1 00:00:06,258 --> 00:00:09,970 సిసామ్ వర్క్ షాప్ సమర్పణ 2 00:00:09,970 --> 00:00:11,054 ఆలివర్ రామోస్ 3 00:00:11,054 --> 00:00:14,015 అయితే ఆలివర్ రామోస్ పోయిన వారం చనిపోయాడన్నమాట, 4 00:00:14,099 --> 00:00:16,434 చనిపోయి దెయ్యం అయ్యాక ఆయన చేసిన మొదటి పని ఏంటంటే, 5 00:00:16,518 --> 00:00:20,605 మన ముగ్గురికి కల్పిత పాత్రలను పరిచయం చేయడమా? 6 00:00:21,106 --> 00:00:22,440 అలాగే ఉంది మరి. 7 00:00:23,984 --> 00:00:25,485 మరి మనం వాళ్లకి ఏం చెప్పాలి? 8 00:00:28,530 --> 00:00:30,031 నిజం. -ఏ నిజం? 9 00:00:30,574 --> 00:00:33,201 వారు పుస్తకంలోని పాత్రలనా? అసలు విజర్డ్ లేడనే విషయాన్నా? 10 00:00:33,702 --> 00:00:35,495 వాళ్లని అసలైన ప్రపంచంలోకి దెయ్యం వదిలాడని, 11 00:00:35,579 --> 00:00:37,497 ఇక్కడ వాళ్లు మనకు తప్ప ఇంకెవరికీ కనబడరు అనా? 12 00:00:37,998 --> 00:00:39,249 మనం అలా చెప్పినప్పుడు, 13 00:00:39,749 --> 00:00:42,544 వాళ్లకి మనం ఎలా అనిపించేలా చేస్తే మంచిదంటే, మనం వెళ్లి... 14 00:00:42,544 --> 00:00:44,379 విజర్డ్. విజర్డ్! 15 00:00:58,602 --> 00:01:00,979 ఇదిగోండి ఎలోకెంట్ పెసంట్, 16 00:01:01,605 --> 00:01:04,523 నేన్ను దీన్ని ఈపీ అని పిలుస్తాను. 17 00:01:05,190 --> 00:01:07,360 ఈ ప్రాచీన ఈజిప్ట్ కథ, చాలా చాలా పాతది... 18 00:01:07,444 --> 00:01:08,778 అతనేనా విజర్డ్? 19 00:01:09,446 --> 00:01:11,197 చూస్తుంటే అలా అనిపించట్లేదే. 20 00:01:11,281 --> 00:01:12,282 ఏమో మరి. 21 00:01:12,282 --> 00:01:15,076 ...ఇప్పుడు అది మన యూనివర్సిటీ లైబ్రరీలోనే ఉంది. 22 00:01:15,160 --> 00:01:17,787 సింహం, దిష్టి బొమ్మ, మీతో మాట్లాడాలి, హాలుకు వస్తారా? 23 00:01:17,871 --> 00:01:19,331 ...సంక్లిష్టమైన నైతిక విలువల కథ. 24 00:01:20,916 --> 00:01:24,669 ఈపీ, కథ బాగా చెప్పడం ఎంత ముఖ్యమో మనకి వివరిస్తుంది... 25 00:01:24,753 --> 00:01:25,837 నాకు అతను తెలుసు. 26 00:01:26,713 --> 00:01:28,006 నాకు కూడా తెలుసు. 27 00:01:28,006 --> 00:01:29,090 నాకు కూడా. 28 00:01:29,591 --> 00:01:34,137 కానీ ఎలోకెంట్ పెసంట్ సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే... 29 00:01:35,639 --> 00:01:36,765 న్యాయం అని చెప్పాలి. 30 00:01:49,986 --> 00:01:51,780 ఘోస్ట్ రైటర్ 31 00:01:51,780 --> 00:01:56,576 కథలోని రైతు, అంతటి చెడు ముందు కూడా నిజాన్ని 32 00:01:56,660 --> 00:01:58,703 నిర్భయంగా, స్పష్టంగా చెప్తాడు. 33 00:01:58,787 --> 00:02:00,038 నేను నమ్మలేకపోతున్నాను. 34 00:02:00,538 --> 00:02:03,124 విలేజ్ బుక్స్ లో మేమిద్దరం పక్కపక్కనే కూర్చొనేవాళ్ళం. 35 00:02:05,126 --> 00:02:10,423 అతను ఐసు వేసుకొని మరీ కూల్ డ్రింక్స్ లాగించేవాడు, ప్లగ్స్ ని అతనే వాడుకొనేవాడు. 36 00:02:11,049 --> 00:02:13,051 నేను మ్యాజిక్ ట్రిక్స్ చేస్తుంటానని అతనికి తెలుసు, 37 00:02:13,051 --> 00:02:16,721 ఒకరోజు నాకు సహకరించాడు కూడా... 38 00:02:16,805 --> 00:02:18,765 ఏదైనా ఒక కార్డును ఎంచుకోండి. -అలాగే. 39 00:02:22,561 --> 00:02:23,562 స్పేడ్స్ ఎనిమిదా? 40 00:02:25,105 --> 00:02:28,024 అవును! వావ్. నీ తెలివి అమోఘం. 41 00:02:28,108 --> 00:02:32,153 నేను ఒక ఐస్ క్రీమ్ తిందామని తెచ్చుకుంటుండగా, అతను తనది పడేసుకున్నాడు. 42 00:02:32,237 --> 00:02:34,239 నాకు అవంటే చాలా ఇష్టం. -ఆలివర్ కి కూడా. 43 00:02:35,031 --> 00:02:36,283 నాది తీసుకోండి. 44 00:02:38,368 --> 00:02:39,661 నువ్వు నీ ఐస్ క్రీమును ఇస్తున్నావా? 45 00:02:39,661 --> 00:02:40,954 పర్వాలేదు, నిజంగానే పర్వాలేదు. 46 00:02:40,954 --> 00:02:43,748 మా ఇల్లు పైనే, నేను ఎప్పుడైనా వెళ్లి ఇంకేదైనా తెచ్చుకోగలను. 47 00:02:44,332 --> 00:02:46,501 వావ్. సరే, థ్యాంక్స్. 48 00:02:47,544 --> 00:02:49,546 నీది చాలా విశాల హృదయం. 49 00:02:51,756 --> 00:02:55,093 మా అమ్మ ఆర్కియాలజీ డిపార్టుమెంట్ వాళ్లకి ఇచ్చిన పార్టీలో నేను ఆలివర్ ని కలిశాను. 50 00:02:55,093 --> 00:02:58,263 చాలా బోరింగ్ గా ఉంటే, వేరే గదిలోకి వెళ్లి ఒక గేమ్ ఆడుకుంటున్నాను. 51 00:02:58,763 --> 00:03:00,098 పార్టీలంటే నీకు కూడా నచ్చవా? 52 00:03:00,765 --> 00:03:01,766 కొంచెం నచ్చవు. 53 00:03:03,184 --> 00:03:05,562 దేవుడా, నేను కూడా ఒకప్పుడు ఈ ఆటనే ఆడుతూ గడిపేవాడిని. 54 00:03:07,439 --> 00:03:08,899 భలే సాహసవంతంగా ఆడావు. 55 00:03:09,482 --> 00:03:11,735 నియా. ఇక్కడ ఉన్నావా! 56 00:03:11,735 --> 00:03:13,695 నీకు కొందరిని పరిచయం చేస్తాను రా. -అలాగే. 57 00:03:14,279 --> 00:03:15,488 మీరు ఆడండి. 58 00:03:15,572 --> 00:03:16,573 థ్యాంక్స్. 59 00:03:18,366 --> 00:03:20,911 అతను మంచి వాడే, కానీ ఆటే చండాలంగా ఆడాడు. 60 00:03:21,745 --> 00:03:22,954 నా లైఫ్స్ అన్నీ ఖతమ్ చేసేశాడు. 61 00:03:26,625 --> 00:03:27,918 ఇది చాలా వింతగా ఉంది. 62 00:03:27,918 --> 00:03:29,794 మనకి ఆలివర్ తెలుసు కానీ మరీ అంత పరిచయం ఏమీ లేదు. 63 00:03:30,295 --> 00:03:31,713 మనల్ని ఎందుకు ఎంచుకున్నాడు? 64 00:03:32,339 --> 00:03:34,132 ఏమీ అర్థం కావట్లేదు. 65 00:03:35,592 --> 00:03:38,136 నాకు అర్థం అయిందనుకుంటా. 66 00:03:39,346 --> 00:03:41,139 నాకు హృదయం ఉందని ఆలివర్ అన్నాడు. 67 00:03:41,223 --> 00:03:44,684 చార్లీ తెలివి అమోఘం అన్నాడు, అంటే ఆమెకి మెదడు ఉందని. 68 00:03:45,352 --> 00:03:50,232 నియాని సాహసవంతంగా ఆడావు అని అన్నాడు, అంటే ధైర్యం అని అర్థం చేసుకోవచ్చు. 69 00:03:50,815 --> 00:03:52,192 "విజర్డ్ ఆఫ్ ఆజ్"లో లాగే అన్నమాట. 70 00:03:52,901 --> 00:03:55,320 నేను చెప్తున్నా కదా, నాకు వాళ్ల మీద నమ్మకం లేదు. 71 00:03:55,320 --> 00:03:57,989 ఏమైంది? వాళ్ళు చాలా మంచి వాళ్లు. 72 00:03:58,073 --> 00:03:59,282 చార్లీ నాకు కేకులు చేసి ఇచ్చింది. 73 00:03:59,366 --> 00:04:00,492 ఎందుకో చెప్తా ఆగు. 74 00:04:00,492 --> 00:04:03,787 ముందుగా, ఈ పసుపు ఫ్లోర్ అనేది 75 00:04:03,787 --> 00:04:05,956 మనం ఇంతకు ముందున్న రోడ్డులా అస్సలు లేదు. 76 00:04:06,790 --> 00:04:07,791 నిజమే. 77 00:04:07,791 --> 00:04:11,461 బహుశా ఎమరాల్డ్ సిటీ ఈ రోడ్డును ఇంకా నవీకరించలేదేమో. 78 00:04:11,545 --> 00:04:13,088 సింహమా, నువ్వు అన్నీ నమ్మేస్తావు. 79 00:04:13,713 --> 00:04:15,048 అసలు డొరోతీ ఎక్కడ? 80 00:04:15,048 --> 00:04:17,800 ఇంకో విషయం, ఆ వీడియోలోని వ్యక్తి అస్సలు విజర్డ్ అయ్యే అవకాశమే లేదు. 81 00:04:17,884 --> 00:04:20,971 నన్ను అడిగితే, నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నట్టున్నావు, టిన్ గర్ల్. 82 00:04:20,971 --> 00:04:24,224 సరే. కానీ నాకు విజర్డ్ చేసే పనులు త్వరగా కనబడాలి, అప్పుడే నమ్ముతాను. 83 00:04:30,897 --> 00:04:32,357 ఆ విజర్డ్ పని సరిపోతుందా నీకు? 84 00:04:32,357 --> 00:04:33,650 పర్వాలేదు, కానీ మున్ముందు చూద్దాం. 85 00:04:44,411 --> 00:04:45,912 ఇది యూనివర్సిటీ మ్యాప్. 86 00:04:46,413 --> 00:04:48,248 లైబ్రరీని చూపిస్తోంది. 87 00:04:50,875 --> 00:04:52,961 ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసును చూపిస్తోంది. 88 00:04:55,964 --> 00:04:56,965 క్రీడా కేంద్రం. 89 00:04:58,341 --> 00:05:01,261 మనం ఆ చోట్లకి వెళ్లాలనుకుంటా. 90 00:05:01,261 --> 00:05:04,973 విజర్డ్ తో మనం ముగ్గురం మాట్లాడాలనుకుంటున్నాం, ఇంకా మూడు ప్రదేశాలు ఉన్నాయి. వెళ్దాం పదండి. 91 00:05:04,973 --> 00:05:07,434 ఈ ప్రదేశాలల్లో ఎక్కడైనా నాకు ధైర్యం దొరుకుతుందంటారా? 92 00:05:07,434 --> 00:05:09,561 ఎందుకంటే, నాకు అత్యవసరంగా కాస్తంత ధైర్యం కావాలి. 93 00:05:09,561 --> 00:05:12,606 ఈ మిస్టరీతో నా నరాలు తెగిపోతున్నాయి. 94 00:05:12,606 --> 00:05:15,233 ప్రతీ దానికీ చర్చా కార్యక్రమాలు వద్దు. మనకి సమయం మించిపోతోంది. 95 00:05:15,817 --> 00:05:18,153 మంత్రగత్తె, తన రెక్కల కోతులతో దగ్గర్లోనే ఎక్కడో ఉంది. 96 00:05:37,380 --> 00:05:39,382 నా మెదడు ఎక్కడ? 97 00:05:39,466 --> 00:05:41,176 ఆలివర్ ఎప్పుడూ ఇక్కడే ఉండేవాడు. 98 00:05:41,176 --> 00:05:43,678 ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్కైవ్ గది అతని ఇల్లు అని చెప్పవచ్చు. 99 00:05:45,597 --> 00:05:46,890 జరిగింది చాలా బాధాకరమైన విషయం. 100 00:05:46,890 --> 00:05:48,642 అతని గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? 101 00:05:48,642 --> 00:05:51,478 నేను స్కూల్ పేపర్ విషయమై అతని గురించి 102 00:05:52,312 --> 00:05:54,189 మీరు అతడిని చివరిగా ఎప్పుడు చూశారో మీకు గుర్తుందా? 103 00:05:54,856 --> 00:05:57,442 అతను చనిపోయే కొన్ని రోజుల ముందు అనుకుంటా. 104 00:05:57,442 --> 00:05:59,069 తన కోసం ఒక పుస్తకం అట్టిపెట్టి ఉంచమన్నాడు. 105 00:05:59,069 --> 00:06:00,153 పుస్తకమా? 106 00:06:00,654 --> 00:06:01,821 అది మీ దగ్గరే ఉందా మరి? 107 00:06:01,905 --> 00:06:06,159 అవును. ఇంకా ఇక్కడే ఉంది. 108 00:06:06,243 --> 00:06:07,953 నేను త్వరగా ఒక ఫోటో తీసేసుకుంటాను. 109 00:06:08,620 --> 00:06:11,456 "ది వరల్డ్స్ స్మార్టెస్ట్ క్రిమినల్ మాస్టర్ మైండ్స్." 110 00:06:13,250 --> 00:06:14,626 నేను కూడా ఏదోకరోజు దాన్ని చదువుతానేమో. 111 00:06:22,217 --> 00:06:23,218 చార్లీ. 112 00:06:26,304 --> 00:06:27,305 చార్లీ! 113 00:06:28,682 --> 00:06:31,893 దేన్నీ తాకవద్దని చెప్పా కదా. -ఎవరితో మాట్లాడుతున్నావు? 114 00:06:33,562 --> 00:06:34,604 నా ఊహల స్నేహితురాలితో. 115 00:06:35,605 --> 00:06:37,607 పద. ఇక వెళ్దాం. 116 00:06:42,779 --> 00:06:43,863 అవును, నాకు ఆలివర్ తెలుసు. 117 00:06:43,947 --> 00:06:47,576 ఎప్పుడూ పొద్దుపోయేదాకా పనిచేసే వాడు. స్వైప్ కార్డును పోగొట్టుకుంటూ ఉండేవాడు. ఎందుకు? 118 00:06:48,201 --> 00:06:51,746 స్కూల్ పేపర్ విషయమై నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను, అందుకు. 119 00:06:51,830 --> 00:06:55,166 మీరు సెక్యూరిటీ గార్డ్ కనుక మీకు తెలిసి ఉంటుందనుకున్నా. 120 00:06:55,250 --> 00:06:58,545 నాకు అతనంటే ఇష్టం. కానీ సెక్యూరిటీ విషయంలో అతను చాలా భయపడేవాడు. 121 00:06:58,545 --> 00:06:59,963 ఇక్కడికి చాలా సార్లు వచ్చేవాడు. 122 00:07:00,547 --> 00:07:03,133 నేను పెద్దగా పట్టించుకోలేదు, ఎప్పుడూ కౌబాయ్ కి ఏదోకటి తెచ్చేవాడు. 123 00:07:03,717 --> 00:07:07,554 త్వరగా కానివ్వు. ఇక్కడ హృదయం లేదు. రెక్కల కోతులు మనకి దగ్గర్లోనే ఉండవచ్చు. 124 00:07:07,554 --> 00:07:10,432 అతను భయపడేవాడు అని మీకు ఎందుకు అనిపించింది? 125 00:07:11,141 --> 00:07:14,436 క్యాంపస్ లో ఉండే సెక్యూరిటీ కెమెరాల గురించి పదే పదే అడిగేవాడు. 126 00:07:14,436 --> 00:07:17,022 పాత సెక్యూరిటీ వీడియోను మాత్రం నేను మాటిమాటికీ చూపలేను అని చెప్పేశా. 127 00:07:17,022 --> 00:07:18,189 దీని వల్ల సమయం వృథా తప్ప మరో లాభం లేదు. 128 00:07:18,273 --> 00:07:19,232 పద. 129 00:07:21,109 --> 00:07:22,319 నువ్వు బాగానే ఉన్నావా? 130 00:07:22,319 --> 00:07:25,822 అవును. బాగానే ఉన్నాను. థ్యాంక్యూ. 131 00:07:29,367 --> 00:07:32,037 నాకు ఆలివర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఇక్కడికి వచ్చేవాడు. 132 00:07:32,037 --> 00:07:33,121 ఫిట్నెస్ కేంద్రం 133 00:07:33,121 --> 00:07:36,249 అతను కుటుంబంతో కలిసి ఈజిప్ట్ కి వెళ్తున్నాడట, అందుకని బాగా ఎత్తులకు ఎక్కడానికి 134 00:07:36,333 --> 00:07:37,834 అతనికి శిక్షణ ఇస్తున్నాను. 135 00:07:39,878 --> 00:07:40,879 ఇక్కడే శిక్షణ ఇచ్చాను. 136 00:07:41,713 --> 00:07:43,256 పురోగతి కూడా బాగానే ఉండింది, 137 00:07:43,757 --> 00:07:45,592 కానీ హఠాత్తుగా రావడం మానేశాడు. 138 00:07:46,092 --> 00:07:47,260 నిజంగానా? 139 00:07:47,344 --> 00:07:51,014 నేను ఆశ్చర్యపోయాను. శారీరకంగా దృఢంగా ఉండాలని తెగ ఆరాటపడిపోయేవాడు. 140 00:07:51,014 --> 00:07:52,307 వారానికి అయిదు రోజులు ఇక్కడే ఉండేవాడు. 141 00:07:53,516 --> 00:07:55,518 నాకు అతని గుండె సంబంధిత వ్యాధి ఉందని నాకు ముందే తెలిసి ఉంటే, 142 00:07:55,602 --> 00:07:57,562 అంత కష్టమైన వాటిని చేయనిచ్చి ఉండేదాన్ని కాదు. 143 00:07:58,230 --> 00:07:59,814 ఎందుకు రావడం మానేశాడో మీకు తెలుసా? 144 00:07:59,898 --> 00:08:03,235 పరిస్థితులన్నీ గందరగోళంగా తయారయ్యాయని, సమయం లేదని అన్నాడు. 145 00:08:04,319 --> 00:08:08,823 అతను ఏమన్నాడంటే, అతను దేని మీద అయితే పని చేస్తున్నాడో, అది పూర్తయ్యాక, 146 00:08:09,324 --> 00:08:12,911 అది ఎంత ముఖ్యమైనదంటే, యూనివర్సిటీలో ఒక భవనానికి తన పేరు పెడతారట. 147 00:08:14,871 --> 00:08:16,331 ఒక్క నిమిషం. -థ్యాంక్యూ. 148 00:08:18,875 --> 00:08:19,876 పద. 149 00:08:19,960 --> 00:08:21,795 మిస్టరీని ఛేదించే పనిని మనం 8:30లోపు ముగించేస్తే, 150 00:08:21,795 --> 00:08:24,172 ఇక్కడికి వచ్చి యోగా క్లాసులో చేరుదామనుకుంటున్నా. 151 00:08:26,758 --> 00:08:28,677 నేను సింహాసనం చాలా బాగా చేస్తా. 152 00:08:30,345 --> 00:08:33,515 ఈజిప్ట్ మీద పరిశోధన చేసే వ్యక్తికి బడా నేరస్థులకు సంబంధించిన పుస్తకాలతో పనేంటి? 153 00:08:33,597 --> 00:08:36,142 క్యాంపస్ సెక్యూరిటీ మీద కూడా అంత ఆసక్తి దేనికి? 154 00:08:36,226 --> 00:08:38,895 అతను ఏదైనా నేరాన్ని పరిష్కరిస్తున్నాడేమో. 155 00:08:38,979 --> 00:08:40,313 నువ్వు ఇది చూడాలి! 156 00:08:40,397 --> 00:08:41,481 విజర్డ్... 157 00:08:42,816 --> 00:08:44,818 విజర్డ్ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. 158 00:08:45,318 --> 00:08:48,405 అతను ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు కానీ నాకు బాగా నచ్చింది. 159 00:08:49,739 --> 00:08:51,950 అదేమైనా కానీ, చాలా పెద్దది అయ్యుంటుంది. 160 00:08:52,617 --> 00:08:55,829 అతను చేసే పని యూనివర్సిటీకి బాగా నచ్చేసి ఒక భవనానికి తన పేరు పెడతారని 161 00:08:55,829 --> 00:08:57,622 ట్రయినర్ తో అన్నాడు. 162 00:08:58,665 --> 00:09:00,000 సూపర్! అదనపు నాణాలు. 163 00:09:00,584 --> 00:09:01,877 నాకు అదనపు నాణాలు దక్కాయి. 164 00:09:03,795 --> 00:09:08,174 కానీ దీనికంతటికీ, "విజర్డ్ ఆఫ్ ఆజ్"కి, ఇంకా అందులోని పాత్రలకీ ఏంటి సంబంధం? 165 00:09:08,258 --> 00:09:09,259 నాకు కూడా అర్థం కావట్లేదు. 166 00:09:09,259 --> 00:09:10,635 మరి ఆ వీడియో సంగతేంటి? 167 00:09:11,136 --> 00:09:13,597 అందులో ఏదో ఎలోకెంట్ పెసంట్ గురించి మాట్లాడాడు. 168 00:09:13,597 --> 00:09:15,849 మొన్న రాత్రి మా అమ్మ దాని గురించే ఏదో చెప్పింది. 169 00:09:16,349 --> 00:09:19,853 అవేవో ప్రాచీన పత్రాలట, వాటిని ఈజిప్టులోని మ్యూజియమ్ కి తిరిగి ఇచ్చేస్తుందట. 170 00:09:19,853 --> 00:09:21,813 వీటన్నింటికీ, దానికీ ఏదో సంబంధం ఉండుండాలి. 171 00:09:22,439 --> 00:09:25,400 హేయ్, సమీర్. టిన్ గర్ల్ ఏది? 172 00:09:27,319 --> 00:09:29,905 ఇందాకటి దాకా ఇక్కడే ఉండిందే. 173 00:09:36,286 --> 00:09:37,787 ఏం చేస్తున్నావు? 174 00:09:38,872 --> 00:09:40,290 ఇది వంట గదిలో ఉండింది. 175 00:09:40,290 --> 00:09:42,751 అవును, అది కుండలకి, ప్యాన్ లకి వాడతాం. 176 00:09:42,751 --> 00:09:44,336 చూడు ఎంత చండాలం చేశావో. 177 00:09:44,336 --> 00:09:45,754 ఏంటి? నువ్వు అయితే ఎంచక్కా స్నానం చేస్తావు. 178 00:09:45,754 --> 00:09:47,339 నేను శుభ్రంగా ఉండకూడదా ఏంటి? 179 00:09:48,548 --> 00:09:49,549 సమీర్? 180 00:09:49,633 --> 00:09:51,218 అక్కడి నుండి లేయ్. 181 00:09:54,304 --> 00:09:57,557 నీ వల్ల ఇద్రిస్ కి పీడకలలు రావట్లేదు కాబట్టి, మీ ఇద్దరూ రేపు 182 00:09:58,767 --> 00:10:00,727 కాస్త సరదాగా గడిపితే బాగుంటుందని నాకు అనిపించింది. 183 00:10:00,727 --> 00:10:04,022 తప్పకుండా. నేను వాడిని పార్కుకు తీసుకెళ్తాను. ఇద్దరం ఫుట్ బాల్ ఆడతాం. 184 00:10:04,022 --> 00:10:05,899 సూపర్. అన్నయ్య అంటే నీలా ఉండాలి. 185 00:10:11,029 --> 00:10:12,530 కథ సమాప్తమైపోయింది అనుకుంటున్నారా? 186 00:10:13,031 --> 00:10:14,032 లేదు. 187 00:10:14,699 --> 00:10:16,660 ఖన్-అనప్ ఊరికే ఉండలేదు. 188 00:10:17,160 --> 00:10:20,121 భూస్వామి చర్యలు సమంజసమైనవి కాదని ప్రకటిస్తాడు, 189 00:10:20,205 --> 00:10:21,206 ఇక తర్వాతి పది రోజులకు... 190 00:10:21,206 --> 00:10:22,958 ఇతను ఏం చెప్పాలని చూస్తున్నాడు? 191 00:10:22,958 --> 00:10:25,418 ఈ వీడియోలో ఏదో నిగూఢార్థం ఉండుంటుంది. 192 00:10:26,503 --> 00:10:29,005 "సింహానికి సాయం చేయవద్దు," లాంటి మంచిది కానిదేదైనా అయ్యుందంటావా? 193 00:10:29,089 --> 00:10:30,966 ఎందుకంటే, నాకు అలాంటిది కొత్తేమీ కాదు. 194 00:10:30,966 --> 00:10:34,302 చిన్నప్పుడు, పిల్లల్లో ఒకటి నాతో చాలా దురుసుగా ప్రవర్తించేది. 195 00:10:34,386 --> 00:10:35,720 శాంతించు, ఇది నీ గురించేమీ కాదు. 196 00:10:38,557 --> 00:10:42,894 హేయ్, ఊరికే ఏం చేస్తున్నావా అని వచ్చా. నువ్వు డిన్నర్ ని పెద్దగా తిననేలేదు. 197 00:10:43,895 --> 00:10:45,438 నా కడుపు కాస్త తేడాగా ఉంది. 198 00:10:46,022 --> 00:10:47,649 కానీ కంగారుపడకు. త్వరలోనే తగ్గిపోతుందిలే. 199 00:10:48,233 --> 00:10:50,610 ఏం పర్లేదు అంటావా? -అవును, నాకు చాలా హోమ్ వర్క్ ఉంది. 200 00:10:51,111 --> 00:10:53,655 సరే మరి. మరీ పొద్దుపోయేదాకా మేల్కోకు. 201 00:10:55,740 --> 00:10:58,743 ఆమె నిజమే అంది. నువ్వు డిన్నర్ సరిగ్గా తినలేదు. 202 00:10:58,827 --> 00:11:01,496 నా పక్కనే ఒక కనబడని సింహం కూర్చుంది కదా, అందుకే ఏమో. 203 00:11:01,580 --> 00:11:03,248 అది కాదు. 204 00:11:03,248 --> 00:11:06,334 ఆ మహిళ నువ్వు దొంగలిస్తున్నావని అంది కదా, అందుకా? 205 00:11:10,255 --> 00:11:11,673 సరే, నీ వంతు అయిపోయింది. 206 00:11:13,341 --> 00:11:14,384 ఇప్పుడు నా వంతు. 207 00:11:14,384 --> 00:11:19,180 కథలోని రైతు, అంతటి చెడు ముందు కూడా నిజాన్ని 208 00:11:19,264 --> 00:11:21,516 నిర్భయంగా, స్పష్టంగా చెప్తాడు. 209 00:11:22,309 --> 00:11:24,185 దాన్ని ఎన్నిసార్లు చూస్తావు? 210 00:11:24,269 --> 00:11:25,896 ఇతను విజర్డ్, తెలివైన వాడు, 211 00:11:25,896 --> 00:11:28,857 ఇతను చెప్పేది వింటూ ఉంటే, నాకు మెదడు వస్తుందేమో. 212 00:11:28,857 --> 00:11:30,942 అదీగాక, ఇతను 'ఎలోకెంట్' అని భలే అంటున్నాడు. 213 00:11:31,026 --> 00:11:32,569 బాగా వినసొంపుగా ఉంది. 214 00:11:33,153 --> 00:11:34,237 "ఎలోకెంట్." 215 00:11:34,321 --> 00:11:37,657 ఏం చేస్తున్నావు, చార్లీ? నాకు పెద్ద గది దక్కినందుకు నీకు కుళ్లుగా ఉందని తెలుసు, కానీ ఏంటి ఈ పని? 216 00:11:37,741 --> 00:11:38,783 నువ్వేం మాట్లాడుతున్నావు? 217 00:11:38,867 --> 00:11:41,745 నా బట్టలు. ఇవి బయట పడి ఉన్నాయి. నువ్వు కిటికీ నుండి ఇవి బయటకు పడేశావు. 218 00:11:41,745 --> 00:11:43,163 ఏంటి? నేను పడేయలేదు. 219 00:11:43,163 --> 00:11:44,956 నువ్వు కాకపోతే, ఇంకెవరు పడేస్తారు? 220 00:11:45,040 --> 00:11:48,126 ఇప్పుడు మ్యాజిక్ సాధన చేయడానికి నీకు ఎక్కువ స్థలం ఉంటుంది. నేనే చేశాగా. 221 00:11:48,126 --> 00:11:49,461 హలో? 222 00:11:49,461 --> 00:11:52,547 నిజమే, సిడ్. నేను పిచ్చి పని చేశాను. 223 00:11:53,298 --> 00:11:54,424 క్షమించు. 224 00:11:55,383 --> 00:11:56,843 ఈ బట్టలను నువ్వే ఉతుకు. 225 00:11:59,221 --> 00:12:03,141 నువ్వు సాయం చేయడానికే అలా చేశావని తెలుసు, కానీ అది తెలివైన పని కాదు. 226 00:12:04,309 --> 00:12:07,270 అందులో నీ తప్పేమీ లేదులే, అసలు నీకు మెదడు లేదు కదా. 227 00:12:07,354 --> 00:12:08,480 హేయ్, ఇటు చూడు. 228 00:12:08,480 --> 00:12:11,233 నాకేమీ చూడాలని లేదు. ఇక దాన్ని ఆఫ్ చేసేయ్. 229 00:12:11,233 --> 00:12:12,692 కానీ నాకొకటి కనిపించింది. 230 00:12:18,990 --> 00:12:21,326 ఆ పదునుగా ఉన్నదాని పక్కన ఒక చిట్టోడు ఉన్నాడు కదా. 231 00:12:21,326 --> 00:12:22,911 చదరంగం ఆటలో ఉండే పావుల గురించి మాట్లాడుతున్నావా? 232 00:12:22,911 --> 00:12:25,413 లైబ్రరీలో అచ్చం ఇలాంటి దాన్నే నేను ఒకటి చూశాను. 233 00:12:29,584 --> 00:12:32,295 మూడు ప్రదేశాలు, మూడు చదరంగ పావులు. 234 00:12:32,379 --> 00:12:34,798 అది లైబ్రరీలో ఉంది అంటే... 235 00:12:36,424 --> 00:12:37,425 దిష్టి బొమ్మ! 236 00:12:37,509 --> 00:12:39,928 నిన్ను నేను తప్పుగా అన్నాను. నువ్వు మహా మేధావివి. 237 00:12:43,181 --> 00:12:44,432 అవునా? 238 00:12:47,894 --> 00:12:51,356 చదరంగ పావులా? వాటికీ, నా హృదయానికీ సంబంధం ఏంటి? 239 00:12:52,399 --> 00:12:54,859 విజర్డ్ లీలలేంటో ఆయనకే తెలియాలి. 240 00:12:55,443 --> 00:12:57,153 సరే అయితే. ఇక పద! 241 00:12:57,654 --> 00:12:59,531 ఈ రాత్రి సమయాన వెళ్లలేము. రేపు వెళ్దాం. 242 00:13:00,073 --> 00:13:02,576 అయ్యయ్యో. రేపు కూడా నేను రాలేను. 243 00:13:02,576 --> 00:13:04,619 నాన్న చెప్పింది విన్నావు కదా. నేను నా తమ్ముడిని చూసుకోవాలి. 244 00:13:05,203 --> 00:13:06,329 అయితే వాడిని కూడా తీసుకురా. 245 00:13:06,413 --> 00:13:09,708 పిల్లలకు తమ అన్నయ్యలతో, అది కూడా హీరోలా ఉండే అన్నయ్యలతో గడపడమంటే చాలా ఇష్టం, 246 00:13:10,292 --> 00:13:13,503 నిజమే, కానీ... ఏమో మరి. -పెద్ద సమయమేమీ పట్టదులే. 247 00:13:13,587 --> 00:13:16,423 ఆ తర్వాత మీరు పార్కుకు వెళ్లవచ్చు. కమాన్. అప్పుడు అందరి పనులూ అవుతాయి. 248 00:13:17,007 --> 00:13:18,383 మంచి ఐడియాలానే ఉంది. 249 00:13:29,936 --> 00:13:32,355 నువ్వు లైబ్రేరియన్ ని మాటల్లో పెట్టు, ఆ చదరంగ పావును నేను తీసేస్తా. 250 00:13:33,231 --> 00:13:34,441 ఏంటి? 251 00:13:34,441 --> 00:13:37,569 నువ్వు లైబ్రేరియన్ ని మాటల్లో పెట్టు, ఆ చదరంగ పావును నేను తీసేస్తా. 252 00:13:37,569 --> 00:13:39,613 నువ్వు నిశ్శబ్దంగా ఉండనక్కర్లేదు. 253 00:13:45,619 --> 00:13:47,954 అవును కదా. నువ్వు లైబ్రేరియన్ ని మాటల్లో పెడితే ఆ చదరంగ పావును 254 00:13:48,038 --> 00:13:49,080 నేను తీసేస్తానని నీకు చెప్తున్నా. 255 00:13:50,874 --> 00:13:52,000 సరే. 256 00:13:55,587 --> 00:13:58,340 కిందటి సారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నా చేతి గుడ్డని మర్చిపోయినట్టున్నా. 257 00:13:58,340 --> 00:14:00,800 నేను జనాలు మర్చిపోయి వెళ్లిపోయిన వస్తువుల్లో ఓసారి చూడవచ్చా? 258 00:14:01,301 --> 00:14:02,552 భేషుగ్గా వచ్చి చూసుకో. 259 00:14:14,064 --> 00:14:15,523 చదరంగ పావు లేదా? 260 00:14:16,066 --> 00:14:17,984 ఈ గదిలోనే ఎక్కడైనా ఉండుంటుంది. 261 00:14:22,113 --> 00:14:24,199 ఆ కుక్క నన్నే చూస్తోందా? 262 00:14:25,200 --> 00:14:27,118 నువ్వూ, నీ స్నేహితులూ తప్ప నన్ను ఇంకెవరూ చూడలేరు కదా. 263 00:14:29,871 --> 00:14:31,623 సమీర్! -కౌబాయ్! 264 00:14:31,623 --> 00:14:33,333 పర్వాలేదు. మరేం పర్వాలేదు. 265 00:14:33,333 --> 00:14:35,126 ఆ కుక్క నిన్నేమీ చేయదు. ఏం పర్వాలేదు. 266 00:14:35,710 --> 00:14:37,045 వెళ్లి కూర్చుందాం పద. ఏం కాదులే. 267 00:14:37,921 --> 00:14:40,131 నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇద్రిస్? ఏం కాదు. ఏమీ కాదు. 268 00:14:40,799 --> 00:14:41,800 ఏం పర్వాలేదు. 269 00:14:42,842 --> 00:14:43,969 మనం అన్నిచోట్లా వెతికేశాం. 270 00:14:43,969 --> 00:14:46,012 జిమ్ లో చదరంగ పావును ఎక్కడ దాస్తారబ్బా? 271 00:14:46,513 --> 00:14:47,514 నేనైతే జిమ్ లో దాచిపెట్టను. 272 00:14:49,224 --> 00:14:52,852 ఆ పైన! ఆలివర్ ఆ గోడను ఎక్కుతూ ఉండేవాడని ట్రయినర్ చెప్పింది. 273 00:14:53,562 --> 00:14:55,230 బహుశా దాన్ని పైన దాచిపెట్టాడేమో. 274 00:14:55,230 --> 00:14:57,566 అయితే నీకు గుడ్ లక్ మరి. 275 00:14:58,400 --> 00:14:59,818 ఓయ్! ఎక్కడికి వెళ్తున్నావు? 276 00:15:00,402 --> 00:15:04,155 నేను కాస్త వ్యాయామం చేస్తాను. మరీ అలా ఉరిమి చూడకు. 277 00:15:10,203 --> 00:15:11,955 నువ్వు ఆ పైకి ఎక్కి చూడాలి. 278 00:15:11,955 --> 00:15:13,164 నన్ను ఎందుకు ఎక్కమంటున్నావు? 279 00:15:13,248 --> 00:15:14,749 ఎందుకంటే, నువ్వు ఎవరికీ కనబడని పెద్ద సింహానివి. 280 00:15:15,917 --> 00:15:17,419 పై దాకా ఎక్కడానికి నీకు మూడు సెకన్లు పడుతుందంతే. 281 00:15:18,461 --> 00:15:20,422 లేదు. నాకు ఎత్తులంటే చచ్చేంత భయం. 282 00:15:29,848 --> 00:15:31,725 గుడ్ ఆఫ్టర్ నూన్. నీకు నేను గుర్తున్నానా? 283 00:15:32,851 --> 00:15:33,852 గుర్తున్నావు. 284 00:15:33,852 --> 00:15:36,521 సరే. హాయ్. 285 00:15:38,940 --> 00:15:42,110 సర్లేండి, నా కోసం ఒక పుస్తకం ఉందో లేదో చూసి పెట్టగలరా? 286 00:15:42,110 --> 00:15:43,361 పేరేంటి? 287 00:15:46,448 --> 00:15:48,867 దాని పేరు "సోడా బుడ్డి కళద్దాల పాప." 288 00:15:50,035 --> 00:15:53,496 నేను ఆ పుస్తకాన్ని ఎప్పుడూ వినలేదు, కానీ... 289 00:15:57,918 --> 00:16:00,420 చార్లీ, చూడు. తీసేసుకున్నా. 290 00:16:06,092 --> 00:16:07,510 ఇక వెళ్దాం పద. 291 00:16:09,429 --> 00:16:10,680 ఏమన్నావు? 292 00:16:11,640 --> 00:16:12,807 క్షమించాలి. తొందరేమీ లేదు. 293 00:16:13,975 --> 00:16:15,018 థ్యాంక్యూ. 294 00:16:18,104 --> 00:16:21,524 ఆ పుస్తకం ఇంట్లోనే ఉందనే విషయం ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. క్షమించండి. 295 00:16:23,818 --> 00:16:25,320 ఆ కుక్క నన్ను కరవబోయింది. 296 00:16:25,320 --> 00:16:26,821 లేదు, అది కరవాలనుకుంది నన్ను. 297 00:16:26,905 --> 00:16:28,073 అది నీకు బాగా భయం తెప్పించి ఉంటుంది. 298 00:16:28,573 --> 00:16:31,493 బహుశా కుక్క కూడా భయపడిపోయిందేమో, అది అందుకే మొరిగిందేమో. 299 00:16:32,994 --> 00:16:34,704 పద, ఇద్రిస్, మనం పార్కుకు వెళ్దాం. 300 00:16:34,788 --> 00:16:37,958 సమీర్, ఇలా మధ్యలో వదిలి వెళ్లిపోతే ఎలా! మనం చదరంగ పావును కనిపెట్టాలి. 301 00:16:38,458 --> 00:16:40,377 కౌబాయ్ విషయంలో నన్ను మన్నించాలి. 302 00:16:40,377 --> 00:16:41,962 మామూలుగా అది మొరగనే మొరగదు. 303 00:16:41,962 --> 00:16:44,548 అతనికి ట్రీట్ ఏమైనా ఇస్తావా? -వద్దులే, పర్వాలేదు. 304 00:16:47,217 --> 00:16:48,969 ఇది ఎంత మంచిదో మీకు చూపిస్తాను. 305 00:16:48,969 --> 00:16:50,762 చూశారా? ఇది చాలా మంచి కుక్క. 306 00:16:58,019 --> 00:17:00,814 సమీర్, చూడు. అది కుక్క పక్కలో ఉంది. 307 00:17:00,814 --> 00:17:04,066 "ఆలివర్ ఎప్పుడూ కుక్కకి ఏదోకటి తెచ్చేవాడు," అన్నాడు కదా. 308 00:17:07,027 --> 00:17:08,362 ఇక్కడ కూర్చో. 309 00:17:09,030 --> 00:17:10,239 ఏం చేస్తున్నావు నువ్వు? 310 00:17:10,323 --> 00:17:11,616 పని అయింది. 311 00:17:11,616 --> 00:17:12,993 థ్యాంక్యూ. -నన్ను క్షమించండి. 312 00:17:13,075 --> 00:17:14,869 దీనికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. 313 00:17:45,734 --> 00:17:46,902 నియా, నన్ను క్షమించు. 314 00:17:46,902 --> 00:17:48,862 నువ్వు కాకుండా ఈ గోడను నేను ఎక్కుండాల్సింది. 315 00:17:50,488 --> 00:17:51,489 తనే. 316 00:17:53,158 --> 00:17:54,159 ఎవరు? 317 00:17:54,701 --> 00:17:56,494 నేను దొంగలిస్తున్నానని చెప్పిన మహిళ. 318 00:18:00,206 --> 00:18:01,333 నియా, అక్కడ ఉండేది ఆమె కాదు. 319 00:18:06,296 --> 00:18:07,464 మేం సాధించాం! 320 00:18:08,673 --> 00:18:09,925 ఇది భలే థ్రిల్లింగ్ గా ఉంది! 321 00:18:12,969 --> 00:18:14,221 మీకు థ్రిల్లింగ్ గా లేదా? 322 00:18:16,223 --> 00:18:17,641 నువ్వు బాగానే ఉన్నావా, నియా? -నేను బాగానే ఉన్నా. 323 00:18:18,350 --> 00:18:19,351 సరే. 324 00:18:20,018 --> 00:18:21,102 సమీర్? 325 00:18:21,186 --> 00:18:24,731 నిజానికి, నాకు అస్సలు బాగాలేదు. 326 00:18:24,731 --> 00:18:26,733 నా తమ్ముడికి పీడకలలు బాగా వచ్చేవి, 327 00:18:28,151 --> 00:18:29,778 ఇప్పుడిప్పుడే వాటి నుండి బయటపడుతున్నాడు, 328 00:18:29,778 --> 00:18:33,031 కానీ నేను వాడిని ఈ మిస్టరీలోకి లాక్కు వచ్చాను. 329 00:18:33,740 --> 00:18:35,158 ఇప్పుడు వాడు కుక్క అంటే భయపడుతున్నాడు. 330 00:18:35,242 --> 00:18:36,576 అతను దాని నుండి భయటపడాలి. 331 00:18:36,660 --> 00:18:38,870 తప్పుగా అనుకోవద్దు, కానీ నువ్వు వాడిని మరీ చిన్నపిల్లాడిలా చూడటం ఆపాలి. 332 00:18:38,954 --> 00:18:40,038 వాడు చిన్నపిల్లాడే! 333 00:18:41,414 --> 00:18:43,083 అసలు నేను నీ మాటలను విని ఉండకూడదు. 334 00:18:46,836 --> 00:18:48,088 నేను బయలుదేరాలి. 335 00:18:48,922 --> 00:18:51,466 ఇప్పుడా? ఇప్పుడే కదా మనం ఇందులో ముందడుగు వేసింది! 336 00:18:52,425 --> 00:18:55,303 మన్నించాలి. నాకు నా తమ్ముడు తర్వాతే ఏదైనా. 337 00:18:55,887 --> 00:18:58,181 గుడ్ లక్. -సమీర్, కాస్త ఆగు. 338 00:18:58,265 --> 00:18:59,349 అతడిని వదిలేయండి. 339 00:19:00,600 --> 00:19:02,018 అతనికి తన తమ్ముడి గురించి ఆందోళనగా ఉంది. 340 00:19:03,019 --> 00:19:04,354 నాకు మనస్సు లేదు అనుకోకండి, 341 00:19:04,354 --> 00:19:08,108 కానీ ఇప్పుడు మనకి చదరంగ పావులు దొరికేశాయి కనుక, మనం వాటిని విజర్డ్ దగ్గరికి తీసుకెళ్లాలి కదా? 342 00:19:08,900 --> 00:19:11,069 ఇప్పటికైనా ఆయన మనకి సాక్షాత్కరిస్తాడేమో. 343 00:19:11,069 --> 00:19:12,779 మనకి వరాలు ఇస్తాడేమో. పదండి! 344 00:19:16,700 --> 00:19:19,786 ఆలివర్ బతికి ఉంటే ఇది చాలా తేలిగ్గా జరిగిపోయుండేది. 345 00:19:27,294 --> 00:19:28,295 ఇప్పుడు ఏం జరుగుతుంది? 346 00:19:31,131 --> 00:19:35,802 మహోన్నత, మహా శక్తి స్వరూప విజర్డ్, నీ చదరంగ పావులను మేము కనిపెట్టేశాము. 347 00:19:36,761 --> 00:19:38,096 ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. 348 00:19:50,734 --> 00:19:52,402 "న్యాయం దక్కేలా చేయండి." 349 00:19:53,904 --> 00:19:55,071 అంటే ఏమిటి? 350 00:19:55,697 --> 00:19:57,616 ఇది "సెక్టర్ 371"ని తలపిస్తుంది. 351 00:19:59,242 --> 00:20:00,577 అది నా ఫేవరేట్ ఆర్.పీ.జీ 352 00:20:02,495 --> 00:20:03,622 అంటే రోల్ ప్లేయింగ్ గేమ్. 353 00:20:05,874 --> 00:20:06,875 సర్లే. 354 00:20:06,875 --> 00:20:10,962 మనం ఇలాంటి మిషన్లను పూర్తి చేస్తే, ఇలాంటి వస్తువులు మనకు లభిస్తాయి. 355 00:20:11,463 --> 00:20:16,134 తదుపరి లెవెల్ కి వెళ్లడానికి, మనం వీటిని ఉపయోగించి దాచబడి ఉన్న తలుపులనో, 356 00:20:16,218 --> 00:20:17,219 రహస్య గదులనో తెరుస్తాం. 357 00:20:17,219 --> 00:20:18,929 కానీ ఇది ఆట కాదు కదా. 358 00:20:19,679 --> 00:20:20,722 ఒక రకంగా చెప్పాలంటే, ఇది ఆటే. 359 00:20:23,308 --> 00:20:25,268 అక్కడ చూడండి! న్యాయానికి సంబంధించిన తులాభారం ఉంది. 360 00:20:25,769 --> 00:20:28,605 కానీ అవి సమంగా లేవు. అయ్యో. అవి విరిగిపోయున్నాయి. 361 00:20:29,189 --> 00:20:31,316 చూశారా, అందుకే మనం ఎప్పుడూ ఏమరపాటుగా ఉండకూడదు. 362 00:20:31,316 --> 00:20:33,235 బహుశా అవి సమంగా కాకుండా అలాగే ఉండాలేమో. 363 00:20:34,444 --> 00:20:38,490 న్యాయాన్ని అందేలా చేయాలంటే, మనం వాటిని సమం చేయాలి. 364 00:20:39,616 --> 00:20:41,076 నియా, నీది మామూలు తెలివి కాదు. 365 00:21:22,409 --> 00:21:23,577 వావ్. 366 00:21:24,327 --> 00:21:26,871 ఏంటది? -అది పెన్ డ్రైవ్. 367 00:21:26,955 --> 00:21:30,417 అవునులే. దానితో మనం ఏం చేయాలి? 368 00:21:30,417 --> 00:21:33,628 అంటే, నాకు తెలుసు, కాని దిష్టి బొమ్మకు తెలీదు కదా. 369 00:21:33,712 --> 00:21:36,381 ఇది కంప్యూటర్ కి పెట్టాలి. ఇందులో ఫైల్స్ ఉంటాయి. 370 00:21:36,381 --> 00:21:38,842 ఆసక్తికరంగా ఉంది. 371 00:21:38,842 --> 00:21:40,510 కానీ విజర్డ్ ఎక్కడ? 372 00:21:41,011 --> 00:21:44,723 దిష్టి బొమ్మ, నువ్వు ఇప్పటిదాకా చెప్పిన వాటిలో ఇదే అత్యంత తెలివైన మాట. 373 00:21:45,307 --> 00:21:46,975 ఏం చేస్తున్నావు? -అది ఇచ్చేయ్. 374 00:21:46,975 --> 00:21:50,270 లేదు. మీరు మాతో అబద్ధం చెప్పారు, నిజమేంటో నాకు చెప్పండి. 375 00:21:50,270 --> 00:21:53,857 ఈ ఆఫీసు ఆలివర్ అనే వ్యక్తిది కదా... అతను చనిపోయాడు. 376 00:21:53,857 --> 00:21:57,527 వాళ్లు మన దగ్గర ఆ విషయం దాచి ఉంచారు. -లేదు! విజర్డ్ చనిపోయాడా? 377 00:21:57,611 --> 00:21:59,279 అసలు విజర్డ్స్ కి చావు ఉంటుందా? 378 00:21:59,279 --> 00:22:01,740 అతను విజర్డ్ కాదు. ఇది కేవలం వీళ్లు అల్లిన కట్టు కథ, అంతే. 379 00:22:02,866 --> 00:22:05,911 నేను నమ్మలేకపోతున్నాను. మీరు మమ్మల్ని మోసం చేశారా? 380 00:22:05,911 --> 00:22:07,287 అసలు మీకు మనస్సు ఎలా వచ్చింది? 381 00:22:07,287 --> 00:22:08,455 మీకు అర్థం కావట్లేదు. 382 00:22:08,955 --> 00:22:12,042 దయచేసి, ఆ పెన్ డ్రైవ్ ని ఇవ్వు, మేము అన్నీ సవివరంగా చెప్తాం. 383 00:22:12,042 --> 00:22:13,460 ఇది మీకు దక్కదు గాక దక్కదు. 384 00:22:15,545 --> 00:22:17,589 నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. 385 00:22:21,301 --> 00:22:22,886 తప్పు చేసింది మీరే. 386 00:23:20,902 --> 00:23:22,904 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య