1 00:00:09,468 --> 00:00:14,932 చాలా, చాలా కాలం తరువాత నేను ఆరోగ్యంగా ఉన్నాను, 2 00:00:15,015 --> 00:00:16,808 ఎంతకాలం తరువాత అంటే నాకు కనీసం గుర్తులేదు. 3 00:00:16,892 --> 00:00:19,436 వాస్తవంగా, నేను ఇంత ఆరోగ్యంగా ఇదివరకు ఎప్పుడైనా ఉన్నానా అంటే కూడా చెప్పలేను. 4 00:00:20,646 --> 00:00:24,149 గత రెండు వారాలుగా నేను ఇక్కడ నేర్చుకున్నదంతా నాతో పాటు తీసుకువెళ్లి 5 00:00:24,233 --> 00:00:27,444 నా జీవితంలో అమలు చేయడానికి నేను ఊవిళ్లూరుతున్నాను. 6 00:00:28,362 --> 00:00:30,072 నా ఉద్దేశం, భోజనాల మీద ధ్యాస. 7 00:00:30,155 --> 00:00:33,784 మా కుటుంబంతో కలిసి ప్రతి రోజూ ఉదయం కిచెన్ టేబుల్ దగ్గర 8 00:00:33,867 --> 00:00:35,911 ఈ ప్రక్రియని చేయడం నాకు ఇప్పటికే ప్రత్యక్షంగా కనిపిస్తోంది. 9 00:00:35,994 --> 00:00:40,123 "నిజాయితీ వ్యక్తీకరణల" పద్ధతి. అది నిజంగా చాలా ఉపయోగపడుతుంది. 10 00:00:40,207 --> 00:00:43,544 అలాగే చిత్రకళ ఇంకా వ్యాసరచన కూడా ఉపయోగపడతాయి, 11 00:00:43,627 --> 00:00:48,340 ఇంకా మీరంతా నాకు అండగా ఉన్నారనే భావన నాకు ఎప్పుడూ ఉంటుంది. 12 00:00:48,423 --> 00:00:51,552 నా ఉద్దేశం, మీకు ధన్యవాదాలు. నేను ఒంటరిని కాను అని నాకు తెలియజేశారు. 13 00:00:55,055 --> 00:00:56,723 సరే. 14 00:00:56,807 --> 00:00:58,600 అంటే, నేను ఒక కొత్త వ్యక్తిని అని నాకే అనిపిస్తోంది. 15 00:01:00,102 --> 00:01:03,313 ఒక కొత్త మనిషిగా అయ్యాను. ఆరోగ్యంగా ఉన్నాను. 16 00:01:04,815 --> 00:01:10,612 అవును, జీవితం మీద నాకు పూర్తిగా ఒక కొత్త దృక్పథం ఏర్పడిందని మీరు చెప్పగలరు అనుకుంటాను. 17 00:01:11,238 --> 00:01:12,281 నేను చెప్పగలను. 18 00:01:14,157 --> 00:01:15,158 నేను మెరుగయ్యాను. 19 00:01:17,619 --> 00:01:21,707 అందుకు గాను, నేను మీ అందరి పట్ల నిజంగా కృతజ్ఞతాభావం కలిగి ఉంటాను. 20 00:01:22,291 --> 00:01:23,834 మరీ ముఖ్యంగా, లుయాన్, 21 00:01:23,917 --> 00:01:28,046 మానసిక రుగ్మతల నుండి కోలుకోవడానికి నిజంగా ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించినందుకు నీకు ధన్యవాదాలు. 22 00:01:28,130 --> 00:01:30,340 నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. 23 00:01:33,177 --> 00:01:34,386 నేను వెళ్లడానికి ఇప్పుడు సిద్ధం. 24 00:01:37,639 --> 00:01:39,391 నువ్వు ఏం చెత్త మాట్లాడుతున్నావు? 25 00:01:40,809 --> 00:01:42,686 -మన్నించగలరా? -నువ్వు మెరుగయ్యావా, హా? 26 00:01:44,438 --> 00:01:45,439 నీకు మతి భ్రమించింది. 27 00:01:46,398 --> 00:01:48,775 ఇలా చూడు, లుయాన్. ఇక్కడ నేను ఒక్కత్తినే పిచ్చి దాన్నా? లేదా… 28 00:01:48,859 --> 00:01:50,736 "పిచ్చి" అనే మాట విషయంలో నేను ఎలా స్పందిస్తానో నీకు తెలుసు. 29 00:01:50,819 --> 00:01:53,030 నా దృష్టిలో పిచ్చి అనే మాటకి "నేను విభేదించే మహిళ" అని అర్థం. 30 00:01:53,113 --> 00:01:55,365 -సరే, ధన్యవాదాలు. కానీ మరి… -నువ్వు కూడా హద్దు మీరావు. 31 00:01:55,449 --> 00:02:00,495 ఇప్పుడు నా మీద దాడి జరిగినట్లు అనిపిస్తోంది. 32 00:02:00,579 --> 00:02:04,499 కానీ, నువ్వు ఇప్పుడే నేల మీద పడిన చెత్తని మా ముందే ఏరుకుని దాన్ని 33 00:02:04,583 --> 00:02:06,210 ఐస్ క్రీమ్ అంటున్నావు అనిపిస్తోంది. 34 00:02:06,877 --> 00:02:08,503 -హారియెట్. -ఏంటి? నేను ఇక్కడ ఇలా 35 00:02:08,586 --> 00:02:11,089 ఈ అందగత్తె మిస్ అమెరికా తన అవార్డు స్వీకార ప్రసంగాన్ని వింటూ కూర్చోవాలా? 36 00:02:11,173 --> 00:02:13,550 చాలా త్వరగా గొడవపడటం నీకు అలవాటు అని మాకు తెలుసు, హారియెట్. 37 00:02:13,634 --> 00:02:15,886 కానీ అది నిన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో కూడా తెలుసు, కదా? 38 00:02:15,969 --> 00:02:17,596 కాబట్టి నీ ఉద్రేకాలని తగ్గించుకో, బంగారం. 39 00:02:19,556 --> 00:02:23,560 ఈ ఉదయపు చర్చా కార్యక్రమానికి ఇంక ఇది ముగింపు అనుకుంటున్నాను. 40 00:02:23,644 --> 00:02:25,437 ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. 41 00:02:25,521 --> 00:02:27,356 మీ వ్యక్తిగత గంట సమయాన్ని ఆస్వాదించండి, 42 00:02:27,439 --> 00:02:29,775 ఆ తరువాత మిమ్మల్ని పన్నెండున్నర గంటలకు భోజనాల గదిలో కలుస్తాను. 43 00:02:29,858 --> 00:02:32,694 షీలా, చిన్న చర్చ కోసం నాతో బంగ్లాకు వస్తావా? 44 00:02:33,946 --> 00:02:35,030 తప్పకుండా. 45 00:02:35,113 --> 00:02:37,616 ఈ విషయాన్ని ఖచ్చితంగా చెడ్డ నుండి ఘోర స్థితికి తీసుకువెళ్లావు కదా? 46 00:02:47,584 --> 00:02:48,877 ఇది తీసుకో. 47 00:02:48,961 --> 00:02:53,215 సరే, ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, నిజం చెప్పాలంటే, నువ్వు మాత్రమే మొదటిదానివి కాదు, 48 00:02:53,298 --> 00:02:56,301 ఈ అనుభవం నువ్వు స్వచ్ఛందంగా కోరుకున్నదే. ఆ విషయం నీకు గుర్తుంది, కదా? 49 00:02:57,135 --> 00:02:58,512 గుర్తుంది. అవును, నాకు గుర్తుంది. 50 00:02:58,595 --> 00:03:01,348 మంచిది, మంచిది. ఎందుకంటే నీకు అది గుర్తు చేయకపోతే, 51 00:03:01,431 --> 00:03:02,641 నా ఉద్యోగాన్ని నేను సరిగా చేయనట్లే. 52 00:03:02,724 --> 00:03:04,476 ఈ చికిత్స కేంద్రాన్ని ప్రారంభించడానికి అసలు కారణం… 53 00:03:04,560 --> 00:03:06,687 ఇదిగో చూడు, పాత కథ మొత్తం మళ్లీ మొదలుపెట్టింది, 54 00:03:06,770 --> 00:03:09,690 ఆమె తినకపోయేది. ఆమె తల్లిదండ్రులు ఆమెని మానసిక రోగుల ఆసుపత్రికి పంపించారు. 55 00:03:09,773 --> 00:03:11,441 వాళ్లు ఆమెను నిర్బంధించారు. బలవంతంగా తినిపించారు. 56 00:03:11,525 --> 00:03:14,403 అటువంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని ఆమె శపథం చేసింది. ఇదంతా నీకు తెలుసు. 57 00:03:14,486 --> 00:03:17,739 …నాకు విపరీతమైన విసుగు పుట్టింది. కానీ చివరికి, అది మన నిర్ణయం. 58 00:03:20,033 --> 00:03:21,076 మరి, నువ్వేం ఆలోచిస్తున్నావు? 59 00:03:22,119 --> 00:03:23,120 షీలా? 60 00:03:27,207 --> 00:03:29,918 అవును. ఒక్క క్షణం పాటు నేను వేరే ఏదో ఆలోచనలో పడిపోయాను. 61 00:03:30,002 --> 00:03:34,590 కానీ నువ్వు అది మరొక్కసారి చెప్పగలవా? నేను ఏం ఆలోచించడం ఏంటి? 62 00:03:34,673 --> 00:03:37,718 షీలా, నువ్వు ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నావని నిజంగా అనుకుంటున్నావా? 63 00:03:39,887 --> 00:03:42,055 నేను వెళ్లిపోవచ్చా అని నిన్ను అడగడానికి బదులు అక్కడ ఏదో మాయ చేయాలని 64 00:03:42,139 --> 00:03:44,433 నేను ప్రయత్నించినందుకు నిజంగా క్షమించు. 65 00:03:45,142 --> 00:03:46,685 నువ్వు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. 66 00:03:47,644 --> 00:03:49,062 ప్రమాదాన్ని గుర్తించాలి. 67 00:03:49,563 --> 00:03:51,773 అది నీ విధానాలలో ఒకటి. అది ఆ జాబితాలో ఉంది. 68 00:03:51,857 --> 00:03:54,109 అది ఉంది. అది నా జాబితా. 69 00:03:55,235 --> 00:03:58,989 కానీ, ఈ సంద్భంలో, నువ్వు క్షమాపణలు చెప్పవలసిన వ్యక్తి ఒకరు ఉన్నారు, 70 00:03:59,072 --> 00:04:00,240 అది నేను కాదు. 71 00:04:00,908 --> 00:04:03,744 నేను హారియెట్ కి క్షమాపణలు చెప్పను. నా ఉద్దేశం, తను… 72 00:04:03,827 --> 00:04:05,245 నీకు "పిచ్చి" అనే మాట నచ్చదని తెలుసు, 73 00:04:05,329 --> 00:04:08,290 -కానీ తను కొద్దిగా… -నేను నీ గురించి మాట్లాడుతున్నాను, షీలా. 74 00:04:08,373 --> 00:04:11,210 నువ్వు ఈ చికిత్సా ప్రక్రియలో నిజాయితీగా పాల్గొనకపోతే, 75 00:04:11,293 --> 00:04:12,628 నీకు నువ్వే క్షమాపణ చెప్పుకోవాలి. 76 00:04:13,212 --> 00:04:14,546 ఈ మాట వస్తుందని ముందే ఊహించాల్సింది. 77 00:04:14,630 --> 00:04:17,673 ఈ మాటని ఆమె తన తలగడలకు కుట్టించేసుకుని ఉంటుంది. 78 00:04:17,757 --> 00:04:20,677 దీని నుంచి నీకు ఏం వస్తుంది అనుకుంటున్నావు? పెద్ద బిల్లు కాకుండా? 79 00:04:20,761 --> 00:04:26,391 ఇంకొక రకంగా చెప్పాలంటే, నువ్వు ప్రయత్నించకుండా ఉంటే కూడా, అది నీ తప్పే. 80 00:04:27,017 --> 00:04:28,435 నువ్వు ఇక్కడకి రాకూడదు. 81 00:04:29,228 --> 00:04:32,523 నేను అన్ని కార్యక్రమాలలో, వ్యాయామాలలో పాల్గొంటున్నాను. నేను అన్నింటికీ వస్తున్నాను. 82 00:04:32,606 --> 00:04:35,901 పాల్గొనడం అనే మాటకి అర్థం నిజాయితీగా ఉండటం అని. 83 00:04:35,984 --> 00:04:40,239 నేను ఏది వినాలని ఆశిస్తానో అది చెప్పడం కాదు, కానీ నిజంగా నీ ఆలోచనల్ని మాకు చెప్పడం. 84 00:04:40,322 --> 00:04:42,908 నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఎవ్వరికీ తెలుసుకోవాలని ఉండదు, కనీసం ఈమెకు కూడా. 85 00:04:42,991 --> 00:04:44,743 దీనికి తోడు, నువ్వు ఇక్కడికి చెక్ బుక్ తో పాటు వచ్చావు. 86 00:04:44,826 --> 00:04:46,620 టర్కోయిస్ డ్రెస్సులు చౌకగా ఉండవు. ఆమె వేసుకున్నది చౌకదే. 87 00:04:46,703 --> 00:04:49,081 ఇది ఇంక నీ నిర్ణయం, షీలా. నువ్వు ఇప్పుడే మీ ఇంటికి వెళ్లిపోవచ్చు. 88 00:04:49,164 --> 00:04:53,293 నీ జీవితంలో నువ్వు వదిలిపెట్టినది తిరిగి అందుకుని, అదే విజయం అనుకోవచ్చు. 89 00:04:54,211 --> 00:04:58,882 లేదా ఇక్కడే ఉండి అంకితభావంతో చికిత్స అందుకుని, మరిన్ని కఠిన పరీక్షలను ఎదుర్కోవాలి. 90 00:05:00,133 --> 00:05:01,844 సరిగ్గా అక్కడే నిజమైన మార్పు నీకు లభిస్తుంది. 91 00:05:02,636 --> 00:05:03,846 మరి నీ నిర్ణయం ఏమిటి? 92 00:05:05,138 --> 00:05:07,391 నువ్వు చేయవలసిందల్లా ఇంక చాలు అని తనకి చెప్పడమే. 93 00:05:07,474 --> 00:05:08,600 నువ్వు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నావు. 94 00:05:08,684 --> 00:05:11,895 కానీ ఎప్పటిలాగే ఆ విషయం చెప్పడానికి నువ్వు భయపడుతున్నావు. 95 00:05:15,899 --> 00:05:18,527 నీ చిన్న సంచీని నువ్వు సర్దుకోవడం చూసి నేను గట్టిగా నవ్వుకున్నాను. 96 00:05:19,194 --> 00:05:20,237 అందుకు ధన్యవాదాలు. 97 00:05:20,320 --> 00:05:22,447 నీకు నవ్వు తెప్పించినందుకు నాకు సంతోషంగా ఉంది. 98 00:05:22,531 --> 00:05:27,995 అది పని చేస్తుందని నిజంగా అనుకున్నావా? నిజాయితీగా కృతజ్ఞతాభావంతో మాట్లాడితే సరిపోతుందా? 99 00:05:28,078 --> 00:05:29,746 "నాకు నయం అయిపోయింది. బైబై." 100 00:05:30,372 --> 00:05:31,874 అది చూడటానికి అద్భుతంగా అనిపించింది. 101 00:05:31,957 --> 00:05:35,460 ఒక ఉడుత నీళ్లలో ఈదినట్లుగా నీ ప్రవర్తన అసహజంగా ఉంది. 102 00:05:35,544 --> 00:05:36,795 నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? 103 00:05:36,879 --> 00:05:39,381 అంటే, పట్టించుకోవడం అనేది ఇక్కడ సరైన పదం కాదు, కానీ… 104 00:05:39,464 --> 00:05:41,633 ఈ ప్రదేశాన్ని నువ్వు ఇష్టపడినంతగా మేము ఇష్టపడము. 105 00:05:44,803 --> 00:05:47,514 నువ్వు ఎందుకు నన్ను ఇంతలా సతాయిస్తున్నావు? 106 00:05:50,309 --> 00:05:52,436 -వాస్తవంగా అది ఒక న్యాయమైన ప్రశ్న. -నాకు తెలుసు. 107 00:05:52,519 --> 00:05:55,105 దీనికి ఒక కారణం ఉంది. అది ఏమిటో నాకు గుర్తు రావడం లేదు. 108 00:05:56,231 --> 00:05:58,817 అది ముఖానికి సంబంధించినది. కనీసం, కొద్ది భాగం. 109 00:06:02,196 --> 00:06:04,156 నా డంబెల్స్ తో నువ్వు ఏమైనా చేశావా? 110 00:06:04,239 --> 00:06:06,909 నీ డంబెల్స్ తో నేను ఏమైనా చేసేదానిలా కనిపిస్తున్నానా? 111 00:06:16,418 --> 00:06:17,753 ఓహ్, దేవుడా. 112 00:06:19,963 --> 00:06:22,716 ఇక్కడే ఇంకొన్ని రోజులు ఉంటే, నువ్వు కూడా ఆమెలాగా ఘోరంగా తయారయిపోతావు. 113 00:06:22,799 --> 00:06:24,301 ఇంక చాలు. 114 00:06:24,384 --> 00:06:27,804 నువ్వు ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? నువ్వు ఇంతకన్నా ఘోరంగా తయారయిపోతావు. 115 00:06:28,931 --> 00:06:31,558 ఈ చెత్తలో రెండు వారాలుగా ఉన్నావు కానీ వాళ్లు నీ నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు. 116 00:06:31,642 --> 00:06:34,853 నిన్ను మానసికంగా ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తారు, మరోపక్క నీ వ్యాపారం నాశనం అయిపోతుంది. 117 00:06:37,064 --> 00:06:38,607 ఇదంతా ఒక దోపిడీ ముఠా. 118 00:06:38,690 --> 00:06:42,027 వీళ్లకు ఉన్న రియల్ ఎస్టేట్ చూడు. లుయాన్ ఇంత ఆస్తి ఎలా సంపాదించి ఉంటుంది? 119 00:06:45,405 --> 00:06:47,157 నువ్వు రెండు వారాల నుండి వాంతులు చేసుకోవడం లేదు. 120 00:06:47,241 --> 00:06:50,577 నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. మానసికంగా మెరుగయ్యావు. కానీ దాన్ని నువ్వు నమ్మకుండా చేయాలని ఆమె ప్రయత్నిస్తోంది. 121 00:06:50,661 --> 00:06:53,038 నువ్వు ఎంత అనారోగ్యంగా ఉంటే ఆమె అంత ఎక్కువ డబ్బు గుంజుతుంది. 122 00:06:53,121 --> 00:06:56,959 ఆ లోభి లుయాన్ కి మరింత ఎక్కువ ఆదాయం. నీకు మాత్రం మెరుగవ్వడానికి అవకాశం తక్కువ. 123 00:06:59,169 --> 00:07:00,170 మే 1982 చివరి రోజు! 124 00:07:04,258 --> 00:07:06,301 ఏకాగ్రతతో తినండి. అంటే ఏంటి? 125 00:07:07,344 --> 00:07:09,137 ఆ మాటలోనే దాని విధానం ఉంది. 126 00:07:09,721 --> 00:07:14,184 మనం ఆహారాన్ని ఇతర కారణాలకు వినియోగించడం కాకుండా 127 00:07:14,268 --> 00:07:17,062 మన సంతోషం కోసం, మన పోషణ కోసం అవగాహనతో తినడం అన్న మాట. 128 00:07:17,729 --> 00:07:18,814 నాకు మాటలతో సహాయం చేస్తారా? 129 00:07:19,815 --> 00:07:20,816 సౌకర్యం. 130 00:07:21,692 --> 00:07:22,943 సాంగత్యం. 131 00:07:24,152 --> 00:07:25,571 వదిలివేయడం. 132 00:07:26,446 --> 00:07:27,447 అన్నీ తెలిసినవే. 133 00:07:28,740 --> 00:07:31,910 నువ్వు ఇక్కడ నీ సొంత నిర్ణయంతో ఉన్నావు. మునుగు లేదా ఈదు. నేను పట్టించుకుంటానేమో చూడు. 134 00:07:31,994 --> 00:07:33,078 ప్రేమ? 135 00:07:33,704 --> 00:07:36,999 అది ఒక ప్రశ్నా? ఎందుకంటే నువ్వు చివరి మాట గట్టిగా చెప్పావు. 136 00:07:37,082 --> 00:07:39,668 -ఎదురు మాట్లాడిన వాళ్లు నడవాలి. -నిజంగానా? 137 00:07:39,751 --> 00:07:42,629 -మనం ఆ పని మళ్లీ చేయడం లేదు, కదా? -నేను లెక్కని రెండుసార్లకు పెంచుతాను. 138 00:07:44,173 --> 00:07:47,301 ఆరెంజ్ ఆరు దశల ప్రక్రియని ఎవరు మనతో పంచుకుంటారు? 139 00:07:47,384 --> 00:07:48,385 హారియెట్ కాకుండా ఎవరైనా సరే. 140 00:07:48,468 --> 00:07:50,220 ఆకలి లేమి వాళ్లు ఎక్కువ విజయాలు సాధిస్తారు. 141 00:07:50,304 --> 00:07:52,848 ఆమోదం కోసం ఎదురుచూసే క్షిపణిలాగా ఆమె చేతిని గాల్లోకి పైకెత్తింది. 142 00:07:52,931 --> 00:07:58,896 పట్టుకోవడము, చూడటము, వాసన చూడటము, రుచి చూడటము, మింగటము, పూర్తిగా తినడము. 143 00:07:58,979 --> 00:08:01,315 -ఆమెను కాకా పట్టడం మర్చిపోకు. -బాగా చెప్పావు, మెలిండా. 144 00:08:01,398 --> 00:08:06,528 మీ ఇంద్రియానుభవంతో, మీ ఆలోచనల్నీ, ఉద్వేగాలనీ మీరు గమనించుకునే భంగిమ ఇది. 145 00:08:06,612 --> 00:08:10,741 కానీ మనలో కొందరికి, ఇది అంతగా సౌకర్యవంతమైన ప్రదేశం కాదు. 146 00:08:12,117 --> 00:08:13,535 నువ్వు ఇప్పుడు చేయి ఎత్తే అవసరం లేదు. 147 00:08:13,619 --> 00:08:15,537 -నన్ను క్షమించు. -నువ్వు క్షమాపణ చెప్పే అవసరం లేదు. 148 00:08:15,621 --> 00:08:18,665 -క్షమించు. క్షమించు. క్షమించు. -ఫర్వాలేదు. ఫర్వాలేదు. 149 00:08:18,749 --> 00:08:20,250 నేను వేరే బత్తాయి పండుని తీసుకోవచ్చా? 150 00:08:20,751 --> 00:08:24,338 దీని లోపల ఏదో పాడయినట్లు అనిపిస్తోంది. 151 00:08:24,421 --> 00:08:25,964 బాబోయ్. ఇది ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. 152 00:08:26,048 --> 00:08:27,299 నువ్వు వెంటనే మరొకటి తీసుకో. 153 00:08:32,136 --> 00:08:34,806 నన్ను క్షమించండి. ఇది పిచ్చిగా ఉంది. నేను అందరినీ వేచి ఉండేలా చేస్తున్నాను. 154 00:08:34,890 --> 00:08:36,058 -నన్ను క్షమించండి. -ఫర్వాలేదు. 155 00:08:36,140 --> 00:08:39,019 నీకు ఒక జీవితం, వ్యాయామం వీడియో టేపు, ఎదిగే వ్యాపారం ఉన్నాయి, 156 00:08:39,102 --> 00:08:41,230 కానీ ఈ పిచ్చిమాలోకం కోసం నువ్వు అవన్నీ వదిలి పెట్టేస్తున్నావు. 157 00:08:41,313 --> 00:08:44,107 ఇదీ ఇప్పుడు నీ జాతి. నువ్వు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నావా? 158 00:08:44,191 --> 00:08:47,110 …ఒక సుదూరపు గ్రహం నుండి ఎవరో గ్రహాంతరవాసి దీనిని పడేసినట్లు భావించాలి. 159 00:08:47,194 --> 00:08:50,739 మీ జీవితంలో ఇంతకుముందు వరకూ మీరు ఇలాంటిది చూడలేదు. 160 00:08:50,822 --> 00:08:54,785 దీని లక్షణాలు ఏమిటి? దీని రంగులు ఏవి? దీని రూపం ఏమిటి? 161 00:08:54,868 --> 00:08:57,704 ఇది కేవలం ఒక బత్తాయి పండు. ఒక మామూలు చెత్త బత్తాయి పండు. 162 00:08:57,788 --> 00:09:01,792 ఇది మీ చేతిలో ఉంటే మీకు ఏం అనిపిస్తోంది? దీని బరువు, దీని ఆకృతి. 163 00:09:01,875 --> 00:09:04,711 దీని మీద చిన్న గీతలు, బరకగా ఉన్న తోలు చూడండి. 164 00:09:04,795 --> 00:09:07,506 ఇంక ఇప్పుడు మనం కేవలం ఒక్క ముక్కని వొలిచడం ద్వారా మొదలుపెడుతున్నాం, 165 00:09:08,632 --> 00:09:11,093 ఇందులో కమ్మని వాసన దాగి ఉంటుంది, 166 00:09:11,176 --> 00:09:12,636 ఇది పండు యొక్క చర్మాన్ని సంరక్షిస్తుంటుంది. 167 00:09:14,096 --> 00:09:15,097 దాన్ని వాసన చూడండి. 168 00:09:15,764 --> 00:09:19,268 వాసన చూడటం కూడా ఒక విధంగా భుజించడమే అని మనం గ్రహించాలి. 169 00:09:19,351 --> 00:09:21,854 ఆ సుగంధం మీ ముక్కు ద్వారా మీ ఊపిరితిత్తుల వరకూ ప్రయాణం చేస్తుంది. 170 00:09:21,937 --> 00:09:24,439 నువ్వు నిజంగా ఒక్క ముక్క కొరకాలంటే ఇంకో ఏడాది పడుతుంది. 171 00:09:24,523 --> 00:09:25,524 ఇది పిచ్చితనం. 172 00:09:25,607 --> 00:09:29,278 ఇంకా ఇప్పుడు ఈ పండులోని ఒక భాగాన్ని మీ నోటిలో పెట్టుకోండి, 173 00:09:30,028 --> 00:09:33,949 కానీ అప్పుడే తినకండి. దానిని మీ నోటిలో అనుభూతి చెందండి. 174 00:09:34,032 --> 00:09:38,912 మీలో ఎలాంటి అనుభూతులు ఏర్పడతాయో, మీ శరీర వ్యవస్థ ఎలా స్పందిస్తుందో చూడండి. 175 00:09:39,663 --> 00:09:44,084 ఎటువంటి అభిప్రాయాలు లేకుండా ఒక్క క్షణం మనం వాటన్నింటినీ గమనిస్తూ ఉండాలి. 176 00:09:44,168 --> 00:09:46,211 ఇంకా ఎటువంటి ఆత్మగౌరవం లేకుండా. 177 00:09:47,921 --> 00:09:50,090 ఆ భావవ్యక్తీకరణ నాకు నచ్చింది, మెలిండా. 178 00:09:50,174 --> 00:09:54,469 అవును. మీ అనుభూతిని ఎలా వ్యక్తం చేసినా ఫర్వాలేదు, కానీ దానిని ఇంకా అప్పుడే తినడానికి ప్రయత్నించకండి. 179 00:09:54,553 --> 00:09:57,890 మనం కేవలం అవగాహన ఏర్పరుచుకుంటూ, గమనిస్తున్నాం. 180 00:09:57,973 --> 00:10:00,017 తరువాత ఏంటి? అందరూ కలిసి బాత్ రూమ్ కి వెళ్లి 181 00:10:00,100 --> 00:10:02,895 ఈ బత్తాయిని గమనించుకుంటూ మలవిసర్జన చేస్తామా? నీ అవకాశాన్ని జారవిడుచుకుంటున్నావు. 182 00:10:02,978 --> 00:10:06,023 నీ జీవితంలో ఏదో సాధించడానికి మిగిలి ఉన్న కొద్దిపాటి సమయాన్ని వృథా చేసుకుంటున్నావు. 183 00:10:06,106 --> 00:10:07,191 లేదు, నువ్వు ఇంక ఆపేయ్! 184 00:10:07,941 --> 00:10:12,362 క్షమించు. నేను ఇదంతా చేయలేను. మీరు చేసుకోండి. నేను కేవలం… ఇది నా వల్ల కాదు. 185 00:10:12,446 --> 00:10:14,198 ఆమె చేయలేకపోయింది. ఆమె అలా వెళ్లిపోకూడదు. 186 00:10:14,281 --> 00:10:17,284 తిరిగి మీ బత్తాయి పండు ని చూడు, హారియెట్. దయచేసి మీ బత్తాయిల మీద మళ్లీ దృష్టి పెట్టండి. 187 00:10:26,043 --> 00:10:27,044 నేను ఒకటి తీసుకోవచ్చా? 188 00:10:27,669 --> 00:10:29,046 -తప్పకుండా. -వద్దు, బుజ్జీ. 189 00:10:31,340 --> 00:10:34,510 ఏమీ అనుకోకు, స్వీటీ. అవి ఇక్కడ అందరి కోసం ఉన్నాయి, కేవలం మన కోసం కాదు. 190 00:10:35,052 --> 00:10:36,303 ఇక్కడ ఎంత కాలం ఉంటావు, అమ్మా? 191 00:10:36,386 --> 00:10:39,515 నీకు చెప్పాను కదా, బంగారం. కొద్ది వారాలు మాత్రమే. దాదాపు అయిపోవచ్చింది. 192 00:10:40,432 --> 00:10:43,393 అవును. పది రాత్రిళ్లు, ఆ తరువాత ఇంటికి వచ్చేస్తాను. 193 00:10:43,894 --> 00:10:46,563 పెద్ద కష్టం ఏమీ కాదు. అన్నట్లు, పింకీ ఎలా ఉంది? 194 00:10:46,647 --> 00:10:48,774 తనకి ఆరోగ్యం పాడయింది. తన తలకి దెబ్బ తగిలింది. 195 00:10:48,857 --> 00:10:51,193 అది నయం కావడానికి పెద్ద డాక్టర్ల దగ్గరకి వెళుతోంది. 196 00:10:53,195 --> 00:10:54,571 దాని తలకి ఎలా దెబ్బ తగిలింది? 197 00:10:54,655 --> 00:10:56,406 ఏమో, మేము ఇంకా అంత దూరం ఆలోచించలేదు. 198 00:10:57,407 --> 00:10:58,617 నాకు ఒక కుక్క వస్తోంది. 199 00:10:59,409 --> 00:11:00,410 ఏంటి? 200 00:11:00,911 --> 00:11:03,664 వావ్, అది పెద్దగా ఉంది ఇంకా భిన్నంగా ఉంది. 201 00:11:03,747 --> 00:11:08,502 అవును. మేము ఒక జంతు సంరక్షణ కేంద్రానికి వెళ్లాము. 202 00:11:08,585 --> 00:11:10,587 అక్కడ, కొన్ని ముద్దుగా ఉన్న కుక్కల్ని చూశాము. 203 00:11:10,671 --> 00:11:13,841 అందులో ఒక దాని పేరు ఓరియో… అది మాకు నచ్చింది. 204 00:11:14,842 --> 00:11:17,803 కానీ, దాని ప్రవర్తనలో కొద్ది సమస్యలు ఉన్నాయి ఇంకా కంటి నుండి ఏదో కారుతోంది, 205 00:11:17,886 --> 00:11:20,430 అది మాకు ఆందోళనగా ఉంది, కాబట్టి… కానీ, దాని గురించి మేము మాట్లాడుతున్నాము. 206 00:11:20,514 --> 00:11:21,765 అది ఆసక్తికరంగా ఉంది. 207 00:11:30,482 --> 00:11:32,234 తనని ఇక్కడికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. 208 00:11:32,317 --> 00:11:34,653 నువ్వు చాలా ఉదారంగా వ్యవహరించావు. నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం లేదు. 209 00:11:35,863 --> 00:11:39,783 అవును, మన మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా, వాటి ప్రభావం దాని మీద పడనక్కర లేదు. 210 00:11:39,867 --> 00:11:43,787 నీ బిడ్డ నిన్ను ఇలా చూడాలన్నది అతని వ్యూహం, అప్పుడు అతను హీరో అవుతాడు, కుక్కని తెచ్చిస్తాడు. 211 00:11:43,871 --> 00:11:46,164 నువ్వు మరింత చెత్తని భరించాలి. అందుకే ఇదంతా. 212 00:11:46,790 --> 00:11:48,208 నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. 213 00:11:48,876 --> 00:11:51,170 నా కోపం ఎప్పటికయినా తగ్గుతుందో లేదో చెప్పలేను. 214 00:11:51,253 --> 00:11:53,088 -నన్ను చాలా… డానీ. నన్ను క్షమించు. -లేదు. విను. 215 00:11:53,589 --> 00:11:55,674 దయచేసి విను. నన్ను ఇది చెప్పనివ్వు, సరేనా? 216 00:11:56,800 --> 00:11:58,969 ఒక సమస్య కారణంగా నువ్వు ఇక్కడ చికిత్స పొందుతున్నావు 217 00:11:59,052 --> 00:12:04,725 పైగా అది చాలా పెద్ద సమస్య ఇంకా నిజమైనది కూడా, దానిని నువ్వు ఎదుర్కొంటున్నందుకు నాకు గర్వంగా ఉంది. 218 00:12:04,808 --> 00:12:06,351 అందుకు నిన్ను అభినందించాల్సిందే. 219 00:12:06,435 --> 00:12:08,645 మనకు ఉన్న అలవాట్లను ఇక్కడ వదిలించుకోవాలి, 220 00:12:08,729 --> 00:12:10,439 దాన్ని వదిలించుకోవడామా లేదా అనేది పూర్తిగా నీ నిర్ణయం. 221 00:12:11,273 --> 00:12:12,274 మాయా కోసం. 222 00:12:15,903 --> 00:12:18,197 కాబట్టి అది నీకూ మంచిది. ఇంక అంతే. 223 00:12:20,324 --> 00:12:23,327 కానీ నాకు ఇప్పటికీ నీ మీద చాలా కోపంగా ఉంది. 224 00:12:43,055 --> 00:12:44,973 ప్రేమ 225 00:12:51,897 --> 00:12:53,106 ఇప్పుడు ఇది చేద్దాం. 226 00:12:54,024 --> 00:12:55,400 అదంతా ఏంటి? 227 00:12:58,362 --> 00:13:00,531 -అదేనా… ఓహ్, చెత్త. -సరే, అందరూ. 228 00:13:01,073 --> 00:13:04,076 మీరు ఏం అనుకుంటున్నారో నాకు తెలుసు. మీ శక్తికి మించి శ్రమ పడుతున్నట్లు అనిపిస్తోంది కదూ? 229 00:13:04,701 --> 00:13:07,704 -నిన్ను ఎందుకు ఇష్టపడనో నేను తెలుసుకున్నాను. -ఇది తప్పదు, అవును కదా? 230 00:13:07,788 --> 00:13:09,831 -ఇది మీకు ఎక్కడ దొరికింది… -లూసీ దగ్గర ఒక కాపీ ఉంది. 231 00:13:09,915 --> 00:13:13,752 నేను దాని గురించి మర్చిపోయాను కానీ ఈ రోజు కొద్దిగా వ్యాయామం చేయాలనిపించి బయటకు తీశాను. 232 00:13:14,503 --> 00:13:15,504 దానితో టీవీలో నువ్వు వచ్చావు. 233 00:13:15,587 --> 00:13:18,006 ఒక్క క్షణం ఆగు. నేను ఈ మొత్తం అంతా వివరించగలను. 234 00:13:18,090 --> 00:13:21,176 నువ్వు ఇదంతా చేస్తూ స్కూలులో పాఠాలు చెబుతావా లేక కేవలం… 235 00:13:22,302 --> 00:13:25,055 అవును, ఇది మాత్రమే చేస్తాను. 236 00:13:25,639 --> 00:13:26,640 ఇది నమ్మశక్యంగా లేదు. 237 00:13:26,723 --> 00:13:29,643 నేను నేర్పిస్తాను అని ఇప్పుడే చెప్పాను. నేను పాఠాలు చెబుతాను. 238 00:13:29,726 --> 00:13:32,938 కాబట్టి మీరందరూ, ఎలాగంటే, ఖాళీలని పూరించారు. 239 00:13:33,021 --> 00:13:35,899 పాక్షికమైన అబద్ధాలు అయినా పూర్తి అబద్ధాలంత చెడ్డవి. 240 00:13:36,441 --> 00:13:39,862 ఈ అబద్ధాలకు తోడు దొంగచాటుగా వ్యవహరించడం మరింత ఘోరమైన విషయం. 241 00:13:40,696 --> 00:13:42,865 తను దొంగచాటుగా వ్యవహరించే రకం. అది మాత్రం ఖచ్చితం. 242 00:13:42,948 --> 00:13:44,324 నేను అలాగ ఆలోచించను. 243 00:13:44,408 --> 00:13:48,662 బతకడానికి నేను ఏం చేస్తాను అనేది మీకు అనవసరం అనుకుంటాను. 244 00:13:48,745 --> 00:13:52,749 మనం ఇక్కడికి చికిత్స కోసం ఎందుకు వచ్చామో ఆ విషయాన్నే నువ్వు ఏమారుస్తున్నావు. 245 00:13:56,003 --> 00:13:58,297 ఒక మంచి ఇంటిలో నువ్వు చెడు ఆలోచనలు ఉన్న నక్కవి. 246 00:13:58,380 --> 00:14:00,424 వాళ్లకు నువ్వు ఉండటం ఇష్టం లేదు. నువ్వు వాళ్లకి నచ్చవు. 247 00:14:00,507 --> 00:14:02,843 అయినా కూడా నువ్వు ఇక్కడ ఉండాలని పట్టుబడతావు. మేలుకో! 248 00:14:02,926 --> 00:14:06,430 ఇక్కడి నుండి వెళ్లిపోయాక ఈ చెత్తనంతా ఎలా అమ్ముతావు? 249 00:14:07,598 --> 00:14:11,351 అంటే, ఒకదానితో మరొక దానికి సంబంధం ఉందని అనుకోను. 250 00:14:11,435 --> 00:14:14,354 నువ్వు కూడా మాలో ఒకదానివి అని తెలిసిపోతే ఎవరైనా నీ టేపుని ఎందుకు కొంటారు? 251 00:14:14,438 --> 00:14:19,484 "పైగా చాలా తక్కువ, తక్కువ ధర 9.95 డాలర్లు, దీనికి తోడు తిండి తినలేని రోగం, 252 00:14:19,568 --> 00:14:21,612 మీరు కూడా నాలాగ కనిపించవచ్చు." 253 00:14:22,196 --> 00:14:25,782 అవును, నీ విషయంలో నాకు నచ్చనిది ఖచ్చితంగా అదే. 254 00:14:25,866 --> 00:14:28,202 నువ్వు కూడా వీళ్లలా దీనంగా పనికిరాకుండా పోయి, అన్ని అవకాశాలూ కోల్పోతే తప్ప 255 00:14:28,285 --> 00:14:29,620 వీళ్లంతా సంతోషపడరు. 256 00:14:29,703 --> 00:14:33,165 సరే, అసలు నిజం ఏమిటంటే, నేను తిరిగి ఈ పని చేస్తానో లేదో కూడా నాకు తెలియదు. 257 00:14:33,248 --> 00:14:34,958 నాకు ఇది చేస్తానో లేదో తెలియదు… 258 00:14:35,042 --> 00:14:36,043 ఇది నాకు నచ్చింది. 259 00:14:37,211 --> 00:14:40,297 -ఆ మ్యూజిక్ సరదాగా ఉంది. -అవును, అది వినసొంపుగా ఉంది. 260 00:14:40,380 --> 00:14:44,593 మామూలు వ్యాయామం చేయడం మంచిదే అని లుయాన్ చెబుతుంది. అది ఆరోగ్యం కూడా. 261 00:14:44,676 --> 00:14:47,846 నువ్వు భోజనం బదులు ఆవపిండి పొట్లాలు తింటావు. ఆరోగ్యం గురించి నీకేం తెలుసు? 262 00:14:50,349 --> 00:14:52,100 మేము శరీరానికి ఉపశమనం ఇచ్చే ఈతకు వెళుతున్నాం. 263 00:14:52,809 --> 00:14:53,977 నువ్వు కూడా మాతో వస్తావా? 264 00:14:54,061 --> 00:14:55,896 నువ్వు యాసిడ్ లో కూడా ఈదగలవని నీకు తెలుసు. 265 00:14:56,897 --> 00:14:57,898 సరే. 266 00:14:59,233 --> 00:15:00,275 మంచిది. 267 00:15:05,197 --> 00:15:07,908 డ్రగ్స్ కి అలవాటుపడిన నా మాజీ ప్రియురాలికి నువ్వు అదృష్టవంతురాలివి అని చెప్పే దాన్ని, 268 00:15:07,991 --> 00:15:09,117 ఎందుకంటే ఆమె తిండి తినేది కాదు. 269 00:15:09,201 --> 00:15:11,620 తినడం గనుక వ్యసనం అయితే, అది మానుకోవడం ఇంకా కష్టం. 270 00:15:12,621 --> 00:15:15,541 మనం శత్రువులతో కూడా స్నేహం చేయాల్సి వస్తుంది. 271 00:15:15,624 --> 00:15:19,044 మనల్ని ఏదయితే నాశనం చేస్తుందో దానితో మనం ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగిస్తాము. 272 00:15:19,127 --> 00:15:21,129 కానీ నేను ఇక్కడ మీకు ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు. 273 00:15:21,213 --> 00:15:25,759 ఇదిగో ఇప్పుడు ఉపన్యాసం మొదలుపెడుతుంది, మూడు, రెండు… మూడు, రెండు… 274 00:15:25,843 --> 00:15:30,514 నిజం ఏమిటంటే నేను బోధించే దాని కన్నా ఎక్కువగా నేను మీ నుంచి నేర్చుకుంటాను. 275 00:15:30,597 --> 00:15:32,891 స్వప్రయోజనాలు ఆశించే, పవిత్రమైన చెత్త. 276 00:15:32,975 --> 00:15:35,602 ఒక మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ బల్ల మీద కాఫీ మగ్గు మీద ఉండాల్సిన ముఖం ఇది. 277 00:15:35,686 --> 00:15:38,522 షీలా, ఇప్పుడు నీ వంతు. కృతజ్ఞతలు చెప్పే సమయం. 278 00:15:41,024 --> 00:15:43,235 సరే. నేను ఈ రోజు నిద్ర లేచాను. 279 00:15:43,318 --> 00:15:45,112 పడుకోవడం కన్నా అదే మేలు. 280 00:15:50,659 --> 00:15:53,537 రెండు వారాల తరువాత మొదటిసారి నా కూతుర్ని చూశాను. 281 00:15:55,747 --> 00:15:59,835 ఇంకా తను కాస్త పెద్దది అయింది. 282 00:16:02,129 --> 00:16:03,130 భిన్నంగా ఉంది. 283 00:16:05,841 --> 00:16:08,051 కానీ తను అలా మారకూడదు, కదా? 284 00:16:08,135 --> 00:16:12,306 నా ఉద్దేశం, తల్లికి దూరంగా ఉండటం వల్ల కొద్దిగా పెద్దరికం వచ్చి ఉంటుంది. 285 00:16:14,183 --> 00:16:17,269 నువ్వు కృతజ్ఞతాభావం కలిగి ఉండే మరేదయినా విషయం ఉందా? అది చిన్నదయినా ఫర్వాలేదు. 286 00:16:17,352 --> 00:16:20,606 నీ తప్పుల్ని ఎంచడం గురించి ఏం అంటావు? అది చిన్న విషయమా? 287 00:16:20,689 --> 00:16:21,982 నేను ఇంకేమీ ఆలోచించలేకపోతున్నాను. 288 00:16:22,065 --> 00:16:26,028 ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించు. నా నోరు దాని పాటికి అది పని చేస్తుంది. 289 00:16:26,111 --> 00:16:27,446 కొన్నిసార్లు అంతా సవ్యంగానే ఉంటుంది. 290 00:16:27,529 --> 00:16:29,531 ఇక్కడ ఉన్న అందరిలాగ నువ్వు కూడా చెత్తదానివే. 291 00:16:29,615 --> 00:16:32,117 ఇలా అందరితో, నీ ఆలోచనల్ని పంచుకుంటూ, బత్తాయిలు వొల్చుకుంటూ కూర్చో, 292 00:16:32,201 --> 00:16:34,161 మరో పక్క విన్నీ గ్రీన్ లాంటి వాళ్లు దూసుకువెళ్లిపోతుంటారు. 293 00:16:34,244 --> 00:16:36,079 నీ బుర్రలో మరేవో ఆలోచనలు నాకు కనిపిస్తున్నాయి. 294 00:16:36,163 --> 00:16:39,082 ఆ ఆలోచనల్ని నువ్వు పైకి చెప్పడం లేదు. అవి వినాలని నాకు ఆసక్తిగా ఉంది. 295 00:16:39,166 --> 00:16:40,167 లేదు, తనకి ఆసక్తి లేదు. 296 00:16:40,250 --> 00:16:42,961 నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు, షీలా. ఆ విషయం మా అందరికీ తెలుసు. 297 00:16:43,045 --> 00:16:45,297 ఊరికే మార్పు కోసం ఆ ఆలోచనల్ని బయట పెడతావా? 298 00:16:54,264 --> 00:16:57,059 నీకు మేజిక్ శక్తులు ఏమీ లేవు. నా ఆత్మలో ఏముందో నువ్వు చూడలేవు. 299 00:16:57,726 --> 00:17:01,271 నీకు వివేకం లేదు, కనీసం తెలివి కూడా లేదు. నిన్ను చూస్తే నవ్వు కూడా రాదు. 300 00:17:01,355 --> 00:17:04,148 నువ్వు చెప్పే ప్రతి మాటా ఏదో గిఫ్ట్ షాపులో బంపర్ స్టిక్కర్ మీద రాసే 301 00:17:04,233 --> 00:17:05,233 రాతలు చదివినట్లు ఉంటాయి. 302 00:17:05,317 --> 00:17:07,109 నువ్వు ఒక దలై లామా లాగా ప్రవర్తిస్తావు, 303 00:17:07,194 --> 00:17:11,448 కానీ నువ్వు ఇప్పుడు ఒక ఒంటరి దానివి, ఒకప్పటి లావుపాటి స్వలింగ సంపర్కురాలివి, 304 00:17:11,531 --> 00:17:14,492 నిన్ను అందరూ గుర్తించి గౌరవించాలన్నట్లుగా భారీగా డ్రెస్సులు వేసుకుంటూ ఉంటావు. 305 00:17:15,160 --> 00:17:16,869 -అంతేనా? -లేదు. 306 00:17:18,704 --> 00:17:20,540 ఇది చాటుగా మాట్లాడే మాటలు. తను కాసేపు నడవాలి. 307 00:17:20,624 --> 00:17:24,627 నోరు మూసుకో, మెలిండా. నువ్వు ఒక చెత్త చిన్నపిల్లవి! ఆమెను మంచి చేసుకోవడానికి ఉత్సాహపడుతూ ఉంటావు. 308 00:17:24,711 --> 00:17:28,590 నువ్వు సొంతంగా కోలుకోవడానికి ప్రయత్నించలేవు కానీ ఇక్కడ ఉన్న అందరితో శభాష్ అని 309 00:17:28,674 --> 00:17:30,175 నెత్తి మీద కొట్టించుకుని తృప్తి పడుతుంటావు! 310 00:17:30,259 --> 00:17:32,970 ఇంకా నువ్వు, స్త్రీ జనోద్దరణకు నడుం బిగించిన దానిలా ప్రవర్తిస్తుంటావు, 311 00:17:33,053 --> 00:17:34,680 కానీ నిజం ఏమిటంటే నేనంటే నీకు ద్వేషం 312 00:17:34,763 --> 00:17:37,057 ఎందుకంటే నీకంటే అందంగా ఉంటాను, నీకన్నా ఎక్కువ విజయాలు సాధించాను. 313 00:17:37,140 --> 00:17:39,142 బయట ప్రపంచంలో అక్కడ నీకంటూ ఒక జీవితం లేదు. 314 00:17:39,226 --> 00:17:40,352 ఇది నీ వేసవి విడిది, 315 00:17:40,435 --> 00:17:42,604 ఇక్కడ మాత్రమే నువ్వు ఏదో గొప్పదానివి అని అందరూ అనుకోగలరు. 316 00:17:42,688 --> 00:17:43,689 సరే, షీలా. 317 00:17:43,772 --> 00:17:45,190 వ్యాధులు నయం కావడం ఎలాగో ఇక్కడ చూశాక, 318 00:17:45,274 --> 00:17:49,069 దీని కంటే నేను బాత్రూమ్ లో ఆ చెత్త టాయిలెట్ చుట్టూ చేతులు ఉంచి వాంతులు చేసుకోవడమే నయం అనిపిస్తుంది. 319 00:17:49,152 --> 00:17:51,363 -నువ్వు సాధించావు. అయిపోయింది. ఇక వెళ్లు. -షీలా, ఆగు. 320 00:17:51,446 --> 00:17:54,575 నీకు ఏమైనా పిచ్చా? ఇప్పుడు నిన్ను ద్వేషిస్తారు. నువ్వంటే ద్వేషం. వెళ్లు! 321 00:17:54,658 --> 00:17:58,579 ఈ ప్రత్యేకమైన మానసిక వ్యాధికి సంబంధించిన మంచి లక్షణం ఏమిటో తెలుసా? 322 00:17:59,079 --> 00:18:03,000 నిన్ను ఎవ్వరూ ఎంత ఘోరంగా అయినా ఏమీ తిట్టలేరు, 323 00:18:03,500 --> 00:18:05,460 ఎందుకంటే నిన్ను నువ్వు అంతకన్నా ఘోరంగా తిట్టుకుని ఉంటావు. 324 00:18:07,045 --> 00:18:09,131 ఈ విషయాన్ని కూడా నేను ఏదైనా బంపర్ స్టిక్కర్ మీద చదివే ఉంటాను. 325 00:18:10,799 --> 00:18:13,927 ఎట్టకేలకు నీ ఆలోచనల్ని బయటపెట్టినందుకు ధన్యవాదాలు. 326 00:18:23,020 --> 00:18:26,857 చికిత్సా కేంద్రానికి స్వాగతం. ఇక్కడ చిరాకుగా ఉంటుంది. 327 00:18:39,995 --> 00:18:42,998 సరే, నాకు తెలిసింది. నేను ఒక మూర్ఖురాలిని. 328 00:18:43,081 --> 00:18:46,001 నేను నీ విషయంలో కఠినంగా వ్యవహరించాను, నీకు నా మీద కోపం ఉండటంలో అర్థం ఉంది. 329 00:18:46,084 --> 00:18:48,212 నీకు అన్ని హక్కులూ ఉన్నాయి. అందుకు నేను అర్హురాలినే. 330 00:18:50,422 --> 00:18:53,091 నీ చెవిలో నేను ఎప్పుడూ రొద పెట్టకుండా ఉంటే నువ్వు ఇంకా బాగుండేదానివేమో. 331 00:18:53,175 --> 00:18:55,344 బహుశా దాని వల్ల నువ్వు మరింత సంతోషంగా ఆరోగ్యంగా ఉండి ఉండేదానివి. 332 00:18:57,137 --> 00:19:02,184 శరీరాన్ని ఇష్టపడకండి. దాని ఒంపుల్ని గీయండి. మీరు ఏం చూస్తున్నారో అదే గీయండి. 333 00:19:03,435 --> 00:19:05,354 నేను నీ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాను. 334 00:19:05,437 --> 00:19:09,775 నీ శరీరం గురించి నేను మాట్లాడిన తీరు, అది చాలా నీచం. పూర్తిగా అన్యాయం. 335 00:19:11,318 --> 00:19:15,489 కానీ అన్నిసార్లు అది చెడుగా మారలేదు. కొన్నిసార్లు నీలో స్ఫూర్తి నింపాను, కదా? 336 00:19:16,156 --> 00:19:18,116 ఆ వీడియో. ఆ క్లాసులు. నేను లేకుండా నువ్వు 337 00:19:18,200 --> 00:19:21,161 అంత దూరం వెళ్లగలిగే దానివా? నిజాయితీగా చెప్పగలవా? 338 00:19:21,245 --> 00:19:23,163 నేను లేకుండా నువ్వు ఏం అవుతావు? 339 00:19:23,247 --> 00:19:25,457 నీ జీవితంలో మంచి అంతా నా వల్ల… 340 00:19:44,101 --> 00:19:49,398 నువ్వు ఇలా వృథాగా ఉండటం చూస్తే నాకు చాలా, చాలా, చాలా బాధగా ఉంది. 341 00:19:50,107 --> 00:19:54,653 నా సమయం వృథా అవుతోంది. నాకు సంబంధించిన అన్ని విషయాలు నాకు చెత్తగా అనిపిస్తున్నాయి. 342 00:19:55,153 --> 00:19:57,906 అంటే, ఆ సమయం ఆ శక్తినంతా నేను ఉపయోగించుకునే దాన్ని… 343 00:19:59,575 --> 00:20:02,286 నాకు తెలియదు. స్నేహాలు పెంచుకునే దాన్ని. ఏదైనా సాధించే దానిని. 344 00:20:02,369 --> 00:20:05,205 ఏదైనా చేసి ఉండేదాన్ని, నిజంగా, వాస్తవంగా, ఏదైనా సాధించి ఉండేదానిని. 345 00:20:09,209 --> 00:20:13,338 అంటే, నేను ఏదైనా వాయిద్యం నేర్చుకునే దానిని. లేదా ఇటాలియన్ భాష నేర్చుకునేదాన్ని. 346 00:20:13,422 --> 00:20:16,425 లేదా జాపనీస్ భాషో ఇంకేదో నేర్చుకునే దాన్ని. నాకు తెలియదు. 347 00:20:16,508 --> 00:20:20,053 బహుశా జాపనీస్ భాష నేర్చుకోను. అది చాలా కష్టం. కానీ ఏదైనా నేర్చుకునే దానిని. 348 00:20:20,137 --> 00:20:22,097 నా ఉద్దేశం, నా వ్యాపారంతో నేను ఈ రోజు ఏదైనా సాధించి ఉండే దానిని. 349 00:20:22,181 --> 00:20:25,601 కానీ… ఇక్కడ వెచ్చించిన నా సమయం నా శ్రమలో సగం వెచ్చించినా కూడా… 350 00:20:26,977 --> 00:20:29,313 ఇలా మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని నాకు తెలుసు, 351 00:20:29,396 --> 00:20:32,774 కానీ నేను కేవలం, మీకు తెలుసు, నేను చాలా బాధ పడుతున్నాను. 352 00:20:33,400 --> 00:20:39,406 ఇంకా నేను ఇప్పటివరకూ చెప్పిన అబద్ధాలు ఇంకా నేను చేసిన హాని, ఇంకా… మీకు తెలుసా? 353 00:20:42,159 --> 00:20:44,036 నా జీవితంలో అస్తవ్యస్తమైన భాగాల్ని ఒకటిగా కూర్చాలని ఉంది. 354 00:20:44,119 --> 00:20:46,747 కానీ నాకు భయంగా ఉంది… ఇప్పటికే ఆలస్యం చేశానని భయంగా ఉంది. 355 00:20:48,248 --> 00:20:51,877 చూడు, కోలుకున్న తరువాత బయట ప్రపంచం అంతా 356 00:20:51,960 --> 00:20:53,420 రంగులమయంగా ఉంటుందని నేను చెప్పను. 357 00:20:55,547 --> 00:20:56,632 కానీ… 358 00:20:57,591 --> 00:20:59,009 "కానీ" అనే మాటని నేను అన్నానా? 359 00:20:59,718 --> 00:21:02,012 అంటే, ఆ మాటలో అది దాగి ఉంది అనిపించింది. 360 00:21:03,055 --> 00:21:04,431 నేను ఏ అర్థంలో అన్నానో నాకు చెప్పు. 361 00:21:08,143 --> 00:21:09,561 అది ఇంకా ఆలస్యం కాదు అన్న అర్థంలో. 362 00:21:10,646 --> 00:21:11,939 నువ్వు ఆ మాట అంటే ఫర్వాలేదు. 363 00:21:18,403 --> 00:21:19,738 ఇది ప్రధానంగా దంపతులకు సంబంధించిన 364 00:21:19,821 --> 00:21:22,324 అపాయింట్మెంట్ అని అనుకుని వచ్చాను. 365 00:21:22,407 --> 00:21:24,451 కానీ, మిమ్మల్ని నిరాశపరిస్తే క్షమించండి, డానీ. 366 00:21:24,535 --> 00:21:29,331 కానీ ఈ కార్యక్రమం ఎలా రూపొందించామంటే రోగి నయం అయే ప్రక్రియలో భాగంగా గతంలోకి తొంగి చూస్తాము, 367 00:21:29,414 --> 00:21:34,628 అలా చూడటం ద్వారా, వ్యవసపూరితమైన అలవాట్లునీ, ప్రవర్తనలనీ మానుకునే ప్రక్రియలో 368 00:21:34,711 --> 00:21:36,505 రోగి ఒంటరిగా పడే వేదననీ, అందరికీ దూరంగా, రహస్యంగా 369 00:21:36,588 --> 00:21:39,007 ఆమె పడే కష్టాన్ని తెలుసుకుని కుటుంబసభ్యులు ఓదారుస్తారని ఇది ఉద్దేశించాం. 370 00:21:39,091 --> 00:21:40,175 సరే, ఒకవేళ అదే విషయం అయితే, 371 00:21:40,259 --> 00:21:42,511 ఆమె ప్రియుడికి కూడా మీరు ఆహ్వానం పంపించారా? 372 00:21:43,095 --> 00:21:45,681 -దయచేసి అలా అనకు. దయచేసి మాట్లాడకు. -ఆ విషయం ఆమె చెప్పిందా? 373 00:21:45,764 --> 00:21:49,935 ఆమె ఒక షాపింగ్ మాల్ నిర్మించే మోర్మాన్ తో సంబంధం కలిగి ఉందని చెప్పిందా? 374 00:21:50,018 --> 00:21:51,812 వాడే నా దృష్టిలో తనకి పట్టిన దెయ్యం. 375 00:21:51,895 --> 00:21:53,981 -అది ముగిసిపోయిందని చెప్పాను. -నువ్వు నాకు ఏమీ చెప్పలేదు. 376 00:21:54,064 --> 00:21:56,024 నువ్వు నాకు అబద్ధాలు తప్ప ఇంకేమీ చెప్పలేదు. 377 00:21:56,108 --> 00:21:58,318 మీరు కోపంగా ఉన్నారు. అందులో అర్థం ఉంది. 378 00:21:58,402 --> 00:22:00,028 కానీ ప్రస్తుతానికి, మన ఆవేశాలు తగ్గించుకోవాలని… 379 00:22:00,112 --> 00:22:01,738 నేను మారాలని చూస్తున్నాను. ఇక్కడ అదే చేస్తున్నాను. 380 00:22:01,822 --> 00:22:04,491 మరింత మెరుగవ్వడానికి ప్రయత్నించాను, ఇప్పుడు మెరుగయ్యాను కూడా. 381 00:22:04,575 --> 00:22:07,995 నేను చేసిన చెత్తనంతా ఒప్పుకుంటున్నాను. నేను చేసిన అన్ని చెత్త పనులూ. 382 00:22:08,078 --> 00:22:09,997 ఇంకా నీకు కోపం కలిగించిన అన్ని విషయాల గురించి… 383 00:22:10,914 --> 00:22:12,708 తప్పులు చేశాను, ఆ తప్పంతా నాదే. 384 00:22:12,791 --> 00:22:15,294 కానీ అవి వేరు కాదు. 385 00:22:15,377 --> 00:22:17,838 -అవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అన్నీ… -నాకు అర్థమైంది. అర్థమైంది. 386 00:22:17,921 --> 00:22:20,174 ఇది ఎలా ఉందంటే, "నా సంబంధాలు కూడా నా రోగ లక్షణమే" అన్నట్లుంది. 387 00:22:20,257 --> 00:22:22,259 -లేదు. -నువ్వు చేయలేదు. 388 00:22:22,342 --> 00:22:24,428 -నీ రోగం చేసింది, కదా? -నేను చెబుతున్నది అది కాదు. 389 00:22:24,511 --> 00:22:26,930 -నేను చెబుతున్నది అది కానే కాదు. -అవును, ఏదైనా నేను పట్టించుకోను. 390 00:22:27,431 --> 00:22:30,767 నిన్ను ప్రోత్సహించి నేను విసిగిపోయాను. 391 00:22:31,393 --> 00:22:33,812 ఆ ప్రోత్సాహం ఇక్కడ నీకు బాగా లభిస్తోందని చూస్తే అర్థం అవుతోంది, కాబట్టి… 392 00:22:33,896 --> 00:22:38,984 సరే, మంచిదే. నువ్వు మెరుగవ్వడానికి కష్టపడుతున్నావు. అది మంచి విషయం. 393 00:22:39,651 --> 00:22:43,071 అది కాదు. ఇది పని. నిజంగా కష్టమైన పని. 394 00:22:43,155 --> 00:22:46,783 సరే. అలాగే. నేను ఇక్కడి నుండి బయటకు వెళతాను. 395 00:22:46,867 --> 00:22:50,495 నేను చాలా దూరం డ్రైవ్ చేసుకుని వెళ్లాలి, అలాగే రేపు ముఖ్యమైన పని కూడా ఉంది. 396 00:22:51,914 --> 00:22:53,916 ఎ.సి.ఎల్.యు. లో ఉద్యోగానికి ఇంటర్వ్యూ. 397 00:22:54,625 --> 00:22:58,754 అయితే అది ఏదో టీవీలో చేసే పని లాంటిది కాదు. నిజమైన, అంటే, నిజమైన ప్రజా విధానపరమైన పని. 398 00:22:58,837 --> 00:23:01,715 బండ పని. అంటే, నిజమైన పని. 399 00:23:03,091 --> 00:23:04,676 అది వినడం నాకు సంతోషంగా ఉంది. 400 00:23:05,427 --> 00:23:09,223 సరే, ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో నీకు చెబుతాను. నీకు పట్టించుకోవాలనే ఆసక్తి ఏదైనా ఉంటే. 401 00:23:21,735 --> 00:23:26,406 సరే, అది చూడు. దాదాపుగా వచ్చేశావు. నువ్వు ఈ ప్రదేశం నుంచి బయటపడిపోతావు. 402 00:23:27,324 --> 00:23:31,286 నీ విషయంలో నాకు సంతోషంగా ఉంది. నిజంగా. కానీ తరువాత ఏం చేస్తావు? 403 00:23:35,916 --> 00:23:37,376 నీ వ్యక్తిగత జీవితం విఫలమయింది. 404 00:23:39,086 --> 00:23:41,630 దాని కారణంగా ఫిట్నెస్ వ్యాపారానికి నువ్వు ఎక్కువ సమయం కేటాయించవచ్చు. 405 00:23:44,174 --> 00:23:46,426 కానీ అది ఎలా ఉండబోతోంది? 406 00:23:46,510 --> 00:23:48,387 నువ్వు మరొక వీడియో రూపొందించబోతున్నావా? 407 00:23:48,887 --> 00:23:51,765 జూన్ 1982 408 00:23:51,849 --> 00:23:54,768 చికిత్స పొందుతున్న బులీమిక్ రోగుల మెరుగైన ఆరోగ్యానికీ, జీవనానికీ మార్గదర్శి? 409 00:23:54,852 --> 00:23:56,812 ఎవరికైనా దీని వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? 410 00:23:58,355 --> 00:24:00,482 పూరించాల్సిన చాలా ఖాళీ రోజులు నీకు ఉన్నాయి. 411 00:24:01,149 --> 00:24:02,818 వాటిని ఏం చేసి భర్తీ చేస్తావు? 412 00:24:26,800 --> 00:24:27,843 నిద్ర పట్టలేదా? 413 00:24:29,261 --> 00:24:31,555 లేదు. నాకు ఆరోగ్యం బాగా లేదు. 414 00:24:32,514 --> 00:24:35,642 అవును, నాకూ అలాగే ఉంది. నాకు కొద్దిగా దాహం వేసింది, అందుకే… 415 00:24:35,726 --> 00:24:37,352 సరే, శుభ రాత్రి. 416 00:24:37,436 --> 00:24:40,189 బాగుంది. చాలా బాగుంది. తను కూడా మోసగత్తెనే. 417 00:24:40,272 --> 00:24:42,774 ఇక్కడ ఉన్న అందరూ మోసం చేస్తున్నట్లుగానే. 418 00:24:42,858 --> 00:24:43,859 ఆగు. 419 00:24:44,443 --> 00:24:46,361 నన్ను క్షమించు, నేను కేవలం… నేను. 420 00:24:49,823 --> 00:24:51,783 నేను విన్నాను. 421 00:24:53,952 --> 00:24:55,037 సరే. 422 00:24:55,120 --> 00:25:00,876 నిన్ను బయటపెట్టాలనో లేక మరొకటో కాదు. నేను విన్నాను అని మాత్రమే చెబుతున్నాను. 423 00:25:00,959 --> 00:25:02,252 ఇది హద్దు మీరడమే అవుతుంది. 424 00:25:02,336 --> 00:25:04,463 నువ్వు ఇక్కడ బస చేస్తున్నావు. నేను కౌన్సెలర్ ని. 425 00:25:07,216 --> 00:25:08,383 కానీ, మనం ఇక్కడ ఉన్నాము. 426 00:25:09,468 --> 00:25:12,804 నేను మళ్లీ పాత అలవాటుకు వచ్చేశాను. అందుకు నేను విచారిస్తున్నాను. 427 00:25:13,555 --> 00:25:16,600 ఇది నా మొదటిసారి కాదు, నా చివరిసారి కూడా కాబోదు. 428 00:25:16,683 --> 00:25:18,185 నేను నీ గురించి దారుణంగా మాట్లాడటం 429 00:25:18,268 --> 00:25:19,728 -కారణం కాదు కదా… -ఓహ్, లేదు. లేదు. 430 00:25:19,811 --> 00:25:23,440 అది నీ మాటల వల్ల కాదు, స్వీటీ, అది కాదు. లేదు. నువ్వు అంత శక్తిమంతురాలివి కావు. 431 00:25:23,524 --> 00:25:25,484 నీకు నేను లక్షల సాకులు చెప్పవచ్చు. 432 00:25:26,610 --> 00:25:31,448 కానీ, నిజం ఏమిటంటే, నాకు ఇప్పటికీ నా రోగం తిరగతోడుతూ ఉంటుంది. 433 00:25:33,450 --> 00:25:35,327 సరేనా? కోలుకోవడం అనేది దీర్ఘకాల ప్రక్రియ. 434 00:25:38,956 --> 00:25:40,165 నీకు నిరాశగా ఉందా? 435 00:25:41,166 --> 00:25:42,251 లేదు, నేను… 436 00:25:45,629 --> 00:25:47,589 అవును, కొద్దిగా ఉంది. 437 00:25:48,215 --> 00:25:49,216 నాకు కూడా. 438 00:25:50,509 --> 00:25:51,760 కానీ రేపు అనేది మరొక రోజు. 439 00:25:53,762 --> 00:25:56,807 వెళ్లి నిద్దురపో, షీలా. సరేనా? 440 00:25:57,391 --> 00:25:58,392 శుభ రాత్రి. 441 00:26:10,988 --> 00:26:14,491 హేయ్. లాబీ లాంటి గదిలో నన్ను వేచి ఉండమని చెప్పారు. 442 00:26:14,575 --> 00:26:17,494 కానీ అక్కడ ఉన్న అందమైన మహిళతో మాట్లాడి నేను ఎవర్ని తీసుకువెళ్లడానికి వచ్చానో చెప్పాను, 443 00:26:17,578 --> 00:26:20,747 అప్పుడు ఆమె నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది. కాబట్టి… 444 00:26:20,831 --> 00:26:21,915 ఏది ఏమైనా, హాయ్. 445 00:26:22,833 --> 00:26:24,042 నువ్వు వచ్చావు. 446 00:26:24,126 --> 00:26:26,712 అవును, సరే, అది నా సహజ గుణం, పిలవగానే వచ్చేయడం. 447 00:26:26,795 --> 00:26:29,256 హైస్కూలులో నాకు అటెండెన్స్ అవార్డు కూడా వచ్చింది. 448 00:26:29,339 --> 00:26:30,674 చాలా మంచి విషయం. కాబట్టి… 449 00:26:30,757 --> 00:26:34,803 -నీకు ఆ బ్యాగులు మోయడానికి సాయం కావాలా? -లేదు. నేను మోయగలను. 450 00:26:36,513 --> 00:26:37,764 నన్ను క్షమించు. 451 00:26:38,432 --> 00:26:42,019 నువ్వు సరిగ్గానే చెప్పావు. అదే జరిగింది. నాకు సహాయం కావలసి వచ్చింది. 452 00:26:42,102 --> 00:26:43,979 నాకు సాయం అవసరమైంది. తీసుకున్నాను. ఇంకా అవసరం. 453 00:26:44,688 --> 00:26:45,689 అవును. 454 00:26:46,315 --> 00:26:48,400 ఆగు, మనం బ్యాగుల గురించి మాట్లాడుకోవడం లేదు, కదా? 455 00:26:48,483 --> 00:26:49,610 -లేదు. -లేదు. నాకు తెలుసు. 456 00:26:49,693 --> 00:26:52,154 ఈ మొత్తం మానసిక వ్యాధుల విషయం. అవును, ఊరికే అడుగుతున్నాను. అర్థమైంది. 457 00:26:52,237 --> 00:26:56,533 లేదు, నేను ఈ సూట్ కేస్ ని పట్టుకుంటాను, కానీ మిగతావి, నాకు తెలియదు. 458 00:26:57,242 --> 00:26:59,244 -మనం చూద్దాం. -అలాగే. అలాగే. 459 00:27:13,008 --> 00:27:15,010 నేను చేయగలనో లేదో ఖచ్చితంగా చెప్పలేను. 460 00:27:16,595 --> 00:27:18,639 ఆ ఎయిరోబిక్స్. ఆ వ్యాపారం. 461 00:27:18,722 --> 00:27:19,890 ఓహ్, అలా మాట్లాడకు. 462 00:27:21,975 --> 00:27:24,228 ఇప్పుడు అవన్నీ నాకు శక్తికి మించినవి అయిపోతాయి అనుకుంటా. 463 00:27:25,187 --> 00:27:26,188 సరే. 464 00:27:29,525 --> 00:27:32,194 నువ్వు ఎలా చెప్పగలవు? నువ్వు ఎలా వదిలేయగలవు? 465 00:27:32,861 --> 00:27:35,322 నేను ఏమిటో నేను తెలుసుకుంటున్న దశలో ఒక నిపుణురాలిగా అందరి ముందూ నిలబడి 466 00:27:35,405 --> 00:27:38,367 నేను ఏం చేయగలనో నాకు తెలియడం లేదు. 467 00:27:39,701 --> 00:27:41,411 నీకు అభిమానుల నుండి ఉత్తరాలు వచ్చాయి. 468 00:27:41,495 --> 00:27:43,121 స్టాల్/గ్రన్నర్ మనుషులు వీటిని నాకు పంపించారు 469 00:27:43,205 --> 00:27:45,082 ఎందుకంటే, మనం కలిసి వ్యాపారం చేస్తున్నామని అనుకున్నారు. 470 00:27:45,165 --> 00:27:46,792 మనం ఇప్పటికీ కలిసి పని చేస్తున్నామా? 471 00:27:46,875 --> 00:27:48,627 ఏమీ అనుకోకు. మనం చాలా మాట్లాడుకోవాలి. 472 00:27:48,710 --> 00:27:50,420 అది బాగుంది. నాకు ఉత్తరం వచ్చిందా? 473 00:27:51,421 --> 00:27:52,506 ఒకటి కంటే ఎక్కువ. 474 00:28:00,055 --> 00:28:02,724 డియర్ షీలా, ఈ వ్యాయామం టేపు అత్యుత్తమం. 475 00:28:02,808 --> 00:28:06,311 డియల్ షీలా, బాడీ బై షీలా నా జీవితాన్ని కాపాడింది. 476 00:28:06,395 --> 00:28:09,314 -నాకు నిజంగా తెలియలేదు నేను ఎక్కడ... -డియర్ షీలా, ధన్యవాదాలు. 477 00:28:09,398 --> 00:28:14,611 నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చినందుకు, నా ఆత్మవిశ్వాసాన్నీ, నా ఆరోగ్యాన్నీ తిరిగి ఇచ్చినందుకు ధన్యవాదాలు. 478 00:28:14,695 --> 00:28:17,489 నేను ఇటీవల ఆరోగ్యం దెబ్బతిని లేవలేని స్థితికి చేరుకున్నాను. 479 00:28:17,573 --> 00:28:18,782 నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే… 480 00:28:18,866 --> 00:28:21,618 కానీ, ఇది అసలైన నిజం కాబట్టి నువ్వు ఇంకా చేయాలి. 481 00:28:21,702 --> 00:28:23,412 నా జీవితాన్ని మార్చేశావు 482 00:29:52,501 --> 00:29:54,503 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్