1 00:00:06,383 --> 00:00:09,553 సిసేమ్ వర్క్ షాప్ సమర్పించు 2 00:00:18,562 --> 00:00:19,688 నేను వెళ్లి చూస్తాను. 3 00:00:23,608 --> 00:00:25,860 వేడుక ఈ రోజే మొదలవుతుందని మర్చిపోకు. 4 00:00:25,944 --> 00:00:27,571 ఆ వ్యవస్థాపకుని వారోత్సవం గురించేనా? 5 00:00:28,196 --> 00:00:29,197 నేను వెళ్లాలా? 6 00:00:31,032 --> 00:00:32,784 లైలా, నీ కోసమే. 7 00:00:40,959 --> 00:00:43,920 దయచేసి లోపలికి వచ్చి కూర్చోండి. 8 00:00:44,796 --> 00:00:46,882 ఇంత ఉదయమే వచ్చినందుకు మన్నించాలి, 9 00:00:46,882 --> 00:00:49,759 కానీ దొరికిన ఆధారాల ప్రకారం, బోర్డు ఇంక ఆలస్యం చేయరాదని భావించింది. 10 00:00:49,843 --> 00:00:52,512 నాకు అర్థం కాలేదు. ఏ ఆధారం? 11 00:00:53,096 --> 00:00:55,098 నాకు నిన్న అందిన ఈ ఫోటోలలో 12 00:00:55,599 --> 00:01:00,061 ఎలోకెంట్ పెసంట్ ని దొంగిలించాడని భావిస్తున్న వ్యక్తితో మీరు సమావేశం అయ్యారు. 13 00:01:02,772 --> 00:01:03,773 ప్యారిస్ క్యాంటీన్ 14 00:01:03,857 --> 00:01:05,775 అలెక్స్ థాంప్సన్ ఒక దాత. 15 00:01:06,276 --> 00:01:08,945 యూనివర్సిటీకి ఎలా సహాయం చేయాలనే అంశాలను చర్చించాలి అనుకున్నాడు. 16 00:01:09,029 --> 00:01:11,489 కానీ మీ ఆడియో అందుకు భిన్నంగా ఉంది. 17 00:01:12,240 --> 00:01:15,952 అయితే, లైలా, ఎలోకెంట్ పెసంట్ మీద మనకి ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 18 00:01:16,036 --> 00:01:18,121 యాభై లక్షల డాలర్లు. ఇంకా ఎక్కువ రావచ్చు. 19 00:01:19,289 --> 00:01:20,498 ఇది హాస్యాస్పదంగా ఉంది. 20 00:01:20,582 --> 00:01:23,043 అలెక్స్ థాంప్సన్ ఎవరో నాకు పెద్దగా తెలియదు. అతను నాకు కాల్ చేశాడు. 21 00:01:23,627 --> 00:01:25,587 ఆ యాభై లక్షల డాలర్లు క్యాంపస్ గృహాల కోసం. 22 00:01:25,587 --> 00:01:27,672 ఈ మొత్తం సంభాషణ వక్రీకరించబడింది. 23 00:01:27,756 --> 00:01:29,591 స్పష్టంగా, థాంప్సన్ అనే వాడు తనని ఇరికించాలని చూస్తున్నాడు. 24 00:01:29,591 --> 00:01:32,761 మీ కార్యాలయాన్ని సోదా చేయడానికి ఈ ఆడియో ఆధారం సరిపోతుందని బోర్డు భావించింది... 25 00:01:32,761 --> 00:01:33,887 ఏంటి? 26 00:01:33,887 --> 00:01:35,305 ...అక్కడ వీటిని చూశాను. 27 00:01:37,933 --> 00:01:40,644 ఈ పాత సొరంగాలు మొత్తం యూనివర్సిటీ అడుగున తవ్వబడి ఉన్నాయి. 28 00:01:40,644 --> 00:01:43,438 క్యాంపస్ నుండి దొంగిలించిన పెసంట్ ని ఆ దొంగ ఈ సొరంగాల ద్వారా 29 00:01:44,022 --> 00:01:45,023 ఇక్కడికి తీసుకువచ్చాడు. 30 00:01:45,023 --> 00:01:46,483 ఆపై ఇక్కడ ఆ సొరంగ మార్గం ఆగిపోయింది. 31 00:01:46,483 --> 00:01:48,860 మా ఇంటి కింద ఎటువంటి నేలమాళిగ లేదు. 32 00:01:48,944 --> 00:01:50,195 నేను స్వయంగా చూడవచ్చా? 33 00:01:50,195 --> 00:01:51,321 దాచడానికి నా దగ్గర ఏమీ లేదు. 34 00:01:52,405 --> 00:01:53,615 ఈ మార్గంలో కుడి వైపున ఉంది. 35 00:02:00,956 --> 00:02:02,958 నియా, బంగారం, మేడ మీదకి వెళ్లు. 36 00:02:02,958 --> 00:02:04,668 ఈ పరిశోధకురాలు ఇక్కడ ఏం చేస్తోంది? 37 00:02:04,668 --> 00:02:06,628 నువ్వు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నావా? -ఖచ్చితంగా లేను. 38 00:02:06,628 --> 00:02:09,004 ఆమె తన ఉద్యోగం తను చేస్తోంది. మేము కొద్దిసేపటిలో పైకి వస్తాము. 39 00:02:09,088 --> 00:02:14,219 ఈ పటం ప్రకారం ఆ సొరంగం ప్రవేశద్వారం ఈ క్యాబినెట్ వెనుక నుండి ఉండాలి. 40 00:02:14,219 --> 00:02:15,345 నేను చూడవచ్చా? 41 00:02:15,345 --> 00:02:16,680 తప్పకుండా చూడండి. 42 00:02:47,252 --> 00:02:48,879 ఘోస్ట్ రైటర్ 43 00:02:49,754 --> 00:02:51,131 ఎవరు ఇదంతా చేసి ఉంటారు? 44 00:02:53,008 --> 00:02:55,135 ఎవరో కానీ, మా అమ్మని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. 45 00:02:55,135 --> 00:02:58,096 నాకు తెలియదు. ఇక్కడ స్పష్టంగా ఏ రంగూ లేదు. 46 00:02:58,096 --> 00:02:59,598 కానీ ఏదైనా ఒక ఆధారం ఉండవచ్చు. 47 00:03:00,181 --> 00:03:01,766 అవును. నన్ను చూడనివ్వు. 48 00:03:04,686 --> 00:03:06,605 మీ అమ్మని ఈ కేసులో ఇరికించాలని ఎవరైనా ఎందుకు ప్రయత్నిస్తారు? 49 00:03:06,605 --> 00:03:09,524 ఆమె ప్రాచీన కళాఖండాలను తిరిగి వాటి స్వదేశాలకు పంపించి 50 00:03:09,608 --> 00:03:10,609 ట్యూషన్ ఫీజులను తగ్గిస్తోంది. 51 00:03:10,609 --> 00:03:12,861 కానీ అవి మంచి పనులు. -అవును. 52 00:03:13,361 --> 00:03:15,739 కొందరు మనుషులు మార్పు వస్తుందంటే భయపడిపోతారు. 53 00:03:15,739 --> 00:03:19,743 ముఖ్యంగా అందరికీ మంచి జరిగితే అది వారికి చెడుగా అనిపిస్తుంది. 54 00:03:20,410 --> 00:03:22,245 నాకు ఇక్కడ ఏదో కనిపించింది. 55 00:03:31,588 --> 00:03:32,797 ఒక గమ్ కాగితం? 56 00:03:33,506 --> 00:03:35,634 ఎవరో నిన్న రాత్రి దీనిని ఇక్కడ పడేసి ఉంటారు. 57 00:03:36,927 --> 00:03:38,637 మనల్ని ఎవరో అనుసరిస్తున్నారు అనుకుంటా. 58 00:03:39,429 --> 00:03:43,141 నియా, నేనూ మీ నాన్న నీతో మాట్లాడాలి అనుకుంటున్నాం. 59 00:03:46,937 --> 00:03:48,521 మిమ్మల్ని నా గదిలో తరువాత కలుస్తాను. 60 00:03:50,982 --> 00:03:53,735 ఈ పరిశోధనలో ఒక చిన్న సమస్య ఉంది. 61 00:03:53,735 --> 00:03:57,072 ఇది ఒక పెద్ద, సంక్లిష్టమైన అపార్థం, 62 00:03:57,072 --> 00:03:59,282 కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సరేనా? 63 00:03:59,366 --> 00:04:00,700 నేను ఏమీ తప్పు చేయలేదు. 64 00:04:00,784 --> 00:04:04,204 రేపు నేను ఒక గొప్ప లాయర్ ని కలుస్తున్నాను, ఆయన ఈ కేసుని చూసుకుంటాడు. 65 00:04:04,955 --> 00:04:06,665 ఇదంతా చాలా దుర్మార్గంగా ఉంది, అమ్మా. 66 00:04:07,582 --> 00:04:09,125 అసలు నిజంగా ఏం జరుగుతోంది? 67 00:04:09,209 --> 00:04:10,794 నాకు చెబితే, బహుశా నేను సాయం చేయగలను. 68 00:04:10,794 --> 00:04:12,003 అది మంచి విషయం, నియా. 69 00:04:12,087 --> 00:04:14,422 పెద్దలం మేము చూసుకుంటాము. 70 00:04:17,716 --> 00:04:18,969 నేను ఈ కాల్ తీసుకోవాలి. 71 00:04:19,594 --> 00:04:21,763 వేడుకకి సమయానికి రావాలని గుర్తుంచుకో. 72 00:04:24,641 --> 00:04:27,018 వ్యవస్థాపకుని వారోత్సవం గురించి ఈ సమయంలో ఆమె ఎలా ఆలోచించగలుగుతోంది? 73 00:04:27,102 --> 00:04:27,936 హలో? 74 00:04:27,936 --> 00:04:30,230 ఈ కేసు వల్ల మన జీవితాలు దెబ్బ తినకూడదు అని తను భావిస్తోంది. 75 00:04:31,106 --> 00:04:33,775 కాబట్టి మన ముఖాలు ఆనందంగా ఉన్నట్లు పెడదాం, 76 00:04:33,775 --> 00:04:36,528 అలాగే మనం మీ అమ్మకు అండగా నిలబడదాం, సరేనా? 77 00:04:38,989 --> 00:04:42,993 మేము త్వరలోనే అక్కడికి వస్తాము. తప్పకుండా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. 78 00:04:42,993 --> 00:04:45,287 బాగుంది! -సరే! 79 00:04:45,287 --> 00:04:47,163 ఇది నాకు గొప్పగా అనిపిస్తోంది. 80 00:04:47,247 --> 00:04:48,748 హాయ్, అందరూ. 81 00:04:48,832 --> 00:04:50,125 నువ్వు బాగానే ఉన్నావా? 82 00:04:50,125 --> 00:04:52,878 అవును. ఇక్కడ సంతోషంగా మాత్రమే కనిపించాలి. 83 00:04:52,878 --> 00:04:56,882 సరే, మనల్ని ఎవరు అనుసరిస్తున్నారో తెలుసుకోవడానికి చార్లీ నేనూ ఒక పథకం ఆలోచించాం. 84 00:04:56,882 --> 00:04:59,259 దీనికి ఒక సూచన: రూపు మార్చడం ఇందులో ఒక భాగం. 85 00:05:01,344 --> 00:05:03,972 ఏం జరిగిందో నువ్వు వాళ్లకు చెప్పాలి అనుకుంటున్నావా? -ఏంటి? 86 00:05:05,098 --> 00:05:06,433 నాకు నిజంగా తెలియదు. 87 00:05:07,893 --> 00:05:10,186 బోర్డు మీటింగ్ లో నేను కేటరర్ గా ఉన్నప్పుడు, 88 00:05:10,854 --> 00:05:13,607 రెయిన్బోకి ఏదో లోపం ఏర్పడింది, 89 00:05:13,607 --> 00:05:15,775 అప్పుడు నా చేయి తిరిగి నా సహజ రూపంలోకి వచ్చేసింది. 90 00:05:15,859 --> 00:05:17,360 నేను పట్టుబడేదాన్ని, 91 00:05:17,444 --> 00:05:20,280 ఆ రోజు నేను కొద్దిగా అలసిపోయాను, సరేనా? ఈ రోజు నేను బాగానే ఉన్నాను. 92 00:05:20,780 --> 00:05:21,781 కంగారు పడకు. 93 00:05:22,866 --> 00:05:23,950 నువ్వు ఎలా అంటే అలా. 94 00:05:26,453 --> 00:05:27,454 పథకం ఏంటి? 95 00:05:27,454 --> 00:05:29,664 "మనల్ని అనుసరించే వాడిని అనుసరించండి" అంటున్నాం. 96 00:05:30,206 --> 00:05:31,917 ఆసక్తిగా ఉంది. ఇది ఎలా పని చేస్తుంది? 97 00:05:31,917 --> 00:05:36,838 అంటే, మనల్ని ఎవరైనా అనుసరిస్తుంటే, వారిని ఆ పని చేస్తున్నప్పుడే మనం పట్టుకోవాలి. 98 00:05:37,422 --> 00:05:39,883 మనం చివరిసారి థాంప్సన్ ని ఎక్కడ చూశామో ఆ ప్రదేశానికి మనం తిరిగి వెళ్లాలి. 99 00:05:39,883 --> 00:05:42,802 నియా, నువ్వూ నేనూ మామూలుగా నడుద్దాం. -తాబేళ్లను కాపాడండి. 100 00:05:42,886 --> 00:05:45,222 ఆ సమయంలో రెయిన్బో ఇంకా చార్లీ వస్తారు. -సరే! 101 00:05:47,724 --> 00:05:51,353 మన పరిధిలో ఎవరో ఒకరి రూపంలోకి నేను మారిపోతాను, 102 00:05:51,353 --> 00:05:53,730 తరువాత మీ ఇద్దరినీ ఎవరు అనుసరిస్తున్నారో తెలుసుకుంటాను. 103 00:05:53,730 --> 00:05:56,942 మనం జనం ఉండే ప్రదేశంలో ఉంటాం, బాగా దగ్గరగా ఎవరూ రారు. 104 00:05:56,942 --> 00:05:58,652 వాళ్లు ఎవరో మనం తెలుసుకుంటాం, 105 00:05:58,652 --> 00:06:01,988 అలా తెలుసుకున్నాక, చివరిగా మనం ఆ అనుసరించే వారినే అనుసరిస్తాము. 106 00:06:04,783 --> 00:06:08,245 మిత్రులారా, నేను ఒకటి గమనించాను. ఆమె నేరుగా మీ వైపే నడిచి వస్తోంది! 107 00:06:08,995 --> 00:06:11,039 వదిలేయండి. ఆమె కాదు. 108 00:06:11,039 --> 00:06:13,041 ఒక్క క్షణం ఆగండి. నేను ప్రదేశం మార్చాలి. 109 00:06:23,385 --> 00:06:24,386 ఏమైనా కనిపించిందా? 110 00:06:24,970 --> 00:06:27,222 నిజం చెప్పాలంటే, అది ఎవరైనా కావచ్చు. 111 00:06:33,645 --> 00:06:34,854 అక్కడ ఏం జరుగుతోంది? 112 00:06:34,938 --> 00:06:37,857 తెలియడం లేదు. మా అలారంలు ఆగడం లేదు. 113 00:06:38,441 --> 00:06:40,068 ఇది ఆలివర్ నుండి సంకేతం కావచ్చు. 114 00:06:41,861 --> 00:06:42,862 పన్నెండు గంటలు? 115 00:06:52,455 --> 00:06:54,749 ఇది దిశని సూచిస్తోంది. -ఏంటి? 116 00:06:54,833 --> 00:06:57,335 పన్నెండు గంటలు అనేది ఒక దిశ. నేరుగా చూడండి. 117 00:07:00,088 --> 00:07:01,673 అక్కడ, కెమెరాతో ఒక అమ్మాయి. 118 00:07:01,673 --> 00:07:03,216 మనల్ని అనుసరిస్తున్నది ఆమెనే కావచ్చు. 119 00:07:03,300 --> 00:07:05,969 చార్లీ, ఆకుపచ్చ బేస్ బాల్ టోపీ పెట్టుకున్న అమ్మాయి. 120 00:07:19,441 --> 00:07:21,359 అవును, తాబేళ్లను కాపాడాలి, కదా? 121 00:07:22,736 --> 00:07:24,905 అవకాశమే లేదు. 122 00:07:26,156 --> 00:07:27,657 తను ఆంబర్. 123 00:07:27,741 --> 00:07:29,075 సిడ్నీ స్నేహితురాలు. 124 00:07:35,457 --> 00:07:37,626 సరే, ఇప్పుడు రెండవ దశ అమలు చేసే సమయం. 125 00:07:49,012 --> 00:07:50,347 హలో, చార్లీ. 126 00:07:51,181 --> 00:07:52,182 నియా? 127 00:07:52,682 --> 00:07:54,517 నా పేరు నియా. ఇతను సమీర్. 128 00:07:54,601 --> 00:07:56,728 బహుశా మరుసటి సారి మనం పేర్ల ట్యాగులు తెచ్చుకోవాలేమో. 129 00:07:59,981 --> 00:08:02,817 వెళదాం పద. బహుశా అమె మనల్ని అలెక్స్ థాంప్సన్ దగ్గరకు తీసుకుపోవచ్చు. 130 00:08:27,592 --> 00:08:30,428 సొరంగంలో రెయిన్బోకి దొరికిన గమ్ కాగితం సరిగ్గా ఇలాంటిదే. 131 00:08:31,429 --> 00:08:34,558 నా చెల్లెలి స్నేహితురాలు మనల్ని ఎందుకు అనుసరిస్తోంది? నాకు అర్థం కావడం లేదు. 132 00:08:36,893 --> 00:08:37,894 వెళదాం పదండి. 133 00:08:44,484 --> 00:08:46,361 ఆర్కియాలజీ విభాగం. 134 00:08:47,028 --> 00:08:50,949 అవును, ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే వచ్చాము. -కానీ ఇది ఎవరి ఆఫీసు? 135 00:08:50,949 --> 00:08:52,951 ప్రొఫెసర్ టాడ్ మెక్ కార్మాక్ చైర్మన్, ఆర్కియాలజీ విభాగం 136 00:08:52,951 --> 00:08:55,120 ఇది "ప్రొఫెసర్ టాడ్ మెక్ కార్మాక్" అని సూచిస్తోంది. 137 00:08:56,079 --> 00:08:57,789 దీని ఉద్దేశం ఏమై ఉంటుంది, నియా? 138 00:08:57,789 --> 00:08:59,291 నేను సమీర్ ని, గుర్తు లేదా? 139 00:08:59,291 --> 00:09:02,002 సరే, మన్నించు. దీని అర్థం ఏమై ఉంటుంది, సమీర్? 140 00:09:02,002 --> 00:09:04,504 బహుశా మెక్ కార్మాక్ అనే వ్యక్తే అలెక్స్ థాంప్సన్ అయి ఉంటాడు. 141 00:09:04,588 --> 00:09:05,589 అవకాశమే లేదు. 142 00:09:05,589 --> 00:09:09,175 అతను మారువేషంలో ఉన్నా నియా అమ్మ గుర్తు పట్టేస్తుంది. 143 00:09:09,259 --> 00:09:13,847 కానీ మెక్ కార్మాక్ దీనికి ఇంఛార్జి కాబట్టి అతనే ఈ వ్యూహం పన్ని ఉంటాడు. 144 00:09:14,347 --> 00:09:17,642 మా అమ్మ ప్రెసిడెంట్ కావడం అతనికి ఇష్టం లేదు, అదే అతని లక్ష్యం. 145 00:09:17,726 --> 00:09:21,646 అదే విధంగా, ఈపీ నకిలీని తయారు చేసే నైపుణ్యం అతనికే ఉంది, 146 00:09:21,730 --> 00:09:22,731 అతనే 147 00:09:22,731 --> 00:09:25,567 మా అమ్మ కార్యాలయంలో పరిశోధకురాలు సోదాలు చేయాలని కోరాడు, 148 00:09:25,567 --> 00:09:27,652 ఆ ఆధారాలు ఏవో అక్కడ ఉన్నాయని తనకి తెలిసినట్లు వ్యవహరించాడు. 149 00:09:27,736 --> 00:09:28,737 చూడు. 150 00:09:28,737 --> 00:09:31,072 కుక్క తప్పిపోయింది పేరు: బోవీ 151 00:09:34,826 --> 00:09:36,411 ఎవరో బోవీ అనే పేరుగల కుక్కని పోగొట్టుకున్నారు. 152 00:09:36,411 --> 00:09:39,205 ఆంబర్ ఇంకా అలెక్స్ థాంప్సన్ బహుశా మెక్ కార్మాక్ దగ్గర పని చేస్తుండవచ్చు. 153 00:09:40,832 --> 00:09:43,710 నీకు తెలుసా? ఇది అర్థం అవుతోంది. 154 00:09:54,221 --> 00:09:55,388 ఏం జరుగుతోంది? 155 00:09:59,976 --> 00:10:02,020 ధన్యవాదాలు, ప్రొఫెసర్. నేను వేడుకకి వెళ్తున్నాను. 156 00:10:02,020 --> 00:10:04,105 మీకు ఏమైనా అవసరమైతే చెప్పండి. -వినడానికి బాగుంది. 157 00:10:04,189 --> 00:10:05,190 నేను అక్కడ కలుస్తాను. 158 00:10:13,490 --> 00:10:14,532 అంతా ఖాళీ అయింది. 159 00:10:14,616 --> 00:10:16,701 రెయిన్బో, నీ డ్రెస్సు! 160 00:10:16,785 --> 00:10:17,953 దాదాపు దొరికిపోయే దానివి. 161 00:10:17,953 --> 00:10:19,913 నువ్వు బాగానే ఉన్నావా, రెయిన్బో? 162 00:10:20,455 --> 00:10:21,456 అవును అనుకుంటా. 163 00:10:21,957 --> 00:10:25,877 ఒక క్షణం నవ్వొస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. 164 00:10:27,879 --> 00:10:29,631 అయితే, మనం మెక్ కార్మాక్ విషయంలో ఏం చేద్దాం? 165 00:10:30,632 --> 00:10:33,927 నేను ఇంకా ఖచ్చితంగా చెప్పలేను. అతను దీని వెనుక ఉంటే, మనకి ఆధారాలు కావాలి. 166 00:10:33,927 --> 00:10:36,263 నేను త్వరగా వేడుకకి వెళ్లవలసి ఉంది. 167 00:10:36,263 --> 00:10:38,890 మనం పథకాలను తరువాత ఆలోచిద్దాం. -బహుశా మనందరం ఇక బయటపడాలి. 168 00:10:38,974 --> 00:10:40,850 సమీర్ ఇంకా నేను ఆంబర్ మీద ఒక కన్నేసి ఉంచుతాం. 169 00:10:41,351 --> 00:10:42,644 వెళదాం పదండి. 170 00:10:42,644 --> 00:10:45,855 నిజాయితీ. సమగ్రత. నిష్పాక్షికత. 171 00:10:45,939 --> 00:10:47,232 విక్ఫర్డ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుని వారోత్సవం 172 00:10:47,232 --> 00:10:50,944 ఈ మూడు పునాదులపైనే ఈ విద్యాలయం రూపుదిద్దుకుంది. 173 00:10:50,944 --> 00:10:54,990 రెండు శతాబ్దాల కిందట చార్ల్స్ విక్ఫర్డ్ ఈ యూనివర్సిటీని స్థాపించినప్పుడు అది నిజం, 174 00:10:56,032 --> 00:10:57,242 ఈనాటికీ కూడా అదే నిజం. 175 00:10:57,242 --> 00:11:00,579 ఈ వేడుకను జరుపుకోవడానికి కారణమైన ఈ ప్రధాన విలువలను మననం చేసుకోవడానికి 176 00:11:00,579 --> 00:11:02,247 మనం ఈ సందర్భాన్ని వినియోగించుకుందాం, 177 00:11:03,248 --> 00:11:06,960 ఇంకా మన భవిష్యత్తు బాటని వీటి ఆధారంగా నిర్మించుకుందాం. 178 00:11:08,086 --> 00:11:08,920 ధన్యవాదాలు. 179 00:11:14,259 --> 00:11:18,805 వ్యవస్థాపకుని వారోత్సవం ప్రారంభించడానికి విద్యార్థులందరికీ వేదిక వద్దకు స్వాగతం. 180 00:11:24,060 --> 00:11:25,812 హేయ్. ఇది తీసుకో, బంగారం. 181 00:11:29,065 --> 00:11:32,319 వాళ్లందరూ... చాలా మంచిగా మాట్లాడుతున్నారు. 182 00:11:32,319 --> 00:11:34,946 అమ్మ ఈ రోజు కాస్త మంచిని ఉపయోగిస్తుంది, ఏమంటావు? 183 00:11:36,156 --> 00:11:37,365 నేను వెళ్లాలి. 184 00:11:38,909 --> 00:11:40,785 నువ్వు నిజంగానే బాగున్నావా, రెయిన్బో? 185 00:11:40,869 --> 00:11:42,746 అవును, నిజంగా. బాగున్నాను. 186 00:11:42,746 --> 00:11:44,664 అయితే నీ డ్రెస్సు రంగు మారిపోయింది ఎందుకు? 187 00:11:45,206 --> 00:11:46,416 ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నాను. 188 00:11:48,710 --> 00:11:50,337 హలో, హలో. -హాయ్. 189 00:11:50,337 --> 00:11:51,463 డారియస్. -హాయ్. 190 00:11:51,963 --> 00:11:53,715 ఆహ్, నియా, నిన్ను మళ్లీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. 191 00:11:53,715 --> 00:11:54,925 స్కూల్ ఎలా ఉంది? 192 00:11:56,593 --> 00:11:59,387 మీరు వచ్చినందుకు సంతోషం, ప్రొఫెసర్. మీరు బాగా ఆస్వాదిస్తున్నారా? 193 00:11:59,471 --> 00:12:00,764 అవును, ఆస్వాదిస్తున్నాను. 194 00:12:00,764 --> 00:12:02,724 మిమ్మల్ని కలవడం సంతోషం, ప్రెసిడెంట్ బార్న్స్. 195 00:12:02,724 --> 00:12:04,893 నిజంగా, మీరు వచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది. 196 00:12:04,893 --> 00:12:06,895 సరే, అంతొద్దు. -నియా. 197 00:12:07,854 --> 00:12:10,065 మన్నించండి. ఈ రోజు సుదీర్ఘంగా గడిచింది. 198 00:12:10,649 --> 00:12:12,609 అవును, ఈ రోజు కష్టంగా కూడా గడిచి ఉంటుంది. 199 00:12:13,276 --> 00:12:14,402 ఆరోగ్యం జాగ్రత్త. 200 00:12:17,948 --> 00:12:20,659 నియా జాయ్ బార్న్స్ 201 00:12:20,659 --> 00:12:23,536 నీకు ఏం పట్టింది? నువ్వు ఎవ్వరితోనూ అలా మాట్లాడకూడదు. 202 00:12:23,620 --> 00:12:26,206 కానీ అతను రెండు తలల వ్యక్తి! నీకు తెలియదా? 203 00:12:26,206 --> 00:12:28,959 మిగతా బోర్డు సభ్యులు కూడా అలాంటి వారే. నువ్వు దోషివి అని వాళ్లంతా అనుకుంటున్నారు. 204 00:12:28,959 --> 00:12:30,502 ఇలా చూడు. అది నిజం కాదు. 205 00:12:30,502 --> 00:12:33,588 అదే నిజం. నన్ను నమ్ము. వాళ్లంతా నటిస్తున్నారు. 206 00:12:33,672 --> 00:12:35,423 మనం కూడా భిన్నమైన వాళ్లం కాదు. 207 00:12:35,507 --> 00:12:37,759 అంతా సవ్యంగా ఉందని మనమూ నటిస్తున్నాము. 208 00:12:37,759 --> 00:12:39,636 నేను ఒక్కదానినే ఎందుకు కుంగిపోవాలి? 209 00:12:39,636 --> 00:12:41,638 మీ నాన్న నేనూ కూడా ఇది ఇష్టపడము, 210 00:12:41,638 --> 00:12:44,599 కానీ ఆ వంకతో మనం కోపగించుకోవడమో లేదా ఇబ్బందికర పరిస్థితిని తీసుకురావడమో చేయకూడదు. 211 00:12:44,683 --> 00:12:47,811 కోపానికి సమయం ఇంకా సందర్భమూ ఉంటాయి, ఇది మాత్రం అందుకు సమయం కాదు. 212 00:12:49,688 --> 00:12:51,606 సంతోషంగా ముఖాలు, గుర్తుందా? 213 00:12:53,066 --> 00:12:56,069 ఇది కష్టమైన పని అని తెలుసు, కానీ మనం ఇక్కడి నుండి మరో పదిహేను నిమిషాల్లో వెళ్లిపోదాం, సరేనా? 214 00:12:59,656 --> 00:13:01,825 హేయ్, విచారపడకు. 215 00:13:01,825 --> 00:13:05,245 ఒకసారి నువ్వు ఈ మిస్టరీని ఛేదించావంటే, అంతా మళ్లీ మామూలు అయిపోతుంది, కదా? 216 00:13:05,745 --> 00:13:06,746 నాకు అదే ఆశ. 217 00:13:13,336 --> 00:13:16,089 సిడ్ కి ఆంబర్ స్నేహితురాలు కావడం, 218 00:13:16,089 --> 00:13:18,800 అది కూడా మనం ఈపీ నకిలీది అని గుర్తించాక జరగడం నీకు విడ్డూరంగా అనిపించడం లేదా? 219 00:13:19,551 --> 00:13:20,886 విడ్డూరంగా ఎలా? 220 00:13:20,886 --> 00:13:23,513 సరైన సమయానికి జరిగింది. చాలా పక్కాగా ఉంది. 221 00:13:25,473 --> 00:13:29,269 సిడ్ ని వాడుకుని నాకు దగ్గరవ్వాలని ఆంబర్ ప్రయత్నిస్తోంది. 222 00:13:29,936 --> 00:13:31,688 మనం ఇప్పుడే నిర్ణయాలకు రాలేము. 223 00:13:31,688 --> 00:13:34,274 అది యాదృచ్ఛికం కావచ్చు. -కానీ అది కాకపోతే ఏంటి? 224 00:13:34,274 --> 00:13:36,359 హేయ్. మీరు ఇద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? 225 00:13:37,193 --> 00:13:39,362 హాయ్, సిడ్. మేము... 226 00:13:40,488 --> 00:13:43,241 మేము నిమ్మరసం తాగుదామని వచ్చాము. ఇది తాజాగా తయారు చేసింది. 227 00:13:49,998 --> 00:13:53,877 సరే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను... నువ్వు ఈ రోజు షాపింగ్ కి వెళ్తావని అనుకున్నాను. 228 00:13:53,877 --> 00:13:57,005 నేను వెళ్లాను. ఆంబర్ కూడా నాతో రావాలి, కానీ ఆమెకు మరేదో పని పడింది. 229 00:13:57,005 --> 00:13:58,673 కాబట్టి మేము ఇక్కడ కలుసుకోవాలి అనుకున్నాము. 230 00:13:58,757 --> 00:13:59,758 హేయ్! 231 00:14:00,634 --> 00:14:01,635 ఇక్కడ ఉన్నావు! 232 00:14:01,635 --> 00:14:05,138 దేవుడా! ఇంతకుముందు నీకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయాను, క్షమించు. 233 00:14:05,222 --> 00:14:07,015 నా సైకాలజీ పేపర్ పూర్తి చేయాల్సి వచ్చింది. 234 00:14:09,601 --> 00:14:13,146 మా మిత్రబృందం కొందరం వసతి గృహాలకు వెళ్లి ముసుగు పార్టీకి ముస్తాబు అవుతున్నాం. 235 00:14:13,230 --> 00:14:14,272 నీ వస్తువులు తెచ్చావా? 236 00:14:14,356 --> 00:14:16,441 ఆగు, ఏ ముసుగు పార్టీ? 237 00:14:16,441 --> 00:14:18,151 హావ్తోర్న్ క్లబ్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. 238 00:14:18,235 --> 00:14:21,112 అవును, సిడ్ లాంటి సమర్థులైన కొత్త సభ్యులను స్వాగతించడానికి ఏర్పాటు చేసినది. 239 00:14:21,696 --> 00:14:23,573 వాళ్లు ఆమోదించడానికి ముందు ఇదే చివరి దశ. 240 00:14:23,657 --> 00:14:24,658 ఇది నిజంగా చక్కగా ఉంటుంది. 241 00:14:24,658 --> 00:14:26,910 ఇంకా అది నిజంగా చిత్రంగా ఉంటుందని విన్నాను. 242 00:14:26,910 --> 00:14:29,329 ఓహ్, నేను నీ కోసం మాస్క్ తెచ్చాను. 243 00:14:29,996 --> 00:14:31,957 నాకు నచ్చింది! ఇది సరదాగా ఉంటుంది. 244 00:14:31,957 --> 00:14:34,417 నిన్ను ప్రొఫెసర్ మెక్ కార్మాక్ కి పరిచయం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. 245 00:14:35,001 --> 00:14:38,046 ఆయన హావ్తోర్న్ క్లబ్ లో ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇంకా ఆయన గొప్ప మార్గదర్శి. 246 00:14:38,046 --> 00:14:40,215 అద్భుతం. నేను ఇంక ఆగలేను. 247 00:14:41,049 --> 00:14:42,968 అదృష్టం వరించాలని కోరుకో. -శుభం. 248 00:14:46,388 --> 00:14:48,974 ఆంబర్ ఇంకా మెక్ కార్మాక్ ఇద్దరికీ ఆ క్లబ్ తో అనుబంధం ఉందంటే, 249 00:14:48,974 --> 00:14:50,809 బహుశా అలెక్స్ థాంప్సన్ కూడా అక్కడే ఉండచ్చు. 250 00:14:51,560 --> 00:14:53,103 మనం ఆ పార్టీలోకి జొరబడాలి. 251 00:14:58,567 --> 00:14:59,693 నాకు కొద్దిగా భయంగా ఉంది. 252 00:14:59,693 --> 00:15:03,071 మనం ఎవరెవరిమో గుర్తుంచుకుని కలిసి ఉన్నంత వరకూ మనం బాగానే ఉంటాము. 253 00:15:03,071 --> 00:15:05,198 తేలికే. నియా. చార్లీ. సమీర్. 254 00:15:05,865 --> 00:15:08,493 నియా, చార్లీ, సమీర్. తెలిసింది. 255 00:15:08,577 --> 00:15:09,911 తప్పు పాస్ వర్డ్. 256 00:15:11,746 --> 00:15:13,081 అది సమస్య కావచ్చు. 257 00:15:14,040 --> 00:15:15,750 కాకపోవచ్చు. చూడు. 258 00:15:16,251 --> 00:15:17,586 హావ్తోర్న్ క్లబ్ ముసుగు పార్టీ 259 00:15:17,586 --> 00:15:20,547 "డ్రీ-మ్స్." 260 00:15:21,298 --> 00:15:22,549 "డ్రీమ్స్." 261 00:15:22,549 --> 00:15:23,675 ధన్యవాదాలు, ఆలివర్. 262 00:15:28,597 --> 00:15:30,307 పాస్ వర్డ్ ఏంటి? -డ్రీమ్స్. 263 00:15:31,433 --> 00:15:32,809 ముందుకు సాగండి. 264 00:15:34,436 --> 00:15:37,188 నీకు ఎలా అనిపిస్తోంది? -బాగుంది. ప్రమాణపూర్వకంగా. 265 00:15:37,272 --> 00:15:42,027 సరే, నువ్వు శక్తినంతా కూడగట్టుకునే ప్రయత్నం చేయి. నీ శక్తిలో లోపం ఏర్పడితే, మనం పెద్ద సమస్యలో పడతాం. 266 00:15:42,027 --> 00:15:43,236 నేను మిమ్మల్ని నిరాశపర్చను. 267 00:15:45,614 --> 00:15:46,907 నేను ఆంబర్ ని చూశాను. 268 00:15:46,907 --> 00:15:49,284 మంచిది. మెక్ కార్మాక్ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నాడేమో నేను చూస్తాను. 269 00:15:49,284 --> 00:15:50,911 మీరు ఇద్దరూ, ఇక్కడే ఉండండి. 270 00:15:50,911 --> 00:15:52,996 కానీ జాగ్రత్త. బాగా దగ్గరగా వెళ్లవద్దు. 271 00:15:52,996 --> 00:15:54,080 సరే. 272 00:15:57,876 --> 00:15:59,836 మనం దగ్గరగా వెళ్లగలమేమో చూద్దాం. 273 00:15:59,920 --> 00:16:02,088 నియా చెప్పిన విషయం విన్నావు. రెయిన్బో శక్తి కోల్పోతే ఏం చేయాలి? 274 00:16:02,172 --> 00:16:03,548 ఇక్కడ అందరూ మన నిజరూపాలు చూసేస్తారు. 275 00:16:03,632 --> 00:16:06,718 కానీ మనం ఇక్కడ ఉండి చాటుగా వారి మాటలు వినలేం. నేను ఇప్పుడే వస్తాను. 276 00:16:07,719 --> 00:16:09,429 హేయ్, నీ ఫోన్ కేస్ నాకు నచ్చింది. 277 00:16:10,597 --> 00:16:11,890 మా చెల్లెలకి కూడా ఇలాంటిదే ఉంది. 278 00:16:11,890 --> 00:16:12,974 తనకి లామాస్ అంటే ఇష్టం. 279 00:16:13,725 --> 00:16:14,893 మంచిది. 280 00:16:14,893 --> 00:16:17,062 అవును. పద లామాస్. 281 00:16:17,062 --> 00:16:18,521 సరే. 282 00:16:19,231 --> 00:16:21,900 ఓహ్, సిడ్! నువ్వు ఇది రుచి చూడాలి. 283 00:16:22,400 --> 00:16:24,736 నేను ఈ క్లబ్ లో చేరాలి. 284 00:16:29,866 --> 00:16:33,161 మెక్ కార్మాక్ ఇక్కడ ఎక్కడా లేడు. -కంగారు పడకు. అతను ఖచ్చితంగా వస్తాడు. 285 00:16:33,245 --> 00:16:36,248 ఒకసారి అచ్చులని తగ్గించి వేస్తే ఇది తేలిక అవుతుంది. 286 00:16:36,248 --> 00:16:38,750 ఇదిగో, ఇలా అనడానికి ప్రయత్నించు, ఉహ్... అనడానికి ప్రయత్నించు "బోగో పోగో." 287 00:16:39,292 --> 00:16:42,045 రెయిన్బో, అది విన్నావా? ఆస్ట్రేలియన్ యాస. 288 00:16:42,045 --> 00:16:43,255 అతనే అలెక్స్ థాంప్సన్. 289 00:16:44,631 --> 00:16:47,592 ఇది పని చేస్తుంది, మిత్రమా. నువ్వు సాధన చేయాలంతే. 290 00:16:48,301 --> 00:16:49,594 నియా, అక్కడ! 291 00:16:52,722 --> 00:16:54,057 నన్ను క్షమించు! నేను... 292 00:16:54,057 --> 00:16:55,475 హేయ్! -లేదు... 293 00:16:55,976 --> 00:16:58,812 అలెక్స్ థాంప్సన్ ఇక్కడ ఉన్నాడు. రెయిన్బో నేనూ ఇప్పుడే అతడిని చూశాము. 294 00:16:58,812 --> 00:17:01,064 నియా, చార్లీ, సమీర్, అతడిని నేను చూశాను. 295 00:17:01,565 --> 00:17:03,275 నిషిద్ధ ప్రాంతం 296 00:17:07,946 --> 00:17:09,781 బహుశా అతను తిరిగి వచ్చేవరకూ మనం వేచి ఉండాలేమో. 297 00:17:09,863 --> 00:17:11,199 మనం ఇప్పటికే ఇంత దూరం వచ్చాము. 298 00:17:11,283 --> 00:17:13,743 ఇంక అలెక్స్ థాంప్సన్ నిజంగా ఎవరో మనం తెలుసుకోవలసిన సమయం వచ్చింది. 299 00:17:14,244 --> 00:17:16,537 కానీ మనం పట్టుబడితే ఏంటి? మనల్ని తన్ని తరిమేస్తారు. 300 00:17:16,621 --> 00:17:19,165 సరే, నేను లోపలికి వెళ్తున్నాను. నేను దీని అంతు చూస్తాను. 301 00:17:25,881 --> 00:17:27,215 అతను ఎక్కడికి వెళ్లాడు? 302 00:17:30,844 --> 00:17:33,763 ఏం చేస్తున్నావు? -మనం థాంప్సన్ ముఖాన్ని ఒకసారి చూడాలి. 303 00:17:33,847 --> 00:17:35,849 కానీ అతను కనిపించాక మనం ఏం చేయాలి? 304 00:17:35,849 --> 00:17:36,933 వ్యూహం మార్చాలా? 305 00:17:37,017 --> 00:17:38,018 అది వినడానికి సరదాగా ఉంది. 306 00:17:38,018 --> 00:17:40,896 లేదు. ఇది ప్రమాదకరం అనిపిస్తోంది. ఇది తీవ్రమైన విషయం, చార్లీ. 307 00:17:40,896 --> 00:17:43,064 మనం అలా తొంగి చూస్తే చాలు. అప్పుడు పట్టుబడము. 308 00:17:43,148 --> 00:17:45,817 ఇలా చూడు. మనం తెలివైన వాళ్లం. ఏదో పరిష్కారం కనుక్కుందాం. 309 00:17:45,901 --> 00:17:48,528 మనం సంతోషంగా ముఖాలు పెట్టి ఈ పనిని పూర్తి చేద్దాం. 310 00:17:48,612 --> 00:17:50,530 సంతోషంగా ముఖాలు పెట్టి నేను అలసిపోయాను. 311 00:17:51,114 --> 00:17:53,241 మెక్ కార్మాక్ మా అమ్మని ఇరికించాడని నేను రుజువు చేయలేకపోతే, 312 00:17:53,325 --> 00:17:55,493 ఆమె ఉద్యోగం పోవచ్చు. లేదా ఇంకా ఘోరం జరగచ్చు! 313 00:17:55,577 --> 00:17:56,703 మేము అన్నీ కోల్పోతాము. 314 00:17:56,703 --> 00:18:00,624 బహుశా అంతా బాగానే ఉందని అందరూ నటించగలరేమో, కానీ ఇంక నా వల్ల కాదు. 315 00:18:00,624 --> 00:18:02,208 నేను నటించబోవడం లేదు! 316 00:18:02,292 --> 00:18:04,920 నేను ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను, కానీ సిడ్నీ విషయంలో ఆందోళనగా ఉంది. 317 00:18:04,920 --> 00:18:07,380 వాళ్లు ఆమెను వాడుకుంటున్నారు, కానీ అది తనకు తెలియడం లేదు. 318 00:18:07,464 --> 00:18:09,841 మా అందరికీ సాయం చేయాలనే ఉంది, కానీ పట్టుబడకూడదు అనిపిస్తోంది. 319 00:18:09,925 --> 00:18:13,136 నియా, మెక్ కార్మాక్ మనల్ని అనుసరించాడు. అతను మీ అమ్మని ఇరికిస్తున్నాడు. 320 00:18:13,220 --> 00:18:14,846 అతను ఇంకేం చేయబోతున్నాడో ఎవరికి తెలుసు? 321 00:18:22,395 --> 00:18:23,980 నేను... నేను దీన్ని ఆపలేను. 322 00:18:24,064 --> 00:18:26,483 అవును, నువ్వు చేయగలను. నువ్వు చేయాలి. 323 00:18:27,609 --> 00:18:28,610 నన్ను క్షమించు. 324 00:18:38,078 --> 00:18:40,455 హేయ్, అన్నింటికన్నా కష్టమైనది దక్షిణాఫ్రికా యాస. 325 00:18:40,455 --> 00:18:43,708 ఆస్ట్రేలియా భాష వాస్తవంగా చాలా తేలిక. నేను కొద్దికాలంగా దాని మీద కృషి చేస్తున్నాను. 326 00:18:43,792 --> 00:18:45,627 బహుశా సుమారు ఆరు నెలలుగా. 327 00:18:46,211 --> 00:18:48,463 అయితే, నువ్వు ఏం గుర్తించావు? 328 00:18:48,547 --> 00:18:49,548 ఇది మంచిది, కదా? 329 00:18:54,302 --> 00:18:55,303 అతను వెళ్లిపోయాడు. 330 00:18:58,098 --> 00:18:59,099 రెయిన్బో. 331 00:19:01,101 --> 00:19:02,852 ఏం జరుగుతోందో నాకు తెలియడం లేదు. 332 00:19:02,936 --> 00:19:04,437 నా విషయంలో ఏదో పొరపాటు జరుగుతోంది. 333 00:19:04,521 --> 00:19:06,690 నువ్వు శక్తి కోల్పోయినప్పుడు ఏం జరుగుతుందో అది చెప్పు చాలు. 334 00:19:06,690 --> 00:19:08,108 అది వివరించడం కష్టం. 335 00:19:08,858 --> 00:19:11,778 నేను... నేను హఠాత్తుగా ఆగిపోతాను. 336 00:19:11,778 --> 00:19:14,197 "ఆగిపోతాను" అంటే ఎలా ఉంటుంది? 337 00:19:14,781 --> 00:19:16,449 అది ప్రతీసారీ వేరేగా ఉంటుంది. 338 00:19:17,951 --> 00:19:18,952 నేను... ఆ బోర్డు గదిలో, 339 00:19:18,952 --> 00:19:23,290 మీ అమ్మ గురించి వాళ్లు అలా మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చింది. 340 00:19:23,290 --> 00:19:24,958 నాకు కూడా అంతే. 341 00:19:24,958 --> 00:19:26,501 ఆ తరువాత నేను... 342 00:19:26,585 --> 00:19:31,965 సమీర్ తన స్వదేశం ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చిందో చెబుతుంటే విచారం కలిగింది. 343 00:19:33,133 --> 00:19:35,594 లేదా బోవీ కుక్క గురించి ఆ ప్రకటన చూస్తే బాధ కలిగింది. 344 00:19:37,137 --> 00:19:40,849 ఇంక ఇప్పుడు నా గొంతు పూడుకుపోయింది, నాకు చాలా బాధగా ఉంది. 345 00:19:42,475 --> 00:19:44,060 నన్ను క్షమించు. నిన్ను నిరాశపరిచాను. 346 00:19:45,270 --> 00:19:46,313 నువ్వు నిరాశపర్చలేదు. 347 00:19:46,313 --> 00:19:50,191 చెడు విషయాలు చూసి నేను తట్టుకోలేను. 348 00:19:51,026 --> 00:19:53,278 నువ్వు చెప్పినట్లు, నేను సంతోషపు పాట నుండి పుట్టాను. 349 00:19:53,278 --> 00:19:54,863 మన అందరికీ సమస్యలు ఉంటాయి. 350 00:19:56,364 --> 00:19:59,534 బహుశా కొన్నిసార్లు 351 00:20:00,493 --> 00:20:03,163 ఈ కష్ట సమయాలలో కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలేమో. 352 00:20:04,331 --> 00:20:05,957 కానీ అన్నిసార్లు మనం ఆ పని చేయలేము. 353 00:20:08,460 --> 00:20:11,463 మన భావాలను మనలోనే దాచుకోవడం ప్రమాదకరం కూడా. 354 00:20:11,963 --> 00:20:14,674 అయితే, నాకు బాధ కలిగినప్పుడు, 355 00:20:16,676 --> 00:20:18,136 అది ఫర్వా లేదా? 356 00:20:18,220 --> 00:20:19,262 అవును. 357 00:20:19,346 --> 00:20:23,099 నాకు కూడా అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. అందుకని నాలో ఏదో లోపం ఉందంటావా? 358 00:20:23,183 --> 00:20:24,434 ఖచ్చితంగా కాదు. 359 00:20:24,434 --> 00:20:26,853 నేను ఎప్పుడూ నా భావాలను పంచుకుంటూ ఉంటాను. 360 00:20:27,479 --> 00:20:28,813 అది పూర్తిగా సర్వసాధారణం. 361 00:20:29,898 --> 00:20:31,983 నీలో ఎలాంటి లోపం లేదు, రెయిన్బో. 362 00:20:32,067 --> 00:20:36,321 నువ్వు సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా, ఎలా ఉన్నా నువ్వంటే మాకు ఇష్టం. 363 00:20:37,239 --> 00:20:38,240 నిజంగానా? 364 00:20:38,949 --> 00:20:39,950 నేను ప్రమాణం చేస్తున్నాను. 365 00:20:41,243 --> 00:20:43,703 నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు. 366 00:20:44,371 --> 00:20:45,997 నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. 367 00:20:46,581 --> 00:20:47,958 కొన్నిసార్లు అలాగే జరుగుతూ ఉంటుంది. 368 00:20:52,003 --> 00:20:53,004 ధన్యవాదాలు. 369 00:21:14,526 --> 00:21:15,610 నేను తనని మిస్ అవుతాను. 370 00:21:16,528 --> 00:21:17,529 నేను కూడా. -నేను కూడా. 371 00:21:20,156 --> 00:21:21,199 మనం ఇంక వెళ్లాలి. 372 00:21:21,283 --> 00:21:24,494 ఆగు. మనం మన రూపాల్లోకి వచ్చేశాం. మనం పట్టుబడతాం. 373 00:21:26,997 --> 00:21:29,332 ఈ జాకెట్స్ తో ఏం చేద్దాం? బహుశా మనం... 374 00:21:32,502 --> 00:21:33,545 ఏంటి? 375 00:21:33,545 --> 00:21:36,756 ఇది చూడు. ఇక్కడ ఒక ద్వారం ఎందుకు ఉంది? 376 00:21:43,638 --> 00:21:45,223 ఒక విగ్గు. 377 00:21:45,932 --> 00:21:48,852 అయితే, మనకి విగ్గు ఇంకా కొంత మేకప్ సామగ్రి ఉన్నాయా? 378 00:21:48,852 --> 00:21:50,896 ఇంకా కొన్ని జతల దుస్తులు. 379 00:21:52,063 --> 00:21:54,024 ఇది ఓల్డ్ చాన్సీ వస్త్రంలాగా ఉంది. 380 00:21:54,691 --> 00:21:56,776 ఆ మైదానాల పనివాడు వేసుకున్నది ఇదే. 381 00:21:57,277 --> 00:21:59,779 మా అమ్మని కలిసినప్పుడు అలెక్స్ థాంప్సన్ ధరించిన దుస్తులు కూడా ఇవే. 382 00:22:02,490 --> 00:22:04,367 మా అమ్మని ఇరికించారని మనం రుజువు చేయవచ్చు. 383 00:22:04,451 --> 00:22:05,452 ఇదే ఆధారం. 384 00:22:08,496 --> 00:22:09,664 ఇప్పుడు ఏం చేద్దాం? 385 00:22:18,089 --> 00:22:20,217 బాత్ రూమ్ ఆ హాల్లో కుడి వైపు ఉంది. 386 00:22:21,468 --> 00:22:23,261 ధన్యవాదాలు? 387 00:22:30,894 --> 00:22:32,062 అతడే థాంప్సన్. 388 00:22:33,730 --> 00:22:35,649 సిడ్నీ ఇంకా ఆంబర్ తో కలిసి ఉన్నాడు. 389 00:22:36,942 --> 00:22:38,193 నేను అతడిని హాలు నడవలో చూశాను. 390 00:22:38,193 --> 00:22:41,947 లియమ్. నా చెల్లెలి స్నేహితుడు. 391 00:22:42,906 --> 00:22:46,326 సిడ్ దుష్టుల గుంపులో చేరుతోందా? 392 00:22:47,994 --> 00:22:49,371 మెక్ కార్మాక్? 393 00:22:49,371 --> 00:22:52,249 లోపలికి వెళదాం, టాడ్. -అలాగే. 394 00:22:52,249 --> 00:22:55,210 నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకున్నాను. 395 00:22:55,210 --> 00:22:56,878 ఏవరీ బాయిడ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? 396 00:23:03,301 --> 00:23:04,386 దురదృష్టవశాత్తూ, 397 00:23:04,386 --> 00:23:08,181 నేర పరిశోధన జరుగుతున్న ప్రెసిడెంట్ ఉండటం బోర్డు కు అంత సౌకర్యంగా లేదు. 398 00:23:08,890 --> 00:23:09,891 సరే. 399 00:23:09,975 --> 00:23:13,061 కాబట్టి లైలా ని తక్షణం విధుల నుంచి తప్పించబోతున్నాం. 400 00:23:15,188 --> 00:23:17,065 ఆగు, నువ్వు ఏం అంటున్నావు... ఏంటి... -అవును. 401 00:23:17,566 --> 00:23:19,693 నువ్వు యాక్టింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవాలి. 402 00:23:21,486 --> 00:23:24,406 నీ మీద మాకు చాలా ఆశలు ఉన్నాయి, ప్రెసిడెంట్ మెక్ కార్మాక్. 403 00:23:24,406 --> 00:23:25,490 ధన్యవాదాలు. 404 00:24:26,009 --> 00:24:28,011 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్