1 00:00:06,920 --> 00:00:09,240 నువ్వు చూసిన అతిగొప్ప ఆస్ట్రేలియా జట్టు ఏది? 2 00:00:13,040 --> 00:00:16,360 బహుశా 2000 తొలినాళ్ళదేమో. ఆ జట్టును చూసి ఎదిగాను. 3 00:00:18,720 --> 00:00:21,360 బహుశా నాకున్న స్పష్టమైన జ్ఞాపకం, 4 00:00:21,480 --> 00:00:22,440 2005, 2006, 2007. 5 00:00:22,520 --> 00:00:25,000 అప్పుడు ఏడెనిమిది గొప్ప ఆటగాళ్ళు ఉండేవారు. 6 00:00:25,080 --> 00:00:27,320 హేడన్, లాంగర్, పాంటింగ్. 7 00:00:27,400 --> 00:00:29,720 గిల్‌క్రిస్ట్, మెక్‌గ్రాత్, వార్న్ 8 00:00:29,800 --> 00:00:32,080 వాళ్ళు మరో స్థాయి ఆటగాళ్ళు, కదా? 9 00:00:32,200 --> 00:00:33,360 వారు ఇండియాలో గెలిచారు. 10 00:00:33,440 --> 00:00:34,920 ఇంగ్లండ్‌లో గెలిచారు. 11 00:00:35,000 --> 00:00:39,560 ఆ జట్టు ఎలాంటిదంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, పరిస్థితుల్ని మలుచుకున్నారు. 12 00:00:39,640 --> 00:00:42,640 అదే బంగారు ప్రమాణం. అది అందుకోవాలని ఆశిస్తున్నాం. 13 00:00:43,120 --> 00:00:44,560 ఆధునిక టెస్ట్ జట్టు విలువ 14 00:00:44,640 --> 00:00:46,680 బయటి దేశాలలోనే తెలుస్తుంది. 15 00:00:47,120 --> 00:00:48,880 ఆస్ట్రేలియా జట్లకు, 16 00:00:49,000 --> 00:00:52,200 ఉపఖండంలో అది చాలా కష్టంగా నిలిచింది. 17 00:00:52,760 --> 00:00:55,920 శ్రీలంక టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచశక్తి కాదు. 18 00:00:56,080 --> 00:00:59,280 కానీ వాళ్ళను సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టమైన విషయం. 19 00:01:00,800 --> 00:01:02,960 మీరు ఒక గొప్ప జట్టుగా అవ్వాలంటే, 20 00:01:03,040 --> 00:01:04,200 ఆ పయనంలో 21 00:01:04,280 --> 00:01:05,840 ఈ విజయాలే 22 00:01:05,920 --> 00:01:07,240 మైలురాళ్ళు అవుతాయి. 23 00:01:08,560 --> 00:01:10,800 ఇదొక నిర్దేశక తొలి కాలం, 24 00:01:11,920 --> 00:01:13,920 కమిన్స్ శకం. 25 00:01:15,880 --> 00:01:20,280 ద టెస్ట్ 26 00:01:22,800 --> 00:01:24,560 క్రిస్టొఫర్ హిచెన్స్ హిచ్-22 27 00:01:28,880 --> 00:01:29,800 ప్యాట్ కమిన్స్ 28 00:01:29,880 --> 00:01:31,920 నా పుస్తకాల ప్రేమ కాల్పనిక సాహిత్యంతో 29 00:01:32,000 --> 00:01:33,120 పిల్లాడిగా మొదలైంది. 30 00:01:33,200 --> 00:01:34,800 అమ్మానాన్నలు ఎప్పుడూ చదివేవారు. 31 00:01:34,880 --> 00:01:36,680 వేసవి సెలవుల్లో, ఐదుగురిలో ఒకడిని. 32 00:01:36,760 --> 00:01:40,560 కారులో ఐదుగురు పిల్లలుంటే, అందరి చేతిలో భిన్నమైన పుస్తకం ఉండేది. 33 00:01:40,640 --> 00:01:43,360 వెనుదిరిగి చూస్తే, మేము కలల్లో బతికిన పిల్లలం. 34 00:01:45,480 --> 00:01:48,160 ఇది హ్యారీ పాటర్ పుస్తకం. క్లాసిక్. నాకెంతో ఇష్టం. 35 00:01:48,240 --> 00:01:51,280 మొదటి పుస్తకం నుండి ఏడవ పుస్తకందాకా చదివేవాడిని, 36 00:01:51,360 --> 00:01:54,560 మళ్ళీ మొదటి నుండి ఏడు దాకా చదివేవాడిని, ఆపకుండా. 37 00:01:54,640 --> 00:01:57,200 అందరి పిల్లలలాగే, హోగ్‌వార్ట్స్‌లో ఉండాలనుకున్నా. 38 00:01:57,280 --> 00:02:00,120 ఈ పుస్తకాలు విషయాలను ఎత్తి చూపిస్తుంటాయి. 39 00:02:00,200 --> 00:02:02,240 రే డాలియో రాసిన ప్రిన్సిపల్స్ ఉంది, 40 00:02:02,320 --> 00:02:05,680 చాలా భిన్నంగా ఉంటుంది... అదొక మంచి విషయం. 41 00:02:06,320 --> 00:02:08,560 ప్రతీ పుస్తకం, మనల్ని కాస్తంత 42 00:02:08,600 --> 00:02:10,320 తీర్చిదిద్దుతుందని అనుకుంటాను. 43 00:02:10,400 --> 00:02:14,440 నిర్ధిష్ట వివరాలను గుర్తుంచుకోకపోయినా, అది మన ఆలోచనను కొంచెం మారుస్తుంది. 44 00:02:14,520 --> 00:02:18,440 నాకు ఎలాంటి పుస్తకాలు ఇష్టమంటే... నా పక్షపాత ధోరణులను మార్చేవి. 45 00:02:19,600 --> 00:02:21,960 నా దగ్గర దాదాపు క్రికెట్ పుస్తకాలు లేనట్టే. 46 00:02:22,040 --> 00:02:24,800 నేను అనుకోవడం... నాయకుడిగా ఉండాలనుకోవడం లేదా 47 00:02:24,880 --> 00:02:28,320 ఫలానా వ్యక్తిగా ఉండాలనుకోవడం క్రికెట్ వెలుపల నుండి వస్తుందనుకుంటా. 48 00:02:29,800 --> 00:02:32,560 నన్ను బాగా ఆకట్టుకున్న కొన్ని పుస్తకాలు 49 00:02:32,600 --> 00:02:34,600 నిజానికి శాస్త్రీయమైనవి. 50 00:02:34,720 --> 00:02:37,840 అంటే బిల్ బ్రైసన్ రాసిన హిస్టరీ ఆఫ్ ఎవరిథింగ్, 51 00:02:37,880 --> 00:02:40,240 రిచర్డ్ డాకిన్స్ రచన గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్. 52 00:02:40,320 --> 00:02:44,600 వాటిని చదివినప్పుడు ఇలా అనిపించింది, అబ్బో, ఈ భూమిలో మనం అప్రధానమైనవాళ్ళం, 53 00:02:44,680 --> 00:02:46,800 వేల కోట్ల ఏళ్ళుగా తిరుగుతున్న ఈ భూమిలో. 54 00:02:46,880 --> 00:02:49,960 ఈ విశ్వానికి మనమే కేంద్రబిందువని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. 55 00:02:50,040 --> 00:02:53,280 కానీ వెలుపల ఎంతో పెద్ద ప్రపంచం ఉందని మనం అందులో గ్రహిస్తాం. 56 00:02:53,360 --> 00:02:55,320 మనం దానిలో అతి సూక్ష్మ భాగం, కనుక... 57 00:03:04,280 --> 00:03:07,200 శ్రీలంక 58 00:03:07,280 --> 00:03:11,040 శ్రీలంక మునుపెన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోంది. 59 00:03:11,880 --> 00:03:15,160 అధ్యక్షుడు రాజపక్సా, దేశాన్ని గట్టున పడేయాలని చూసినా 60 00:03:15,240 --> 00:03:17,120 అతని విధానాలు విఫలమయ్యాయి. 61 00:03:17,200 --> 00:03:21,600 వారి దేశ దుస్థితికి అతన్ని, అతని ప్రభుత్వాన్ని ప్రజలు నిందిస్తున్నారు. 62 00:03:21,680 --> 00:03:25,880 ఆహారపు కొరత ఉంది, ఇంధన మరియు నిత్యావసరాల కొరత ఉంది. 63 00:03:25,960 --> 00:03:28,160 కుమార సంగక్కర శ్రీలంక క్రికెట్ లెజెండ్ 64 00:03:28,240 --> 00:03:31,160 శ్రీలంక ప్రజల ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి. 65 00:03:31,240 --> 00:03:34,760 దేశం మొత్తం జీవితం చాలా దుర్భరంగా ఉంది. 66 00:03:36,080 --> 00:03:40,800 ఈ దేశం సంక్షోభంలో ఉంది, మేము చాలా అప్రధానమైన ఆట ఆడుతున్నాం. 67 00:03:40,880 --> 00:03:43,600 మేము బంతిని అటూ ఇటూ కొడుతున్నాం, విసురుతున్నాం. 68 00:03:43,680 --> 00:03:47,200 నాకు అక్కడికి వెళ్ళాలనే ఆసక్తి లేదు. అంటే భద్రతా కారణాల వల్ల కాదు. 69 00:03:47,280 --> 00:03:50,360 ఒక దయనీయ స్థితిలో ఉన్న దేశాన్ని చూడటం వల్ల. 70 00:03:50,440 --> 00:03:51,760 మిచ్ మార్ష్ ఆల్ రౌండర్ 71 00:03:51,840 --> 00:03:53,800 అది సరైన పనిగా అనిపించలేదు. 72 00:03:53,880 --> 00:03:56,600 దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. 73 00:03:56,680 --> 00:04:00,360 ప్రజలు గత మూడు నెలలుగా నిరసిస్తున్నారు. 74 00:04:00,720 --> 00:04:04,400 క్రికెట్ పర్యటన చోటుచేసుకోవడం చాలా చాలా మంచిదనిపించింది. 75 00:04:05,160 --> 00:04:07,120 ఇక శ్రీలంకకూ పర్యాటకులు కావాలి. 76 00:04:07,200 --> 00:04:09,880 దేశం పని చేయడానికి, ప్రజలను ఒక్కటి చేయడానికి 77 00:04:09,960 --> 00:04:11,960 దానికి అది కావాలి. 78 00:04:12,640 --> 00:04:16,000 మేము కలసిన ప్రజలు మేము అక్కడికి వచ్చినందుకు కృతజ్ఞత తెలిపారు. 79 00:04:16,120 --> 00:04:17,560 వారి జీవిత వాస్తవికత నుండి 80 00:04:17,640 --> 00:04:20,640 కొన్ని గంటల క్రికెట్ చూసేందుకు వారికి విరామం ఇచ్చాం, 81 00:04:20,720 --> 00:04:22,920 వాళ్లు దాన్ని ఇష్టపడతారు. 82 00:04:26,240 --> 00:04:27,200 ధన్యవాదాలు. 83 00:04:39,200 --> 00:04:40,640 మిస్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ 84 00:04:40,720 --> 00:04:44,240 పాకిస్తాన్‌తో జరిగిన సీరీస్ తర్వాత ఆస్ట్రేలియా సానుకూలతను తెచ్చింది. 85 00:04:44,320 --> 00:04:45,920 కానీ ఒక సమస్య ఉంది. 86 00:04:46,040 --> 00:04:49,720 తొలి టెస్ట్‌కు కొద్ది రోజుల ముందు, ట్రావిస్ హెడ్ తొడకండరం గాయమైంది. 87 00:04:49,800 --> 00:04:52,160 ఆస్ట్రేలియా ఓ ఎబ్బెట్టైన ఎంపిక చేయాలి. 88 00:04:52,240 --> 00:04:54,160 ప్రస్తుత సభ్యుడితో సరిపెట్టుకుంటుందా 89 00:04:54,240 --> 00:04:57,160 లేదా పోటీకి గ్లెన్ మాక్స్‌వెల్‌ను తీసుకొస్తుందా? 90 00:04:57,240 --> 00:05:01,080 నాకు మళ్ళీ ప్రాధాన్యం ఇస్తారని నాకు చూచాయగా అనిపించింది. 91 00:05:01,160 --> 00:05:05,360 మేము ఓడీఐ సీరీస్ చివరికి వచ్చాం. నేను ఆరోన్ ఫించ్‌తో మాట్లాడాను. 92 00:05:05,440 --> 00:05:08,320 ఓ జట్టు వేడుక జరిగింది. "నేను ఉంటానా ఉండనా?" అన్నా. 93 00:05:08,360 --> 00:05:11,920 అతను, "సరే, కోచ్ అక్కడే ఉన్నాడు. తనను ఎందుకు అడగవు?" అన్నాడు. 94 00:05:12,040 --> 00:05:14,720 నేను, "ఎంతమేరకు అవకాశాలు ఉన్నాయి?" అతను... 95 00:05:15,920 --> 00:05:19,120 "నువ్వు ఉండటానికి 99 శాతం అవకాశాలున్నాయి." 96 00:05:19,920 --> 00:05:22,440 అప్పుడే ఆ క్షణంలో... 97 00:05:22,920 --> 00:05:24,240 నేను ఏడ్చేశాను. 98 00:05:24,360 --> 00:05:26,480 ఆనందబాష్పాలు. అంటే, 99 00:05:26,560 --> 00:05:28,800 నేను నమ్మలేకపోయాను, 100 00:05:29,400 --> 00:05:31,840 మళ్ళీ టెస్ట్ ప్రపంచంలో అడుగుపెట్టడం... 101 00:05:31,920 --> 00:05:33,800 ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు బయట ఉన్నాక. 102 00:05:36,240 --> 00:05:37,840 అది మెదలయ్యేది అలానే. 103 00:05:37,920 --> 00:05:38,920 కచ్చితంగా సిక్స్. 104 00:05:39,000 --> 00:05:40,080 మళ్ళీ బంతి వస్తోంది! 105 00:05:40,160 --> 00:05:41,960 దీన్ని అతను ఇంకా బాగా బాదాడు! 106 00:05:42,760 --> 00:05:44,120 సీరీస్‌ను తగ్గిస్తున్నాడు! 107 00:05:44,200 --> 00:05:45,640 దాని గురించి దిగులుపడకండి! 108 00:05:45,720 --> 00:05:48,760 బిగ్ షో దంచుతాడు... చిన్న తరహా ఆటల్లో అద్భుతంగా ఆడుతాడు. 109 00:05:48,840 --> 00:05:50,200 నాథన్ లయన్ స్పిన్ బౌలర్ 110 00:05:50,280 --> 00:05:52,200 అతనొక భారీ అనూహ్యమైన ఆటగాడు. 111 00:05:52,280 --> 00:05:54,280 ఒక్కోసారి అతని ఆటతీరు ఆందోళనకరం. 112 00:05:54,360 --> 00:05:57,360 మాక్స్ ఆడుతోంటే గెలుపు అవకాశాలు సజీవమేననిపిస్తుంది. 113 00:05:57,440 --> 00:05:59,520 100 చేరడానికి 6 బాదాడు, ఆసీస్ గెలిచింది! 114 00:05:59,920 --> 00:06:01,600 నాకు తనంటే ఇష్టం. 115 00:06:01,680 --> 00:06:04,080 ఆస్ట్రేలియా కోసం ఆడటాన్ని ఎంతో ఇష్టపడతాడు. 116 00:06:04,160 --> 00:06:07,160 జట్టు ఆకుపచ్చ టోపీ పెట్టుకోవడానికి ఎంతో తపిస్తాడు. 117 00:06:07,240 --> 00:06:10,160 టెస్ట్ స్థాయిలో తనని తాను పూర్తిగా వ్యక్తీకరించుకోలేదని, 118 00:06:10,240 --> 00:06:12,040 అది వ్యక్తీకరించుకోవాలనే భావన ఉంది. 119 00:06:12,120 --> 00:06:13,480 టెస్ట్ క్రికెట్... 120 00:06:15,200 --> 00:06:16,400 అది చిరాకుగా ఉండింది. 121 00:06:16,480 --> 00:06:17,920 అవకాశం వచ్చింది. 122 00:06:18,920 --> 00:06:21,440 దాన్ని చేజిక్కించుకున్నట్టు అనిపించింది, అంతలో... 123 00:06:21,960 --> 00:06:25,680 త్వరగా తీసివేయబడ్డాను, అది చాలా బాధగా అనిపించింది. 124 00:06:26,240 --> 00:06:27,520 చాలా బాధేసింది. 125 00:06:27,600 --> 00:06:30,800 తొలి టెస్ట్‌కు మూడు రోజుల ముందు 126 00:06:32,480 --> 00:06:34,520 ఎంపికల సమావేశం 127 00:06:34,600 --> 00:06:37,240 కనుక, మనం ఈ కూడలిలో ఉన్నాం. మనం ఏమి... 128 00:06:37,320 --> 00:06:39,200 డెనే హిల్స్ జట్టు సామర్థ్య విశ్లేషకుడు 129 00:06:39,280 --> 00:06:40,720 మన... ఉత్తమ ఆటగాళ్లు ఎవరు? 130 00:06:40,800 --> 00:06:42,360 ...తాజా సమాచారం. అందిస్తున్నా. 131 00:06:42,440 --> 00:06:45,000 ఆ సంభాషణలో కీలక విషయం ఏంటంటే... 132 00:06:45,080 --> 00:06:47,280 జార్జ్ బెయిలీ సెలెక్టర్ల ఛైర్మన్ 133 00:06:47,360 --> 00:06:51,640 టెస్ట్‌లోని ఒకటవ రోజు, రెండు వారాల గాయానికి ఎనిమిదవ రోజు అవుతుంది. 134 00:06:53,960 --> 00:06:57,280 ఒకవేళ అతను ఆడితే అందులో రిస్క్ ఉంటుంది. 135 00:06:58,120 --> 00:07:00,440 జోన్స్, వైద్యుడు బాగా... 136 00:07:01,520 --> 00:07:05,040 వాళ్ళు అంత సౌకర్యంగా లేరు కదా, హెడీ ఆడటం విషయంలో? 137 00:07:05,680 --> 00:07:08,120 అతన్ని తప్పించవచ్చని జోన్సీ కూడా చెప్పాడు. 138 00:07:08,200 --> 00:07:09,680 నిక్ జోన్స్ ఫిజియోథెరపిస్ట్ 139 00:07:09,760 --> 00:07:11,200 అలా చేయడం తనకు సంతోషమే. 140 00:07:11,280 --> 00:07:12,720 ఆండ్రూ మెక్‌డొనాల్డ్ హెడ్ కోచ్ 141 00:07:12,800 --> 00:07:15,880 అతని గాయం విపరీతమైన ముప్పును కలిగించే స్థితికి చేరుకోవచ్చు. 142 00:07:15,960 --> 00:07:17,840 కానీ ఎంత చక్కగా మెరుగయ్యాడంటే... 143 00:07:17,920 --> 00:07:20,360 చాలా ముప్పు ఉంది, కానీ బాగా మెరుగవుతున్నాడు. 144 00:07:20,440 --> 00:07:21,960 మనకు తెలిసినది, మాట్లాడేది, 145 00:07:22,040 --> 00:07:26,080 నా అతిపెద్ద భయం జట్టులో 10 మందే ఉండటం. ఒకటవ రోజు. 146 00:07:27,240 --> 00:07:28,480 కనుక... 147 00:07:29,320 --> 00:07:30,440 ఎంతమంది ఉన్నారు? 148 00:07:31,400 --> 00:07:33,240 హెడీ లేదా మాక్సీ ఎంపికవ్వాలి. 149 00:07:34,400 --> 00:07:35,960 జట్టు గది 150 00:07:37,240 --> 00:07:39,480 అబెల్స్ క్రాసింగ్ 151 00:07:39,560 --> 00:07:40,600 ఆటగాళ్ళు 152 00:07:40,680 --> 00:07:41,920 గణాంకాలు. 153 00:07:42,000 --> 00:07:43,200 సరే. థాంక్యూ. 154 00:07:48,800 --> 00:07:51,920 నేను చాలా సౌకర్యంగా ఉన్నాను, ఎందుకో తెలుసా? 155 00:07:52,000 --> 00:07:53,400 టెస్ట్ కెరియర్ ముగిసింది. 156 00:07:53,480 --> 00:07:57,400 జట్టులో ఉన్నవాళ్ళు బాగా చేస్తున్నారు. తర్వాత కాస్త ఆశ చిగురించింది. 157 00:07:58,520 --> 00:08:01,040 నేను సంభాళించుకోవాలి... 158 00:08:02,120 --> 00:08:03,280 ఆ భావోద్వేగాలతో. 159 00:08:05,280 --> 00:08:08,480 ఇంకా కొంచెం తెలియని విషయం ఉందనే వాస్తవంతో. 160 00:08:10,320 --> 00:08:12,520 అంటే రేపు జరిగే ఫిట్నెస్ పరీక్ష విషయంగా. 161 00:08:13,400 --> 00:08:15,960 అవును, బహుశా అతను ఆ పరీక్షలో సఫలమవుతాడేమో. 162 00:08:16,040 --> 00:08:17,520 అతనికి బాగవుతుంది. 163 00:08:20,160 --> 00:08:22,880 నేను స్వీయ జాలిలో మునిగితేలుతుంటాను. 164 00:08:32,800 --> 00:08:35,800 ఎప్పుడూ భావోద్రేకాలను అదుపులో ఉంచుకునేవాడిని, అలాగే... 165 00:08:38,960 --> 00:08:41,960 సమాచారాన్ని కూడా, నా జీవితంలో జరుగుతున్నవాటిని. 166 00:08:42,040 --> 00:08:44,640 ఎందుకంటే ఎప్పుడూ అందరి దృష్టిలో ఉండటమంటే ద్వేషం. 167 00:08:44,760 --> 00:08:46,640 నలుగురి దృష్టిలో పడటం ఇష్టం లేదు. 168 00:08:46,720 --> 00:08:49,640 కనుక నేను చేసిన ప్రతీ విషయంలో పైపైన నటించేవాడిని. 169 00:08:50,320 --> 00:08:53,600 2019లో, నేను కుంగుబాటుకు లోనయ్యాను, 170 00:08:54,480 --> 00:08:56,480 ఆట నుండి విరామం తీసుకున్నాను. 171 00:08:57,840 --> 00:09:00,360 18 నెలల పాటు, అందరి విషయంలో 172 00:09:00,440 --> 00:09:03,520 అన్నీ సరిగ్గా చేయాలని చూడటం వల్ల జరిగిన ఫలితం అది. 173 00:09:04,880 --> 00:09:07,520 అది నన్ను నిర్జీవంగా మార్చింది. నీరుగార్చింది. 174 00:09:07,640 --> 00:09:10,600 నాకు నేనే ఒక గుల్లగా అయిపోయాను. 175 00:09:11,720 --> 00:09:14,720 ఎవరు అనుకొని ఉంటారు? అసలు ఎవరు అనుకొని ఉంటారు! 176 00:09:14,760 --> 00:09:16,760 నా నిస్సహాయతను ఒప్పుకుని, 177 00:09:16,840 --> 00:09:18,400 ఘర్షణపడుతున్నానని అనేసరికి... 178 00:09:19,400 --> 00:09:23,200 నేను దాన్ని కొన్ని వారాల పాటు అలాగే చెప్పకుండా ఉండుంటే, 179 00:09:24,440 --> 00:09:26,360 నేను ఏమై ఉంటానో ఎవరికి తెలుసు. 180 00:09:26,440 --> 00:09:28,200 అది నా అంతం అయ్యేది. 181 00:09:28,280 --> 00:09:31,960 నాకు విసుగు వచ్చి, నేను వెళ్ళిపోయేవాడిని, అంతటితో కథ ముగిసేది. 182 00:09:33,080 --> 00:09:36,640 2019 తర్వాత నేను మార్చుకున్న అతి పెద్ద విషయాలలో ఒకటి, 183 00:09:36,720 --> 00:09:39,520 ఏ సమయంలోనైనా, నా మనసులో 184 00:09:40,240 --> 00:09:45,840 చికాకుగానో, ఆదుర్దాగానో అనిపిస్తే, నా గదిలోకి ఒకరిని తీసుకొచ్చేవాడిని. 185 00:09:45,880 --> 00:09:47,960 మరో ఆటగాడినో, కోచ్‌నో, ఎవరినో ఒకరిని. 186 00:09:48,400 --> 00:09:51,760 లేదా ఎక్కడికైనా వెళ్ళి ఎవరితో ఒకరితో మాట్లాడేవాడిని. 187 00:09:52,280 --> 00:09:55,080 నేను ఆ మనసులోని మాటల్ని బయటకు పంచుకోగానే, 188 00:09:55,160 --> 00:09:59,480 అంటే వాటిని దాచిపెట్టుకోకుండా, భుజాల నుండి భారం తీసేసినట్టు ఉండేది. 189 00:09:59,520 --> 00:10:03,280 జట్టులోని చాలా మంది మాట్లాడటానికి చొరవ చూపడంతో 190 00:10:03,360 --> 00:10:06,000 బహుశా నాకు సహాయపడిందేమో. 191 00:10:08,640 --> 00:10:12,480 తొలి టెస్ట్‌కు ఒకరోజు ముందు 192 00:10:12,520 --> 00:10:14,760 ట్రావిస్ హెడ్ ఫిట్నెస్ పరీక్ష 193 00:10:19,720 --> 00:10:21,640 నాకు గతంలో తొడకండరం గాయం కాలేదు, 194 00:10:21,760 --> 00:10:25,600 పరీక్ష ముందు రోజు దాకా పూర్తి వేగంతో పరిగెత్తాల్సిన అవసరం రాలేదు, 195 00:10:25,640 --> 00:10:27,760 ఆ దశకు చేరుకోవడానికి నాకు ఆదుర్దాగా ఉంది. 196 00:10:27,880 --> 00:10:30,640 గాయం తర్వాత పూర్తి పటుత్వంతో పరిగెత్తే మొదటిసారి అదే. 197 00:10:30,760 --> 00:10:33,480 ఒకవేళ నేను విఫలమైతే, పూర్తిగా విఫలమైనట్టే. 198 00:10:33,520 --> 00:10:35,760 ఒకవేళ విఫలమైతే, సీరీస్‌లో చోటు దక్కనట్టే. 199 00:10:35,840 --> 00:10:39,760 దారుణంగా ఉండింది, ఎందుకంటే నా నెట్ సెషన్‌పై ధ్యాస పెట్టినప్పుడు, 200 00:10:39,840 --> 00:10:41,880 అతను పరిగెత్తడం చూశాను, 201 00:10:41,960 --> 00:10:45,320 అతను ఏమైనా కుంటుతాడా అని చూశాను, ఎలా ఆడుతున్నాడు అని చూశాను. 202 00:10:45,400 --> 00:10:46,360 అతను బానే ఉన్నాడా? 203 00:10:46,440 --> 00:10:49,520 ఏం జరుగుతోందో, నేను ఎందుకు అక్కడున్నానో అందరికీ తెలుసు. 204 00:10:49,640 --> 00:10:50,600 సిద్ధమా? 205 00:10:50,960 --> 00:10:52,880 రెండు... ఒకటి... కానివ్వు! 206 00:10:53,120 --> 00:10:54,120 కానివ్వు, హెడీ! 207 00:10:55,840 --> 00:10:56,800 కానివ్వు, మిత్రమా! 208 00:10:57,320 --> 00:10:58,400 బ్యాట్ నేలకు తాకించు. 209 00:11:05,680 --> 00:11:08,480 కనుక, అంతా సవ్యంగా ఉంది, సోదరా. బాగుంది. 210 00:11:08,560 --> 00:11:10,640 అవును, బాగుంది. థాంక్యూ. 211 00:11:11,360 --> 00:11:12,640 థాంక్స్, మిత్రమా. మంచిది. 212 00:11:22,480 --> 00:11:25,120 నా గుండెను ముక్కలు చేసిన విపరీత క్షణాల్లో అదొకటని 213 00:11:25,200 --> 00:11:27,520 నా అభిప్రాయం, అలాగే... 214 00:11:28,320 --> 00:11:31,000 నేను చెప్పినట్టుగా, 100 శాతం సరైన ఎంపికే చేశారు, 215 00:11:31,080 --> 00:11:34,520 కానీ నన్ను నేను నమ్మేలా చేసుకున్నాను, ఐదేళ్ళ తర్వాత, 216 00:11:34,600 --> 00:11:37,560 నేను దేశం కోసం మరో టెస్ట్ ఆడబోతున్నానని. 217 00:11:37,640 --> 00:11:40,400 నన్ను నేను ఆ అందమైన కథను ఊహించుకోనిచ్చాను, 218 00:11:40,480 --> 00:11:42,520 అది అద్భుతంగా ఉంటుందని, 219 00:11:42,600 --> 00:11:44,600 కానీ అది నా నుండి లాగేసుకోబడింది. 220 00:11:50,480 --> 00:11:51,480 అది బాధేస్తుంది. 221 00:11:52,960 --> 00:11:56,400 కానీ నా తుదిశ్వాస దాకా ప్రయత్నిస్తాను, 222 00:11:56,480 --> 00:11:58,480 మరో టెస్ట్ ఆడటానికి... 223 00:12:00,000 --> 00:12:01,400 ఎవరికి తెలుసు. 224 00:12:12,920 --> 00:12:16,960 సందర్శించే జట్టుకు గాల్ ఎప్పుడూ చాలా కష్టమైన చోటుగా ఉండేది 225 00:12:17,040 --> 00:12:20,600 ఎందుకంటే మేము ఆధిపత్యం చూపిస్తాం, అక్కడ స్పిన్ పని చేస్తుంది. 226 00:12:20,680 --> 00:12:24,360 చాలా అంతర్జాతీయ జట్లపై, అక్కడ ఎన్నో విజయాలు కైవసం చేసుకున్నాం. 227 00:12:25,000 --> 00:12:28,000 2016 శ్రీలంక పర్యటనకు సంబంధించి మీ జ్ఞాపకాలు ఏంటి? 228 00:12:29,840 --> 00:12:30,960 పరమచెత్త. 229 00:12:31,040 --> 00:12:32,960 2016 ఆస్ట్రేలియా వారి శ్రీలంక పర్యటన 230 00:12:33,040 --> 00:12:34,840 బౌల్డ్ చేశాడు! భలే సుత్తిపోటు! 231 00:12:34,920 --> 00:12:36,200 2016 పర్యటనా? ఏం పర్యటన? 232 00:12:37,240 --> 00:12:38,080 దొరికిపోయాడు. 233 00:12:39,800 --> 00:12:41,120 చెల్లాచెదురైన ఆస్ట్రేలియా. 234 00:12:41,200 --> 00:12:44,000 ఆస్సీ బ్యాటింగ్‌ను శ్రీలంక తునాతునకలు చేస్తోంది. 235 00:12:44,080 --> 00:12:46,160 వారి స్పిన్ బౌలర్లు అత్యుత్తమం, 236 00:12:46,240 --> 00:12:48,640 మా బ్యాటర్లు అందుకు ధీటుగా ఆడలేదు, అంతే. 237 00:12:48,720 --> 00:12:49,560 దొరికిపోయాడు! 238 00:12:49,640 --> 00:12:51,000 జ్ఞాపకాలు దారుణమైనవి. 239 00:12:51,080 --> 00:12:54,920 స్పిన్ బంతితో బ్యాట్‌కు ఇరువైపులా విఫలమయ్యాను. 240 00:12:55,000 --> 00:12:57,960 ఆ పరిస్థితులకు మేము త్వరగా అలవాటుపడలేదు. 241 00:12:58,040 --> 00:12:59,240 నేను ఇలాగే ఆడతాను. 242 00:12:59,320 --> 00:13:02,840 నేను ఆడేది ఇలానే. అది శ్రీలంకలో పని చేయదు. 243 00:13:02,920 --> 00:13:03,760 బౌల్డ్ చేశాడు. 244 00:13:03,840 --> 00:13:05,760 కొన్ని పర్యటనలు పీడకలలు మిగులుస్తాయి. 245 00:13:05,840 --> 00:13:08,520 కొన్ని పర్యటనలను వెనుదిరిగి చూసుకుంటే... 246 00:13:08,600 --> 00:13:11,200 బంతి చాలా దగ్గరికి వచ్చింది! అంతే! అంతా అయిపోయింది! 247 00:13:11,280 --> 00:13:13,160 శ్రీలంక సీరీస్ గెలుచుకుంది! 248 00:13:13,240 --> 00:13:14,760 ఇదొక 3-0 సంపూర్ణ విజయం. 249 00:13:19,320 --> 00:13:23,840 మొదటి టెస్ట్ గాల్ అంతర్జాతీయ స్టేడియం 250 00:13:25,880 --> 00:13:29,400 పిచ్ నుండి వచ్చిన సమాచారం ఏంటంటే శ్రీలంక టాస్ గెలిచింది, 251 00:13:29,520 --> 00:13:31,360 మొదట బ్యాట్ చేయబోతుంది. 252 00:13:31,440 --> 00:13:32,800 చూడటానికి గొప్ప పిచ్. 253 00:13:32,880 --> 00:13:34,640 బంతి బాగా మెలి తిరగనుంది, 254 00:13:34,720 --> 00:13:37,840 బ్యాటర్లకు పెద్ద సవాలుగా నిలువనుంది. 255 00:13:39,280 --> 00:13:42,480 తిరిగి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వచ్చాడు, నాథన్ లయన్. 256 00:13:46,040 --> 00:13:47,240 అబ్బో. 257 00:13:49,080 --> 00:13:51,760 నాథన్ వచ్చాడు, అతను వేసిన తొలిబంతి, 258 00:13:51,840 --> 00:13:56,520 నేరుగా వెళ్ళి క్యారీ మూతికి తగిలింది. 259 00:13:56,600 --> 00:13:59,560 అతనికి హెల్మెట్ లేకపోయి ఉంటే... 260 00:13:59,720 --> 00:14:02,520 అతని దగ్గరికి వెళ్ళి, "ఏమీ కాలేదుగా?" అని అడిగాను. 261 00:14:02,600 --> 00:14:05,920 అతను, "అవును. ఛత్!" నేను, "గాల్‌కు స్వాగతం," అన్నాను. 262 00:14:09,600 --> 00:14:10,920 శ్రీలంక మరో వికెట్ పోయింది. 263 00:14:11,000 --> 00:14:11,840 సిల్లీ పాయింట్. 264 00:14:14,760 --> 00:14:15,840 అంపైర్ ఔట్ ఇచ్చాడు. 265 00:14:16,360 --> 00:14:17,400 అద్భుతం. 266 00:14:17,520 --> 00:14:20,480 స్వెప్సన్ నుండి మరో అమోఘమైన బంతి. 267 00:14:20,560 --> 00:14:21,720 అదొక అద్భుతమైన క్యాచ్. 268 00:14:21,800 --> 00:14:23,240 -క్యాచ్! -అమోఘం! 269 00:14:23,320 --> 00:14:25,840 శ్రీలంక వారికి అంత కష్టంగా అనిపించడం చూసి 270 00:14:25,920 --> 00:14:29,640 క్రికెట్ ఎలా ఆడాలన్న దాన్నిపై మాకు మరింత స్పష్టత వచ్చింది. 271 00:14:29,720 --> 00:14:32,000 అంతటితో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. 272 00:14:32,080 --> 00:14:34,880 ఈ పరిస్థితులు ఆస్ట్రేలియా వారికి అంత సులభంగా ఉండవు. 273 00:14:34,960 --> 00:14:37,400 -అవి సవాళ్ళు విసురుతాయి. -ఆత్మవిశ్వాసం. 274 00:14:37,480 --> 00:14:40,400 బౌలింగ్ ఇన్నింగ్స్ తర్వాత అది కచ్చితంగా ఉండింది, 275 00:14:40,480 --> 00:14:43,960 కానీ, పిచ్‌పై బంతి బాగా తిరుగుతుందని మాకు తెలుసు. 276 00:14:44,040 --> 00:14:46,600 అది చాలా కష్టంగా ఉండబోతుందని మాకు తెలుసు. 277 00:14:49,280 --> 00:14:50,360 అది ఔట్ ఇవ్వాల్సిందే! 278 00:14:50,440 --> 00:14:52,280 అది ఔట్ ఇవ్వాల్సిందే, ఇచ్చాడు! 279 00:14:52,760 --> 00:14:56,760 శ్రీలంకపై ఆడేటప్పుడు, ఒక వికెట్ కోల్పోగానే, వెంటనే అంతా మారిపోతుంది. 280 00:14:56,840 --> 00:14:58,800 అది ఈ పిచ్‌కున్న సత్తా. 281 00:15:01,280 --> 00:15:03,280 వాటిని మిస్సవుతూ ఉంటాను! 282 00:15:17,360 --> 00:15:19,240 తెరుచుకుని చావవే! 283 00:15:20,520 --> 00:15:22,080 మార్నస్ స్వీప్ చేశాడు. 284 00:15:22,160 --> 00:15:23,640 నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి. 285 00:15:23,720 --> 00:15:25,920 నమ్మలేకపోతున్నాడు. మార్నస్ నిష్క్రమించాడు. 286 00:15:26,920 --> 00:15:28,000 నన్ను భలే పట్టేశారు. 287 00:15:29,160 --> 00:15:31,920 నా మీద పగ తీర్చుకుంటాడని తెలుసు. ఓరి నీ ఛ! 288 00:15:38,560 --> 00:15:39,480 చిక్కుల్లో పడ్డాడు! 289 00:15:39,560 --> 00:15:40,600 చిక్కుల్లో పడ్డాడు! 290 00:15:41,360 --> 00:15:42,880 అది ఔట్‌గా ప్రకటిస్తారు. 291 00:15:43,760 --> 00:15:45,160 అది ఔట్‌గా ప్రకటిస్తారు. 292 00:15:45,520 --> 00:15:49,080 స్టీవ్ స్మిత్ కోపంతో ఊగిపోతున్నాడు! 293 00:15:49,520 --> 00:15:50,600 ఆగ్రహావేశంతో! 294 00:15:51,640 --> 00:15:55,800 అబ్బో. అవును, అలా జరిగి ఉండకూడదు. 295 00:15:57,360 --> 00:16:00,320 అదొక కష్టమైన పిచ్, ఇక, 296 00:16:00,400 --> 00:16:05,400 అలాంటి పరిస్థితుల్లో నేను అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు కావడం వల్ల, 297 00:16:06,760 --> 00:16:11,160 బౌలర్‌ను పెద్దగా ఎదుర్కోకుండానే ఔట్ అవ్వడం, 298 00:16:11,240 --> 00:16:14,280 దాన్నుండి తేరుకోవడానికి నాకు ఎక్కువ సమయమే పట్టింది. 299 00:16:14,360 --> 00:16:18,000 6 పరుగుల తర్వాత వెనుదిరుగుతున్నాడు. ఆస్ట్రేలియా 83కు 3 వికెట్లు. 300 00:16:20,040 --> 00:16:21,320 ఓరి నీ... 301 00:16:23,760 --> 00:16:27,440 భలే తెలివి. అలాంటి వికెట్‌లో రనౌట్ కావడం భలే తెలివైన పని. 302 00:16:27,520 --> 00:16:30,400 మంచిది. వాళ్ళకు వికెట్ ఇవ్వడం. ఎందుకు ఇవ్వకూడదు? ఛత్! 303 00:16:31,040 --> 00:16:34,360 తనకు తానే అధిక ప్రమాణాలు పెట్టుకునే స్మిత్‌లాంటి బ్యాటర్‌కు, 304 00:16:34,440 --> 00:16:35,840 ఇది రెండింతల కష్టం. 305 00:16:36,000 --> 00:16:39,280 శ్రీలంకకు వెళ్ళి, కెప్టెన్‌గా విఫలమయ్యాక, అతను అక్కడ... 306 00:16:39,360 --> 00:16:42,080 ముగించాల్సిన పని ఇంకా ఉందని అనుకునేవాడు. 307 00:16:42,560 --> 00:16:43,960 ఆట విరామం తీసుకుంటుంది... 308 00:16:44,040 --> 00:16:45,000 ఆస్ట్రేలియా 3/98 309 00:16:45,080 --> 00:16:46,440 ...తొలి రోజు తర్వాత. 310 00:16:47,880 --> 00:16:51,720 ఒత్తిడి పెరిగిపోయింది, అవును. ఒక్క తప్పు చేస్తే చాలు, ఔట్ అవుతాం. 311 00:16:51,920 --> 00:16:55,360 ఒత్తిడి పెరిగిపోయింది, అవును. ఒక్క తప్పు చేస్తే చాలు, ఔట్ అవుతాం. 312 00:16:56,560 --> 00:16:59,240 మనం యువకులుగా ఉన్నప్పుడు, కొంత దిగులుపడతాం. 313 00:16:59,320 --> 00:17:02,440 సంక్లిష్టం చేయకు. సదుద్దేశంతో ఆడు. అదృష్టాన్ని సృష్టించు. 314 00:17:02,520 --> 00:17:04,840 సదుద్దేశంతో ఆడు, అలా ఆడుతూనే ఉండు. 315 00:17:04,920 --> 00:17:08,040 నేను ఇక్కడ ఇబ్బంది పడిన సమయాలు సదుద్దేశం చూపని సమయాలే. 316 00:17:08,080 --> 00:17:10,440 నేను ఒకసారి, రెండు సార్లు ఔట్ అయ్యాను, 317 00:17:10,520 --> 00:17:12,960 భయపడ్డాను, సదుద్దేశ్యం లేదు, ఖేల్ ఖతమ్ అంతే. 318 00:17:13,040 --> 00:17:15,760 ఇక్కడ 50 పరుగులు చేయడం భారీ విషయం, 319 00:17:15,800 --> 00:17:18,800 నువ్వు 50 కొడితే, అది భారీ విషయం, 320 00:17:18,920 --> 00:17:21,800 ప్రతి ఒకరూ 20, 30 పరుగుల దాకా కొడితే, అది భారీ విషయం. 321 00:17:21,880 --> 00:17:22,800 భారీ లక్ష్యం వద్దు. 322 00:17:22,920 --> 00:17:25,040 అది అద్భుతం. థాంక్యూ. 323 00:17:31,880 --> 00:17:33,320 కెమరన్ గ్రీన్ 324 00:17:34,560 --> 00:17:37,400 మూడున్నర ఏళ్ళుగా ఆమెతో కలిసి తిరుగుతున్నాను. 325 00:17:37,480 --> 00:17:39,440 మేము ఇద్దరూ ఒకే ప్రాంతంలో పెరిగాం. 326 00:17:39,520 --> 00:17:40,440 ఎమిలీ రెడ్‌వుడ్ 327 00:17:40,520 --> 00:17:43,560 నా స్నేహితులు చాలామంది తనను స్నేహపూర్వక భారీకాయుడు అంటారు. 328 00:17:45,560 --> 00:17:48,280 తను ఒక భావోద్వేగ తరహా మనిషి. 329 00:17:48,320 --> 00:17:52,640 సరదాగా ఉంటుంది, మనసు లోపల ఏముంటుందో వినటం, బహుశా పైకి కనిపించేలా ఉండదు. 330 00:17:53,320 --> 00:17:55,560 తోక బాగుంది. తోక సంతోషంగా ఉంది. 331 00:17:55,800 --> 00:17:57,080 నీకున్నది సంతోషమైన తోక. 332 00:17:58,520 --> 00:17:59,800 ఇది బుజ్జి మర్టల్. 333 00:18:00,080 --> 00:18:02,320 దీని వయసు ఆరున్నర నెలలు. 334 00:18:02,680 --> 00:18:04,480 ఇది కవూడుల్ మిశ్రమ జాతి కుక్క. 335 00:18:04,800 --> 00:18:09,560 మేము మర్టల్‌ను ఎందుకు ఎంచుకున్నామంటే, ఉన్న కుక్కపిల్లల్లో ఎక్కువ మూలిగింది ఇదే. 336 00:18:09,680 --> 00:18:12,080 అందుకే హ్యారీ పాటర్‌‌‌లో ఉన్న మూలిగే మర్టల్. 337 00:18:13,400 --> 00:18:17,880 క్రికెట్ చాలా తమాషైన ఆట, అందులో మన నియంత్రణలో లేని విషయాలుంటాయి, 338 00:18:17,960 --> 00:18:19,680 వాటి గురించి మనం ఏమీ చేయలేం. 339 00:18:19,760 --> 00:18:21,560 చేయి కలుపు. చేయి? 340 00:18:21,680 --> 00:18:23,520 కామ్ చాలా ముందుగానే సంప్రదించాడు, 341 00:18:23,560 --> 00:18:27,080 నీకు ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడటానికి పిలుపు అందగానే, 342 00:18:27,160 --> 00:18:28,680 మానసిక ఎరుక నేర్పే కోచ్‌ను. 343 00:18:30,080 --> 00:18:34,440 మైదానం వెలుపలి వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే ఏదైనా మైదానంపై సాయం చేస్తుంది. 344 00:18:34,520 --> 00:18:36,640 క్రికెట్‌లో ప్రశాంతతనిచ్చేవి అంతగా లేవు. 345 00:18:36,720 --> 00:18:39,800 మానసిక ఎరుక కోచ్‌తోనో లేదా మానసిక వైద్యుడితోనో మాట్లాడటం 346 00:18:39,920 --> 00:18:43,240 బహుశా అందులో సహాయపడే మార్గమని నాకు అనిపించింది. 347 00:18:43,320 --> 00:18:47,080 మనకు మనం విశాలతను కల్పించుకునే ఏ సమయమైనా, నేను కీలకం అనుకుంటాను. 348 00:18:47,160 --> 00:18:51,480 కామ్ ఇప్పుడు బాగున్నాడు. అతనికి ఇప్పుడు మద్దతునిచ్చే ఎన్నో వ్యవస్థలున్నాయి, 349 00:18:51,560 --> 00:18:54,200 అలాగే తన వేగమైన ప్రగతితో బాగానే వ్యవహరించాడు. 350 00:18:55,080 --> 00:18:59,040 డబ్ల్యూఏలో ఈ కుర్రాడు కెమరన్ గ్రీన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. 351 00:18:59,080 --> 00:19:01,320 అతను బ్రాడ్‌మన్, లిల్లీల కలయిక... 352 00:19:01,440 --> 00:19:04,720 కీత్ మిల్లర్ తర్వాత అలాంటి తరహా ఆటగాడు అవ్వగలడు. 353 00:19:04,800 --> 00:19:07,480 తన వయసువారిలో ఇతను ఆధిపత్యం చూపించి పైకొచ్చాడు. 354 00:19:07,560 --> 00:19:10,960 ఒక బ్రహ్మాండమైన ప్రధాన ఆటగాడి ఉద్భవాన్ని మనం చూస్తున్నాం. 355 00:19:11,040 --> 00:19:12,880 ఇతనొక మారణాయుధం కాగలడు... 356 00:19:12,960 --> 00:19:16,000 రికీ పాంటింగ్ తర్వాత ఉత్తమ బ్యాటింగ్ సత్తా ఉన్న వ్యక్తి. 357 00:19:16,080 --> 00:19:19,040 ఇలాంటి ప్రతిభ ఉన్న ఆటగాళ్ళు అంత తరచుగా రారు. 358 00:19:20,520 --> 00:19:23,440 కెమరన్ గ్రీన్ చిన్ననాటి నుండే ఒక సహజ ప్రతిభాశాలి. 359 00:19:24,080 --> 00:19:27,080 కాస్త ఎక్కువగా ఎదిగిన బాయ్ స్కౌట్‌లా కనిపిస్తాడు. 360 00:19:27,720 --> 00:19:31,640 అతని చేతికి బ్యాటో లేక బంతో వచ్చినప్పుడే 361 00:19:31,720 --> 00:19:35,560 అతనిలోని అసాధారణ సాధ్యతలను మనం చూడగలం. 362 00:19:36,440 --> 00:19:38,240 ఇది 10 మంది సహచరులతో ఆడే ఆట. 363 00:19:39,320 --> 00:19:41,440 కానీ నిజానికి ఇది మనలో మనమే ఆడే ఆట. 364 00:19:41,560 --> 00:19:44,560 మనకోసం ఎవరూ బ్యాట్ చేయరు లేదా బౌల్ చేయరు. 365 00:19:45,160 --> 00:19:47,240 సామర్థ్యం చూపాల్సిన బాధ్యత మనదే. 366 00:19:49,000 --> 00:19:50,960 21 ఏళ్ళ యుక్త వయసులో ఆడటం ఆరంభించి, 367 00:19:51,080 --> 00:19:53,040 తొలి మ్యాచ్‌ ఇండియాపై డిసెంబర్ 2020 368 00:19:53,160 --> 00:19:55,280 అందరి కళ్ళు నన్ను చూడడం అనుభూతి చెందాను. 369 00:19:55,400 --> 00:19:57,800 ఈ స్థాయిలో సౌకర్యంగా ఉండటానికి 370 00:19:57,920 --> 00:20:00,280 ఇంకాస్త సమయం పడుతుందని అనిపిస్తుంది. 371 00:20:00,320 --> 00:20:02,040 ఆ భావన ఇంకా పరిణమిస్తూనే ఉంది. 372 00:20:02,080 --> 00:20:06,800 ఈ స్థాయిలో సౌకర్యమైన భావన కోసం ఇంకా చాలా సమయం పడుతుంది. అవును. 373 00:20:08,080 --> 00:20:11,760 కెమరన్ గ్రీన్ ఎంత యువకుడో నాకు నేను గుర్తు చేసుకుంటాను. 374 00:20:11,800 --> 00:20:15,000 తనకు అంత ప్రొఫెషనల్ చరిత్ర లేదు. నేను ఆ స్థితిలో ఉన్నవాడినే. 375 00:20:15,080 --> 00:20:17,640 ఆస్ట్రేలియాకు ఎంతోకాలంగా ఆడుతూ ఇలా అనుకుంటున్నా, 376 00:20:17,720 --> 00:20:21,320 ఈ పిచ్‌ను పోలినలాంటి పిచ్‌పై నేను ఇంతవరకూ ఆడలేదు. 377 00:20:21,520 --> 00:20:24,800 శ్రీలంక స్కోరుకు ఆస్ట్రేలియా ఇంకా 100 పరుగులు వెనుకబడి ఉంది. 378 00:20:24,880 --> 00:20:25,880 ప్రస్తుతానికి, 379 00:20:25,960 --> 00:20:28,280 ప్రతీ విషయం బౌలర్లకు సానుకూలంగా ఉంది. 380 00:20:28,320 --> 00:20:32,400 మొత్తం మ్యాచ్ ఫలితానికి ఇప్పుడు ఆస్ట్రేలియా సాధించబోయే ఆధిక్యమే 381 00:20:32,480 --> 00:20:35,080 కీలకం కాబోతోంది. ఆ బాధ్యతలోని చాలా భారం 382 00:20:35,160 --> 00:20:37,080 గ్రీన్ భుజస్కంధాలపై పడింది. 383 00:20:37,200 --> 00:20:39,200 ఇలా చేయడం చాలా కష్టమైన విషయం, నిజంగానే. 384 00:20:39,280 --> 00:20:41,760 అంటే బ్యాట్ తీసుకుని మైదానంలోకి వెళ్ళి, 385 00:20:41,800 --> 00:20:44,640 పిచ్‌పై నిలబడి ఆస్ట్రేలియా తరపున ఆడితే తప్ప, 386 00:20:44,720 --> 00:20:46,720 అది ఎలా ఉంటుందో మీకు తెలియదు. 387 00:20:48,400 --> 00:20:49,480 చక్కని బౌలింగ్. 388 00:20:49,560 --> 00:20:52,320 అస్తవ్యస్తత. అక్కడ పూర్తి అస్తవ్యస్తత నెలకొంది. 389 00:20:52,440 --> 00:20:54,560 బ్యాటర్లు ఇక్కడ చాలా విషయాలతో వ్యవహరించాలి. 390 00:20:54,680 --> 00:20:57,240 కొన్నిసార్లు సముద్రతీరంపై ఆడినట్టుగా ఉంటుంది. 391 00:20:57,320 --> 00:21:00,680 ఫీల్డర్లు తల దగ్గర లేక కాలి దగ్గర లేక అంతటా ఉన్నారు. 392 00:21:00,760 --> 00:21:04,080 కెమరన్ గ్రీన్, ఈ యువకుడికి ఎంతో భవిష్యత్తు ముందుంది. 393 00:21:04,200 --> 00:21:06,440 టెస్ట్ సగటు 36 పరుగులు. 394 00:21:06,800 --> 00:21:08,520 చక్కటి ఆల్-రౌండర్. 395 00:21:08,560 --> 00:21:11,040 కానీ ఈ పరిస్థితులు, అతన్ని పరీక్షిస్తాయి. 396 00:21:15,440 --> 00:21:19,080 నా పాదాలను ఉపయోగించాలనే స్పష్టమైన ప్రణాళికతో వెళ్ళాను. 397 00:21:20,240 --> 00:21:24,240 బంతిని వెంటనే అందుకోకపోతే అది మెలితిరిగి చాలా దూరం వెళుతోంది. 398 00:21:24,320 --> 00:21:28,560 దాంతో, మేము అందరం అనుకున్నాం, మనం ఆటలో ఉండాలంటే స్వీప్ ఆడాల్సిందేనని. 399 00:21:30,040 --> 00:21:31,880 ఈసారి అతను స్వీప్ షాట్ యత్నించాడు. 400 00:21:31,960 --> 00:21:33,560 భారీ అప్పీల్ చేశాడు. 401 00:21:33,680 --> 00:21:35,920 స్టంప్స్‌కు కాస్త అటుగా వెళ్ళుంటుందేమో. 402 00:21:36,000 --> 00:21:37,560 తగినంత స్వీప్ చేయలేదేమో. 403 00:21:37,680 --> 00:21:40,320 అంతకుముందు ఒకటి రెండు బంతులు స్వీప్ చేసి ఉండాలేమో. 404 00:21:41,560 --> 00:21:43,000 చీపురుతో వచ్చినట్టు ఉన్నాడు. 405 00:21:43,680 --> 00:21:45,920 అందులో కాస్త ముప్పు ఉందనుకుంటాను, 406 00:21:46,000 --> 00:21:48,520 బంతి మెలి తిరుగుతుండగా స్వీప్‌కు ప్రయత్నించడం. 407 00:21:48,560 --> 00:21:51,440 ప్రత్యేకించి, అతను ఆడుతున్న శైలిలో. 408 00:21:53,440 --> 00:21:56,720 మనకు మనం చెప్పుకోవాలి, "నేను ఇందుకు పూర్తిగా కట్టుబడాలి". 409 00:21:56,800 --> 00:21:58,840 మనం ధైర్యంగా ఉండాలి. 410 00:22:01,240 --> 00:22:02,400 చక్కగా కొట్టాడు. 411 00:22:02,480 --> 00:22:04,520 ఇద్దరు ఫీల్డర్లకు సరిగ్గా మధ్యలో. 412 00:22:05,240 --> 00:22:06,200 కెమరన్ గ్రీన్. 413 00:22:06,760 --> 00:22:08,320 ఆపడానికి వీలులేని వ్యూహాన్ని 414 00:22:08,400 --> 00:22:11,120 అతను ప్రయోగించాలి, 415 00:22:11,200 --> 00:22:13,560 ఆడటానికి దాదాపు సాధ్యపడని 416 00:22:13,640 --> 00:22:15,360 పరిస్థితులలో. 417 00:22:15,840 --> 00:22:18,080 కెమరన్ గ్రీన్, ఇప్పట్లో వెళ్ళేలా లేడు. 418 00:22:18,160 --> 00:22:19,480 అక్కడికి వెళ్ళాక 419 00:22:19,560 --> 00:22:22,240 అతను చూపిన వ్యక్తిత్వం, "కాదు, నేను ఇదే చేస్తాను. 420 00:22:22,320 --> 00:22:25,400 నేను దాన్ని చాచి కొడతాను, ఇక అంతే." 421 00:22:25,480 --> 00:22:28,000 స్క్వేర్ లెగ్ వెనుక స్వీప్ చేశాడు. అదొక బౌండరీ. 422 00:22:28,080 --> 00:22:31,560 ఆ క్షణంలోనే ఇలా అనుకున్నా, "ఈ జట్టు పురోగమిస్తోంది." 423 00:22:32,920 --> 00:22:34,120 అదిగో సాధించాడు. 424 00:22:36,360 --> 00:22:39,080 అతను చిరకాలం గుర్తుంచుకునే అర్థశతకం ఇది. 425 00:22:41,120 --> 00:22:43,800 పోరాడి ఆస్ట్రేలియాను ఈ మ్యాచ్‌లో నిలబెట్టాడు. 426 00:22:45,400 --> 00:22:48,480 ఒక్కో పరుగు చేరుతుండటంతో, శ్రీలంక ఆటగాళ్ళు 427 00:22:48,560 --> 00:22:51,200 అంతకంతకూ నిరుత్సాహపడటం మేము చూశాం. 428 00:22:51,800 --> 00:22:55,560 ఆ టెస్ట్ మ్యాచ్ వారి చేజారిపోతోందని పసిగట్టగలిగారు. 429 00:22:57,320 --> 00:23:02,400 ఒక యువ ఆటగాడు ఇలాంటి కష్టమైన పిచ్‌పైకి వచ్చి 77 పరుగులు చేయడం తరచూ జరగదు, 430 00:23:02,480 --> 00:23:05,400 బహుశా ఆ పిచ్‌పై అది 140 పరుగులకు సమానమేమో. 431 00:23:08,720 --> 00:23:12,040 ఈ కుర్రాడు ఓ చిరకాలపు అత్యుత్తమ ఆటగాడిగా నిలుస్తాడు. 432 00:23:13,200 --> 00:23:17,480 తనకు ఇది తొలి శ్రీలంక పర్యటన, పరిస్థితులకు అలవాటుపడి, ఓ మార్గం కనుగొన్నాడు. 433 00:23:18,240 --> 00:23:23,120 అది మనం చూడవచ్చు. అతని మనసులో సౌకర్యంగా ఎలా ఆడాలనుకుంటున్నాడో మనకు తెలుసు. 434 00:23:23,760 --> 00:23:27,960 ఒక కెప్టెన్‌గా అదే పెద్ద బహుమానం, జట్టు ఉత్సాహంగా ఉంటూ, 435 00:23:28,240 --> 00:23:30,600 అందరూ తమదైన శైలిలో ఆడటం. 436 00:23:30,680 --> 00:23:31,720 అది అద్భుతం. 437 00:23:33,040 --> 00:23:33,880 బౌల్డ్ చేశాడు. 438 00:23:37,080 --> 00:23:41,720 గ్రీన్ ఇన్నింగ్స్ ఆటను గాడిలో పెట్టింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో అదొక పెద్ద గెలుపు. 439 00:23:42,960 --> 00:23:46,640 ఈ పరిస్థితులను జయించటం, జట్టుకు చిరకాలం గుర్తుండిపోయే 440 00:23:46,760 --> 00:23:47,720 విషయం ఇది. 441 00:23:50,640 --> 00:23:52,160 ఆస్ట్రేలియాకు సంబరాలు! 442 00:23:52,240 --> 00:23:54,560 వారికి ఇదొక పరిపూర్ణమైన విజయం. 443 00:23:55,320 --> 00:23:57,440 మరో ఆట గెలిస్తే, సీరీస్ వారిదే. 444 00:23:57,800 --> 00:24:00,600 గ్రీన్, అతను ఆస్ట్రేలియాకు తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. 445 00:24:00,680 --> 00:24:03,760 బంతితో, బ్యాట్‌తో అతను మరెన్నో చేయబోతున్నాడు. 446 00:24:03,840 --> 00:24:05,760 మిత్రమా, నిన్ను చూసి ఎంతో గర్విస్తా 447 00:24:05,840 --> 00:24:09,200 నువ్వు అక్కడికి వెళ్ళిన తీరు నుండి సాధించిన విషయాల దాకా. 448 00:24:09,280 --> 00:24:11,200 చక్కగా ఆడావు, మిత్రమా! 449 00:24:14,920 --> 00:24:16,680 నాకు చీర్స్ కొట్టు, బాబు. 450 00:24:16,760 --> 00:24:19,720 -కుర్రోడా, నిమ్మరసం ఆస్వాదించు. -చక్కగా ఆడావు. 451 00:24:19,800 --> 00:24:23,000 తొలిసారి అదృష్టం, మిత్రమా, కానీ రెండోసారి నిలకడ. 452 00:24:25,200 --> 00:24:26,200 థాంక్స్. 453 00:24:30,840 --> 00:24:32,280 అది అభినందనలు అనుకుంటా. 454 00:24:32,640 --> 00:24:34,240 -వినయంగా ఉండు. -అది స్వీకరిస్తా. 455 00:24:34,800 --> 00:24:38,360 భవిష్యత్తు పరంగా, ఆ ఆట అతనికి చాలా చక్కనైనది. 456 00:24:38,440 --> 00:24:41,440 తను ఆడగలననే నమ్మకం అతనికి ఇప్పుడు కలిగింది. 457 00:24:41,520 --> 00:24:43,480 ముఖ్యమైన సందర్భంలో ఆడగలననే నమ్మకం. 458 00:24:46,200 --> 00:24:49,480 ఒక క్రికెట్ జట్టుగా ఆ గెలుపు మమ్మల్ని సమర్థించింది, 459 00:24:49,560 --> 00:24:53,120 అంటే మా ఉత్తమమైన ఆట ఆడే రోజున ఏ జట్టునైనా ఓడిస్తాం అని. 460 00:25:30,000 --> 00:25:32,240 నా ఆటతీరు ఎలా ఉంటుందంటే 461 00:25:32,320 --> 00:25:36,120 క్షుణ్ణంగా సంసిద్ధం కావడం, నాకు వీలైనవన్నీ చేయడం, 462 00:25:36,200 --> 00:25:40,040 అంటే విజయం సాధించడానికి నాకు నేను అవకాశం ఇచ్చుకునేలా చూసుకోవడం. 463 00:25:41,560 --> 00:25:43,880 అక్కడ ఏం చేస్తున్నావు? 464 00:25:44,320 --> 00:25:46,120 నా బొటనవేలి ముక్కల్ని మారుస్తున్నా. 465 00:25:46,200 --> 00:25:47,360 వేటితో? 466 00:25:49,040 --> 00:25:53,160 ఫోమ్ బయటకు తీసి, మరింత మెత్తటి ఫోమ్‌ను లోపల పెడుతున్నా. 467 00:25:53,880 --> 00:25:55,200 అది సాయపడుతుందా? 468 00:25:55,280 --> 00:25:56,120 బాగుంటుంది. 469 00:25:56,200 --> 00:25:57,600 నువ్వొక వింత మనిషివి. 470 00:25:58,640 --> 00:26:00,080 -అవును. నిజమే. -అవును. 471 00:26:01,800 --> 00:26:04,960 ప్రతీ చేతితొడుగుల జతకు అలా చేయడం ఒక ప్రక్రియ. 472 00:26:05,400 --> 00:26:07,880 ముఖ్యంగా నీ దగ్గర 3,000 జతలు ఉన్నప్పుడు... 473 00:26:07,960 --> 00:26:08,960 అది నిజమే. 474 00:26:09,120 --> 00:26:12,480 ఎప్పుడూ మెరుగుపరుచుకునే విషయాలు, మార్గాల కోసం చూస్తుంటాను. 475 00:26:12,560 --> 00:26:15,560 ఆత్మావలోకనం చేసుకోవడం, మనతో మనం నిజాయితీగా ఉండటం, 476 00:26:15,680 --> 00:26:18,360 ఎదుగుదలలో, మెరుగుదలలో ఒక భాగం. 477 00:26:19,120 --> 00:26:20,880 2019, యాషెస్ సీరీస్‌లో, 478 00:26:20,960 --> 00:26:24,680 ఏ స్థితిలో ఉండేవాడినంటే, మైదానంలోకి నడుచుకుని వెళ్తే చాలు, 479 00:26:24,760 --> 00:26:26,760 దాదాపు విజయం ఖాయం అన్నట్టుగా. 480 00:26:26,840 --> 00:26:28,720 2019 యాషెస్ బ్యాటింగ్ సగటు 110.57 481 00:26:28,800 --> 00:26:32,400 ఒకే టెస్ట్ మ్యాచ్‌లో స్టీవెన్ స్మిత్ వరుసగా రెండు శతకాలు బాదాడు. 482 00:26:32,480 --> 00:26:35,080 ఎల్లప్పుడూ అదే స్థాయిలో ఆడటం కష్టమైన విషయం. 483 00:26:35,160 --> 00:26:37,640 ఎందుకో తెలియదు. జవాబు తెలిసుంటే బాగుండు. 484 00:26:37,720 --> 00:26:40,360 అతను బౌల్డ్ అయ్యాడు! పరిపూర్ణమైన బౌలింగ్! 485 00:26:42,040 --> 00:26:43,400 చక్కగా అందుకున్నాడు. 486 00:26:44,040 --> 00:26:45,800 స్టీవ్ స్మిత్‌కు గుండు సున్నా. 487 00:26:45,880 --> 00:26:47,760 2021/22 యాషెస్ బ్యాటింగ్ సగటు 30.5 488 00:26:47,840 --> 00:26:50,280 ఆస్ట్రేలియా అన్ని రకాల చిక్కుల్లో పడింది. 489 00:26:50,360 --> 00:26:52,320 100 పరుగులు చేయని ప్రతీ టెస్ట్, 490 00:26:52,400 --> 00:26:54,200 అతన్ని కలచివేసేది. 491 00:26:55,800 --> 00:27:00,760 బంతిని మనం అనుకున్నట్టుగా కొట్టనప్పుడు, లేదా మనం అనుకున్న నిర్ణయాలు చేయలేనప్పుడు, 492 00:27:00,840 --> 00:27:03,720 శతకం సాధించడం చాలా కష్టం. 493 00:27:06,160 --> 00:27:08,320 నేను చేసే ప్రతీదీ విమర్శించుకుంటాను. 494 00:27:09,680 --> 00:27:12,640 కొన్నిరోజులు ఎలా అనిపిస్తుందంటే, లేదు, నేను సరిగ్గా 495 00:27:12,720 --> 00:27:15,400 కదలటం లేదు. బంతిని సరిగ్గా అందుకోవటం లేదు. 496 00:27:15,480 --> 00:27:18,880 ఇవాళ విషయాలు అంత మంచిగా అనిపించడం లేదు. 497 00:27:25,280 --> 00:27:28,320 బహుశా స్టీవ్ తనకు తానే బాధితుడేమో, 498 00:27:28,840 --> 00:27:30,520 తన గొప్పతనానికి బాధితుడేమో. 499 00:27:30,600 --> 00:27:36,120 అతను ఎంతోకాలంగా చక్కటి ఆటగాడిగా ఉండటం వల్ల, జనాలు అదే ఆశిస్తారు. 500 00:27:36,640 --> 00:27:39,720 దాంతో అతను 100 తర్వాత 100 పరుగులు చేయకపోతే, 501 00:27:39,800 --> 00:27:42,440 జనాలు ప్రశ్నలు అడుగుతారు. 502 00:27:42,520 --> 00:27:46,000 బహుశా కొద్దిసార్లు అతను కూడా తనపై ఆ ఒత్తిడి పెట్టుకుంటాడేమో. 503 00:27:46,600 --> 00:27:50,160 స్టీవ్ స్మిత్‌లాంటి ఆటగాడు, అతనికి అతనే ఉత్తమ కోచ్. 504 00:27:50,240 --> 00:27:52,520 తన మానానికి తనను వదిలేయాలి. అడ్డుపడకూడదు. 505 00:27:52,600 --> 00:27:53,440 స్టీవ్ స్మిత్ 506 00:27:53,520 --> 00:27:56,000 నా నుండి నీకేమైనా కావాలంటే, నాతో వచ్చి మాట్లాడు, 507 00:27:56,080 --> 00:27:57,560 కానీ వెళ్ళి నీ ఆట ఆడు. 508 00:28:01,160 --> 00:28:02,200 ఎలాఉన్నాం, సిబ్బంది? 509 00:28:02,280 --> 00:28:03,120 అదిగో వచ్చాడు. 510 00:28:03,200 --> 00:28:07,680 చాలా ఏళ్ళుగా జనాలు ఏమన్నారంటే క్రికెట్‌పై నుండి నీ మనసు మళ్ళడానికి నీకు 511 00:28:07,760 --> 00:28:08,920 ఇంకేదైనా ఉండాలన్నారు. 512 00:28:09,440 --> 00:28:10,480 కొంతకాలం, 513 00:28:10,600 --> 00:28:13,480 కేవలం క్రికెట్ మాత్రమే ఉండేది. అంతే. 514 00:28:14,360 --> 00:28:17,520 కానీ నా వయసు పెరిగే కొద్దీ, కొన్ని భిన్నమైన 515 00:28:17,600 --> 00:28:21,920 విషయాల గురించి ఆలోచించి, ఆట నుండి నా మనసు దారి మళ్ళించడం బాగా అనిపించింది. 516 00:28:22,000 --> 00:28:24,800 అంటే కోల్డ్ బ్రూ రుచి బానే ఉందా? 517 00:28:26,120 --> 00:28:30,080 అది అసాధారణంగా ఉండింది. అది చాలా మృదువుగా ఉందనిపించింది. 518 00:28:30,160 --> 00:28:34,200 వాళ్ళు 1 కి 4 నిష్పత్తిలో పరీక్షలు చేశారనుకుంటా. 519 00:28:34,280 --> 00:28:35,680 1 కి 3 అలాగే 1 కి 6. 520 00:28:35,760 --> 00:28:36,680 సరే. 521 00:28:36,760 --> 00:28:38,840 ఇక 1 కి 4 అమోఘంగా ఉండింది. 522 00:28:38,920 --> 00:28:42,400 2018లో ఇక్కడ నాకు ఓట్ మిల్క్ కనిపించలేదు. 523 00:28:42,480 --> 00:28:46,560 ఆ తీరు ఆస్ట్రేలియాకు కూడా రాబోతుందని నాకు అనిపించింది. 524 00:28:46,640 --> 00:28:49,120 ప్రస్తుతం రకరకాల ఓట్ మిల్క్ లభ్యమవుతోంది. 525 00:28:49,200 --> 00:28:53,400 నాకు ఎప్పుడూ పెట్టుబడి పెట్టడం, అలాంటి వాటిలో ఆసక్తి ఉండేది. 526 00:28:53,480 --> 00:28:55,720 కొన్ని కంపెనీలతో కలిసి పని చేశాను. 527 00:28:55,800 --> 00:28:59,480 నా సొంత కంపెనీని ప్రారంభించడం, అది ఉత్తేజాన్ని ఇచ్చిన విషయం. 528 00:28:59,560 --> 00:29:02,480 అవి 45 రోజుల వరకూ పాడు కావనుకుంటా. 529 00:29:02,560 --> 00:29:04,600 -కచ్చితంగా. -ఉత్పత్తిని చల్లబరిస్తే. 530 00:29:04,680 --> 00:29:06,680 వాళ్ళు అదే చెప్పారు, కదా? 531 00:29:06,760 --> 00:29:10,720 45 రోజులు, అవును. అది అద్భుతం. అది ప్రామాణిక కాఫీ కోల్డ్ బ్రూ కన్నా... 532 00:29:10,800 --> 00:29:12,920 -అవును. -...సుదీర్ఘమైనది. 533 00:29:13,000 --> 00:29:15,760 అది మనకు పోటీలో ప్రధానమైన ప్రయోజనం కలిగిస్తుంది. 534 00:29:15,840 --> 00:29:17,800 -భారీ... -మంచిది. ఉత్తేజకరంగా ఉంది. 535 00:29:17,880 --> 00:29:21,120 2018లో, ఆ సంవత్సరం నేనెంతో ప్రేమించే ఆటను ఆడలేకపోవడం 536 00:29:21,200 --> 00:29:23,080 కష్టంగా అనిపించినా, 537 00:29:23,160 --> 00:29:26,440 నేను భిన్నమైన విషయాలను నేర్చుకుని, వ్యక్తిగా ఎదగగలిగాను 538 00:29:26,520 --> 00:29:29,440 అది భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. 539 00:29:29,520 --> 00:29:31,360 మనకు ఆర్డర్ వచ్చిందనుకుంటా, కదా? 540 00:29:33,440 --> 00:29:35,840 శ్రీలంకలో పరిస్థితి ఏం బాగోలేదు. 541 00:29:35,920 --> 00:29:37,360 అదొక దారుణమైన పరిస్థితి, 542 00:29:37,440 --> 00:29:40,480 ఎంతకీ తగ్గేలా కనిపించలేదు. ఇక్కడ ఇంకా దారుణమవుతోంది. 543 00:29:41,320 --> 00:29:43,960 రెండవ టెస్ట్ గాల్ అంతర్జాతీయ స్టేడియం 544 00:29:44,400 --> 00:29:46,000 శ్రీలంక తన ఉత్తమ రూపంలో లేదు. 545 00:29:46,080 --> 00:29:49,400 ఈ వారం కోవిడ్-19 వల్ల నలుగురు ఆటగాళ్ళు నిష్క్రమించారు. 546 00:29:49,480 --> 00:29:50,880 కొందరికి ఇది తొలి టెస్ట్‌. 547 00:29:50,960 --> 00:29:53,520 ఆస్ట్రేలియా కచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుంది, 548 00:29:53,600 --> 00:29:56,160 ఏదైనా అసాధారణమైనది జరిగితే తప్ప. 549 00:29:56,240 --> 00:30:00,160 కొత్త ఆటగాళ్ళ పరంగా చూస్తే, వారిపై విపరీతమైన ఉత్తిడి ఉండి ఉంటుంది. 550 00:30:06,960 --> 00:30:09,320 మాకు కొత్త ఆటగాళ్ళ గురించి పెద్దగా తెలియదు. 551 00:30:09,400 --> 00:30:12,880 పర్యటనలో ఎప్పుడూ డేన్ హిల్స్ ఒక విశ్లేషకుడు ఉంటారు. 552 00:30:12,960 --> 00:30:16,560 అతను శ్రీలంక దేశీయ ఆటకు సంబంధించిన విశ్లేషణ సమర్పిస్తాడు. 553 00:30:17,000 --> 00:30:20,320 ప్రభాత్ జయసూర్య. ఈమధ్యే అతన్ని జట్టులోకి తీసుకున్నారు. 554 00:30:20,400 --> 00:30:22,080 నాకు తెలియదు. మంచి ప్రశ్న. 555 00:30:22,160 --> 00:30:25,200 అతను ప్రధాన జట్టులో లేడు కనుక నేను కనుక్కొంటాను. 556 00:30:25,280 --> 00:30:27,840 నేను త్వరగా అతని గురించి సమాచారం తెలుసుకుంటా. 557 00:30:30,520 --> 00:30:32,800 ఇతనికి బంతి బాగా తిరగనుంది. 558 00:30:38,600 --> 00:30:39,760 అదొక చక్కటి బంతి. 559 00:30:39,840 --> 00:30:43,040 అక్కడికి వెళ్లే ముందు నేను జయసూర్య బౌల్ చేయడం చూశాను. 560 00:30:43,120 --> 00:30:45,640 అతను వేస్తున్న వేగం నాకు నచ్చింది. 561 00:30:45,720 --> 00:30:47,840 అది సవాలుగా నిలుస్తుందని అనిపించింది. 562 00:30:47,920 --> 00:30:50,360 తిరిగింది. చాలా దూరం తిరిగింది. 563 00:30:53,080 --> 00:30:56,760 అదే నా దృక్పథం, వీలైనంత సమాచారాన్ని సేకరించడం, 564 00:30:56,840 --> 00:30:59,040 ఎంత వీలైతే అంత ఆటకు సంసిద్ధం కావడానికి. 565 00:30:59,120 --> 00:31:00,520 ఆటలో ఇది ప్రధాన తరుణం. 566 00:31:01,240 --> 00:31:03,040 స్మిత్, లాబుషేన్‌లు ఇద్దరూ ఉన్నారు. 567 00:31:03,120 --> 00:31:05,560 మీడియా పెంచే అంచనాలు, అలా పెరుగుతూనే ఉంటాయి. 568 00:31:05,640 --> 00:31:09,360 అతను 100 పరుగులు కొట్టి అన్ని నెలలు అయ్యింది, ఇన్ని నెలలు అయ్యింది. 569 00:31:09,440 --> 00:31:13,320 ఆటగాళ్ళు ఏమనుకుంటారనే దానితో సంబంధం లేకుండా, దాని భారం మనపై ఉంటుంది. 570 00:31:17,400 --> 00:31:20,040 వెంటనే మిడ్ వికెట్‌పై షాట్ కొట్టాడు. 571 00:31:20,920 --> 00:31:22,920 స్టీవెన్ స్మిత్ నుండి చక్కటి బ్యాటింగ్. 572 00:31:23,000 --> 00:31:26,240 చిన్న వయసు నుండే నేను బాగా ఆడతానని నాకు తెలుసు. 573 00:31:26,320 --> 00:31:28,360 ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడిని కాదు. 574 00:31:28,440 --> 00:31:31,440 నేను నా చిన్న ప్రపంచంలో ఉండిపోయేవాడిని. 575 00:31:31,520 --> 00:31:34,600 నేను ఎంత ఏకాగ్రతతో ఉంటానంటే, 576 00:31:34,680 --> 00:31:36,600 ఇంకేదీ నాకు అనవసరం, ఒక రకంగా. 577 00:31:38,920 --> 00:31:41,360 దొర్లుకుంటూ వెళుతోంది. మరో బౌండరీ. 578 00:31:44,920 --> 00:31:47,680 మరీ అంత కష్టం కాదనుకుంటా. 579 00:31:47,760 --> 00:31:49,680 నేను మైదానంలో ఉన్నప్పుడు. 580 00:31:50,760 --> 00:31:52,840 మనసుని అలా ఆపేసి 581 00:31:52,920 --> 00:31:56,560 ఆలోచనకు చోటివ్వకుండా వచ్చే బంతికి స్పందించడమే. 582 00:32:03,240 --> 00:32:06,560 ఆటగాళ్ళుగా, అతని జట్టు సహచరులుగా ఇది ఉత్తేజకరమైన విషయం, 583 00:32:06,640 --> 00:32:11,240 ఎందుకంటే అంతకుముందు చూడటం వల్ల అర్థమవుతుంది, స్మిత్ ఊపు మీద ఉన్నాడని. 584 00:32:11,320 --> 00:32:14,560 మొత్తం సమయం అలాంటి పారవశ్యంలాంటి స్థితిలో ఉండటం, 585 00:32:15,000 --> 00:32:18,800 ఎంతో ఏకాగ్రతతో ఉండటం, బాగా అలసిపోయేలా చేస్తుంది. 586 00:32:20,600 --> 00:32:23,160 ఆ స్థితిలో నిరంతరం వెళ్ళడం చాలా కష్టం. 587 00:32:23,240 --> 00:32:25,720 అది భిన్నమైనది, విడ్డూరమైనది. 588 00:32:25,800 --> 00:32:28,320 కానీ అతన్ని అత్యుత్తమంగా నిలిపేది అదేనేమో, 589 00:32:28,400 --> 00:32:30,120 ప్రపంచంలో అత్యుత్తమం అనవచ్చేమో. 590 00:32:30,200 --> 00:32:31,920 స్మిత్ దీన్ని జారవిడుచుకోవడం లేదు. 591 00:32:32,000 --> 00:32:34,520 అతను జారవిడుచుకోవడం లేదు, జారవిడుచుకోడు. 592 00:32:34,600 --> 00:32:37,040 అది మనలో మనకే తెలుస్తుంది. దాన్ని భావించగలం. 593 00:32:37,120 --> 00:32:39,560 ఇవాళ, నేను నిజంగా ఊపు మీదున్నా. 594 00:32:39,640 --> 00:32:41,200 నేను పొరపాట్లు చేయడం లేదు. 595 00:32:42,200 --> 00:32:43,200 అతను సాధించాడు! 596 00:32:44,000 --> 00:32:45,600 స్టీవ్ స్మిత్‌కు 100 పరుగులు. 597 00:32:45,680 --> 00:32:47,640 దీని కోసం ఎంతోకాలంగా వేచి చూశాడు. 598 00:32:48,320 --> 00:32:50,240 స్టీవెన్ స్మిత్, పునర్వైభవం. 599 00:32:51,680 --> 00:32:53,360 ఆస్ట్రేలియా 600 00:32:54,960 --> 00:32:56,920 100 సాధించడం ఎప్పుడూ బాగుంటుంది. 601 00:32:58,200 --> 00:33:00,880 ఈసారి సాధించడానికి ఎక్కువ సమయమే పట్టింది. 602 00:33:01,400 --> 00:33:05,360 కానీ తక్కువ స్కోర్ చేశాం. తొలి ఇన్నింగ్స్‌లో ఎన్నో పరుగులు కావాలి. 603 00:33:05,440 --> 00:33:08,800 టాస్ గెలిచి, ఆ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తే, 604 00:33:08,880 --> 00:33:10,760 ఓ భారీ స్కోరు నమోదు చేయాలి, 605 00:33:10,840 --> 00:33:13,680 నాలుగు లేక ఐదు వందలు చేసి, ఆటను దక్కించుకోవాలి. 606 00:33:14,640 --> 00:33:15,760 చక్కగా బౌల్ చేశాడు. 607 00:33:15,840 --> 00:33:16,680 అదిగో. 608 00:33:16,760 --> 00:33:17,920 ట్రావిస్ హెడ్ నిష్క్రమణ. 609 00:33:18,000 --> 00:33:20,320 అతన్ని 12 వద్ద జయసూర్య బౌల్డ్ చేశాడు. 610 00:33:20,400 --> 00:33:22,120 మరోసారి స్పిన్ పని పూర్తి చేసింది. 611 00:33:25,560 --> 00:33:27,000 హెడ్ 62 612 00:33:34,880 --> 00:33:37,720 నా వికెట్ మళ్ళీ పడగొట్టారు! ఛత్! 613 00:33:40,040 --> 00:33:41,360 మరో వికెట్ పడింది. 614 00:33:41,440 --> 00:33:44,440 ఇదంతా చాలా చాలా త్వరగా మారిపోవచ్చు. 615 00:33:44,520 --> 00:33:47,600 టెస్ట్ కెరియర్‌లో కెమరన్ గ్రీన్‌కు ఇవి తొలి రోజులు. 616 00:33:47,680 --> 00:33:51,280 ప్రతీ ఒక్కరూ ఇతని సామర్థ్యాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. 617 00:33:55,080 --> 00:33:56,720 ఎల్‌బీడబ్ల్యూ కోసం అరిచారు. 618 00:33:56,800 --> 00:33:58,520 అంపైర్ ఔట్ ప్రకటించాడు. 619 00:33:58,880 --> 00:34:01,600 భారీ వికెట్. కెమరన్ గ్రీన్ 4 పరుగులకే అవుటయ్యాడు. 620 00:34:01,680 --> 00:34:06,760 ఆస్ట్రేలియా, 5 వికెట్లకు 252 పరుగులు. ఇప్పుడు ఆట శ్రీలంక వైపు ఉంది. 621 00:34:10,640 --> 00:34:12,000 బహుశా గ్రీనీ చాలాసార్లు 622 00:34:12,720 --> 00:34:15,760 తనపై తానే విపరీతమైన ఒత్తిడి పెట్టుకుంటాడని అనిపిస్తుంది. 623 00:34:20,840 --> 00:34:24,520 అతను ఇంకా యువ ఆటగాడే, నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. 624 00:34:31,000 --> 00:34:32,840 మొదటి టెస్ట్‌లో చూపిన ప్రతిభ అంతా 625 00:34:32,920 --> 00:34:36,200 కొంత పోయిందన్నట్టుగా అనిపించింది. 626 00:34:36,960 --> 00:34:39,160 మళ్ళీ మొదలుపెట్టిన స్థానానికే పోయినట్టు. 627 00:34:41,680 --> 00:34:45,280 ఇది చాలా కఠినమైన క్రీడ, కానీ మేము ఆడుతున్న పిచ్ చాలా కష్టమైనది. 628 00:34:45,360 --> 00:34:46,320 అంచనాకు చేరలేదు. 629 00:34:52,480 --> 00:34:54,160 మనుషులు వారికి భావోద్వేగాలను... 630 00:34:54,840 --> 00:34:56,800 వెలిబుచ్చడం మంచిది. 631 00:34:56,880 --> 00:35:00,600 ఎప్పుడూ కఠినంగా, దృఢంగా ఉన్నట్టు ప్రయత్నించడం తప్పుడు విషయం. 632 00:35:10,520 --> 00:35:12,480 శ్రీలంక రాజధాని కొలంబోలో 633 00:35:12,560 --> 00:35:16,080 ఆ దేశ అధ్యక్షుడు గొటబయా రాజపక్సా రాజీనామాను కోరుతూ 634 00:35:16,160 --> 00:35:18,640 గుమికూడిన ప్రజలను పోలీసులు చెదరగొడుతున్నారు. 635 00:35:18,760 --> 00:35:19,600 రెండవ రోజు 636 00:35:19,640 --> 00:35:23,280 గాల్ నిరసనకారులకు రాజధానిని ముట్టడించాలన్న ఆశయం ఉంది. 637 00:35:23,360 --> 00:35:24,640 వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. 638 00:35:25,360 --> 00:35:29,440 కనుక అనుకోని విధంగా, క్రికెట్ మైదానాలు కేంద్రబిందువుగా మారాయి. 639 00:35:29,520 --> 00:35:34,000 10 మీటర్ల దూరంలో నిరసనలు జరిగాయి. అంత దగ్గరగా జరిగాయి. 640 00:35:38,080 --> 00:35:39,760 గేట్ల వద్దకు దూసుకువస్తున్నారు. 641 00:35:40,560 --> 00:35:42,200 శబ్దాలు హోరెత్తాయి. 642 00:35:43,000 --> 00:35:45,960 మైదానం బయటే ఉన్నారు. అంతా అక్కడున్నారు. 643 00:35:46,440 --> 00:35:48,000 అతను ఇప్పుడు దిగిపోవాలా? 644 00:35:48,080 --> 00:35:49,440 అధ్యక్షుడు. 645 00:35:49,520 --> 00:35:54,040 దేశమే సంక్షోభంలో ఉంది. అది శ్రీలంక జట్టులో ఆవేశాన్ని రగిలించిందా? 646 00:35:54,160 --> 00:35:55,480 కచ్చితంగా రగిలించింది. 647 00:35:56,600 --> 00:35:57,440 అదిగో. 648 00:35:58,000 --> 00:35:58,960 గాల్లోకి లేచింది. 649 00:35:59,320 --> 00:36:00,160 పట్టుకున్నాడు! 650 00:36:00,640 --> 00:36:01,560 జయసూర్య. 651 00:36:03,680 --> 00:36:05,440 అదొక అద్భుతమైన క్యాచ్! 652 00:36:05,520 --> 00:36:07,760 తన తొలి ఆటలో జయసూర్యకు ఐదు వికెట్లు. 653 00:36:09,440 --> 00:36:12,680 వెనకడుగు వేశాడు. వాళ్ళు అప్పీల్ చేశారు. అతను ఇచ్చాడు. 654 00:36:16,760 --> 00:36:19,360 శ్రీలంక ఆటగాళ్ళు చాలా బాగా పోరాడారు, 655 00:36:19,440 --> 00:36:21,680 ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగింపుకు వస్తోంది. 656 00:36:21,800 --> 00:36:26,120 అయినా స్టీవ్ స్మిత్, 145 వద్ద నాటౌట్‌గా నిలిచాడు. 657 00:36:26,560 --> 00:36:29,520 వారి చుట్టూ జరుగుతున్న సంఘటనలు వారిని ప్రభావితం చేశాయి. 658 00:36:29,600 --> 00:36:33,000 మేము చూసిన ఆ చక్కటి ప్రదర్శనకు అవి స్ఫూర్తిగా నిలిచాయో ఏమో. 659 00:36:33,080 --> 00:36:36,360 దానికి ఆస్ట్రేలియా జట్టు ప్రత్యక్షసాక్షిగా నిలిచింది. 660 00:36:39,280 --> 00:36:40,280 చక్కటి షాట్. 661 00:36:41,040 --> 00:36:42,080 ఊరికే అలా కొట్టాడు. 662 00:36:43,600 --> 00:36:46,160 విశాలత చూసి పుల్ షాట్ ఆడాడు, బౌండరీ సాధించాడు. 663 00:36:47,480 --> 00:36:51,440 మైదానంలో మా మాట మాకే వినిపించలేదు. అంత శబ్దంగా ఉండింది. 664 00:36:54,640 --> 00:36:56,800 మాజీ శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్, 665 00:36:56,880 --> 00:36:58,440 కుమార సంగక్కర, 666 00:36:58,520 --> 00:37:00,800 ఒక వీడియో పంచాడు, "ఇది మన భవిష్యత్తు కోసం." 667 00:37:00,880 --> 00:37:03,080 కుమార సంగక్కర ఇది మన భవిష్యత్తు కోసం. 668 00:37:03,160 --> 00:37:07,280 క్రికెట్ ఆడాలా వద్దా అని శ్రీలంక ఆటగాళ్లు తమని తాము ప్రశ్నించుకుని ఉంటారు. 669 00:37:07,360 --> 00:37:10,480 ఆటగాళ్ళకు ప్రజల మద్దతు అందటంతో 670 00:37:10,560 --> 00:37:13,040 వాళ్ళకు ఆ బంధంపై భరోసా ఇచ్చి, స్ఫూర్తి నింపింది. 671 00:37:15,280 --> 00:37:16,320 అదిగో 100 పరుగులు! 672 00:37:17,400 --> 00:37:18,440 గొప్ప బ్యాటింగ్! 673 00:37:18,520 --> 00:37:20,520 దినేష్ చండిమల్, ఎంత గొప్ప ఇన్నింగ్స్! 674 00:37:21,800 --> 00:37:24,800 ఇచ్చిన మాట ప్రకారం శ్రీలంక ప్రధాని, అధ్యక్షుడు 675 00:37:24,880 --> 00:37:29,480 రాజీనామా చేయకపోతే, ఆందోళనలు పెరుగుతాయని నిరసనకారుల నాయకులు హెచ్చరించారు. 676 00:37:29,560 --> 00:37:30,760 ఆందోళనలు హెచ్చరిల్లాయి. 677 00:37:31,640 --> 00:37:35,120 అధ్యక్షుడు గొటబయా రాజపక్సా విలాసవంతమైన ఇంటిని 678 00:37:35,160 --> 00:37:39,000 వేలమంది ముట్టడించడంతో ఆందోళనలు పతాక స్థాయికి చేరాయి. 679 00:37:40,080 --> 00:37:43,880 అధ్యక్షుడు రాజపక్సా దేశం వదిలి పారిపోయాడు, రాజీనామా చేశాడు. 680 00:37:45,400 --> 00:37:48,080 దినేష్ చండిమల్, తన ఆటనే చక్కగా ఆస్వాదిస్తున్నాడు. 681 00:37:48,160 --> 00:37:50,520 దీనితో శ్రీలంక స్కోరు 500కు చేరింది. 682 00:37:50,800 --> 00:37:52,840 టెస్ట్ మ్యాచ్ ఎంత సుదీర్ఘ కాలం పాటు 683 00:37:52,920 --> 00:37:56,840 జరుగుతుందంటే, ఆ కాలంలో ఒక దేశ ప్రభుత్వం కూడా మారిపోతుంది. 684 00:37:56,920 --> 00:38:00,360 ఇది అసాధారణం. ఏ ఇతర క్రీడలోనూ ఇలా జరగదు. 685 00:38:00,440 --> 00:38:01,880 అదొక చారిత్రాత్మక సందర్భం. 686 00:38:05,320 --> 00:38:09,000 మొదటి కొంత బాణాసంచా పేలినప్పుడు అది తుపాకుల మోతలా అనిపించింది. 687 00:38:09,080 --> 00:38:11,000 మేము దాక్కోవాలా అని కుమారాను అడిగాము. 688 00:38:11,080 --> 00:38:12,160 అతను, "అవసరం లేదు, 689 00:38:12,280 --> 00:38:14,760 అవి పటాకులు. వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. 690 00:38:14,840 --> 00:38:16,840 వాళ్ళు ఇప్పుడే కాంపౌండ్‌ను ముట్టడించారు." 691 00:38:18,000 --> 00:38:19,760 చండీమల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 692 00:38:19,840 --> 00:38:21,920 ఈ భావన కలిగింది, అతను ఆ సందర్భానికి తగిన 693 00:38:22,000 --> 00:38:25,080 స్కోరును నిర్మిస్తున్నాడని. అది అతనికి అదనపు ప్రేరణనిచ్చింది, 694 00:38:25,160 --> 00:38:28,680 కేవలం పరుగులు చేసి టెస్ట్ మ్యాచ్ గెలవడం అనే ప్రేరణ మాత్రమే కాదు. 695 00:38:31,160 --> 00:38:32,040 మళ్ళీ! 696 00:38:33,000 --> 00:38:34,200 200! 697 00:38:34,360 --> 00:38:36,600 దినేష్ చండిమల్ 200 పరుగులు చేశాడు! 698 00:38:37,560 --> 00:38:39,320 ఎంతటి అమోఘమైన ప్రదర్శన ఇది! 699 00:38:40,160 --> 00:38:42,120 శ్రీలంక చివరికి తమ స్కోరును 700 00:38:42,160 --> 00:38:44,920 554కు చేర్చింది, 119 పరుగుల ఆధిక్యంతో. 701 00:38:45,800 --> 00:38:49,040 అంతటి క్లిష్టపరిస్థితులలోనూ, 702 00:38:49,320 --> 00:38:53,920 నిలబడి, ఏకమై, దృఢమైన నిరోధకతను ప్రదర్శించిన ఓ ప్రజానీకపు సామర్థ్యమది. 703 00:38:54,680 --> 00:38:58,520 వాళ్ళు దీనికి సానుకూలంగా స్పందించడం చాలా అద్భుతమైన విషయం. 704 00:39:01,560 --> 00:39:03,600 నాల్గవ రోజు 705 00:39:03,640 --> 00:39:05,040 ఆస్ట్రేలియా 190 పరుగుల వెనుక 706 00:39:05,120 --> 00:39:07,440 అది కచ్చితంగా ఓ విడ్డూరమైన అనుభవం, 707 00:39:07,520 --> 00:39:09,920 ఒక దేశాన్ని అలాంటి స్థితిలో చూడటం, 708 00:39:10,000 --> 00:39:12,480 అయినా క్రికెట్ కొనసాగుతూనే ఉంది. 709 00:39:15,000 --> 00:39:16,840 దాన్ని మిడ్ వికెట్ మీదుగా కొట్టాడు. 710 00:39:16,920 --> 00:39:18,800 ఇప్పుడా పరిస్థితి నుండి బయటపడ్డాక... 711 00:39:18,880 --> 00:39:19,680 మంచి టైమింగ్! 712 00:39:19,800 --> 00:39:21,160 ...మా గడ్డపై బ్యాటింగ్... 713 00:39:21,280 --> 00:39:23,360 మేము ఎక్కడి నుండైనా గెలవచ్చని అనిపించింది. 714 00:39:23,440 --> 00:39:25,960 ఎన్నో భాగస్వామ్యాలు, చాలా ముఖ్యమైనవి. 715 00:39:26,040 --> 00:39:27,960 చక్కటి షాట్. పాదాలను బాగా వాడాడు. 716 00:39:28,040 --> 00:39:30,360 ఈ షాట్స్ అతనికి చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. 717 00:39:30,440 --> 00:39:32,760 ఇప్పుడే ఆ ముగ్గురు స్పిన్నర్ల అవసరం. 718 00:39:32,840 --> 00:39:35,120 ఆట మా చేతిలోనే ఉన్నట్టు అనిపించింది. 719 00:39:35,160 --> 00:39:36,760 జరిగేది తెలుసుకునే లోపే... 720 00:39:37,640 --> 00:39:39,080 దానికి ఎంతటి అవకాశముంది? 721 00:39:39,160 --> 00:39:41,320 ఎంతటి అవకాశముంది? ఔట్ ప్రకటించాడు! 722 00:39:41,640 --> 00:39:43,160 మరోసారి అతని వికెట్ పడగొట్టాడు. 723 00:39:44,840 --> 00:39:45,800 ఇది భారీ వికెట్! 724 00:39:45,880 --> 00:39:47,360 చిక్కుల్లో ఆస్ట్రేలియా. 725 00:39:47,440 --> 00:39:48,640 చాలా సమయం పట్టలేదు. 726 00:39:48,680 --> 00:39:50,640 ఆట మా చేజారిపోయింది. 727 00:39:50,680 --> 00:39:53,000 మేము, అసలు ఏం జరిగింది? 728 00:39:53,080 --> 00:39:55,480 ఔట్! ఔట్! ఔట్! 729 00:39:56,760 --> 00:39:58,040 జయసూర్యకు ఆరు వికెట్లు! 730 00:39:58,120 --> 00:40:00,800 ఆటను ఆస్వాదిస్తూ, శ్రీలంకేయులలో సంబరాలు. 731 00:40:00,920 --> 00:40:03,400 అత్యద్భుతమైన ప్రదర్శన అందించారు! 732 00:40:03,480 --> 00:40:06,920 ఇన్నింగ్స్ తేడాతో ఆస్ట్రేలియాను వారు ఓడించడం ఇదే తొలిసారి. 733 00:40:13,880 --> 00:40:17,440 ఇది విడ్డూరం. ఏం చెప్పాలో, ఎలా భావించాలో నాకు తెలియలేదు. 734 00:40:17,920 --> 00:40:19,160 అదొక చిన్న... 735 00:40:19,200 --> 00:40:22,080 మొట్టికాయ లాంటిది. ఒక చిన్న హెచ్చరిక. 736 00:40:22,160 --> 00:40:26,000 "ఇది క్రికెట్. ఇక్కడ ఏదీ తేరగా ఇవ్వరు. కష్టపడి దక్కించుకోవాలి." 737 00:40:27,080 --> 00:40:29,920 ఈ బృందం చవిచూసిన మొదటి ఓటమి ఇది. 738 00:40:30,000 --> 00:40:31,840 కొన్ని జట్టు అంశాలు, 739 00:40:31,920 --> 00:40:33,480 శాంతంగా ఉండటం, స్థిరంగా ఉండటం 740 00:40:33,560 --> 00:40:34,800 అద్భుతంగా ఉన్నాయి. 741 00:40:34,880 --> 00:40:38,160 ఇక అలాంటి విషయాల ఆధారంగా మనల్ని మనం బేరీజు వేసుకోవాలి. 742 00:40:40,120 --> 00:40:42,560 మనం ఓడిపోయినప్పుడు, దానిలో నుండి ఎలా బయటపడాలి? 743 00:40:43,080 --> 00:40:44,760 మారవద్దని అంటాను. 744 00:40:44,840 --> 00:40:46,040 నువ్వు ఓడిపోయావని, 745 00:40:46,120 --> 00:40:48,360 నీ ప్రక్రియలు తప్పని కాదు. 746 00:40:49,320 --> 00:40:51,640 క్రికెట్ కన్నా ఇతర కారణాల వల్ల 747 00:40:51,760 --> 00:40:53,800 ఇదొక గొప్ప సీరీస్. 748 00:40:55,000 --> 00:40:59,400 అది జరిగిన కాలం పరంగా చూస్తే, ఈ పర్యటన చాలా ప్రధానమైది. 749 00:40:59,480 --> 00:41:03,840 పర్యటన నిజంగా శ్రీలంకవాసులతో సంధానం ఏర్పరుచుకుంది. అది ప్రధానంగా నిలిచింది. 750 00:41:04,640 --> 00:41:07,800 ఆ ఆటలను చూసిన, అనుసరించిన ప్రజల్లో అది నింపిన ఆనందం, 751 00:41:07,880 --> 00:41:10,560 వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టనష్టాలతో 752 00:41:10,640 --> 00:41:13,640 సంబంధం లేకుండా అది కూడా చాలా ముఖ్యమైనది. 753 00:41:13,760 --> 00:41:17,320 శ్రీలంక సమాజంలో క్రికెట్‌కు కొత్త స్థానం దక్కిందనిపిస్తుంది. 754 00:41:18,160 --> 00:41:20,920 ఇది శ్రీలంక ప్రజలకు అవసరమా? 755 00:41:21,000 --> 00:41:23,680 వాళ్ళు చాలా కష్టకాలంలో ఉన్నారు. 756 00:41:23,800 --> 00:41:27,160 ఇక శ్రీలంక జట్టు వారికి తెచ్చిన ఆ ఆనందం, 757 00:41:27,200 --> 00:41:29,040 నిస్సందేహంగా బ్రహ్మాండమైనది. 758 00:41:29,120 --> 00:41:30,600 థాంక్యూ, ఆస్ట్రేలియా. 759 00:41:30,640 --> 00:41:33,040 కృతజ్ఞతలు. కృతజ్ఞతలు. 760 00:41:33,880 --> 00:41:38,120 మాకు నిరాశాజనకమైనప్పటికీ, 20 ఏళ్ళ తర్వాత వెనుదిరిగి చూస్తే, 761 00:41:38,160 --> 00:41:42,160 ఆ సమయంలో వారి దేశానికి వారు అది చేయడం చాలా చక్కటి విషయం. 762 00:41:45,320 --> 00:41:46,400 లాంగర్ హయాంలో 763 00:41:46,480 --> 00:41:48,880 ఆస్ట్రేలియా క్రికెట్‌ను గాడిలో పెట్టడం ప్రధానం. 764 00:41:50,520 --> 00:41:54,680 కానీ ఇది ఆస్ట్రేలియా క్రికెట్ కొత్త శకం గురించి. 765 00:41:54,840 --> 00:41:57,480 ఇది ప్యాట్ కమిన్స్ శకంలో ప్రారంభం. 766 00:41:57,560 --> 00:42:01,880 ఈ క్రికెట్ దశాబ్దం అలాగే నిర్వచించబడనుంది 767 00:42:01,960 --> 00:42:04,440 దీనికి చరిత్ర పుటలలో చెరగని చోటు దక్కనుంది. 768 00:42:06,800 --> 00:42:11,400 ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చేసే ఉత్తేజకరమైన ప్రయాణంలో 769 00:42:11,480 --> 00:42:13,960 ఒక గొప్ప జట్టుగా మారే అవకాశాన్ని చూస్తున్నాను. 770 00:42:14,040 --> 00:42:16,160 చీర్స్. స్టీవ్, పుట్టినరోజు శుభాకాంక్షలు. 771 00:42:16,280 --> 00:42:18,360 క్రికెట్ ఆడటంలోని ఉత్తమ విషయం ఏంటంటే, 772 00:42:18,440 --> 00:42:22,640 మనతో పాటు ఉండే మనుషులు. అందరూ చాలా భిన్నమైనవారనే విషయం నాకిష్టం. 773 00:42:22,680 --> 00:42:25,560 మా ఆటలో స్టీవ్ స్మిత్‌లాంటి గొప్ప ఆటగాడు, 774 00:42:25,640 --> 00:42:27,880 ఎన్నో ఏళ్ళుగా ఆడుతున్నాడు, డేవిడ్ వార్నర్... 775 00:42:28,960 --> 00:42:30,880 కొత్త ఆటగాళ్ళు ట్రావిస్ హెడ్, క్యారీ, 776 00:42:30,960 --> 00:42:32,760 మార్నస్, కామ్ గ్రీన్... 777 00:42:33,680 --> 00:42:36,840 మా ముందు వచ్చిన ఇతర మేటి జట్లలాగే మేము చక్కగా ఆడగలం. 778 00:42:38,080 --> 00:42:40,160 మా ముందున్న అవకాశం అదే. 779 00:42:40,840 --> 00:42:44,640 జట్టులో స్ఫూర్తి నిండి ఉంది. మేము తపిస్తున్నాం. ఆడటానికి ఎంతో ఉంది. 780 00:42:46,760 --> 00:42:49,200 ఉస్మాన్ ఖవాజా అద్భుతమైన ఆటతీరు! 781 00:42:49,320 --> 00:42:51,520 ఆస్ట్రేలియా పాకిస్తాన్‌లో గెలిచింది! 782 00:42:51,600 --> 00:42:53,120 స్టీవ్ స్మిత్‌కు 100 పరుగులు. 783 00:42:53,160 --> 00:42:55,400 అతనికొక విగ్రహం కట్టించండి! 784 00:42:56,840 --> 00:42:59,840 అదంతా మా ముందుంది, మా ఆకాంక్ష దాని కోసమే. 785 00:43:00,600 --> 00:43:01,840 అవును. ఆగలేను. 786 00:43:54,320 --> 00:43:56,320 సబ్‌టైటిల్ అనువాద కర్త Pradeep Kumar Maheshwarla 787 00:43:56,400 --> 00:43:58,400 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల