1 00:00:06,216 --> 00:00:09,970 సిసేమ్ వర్క్ షాప్ సమర్పించు 2 00:00:14,933 --> 00:00:16,058 మీకు అపాయింట్మెంట్ ఉందా? 3 00:00:16,142 --> 00:00:19,020 ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి మేము ఆతృతతో ఉన్నాం. ఆధారాలు సేకరించారా? 4 00:00:19,104 --> 00:00:23,233 సరే, నేను హావ్తోర్న్ క్లబ్ ఇంకా డిజైన్ వర్క్ షాప్ లకు వెళ్లాను, కానీ మన్నించాలి. 5 00:00:23,233 --> 00:00:25,569 అక్కడ మారువేషాలు, చెట్టు బెరడు ఆనవాళ్లు కనిపించలేదు. 6 00:00:25,569 --> 00:00:27,028 వాటిని తరలించేసి ఉంటారు. 7 00:00:27,112 --> 00:00:29,030 వాళ్లు అలా ఎలా చేయగలుగుతున్నారు? 8 00:00:29,114 --> 00:00:30,448 వాళ్లు సొంతంగా ఇలా చేయలేదు. 9 00:00:30,532 --> 00:00:33,159 ఆంబర్ విలియమ్స్ కజిన్ కోటీశ్వరుడైన ఏవరీ బాయిడ్. 10 00:00:33,243 --> 00:00:35,912 మీరు అతని మీద దృష్టి సారించాలి. అతని పాత్ర కూడా ఇందులో ఉంటుంది. 11 00:00:35,996 --> 00:00:36,997 ఆగండి. 12 00:00:36,997 --> 00:00:40,000 మొదట కాలేజీ స్టూడెంట్స్ అన్నారు, ఇప్పుడు ఒక బోర్డు సభ్యుడి మీదనే ఆరోపణలా? 13 00:00:40,000 --> 00:00:42,627 ఈ మొత్తం వ్యవహారాన్ని కాలేజీ స్టూడెంట్స్ మాత్రమే ఎలా చేయగలరు? 14 00:00:44,504 --> 00:00:46,548 మీ ఉద్దేశాలు మంచివి అని నాకు తెలుసు, 15 00:00:46,548 --> 00:00:48,717 కానీ నేను మళ్లీ చీకట్లలో రాళ్లు వేయలేను. 16 00:00:48,717 --> 00:00:52,262 కాబట్టి, మీరు నాకు ఏదైనా కొత్త సమాచారం అందిస్తే తప్ప, 17 00:00:52,262 --> 00:00:53,388 నేను ఇంక ఏమీ చేయలేను. 18 00:00:53,388 --> 00:00:54,848 నాకు కొద్దిగా పని ఉంది. 19 00:01:02,272 --> 00:01:05,442 వాళ్లు ఏదో విధంగా ఎప్పుడూ మనకంటే ఒక అడుగు ముందే ఉంటున్నారు. 20 00:01:05,442 --> 00:01:07,068 వాళ్లకు కూడా ఏదైనా దెయ్యం సాయం చేస్తోందేమో. 21 00:01:07,152 --> 00:01:08,820 ఏవరీ బాయిడ్ సజీవంగా ఉన్నాడు. 22 00:01:09,321 --> 00:01:12,699 డోనవన్ గనుక మనకు సాయం చేయలేకపోతే, ఈ పనిని మనకు మనమే పరిష్కరిద్దాము. 23 00:01:30,050 --> 00:01:32,052 ఏవరీ. నేను. 24 00:01:33,929 --> 00:01:35,180 నీకు సమయం మించిపోయింది. 25 00:01:50,320 --> 00:01:52,113 ఘోస్ట్ రైటర్ 26 00:01:52,197 --> 00:01:54,282 సరే, మనకి తెలిసినది ఏంటి? 27 00:01:56,284 --> 00:01:59,329 అంటే, ఏవరీ బాయిడ్ తన కజిన్ ఆంబర్ ని నియమించి 28 00:01:59,329 --> 00:02:02,290 ఎలోకెంట్ పెసంట్ తిరిగి ఈజిప్టుకు వెళ్లిపోకుండా అడ్డుకోవాలని కుట్ర పన్నాడు. 29 00:02:02,374 --> 00:02:03,875 గ్రిఫిన్ తో నకిలీ ఈపీ తయారు చేయించాడు. 30 00:02:03,959 --> 00:02:04,960 హావ్తోర్న్ క్లబ్ నియామకం 31 00:02:05,544 --> 00:02:10,966 ఆ తరువాత లియమ్ అసలైన ఈపీ స్థానంలో నకిలీది పెట్టి, మా అమ్మని ఇరికించాడు. 32 00:02:10,966 --> 00:02:14,010 నాకు అనిపించేది ఏమిటంటే ఏవరీ బాయిడ్ పెద్దగా శ్రమపడకుండా ఆంబర్ 33 00:02:14,094 --> 00:02:15,720 తన మిత్రుడు లియమ్ లని ఒప్పించాడు, కానీ... 34 00:02:15,804 --> 00:02:17,806 ప్రాణ స్నేహితులు 35 00:02:18,765 --> 00:02:21,268 ...గ్రిఫిన్ సంగతి ఏంటి? అతను ఎందుకు పాల్గొని ఉంటాడు? 36 00:02:22,394 --> 00:02:25,855 బహుశా నీ చెల్లెలు మాదిరిగానే. హావ్తోర్న్ క్లబ్ లో సభ్యత్వం కోసం కావచ్చు. 37 00:02:25,939 --> 00:02:27,941 కానీ నువ్వు చెప్పింది నాకు అర్థమయింది, చార్లీ. 38 00:02:28,900 --> 00:02:32,237 ఈ కేసుకి సంబంధించిన అందరిలోనూ, గ్రిఫిన్ మాత్రమే బయట వ్యక్తి. 39 00:02:32,237 --> 00:02:36,199 ఆంబర్ చిన్నతనం నుండి లియమ్ తో కలిసి పెరిగింది, కానీ గ్రిఫిన్ ని ఈ ఏడాదే కలుసుకుంది. 40 00:02:37,867 --> 00:02:41,663 అయితే బహుశా మనం దీనిని మనకు అనుకూలంగా మలుచుకుని 41 00:02:42,163 --> 00:02:43,999 అతడిని మన వైపు తిప్పుకోవచ్చు అనుకుంటా. 42 00:02:45,041 --> 00:02:46,167 బాగానే ఉన్నావా? 43 00:02:46,251 --> 00:02:47,294 నియా! 44 00:02:58,805 --> 00:03:01,391 నియా. 45 00:03:02,934 --> 00:03:04,144 ఇలా రా, కూర్చుందాం. 46 00:03:05,020 --> 00:03:06,438 నువ్వు బాగానే ఉన్నావా? 47 00:03:06,438 --> 00:03:09,399 ఇది చాలా విచిత్రంగా ఉంది. 48 00:03:09,399 --> 00:03:12,485 ఒక దృశ్యం నా తలలో కనిపించింది. 49 00:03:13,570 --> 00:03:16,406 మా కుటుంబాన్ని బలవంతంగా ఇంటి నుండి బయటకు గెంటేస్తున్నారు. 50 00:03:17,699 --> 00:03:18,825 అది ఆలివర్ పనేనా? 51 00:03:19,451 --> 00:03:22,203 ఏదో గొంతు వినిపించింది, కానీ అది ఆలివర్ ది కాదు. 52 00:03:23,371 --> 00:03:24,456 ఆమె నా పేరుని పలికింది. 53 00:03:26,708 --> 00:03:30,962 అది ఎలాగో నాకు తెలియదు, కానీ ఆమె భవిష్యత్తును చూపించింది అనుకుంటున్నాను. 54 00:03:31,463 --> 00:03:35,550 నీ తలలో ఒక కాల్పనిక పాత్ర నీకు భవిష్యత్తును చూపిస్తోందా? 55 00:03:36,593 --> 00:03:37,719 అది నాకు బాగా అనిపించలేదు. 56 00:03:38,553 --> 00:03:40,222 భవిష్యత్తు అంటే అలాగే ఉంటుంది. 57 00:03:41,223 --> 00:03:43,475 అది ఇంకా జరగలేదు, కాబట్టి మనం దానిని మార్చగలం. 58 00:03:43,475 --> 00:03:45,268 అవును. మనం ఈ కేసుని పరిష్కరిద్దాం, 59 00:03:45,352 --> 00:03:48,772 ఇంకా మీ అమ్మ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా మళ్లీ చేరేలా ప్రయత్నిద్దాం. 60 00:03:48,772 --> 00:03:51,733 ఆ తరువాత నీ వీడియో గేమ్స్ లో రహస్యాలను ఛేదిస్తూ నువ్వు గడిపేయవచ్చు. 61 00:03:56,529 --> 00:04:00,116 కానీ... మనం మాత్రమే ఈ పనిని పూర్తి చేయలేము. 62 00:04:02,869 --> 00:04:04,079 ఆ అవకాశమే లేదు. 63 00:04:04,079 --> 00:04:05,872 నేను ఎప్పుడయినా నిన్ను ఏదైనా సాయం అడిగానా? 64 00:04:05,956 --> 00:04:08,541 నిన్ననే అడిగావు, అంతకుముందు రోజు, ఆ ముందు రోజు అడిగావు. 65 00:04:08,625 --> 00:04:09,626 సరే, నాకు అర్థం అయింది. 66 00:04:09,626 --> 00:04:14,631 కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం, నువ్వు గ్రిఫిన్ తో స్నేహంగా ఉంటావు కాబట్టి, 67 00:04:14,631 --> 00:04:17,259 బహుశా అతడిని మంచి వైపు... అంటే మన వైపు తిప్పగలవేమో చూడు. 68 00:04:17,341 --> 00:04:19,719 యూనివర్సిటీలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తికి వ్యతిరేకంగా గ్రిఫిన్ 69 00:04:19,803 --> 00:04:21,555 ఎలా మారతాడని నువ్వు అనుకుంటున్నావు? 70 00:04:22,138 --> 00:04:23,682 ఎందుకంటే నాకు నువ్వు బాగా తెలుసు. 71 00:04:24,683 --> 00:04:26,851 అంటే నా జీవితంలో ఎంతోకాలంగా నిన్ను చూస్తున్నాను కదా. 72 00:04:27,477 --> 00:04:28,937 సరే, బహుశా నువ్వు అలా చూడకూడదు. 73 00:04:31,189 --> 00:04:33,817 హావ్తోర్న్ క్లబ్ లో సభ్యత్వానికి వాస్తవంగా నేను అర్హురాలిని కాను. 74 00:04:35,110 --> 00:04:36,111 నీకు నేను సాయం చేయలేను. 75 00:04:37,195 --> 00:04:43,159 ఆ పిచ్చి క్లబ్ లో నువ్వు ఉన్నా లేకపోయినా, నాకు తెలిసి నువ్వు చాలా అద్భుతమైన మనిషివి. 76 00:04:43,827 --> 00:04:45,912 ఏదో ఒక రోజు నువ్వు ఈ ప్రపంచాన్ని ఏలతావు. 77 00:04:46,913 --> 00:04:49,583 వాళ్లు చేసిన తప్పుకి వాళ్లకి శిక్షపడాలని కోరుకోవా? 78 00:04:51,042 --> 00:04:52,419 ఖచ్చితంగా అనుకుంటాను. 79 00:04:53,003 --> 00:04:54,838 అయితే అప్పుడు మనం ఈ విధంగానే చేయాలి. 80 00:04:57,966 --> 00:04:59,175 ఉంటాను, నాన్నా. 81 00:04:59,259 --> 00:05:00,302 సమీర్, ఆగు. 82 00:05:02,095 --> 00:05:04,431 నేను డ్యూటీకి వెళ్లినప్పుడు ఇద్రిస్ ని నువ్వు చూసుకోవాలి. 83 00:05:04,431 --> 00:05:05,432 ఈ రోజా? 84 00:05:05,432 --> 00:05:07,684 మీ అమ్మకి పని ఉంది, ఇంకా అమీరా కి ఈ రోజు సెలవు. 85 00:05:08,518 --> 00:05:09,936 కానీ నా స్నేహితులు, నేనూ కలిసి 86 00:05:10,020 --> 00:05:13,857 ఒక పెద్ద ఆర్కియాలజీ సమస్యని పరిష్కరించే పనిలో మధ్యలో ఉన్నాం. 87 00:05:13,857 --> 00:05:16,484 ఆర్కియాలజీ అంటే పురాతన విశేషాల అధ్యయనమే కదా? 88 00:05:16,568 --> 00:05:18,445 వాటిలో అత్యవసరమైన పనులు సహజంగానే ఏమీ ఉండవు. 89 00:05:18,445 --> 00:05:20,864 అవును, కానీ కాదు. 90 00:05:20,864 --> 00:05:22,073 అయితే, తమ్ముడిని తీసుకెళ్లు. 91 00:05:22,157 --> 00:05:23,366 నేను సాయం చేయగలను. 92 00:05:23,450 --> 00:05:25,785 చూశావా? సమస్య పరిష్కారం అయిపోయింది. 93 00:05:27,412 --> 00:05:28,413 ధన్యవాదాలు, నాన్నా. 94 00:05:32,250 --> 00:05:33,543 అలాగే, తప్పకుండా. 95 00:05:33,627 --> 00:05:34,836 మంగళవారం డెలివరీ పనులు. 96 00:05:35,545 --> 00:05:37,839 కానీ ఉదయం తొమ్మిది గంటల లోపే అవుతుందా? ఆ సమయంలో క్లాస్ ఉంది. 97 00:05:38,798 --> 00:05:39,799 అలాగే. 98 00:05:40,383 --> 00:05:42,886 సరే, అది మంచి పని. ధన్యవాదాలు. అలాగే. కలుద్దాం. 99 00:05:43,470 --> 00:05:45,180 ఫోన్ విషయంలో మన్నించండి, మిత్రులారా. 100 00:05:45,764 --> 00:05:46,765 ఏమీ మళ్లీ ఊరెళ్లిందా? 101 00:05:46,765 --> 00:05:49,726 ఓహ్, అవును. కానీ నాకు ఇది బాగుంది. అదనపు షిఫ్టుల వల్ల ఆదాయం పెరిగి 102 00:05:49,726 --> 00:05:52,520 గ్రాడ్యుయేషన్ తరువాత ప్రపంచ యాత్రకు డబ్బు ఆదా చేసుకుంటున్నాను. 103 00:05:52,604 --> 00:05:53,730 అది చూడు. 104 00:05:53,730 --> 00:05:55,732 యాత్ర. వావ్. 105 00:05:55,732 --> 00:05:57,609 నువ్వు ఈ ప్రదేశాలన్నీ పర్యటిస్తావా? 106 00:05:57,609 --> 00:05:59,694 నేను తగినంత డబ్బు ఆదా చేసుకోగలిగితే చూస్తాను. 107 00:05:59,778 --> 00:06:02,906 సూర్యుడిని అనుసరిస్తూ ప్రపంచంలో ప్రతి ఒక్క ఖండాన్ని చూడాలని కోరుకుంటున్నాను. 108 00:06:04,783 --> 00:06:07,202 ఇదిగో. నీ యాత్ర కోసం దీనిని వాడుకోవచ్చు. 109 00:06:07,869 --> 00:06:09,454 నేను మెచ్చుకుంటున్నాను, చిన్న బాబూ. 110 00:06:09,454 --> 00:06:12,832 కానీ బాబూ, ఏదో ఒక రోజు నువ్వు చేయబోయే సాహసం కోసం దీనిని దాచుకోవచ్చు కదా? 111 00:06:13,458 --> 00:06:14,542 అలాగే. 112 00:06:17,003 --> 00:06:19,214 హేయ్, ఇద్రిస్. నీ ఆర్డర్ తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. 113 00:06:23,385 --> 00:06:26,930 సిడ్నీ మనలో చేరింది. ఆంబర్, లియమ్ లకు వ్యతిరేకంగా గ్రిఫిన్ మారతాడేమో కనుక్కుంటుంది. 114 00:06:31,101 --> 00:06:34,479 ఇది నాకే ఇలా కనిపిస్తోందా లేక ఈ ఈగ నిజంగానే మెరుస్తోందా? 115 00:06:35,855 --> 00:06:37,232 ఇది మిణుగురు పురుగు అనుకుంటా. 116 00:06:43,572 --> 00:06:47,909 మన నగరంలోనా? కానీ దీనిని మనం తప్ప మరెవ్వరూ చూడలేరేమో? 117 00:06:50,745 --> 00:06:51,788 సరే, చిట్టి మిత్రుడా. 118 00:06:52,747 --> 00:06:56,585 నిన్ను చంపాలని చూసినందుకు నన్ను మన్నించు. ఇప్పుడు, నువ్వు ఏ పుస్తకం నుండి వచ్చావు? 119 00:06:59,796 --> 00:07:01,172 మనం దానిని అనుసరించాలని అనుకుంటోంది. 120 00:07:05,427 --> 00:07:07,095 ఇక్కడే ఉండు. ఒక్క క్షణంలో వస్తాను. 121 00:07:13,435 --> 00:07:14,895 మరిన్ని మిణుగురులా? 122 00:07:15,979 --> 00:07:18,315 "డబ్ల్యు ఎ టి ఎ"? 123 00:07:19,649 --> 00:07:23,612 "వాటా." బహుశా వాటి ఉద్దేశం వాటర్ ఏమో? 124 00:07:31,828 --> 00:07:33,872 ఆగు. -పద, వాటిని మనం అనుసరించాలని చెబుతున్నాయి. 125 00:07:34,706 --> 00:07:36,082 మరి ఇద్రిస్ సంగతి ఏంటి? 126 00:07:36,666 --> 00:07:37,709 హేయ్, ఇద్రిస్! 127 00:07:38,293 --> 00:07:39,294 ఏంటి? 128 00:07:41,922 --> 00:07:45,258 మహానగరంలోకి కొన్ని మాయా మిణుగురులను అనుసరించడంలో మాకు సహకరించగలవా? 129 00:07:45,926 --> 00:07:47,052 అలాగే! -సరే! 130 00:07:47,052 --> 00:07:49,346 చార్లీ. -కంగారు పడకు, ఇది ఆట అనుకుంటాడు. 131 00:07:51,473 --> 00:07:52,515 అవి ఎటు వైపు వెళ్లాయి? 132 00:07:52,599 --> 00:07:53,683 ఆ మార్గంలో వెళ్లాయి. హుర్రే! 133 00:07:56,478 --> 00:07:58,480 ఇదంతా ఎప్పటికి ముగుస్తుంది? -త్వరలో. 134 00:07:58,480 --> 00:08:00,273 కానీ నువ్వు శాంతంగా ఉండకపోతే తప్ప. 135 00:08:01,274 --> 00:08:03,401 ఈ పనికి నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు. 136 00:08:04,861 --> 00:08:07,155 నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, నువ్వు కూడా ఇందులో భాగమే. 137 00:08:14,079 --> 00:08:15,997 ఈ మిణుగురు పురుగులు ఎక్కడి నుండి వచ్చాయి? 138 00:08:16,873 --> 00:08:18,124 బహుశా మరొక పరిధి నుండి వచ్చాయి. 139 00:08:18,208 --> 00:08:19,209 నిజంగానా? 140 00:08:19,209 --> 00:08:22,587 లేదు, ఇద్రిస్. అవి సాధారణమైన భయపెట్టని మిణుగురులు. 141 00:08:23,088 --> 00:08:24,673 నువ్వు ఏం చేస్తున్నావు? 142 00:08:25,382 --> 00:08:28,176 మనం ఏదో ఆట ఆడుతున్నాం అనుకుంటున్నాడు, కాబట్టి సరదాగా అంటున్నాను. 143 00:08:28,260 --> 00:08:31,096 కిందటిసారి మనం వాడిని తీసుకువెళ్లినప్పుడు ఏం జరిగిందో నీకు గుర్తు లేదా? 144 00:08:31,096 --> 00:08:32,597 మా తమ్ముడు భయపడటం నాకు ఇష్టం లేదు. 145 00:08:33,515 --> 00:08:35,600 ఈ మిణుగురులు మరొక పరిధి నుండి వస్తే, 146 00:08:35,600 --> 00:08:37,769 అప్పుడు వాళ్లు లేజర్ గన్స్ తో షూట్ చేయవచ్చు కదా. 147 00:08:39,645 --> 00:08:41,398 వీడు నాకు సరదాగా అనిపిస్తున్నాడు. 148 00:08:41,398 --> 00:08:43,400 అవి పూర్తిగా లేజర్ గన్స్ తో షూట్ చేస్తాయి. 149 00:08:44,025 --> 00:08:45,110 నియా. 150 00:08:45,694 --> 00:08:48,697 నేను ఇక్కడ ఉన్నాను. నన్ను కనిపెట్టు. 151 00:08:49,573 --> 00:08:50,657 మీరు ఇది విన్నారా? 152 00:08:51,449 --> 00:08:52,450 ఏంటి వినడం? 153 00:08:52,534 --> 00:08:55,537 ఆ గొంతు. ఆమె నన్ను పేరు పెట్టి పిలుస్తోంది. తనని వెతకమని చెబుతోంది. 154 00:08:55,537 --> 00:08:58,290 నేను విన్నాను. తను "హాయ్, ఇద్రిస్" అంది. 155 00:09:05,422 --> 00:09:06,965 ఆమె అక్కడ ఉంది. ఆ నీటిలో ఉంది. 156 00:09:18,351 --> 00:09:19,436 మత్స్య కన్యా? 157 00:09:20,729 --> 00:09:24,274 నాకు కనిపిస్తోంది. తనకి పొడవైన, ఎర్రటి జుట్టు ఉంది. 158 00:09:25,942 --> 00:09:27,152 నువ్వు ఎవరు? 159 00:09:27,152 --> 00:09:31,656 మామి వాటా. -మామి వాటా ఏంటి? 160 00:09:32,157 --> 00:09:34,534 ఇంతకుముందు వచ్చిన క్లూ గుర్తుందా? వాటా? 161 00:09:34,618 --> 00:09:35,619 అయి ఉండచ్చు. 162 00:09:35,619 --> 00:09:38,121 కానీ... అది నీకు ఎలా తెలుసు, నియా? 163 00:09:38,121 --> 00:09:40,165 నీకు కూడా ఆమె గొంతు వినిపించడం లేదా? 164 00:09:41,499 --> 00:09:43,543 ఆమె కేవలం నీతో మాత్రమే సంభాషిస్తోంది. 165 00:09:43,627 --> 00:09:46,004 ఆగు. మామి వాటా. 166 00:09:46,004 --> 00:09:49,925 గత వేసవిలో ఆఫ్రికన్ కళాప్రదర్శనకు వెళ్లినప్పుడు ఆమె గురించి నేను తెలుసుకున్నాను. 167 00:09:50,634 --> 00:09:53,595 నాకు గుర్తున్నంత వరకూ, ఆమె నీటికి తల్లి. 168 00:09:54,095 --> 00:09:57,307 ఆమె ప్రకృతి సంరక్షకురాలు అని చాలా ఆఫ్రికన్ జాతులు నమ్ముతాయి, 169 00:09:57,307 --> 00:09:59,100 మన ప్రపంచానికీ ఆత్మలకీ మధ్య ఆమె ఉంటుంది. 170 00:09:59,184 --> 00:10:02,938 నాకు కూడా మామి వాటా గురించి తెలుసు. ఆమె గురించిన పుస్తకాన్ని అమీరా నాకు చదివి వినిపించింది. 171 00:10:02,938 --> 00:10:04,105 అది ఏం పుస్తకం? 172 00:10:04,189 --> 00:10:05,190 బాయూ మేజిక్. 173 00:10:05,690 --> 00:10:07,734 ఆ పుస్తకంలో అమ్మాయి పేరు, మ్యాడీ, 174 00:10:07,734 --> 00:10:10,737 బాయూలో తన అమ్మమ్మ గారి ఇంట్లో వేసవి సెలవులను గడుపుతుంది. 175 00:10:10,737 --> 00:10:13,615 ఆమె మిణుగురులను అదుపు చేస్తూ మామి వాటాతో మాట్లాడుతుంటుంది. 176 00:10:13,615 --> 00:10:18,328 అప్పుడు బాయూకి ఏం జరగబోతోందో మామి వాటా ఆమెకు చూపిస్తుంది. 177 00:10:18,328 --> 00:10:21,665 భవిష్యత్తు గురించి దృశ్యాలు. నేను ఇంతకుముందు చూశాను కదా. 178 00:10:22,666 --> 00:10:24,709 మామి వాటా, మాకు నీ సహాయం కావాలి. 179 00:10:30,882 --> 00:10:32,092 హేయ్. -హాయ్. 180 00:10:32,092 --> 00:10:33,343 హాయ్, సిడ్. ఏంటి సంగతి? 181 00:10:33,343 --> 00:10:36,846 పెద్దగా ఏం లేదు. మా చెల్లెలి మేజిక్ టేబుల్ కోసం వాడిన పరికరాలని తిరిగి ఇచ్చేయాలని వచ్చాను. 182 00:10:36,930 --> 00:10:40,600 మంచిది, మేము వ్యవస్థాపకుని వారోత్సవం లైవ్ స్ట్రీమ్ కోసం మంచి నేపథ్యాన్ని తయారు చేస్తున్నాం. 183 00:10:41,518 --> 00:10:42,644 చూడటానికి చాలా బాగుంది. 184 00:10:43,186 --> 00:10:46,648 అవును. ఆ పార్టీ చాలా గొప్పగా ఉంటుంది. ఈ ఏడాది అది బోటులో ఉంటుంది. 185 00:10:46,648 --> 00:10:48,775 నువ్వు వస్తున్నావు, కదా? -అవును. ఎదురుచూస్తున్నాను. 186 00:10:48,775 --> 00:10:50,485 బోటు ఎక్కడం నాకు మొదటిసారి అవుతుంది. 187 00:10:50,569 --> 00:10:52,153 సరే, అదే ఆఖరిసారి కాదులే. 188 00:10:52,237 --> 00:10:54,114 ఇప్పుడు హావ్తోర్న్ క్లబ్ సభ్యురాలివి కూడా కాబట్టి, 189 00:10:54,114 --> 00:10:56,116 నువ్వు అన్ని వేడుకలకు హాజరు కావచ్చు. 190 00:10:57,951 --> 00:10:59,119 ఒక్క క్షణం. 191 00:11:02,831 --> 00:11:03,915 ఈ నేపథ్యం నిజంగా చాలా బాగుంది. 192 00:11:05,500 --> 00:11:06,501 ధన్యవాదాలు. 193 00:11:07,919 --> 00:11:09,087 నువ్వు బాగానే ఉన్నావా? 194 00:11:09,671 --> 00:11:11,214 హా. కేవలం ఆకలిగా ఉంది అంతే. 195 00:11:11,298 --> 00:11:13,884 నాకు కూడా. ఇది పూర్తయ్యాక ఏమైనా తిందామా? 196 00:11:14,885 --> 00:11:15,886 ఏమీ బలవంతం లేదు. 197 00:11:15,886 --> 00:11:17,512 అలాగే. మంచి ప్రతిపాదన. 198 00:11:19,973 --> 00:11:23,351 భోజనం గురించి నేను విన్నానా? నాకు ఆకలేస్తోంది. నేను కూడా మీతో రావచ్చా? 199 00:11:24,853 --> 00:11:26,813 తప్పకుండా! ఎంత ఎక్కువమంది ఉంటే అంత ఆనందం. 200 00:11:28,773 --> 00:11:30,817 ఎలోకెంట్ పెసంట్ ని మా అమ్మ దొంగిలించిందని బోర్డు భావిస్తోంది, 201 00:11:30,901 --> 00:11:33,278 మేము దానిని వెతికి పట్టుకుని, మళ్లీ యూనివర్సిటీకి అప్పగించాలి, 202 00:11:33,278 --> 00:11:34,946 లేదంటే మా తల్లిదండ్రులు పూర్తిగా నష్టపోతారు. 203 00:11:35,030 --> 00:11:39,868 ఏది దొంగిలించబడిందో అది తిరిగి ఇచ్చివేయబడుతుంది. 204 00:11:43,288 --> 00:11:44,372 ఆమె ఎక్కడికి వెళ్లింది? 205 00:11:44,456 --> 00:11:48,793 నాకు తెలియదు. కానీ తను ఏం అంది అంటే, "ఏది దొంగిలించబడిందో అది తిరిగి ఇచ్చివేయబడుతుంది" అని. 206 00:11:50,253 --> 00:11:52,005 మనం చేస్తున్న ప్రయత్నం కూడా అదే కదా. 207 00:11:56,968 --> 00:11:57,969 హలో? 208 00:11:58,053 --> 00:12:00,722 గ్రిఫిన్ ని బయటకు తీసుకువెళ్లాలి అనుకున్నా, కానీ ఆంబర్ కూడా వస్తానంటోంది. 209 00:12:00,722 --> 00:12:01,806 అది మంచిది కాదు. 210 00:12:01,890 --> 00:12:04,309 నాకు ఒక ఆలోచన తట్టింది, కానీ అందుకు నీ సహాయం కావాలి. 211 00:12:04,893 --> 00:12:05,894 నేను వింటున్నాను. 212 00:12:11,608 --> 00:12:12,692 ఇది ఎలా ఉంది? 213 00:12:13,235 --> 00:12:14,402 నేను దాదాపు పూర్తి చేసేశాను. 214 00:12:14,486 --> 00:12:16,238 మంచిది, మనం వెళ్లి భోజనం చేద్దాం. 215 00:12:17,113 --> 00:12:19,074 సరే. ముందు నేను ఇది ఇచ్చేసి వస్తాను. 216 00:12:25,247 --> 00:12:27,999 నువ్వు అంత ఉదాసీనంగా ఉండనక్కరలేదు. అంతా సవ్యంగానే జరుగుతుంది. 217 00:12:29,417 --> 00:12:31,461 స్నేహితులకి అబద్ధాలు చెప్పడానికి నేను ఉత్సాహపడకపోతే, క్షమించు. 218 00:12:32,546 --> 00:12:33,922 సందేశం చార్లీ 219 00:12:35,924 --> 00:12:37,801 ఇది తన చెల్లెలు చార్లీ నుంచి వచ్చింది. 220 00:12:37,801 --> 00:12:40,220 అది వేరొకరి విషయాలలో తలదూర్చడం అవుతుంది. -ఓహ్, లేదు. 221 00:12:43,557 --> 00:12:44,891 ఏంటి? -ఇది ఏంటి? 222 00:12:45,517 --> 00:12:47,811 "వీలైనంత తొందరగా నన్ను ఆనీస్ డైనర్ లో కలుసుకో. 223 00:12:47,811 --> 00:12:51,773 హావ్తోర్న్ క్లబ్ ఇంకా నీ కొత్త మిత్రుల గురించి మా దగ్గర కొత్త సమాచారం ఉంది. 224 00:12:51,773 --> 00:12:52,941 హుర్రే." 225 00:12:53,441 --> 00:12:54,442 నేను దాన్ని తొలగించేస్తాను. 226 00:12:55,485 --> 00:12:56,486 నువ్వు ఏం చేస్తున్నావు? 227 00:12:57,612 --> 00:12:59,823 సిడ్నీకి తెలియని విషయం ఆమెను బాధపెట్టదు. 228 00:12:59,823 --> 00:13:02,284 నేను కూడా ఆ డైనర్ కి వెళ్లి అక్కడ ఏం వినగలనో వింటాను. 229 00:13:02,284 --> 00:13:04,744 నువ్వు సిడ్నీతోనే ఉండు, ఇంకా నేను చెప్పింది గుర్తుంచుకో. 230 00:13:04,828 --> 00:13:06,788 ఆంబర్... -సరే, నేను సిద్ధం. 231 00:13:07,664 --> 00:13:11,209 నేను మర్చిపోయాను. నేను ప్రొఫెసర్ మెక్ కార్మాక్ కి ప్రశ్నాపత్రాల విషయంలో సాయం చేయాలి. 232 00:13:11,293 --> 00:13:12,460 ఓహ్, అవకాశమే లేదు. 233 00:13:13,169 --> 00:13:15,922 అవును. కానీ, మీరు వెళ్లండి, మిమ్మల్ని కొద్దిసేపటిలో కలుస్తాను. 234 00:13:16,923 --> 00:13:18,008 ఇది వినడానికి బాగానే ఉంది. 235 00:13:22,429 --> 00:13:24,514 మన పథకం పారింది. ఆంబర్ మన వలలో పడిందని సిడ్నీ చెప్పింది, 236 00:13:24,598 --> 00:13:26,850 ఇప్పుడు తను గ్రిఫిన్ తో ఒంటరిగా ఉంది. 237 00:13:26,850 --> 00:13:28,184 అది గొప్ప విషయం. 238 00:13:31,688 --> 00:13:33,773 ఇక్కడ నిధి దాగి ఉంది. 239 00:13:33,857 --> 00:13:36,192 ఇప్పుడు నువ్వు దీనిని కనిపెట్టాలి. 240 00:13:43,700 --> 00:13:45,285 ఈపీ ఎక్కడ ఉందో మామి వాటా కనిపెట్టింది. 241 00:13:46,077 --> 00:13:49,372 ఒకే ఒక్క సమస్య ఏమిటంటే, అది ఈ చెరువుకు అటు పక్క ఇంట్లో ఉంది. 242 00:13:50,832 --> 00:13:51,917 మనం అక్కడికి ఎలా వెళతాం? 243 00:13:52,500 --> 00:13:53,543 పడవలోనా? 244 00:13:54,044 --> 00:13:56,171 మనకి పడవ ఎలా దొరుకుతుంది? 245 00:14:01,843 --> 00:14:02,844 ఇదిగో ఇక్కడే ఉంది! 246 00:14:04,596 --> 00:14:06,723 ధన్యవాదాలు, మామి వాటా. -వెళదాం పదండి. 247 00:14:07,891 --> 00:14:08,892 ఆగండి. 248 00:14:10,143 --> 00:14:11,561 ఆ ప్రదేశం క్షేమమో కాదో ఎలా తెలుస్తుంది? 249 00:14:12,854 --> 00:14:15,857 అది ఎలాగో నాకు తెలియదు, కానీ ఆ పుస్తకంలో అమ్మాయి మాదిరిగా, 250 00:14:16,566 --> 00:14:18,526 నాకు కూడా మామి వాటాతో అనుబంధం ఏర్పడింది. 251 00:14:18,610 --> 00:14:21,571 దానిని నేను అనుభూతి చెందుతున్నాను. ఆమె మనల్ని ప్రమాదంలోకి నెట్టదు. 252 00:14:22,530 --> 00:14:23,990 ఆమెను నేను నమ్ముతున్నాను. 253 00:14:24,074 --> 00:14:25,075 నేను కూడా. 254 00:14:27,202 --> 00:14:28,370 సమీర్? 255 00:14:30,830 --> 00:14:32,123 లైఫ్ జాకెట్స్ 256 00:14:32,207 --> 00:14:34,417 నేను పడవ ఎక్కాను! పడవ ఎక్కాను... 257 00:14:34,501 --> 00:14:36,086 కూర్చో, ఇద్రిస్. జాగ్రత్తగా ఉండు! 258 00:14:37,003 --> 00:14:41,007 ఓయ్. ఆ చిన్న పిల్లవాడి మీద కోపం తగ్గించుకుంటావా? 259 00:14:41,091 --> 00:14:43,134 నువ్వు వాడిని పిలవడం నాకు ఇష్టం లేదు. 260 00:14:43,218 --> 00:14:45,720 ఏదైనా జరగరానిది జరిగితే వాడు పడే బాధల్ని 261 00:14:45,804 --> 00:14:46,930 నువ్వు వచ్చి తీర్చలేవు కదా. 262 00:14:46,930 --> 00:14:50,058 సరే, అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఒక చెల్లెలుగా ఉన్న నేను, 263 00:14:50,058 --> 00:14:53,353 నేను వయస్సులో చిన్న కాబట్టి నన్ను పక్కకు తప్పిస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. 264 00:14:55,105 --> 00:14:57,983 పైగా, నువ్వు వాడికి తగిన గుర్తింపు ఇవ్వవు. 265 00:15:05,574 --> 00:15:07,200 ఇది చాలా బాగుంది. 266 00:15:09,327 --> 00:15:10,662 ఇద్రిస్, నిలకడగా కూర్చో. 267 00:15:11,538 --> 00:15:14,291 నేను మామి వాటా కోసమే చూస్తున్నాను. 268 00:15:14,291 --> 00:15:16,376 ప్రతీదీ ఆట కాదు, సరేనా? 269 00:15:17,043 --> 00:15:18,128 క్షమించు. 270 00:15:21,715 --> 00:15:24,509 సమీర్, నువ్వు బాగానే ఉన్నావా? 271 00:15:27,220 --> 00:15:28,388 మామి వాటా, ఈ పడవని ఆపు. 272 00:15:28,388 --> 00:15:33,602 మన ప్రయాణం కొనసాగాలి. మీ కోసం నేను ఏర్పాటు చేసిన భవిష్యత్తు మళ్లీ మారిపోవచ్చు. 273 00:15:33,602 --> 00:15:35,437 మనం ఆగాలి. నా మిత్రుడికి కాస్త విరామం కావాలి. 274 00:15:36,354 --> 00:15:37,480 సరే మంచిది. 275 00:15:40,108 --> 00:15:42,152 భూమి ఆకాశం కలిసే చోటుని చూడు. -ఏంటి? 276 00:15:42,819 --> 00:15:45,405 సముద్రయానంలో కడుపులో తిప్పితే భూమి ఆకాశం కలిసే చోటుని చూడాలి. 277 00:15:46,698 --> 00:15:47,908 ఇది అది కాదు. 278 00:15:48,491 --> 00:15:50,493 మరి ఏమిటి? నువ్వు మాతో చెప్పవచ్చు. 279 00:15:52,495 --> 00:15:53,872 చనిపోయిన మన కజిన్ గుర్తున్నాడా? 280 00:15:57,375 --> 00:16:02,714 మేము టర్కీ వదిలి వచ్చినప్పుడు, అతని కుటుంబ ఇక్కడ మరొక దారిలో వెళ్లింది, 281 00:16:02,714 --> 00:16:05,967 కానీ వాళ్లు ఒడ్డుకు చేరలేదు. 282 00:16:08,929 --> 00:16:10,847 నాకు ఎప్పుడూ అది తెలియలేదు. 283 00:16:11,848 --> 00:16:13,433 నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివే. 284 00:16:14,434 --> 00:16:15,936 నన్ను క్షమించు, సమీర్. 285 00:16:15,936 --> 00:16:19,272 మాకు ఆ విషయం తెలిసిన తరువాత మళ్లీ నేను పడవ ఎక్కడం ఇదే మొదటిసారి. 286 00:16:19,356 --> 00:16:21,775 అది మాకు తెలిసి ఉంటే, మేము పడవ ఎక్కి ఉండే వాళ్లం కాదు. 287 00:16:24,236 --> 00:16:26,696 ఆ రోజు కూడా మామి వాటా మనతో ఉంటే బాగుండేది. 288 00:16:28,907 --> 00:16:29,908 నేను కూడా అదే అనుకుంటాను. 289 00:16:39,084 --> 00:16:40,544 మిణుగురులు మళ్లీ వచ్చాయి. 290 00:16:42,337 --> 00:16:43,672 అవి చాలా అందంగా ఉన్నాయి. 291 00:16:47,676 --> 00:16:49,553 మనం ఇప్పుడు వెళ్లవచ్చు. 292 00:16:50,053 --> 00:16:51,096 నీకు ఫర్వాలేదా? 293 00:17:00,855 --> 00:17:01,898 వావ్. 294 00:17:01,982 --> 00:17:05,944 ఏదైనా అతి ముఖ్యమైన కళాఖండాన్ని రహస్యంగా దాచవలసి వస్తే, ఇదే సరైన చోటు. 295 00:17:17,080 --> 00:17:18,582 వేరెవరో ఈపీని దొంగిలించబోతున్నారు. 296 00:17:19,958 --> 00:17:21,543 మనం త్వరపడాలి. వెళదాం పదండి. 297 00:17:21,543 --> 00:17:23,044 త్వరగా వెళ్లండి. 298 00:17:23,962 --> 00:17:24,963 పదండి. 299 00:17:27,299 --> 00:17:28,884 పద, ఇద్రిస్. ఇలా పైకి నడు. 300 00:17:29,467 --> 00:17:30,635 వెళదాం పదండి. రండి. 301 00:17:34,306 --> 00:17:35,390 మన ప్లాన్ ఏంటి? 302 00:17:35,390 --> 00:17:38,643 మనకి అది దొరికే వరకూ కిటికీలో నుండి చూద్దామా? -అంతకన్నా మంచిది నా దగ్గర లేదు. 303 00:17:41,146 --> 00:17:43,398 ఏవరీ ఇంకా ఆంబర్. మనం సరైన చోటుకే వచ్చాము. 304 00:17:43,398 --> 00:17:45,609 ఇది సరైన గది కాదు. పదండి. 305 00:17:51,948 --> 00:17:53,700 నాకు లీలగా కనిపించిన గది ఇదే. 306 00:17:56,703 --> 00:17:57,787 దీనికి తాళం వేసి ఉంది. 307 00:17:58,747 --> 00:18:00,540 మనం ఎలాగైనా లోపలికి వెళ్లాలి. 308 00:18:00,624 --> 00:18:02,042 మిణుగురులు మళ్లీ వచ్చాయి. 309 00:18:02,042 --> 00:18:05,545 బహుశా ఆ పుస్తకంలో మాదిరిగా నియా వాటిని నియంత్రించవచ్చు. 310 00:18:06,296 --> 00:18:09,216 నేను ఏం చేయాలి? "లోపలికి వెళ్లి, 311 00:18:09,216 --> 00:18:11,509 ఎలోకెంట్ పెసంట్ ని వెతకండి" అని వాటికి చెప్పాలా? 312 00:18:14,554 --> 00:18:15,764 ఇద్రిస్ సరిగ్గా చెప్పాడు. 313 00:18:16,431 --> 00:18:18,808 ఏదో విధంగా, నీకు వాటితో అనుబంధం ఏర్పడింది. 314 00:18:21,561 --> 00:18:23,063 నియా? ఏం జరుగుతోంది? 315 00:18:25,273 --> 00:18:27,025 అవి చూసేవి నేను కూడా చూడగలుగుతున్నాను. 316 00:18:28,818 --> 00:18:30,237 మనం లివింగ్ రూమ్ లో ఉన్నాము. 317 00:18:30,904 --> 00:18:33,865 సరే. ఇప్పుడు మేడ మెట్లు దిగుతున్నాము. 318 00:18:35,492 --> 00:18:36,618 అక్కడ పూల్ టేబుల్ ఉంది. 319 00:18:38,787 --> 00:18:40,205 ఇప్పుడు మనం సామాన్ల గదిలో ఉన్నాం. 320 00:18:42,123 --> 00:18:43,416 అది ఇక్కడ లేదు. 321 00:18:43,500 --> 00:18:45,001 మరి ఎక్కడ ఉంది? 322 00:18:46,127 --> 00:18:48,588 పదండి, పదండి! వెనక్కి వచ్చేయండి. 323 00:18:51,508 --> 00:18:53,677 అది అక్కడ ఉండచ్చు అనిపిస్తోంది. 324 00:18:53,677 --> 00:18:54,761 నువ్వు బాగానే ఉన్నావా? 325 00:18:55,971 --> 00:18:58,431 ఇది నా పొరపాటు. నేను పడవలో ఆలస్యం చేశాను. 326 00:18:58,515 --> 00:19:00,892 లేదు, అది నీ తప్పు కాదు. మనకి దొరికే దాకా ప్రయత్నం ఆపము. 327 00:19:01,935 --> 00:19:02,978 అవును. 328 00:19:05,647 --> 00:19:08,900 సిడ్నీ కాల్ చేసింది. తనకి మన అవసరం ఉంది. పదండి. 329 00:19:10,652 --> 00:19:12,946 ఒక చిన్న పట్టణంలో పెరగడం చాలా బాగుంటుంది. 330 00:19:12,946 --> 00:19:16,575 నిజంగానా? ఒక పెద్ద నగరంలో ఉండాలని నేను ఎప్పుడూ కలలు కన్నాను. 331 00:19:17,325 --> 00:19:19,160 డబ్బులు ఉంటే ఈ పెద్ద నగరాలు బాగుంటాయి. 332 00:19:19,244 --> 00:19:20,912 మన దగ్గర డబ్బులు ఉంటే అన్ని నగరాలూ బాగుంటాయి. 333 00:19:22,289 --> 00:19:23,957 ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉండచ్చు. 334 00:19:24,457 --> 00:19:26,751 హావ్తోర్న్ క్లబ్ లో సభ్యత్వం అంటే మంచి పరిచయాలు అవుతాయి, 335 00:19:26,835 --> 00:19:28,420 దాని వల్ల మంచి ఉద్యోగాలు వస్తాయి, 336 00:19:28,420 --> 00:19:31,214 అప్పుడు మా తల్లిదండ్రుల ఇంటి నుంచి ఏదో ఒక రోజు విడిగా వెళ్లచ్చు. 337 00:19:31,298 --> 00:19:33,550 అవును, కానీ అందుకు చెల్లించే మూల్యం ఎంత? 338 00:19:37,178 --> 00:19:41,224 నా కల నెరవేరడానికి నేను అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పట్టింది. 339 00:19:42,100 --> 00:19:43,101 నీ ఉద్దేశం అర్థం అయింది. 340 00:19:45,270 --> 00:19:48,523 ఒక విషయం చెప్పనా? ఈ హావ్తోర్న్ క్లబ్ వ్యవహారాన్ని మనం కాసేపు పక్కన పెట్టాలి. 341 00:19:49,232 --> 00:19:50,692 నీ మనసులో ఏం ఉంది? 342 00:19:53,695 --> 00:19:54,738 ఇలా రా. -ఇది ఏంటి? 343 00:19:55,822 --> 00:20:00,160 ఇతరులకు ప్రవేశం నిషిద్ధం 344 00:20:00,744 --> 00:20:02,495 మనం లోపలికి వెళ్లడానికి అనుమతి లేదు అనుకుంటా. 345 00:20:04,164 --> 00:20:05,165 ఈ తలుపు తెరిచే ఉంది. 346 00:20:06,207 --> 00:20:09,669 మన వ్యవస్థాపకుని ఆత్మకి నివాళి అర్పించకుండా మనం వ్యవస్థాపకుని వారోత్సవం జరుపుకోలేం. 347 00:20:09,753 --> 00:20:11,379 సరే, నివాళి అర్పించేశాము. ఇక మనం... 348 00:20:11,463 --> 00:20:13,131 నీకు భయంగా ఉంది కదా? 349 00:20:25,143 --> 00:20:26,144 చాన్సీ? 350 00:20:27,103 --> 00:20:28,396 నువ్వు ఇక్కడ ఉన్నావా? 351 00:20:28,480 --> 00:20:32,150 మరణించాక అతను ఇక్కడ పడి ఉండటం కంటే మరిన్ని మంచి పనులు చేసుకుంటూ ఉండచ్చు. 352 00:20:34,069 --> 00:20:36,029 సరే, ఇంక వెళదాం. -లేదు, ఆగు. 353 00:20:40,200 --> 00:20:41,826 తను నీ చెల్లెలా? 354 00:20:41,910 --> 00:20:43,745 ఇంకా నా స్నేహితులు, నియా, సమీర్. 355 00:20:44,246 --> 00:20:46,206 ఈ సొరంగాలు ఎక్కడికైనా తీసుకువెళతాయి. 356 00:20:46,206 --> 00:20:47,749 ఇంకా అతని తమ్ముడు, ఇద్రిస్. 357 00:20:47,749 --> 00:20:49,501 ఇద్రిస్! నా కోసం ఆగు. 358 00:20:52,963 --> 00:20:53,964 సరే. ఏం జరుగుతోంది? 359 00:20:53,964 --> 00:20:56,716 మన్నించు, ఆంబర్ లేకుండా మనం మాట్లాడుకోవడానికి ఒక ప్రదేశం అవసరమైంది. 360 00:20:56,800 --> 00:20:58,385 నువ్వు లియమ్, ఆంబర్ లకి సహాయం చేసి 361 00:20:58,385 --> 00:21:00,512 ఏవరీ బాయిడ్ కోసం నకిలీ ఎలోకెంట్ పెసంట్ తయారు చేశావని మాకు తెలుసు. 362 00:21:00,512 --> 00:21:02,806 కానీ నువ్వు మిగతా వాళ్ల మాదిరి కాదని కూడా తెలుసు. 363 00:21:02,806 --> 00:21:04,432 ఇలా చూడు, గ్రిఫిన్. 364 00:21:04,516 --> 00:21:08,395 ఒక బయట వ్యక్తిలా ఉన్నట్లు అనిపిస్తోందని నువ్వు ఇందాకే చెప్పావు. నాకు అర్థమైంది. 365 00:21:08,395 --> 00:21:11,398 వాళ్ల క్లబ్ లో చేరడం మంచి విషయమే. 366 00:21:11,398 --> 00:21:14,276 కానీ వాళ్లు నిన్ను వాడుకుంటున్నారు. నన్ను కూడా. 367 00:21:16,111 --> 00:21:20,574 ఆ పాత పత్రం తనకూ, ఏవరీ కుటుంబానికీ చెందినదని ఆంబర్ చెప్పింది. 368 00:21:21,199 --> 00:21:22,951 నేను గనుక అచ్చు దానిలా ఉండే నకలుని తయారు చేస్తే, 369 00:21:22,951 --> 00:21:25,495 వాళ్లు అసలైన ఈపీ స్థానంలో నకిలీది పెట్టి, అసలు ఈపీని భద్రంగా పెడతామని చెప్పారు. 370 00:21:27,247 --> 00:21:30,417 అందుకు సహకరిస్తే, హావ్తోర్న్ క్లబ్ లో సభ్యత్వం ఇప్పిస్తామని చెప్పారు. 371 00:21:31,126 --> 00:21:32,752 ఇందులో ఎవ్వరికీ ఇబ్బంది ఉండదని చెప్పారు. 372 00:21:32,836 --> 00:21:35,130 అది ఒకరిని బాధ పెట్టింది. మా అమ్మని. 373 00:21:35,630 --> 00:21:40,510 మీ అమ్మగారిని ఈ కేసులో ఇరికించడంలో నా పాత్ర లేదు, కానీ... వాళ్ల రహస్యాలు దాచినందుకు బాధగా ఉంది. 374 00:21:40,594 --> 00:21:41,803 నన్ను క్షమించు, నియా. 375 00:21:45,849 --> 00:21:49,603 అయితే మాకు సాయం చేయి. నీకు అన్నీ తెలుసు కదా. 376 00:21:49,603 --> 00:21:50,854 మనం బోర్డు దగ్గరకు వెళదాం. 377 00:21:50,854 --> 00:21:54,190 అవకాశమే లేదు. అందుకు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. 378 00:21:54,274 --> 00:21:55,817 "ఆలస్యం అయింది" అనడంలో నీ ఉద్దేశం ఏంటి? 379 00:22:06,745 --> 00:22:07,913 ఆగు. 380 00:22:09,456 --> 00:22:13,126 ఇద్రిస్, నువ్వు పైన నియా గదికి వెళ్లి వీడియో గేమ్స్ ఆడుకో, సరేనా? 381 00:22:13,126 --> 00:22:14,461 నేను తొందరగానే వచ్చేస్తాను. 382 00:22:14,461 --> 00:22:15,879 సరే. 383 00:22:15,879 --> 00:22:17,130 నాన్నా? 384 00:22:19,257 --> 00:22:21,384 నాన్నా, ఈ రోజు మన ఇంటికి ఎవరైనా వచ్చారా? 385 00:22:21,468 --> 00:22:22,761 నిన్ను చూడటం సంతోషంగా ఉంది, నియా. 386 00:22:24,012 --> 00:22:25,013 అంతా బాగానే ఉందా? 387 00:22:25,013 --> 00:22:26,806 అవును, నాకు ఒక ప్యాకేజీ రావాలి. 388 00:22:27,474 --> 00:22:28,475 నేను ఏమీ చూడలేదు. 389 00:22:30,185 --> 00:22:33,730 మన రౌటర్ ని బాగు చేయడానికి ఇంటర్నెట్ కుర్రాడు మాత్రమే వచ్చాడు. 390 00:22:33,730 --> 00:22:34,814 నీ గేమింగ్ టోర్నమెంట్స్ కోసం 391 00:22:34,898 --> 00:22:38,109 బ్యాండ్ విడ్త్ పెంచమని అతడిని అడిగాను. 392 00:22:42,572 --> 00:22:43,615 సంతోషం! 393 00:22:46,117 --> 00:22:48,161 అయితే అతను ఈపీని ఎక్కడ దాచి పెట్టాడు? 394 00:22:49,663 --> 00:22:51,373 ఆ వచ్చినది డోనవన్ కావచ్చు. 395 00:23:00,090 --> 00:23:01,091 ఒక్క క్షణం ఆగండి. 396 00:23:02,634 --> 00:23:03,635 లైలా! 397 00:23:09,307 --> 00:23:10,517 అవకాశమే లేదు. 398 00:23:11,184 --> 00:23:12,561 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 399 00:23:13,144 --> 00:23:14,813 గ్రిఫిన్ సరిగ్గానే చెప్పాడు. 400 00:23:15,730 --> 00:23:16,731 ఎవరో వస్తున్నారు. 401 00:23:16,815 --> 00:23:19,859 నేను మీకు హామీ ఇవ్వగలను, నా లివింగ్ రూమ్ లో నేను ఏమీ దాచలేదు. 402 00:23:19,943 --> 00:23:21,152 తను డోనవన్. 403 00:23:21,236 --> 00:23:22,445 మనం దీనిని ఎలా వివరించగలం? 404 00:23:22,529 --> 00:23:23,530 మనం దీనిని దాచేద్దామా? 405 00:23:25,782 --> 00:23:27,200 ఆలివర్. 406 00:23:29,911 --> 00:23:31,288 హేయ్. 407 00:23:33,415 --> 00:23:34,749 మీరు ఈ గదిని మాకు వదిలేస్తారా? 408 00:23:35,375 --> 00:23:36,710 తప్పకుండా. మాకు ఇబ్బంది లేదు. 409 00:23:39,588 --> 00:23:42,299 మీ దగ్గర ఉన్నది ఏంటి? -అది... 410 00:23:42,299 --> 00:23:44,593 మా ఆర్ట్ ప్రాజెక్టు కోసం కేవలం ఖాళీ పత్రం. 411 00:23:44,593 --> 00:23:47,804 మంచిది. మీరు మమ్మల్ని కాసేపు వదిలేయాలి. 412 00:24:01,192 --> 00:24:04,487 మనం దాదాపు దొరికిపోయే వాళ్లం. నాకు బాగా చెమటలు పట్టేశాయి. 413 00:24:04,571 --> 00:24:07,115 ఆలివర్ మనల్ని నిజంగా కాపాడాడు. నీకు ధన్యవాదాలు, ఆలివర్. 414 00:24:07,115 --> 00:24:10,702 డోనవన్ తనకు ఖచ్చితంగా తెలిసినట్లే నేరుగా ఆ బల్ల వైపే చూసింది. 415 00:24:11,202 --> 00:24:14,789 ఆమె మనల్ని ఎందుకు పట్టించుకోలేదో ఇప్పుడు తెలిసింది. తను కూడా నేరగాళ్లతో చేరింది. 416 00:24:15,665 --> 00:24:17,375 కానీ మనకి తెలిసిన వివరాలన్నీ ఆమెకు చెప్పేశాం. 417 00:24:19,002 --> 00:24:20,003 ఆగండి. 418 00:24:21,171 --> 00:24:23,215 ఆ పేజీ మీద అక్షరాలు అదృశ్యం అయ్యాక, 419 00:24:23,215 --> 00:24:26,176 ఒక పుస్తకం నుండి ఒక పాత్రని దెయ్యం ప్రవేశపెట్టినట్లుగా, 420 00:24:27,052 --> 00:24:28,303 అంటే దాని ఉద్దేశం... 421 00:24:28,303 --> 00:24:31,556 మన్నించు, ఈ రాజభవనం ఏమిటి? 422 00:24:34,476 --> 00:24:35,477 ఇది నా ఇల్లు. 423 00:24:35,977 --> 00:24:38,939 మన్నించండి, నేను ఒక సాధారణ రైతుని. 424 00:25:32,284 --> 00:25:34,286 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్