1 00:00:05,882 --> 00:00:09,970 నాకు జరిగే అవకాశమున్న టాప్ 100 ఆపదలలో, 2 00:00:09,970 --> 00:00:13,098 "సింహాద్రి" సినిమాలో విలన్ చనిపోయినట్టు చనిపోవడానికి 3 00:00:13,098 --> 00:00:15,559 సరిగ్గా ముందు, ఈ ఆపదే ఉంది. 4 00:00:15,559 --> 00:00:16,643 అత్యంత రహస్యమైనది 5 00:00:16,643 --> 00:00:19,145 నా గురించి ఇక్కడేదో రాసుంది. 6 00:00:19,145 --> 00:00:22,315 నా పుస్తకాన్ని నాకు ఇచ్చేయ్. 7 00:00:22,315 --> 00:00:24,693 దానిలో ఉన్నదంతా కేవలం నాకే సంబంధించినది! 8 00:00:25,777 --> 00:00:27,362 చదువుతున్నా మరి. 9 00:00:27,362 --> 00:00:29,656 "మేరియన్ ఎన్ని అవార్డులను గెలుచుకున్నా, 10 00:00:29,656 --> 00:00:32,741 చెడ్డ మనిషిగా తను సాధించినవాటికి 11 00:00:32,741 --> 00:00:36,454 ఒక భారీ కప్పును ఇంకా తను గెలవలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది." 12 00:00:38,123 --> 00:00:41,751 వావ్. ఏం చేస్తాం, అందరూ ఏమో నేనే చెడ్డదాన్ని అనుకుంటుంటారు. 13 00:00:45,463 --> 00:00:47,674 ఇంకేముందో చూద్దాం. ఇక్కడ కత్తిలాంటిది ఒకటి ఉంది. 14 00:00:47,674 --> 00:00:50,760 "పిల్లల్ని బూచాడు వచ్చి ఎత్తుకుపోతాడు అని బెదిరించడానికి బదులుగా, 15 00:00:50,760 --> 00:00:55,223 రేచెల్ హెన్నెసీ వచ్చి ఎత్తుకు పోతుంది అని అనాలి." 16 00:00:58,310 --> 00:00:59,895 నన్ను ఇంకా బాధపెట్టకు. 17 00:01:01,271 --> 00:01:05,025 వావ్, ఇక్కడ అందరి గురించి ఏదో రాసుంది. 18 00:01:05,025 --> 00:01:07,569 ఇక చాలు, మేరియన్. నీ ఆగడాలని అంతటితో ముగించేయ్. 19 00:01:08,153 --> 00:01:09,946 హ్యారియట్ కి తన పుస్తకాన్ని ఇచ్చేయ్. 20 00:01:10,447 --> 00:01:12,282 జేనీ మీద కూడా ఏదో రాసుంది. 21 00:01:12,282 --> 00:01:13,491 ఏంటి? 22 00:01:14,075 --> 00:01:16,620 ఇక చాలు, మేరియన్. ప్లీజ్. 23 00:01:16,620 --> 00:01:19,205 సరే, నేను చదవనులే. 24 00:01:19,205 --> 00:01:22,417 కానీ ఏం చేయాలి అనే నిర్ణయాన్ని జేనీకే వదిలేస్తాను. 25 00:01:23,043 --> 00:01:24,294 నీ ఇష్టం, జేనీ. 26 00:01:40,894 --> 00:01:43,563 {\an8}నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 27 00:01:43,563 --> 00:01:45,315 మనకు నచ్చినట్లు ఉండాలి 28 00:01:46,483 --> 00:01:48,944 నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అదే అవుతాను 29 00:01:48,944 --> 00:01:50,612 నాదే తుది నిర్ణయం 30 00:01:51,112 --> 00:01:54,032 లేదు, నా జుట్టు కత్తిరించుకోను 31 00:01:54,032 --> 00:01:56,493 నాకు నచ్చిందే వేసుకుంటాను 32 00:01:56,493 --> 00:02:02,624 నాకు నచ్చినట్లుగా ఉండడం నాకిష్టం 33 00:02:02,624 --> 00:02:05,252 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 34 00:02:05,252 --> 00:02:08,170 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 35 00:02:08,170 --> 00:02:09,256 {\an8}"నేనంటే అందరికీ అసహ్యం" 36 00:02:11,299 --> 00:02:12,384 {\an8}లూయిస్ ఫిట్జ్ హ్యూ రచించిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 37 00:02:16,930 --> 00:02:19,641 నేను అందులో నాకోసమే రాసుకున్నాను. 38 00:02:34,239 --> 00:02:37,784 "జేనీకి మేడమ్ క్యూరీలా ఒక పెద్ద సైంటిస్ట్ కావాలనుంది. 39 00:02:37,784 --> 00:02:42,414 కానీ ఒక్కోసారి, తను ఒక పిచ్చి సైంటిస్ట్ అని, ఒక చెడ్డ సైంటిస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది, 40 00:02:42,414 --> 00:02:45,875 ఒక్కోసారి అయితే ఒక పిచ్చి, చెడ్డ సైంటిస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది." 41 00:02:46,960 --> 00:02:49,045 సరే, అది బాగా పరుషంగా ఉన్నట్టు అనిపించవచ్చు, 42 00:02:49,045 --> 00:02:51,381 కానీ టమోటా విషయం ఎమైందో గుర్తుంది కదా? 43 00:02:55,594 --> 00:03:00,599 ఇది పండా, కూరగాయనా లేకపోతే సూపర్ డూపర్ బాలా? 44 00:03:12,694 --> 00:03:15,238 ఇది కూరగాయగా ఉంటేనే మేలు. 45 00:03:15,238 --> 00:03:16,740 అది పండు. 46 00:03:20,410 --> 00:03:23,413 మీ ఇద్దరూ ప్రాణ స్నేహితులని అని అనుకున్నా, జేనీ. 47 00:03:23,955 --> 00:03:25,290 నేను కూడా అలాగే అనుకున్నా. 48 00:03:28,251 --> 00:03:30,253 బెత్ ఎల్లెన్, చదవడం ఎప్పుడు ఆపాలో చెప్పు. 49 00:03:31,004 --> 00:03:33,298 -ఆపేయ్. -సర్లే. 50 00:03:33,298 --> 00:03:34,841 తర్వాత ఎవరిది రాసుంది? 51 00:03:37,135 --> 00:03:38,136 అయ్యయ్యో. 52 00:03:38,136 --> 00:03:39,429 ఎవరు? ఎవరు? 53 00:03:40,096 --> 00:03:42,724 నువ్వు, ఇంకా పర్పుల్ సాక్స్. 54 00:03:44,809 --> 00:03:49,439 "పింకీ ఇంకా పర్పుల్ సాక్స్ స్కూల్ మానేసి, ఏదైనా విచిత్రమైన సర్కస్ లో చేరితే బాగుంటుందని 55 00:03:49,439 --> 00:03:51,524 అప్పుడప్పుడూ నాకు అనిపిస్తుంది." 56 00:03:57,322 --> 00:04:00,867 నీ అంత తోపులం కానందుకు మమ్మల్ని క్షమించేయ్, హ్యారియట్. 57 00:04:03,620 --> 00:04:04,871 తర్వాత ఎవరబ్బా? 58 00:04:04,871 --> 00:04:07,082 నీ సోదంతా వినాల్సిన అవసరం నాకు లేదు. 59 00:04:07,082 --> 00:04:09,918 నీ ఇష్టం వచ్చినట్టు చేస్కో, మేరియన్. పండగ చేస్కో. 60 00:04:11,086 --> 00:04:12,796 సరే, వెళ్లిపో. 61 00:04:12,796 --> 00:04:14,714 ఇక ఈ పుస్తకాన్ని మర్చిపో. 62 00:04:14,714 --> 00:04:18,175 నన్ను కాపాడు! 63 00:04:21,805 --> 00:04:22,847 నువ్వే గెలిచావులే! 64 00:04:24,224 --> 00:04:28,061 "అప్పుడప్పుడూ నాకేం అనిపిస్తుందంటే, జనాలు కేరీ ఆండ్రూస్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తారంటే"... 65 00:04:32,357 --> 00:04:34,484 అసలైన విషయం ఇంకా చదవందే ఏడ్చేస్తుందే. 66 00:04:34,484 --> 00:04:35,986 మేరియన్, ఇక చాలు. 67 00:04:35,986 --> 00:04:39,114 హ్యారియట్ కి తన పుస్తకాన్ని ఇచ్చేయ్. తను ఏం రాసుకుంటే ఏంటి? 68 00:04:39,114 --> 00:04:41,408 -ఓసారి ఇది చూసి మాట్లాడు. -లేదు. 69 00:04:41,408 --> 00:04:44,578 జేనీ, కాస్త స్పోర్ట్ కి చదివి వినిపిస్తావా? 70 00:04:47,038 --> 00:04:48,456 జేనీ, వద్దు. 71 00:04:51,167 --> 00:04:53,253 "ఒక్కోసారి, స్పోర్ట్ ని భరించడం అసాధ్యం అనిపిస్తుంది. 72 00:04:53,837 --> 00:04:57,924 ఎప్పుడూ కంగారే, ఎప్పుడూ వాళ్ల నాన్న మీద ఏడుపే, 73 00:04:57,924 --> 00:05:01,386 ముసలావిడలా ప్రవర్తిస్తుంటాడు." 74 00:05:02,679 --> 00:05:06,850 స్పోర్ట్, అది... నేను గమనించిన ఒక చిన్న విషయమంతే. 75 00:05:07,809 --> 00:05:10,854 ఆ చిన్న విషయాన్ని నేను ఈ చిన్న సమయంలో గమనించాను. 76 00:05:10,854 --> 00:05:14,149 స్పోర్ట్, త్వరగా కానివ్వు. సినిమాకి ఇంకా 15 నిమిషాలే ఉంది. 77 00:05:15,150 --> 00:05:17,027 ఆ అంట్లను మీ నాన్న తోమలేడా? 78 00:05:17,652 --> 00:05:20,071 లేదు, అతని వేళ్లకి మడతలు వచ్చేస్తాయి. 79 00:05:20,071 --> 00:05:22,449 అప్పుడు టైప్ రైటర్ మీద అతను టైప్ చేయలేడు. 80 00:05:22,449 --> 00:05:24,367 అయితే, తర్వాత తోమలేవా? 81 00:05:24,367 --> 00:05:28,663 జేనీ, ఒక్క పాత్ర ఉండిపోయినా నాకు ప్రశాంతత ఉండదు. 82 00:05:33,168 --> 00:05:34,920 నిజంగానే అలా అనుకుంటున్నావా, హ్యారియట్? 83 00:05:35,503 --> 00:05:39,132 నేను చాలా విషయాలను అనుకుంటుంటాను. వాటన్నింటినీ గుర్తుంచుకోవడం కష్టం. 84 00:05:39,132 --> 00:05:41,676 నువ్వు కేవలం నిజం మాత్రమే రాస్తావని చెప్పావే. 85 00:05:41,676 --> 00:05:43,136 లేదంటే నువ్వు అబద్ధమాడుతున్నావని అర్థమా? 86 00:05:43,887 --> 00:05:45,347 నేనేమీ అబద్ధమాడను. 87 00:05:47,057 --> 00:05:50,018 అసలు నీకు ఆ విషయం ఎలా తెలుసు? నువ్వు అక్కడ లేవు కదా. 88 00:05:50,018 --> 00:05:52,145 మా మీద నిఘా వేసి ఉంచావా? 89 00:05:52,729 --> 00:05:55,607 ఒక్కోసారి నిజం కనిపెట్టడానికి ఆ దారి తప్ప మరో దారి ఉండదు. 90 00:06:00,695 --> 00:06:03,531 మా అందరి మీద కూడా నిఘా పెట్టావా? 91 00:06:08,203 --> 00:06:11,414 నా పుస్తకాన్ని ఇచ్చేయ్! 92 00:06:17,504 --> 00:06:19,506 ఇక ఈ పుస్తకాన్ని మర్చిపో, హ్యారియట్. 93 00:06:20,590 --> 00:06:23,218 సరే. నువ్వే ఉంచుకో. నేను ఇంకోటి కొనుక్కుంటా! 94 00:06:33,687 --> 00:06:36,481 సరిగ్గా ఓల్ గోలీ మోంట్రియల్ కి వెళ్లినప్పుడే ఇలాంటి పరిస్థితి తలెత్తడం 95 00:06:36,481 --> 00:06:39,609 నా తలరాత అని చెప్పవచ్చు. 96 00:06:39,609 --> 00:06:41,695 ఏం చేయాలో తనకి తెలిసేది. 97 00:06:44,614 --> 00:06:45,782 ఓల్ గోలీ! 98 00:06:48,410 --> 00:06:50,453 నీ టోపీ మీద ఫ్లెమింగో ఉందేంటి? 99 00:06:50,453 --> 00:06:53,498 నన్ను అడుగుతావేంటి? ఇది నీ కల్పనే కదా. 100 00:06:53,498 --> 00:06:56,334 పైగా, నీలాగా నేనేం ఉల్లిపాయ వేషం వేసుకోలేదులే. 101 00:06:59,588 --> 00:07:01,172 ఇంతకీ నన్ను ఎందుకు తలుచుకున్నావు? 102 00:07:01,172 --> 00:07:05,760 స్కూల్లోని పిల్లలకు నా పుస్తకం దొరికింది, వాళ్ల గురించి నేను రాసిందంతా చదివేశారు. 103 00:07:06,261 --> 00:07:08,638 జాన్ కీట్స్ ఓసారి ఏమన్నాడో తెలుసా? 104 00:07:09,472 --> 00:07:11,975 "అందంలో నిజం ఉంది, నిజం అందంగా ఉంటుంది." 105 00:07:13,059 --> 00:07:15,103 నీకు అదొక్కటి తెలిస్తే చాలు. 106 00:07:16,646 --> 00:07:17,689 వెళ్లిపోకు. 107 00:07:19,900 --> 00:07:23,069 ఈ సైకిల్ కి థ్యాంక్స్. మోంట్రియల్ కి వెళ్లిపోవాలి మరి. 108 00:07:26,239 --> 00:07:30,452 గుర్తుంచుకో, మంచి డిటెక్టివ్ ఎప్పుడూ పట్టు వదలనే వదలదు! 109 00:07:35,749 --> 00:07:37,000 పెయిజ్ బుక్ స్టోర్ 110 00:07:40,253 --> 00:07:42,047 మేరియన్ హాతోర్న్ తన పుస్తకం దొంగిలించినప్పుడు 111 00:07:42,047 --> 00:07:44,591 ఒక మంచి డిటెక్టివ్ అయితే ఇంకేం చేయగలదో చెప్పనా? 112 00:07:45,258 --> 00:07:47,427 ఒక కొత్త పుస్తకాన్ని కొనుక్కుంటుంది. 113 00:07:54,559 --> 00:07:57,145 ఓల్ గోలీ చెప్పింది నిజమే, నేను పట్టు విడవకూడదు. 114 00:07:57,145 --> 00:08:01,358 ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిజం చెప్పడం నా విధి. క్షమాపణలు చెప్పడం కాదు. 115 00:08:06,029 --> 00:08:08,657 నేను కూడా నాకు ఇష్టమైన రచయిత అయిన జాక్ లండన్ లాంటిదాన్నే అనిపించింది. 116 00:08:09,241 --> 00:08:11,743 నేను ఒక్కదాన్నే పని చేశాను. 117 00:08:28,802 --> 00:08:31,304 నాకు ఆ నౌక కెప్టెన్ ఆమోదం అక్కర్లేదు. 118 00:08:33,765 --> 00:08:38,352 నా దగ్గర పుస్తకం, పెన్, బుర్ర ఉన్నాయి. 119 00:08:52,242 --> 00:08:53,368 గుడ్ మార్నింగ్, స్పోర్ట్. 120 00:08:53,368 --> 00:08:54,494 జేనీ. 121 00:08:54,494 --> 00:08:56,246 నీకేమైనా వినిపించిందా, స్పోర్ట్? 122 00:08:56,246 --> 00:08:57,831 లేదే. ఏమీ వినపడలేదు. 123 00:09:03,211 --> 00:09:04,421 వావ్. కొత్త పుస్తకం. 124 00:09:05,839 --> 00:09:07,340 పిల్లలూ. 125 00:09:07,340 --> 00:09:09,968 ఇవాళ క్లాసును మీకు నచ్చిన పుస్తకాన్ని చదవడంతో ప్రారంభిద్దాం. 126 00:09:09,968 --> 00:09:14,764 మీకు నచ్చిన పుస్తకమంటే, శిశువుల పేర్ల పుస్తకం కాదు, మిస్టర్ వైట్ హెడ్. 127 00:09:14,764 --> 00:09:19,728 నా పేరును బార్నబీగా మార్చుకుందాం అనుకుంటున్నా. 128 00:09:19,728 --> 00:09:21,062 కాచుకోండి! 129 00:09:48,256 --> 00:09:50,508 జేనీ! ఓయ్! జేనీ! 130 00:09:51,176 --> 00:09:55,013 నాకు పిచ్చెక్కుతోంది. ఆ చీటీ మర్మర శబ్దం నా చెవుల్లో మార్మోగుతోంది. 131 00:09:55,013 --> 00:09:59,643 "నీ గురించి మాకొక దారుణమైన విషయం తెలుసు," అన్నట్టుగా ఆ శబ్దం ఉంది. 132 00:10:01,519 --> 00:10:02,562 హేయ్, స్పోర్ట్. 133 00:10:06,024 --> 00:10:07,108 హేయ్! 134 00:10:07,901 --> 00:10:13,031 "హ్యారియట్ ఎం. వెల్ష్ దగ్గర కంపు కొడుతుందన్న విషయం గమనించారా?" 135 00:10:13,031 --> 00:10:17,118 నా దగ్గరా? వాసనా? నా దగ్గర వాసన వస్తుందా? 136 00:10:27,671 --> 00:10:31,424 నేను అవమానభారంతో కుంగిపోయాను. 137 00:10:31,424 --> 00:10:34,052 అందరూ నన్ను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. 138 00:10:34,052 --> 00:10:35,345 నేను టాయిలెట్ కి వెళ్లవచ్చా? 139 00:10:54,614 --> 00:10:57,409 మిస్టర్ హొరేషియో ఎప్పుడూ ఎందుకంత హోమ్ వర్క్ ఇస్తాడు? 140 00:10:58,076 --> 00:10:59,578 నేను హోమ్ వర్క్ గురించి అస్సలు పట్టించుకోను. 141 00:10:59,578 --> 00:11:02,122 నాకు భోజనంలో చల్లగా అయిపోయిన వేపుడు కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు. 142 00:11:02,122 --> 00:11:05,083 వాళ్లు నన్ను ఎంత చీదరించుకున్నా కానీ, ఏం అయినా కానీ, 143 00:11:05,083 --> 00:11:06,167 నేను ఎప్పుడూ నిజమే రాస్తా. 144 00:11:06,167 --> 00:11:09,671 మంచి మంచి పుస్తకాలు రాసి పులిట్జర్ అవార్డును ఎగరేసుకుపోతా. 145 00:11:09,671 --> 00:11:11,923 అప్పుడు నా మాజీ మిత్రులు ఏమంటారంటే... 146 00:11:11,923 --> 00:11:14,509 అదుగోండి హ్యారియట్ ఎం. వెల్ష్. 147 00:11:14,509 --> 00:11:16,678 మనం తనని చాలా అపార్థం చేసుకున్నాం. 148 00:11:16,678 --> 00:11:19,514 ఇంకో విషయం, తన దగ్గర కంపు కొట్టేదే కాదు. 149 00:11:21,516 --> 00:11:24,185 హ్యారియట్ వెల్ష్ దగ్గర కంపు కొడుతుందట, విన్నావా? 150 00:11:30,650 --> 00:11:33,069 స్కూల్ అయ్యాక, పని మొదలుపెట్టాను. 151 00:11:36,281 --> 00:11:38,158 నా కాలు కాస్తంత కంపు కొడతుండటం పెద్ద విషయమా ఏంటి? 152 00:11:38,158 --> 00:11:41,703 విల్లా కాథర్ కాలు కూడా అప్పుడప్పుడూ కాస్తయినా కొంపు కొడుతుంది కదా. 153 00:11:43,079 --> 00:11:48,710 చందమామ రావే, జాబిల్లి రావే 154 00:11:49,711 --> 00:11:51,713 క్లారిటా గానాన్ని తట్టుకోలేక 155 00:11:51,713 --> 00:11:54,758 క్యూబా నిండి గెంటేశారా ఏంటి, అందుకే గ్రాసియాస్ పరివారం అమెరికాకి వలస వచ్చిందా? 156 00:11:54,758 --> 00:11:56,843 అది ముఖ్యమైన విషయం కావచ్చు. దాన్ని దర్యాప్తు చేయాలి. 157 00:12:00,889 --> 00:12:03,934 మేము డిటెక్టివ్స్ కిల్లర్స్ క్లబ్ సభ్యులం, 158 00:12:03,934 --> 00:12:07,562 ఈ నగరంలో డిటెక్టివ్స్ లేకుండా చేయడమే మా పని! 159 00:12:08,063 --> 00:12:10,148 డిటెక్టివ్సా? మీరేం మాట్లాడుతున్నారు? 160 00:12:12,901 --> 00:12:13,902 హ్యారియట్? 161 00:12:13,902 --> 00:12:16,071 హ్యారియట్ ఒక డిటెక్టివ్! 162 00:12:16,071 --> 00:12:18,365 మా అందరిపైనా నిఘా ఉంచుతుంది. 163 00:12:18,365 --> 00:12:20,408 ఆ తర్వాత చెడ్డ చెడ్డ విషయాలన్నీ రాస్తుంది! 164 00:12:27,666 --> 00:12:29,000 తనని పట్టుకుందాం! 165 00:12:52,148 --> 00:12:54,150 -ఎటు వెళ్లిపోయింది? -తలో దిక్కుకు వెళ్లండి! 166 00:13:00,949 --> 00:13:05,704 ఇది నిఘా పనిలో ఉన్నప్పుడు నేను వెళ్లే మార్గం, దీని గురించి నాకన్నా ఇంకెవరికీ బాగా తెలీదు. 167 00:13:06,496 --> 00:13:08,540 గార్సియాస్ ఇంటి దగ్గర నేను ఉన్నానని వాళ్ళకి ఎలా తెలిసిందే ఏమో, 168 00:13:08,540 --> 00:13:10,208 కానీ ఎలాగైతేనేం, తప్పించుకున్నా. 169 00:13:10,208 --> 00:13:12,544 ఇక నేను నా డిటెక్టివ్ పని మొదలుపెట్టవచ్చు. 170 00:13:12,544 --> 00:13:15,130 అ ఒకటి, అ రెండు, అ మూడు, 171 00:13:18,842 --> 00:13:19,843 హలో? 172 00:13:27,601 --> 00:13:28,768 అవును కదా. 173 00:13:28,768 --> 00:13:31,521 నా డిటెక్టివ్ మార్గం గురించి ఆ డిటెక్టివ్స్ కిల్లర్స్ కి తెలిసి ఉంటుంది, 174 00:13:31,521 --> 00:13:33,773 వాళ్ల దగ్గర నా పుస్తకం ఉంది కదా. 175 00:13:35,317 --> 00:13:36,318 అయ్యయ్యో. 176 00:13:37,152 --> 00:13:40,447 జేనీ, మేరియన్ కలిసిపోయారా? 177 00:13:40,447 --> 00:13:42,741 ఒక్కసారిగా నా గుండె జారి కింద పడిపోయింది. 178 00:13:42,741 --> 00:13:45,994 ఆ తర్వాత నేల మీద నుండి పాతాళంలోకి వెళ్లిపోయింది. 179 00:13:46,703 --> 00:13:49,497 డిటెక్టివ్స్ కిల్లర్స్ తో జేనీ చేతులు కలిపిందంటే... 180 00:13:50,206 --> 00:13:51,541 స్పోర్ట్ కూడా కలిపి ఉంటాడు. 181 00:13:56,254 --> 00:13:58,298 ఆ యోయోని పక్కకు పెట్టేయండి, సర్. 182 00:13:58,965 --> 00:14:00,550 హ్యారియట్ ఇక్కడే ఎక్కడో ఉంది. 183 00:14:00,550 --> 00:14:02,302 మనం అప్రమత్తంగా ఉండాలి. 184 00:14:06,723 --> 00:14:10,060 గొప్ప గొప్ప పనులకు ఇలాంటి గొప్ప గొప్ప బాధలు తప్పవని ఓల్ గోలీ అంది. 185 00:14:10,060 --> 00:14:13,730 కానీ అవి ఒకేసారి మీద పడకుండా కొంచెం కొంచెంగా వస్తే బాగుండు. 186 00:14:17,150 --> 00:14:21,112 ఆ రాత్రి, నాకు స్నేహితుల అవసరం మాత్రమే కాకుండా, నా డిటెక్టివ్ మార్గం అవసరం కూడా లేదని 187 00:14:21,112 --> 00:14:23,490 నేను నిర్ణయించేసుకున్నాను. 188 00:14:24,074 --> 00:14:25,784 అవన్నీ నన్ను పక్కదోవ పట్టించే అంశాలు. 189 00:14:25,784 --> 00:14:28,328 ఎమిలీ డికిన్సన్ లాగా ఇక ఎప్పటికీ ఒకే గదిలో ఉండిపోయి 190 00:14:28,328 --> 00:14:32,499 జీవితాన్నంతా ఒంటరితనంతోనే గడిపేస్తాను. 191 00:14:33,416 --> 00:14:37,712 ఎమిలీ డికిన్సన్ అను నేను, ఈ వ్యతిరేకతను, ఒంటరితనాన్ని, 192 00:14:37,712 --> 00:14:43,134 ఇంకా దురద పుట్టించే ఈ పాత బట్టలను వదిలేసి, 193 00:14:43,134 --> 00:14:47,055 ప్రజానీకానికి నిజం చెప్పి వాళ్లని బంధ విముక్తులను చేయాలి. 194 00:14:56,606 --> 00:14:58,108 హ్యారియట్! 195 00:15:11,413 --> 00:15:12,414 హ్యారియట్. 196 00:15:13,248 --> 00:15:16,251 హ్యారియట్. స్కూలుకు వెళ్ళాల్సిన సమయం అయింది. నువ్వు అలారం మోగినా లేవలేదు. 197 00:15:18,336 --> 00:15:20,130 నేను స్కూలుకు వెళ్లట్లేదు. 198 00:15:20,130 --> 00:15:22,090 వెళ్లాలి. 199 00:15:22,090 --> 00:15:26,219 వెళ్లను. జీవితమంతా ఒంటరిగానే గడిపేస్తాను. 200 00:15:27,554 --> 00:15:29,764 -అలా కుదరదు. -నేను నీకు దోశలు వేస్తాను. 201 00:15:30,557 --> 00:15:32,851 దోశలు. 202 00:15:40,942 --> 00:15:44,112 నాకు దోశలు అక్కర్లేదు. దోశలు అక్కర్లేదు. 203 00:15:44,112 --> 00:15:47,824 నాకు డిటెక్టివ్ మార్గం అక్కర్లేదు. నా దగ్గర సువాసన రావాల్సిన అవసరం కూడా లేదు. 204 00:15:48,825 --> 00:15:52,579 నాకు ఆ నౌక కెప్టెన్ హారన్ మోగిస్తే చాలు. 205 00:15:52,579 --> 00:15:54,122 ఒక్కసారి మోగిస్తే సరిపోతుంది, అది నాకు చాలు. 206 00:15:59,920 --> 00:16:03,840 కమాన్. హారన్ మోగించు. హారన్ మోగించు! 207 00:16:03,840 --> 00:16:06,760 హారన్ మోగించు! హారన్ మోగించు! 208 00:16:06,760 --> 00:16:08,637 నేను ఇక వదిలేస్తున్నాను. 209 00:16:26,905 --> 00:16:29,241 పిల్లలూ, మనందరం ఇప్పుడు ఓ సాహసం చేద్దాం. 210 00:16:29,241 --> 00:16:33,662 ప్రాచీన కాలానికి వెళ్లిపోదాం, గతంలోకి తరచి, తరచి, తరచి చూద్దాం, 211 00:16:33,662 --> 00:16:35,997 ప్రాచీన నాగరికిత అయిన... 212 00:16:46,633 --> 00:16:47,801 కాపీ కొట్టే సన్నాసులు. 213 00:16:49,261 --> 00:16:52,681 నేను చేసిందే నాకు చేసి నాపై పగ తీర్చుకోవాలనుకుంటున్నారని నాకు తెలుసు, కానీ... 214 00:16:54,140 --> 00:16:56,977 నా గురించి ఏం రాస్తున్నారా అనే కంగారు నాలో ఉండింది. 215 00:17:02,023 --> 00:17:03,608 టాయిలెట్ కి వెళ్లవచ్చా? 216 00:17:09,613 --> 00:17:12,700 అసలు నేనేం చేస్తున్నాను? వాళ్లు నన్నేం చేయగలరు? 217 00:17:13,285 --> 00:17:14,785 నన్నేమైనా కుంగదీయగలరా? 218 00:17:16,204 --> 00:17:18,290 నేను హ్యారియట్ ని. వెల్ష్... 219 00:17:19,291 --> 00:17:22,209 నా శాండ్విచ్. ఎంత పని చేశార్రా! 220 00:17:32,012 --> 00:17:35,140 నేను కూడా పక్షినైతే బాగుండు. పక్షులకు ఒంటరిగా జీవించడం ఎలాగో తెలుసు. 221 00:17:42,147 --> 00:17:45,775 నేనంటే అందరికీ అసహ్యం. వాళ్ల దగ్గర అందుకు బలమైన కారణమే ఉందేమో. 222 00:17:45,775 --> 00:17:47,485 అది నిజం. 223 00:17:47,485 --> 00:17:50,989 కొత్త మలుపు ఏంటంటే, నాకు కూడా నాపై అసహ్యం మొదలైంది. 224 00:17:52,782 --> 00:17:58,371 నా ఆప్త మిత్రులతో నేను సరిగ్గా ప్రవర్తించలేదు, అప్పుడప్పుడూ నేను మరీ పిచ్చిగా ప్రవర్తిస్తాను. 225 00:17:59,080 --> 00:18:01,666 ఇతరుల కన్నా నేను పిస్తానని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను. 226 00:18:02,334 --> 00:18:04,669 స్వార్థపరురాలిని. 227 00:18:04,669 --> 00:18:08,215 ఉదాహరణకు, పిజ్జాలోని ఆఖరి ముక్కని ఎప్పుడూ నేను తినాలి. 228 00:18:09,841 --> 00:18:13,803 నిజం చెప్పాలనే నా వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే, ముందు నా గురించే 229 00:18:13,803 --> 00:18:16,765 నేను నిజాలు చెప్పుకోవాలనే విషయాన్ని గ్రహించాను. 230 00:18:16,765 --> 00:18:17,849 స్పోర్ట్ జేనీ 231 00:18:27,984 --> 00:18:32,113 ఇదేమీ క్షమాపణ కాదు, కానీ స్పోర్ట్, జేనీలు నన్ను క్షమించడంలో ఇది సాయపడవచ్చేమో. 232 00:18:41,289 --> 00:18:42,290 అయ్యయ్యో. 233 00:18:45,293 --> 00:18:46,503 హేయ్! 234 00:18:46,503 --> 00:18:48,213 ఓరి దేవుడా. ఒలికిపోయినట్టుంది. 235 00:18:48,838 --> 00:18:51,007 సారీ, హ్యారియట్. 236 00:18:51,007 --> 00:18:52,092 అది అబద్ధం! 237 00:18:54,219 --> 00:18:58,139 -నువ్వు కావాలని చేశావు, రేచెల్ హెన్నెసీ. -ఇక్కడ ఏం జరుగుతోంది? 238 00:18:58,139 --> 00:19:02,352 నేను పొరపాటున హ్యారియట్ మీద పెయింట్ ని ఒలికించాను, కానీ నేను కావాలని చేశానని తను అనుకుంటోంది. 239 00:19:02,352 --> 00:19:03,478 తను కావాలనే చేసింది! 240 00:19:03,478 --> 00:19:06,606 హ్యారియట్, రేచెల్ పొరపాటున చేశానని చెప్పిందంటే, అది పొరపాటుగానే చేసి ఉంటుంది. 241 00:19:07,107 --> 00:19:08,483 నేను వెళ్లి టిష్యూ పేపర్స్ తెస్తాను. 242 00:19:13,572 --> 00:19:15,073 ఇదేమీ జోక్ కాదు! 243 00:19:21,788 --> 00:19:23,873 ఆగు, హ్యారియట్. నేను సాయపడతా... 244 00:19:23,873 --> 00:19:28,003 జేనీ, నీకు మేడమ్ క్యూరీ అయ్యే సీన్ లేదని హ్యారియట్ అన్న మాటలను మర్చిపోయావా? 245 00:19:31,548 --> 00:19:32,591 దీనితో తుడుచుకో. 246 00:19:34,217 --> 00:19:38,221 "స్పోర్ట్ ఒక ముసలావిడ." నిన్ను తను అన్న మాట అది. 247 00:19:41,224 --> 00:19:43,560 హఠాత్తుగా, నాలో కోపావేశాలు పొంగుకొచ్చేశాయి. 248 00:19:43,560 --> 00:19:45,020 నేను అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. 249 00:19:47,564 --> 00:19:48,857 సారీ. 250 00:19:50,233 --> 00:19:54,821 తుడుచుకోవటానికి ఇంటికి వచ్చాక, జాన్ కీట్స్ అన్న దాని గురించి ఆలోచించాను. 251 00:19:54,821 --> 00:19:59,826 నిజం అంత అందంగా ఉండేదైతే, అన్నీ ఇలా దారుణంగా తయారవుతున్నాయి ఎందుకు? 252 00:19:59,826 --> 00:20:04,456 ఓల్ గోలీ వెళ్లిపోయిందని నాకు తెలుసు, కానీ తొలిసారిగా నేనొకటి గ్రహించాను. 253 00:20:04,956 --> 00:20:06,917 తను ఇక రాదనే విషయం. 254 00:20:07,459 --> 00:20:11,588 నాకు మరో దారి లేదు. దీన్ని హ్యారియట్ పద్ధతిలోనే చేయాలి. 255 00:20:55,423 --> 00:20:56,633 కప్ప! 256 00:20:56,633 --> 00:20:58,093 అయ్య బాబోయ. 257 00:20:58,093 --> 00:21:00,428 అది నా ముఖంపై పడింది! 258 00:21:00,428 --> 00:21:02,097 నా ముఖంపై మొటిమలు వస్తాయి! 259 00:21:02,097 --> 00:21:03,515 కప్ప! 260 00:21:03,515 --> 00:21:07,978 -కప్ప! -కప్ప! 261 00:21:13,858 --> 00:21:16,861 -అయ్యయ్యో. -ఏం జరుగుతోంది? 262 00:21:17,946 --> 00:21:19,072 కప్ప! 263 00:21:20,782 --> 00:21:24,703 ప్రతీకారం సమ్మగా ఉంటుందంటారు, కానీ అది గాఢంగా కూడా ఉంది. 264 00:21:24,703 --> 00:21:27,706 నాకు మాత్రం అది వేరే లెవెల్లో ఉంది. 265 00:21:31,585 --> 00:21:34,921 నా ప్లాన్ ఎంత సూపర్ గా ఉండిందంటే, నేను పెరిగి పెద్దయ్యాక 266 00:21:34,921 --> 00:21:38,008 అది నిజంగా జరిగిందని నాకు నమ్మకం కోసం దాని గురించి పుస్తకంలో రాసుకున్నాను. 267 00:21:40,218 --> 00:21:44,556 హ్యారియట్ ఎం. వెల్ష్. స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. చాలా కోపంగా మాట్లాడారు. 268 00:21:44,556 --> 00:21:48,101 కప్పను వదిలి క్లాసును జరగకుండా చేశావని అన్నారు. 269 00:21:48,768 --> 00:21:53,565 నాకు... నాకు మరో దారి లేకపోయింది. మేరియన్ నా వ్యక్తిగత పుస్తకాన్ని దొంగిలించి 270 00:21:53,565 --> 00:21:56,067 దానిలో ఉన్నదాన్నంతా అందరికీ గట్టిగా చదివి వినిపించింది. అదీగాక... 271 00:21:56,067 --> 00:22:00,155 ఆ పుస్తకంలో నీ తోటి విద్యార్థుల గురించి చాలా దారుణంగా రాశావని అంటున్నారు. 272 00:22:00,155 --> 00:22:01,406 అది నిజమేనా? 273 00:22:01,406 --> 00:22:04,034 నేను నిజాన్ని రాశానంతే. 274 00:22:04,034 --> 00:22:06,077 ఆ పుస్తకాన్ని ఇలా ఇవ్వు, హ్యారియట్. వెంటనే ఇవ్వు. 275 00:22:06,077 --> 00:22:08,413 నా ఇంకో పుస్తకాన్ని మేరియన్ నాకు ఇవ్వదు. 276 00:22:08,413 --> 00:22:11,499 నాకు ఇది కావాలి. దీనికి నేను కావాలి. 277 00:22:11,499 --> 00:22:14,044 హ్యారియట్, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నా. 278 00:22:14,044 --> 00:22:16,463 ఆ పుస్తకాన్ని ఇవ్వు. 279 00:22:16,463 --> 00:22:18,715 మీరు... మీరు ఇందులో ఉండేది చదవం అని మాటిస్తేనే ఇస్తా. 280 00:22:18,715 --> 00:22:21,676 నువ్వు డిమాండ్లు చేసే అర్హతని కోల్పోయావు, హ్యారియట్. 281 00:22:21,676 --> 00:22:25,222 నాకు మీరు ముందే పాకెట్ మనీ ఇచ్చుంటే, అవి మీకు లంచంగా ఇచ్చి ఉండేదాన్ని. 282 00:22:26,765 --> 00:22:28,934 నీకు అయిదు సెకన్ల సమయం ఇస్తున్నా. 283 00:22:29,517 --> 00:22:32,479 దగ్గరకు రావద్దు, లేదంటే ఎడ్డీ మిమ్మల్ని పొడిచేస్తుంది. 284 00:22:32,479 --> 00:22:35,190 నిజంగానే పొడుస్తుంది. పొడవదు అనుకోకండి. 285 00:22:36,942 --> 00:22:39,945 బిషా! బిషా! బిష బిషా! 286 00:22:39,945 --> 00:22:42,364 మూసుకొని పుస్తకాన్ని ఇవ్వు, హ్యారియట్. 287 00:22:42,364 --> 00:22:43,698 ఇవ్వను! 288 00:22:45,617 --> 00:22:48,620 వాళ్లు బాతు తగలకుండా తప్పించుకొన్న రోజు గురించి తలుచుకొని భవిష్యత్తులో 289 00:22:48,620 --> 00:22:51,623 మేమందరం నవ్వుకుంటామని మొదట నాకు అనిపించింది. 290 00:22:52,249 --> 00:22:56,711 కానీ తర్వాత "నా ఖేల్ ఖతమ్," అని తెలిసొచ్చింది. 291 00:22:57,712 --> 00:23:00,298 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 292 00:23:00,298 --> 00:23:02,050 మనకు నచ్చినట్లు ఉండాలి 293 00:23:03,176 --> 00:23:05,720 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 294 00:23:05,720 --> 00:23:11,309 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 295 00:23:13,478 --> 00:23:19,150 నా చుట్టపక్కల అందరికీ మంచి చేయాలని ప్రయత్నిస్తాను 296 00:23:19,150 --> 00:23:21,695 నేను అందంగా నవ్వుతాను 297 00:23:21,695 --> 00:23:24,990 నిజం మాత్రమే చెప్పాలని తపిస్తాను 298 00:23:24,990 --> 00:23:27,576 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 299 00:23:27,576 --> 00:23:29,494 మనకు నచ్చినట్లు ఉండాలి 300 00:23:30,370 --> 00:23:33,123 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 301 00:23:33,123 --> 00:23:35,959 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 302 00:23:35,959 --> 00:23:38,545 నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అదే అవుతాను 303 00:23:38,545 --> 00:23:40,547 నాదే తుది నిర్ణయం 304 00:23:41,256 --> 00:23:43,884 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 305 00:23:43,884 --> 00:23:46,052 మనకు నచ్చినట్లు ఉండాలి 306 00:23:46,052 --> 00:23:48,889 లేదు, నా జుట్టు కత్తిరించుకోను 307 00:23:48,889 --> 00:23:51,558 నాకు నచ్చిందే వేసుకుంటాను 308 00:23:51,558 --> 00:23:57,230 నాకు నచ్చినట్లుగా ఉండడం నాకిష్టం 309 00:23:57,230 --> 00:24:00,150 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 310 00:24:00,150 --> 00:24:04,863 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 311 00:24:04,863 --> 00:24:06,948 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్