1 00:00:27,320 --> 00:00:29,239 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:29,239 --> 00:00:31,408 బాధ మరో రోజుకు 3 00:00:31,408 --> 00:00:33,493 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:33,493 --> 00:00:35,412 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:35,412 --> 00:00:37,706 మీ బాధలను మర్చిపోండి 6 00:00:37,706 --> 00:00:39,749 డాన్సు మరో రోజుకు 7 00:00:39,749 --> 00:00:41,376 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:41,376 --> 00:00:42,419 - మేము గోబో. - మోకీ. 9 00:00:42,419 --> 00:00:43,336 - వెంబ్లీ. - బూబర్. 10 00:00:43,336 --> 00:00:44,254 రెడ్. 11 00:00:47,757 --> 00:00:48,800 జూనియర్! 12 00:00:49,301 --> 00:00:50,635 హలో! 13 00:00:52,178 --> 00:00:53,346 నా ముల్లంగి. 14 00:00:54,472 --> 00:00:56,016 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:56,516 --> 00:00:58,560 బాధ మరో రోజుకు 16 00:00:58,560 --> 00:01:00,228 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:01:00,729 --> 00:01:04,648 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:04,648 --> 00:01:06,192 ఇది ఫ్రాగుల్ రాక్ దగ్గర జరిగే కథ. 19 00:01:08,862 --> 00:01:09,863 గమనించండి! 20 00:01:10,947 --> 00:01:13,742 గమనించండి! 21 00:01:15,785 --> 00:01:18,872 అందరూ కాస్త వినండి. మీరు చేసే పనులు కాస్త ఆపి చెప్పేది వినండి. 22 00:01:20,457 --> 00:01:22,334 ఇక్కడి నుండి నువ్వు చెప్పేది వినొచ్చా? 23 00:01:22,334 --> 00:01:24,085 - వినొచ్చు, తప్పకుండా. - థాంక్స్. 24 00:01:24,085 --> 00:01:26,421 ఫ్రెండ్స్, ప్రతీ ఏడాది ఒకరోజు, 25 00:01:26,421 --> 00:01:29,299 నేను నాకున్న మితిమీరిన భయాన్ని పక్కన పెట్టి... 26 00:01:29,799 --> 00:01:31,801 మరీ పక్కకు కాదు అనుకోండి, ఎందుకంటే అది లేకపోతే నేను ఉండలేను, 27 00:01:31,801 --> 00:01:36,014 కానీ నా వంటల నైపుణ్యాన్ని మీ అందరికీ చూపించడానికి దానిని ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెడతా. 28 00:01:36,014 --> 00:01:38,975 - చాల్లే. ఆహ్-హాహ్. - నేను చేసే ప్రత్యేకమైన, ఒకే ఒక్క... 29 00:01:38,975 --> 00:01:40,268 రాడిష్ రాజల్! 30 00:01:41,394 --> 00:01:43,897 థాంక్స్, వెంబ్లీ. నేను కూడా అదే చెప్పబోతున్నాను. 31 00:01:43,897 --> 00:01:44,981 ఏం పర్లేదు, చెఫ్. 32 00:01:45,774 --> 00:01:47,567 అవును, మన రాడిష్ రాజల్. 33 00:01:47,567 --> 00:01:51,363 మీ భోజనంతోనే ప్రదర్శన చేస్తూ మీకు భోజనం వడ్డించే ఒకే ఒక్క భోజన కార్యక్రమం. 34 00:01:53,406 --> 00:01:57,118 సరే, ఇప్పుడు చివరిగా అలంకరణ చేయడానికి నాకు ఇంకొక రెండు ముల్లంగులు కావాలి అంతే. 35 00:01:59,829 --> 00:02:00,830 బొంగో! 36 00:02:00,830 --> 00:02:03,792 క్షమించాలి, ఇవి నా నోట్లోకి దూకేసాయి. 37 00:02:06,586 --> 00:02:08,212 ఇవాళే ఇలా జరగాలా. 38 00:02:08,212 --> 00:02:11,466 ఆహ్, పోనిలే. మళ్ళీ వెళ్లి కొన్ని ముల్లంగులు తెమ్మని మోకీని అడుగుతాను. 39 00:02:12,509 --> 00:02:13,593 హేయ్. అది ఏం చేస్తోంది... 40 00:02:13,593 --> 00:02:15,845 - హేయ్! దానిని నేను తినబోతున్నా! - నువ్వు అలా తినకూ... 41 00:02:16,429 --> 00:02:19,266 ఆ గాలి దుమారం రేగినప్పటి నుండి ఈ పక్షులు ఇక్కడే ఉన్నాయి. 42 00:02:19,266 --> 00:02:21,851 నేను ఇందాక నా నవ్వుల నడకకు వెళ్ళినప్పుడు ఒకదానిని చూశాను. 43 00:02:21,851 --> 00:02:24,354 - నవ్వుల నడకా? నవ్వుల నడక అంటే ఏంటి? - ఆహ్-హాహ్. 44 00:02:25,230 --> 00:02:26,231 అది చెప్పడం కాస్త కష్టం. 45 00:02:26,856 --> 00:02:29,526 మనం నడుస్తూ... నవ్వాలి అంతే. 46 00:02:30,819 --> 00:02:32,195 అంతకు మించి ఇంకేం లేదు. 47 00:02:32,195 --> 00:02:33,738 ముల్లంగుల కోసం మీకు నా సాయం 48 00:02:33,738 --> 00:02:35,156 - కావాలి అంట కదా. - ఓహ్, అవును. సరే. 49 00:02:35,156 --> 00:02:38,493 ఒక్క నిమిషం ఉండు, నేను వెంటనే గోర్గ్ ల తోటకు వెళ్లి వాటిని తీసుకొస్తాను. 50 00:02:42,455 --> 00:02:44,916 చూశావా? దానిని ముద్దుల రాగాల నడక అంటారు. 51 00:02:44,916 --> 00:02:47,627 - చాలా అధునాతనమైంది. - సరే. అలాగే. 52 00:02:55,677 --> 00:02:58,096 స్ప్రాకీ, నేను ఇంటికి వచ్చేశా! 53 00:02:58,096 --> 00:03:00,599 అలాగే ఒక ఫ్రెండ్ ని తీసుకొచ్చాను కూడా! 54 00:03:00,599 --> 00:03:02,142 నీకు డాక్ బాట్ గుర్తుంది కదా? 55 00:03:02,142 --> 00:03:06,104 హలో, స్పోర్క్లెట్. నువ్వు చాలా మంచి కుక్క పిల్లవి. 56 00:03:07,731 --> 00:03:09,816 నువ్వు చాలా మంచి కుక్కవి. 57 00:03:12,819 --> 00:03:15,238 భయపడకు, బాబు. దీనిని నిన్ను చూసుకోవడానికి తీసుకురాలేదు. 58 00:03:15,238 --> 00:03:17,490 నిన్ను ఇంకెప్పుడూ అంత బాధపడనివ్వను. 59 00:03:17,490 --> 00:03:19,451 నేను దీనిని రీప్రోగ్రామ్ చేయబోతున్నాను. 60 00:03:19,451 --> 00:03:21,202 డాక్ బాట్ నిద్రపోతోంది. 61 00:03:21,703 --> 00:03:24,247 నేను స్కూల్ లో చదువు చెప్తున్నా తెలుసు కదా? 62 00:03:24,247 --> 00:03:26,583 అంటే, నేను చాలా కూల్ అనుకో 63 00:03:26,583 --> 00:03:29,461 కానీ పిల్లలకు నా పాఠాలు బాగా నచ్చడానికి నాకు సాయంగా ఏమైనా ఉంటే బాగుండు అనుకున్నా. 64 00:03:29,461 --> 00:03:30,879 అలాగే పిల్లలకు రోబోట్ లు బాగా నచ్చుతాయి కదా? 65 00:03:31,922 --> 00:03:34,841 డాక్ బాట్ నాతో పాటు కో-టీచర్ లాగ ఉంటుంది. నా చీర్ బాట్ అన్నమాట. 66 00:03:34,841 --> 00:03:39,179 నేను దీనితో, "మంచి పాయింట్, డాక్, గాలి శక్తి భలే గొప్పది" అనే డైలాగులు చెప్పిస్తాను. 67 00:03:39,179 --> 00:03:42,557 "హేయ్, నీ అందమైన డ్రెస్ ఎక్కడ కొన్నావు?" 68 00:03:43,558 --> 00:03:44,935 భలే ఉంది, కదా? 69 00:03:45,435 --> 00:03:47,062 నీ నిశ్శబ్దాన్ని అంగీకారంగా భావిస్తున్నా. 70 00:03:48,146 --> 00:03:50,774 ఇప్పుడు దీనిని మొత్తం విప్పేసి మళ్ళీ మొదటి నుండి నిర్మించాలి. 71 00:03:50,774 --> 00:03:54,986 అంతేకాక, అందమైన మంచి స్వరంతో అలాగే సులభంగా స్వరాన్ని ప్లే చేసేలా రీప్రోగ్రామ్ చేయాలి. 72 00:03:54,986 --> 00:03:56,112 నాకు సాయం చేస్తావా? 73 00:03:56,863 --> 00:03:59,449 సరే, బాబు. నీ ఇష్టం. 74 00:04:03,787 --> 00:04:04,996 జూనియర్! 75 00:04:05,830 --> 00:04:09,751 ఈ ఎర్రని వాటిని పీకేయమని నీకు చెప్పాను కదా. 76 00:04:09,751 --> 00:04:11,878 పీకేశాను, నాన్నా, కానీ అవి మళ్ళీ పెరిగాయి. 77 00:04:12,379 --> 00:04:16,257 - ఏం కంగారు పడకు, మళ్ళీ పీకుతాను. - నువ్వు భలే మంచి కొడుకువి. 78 00:04:16,257 --> 00:04:17,800 భలే అందగాడివి. 79 00:04:17,800 --> 00:04:23,014 నీకు ఏమైనా సహాయం కావాలంటే, నేను లోపల స్టైల్ గా ఉండే కిరీటాలు ట్రై చేస్తుంటా. సరే. 80 00:04:23,014 --> 00:04:26,685 వీడుకోలు, ఎర్రని పండ్లలారా. బై-బై. 81 00:04:26,685 --> 00:04:28,687 - హాయ్, జూనియర్! - మోకీ! 82 00:04:28,687 --> 00:04:30,939 ఏంటి? అక్కడ ఎలాంటి సమస్యా లేదు కదా, బాబు? 83 00:04:30,939 --> 00:04:33,650 నేను... లేదు. అంతా బానే ఉంది, నాన్నా. 84 00:04:33,650 --> 00:04:34,901 సారి. 85 00:04:34,901 --> 00:04:39,406 ఒక కొత్త విషయం. మనం స్నేహతులమే, కానీ ఆ విషయం మా నాన్నకు తెలీకూడదు. 86 00:04:40,073 --> 00:04:41,241 క్లిష్టమైన సమస్యే. 87 00:04:41,241 --> 00:04:44,661 ఏం పర్లేదు. నేను నా ముల్లంగులు తీసుకున్నాను, ఇక వెళ్తాను. 88 00:04:46,746 --> 00:04:49,165 ఇక్కడ స్ట్రాబెర్రీలు పెరుగుతున్నాయి అని నాకు తెలీదు. 89 00:04:49,165 --> 00:04:51,543 - ఆహ్-హాహ్. - నేను మొదటిసారి స్ట్రాబెర్రీ తిన్నప్పుడు, 90 00:04:51,543 --> 00:04:54,546 "అమ్మ బాబోయ్ ఎంత తియ్యగా ఉందో!" అనుకున్నాను. 91 00:04:55,130 --> 00:04:57,507 అవును, కానీ మా నాన్న వాటిని తీసేయమంటున్నారు. 92 00:04:58,884 --> 00:04:59,718 హేయ్! 93 00:04:59,718 --> 00:05:02,304 వీటిని నువ్వు తీసుకెళ్లి మీ ఫ్రాగుల్స్ కి ఇవ్వొచ్చు కూడా? 94 00:05:02,304 --> 00:05:04,556 నిజంగా? థాంక్స్. 95 00:05:05,140 --> 00:05:06,141 సరే. 96 00:05:06,850 --> 00:05:09,311 వీటిని మోసుకెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది, కానీ థాంక్స్. 97 00:05:09,311 --> 00:05:10,395 ఆహ్-హాహ్. 98 00:05:11,980 --> 00:05:14,482 బై, బై, ఎర్రని పండ్లలారా. 99 00:05:17,319 --> 00:05:18,320 హేయ్, రెడ్! 100 00:05:18,320 --> 00:05:20,906 రాడిష్ రాజల్ చూడటానికి నువ్వు భలే మంచి ప్రదేశాన్ని ఎంచుకున్నావు. 101 00:05:20,906 --> 00:05:22,532 సరేలే, నాకు నా గురించి తెలుసు కదా. 102 00:05:22,532 --> 00:05:26,912 బూబర్ తన రాడిష్ సూప్ ని పైకి విసిరినప్పుడు, అది పడే ప్రదేశంలో నేను ఖచ్చితంగా ఉండాలి. 103 00:05:26,912 --> 00:05:27,996 ఓహ్, అవును. 104 00:05:28,496 --> 00:05:31,249 హేయ్, నీ పాంచో భలే ఉంది. నాకు పాంచోలు అంటే ఇష్టం. 105 00:05:31,249 --> 00:05:32,792 నాకు కూడా ఒక పాంచో ఉంటే బాగుండు. 106 00:05:32,792 --> 00:05:35,795 - అయ్యో, కానీ నీకు ఒక చెడ్డ వార్త చెప్పాలి, మిత్రమా. - సరే. 107 00:05:35,795 --> 00:05:37,339 ఇకపై నువ్వు అలా బాధపడటానికి కుదరదు 108 00:05:37,339 --> 00:05:39,299 ఎందుకంటే నీకోసం ఒకటి తెచ్చాను! 109 00:05:40,467 --> 00:05:43,929 పాంచో, పాంచో, పాంచో, పాంచో, పాంచో! 110 00:05:45,764 --> 00:05:48,892 సరే. ముందుగా, అందరికీ బాగా నచ్చేది, 111 00:05:48,892 --> 00:05:51,144 ముల్లంగి వాల్కేనో. 112 00:05:51,144 --> 00:05:54,856 - కానీ ఇది చేయాలంటే... - ముల్లంగులతో మోకీ వెనక్కి రావాలి కదా? 113 00:05:54,856 --> 00:05:56,858 అన్నీ తెచ్చాసాను. 114 00:05:57,442 --> 00:05:59,069 అలాగే నేను కేవలం ముల్లంగులు మాత్రమే తేలేదు. 115 00:05:59,069 --> 00:06:02,530 గోర్గ్ ల తోటలో స్ట్రాబెర్రీలు కూడా పెరుగుతున్నాయి అని మీకు తెలుసా? 116 00:06:02,530 --> 00:06:04,658 అవతలికి పో! దయచేసి వెళ్ళిపోకు. 117 00:06:04,658 --> 00:06:05,742 నేను ఆ ఉద్దేశంతో అలా అనలేదు. 118 00:06:05,742 --> 00:06:07,827 ఆశ్చర్యంతో అలా అన్నాను. 119 00:06:07,827 --> 00:06:10,705 థాంక్స్, మోక్. కానీ నాకు స్ట్రాబెర్రీలతో పని లేదు. 120 00:06:10,705 --> 00:06:13,416 ఇవాళ అంతా రాడిష్ రాజల్ మీదే నా దృష్టి. 121 00:06:13,416 --> 00:06:15,544 ఆ విషయం నువ్వు నాకు మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు. 122 00:06:15,544 --> 00:06:17,003 అదరగొట్టు, బూబర్! 123 00:06:19,714 --> 00:06:21,258 సిద్ధమా, చెఫ్? 124 00:06:21,758 --> 00:06:23,260 ఇక పని కానిద్దాం! 125 00:06:27,764 --> 00:06:31,977 చెఫ్ బూబర్ తో ముల్లంగి వంటకు మీరు సిద్ధంగా ఉన్నారా? 126 00:06:46,700 --> 00:06:48,785 ఇదే ముల్లంగి వాల్కేనో! 127 00:06:52,205 --> 00:06:53,999 వావ్! స్ట్రాబెర్రీలు. 128 00:06:53,999 --> 00:06:55,917 అవి చాలా ఉన్నాయి! 129 00:06:55,917 --> 00:06:57,127 ఇవి భలే ఉన్నాయి. 130 00:06:57,836 --> 00:06:59,671 - చాలా రసంతో ఉన్నాయి! - అవును. 131 00:06:59,671 --> 00:07:00,922 ఏమండీ! 132 00:07:00,922 --> 00:07:03,592 ఇక్కడ నేను ఒక షో నడుపుతున్నాను. 133 00:07:04,467 --> 00:07:07,220 కాస్త దృష్టి ఇక్కడ పెడితే బాగుంటుంది! 134 00:07:07,220 --> 00:07:09,848 - నిజమే! భలే రుచిగా ఉన్నాయి. - అవును. 135 00:07:10,599 --> 00:07:11,766 వదిలేయండి. 136 00:07:14,269 --> 00:07:17,272 స్ట్రాబెర్రీ కాదు, పిచ్చి బెర్రీ. 137 00:07:18,023 --> 00:07:20,025 అసలు మనకు వాటి గురించి ఏం తెలుసు? 138 00:07:20,942 --> 00:07:22,736 వాటి వల్ల సమస్యలు రావచ్చు. 139 00:07:31,870 --> 00:07:33,330 భలే ఆసక్తిగా ఉంది. 140 00:07:33,330 --> 00:07:38,084 ఈ స్ట్రాబెర్రీ అని పిలవబడేది మనం భవనాలు నిర్మించడానికి చక్కగా సరిపోతుంది. 141 00:07:38,084 --> 00:07:39,961 దీనిని ప్రొడక్షన్ వారికి పంపండి. 142 00:07:39,961 --> 00:07:42,589 ఏమీ అనుకోకండి, ఆర్కిటెక్ట్, కానీ నేనైతే ఆ పని చేయను. 143 00:07:42,589 --> 00:07:45,175 మనం పెద్ద తప్పు చేస్తుండవచ్చు. 144 00:07:46,009 --> 00:07:47,552 అరెరే, పెద్ద సమస్య వచ్చిపడిందే. 145 00:07:47,552 --> 00:07:51,640 ఈ బెర్రీలతో భవనాలు నిర్మిస్తామేమో అని నేను చాలా ఉత్సాహపడ్డా, కానీ నువ్వు దీనికి వ్యతిరేకంగా ఉన్నావు. 146 00:07:51,640 --> 00:07:52,807 ఇప్పుడు మనం ఏం చేయాలి? 147 00:07:53,308 --> 00:07:56,519 మనం పరిస్థితిని పరీక్షించి అడుగులు వేస్తే ఎలా ఉంటుంది? 148 00:07:57,687 --> 00:08:00,232 మెజర్ డూజర్. 149 00:08:01,066 --> 00:08:02,067 అమ్మో! 150 00:08:02,067 --> 00:08:05,820 నేనైతే, మనం ఈ స్ట్రాబెర్రీల విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి ముందు, 151 00:08:05,820 --> 00:08:08,531 వీటిని రీసెర్చ్ ఇంకా డెవెలప్మెంట్ వారికి పంపుదాం. 152 00:08:08,531 --> 00:08:09,991 మాకు ఇష్టమే. 153 00:08:09,991 --> 00:08:11,993 హేయ్, నా పేరు రీసెర్చ్. 154 00:08:11,993 --> 00:08:14,079 డెవెలప్మెంట్. మీతో కలిసి ఈ పనిచేయడం సంతోషం. 155 00:08:14,079 --> 00:08:15,914 వీళ్ళను చూస్తుంటే బాగా తెలివైన వారిలా ఉన్నారు. 156 00:08:19,876 --> 00:08:21,211 హేయ్, ఇక్కడ ఉన్నావా! 157 00:08:21,211 --> 00:08:22,629 మేము నీ గురించే ఆలోచిస్తున్నాం. 158 00:08:22,629 --> 00:08:24,589 గోబో అయితే నిన్ను ఉత్సాహపరచడానికి తన అంకుల్ పంపిన 159 00:08:24,589 --> 00:08:26,383 కొత్త కళాకండాన్ని తేవడానికి వెళ్ళాడు కూడా. 160 00:08:26,383 --> 00:08:29,427 ఏమో, వెం. ఏం చేసినా నాకు ఇక ఉత్సాహం వచ్చేలా లేదు. 161 00:08:29,427 --> 00:08:30,637 ఏంటి? 162 00:08:30,637 --> 00:08:32,429 - సరే. - అలాగే. 163 00:08:32,429 --> 00:08:35,517 స్ట్రాబెర్రీ కాదు, పిచ్చి బెర్రీ. 164 00:08:35,517 --> 00:08:38,979 అసలు మనకు వాటి గురించి ఏం తెలుసు? వాటి వల్ల సమస్యలు రావచ్చు. 165 00:08:40,063 --> 00:08:42,524 హేయ్. అది నా మాట. 166 00:08:42,524 --> 00:08:44,192 అసలు మనకు వాటి గురించి ఏం తెలుసు? 167 00:08:44,192 --> 00:08:46,152 వాటి వల్ల సమస్యలు రావచ్చు. 168 00:08:46,152 --> 00:08:48,113 ఆగు. ఇక్కడ ఏం జరుగుతోంది? 169 00:08:48,822 --> 00:08:52,284 అసలు మనకు వాటి గురించి ఏం తెలుసు? వాటి వల్ల సమస్యలు రావచ్చు. 170 00:08:53,660 --> 00:08:56,121 ఏంటి? నువ్వు విన్న ప్రతీది మళ్ళీ పలుకుతావా? 171 00:08:56,121 --> 00:08:58,456 అంటే, నువ్వేమైనా రిపీటీ పక్షివా? 172 00:09:02,544 --> 00:09:05,672 స్ట్రాబెర్రీలు ఫ్రాగుల్స్ కి మంచివి కాదు. 173 00:09:06,381 --> 00:09:09,509 స్ట్రాబెర్రీలు ఫ్రాగుల్స్ కి మంచివి కాదు. 174 00:09:10,760 --> 00:09:16,516 స్ట్రాబెర్రీలు ఫ్రాగుల్స్ కి మంచివి కాదు. 175 00:09:17,017 --> 00:09:19,311 ఆ మాట ఒక పక్షి అన్నది, నాకు పక్షుల మాటలంటే చాలా నమ్మకం. 176 00:09:19,311 --> 00:09:20,228 నువ్వు అన్నది నిజమే. 177 00:09:20,228 --> 00:09:22,397 నేను ఇక స్ట్రాబెర్రీలు తినను! 178 00:09:22,397 --> 00:09:24,983 బూబర్ ఇంకా తన రాడిష్ రాజల్ చేస్తుంటే బాగుండు. 179 00:09:24,983 --> 00:09:26,443 అక్కడికే వెళదాం పద. 180 00:09:27,986 --> 00:09:31,740 అవును. అక్కడికే వెళదాం రండి. 181 00:09:37,329 --> 00:09:38,663 చాలా గంటలు అవుతుంది, స్ప్రాకీ, 182 00:09:38,663 --> 00:09:40,957 కానీ డాక్ బాట్ ఏం రికార్డు చేయడం లేదు. 183 00:09:40,957 --> 00:09:43,126 అసలు నేను ఎందుకని ఈ పని చేయాలనుకున్నాను? 184 00:09:43,627 --> 00:09:45,337 సరే. ఇంకొకసారి ట్రై చేద్దాం. 185 00:09:45,337 --> 00:09:48,298 నేను మారుతున్న గాలి తరంగాల గురించి నా లైన్ చెప్పిన తర్వాత 186 00:09:48,298 --> 00:09:53,345 డాక్ బాట్ ఇలా అనాలి, "మంచి పాయింట్, డాక్. నాకైతే మతి పోయింది." 187 00:09:56,681 --> 00:09:57,891 ఏం రికార్డు కాలేదు. 188 00:09:57,891 --> 00:10:00,060 నీకు ఎందుకు ఇది రావడం లేదు? 189 00:10:00,560 --> 00:10:03,605 ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు. బుద్ధి తెచ్చుకో. 190 00:10:05,482 --> 00:10:09,277 కనీసం నేను ఒక విషయమైనా బాగా చేయగలను. స్ట్రాబెర్రీలు తినడం. 191 00:10:10,070 --> 00:10:12,239 అంటే ఈ వెర్రి జీవులు కూడా స్ట్రాబెర్రీలు తింటాయా, ఆహ్? 192 00:10:19,371 --> 00:10:22,207 చింతించకు, స్ప్రాకీ. నీకోసం ఒక స్ట్రాబెర్రీ ఉంచుతాను. 193 00:10:23,583 --> 00:10:24,834 ఇంకొకసారి ఇస్తానులే. 194 00:10:24,834 --> 00:10:26,169 అన్నీ నేనే తినేసా. 195 00:10:30,674 --> 00:10:33,802 వావ్. హేయ్, బూబర్, నీ రాజల్ నిజంగా అదిరిపోతోంది. 196 00:10:34,761 --> 00:10:36,429 ఫ్రాగుల్స్ అందరికీ ఇది నచ్చినట్టు ఉంది. 197 00:10:36,429 --> 00:10:38,223 అంతా బాగానే సాగుతున్నట్టు ఉంది. 198 00:10:38,223 --> 00:10:40,475 అంటే, ఇకపై స్ట్రాబెర్రీల కారణంగా ఎవరూ నిన్ను పట్టించుకోకుండా ఉండరు. 199 00:10:40,475 --> 00:10:42,811 వెర్రి జీవులు కూడా వాటిని తింటారని నీకు తెలుసా? 200 00:10:43,395 --> 00:10:45,230 వెర్రి జీవులు స్ట్రాబెర్రీలు తింటారా? 201 00:10:45,230 --> 00:10:47,566 ఇప్పుడు నాకు కూడా అవి తినాలని ఉంది. 202 00:10:47,566 --> 00:10:50,777 - నిజమే. వెళ్లి తిందాం పదండి. - అవును. 203 00:10:51,611 --> 00:10:53,780 అది భలే ఆసక్తికరమైన విషయం, గోబో. 204 00:10:54,781 --> 00:10:56,533 ఒకసారి తప్పుకోండి. 205 00:10:59,578 --> 00:11:03,790 స్ట్రాబెర్రీలు ఔటర్ స్పేస్ కి చెందినవి. వాటిని మనం ఎలా నమ్మగలం? 206 00:11:03,790 --> 00:11:08,295 స్ట్రాబెర్రీలు ఔటర్ స్పేస్ కి చెందినవి. వాటిని మనం ఎలా నమ్మగలం? 207 00:11:08,795 --> 00:11:09,796 అద్భుతం. 208 00:11:10,839 --> 00:11:15,468 స్ట్రాబెర్రీలు ఔటర్ స్పేస్ కి చెందినవి. వాటిని మనం ఎలా నమ్మగలం? 209 00:11:16,469 --> 00:11:18,930 స్ట్రాబెర్రీలు ఔటర్ స్పేస్ కి చెందినవి. 210 00:11:18,930 --> 00:11:20,807 వాటిని మనం ఎలా నమ్మగలం? 211 00:11:21,600 --> 00:11:23,852 ఏంటి? మనం వాటిని తప్పకుండా నమ్మొచ్చు. 212 00:11:23,852 --> 00:11:25,604 వాటిని కనిపెట్టింది మా అంకుల్, 213 00:11:25,604 --> 00:11:29,524 అలాగే స్ట్రాబెర్రీలకు మంచి రంగు, అంతకంటే మంచి రుచి ఉంటుంది. అవి నాకు చాలా ఇష్టం. 214 00:11:29,524 --> 00:11:33,987 స్ట్రాబెర్రీలకు మంచి రంగు, అంతకంటే మంచి రుచి ఉంటుంది. అవి నాకు చాలా ఇష్టం. 215 00:11:34,529 --> 00:11:35,947 ఆ పక్షి నేను చెప్పిందే చెపుతుందా? 216 00:11:36,573 --> 00:11:38,491 నాకు అదే అనిపిస్తోంది. 217 00:11:38,491 --> 00:11:40,952 స్ట్రాబెర్రీలకు మంచి రంగు, అంతకంటే మంచి రుచి ఉంటుంది. 218 00:11:40,952 --> 00:11:42,704 - అవి నాకు చాలా ఇష్టం. - కదలండి! 219 00:11:42,704 --> 00:11:44,372 స్ట్రాబెర్రీలు ఔటర్ స్పేస్ కి చెందినవి. 220 00:11:44,372 --> 00:11:46,791 స్ట్రాబెర్రీలకు మంచి రంగు, అంతకంటే... 221 00:11:57,093 --> 00:12:00,180 స్ట్రాబెర్రీ-బిల్డింగ్ టెస్టులకు సిద్ధంగా ఉన్నారా? 222 00:12:00,180 --> 00:12:02,182 రీసెర్చ్ ని మొదలెట్టండి. 223 00:12:02,182 --> 00:12:04,559 - అలాగే డెవెలప్మెంట్ కూడా. - సరే. 224 00:12:04,559 --> 00:12:07,729 స్ట్రాబెర్రీ ఒత్తిడి టెస్టు మొదలవుతోంది, మూడు, రెండు... 225 00:12:08,980 --> 00:12:11,024 నా సూట్ మీద అది పడింది. 226 00:12:11,024 --> 00:12:11,942 ఊరుకో. 227 00:12:11,942 --> 00:12:14,903 ఇది స్ప్లాష్ సూట్. దీనిని వేసుకునేదే అందుకు. 228 00:12:14,903 --> 00:12:16,321 ఇక కానివ్వండి. 229 00:12:18,615 --> 00:12:19,741 - ఇది మరీ ఎక్కువ! - ఓహ్, అబ్బా! 230 00:12:19,741 --> 00:12:22,202 - ఓహ్, అబ్బా. - స్ట్రాబెర్రీలు ఒత్తిడికి నిలబడలేవు! 231 00:12:22,702 --> 00:12:24,579 - అర్థమైంది. - అర్థమైంది. 232 00:12:25,705 --> 00:12:27,624 కాకపోత మంచి రుచికరమైనవి కూడా! 233 00:12:29,334 --> 00:12:31,002 - అర్థమైంది. - అర్థమైంది. 234 00:12:31,836 --> 00:12:32,921 అది తెలుసుకోవడం సంతోషం. 235 00:12:35,590 --> 00:12:42,097 రాడిష్లకు సాటి లేదు, మీ స్ట్రాబెర్రీ సన్నాసులకు బుర్ర లేదు! 236 00:12:42,097 --> 00:12:48,478 స్ట్రాబెర్రీలకు మించింది లేదు. రాడిష్ కంటే దారుణం లేదు! 237 00:12:48,478 --> 00:12:52,190 మిత్రులారా, కొట్లాడుకోకూడదు, కలిసి ఉండాలి. 238 00:12:52,899 --> 00:12:53,858 ఇప్పుడు అంతా సరైపోతుందిలే. 239 00:12:53,858 --> 00:12:55,277 మంచి పని, మోకీ. 240 00:12:56,152 --> 00:12:59,072 ఎప్పటికీ స్ట్రాబెర్రీలే గొప్ప! 241 00:13:01,366 --> 00:13:04,744 క్షమించండి, కానీ స్ట్రాబెర్రీలు కూడా నాలాగే ఎర్రగా ఉంటాయి. 242 00:13:05,245 --> 00:13:06,705 ముల్లంగులు కూడా. 243 00:13:06,705 --> 00:13:10,083 - అవును. - అవును, కానీ స్ట్రాబెర్రీలు ఇంకా ఎర్రగా ఉంటాయి! 244 00:13:10,083 --> 00:13:13,420 స్ట్రాబెర్రీలు! 245 00:13:13,420 --> 00:13:15,005 ముల్లంగులు! 246 00:13:15,005 --> 00:13:16,631 స్ట్రాబెర్రీలు 247 00:13:16,631 --> 00:13:19,134 - అవి భలే మృదువుగా ఇంకా తియ్యగా ఉంటాయి - చాలా తియ్యగా ఉంటాయి 248 00:13:19,134 --> 00:13:21,553 ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అది మాత్రమే తినాలని అనిపిస్తుంది 249 00:13:21,553 --> 00:13:23,305 - అవే స్ట్రాబెర్రీలు - స్ట్రాబెర్రీలు 250 00:13:23,305 --> 00:13:24,723 అవి మీరు అనుకునేకన్నా చాలా బెటర్ 251 00:13:24,723 --> 00:13:27,767 అవన్నీ మురికిగా ఉండవు, వింతైన పింక్ రంగులో ఉండవు 252 00:13:28,351 --> 00:13:29,686 ముల్లంగులు 253 00:13:29,686 --> 00:13:31,938 - మాకు మొదటి నుండి అవి మాత్రమే తెలుసు - అవి మాత్రమే తెలుసు 254 00:13:31,938 --> 00:13:33,940 అవి ఎంతో రుచుగా ఉంటాయి అవి పెరిగే విధానమే అంత 255 00:13:33,940 --> 00:13:35,108 అదేం వింత విషయం కాదు 256 00:13:35,108 --> 00:13:37,402 ముల్లంగులు అవి మీరు అనుకునేకన్నా చాలా బెటర్ 257 00:13:37,402 --> 00:13:40,697 వాటి మీద ఛండాలంగా ఆ చిన్న చిన్న విత్తనాలు ఉండవు 258 00:13:40,697 --> 00:13:42,532 కానీ స్ట్రాబెర్రీ విషయానికి వస్తే 259 00:13:42,532 --> 00:13:46,703 - స్ట్రాబెర్రీలు చాలా రుచిగా ఉంటాయి - స్ట్రాబెర్రీలు రుచిగా ఉంటాయి 260 00:13:46,703 --> 00:13:48,914 కానీ ముల్లంగి విషయానికి వస్తే 261 00:13:48,914 --> 00:13:52,542 - ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది - ఆరోగ్యానికి చాలా మంచిది 262 00:13:53,627 --> 00:13:57,714 - స్ట్రాబెర్రీలు - ముల్లంగులు 263 00:13:57,714 --> 00:14:00,050 అవి మీరు అనుకునేదానికన్నా బాగుంటాయి 264 00:14:00,050 --> 00:14:01,760 - ముల్లంగులు - స్ట్రాబెర్రీలు 265 00:14:01,760 --> 00:14:02,677 ముల్లంగులు 266 00:14:02,677 --> 00:14:06,431 నేను నా జీవితంలో ఇంకెప్పటికీ వాటిని తిననే తినను నేను ఎప్పటికీ తినేది కేవలం 267 00:14:06,431 --> 00:14:11,228 - స్ట్రాబెర్రీలు - ముల్లంగులు 268 00:14:11,228 --> 00:14:13,772 ముల్లంగులతో పోల్చితే అవి దేనికీ సరిపోవు 269 00:14:13,772 --> 00:14:15,482 - స్ట్రాబెర్రీలు - ముల్లంగులు 270 00:14:15,482 --> 00:14:19,486 నేను నా జీవితంలో ఇంకెప్పటికీ వాటిని తిననే తినను నేను ఎప్పటికీ తినేది కేవలం 271 00:14:19,486 --> 00:14:23,073 - స్ట్రా... - కాదు, ఒక్క నిమిషం ఆగు! 272 00:14:23,823 --> 00:14:27,702 అందరూ కాస్త నెమ్మదించండి కాస్త శాంతించి ఇలా దగ్గరకు రండి 273 00:14:27,702 --> 00:14:29,829 స్ట్రాబెర్రీలు అలాగే ముల్లంగులు 274 00:14:29,829 --> 00:14:33,416 రెండిటికీ వాటి వాటి మంచి గుణాలు ఉన్నాయి 275 00:14:33,416 --> 00:14:36,795 అలాగే చెడ్డ గుణాలు కూడా ఉన్నాయి కానీ అవి రెండూ సాండ్విచ్ లలో బాగుంటాయి 276 00:14:36,795 --> 00:14:42,884 కాబట్టి అభిప్రాయాలు ఒక్కటి కానంత మాత్రాన మీరు కొట్లాడుకోవాల్సిన పనిలేదు 277 00:14:43,593 --> 00:14:46,555 అది చాలా మంచి పాయింట్, కానీ నేను దానిని పట్టించుకోను. 278 00:14:46,555 --> 00:14:51,184 - స్ట్రాబెర్రీలు - ముల్లంగులు 279 00:14:51,184 --> 00:14:53,728 - అవి మీ వాటికన్నా చాలా బాగుంటాయి - ముల్లంగులు 280 00:14:53,728 --> 00:14:55,272 - స్ట్రాబెర్రీలు - ముల్లంగులు 281 00:14:55,272 --> 00:14:59,276 నేను నా జీవితంలో ఇంకెప్పటికీ వాటిని తిననే తినను నేను ఎప్పటికీ తినేది కేవలం 282 00:14:59,276 --> 00:15:03,196 - ముల్లంగులు - స్ట్రాబెర్రీలు 283 00:15:03,196 --> 00:15:07,826 స్ట్రాబెర్రీలు! స్ట్రాబెర్రీలు! స్ట్రాబెర్రీలు! 284 00:15:08,410 --> 00:15:10,870 ఓహ్, లేదు. లేదు! 285 00:15:11,871 --> 00:15:14,416 ఎప్పటికీ ముల్లంగులే గొప్ప. ముల్లంగులు, ముల్లంగులు, ముల్లంగులు! 286 00:15:15,125 --> 00:15:16,668 నేను ఎంత పని చేశాను? 287 00:15:19,880 --> 00:15:21,214 ఓహ్, అయ్యో. 288 00:15:24,301 --> 00:15:28,263 చివరికి, కాస్త నిశ్శబ్దంగా ఇంకా ప్రశాంతంగా ఉంది. 289 00:15:28,263 --> 00:15:30,432 వస్తున్నాను తప్పుకోండి. 290 00:15:33,476 --> 00:15:36,855 ఆ రిపీటీ పక్షులు అందరికీ తలనోప్పి తెప్పిస్తున్నాయి. 291 00:15:36,855 --> 00:15:40,400 రెడ్. ఈ దాగుకునే కన్నంలో ఒక్కరికి మాత్రమే చోటు ఉంది. 292 00:15:40,400 --> 00:15:42,611 ఓహ్, పోనిలే, మనం ఇద్దరమే కదా. 293 00:15:43,153 --> 00:15:44,487 తప్పుకోండి. 294 00:15:44,487 --> 00:15:46,823 - నేను కాస్త ప్రశాంతత కోసం వచ్చాను. - అలాగే నిశ్శబ్దం కోసం. 295 00:15:46,823 --> 00:15:47,991 ఓహ్, అబ్బా. 296 00:15:48,909 --> 00:15:52,662 - అందరూ ఇక్కడే ఉన్నారు. భలే ఉంది. - నాకు నచ్చలేదు. 297 00:15:52,662 --> 00:15:54,456 ఇక్కడ చాలా బిగుతుగా ఉంది. 298 00:15:54,998 --> 00:15:57,167 - ఇక్కడికి వెం ఒక్కడే రాలేదు... - హాయ్. 299 00:15:57,667 --> 00:16:01,463 నిజానికి అందరికంటే ముందు నేనే వచ్చాను. ఏం మాట్లాడలేదు అంతే. అవును. 300 00:16:02,672 --> 00:16:04,925 అంతా చాలా అయోమయంగా ఉంది. 301 00:16:04,925 --> 00:16:06,259 పరిస్థితి ఇలా ఎలా దిగజారింది? 302 00:16:06,259 --> 00:16:08,178 అవును. ఇదంతా అసలు ఎలా మొదలైంది? 303 00:16:10,096 --> 00:16:11,431 ఇది నా పనే. నా వల్లే ఇలా అయింది. 304 00:16:12,766 --> 00:16:14,559 ఒకేసారి అలా శ్వాస తీసుకోకండి. 305 00:16:14,559 --> 00:16:16,519 ఇక్కడ అంత గాలి కూడా లేదు. 306 00:16:19,981 --> 00:16:21,858 నువ్వే చూస్తావు కదా, కాటర్పిన్. 307 00:16:21,858 --> 00:16:27,447 రీవైండ్ ఇంకా డెవెలపే స్ట్రాబెర్రీలతో నిర్మించడం గురించి మంచి వార్త చెబుతారు. 308 00:16:28,281 --> 00:16:31,034 అది రీసెర్చ్ ఇంకా డెవెలప్మెంట్, సర్. 309 00:16:31,534 --> 00:16:33,703 వాళ్ళు తమ పేర్లను చాలా సార్లు చెప్పారు. 310 00:16:33,703 --> 00:16:34,788 అవును. 311 00:16:34,788 --> 00:16:38,250 వాళ్ళు ఖచ్చితంగా స్ట్రాబెర్రీలు మనకు మంచివి కాదు అని చెప్తారు చూడండి. 312 00:16:39,417 --> 00:16:43,171 నేను చివరి స్ట్రాబెర్రీ రిపోర్టు తీసుకొచ్చాను. 313 00:16:47,050 --> 00:16:48,260 నువ్వు దానిని చదువుతావా లేక... 314 00:16:48,260 --> 00:16:49,678 - సరే. - అలాగే. 315 00:16:49,678 --> 00:16:52,389 సరే, మా రీసెర్చ్... 316 00:16:52,389 --> 00:16:54,599 - అలాగే డెవెలప్మెంట్ కూడా. - అవును, అదే. 317 00:16:54,599 --> 00:16:57,769 వాళ్ళ లెక్క ప్రకారం స్ట్రాబెర్రీలు... 318 00:16:58,353 --> 00:16:59,271 ఏంటి? 319 00:16:59,271 --> 00:17:01,815 ...పర్లేదు. అవి పర్లేదు అంట. 320 00:17:01,815 --> 00:17:04,025 ఏంటి? అంటే ఏంటి అర్థం? 321 00:17:04,025 --> 00:17:07,487 అంటే, వాటితో నిర్మాణాలు చేయడానికి కుదరదు, 322 00:17:07,487 --> 00:17:09,863 కానీ అవి హానికరం కూడా కాదు. 323 00:17:09,863 --> 00:17:12,074 చెప్పాలంటే, అవి చాలా రుచికరమైనవి. 324 00:17:12,074 --> 00:17:15,370 అంతేకాక వాటి పై భాగంతో మంచి టోపీలు చేసుకోవచ్చు. 325 00:17:16,036 --> 00:17:17,581 భలే సరదాగా ఉంది, కదా? 326 00:17:18,707 --> 00:17:22,002 అంటే మనం ఇద్దరం తప్పుబడ్డామా? 327 00:17:22,002 --> 00:17:23,378 అలాగే ఇద్దరం సరిగ్గానే చెప్పాము! 328 00:17:23,378 --> 00:17:27,048 కాటర్పిన్, నీ జాగ్రత్త మనం పెద్ద తప్పు చేయకుండా ఆపింది. 329 00:17:27,048 --> 00:17:31,303 అలాగే మీ ఉత్సాహం వల్ల నేను వాటిని మొత్తానికే తీసిపారేయకుండా ఆగాను. 330 00:17:31,303 --> 00:17:34,764 మన అంచనాలను సరైన రీసెర్చ్ తో నిరూపించినందుకు సంతోషంగా ఉంది. 331 00:17:34,764 --> 00:17:37,392 అలాగే డెవెలప్మెంట్ కూడా, ప్లీజ్. 332 00:17:41,396 --> 00:17:42,564 ఇవి బాగానే ఉన్నాయి. 333 00:17:42,564 --> 00:17:45,442 అలాగే నేను ఇన్ని సంవత్సరాలలో ఇంత అందంగా ముందెప్పుడూ లేను. 334 00:17:47,110 --> 00:17:49,905 - నాకు ఇది చాలా నచ్చింది. - ఆహ్-హాహ్. 335 00:17:50,655 --> 00:17:53,575 బూబర్? ఇది నీ తప్పే అంటే ఏంటి అర్థం? 336 00:17:53,575 --> 00:17:54,659 అవును. 337 00:17:54,659 --> 00:17:58,413 అంటే, మొదట అనుకోకుండా జరిగింది 338 00:17:58,413 --> 00:18:01,416 కానీ ఆ తర్వాత నేను ఆ పక్షుల సాయంతో స్ట్రాబెర్రీలకు నష్టం తెప్పించి 339 00:18:01,416 --> 00:18:03,209 నా రాడిష్ రాజల్ పేరు పెంచుకోవచ్చు అని తెలుసుకున్నా. 340 00:18:03,209 --> 00:18:06,796 అందరూ ముల్లంగులను మర్చిపోతారు ఏమో అని భయం వేసింది. 341 00:18:07,797 --> 00:18:10,300 బహుశా నన్ను కూడా మర్చిపోతారేమో అని భయం వేసి ఉంటుంది. 342 00:18:11,927 --> 00:18:14,596 ఇంత దారుణంగా అవుతుందని నేను ఊహించలేదు. 343 00:18:14,596 --> 00:18:17,849 నేను అసలు ఇప్పటి వరకు స్ట్రాబెర్రీలు తినలేదు అని మీకు తెలుసా? 344 00:18:17,849 --> 00:18:18,975 ఏంటి? 345 00:18:18,975 --> 00:18:21,561 నువ్వు ఇంత వరకు స్ట్రాబెర్రీ తినలేదా? 346 00:18:21,561 --> 00:18:24,773 బూబర్, రిపీటీ పక్షులను వాడుకున్నది నువ్వు ఒక్కడివే కాదు. 347 00:18:24,773 --> 00:18:27,275 నేను కూడా వెనక్కి తీసుకోవాలి అనిపించే విషయాలను వాటితో పలికించాను. 348 00:18:27,275 --> 00:18:30,445 హేయ్, ఇక్కడ గతాన్ని తలచుకుని బాధపడటానికి చోటు లేదు, 349 00:18:30,445 --> 00:18:32,155 అంటే, మనకే సరైన చోటు లేదు అనుకోండి. 350 00:18:32,155 --> 00:18:33,865 - చాలా ఇరుకుగా ఉంది! - ఓహ్, అవును. 351 00:18:33,865 --> 00:18:37,494 హేయ్, ఒకటి చెప్పనా, బూబర్ ని ఉత్సాహపరచడానికి నేను మా అంకుల్ మ్యాట్ పోస్ట్ కార్డు తెచ్చాను. 352 00:18:37,494 --> 00:18:40,330 వీడికి అప్పుడు దీని అవసరం లేదు, కానీ మనందరికీ ఇప్పుడు దాని అవసరం ఉంది. 353 00:18:41,539 --> 00:18:43,583 అందరూ ఇలాగే నొక్కితే, 354 00:18:43,583 --> 00:18:45,794 నేను ఇక్కడ పచ్చడి అయిపోతానేమో... 355 00:18:45,794 --> 00:18:48,421 "ప్రియమైన గోబో అల్లుడు అలాగే వాడి ఫ్రెండ్స్..." 356 00:18:49,506 --> 00:18:54,261 నేను ఈ మధ్యనే ఒక గొప్ప విషయాన్ని గమనించా. 357 00:18:54,261 --> 00:18:59,391 చిన్న సైజు వెర్రి జీవులతో కళకళలాడుతున్న ఒక అందమైన సమాజాన్ని చూశాను, 358 00:19:00,141 --> 00:19:03,687 వాళ్ళ వింతైన తల రూపం వల్ల భలే వేగంగా కదులుతున్నారు. 359 00:19:04,437 --> 00:19:05,772 హలో, సూది తలలూ. 360 00:19:07,148 --> 00:19:09,568 అక్కడే నేను ఆ సూది తలల వెర్రి జీవుల గౌరవార్థం 361 00:19:09,568 --> 00:19:12,445 ఉంచబడ్డ అద్భుతమైన కళాకండాన్ని చూశాను. 362 00:19:12,445 --> 00:19:15,615 అది చాలా అందంగానే ఉంది, కానీ నా దారికి అడ్డుగా ఉంది. 363 00:19:16,491 --> 00:19:17,993 నేను ఎక్కడ కూర్చోవాలి? 364 00:19:21,288 --> 00:19:24,499 నేను ప్రశాంతంగా దానిని ఆ టేబుల్ మీద నుండి తీయమని అడిగాను. 365 00:19:24,499 --> 00:19:29,087 నా దారికి అడ్డు లెగు! లేదు! త్వరగా తీయండి! దీనిని నా దారికి అడ్డు తీయండి... 366 00:19:29,921 --> 00:19:31,548 నీకు బాగా గౌరవం ఇస్తారని తెలుసు, 367 00:19:31,548 --> 00:19:34,301 కానీ నా మాటలకు ఉన్న శక్తీ, అలాగే దాని వల్ల ఏర్పడే 368 00:19:34,301 --> 00:19:37,178 పర్యవసానాల గురించి నాకు తెలీలేదు. 369 00:19:38,722 --> 00:19:42,309 అనుకోకుండా పలికిన నా మాటల వల్ల గందరగోళం ఇంకా నాశనం జరిగింది. 370 00:19:42,309 --> 00:19:43,977 వద్దు, సన్నాసుల్లారా. 371 00:19:43,977 --> 00:19:46,062 నేను దానిని కదల్చమన్నాను, నాశనం చేయమనలేదు. 372 00:19:46,062 --> 00:19:49,691 వద్దు! ఆగండి. అంతా అయిపోయింది. ఓరి, నాయనో. వెళ్లి... 373 00:19:49,691 --> 00:19:52,360 నేను నా మాటలను తిరిగి వెనక్కి తీసుకోలేకపోవచ్చు, 374 00:19:52,360 --> 00:19:56,323 కానీ మరిన్ని కొత్త మాటలతో పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించగలను. 375 00:19:56,323 --> 00:19:57,574 నన్ను క్షమించు. 376 00:19:57,574 --> 00:19:59,868 నేను కాస్త ఆలోచించి మాట్లాడాల్సింది. 377 00:19:59,868 --> 00:20:01,703 ఇలా జరగాలని నేను అస్సలు కోరుకోలేదు. 378 00:20:02,203 --> 00:20:06,041 నేను పలికిన కొత్త మాటలు కాస్త సంతోషాన్ని అలాగే ప్రశాంతతను తీసుకొచ్చాయి 379 00:20:06,041 --> 00:20:08,668 అలాగే తియ్యని జ్ఞాపకాలను కూడా. 380 00:20:10,462 --> 00:20:11,546 థాంక్స్. 381 00:20:11,546 --> 00:20:14,966 కాబట్టి ఫ్రాగుల్ రాక్ ని మెరుగుపరిచే నా కర్తవ్యంలో భాగంగా, 382 00:20:14,966 --> 00:20:18,553 నేను ఈ కళాకండాన్ని పంపుతున్నా, యువ గోబో. 383 00:20:18,553 --> 00:20:21,223 "మన మాటలు నష్టాన్ని కలిగించగలవు, అలాగే దేనినైనా 384 00:20:21,223 --> 00:20:22,849 నయం చేయగలవు అని గుర్తుంచుకో. 385 00:20:22,849 --> 00:20:24,517 ప్రేమతో, మీ అంకుల్, ట్రావెలింగ్ మ్యాట్." 386 00:20:25,018 --> 00:20:27,687 "ఒక మాట, మిఠాయి భలే ఉంది!" 387 00:20:28,521 --> 00:20:29,522 ఆయన సరిగ్గానే అన్నారు. 388 00:20:29,522 --> 00:20:32,442 మనం మన మాటలను వాడి పరిస్థితిని చక్కబెట్టాలి. 389 00:20:32,943 --> 00:20:33,944 హేయ్. 390 00:20:35,654 --> 00:20:38,907 వెళ్లి ఈ విషయాన్ని ఫ్రాగుల్ రాక్ లో అందరికీ ప్రకటిద్దాం. 391 00:20:38,907 --> 00:20:40,575 అవును, పదండి. 392 00:20:40,575 --> 00:20:43,578 - అవును. అవును, ఎలా? - ఎలా? 393 00:20:44,996 --> 00:20:47,707 బహుశా నేను నా తోకని... ఓహ్, కాదు, అది నా కాలు. 394 00:20:47,707 --> 00:20:48,667 - ఆగు. - సరే. 395 00:20:48,667 --> 00:20:50,252 ఒకటి, రెండు, మూడు అనగానే చేద్దాం, సరేనా? 396 00:20:50,252 --> 00:20:53,421 నేను నిన్ను గమనిస్తున్నాను, మిత్రమా. శాంతించు. 397 00:20:53,421 --> 00:20:56,508 హేయ్! దానిని కింద... వెంటనే... కాదు. ఊరుకో. 398 00:20:56,508 --> 00:21:01,555 ఫ్రాగుల్ ప్రేమ తిరిగి వచ్చింది! అందరికీ చెప్పు! 399 00:21:01,555 --> 00:21:06,184 మనం వేరుగా ఉన్నంత మాత్రాన ద్వేషించుకోవాల్సిన పని లేదు. అందరికీ చెప్పు! 400 00:21:06,184 --> 00:21:08,812 మనం వేరుగా ఉన్నంత మాత్రాన ద్వేషించుకోవాల్సిన పని లేదు. 401 00:21:08,812 --> 00:21:10,230 అందరికీ చెప్పు! 402 00:21:11,356 --> 00:21:14,317 అవును, నయం చేయడం పనిచేస్తుంది. అందరికీ చెప్పు! 403 00:21:14,317 --> 00:21:15,402 అవును! 404 00:21:15,402 --> 00:21:19,406 ల-ల-ల-ల-ల-ల-ల-ల 405 00:21:19,406 --> 00:21:21,658 - ల-ల-ల-ల-ల-ల - ల, ల, ల 406 00:21:21,658 --> 00:21:22,742 ల-ల 407 00:21:22,742 --> 00:21:23,660 అందరికీ చెప్పు 408 00:21:23,660 --> 00:21:28,164 హాయిగా వెలుతురుగా ఉన్నప్పుడ్డు అందరికీ సంతోషంగా ఉంటుంది 409 00:21:28,164 --> 00:21:31,293 మన మనసుకు దానికి నచ్చినది ఇవ్వాలి తప్పకుండా ఇవ్వాలి 410 00:21:31,293 --> 00:21:32,419 ఈ మాట అందరికీ చెప్పండి 411 00:21:32,419 --> 00:21:36,882 ఎప్పుడైనా సంతోషంగా అనిపించిందంటే మనసుకు ఆనందంగా ఉందంటే 412 00:21:36,882 --> 00:21:39,509 అప్పుడు ఒకటి అర్థం చేసుకోండి తప్పక అర్థం చేసుకోండి 413 00:21:40,093 --> 00:21:41,177 విషయాన్ని అందరికీ చెప్పండి 414 00:21:41,177 --> 00:21:45,348 మనం ఎవరినైనా ప్రేమించామంటే ఆ ప్రేమ తిరిగి మన వద్దకే వస్తుందండి 415 00:21:45,348 --> 00:21:48,310 మనం ఏది అయితే ఇస్తామో, అదే తిరిగి వస్తుంది మనం దేనినైతే 416 00:21:48,810 --> 00:21:49,895 అందరికీ ఇస్తామో అదే 417 00:21:49,895 --> 00:21:51,813 నేను నీకు ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు 418 00:21:51,813 --> 00:21:53,982 నువ్వు కూడా ఇస్తావు అని నాకు తెలుసు 419 00:21:53,982 --> 00:21:56,818 అందుకే మంచివి ఇస్తుండాలి దీనినే అందరికీ 420 00:21:57,319 --> 00:21:58,153 చేసి చూపించాలి 421 00:21:58,153 --> 00:22:02,657 - అందరికీ అదే చెప్పాలి - అందరికీ అదే చెప్పాలి 422 00:22:02,657 --> 00:22:04,951 - అదే కోరుకోవాలి - అదే కోరుకోవాలి 423 00:22:04,951 --> 00:22:07,162 మనం చేసే మంచి పనులన్నీ 424 00:22:07,162 --> 00:22:11,291 - అందరికీ చెప్పాలి - అందరికీ చెప్పాలి 425 00:22:11,291 --> 00:22:13,543 - అది అందరి దగ్గరకూ వెళ్ళినప్పుడు - అది అందరి దగ్గరకూ వెళ్ళినప్పుడు 426 00:22:13,543 --> 00:22:15,629 అది మనకు అదృష్టాన్ని తీసుకొస్తుంది 427 00:22:15,629 --> 00:22:19,799 మనం ప్రేమను ఇచ్చినప్పుడు ప్రేమ తిరిగి వచ్చి మనతో ఉంటుంది 428 00:22:19,799 --> 00:22:22,886 మనం ఏది అయితే ఇస్తామో, అదే తిరిగి వస్తుంది మనం దేనినైతే 429 00:22:23,386 --> 00:22:24,512 అందరికీ ఇస్తామో అదే 430 00:22:24,512 --> 00:22:28,683 నేను నీకు ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు నువ్వు కూడా ఇస్తావు అని నాకు తెలుసు 431 00:22:28,683 --> 00:22:31,436 అందుకే మంచివి ఇస్తుండాలి దీనినే అందరికీ 432 00:22:32,020 --> 00:22:33,104 చేసి చూపించాలి 433 00:22:33,939 --> 00:22:35,148 చేసి చూపించాలి 434 00:22:37,150 --> 00:22:39,778 భలే! చాలా బాగుంది, మోకీ. 435 00:22:43,573 --> 00:22:46,159 వదిలేయ్, స్ప్రాకీ. నేను ఇక చేయలేను. 436 00:22:49,412 --> 00:22:51,498 నీకు ఎందుకు ఇది రావడం లేదు? 437 00:22:51,498 --> 00:22:54,542 ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు. బుద్ధి తెచ్చుకో. 438 00:22:54,542 --> 00:22:56,545 హేయ్, ఎవరూ నాతో అలా మాట్లాడటానికి ఒప్పుకోను. 439 00:22:58,004 --> 00:22:59,214 నేను తప్ప. 440 00:23:00,840 --> 00:23:03,802 ముందుగా, ఇది పనిచేస్తోంది. రెండవది ఏంటంటే... 441 00:23:05,136 --> 00:23:07,639 నేను ఇలా ఎవరితోనూ మాట్లాడను. 442 00:23:07,639 --> 00:23:10,100 అలాంటప్పుడు నాతో నేనే ఎందుకని ఇలా అంటాను? 443 00:23:12,269 --> 00:23:16,523 నా షీరోల గోడ మీద ఉన్న మహిళలకు మాటలకు శక్తి ఉంటుందని తెలుసు, 444 00:23:16,523 --> 00:23:20,360 అలాగే మనం మంచి మాటలే మాట్లాడితే మనం ప్రపంచాన్ని మెరుగుపరచగలం. 445 00:23:23,113 --> 00:23:26,491 మంచి మాటలు మ-మ-మ-మంచి మాటలు 446 00:23:26,491 --> 00:23:31,454 మ-మ-మ-మ-మన ప్రపంచాన్ని మె-మె-మె-మెరుగుపరుస్తాయి 447 00:23:33,039 --> 00:23:34,040 ఊహ్-ఆహ్. 448 00:23:35,834 --> 00:23:36,877 - అరేయ్, మిత్రమా... - ఏంటి? 449 00:23:36,877 --> 00:23:39,421 ...చూస్తుంటే ది రాక్ లో మళ్ళీ మనం సామరస్యాన్ని తీసుకొచ్చినట్టు ఉన్నాం. 450 00:23:39,421 --> 00:23:42,507 స్ట్రాబెర్రీలు ఫ్రాగుల్స్ కి మంచివి కాదు. 451 00:23:44,467 --> 00:23:46,887 చూస్తుంటే కొన్నిసార్లు మనం పలికిన మాటలు 452 00:23:46,887 --> 00:23:50,390 ఎన్నటికీ పోవు ఏమో. ఒక సూప్ కి ఉండే వాసనలాగ. 453 00:23:50,390 --> 00:23:54,644 అంటే, మనం మన తప్పుల నుండి నేర్చుకుని ప్రేమను పంచడం తప్ప ఇంకేం చేయలేము. 454 00:24:05,155 --> 00:24:07,324 ఈ కిరీటం భలే ఉంది, నాన్నా. 455 00:24:09,200 --> 00:24:12,913 ఈ పాత కిరీటమా? ఇది నాకు ఒక అలమారాలో కనిపించింది. 456 00:24:13,413 --> 00:24:15,332 - స్ట్రాబెర్రీలు ఫ్రాగుల్స్ కి మంచివి కాదు. - ఏంటి? 457 00:24:17,667 --> 00:24:20,378 స్ట్రాబెర్రీలు ఫ్రాగుల్స్ కి మంచివి కాదా? 458 00:24:20,378 --> 00:24:23,131 చివరికి ఆఖరి స్ట్రాబెర్రీని కూడా తీసేశా. 459 00:24:23,131 --> 00:24:25,592 జూనియర్, ప్లాను మారింది. 460 00:24:25,592 --> 00:24:27,886 మరిన్ని స్ట్రాబెర్రీలు నాటు. 461 00:24:28,929 --> 00:24:31,348 - సరే. అలాగే, నాన్నా. - అవును. 462 00:24:31,348 --> 00:24:33,308 ఇప్పుడు ఆ ఫ్రాగుల్స్ కి తెలుస్తుంది. 463 00:24:36,728 --> 00:24:37,812 నువ్వు ఇది చేయగలవు, మిత్రమా. 464 00:24:37,812 --> 00:24:39,648 బూబర్! బూబర్! 465 00:24:40,273 --> 00:24:42,525 దీనిని ఖచ్చితంగా బాగానే శుభ్రం చేశారు కదా? 466 00:24:42,525 --> 00:24:43,693 - ఓహ్, అవును. - సరే! 467 00:24:43,693 --> 00:24:46,238 ఇప్పుడు దాన్ని చూడడం మాని తిను. 468 00:24:46,238 --> 00:24:48,448 ఇది సంచలనాత్మకంగా ఉంటుంది. గొప్ప అనుభవం! 469 00:24:48,448 --> 00:24:50,116 తింటూ నిమగ్నమైపో. 470 00:24:50,116 --> 00:24:51,451 - సరే. - అవును. 471 00:24:56,581 --> 00:25:01,378 - ఇది... - ఏంటి? 472 00:25:01,378 --> 00:25:02,546 బానే ఉంది. 473 00:25:03,296 --> 00:25:04,756 ఇది పర్లేదు. 474 00:26:27,589 --> 00:26:29,591 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్