1 00:00:11,678 --> 00:00:15,140 అందరూ ఎక్కువగా అసహ్యించుకొనే స్కేటర్ల జాబితాలో నేను కూడా ఉంటాననుకుంటా. 2 00:00:16,308 --> 00:00:19,019 చాలా మంది... నా గురించి చెడుగా మాట్లాడుకుంటారు. 3 00:00:19,102 --> 00:00:22,272 కానీ ఎవరేం అనినా నేను పట్టించుకోను. 4 00:00:22,773 --> 00:00:27,402 దాన్ని నేను ప్రేరణగా తీసుకొని నేను చేయాలనుకున్నది చేసేస్తాను. 5 00:00:31,573 --> 00:00:34,868 లెటీసియా బుఫోనీ 6 00:00:36,662 --> 00:00:38,372 నా బాల్యం బ్రేజిల్ లోని సావ్ పాలోలో గడిచింది. 7 00:00:40,999 --> 00:00:43,710 నేను స్కేటింగుని మొదటగా నాకు పదేళ్ళు ఉన్నప్పుడు ప్రారంభించాను. 8 00:00:43,794 --> 00:00:47,256 మొదటిసారి స్కేటింగ్ బోర్డును తాకగానే, దానితో ప్రేమలో పడిపోయాను. 9 00:00:49,132 --> 00:00:52,719 నేను స్కేటింగ్ చేయడం ప్రారంభించగానే, చాలా విషయాలు... చాలా త్వరగా నేర్చేసుకున్నాను. 10 00:00:52,803 --> 00:00:55,931 నేను స్కేటింగ్ చేసిన మొదటి రోజునే కొన్ని ట్రిక్స్ ప్రయత్నించాను. 11 00:00:56,014 --> 00:00:58,100 అంటే, నాకు బోర్డుతో ముందుకు ఎలా వెళ్లాలో కూడా తెలీదు, 12 00:00:58,183 --> 00:00:59,518 కానీ ట్రిక్స్ ని మాత్రం ప్రయత్నించేస్తున్నాను. 13 00:01:01,353 --> 00:01:03,230 నేను తలుపును పట్టుకొని, 14 00:01:03,313 --> 00:01:05,607 ఫల్టీలు కొట్టడం, కాళ్ళని గాల్లోకి లేపడం వంటివి ప్రయత్నించేదాన్ని... 15 00:01:08,026 --> 00:01:10,279 స్కేట్ బోర్డింగులో ఊరికే పడిపోతుంటాం. 16 00:01:10,362 --> 00:01:11,238 ఎప్పుడూ పడిపోతూనే ఉంటాం. 17 00:01:11,822 --> 00:01:13,824 ఊరకూరకే గాయాలు అవుతుంటాయి కనుక చాలా మంది స్కేట్ బోర్డింగును 18 00:01:13,907 --> 00:01:15,409 మొదలుపెట్టిన వెంటనే ఆపేస్తుంటారు. 19 00:01:17,703 --> 00:01:22,624 మొదటిసారి, నేను కొండ దిగువకు స్కేటింగ్ చేస్తున్నప్పుడు పడిపోయాను. 20 00:01:22,708 --> 00:01:25,252 అప్పుడు... నా ఒళ్ళంతా గాయాలయ్యాయి. 21 00:01:25,335 --> 00:01:26,837 అప్పుడు నేను, 22 00:01:26,920 --> 00:01:28,839 "వావ్, ఇది భలేగా ఉందే. మళ్లీ చేస్తే పోలా," అని అనుకున్నాను. 23 00:01:34,178 --> 00:01:37,639 నేను అబ్బాయిలతో స్కేటింగ్ చేసేదాన్ని. నేను కూడా అబ్బాయిలానే ఉండేదాన్ని అనవచ్చు. 24 00:01:37,723 --> 00:01:39,516 నేను వాళ్లతో గొడవపడేదాన్ని. 25 00:01:39,600 --> 00:01:41,018 వాళ్లు చేసే ట్రిక్స్ ని నేను కూడా ప్రయత్నించేదాన్ని. 26 00:01:41,602 --> 00:01:42,853 మా గ్యాంగ్ లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని. 27 00:01:43,353 --> 00:01:45,522 నేను అబ్బాయిలు వేసుకొనే బ్యాగీ ప్యాంట్లను, టోపీని వేసుకొని, 28 00:01:45,606 --> 00:01:49,193 స్కేటింగ్ బోర్డును పట్టుకొని తిరుగుతూ ఉండేదాన్ని కనుక 29 00:01:49,276 --> 00:01:52,696 మా పక్కింటావిడ నన్ను అనరాని మాటలు అనేది. 30 00:01:54,198 --> 00:01:56,283 మా నాన్నకి స్కేట్ బోర్డింగ్ అంటే అసహ్యం. 31 00:01:56,366 --> 00:01:57,868 నేను స్కేటింగ్ చేయడం ఆయనకి ఇష్టం లేదు. 32 00:01:57,951 --> 00:02:00,037 ఆయన చాలా స్ట్రిక్ట్ అన్నమాట. 33 00:02:00,120 --> 00:02:02,581 నేను ఇంట్లో కూర్చొని చదువుకోవాలని 34 00:02:03,290 --> 00:02:05,292 బయట అబ్బాయిలతో తిరగకూడదని అనేవాడు. 35 00:02:05,375 --> 00:02:07,169 నా స్కేటింగ్ బోర్డును విరగొట్టేశాడు కూడా. 36 00:02:08,377 --> 00:02:10,964 కానీ తర్వాతి రోజు ఉదయం, నా స్నేహితుడితో కలిసి ఒక బోర్డు తెచ్చుకున్నా, 37 00:02:11,048 --> 00:02:12,299 ఒక కొత్త బోర్డును సెటప్ చేసుకున్నాను. 38 00:02:12,382 --> 00:02:14,801 నాకు స్కేటింగ్ తప్ప ఇంకేమీ చేయాలనిపించేది కాదు. 39 00:02:23,018 --> 00:02:26,855 నాకు పద్నాలుగేళ్లు ఉన్నప్పుడు, ఎక్స్ గేమ్స్ లో స్కేటింగ్ చేయడానికి 40 00:02:26,939 --> 00:02:28,690 నన్ను లాస్ ఏంజలెస్ కి ఆహ్వానించారు. 41 00:02:28,774 --> 00:02:31,235 "వావ్, నేను స్కేటింగ్ బాగానే చేస్తున్నానన్నమాట," అని 42 00:02:31,318 --> 00:02:33,028 నేను అప్పుడు గ్రహించాను. 43 00:02:33,111 --> 00:02:34,404 2007 ఎక్స్ గేమ్స్ లాస్ ఏంజలెస్ 44 00:02:34,488 --> 00:02:38,367 కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలెస్ కి అందరికీ సుస్వాగతం. 45 00:02:40,285 --> 00:02:42,996 నా తొలి ఎక్స్ గేమ్స్ లో నేను అంత బాగా ప్రదర్శించలేదు. 46 00:02:44,164 --> 00:02:47,251 నేను బ్రెజిల్ లోని పోటీలకు బాగా అలవాటుపడిపోయాను, అక్కడ... 47 00:02:47,334 --> 00:02:49,086 స్కేట్ పార్క్ చాలా చిన్నగా ఉంటుంది. 48 00:02:50,045 --> 00:02:54,341 మరి ఎక్స్ గేమ్స్ లో అన్నీ రెండింతల పరిమాణంలో ఉన్నాయి. 49 00:02:55,217 --> 00:02:56,426 నాకు చివరి స్థానం దక్కింది. 50 00:02:58,345 --> 00:03:00,055 నాకు అలా జరగడమే మేలైందిలే. 51 00:03:00,138 --> 00:03:01,974 నా స్కేటింగ్ పద్ధతిని మార్చడానికి అది ఉపయోగపడింది. 52 00:03:03,308 --> 00:03:05,894 నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అది నాకు తోడ్పడింది. 53 00:03:05,978 --> 00:03:08,856 "నేను ఆటలో మెళకువలను మెరుగుపరుచుకోవాలి," అని అనుకున్నాను. 54 00:03:10,524 --> 00:03:13,318 లెటీసియా, తన మొట్టమొదటి పసిడి పతకాన్ని 55 00:03:13,986 --> 00:03:15,904 తన సొంత దేశంలోనే గెలుచుకుంది. 56 00:03:15,988 --> 00:03:18,282 లెటీ! లెటీ! లెటీ! 57 00:03:20,492 --> 00:03:24,413 లెటీసియా బుఫోనీ బంగారు పతకాన్ని గెలుచుకుంది. 58 00:03:27,124 --> 00:03:30,335 లెటిసీయా మళ్లీ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. 59 00:03:30,419 --> 00:03:32,379 మరొక పసిడి పతకం. 60 00:03:34,423 --> 00:03:36,675 ఎక్స్ గేమ్స్ లో మూడు బంగారు పతకాలను సాధించింది. 61 00:03:36,758 --> 00:03:38,969 ఒక కాంస్య పతకం, ఒక రజత పతకం. 62 00:03:40,721 --> 00:03:42,347 ఎక్స్ గేమ్స్ పతకాలు - 2010 రజతం 2011 కాంస్యం - 2012 రజతం 63 00:03:42,431 --> 00:03:43,849 2013 పసిడి - 2013 పసిడి 2013 పసిడి - 2014 కాంస్యం 64 00:03:43,932 --> 00:03:46,393 ఎక్స్ గేమ్స్ లో నా విజయాల పరంపర 65 00:03:46,476 --> 00:03:48,687 చాలా వేగంగా సాగిపోయింది. 66 00:03:48,770 --> 00:03:49,771 చాలా బాగా అనిపించింది. 67 00:03:49,855 --> 00:03:52,232 నాకు గొప్ప గొప్ప స్కేటర్స్ ని కలిసే అవకాశం దక్కింది. 68 00:03:52,733 --> 00:03:56,236 మ్యాగజీన్లు, ఫిట్నెస్ మ్యాగజీన్లు, ఫ్యాషన్ మ్యాగజీన్లు, 69 00:03:56,320 --> 00:03:57,571 ఇలా అనేక వాటిలో ఫోటోలు దిగే 70 00:03:57,654 --> 00:03:59,323 అవకాశాలు నాకు దక్కాయి. 71 00:04:01,658 --> 00:04:03,118 ఎండార్ఫినా లెటీసియా బుఫోనీ 72 00:04:03,202 --> 00:04:07,372 నేను స్కేటింగ్ ని పక్కకు పెట్టేసి, మోడలింగ్ మీదనే దృష్టి పెడుతున్నానని, 73 00:04:07,456 --> 00:04:09,791 ఫీట్నెస్ మోడల్ ని అయిపోయానని 74 00:04:09,875 --> 00:04:11,168 చాలా మంది అన్నారు. 75 00:04:12,669 --> 00:04:16,173 అది నాకు కాస్త బాధ కలిగించింది, ఎందుకంటే నా తొలి ప్రాధాన్యత ఎప్పుడూ స్కేట్ బోర్డింగుకే. 76 00:04:16,255 --> 00:04:18,175 నాకు అన్నింటికన్నా ఎప్పుడూ అదే ముఖ్యమైనది. 77 00:04:20,427 --> 00:04:23,263 ఈ.ఎస్.పీ.ఎన్ బాడీ సంచికలో పాల్గొనమని నాకు ఆహ్వానం అందినప్పుడు, 78 00:04:23,347 --> 00:04:24,348 నాకు చాలా గర్వంగా అనిపించింది. 79 00:04:24,431 --> 00:04:26,433 మొదట, నాకు చాలా కంగారుగా అనిపించింది, 80 00:04:26,517 --> 00:04:29,311 ఎందుకంటే, నేను నగ్నంగా ఉండాల్సి వస్తుందని నాకు తెలుసు. 81 00:04:30,395 --> 00:04:32,648 నేను అందులో పాల్గొన్నాను, వచ్చిన ఫలితం కూడా నచ్చింది. 82 00:04:32,731 --> 00:04:34,483 కానీ చాలా మందికి, 83 00:04:34,566 --> 00:04:38,445 ఒక క్రీడాకారుని దేహాన్ని చూపడం అంటే ఏంటో సరిగ్గా తెలీదు, 84 00:04:38,529 --> 00:04:41,865 కండల వంటి వాటిని చూపుతారు, మిగతా వాటిని చూపరు అని వారికి అవగాహన లేదు. 85 00:04:43,408 --> 00:04:46,662 కాబట్టి, చాలా మంది చెడుగా మాట్లాడటం మొదలుపెట్టారు, 86 00:04:46,745 --> 00:04:48,914 నగ్నంగా ఫోజులు ఇచ్చినందుకు నాకు డబ్బులు ఇచ్చారని గుసగుసలాడుకున్నారు. 87 00:04:48,997 --> 00:04:51,166 ఆటను వదిలేసి డబ్బు వెనుక పరుగెడుతున్నానని కూశారు. 88 00:04:51,250 --> 00:04:54,169 అది కూడా సరిగ్గా స్ట్రీట్ లీగ్ ముందే జరిగింది, 89 00:04:54,253 --> 00:04:55,629 అది కూడా మొట్టమొదటి స్ట్రీట్ లీగ్. 90 00:04:55,712 --> 00:04:57,339 మనం ఇప్పుడు చికాగోలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. 91 00:04:57,422 --> 00:04:59,132 2015 స్ట్రీట్ లీగ్ స్కేట్ బోర్డింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 92 00:04:59,216 --> 00:05:01,260 స్ట్రీట్ లీగ్ స్కేట్ బోర్డింగ్ చరిత్రలో ఈ రోజు చాలా గొప్ప రోజు. 93 00:05:01,343 --> 00:05:02,845 ఈ లీగ్ ని ప్రారంభించి ఇప్పటికి ఆరేళ్లయింది, 94 00:05:02,928 --> 00:05:05,639 కానీ ఇప్పటిదాకా ఇందులో మహిళలు పాల్గొనిందే లేదు. 95 00:05:05,722 --> 00:05:06,723 ఇప్పుడు అందరూ మహిళలే! 96 00:05:06,807 --> 00:05:10,060 స్కేట్ బోర్డింగులో స్ట్రీట్ లీగ్ అనేది అత్యంత పెద్ద పోటీ. 97 00:05:10,143 --> 00:05:13,188 ఆ సమయంలో, కెరీర్ లో నేను చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నాను, 98 00:05:13,272 --> 00:05:15,399 ఆ పోటీలో ఎలాగైనా గెలవాలని నాకు ఉంది. 99 00:05:16,233 --> 00:05:18,944 మహిళల స్కేట్ బోర్డింగులో ఇదొక మైలురాయి అని చెప్పవచ్చు. 100 00:05:19,027 --> 00:05:22,197 టైటిల్ వేటలో ఉన్న మహిళల పేర్లను ఓసారి చూద్దాం. 101 00:05:22,281 --> 00:05:24,283 నాతో చాలా మంది పోటీ పడుతున్నారు, 102 00:05:24,366 --> 00:05:26,785 నేను స్కేటింగుని వదిలేసి పక్కదారి పట్టాను అని అన్నది వాళ్ళే. 103 00:05:27,953 --> 00:05:30,539 ఆట దగ్గర కలుసుకున్నప్పుడు అందరూ స్నేహంగానే ఉంటాం. 104 00:05:30,622 --> 00:05:32,416 కానీ నా గురించి లేనిపోనివన్నీ 105 00:05:32,499 --> 00:05:35,043 మాట్లాడుకున్నది వాళ్లేనని నా మనస్సుకు తెలుసు. 106 00:05:36,086 --> 00:05:39,047 వారు పొరబడ్డారని నిరూపించడానికి నాపై నేను చాలా ఒత్తిడి పెట్టుకున్నాను. 107 00:05:40,966 --> 00:05:43,135 పోటీకి ముందు నేను చాలా కంగారుపడిపోయాను, 108 00:05:43,218 --> 00:05:46,597 పోటీలో ఏమవుతుందో ఏమో అని భయపడ్డాను. 109 00:05:47,639 --> 00:05:51,059 కానీ నేను స్కేటింగును ప్రారంభించాక, మొత్తం మారిపోతుంది. 110 00:05:51,810 --> 00:05:54,855 నేను కేవలం స్కేటింగ్ మీదనే దృష్టి పెడతాను, నాకు ఇంకేవీ వినిపించవు. 111 00:05:55,355 --> 00:05:58,400 మీరు నా పక్కనే ఉండి కేకలు పెడుతూ ఉండవచ్చు, నన్నే పిలుస్తూ ఉండవచ్చు. 112 00:05:58,483 --> 00:05:59,902 పక్కనే టపాసులు పేలుస్తూ ఉండవచ్చు. 113 00:05:59,985 --> 00:06:01,904 నాకు ఆ శబ్దాలేమీ వినబడవు, నా దృష్టంతా నా ట్రిక్స్ మీదనే ఉంటుంది. 114 00:06:04,615 --> 00:06:06,658 తనకు చాకచక్యంగా ఎలా స్కేటింగ్ చేయాలో బాగా తెలుసు, 115 00:06:06,742 --> 00:06:07,618 తనకి మంచి మంచి ట్రిక్స్ తెలుసు. 116 00:06:08,285 --> 00:06:09,578 తను స్కేటింగ్ వేగంగా బాగా చేయగలదు. 117 00:06:10,495 --> 00:06:12,748 ఎలాంటి ఉపరితలం మీదనైనా చేయగలదు. స్ట్రీట్ స్కేటింగుకు ఆమె పెట్టింది పేరు. 118 00:06:14,541 --> 00:06:16,960 కోర్సు చాలా బాగా ఉంది. 119 00:06:17,044 --> 00:06:20,964 కోర్సు మధ్యలో చాలా పెద్ద ఎస్.ఎల్.ఎస్ లోగో ఉంది, 120 00:06:21,048 --> 00:06:24,176 దాని మీద నుండి ఎవరూ దూకడం లేదు, 121 00:06:24,259 --> 00:06:26,261 ఎందుకంటే మధ్యలో చాలా ఖాళీ ఉంది. 122 00:06:27,596 --> 00:06:29,223 చాలా దూరం దూకింది. 123 00:06:30,516 --> 00:06:31,808 వావ్. అదరగొట్టేసింది. 124 00:06:31,892 --> 00:06:32,893 బుఫోనీ 3.3 మొదటి స్థానం కోసం ఇంకా 4.4 కావాలి 125 00:06:32,976 --> 00:06:34,228 చాలా బాగా చేసింది. 126 00:06:34,311 --> 00:06:38,315 మొదటి స్థానం, రెండవ స్థానం గురించి నేనేమీ ఆలోచించలేదు. 127 00:06:38,398 --> 00:06:40,901 ట్రిక్స్ అన్నీ సరిగ్గా చేయాలనుకున్నా. 128 00:06:43,445 --> 00:06:44,988 సూపర్. చాలా బాగా చేసింది. 129 00:06:45,072 --> 00:06:46,698 ఫ్రంట్ సైడ్ 180 ట్రిక్ సూపర్ గా చేసింది. 130 00:06:46,782 --> 00:06:47,783 బుఫోనీ 15.2 మొదటి స్థానం కోసం ఇంకా 1.3 కావాలి 131 00:06:47,866 --> 00:06:49,910 నేను రెండవ స్థానంలో ఉన్నాను, 132 00:06:49,993 --> 00:06:51,495 నాకు ఇంకా మూడు అవకాశాలు ఉన్నాయి. 133 00:06:51,578 --> 00:06:55,040 నాకు... పెద్ద స్కోరేమీ అక్కర్లేదు. మామూలు స్కోర్ సరిపోతుంది. 134 00:06:55,123 --> 00:06:56,917 నేను ఏ సులువైన ట్రిక్కును చేసినా, 135 00:06:57,000 --> 00:06:59,586 నాకు స్కోర్ వచ్చేస్తుంది, తొలి స్థానం నాది అయిపోతుంది. 136 00:06:59,670 --> 00:07:02,506 కానీ నా దృష్టి అంతా పాయింట్ల మీద లేదు. 137 00:07:02,589 --> 00:07:05,259 నాకు ఒక మంచి ట్రిక్ చేయాలనుంది. 138 00:07:05,342 --> 00:07:08,178 ఒక గొప్ప ట్రిక్ లాంటిది. గెలవడానికి ఏదోక సులభమైన ట్రిక్ చేసేయాలని నాకు లేదు. 139 00:07:08,804 --> 00:07:10,389 ఆమె మనకు ఏం ట్రిక్స్ చూపబోతోంది? 140 00:07:14,351 --> 00:07:17,813 360 ఫ్లిప్ తృటిలో చేజారింది. బోర్డ్ పూర్తిగా తిరగలేదు. 141 00:07:17,896 --> 00:07:19,231 నేను 360 ఫ్లిప్ ని ప్రయత్నించాను. 142 00:07:19,314 --> 00:07:21,149 మొదటిసారి అది సరిగ్గా చేయలేకపోయాను. 143 00:07:21,233 --> 00:07:23,735 అప్పుడు నేను "సర్లే, ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయి కదా. చేసేద్దాంలే," అనుకున్నాను. 144 00:07:30,325 --> 00:07:32,661 రెండవసారి కూడా సఫలమవ్వలేకపోయాను. 145 00:07:32,744 --> 00:07:35,539 అప్పుడు నేను "వామ్మో, ఇదేదో తేడాగా అయ్యేలా ఉందే. 146 00:07:35,622 --> 00:07:38,292 ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. ఇంకొక్క అవకాశమే ఉంది," అని అనుకున్నాను. 147 00:07:38,375 --> 00:07:40,460 తనకి 3.9 పాయింట్లు కావాలి. 148 00:07:40,544 --> 00:07:43,672 తను ఒకవేళ 360 ఫ్లిప్ ని ప్రయత్నిస్తే... ఇప్పటికే తను రెండు సార్లు విఫలమైంది... 149 00:07:43,755 --> 00:07:46,049 లేదా తను నమ్మకంగా చేయగల మరో ట్రిక్కును చేస్తుందేమో చూద్దాం. 150 00:07:46,133 --> 00:07:49,595 అంత పెద్ద ట్రిక్ చేయాల్సిన పని లేదని నా మెదడు చెప్తోంది. 151 00:07:50,137 --> 00:07:51,847 కానీ నా మనస్సు పెద్ద ట్రిక్ చేయమని చేప్తోంది. 152 00:07:51,930 --> 00:07:53,724 నాకు ఆ ట్రిక్ చేయాలనుంది. 153 00:07:53,807 --> 00:07:57,436 అందులోనూ నేను దాన్ని రెండుసార్లు చేయలేకపోయాను, కనుక ఈసారి చేయాల్సిందే. 154 00:07:57,519 --> 00:08:01,231 నేను గెలవలేనేమో అని నా ట్రిక్కును నేను మార్చలేను. 155 00:08:01,315 --> 00:08:03,150 గెలుపు కూడా సరైన విధంగా పొందాలనుకున్నాను. 156 00:08:03,233 --> 00:08:05,068 చాలా శ్రద్ధతో చేయాల్సిన అవసరం ఉంది. 157 00:08:06,778 --> 00:08:09,573 సాధారణంగా ఏదైనా ట్రిక్ చేసేటప్పుడు, ఎప్పుడు ల్యాండ్ అవుతామో... 158 00:08:09,656 --> 00:08:10,490 ల్యాండ్ % మిస్ % 159 00:08:10,574 --> 00:08:11,575 ...లేదా అది సఫలం కాదా అని తెలిసిపోతుంది. 160 00:08:12,743 --> 00:08:14,453 బోర్డ్ నా కాళ్ళ కిందే ఉంది, 161 00:08:14,536 --> 00:08:17,539 కాబట్టి, "నేను ఇది చేయగలను. ఇంతే. నేను ల్యాండ్ అవుతున్నాను," అని అనుకున్నా. 162 00:08:17,623 --> 00:08:21,251 కానీ నేను ల్యాండ్ అయ్యాక, నాకు కాస్తంత పట్టు తప్పినట్టు అనిపించింది. 163 00:08:21,335 --> 00:08:24,087 మళ్లీ నిలదొక్కుకున్నాక, 164 00:08:24,171 --> 00:08:26,256 "హమ్మయ్య. బాగా చేసేశాను," అని అనుకున్నాను. 165 00:08:26,340 --> 00:08:28,675 అది అయిన వెంటనే నేను ఎగిరి గంతేశాను. 166 00:08:28,759 --> 00:08:30,677 గెలిచేసింది! సూపర్! 167 00:08:30,761 --> 00:08:32,429 అద్భుతం. 168 00:08:32,513 --> 00:08:35,557 మహిళల ఎస్.ఎల్.ఎస్ నైక్ ఎస్.బీ సూపర్ క్రౌన్ 169 00:08:35,640 --> 00:08:41,230 మొట్టమొదటి విజేత, లెటీసియా బుఫోనీ. 170 00:08:42,231 --> 00:08:44,149 నేను ఆ ట్రిక్కును సక్రమంగా చేశాక, 171 00:08:44,775 --> 00:08:46,860 నాకు ఏదో సాధించిన ఫీలింగ్ కలిగింది. 172 00:08:46,944 --> 00:08:48,654 అది మాటలలో వర్ణించలేని ఫీలింగ్. 173 00:08:48,737 --> 00:08:51,281 స్కైడైవింగ్ లాంటి ఫీలింగ్ అన్నమాట. ఆ ఫీలింగ్ తెలియాలంటే స్వయంగా దూకాలి. 174 00:08:53,742 --> 00:08:57,204 అప్పటి పరిస్థితులలో నాకు ఆ గెలుపు చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. 175 00:08:57,287 --> 00:08:59,957 దాని తర్వాత, నా మీద అందరికీ గౌరవం పెరిగింది అనుకుంటా. 176 00:09:00,040 --> 00:09:02,084 నా కలని నిజం చేసుకున్నాను. 177 00:09:02,167 --> 00:09:05,045 రెండు వారాల నుండి స్ట్రీట్ లీగ్ గురించే నాకు కలలు వస్తున్నాయి. 178 00:09:05,128 --> 00:09:06,880 ఇప్పుడు నేను సాధించాను. 179 00:09:06,964 --> 00:09:08,006 నాకు చాలా ఆనందంగా ఉంది. 180 00:09:08,924 --> 00:09:11,093 నా జీవితంలోని మరపురాని క్షణాల్లో అది కూడా ఒకటి. 181 00:09:13,345 --> 00:09:15,472 మనం ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు 182 00:09:15,556 --> 00:09:19,685 మనల్ని విమర్శించేవారు తప్పకుండా ఉంటారనే విషయాన్ని ఇప్పుడు నేను గ్రహించాను. 183 00:09:20,269 --> 00:09:21,270 కానీ దాన్ని నేనెప్పుడూ పట్టించుకోలేదు. 184 00:09:21,353 --> 00:09:25,065 నా దృష్టి అంతా స్కేట్ బోర్డింగ్ క్రీడను మరింత మెరుగుపరచడంపైనే ఉంది. 185 00:09:25,691 --> 00:09:27,901 గెలవడం ముఖ్యమే, 186 00:09:27,985 --> 00:09:31,905 కానీ స్కేట్ బోర్డింగ్ అనేది నాకు గెలుపు కన్నా ముఖ్యమైనది. 187 00:09:33,448 --> 00:09:35,784 నా వీడియోలు చూసే తమ కూతుళ్లు 188 00:09:35,868 --> 00:09:40,163 స్కేటింగ్ చేస్తున్నారని నాతో చాలా మంది తల్లిదండ్రులు చెప్పారు. 189 00:09:40,247 --> 00:09:42,124 అలాంటివి విన్నప్పుడు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. 190 00:09:43,500 --> 00:09:48,463 స్కేటింగును మొదలుపెట్టినప్పుడు నాకు ఏమీ తెలీదు, ఇప్పటికి కూడా నేను అలాంటి వ్యక్తిని కావాలనుకుంటా. 191 00:09:48,547 --> 00:09:51,675 ఎందుకంటే మహిళలు స్కేటింగ్ చేయగలరని, వారు కూడా ప్రొఫెషనల్స్ కాగలరని 192 00:09:51,758 --> 00:09:53,468 నేను మా నాన్నకు చూపాలనుకున్నాను. 193 00:09:53,969 --> 00:09:55,679 అప్పుడు నా దగ్గర ఆ సదుపాయం లేదు. 194 00:09:55,762 --> 00:10:00,267 కాబట్టి ఇప్పుడు యువతకు నేను ఆ స్ఫూర్తిదాతగా నిలవాలనుకుంటున్నా. 195 00:10:00,350 --> 00:10:03,478 మీరేం కావాలనుకుంటే, అది చేయగలరని నేను వాళ్ళకి చూపాలనుకుంటున్నాను. 196 00:10:03,562 --> 00:10:05,606 మీరు మీ అభిరుచిపై దృష్టి పెట్టాలంతే. 197 00:10:05,689 --> 00:10:06,982 మీరు తప్పకుండా సాధించగలరు. 198 00:10:39,473 --> 00:10:41,475 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య