> 00:11:32,653 ఏదైనా నక్షత్రం కానీ ఇంకేదైనా కానీ గీయి. 199 00:11:32,734 --> 00:11:34,654 అది చాలా బాధ కలిగించింది. అది నీకు తెలిసుండాలి. 200 00:11:34,736 --> 00:11:36,106 తను అది చూసుండకూడదు. 201 00:11:36,196 --> 00:11:37,316 ఏదైతే ఏంటి. నాకు పర్వాలేదు. 202 00:11:37,781 --> 00:11:40,491 అదీ, గీశా, కానీ ఇది ఇంకా ఇక్కడే ఉంది. 203 00:11:40,576 --> 00:11:41,576 నాకు ఇవ్వు, నేను ప్రయత్నిస్తాను. 204 00:11:41,660 --> 00:11:44,710 అయితే, నువ్వు "చిలిపి" అనే పదాన్ని తప్పుగా ఉచ్ఛరించాడానికి ఇష్టపడతావా? 205 00:11:45,289 --> 00:11:46,289 అవును కావచ్చు. 206 00:11:49,918 --> 00:11:53,338 ఏమీ జరగడంలేదు. రూబెన్ గీసినప్పుడే అలా అవుతుందేమో. 207 00:11:55,966 --> 00:11:56,966 రూబెన్, 208 00:11:58,093 --> 00:11:59,683 నువ్వు ఏదోకటి గీయాలి. 209 00:12:02,264 --> 00:12:05,484 బాసూ, నువ్వు భలే గీస్తున్నావు. నేను అట్టే మైమరిచిపోతున్నాను ఇక్కడ. 210 00:12:05,809 --> 00:12:06,809 ధన్యవాదాలు. 211 00:12:08,145 --> 00:12:09,345 ఇది పని చేస్తుందంటారా? 212 00:12:11,982 --> 00:12:13,072 పని చేసింది! 213 00:12:14,026 --> 00:12:16,396 రూబెన్, వంటగదిలో నువ్వు శ్వాండ్విచ్ ని ఏమైనా పెట్టావా? 214 00:12:16,486 --> 00:12:17,856 అవును. క్షమించు. 215 00:12:19,072 --> 00:12:21,952 ఒక్క నిమిషం. తనకి శ్వాండ్విచ్ కనబడుతుందంటే... 216 00:12:22,034 --> 00:12:23,414 తను అన్నింటినీ చూడగలదు. 217 00:12:24,745 --> 00:12:27,035 త్వరగా డ్రాగన్ ని తీసుకొని అలమరాలోకి వెళ్లు. 218 00:12:31,543 --> 00:12:33,593 ఓహ్, హలో. నీ శ్వాండ్విచ్ ఇదిగో, రూబెన్. 219 00:12:33,670 --> 00:12:35,340 అది నాది. ధన్యవాదాలు. 220 00:12:36,215 --> 00:12:37,625 షెవాన్ వచ్చింది, చూశావా? 221 00:12:38,842 --> 00:12:40,222 అవును. చూశాను. 222 00:12:40,302 --> 00:12:42,642 -చొక్కా బాగుంది. -ధన్యవాదాలు. రూబెన్ చేసి ఇచ్చాడు. 223 00:12:43,222 --> 00:12:45,932 నువ్వూ, నీ మిత్రులు కింద సరదాగా గడపవచ్చు కదా, 224 00:12:46,016 --> 00:12:47,676 అప్పుడు నువ్వు క్యాష్ పని చూసుకోవచ్చు. 225 00:12:48,185 --> 00:12:50,935 అవును. మన్నించు, పరధ్యానంలో పడిపోయాను. త్వరగా కిందికి వచ్చేస్తాములే. 226 00:12:51,021 --> 00:12:52,021 ధన్యవాదాలు. 227 00:12:55,067 --> 00:12:56,777 ఇది భలేగా ఉంది. 228 00:12:56,860 --> 00:12:59,700 రూబెన్ చిత్రాలకి ఘోస్ట్ రైటర్ ప్రాణం పోస్తోంది. 229 00:12:59,780 --> 00:13:02,490 కానీ మా అమ్మకి ఈ క్లోన్, ఇంకా శ్వాండ్చిచ్ ఎలా కనబడగలుగుతున్నాయి? 230 00:13:02,574 --> 00:13:05,084 బహుశా అవి పుస్తకాల నుండి కాకుండా చిత్రాల నుండి వస్తున్నందుకేమో. 231 00:13:05,160 --> 00:13:08,370 ఘోస్ట్ రైటర్ మనం ఒకటి గీయాలనుకుంటున్నాడు. కానీ ఏంటది? 232 00:13:15,462 --> 00:13:17,212 చూస్తుంటే మనకి ఆ విషయం తెలిసేలా ఉందిలే. 233 00:13:19,341 --> 00:13:21,391 జి.డబ్ల్యు. కి ఇంగ్లీష్ బోర్ కొట్టినట్టుంది. 234 00:13:21,468 --> 00:13:24,138 చెప్పా కదా. ఇప్పుడు ఏదైనా జరిగే అవకాశముంది. 235 00:13:24,847 --> 00:13:27,597 షెవాన్, నీ పోన్ బయటకు తీయి. మనకి అనువాద యాప్ సహాయం కావాలి. 236 00:13:28,517 --> 00:13:30,017 అవును. తెలివైన ఆలోచన. 237 00:13:30,102 --> 00:13:31,102 ఎంతైనా నేను నువ్వే కదా. 238 00:13:38,110 --> 00:13:40,070 ఇది చైనా భాష. "బంగారు డ్రాగన్." 239 00:13:41,071 --> 00:13:44,241 ఘోస్ట్ రైటర్ కి కావలసింది మనం గీసేశామనుకుంటా. 240 00:13:44,324 --> 00:13:47,794 అది బంగారు ఛాయ గల డ్రాగన్. 241 00:13:49,204 --> 00:13:50,794 దీనితో మనమేం చేయాలి? 242 00:13:54,835 --> 00:13:55,915 నేను కనుక్కుంటాలే. 243 00:13:57,671 --> 00:13:58,671 మరి తన... 244 00:13:59,339 --> 00:14:02,219 తను నాతో రావచ్చు. తను నాకు ఉపయోగపడుతుందనుకుంటా. 245 00:14:02,634 --> 00:14:04,894 మా తల్లిదండ్రులు చెప్పినట్టు, నేను ఒక్కదాన్నే. 246 00:14:13,604 --> 00:14:16,364 దాదాపుగా బాగుందనుకో. "ఏ" విభాగం మీద కాస్త తొందదరపడ్డావు. 247 00:14:16,440 --> 00:14:17,820 అవును. ధన్యవాదాలు. 248 00:14:18,483 --> 00:14:21,153 తర్వతిసారి బాగా చేస్తానులే. చరిత్ర వ్యాసం ఎలా ఉంది? 249 00:14:21,236 --> 00:14:22,486 నువ్వు అడగాలంటావా? 250 00:14:22,905 --> 00:14:23,855 షెవాన్? 251 00:14:23,947 --> 00:14:25,027 త్వరగా, దాక్కో. 252 00:14:25,115 --> 00:14:27,865 లేదు. నువ్వు దాక్కో. నేను చూసుకుంటాలే. 253 00:14:30,120 --> 00:14:31,250 లోపలికి రా. 254 00:14:34,583 --> 00:14:36,593 -నువ్వు పియానో వాయిస్తున్నావనుకున్నా. -వాయించాను. 255 00:14:36,668 --> 00:14:38,418 ఇప్పుడు చరిత్ర వ్యాసం మీద పని చేస్తున్నా. 256 00:14:38,504 --> 00:14:41,224 పియానో బాగా అనిపించింది. ఆలాగే వాయించు. 257 00:14:41,298 --> 00:14:42,798 ధన్యవాదాలు. లవ్ యూ, నాన్నా. 258 00:14:49,598 --> 00:14:51,978 ఇది చాలా బాగుంది. 259 00:14:52,976 --> 00:14:54,726 మనిద్దరం కలిసి ఏ పనినైనా చేయగలం. 260 00:14:56,438 --> 00:14:58,728 బహుశా నేను విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ కూడా చేయగలనేమో. 261 00:14:59,900 --> 00:15:02,440 సరే. ప్రాథమిక కమాండ్లతో మొదలుపెడదాం. కూర్చో. 262 00:15:02,528 --> 00:15:03,528 కూర్చోగలవా? 263 00:15:04,780 --> 00:15:06,160 ఎంత మంచి పిల్లవి? 264 00:15:09,535 --> 00:15:11,695 బాస్కెట్ లో వేయలేకపోతున్నా. నాకు నా అదృష్ట స్లీవ్ కావాలి. 265 00:15:11,787 --> 00:15:13,657 కర్టిస్, ఆపమని నీకు చెప్పా కదా. 266 00:15:13,747 --> 00:15:16,287 రేపు నాకు ఆట ఉంది, ఎలా వేసి చూసినా బాస్కెట్ లో మాత్రం వేయలేకపోతున్నా. 267 00:15:16,375 --> 00:15:17,785 నేను సాధన చేయాలి. 268 00:15:20,003 --> 00:15:22,303 వద్దు, దాన్ని వదిలేయ్. చెత్త డ్రాగన్! 269 00:15:22,381 --> 00:15:24,471 -డోనా, దాన్ని వదిలేయమని చెప్పు. -వదిలేయి. 270 00:15:27,469 --> 00:15:29,929 -ఈరాత్రికి నువ్వు సోఫాలో పడుకోవాలి. -అస్సలు కుదరదు. నాన్న చెప్పాడు కదా. 271 00:15:30,013 --> 00:15:33,643 అలాగే. నీకు డ్రాగన్ తో పడుకోవాలనుందా? ఎందుకంటే ఇది ఇక్కడే ఉండాలి కాబట్టి. 272 00:15:42,359 --> 00:15:45,449 రోకో, నన్ను మన్నించు, కానీ నువ్వు ఇక్కడ ఉండకూడదు. 273 00:15:46,947 --> 00:15:48,527 సరే, కానీ నిన్ను ముందే హెచ్చరించాను. 274 00:15:55,122 --> 00:15:57,752 ఇప్పుడు, చక్కగా ఉండండి, ఒకరికొకరు ఆప్యాయంగా వాసన చూసుకోండి. 275 00:15:59,209 --> 00:16:00,289 మీరు మిత్రులు కావచ్చు. 276 00:16:12,931 --> 00:16:14,061 కర్టిస్! 277 00:16:14,141 --> 00:16:16,891 నేను నా అదృష్ట స్లీవ్ ని కనిపెట్టాలి. నాకున్న ఏకైక దిక్కు అదే. 278 00:16:16,977 --> 00:16:18,687 నువ్వు హాలుకు వెళ్ళాలి. 279 00:16:21,523 --> 00:16:25,283 రూబెన్! అతను నా కోసం స్లీవ్ ని గీయగలడు. ఈ ఆలోచన నాకు ముందే ఎందుకు రాలేదు? 280 00:16:25,986 --> 00:16:27,276 నీ బట్టలను అరలో పెట్టేయి! 281 00:16:31,408 --> 00:16:32,908 ఇక్కడ దారాలు ఎలా బయటకు వచ్చాయో చూశావా? 282 00:16:32,993 --> 00:16:33,993 అంచుల దగ్గర? 283 00:16:34,077 --> 00:16:36,787 అవును. అది చాలా ముఖ్యం. అది సరిగ్గా ఇలాగే ఉండాలి. 284 00:16:38,540 --> 00:16:39,920 డోనా వరసపెట్టి సందేశాలు పంపుతూనే ఉంది. 285 00:16:40,542 --> 00:16:43,302 -నువ్వు బదులివ్వాలేమో. -ఇంకేమున్నాయి? 286 00:16:43,712 --> 00:16:45,422 మోచేతి దగ్గర మరక ఉంది. 287 00:16:45,506 --> 00:16:47,376 పసుపు మార్కర్ తో దాని మీద నేను నా పేరు రాశాను. 288 00:16:47,466 --> 00:16:50,086 నాకు తెలియడం లేదు, కర్టిస్. ఇలా మనం చేయవచ్చో లేదో. 289 00:16:50,177 --> 00:16:52,927 ప్లీజ్. నాకు అది కావాలి. జట్టు నా మీద ఆధారాపడి ఉంది. 290 00:16:53,013 --> 00:16:55,313 -రేపు ఒక ముఖ్యమైన ఆట ఉంది... -సరే, సరే. 291 00:16:55,390 --> 00:16:57,060 నాకు ఫోటోలన్నీ పంపు. 292 00:17:01,563 --> 00:17:03,073 హేయ్, కర్టిస్ ఉన్నాడా? 293 00:17:03,398 --> 00:17:05,608 నువ్వు నేల మీద పడేసిన ఒకానొక చొక్కాను డ్రాగన్ నమిలేసింది, 294 00:17:05,692 --> 00:17:07,992 మిగాతా వాటిని కూడా అది నమలకుండా నేను ఆపగలనో లేదో. 295 00:17:08,069 --> 00:17:11,029 -వాటిని లోపల పెట్టేయవచ్చు కదా? -నువ్వు పారేసి పోతే నేను పెట్టాలా. 296 00:17:11,906 --> 00:17:13,616 నాకు ఒకే గదిని ఇతరులతో పంచుకోవడమంటే చిరాకు. 297 00:17:13,700 --> 00:17:16,790 హేయ్, బాసూ, స్లీవ్ ని గీస్తున్నందుకు ధన్యవాదాలు. జీవితాంతం నీకు రుణపడుంటాను. 298 00:17:20,082 --> 00:17:21,502 మరి, ఎలా ఉన్నావు? 299 00:17:21,583 --> 00:17:23,883 అంత గొప్పగా ఏమీ లేను. కర్టిస్ బాగా చిరాకు తెప్పిస్తున్నాడు. 300 00:17:23,961 --> 00:17:26,341 నిన్న రాత్రి, వాడి వల్ల నేను సోఫాలో పడుకోవలసి వచ్చింది. 301 00:17:26,421 --> 00:17:28,131 డ్రాగన్ ని ఉంచడానికి స్థలం కూడా లేదు. 302 00:17:28,214 --> 00:17:30,594 మా నాన్న ఇల్లు మాకు చాలా చిన్నది. 303 00:17:32,094 --> 00:17:34,814 నేను అర్థం చేసుకోగలను. ఇక్కడ నేనూ, అమ్మ, తాతయ్య అందరమూ ఒకే బాత్రూమ్ వాడతాం. 304 00:17:34,888 --> 00:17:36,678 నాకంటూ ఏకాంత ప్రదేశం ఉంటే బాగుండేది. 305 00:17:36,765 --> 00:17:38,805 హేయ్, నేను తిరిగి పనికి వెళ్ళాలి. 306 00:17:38,892 --> 00:17:40,352 సరే. మళ్లీ కలుస్తాలే. 307 00:17:43,188 --> 00:17:44,688 హేయ్. చూసి అడుగేయి. 308 00:17:46,400 --> 00:17:47,400 హేయ్. 309 00:17:59,162 --> 00:18:00,162 రోకో. 310 00:18:02,165 --> 00:18:03,745 వద్దు, రోకో! 311 00:18:24,855 --> 00:18:26,765 డోనా, లేయి. రూబెన్ బొమ్మ గీశాడు! 312 00:18:29,109 --> 00:18:32,199 నా అదృష్ట స్లీవ్ నాకు దక్కేసింది. ఇది పని చేస్తుంది. నేను బాగా వేయగలుగుతున్నాను! 313 00:18:32,279 --> 00:18:33,819 నేను నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాను. 314 00:18:34,573 --> 00:18:35,873 పిల్లలూ, లేవండి. 315 00:18:35,949 --> 00:18:37,579 నేను మీకొకటి చూపాలి. 316 00:18:42,623 --> 00:18:45,213 ఈ ఇల్లు ఇప్పుడే అద్దెకు అందుబాటులోకి వచ్చింది, మన భవనంలోనే ఉంది. 317 00:18:45,292 --> 00:18:48,132 దీని మీద నాకు భలే బేరం దొరికింది. మనం ఇవాళే ఇక్కడికి వచ్చేయవచ్చు! 318 00:18:48,212 --> 00:18:49,552 గమ్మత్తైన విషయమేమిటంటే, 319 00:18:49,630 --> 00:18:52,510 ఇంతకు ముందున్న కిరాయిదారు, ఈ సామనంతా ఇక్కడే వదిలి పోయాడు. 320 00:18:53,091 --> 00:18:56,551 కుట్టు మిషన్ ఉంది, నా డిజైన్లకు అవసరమైన విజన్ బోర్డ్ కూడా ఉంది. 321 00:18:56,637 --> 00:18:58,427 ఈ గది నా కోసమే నిర్మించినట్టుగా ఉంది. 322 00:18:58,514 --> 00:18:59,724 నాకేమీ దక్కడం లేదు. 323 00:18:59,806 --> 00:19:01,096 నీకు సొంతంగా ఒక గది దక్కుతుంది. 324 00:19:02,684 --> 00:19:04,604 అవును, ఆ షూటింగ్ స్లీవ్ తో పాటు. 325 00:19:04,686 --> 00:19:05,726 ఇక ఇది చూడండి. 326 00:19:06,230 --> 00:19:07,900 మనం రోకోకి కూడా తన సొంత గది ఇవ్వవచ్చు. 327 00:19:11,068 --> 00:19:13,488 నిజానికి, ఈ గదిని నేను ఇంకో పనికి వాడుకుంటాలే. 328 00:19:13,570 --> 00:19:16,910 నీకు కావలసింది చేసుకో. ఎంతైనా ఇది నీ గదే కదా. 329 00:19:20,827 --> 00:19:24,247 సరే. నేను పాఠశాలలో ఉన్నప్పుడు, నా చరిత్ర వ్యాసాన్ని నువ్వు పూర్తి చేసేయాలి. 330 00:19:24,331 --> 00:19:27,421 పాఠశాల నుండి వచ్చాక, నేను పియానో సాధన చేస్తాను, నువ్వు చర్చకి వెళ్లవచ్చు. 331 00:19:27,501 --> 00:19:29,041 విషయం చాలా సులువైనదే, 332 00:19:29,127 --> 00:19:31,377 "విద్యార్థులు కూడా ఉపాధ్యాయులకి మార్కులు వేయగలరా?" 333 00:19:31,463 --> 00:19:32,973 ఈ విషయాలని రాసుకుంటావా? 334 00:19:33,048 --> 00:19:35,378 నువ్వు పాఠశాలకి వెళ్లినప్పుడు, మన చరిత్ర వ్యాసాన్ని నేను పూర్తి చేయాలి. 335 00:19:35,467 --> 00:19:39,177 పాఠశాల అయ్యాక, నువ్వు పియానో సాధన చేస్తావు, నేను చర్చకి వెళ్లాలి. విషయం... 336 00:19:39,263 --> 00:19:41,433 సరే. నాకర్థమైంది. 337 00:19:42,015 --> 00:19:44,725 -నీకు ప్రతిదీ తెలుసు. -అది మంచి విషయం కాదని రూబెన్ అనుకున్నాడు. 338 00:19:47,020 --> 00:19:49,940 ఒక్కవిషయం నాకు సూటిగా చెప్పు. వాళ్ళకో కొత్త ఇంటిని గీశావా? 339 00:19:50,023 --> 00:19:51,533 అవును. అది చాలా బాగుంది. 340 00:19:51,608 --> 00:19:53,238 మరీ ఎక్కువ అని చెప్పవచ్చు. 341 00:19:53,652 --> 00:19:55,952 నా అర, నా పాత పడక గది అంత పెద్దదిగా ఉంది. 342 00:19:56,405 --> 00:19:58,235 అక్కడ నువ్వు డ్రాగన్ ని పెట్టవచ్చు అని అనుకున్నాను. 343 00:19:58,323 --> 00:20:01,203 అవును, నా అదృష్ట స్లీవ్ అయితే అదృష్టాన్ని మించిపోయింది. 344 00:20:01,285 --> 00:20:03,155 మాయలా ఉంది. ఇది చూడండి. 345 00:20:07,541 --> 00:20:09,921 నేను అది తినాలనుకున్నాను. 346 00:20:13,589 --> 00:20:15,419 రూబెన్. ఏం చేస్తున్నావు నువ్వు? 347 00:20:15,883 --> 00:20:17,973 నువ్వేది పడితే అది గీయాడనికని ఘోస్ట్ రైటెర్ నీ చిత్రాలని 348 00:20:18,051 --> 00:20:19,641 విడుదల చేస్తుందని నాకనిపించడం లేదు. 349 00:20:19,720 --> 00:20:22,220 అదే కావచ్చు, కానీ ఒక్కసారికైనా మనం సరదాపడవచ్చు కదా? 350 00:20:22,306 --> 00:20:24,466 నేనేమి కోట్ల కొద్దీ రుపాయాలని గీయలేదు కదా. 351 00:20:26,393 --> 00:20:27,773 -సరే. -నిజంగా? 352 00:20:28,145 --> 00:20:30,725 నువ్వనుకున్నట్టుగా, నాకు అన్ని విషయాలూ తెలియవు. 353 00:20:31,732 --> 00:20:34,652 నిన్ను సర్వజ్ఞాని అని నేను పిలిచి ఉండకూడదు. 354 00:20:35,152 --> 00:20:36,152 మన మధ్య ఇప్పుడు ఏమీ లేదు కదా? 355 00:20:36,570 --> 00:20:37,570 ఏమీ లేదు. 356 00:20:42,367 --> 00:20:45,367 -అక్కడి నుండి నువ్వు వేయలేవు. -అవునా? చూడు. 357 00:20:51,335 --> 00:20:53,375 అదృష్ట స్లీవ్ వచ్చేసింది! 358 00:20:54,922 --> 00:20:56,972 ఈ మధ్యాహ్నం మనం ఓక్మోంట్ ని తుక్కుతుక్కు చేయబోతున్నాం, 359 00:20:57,049 --> 00:20:59,429 నేను కూడా అదృష్ట మణికట్టు బ్యాండ్ కానీ ఇంకేదైనా కానీ ప్రయత్నించాలంటావా? 360 00:20:59,510 --> 00:21:02,640 ఇది నా అదృష్ట స్లీవ్ వల్ల కాదు. సాధన వల్ల ఇది సాధ్యమైంది. 361 00:21:03,138 --> 00:21:05,138 నువ్వన్నది నిజమే. నేను బాగా సాధన చేశాను. 362 00:21:05,599 --> 00:21:06,599 నాకు పాస్ చేయి. 363 00:21:09,853 --> 00:21:10,853 క్షమించు. 364 00:21:11,271 --> 00:21:13,981 అర్థమైందిలే. నువ్వు మంచి ఊపులో ఉన్నావు. దాన్ని పాడుచేసుకోకు. 365 00:21:14,650 --> 00:21:16,570 -నిన్ను ఆటలో కలుసుకుంటాను. -అలాగే. 366 00:21:22,199 --> 00:21:23,199 ఏంటి? 367 00:21:23,659 --> 00:21:25,539 వావ్. ఇది నిజంగానే పని చేస్తోంది. 368 00:21:25,619 --> 00:21:26,909 అవును, మరీ అతిగా. 369 00:21:26,995 --> 00:21:29,245 చిత్రంగా ఉంది. నేను బాస్కెట్ లో వేయకుండా ఆపలేకపోతున్నాను. 370 00:21:29,331 --> 00:21:31,211 చూడు. నీకు పాస్ చేయడనికి ప్రయత్నిస్తాను. 371 00:21:36,672 --> 00:21:37,672 చూశావా? 372 00:21:37,756 --> 00:21:40,626 ఇప్పుడు నేనేం చేయాలి? నేను పాస్ చేయలేకపోతున్నా. 373 00:21:40,717 --> 00:21:42,257 ఆ స్లీవ్ ని తీసేయి. 374 00:21:42,344 --> 00:21:43,354 సరే. 375 00:21:46,014 --> 00:21:47,104 ఇది రావడం లేదు. 376 00:21:48,267 --> 00:21:50,887 రూబెన్ నా చేతి మీదనే గీసి ఉంటాడు, అందుకే రావడం లేదేమో. 377 00:21:50,978 --> 00:21:54,358 బాస్కెట్ లో వేయలేకపోవడం కన్నా ఇదే మేలు కదా. 378 00:21:59,611 --> 00:22:02,241 -హాయ్. -చరిత్ర వ్యాసం పని సంగతేంటి? 379 00:22:02,531 --> 00:22:03,661 అయిపోయింది. నీ బల్ల మీద ఉంది. 380 00:22:10,330 --> 00:22:12,500 ఇది 20 పేజీలు ఉంటుంది. అయిదు పేజీలలో ఉండాలి. 381 00:22:12,583 --> 00:22:16,133 నీకు నచ్చకపోతే, నువ్వే తగ్గించుకో. అందులో ఉన్న ప్రతీ పదానికి నేను కట్టుబడి ఉన్నాను. 382 00:22:16,587 --> 00:22:18,757 నాకు అంత సమయం లేదు. నేను పియానో సాధన చేయాలి. 383 00:22:19,756 --> 00:22:22,376 -చర్చకి నువ్వు సన్నద్ధమయ్యావా? -అయ్యాను, అది చాలా తేలిక. 384 00:22:23,051 --> 00:22:26,391 ఎక్కువ మార్కులు నాకే వస్తాయి, అంచేత నేనే బాగా మాట్లాడగలను. 385 00:22:26,471 --> 00:22:27,891 అంచేత, చర్చలో విజయం నాదే. 386 00:22:28,682 --> 00:22:29,812 నువ్వు అలా అనలేవు. 387 00:22:30,601 --> 00:22:33,731 ఎందుకు? "అంచేత" మరీ అతిగా ఉందా? "కాబట్టి" అని అనగలనులే. 388 00:22:34,229 --> 00:22:35,939 లేదు, ఇది సమస్యలు తెచ్చిపెడుతుంది. 389 00:22:36,690 --> 00:22:38,070 మనకి ఒక ప్లాన్ అవసరమేమో. 390 00:22:38,150 --> 00:22:40,320 షెవాన్, సిద్ధంగా ఉన్నావా? చర్చకి నిన్ను నేను దింపాలంటే, 391 00:22:40,402 --> 00:22:41,492 -మనం ఇప్పుడే బయలుదేరాలి. -వస్తున్నా. 392 00:22:41,570 --> 00:22:42,860 ఆగు. 393 00:22:43,238 --> 00:22:45,368 బాగా ప్రొఫెషనల్ గా తయారయ్యావే. 394 00:22:46,074 --> 00:22:48,874 జడ్జిలకు నేనొక మంచి స్పీకర్ ని అని అనిపించడానికి ఇలా రెడీ అయ్యాను. 395 00:22:48,952 --> 00:22:51,002 అదంతా పైపైకే, కానీ పని చేస్తుంది. 396 00:22:53,874 --> 00:22:55,084 సరే, నువ్వెలా అంటే అలా. 397 00:23:02,132 --> 00:23:05,262 ఒప్పుకో, నాన్నా. వెబ్ సైట్ పని చేస్తోంది. చూడు ఎంత మంది వచ్చారో. 398 00:23:05,844 --> 00:23:07,854 కాస్త శాంతించు. పది మంది దాకా వచ్చారు, అంతే. 399 00:23:07,930 --> 00:23:09,470 -రూబెన్. -అమ్మా, తమాషాకి అన్నానులే. 400 00:23:10,057 --> 00:23:12,137 నువ్వు నిజంగానే చాలా మంచి పని చేశావు. 401 00:23:12,226 --> 00:23:14,226 నువ్వు చెప్పేది నేను చెవికి ఎక్కించుకుంటూ ఉండాలి. 402 00:23:15,229 --> 00:23:16,979 నువ్వెలాగూ వింటున్నావు కనుక, 403 00:23:17,773 --> 00:23:21,073 నా చిన్నప్పుడు నువ్వు జాజ్ వాయించడం నీకు గుర్తుందా? 404 00:23:22,361 --> 00:23:25,991 మళ్లీ మనం అలాగే రాత్రి జాజ్ సంగీత షో చేయవచ్చేమో. అలా అయితే జనాలు బాగా వస్తారు. 405 00:23:28,951 --> 00:23:30,161 నాకు అది బాగా నచ్చింది. 406 00:23:31,787 --> 00:23:32,787 హేయ్, షెవాన్. 407 00:23:32,871 --> 00:23:35,291 హాయ్, నేను ఒక్క నిమిషం రూబెన్ తో మాట్లాడాలి. 408 00:23:35,374 --> 00:23:36,424 అలాగే. 409 00:23:38,210 --> 00:23:39,550 నువ్వు నా క్లోన్ ని ఆపాలి. 410 00:23:39,628 --> 00:23:41,958 తను లేకుండా చేయి. తనని చందమామ మీద గీసేసినా నేను పట్టించుకోను. 411 00:23:42,047 --> 00:23:43,717 తను చర్చకి మాత్రం వెళ్లకూడదు. ప్లీజ్! 412 00:23:44,716 --> 00:23:45,716 అలాగే. 413 00:23:49,596 --> 00:23:51,556 ఈ పని చేసి పెడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. 414 00:23:53,141 --> 00:23:54,311 నా పెయింట్ బ్రష్ ఏది? 415 00:23:54,393 --> 00:23:56,313 ఆ డబ్బాలో చాలా బ్రష్ లు ఉనాయి. 416 00:23:57,521 --> 00:24:00,021 అవి నా ఆయిల్ చిత్రాల కోసం. నేను వాటర్ కలర్స్ ని వాడుతున్నా... 417 00:24:00,107 --> 00:24:03,607 రూబెన్. ఇది చాలా అత్యవసరం. వేరే బ్రష్ లలో ఏదైనా వాడు. 418 00:24:03,694 --> 00:24:04,904 సరే. సరే. 419 00:24:10,409 --> 00:24:12,409 నాకు అంతా తెలుసు 420 00:24:15,831 --> 00:24:17,171 మరి, నీ అభిప్రాయం ఏంటి? 421 00:24:18,542 --> 00:24:21,342 చాలా బాగుంది. కానీ అది ఇంకా కాగితం మీదనే ఎందుకు ఉంది? 422 00:24:22,379 --> 00:24:23,589 ఒక్క క్షణం ఆగు. 423 00:24:26,466 --> 00:24:28,466 సరే, ఘోస్ట్ రైటర్, నీ పనితనం చూపెట్టు. 424 00:24:30,929 --> 00:24:32,009 ఇది ఎందుకు పని చేయడం లేదు? 425 00:24:32,097 --> 00:24:34,847 ఏమో. ఇంతకు ముందు నేను గీసినవన్నీ ప్రాణం పోసుకున్నాయి. 426 00:24:34,933 --> 00:24:36,443 కాకపోతే ఏకైక తేడా ఏంటంటే... 427 00:24:37,394 --> 00:24:38,734 పెయింట్ బ్రష్. 428 00:24:39,688 --> 00:24:41,568 సరే, మరి ఆ బ్రష్ ఎక్కడ ఉంది? 429 00:24:41,648 --> 00:24:44,648 ఏమో. అది... పోయింది. 430 00:25:46,380 --> 00:25:48,380 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య