1 00:00:06,091 --> 00:00:09,970 సిసామ్ వర్క్ షాప్ సమర్పణ 2 00:00:18,061 --> 00:00:19,646 ఇది భలేగా ఉంది. 3 00:00:21,773 --> 00:00:25,443 ఇప్పుడు మనకిది అవసరమా? మీరిద్దరూ అసలు ఇక్కడికి రాకూడదు. 4 00:00:26,027 --> 00:00:28,613 మనం త్వరగా తిరిగి వెళ్లకపోతే, ప్రమాదంలో పడతాం. 5 00:00:28,697 --> 00:00:30,407 మా నాన్న ప్రమాదంలో పడతాడు. 6 00:00:37,122 --> 00:00:38,123 సొరంగం! 7 00:00:40,333 --> 00:00:42,544 ఇది ఎక్కడికి వెళ్తుంది? 8 00:00:48,049 --> 00:00:49,509 ఏంటి చూస్తున్నావు? 9 00:00:50,051 --> 00:00:52,262 అడుగు జాడల కోసం. కానీ నాకేమీ కనిపించట్లేదు. 10 00:00:54,097 --> 00:00:56,141 ఏం చేద్దామంటావు? బొమ్మా బొరుసూ వేద్దామా? 11 00:00:57,100 --> 00:00:59,519 బొమ్మ పడితే మనం... అలా వెళ్దామా? 12 00:01:02,230 --> 00:01:03,648 నీ ఉద్దేశం నాణెమేగా? 13 00:01:08,320 --> 00:01:09,404 ఏంటది? 14 00:01:11,323 --> 00:01:13,909 బొరుసు పడితే మనం వెనుదిరిగి లైబ్రరీకి వెళ్లిపోవాలి. 15 00:01:36,097 --> 00:01:37,891 ఘోస్ట్ రైటర్ 16 00:01:39,017 --> 00:01:40,518 ఎందుకింత సేపు పడుతోంది? 17 00:01:41,353 --> 00:01:43,688 కెమెరా కన్ను పడని ఈ ప్రాంతంలో నేను రాత్రంతా గడపలేను బాబూ. 18 00:01:43,772 --> 00:01:45,482 నాకూ అలానే ఉంది. 19 00:01:46,524 --> 00:01:47,692 చివరికి. 20 00:01:48,860 --> 00:01:53,240 సరే. మరో ఐదు నిమిషాల్లో బయట కలుస్తానని మా నాన్నకు చెప్పాను. ఇక పదండి. 21 00:01:53,240 --> 00:01:55,992 ఆగండి. మనం ముందుగా లాగ్ బుక్ ని తనిఖీ చేయాలి. 22 00:01:56,701 --> 00:01:58,078 ఏంటి? అదేం వద్దు. 23 00:01:58,078 --> 00:02:01,748 ఈపీని దొంగిలించినవారు పెలికాన్ పెయింటింగ్ తోనే దాన్ని తీసుకుపోయారని మనకి తెలుసు. 24 00:02:01,748 --> 00:02:04,459 కాబట్టి దొంగ పేరును ఇట్టే కనుక్కోవచ్చు. దానికి ఒక్క క్షణం కూడా పట్టదు. 25 00:02:11,675 --> 00:02:14,511 చూస్తున్నా. చూస్తున్నా. 26 00:02:15,804 --> 00:02:16,930 అది ఇక్కడ లేదు. 27 00:02:17,639 --> 00:02:18,640 అది మంచిది కాదు. 28 00:02:19,224 --> 00:02:20,976 దాని కన్నా పెద్ద సమస్య ఉంది మనకి. 29 00:02:20,976 --> 00:02:24,312 ఇక్కడే కూర్చుంటే సొరంగాల్లోకి మనం ఎలా వెళ్తాం? 30 00:02:24,396 --> 00:02:26,648 పదండి వెళ్దాం. మా నాన్న నాకోసం చూస్తూ ఉంటాడు. 31 00:02:26,648 --> 00:02:28,024 మనం మళ్లీ తిరిగి వద్దాం. 32 00:02:28,108 --> 00:02:30,277 మనం రాలేం. ఇక్కడికి జనం రావడం నిషిద్ధం. 33 00:02:30,277 --> 00:02:31,570 అయితే మరేం చేద్దాం? 34 00:02:32,070 --> 00:02:34,197 మీ అమ్మ కుదుర్చుకున్న ప్రైవేట్ డిటెక్టివ్ కి చెబుదాం, 35 00:02:34,281 --> 00:02:35,907 ఆమె పరిష్కారం చూపిస్తుందేమో? 36 00:02:44,207 --> 00:02:45,625 ఇనుప జాలీ 37 00:02:47,002 --> 00:02:48,336 ఆలివర్. 38 00:02:48,420 --> 00:02:50,046 "ఇనుప జాలీ"? 39 00:02:51,965 --> 00:02:56,720 డ్రైనేజీ జాలీలాంటిదని అతని ఉద్దేశమేమో? సొరంగంలోకి వెళ్లడానికి దాన్నిపెట్టి ఉంటారు. 40 00:02:57,262 --> 00:02:58,805 వాటిని తెరుస్తావా? 41 00:02:59,431 --> 00:03:01,474 దానికి ప్రత్యేకమైన పనిముట్లు కావాలి కదా? 42 00:03:02,267 --> 00:03:04,185 హేయ్, సొరంగాల గురించి నాకు కొన్ని విషయాలు తెలుసు. 43 00:03:04,269 --> 00:03:06,229 పురాతన స్కూళ్లలో వాటిని ఉపయోగించేవారు. 44 00:03:07,230 --> 00:03:09,941 శీతాకాలంలో భవంతుల మధ్య నడిచేందుకు వాటిని వినియోగించేవారు. 45 00:03:10,025 --> 00:03:12,402 వాటిలో చాలావరకూ ఇప్పుడు మూసేశారు. ఎవరూ వాడటం లేదు. 46 00:03:12,402 --> 00:03:15,530 సమీర్. ఇలా వచ్చి నాకోసం ఇద్రిస్ ని చూస్తూ ఉండు. 47 00:03:15,614 --> 00:03:18,074 హాయ్, మిస్టర్ యూసుఫ్. -హాయ్, నియా, చార్లీ. 48 00:03:18,617 --> 00:03:20,368 దీని సంగతి మనం రేపు చూద్దాం. 49 00:03:20,911 --> 00:03:22,162 నేను వెళ్తా మరి. 50 00:03:22,746 --> 00:03:23,747 సరే అయితే. 51 00:03:33,131 --> 00:03:34,466 మన్నించాలి. 52 00:03:34,466 --> 00:03:37,844 హాయ్! నువ్వు నియా కదూ? ప్రెసిడెంట్ బార్న్స్ కూతురివి? 53 00:03:37,928 --> 00:03:39,012 అవును. 54 00:03:39,721 --> 00:03:42,224 మీ దగ్గర రోసా పార్కులపైన పుస్తకాలేమైనా ఉన్నాయా? 55 00:03:42,224 --> 00:03:43,558 ఉన్నాయి, రా. 56 00:03:45,477 --> 00:03:47,229 ఇవిగో. 57 00:03:47,229 --> 00:03:49,981 ఏదైనా ప్రత్యేకమైన పుస్తకం కోసం చూస్తున్నావా, లేక... 58 00:03:50,065 --> 00:03:51,650 లేదు, ఊరికే. 59 00:03:51,650 --> 00:03:54,110 ఏదైనా సాయం కావాలంటే పిలువు. 60 00:03:54,194 --> 00:03:55,195 థాంక్స్. 61 00:04:02,744 --> 00:04:04,704 రోసా పార్క్స్ 62 00:04:06,164 --> 00:04:10,085 నిన్ను కలవడం నాకూ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. 63 00:04:10,794 --> 00:04:12,963 నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. థాంక్యూ. బై! 64 00:04:13,880 --> 00:04:15,549 సిడ్, చెబితే నువ్వు నమ్మవు. 65 00:04:15,549 --> 00:04:18,050 ఆ పుట్టిన రోజు వేడుకలో మా ప్రదర్శన చూసిన ఒకరికి 66 00:04:18,134 --> 00:04:22,096 నా మ్యాజిక్ షో బాగా నచ్చిందట. నన్ను మళ్లీ ఒక ప్రదర్శన ఇవ్వమంటున్నారు! 67 00:04:22,180 --> 00:04:23,932 కంగ్రాట్స్! 68 00:04:23,932 --> 00:04:26,851 నా ప్రదర్శనను మరింత మెరుగుపరచుకోవాలి. 69 00:04:26,935 --> 00:04:29,271 మరిన్ని ట్రిక్కులు, జిమ్మిక్కులూ నేర్చుకోవాలి. 70 00:04:29,271 --> 00:04:31,189 వాటిని ఉంచేందుకు ఒక టేబుల్ కూడా అవసరం. 71 00:04:32,232 --> 00:04:33,525 రహస్య తలుపు ఉన్నదైతే బాగుంటుంది. 72 00:04:33,525 --> 00:04:36,319 అలాంటి టేబుల్ తయారుచేయడంలో నేను సాయపడతా. -నిజంగానా? 73 00:04:36,403 --> 00:04:38,238 క్యాంపస్ లో డిజైన్ వర్క్ షాప్ ని మనం వాడుకోవచ్చు. 74 00:04:38,238 --> 00:04:39,322 అది అద్భుతంగా ఉంటుంది! 75 00:04:39,406 --> 00:04:41,783 ఇక పైన ఏం పెడదామంటే... -సిడ్నీ? 76 00:04:42,659 --> 00:04:43,660 ఏయ్, ఆంబర్! 77 00:04:43,660 --> 00:04:46,746 నిన్న సైక్లింగ్ దారుణంగా ఉంది కదా? నా కాళ్లు ఇంకా నొప్పి పెడుతున్నాయి. 78 00:04:47,289 --> 00:04:48,582 నా పరిస్థితీ అలాగే ఉంది. 79 00:04:49,541 --> 00:04:52,794 నాతో లోపలికి వచ్చి కాఫీ తాగుతావా? 80 00:04:54,796 --> 00:04:56,506 ఇందులో సభ్యులకి మాత్రమే ప్రవేశం ఉందనుకుంటా కదా? 81 00:04:57,924 --> 00:04:59,676 నువ్వు నా అతిథివి. 82 00:05:02,971 --> 00:05:04,264 ఇప్పుడే వస్తా, సరేనా? 83 00:05:06,224 --> 00:05:07,893 కొత్త సభ్యులకు స్వాగతం 84 00:05:07,893 --> 00:05:09,269 హావ్తోర్న్ కు స్వాగతం. 85 00:05:12,188 --> 00:05:14,024 అక్కడే ఉండు. నీ పేరు నమోదు చేసి వస్తా. 86 00:05:21,948 --> 00:05:22,949 మొదటిసారా? 87 00:05:23,533 --> 00:05:24,910 అవును. 88 00:05:26,202 --> 00:05:27,203 నాకు కూడా. 89 00:05:31,082 --> 00:05:33,460 మనం ఈ కేండీ తీసుకుని తినొచ్చా? 90 00:05:34,794 --> 00:05:36,213 ఏమో మరి. 91 00:05:37,088 --> 00:05:38,256 వాటిని అలంకరణ కోసమే పెట్టారేమో? 92 00:05:48,683 --> 00:05:49,684 హలో. 93 00:05:51,269 --> 00:05:52,729 స్కూలుకి వెళ్లేముందు చదువుతున్నావా? 94 00:05:53,605 --> 00:05:55,106 లెక్కల్లో చాలా పెద్ద పరీక్ష ఉంది. 95 00:05:57,776 --> 00:05:58,777 నిన్ను చూస్తే గర్వంగా ఉంది. 96 00:05:58,777 --> 00:06:01,821 శరణార్థి శిబిరంలో స్కూలైనా కాస్త బాగుంటుందేమో, 97 00:06:01,905 --> 00:06:03,657 మనం ఇక్కడికి వచ్చాక నువ్వు ఎంతో కష్టపడ్డావు. 98 00:06:03,657 --> 00:06:06,201 కానీ ఇప్పుడు బాగా చదువుతున్నావు. -థాంక్యూ. 99 00:06:06,201 --> 00:06:09,079 నిన్న పుస్తకాల షాపులో నీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కూడా, 100 00:06:09,079 --> 00:06:10,455 మీరు చదువుతూనే ఉన్నారు కదా? 101 00:06:10,455 --> 00:06:12,332 మీరంతా చదువు పట్ల ఎంతో సీరియస్ గా ఉన్నారు. 102 00:06:13,625 --> 00:06:15,752 అవును... చదువుతున్నాం. 103 00:06:16,670 --> 00:06:17,712 నీకో సంగతి చెప్పాలి. 104 00:06:17,796 --> 00:06:19,714 ఇవాళ నా షిఫ్ట్ మారింది. 105 00:06:19,798 --> 00:06:23,093 నేను ఇద్రిస్ ని కాసేపాగి పార్క్ కి తీసుకెళ్తా. అందువల్ల నీకు కాస్త టైమ్ కలిసొస్తుంది. 106 00:06:24,261 --> 00:06:26,137 ఆ పని అయిపోయింది. దాని గురించి ఏం బాధపడొద్దు. 107 00:06:26,221 --> 00:06:27,264 అన్నింటికన్నా స్కూల్ ముఖ్యం. 108 00:06:42,195 --> 00:06:43,321 లేదు! నేను ఒప్పుకోను! 109 00:06:43,405 --> 00:06:46,032 నేను చాలా చిన్నవాణ్ని, నన్ను ఈ చెత్తలో పారేస్తారా! 110 00:06:53,790 --> 00:06:55,166 మాట్లాడే ఎలుక. 111 00:06:55,667 --> 00:06:59,546 ఏయ్, బుజ్జి ఎలుకా. ఏం కాదులే. 112 00:06:59,546 --> 00:07:01,923 ఎవరు నువ్వు? ఇంకో కుర్రాడు ఏడీ? 113 00:07:02,007 --> 00:07:03,800 మోటార్ సైకిల్ తో ఏం చేస్తున్నావు? 114 00:07:04,384 --> 00:07:07,929 మోటార్ సైకిలా? -నేను దాంతో సహా చెత్తబుట్టలో పడ్డా కదా. 115 00:07:08,013 --> 00:07:11,016 అది నా తప్పు కాదు. ఫోన్ మోగడంతో కంగారు పడి ఇందులో పడిపోయా. 116 00:07:11,016 --> 00:07:12,434 నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? 117 00:07:13,018 --> 00:07:15,520 మౌంటైన్ వ్యూ హోటల్. రూం 215లో. 118 00:07:16,354 --> 00:07:19,482 బహుశా ఈ చెత్తను వారు అక్కడినుంచే తెచ్చి ఉంటారు. 119 00:07:19,566 --> 00:07:21,776 సమీర్! మనం బయల్దేరాలి! 120 00:07:23,236 --> 00:07:24,362 హేయ్, మిత్రమా! 121 00:07:24,446 --> 00:07:25,906 నన్ను దీంట్లోంచి బయటకు తీస్తావా? 122 00:07:26,615 --> 00:07:27,824 ఒక్క క్షణం! 123 00:07:28,658 --> 00:07:29,659 నీ పేరేంటి? 124 00:07:30,243 --> 00:07:31,244 రాల్ఫ్. 125 00:07:31,828 --> 00:07:33,580 రాల్ఫ్. నా పేరు సమీర్. 126 00:07:34,289 --> 00:07:38,919 చూడు, నేను స్కూలు నుంచి వచ్చేంతవరకూ నువ్వు ఈ గదిలోనే ఉండాలి, సరేనా? 127 00:07:38,919 --> 00:07:40,253 మరి నేనేం తినాలి? 128 00:07:45,926 --> 00:07:47,093 ఇది తిను. 129 00:07:48,637 --> 00:07:49,638 ఇంకొకటి ఇవ్వొచ్చుగా? 130 00:07:52,474 --> 00:07:55,602 ఇందాక నన్ను పట్టుకొని బయటకు తీయనందుకు థ్యాంక్స్. 131 00:07:56,519 --> 00:07:59,773 చెత్తబుట్టలోంచి నా అంతట నేనుగా ఠీవిగా, దర్జాగా బయటకు నడుచుకుంటూ 132 00:08:00,440 --> 00:08:02,567 వచ్చే అవకాశం ఇచ్చావు కదా. 133 00:08:03,068 --> 00:08:06,905 సమీర్, నువ్వు నాకు నచ్చావు. 134 00:08:07,489 --> 00:08:08,657 సమీర్! 135 00:08:09,574 --> 00:08:10,575 నేను వెళ్లాలి. 136 00:08:12,577 --> 00:08:13,620 వస్తున్నా. 137 00:08:23,880 --> 00:08:24,881 ఇది ఖాళీగా ఉంది. 138 00:08:25,715 --> 00:08:28,301 సమీర్ నాకు మెసేజ్ పంపిన వెంటనే తెలిసింది. ఇంకేం అయి ఉంటుంది? 139 00:08:28,385 --> 00:08:29,427 బెవర్లీ క్లియరీ 140 00:08:29,511 --> 00:08:32,514 "మౌస్ అండ్ ద మోటార్ సైకిల్". -ఎలుక లేకుండా. 141 00:08:33,056 --> 00:08:35,933 ఈ పుస్తకమంటే నాకు భలే ఇష్టం. బెవర్లీ క్లియరీ నిజంగా మేధావి. 142 00:08:37,226 --> 00:08:40,480 ఇదిగో, నాక్కూడా ఓ పుస్తకం దొరికింది. ఇక చదవడం మొదలెట్టవచ్చు. 143 00:08:41,481 --> 00:08:42,649 ఇది దేని గురించి? 144 00:08:43,275 --> 00:08:45,902 హోటల్ గదిలో నివసించే రాల్ఫ్ అనే ఎలుక గురించి. 145 00:08:45,986 --> 00:08:48,572 అతని తల్లికి అతని గురించి బెంగ, అందుకనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. 146 00:08:48,572 --> 00:08:50,198 కానీ అతనేమో ఏవో సాహసాలు చేయాలని అనుకుంటూ ఉంటాడు. 147 00:08:50,282 --> 00:08:53,285 అతని దగ్గర ఓ మోటార్ సైకిల్ ఉంటుంది కదా? 148 00:08:53,285 --> 00:08:56,830 అవును. అదొక బొమ్మ. కానీ దాని ఇంజన్ సౌండ్ చేయడం ద్వారా తను దానికి జీవం పోశాడు. 149 00:08:56,830 --> 00:08:58,206 "వ్రూమ్ వ్రూమ్" లాగా. 150 00:09:00,959 --> 00:09:04,504 సొరంగాలను అన్వేషించడంలో మనకు సాయపడతాడనే ఉద్దేశంతో రాల్ఫ్ ని అలివర్ విడుదల చేసి ఉంటాడు. 151 00:09:04,588 --> 00:09:06,172 ఇనుప జాలీలోంచి తను వెళ్లగలుగుతాడు. 152 00:09:06,256 --> 00:09:08,717 నేనూ అదే అనుకుంటున్నా. నువ్వు మోటార్ సైకిల్ తీసుకొచ్చావా? 153 00:09:09,259 --> 00:09:11,887 తీసుకొచ్చా. ఇదిగో! 154 00:09:11,887 --> 00:09:15,140 నమూనాలు తయారు చేసే నాకు ఏదో మంచి జరగబోతోందన్నమాట. 155 00:09:15,140 --> 00:09:17,726 చూడు. ఈ బుజ్జి ఎలుకకి నేనొక హెల్మెట్ కూడా తయారు చేశాను. 156 00:09:20,478 --> 00:09:25,901 అయితే ఈ సొరంగాలను పరిశోధించి ఆ నేరస్థుడు ఎలా పారిపోయాడో నేను చెప్పాలి, అంతేకదా? 157 00:09:25,901 --> 00:09:30,113 అవును, నువ్వు మాకు ఈ సాయం చేసి పెడితే, నీకొక బహుమతి ఇస్తాను. 158 00:09:30,113 --> 00:09:31,698 ఏంటది? వెన్నా? 159 00:09:32,324 --> 00:09:34,326 వెన్న కంటే గొప్ప బహుమతి. 160 00:09:34,326 --> 00:09:35,911 అదేంటో మరి. 161 00:09:35,911 --> 00:09:37,245 హేయ్, సమీర్. -ఏయ్. 162 00:09:37,329 --> 00:09:39,080 ఫ్రెండ్స్, రండి. 163 00:09:39,164 --> 00:09:42,459 నియా, చార్లీ. ఇతను రాల్ఫ్. 164 00:09:43,793 --> 00:09:45,253 నువ్వు భలే ముద్దుగా ఉన్నావు. 165 00:09:45,337 --> 00:09:48,215 అది నీ మోటార్ సైకిలా? -అవును. 166 00:09:48,215 --> 00:09:51,343 అదె ఎలా మెరిసిపోతుందో చూశావా? ఎంత అందంగా ఉందో! 167 00:09:51,343 --> 00:09:52,761 నడుపుతావా? 168 00:09:53,637 --> 00:09:56,765 తప్పకుండా, అదేం... పర్లేదు. 169 00:09:59,601 --> 00:10:01,978 గ్రిప్స్ బాగున్నాయి. లీవర్లు కూడా బాగానే పనిచేస్తున్నాయి. 170 00:10:02,520 --> 00:10:06,816 నాకు ఎరుపు రంగు ఇష్టం, కానీ ఇది కూడా బాగానే ఉంది. 171 00:10:07,943 --> 00:10:10,445 సరే, సమీర్! అర్థమైంది కదా! 172 00:10:10,445 --> 00:10:13,531 వెన్న కంటే ఇది పెద్ద బహుమతే! నాకు ఓకే! 173 00:10:13,615 --> 00:10:14,658 థాంక్స్ రాల్ఫ్. 174 00:10:15,659 --> 00:10:17,994 సరే. వెళ్లు. అలా నడిపి తీసుకురా. 175 00:10:18,828 --> 00:10:21,456 దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో నాకు తెలియదు. 176 00:10:21,456 --> 00:10:22,958 అదేం పెద్ద విషయం కాదు. 177 00:10:22,958 --> 00:10:27,587 బైక్ ని స్టార్ట్ చేయడం చాలా ఈజీ. నువ్వు శబ్దం చేస్తే చాలు. 178 00:10:28,088 --> 00:10:29,589 "వ్రూమ్ వ్రూమ్" లాగా. 179 00:10:30,257 --> 00:10:31,758 అది కారు శబ్దంలా ఉంది. 180 00:10:32,300 --> 00:10:33,677 బహుశా ఇలా ఉంటుందేమో... 181 00:10:35,428 --> 00:10:37,180 నువ్వేమైనా రాకాసి బల్లివా? 182 00:10:38,265 --> 00:10:40,100 ఆగు. నేను చూస్తాలే. 183 00:10:40,100 --> 00:10:41,560 మోటార్ సైకిల్ మాన్యువల్ లో... 184 00:10:43,770 --> 00:10:45,105 చూద్దాం. 185 00:10:46,606 --> 00:10:48,441 మోటార్ సైకిల్ మాన్యువలా? 186 00:10:48,525 --> 00:10:49,526 దొరికింది. 187 00:10:54,864 --> 00:10:56,199 మళ్లీ అను. 188 00:10:57,534 --> 00:10:59,744 అది సంగీతంలా ఉంది. విన్నావా? 189 00:11:00,412 --> 00:11:03,665 రహదారిలో దూసుకుపోతా. సుదూర ప్రయాణాలు, సాహసాలు చేస్తా. 190 00:11:03,665 --> 00:11:06,001 గాలి వేగానికి మీసాలు ఎగరడం! 191 00:11:06,626 --> 00:11:09,296 మాన్యువల్ ని ఎవరు రాశారో గానీ వాడు కవి అయి ఉంటాడు! 192 00:11:13,425 --> 00:11:14,509 ఓకే. 193 00:11:18,221 --> 00:11:19,472 ఇది పనిచేస్తోంది! 194 00:11:19,556 --> 00:11:22,350 ఇప్పుడు మనం ఇనుప జాలీని కనుక్కోవాలి. 195 00:11:22,434 --> 00:11:25,979 అందుకోసం నావద్ద ఒక ఐడియా ఉంది, కానీ అది కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. 196 00:11:25,979 --> 00:11:30,442 నా అపార్టుమెంటులో ఒక ఎలుక మోటార్ సైకిల్ నడుపుతోంది. 197 00:11:31,568 --> 00:11:34,321 అవును, "ఎబ్బెట్టు"గా ఉన్నా నేను లెక్క చేయను. 198 00:11:37,782 --> 00:11:39,367 ఏంటి ఆలోచిస్తున్నావు? 199 00:11:39,451 --> 00:11:42,329 అక్కడ తప్పకుండా సొరంగం ఉండే ఉంటుంది. 200 00:11:43,330 --> 00:11:44,664 లైబ్రరీకి పక్కనే. 201 00:11:44,748 --> 00:11:46,249 వావ్! భలే! 202 00:11:47,500 --> 00:11:49,252 నా బొమ్మ టీవీ న్యూస్ కెమెరాని కూడా తెచ్చాను. 203 00:11:50,879 --> 00:11:55,926 అయితే రాల్ఫ్ దాన్ని పనిచేసేలా చేసి, సొరంగంలోకి వెళ్లి, మనకోసం షూట్ చేసి తీసుకు రమ్మని చెబుదామా? 204 00:11:55,926 --> 00:11:58,970 మీ ప్లాన్ లో మోటార్ సైకిల్ కూడా ఉంది కదా? 205 00:11:59,054 --> 00:12:01,765 ఉంది. కెమెరాని హెల్మెట్ కి అంటించు. 206 00:12:03,308 --> 00:12:05,727 ఇప్పుడు అసలైనది బయటకు తీస్తున్నా. 207 00:12:06,645 --> 00:12:08,897 చిన్నప్పుడు నేను వ్యోమగామిని కావాలనుకున్నాను. 208 00:12:08,897 --> 00:12:12,567 అందుకు నా తల్లిదండ్రులు ముచ్చటపడి ఈ మిషన్ కంట్రోల్ సెంటర్ ను కట్టించి ఇచ్చారు. 209 00:12:13,151 --> 00:12:14,152 బాగుంది. 210 00:12:15,779 --> 00:12:18,615 రాల్ఫ్ ని కనిపెట్టేందుకు ఈ స్క్రీన్ జిపిఎస్ లా పనిచేస్తుందనుకుంటా. 211 00:12:18,615 --> 00:12:21,159 చార్లీ కెమెరా నుంచి వచ్చిన ఫీడ్ ఇక్కడ ప్లే అవుతుంది. 212 00:12:21,243 --> 00:12:22,994 ఇక, మోటార్ సైకిల్ మాన్యువల్ లో, 213 00:12:23,078 --> 00:12:25,580 బొమ్మ వాహనాలకు ఎలా జీవం పోయాలో మాత్రమే వివరించారు. 214 00:12:26,081 --> 00:12:28,416 కానీ రాల్ఫ్ ఆ పని చేయగలిగినప్పుడు... 215 00:12:28,500 --> 00:12:31,044 దీనికి కూడా తను జీవం పోయగలడనే అనుకుంటున్నాను. 216 00:12:31,044 --> 00:12:32,921 సరే, ఇది ఎలాంటి శబ్దాలు చేస్తుంది? 217 00:12:32,921 --> 00:12:35,632 నా చిన్నప్పుడు నేను "బూప్, బూప్, బీప్" అని అంటూ ఉండేదాన్ని. 218 00:12:37,300 --> 00:12:40,804 బీప్, బీప్ బీప్, బూప్, బీప్? 219 00:12:41,972 --> 00:12:43,390 బీప్... -నమ్మలేకపోతున్నా! 220 00:12:43,390 --> 00:12:46,059 ఇది పనిచేస్తోంది! -నా కెమెరాలోంచి వచ్చిన వీడియో! 221 00:12:46,059 --> 00:12:48,645 బీప్, బూప్, బీప్ బీప్, బా-డూ, బీప్ 222 00:12:48,645 --> 00:12:49,771 బీప్, బూప్ 223 00:12:50,772 --> 00:12:52,482 మ్యాప్ లో చూడు! 224 00:12:52,566 --> 00:12:54,317 మనం ఇప్పుడున్నది అక్కడే! 225 00:12:54,401 --> 00:12:59,281 నా జీవితం మొత్తం మౌంటైన్ వ్యూ హోటల్ లోని 215 నంబర్ గదిలోనే గడిచిపోయింది. 226 00:12:59,281 --> 00:13:01,324 హాల్ ఎలా ఉంటుంది? 227 00:13:01,408 --> 00:13:04,244 మెట్లు ఎలా ఉంటాయి? పార్కింగ్ ప్రదేశం ఎలా ఉంటుంది? అని అనుకుంటూ ఉండేవాణ్ని. 228 00:13:04,244 --> 00:13:07,497 నేను ఇంతకాలం వేచి చూస్తున్నది ఇలాంటి సాహస కృత్యం కోసమే! 229 00:13:09,958 --> 00:13:12,002 ఇదిగో వెళ్తున్నా! -ఆగు! రాల్ఫ్! నేను తాడు తెచ్చా... 230 00:13:13,128 --> 00:13:14,254 నిన్ను జాగ్రత్తగా కిందకు దించడానికి. 231 00:13:25,140 --> 00:13:26,641 స్క్రీచ్! 232 00:13:26,725 --> 00:13:28,184 రాల్ఫ్, నీకేం కాలేదు కదా? 233 00:13:28,810 --> 00:13:30,270 నేను చెప్పాను కదా. 234 00:13:30,270 --> 00:13:32,314 వావ్! ఇది నిజంగా భలేగా ఉంది! 235 00:13:37,193 --> 00:13:38,445 ఓకే. ఓకే. 236 00:13:43,116 --> 00:13:44,451 స్క్రీచ్! 237 00:13:44,451 --> 00:13:47,996 సిగ్నల్ పోయింది! మనం బయల్దేరాలి. 238 00:13:48,872 --> 00:13:50,123 హలో? 239 00:13:50,707 --> 00:13:51,791 హలో? 240 00:13:52,834 --> 00:13:54,419 స్క్రీచ్! 241 00:13:55,879 --> 00:13:57,547 ఇక ముందుకు దారి లేదు. 242 00:13:58,381 --> 00:14:01,635 సిగ్నల్ మళ్లీ వచ్చింది. ఇంతకి రాల్ఫ్ ఎక్కడ? 243 00:14:02,135 --> 00:14:04,971 ఇది ఎడిసన్ భవంతిలా ఉందే? 244 00:14:05,722 --> 00:14:07,974 దీన్ని మన మ్యాప్ కి జోడిస్తా. -నాకు అర్థం కాట్లేదు. 245 00:14:08,058 --> 00:14:11,561 ఈ సొరంగాలన్నీ క్యాంపస్ కే దారి తీస్తున్నట్లుగా ఉంది. కానీ చివర్లో అన్నీ మూసేసి ఉన్నాయి. 246 00:14:11,645 --> 00:14:14,189 మరి దొంగ ఎక్కడికి పోయినట్లు? 247 00:14:14,189 --> 00:14:15,899 మనం వెతుకుతూనే ఉండాలి. 248 00:14:16,566 --> 00:14:18,401 ఏయ్, నా బండిలో పెట్రోల్ ఎక్కువ లేదు. 249 00:14:18,944 --> 00:14:21,696 బైక్ లో పెట్రోల్ లేదంటే ఏంటి అర్థం? 250 00:14:21,780 --> 00:14:23,531 నాకు ఆకలి వేస్తోంది! 251 00:14:25,617 --> 00:14:28,203 వెన్నలో వేసిన వేరుసెనగలు, జెల్లీ శాండ్విచ్ అతనికి ఇష్టమని పుస్తకంలో ఉంది. 252 00:14:29,663 --> 00:14:30,789 మేం పెడతాంలే, రాల్ఫ్. 253 00:14:34,584 --> 00:14:35,919 బాబోయ్! 254 00:14:35,919 --> 00:14:39,130 నేను ఇంతకుముందు బ్రెడ్ ముక్కలు, వేరుసెనగ పప్పులు తిన్నాను. 255 00:14:39,214 --> 00:14:42,008 పాడైపోయిన స్ట్రాబెర్రీలలో నంచుకుంటూ తిన్నా. 256 00:14:42,092 --> 00:14:43,885 కానీ ఇది ఎంతో బాగుంది! 257 00:14:44,761 --> 00:14:45,804 సమీర్. 258 00:14:45,804 --> 00:14:49,599 లెక్కల పరీక్షకోసం ఎంతో కష్టపడుతున్నావని మీ నాన్న చెప్పారు. 259 00:14:49,683 --> 00:14:50,767 అవును. 260 00:14:50,767 --> 00:14:54,688 రేపు నీకు ఇంకాస్త టైమ్ కావాలంటే, ఇద్రిస్ సంగతి నేను చూసుకుంటానులే. 261 00:14:56,773 --> 00:14:58,149 నీకు ఆఫీసు ఉందిగా? 262 00:14:58,233 --> 00:14:59,234 రేపు నాకు సెలవు. 263 00:14:59,234 --> 00:15:01,695 నేను ఎలాగూ రేపు బిల్లులు కట్టాలి. 264 00:15:01,695 --> 00:15:03,321 నేను చూసుకుంటానులే. 265 00:15:04,406 --> 00:15:05,740 నీపై నువ్వు దృష్టి పెట్టు, సరేనా? 266 00:15:15,834 --> 00:15:16,877 బాగానే ఉన్నావుగా? 267 00:15:17,627 --> 00:15:19,296 మా అమ్మ చెప్పిన లెక్కల పరీక్ష... 268 00:15:20,380 --> 00:15:21,715 నేను ముందే రాసేశాను. 269 00:15:21,715 --> 00:15:23,091 మరి ఫెయిలయ్యావా? 270 00:15:23,091 --> 00:15:24,885 లేదు. "ఏ" గ్రేడ్ వచ్చింది. 271 00:15:25,468 --> 00:15:27,178 అయితే ఆవిడతో అబద్ధం చెప్పావేం? 272 00:15:27,262 --> 00:15:29,764 నియా, చార్లీ నాకు స్నేహితులయ్యాక, 273 00:15:30,682 --> 00:15:33,101 ఈ మిస్టరీని ఛేదించేందుకు పనిచేయడం మొదలుపెట్టాక, 274 00:15:34,311 --> 00:15:38,315 నా తమ్ముడిపైగానీ, నా పనులపై గానీ శ్రద్ధ పెట్టేందుకు సమయం దొరకట్లేదు. 275 00:15:39,566 --> 00:15:41,735 అయినా నేను ఎవరి సహాయం అడగలేదు. 276 00:15:41,735 --> 00:15:43,737 నా తల్లిదండ్రులు నాకోసం ఎంతో చేస్తున్నారు. 277 00:15:43,737 --> 00:15:46,865 వాళ్లని అడగటం ఎలా ఉంటుందో నాకు తెలుసు. 278 00:15:46,865 --> 00:15:48,366 మా అమ్మ నాకోసం ఎంతో బాధపడుతూ ఉంటుంది. 279 00:15:48,450 --> 00:15:51,745 అందుకనే మోటార్ సైకిల్ మాట మా అమ్మ ముందు నేను ఎప్పుడూ ఎత్తలేదు. 280 00:15:51,745 --> 00:15:54,831 ఇవాళ రాత్రి పుస్తకాల షాపు మూసేశాక, దాని చుట్టూ కొన్ని రౌండ్లు 281 00:15:54,915 --> 00:15:55,999 కొట్టనా? 282 00:15:56,625 --> 00:15:58,585 వద్దు, నీకు విశ్రాంతి కావాలి. 283 00:15:59,377 --> 00:16:01,796 రేపు నువ్వు మోటార్ సైకిల్ చాలాసేపు నడపాల్సి ఉంటుంది. 284 00:16:09,012 --> 00:16:11,723 నియా, ఇతను మాల్కం టర్నర్. 285 00:16:11,723 --> 00:16:14,351 క్యాంపస్ లో నల్లజాతి విద్యార్థుల యూనియన్ కి అధ్యక్షుడు. 286 00:16:15,644 --> 00:16:17,145 నిన్ను ఆ పుస్తకాల షాపు దగ్గర చూశాను. 287 00:16:17,229 --> 00:16:19,481 చార్లీ, సమీర్ నీ స్నేహితులు కదా? 288 00:16:19,481 --> 00:16:20,565 అవును. 289 00:16:21,483 --> 00:16:24,861 ఏం జరిగిందో మీ అమ్మ నాకు చెప్పారు. 290 00:16:25,654 --> 00:16:27,155 నీకు అలాంటి పరిస్థితి ఎదురైనందుకు బాధగా ఉంది. 291 00:16:27,822 --> 00:16:30,325 ఆ దుకాణాన్ని నిషేధించాలని కోరుతూ క్యాంపస్ వద్ద నువ్వు నిరసన ప్రదర్శన 292 00:16:30,325 --> 00:16:32,786 చేయాలని అనుకుంటున్నావని కూడా ఆమె చెప్పారు. 293 00:16:32,786 --> 00:16:34,246 అవును. మీరేమంటారు? 294 00:16:36,831 --> 00:16:38,333 అసలు నీ ఉద్దేశమేమిటో తెలుసుకోవచ్చా? 295 00:16:38,917 --> 00:16:42,003 అంటే, ఆ దుకాణం యజమాని నీకు క్షమాపణ చెప్పాలనా? 296 00:16:42,712 --> 00:16:45,507 లేకపోతే జాత్యహంకారంతో మాట్లాడబోనని నీతో ఒక ఒప్పందం చేసుకోవాలనా? 297 00:16:46,383 --> 00:16:48,176 అతని దుకాణాన్ని మూయించాలనా? 298 00:16:49,553 --> 00:16:52,222 నిజానికి, ఇలాంటిది మరొకరికి జరగకూడదనేది నా ఉద్దేశం. 299 00:16:52,722 --> 00:16:53,932 భద్రత ఉందనే ధైర్యం నాకు కావాలి. 300 00:16:55,058 --> 00:16:55,892 అవును. 301 00:16:57,435 --> 00:17:00,689 చూడబోతే, నీకు ఏదో పెద్ద లక్ష్యమే ఉన్నట్లుగా కనబడుతోంది. 302 00:17:01,481 --> 00:17:02,482 అవునా? 303 00:17:04,316 --> 00:17:06,319 నువ్వు ఈ రోసా పార్క్స్ పుస్తకం చదువుతున్నట్టున్నావు. 304 00:17:08,446 --> 00:17:11,199 నీకు తెలుసా, మోంటోమేరీ బస్సు బహిష్కారం, తనను సీట్లోంచి లేవమని 305 00:17:11,283 --> 00:17:13,034 డ్రైవర్ అన్నందుకు మొదలైన సంఘటన కాదు. 306 00:17:13,118 --> 00:17:14,369 అతను చెప్పింది నిజమే. 307 00:17:14,369 --> 00:17:17,497 అది ఒక నగరానికి, ఒక వ్యవస్థకు, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా జరిగిన సంఘటన. 308 00:17:17,581 --> 00:17:20,583 బస్సులాంటి సమాజంలో నల్లజాతి ప్రజలను వెనక కూర్చోబెట్టే వర్ణ వివక్ష, 309 00:17:20,667 --> 00:17:23,587 పద్ధతులనూ, చట్టాలనూ నిరసిస్తూ జరిగిన ఉద్యమం అది. 310 00:17:23,587 --> 00:17:24,713 నిజం. 311 00:17:24,795 --> 00:17:28,382 కాబట్టి, నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఒక వ్యక్తిపై పోరాడతావా 312 00:17:28,967 --> 00:17:30,302 లేక వ్యవస్థపై పోరాడతావా అని. 313 00:17:33,722 --> 00:17:34,723 రెండింటిపైనా ఎందుకు కాకూడదు? 314 00:17:36,099 --> 00:17:38,101 ఒప్పందం గురించి ఇందాకా మీరు మాట్లాడారు కదా? 315 00:17:38,101 --> 00:17:41,146 ఒక ఒప్పందంపై వ్యాపారుల చేత సంతకం చేయించుకుంటే ఎలా ఉంటుంది? 316 00:17:41,771 --> 00:17:44,733 ఉదాహరణకు వర్ణ వివక్ష ప్రతిజ్ఞ చేయడం. 317 00:17:45,483 --> 00:17:47,736 అప్పుడు, జనానికి తాము ఎక్కడ షాపింగ్ చేయాలో తెలుస్తుంది. 318 00:17:48,570 --> 00:17:52,073 ఈ ఒప్పందంపై ఒక దుకాణం యజమాని సంతకం చేయకపోతే, జనం సొంతంగా అతన్ని బహిష్కరిస్తారు. 319 00:17:54,075 --> 00:17:55,076 వావ్. 320 00:17:55,577 --> 00:17:58,038 నియా, నీ ఆలోచనావిధానం నాకు నచ్చింది. 321 00:17:58,038 --> 00:18:00,373 ఈ వ్యాపార యజమానులకు పిల్లలు ఉంటే గనక, 322 00:18:00,457 --> 00:18:02,125 వాళ్లు నిజంగానే మన మాట వింటారు. 323 00:18:02,125 --> 00:18:04,461 ఈ మాట అందరికీ తెలిసేందుకు నీ స్నేహితుల సహయం తీసుకోవచ్చు. 324 00:18:04,461 --> 00:18:05,545 డాక్టర్ బార్న్స్? 325 00:18:06,963 --> 00:18:08,757 నీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. 326 00:18:13,845 --> 00:18:15,680 రహస్య తలుపుకి ఇది ఎలా ఉంటుంది? 327 00:18:15,764 --> 00:18:17,891 ఒకసారి కట్ చేస్తే, ఇక వెనుకంజ వేయకూడదు. 328 00:18:17,891 --> 00:18:20,852 లేకపోతే, దీన్ని మరోచోటికి మారిస్తే... -ఆగు. 329 00:18:23,855 --> 00:18:25,357 సిడ్, ఏంటి నువ్వు! 330 00:18:25,357 --> 00:18:28,777 సరే, సరే. క్షమించు, నాకు ఇక్కడ ఒక స్నేహితురాలు దొరికింది. 331 00:18:28,777 --> 00:18:32,113 బాగుంది. నువ్వు రేపు ఆమెను సైక్లింగ్ లో కలవవచ్చుగా. 332 00:18:35,533 --> 00:18:37,285 హాయ్. -హాయ్. 333 00:18:37,786 --> 00:18:39,079 ఏం చేస్తున్నారు? 334 00:18:39,079 --> 00:18:41,539 నా మ్యాజిక్ ప్రదర్శన కోసం టేబుల్ చేస్తున్నాం. 335 00:18:42,624 --> 00:18:43,625 బాగుంది. 336 00:18:47,045 --> 00:18:50,423 నేను కొన్ని క్యాండీలను పట్టుకొచ్చా. 337 00:18:51,758 --> 00:18:52,926 నేను ఎవరికీ చెప్పనులే. 338 00:18:53,802 --> 00:18:56,638 నాకు ఆర్ట్ ప్రాజెక్ట్ పని ఉంది, వెళ్తాను. మళ్లీ కలుద్దాం. 339 00:19:03,728 --> 00:19:05,730 సూపర్. మళ్లీ ఆమెకు మెసేజ్ చెయ్యి. 340 00:19:14,948 --> 00:19:15,949 జెమీమీ బూలెవార్డ్ 341 00:19:15,949 --> 00:19:17,158 మిడ్ నైట్ ఇన్ నైన్త్ అవెన్యూ 342 00:19:24,541 --> 00:19:25,625 ఏయ్! 343 00:19:28,795 --> 00:19:30,338 స్క్రీచ్! 344 00:19:34,175 --> 00:19:35,260 కుకీలు! 345 00:19:35,260 --> 00:19:36,761 స్క్రీచ్! 346 00:19:36,845 --> 00:19:37,846 చివీ చాక్లెట్ చిప్ 347 00:19:43,101 --> 00:19:44,561 నువ్వు అవి తినకూడదు. 348 00:19:45,520 --> 00:19:47,147 మనుషులు చూస్తారు. 349 00:19:47,147 --> 00:19:50,191 దీన్ని వృథాగా పారేయడంలో అర్థం లేదు, కదా? 350 00:19:50,275 --> 00:19:53,528 నీ బైక్ చాలా బాగుంది. నా పేరు రోసీ. 351 00:19:53,612 --> 00:19:54,988 నా పేరు రాల్ఫ్. 352 00:19:54,988 --> 00:19:56,573 నువ్వెక్కడినుంచి వచ్చావు? 353 00:19:56,573 --> 00:19:58,742 కాలిఫోర్నియాలోని మౌంటైన్ వ్యూ హోటల్ నుంచి. 354 00:19:59,409 --> 00:20:03,371 కాలిఫోర్నియా? నువ్వేదో సాహస యాత్ర చేస్తున్నట్టున్నావు కదూ? 355 00:20:03,455 --> 00:20:04,915 అవును. చేస్తున్నాను. 356 00:20:04,915 --> 00:20:07,125 మిగతా వాళ్లని కూడా కలుద్దామా? 357 00:20:15,050 --> 00:20:17,052 అందరూ రండి! వచ్చి రాల్ఫ్ ను కలుసుకోండి. 358 00:20:17,052 --> 00:20:18,803 నీకు ఆ బైక్ ఎక్కడిది? -అది అసలుదేనా? 359 00:20:18,887 --> 00:20:20,013 అది ఎంత వేగంగా వెళ్తుంది? 360 00:20:20,013 --> 00:20:22,724 దాన్ని నడపడం నీకెలా వచ్చు? -నిశ్శబ్దం! 361 00:20:25,435 --> 00:20:26,978 నువ్వే. 362 00:20:27,062 --> 00:20:29,814 నువ్వు మనుషులతో కలసి మెలసి తిరుగుతున్నావు కదూ? 363 00:20:30,398 --> 00:20:34,569 కొందరు పిల్లలతో మాత్రమే. -ఆ మోటార్ సైకిల్ పై తిరుగుతూ అలా అరవకు. 364 00:20:34,653 --> 00:20:36,571 మా గురించి అందరికీ తెలిసిపోతుంది. 365 00:20:37,781 --> 00:20:39,741 సరదా కోసమే! 366 00:20:39,741 --> 00:20:42,744 నేను అసలు యువకుని దశని అనుభవించలేదని 367 00:20:42,744 --> 00:20:48,083 ఎప్పడూ మోటార్ సైకిలెక్కి, సాహసాలు చేయలేదని అనుకుంటున్నట్టున్నావు. 368 00:20:48,875 --> 00:20:50,835 నీకొకటి చూపిస్తా. 369 00:20:50,919 --> 00:20:54,923 నేను నీ వయసులో ఉండగా ఒక మనిషి పన్నిన వలలో పడిన ఫలితమిది. 370 00:20:55,423 --> 00:20:57,092 బాగా చూడు! 371 00:20:58,718 --> 00:21:02,722 ఈ ఎలుకల కాలనీలో, అన్నింటి కన్నా నా వయస్సే ఎక్కువ, దాని కారణం ఏమనుకుంటున్నావు? 372 00:21:02,806 --> 00:21:04,724 నేను నా కంతకే పరిమితమయ్యాను. 373 00:21:04,808 --> 00:21:06,977 నువ్వూ అలాగే చేయమని నా సలహా. 374 00:21:06,977 --> 00:21:09,354 రాల్ఫ్? రాల్ఫ్? 375 00:21:10,021 --> 00:21:11,147 రాల్ఫ్, వెళ్లకు. 376 00:21:11,231 --> 00:21:12,941 సమీర్! ఇక్కడ! 377 00:21:12,941 --> 00:21:16,653 ఏం చేస్తున్నావు? ఈ రాత్రి బైక్ నడపవద్దన్నాను కదా. 378 00:21:16,653 --> 00:21:17,737 అబ్బా, నా మాట విను! 379 00:21:17,821 --> 00:21:19,698 హాయిగా ఝామ్మంటూ తిరగకపోతే 380 00:21:19,698 --> 00:21:22,576 మోటార్ సైకిల్ ఉండి ఏం లాభం? 381 00:21:22,576 --> 00:21:25,745 నీకు మోటార్ సైకిల్ లేదు. ఇది చార్లీది. 382 00:21:26,246 --> 00:21:28,915 నేను చెప్పిన మాట వినకపోతే, దీన్ని వెనక్కి తీసేసుకుంటాను. 383 00:21:29,874 --> 00:21:32,168 ఇక పద. పడుకుందాం. 384 00:21:38,592 --> 00:21:40,969 విలేజ్ బుక్స్ 385 00:21:59,112 --> 00:22:00,280 ఇది భలేగా ఉంది. 386 00:22:00,280 --> 00:22:01,364 వర్ణ వివక్షపై పోరాడండి 387 00:22:01,448 --> 00:22:03,074 అమ్మా నాన్నతో మాట్లాడతాను, తప్పక సంతకం చేస్తారు. 388 00:22:03,158 --> 00:22:07,162 నేను మా హార్డ్ వేర్ స్టోర్ వాళ్లతోనూ, మా పెయింట్ పంపిణీదారుతోనూ మాట్లాడతా. 389 00:22:07,162 --> 00:22:08,914 సమీర్, మాతో తర్వాత చేరతావా? 390 00:22:10,582 --> 00:22:15,462 మా దేశంలో అయితే. మీరిలాంటివి చేస్తే, ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవచ్చు. 391 00:22:16,254 --> 00:22:19,841 మేము ప్రశాంతంగా నిరసన ప్రదర్శనలు చేశాం. కానీ వాళ్లు బలగాలతో ప్రతిస్పందించారు. 392 00:22:20,717 --> 00:22:22,052 ఆ తర్వాత యుద్ధం మొదలైంది. 393 00:22:23,428 --> 00:22:26,765 చూడు, సమీర్, నువ్వేమీ చేయొద్దులే... -లేదు, నేను చేస్తా. 394 00:22:27,641 --> 00:22:30,685 సిరియన్ బేకరీలో నా స్నేహితులతో మాట్లాడతాను. 395 00:22:33,563 --> 00:22:35,482 మిషన్ కంట్రోల్ కి ఏమైంది? 396 00:22:36,274 --> 00:22:37,108 ఓల్డ్ చాన్సీ 397 00:22:37,192 --> 00:22:38,360 అది ఆలివర్ పని. 398 00:22:38,360 --> 00:22:40,320 "ఓల్డ్ చాన్సీ"? 399 00:22:40,320 --> 00:22:41,613 అంటే అర్థం ఏంటి? 400 00:22:42,364 --> 00:22:44,032 ఈ పదాలు ఎక్కడో చూశాను. 401 00:22:45,075 --> 00:22:48,411 ఆలివర్ ఆఫీసులో చిత్రలిపిని నేను అనువదిస్తున్నప్పుడు చూశా! 402 00:22:49,829 --> 00:22:54,793 ఇదిగో. ఇది యూనివర్శిటీ వ్యవస్థాపకుడు చార్లెస్ విక్ఫర్డ్ ముద్దు పేరు. 403 00:22:55,293 --> 00:22:56,336 "ఓల్డ్ చాన్సీ." 404 00:22:57,462 --> 00:23:01,132 మా అమ్మ ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో అతని గురించి చాలా తెలుసుకోవాల్సి వచ్చింది. 405 00:23:01,800 --> 00:23:04,135 అతని ఆత్మ ఇప్పటికీ క్యాంపస్ లో తిరుగుతూ ఉంటుందని అంటారు. 406 00:23:04,719 --> 00:23:06,972 ఏయ్, నా ముందు మూసుకుపోయిన మరో సొరంగం ఉంది. 407 00:23:07,806 --> 00:23:08,807 నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 408 00:23:10,100 --> 00:23:11,101 ఏంటి? 409 00:23:12,477 --> 00:23:13,562 అది మా ఇల్లే. 410 00:23:16,481 --> 00:23:18,233 రాల్ఫ్! -హలో? 411 00:23:18,233 --> 00:23:20,026 రాల్ఫ్! -ఎక్కడున్నావు మిత్రమా? 412 00:23:20,527 --> 00:23:21,945 హలో? -అది ఈ గదిలో ఉంది. 413 00:23:21,945 --> 00:23:25,031 హలో! హలో? 414 00:23:25,115 --> 00:23:26,950 రాల్ఫ్? ఎక్కడున్నావు? 415 00:23:26,950 --> 00:23:29,160 ఇక్కడ! హలో? -రాల్ఫ్? 416 00:23:29,911 --> 00:23:31,746 ఎక్కడ ఉంది? -హలో? 417 00:23:31,830 --> 00:23:35,166 రాల్ఫ్? -హలో? హలో! 418 00:23:35,667 --> 00:23:36,668 అది ఇక్కడ ఉంది. 419 00:23:41,172 --> 00:23:42,591 ఇక్కడ ఏమీ లేదు. 420 00:23:42,591 --> 00:23:43,717 హలో! 421 00:23:44,676 --> 00:23:45,927 వెనకాల నుంచి వినిపిస్తోంది. 422 00:23:46,011 --> 00:23:48,263 అంతే! మీరు నాకు దగ్గరగా వచ్చారు! -దీన్ని కదుపుదాం. 423 00:23:50,181 --> 00:23:52,225 రాల్ఫ్! బాగానే ఉన్నావు కదా. 424 00:23:53,226 --> 00:23:55,520 సొరంగం నుంచి ఈ కన్నం ద్వారా బయటపడ్డాను. 425 00:23:55,604 --> 00:23:59,441 అవునులే. ఈ ఇంటిని యూనివర్శిటీ కట్టిన తొలినాళ్లలో నిర్మించారు. 426 00:23:59,441 --> 00:24:01,359 ఈ ఇల్లు సొరంగాలతో లింక్ అయ్యి ఉండవచ్చు. 427 00:24:01,443 --> 00:24:05,030 ఈ కంత పెద్దదిగా ఉండి ఉంటే, రాల్ఫ్ తో పాటు మనమూ లోపలికి వెళ్లేవాళ్లం. 428 00:24:05,822 --> 00:24:08,658 ఆ దొంగ ఏ మార్గం గుండా వెళ్లాడో మనం సాక్ష్యం సంపాదించేవాళ్లం. 429 00:24:09,367 --> 00:24:13,121 అవును, దీన్ని పెద్దది చేయాలంటే డ్రిల్ మెషిన్ కావాలి. 430 00:24:15,123 --> 00:24:16,374 అది అవసరం లేకపోవచ్చు. 431 00:24:21,379 --> 00:24:24,966 స్క్రంచ్! స్క్రంచ్! 432 00:24:25,717 --> 00:24:28,220 స్క్రంచ్! స్క్రంచ్! స్క్రంచ్! 433 00:24:28,220 --> 00:24:31,431 స్క్రంచ్! స్క్రంచ్! 434 00:24:31,431 --> 00:24:33,558 నా ఐడియా పనిచేసిందంటే నమ్మలేకపోతున్నా! 435 00:24:33,642 --> 00:24:35,310 వాటికి ఈ బాక్సుపై శబ్దాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది! 436 00:24:35,310 --> 00:24:36,228 బ్రబ్-బ్రబ్! స్క్రంచ్! 437 00:24:36,728 --> 00:24:39,439 మా ఇంటి బేస్మెంట్ లో ఇంత పెద్దగా కూలగొడుతున్నామంటే నమ్మలేకపోతున్నా. 438 00:24:40,315 --> 00:24:43,318 శాంతించు. ఇలాంటి వాటిని పూడ్చడంలో మా నాన్నకు నేను సాయం చేస్తూ ఉంటా. 439 00:24:43,818 --> 00:24:46,655 ఈ పని పూర్తయ్యాక, పూడ్చటంలో సాయం చేస్తాలే. -తప్పక చేయాలి మరి. 440 00:24:46,655 --> 00:24:49,741 స్క్రంచ్! స్క్రంచ్! 441 00:24:49,741 --> 00:24:51,785 దీనికి కాస్త సమయం పడుతుంది. 442 00:24:52,327 --> 00:24:54,996 ఇంకా "ఓల్డ్ చాన్సీ" అంటే అర్థం ఏంటో మనం కనుక్కోవలసి ఉంది. 443 00:24:55,080 --> 00:24:55,914 అవును. 444 00:24:57,165 --> 00:25:00,710 హేయ్. మనం ఈ మరో దెయ్యంతో మాట్లాడాలని మనకి ఆలివర్ చెప్తున్నాడా ఏంటి? 445 00:25:00,794 --> 00:25:02,879 ఆ తర్వాత? ఓల్డ్ చాన్సీ కూడా మనకు కూడా రాస్తాడా ఏంటి? 446 00:25:02,963 --> 00:25:04,381 నాకు తెలియదు, రాయొచ్చేమో. 447 00:25:04,381 --> 00:25:06,299 అసలు ఓల్డ్ చాన్సీ ఎక్కడ ఉంటాడు? 448 00:25:06,883 --> 00:25:07,884 నియా? 449 00:25:09,219 --> 00:25:10,387 పదండి వెళ్దాం. 450 00:25:14,516 --> 00:25:15,517 అందరికీ నమస్తే. 451 00:25:16,101 --> 00:25:17,352 మీరంతా ఇక్కడే ఉన్నందుకు సంతోషం. 452 00:25:17,352 --> 00:25:20,730 ఎలోకెంట్ పెసంట్ నకిలీదని మీరు ఎలా కనుక్కున్నారో తెలుసుకునేందుకు 453 00:25:20,814 --> 00:25:23,316 మేము నియమించిన ప్రైవేట్ డిటెక్టివ్ శనివారం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. 454 00:25:23,400 --> 00:25:26,570 కంగారు పడాల్సింది ఏమీ లేదని, మీ అభిప్రాయాలు తెలుసుకునేందుకేనని తను చెప్పింది. 455 00:25:26,570 --> 00:25:28,405 పరవాలేదుగా? ఉదయం 10.00 గంటలకు ఓకేనా? 456 00:25:29,447 --> 00:25:30,448 అలాగే. 457 00:25:31,157 --> 00:25:33,076 అయితే ఆమెకు ఈ విషయం చెబుతాను. 458 00:25:37,205 --> 00:25:39,541 నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను. లేకపోతే యూనియన్ వాళ్లకి కోపం వస్తుంది. 459 00:25:40,041 --> 00:25:40,875 హేయ్, సమీర్, 460 00:25:40,959 --> 00:25:43,044 ఆ పుస్తకాల దుకాణం యజమానురాలి వద్ద ఉన్న కుకీల లాంటివి 461 00:25:43,128 --> 00:25:45,171 నాకు కొన్ని తెచ్చి ఇవ్వగలవా? 462 00:26:10,196 --> 00:26:14,075 నీ కొత్త స్నేహితురాలితో నిన్న రాత్రి ఎలా గడిచింది? 463 00:26:14,868 --> 00:26:16,328 దేని గురించి మాట్లాడుతున్నావు? 464 00:26:16,995 --> 00:26:19,164 నిన్న రాత్రి. నువ్వు దొంగచాటుగా వెళ్లడం నేను చూశానులే. 465 00:26:20,415 --> 00:26:23,001 నువ్వు ఆంబర్ తో కలిసి తిరుగుతున్నావని అనుకుంటున్నాను. 466 00:26:23,001 --> 00:26:25,337 నేను లైబ్రరీలో చదువుకున్నాను. 467 00:26:25,337 --> 00:26:27,923 నేనేం దొంగచాటుగా వెళ్లలేదు. అమ్మానాన్న నిద్రలేవకూడదని అలా వెళ్లాను. 468 00:26:27,923 --> 00:26:30,091 అబ్బా, ఎక్కడికి వెళ్లావో చెప్పు? 469 00:26:30,967 --> 00:26:32,510 డాన్సింగ్ కా? లేక పెద్ద పార్టీకా? 470 00:26:34,262 --> 00:26:35,347 నువ్వు ఇక్కడికి వచ్చావా? 471 00:26:36,473 --> 00:26:39,142 చూడు, చార్లీ, నేనెక్కడికి వెళ్లానో చెప్పానుగా. ఇక ఆ సంగతి వదిలెయ్, సరేనా? 472 00:26:39,226 --> 00:26:40,393 సరే. 473 00:26:41,311 --> 00:26:44,189 ఏయ్, నీకు ఓల్డ్ చాన్సీ గురించి ఏమైనా తెలుసా? 474 00:26:44,856 --> 00:26:46,149 యూనివర్శిటీ వ్యవస్థాపకుడి గురించా? 475 00:26:46,233 --> 00:26:48,693 అతని ఆత్మ గురించి. 476 00:26:49,361 --> 00:26:50,820 అతనొక స్కూల్ లెజెండ్. 477 00:26:51,571 --> 00:26:53,365 లెజెండ్ అంటే? -ఏమో మరి. 478 00:26:53,365 --> 00:26:57,035 రాత్రివేళ స్కూలు చుట్టూ తిరుగుతూ, విద్యార్థులపై నిఘా వేసి ఉంటాడని అంటుంటారు. 479 00:26:57,035 --> 00:27:00,413 క్యాంపస్ చివర్లో ఉన్న ఆ పాత స్కూలు భవనంలోనే అతను ఉంటాడని అంటుంటారు. 480 00:27:01,206 --> 00:27:04,584 ఊరుకో, చార్. దెయ్యాలు లేవు, గియ్యాలు లేవు. 481 00:27:06,086 --> 00:27:07,087 అవును. 482 00:27:20,225 --> 00:27:22,394 ఇంత రాత్రివేళ ఇదంతా అవసరమా మనకు? 483 00:27:22,394 --> 00:27:24,604 ఓల్డ్ చాన్సీ బయటకు వచ్చేది ఇప్పుడే మరి. 484 00:27:24,688 --> 00:27:26,690 రాత్రివేళ దెయ్యాలన్నీ బయటకు వస్తాయని, అది మామూలే అని ఆయనతో చెప్తే, 485 00:27:26,690 --> 00:27:28,316 పగటి వేళ రావడం మొదలెడతాడేమో. 486 00:27:28,400 --> 00:27:30,026 ఆ కంత విషయంలో రాల్ఫ్ పని ఎక్కడి దాకా వచ్చింది? 487 00:27:30,694 --> 00:27:34,906 అతని మాటల్లో చెప్పాలంటే, "ఆ కంతలో ఇప్పుడు పన్నెండు ఎలుకలు పడతాయి." 488 00:27:34,990 --> 00:27:37,075 అయితే, ఇంకాస్త పెద్దది చేస్తే సరిపోతుందిగా? 489 00:27:39,077 --> 00:27:40,912 "విక్ఫర్డ్ స్కూల్." 490 00:27:42,831 --> 00:27:46,167 చార్లెస్ "చాన్సీ" విక్ఫర్డ్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి ముందు 491 00:27:46,251 --> 00:27:48,295 ఇదే పాఠశాల భవనంలో పాఠాలు చెబుతూ ఉండేవాడు. 492 00:27:48,920 --> 00:27:50,171 ఆయన ఇక్కడ ఉన్నాడని ఆశిద్దాం మరి. 493 00:27:57,637 --> 00:28:01,808 హలో? ఓల్డ్ చాన్సీ? ఇంట్లో ఉన్నారా? 494 00:28:02,309 --> 00:28:04,060 మేము ఆలివర్ స్నేహితులం. 495 00:28:04,144 --> 00:28:05,228 మీతో మాట్లాడాలని వచ్చాం. 496 00:28:08,440 --> 00:28:09,441 ఏంటా చప్పుడు? 497 00:28:16,489 --> 00:28:19,492 సరే. మన ఆలోచన అంత మంచిది కాదేమో. 498 00:28:26,666 --> 00:28:28,418 ఓల్డ్ చాన్సీ? 499 00:29:20,887 --> 00:29:22,889 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య