1 00:00:06,216 --> 00:00:09,970 సిసామ్ వర్క్ షాప్ సమర్పణ 2 00:00:11,263 --> 00:00:12,556 ఇది అసలు అర్థవంతంగా లేదు. 3 00:00:12,556 --> 00:00:15,350 ఆరు నెలల కిందటే నేను ఎలోకెంట్ పెసంట్ అసలైనదేనని చెక్ చేయించాను. 4 00:00:15,350 --> 00:00:17,936 కైరోకి పంపించే ముందు అన్నీ పక్కాగా ఉండాలనుకున్నాను. 5 00:00:17,936 --> 00:00:20,355 కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, టాడ్. 6 00:00:20,355 --> 00:00:22,941 నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు, కానీ ఈ పిల్లలు చెప్పింది నిజమే. 7 00:00:24,234 --> 00:00:25,443 ఇది నకిలీది. 8 00:00:25,527 --> 00:00:26,903 కానీ అదెలా సాధ్యం? ఎందుకు? 9 00:00:26,987 --> 00:00:28,071 అమ్మా, నువ్వు బాగానే ఉన్నావా? 10 00:00:28,071 --> 00:00:31,575 లేను. ఇది చాలా విలువైన కళాఖండం, చాలా చారిత్రాత్మక ప్రాముఖ్యత గలది. 11 00:00:31,575 --> 00:00:33,410 ఇప్పుడు అది పోయిందంటున్నారా? 12 00:00:33,410 --> 00:00:35,620 అసలు ఈ విషయాన్ని మీరు ఎలా కనిపెట్టారో నాకు చెప్పండి. 13 00:00:35,704 --> 00:00:37,163 మొదట్నుంచీ చెప్పండి. 14 00:00:38,164 --> 00:00:39,207 అలాగే. 15 00:00:39,291 --> 00:00:41,501 నేను యువ ఆంథ్రపాలజిస్ట్స్ క్లబ్ ఇచ్చిన అసైన్మెంట్ చేస్తున్నాను... 16 00:00:41,585 --> 00:00:42,669 ఆర్కియాలజిస్ట్స్ క్లబ్. 17 00:00:42,669 --> 00:00:44,754 అదే యువ ఆర్కియాలజిస్ట్స్ క్లబ్. 18 00:00:44,838 --> 00:00:48,592 చాలా క్లబ్స్ ఉండేసరికి అప్పుడప్పుడూ పేర్లను అటుఇటూ చెప్తుంటాను. 19 00:00:49,217 --> 00:00:51,928 ఏదేమైనా, మొన్న ఒక రోజు సమీర్ ఇక్కడ ఎలోకెంట్ పెసంట్ ని పరిశోధన చేస్తూ, 20 00:00:52,012 --> 00:00:53,013 దాని ఫోటోలు కొన్ని తీశాడు. 21 00:00:53,013 --> 00:00:55,849 అవును. లైబ్రరీ వెబ్ సైట్ లో ఉండే ఫోటోకు, నేను తీసిన ఫోటోలకు మధ్య తేడా 22 00:00:55,849 --> 00:00:57,893 ఉండటాన్ని నేను గమనించాను. 23 00:00:57,893 --> 00:01:02,522 ఇక్కడ చూడండి, అసలైన ఎలోకెంట్ పెసంట్ ఇక్కడ చినిగి ఉంది. 24 00:01:02,606 --> 00:01:06,651 కానీ దానికి అదేమీ లేదు. అది నకిలీది అయ్యుంటుంది. 25 00:01:06,735 --> 00:01:07,819 ఇంకా నువ్వు ఎలోకెంట్ పెసంట్ ని 26 00:01:07,903 --> 00:01:10,655 ఈజిప్టుకు పంపించేస్తున్నావనే విషయం గుర్తొచ్చింది, 27 00:01:10,739 --> 00:01:12,365 కాబట్టి, మేము మీకు వెంటనే చెప్పేశాం. 28 00:01:12,449 --> 00:01:15,535 నువ్వు సరైన పని చేశావు. మీరందరూ కూడా. థ్యాంక్యూ. 29 00:01:17,495 --> 00:01:20,165 ఇప్పుడు మనం ఏం చేద్దాం? -మనం పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 30 00:01:20,165 --> 00:01:23,251 అప్పుడే వద్దు. ముందు దీన్ని మనమే తేల్చుదాం. 31 00:01:23,335 --> 00:01:25,253 ఈ విషయం బయట పడితే, మీడియా వాళ్లు ఆడుకుంటారు. 32 00:01:25,337 --> 00:01:28,840 నువ్వన్నది నిజమే. నేను బోర్డును సంప్రదించి ప్రైవేట్ డిటెక్టివ్ ని తీసుకుంటే మంచిదని చెప్తాను. 33 00:01:28,924 --> 00:01:29,925 మంచిది. 34 00:01:31,176 --> 00:01:32,928 థ్యాంక్స్, పిల్లలూ. ఇక దీని సంగతి మేము చూసుకుంటాంలే. 35 00:01:33,887 --> 00:01:35,055 మళ్లీ ఇంట్లో కలుసుకుందాం, బంగారం. 36 00:01:37,474 --> 00:01:39,351 కానీ ఇంకా అంతుచిక్కని విషయాలు చాలా ఉన్నాయి. 37 00:01:39,351 --> 00:01:42,145 ఎలోకెంట్ పెసంట్ ని ఎవరు దొంగిలించారు? ఎలా దొంగిలించారు? 38 00:01:42,229 --> 00:01:44,105 అసలు ఎందుకు దొంగిలించారు? 39 00:01:44,189 --> 00:01:46,483 ఆలీవర్ ఆఫీసులో మనకి దొరికిన చిత్రలిపిల విషయం ఎంత వరకు వచ్చింది? 40 00:01:46,483 --> 00:01:47,943 ఇంకా అనువదించే పనిలోనే ఉన్నాను. 41 00:01:50,320 --> 00:01:52,280 ఈ డిటెక్టివ్ మంచివాడైతే బాగుండు. 42 00:01:53,365 --> 00:01:56,409 ఎందుకంటే, ఇక్కడి నుండి ఎలా దొంగిలించగలిగారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. 43 00:01:56,493 --> 00:02:00,247 అవును. దీన్ని దొంగలించాడంటే, వాడెవడో మెజీషియన్ అయ్యుండాలి. 44 00:02:01,206 --> 00:02:02,207 నేను ఎక్కడ ఉన్నాను? 45 00:02:05,293 --> 00:02:06,378 ఏవండి. 46 00:02:07,212 --> 00:02:08,337 నేను తనకి పోయిన వారం కాల్ చేశాను... 47 00:02:09,798 --> 00:02:10,799 హలో? 48 00:02:14,844 --> 00:02:15,971 హలో? 49 00:02:18,056 --> 00:02:19,307 అసలు ఏం జరుగుతోంది? 50 00:02:23,186 --> 00:02:28,066 నేను చెప్పేది నిజమో కాదో తెలీదు కానీ, మన కథ ఇంకా ముగిసినట్టు లేదు. 51 00:02:44,291 --> 00:02:46,084 ఘోస్ట్ రైటర్ 52 00:02:47,502 --> 00:02:49,754 ఆలివర్ మరో పాత్రను వదిలినట్టున్నాడు. 53 00:02:50,297 --> 00:02:56,845 అవును. అతను మనకే కనిపిస్తున్నాడు, అతని మాటలు మనకే వినిపిస్తున్నాయి. అచ్చం "విజర్డ్ ఆఫ్ ఆజ్"లానే ఉంది. 54 00:02:56,845 --> 00:02:58,847 కానీ నాకు ఈ పుస్తకం గురించి తెలీదు. 55 00:02:59,514 --> 00:03:03,602 అతను పాత్రలను విడుదల చేస్తూనే ఉంటాడా? ఎప్పటికీ? 56 00:03:03,602 --> 00:03:05,604 నేను ముసలిదాన్ని అయినప్పుడు, నాకు మిగిలేది ఈ జ్ఞాపకాలే కాకూడదు. 57 00:03:05,604 --> 00:03:07,022 నాకు అప్పుడు ఆనందంగా ఉండాలనుంటుంది, 58 00:03:07,022 --> 00:03:10,150 ఏ పుస్తకంలో నుండి ఎప్పుడు ఏ పాత్ర వస్తుందోనని అప్పుడు కూడా ఆలోచిస్తూ కూర్చోవాలని లేదు. 59 00:03:10,150 --> 00:03:12,068 ప్రస్తుతానికి ఇప్పటి సంగతి గురించి ఆలోచిద్దాంలే. 60 00:03:12,152 --> 00:03:15,906 హలో? హలో? ఏం... 61 00:03:15,906 --> 00:03:18,074 మనం అతనికి నిజం చెప్పకూడదు, కదా? 62 00:03:18,158 --> 00:03:19,159 అస్సలు చెప్పకూడదు. 63 00:03:19,701 --> 00:03:21,536 మీడియా సమావేశం ఎక్కడ జరుగుతుందో మీకు తెలుసా? 64 00:03:21,620 --> 00:03:22,621 ఏంటి? 65 00:03:22,621 --> 00:03:24,623 అదే, ఒక పెద్ద గదిలో విలేకరులందరూ ఉంటారు కదా? 66 00:03:24,623 --> 00:03:28,460 నా నిర్మాతలు, అసిస్టెంట్లు, స్పాన్సర్లు! 67 00:03:28,460 --> 00:03:31,796 ఇది మయామీ కన్వెన్షన్ సెంటర్ యే కదా? 68 00:03:33,715 --> 00:03:34,716 కాదు. 69 00:03:36,509 --> 00:03:39,471 అయ్యో. అయ్యయ్యో. 70 00:03:42,474 --> 00:03:44,142 లియో ఎల్ మాగ్నీఫికో అసలు ఎక్కడ ఉన్నాడు? 71 00:03:44,226 --> 00:03:45,352 అతను ఎవరు? 72 00:03:45,352 --> 00:03:46,519 నేనే. 73 00:03:46,603 --> 00:03:48,688 నీకు నువ్వే వేరే వ్యక్తిలాగా సంభోదించుకుంటావా? 74 00:03:48,772 --> 00:03:51,775 అవును. అది నా స్టయిల్. 75 00:03:51,775 --> 00:03:53,235 దయచేసి నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి. 76 00:03:55,320 --> 00:03:58,365 అభినందనలు. నువ్వు వేరే లోకం నుండి ఇక్కడికి టెలిపోర్ట్ అయ్యి వచ్చావు, 77 00:03:58,365 --> 00:04:00,283 అది వింతగానే అనిపిస్తుంది, కానీ, ఒక్కోసారి... 78 00:04:00,367 --> 00:04:02,702 ఆలివర్ అని ఒక దెయ్యం ఉంది. 79 00:04:03,620 --> 00:04:05,997 ఈజిప్టుకు చెందిన ఒక పత్రానికి సంబంధించిన గుట్టును ఛేదించడంలో 80 00:04:06,081 --> 00:04:08,875 మాకు సాయపడటానికి, ఆ దెయ్యం కల్పిత పాత్రలను విడుదల చేస్తుంది అనుకుంటున్నాం. 81 00:04:08,959 --> 00:04:10,961 నువ్వు కూడా అలాంటి పాత్రేనని మేము భావిస్తున్నాం, 82 00:04:10,961 --> 00:04:13,463 కానీ నువ్వు ఏ పుస్తకం నుండి వచ్చావో మాకు తెలీదు. 83 00:04:13,547 --> 00:04:16,466 హేయ్, మనం నిజం చెప్పకూడదని అనుకున్నాం కదా. 84 00:04:16,550 --> 00:04:18,927 క్షమించు, నీ అబద్ధం దరిద్రంగా ఉంది, దాని కన్నా నిజం చెప్పడమే మేలు. 85 00:04:19,009 --> 00:04:20,220 ఇప్పుడు అంతా అర్థమవుతోంది. 86 00:04:21,346 --> 00:04:22,514 అవునా? 87 00:04:22,514 --> 00:04:25,809 చూడండి, మయామీలో నేను చాలా పెద్ద మెజీషియన్ ని. 88 00:04:25,809 --> 00:04:28,812 నేను ఇక్కడికి రాక ముందు, నేను ఒక మీడియా సమావేశంలో ఉన్నాను. 89 00:04:28,812 --> 00:04:30,272 "మయామీ హెరాల్డ్" పత్రికా వాళ్లు 90 00:04:30,272 --> 00:04:32,774 "లియో ఎల్ మాగ్నీఫికో, మీరు ఇదివరకు ఈ లోకం ఎన్నడూ చూడని 91 00:04:32,774 --> 00:04:36,111 ఒక అద్భుతమైన మ్యాజిక్ ని చూపుతారని మాకు చెప్తూ ఉన్నారు," అని నాతో అన్నారు. 92 00:04:36,111 --> 00:04:37,195 నేను సంకోచించాను. 93 00:04:37,279 --> 00:04:40,115 నా చుట్టూరా కెమెరాలన్నీ క్లిక్ మంటున్నాయి. 94 00:04:40,115 --> 00:04:43,577 కానీ నిజమేంటంటే, నా దగ్గర అలాంటి అద్భుతమైన మ్యాజిక్ ఏదీ లేదు. 95 00:04:43,577 --> 00:04:46,079 నాకు ఏం చేయాలో తోచలేదు, ఒక్కసారిగా బిగుసుకుపోయాను. 96 00:04:46,079 --> 00:04:48,915 నాకు ఇప్పటిదాకా "అక్కుం బక్కుం"లాంటిది ఇంకా జరగలేదు. 97 00:04:48,999 --> 00:04:50,083 ఈ "అక్కుం బక్కుం" అంటే ఏంటి? 98 00:04:50,083 --> 00:04:52,294 అందరూ "అక్కుం బక్కుం" అన్నప్పుడు, 99 00:04:52,294 --> 00:04:55,922 వాళ్ల ఉద్దేశం "సూపర్", "అద్భుతం", ఇంకా "అమోఘం" అని అన్నమాట. 100 00:04:56,590 --> 00:05:00,635 కానీ లియో "అక్కుం బక్కుం" అన్నప్పుడు అది నా జీవన మార్గం. 101 00:05:00,719 --> 00:05:03,805 అందులో ఉల్లాసమే ఉంటుంది. అంతులేని ఆవిష్కరణ కనబడుతుంది. 102 00:05:03,889 --> 00:05:06,975 నా అమ్మకపు వస్తువులన్నింటి మీదా అది ఉంటుంది, ఇప్పుడు 25 దేశాల్లో అందుబాటులో ఉంది. 103 00:05:06,975 --> 00:05:11,646 బహుశా మీ గుట్టును ఛేదించడంలో నేను మీకు సాయపడితే, నా "అక్కుం బక్కుం" నాకు దొరకవచ్చేమో. 104 00:05:11,730 --> 00:05:15,817 కానీ నిన్ను కల్పిత పాత్ర అన్నాం కదా, నీకేమీ ఇబ్బంది లేదా? 105 00:05:17,110 --> 00:05:18,570 ఒకవేళ మీ లోకంలో లియో నిజం కాకపోతే, 106 00:05:18,570 --> 00:05:21,197 లియో లోకంలో మీరు కూడా నిజం కాకపోయుండవచ్చు కదా? 107 00:05:21,281 --> 00:05:23,617 ఆ కల్పిత పాత్రలు మీరే ఏమో. 108 00:05:24,200 --> 00:05:25,535 లియో ఎప్పుడూ చెప్తున్నట్టుగా, 109 00:05:26,119 --> 00:05:27,787 "మనకి ఒక పరిస్థితి గురించి మెరుగైన అవగాహన కలగాలంటే, 110 00:05:27,871 --> 00:05:29,831 మనం ఆ పరిస్థితిని విభిన్న కోణం నుండి చూడాల్సి ఉంటుంది." 111 00:05:32,959 --> 00:05:35,212 విలేజ్ బుక్స్ 112 00:05:35,212 --> 00:05:38,465 మీరు అడుగుతున్నది దీని గురించే అయ్యుండవచ్చు. 113 00:05:38,465 --> 00:05:39,674 లియో ఎల్ మాగ్నీఫికో పబ్లో కర్తాయా 114 00:05:39,758 --> 00:05:41,635 ఒక కుర్ర మెజిషీయన్ ఒక పోటీని గెలుచుకొని మయామీలో 115 00:05:41,635 --> 00:05:43,345 మంచి పేరు సంపాదిస్తాడు, అతని గురించే ఈ కథ అంతా. 116 00:05:43,345 --> 00:05:44,763 కాదు. ప్రపంచమంతా పేరు సంపాదిస్తాను. 117 00:05:44,763 --> 00:05:46,640 ఆ పేరుతో అతనికి అహంకారం పెరుగుతుంది, 118 00:05:46,640 --> 00:05:49,017 తర్వాత తన ఊతపదమైన "అక్కుం బక్కుం"ను అందరూ వాడాలని పోరు పెడతాడు, 119 00:05:49,017 --> 00:05:51,895 అది ఒక స్పానిష్ పదం, దాన్ని అతను తనదని చెప్పుకొని వాడుకుంటుంటాడు. 120 00:05:51,895 --> 00:05:53,146 అది తన అభిప్రాయం మాత్రమే, అర్థమైందా? 121 00:05:53,230 --> 00:05:55,857 ఇది చాలా సరదాగా ఉంటుంది. మీకు ఇది బాగా నచ్చుతుంది. 122 00:05:55,941 --> 00:05:58,193 మంచి పుస్తకంలా అనిపించింది. నేను కొనుక్కుంటాను. 123 00:05:58,193 --> 00:06:00,570 దాన్ని జాగ్రత్తగా చదువుకొని, అయ్యాక తెచ్చిచ్చేయ్ చాలు. 124 00:06:01,112 --> 00:06:04,616 మేము అప్పుడప్పుడూ కొందరికి పుస్తకాన్ని అరువుగా తీసుకొనే సదుపాయాన్ని అందిస్తుంటాం. 125 00:06:04,616 --> 00:06:07,953 మా కుటుంబ సాంప్రదాయం అన్నమాట. నీకు పుస్తకం నచ్చుతుందనే ఆశిస్తున్నా. 126 00:06:07,953 --> 00:06:09,037 థ్యాంక్యూ. 127 00:06:12,374 --> 00:06:14,459 కిందటి సారిలాగానే ఇప్పుడు కూడా ఈ పుస్తకం ఖాళీగా ఉంది. 128 00:06:16,878 --> 00:06:21,091 పబ్లో కర్తాయా రాసిన లియో ఎల్ మాగ్నీఫికో. ఈసారి దీన్ని మనందరమూ చదవాలి. 129 00:06:21,091 --> 00:06:24,844 అవును. ఈ పుస్తకంలో కూడా దుష్ట మంత్రగత్తె ఉంటే, ముందే తెలుసుకోవడం మంచిది. 130 00:06:26,805 --> 00:06:27,806 హేయ్. 131 00:06:27,806 --> 00:06:29,683 హలో. -హాయ్, సమీర్. 132 00:06:29,683 --> 00:06:32,477 నేను ఇద్రిస్ కి ఇది చదివి వినిపిస్తున్నాను. దాదాపుగా అయిపోవచ్చింది కూడా. 133 00:06:32,561 --> 00:06:34,604 వీళ్లు చార్లీ, ఇంకా నియా. నా స్నేహితులు. 134 00:06:35,105 --> 00:06:36,565 మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. 135 00:06:36,565 --> 00:06:37,983 మిమ్మల్ని కలవడం కూడా. 136 00:06:37,983 --> 00:06:40,277 సమీర్. నీకు ఒక విషయం చెప్పాలి. ఈ శనివారం రాత్రి, 137 00:06:40,277 --> 00:06:43,405 మన స్వదేశంలోని నా ఊరికి చెందిన ఒక కుటుంబానికి ఒక ప్రత్యేకమైన పార్టీ ఇస్తున్నాం. 138 00:06:43,405 --> 00:06:46,116 ఈమధ్యే అమెరికాకి వలస వచ్చారు, వారికి అంతా సౌకర్యంగా అనిపించడానికి పార్టీ ఇస్తున్నాం. 139 00:06:46,116 --> 00:06:48,785 మనం అమెరికాకి వచ్చి రెండేళ్ళయింది కదా, ఆ అనుభవాన్ని వాళ్ళతో పంచుకుందాం. 140 00:06:48,785 --> 00:06:50,287 అలాగే. మంచి విషయమే. 141 00:06:50,870 --> 00:06:52,747 నీకో ప్రత్యేకమైన పని కూడా అప్పగిస్తున్నా. 142 00:06:52,831 --> 00:06:55,542 వారి కోసం నువ్వు బేకరీకి వెళ్లి నమూరా కేకును తీసుకురాగలవా? 143 00:06:55,542 --> 00:06:57,127 అదంటే వాళ్లకి చాలా ఇష్టం. 144 00:06:57,127 --> 00:06:58,503 అలాగే, తప్పకుండా. 145 00:06:59,087 --> 00:07:02,757 థ్యాంక్యూ. మీ ఇద్దరూ కూడా ఈ పార్టీకి తప్పకుండా రావాలి. 146 00:07:02,841 --> 00:07:05,385 జీవితంలో ఒకసారైనా నమూరా తినకపోతే ఆ జీవనం పరిపూర్ణం కానట్టే. 147 00:07:05,385 --> 00:07:08,930 నా అభిప్రాయంలో దానంత రుచికరమైన కేకు ఇంకేదీ లేదు. 148 00:07:09,014 --> 00:07:10,640 మేము వస్తాం. -తప్పకుండా వస్తాం. 149 00:07:10,724 --> 00:07:11,725 ఏంటి... 150 00:07:13,602 --> 00:07:14,603 వెళ్దాం పద. 151 00:07:17,063 --> 00:07:19,900 అయితే, రేపు ఆర్కైవ్ గదిలో కలిసి ఎలోకెంట్ పెసంట్ ని ఎలా దొంగలించారో 152 00:07:19,900 --> 00:07:21,401 కనిపెట్టే ప్రయత్నం చేద్దామా? 153 00:07:21,401 --> 00:07:23,361 దాన్ని తేలిగ్గా "ఈపీ" అని పిలుద్దామా? 154 00:07:23,445 --> 00:07:25,363 "ఎలోకెంట్ పెసంట్" అంటే నోరు తిరగడం లేదు. 155 00:07:25,447 --> 00:07:28,533 ఎలోకెంట్ పెసంట్, ఎలోకెంట్ పెసంట్, ఎలోకెంట్ పెసంట్. చూశారా? ఎంత కష్టంగా ఉందో. 156 00:07:29,576 --> 00:07:30,619 ఈపీ అనే పిలుద్దాం. 157 00:07:42,214 --> 00:07:44,716 ఎలా ఉంది? 158 00:07:45,550 --> 00:07:46,635 పర్వాలేదు. 159 00:07:46,635 --> 00:07:48,970 పర్వాలేదు అంటావేంటి? అది సూపర్ ట్రిక్ అయితే. 160 00:07:49,054 --> 00:07:51,932 కిటికీలో నువ్వు ఎడమ చేతిలో దాచిపెట్టింది కనబడింది, అదీగాక... 161 00:07:53,391 --> 00:07:55,518 లేదు, లేదు. అలా నిరుత్సాహపడిపోకూడదు. 162 00:07:55,602 --> 00:07:57,938 మనం ఇంకా మెరుగవ్వడానికి పని చేయాలి. ముందు నీ కిట్ లో ఏముందో చూద్దాం. 163 00:08:01,816 --> 00:08:04,277 అవును, నేను మొదలుపెట్టినప్పుడు నా వద్ద ఏమున్నాయో, నీ వద్ద కూడా అవే ఉన్నాయి, 164 00:08:04,361 --> 00:08:06,988 కానీ నీకు నిజంగా కావలసింది ఏంటంటే... 165 00:08:13,203 --> 00:08:14,788 నువ్వు బాగానే ఉన్నావా? 166 00:08:14,788 --> 00:08:18,041 ల వీస్టాలో నా స్నేహితురాలు అమాండా ఉపయోగించిన మంత్ర దండం లాగా ఉంది. 167 00:08:19,334 --> 00:08:21,545 మీ ఊరు మయామీ అనుకున్నానే. 168 00:08:21,545 --> 00:08:24,756 ఇప్పుడు మయామీలోనే ఉంటున్నాను, కానీ నా బాల్యమంతా ల వీస్టాలో గడిచింది. 169 00:08:24,756 --> 00:08:27,842 ఫ్లోరిడా కోస్తా ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ఊరు అది. 170 00:08:27,926 --> 00:08:30,929 సముద్ర తీరంలో నేనూ, అమాండా ఉచితంగా మ్యాజిక్ షోలు చేస్తూ ఉండేవాళ్లం. 171 00:08:30,929 --> 00:08:34,849 కేవలం డోమినోస్ ఆడుకొనే ముసలొళ్ళే మా షోలు చూసేవారు, 172 00:08:34,933 --> 00:08:37,226 కానీ అవి చాలా బాగా గడిచేవి. 173 00:08:38,645 --> 00:08:42,023 జనాల ముఖాల్లో నవ్వులు చూడటానికైనా షోలు చేయాలని మాకు అనిపించేది. 174 00:08:42,816 --> 00:08:43,817 వావ్. 175 00:08:43,817 --> 00:08:46,069 నేను కూడా మ్యాజిక్ ని అందుకే చేస్తాను. 176 00:08:46,695 --> 00:08:50,156 ఏదేమైనా, "వాట్స్ యువర్ టాలెంట్" అనే ఒక ప్రముఖ టీవీ షో 177 00:08:50,240 --> 00:08:54,953 మయామీలో ఆడిషన్స్ నిర్వహిస్తూ ఉంది, కానీ తనకి పాల్గొనడం ఇష్టం లేదు. 178 00:08:54,953 --> 00:08:57,706 అందుకని నేను ఒక్కడినే వెళ్లాను. 179 00:08:58,999 --> 00:09:04,045 నేను గెలిచాను, ఆ తర్వాత అంతా మారిపోయింది. 180 00:09:04,796 --> 00:09:06,840 ఇప్పుడు నా పేరు లియో ఎల్ మాగ్నీఫికో. 181 00:09:11,219 --> 00:09:14,472 సరే మరి, పొద్దుపోతున్నట్టు ఉంది. ఇక్కడ బెడ్ సర్వీస్ అందుబాటులో ఉందా? 182 00:09:15,307 --> 00:09:17,851 బేస్మెంట్ లో ఒక సోఫా ఉంది. 183 00:09:19,269 --> 00:09:20,312 అది సరిపోతుందిలే. 184 00:09:20,312 --> 00:09:21,479 శుభరాత్రి. 185 00:09:25,734 --> 00:09:28,653 నిన్న రాత్రి భోజనం చేసేటప్పుడు, బోర్డు డైరెక్టర్లు ఒక ప్రవైటే డిటెక్టివ్ ని 186 00:09:28,737 --> 00:09:31,448 తీసుకున్నారని, ఆయన ఆర్కైవ్ గదిని మూసేయవచ్చని అమ్మ చెప్పింది. 187 00:09:31,448 --> 00:09:34,576 అదే కనుక నిజమైతే, మనం ఈ గుట్టును త్వరగా ఛేదించేయాలి. 188 00:09:34,576 --> 00:09:35,785 అయితే, ఇక పని మొదలుపెడదాం. 189 00:09:38,955 --> 00:09:40,165 ఇది ఇప్పుడు అవసరమా? 190 00:09:40,165 --> 00:09:41,249 ఇది నా స్టయిల్. 191 00:09:41,750 --> 00:09:43,335 నీకు ఎన్ని స్టయిల్స్ ఉన్నాయి, స్వామీ? 192 00:09:48,465 --> 00:09:50,175 ఎలోకెంట్ పెసంట్ 193 00:09:50,175 --> 00:09:54,054 తాళం తెరిచి ఎవరైనా ఈపీని పట్టుకొని వెళ్లిపోవచ్చు, 194 00:09:55,138 --> 00:09:56,806 కానీ ఆ విషయం సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. 195 00:09:57,849 --> 00:09:59,351 నిజంగానే రికార్డ్ అవుతుందంటారా? 196 00:09:59,351 --> 00:10:01,811 దయచేసి ఈ గదిని మెల్లగా పరిశీలిస్తూ ఉండండి, 197 00:10:01,895 --> 00:10:03,939 నేను వచ్చేదాకా ఆపకండి. 198 00:10:08,693 --> 00:10:11,571 హేయ్, మీరు పుస్తకాన్ని చదివేశారా? 199 00:10:11,655 --> 00:10:13,740 నాకు చాలా బాగా నచ్చింది. -నాకు కూడా. 200 00:10:13,740 --> 00:10:18,036 నాకు బాగా నచ్చిన భాగం ఏంటంటే, అతను మయామీకి... -నేను ఇంకా చదవలేదు. కాబట్టి కథ చెప్పేయవద్దు. 201 00:10:34,803 --> 00:10:35,804 "అక్కుం బక్కుం." 202 00:10:37,764 --> 00:10:43,019 సెక్యూరిటీ కెమెరాలకు, ఇక్కడి నుండి ఇక్కడి దాకా జరిగేది చిక్కదు. 203 00:10:44,187 --> 00:10:45,188 రికార్డ్ చేయలేని ప్రదేశం అన్నమాట. 204 00:10:46,356 --> 00:10:51,069 కానీ ఈపీ ఉండేది రికార్డ్ అయ్యే ప్రదేశంలోనే కదా. నాకు అంతా అయోమయంగా ఉంది. 205 00:10:51,069 --> 00:10:52,153 నాకు కూడా. 206 00:10:52,237 --> 00:10:58,243 అయినా కానీ, ఓ విషయం గుర్తుంచుకోండి, ఆవిష్కరణ ఎంత చిన్నదైనా కానీ ఉపయోగకరమైనదే, 207 00:10:58,243 --> 00:10:59,828 అయితే ఈ లోపు, 208 00:10:59,828 --> 00:11:03,915 అసలు వాళ్ళు అద్దంలో నుండి ఈపీని ఎలా తీశారో అన్న ముఖ్యమైన విషయాన్ని మనం కనిపెట్టాలి. 209 00:11:06,793 --> 00:11:10,755 చూడండి. అతను ఏదో బయటకు తీసుకెళ్తున్నట్టున్నాడు, 210 00:11:10,839 --> 00:11:11,923 సూపర్. 211 00:11:12,007 --> 00:11:13,633 ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిద్దాం. 212 00:11:34,237 --> 00:11:35,989 లోపల సెక్యూరిటీ కెమెరాలు ఏవీ లేవు. 213 00:11:37,073 --> 00:11:38,909 అయితే, ఎవరైనా ఎలోకెంట్ పెసంట్ ని చెక్ అవుట్ చేసి, 214 00:11:38,909 --> 00:11:41,786 దాన్ని సేకరణల గదిలో పరిశీలించవచ్చు అన్నమాట, 215 00:11:41,870 --> 00:11:45,165 కానీ అంత సేపూ లైబ్రేరియన్ గమనిస్తూనే ఉంటాడుగా. 216 00:11:45,165 --> 00:11:48,251 దృష్టి మరల్చి ఉంటే తప్ప. 217 00:11:48,335 --> 00:11:51,213 అవును. ఎవరైనా లైబ్రేరియన్ దృష్టి మరల్చి ఉండవచ్చు. 218 00:12:00,764 --> 00:12:05,477 ఇప్పుడు లైబ్రేరియన్ వేరే పనిలో ఉంది, పని కానించేయడానికి సమయం ఇదే. 219 00:12:05,477 --> 00:12:08,939 ఈ సమయంలోనే వాళ్లు అసలైన కాపీని తీసేసి దాని స్థానంలో నకిలీ కాపీని పెట్టి ఉంటారు. 220 00:12:08,939 --> 00:12:10,899 అవును. నేరస్థులు తాము తెచ్చిన నకిలీ కాపీని 221 00:12:10,899 --> 00:12:12,901 ఏదైనా సూట్ కేసులో తెచ్చి ఉంటారు. 222 00:12:13,902 --> 00:12:18,114 లైబ్రేరియన్ వచ్చే ముందే పని కానిచ్చేసి ఉంటారు. సాఫీగా సాగిపోయి ఉంటుంది కదా. 223 00:12:18,198 --> 00:12:20,659 ఇప్పుడు నేరస్థుడు చేయాల్సిందల్లా ఆ అద్ధంలోకి నకిలీ కాపీ 224 00:12:20,659 --> 00:12:24,412 పెడుతూ ఉండగా నవ్వి ఆనందించడమే. 225 00:12:25,121 --> 00:12:26,373 అంతా ఓకే. -థ్యాంక్స్. 226 00:12:27,415 --> 00:12:29,876 ఇక నేరస్థుడు ఆనందంగా గది నుండి బయటకు వెళ్లిపోతాడు. 227 00:12:29,960 --> 00:12:33,838 అసలైన ఎలోకెంట్ పెసంట్ ని తన బ్యాగులో పెట్టుకొని దర్జాగా వెళ్లిపోతాడు. 228 00:12:35,507 --> 00:12:37,133 వావ్. మనం కనిపెట్టేశాం. 229 00:12:37,217 --> 00:12:40,053 ఒక్క నిమిషం. నేను మీ బ్యాగును తనిఖీ చేయాలి. 230 00:12:40,053 --> 00:12:41,805 ఎవరైనా తప్పదు అండి. 231 00:12:45,350 --> 00:12:46,560 థ్యాంక్యూ. 232 00:12:47,769 --> 00:12:49,312 మన సిద్ధాంతం పటాపంచలైందే. 233 00:12:49,396 --> 00:12:51,606 బయటకు వెళ్లేటప్పుడు లైబ్రేరియన్ బ్యాగును తనిఖీ చేస్తుంది. 234 00:12:51,690 --> 00:12:55,652 మీరనుకున్న దాని కన్నా ముందే మనం దీన్ని ఛేధించగలం. ఇలాంటి చిక్కుముడిని పరిష్కరించడం అంత తేలిక కాదు. 235 00:12:55,652 --> 00:12:59,864 మా బామ్మ ఎప్పుడూ "నమ్మకం ఉంచు," అని అంటూ ఉంటుంది. నమ్మకం కోల్పోకండి. 236 00:13:10,125 --> 00:13:11,960 ఇదేనా మీ దెయ్యం? 237 00:13:11,960 --> 00:13:13,378 అతనే ఆలివర్. 238 00:13:21,011 --> 00:13:22,679 "శాక్రోఫ్యాగస్"? 239 00:13:23,680 --> 00:13:27,058 శాక్రోఫ్యాగస్ అంటే మమ్మీలను భద్రపరచడానికి ఉపయోగించే శవపేటిక కదా? 240 00:13:37,569 --> 00:13:38,820 వెళ్దాం పదండి! 241 00:13:58,173 --> 00:13:59,341 అసలు ఈ దెయ్యం ఉద్దేశం ఏమిటో? 242 00:13:59,841 --> 00:14:01,801 చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడు. 243 00:14:01,885 --> 00:14:03,178 వెళ్లి తలుపు తడదాం. 244 00:14:03,178 --> 00:14:06,348 తట్టి ఏం అందాం? పైనున్న శవపేటికని చూడటానికి వచ్చాం అందామా? 245 00:14:06,348 --> 00:14:09,100 లేదు. మేము ఒక విచిత్రమైన ట్రెజర్ హంట్ ఆట ఆడుతున్నామనో, 246 00:14:09,184 --> 00:14:11,269 లేకపోతే చిన్నప్పుడు మనం ఈ ఇంట్లోనే పెరిగామని, 247 00:14:11,353 --> 00:14:14,231 మేము పెరిగిన గదిని బాగా మిస్ అవుతున్నాం కాబట్టి దాన్ని ఒకసారి చూడాలనుకుంటున్నామనో, 248 00:14:14,231 --> 00:14:17,609 లేదా మనం రియల్ ఎస్టేట్ బ్రోకర్లమనో... -ప్రస్తుతానికి ఇక్కడే ఉండి గమనిస్తే మేలేమో. 249 00:14:17,609 --> 00:14:20,862 అవును. గమనించడమనేది చాలా ఉపయోగకరమైనది కావచ్చు. 250 00:14:20,946 --> 00:14:22,405 ఇంకా సమీర్ తో పాటు బేకరీకి వెళ్లే పని తప్పితే, 251 00:14:22,489 --> 00:14:24,241 ఈ మధ్యాహ్నమంతా మనకి వేరే పనేమీ లేదు. 252 00:14:25,283 --> 00:14:26,284 అయ్యయ్యో. 253 00:14:26,993 --> 00:14:29,496 ఏమైంది? -నేను మర్చిపోయాను. 254 00:14:29,496 --> 00:14:31,498 నేను క్యాంపస్ లో మా అక్క దగ్గరకు వెళ్లాలి. 255 00:14:32,165 --> 00:14:34,793 మేము ఒక పెయింటింగ్ పనిలో మా అమ్మానాన్నలకు సాయపడాలి. 256 00:14:34,793 --> 00:14:38,004 క్షమించండి, కానీ నేను తప్పక వెళ్లాలి. ఏమైందో తర్వాత నాకు చెప్పండి. 257 00:14:38,713 --> 00:14:39,923 నీ సాయానికి థ్యాంక్స్. 258 00:14:48,974 --> 00:14:51,434 ఎట్టకేలకు కాస్తంత నిశ్శబ్ద వాతావరణం దొరికినందుకు ఆనందంగా ఉంది. 259 00:14:51,518 --> 00:14:52,811 నాకు చార్లీ అంటే ఇష్టమే, 260 00:14:52,811 --> 00:14:56,523 కానీ తనకి తోచిన అర్థంపర్థంలేని ఐడియాలన్నీ విని వినీ నాకు విసుగు వచ్చేసింది. 261 00:14:56,523 --> 00:14:58,817 కాస్తంత ఆలోచించి మంచి ఐడియాని చెప్తే బాగుంటుంది. 262 00:14:58,817 --> 00:15:01,111 తన ఆలోచనా విధానం అలాగే ఉంటుంది. 263 00:15:01,111 --> 00:15:03,113 అవును, కానీ అది కాస్త చికాకు కలిగించే విధంగా ఉంటుంది. 264 00:15:03,113 --> 00:15:06,032 అంటే, మనందరిలోనూ లోపాలు ఉంటాయి. 265 00:15:06,741 --> 00:15:09,578 ఉదాహరణకు, నీ నిర్ణయాలను 266 00:15:09,578 --> 00:15:11,830 మనందరి నిర్ణయాలుగా చెప్పే అలవాటు నీకు ఉంది. 267 00:15:11,830 --> 00:15:16,501 లియో పుస్తక పాత్ర అని మనం చెప్పకూడదని ముందే అనుకున్నా, నువ్వు తను పుస్తక పాత్ర అని చెప్పేశావు కదా. 268 00:15:16,585 --> 00:15:18,712 అది తనకి కూడా చికాకు కలిగించి ఉండవచ్చు. 269 00:15:19,296 --> 00:15:21,006 వావ్. ముక్కుసూటిగా చెప్పేశావు. 270 00:15:25,635 --> 00:15:28,221 మన్నించాలి, నువ్వు అన్నదానితో నేను ఏకీభవించానంతే. 271 00:15:29,556 --> 00:15:32,767 ఆలివర్ మనల్ని ఎంచుకోవడానికి ఏదొక కారణం ఉండే ఉంటుంది. 272 00:15:32,851 --> 00:15:34,936 కాబట్టి, మనందరం సఖ్యంగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. 273 00:15:36,146 --> 00:15:37,147 సరే. 274 00:15:38,189 --> 00:15:39,858 చాలా సరదాగా ఉంటుంది. -అవును. 275 00:15:39,858 --> 00:15:41,776 అవును. -వెళ్దాం పదండి. 276 00:15:43,153 --> 00:15:45,280 అవును, మేము కొన్ని... 277 00:15:46,239 --> 00:15:48,408 వాళ్లు కరాటే క్లాసుకు వెళ్తున్నారనుకుంటా. 278 00:15:48,408 --> 00:15:50,744 మనం అక్కడికి చేరుకున్నాక, విడివిడిగా ఆరా తీయాలి. 279 00:15:50,744 --> 00:15:52,871 నేను ఆ మహిళను ఫాలో చేస్తాను, మీ ఇద్దరూ ఆ పిల్లాడిని ఫాలో చేయండి. 280 00:15:52,871 --> 00:15:55,749 వాళ్ల ఇంట్లోకి మనం ఎలా వెళ్లవచ్చు అనే విషయాన్ని మనం కనిపెట్టాలి. 281 00:15:55,749 --> 00:15:58,835 అతను కరాటే చేస్తుంటే దగ్గరికి ఎలా వెళ్లగలను? 282 00:15:58,919 --> 00:15:59,920 ఏదోక మార్గం దొరుకుతుందిలే. 283 00:16:01,379 --> 00:16:02,380 తొలి పాఠం ఉచితం 284 00:16:02,464 --> 00:16:03,965 పెద్దలు, పిల్లలు & కుటుంబం అన్ని వయస్సులవారికీ ప్రవేశం ఉంది! 285 00:16:04,049 --> 00:16:07,052 ఒకటి, రెండు, మూడు, నాలుగు. శ్వాస తీసుకోండి. 286 00:16:07,052 --> 00:16:08,136 అంతే, అలాగే చేయండి. 287 00:16:08,845 --> 00:16:10,096 చాలా బాగా చేస్తున్నావు. 288 00:16:10,180 --> 00:16:11,223 థ్యాంక్స్. 289 00:16:12,349 --> 00:16:14,851 నేను మూడు లెక్క పెట్టాక చేయండి. ఒకటి, రెండు, మూడు. 290 00:16:14,935 --> 00:16:18,355 నువ్వు వాడినే ఆపకుండా చూస్తున్నావు. మరీ ఎబ్బెట్టుగా ఉంది. కాస్తంత శాంతించు. 291 00:16:19,397 --> 00:16:21,441 ఎలా శాంతంగా ఉండాలో అర్థం కావట్లేదు. 292 00:16:22,609 --> 00:16:23,610 హేయ్. 293 00:16:26,029 --> 00:16:27,697 ఆమె ఏం మాట్లాడుతోందో నువ్వు విను. 294 00:16:28,865 --> 00:16:30,075 నేను మరీ అంత దగ్గరకు వెళ్లలేను. 295 00:16:30,075 --> 00:16:32,202 ట్రేసీ, ఇంకాస్త పైకి. 296 00:16:35,622 --> 00:16:36,623 అలెన్ పెయింట్ & డిజైన్ 297 00:16:36,623 --> 00:16:37,874 ఇంతకీ ఈ భవనం పేరేంటి? 298 00:16:38,625 --> 00:16:41,878 హావ్తోర్న్ క్లబ్. కేవలం తెలివైన వాళ్లకే ఇందులో ప్రవేశం ఉంటుంది. 299 00:16:41,962 --> 00:16:44,589 క్యాంపస్ లో ఎవరైనా అద్భుతమైన విజయం సాధిస్తే, 300 00:16:44,673 --> 00:16:46,800 రాజకీయవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, 301 00:16:46,800 --> 00:16:49,386 వీళ్లందరూ క్లబ్ మెంబర్స్ తో ఇక్కడ లంచ్ చేస్తారు. 302 00:16:49,386 --> 00:16:53,348 ఇక్కడ ఏర్పడే పరిచయాల ద్వారా ఇంటర్న్ షిప్స్, ఉద్యోగాలు, నీకు ఏం కావాలంటే అది దొరుకుతాయి. 303 00:16:54,224 --> 00:16:56,643 దీనిలో ఎలా చేరాలి? -చేరమని వాళ్లే కోరుతారు. 304 00:16:56,643 --> 00:16:59,521 అదీగాక ప్రతీ ఏడాదీ, ఇందులో పది, పదిహేను మందికే ప్రవేశం కల్పిస్తారు. 305 00:16:59,521 --> 00:17:01,022 నిన్ను కూడా చేర్చుకుంటారులే. 306 00:17:01,606 --> 00:17:03,650 హై స్కూల్ లో ఉన్నప్పుడు అందరి కన్నా నువ్వే తెలివైన దానివి. 307 00:17:04,276 --> 00:17:05,485 కానీ ఇక్కడ నేను ఒక సాధారణ విద్యార్థినినే. 308 00:17:06,695 --> 00:17:09,781 నిజం చెప్పాలంటే, ఈ కాలేజీలో స్నేహితులను ఏర్పరచుకోవడం చాలా కష్టంగా ఉంది. 309 00:17:10,657 --> 00:17:12,409 నీ పేరు సిడ్నీ, కదా? 310 00:17:12,409 --> 00:17:14,410 మనిద్దరం ఒకే సైక్లింగ్ క్లాసుకు వెళ్తాం. 311 00:17:14,494 --> 00:17:17,455 అవును. చెమట లేకుండా నన్ను గుర్తుపట్టగలిగావంటే ఆశ్చర్యంగానే ఉంది. 312 00:17:18,081 --> 00:17:19,082 నా పేరు ఆంబర్. 313 00:17:19,082 --> 00:17:21,501 వీళ్లు లియమ్, స్టెఫనీ, ఇంకా బెన్. 314 00:17:21,501 --> 00:17:22,585 హాయ్. 315 00:17:23,378 --> 00:17:24,963 తను నా చెల్లి, చార్లీ. 316 00:17:25,589 --> 00:17:27,507 మీరు ఈ భవనానికి పెయింటింగ్ వేస్తున్నారా? 317 00:17:27,591 --> 00:17:28,842 మా తల్లిదండ్రులది పెయింటింగ్ వ్యాపారం. 318 00:17:28,842 --> 00:17:31,469 హావ్తోర్న్ క్లబ్ ని పెయింట్ చేయడం లాంటి పెద్ద పని దొరికినప్పుడు మేము సాయపడుతుంటాం. 319 00:17:31,553 --> 00:17:33,430 హా. -బాగుంది. 320 00:17:36,892 --> 00:17:38,643 హేయ్, మిస్టర్ బాయిడ్. మిమ్మల్ని చూడటం బాగుంది. 321 00:17:38,727 --> 00:17:39,811 ఏవరీ. 322 00:17:41,104 --> 00:17:42,314 మళ్లీ ఇక్కడికి రావడం బాగుంది. 323 00:17:44,065 --> 00:17:46,151 మేము లోపలికి వెళ్లాలి. 324 00:17:46,151 --> 00:17:48,445 మిమ్మల్ని కలవడం బాగుంది. నిన్ను జిమ్ లో కలుస్తా మరి. 325 00:17:48,445 --> 00:17:49,779 బై. -బై. 326 00:17:52,365 --> 00:17:54,618 చూశావా, నీకు స్నేహితులు దొరికారు. 327 00:17:55,493 --> 00:17:57,370 నువ్వు కూడా త్వరలోనే వాళ్లతో కలిసి లంచ్ చేస్తావులే. 328 00:17:57,454 --> 00:17:58,455 నువ్వు అన్నది నిజం కావాలి. 329 00:18:02,292 --> 00:18:05,754 సరే మరి, టాడ్, ఇంకాస్త పైకి ఎత్తు. అంతే. 330 00:18:05,754 --> 00:18:07,464 అక్కడ చాలా వేడిగా ఉండింది, అందుకనే నేను... 331 00:18:07,464 --> 00:18:09,007 అలాగే చేయాలి. 332 00:18:09,007 --> 00:18:11,468 నా పేరు సమీర్. నీ పేరు ఏంటి? 333 00:18:11,468 --> 00:18:12,552 క్లాస్ మధ్యలోనా? 334 00:18:15,263 --> 00:18:16,514 ఆహా. 335 00:18:17,682 --> 00:18:19,184 థ్యాంక్యూ. బై. 336 00:18:23,813 --> 00:18:26,149 ఆమె రేపు తన కొడుకు బర్త్ డే పార్టీ ఇస్తోంది. 337 00:18:26,233 --> 00:18:27,859 ఆ పార్టీకి మనం వెళ్లాలి. -ఆవేశపడకు, చెప్పేది విను. 338 00:18:27,943 --> 00:18:29,319 పార్టీ సందర్భంగా ఆమె మ్యాజిక్ షోని ప్లాన్ చేసింది, 339 00:18:29,319 --> 00:18:31,655 కానీ ఆ కంపెనీ రేపు వేరే వాళ్ళతో కూడా బుక్ చేసుకొని ఉండటం వల్ల రావట్లేదు. 340 00:18:31,655 --> 00:18:33,573 కాబట్టి అసలు పార్టీ అనేదే జరగకపోవచ్చు. 341 00:18:37,535 --> 00:18:39,871 నువ్వు "అక్కుం బక్కుం" అని అన్నావా? -అవును. 342 00:18:44,376 --> 00:18:46,545 నమస్తే అండి. మీ అబ్బాయి పుట్టిన రోజు పార్టీ 343 00:18:46,545 --> 00:18:48,255 రేపు జరగనుందని, కానీ ఆ ప్లాన్ విఫలమైందని 344 00:18:48,255 --> 00:18:50,757 నేను విన్నాను. -అవును. 345 00:18:51,466 --> 00:18:53,677 నాకు ఒక మెజిషీయన్ తెలుసు. 346 00:18:54,761 --> 00:18:56,346 ఏం చేశావు? 347 00:18:56,346 --> 00:18:58,723 చార్లీ, దీని వల్ల మనం ఆ ఇంట్లోకి ప్రవేశించగలం. 348 00:18:58,807 --> 00:19:01,351 నువ్వు మ్యాజిక్ షోని చేస్తూ ఉండు, మేమందరం శవపేటిక కోసం వెతుకుతాం. 349 00:19:01,351 --> 00:19:02,477 ఇది దారుణం. 350 00:19:02,561 --> 00:19:05,772 ఒక్క రోజులో నేను సంసిద్ధం అవ్వాలి. ముందు నన్ను అడిగి ఉండవచ్చు కదా? 351 00:19:05,772 --> 00:19:07,566 నేను అప్పటికప్పుడు చెప్పేయాల్సి వచ్చింది. 352 00:19:07,566 --> 00:19:10,860 అదీగాక, మన దగ్గర ఒక ప్రొఫెషనల్ ఉన్నాడుగా, అతను నీకు సహాయపడతాడు. 353 00:19:11,820 --> 00:19:13,071 నీకు అర్థం కావట్లేదు, నియా. 354 00:19:13,071 --> 00:19:16,908 నా దగ్గర పార్టీకి వచ్చే వాళ్లకి చూపడానికి మూడు ట్రిక్కులే ఉన్నాయి. మూడంటే మూడే. 355 00:19:16,992 --> 00:19:20,120 నేను ఒక నాణాన్ని మాయం చేయగలను, నోటి నుండి పొడవాటి రిబ్బను తీయగలను, 356 00:19:20,120 --> 00:19:23,123 ఇంకా కొన్ని కార్డులను నా రెక్కల్లో కొన్ని కార్డులను దాచగలను. అంతే. 357 00:19:24,165 --> 00:19:26,793 రెక్క! నువ్వు రెక్క అని అన్నావా? 358 00:19:27,460 --> 00:19:31,464 రెక్క. రెక్క. రెక్క. రెక్క... 359 00:19:38,889 --> 00:19:42,934 నియా, నువ్వు రెండు విషయాలను పరిశీలించవలసిందిగా లైబ్రేరియన్ ని అడగాలి. 360 00:19:43,018 --> 00:19:45,604 "కౌంట్ ఆఫ్ మోంటె క్రిస్టో" పుస్తకాన్ని, 361 00:19:45,604 --> 00:19:47,063 ఇంకా ఈ పక్షి చిత్రాన్ని. 362 00:19:48,481 --> 00:19:49,941 ఎందుకు? 363 00:19:50,025 --> 00:19:52,903 ప్రత్యేకమైన సేకరణల గది నుండి నేరస్థులు ఎలోకెంట్ పెసంట్ ని 364 00:19:52,903 --> 00:19:54,696 ఎల బయటకు తీసుకురాగలిగారో నాకు తెలుసు. 365 00:19:54,696 --> 00:19:58,742 నా తర్వాతి ట్రిక్కులో, వాళ్ల కుట్రని నేను మీకు కళ్లకు కట్టినట్టుగా చూపుతాను. 366 00:20:00,285 --> 00:20:01,912 నిజానికి, అది చాలా తేలికైన పని. 367 00:20:01,912 --> 00:20:05,498 మన అత్యంత తెలివైన దొంగ రెండు వస్తువులను పరిశీలించాలని అడిగాడు. 368 00:20:05,582 --> 00:20:06,583 చెప్పండి. 369 00:20:06,583 --> 00:20:09,711 నేను ఎలోకెంట్ పెసంట్ ని, పక్షి చిత్రాన్ని చూడాలనుకుంటున్నాను. 370 00:20:09,711 --> 00:20:12,047 నేను "కౌంట్ ఆఫ్ మోంటె క్రిస్టో" పుస్తకాన్ని 371 00:20:12,047 --> 00:20:13,715 ఇంకా పక్షి చిత్రాన్ని చూడాలనుకుంటున్నాను. 372 00:20:13,715 --> 00:20:14,966 ఓ గుర్తింపు కార్డును చూపాడు. 373 00:20:15,050 --> 00:20:16,051 విక్ఫర్డ్ యూనివర్సిటీ ఎన్. ఐ. అబార్న్స్ 374 00:20:16,051 --> 00:20:17,469 మా అమ్మ ఇక్కడే పని చేస్తోంది. 375 00:20:18,178 --> 00:20:20,263 లాగ్ పుస్తకంలో సంతకం చేశారు. 376 00:20:20,347 --> 00:20:23,141 వస్తువులను లైబ్రేరియన్ ప్రత్యేకమైన సేకరణల గదికి తీసుకొచ్చింది. 377 00:20:23,975 --> 00:20:27,771 అది సెక్యూరిటీ కెమెరాలు లేని గది అని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. 378 00:20:29,773 --> 00:20:33,652 తర్వతా, రెండవ నేరస్థుడు దృష్టిని మరల్చాడు. 379 00:20:38,365 --> 00:20:40,116 మన్నించాలి, నేను ఇప్పుడే వస్తాను. 380 00:20:41,952 --> 00:20:42,953 వెంటనే వచ్చేస్తాను. 381 00:20:49,125 --> 00:20:50,752 నాకు ప్రతిసారీ ఇదేం గోలరా బాబూ! 382 00:20:50,752 --> 00:20:52,796 అప్పుడే అసలు పని జరుగుతుంది. 383 00:20:52,796 --> 00:20:54,839 లైబ్రేరియన్ వేరే పనిలో ఉండగా, 384 00:20:54,923 --> 00:20:59,636 నేరస్థుడు ఎలోకెంట్ పెసంట్ ని పక్షి చిత్రంలో దాచి, 385 00:21:01,471 --> 00:21:04,224 సరిగ్గా లైబ్రేరియన్ వచ్చే లోపు 386 00:21:04,224 --> 00:21:09,145 నకిలీ ఎలోకెంట్ పెసంట్ ని బయటకు తీస్తాడు. 387 00:21:11,106 --> 00:21:12,107 క్షమించాలి. 388 00:21:13,692 --> 00:21:15,277 నా పని పూర్తి అయింది. థ్యాంక్యూ. 389 00:21:15,860 --> 00:21:17,821 నా పని పూర్తి అయింది. థ్యాంక్స్. 390 00:21:22,367 --> 00:21:23,368 థ్యాంక్స్. 391 00:21:27,872 --> 00:21:31,501 చివరికి, లైబ్రేరియన్, ఆ అద్ధాల కేసులో 392 00:21:31,585 --> 00:21:33,336 నకిలీ ఎలోకెంట్ పెసంట్ ని లాక్ చేస్తుంది, 393 00:21:33,420 --> 00:21:37,716 ఆ తర్వాత అసలైన ఎలోకెంట్ పెసంట్ దాచబడి ఉన్న పక్షి చిత్రాన్ని గోడకి తగిలిస్తుంది. 394 00:21:37,716 --> 00:21:39,759 ఈ విధంగా నేరస్థుడు దొంగిలించగలిగాడు. 395 00:21:40,635 --> 00:21:42,095 చాలా బాగా చెప్పావు. 396 00:21:42,095 --> 00:21:44,389 ఇది లైబ్రరీ కాకపోయుంటే, ఆపకుండా చప్పట్లు కొట్టేదాన్ని. 397 00:21:45,056 --> 00:21:46,933 చార్లీ "రెక్క" అని అన్నప్పుడు, 398 00:21:47,017 --> 00:21:51,146 మ్యాజిక్ అదిరిపోయేలా చేయాలంటే, కార్డును ఒక చక్కని రెక్కలో దాచాలని నాకు గుర్తు వచ్చింది. 399 00:21:51,146 --> 00:21:53,940 ఆ కళాఖండాన్ని దాచడానికి ఆ దొంగకు కూడా ఒక చక్కని చోటు అవసరం అయ్యుంటుంది. 400 00:21:54,024 --> 00:21:55,025 అదే ఆ చోటు. 401 00:21:56,151 --> 00:21:57,152 ఒక్క నిమిషం. 402 00:21:57,152 --> 00:21:59,487 ఇదంతా బాగానే ఉంది, కానీ... 403 00:22:00,614 --> 00:22:04,993 మనకి ఈపీ, ప్రతేక సేకరణల గది నుండి ఎలా బయటకు వచ్చిందో మాత్రమే తెలిసింది. 404 00:22:04,993 --> 00:22:07,787 కానీ ఆ పెయింటింగ్ నుండి ఎలా తీశారో మనకి ఇంకా తెలీదు. 405 00:22:10,415 --> 00:22:11,708 అది నిజమే. 406 00:22:13,877 --> 00:22:19,382 దీనికి సమాధానం, ఆ శవ పేటికలో ఉందేమో, మనం బర్త్ డే పార్టీకి వెళ్లినప్పుడు చూడాలి. 407 00:22:21,051 --> 00:22:23,511 దాని కోసం కాకపోతే, దాని సంగతి చూడమని ఇంకెందుకు మనకు ఆలివర్ చెప్తాడు? 408 00:22:23,595 --> 00:22:26,640 మనకి ఏం చేయాలో తోచని మరుక్షణం, అతను మనకు ఆ ఆధారాన్ని అందించాడు. 409 00:22:26,640 --> 00:22:27,724 అది నిజమే. 410 00:22:27,724 --> 00:22:32,979 అందులో ఏదున్నా కానీ, మమ్మీయే ఉంటుందేమో, ఈ గుట్టును ఛేదించడంలో మనకు సాయపడుతుంది. 411 00:22:33,813 --> 00:22:34,814 హేయ్. 412 00:22:34,898 --> 00:22:37,651 ...నిజంగానే మరో దారి లేదు. మేము దాన్ని పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. 413 00:22:38,860 --> 00:22:41,655 మధ్యలో అడ్డు తగులుతున్నందుకు మన్నించాలి, ప్రస్తుతం ఆర్కైవ్ గదిని మూసేశాం. 414 00:22:41,655 --> 00:22:43,698 అప్ డేట్స్ కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ ని చూస్తూ ఉండండి. 415 00:22:44,449 --> 00:22:47,285 అది స్కూల్ నియమించిన డిటెక్టివ్ పని అయ్యుంటుంది. 416 00:22:47,369 --> 00:22:48,495 మనం ఇప్పుడు ఏం చేయాలి? 417 00:22:48,495 --> 00:22:50,789 మనం దీన్ని వేరే కోణం నుండి చూడాలి. 418 00:22:52,749 --> 00:22:54,793 ముందు ఏదోకటి తిందాం. -కోణం అంటే ఇది! 419 00:23:05,053 --> 00:23:09,224 నాకు ఆకలి తీర్చుకోవాలని ఉంది, కానీ డిన్నర్ కూడా ఏ లోటూ లేకుండా తినాలనుంది. 420 00:23:11,393 --> 00:23:13,770 ఒక్క నిమిషం. సన్ ఫ్లవర్ సీడ్స్ ని తింటే చాలు కదా. 421 00:23:15,564 --> 00:23:17,607 హలో, ఒక్క నిమిషం ఆగండి. 422 00:23:18,733 --> 00:23:21,570 నన్నేనా? -అవును. మీ బ్యాగును తెరవండి. 423 00:23:24,656 --> 00:23:25,949 ఎందుకు? 424 00:23:25,949 --> 00:23:29,286 సరే, మరి నా బ్యాగును తెరవమని ఎందుకు అడగలేదు? వారి బ్యాగును తెరవమని ఎందుకు అడగలేదు? 425 00:23:33,290 --> 00:23:34,291 చూపెట్టండి. 426 00:23:46,386 --> 00:23:47,512 సంతోషమా? 427 00:23:49,973 --> 00:23:52,559 పద. ఇక్కడికి ఇంకెప్పుడూ రాకూడదు. 428 00:23:52,559 --> 00:23:53,643 చచ్చినా రాకూడదు. 429 00:23:55,353 --> 00:23:56,354 నువ్వు బాగానే ఉన్నావా? 430 00:23:57,689 --> 00:24:01,443 నాది నల్లజాతి కాబట్టి నేను దొంగలిస్తున్నానని ఆ మహిళ అనుకుంది కదా, అదే గుర్తొచ్చింది నాకు. 431 00:24:01,443 --> 00:24:03,570 అయన కనీసం తన జాత్యాహంకారాన్ని దాచుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. 432 00:24:05,155 --> 00:24:07,032 మనం అతనికి ఏదైనా చెప్దామా? 433 00:24:07,032 --> 00:24:09,701 సాధారణంగా ప్రతీకారం కోసం మ్యాజిక్ ని ఉపయోగించడం. 434 00:24:09,701 --> 00:24:12,787 కానీ ఈ సందర్భంలో, ఆ నియమాన్ని కాసేపు పక్కకు పెట్టగలను. 435 00:24:12,871 --> 00:24:17,375 లేదు, నాకేమీ గోల చేయాలని లేదు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 436 00:24:18,585 --> 00:24:22,297 నా లోకంలో కూడా, నేనెంత విజయం సాధించినప్పటికీ, 437 00:24:22,297 --> 00:24:26,384 నేను నా షోలలో ఎక్కువగా స్పానిష్ మాట్లాడుతుంటాను కాబట్టి, కొందరు నన్ను తక్కువగా చూస్తుంటారు. 438 00:24:28,178 --> 00:24:33,475 మేము అమెరికాకి వచ్చిన మొదట్లో, వీధిలోని ఒకడు మాపై అరవడం మొదలుపెట్టాడు. 439 00:24:35,185 --> 00:24:36,978 మేము ఇక్కడ ఉండకూడదని, 440 00:24:37,062 --> 00:24:40,148 ఎక్కడి నుండి వచ్చామో, అక్కడికే వెళ్లిపొమ్మని అరిచాడు. 441 00:24:48,406 --> 00:24:50,617 జైంగర్ 442 00:24:51,660 --> 00:24:53,203 సెంట్రల్ గ్రాస్ 443 00:24:55,038 --> 00:24:55,872 సెంట్రల్ గ్రాసరీ 444 00:24:55,956 --> 00:24:57,707 "నేను ఒక గూండాలా ఉన్నానని మేనేజర్ అన్నాడు." 445 00:24:57,791 --> 00:24:59,918 "నాపై ఏ సంకోచమూ లేకుండా జాత్యాహంకారం ప్రదర్శించాడు." 446 00:25:00,877 --> 00:25:02,921 "జాత్యాహంకారపు మేనేజర్ ఉంటాడు చూసుకోండి." 447 00:25:04,965 --> 00:25:06,967 "బహిష్కారం." 448 00:25:08,510 --> 00:25:09,386 మోంట్గోమేరీ బస్సుల బహిష్కారం 449 00:25:09,386 --> 00:25:10,845 ఉద్యోగాలు, స్వేచ్ఛ కోసం యుద్ధ వ్యతిరేక ప్రదర్శన 450 00:25:10,929 --> 00:25:12,180 జాత్యాంహకార వైఖరికి నిరసనగా బహిష్కారం న్యూ యార్క్ స్కూళ్ల బహిష్కారం 451 00:25:13,598 --> 00:25:16,059 శాంతి!! 452 00:25:16,059 --> 00:25:17,269 ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు కల్పించమని నిరసన తెలుపుతున్నాము! 453 00:25:17,269 --> 00:25:18,812 మేము యోగ్యమైన నివాసం - ఓటు హక్కులను డిమాండ్ చేస్తున్నాము 454 00:25:30,490 --> 00:25:32,826 కమలం 455 00:25:34,703 --> 00:25:38,039 కమలం. అంటే ఏం అయ్యుంటుంది? 456 00:25:42,043 --> 00:25:43,503 నమూరా కేకు ఏది? 457 00:25:44,337 --> 00:25:47,048 క్షమించు, నాన్నా. బేకరీకి సమయానికి వెళ్లలేకపోయాను, 458 00:25:47,132 --> 00:25:50,302 కాబట్టి వేరే బేకరీకి వెళ్లి, బక్లావా కేకును తీసుకొచ్చాను. 459 00:25:55,348 --> 00:25:57,267 నీకు బక్లావా అంటే ఇష్టం. 460 00:25:57,851 --> 00:25:59,811 ఈ కుటుంబానికి నమూరా కేకు చాలా ప్రత్యేకమైనది, అర్థమైందా? 461 00:25:59,895 --> 00:26:03,732 సిరియా నుండి టర్కీకి వెళ్లి, అక్కడి నుండి ఇక్కడికి మనం ఎలా అయితే వచ్చామో, వాళ్లు కూడా అలాగే వచ్చారు. 462 00:26:03,732 --> 00:26:05,609 మనం ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామో నీకు తెలుసు కదా? 463 00:26:06,776 --> 00:26:07,903 అవును, నాకు తెలుసు. 464 00:26:08,820 --> 00:26:11,573 కాబట్టి, వాళ్ళు కూడా మనలాగే అయోమయంగా, ఏమీ అర్థం కాకుండా ఉంటారని నీకూ తెలుసు. 465 00:26:12,157 --> 00:26:13,450 కాబట్టి, వాళ్లకి దేశీయ వంటకాల 466 00:26:13,450 --> 00:26:15,201 రుచిని అందించడానికి, మన వంతు ప్రయత్నం చేద్దాం. 467 00:26:15,285 --> 00:26:18,163 సరే, క్షమించు, నాన్నా. నాకు అర్థమైంది. 468 00:26:18,163 --> 00:26:20,165 నమూరాని నేను రేపు తీసుకువస్తాను. 469 00:26:21,249 --> 00:26:23,001 సరే. మంచిది. 470 00:26:27,797 --> 00:26:30,759 కార్డులను మరీ అంత గట్టిగా పట్టుకోకు, ఇంకా బొటనవేలును కూడా చూసుకో, సరేనా? 471 00:26:30,759 --> 00:26:34,596 మెల్లగా. శాంతంగా చేయ్. నువ్వు జారవిడచకుండా ఉంటే మంచిది. 472 00:26:34,596 --> 00:26:35,680 మాకు తెలుసులే. 473 00:26:35,764 --> 00:26:37,515 కాస్తంత... -జారిపోతున్నాయి. 474 00:26:37,599 --> 00:26:38,433 పర్వాలేదు. 475 00:26:39,434 --> 00:26:41,645 బాగా చేస్తున్నావు, కానీ నువ్వు ఇంకాస్త వేగంగా చేయాలి. 476 00:26:43,063 --> 00:26:45,482 బాగుంది. నువ్వు చేతులను అటూ ఇటూ అనేటప్పుడు నాణం కనిపించింది, 477 00:26:45,482 --> 00:26:46,566 కానీ ప్రాక్టీస్ చేయ్. 478 00:26:49,569 --> 00:26:51,821 ఇదేనా నువ్వు ఎంచుకొన్న కార్డ్? -కాదు. 479 00:26:51,905 --> 00:26:56,117 ప్రశాంతంగా, అలాగే ఆపకుండా చేయ్. అంతే. చాలా బాగా చేశావు. 480 00:26:56,910 --> 00:26:58,912 డైమండ్స్ రెండు? -సూపర్. 481 00:26:59,537 --> 00:27:01,289 సరే. నెమ్మదిగా చేయాలి. 482 00:27:03,124 --> 00:27:06,711 చూసుకో! -సూపర్. "అక్కుం బక్కుం". "అక్కుం బక్కుం". 483 00:27:06,795 --> 00:27:10,090 నీకు నిజంగానే అలా అనిపిస్తోందా? ఎందుకంటే, నేను సరిగ్గా చేసినట్టు నాకు అనిపించలేదు. 484 00:27:10,090 --> 00:27:13,468 చార్లీ, నిరుత్సాహపడిపోకు. మొదట్లో నాకు కూడా ఇలాగే అనిపించింది. 485 00:27:13,552 --> 00:27:15,804 ఒకరోజు సముద్ర తీరం వద్ద నేను, అమాండా షో చేస్తున్నాము, 486 00:27:15,804 --> 00:27:18,557 ఎప్పటిలాగే, ఎవరూ మమ్మల్ని చూడటం లేదు. 487 00:27:18,557 --> 00:27:20,850 అప్పుడు ఒక బామ్మ మా దగ్గరకు వచ్చి, 488 00:27:20,934 --> 00:27:23,687 తన మనవరాలి పెద్ద మనిషి వేడుకలో మమ్మల్ని మ్యాజిక్ చేయమని కోరింది. 489 00:27:23,687 --> 00:27:25,522 సన్నద్ధమవ్వడానికి మాకు ఒక రోజే సమయం ఉంది. 490 00:27:25,522 --> 00:27:26,815 మరి ఎలా చేశారు. 491 00:27:26,815 --> 00:27:28,817 సూపర్ గా చేశామని అయితే చెప్పను. -చచ్చానురా బాబోయ్. 492 00:27:28,817 --> 00:27:31,945 కానీ ఆ వేడుకలో ఇతరులకి నచ్చేంత బాగా అయితే చేశాం. 493 00:27:31,945 --> 00:27:35,198 ఆ వెంటనే, మరిన్ని పనులు రావడం మొదలయ్యాయి. నువ్వు కూడా సరైన పథంలోనే వెళ్తున్నావు. 494 00:27:36,616 --> 00:27:37,617 థ్యాంక్యూ. 495 00:27:38,618 --> 00:27:40,078 హ్యాపీ బర్త్ డే ఈథన్ 496 00:27:40,078 --> 00:27:42,789 లోపలికి రండి. చాలా సామాను తెచ్చుకున్నారే. 497 00:27:42,789 --> 00:27:45,834 ఇంత తక్కువ సమయంలో మీరు రాగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 498 00:27:45,834 --> 00:27:47,502 ఈథన్ అయితే ఎగిరి గంతేస్తాడు. 499 00:27:47,586 --> 00:27:52,924 నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నా... అసిస్టెంట్లు... 500 00:27:56,177 --> 00:27:59,139 నా అసిస్టెంట్లు ఏర్పాట్లు ఎక్కడ చేసుకోవచ్చో చెప్పరా? 501 00:27:59,139 --> 00:28:00,640 ఇక్కడే చేసుకోవచ్చు. 502 00:28:01,224 --> 00:28:02,642 అమ్మా? 503 00:28:02,726 --> 00:28:05,645 క్షమించండి. ఇప్పుడే వచ్చేస్తాను. 504 00:28:05,729 --> 00:28:08,148 హ్యాపీ బర్త్ డే 505 00:28:08,148 --> 00:28:10,525 చార్లీ, ఏమైంది? ఉన్నట్టుండి పరధ్యానం పట్టినట్టున్నావే. 506 00:28:11,568 --> 00:28:12,569 చూడండి. 507 00:28:17,866 --> 00:28:20,035 ఆలివర్. -అతనే దెయ్యమా? 508 00:28:20,035 --> 00:28:22,245 అసలు మనం పార్టీ చేసుకోకుండా ఉంటేనే మంచిదేమో. 509 00:28:22,329 --> 00:28:25,248 ఈథన్. మనం ఈ నెల అంతా చాలా విచారంగా గడిపాం, 510 00:28:25,332 --> 00:28:27,584 ఈ సమయంలో పార్టీ చేసుకుంటే మంచిది అనుకుంటా. 511 00:28:28,209 --> 00:28:30,003 కానీ నేను ఆలివర్ మామయ్యని మిస్ అవుతున్నా. 512 00:28:32,964 --> 00:28:33,965 ఆలివర్ మామయ్యనా? 513 00:29:29,479 --> 00:29:31,398 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య