1 00:00:05,966 --> 00:00:09,844 ఓల్ గోలీ లేదు కనుక, నేను బాధతో ఓ మూల ఉండిపోతానేమో అనుకున్నాను. 2 00:00:09,844 --> 00:00:12,764 కానీ విచిత్రంగా, నాకు చాలా హాయిగా అనిపిస్తోంది. 3 00:00:13,348 --> 00:00:15,850 మనం మన కొత్త కారులోకి ఎక్కి కూర్చున్నప్పుడు, 4 00:00:15,850 --> 00:00:18,812 దాని వాసన చూసినప్పుడు కలిగే ఫిలింగ్ అన్నమాట. 5 00:00:19,354 --> 00:00:22,274 నా జీవితంలో కూడా ఆ వాసనే ఉంది అనిపించింది. 6 00:00:22,816 --> 00:00:24,985 నాకు చివరి పరీక్షలో భాగంగా, 7 00:00:24,985 --> 00:00:28,321 ఓల్ గోలీ పాత బెడ్ రూమ్ తలుపును తెరవాలని నిర్ణయించుకున్నాను. 8 00:00:34,077 --> 00:00:36,663 నాకు ఏడుపు రాకపోతే, ఏ బాధా కలగకపోతే, 9 00:00:36,663 --> 00:00:41,501 హ్యారియట్ యుగం మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. 10 00:00:43,795 --> 00:00:45,171 చాలా చాలా థ్యాంక్స్. 11 00:00:47,173 --> 00:00:48,633 గుడ్ మార్నింగ్, హ్యారియట్. 12 00:00:49,384 --> 00:00:51,469 భలే మంచి రోజు, హ్యారియట్. 13 00:00:51,469 --> 00:00:54,264 ఈ శుభధినాన, నా గారాల కూతురు ఎలా ఉందేంటి? 14 00:00:54,264 --> 00:00:57,517 మన తల్లిదండ్రుల ముఖాలలో అతిగా ఆనందం కనిపిస్తే... 15 00:00:58,101 --> 00:01:00,729 నీ ఫేమస్ టొమాటో శ్యాండ్విచ్ విషయంలో నీకు దిగులు అక్కర్లేదు. 16 00:01:00,729 --> 00:01:03,732 ...వాళ్లు మన విషయంలో ఆందోళన పడుతున్నారని ఇట్టే చెప్పేయవచ్చు. 17 00:01:03,732 --> 00:01:06,276 నీ సూపర్ అమ్మ దాని సంగతి తేల్చేస్తుంది. 18 00:01:07,986 --> 00:01:11,364 అమ్మా మహాతల్లీ, అది డయాగనల్ గా కోస్తేనే నాకు నచ్చుతుంది. 19 00:01:11,948 --> 00:01:13,158 అవును కదా. 20 00:01:13,742 --> 00:01:15,201 ఎలా మర్చిపోయానబ్బా? అది... 21 00:01:15,952 --> 00:01:17,746 ఎన్నిసార్లు చేస్తే అంత పిస్తా అవుతాం. 22 00:01:19,497 --> 00:01:24,961 అమ్మా, ఇప్పటికి ఓల్ గోలీ చేసిన 5,027 శ్యాండ్విచులు తినుంటాను, 23 00:01:24,961 --> 00:01:28,798 ఇక దాన్ని పక్కనపెట్టేసి, ఇంకేదైనా కొత్తది చేయడానికి ప్రయత్నించు. 24 00:01:28,798 --> 00:01:29,925 వేడి వేడి లంచ్ లాంటిదేదైనా. 25 00:01:31,843 --> 00:01:33,803 ఆ ఐడియా అదిరిపోయింది. 26 00:01:34,387 --> 00:01:36,056 నా దగ్గర అలాంటివి సవా లక్ష ఉన్నాయి. 27 00:01:36,056 --> 00:01:37,140 ఉంటా మరి. 28 00:01:39,559 --> 00:01:42,979 ఈ కొత్త జీవితపు పరిమళం యమ బాగా ఉంది. 29 00:01:44,231 --> 00:01:47,150 {\an8}నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 30 00:01:47,150 --> 00:01:48,860 మనకు నచ్చినట్లు ఉండాలి 31 00:01:49,736 --> 00:01:51,988 నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అదే అవుతాను 32 00:01:51,988 --> 00:01:54,407 నాదే తుది నిర్ణయం 33 00:01:54,407 --> 00:01:57,410 లేదు, నా జుట్టు కత్తిరించుకోను 34 00:01:57,410 --> 00:01:59,579 నాకు నచ్చిందే వేసుకుంటాను 35 00:01:59,579 --> 00:02:06,127 నాకు నచ్చినట్లుగా ఉండడం నాకిష్టం 36 00:02:06,127 --> 00:02:08,504 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 37 00:02:08,504 --> 00:02:11,466 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 38 00:02:11,466 --> 00:02:12,551 {\an8}"హ్యారియట్ యుగం" 39 00:02:14,553 --> 00:02:15,679 {\an8}లూయిస్ ఫిట్జ్ హ్యూ రచించిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 40 00:02:16,555 --> 00:02:20,976 హ్యారియట్ యుగాన్ని ప్రారంభించడానికి ఒక థీమ్ సాంగ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. 41 00:02:25,230 --> 00:02:26,314 వారెవ్వా. 42 00:03:19,618 --> 00:03:20,619 నువ్వు బాగానే ఉన్నావా? 43 00:03:20,619 --> 00:03:21,912 సూపర్ గా ఉన్నాను. 44 00:03:21,912 --> 00:03:23,496 అంటే చాలా ఆనందంగా ఉన్నావనా? 45 00:03:23,496 --> 00:03:25,248 లేకపోతే "ఓల్ గోలీని మిస్ అవుతున్నా, 46 00:03:25,248 --> 00:03:27,417 పిచ్చిదానిలా ఏడుస్తూ, అరుస్తాను," అనా? 47 00:03:27,417 --> 00:03:29,502 ఏం చేస్తున్నావు? 48 00:03:29,502 --> 00:03:33,256 ముక్కును నాలుకతో తాకుదామని ప్రయత్నిస్తున్నా. 49 00:03:33,256 --> 00:03:34,799 ఇప్పటిదాకా అలా అస్సలు చేయలేకపోయాను. 50 00:03:35,300 --> 00:03:39,012 గుడ్ మార్నింగ్, నా యువ నటీనటులారా. 51 00:03:39,012 --> 00:03:41,389 వావ్! సాధించాను. 52 00:03:41,389 --> 00:03:43,350 క్లాస్ మొదలైంది, హ్యారియట్. 53 00:03:43,350 --> 00:03:45,143 సారీ, మిస్ ఎల్సన్. 54 00:03:45,143 --> 00:03:49,648 ఫాల్ హార్వెస్ట్ డేకి ఎన్నో రోజులు లేవని అందరికీ తెలిసిందేగా. 55 00:03:49,648 --> 00:03:53,068 మన వార్షిక తరగతి నాటకంతో వేడుక చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. 56 00:03:53,068 --> 00:03:55,528 ఎవరన్నా ఏమైనా ఐడియా చెప్పగలరా? 57 00:03:58,531 --> 00:03:59,866 మనకు ఎందుకు? 58 00:03:59,866 --> 00:04:02,911 ప్రతీ ఏడాదీ, మిస్ ఎల్సన్ ఐడియాల కోసం అడుగుతూనే ఉంటుంది, 59 00:04:02,911 --> 00:04:06,998 ప్రతీసారి ఆ మేరియన్ చెత్త ఐడియాలకే ఓకే అంటుంది. 60 00:04:06,998 --> 00:04:10,585 మిస్ ఎల్సన్, మేరియన్ కి ఎప్పుడూ ఎందుకు తానా తందానా అంటుంది అంటే 61 00:04:10,585 --> 00:04:11,586 ఒక్కొక్కరూ ఒక్కోటి చెప్తారు. 62 00:04:11,586 --> 00:04:14,923 -రెండే పదాలు. కీలు... -బొమ్మ. 63 00:04:14,923 --> 00:04:17,634 టీచర్ కి మేరియన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చి 64 00:04:17,634 --> 00:04:19,636 బుట్టలో పడేసుకుందని విన్నాను. 65 00:04:20,845 --> 00:04:22,806 నన్ను ఎందుకు అడుగుతున్నారు? నాకు ఏమీ తెలీదు. 66 00:04:22,806 --> 00:04:24,933 అసలు నాకు ఎందుకు తెలుసని అనుకుంటున్నారు? 67 00:04:25,892 --> 00:04:27,602 నిజానికి, నాకు ఒకరు ఏం చెప్పారంటే... 68 00:04:29,521 --> 00:04:32,691 హాయ్, మేరియన్. నీ కోసమే ఈ సీటు అట్టిపెట్టి ఉంచా. 69 00:04:33,817 --> 00:04:35,277 ఇక ఆపండి. 70 00:04:35,777 --> 00:04:38,530 దోపిడీ దొంగల మీద గానీ, లేదా ఎలుగు బంట్ల మీద గానీ ఏదైనా చేద్దాం. 71 00:04:39,239 --> 00:04:41,575 లేకపోతే, రేడియంని, అలాగే నిజమైన ప్రేమని కనుగొన్న మేడమ్ క్యూరీ, ఇంకా ఆమె భర్తపై 72 00:04:41,575 --> 00:04:42,659 ఒక నాటిక చేద్దామా? 73 00:04:42,659 --> 00:04:44,661 దోపిడీ దొంగలు, ఎలుగుబంట్ల మీద చేద్దాం. 74 00:04:45,078 --> 00:04:47,998 మనం చలికాలాన్ని స్వాగతిస్తూ సెలవును జరుపుకుంటాం కాబట్టి, 75 00:04:47,998 --> 00:04:50,208 వెచ్చగా ఉండటానికి సంబంధించినది ఏదైనా చేద్దామా? 76 00:04:50,208 --> 00:04:53,169 అవును, గ్లవ్స్ కి జై కొడదాం. 77 00:04:53,169 --> 00:04:56,715 లేదా రైలు వెళ్లగానే సబ్ వే గ్రేట్ మీద నిల్చొని, 78 00:04:56,715 --> 00:04:59,759 అప్పుడు పైకి వచ్చే ఆ వెచ్చని గాలిని తనివితీరా ఆస్వాదిద్దాం. 79 00:04:59,759 --> 00:05:01,761 నేను కూడా సరిగ్గా అదే చెప్పబోతున్నా. 80 00:05:01,761 --> 00:05:03,889 -దోస్త్... -మేరా దోస్త్. 81 00:05:05,348 --> 00:05:06,516 ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? 82 00:05:07,017 --> 00:05:09,311 ఏం చెప్పను? జీవితంలో ఎప్పుడోకప్పుడు ముందడుగు వేయాల్సిందే. 83 00:05:09,936 --> 00:05:11,229 చెప్పు, హ్యారియట్. 84 00:05:11,730 --> 00:05:15,609 {\an8}ఫాల్ హార్వెస్ట్ డే నాడు మనం ఎప్పుడూ ఫుల్ తందూరీ చికెన్ తింటాము కనుక... 85 00:05:15,609 --> 00:05:16,693 {\an8}అత్యంత రహస్యమైనది 86 00:05:16,693 --> 00:05:18,528 {\an8}...మనం హిస్టరీలో ట్రోజన్ వార్ పాఠం చదువుతున్నాం కనుక, 87 00:05:18,528 --> 00:05:22,157 గ్రీకులు ట్రోజన్లకు ఒక పెద్ద ట్రోజన్ చికెన్ ని బహుమతిగా ఇచ్చినట్టు నాటిక వేద్దామా? 88 00:05:22,157 --> 00:05:25,577 సరిగ్గా వారు దాన్ని హాంఫట్ చేసే సమయానికి, వారిపై మెరుపుదాడి జరుగుతుంది. 89 00:05:30,123 --> 00:05:33,293 నా కళ్ల ముందు అంతా కదలాడుతోంది. నా నాటిక స్కూల్ లో సూపర్ హిట్ అయి 90 00:05:33,293 --> 00:05:34,419 హాలీవుడ్ కి చేరుతుంది, 91 00:05:34,419 --> 00:05:36,755 అప్పుడు మోంట్రియల్ లో ఉన్న ఓల్ గోలీ కూడా దాన్ని చూస్తుంది. 92 00:05:40,217 --> 00:05:44,262 మేరియన్, మమ్మల్ని సస్పెన్స్ లో ఉంచకుండా నీ ఐడియా చెప్పేయ్. 93 00:05:44,930 --> 00:05:48,225 ఫాల్ హార్వెస్ట్ విందులో మనం వేటినైతే తింటామో, ఆ వేషాలను వేసి 94 00:05:48,225 --> 00:05:49,601 వేడుకను జరుపుకుందామని అంటాను. 95 00:05:49,601 --> 00:05:52,771 అది సంబంధితంగా, వాస్తవికంగా ఉంటుంది, అంతే కాదు, 96 00:05:52,771 --> 00:05:55,065 నేను స్క్రిప్ట్ కూడా రాసేశాను. 97 00:05:55,565 --> 00:05:57,859 ఇది హ్యారియట్ యుగమని 98 00:05:57,859 --> 00:06:01,238 మిస్ ఎల్సన్ ఇంకా గ్రహించినట్టు లేదు. 99 00:06:02,072 --> 00:06:03,907 శభాష్, మేరియన్. 100 00:06:03,907 --> 00:06:06,993 అయితే నీకు తందూరీ చికెన్ లా నటించాలని ఉంది కదా. 101 00:06:07,827 --> 00:06:08,995 సూపర్. 102 00:06:08,995 --> 00:06:14,000 రేచెల్, ఇంకా బెత్ ఎల్లెన్, మీ ఇద్దరూ చికెన్ డ్రమ్ స్టిక్స్ లా నటించండి. 103 00:06:14,501 --> 00:06:18,129 మిస్టర్ మాథ్యూస్, ఇంకా పింకీ, మీరు గెనుసు గడ్డల్లా నటించండి. 104 00:06:18,129 --> 00:06:22,217 కేరీ, నువ్వు క్యాబేజీలా నటించు. 105 00:06:22,217 --> 00:06:25,804 జేనీ, ఇంకా స్పోర్ట్, ఫ్రెంచ్ ఫ్రైస్ గా సరిగ్గా ఉంటారు. 106 00:06:25,804 --> 00:06:30,892 హ్యారియట్, నీకు ఉల్లిపాయ పాత్ర అయితే సూపర్ గా ఉంటుంది కదా, ఏమంటావు? 107 00:06:32,686 --> 00:06:35,730 "కుదరదు, కుదరదు, 108 00:06:35,730 --> 00:06:38,233 అస్సలు కుదరదు," అని అంటాను. 109 00:06:38,233 --> 00:06:42,320 అయ్యయ్యో. హ్యారియట్, అది పిచ్చితనం. 110 00:06:42,320 --> 00:06:44,739 ఉల్లిపాయలు చాలా అందంగా ఉంటాయి. 111 00:06:44,739 --> 00:06:47,075 అవి కంపు కొడతాయి, కళ్ల నీళ్లు తెప్పిస్తాయి. 112 00:06:47,659 --> 00:06:50,287 కంటికి కనిపించిందే నిజమని అనుకుంటే ఎలా! 113 00:07:00,630 --> 00:07:02,632 ఏం చేస్తున్నావు నువ్వు? 114 00:07:02,632 --> 00:07:05,677 మిస్ ఎల్సన్ ఏం చెప్పిందంటే, అసలైన ఉల్లిపాయలా నటించాలంటే, 115 00:07:05,677 --> 00:07:09,180 కింద పడినప్పుడు ఉల్లిపాయ ఎలా అయితే దొర్లుతుందో, అలా దొర్లడం నేను కూడా నేర్చుకోవాలట. 116 00:07:13,226 --> 00:07:15,020 ఫాల్ హార్వెస్ట్ నాటిక కోసమా? 117 00:07:15,020 --> 00:07:18,648 లేదమ్మా, ఉత్తినే పిచ్చి పట్టి సరదాగా దొర్లుతున్నా. 118 00:07:19,232 --> 00:07:20,609 అడిగాను, అంతేగా. 119 00:07:23,737 --> 00:07:24,946 బాబోయ్, ఏం చేస్తున్నావు? 120 00:07:24,946 --> 00:07:26,489 ఉల్లిపాయలా నటిస్తోంది. 121 00:07:26,489 --> 00:07:28,992 ఒక మంచి దర్శకుడు ఏమని చెప్తాడంటే, ఉల్లిపాయలా ఉండాలంటే, 122 00:07:28,992 --> 00:07:30,994 నువ్వు ఉల్లిపాయలా ఫీల్ అవ్వాలి. 123 00:07:30,994 --> 00:07:33,288 అలా నువ్వు ఫీల్ అవుతున్నావా? 124 00:07:33,914 --> 00:07:35,457 అస్సలు ఫీల్ అవ్వట్లేదు. 125 00:07:36,833 --> 00:07:39,502 హనీ, నువ్వు ఉల్లిపాయలా ఫీల్ అవ్వాలి. 126 00:07:40,420 --> 00:07:42,255 నాకు అసలు ఉల్లిపాయలా ఉండాలనే లేదు. 127 00:07:42,255 --> 00:07:43,632 అది మంచి విషయమే కదా. 128 00:07:43,632 --> 00:07:46,009 ఈ రోజుల్లో ఉల్లిపాయల పాత్రలు దొరకడమే కష్టం. 129 00:07:46,009 --> 00:07:47,510 పెద్ద తెలివైనోడివేలే గానీ. 130 00:07:47,510 --> 00:07:50,180 ఉల్లిపాయలా నువ్వు దొర్లు, చూద్దాం. 131 00:07:50,180 --> 00:07:52,015 చూసి తరించు. 132 00:08:00,190 --> 00:08:02,651 ఇప్పుడు నువ్వు ఉల్లిపాయలా ఫీల్ అవుతున్నావా? 133 00:08:02,651 --> 00:08:05,570 ఉల్లిపాయలా చేయాలనే ప్రయత్నించా, కాకపోతే కాకరకాయ అయ్యా. 134 00:08:06,613 --> 00:08:07,614 సారీ. 135 00:08:07,614 --> 00:08:10,367 నవ్వు వస్తుందా, నువ్వు ప్రయత్నించు చూద్దాం! 136 00:08:10,951 --> 00:08:12,327 తప్పకుండా. 137 00:08:18,166 --> 00:08:19,876 ఉల్లిపాయ ఎలాగూ అయిపోయాను కనుక, 138 00:08:19,876 --> 00:08:22,796 టేబుల్ లాగా ఉంటే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చింది. 139 00:08:22,796 --> 00:08:25,465 లేదా బాత్ టబ్ లా. మరొక వ్యక్తిలా. 140 00:08:30,762 --> 00:08:33,306 దానికి ఓల్ గోలీ ఏమంటుందో ఏమో. 141 00:08:34,599 --> 00:08:35,808 గార్సియాస్ బేకరీ మరియు కూరగాయల దుకాణం 142 00:08:35,808 --> 00:08:37,726 ఓల్ గోలీ పళ్లున్న పక్షిలా ఉంటుంది, 143 00:08:37,726 --> 00:08:40,772 కానీ నేనైతే నిజంగానే ఉల్లిపాయలా ఉంటాను అనుకుంటా. 144 00:08:41,273 --> 00:08:45,527 ఆ మహా వైఫల్యం తర్వాత, నన్ను నేను పూర్తిగా ఉల్లిపాయలా మలుచుకోవాలంటే, 145 00:08:46,027 --> 00:08:48,238 మరింత రీసెర్చ్ చేయాలని నిర్ణయించుకున్నా. 146 00:08:48,738 --> 00:08:51,575 నాలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, 147 00:08:51,575 --> 00:08:55,537 పసుపు ఉల్లిపాయ గాఢంగా ఉంటుంది. 148 00:08:56,162 --> 00:08:58,498 నాలో సల్ఫర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి, 149 00:08:58,498 --> 00:09:02,878 కాస్తంత తీయగా ఉంటానని బెర్ముడా ఉల్లిపాయగా నాకు పేరు ఉంది. 150 00:09:02,878 --> 00:09:05,672 ఈ పిచ్చోళ్ల మాటలను వినవద్దు. 151 00:09:05,672 --> 00:09:09,426 తీయగా ఉండాలి, అదే సమయంలో గాఢంగా కూడా ఉండాలి అంటే, 152 00:09:09,426 --> 00:09:11,386 నీకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. అది... 153 00:09:11,386 --> 00:09:13,597 -బెర్మూడా ఉల్లిపాయ. -కాదు, అది... 154 00:09:13,597 --> 00:09:15,974 పసుపు ఉల్లిపాయ. వెళ్లి మొహం అద్దంలో చూసుకో. 155 00:09:17,183 --> 00:09:19,352 కాదు, విదాలియా ఉల్లిపాయ. 156 00:09:20,186 --> 00:09:22,314 ఆ తర్వాత లైబ్రరీ నుండి పుస్తకాలను తెచ్చుకొని 157 00:09:22,314 --> 00:09:25,442 భలే గమ్మత్తైన విషయాల గురించి తెలుసుకున్నాను. 158 00:09:25,442 --> 00:09:29,863 ఒకానొకప్పుడు న్యూయార్క్ నగరాన్ని బిగ్ ఆనియన్ అనేవారని తెలుసా? 159 00:09:29,863 --> 00:09:32,324 ఎందుకంటే, ఇక్కడ కూడా మీరు ఉల్లిపాయలాగా పొరలు తీసేకొద్దీ 160 00:09:32,324 --> 00:09:35,994 జనాల గురించి, ఊరి గురించి కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. 161 00:09:36,578 --> 00:09:39,873 ఇంకా ప్రాచీన కాలపు ఈజిప్ట్ వాసులు ఉల్లిపాయని దేవునిలా కొలిచేవారట. 162 00:09:39,873 --> 00:09:42,417 దాని గోళాకారం, ఇంకా గుండ్రంగా ఉండే పొరలు, 163 00:09:42,417 --> 00:09:46,296 అమరత్వానికి ప్రతీక అని భావించేవాళ్లు. 164 00:09:46,296 --> 00:09:47,756 ఎక్కువగా చదివే కొద్దీ, 165 00:09:47,756 --> 00:09:52,219 ఓల్ గోలీ చెప్పిన గొప్ప గొప్ప కోట్స్ లో ఒకానొక కోట్ నాకు బాగా అర్థమవ్వసాగింది. 166 00:09:52,719 --> 00:09:54,304 డోస్టోయాస్కీ ఏమన్నాడంటే, 167 00:09:54,304 --> 00:09:56,306 "మనం అన్నిటినీ ప్రేమిస్తే, 168 00:09:56,306 --> 00:10:00,018 వాటన్నిట్లోనూ ఉండే నిగూఢార్థాలు మనకి అవగతమవుతాయి." 169 00:10:07,734 --> 00:10:10,237 తర్వాతి రోజు, మేము వేషాలు వేసుకున్నప్పుడు నాకు అనిపించింది, 170 00:10:10,237 --> 00:10:12,447 ఈ పిచ్చి వేషంలో నన్ను డోస్టోయాస్కీ చూస్తే, 171 00:10:12,447 --> 00:10:16,034 అప్పుడు ప్రేమా దోమా అని ఏమంటాడో చూద్దాం అని. 172 00:10:16,034 --> 00:10:18,745 నా పుస్తకాన్ని దాచుకోవడానికి కనీసం నా వేషానికి ఒక రహస్యమైన జేబు అయినా ఉంది. 173 00:10:18,745 --> 00:10:21,581 అది కోతుల్లా నాకు దురద కలిగించలేదు. 174 00:10:21,581 --> 00:10:24,042 కేరీ ఆండ్రూస్ వేషంలా కూడా లేదు, 175 00:10:24,042 --> 00:10:27,754 అది అంతా బాగానే ఉంది ఒక విచిత్రమైన విషయంలో తప్ప. 176 00:10:30,590 --> 00:10:33,426 ఇది క్యాబేజీలా కంపు కొడుతోంది ఏంట్రా నాయనా! 177 00:10:34,511 --> 00:10:38,139 పింకీ, ఇంకా పర్పుల్ సాక్స్ ఒకేలా ఉండే గెనుసు గడ్డ వేషాల్లో వచ్చారు. 178 00:10:38,139 --> 00:10:40,308 నువ్వు సూపర్ ఉన్నావు. 179 00:10:40,308 --> 00:10:43,562 నువ్వు బంపర్ ఉన్నావు. 180 00:10:46,189 --> 00:10:48,567 రేచెల్, బెత్ ఎల్లెన్ లు చికెన్ డ్రమ్ స్టిక్స్ వేషాల్లో వచ్చారు. 181 00:10:48,567 --> 00:10:50,986 నేను పడిపోతున్నా. పట్టుకో. 182 00:10:51,861 --> 00:10:54,322 అయ్యో. సారీ, బెత్ ఎల్లెన్. నాకు చేతులు లేవు. 183 00:10:55,782 --> 00:10:57,242 మీరు ఊహించినట్టుగానే, 184 00:10:57,242 --> 00:11:03,123 ఇప్పటిదాకా వచ్చిన వేషాల్లో మేరియన్ దే అదిరిపోయింది. 185 00:11:03,123 --> 00:11:08,503 ఏంటి? బ్రాడ్ వేలలోని నాటికలకు కాస్ట్యూమ్స్ ని తయారు చేసే గొప్ప ఆంటీ ఎవరికీ లేదా ఏంటి? 186 00:11:10,589 --> 00:11:16,386 ముందుగా, అందరినీ చూస్తుంటే నోరు ఊరిపోతోంది. 187 00:11:18,430 --> 00:11:19,848 నోట్లో వేసేసుకోవాలి అనిపిస్తోంది. 188 00:11:25,270 --> 00:11:29,482 చేయి అందిస్తావా, లేకపోతే నీ పేరు కూడా లిస్టులో వేసేయనా? 189 00:11:30,150 --> 00:11:30,984 లిస్ట్ 190 00:11:30,984 --> 00:11:33,028 రేచెల్ దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది, 191 00:11:33,028 --> 00:11:35,196 అందులో తను పగ తీర్చుకోబోయే వాళ్ల పేర్లను రాస్తుంది. 192 00:11:35,196 --> 00:11:36,698 మిస్టర్ హొరేషియో. 193 00:11:37,699 --> 00:11:39,409 థ్యాంక్స్, మిస్టర్ హొరేషియో. 194 00:11:39,409 --> 00:11:40,702 పర్వాలేదు. 195 00:11:41,411 --> 00:11:43,997 సరే. నేను నిలబెట్టాను. నిలబెట్టానుగా. 196 00:11:43,997 --> 00:11:47,375 అంతే, రేచెల్. ఏమీ జరగలేదు. 197 00:11:48,627 --> 00:11:49,628 పైకెత్తండి. 198 00:11:49,628 --> 00:11:54,424 మన మొదటి రిహార్సల్ కి, "మనం మన పాత్రల్లో లీనమైపోవడానికి 199 00:11:54,424 --> 00:11:58,720 మున్ముందుగా మనం చేయాల్సింది ఏంటి?" అనే ప్రశ్న వేసుకుందాం. 200 00:11:58,720 --> 00:12:04,017 నన్ను అడిగితే, నా పాత్ర గురించి బాగా రీసెర్చ్ చేసి బాగా తెలుసుకోవడం అని చెప్తాను. 201 00:12:04,017 --> 00:12:08,521 వావ్ హ్యారియట్, నువ్వు మహానటిలా ఉన్నావే? 202 00:12:08,521 --> 00:12:13,652 నిజం చెప్పాలంటే, ఆ సలహా నాకు చాలా బాగా నచ్చింది, హ్యారియట్. 203 00:12:13,652 --> 00:12:19,783 మీ మీ పాత్రల గురించి తెలుసుకోవడానికి అందరూ కాస్తంత సమయం వెచ్చించండి. 204 00:12:22,452 --> 00:12:24,454 సారీ, బెత్ ఎల్లెన్, నిన్ను గమనించనే లేదు. 205 00:12:29,834 --> 00:12:31,294 జాగ్రత్త. 206 00:12:31,294 --> 00:12:33,171 చికెన్ అన్నాక డ్రమ్ స్టిక్స్ ఉండాలి కదా. 207 00:12:37,926 --> 00:12:39,010 నా మీద నుండి లేవండి. 208 00:12:39,010 --> 00:12:41,304 రిహార్సల్స్ లో ఒక వారం గడిచాక, 209 00:12:41,304 --> 00:12:44,766 సైడ్ డిషెస్ కి నేను అనధికారిక లీడర్ ని అయిపోయా. 210 00:12:44,766 --> 00:12:46,518 మనం కేవలం సైడ్ డిషెస్ మాత్రమే అని నాకు తెలుసు. 211 00:12:46,518 --> 00:12:49,729 కానీ మనం కలిసికట్టుగా పని చేస్తే పెనుమార్పును సృష్టించవచ్చు. 212 00:12:50,939 --> 00:12:52,274 తడాఖా చూపుదాం! 213 00:12:53,650 --> 00:12:57,404 మిస్ ఎల్సన్, నా నాటికకి హ్యారియట్ కొత్త డైలాగ్స్ రాస్తోంది. 214 00:12:59,406 --> 00:13:03,243 స్క్రిప్ట్ చాలా బాగుంది, మేరియన్. 215 00:13:03,243 --> 00:13:07,831 కాకపోతే సైడ్ డిషెస్ కి కూడా ప్రాముఖ్యత ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా. 216 00:13:07,831 --> 00:13:09,124 నేను ఒకసారి చూడనా? 217 00:13:11,751 --> 00:13:14,045 నీ ఉద్దేశం నాకు అర్థమైంది, హ్యారియట్. 218 00:13:14,045 --> 00:13:16,172 తందూరీ చికెన్ ఇందులో ప్రధాన హీరో. 219 00:13:16,172 --> 00:13:20,427 కానీ సైడ్ డిషెస్ లేకపోతే, ఫాల్ హార్వెస్ట్ విందుకు అర్థమే ఉండదు. 220 00:13:21,011 --> 00:13:22,512 అవును. 221 00:13:22,512 --> 00:13:25,765 నేను రాసే ప్రసంగంలో ఆ డైలాగును నేను వాడుకోవచ్చా? 222 00:13:25,765 --> 00:13:27,767 అది కత్తిలా ఉంది. 223 00:13:29,102 --> 00:13:30,896 ఓహో! తప్పకుండా వాడుకో. 224 00:13:31,980 --> 00:13:34,399 గొప్పదానివే, హ్యారియట్ ఎం. వెల్ష్. 225 00:13:34,399 --> 00:13:36,484 నువ్వు గొప్పదానివే. 226 00:13:40,155 --> 00:13:43,617 మేరియన్ స్క్రిప్టును మార్చడం అనుకున్న దాని కన్నా చాలా కష్టంగా ఉంది. 227 00:13:44,993 --> 00:13:46,703 హలో, హ్యారియట్. 228 00:13:46,703 --> 00:13:48,455 ఓల్ గోలీ. 229 00:13:50,957 --> 00:13:52,459 మోంట్రియల్ ఎలా ఉంది? 230 00:13:52,459 --> 00:13:54,586 కొద్దిగ ఫ్రెంచ్ నేర్చుకున్నా. 231 00:13:56,963 --> 00:13:59,132 అంటే, "రాయడం ఎలా సాగుతోంది?" అని అర్థం. 232 00:14:01,009 --> 00:14:02,135 నాకు కంగారుగా ఉంది. 233 00:14:02,135 --> 00:14:05,847 ఇప్పటిదాకా నేను రాసినదాన్ని ఎవరికీ చూపించలేదు. 234 00:14:05,847 --> 00:14:07,390 ఒకవేళ అది దరిద్రంగా ఉంటే? 235 00:14:07,390 --> 00:14:12,771 రచయిత అయిన శామ్యూల్ బెకెట్ జీవితం గురించి ఒక మాట చెప్పాడు, అది రచనలకు కూడా వర్తిస్తుంది. 236 00:14:12,771 --> 00:14:16,191 "ఇక ముందుకు సాగడం నా వల్ల కాదు. అయినా కూడా సాగిపోతాను." 237 00:14:17,025 --> 00:14:18,401 కాబట్టి, దాన్ని ఫాలో అవ్వు. 238 00:14:19,194 --> 00:14:20,946 వెళ్లిపోకు. 239 00:14:21,446 --> 00:14:23,531 నువ్వు ప్రతీరాత్రి నా మీద నుండి దుప్పటి తీసి 240 00:14:23,531 --> 00:14:25,450 ఇక పడుకో అని చెప్పాలి. 241 00:14:25,450 --> 00:14:29,037 అమ్మానాన్నలు అలా ఎప్పుడూ చేయరు. అదీగాక, నేను నిన్ను మిస్ అవుతున్నా. 242 00:14:30,497 --> 00:14:34,000 ఆ రివో, హ్యారియట్. ఆ రివో. 243 00:14:34,668 --> 00:14:36,545 అంటే ఫ్రెంచిలో... 244 00:14:36,545 --> 00:14:38,129 బై అని. 245 00:14:41,925 --> 00:14:45,595 నేను పెద్దదాన్ని అయిపోయానని తెలుసు. 246 00:14:45,595 --> 00:14:47,013 కానీ ఇది నాకు దిక్కుతోచని స్థితి, 247 00:14:47,013 --> 00:14:50,809 మళ్లీ అయిదేళ్ల పాపలా నటించడం తప్ప నాకు మరో దారి లేదు. 248 00:15:09,995 --> 00:15:12,163 నన్ను ఓల్ గోలీ కాపాడదు, 249 00:15:12,163 --> 00:15:14,666 ఇలా అయిదేళ్ల పాపలా నటించడం వల్ల కూడా ఉపయోగం లేదు. 250 00:15:18,086 --> 00:15:20,964 నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ల నుండి సపోర్ట్ ఇక జన్మలో నాకు దక్కదు. 251 00:15:20,964 --> 00:15:26,177 ఇప్పుడు నన్ను కాపాడే ఏకైక వ్యక్తి, హ్యారియట్ ఎం. వెల్ష్. 252 00:15:29,055 --> 00:15:35,687 "మిత్రులారా, సహవిద్యార్థులారా, మంచివాళ్లారా, నేను చెప్పేది వినండి." 253 00:15:37,314 --> 00:15:38,315 చెత్తలా ఉంది. 254 00:15:40,317 --> 00:15:46,531 "సైడ్ డిషెస్ గానే ఉండాలా, ఫ్రంట్ డిషెస్ గా ఉండకూడదా?" 255 00:15:47,991 --> 00:15:49,784 ఫ్రంట్ డిషెస్? 256 00:16:02,756 --> 00:16:06,968 బంగాళా దుంపల్లా మా ప్రయాణం ఆరంభించాం 257 00:16:06,968 --> 00:16:10,847 రుచికరమైన వంటకం అనే ఊరికి వెళ్లే రైలెక్కాం 258 00:16:10,847 --> 00:16:15,727 గ్రేటర్లతో కలిసి చిందులేశాం గోధుమ రంగు వచ్చే దాకా ఫ్రై అయ్యాం 259 00:16:15,727 --> 00:16:20,941 కరకరలాడే వంటకాలలో పోటీ పెడితే విజయ సింహాసనం మాదేలే 260 00:16:20,941 --> 00:16:22,943 ఆ పాట ఎక్కడి నుండి ఊడిపడిందో తెలీదు కానీ 261 00:16:22,943 --> 00:16:25,862 అది స్క్రిప్టులో పెడితే ఏమవుతుందో చూద్దామనుకున్నాను. 262 00:16:25,862 --> 00:16:30,992 రుచికరమైన వంటకం అనే ఊరికి మీకు దారి చూపుతాం 263 00:16:33,453 --> 00:16:37,916 మిస్ ఎల్సన్, హ్యారియట్ కొన్ని డైలాగులు రాస్తానంటే మంచితనంతో ఒప్పుకున్నా, 264 00:16:37,916 --> 00:16:40,293 కానీ ఇలా నా నాటకాన్ని తను సంగీత కచేరీలా మార్చేస్తానంటే 265 00:16:40,293 --> 00:16:41,753 నేను ఒప్పుకొనే దాన్నే కాదు. 266 00:16:42,587 --> 00:16:47,217 మేరియన్, నీ కోపం నాకు అర్థమైంది. 267 00:16:47,801 --> 00:16:50,720 ఆ విషయంలో ఇప్పుడు నువ్వు ఏదోకటి చేయాలి. 268 00:16:50,720 --> 00:16:55,934 కోపం, ద్వేషం, అసూయ వంటి ఎమోషన్స్ నీలో రగిలిపోతున్నాయి. 269 00:16:56,601 --> 00:17:01,773 ఆ ఫీలింగ్స్ ని ఆవహించు, ఆ తర్వాత ఏమవుతుందో చూడు. 270 00:17:01,773 --> 00:17:03,149 కానీ, మిస్ ఎల్సన్... 271 00:17:03,149 --> 00:17:07,529 నటన అనేది ఒక ప్రయాణం, మేరియన్. భయపడిపోకు. 272 00:17:07,529 --> 00:17:10,282 ఇక హ్యారియట్, మొదటి నుండి ప్రారంభించు. 273 00:17:10,282 --> 00:17:14,035 ఇప్పుడు సైడ్ డిషెస్ అన్నీ వచ్చి కోరస్ లో జాయిన్ అవ్వాలి. 274 00:17:15,203 --> 00:17:19,708 ఒకటి, రెండు, మూడు. 275 00:17:24,004 --> 00:17:27,007 నేను ఏదో సరైన పనే చేసినట్టున్నా, ఎందుకంటే తర్వాతి రోజు చూస్తే, 276 00:17:27,007 --> 00:17:30,051 సైడ్ డిషెస్ పాత్రధారులు అందరూ తమ పాత్రల గురించి పరిశోధన చేస్తున్నారు. 277 00:17:30,719 --> 00:17:35,432 నా అడ్డా, గెనుసు గడ్డ. 278 00:17:35,432 --> 00:17:37,976 మీ గెనుసు గడ్డ గోలను ఆపండ్రా! 279 00:17:38,727 --> 00:17:39,978 మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలా? 280 00:17:42,022 --> 00:17:46,902 బంగాళా దుంపల్లా మా ప్రయాణం ఆరంభించాం రుచికరమైన వంటకం అనే ఊరికి వెళ్లే రైలెక్కాం 281 00:17:46,902 --> 00:17:48,778 గ్రేటర్లతో కలిసి చిందులేశాం 282 00:17:48,778 --> 00:17:51,197 -గోధుమ రంగు వచ్చే దాకా ఫ్రై అయ్యాం -క్యూలో ఎంత సేపు ఉంటారు! 283 00:17:51,197 --> 00:17:55,452 కరకరలాడే వంటకాలలో పోటీ పెడితే విజయ సింహాసనం మాదేలే 284 00:17:55,452 --> 00:18:00,624 రుచికరమైన వంటకం అనే ఊరికి మీకు దారి చూపుతాం 285 00:18:03,627 --> 00:18:08,924 నేను క్యాబేజీని. 286 00:18:09,966 --> 00:18:10,967 అయ్య బాబోయ్. 287 00:18:10,967 --> 00:18:14,930 పరమ కంపులా ఉండే పాత్రని నువ్వు ఎలా పోషించగలవో ఏమో? 288 00:18:14,930 --> 00:18:18,225 క్యాబేజీ నుండి ఆ కంపు 289 00:18:18,225 --> 00:18:20,644 సరిగ్గా ఉడకపెట్టకపోవడం వల్ల వస్తుంది. 290 00:18:20,644 --> 00:18:23,230 సరిగ్గా కనుక ఉడకబెడితే, 291 00:18:23,230 --> 00:18:26,816 క్యాబేజీ చాలా రుచిగా, కరకరమంటూ అదిరిపోయేలా ఉంటుంది. 292 00:18:27,525 --> 00:18:31,321 నేను క్యాబేజీని. నేను క్యాబేజీని. 293 00:18:31,321 --> 00:18:32,948 నేను క్యాబేజీని. 294 00:18:35,283 --> 00:18:36,576 ఈ సోదికి ముగింపు ఎప్పుడు? 295 00:18:36,576 --> 00:18:40,080 నటన అనేది ఒక ప్రయాణం, మేరియన్. భయపడిపోకు. 296 00:18:40,080 --> 00:18:41,164 హ్యారియట్. 297 00:18:42,457 --> 00:18:44,542 ఇక... నువ్వు మహా దరిద్రానివి. 298 00:18:49,673 --> 00:18:52,801 మిస్ ఎల్సన్, హ్యారియట్ నా నాటకాన్ని తన... 299 00:18:52,801 --> 00:18:55,345 మేరియన్, వచ్చేశావా! సూపర్. 300 00:18:55,345 --> 00:18:56,805 హ్యారియట్ రాసిన ఒక కొత్త సీనుకు 301 00:18:56,805 --> 00:19:00,100 సరిగ్గా రిహార్సల్ సమయానికి వచ్చావు. 302 00:19:04,771 --> 00:19:09,776 "అబ్బా, క్యాబేజీ. నువ్వు పరమ కంపు కొడుతున్నావు." 303 00:19:09,776 --> 00:19:12,404 "క్యాబేజీ నుండి ఆ కంపు సరిగ్గా ఉడకపెట్టకపోవడం వల్ల..." 304 00:19:12,404 --> 00:19:14,281 ఇది మరీ శృతి మించిపోయింది. 305 00:19:14,281 --> 00:19:17,492 ఈ నాటికలో నేను విలన్ ని కాదు, హీరోని. 306 00:19:20,078 --> 00:19:22,080 నువ్వు తగిన మూల్యం చెల్లించక తప్పదు. 307 00:19:28,044 --> 00:19:29,379 మేరియన్. 308 00:19:33,717 --> 00:19:34,926 అందరూ వినండి. 309 00:19:34,926 --> 00:19:39,598 నాటిక ముగింపులో వచ్చే పాటకు మ్యారియన్ కంటపడకుండా రహస్యంగా రిహార్సల్ చేద్దామని 310 00:19:39,598 --> 00:19:42,267 -మిమ్మల్ని ఇక్కడికి రమన్నాను. -ఏడిచావులే, హ్యారియట్. 311 00:19:43,476 --> 00:19:44,895 అబ్బా. వచ్చిందమ్మా వయ్యారి. 312 00:19:44,895 --> 00:19:47,772 ఒరిజినల్ స్క్రిప్టు ప్రకారం నడుచుకోకపోతే ఈ నాటకం మేము చేయమని 313 00:19:47,772 --> 00:19:50,859 మీకు చెప్పడానికి వచ్చాం. 314 00:19:52,736 --> 00:19:55,947 మేరియన్ లేకపోతే ఈ నాటకం ఇంకా బాగుంటుందేమో. 315 00:19:59,618 --> 00:20:02,913 జేనీ అన్నదానిలో నిజముందని నాకు తెలుసు, తందూరీ చికెన్ లేకుండా 316 00:20:02,913 --> 00:20:05,624 మా ఫాల్ హార్వెస్ట్ డే నాటకం దరిద్రంగా ఉంటుంది. 317 00:20:06,166 --> 00:20:08,877 మేరియన్, నువ్వు లేకుండా ఈ నాటకం జరగదని నీకు తెలుసు. 318 00:20:08,877 --> 00:20:12,172 ఆ విషయం నువ్వు నా నాటకాన్ని దోచుకొనే ముందు ఆలోచించి ఉండాల్సింది. 319 00:20:12,172 --> 00:20:14,341 హ్యారియట్ ఎం. వెల్ష్ కేవలం ఈ నాటకాన్ని ఇంకా బాగా చేస్తుందనే 320 00:20:14,341 --> 00:20:15,634 మీరందరూ అనుకోవచ్చు. 321 00:20:15,634 --> 00:20:18,929 కానీ నిజమేంటంటే, తను నా పై పగ తీర్చుకుంటోంది. 322 00:20:18,929 --> 00:20:20,263 అది నిజం కాదు. 323 00:20:20,847 --> 00:20:24,684 అవునా? ఇప్పుడు మనం స్నేహితులం కాదని నీకు ఇంకా నాపై కోపంగా లేదా? 324 00:20:25,477 --> 00:20:27,020 అది చాలా కాలం క్రిందటి మాట. 325 00:20:27,520 --> 00:20:31,316 "అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు," అని నాకు చెప్పాలనుంది. 326 00:20:31,316 --> 00:20:33,276 కానీ నువ్వు ఇప్పుడు ఉల్లిపాయ పాత్రలో ఉన్నావు కాబట్టి, 327 00:20:33,276 --> 00:20:36,905 "అబద్ధాలు చెప్తే ఉల్లిపాయలు పుడతాయి," అని చెప్తున్నా. 328 00:20:36,905 --> 00:20:38,698 నువ్వే అబద్ధాలకోరువి. 329 00:20:38,698 --> 00:20:39,866 ఆ ముక్క ఓ అబద్ధాలకోరు చెప్తోంది. 330 00:20:40,867 --> 00:20:43,828 నేనేమీ అబద్ధాలకోరును కాదు! 331 00:20:46,122 --> 00:20:48,792 సారీ. అది అనుకోకుండా జరిగిపోయింది. నీకు ఏమీ కాలేదు కదా? 332 00:20:52,504 --> 00:20:55,757 మీరందరూ చూశారు కదా. తను నాపై దాడి చేసింది. 333 00:20:55,757 --> 00:20:57,050 ఏదోకటి చేయండి! 334 00:20:57,050 --> 00:20:59,511 -ఏం చేయమంటావు... -వెళ్లి తన పని పట్టండి. 335 00:21:04,099 --> 00:21:05,308 పారిపో, హ్యారియట్! 336 00:21:11,856 --> 00:21:14,276 తనని పట్టుకున్నాక ఏం చేయాలి? 337 00:21:14,276 --> 00:21:16,152 ఏమో మరి. నీకు తెలుసు అనుకున్నా. 338 00:21:24,160 --> 00:21:25,412 తను ఎటు వెళ్లిపోయింది? 339 00:21:25,412 --> 00:21:26,496 చెరో వైపు వెతుకుదాం. 340 00:21:47,517 --> 00:21:50,437 అత్యంత రహస్యమైనది 341 00:21:57,903 --> 00:22:00,614 అది నాదేనా? 342 00:22:02,866 --> 00:22:05,577 కొత్త జీవితపు పరిమళం అంటూ నేను ఇందాక అన్నాను కదా? 343 00:22:06,494 --> 00:22:08,371 కానీ మేరియన్ దగ్గర నా పుస్తకం ఉంది. 344 00:22:08,371 --> 00:22:10,874 ఇప్పుడు నాకు భయానికి సంబంధించిన పరిమళం తప్ప ఇంకేమీ తెలియట్లేదు. 345 00:22:11,499 --> 00:22:14,294 నువ్వు అబద్ధాలకోరువి కాదని ఇందాక తెగ చెప్పావు కదా, 346 00:22:14,294 --> 00:22:18,590 అంటే ఈ పుస్తకంలో మా గురించి నువ్వు రాసిందంతా నిజం అన్నట్టే కదా. 347 00:22:24,679 --> 00:22:29,434 నా పుస్తకాన్ని చదవడానికి నీకెంత ధైర్యం! 348 00:22:36,608 --> 00:22:40,737 ఇక్కడ నా గురించి ఏదో రాసుంది. 349 00:22:41,947 --> 00:22:47,827 అలా హఠాత్తుగా, హ్యారియట్ యుగం అంతమైపోయింది. 350 00:22:48,995 --> 00:22:52,123 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 351 00:22:52,123 --> 00:22:54,084 మనకు నచ్చినట్లు ఉండాలి 352 00:22:55,085 --> 00:22:57,629 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 353 00:22:57,629 --> 00:23:02,842 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 354 00:23:05,262 --> 00:23:11,101 నా చుట్టపక్కల అందరికీ మంచి చేయాలని ప్రయత్నిస్తాను 355 00:23:11,101 --> 00:23:13,562 నేను అందంగా నవ్వుతాను 356 00:23:13,562 --> 00:23:16,690 నిజం మాత్రమే చెప్పాలని తపిస్తాను 357 00:23:16,690 --> 00:23:19,442 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 358 00:23:19,442 --> 00:23:21,152 మనకు నచ్చినట్లు ఉండాలి 359 00:23:22,279 --> 00:23:24,864 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 360 00:23:24,864 --> 00:23:27,659 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 361 00:23:27,659 --> 00:23:30,287 నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అదే అవుతాను 362 00:23:30,287 --> 00:23:31,913 నాదే తుది నిర్ణయం 363 00:23:33,123 --> 00:23:35,750 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 364 00:23:35,750 --> 00:23:37,586 మనకు నచ్చినట్లు ఉండాలి 365 00:23:37,586 --> 00:23:40,881 లేదు, నా జుట్టు కత్తిరించుకోను 366 00:23:40,881 --> 00:23:43,258 నాకు నచ్చిందే వేసుకుంటాను 367 00:23:43,258 --> 00:23:49,472 నాకు నచ్చినట్లుగా ఉండడం నాకిష్టం 368 00:23:49,472 --> 00:23:52,183 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 369 00:23:52,183 --> 00:23:56,730 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 370 00:23:56,730 --> 00:23:58,732 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్