1 00:00:05,090 --> 00:00:08,093 అది 1964 నాటి వరల్డ్ ఫెయిర్. 2 00:00:08,093 --> 00:00:11,680 మామూలు మేళాని ఊహించుకోండి. దాన్ని ఒక రాకెట్ షిప్ లో పెట్టి 3 00:00:11,680 --> 00:00:16,434 భవిష్యత్తులోకి పంపించారే అనుకోండి, అయినా కూడా మీరు దాని గొప్పతనాన్ని మించలేరు. 4 00:00:16,434 --> 00:00:20,939 తిరిగి ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఉండాలనిపించే ఫీల్డ్ ట్రిప్పులలో అది కూడా ఒకటి. 5 00:00:20,939 --> 00:00:28,029 ఫ్యూచురామా టూకి స్వాగతం, రేపటి ప్రపంచానికి మార్గం ఇది. 6 00:00:28,029 --> 00:00:30,198 -అద్భుతం. -చాలా బాగుంది. సూపర్ గా ఉంది. 7 00:00:30,198 --> 00:00:34,911 నీళ్ళ అడుగున ప్రయాణించే రైళ్ళు ఖండాలను, వాణిజ్యాన్ని అనుసంధానిస్తాయి. 8 00:00:35,495 --> 00:00:37,330 నాకు నీళ్ళ అడుగున ఉండాలని ఉంది. 9 00:00:37,330 --> 00:00:39,749 పోస్ట్ తెచ్చుకోవాలంటే ఊపిరి బిగబట్టాలి. 10 00:00:39,749 --> 00:00:42,711 నేను మామూలుగా కూడా అదే చేస్తాను. మా పోస్ట్ బాక్స్ పక్కనే చెత్త కుండీ ఉంది. 11 00:00:43,378 --> 00:00:46,548 భవిష్యత్తులో ఉన్న చిట్టి చిట్టి జనాల్ని చూడండి. 12 00:00:46,548 --> 00:00:48,091 హాయ్, చిట్టి చిట్టి జనాలు! 13 00:00:48,758 --> 00:00:50,719 సరిగ్గా కూర్చో, హ్యారియట్. 14 00:00:51,761 --> 00:00:52,762 రాక్షసి! 15 00:00:52,762 --> 00:00:57,559 పరిగెత్తండి, చిట్టి చిట్టి జనాల్లారా! ఒక రాక్షసి మీ సిటీమీద దాడి చేయబోతోంది. 16 00:00:59,060 --> 00:01:02,188 మిస్టర్ హొరేషియో, ఇక్కడ హ్యారియట్, జేనీలు గొడవ చేస్తున్నారు. 17 00:01:02,772 --> 00:01:05,025 పిల్లలూ, గొడవ చేయకుండా కూర్చోండి. 18 00:01:05,025 --> 00:01:07,986 ఈరోజు మనం చేస్తున్న ఆఖరి రైడ్ ని మీరు పాడు చేస్తున్నారు. 19 00:01:14,659 --> 00:01:18,496 ఈరోజు మనం చూసిన వాటిని నమ్మగలరా? 20 00:01:18,496 --> 00:01:23,293 రోబోట్ పనివాళ్ళు, ఎలక్ట్రిక్ కార్లు, శాటిలైట్లు! 21 00:01:23,793 --> 00:01:27,631 అంతరిక్షం నుండి నేను ఎన్నింటి మీద నిఘా పెట్టచ్చో ఊహించండి. 22 00:01:27,631 --> 00:01:30,342 అక్కడ కనిపించిన వింత ఆహారాన్ని నేను తినగలిగితే ఎంత బాగుండేది. 23 00:01:30,342 --> 00:01:32,510 నా ఉద్దేశం, బెల్జియన్ వాఫుల్ అంటే ఏంటి? 24 00:01:33,178 --> 00:01:39,601 నేను చెప్పేది జాగ్రత్తగా విను, అదొక వాఫుల్, ఇంకా అది బెల్జియం నుండి వచ్చింది. 25 00:01:41,353 --> 00:01:42,604 వావ్. 26 00:01:43,480 --> 00:01:49,027 సరే, పిల్లలూ. మీ అసైన్మెంట్ కోసం ఐడియాలను రాయడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. 27 00:01:49,027 --> 00:01:54,366 ఇక్కడ మీరు చూసిన వాటిలో, మీకు భవిష్యత్తు పట్ల అన్నిటికంటే ఎక్కువ ఉత్సాహాన్ని కలిగించింది ఏది? 28 00:01:54,366 --> 00:01:57,994 భవిష్యత్తు పట్ల నాకు ఎక్కువగా ఉత్సాహాన్ని కలిగించింది ఏంటా? ఓహ్, ప్రతీదీ. 29 00:01:58,620 --> 00:02:02,123 అందరికీ ఐదు నిమిషాల సమయం ఇస్తున్నా. బాగా రాయండి. 30 00:02:02,791 --> 00:02:05,168 భవిష్యత్తు పట్ల నాకు ఎక్కువగా ఉత్సాహాన్ని కలిగించింది ఏది? 31 00:02:05,168 --> 00:02:07,420 అంతరిక్ష నౌకలు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్. 32 00:02:07,420 --> 00:02:09,756 నేను ఎంచుకోలేకపోతున్నాను. దృష్టి పెట్టు, హ్యారియట్. 33 00:02:10,674 --> 00:02:15,011 భవిష్యత్తు పట్ల నాకు అన్నిటికంటే ఎక్కువ ఉత్సాహాన్ని కలిగించిన విషయం ఏంటంటే... 34 00:02:20,642 --> 00:02:21,935 నేను నమ్మలేకపోతున్నాను. 35 00:02:22,561 --> 00:02:24,437 నా జీవితంలో మొదటిసారి, 36 00:02:24,437 --> 00:02:28,066 అంటే భవిష్యత్తులో గొప్ప రచయిత కాబోతున్న హ్యారియట్ ఎం. వెల్ష్... 37 00:02:28,066 --> 00:02:30,026 రాయలేక ఇబ్బంది పడుతోంది. 38 00:02:31,945 --> 00:02:34,197 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 39 00:02:34,197 --> 00:02:36,449 మనకు నచ్చినట్లు ఉండాలి 40 00:02:37,450 --> 00:02:39,703 నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అదే అవుతాను 41 00:02:39,703 --> 00:02:41,538 నాదే తుది నిర్ణయం 42 00:02:42,080 --> 00:02:44,541 లేదు, నా జుట్టు కత్తిరించుకోను 43 00:02:44,541 --> 00:02:47,294 నాకు నచ్చిందే వేసుకుంటాను 44 00:02:47,294 --> 00:02:53,091 నాకు నచ్చినట్లుగా ఉండడం నాకిష్టం 45 00:02:53,091 --> 00:02:56,219 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 46 00:02:56,219 --> 00:02:59,180 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 47 00:02:59,180 --> 00:03:00,265 {\an8}"రేపటి ప్రపంచం" 48 00:03:02,475 --> 00:03:03,393 {\an8}లూయిస్ ఫిట్జ్ హ్యూ రచనపై ఆధారపడింది 49 00:03:03,393 --> 00:03:08,148 క్లాసులో నా ప్రజెంటేషన్ కోసం మంచి ఐడియా ఏంటో కనిపెట్టాలంటే, 50 00:03:08,148 --> 00:03:11,651 నేను విషయాల్ని మరో కోణంలో చూడాల్సి ఉంటుంది. 51 00:03:13,945 --> 00:03:15,614 బాగుంది. కానీ అక్కడే ఎందుకు ఆగావు? 52 00:03:18,199 --> 00:03:20,577 కమాన్, ఫ్యూచర్. నీ సామర్థ్యం ఏంటో చూపించు. 53 00:03:28,793 --> 00:03:31,755 కంగారుపడకండి. నాకు జెట్ ప్యాక్ లైసెన్స్ ఉంది. 54 00:03:33,590 --> 00:03:35,217 నేను దిగాల్సిన చోటు వచ్చింది. 55 00:03:42,599 --> 00:03:46,394 వావ్. భవిష్యత్తు నుండి టమాటో శాండ్విచ్. 56 00:03:47,395 --> 00:03:49,064 చాలా రుచిగా ఉంది. 57 00:03:51,900 --> 00:03:54,694 రోబోట్ గోలీ, మీకు భవిష్యత్తు పట్ల బాగా ఆసక్తి కలిగించేది ఏది? 58 00:03:56,738 --> 00:03:59,074 ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పకుండా నన్ను ప్రోగ్రాం చేశారు 59 00:03:59,074 --> 00:04:02,327 ఎందుకంటే ఒక మంచి గూఢచారి తనంతట తానే సమాధానాలు వెతుక్కుంటుంది. 60 00:04:04,329 --> 00:04:07,832 నాకు ఎక్కువ ఐడియాలు అవసరం లేదు, సరైనది ఒక్కటి చాలు. 61 00:04:07,832 --> 00:04:10,418 ఇది పెద్ద విషయమే కాదన్నట్లు ప్రతి ఒక్కరూ రాసేస్తున్నారు, 62 00:04:11,586 --> 00:04:13,463 చివరికి పింకీ వైట్ హెడ్ కూడా. 63 00:04:15,423 --> 00:04:16,507 మిస్టర్ హొరేషియో. 64 00:04:17,509 --> 00:04:20,387 నేను ముందుగా పూర్తి చేశాను. కాబట్టి ఎవరైనా ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉంటే, 65 00:04:20,387 --> 00:04:22,264 వాళ్ళకు నేను సాయం చేయగలను. 66 00:04:23,974 --> 00:04:25,559 పోవమ్మా, మేరియన్. 67 00:04:25,559 --> 00:04:29,688 భవిష్యత్తుకు దగ్గరగా ఉన్న ప్రదేశంలో, భవిష్యత్తు గురించి రాయలేకుండా 68 00:04:29,688 --> 00:04:32,857 నేను భవిష్యత్తులో రచయితను ఎలా కాగలను? 69 00:04:35,360 --> 00:04:36,570 టైం అయిపోయింది. 70 00:04:36,570 --> 00:04:39,906 సరే, పిల్లలూ, మనం బయలుదేరడానికి ఇంకాస్త సమయం ఉంది. 71 00:04:39,906 --> 00:04:42,909 "బెల్జియన్ వాఫుల్" తినాలని ఎవరికి ఉంది? 72 00:04:42,909 --> 00:04:44,703 చాలా సరదాగా ఉంది. 73 00:04:44,703 --> 00:04:46,204 అవును. 74 00:04:50,125 --> 00:04:52,002 నువ్వు బానే ఉన్నావా, హ్యారియట్? 75 00:04:52,002 --> 00:04:53,086 నేను బానే ఉన్నాను. 76 00:04:56,214 --> 00:04:58,174 ఏయ్, నువ్వు నా ఫోటో తీశావా? 77 00:04:59,759 --> 00:05:00,760 ఏయ్! 78 00:05:00,760 --> 00:05:04,514 వెళ్దాం పద, హ్యారియట్. ఫ్యూచర్ వాఫుల్ మనకోసం ఎదురు చూస్తోంది. 79 00:05:04,514 --> 00:05:06,725 నువ్వది చూశావా? ఏం చేశాడో చూడు. 80 00:05:06,725 --> 00:05:11,354 అవును, హ్యారియట్. అనుమతి లేకుండా ఇతరులపై నిఘా పెట్టడం చాలా చెడ్డ పని కదా? 81 00:05:11,354 --> 00:05:13,940 కదా? నేను అతన్ని ఫాలో అయ్యి కనిపెడతాను. 82 00:05:14,441 --> 00:05:17,527 వద్దు. నువ్వు తిరగడానికి వెళ్ళావని మిస్టర్ హొరేషియో కనిపెడితే, 83 00:05:17,527 --> 00:05:19,487 నీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. 84 00:05:29,664 --> 00:05:33,293 నువ్వు సరిగ్గా చెప్పావు, స్పోర్ట్. కాబట్టి నేను దొరికిపోకుండా చూడు. 85 00:05:36,004 --> 00:05:39,758 ఓల్ గోలీ ఒకసారి, "ఏదైనా ఆధారం దొరికితే, దాన్ని అనుసరించు" అని చెప్పింది. 86 00:06:15,168 --> 00:06:16,169 సారీ. 87 00:06:31,226 --> 00:06:32,394 దొరికావు! 88 00:06:34,020 --> 00:06:35,021 ఏం కావాలి? 89 00:06:35,021 --> 00:06:37,190 నన్ను అడగకుండా నా ఫోటో ఎందుకు తీశావు? 90 00:06:38,108 --> 00:06:39,859 నేను నీ ఫోటో తీయలేదు. 91 00:06:42,070 --> 00:06:45,115 నేను నలిపి పడేసిన పేపర్ ని ఫోటో తీశావా? 92 00:06:46,449 --> 00:06:49,286 నీకు నోట్ బుక్ పేపర్ కనిపిస్తోంది. నాకు నిజం కనిపిస్తోంది. 93 00:06:49,286 --> 00:06:52,539 చెత్త, పగుళ్ళు, జనం పట్టించుకోని విషయాలే అసలైన కళ. 94 00:06:52,539 --> 00:06:53,915 నేనొక ఫోటోగ్రాఫర్ ని. 95 00:06:53,915 --> 00:06:56,126 నీకు అర్థం కాదు. నువ్వింకా చిన్నదానివే. 96 00:06:56,877 --> 00:06:58,795 చిన్నదాన్నా? నీ వయసెంత, 14? 97 00:06:59,337 --> 00:07:01,423 నేను వెళ్ళాలి. ఈ ఫెయిర్ లో ఉండాల్సి రావడమే నాకు నచ్చలేదు. 98 00:07:01,423 --> 00:07:03,466 ఇప్పుడు నీతో ఉండాలని నేను అనుకోవడం లేదు. 99 00:07:04,092 --> 00:07:06,344 నీకు అంత నచ్చకపోతే, మరి ఇక్కడ ఎందుకున్నావు? 100 00:07:07,012 --> 00:07:10,515 మా అమ్మానాన్న కొడాక్ పెవిలియన్ లో పనిచేస్తున్నారు. వాళ్ళు జనాన్ని ఆకట్టుకోవడానికి షోలు చేస్తారు, 101 00:07:10,515 --> 00:07:13,602 నేనేమో ఈ పిచ్చి ప్రదేశంలో నిజమైన కళ ఏమైనా కనిపిస్తుందేమో అని చూస్తుంటాను. 102 00:07:13,602 --> 00:07:17,147 జనం ఒక మంచి భవిష్యత్తుని ఆశించడంలో పిచ్చితనం ఏముంది? 103 00:07:17,147 --> 00:07:18,440 నాకు భవిష్యత్తుపై నమ్మకం లేదు. 104 00:07:18,440 --> 00:07:20,650 నీలాంటి కఠినమైన వారిపై నాకు కూడా నమ్మకం లేదు. 105 00:07:20,650 --> 00:07:21,818 ఫెయిర్ ని ఎంజాయ్ చేయి, అమ్మాయి. 106 00:07:22,736 --> 00:07:24,029 చేస్తాను. 107 00:07:24,029 --> 00:07:26,072 భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోందన్న 108 00:07:26,072 --> 00:07:28,742 విషయంపై నేను బహుమతి గెల్చుకునే వ్యాసం రాసినప్పుడు, 109 00:07:28,742 --> 00:07:30,911 నీలాంటి వాడు కూడా దాన్ని నమ్ముతాడు. 110 00:07:38,209 --> 00:07:42,631 ఒక మనిషికి, ఒక ఇటుకకీ బిడ్డ పుడితే, ఇప్పుడు నేను కలిసిన వాడిలా ఉంటాడు. 111 00:07:52,057 --> 00:07:54,100 జేనీ! స్పోర్ట్! 112 00:07:55,435 --> 00:07:58,438 యూ-హూ, మేరియన్! ఎక్కడున్నారు? 113 00:07:58,438 --> 00:08:02,067 నేనొక బెంచి మీద నిలబడ్డాను. నన్ను గమనించండి. 114 00:08:02,817 --> 00:08:04,611 ఏం చేయాలో తెలియట్లేదే! 115 00:08:04,611 --> 00:08:08,448 ఏం రాయాలన్న ఆలోచనలో తప్పిపోయాను. ఇప్పుడు నిజంగానే నేను తప్పిపోయాను. 116 00:08:10,450 --> 00:08:11,743 బెల్జియన్ వాఫుల్ స్టాండ్! 117 00:08:18,291 --> 00:08:20,335 నీ పిచ్చి ఫోటోగ్రఫీ ఎలా సాగుతోంది? 118 00:08:22,087 --> 00:08:24,714 ఆగు, నీ ఫోటోగ్రఫీ చెత్త అని నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే... 119 00:08:24,714 --> 00:08:25,966 నీకేం కావాలి? 120 00:08:25,966 --> 00:08:28,301 నేను మా క్లాసుతో పాటు ఉన్నాను, మేమొక వ్యాసం రాయాలి, 121 00:08:28,301 --> 00:08:29,886 కానీ ఏం రాయాలో తేల్చుకోలేకపోతున్నాను. 122 00:08:29,886 --> 00:08:33,056 అప్పుడే నిన్ను చూసి, "నన్ను అడగకుండా నా మీద ఎవరూ నిఘా పెట్టకూడదు" అనుకున్నాను. 123 00:08:33,056 --> 00:08:35,725 కానీ ఈలోగా దారి తప్పిపోయాను. 124 00:08:36,726 --> 00:08:38,770 మా క్లాసు పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టడానికి సాయం చేస్తావా? 125 00:08:39,437 --> 00:08:40,438 చేయను. 126 00:08:40,438 --> 00:08:43,733 నువ్వు మంచి వాడివి కాదని ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? 127 00:08:43,733 --> 00:08:45,902 మా అమ్మానాన్న సాయపడగలరు. వెళ్లి అడుగుదాం. 128 00:08:46,695 --> 00:08:49,155 ఓహ్, సరే. మంచిది. 129 00:08:49,155 --> 00:08:50,699 ఇంతకీ నా పేరు హ్యారియట్. 130 00:08:50,699 --> 00:08:52,659 చక్. నా పేరు చక్. 131 00:08:54,077 --> 00:08:56,538 నేను భవిష్యత్తుని రుచి చూశాను, జేనీ. 132 00:08:56,538 --> 00:09:00,166 ఇది బెల్జియం నుండి వచ్చింది, ఇదొక వాఫుల్. 133 00:09:00,166 --> 00:09:02,586 అది ప్రపంచాన్ని మార్చేస్తుంది. 134 00:09:05,255 --> 00:09:07,716 దృష్టి పెట్టు, స్పోర్ట్. మనం హ్యారియట్ ని కనిపెట్టాలి. 135 00:09:11,970 --> 00:09:13,513 దృష్టి పెట్టు. మనం తనని కనిపెట్టాలి. 136 00:09:13,513 --> 00:09:17,517 ఒక వాఫుల్ మీద క్రీంతో హ్యారియట్ పేరు రాసి షాపులో వదిలి పెట్టాను. 137 00:09:17,517 --> 00:09:20,854 దానికింద ఒక టిష్యూ ఉంచాను, దానిపై ఇలా రాశాను, "మమ్మల్ని..." 138 00:09:20,854 --> 00:09:22,147 హ్యారియట్ నీ కోసం జేనీ... 139 00:09:22,772 --> 00:09:23,982 నేను రాసిన టిష్యూ అదేనా? 140 00:09:26,067 --> 00:09:28,778 స్పోర్ట్, హ్యారియట్ ఇప్పుడు మనల్ని ఎలా కనిపెడుతుంది? 141 00:09:33,909 --> 00:09:35,827 పైన కనిపిస్తోంది ఈ ప్రపంచంలోనే 142 00:09:35,827 --> 00:09:38,330 అత్యంత ఫేమస్ సర్కస్ జోకర్ అని మీరు గుర్తు పట్టొచ్చు. 143 00:09:38,330 --> 00:09:40,582 చక్కగా నవ్వండి, జోకర్ గారూ. 144 00:09:40,582 --> 00:09:43,043 ఇప్పటి వరకూ డెవలప్ చేయని అతి పెద్ద ఫోటోలో మీరు ఉన్నారు. 145 00:09:45,212 --> 00:09:49,591 ఈ ఫెయిర్ మొత్తంలో అన్నిటికంటే ఎత్తులో ఉన్న ఒకే ఒకటి రాయల్ టైర్ జెయింట్ వీల్. 146 00:09:51,551 --> 00:09:52,552 చక్. 147 00:09:54,846 --> 00:09:56,473 హాయ్, బంగారం. 148 00:09:57,474 --> 00:09:59,100 సాయంత్రం వరకూ కనిపించవని అనుకున్నామే. 149 00:09:59,100 --> 00:10:02,270 అది కూడా ఒక ఫ్రెండ్ తో కలిసి రావడం బాగుంది. 150 00:10:02,771 --> 00:10:06,233 నా పేరు హ్యారియట్ ఎం. వెల్ష్, నేను చాలా బాగున్నాను. థాంక్యూ. 151 00:10:06,775 --> 00:10:08,777 అలాగే తను తప్పిపోయింది కూడా. మీరు సాయం చేయగలరా? 152 00:10:08,777 --> 00:10:10,070 ఓహ్, అయ్యో! 153 00:10:10,070 --> 00:10:12,864 అదీ, మేము టూర్ మధ్యలో ఉన్నాం. 154 00:10:12,864 --> 00:10:17,202 కానీ కంగారుపడకమ్మా. మాకంటే బాగా చక్ కి ఈ చోటు గురించి తెలుసు. 155 00:10:17,202 --> 00:10:20,038 చక్, బంగారం, తనని సెక్యూరిటీ స్టేషన్ కి తీసుకెళ్ళు. 156 00:10:20,789 --> 00:10:21,790 అలాగే. 157 00:10:21,790 --> 00:10:23,541 నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. 158 00:10:24,042 --> 00:10:25,168 బై, బంగారం. 159 00:10:27,045 --> 00:10:31,508 ప్రశాంతంగా ఉండు, బాబూ. ఎక్కువగా అలిసిపోకు. 160 00:10:31,508 --> 00:10:33,552 నాన్నా, ఆపండి. ఏం చేయాలో నాకు తెలుసు. 161 00:10:33,552 --> 00:10:35,595 పదా, హ్యారియట్. మనం చాలా దూరం వెళ్ళాలి. 162 00:10:35,595 --> 00:10:36,930 అది ఈ ఫెయిర్ కి అటువైపు ఉంది. 163 00:10:36,930 --> 00:10:40,725 సరే. బహుశా ఒకసారి మొత్తం చూస్తే నాకేదైనా మంచి ఆలోచన వస్తుందేమో. 164 00:10:40,725 --> 00:10:42,852 నువ్వు వింత అమ్మాయివి, హ్యారియట్. 165 00:10:42,852 --> 00:10:44,521 అయితే నీకు ఇప్పటికీ అవకాశం ఉందన్నమాట. 166 00:10:44,521 --> 00:10:46,731 నా వెంటే ఉండు. ఏదైనా నేర్చుకుంటావేమో! 167 00:10:53,822 --> 00:10:56,616 మొదటి పాఠం. ఈ ఫెయిర్ దేని గురించని నీ ఉద్దేశం? 168 00:10:56,616 --> 00:10:58,994 -ప్రపంచ శాంతి కోసం? -తప్పు! 169 00:10:58,994 --> 00:11:01,705 డబ్బు సంపాదించడం కోసం ప్రపంచం నలుమూలల నుండీ జనం ఇక్కడికి వస్తారు. 170 00:11:01,705 --> 00:11:02,789 ఫ్యూచర్ లెమన్ జ్యూస్ ని ఎంజాయ్ చేయండి 171 00:11:04,124 --> 00:11:05,125 ఈ ప్రదేశమంతటా కంపెనీలు... 172 00:11:05,125 --> 00:11:06,209 స్విస్ సావనీర్స్ 173 00:11:06,209 --> 00:11:07,794 ...అనేక యాడ్స్ పెట్టి ఏదోకటి అమ్మాలని చూస్తాయి. 174 00:11:07,794 --> 00:11:09,713 ఇవన్నీ చాలా ముఖ్యమైన, సీరియస్ విషయాలు, హ్యారియట్. 175 00:11:11,047 --> 00:11:12,424 నువ్వు రాసుకోవడం మంచిది. 176 00:11:12,424 --> 00:11:15,302 ఇవన్నీ నేను రాసుకుంటే, నాకు ఎఫ్ గ్రేడ్ ఇచ్చి, 177 00:11:15,302 --> 00:11:18,221 "రచయిత కావాలన్న ఆలోచనని ఎప్పటికీ మర్చిపో" అని చెబుతారు. 178 00:11:19,055 --> 00:11:21,433 ఇక్కడున్న ఈ మేధావులు ఎవరికీ భవిష్యత్తులో ఇదంతా జరుగుతుందో 179 00:11:21,433 --> 00:11:23,351 లేదో ఎలాగైతే తెలీదో నీకు కూడా అది కచ్చితంగా తెలీదు. 180 00:11:23,351 --> 00:11:24,477 నీకు అన్నీ తెలుసా? 181 00:11:24,477 --> 00:11:26,897 వర్తమానంలో బతికితే, తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాల్సిన 182 00:11:26,897 --> 00:11:29,900 అవసరం ఉండదని మాత్రం తెలుసు. ఇప్పుడు ఏమనిపిస్తోంది? 183 00:11:29,900 --> 00:11:33,236 బాబోయ్! వ్యాసం కోసం నేను ఏదో ఒకటి ఆలోచించకపోతే, 184 00:11:33,236 --> 00:11:35,488 నా తల ఒక కోన్ లాగా మారే వరకూ 185 00:11:35,488 --> 00:11:37,949 మిస్టర్ హొరేషియో నాచేత డన్స్ టోపీ పెట్టిస్తారు. 186 00:11:37,949 --> 00:11:41,494 అది భవిష్యత్తులో జరగబోయే విషయం. ఇప్పుడు నీకు ఏమనిపిస్తోంది? 187 00:11:41,494 --> 00:11:42,954 అదీ, 188 00:11:42,954 --> 00:11:45,457 ప్రస్తుతం 189 00:11:45,457 --> 00:11:47,500 ఎండగా ఉంది. 190 00:11:47,500 --> 00:11:49,002 జనం నవ్వుతున్నారు. 191 00:11:50,503 --> 00:11:52,756 నా జుట్టు చక్రాల వాసన వస్తోంది. 192 00:11:54,758 --> 00:11:57,886 తర్వాత ఏం జరుగుతుందో అని కంగారుపడడం కంటే ఇది మంచిదే కదా? 193 00:11:59,804 --> 00:12:01,223 వెళ్దామా? 194 00:12:01,223 --> 00:12:02,474 సరే, వెళ్దాం. 195 00:12:03,600 --> 00:12:05,810 స్విస్ సావనీర్స్ 196 00:12:07,020 --> 00:12:08,480 అయ్యో, ఈ చెత్త చూడు. 197 00:12:08,480 --> 00:12:10,982 ఇది పెట్టుకునే వాళ్ళు వెధవలు అయ్యుంటారు. 198 00:12:14,402 --> 00:12:16,947 సరే, మీరందరూ నేను చెప్పేది వింటున్నారో లేదో పరీక్షిస్తాను. 199 00:12:17,614 --> 00:12:19,783 నేను ఎప్పుడూ శ్రద్ధగానే వింటున్నాను. 200 00:12:19,783 --> 00:12:23,703 మిస్ హాతోర్న్, దయచేసి నా విలువైన వస్తువులను మోసుకొస్తావా? 201 00:12:31,503 --> 00:12:34,965 ఇక్కడ ప్రదర్శించిన వాటిని రూపొందించిన డిజైనర్లలో ఒకరి పేరు ఎవరైనా చెప్పగలరా? 202 00:12:34,965 --> 00:12:37,133 మిస్ వెల్ష్, నువ్వు చెప్పు. 203 00:12:37,676 --> 00:12:40,220 దొరికిపోయాం. దొరికిపోయాం. 204 00:12:40,220 --> 00:12:41,680 నేను ఎదురుచూస్తున్నాను, మిస్ వెల్ష్. 205 00:12:43,515 --> 00:12:45,600 చార్లెస్ ఈమ్స్, మిస్టర్ హెచ్. 206 00:12:46,601 --> 00:12:51,523 కరెక్ట్. బాగా చెప్పావు, మిస్ వెల్ష్. కనీసం ఒకరైనా శ్రద్ధగా వింటున్నందుకు సంతోషంగా ఉంది. 207 00:12:51,523 --> 00:12:53,900 నువ్వు హ్యారియట్ లాగా మాట్లాడగలవని నాకు తెలీదు. 208 00:12:53,900 --> 00:12:55,652 ఇప్పటివరకూ నాక్కూడా తెలీదు. 209 00:12:55,652 --> 00:12:58,363 భయపడినప్పుడు నా గొంతు అలా మారిపోతుందనుకుంటా. 210 00:13:03,535 --> 00:13:05,036 సెక్యూరిటీ వాళ్ళు అక్కడున్నారు. 211 00:13:05,036 --> 00:13:06,454 ఏంటిదంతా? 212 00:13:06,454 --> 00:13:09,916 దీన్ని చూసి భవిష్యత్తు గురించి ఉత్సాహపడకుండా ఎలా ఉండగలవు? 213 00:13:12,711 --> 00:13:13,879 వీడియో ఫోనా? 214 00:13:13,879 --> 00:13:17,632 మాట్లాడేటప్పుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడానికి జనం ఇష్టపడతారని అనుకుంటున్నావా? 215 00:13:17,632 --> 00:13:19,384 ఖచ్చితంగా! 216 00:13:19,384 --> 00:13:21,469 ఫోన్లో తను పకపకా నవ్వే నవ్వు వినడానికి బదులుగా 217 00:13:21,469 --> 00:13:24,055 నా జోకులు విని జేనీ ఎలా నవ్వుతుందో చూడాలని అనుకుంటాను. 218 00:13:30,520 --> 00:13:32,022 అయితే, నీకు వేరే ఐడియాలు ఉన్నాయా? 219 00:13:32,022 --> 00:13:33,523 లేవు. 220 00:13:33,523 --> 00:13:37,527 ఈ ప్రపంచంలోనే ఇది అత్యంత ఫ్యూచరిస్టిక్ గా ఉన్న చోటిది. 221 00:13:37,527 --> 00:13:38,778 అయినప్పటికీ ఏమీ తోచడం లేదా? 222 00:13:38,778 --> 00:13:42,115 నువ్వు నిజమైన రచయితవి అయినప్పుడు, నీ ఆలోచనలు ఏదో ఒక దాని గురించి ఉండకూడదు. 223 00:13:42,115 --> 00:13:45,201 ఇతరులు చూడలేని దృష్టికోణం నుండి నువ్వు విషయాల్ని చూడగలగాలి. 224 00:13:45,201 --> 00:13:46,369 అవును. 225 00:13:46,369 --> 00:13:48,955 అంటే సరైన కోణం నుండి ప్రపంచాన్ని బంధించగలగడం అన్నమాట, 226 00:13:48,955 --> 00:13:50,206 అది నువ్వు మాత్రమే చేయగలవు, సరేనా? 227 00:13:50,206 --> 00:13:53,501 కొన్నిసార్లు సరైన విధంగా ఆలోచించాలంటే చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. 228 00:13:54,252 --> 00:13:57,088 ఆలోచనల్ని మాటల్లో రాయడం చాలా సులభం. పేపర్ తో మాట్లాడినట్లే. 229 00:13:57,088 --> 00:13:59,090 అవునా, అంత తేలిక అయితే, 230 00:13:59,090 --> 00:14:03,261 భవిష్యత్తు గురించి నీకు ఉత్సాహంగా అనిపిస్తున్న విషయమేంటో నువ్వు రాయి, 231 00:14:03,261 --> 00:14:05,263 నేను ఈ మేళాని ఫోటోలు తీస్తాను, సరేనా? 232 00:14:05,263 --> 00:14:07,140 ఎవరు బాగా చేస్తారో వాళ్ళు గెలిచినట్లు. 233 00:14:07,140 --> 00:14:08,558 సరే అయితే. నాకు ఓకే. 234 00:14:14,189 --> 00:14:16,399 -దాన్ని జాగ్రత్తగా చూసుకో. -దాన్ని జాగ్రత్తగా చూసుకో. 235 00:14:18,360 --> 00:14:20,237 నేను నీ ఫోటో తీసుకోవచ్చా? 236 00:14:20,237 --> 00:14:22,614 ఫోటోనా? అదేమీ బాగోదు. 237 00:14:24,157 --> 00:14:25,283 హ్యారియట్. 238 00:14:25,283 --> 00:14:26,743 అనుకోకుండా నొక్కాను. 239 00:14:34,960 --> 00:14:36,920 టైం అయిపోయింది. చూసుకుని ఏడువు. 240 00:14:37,879 --> 00:14:40,799 వీటిలో జీవం ఉట్టిపడుతోంది. మొదటిసారైనా బాగా తీశావు. 241 00:14:41,466 --> 00:14:43,885 థాంక్స్. ఇప్పుడు నీ వంతు. 242 00:14:46,346 --> 00:14:48,890 "భవిష్యత్తు ఒక చెత్త"? 243 00:14:49,599 --> 00:14:51,560 ఈ చోటులో నీకు ఇంకేమీ కనిపించలేదా? 244 00:14:51,560 --> 00:14:52,769 దాని గురించి ఆలోచించు, హ్యారియట్. 245 00:14:52,769 --> 00:14:56,231 భవిష్యత్తు ఎలా ఉన్నా, అందులో చెత్త లేకుండా ఉంటుందా. 246 00:15:04,072 --> 00:15:07,200 అంటే ఆ చెత్తని శుభ్రం చేయడానికి స్వీపర్లు ఉంటారన్నమాట. 247 00:15:09,703 --> 00:15:11,705 ఆగు. నువ్వు చెప్పేది... 248 00:15:11,705 --> 00:15:14,332 భవిష్యత్తులో ఖచ్చితంగా స్వీపర్లు ఉంటారు. 249 00:15:15,792 --> 00:15:18,837 కాదు. భవిష్యత్తు ఖచ్చితంగా చెత్తే. 250 00:15:18,837 --> 00:15:20,672 -స్వీపర్లు. -చెత్త. 251 00:15:21,256 --> 00:15:23,258 రెండూ ఎందుకు కాకూడదు? 252 00:15:24,050 --> 00:15:26,344 భవిష్యత్తు చెత్తది, స్వీపర్లది ఎందుకు కాదు? 253 00:15:26,344 --> 00:15:27,804 నాకు నచ్చింది. ఇదే నిజం. 254 00:15:28,555 --> 00:15:32,726 భవిష్యత్తు చెత్తది, స్వీపర్లది! భవిష్యత్తు చెత్తది, స్వీపర్లది! 255 00:15:32,726 --> 00:15:35,145 భవిష్యత్తు చెత్తది, స్వీపర్లది! 256 00:15:35,145 --> 00:15:39,441 మీరిది విన్నారా? భవిష్యత్తు చెత్తది, స్వీపర్లదట! 257 00:15:39,941 --> 00:15:42,152 -టైం ఎంతయింది? -నాలుగున్నర. 258 00:15:42,152 --> 00:15:45,363 నేను సమయానికి చేరుకోలేను. మనం సెక్యూరిటీ స్టేషన్ దగ్గరలో ఉన్నామా? 259 00:15:45,363 --> 00:15:49,618 ఇంకా ముందుకి వెళ్ళాలి, మీ క్లాసుని మనంతట మనమే కనిపెట్టే అవకాశం ఉన్నప్పుడు, పోలీసుల దగ్గరికి వెళ్ళడం ఎందుకు? 260 00:15:49,618 --> 00:15:51,328 మనం ఏదైనా ఎత్తైన ప్రాంతానికి వెళితే చాలు. 261 00:15:51,328 --> 00:15:55,582 కొడాక్ పెవిలియన్ కంటే ఎత్తైనది ఏమిటని మీ నాన్న చెప్పారు కదా... 262 00:15:57,125 --> 00:15:58,418 జైంట్ వీల్! 263 00:15:58,418 --> 00:16:00,045 వెళ్దాం పద, చక్! ఎవరు ముందు వెళ్తారో చూద్దాం. 264 00:16:00,045 --> 00:16:01,630 హేయ్, చూడు. అతను మీ టీచర్ కదూ? 265 00:16:02,756 --> 00:16:03,757 ఏయ్! 266 00:16:07,928 --> 00:16:09,429 ఏయ్, పరిగెత్తకూడదు! 267 00:16:09,429 --> 00:16:10,722 అవును, పరిగెత్తకూడదు! 268 00:16:12,349 --> 00:16:13,892 మనం చెప్పింది వాళ్ళకి అర్థమయింది కదా! 269 00:16:13,892 --> 00:16:14,976 ఖచ్చితంగా. 270 00:16:23,610 --> 00:16:24,694 నువ్వు బానే ఉన్నావా? 271 00:16:25,278 --> 00:16:29,616 బానే ఉన్నాను. కొద్దిగా ఊపిరాడలేదు అంతే. కాసేపు కూర్చుందామా? 272 00:16:30,533 --> 00:16:31,701 కూర్చోడానికి నాకో మంచి చోటు తెలుసు. 273 00:16:40,377 --> 00:16:41,711 ఎంజాయ్. 274 00:16:41,711 --> 00:16:43,213 ఇప్పుడు... నీకిప్పుడు బానే ఉందా? 275 00:16:43,213 --> 00:16:44,548 బానే ఉన్నానని చెప్పాను కదా. 276 00:16:44,548 --> 00:16:45,966 సరే. 277 00:16:45,966 --> 00:16:48,969 నీకు బాగోకపోయినా నాకు చెప్పు, పరవాలేదు. 278 00:16:48,969 --> 00:16:50,845 మీ క్లాసు పిల్లలు ఎక్కుడున్నారో వెతుకు. 279 00:16:50,845 --> 00:16:52,472 మనం చేయాల్సిన పని అదే కదా? 280 00:16:52,472 --> 00:16:53,557 అది, కానీ... 281 00:16:53,557 --> 00:16:56,309 నా గురించి కంగారుపడడం మానుకో. నాకది నచ్చని విషయం. 282 00:16:56,309 --> 00:16:57,394 నేను బానే ఉన్నాను. 283 00:16:57,394 --> 00:16:59,854 అతను చెప్పిన విధానాన్ని బట్టి నాకు తెలిసింది. 284 00:16:59,854 --> 00:17:02,440 అంటే, "నాకు అస్సలు బాగోలేదు" అని అర్థం. 285 00:17:03,525 --> 00:17:04,901 నేను చక్ కి సాయం చేయాలని అనుకున్నాను, 286 00:17:04,901 --> 00:17:08,862 కానీ వ్యాసం రాయలేకపోయినట్లే, ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. 287 00:17:10,156 --> 00:17:11,824 అదిగో మా క్లాస్. 288 00:17:11,824 --> 00:17:14,660 అటెండెన్స్ పిలిచేలోగా నేను అక్కడికి చేరుకోకపోతే, నా పని అయినట్లే. 289 00:17:17,622 --> 00:17:21,751 లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నేను దీన్లోంచి కిందికి దిగాలి! 290 00:17:21,751 --> 00:17:23,962 నేను నా అసైన్మెంట్ మొదలు కూడా పెట్టలేదు. 291 00:17:23,962 --> 00:17:25,255 నువ్వు కంగారు పడుతున్నావు. 292 00:17:25,255 --> 00:17:28,758 నీకు మిస్టర్ హొరేషియో గురించి తెలీదు. మా అమ్మానాన్నల్ని పిలుస్తారు. 293 00:17:28,758 --> 00:17:29,843 బహుశా పిలుస్తారేమో. 294 00:17:29,843 --> 00:17:33,847 బహుశా నువ్వు సమస్యల్లో పడొచ్చు, పరీక్షల్లో ఫెయిల్ అవ్వొచ్చు, లేదా నిన్ను మిలిటరీ స్కూలుకు పంపొచ్చు. 295 00:17:33,847 --> 00:17:36,057 కానీ కంగారుపడడం వల్ల ఏవీ చక్కబడవు. 296 00:17:36,057 --> 00:17:39,311 కంగారుపడడం వల్ల బాధ కలుగుతుంది. నన్ను నమ్ము. నాకు తెలుసు. 297 00:17:39,811 --> 00:17:40,979 ఎలా? 298 00:17:40,979 --> 00:17:42,063 ఎందుకంటే... 299 00:17:43,064 --> 00:17:46,776 ఎందుకంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుందా అని కొన్నిసార్లు కంగారుపడుతూ ఉంటాను. 300 00:17:48,695 --> 00:17:51,698 నీకు భవిష్యత్తుపై నమ్మకం లేదని చెప్పినట్లున్నావు. 301 00:17:52,782 --> 00:17:56,244 నాతో చెప్పించకు. వినడానికి అతిగా అనిపించొచ్చు, కానీ... 302 00:17:59,164 --> 00:18:00,790 నాకు గుండె జబ్బు ఉంది. 303 00:18:00,790 --> 00:18:02,834 కాబట్టి కొన్నిసార్లు నేను భవిష్యత్తు గురించి కంగారుపడుతూ ఉంటాను. 304 00:18:03,627 --> 00:18:06,004 ప్రస్తుతం జరుగుతున్న వాటినే నేను నమ్మగలను. 305 00:18:06,004 --> 00:18:09,007 ఇదే... ఇదే నాకు స్ఫూర్తిని అందిస్తుంది. 306 00:18:09,007 --> 00:18:12,219 చక్ తల్లిదండ్రులు అంతగా కంగారుపడడానికి కారణం ఇదేనన్నమాట, 307 00:18:13,178 --> 00:18:15,222 తనకి ఊపిరి అందకపోవడానికి, ఇంకా... 308 00:18:15,805 --> 00:18:17,807 తను ఒంటరిగా ఉండడానికి కారణం ఇదేనన్నమాట. 309 00:18:18,892 --> 00:18:22,979 అతను, అతని కెమెరా. ఎక్కడ గాయపడతానో అని భయపడుతున్నాడు. 310 00:18:24,689 --> 00:18:27,234 ఈరోజు పూర్తయిందంటే నమ్మలేకపోతున్నాను. 311 00:18:31,529 --> 00:18:32,656 ఆయన ఏడుస్తున్నారా? 312 00:18:34,824 --> 00:18:35,825 అటెండెన్స్. 313 00:18:35,825 --> 00:18:38,745 నేను అందర్నీ లెక్కబెడుతూ ఉంటే నాకు సాయంగా పేర్లు ఎవరు పిలుస్తారు? 314 00:18:38,745 --> 00:18:41,915 ఆ పని స్పోర్ట్ చేస్తే బాగుంటుంది, మిస్టర్ హొరేషియో. 315 00:18:41,915 --> 00:18:43,792 అన్నిపేర్లూ. 316 00:18:45,168 --> 00:18:47,295 నేను పేర్లు పిలుస్తూ హ్యారియట్ లాగా నటించలేను. 317 00:18:47,295 --> 00:18:48,838 నెమ్మదిగా పిలువు, స్పోర్ట్. 318 00:18:48,838 --> 00:18:51,841 నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ మాట్లాడనంత నెమ్మదిగా మాట్లాడు. 319 00:18:51,841 --> 00:18:53,927 నేను ఇప్పటివరకూ ఈ రైడ్ ఎక్కలేదు. 320 00:18:53,927 --> 00:18:58,557 ఇక్కడి నుండి ఫెయిర్ మరీ అంత దారుణంగా ఏమీ లేదులే. 321 00:18:58,557 --> 00:19:01,810 నువ్వు చేయాల్సిందల్లా దాన్ని వేరే కోణం నుండి చూడడమే. 322 00:19:01,810 --> 00:19:03,645 అలా అని నాకు ఎవరో చెప్పారు. 323 00:19:03,645 --> 00:19:04,938 మంచి సలహా. 324 00:19:05,855 --> 00:19:08,024 మీ క్లాసుని సరైన సమయంలో కనిపెట్టలేకపోయినందుకు సారీ. 325 00:19:08,775 --> 00:19:12,654 భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలీదు, కానీ ఏం జరిగినా పరవాలేదని నువ్వు నాకు నేర్పించావు. 326 00:19:12,654 --> 00:19:15,532 కాబట్టి ఇక కంగారేమీ లేదు. 327 00:19:15,532 --> 00:19:18,910 వర్తమానంలో జీవించాల్సిన సమయం వచ్చింది! 328 00:19:21,037 --> 00:19:22,372 నీతో. 329 00:19:22,372 --> 00:19:24,958 సరే, థాంప్సన్? 330 00:19:24,958 --> 00:19:26,042 ఉన్నాను. 331 00:19:26,042 --> 00:19:28,420 ఇక్కడే ఉన్నాడు. మరి తనాకా ఉన్నాడా? 332 00:19:28,420 --> 00:19:29,546 ఉన్నాను. 333 00:19:31,339 --> 00:19:34,301 వాల్డన్? 334 00:19:34,301 --> 00:19:37,012 త్వరగా, స్పోర్ట్. బస్ వచ్చే టైం అయింది. 335 00:19:37,012 --> 00:19:41,683 ఏంటి సంగతి, స్పోర్ట్? తర్వాతి పేరు వెల్ష్, హ్యారియట్ ఎం. 336 00:19:45,854 --> 00:19:47,731 వావ్! నా బుర్ర పనిచేయట్లేదు. 337 00:19:48,857 --> 00:19:49,983 తన పేరు పిలువు. 338 00:19:56,740 --> 00:19:58,450 వెల్ష్, హ్యారియట్. 339 00:20:02,329 --> 00:20:05,290 -జెయింట్ వీల్ మీద ఉందా? -ఏంటి? 340 00:20:05,874 --> 00:20:08,251 మిస్టర్ హొరేషియో... చూడండి, నేను హ్యారియట్ తరపున మాట్లాడాలని అనుకోవట్లేదు. 341 00:20:08,251 --> 00:20:10,253 కానీ నువ్వు హ్యారియట్ తరపునే మాట్లాడావు. 342 00:20:10,253 --> 00:20:13,048 వరల్డ్ ఫెయిర్ చూడ్డం పూర్తవలేదని తను నాతో చెప్పింది, 343 00:20:13,048 --> 00:20:15,342 జేనీకి, నాకూ కూడా అలాగే అనిపిస్తోంది. 344 00:20:15,342 --> 00:20:16,927 నేను వింటున్నాను, చెప్పు. 345 00:20:16,927 --> 00:20:20,222 ప్రపంచంలోనే అతి ఎత్తయిన జెయింట్ వీల్ ఎక్కకుండా, 346 00:20:20,222 --> 00:20:25,060 వరల్డ్ ఫెయిర్ కి వెళ్లి వచ్చామని ఎలా చెప్పుకోవాలి? 347 00:20:29,731 --> 00:20:33,026 పిల్లలూ, జెయింట్ వీల్ ఎక్కుదాం పదండి! 348 00:20:33,026 --> 00:20:34,361 బస్ సంగతేంటి? 349 00:20:34,361 --> 00:20:35,779 మంచి ఐడియా, మిస్ హాతోర్న్. 350 00:20:35,779 --> 00:20:37,906 నా విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళి బస్సులో పెట్టు, 351 00:20:37,906 --> 00:20:39,115 మేము వెంటనే వచ్చేస్తాం. 352 00:20:39,699 --> 00:20:41,284 ఆగండి. నేనూ వస్తాను. 353 00:20:42,535 --> 00:20:44,746 వావ్! ఇది నిజంగా ఊగుతోంది. 354 00:20:46,539 --> 00:20:48,083 హ్యారియట్, వాళ్ళు నీ క్లాసు పిల్లలే కదూ? 355 00:20:48,708 --> 00:20:49,918 నేను చూడలేను. 356 00:20:49,918 --> 00:20:53,004 వాళ్ళు బస్ ఎక్కుతున్నారా? ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారా? 357 00:20:53,004 --> 00:20:54,214 అలా జరగట్లేదు. 358 00:20:57,717 --> 00:21:00,637 మంచి ఐడియా, హ్యారియట్. నేనే ఈ ఆలోచన చేసి ఉండాల్సింది. 359 00:21:01,972 --> 00:21:03,932 థాంక్యూ అనుకుంటా. 360 00:21:06,935 --> 00:21:10,897 హాయ్ ఫ్రెండ్స్! ఏం చేశారో తెలీదు గానీ, నా జీవితాన్ని కాపాడారు. 361 00:21:12,691 --> 00:21:15,318 బెల్జియన్ వాఫుల్స్ కొనిపెట్టి బదులు తీర్చుకో! 362 00:21:17,404 --> 00:21:19,489 నీ ఫ్రెండ్స్ నీ గురించి బాగా పట్టించుకుంటారు. 363 00:21:19,489 --> 00:21:21,032 నేను గొప్ప దాన్నని చెప్పానుగా. 364 00:21:21,700 --> 00:21:23,535 నువ్వు కూడా గొప్ప వాడివి, చక్. 365 00:21:24,744 --> 00:21:26,621 హ్యారియట్, నేను నీ ఫోటో తీసుకోవచ్చా? 366 00:21:26,621 --> 00:21:30,417 నువ్వు నిజంగా బానే ఉన్నావా? నువ్వు మనిషి ఫోటో తీయాలని అనుకుంటున్నావా? 367 00:21:30,417 --> 00:21:32,586 నేను నిజమైన వ్యక్తి ఫోటో తీయాలని అనుకుంటున్నాను. 368 00:21:32,586 --> 00:21:35,839 నేను దాన్ని, "హ్యారియట్, ది రైటర్" అని పిలుస్తాను. 369 00:21:35,839 --> 00:21:37,883 నువ్వు చేయాల్సిందల్లా అడగడమే. 370 00:21:41,428 --> 00:21:44,347 వ్యాసంలో ఏం రాయాలో నాకు మొత్తానికి తెలిసిపోయింది. 371 00:21:44,347 --> 00:21:48,518 నాకు భవిష్యత్తు పట్ల ఎక్కువగా ఉత్సాహాన్ని కలిగించింది ఏది? అదీ ప్రశ్న. 372 00:21:48,518 --> 00:21:53,231 కానీ ఫెయిర్ లో ఆరోజు తర్వాత, నేను మరింత అద్భుతమైన విషయాన్ని కనుగొన్నాను, 373 00:21:53,231 --> 00:21:56,234 అదేంటంటే వర్తమానంలో జీవించడం. 374 00:21:56,234 --> 00:21:59,571 భవిష్యత్తు ఎన్నోవిధాలుగా ఉండే అవకాశం ఉంది, 375 00:21:59,571 --> 00:22:02,908 కానీ అందులో అధిక భాగం మీకు తెలియందే ఉంటుంది. 376 00:22:02,908 --> 00:22:05,785 తెలియక పోవడం నుండే ఎంతో భయం పుడుతుంది. 377 00:22:06,328 --> 00:22:10,290 ఒకవేళ నా కలలు నిజం కాకపొతే? ఏదైనా అనుకోనిది జరిగితే? 378 00:22:10,290 --> 00:22:12,083 నేను ఒంటరిని అయిపోతే? 379 00:22:12,083 --> 00:22:15,503 కానీ ఒకవేళ వర్తమానంలో జీవిస్తే, 380 00:22:16,213 --> 00:22:20,634 మీ సామర్థ్యాల్ని సవాలు చేసే స్నేహితుడు ఎవరైనా దొరికే అవకాశం ఉంది. 381 00:22:20,634 --> 00:22:24,095 "భిన్నంగా ఆలోచించేలా, అసలైనది సృష్టించేలా చేసేవాడు. 382 00:22:25,096 --> 00:22:29,226 విషయాల్ని వేరే కోణంలో ఎలా చూడాలో తెలియజేసే వాడు. 383 00:22:30,060 --> 00:22:32,771 ఎందుకంటే భవిష్యత్తు మొత్తం ఊహాజనితమే. 384 00:22:33,605 --> 00:22:36,983 కాబట్టి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా 385 00:22:36,983 --> 00:22:39,527 మీరే దాన్ని బాగా మలుచుకోవచ్చు. 386 00:22:41,446 --> 00:22:42,489 కలిసికట్టుగా." 387 00:22:45,700 --> 00:22:46,701 టాప్ సీక్రెట్ 388 00:23:54,978 --> 00:23:56,980 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ