1 00:00:05,090 --> 00:00:06,591 నాకు ఆరోగ్యం బ్రహ్మాండంగానే ఉందిగా. 2 00:00:08,802 --> 00:00:11,054 నన్ను డాక్టరుకు ఎందుకు చూపించడం? 3 00:00:11,054 --> 00:00:13,974 సైకైయాట్రిస్ట్ కూడా ఒక ప్రత్యేకమైన డాక్టర్, హనీ. 4 00:00:13,974 --> 00:00:15,850 డాక్టర్ వాగ్నెర్ నీతో మాట్లాడతారంతే, 5 00:00:15,850 --> 00:00:18,853 నీకు ఎలా ఉంది, ఏం చేస్తున్నావు వంటివి తెలుసుకుంటారు. 6 00:00:19,437 --> 00:00:21,189 నాకు అంతా బాగానే ఉంది. 7 00:00:21,189 --> 00:00:22,816 నువ్వు చేసినవి నీకు గుర్తు తెప్పిస్తా ఆగు. 8 00:00:22,816 --> 00:00:26,319 నీ పుస్తకంలో నీ స్నేహితులను ఉద్దేశించి నువ్వు రాసిన దారుణమైన రాతలన్నింటినీ వాళ్ళు చదివారు. 9 00:00:27,571 --> 00:00:29,823 ఒక కప్పని తీసుకెళ్లి మీ క్లాసును హడలెత్తించావు. 10 00:00:30,782 --> 00:00:32,241 ఇంకేం చేశావు? 11 00:00:32,741 --> 00:00:34,452 ఇంకోటి ఉంది. 12 00:00:34,452 --> 00:00:36,955 ఒక బాతు బొమ్మని నీ కన్న తల్లిదండ్రుల పైకి విసిరావు. 13 00:00:37,581 --> 00:00:40,667 వాటన్నింటినీ మనం మాట్లాడుకుంటే సరిపోదా? తల్లీకూతుళ్లలా? 14 00:00:40,667 --> 00:00:42,002 మిత్రులుగా? 15 00:00:43,461 --> 00:00:44,421 నీ మాటలకు పడిపోనులే, హ్యారియట్. 16 00:00:45,589 --> 00:00:46,840 మీరు సిద్ధంగా ఉంటే రావచ్చు. 17 00:00:48,508 --> 00:00:50,135 హాయ్, నేనే డాక్టర్ వాగ్నెర్ ని. 18 00:00:50,135 --> 00:00:51,636 నిన్ను కలవడం సంతోషంగా ఉంది, హ్యారియట్. 19 00:00:51,636 --> 00:00:54,681 నేనెంత వద్దన్నా ఇక్కడికి తీసుకొచ్చారు. 20 00:00:54,681 --> 00:00:55,765 అలాగే. 21 00:00:55,765 --> 00:00:57,100 మనం తర్వాత మాట్లాడుకుందాంలే. 22 00:00:57,100 --> 00:00:58,268 లోపలికి వస్తావా? 23 00:00:59,144 --> 00:01:00,645 నాకు మరో దారి ఉందా ఏంటి? 24 00:01:02,480 --> 00:01:05,734 నేను అబద్ధమాడను కానీ, నాకు కాస్త కంగారుగా ఉంది. 25 00:01:05,734 --> 00:01:08,236 డాక్టర్ జుట్టు మంటలా ఉంది. 26 00:01:08,236 --> 00:01:09,738 అక్కడ వింత వింత కళాకృతులు ఉన్నాయి, 27 00:01:09,738 --> 00:01:11,031 పిల్లల ఆటలు ఉన్నాయి, 28 00:01:11,031 --> 00:01:14,492 ఇంకో బొమ్మ అయితే నన్ను గుచ్చిగుచ్చి చూస్తోంది. 29 00:01:18,580 --> 00:01:21,666 నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. కానీ పరిస్థితులు అదుపు తప్పితే... 30 00:01:25,837 --> 00:01:27,005 అదిరిపోయింది. 31 00:01:27,005 --> 00:01:30,217 ...కళాకృతులను మెచ్చుకుంటున్నట్టు నటించడమో లేదా కిటికీ నుండి దూకి పారిపోవడమో చేసేస్తాను. 32 00:01:34,012 --> 00:01:36,389 ఒక నకిలీ గడ్డం వేసుకొని నౌకలో ఎక్కి ఉడాయించేస్తాను. 33 00:01:37,307 --> 00:01:38,808 ఏం ఆలోచిస్తున్నావు, హ్యారియట్? 34 00:01:40,185 --> 00:01:42,604 ఏం లేదు, డాక్టర్. అస్సలు ఏమీ లేదు. 35 00:01:43,188 --> 00:01:45,857 {\an8}నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 36 00:01:45,857 --> 00:01:47,609 మనకు నచ్చినట్లు ఉండాలి 37 00:01:48,735 --> 00:01:51,196 నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అదే అవుతాను 38 00:01:51,196 --> 00:01:52,864 నాదే తుది నిర్ణయం 39 00:01:53,365 --> 00:01:56,284 లేదు, నా జుట్టు కత్తిరించుకోను 40 00:01:56,284 --> 00:01:58,745 నాకు నచ్చిందే వేసుకుంటాను 41 00:01:58,745 --> 00:02:04,876 నాకు నచ్చినట్లుగా ఉండడం నాకిష్టం 42 00:02:04,876 --> 00:02:07,504 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 43 00:02:07,504 --> 00:02:10,465 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 44 00:02:10,465 --> 00:02:11,550 {\an8}"నేను ఆనియన్" 45 00:02:13,343 --> 00:02:14,678 {\an8}లూయిస్ ఫిట్జ్ హ్యూ రచించిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 46 00:02:17,889 --> 00:02:19,307 నా గురించి మీరేం రాస్తున్నారు? 47 00:02:19,307 --> 00:02:20,392 కొన్ని నోట్స్, అంతే. 48 00:02:20,892 --> 00:02:22,143 నీకేమీ పర్వాలేదు కదా? 49 00:02:22,143 --> 00:02:23,353 లేదు. 50 00:02:23,353 --> 00:02:26,064 కానీ మీరేమైనా దారుణమైన రాతలు రాస్తే, ఆ విషయం మా అమ్మకు తెలిస్తే, 51 00:02:26,064 --> 00:02:28,441 మీరు కూడా సైకైయాట్రిస్ట్ ని కలవాల్సి ఉంటుంది. 52 00:02:28,441 --> 00:02:30,318 నీకు కూడా ఒక పుస్తకం కావాలా? 53 00:02:30,819 --> 00:02:33,613 నా దగ్గర ఉండి, నీ దగ్గర లేకపోవడం న్యాయంగా అనిపించట్లేదు. 54 00:02:34,114 --> 00:02:36,866 పుస్తకం అనగానే నా చేతి వేళ్లు దురదపెట్టేశాయి. 55 00:02:36,866 --> 00:02:39,494 నా పెన్ ధారాళంగా రాయడం. 56 00:02:39,494 --> 00:02:41,830 నా ఆలోచనలు బయటపడటానికి ఒక దారి. 57 00:02:42,747 --> 00:02:44,457 ఇది ఖచ్చితంగా ఉచ్చే. 58 00:02:47,878 --> 00:02:49,254 వామ్మోయ్! 59 00:02:50,922 --> 00:02:52,048 పర్వాలేదులెండి. అక్కర్లేదు. 60 00:02:52,048 --> 00:02:54,968 అయితే, హ్యారియట్. నువ్వు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటావు? 61 00:02:54,968 --> 00:02:56,887 నేనెందుకు వచ్చానని అంటారు? 62 00:02:57,387 --> 00:03:00,640 మీ ఆయా హఠాత్తుగా వెళ్లిపోయిందని, ఆ తర్వాత సర్దుబాటు అవ్వడం 63 00:03:00,640 --> 00:03:02,934 నీకు కష్టం అయిపోయిందని మీ అమ్మ అంది. 64 00:03:03,643 --> 00:03:05,520 మరి నీ మనస్సులో ఏముందో చెప్పరాదూ? 65 00:03:06,271 --> 00:03:08,857 నా మనస్సులో ఏముందంటే, పారిపోవడానికి బదులు, 66 00:03:08,857 --> 00:03:11,610 ఇక్కడి నుండి గెంటేయించుకోవడం సులభమేమో. 67 00:03:11,610 --> 00:03:14,696 అప్పుడప్పుడూ తలతిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. 68 00:03:14,696 --> 00:03:18,199 గుచ్చిగుచ్చి చూసే విషయంలో పోటీ పెట్టుకుందామా? 69 00:03:18,199 --> 00:03:20,035 రగ్గు మీద దైవదూత బొమ్మని గీద్దామా? 70 00:03:20,827 --> 00:03:22,037 -హ్యారియట్? -చెప్పండి. 71 00:03:22,579 --> 00:03:24,122 ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఇవ్వనా? 72 00:03:25,290 --> 00:03:26,875 ఇవ్వండి. 73 00:03:27,375 --> 00:03:28,460 ఇది హ్యారియట్ ఎం. వెల్ష్ పుస్తకం 74 00:03:28,460 --> 00:03:30,170 కొత్త పుస్తకం మీద నా పేరును రాసిన వెంటనే 75 00:03:30,170 --> 00:03:32,255 ఎక్కడా లేని ఉత్సాహం, ఊపూ నాకు వచ్చేస్తుంది. 76 00:03:32,881 --> 00:03:35,091 అదే ఊపులో సైకైయాట్రిస్టుతో కూడా మాట్లాడేయగలను. 77 00:03:35,091 --> 00:03:36,509 చెప్పు మరి, హ్యారియట్, 78 00:03:36,509 --> 00:03:38,428 మీ ఆయా వెళ్లిపోయినప్పుడు నీకు ఎలా అనిపించింది? 79 00:03:39,721 --> 00:03:42,641 ఎలా... ఎలా అనిపించిందంటే... 80 00:03:43,558 --> 00:03:46,436 చాలా బాధగా అనిపించింది. 81 00:03:46,436 --> 00:03:48,063 నేను ఆమెకి అన్నీ చెప్పేశాను. 82 00:03:48,063 --> 00:03:53,276 ఓల్ గోలీ గురించి, దొంగిలించబడిన నా పుస్తకం గురించి, ఇంకా నా గురించి. 83 00:03:54,361 --> 00:03:56,613 నాకు అన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. 84 00:03:56,613 --> 00:03:59,324 అలా తెలుసుకోవాలంటే, నేను నా కళ్ళారా అన్నీ చూడాలి కదా. 85 00:03:59,324 --> 00:04:03,286 అలా అన్నీ చూడాలంటే, డిటెక్టివ్ అవ్వడం తప్ప నాకు మరో దారి లేదు కదా. 86 00:04:03,286 --> 00:04:04,371 విషయమేంటంటే, హ్యారియట్, 87 00:04:04,371 --> 00:04:07,749 అప్పుడప్పుడూ నీపై నువ్వు నిఘా ఉంచుకోవడమే చాలా మేలైన పని అవుతుంది. 88 00:04:09,459 --> 00:04:10,460 సరే. 89 00:04:12,003 --> 00:04:13,463 ఒకసారి దాని గురించి ఆలోచించు. 90 00:04:14,089 --> 00:04:15,715 వచ్చేసారి దాని గురించే మాట్లాడుకుందాం. 91 00:04:15,715 --> 00:04:17,800 నీకు ఆ పుస్తకాన్ని తర్వాతి సెషన్ లో ఇచ్చేస్తాను. 92 00:04:17,800 --> 00:04:18,884 ఏమంటావు? 93 00:04:19,636 --> 00:04:21,638 నిజం చెప్తున్నా కదా, నాకు ఈవిడ బాగా నచ్చేసింది. 94 00:04:22,138 --> 00:04:24,516 కానీ నాకు ఓ పుస్తకం ఇవ్వడం, మళ్లీ దాన్ని తీసేసుకోవడం 95 00:04:24,516 --> 00:04:26,309 అంత మంచి పనిలా అనిపించలేదు. 96 00:04:31,690 --> 00:04:35,026 నీతో డాక్టర్ వాగ్నెర్ ఏం చెప్పిందేంటి? 97 00:04:35,527 --> 00:04:38,446 నువ్వు చాలా అద్భుతమైన పాపవి అంది. 98 00:04:39,406 --> 00:04:40,740 అది నిజమేలే. 99 00:04:46,037 --> 00:04:50,375 బంగారం, నీ స్నేహితులకు ఎప్పుడూ సారీ చెప్పాలని అనిపించలేదా? 100 00:04:50,375 --> 00:04:51,793 లేదు. 101 00:04:51,793 --> 00:04:54,462 డాక్టర్ వాగ్నెర్, నీకు ఒక లక్ష్యాన్ని ఇవ్వమని సూచించారు. 102 00:04:54,462 --> 00:04:58,258 నీ మిత్రులకు సారీ చెప్తే, నీ పుస్తకం నీకు ఇచ్చేస్తాను. 103 00:04:59,885 --> 00:05:02,053 ఈ రాత్రి వైట్ హెడ్స్ లో పేక ఆడటానికి వెళ్తున్నాను. 104 00:05:02,053 --> 00:05:03,430 నువ్వు కూడా నాతో రావచ్చు కదా? 105 00:05:03,430 --> 00:05:05,682 ముందు పింకీకి సారీ చెప్పు. 106 00:05:05,682 --> 00:05:08,810 నా పుస్తకాన్ని చదివినందుకు వాడే నాకు సారీ చెప్పాలి. 107 00:05:08,810 --> 00:05:10,645 ఒకసారి ఆలోచించి చూడు, సరేనా? 108 00:05:15,483 --> 00:05:16,818 నేను ఆలోచించాను. 109 00:05:16,818 --> 00:05:19,446 ఇంకాస్త ఎక్కువగా కూడా ఆలోచించా. 110 00:05:19,446 --> 00:05:22,157 నా పుస్తకాన్ని నేను చాలా మిస్ అవుతున్నానని అనిపించింది. 111 00:05:22,741 --> 00:05:24,492 ఇంకా ఓల్ గోలీని కూడా చాలా మిస్ అవుతున్నానని అనిపించింది, 112 00:05:24,492 --> 00:05:27,203 నేను వాడికి సారీ చెప్తే, తను ఏమంటుందో, అది కూడా. 113 00:05:28,496 --> 00:05:31,958 ఆ తర్వాత హొవర్డ్ ఫించ్ చిటికెన వేలు అంటే నాకు ఎంత ఇష్టమో అని ఆలోచించాను. 114 00:05:31,958 --> 00:05:34,711 అప్పుడప్పుడూ, అలాంటి చిన్న చిన్న వివరాలే, 115 00:05:34,711 --> 00:05:37,130 నకిలీవి కూడా నిజమైనవే అనే ఫీలింగ్ ని మనకి కలిగిస్తాయి. 116 00:05:38,298 --> 00:05:40,717 గౌరవనీయులైన జూరీ సభ్యులారా, 117 00:05:40,717 --> 00:05:45,513 నాకు నిజంపై నమ్మకం ఉంది కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. 118 00:05:45,513 --> 00:05:49,726 మరి ఏ మాత్రం సందేహం లేకుండా నా క్లయింట్ నిర్దోషి అని 119 00:05:49,726 --> 00:05:54,564 నేను నిరూపించాలనుకుంటున్నాను. 120 00:05:55,398 --> 00:05:58,193 హొవర్డ్ ఫించ్ అన్న దాని గురించి ఆలోచించాను. 121 00:05:58,193 --> 00:06:00,987 సారీ చెప్పాల్సిన అవసరం నాకు లేదని గ్రహించాను. 122 00:06:01,571 --> 00:06:04,741 నాకు కావలసింది న్యాయం. 123 00:06:08,328 --> 00:06:12,791 మీ ఇద్దరికీ స్వాగతం. కారొల్, నువ్వు పేకాట ఆడటానికే వచ్చావు అనుకుంటా. 124 00:06:12,791 --> 00:06:16,211 నేనేదో ఆడేద్దామని రాలేదు, పెగ్గీ. గెలవడానికే వచ్చాను. 125 00:06:17,003 --> 00:06:18,755 పింకీ, ఎవరొచ్చారో చూడు. 126 00:06:23,301 --> 00:06:25,387 నువ్వూ, హ్యారియట్ బయటకు వెళ్లి ఆడుకోండి. 127 00:06:25,887 --> 00:06:28,848 మీరిద్దరూ చాలానే మాట్లాడుకోవాలనుకుంటా. 128 00:06:28,848 --> 00:06:30,183 సరే. 129 00:06:32,894 --> 00:06:34,437 ఇది చాలా తేలికైన పని. 130 00:06:34,437 --> 00:06:37,065 పింకీతో నా కేసును గెలిచి, నా పుస్తకాన్ని తిరిగి సంపాదించుకుంటా, 131 00:06:37,065 --> 00:06:39,526 ఆ తర్వాత ఇంకెవరి గురించి ఆలోచించాల్సిన పని కూడా ఉండదు. 132 00:06:43,613 --> 00:06:44,823 వామ్మోయ్. 133 00:06:47,158 --> 00:06:48,702 ఇక్కడేం జరుగుతోంది, పింకీ? 134 00:06:48,702 --> 00:06:51,788 నువ్వు ఇక్కడికి సారీ చెప్పడానికి వస్తున్నావని 135 00:06:51,788 --> 00:06:54,666 నేనే అనుకోకుండా వీళ్లందరికీ చెప్పుంటానేమో. 136 00:06:55,333 --> 00:06:58,253 వచ్చిందమ్మా వయ్యారి. అందరూ చూడండి. 137 00:06:59,713 --> 00:07:00,714 హాయ్. 138 00:07:04,593 --> 00:07:05,510 అత్యంత రహస్యమైనది 139 00:07:10,265 --> 00:07:12,434 మాయా పుస్తకం. వెళ్లిపోదాం పదా. 140 00:07:15,020 --> 00:07:16,855 ఇక నువ్వు సారీ చెప్తే, మేము విని తరిస్తాం. 141 00:07:19,691 --> 00:07:23,236 నిజానికి, నేను నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలనుకుంటున్నా. 142 00:07:23,904 --> 00:07:26,156 గౌరవనీయులైన కోర్టు సభ్యులారా, 143 00:07:26,156 --> 00:07:30,285 నాకు నిజంపై నమ్మకం ఉంది కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. 144 00:07:30,285 --> 00:07:34,039 మరి ఏ మాత్రం సందేహం లేకుండా నా క్లయింట్, 145 00:07:34,039 --> 00:07:38,668 అంటే హ్యారియట్ ఎం. వెల్ష్ అనే నేను నిర్దోషినని 146 00:07:38,668 --> 00:07:41,755 నిరూపించాలనుకుంటున్నాను. 147 00:07:42,255 --> 00:07:43,673 విచారణని నిర్వహిద్దాం. 148 00:07:43,673 --> 00:07:45,842 కేసును నేను గెలిస్తే, నా పుస్తకం నాకు ఇచ్చేయాలి. 149 00:07:45,842 --> 00:07:47,636 ఒకవేళ నువ్వు ఓడిపోతే? 150 00:07:47,636 --> 00:07:49,846 అప్పుడు మీరు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తాను. 151 00:07:50,430 --> 00:07:51,640 ఏ శిక్ష అయినానా? 152 00:07:52,641 --> 00:07:53,767 అందరూ ఇలా రండి. 153 00:07:59,940 --> 00:08:02,484 స్కూల్ నాటకంలో నువ్వు ఉల్లిపాయ పాత్రలో నటిస్తున్నావు కాబట్టి, 154 00:08:02,484 --> 00:08:07,572 నువ్వు ఓడిపోతే, ఒక ఉల్లిపాయని తినాలి. 155 00:08:07,572 --> 00:08:08,907 మొత్తం తినేయాలి. 156 00:08:08,907 --> 00:08:10,617 ఆ శిక్ష నాకు ఓకే. 157 00:08:13,328 --> 00:08:17,207 నేను హొవర్డ్ ఫించ్ లా వాదించాలంటే, నా చిటికెన వేలుకు ఒక ఉంగరం ఉండాలి. 158 00:08:18,416 --> 00:08:20,460 ఇక కోర్టులోనే తేల్చుకుందాం. 159 00:08:29,970 --> 00:08:32,179 పింకీ, ఇది మీ ఇల్లు కాబట్టి, జడ్జిగా నువ్వే ఉండవచ్చు. 160 00:08:32,806 --> 00:08:34,890 దానికి నాకు జడ్జి డ్రెస్ కావాలి. 161 00:08:34,890 --> 00:08:35,976 ఐడియా! 162 00:08:38,186 --> 00:08:41,481 -రేచెల్, నువ్వు బంట్రోతువి. -సూపర్! ఇంతకీ బంట్రోతు అంటే ఏంటి? 163 00:08:41,481 --> 00:08:43,316 నువ్వు కోర్టులో అంతా పద్ధతి ప్రకారం జరిగేలా చూసుకోవాలి. 164 00:08:43,316 --> 00:08:45,819 ఎలాగైనా. 165 00:08:46,987 --> 00:08:48,613 ఇక నాకు వదిలేయ్. 166 00:08:50,407 --> 00:08:52,367 నేను కోర్టు ఆర్టిస్టుగా ఉంటా. 167 00:08:52,367 --> 00:08:53,994 నేను టైపిస్టుగా ఉంటా. 168 00:08:54,494 --> 00:08:58,623 -మంచిది. ఇక ఎలాగూ ప్రాసిక్యూటరుగా నేనే ఉండాలి. -లేదు. 169 00:08:59,916 --> 00:09:01,459 ప్రాసిక్యూటరుగా నేను ఉంటాను. 170 00:09:01,459 --> 00:09:03,128 నువ్వు ఎందుకు? 171 00:09:03,128 --> 00:09:05,297 హ్యారియట్ గురించి అందరికన్నా నాకే బాగా తెలుసు. 172 00:09:05,297 --> 00:09:08,216 అంటే, తన చెత్త చెత్త ట్రిక్స్ కూడా నాకు తెలుసని అర్థం. 173 00:09:09,050 --> 00:09:10,719 మరి నేనే పాత్ర పోషించాలి? 174 00:09:10,719 --> 00:09:12,053 నువ్వు సాక్షిగా ఉండవచ్చు. 175 00:09:12,053 --> 00:09:14,431 ఒక ప్రముఖ సాక్షిగా. 176 00:09:18,018 --> 00:09:19,978 నేను చాలా పెద్ద ప్రముఖ సాక్షిని. 177 00:09:20,770 --> 00:09:24,232 అందరూ వినండి! కోర్టు విచారణ ఆరంభం కానున్నది. 178 00:09:24,232 --> 00:09:27,360 అందమైన జడ్జి వైట్ హెడ్ వస్తున్నారు, అందరూ లేచి నిలబడండి. 179 00:09:27,944 --> 00:09:30,655 అబ్బో, పింకీ అందగాడని రేచెల్ అంటోందిగా. 180 00:09:30,655 --> 00:09:32,824 నువ్వు అనాల్సింది "గౌరవనీయులైన" అని, రేచెల్. 181 00:09:32,824 --> 00:09:33,909 తొక్కలే. 182 00:09:34,451 --> 00:09:37,954 "లేచి నిలబడండి" అన్నాను కదరా, సన్నాసులారా, 183 00:09:42,042 --> 00:09:43,335 ఏంటి అది? 184 00:09:44,878 --> 00:09:45,879 నా చెక్క సుత్తి. 185 00:09:48,256 --> 00:09:49,591 అందరూ కూర్చోండి. 186 00:09:50,217 --> 00:09:54,346 చిటికెన వేలుకు ఉన్న ఉంగరం వల్లనేమో, నాలో ఆత్మ విశ్వాసం పొంగి పొర్లుతోంది. 187 00:09:54,846 --> 00:09:57,515 కానీ నా ఎడమ కాలు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. 188 00:09:59,517 --> 00:10:00,518 కంగారుగా ఉందా? 189 00:10:01,061 --> 00:10:02,062 లేదు. 190 00:10:02,062 --> 00:10:03,772 నా కాలు కొట్టుకుంటూ ఉండవచ్చు, 191 00:10:03,772 --> 00:10:07,984 కానీ నా పునాది మాత్రం చాలా గట్టిగా ఉంది, అదే నిజం. 192 00:10:09,194 --> 00:10:10,487 ఈరోజు మనం విచారణ చేస్తున్న కేసు 193 00:10:10,487 --> 00:10:15,283 హ్యారియట్ ఎం. వెల్ష్ మాజీ స్సేహితులకు, హ్యారియట్ ఎం. వెల్ష్ కు మధ్య నడుస్తున్న కేసు. 194 00:10:15,283 --> 00:10:18,536 ఇక విచారణ మొదలుపెట్టండి. 195 00:10:18,536 --> 00:10:20,538 కోర్టు సభ్యులారా, 196 00:10:20,538 --> 00:10:25,335 తన మిత్రులపై దారుణమైన, న్యాయబద్ధం కాని ఆరోపణలన్నిటినీ చేసి, సారీ కూడా చెప్పకుండా 197 00:10:25,335 --> 00:10:28,296 ప్రతివాది అయిన హ్యారియట్ ఎం. వెల్ష్ స్నేహానికి వ్యతిరేకంగా 198 00:10:28,296 --> 00:10:34,719 తీవ్రమైన నేరాలకు పాల్పడిందని నేను నిరూపించాలనుకుంటున్నాను. 199 00:10:35,428 --> 00:10:36,846 డిఫెన్స్ లాయరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 200 00:10:38,848 --> 00:10:40,934 ఇప్పుడు నేనంటే మీలో ఎవరికీ ఇష్టం లేదని నాకు తెలుసు. 201 00:10:40,934 --> 00:10:42,519 మీకు నాపై చాలా ద్వేషం కూడా ఉండవచ్చు. 202 00:10:46,231 --> 00:10:50,443 కానీ నచ్చకపోయినంత మాత్రాన నేను దోషినని కాదు కదా. 203 00:10:50,443 --> 00:10:52,571 ఎందుకంటే, నిజానిజాలు అదే చెప్తున్నాయి కదా. 204 00:10:52,571 --> 00:10:57,450 అవి నేను చేసిన నేరం ఏంటంటే, అది నిజం చెప్పడమే అని ఘోషిస్తున్నాయి! 205 00:10:57,450 --> 00:11:00,704 ప్రాసిక్యూటర్, మీ తొలి సాక్షిని మీరు ప్రవేశపెట్టవచ్చు. 206 00:11:00,704 --> 00:11:03,748 నేను స్పోర్ట్ రోక్ ని ప్రవేశపెట్టమని కోరుతున్నాను. 207 00:11:07,252 --> 00:11:11,339 స్పోర్ట్, మీరు 55వ పేజీలోని ఈ విభాగాన్ని చదివి వినిపిస్తారా? 208 00:11:11,339 --> 00:11:12,424 తప్పదంటే చదువుతాను. 209 00:11:13,884 --> 00:11:15,635 "ఒక్కోసారి, స్పోర్ట్ ని భరించడం అసాధ్యం అనిపిస్తుంది. 210 00:11:15,635 --> 00:11:19,014 ఎప్పుడూ కంగారే, ఎప్పుడూ వాళ్ల నాన్న మీద ఏడుపే, 211 00:11:19,014 --> 00:11:21,683 ముసలావిడలా ప్రవర్తిస్తుంటాడు." 212 00:11:22,517 --> 00:11:24,978 అది చదివాక మీకు ఎలా అనిపించింది? 213 00:11:24,978 --> 00:11:26,062 చాలా దారుణంగా అనిపించింది. 214 00:11:26,980 --> 00:11:29,316 నేనేమీ ఊరికే ఏడవలేదు, హ్యారియట్. నేను అస్సలు ఏడుపోడినే కాదు. 215 00:11:29,316 --> 00:11:31,359 అసలు "ఏడుపోడు" అనే పదం లేదుగా. 216 00:11:33,486 --> 00:11:34,487 పర్వాలేదులే. 217 00:11:35,071 --> 00:11:37,157 స్పోర్ట్, ఆ రాత్రి వేళ, 218 00:11:37,157 --> 00:11:39,284 జేనీ నీతో కలిసి సినిమాకి వెళ్లాలని 219 00:11:39,284 --> 00:11:41,953 -మీ నాన్న అంట్లు తోమగలడా అని అడిగింది. -అవును. 220 00:11:41,953 --> 00:11:43,747 అప్పుడు, నువ్వేం అన్నావు? 221 00:11:44,539 --> 00:11:47,667 నేను, "లేదు, అతని వేళ్లకి మడతలు వచ్చేస్తాయి. 222 00:11:47,667 --> 00:11:50,003 అప్పుడు టైప్ రైటర్ మీద అతను టైప్ చేయలేడు," అని అన్నాను. 223 00:11:50,003 --> 00:11:53,381 జేనీ నిన్ను "అయితే, తర్వాత తోమలేవా?" అని అడిగినప్పుడు, 224 00:11:53,381 --> 00:11:54,591 నువ్వు ఏమన్నావు? 225 00:11:54,591 --> 00:11:57,719 ఒక్క పాత్ర ఉండిపోయినా నాకు ప్రశాంతత ఉండదు. 226 00:11:58,595 --> 00:12:02,641 స్పోర్ట్, అలాంటి మాటలను మా బామ్మే నాతో అంటుంది. 227 00:12:02,641 --> 00:12:03,725 అవునా? 228 00:12:03,725 --> 00:12:06,519 ఒక పక్కన పెద్ద నవలను రాయాలని ప్రయత్నిస్తూ, 229 00:12:06,519 --> 00:12:08,146 మరోవైపు ఏ ఆసరా లేకుండా నన్ను పెంచే మా నాన్నకి 230 00:12:08,146 --> 00:12:10,649 సాయపడాలని ప్రయత్నించినందుకు క్షమించు. 231 00:12:10,649 --> 00:12:12,776 నేను ఏదైతే గమనించానో, అదే రాశాను. 232 00:12:12,776 --> 00:12:13,860 హ్యారియట్... 233 00:12:15,904 --> 00:12:18,657 నాకు అన్నీ తెలుసుకోవాలని ఉంటుంది అని నువ్వు అంటుంటావు, 234 00:12:18,657 --> 00:12:20,408 కానీ నీకు అసలు ఏమీ తెలీదు. 235 00:12:21,201 --> 00:12:22,202 ఇక నేను బయలుదేరుతాను. 236 00:12:23,245 --> 00:12:24,246 స్పోర్ట్. 237 00:12:27,415 --> 00:12:28,917 భళా, హ్యారియట్. 238 00:12:28,917 --> 00:12:31,545 నా రహస్యమైన, ప్రైవేట్ పుస్తకంలోని రాతలను 239 00:12:31,545 --> 00:12:34,839 అసలు అతనికి చూపింది నువ్వే కదా! 240 00:12:36,591 --> 00:12:37,926 తర్వాతి సాక్షి. 241 00:12:38,510 --> 00:12:42,556 నేను పుస్తకంలో రాసిన వాళ్ళందరూ ఒకరు తర్వాత మరొకరు వచ్చి 242 00:12:42,556 --> 00:12:45,267 నాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు. 243 00:12:45,267 --> 00:12:49,229 నువ్వు ఒకానొకప్పుడు హ్యారియట్ కి వీరాభిమానివని అందరికీ తెలుసు కదా? 244 00:12:49,229 --> 00:12:51,898 అలా అని నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ, 245 00:12:51,898 --> 00:12:54,025 నేను తనలానే రెడీ అవ్వడానికి ప్రయత్నించాను, 246 00:12:54,025 --> 00:12:58,613 ఇంకా హ్యారియట్స్ అనే ఒక రహస్య అభిమాన సంఘాన్ని కూడా ప్రారంభించాను. 247 00:12:59,322 --> 00:13:01,616 దాన్ని కూడా "బ్యారియట్" అనే పదంలానే పలకాలి, బెత్ ఎల్లెన్. 248 00:13:02,242 --> 00:13:05,787 కానీ నేను అభిమానివంటావా? అది నిజం కాదనుకుంటా. 249 00:13:05,787 --> 00:13:07,205 సరే. 250 00:13:07,205 --> 00:13:11,585 ఎనలేని అభిమానం చూపిన అస్సలు ఏ మాత్రం అభిమానం లేని వ్యక్తిగా, 251 00:13:11,585 --> 00:13:15,255 ఈ పుస్తకంలో హ్యారియట్ నీ గురించి ఏ రాసిందో చూద్దామా? 252 00:13:16,298 --> 00:13:17,299 సరే. 253 00:13:17,299 --> 00:13:21,303 "జనాలు కేరీ ఆండ్రూస్ వాళ్ళ ఇంటికి కేవలం వాళ్ల అమ్మ చేసే కేకుల కోసమే వెళ్తారని 254 00:13:21,303 --> 00:13:23,722 నాకు అప్పుడప్పుడూ అనిపిస్తుంది." 255 00:13:24,264 --> 00:13:26,099 అది నిజమే అంటావా? 256 00:13:26,099 --> 00:13:27,267 కాదు. 257 00:13:27,267 --> 00:13:30,478 జనాలు మా ఇంటికి వచ్చి ఏమంటారంటే, నేను వాళ్ల మాటల్లోనే చెప్తున్నా, 258 00:13:30,478 --> 00:13:33,815 "నన్ను ఇంటికి పిలిచినందుకు థ్యాంక్యూ, కేరీ. చాలా సరదాగా గడిపాను." 259 00:13:35,317 --> 00:13:36,818 అంతే. 260 00:13:37,485 --> 00:13:40,196 కేరీ, మీ ఇంటికి వచ్చే ముందు 261 00:13:40,196 --> 00:13:43,742 అందరూ ఏమంటారో ఓసారి కోర్టుకు చెప్తావా? 262 00:13:43,742 --> 00:13:45,452 మా అమ్మ అదిరిపోయే చాక్లెట్ కేకును 263 00:13:45,452 --> 00:13:47,829 చేసిందా అని అడుగుతారు. 264 00:13:47,829 --> 00:13:52,918 పైన చెర్రీలని, క్యాష్యూస్ ని కూడా అదరగొట్టేస్తారు. 265 00:13:56,671 --> 00:13:58,048 అంతే. 266 00:13:58,924 --> 00:13:59,925 సారీ. 267 00:13:59,925 --> 00:14:01,968 అలా అడిగినంత మాత్రాన ఇక అంతేనా? 268 00:14:01,968 --> 00:14:05,305 -ఇక పద లేకపోతే బొక్కబోర్లాపడతావు, కేరీ. -అది కేవలం కాకతాళీయమే. 269 00:14:08,099 --> 00:14:10,852 బెత్ ఎల్లెన్ హాన్సెన్ ని స్టాండ్ దగ్గరికి రావలసిందిగా కోరుతున్నాం. 270 00:14:11,937 --> 00:14:15,732 ఒక్క క్షణం. చాలా పెద్ద ప్రముఖ సాక్షి విచ్చేస్తున్నారహో. 271 00:14:15,732 --> 00:14:17,400 నీ వంతు వచ్చే దాకా ఆగు, మేరియన్. 272 00:14:17,400 --> 00:14:19,736 కాస్త ఆగు, పకోడీ పాపా. 273 00:14:20,237 --> 00:14:22,530 అభ్యంతరం! తరువాత రావలసిన సాక్షి తను కాదు. 274 00:14:23,573 --> 00:14:25,075 అభ్యంతరాన్ని పక్కన పెట్టేస్తున్నా. 275 00:14:27,369 --> 00:14:28,662 నాకు పుస్తకం అక్కర్లేదులే. 276 00:14:29,329 --> 00:14:32,123 హ్యారియట్ రాసిన ఆ చెడు మాటలన్నీ నా బుర్రలో ఉండిపోయాయి. 277 00:14:32,123 --> 00:14:34,125 తను రాసిన మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, 278 00:14:34,125 --> 00:14:36,294 "మేరియన్ ఎన్ని అవార్డులను గెలుచుకున్నా, 279 00:14:36,294 --> 00:14:39,297 చెడ్డ మనిషిగా తను సాధించినవాటికి 280 00:14:39,297 --> 00:14:43,635 ఒక భారీ కప్పును ఇంకా తను గెలవలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది." 281 00:14:44,886 --> 00:14:49,599 అలా రాసినందుకు, నువ్వు పనికిమాలినదానివి అని అంటాను, 282 00:14:49,599 --> 00:14:51,142 హ్యారియట్ ఎం. వెల్ష్. 283 00:14:52,185 --> 00:14:56,356 ఇప్పుడు నేను ఒకటి చెప్తా, అక్టోబరు 12న సాయంత్రం మూడున్నరకు, 284 00:14:56,356 --> 00:14:59,734 నేను, స్పోర్ట్ మా బొమ్మలను పట్టుకొని ఉన్న ఒక పెద్ద ఫోటోతో కూడిన 285 00:14:59,734 --> 00:15:02,988 న్యూస్ లెటర్ ని ప్రచురించావా లేదా? 286 00:15:02,988 --> 00:15:06,825 నువ్వు ఆ లెక్కనే కనుక చూడాలనుకుంటే, నేను చెప్పే అవకాశముండి కూడా 287 00:15:06,825 --> 00:15:09,202 చెప్పని చెడు విషయాలను నువ్వు లెక్కలోకి తీసుకోకూడదు. 288 00:15:10,245 --> 00:15:12,122 అంతే. 289 00:15:12,122 --> 00:15:15,458 బెత్ ఎల్లెన్, ఇవాళ నిన్ను మాటలు అనే అవకాశముండి కూడా నేనేమీ అనలేదు కదా, 290 00:15:15,458 --> 00:15:16,626 అ మాటల సంఖ్య ఎంతో చెప్పు. 291 00:15:17,294 --> 00:15:18,295 మూడు. 292 00:15:18,795 --> 00:15:20,255 లేదు, రెండు. 293 00:15:20,255 --> 00:15:22,507 మూడు. ఖచ్చితంగా మూడు. 294 00:15:23,091 --> 00:15:24,092 నాలుగు కూడా అయ్యుండవచ్చు. 295 00:15:25,552 --> 00:15:26,720 అంతే. 296 00:15:28,889 --> 00:15:33,143 "బెత్ ఎల్లెన్ కంగారుగా ఎప్పుడూ తన జుట్టును నములుతూనే ఉంటుంది కదా, 297 00:15:33,143 --> 00:15:36,354 అలాంటప్పుడు తనకి స్పెషల్ షాంపూ వాడాల్సిన అవసరం లేదు కదా." 298 00:15:36,354 --> 00:15:37,772 దానికి నీ సమాధానం? 299 00:15:38,773 --> 00:15:41,693 నాకేమీ కంగారు కాదు. నాకు దాని రుచి ఇష్టమంతే. 300 00:15:45,322 --> 00:15:48,742 {\an8}"పింకీ ఇంకా పర్పుల్ సాక్స్ స్కూల్ మానేసి, ఏదైనా విచిత్రమైన సర్కస్ లో చేరితే బాగుంటుందని 301 00:15:48,742 --> 00:15:51,202 {\an8}అప్పుడప్పుడూ నాకు అనిపిస్తుంది." 302 00:15:52,203 --> 00:15:54,748 -అది నీకెలా అనిపించింది? -చాలా కోపం వచ్చింది! 303 00:15:54,748 --> 00:15:57,125 కోర్టులో పద్ధతిగా ఉండాలి! పద్ధతిగా ఉండాలి! 304 00:15:57,876 --> 00:15:59,377 క్షమించాలి, యువర్ హానర్. 305 00:16:00,003 --> 00:16:03,256 ఇది కోర్టు, జూ కాదు. 306 00:16:04,883 --> 00:16:07,844 -సూపర్. -నేను ఎప్పట్నుంచో ప్రాక్టీస్ చేస్తున్నా. 307 00:16:07,844 --> 00:16:09,512 మీ ఇద్దరూ అదరగొట్టేశారు. 308 00:16:09,512 --> 00:16:10,889 మాతో పెట్టుకోవద్దు! 309 00:16:13,767 --> 00:16:16,228 "పిల్లల్ని బూచాడు వచ్చి ఎత్తుకుపోతాడు 310 00:16:16,228 --> 00:16:18,438 అని బెదిరించడానికి బదులుగా, 311 00:16:18,438 --> 00:16:21,650 రేచెల్ హెన్నెసీ వచ్చి ఎత్తుకు పోతుంది అని అనాలి." 312 00:16:21,650 --> 00:16:23,360 నా తమ్ముడు ఎప్పుడూ అదే అంటాడులే. 313 00:16:26,947 --> 00:16:30,033 ఇక మన తుది వాదనలను వినిపించవలసిన సమయం వచ్చింది. 314 00:16:30,033 --> 00:16:33,119 నేను రాసినవన్నీ మంచి విషయాలు కాదని అంగీకరిస్తున్నాను, 315 00:16:33,787 --> 00:16:36,831 కానీ అవన్నీ నిజమని నేను నిరూపించాను. 316 00:16:37,916 --> 00:16:40,001 ఇంకా, మహోన్నత వ్యక్తి అయిన ఓల్ గోలీ మాటల్లో చెప్పాలంటే, 317 00:16:40,585 --> 00:16:44,089 రచయిత బాధ్యత నిజం చెప్పడం, 318 00:16:44,089 --> 00:16:48,635 ఎందుకంటే అందంలో నిజం ఉంది, నిజం అందంగా ఉంటుంది. 319 00:16:50,220 --> 00:16:53,431 కేసు గెలిచానని నాకు అనిపించసాగింది. 320 00:16:53,431 --> 00:16:58,311 అంత అద్భుతంగా వాదించాక, జేనీ నోట మాటలు ఇంకేం వస్తాయి? 321 00:16:58,937 --> 00:17:00,939 జడ్జ్ పింకీ, నా తుది వాదనకు బదులుగా, 322 00:17:01,523 --> 00:17:02,649 నేను హ్యారియట్ ఎం. వెల్ష్ ని 323 00:17:03,817 --> 00:17:06,194 ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. 324 00:17:11,199 --> 00:17:12,199 అభ్యంతరం, యువర్ హానర్. 325 00:17:12,199 --> 00:17:14,953 మన న్యాయ వ్యవస్థ పునాదులకే అది వ్యతిరేకం. 326 00:17:14,953 --> 00:17:16,705 ఇక్కడున్న మన "న్యాయ వ్యవస్థ"లో 327 00:17:16,705 --> 00:17:20,458 సాక్ష్యుల స్టాండ్ గా పక్షులకు నీళ్లు పోసేది, ఇంకా తప్పుగా అనుకోవద్దు, 328 00:17:20,458 --> 00:17:23,879 తన తండ్రి బాత్ రోబ్ ని ధరించిన మనిషి, జడ్జిగా ఉన్నాడని గుర్తు చేస్తున్నాను, యువర్ హానర్. 329 00:17:23,879 --> 00:17:26,131 అభ్యంతరాన్ని తిరస్కరిస్తున్నాను. నేను అనుమతి ఇస్తున్నాను. 330 00:17:33,388 --> 00:17:34,222 మిస్ వెల్ష్. 331 00:17:34,222 --> 00:17:37,350 డెబ్బై ఏడవ పేజీలో నా గురించి ఒక పేరా రాసుంది. 332 00:17:37,350 --> 00:17:39,853 దాన్ని కాస్త కోర్టుకి చదివి వినిపిస్తారా? 333 00:17:39,853 --> 00:17:41,730 సరే. 334 00:17:42,439 --> 00:17:46,860 నేను ఏమని రాశానంటే, "జేనీకి మేడమ్ క్యూరీలా ఒక పెద్ద సైంటిస్ట్ కావాలనుంది. 335 00:17:47,402 --> 00:17:48,778 కానీ ఒక్కోసారి, తను ఒక పిచ్చి..." 336 00:17:48,778 --> 00:17:51,656 దాన్ని చదివి వినిపించవద్దులే. 337 00:17:51,656 --> 00:17:55,285 పుస్తకాన్ని పక్కన పెట్టేసి, నా ముఖం మీదే చెప్పేయ్. 338 00:17:56,620 --> 00:17:58,663 అందులో ఏముందే నీకు తెలుసు. 339 00:17:58,663 --> 00:18:00,206 హా, నాకు తెలుసు. 340 00:18:00,206 --> 00:18:02,542 కానీ అది నీ నోటి ద్వారా వినాలనుకుంటున్నాను. 341 00:18:02,542 --> 00:18:04,169 నాకు చెప్పాలని లేదు. 342 00:18:04,169 --> 00:18:06,254 బంట్రోతును పిలిపించేలా చేయవద్దు. 343 00:18:06,963 --> 00:18:10,175 నన్ను పిలవాలని ఎవరికీ ఉండదు. 344 00:18:14,846 --> 00:18:18,058 అది నువ్వు అనుకుంటున్నట్టు నిజమే అయితే, నోటితో చెప్పేయవచ్చు కదా? 345 00:18:18,642 --> 00:18:19,893 ఎందుకంటే... 346 00:18:19,893 --> 00:18:23,438 ఎందుకంటే, నువ్వు నీ స్నేహితులపైనే నిఘా వేసి ఉంచి, వారి గురించి 347 00:18:23,438 --> 00:18:26,107 నీ విలువైన పుస్తకంలో చెడ్డ చెడ్డ విషయాలు రాసే పిరికి పందవి, 348 00:18:26,107 --> 00:18:28,818 ఎందుకంటే, నీకు ముఖంపై చెప్పేంత దమ్ము లేదు. 349 00:18:28,818 --> 00:18:30,904 ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? 350 00:18:30,904 --> 00:18:32,155 కుదరదు. 351 00:18:37,494 --> 00:18:40,288 మేము వేచి చూస్తున్నాం, లాయరు గారు. 352 00:18:40,872 --> 00:18:41,998 చెప్పేయ్. 353 00:18:42,832 --> 00:18:45,126 పిచ్చి సైంటిస్ట్, చెడ్డ సైంటిస్ట్. 354 00:18:45,126 --> 00:18:47,546 ఇంకా ఒక పిచ్చి, చెడ్డ సైంటిస్ట్. 355 00:18:52,259 --> 00:18:54,094 ఆ మాటలకు నేను బాగా బాధపడ్డాను. 356 00:18:54,678 --> 00:18:55,971 కానీ అది నిజం కదా. 357 00:18:58,098 --> 00:18:59,933 కావచ్చు, హ్యారియట్ ఎం. వెల్ష్. 358 00:19:00,433 --> 00:19:02,602 కానీ జీవితమంటే నిజాలే కాదు. 359 00:19:02,602 --> 00:19:04,646 స్నేహబంధాలకు కూడా విలువ ఇవ్వాలి. 360 00:19:05,313 --> 00:19:08,316 స్నేహబంధం అన్నాక, నీ వల్ల నీ నేస్తం బాధ పడితే, 361 00:19:08,316 --> 00:19:09,693 వాళ్ళకి సారీ కూడా చెప్పాలి. 362 00:19:12,153 --> 00:19:14,906 రచయిత కావాలంటే, నిజం చెప్పేంత ధైర్యం ఉండాలని, 363 00:19:14,906 --> 00:19:16,908 అందుకు క్షమాపణలు చెప్పకూడదని 364 00:19:16,908 --> 00:19:19,202 ఓల్ గోలీ నాకు చెప్పింది. 365 00:19:19,202 --> 00:19:23,999 కానీ ఇక్కడ ఓల్ గోలీ లేదు, నేను ఉన్నాను. 366 00:19:34,342 --> 00:19:37,387 సారీ చెప్పనందుకు సారీ చెప్తే, ఓకేనా? 367 00:19:37,888 --> 00:19:40,807 సారీ చెప్పేసేయ్, హ్యారియట్. అదేమంత కష్టం కాదు. 368 00:19:40,807 --> 00:19:44,853 నాకు... నాకు కూడా సారీ చెప్పాలని చాలా ఉంది, కానీ... 369 00:19:45,687 --> 00:19:48,523 జీవితమంటే నిజాలే కాదని నువ్వు ఇందాక చెప్పావు కదా. 370 00:19:48,523 --> 00:19:50,483 కానీ నాకు నిజాలే జీవితమైతే? 371 00:19:51,484 --> 00:19:53,028 అది నీ ఇష్టం, హ్యారియట్. 372 00:19:59,910 --> 00:20:02,162 నేను గెలుస్తానని నాకు ఖచ్చితంగా తెలుసు, 373 00:20:02,162 --> 00:20:04,456 అందుకే నేను ఓడిపోతే ఈ ఉల్లిపాయని తింటానని చెప్పా. 374 00:20:04,456 --> 00:20:06,833 నేను చెప్పింది నిజమేనని నిరూపిస్తే చాలు, 375 00:20:06,833 --> 00:20:08,293 నేను అదే చేశా కూడా. 376 00:20:08,960 --> 00:20:10,962 మరి ఎందుకు నేను ఓడిపోయానని నాకు అనిపిస్తోంది? 377 00:20:11,546 --> 00:20:14,549 నాటకంలోని ఉల్లిపాయ పాత్ర రావడం నాకు అస్సలు నచ్చలేదు. 378 00:20:15,467 --> 00:20:17,469 కానీ దీనిలో ఉన్న విభిన్నమైన పొరలు, ఇంకా చాలా విశేషాలను చూసి 379 00:20:17,469 --> 00:20:19,304 ఇందులోని మంచి విషయం ఏమిటో నాకు అర్థమవ్వడం మొదలైంది. 380 00:20:19,888 --> 00:20:23,099 కాబట్టి, ఒక మంచి నటిలా నేను ఉల్లిపాయలా ఉండటానికి ప్రయత్నించాను. 381 00:20:23,099 --> 00:20:24,601 కానీ ఇప్పుడు నాకు తెలిసొచ్చింది... 382 00:20:36,112 --> 00:20:41,076 ఉల్లిపాయ అనేది జనాలని ఏడిపించే, ఎవరికీ ఇష్టం లేని, కంపు కొట్టే ఒక చెత్త వస్తువు, అంతే. 383 00:20:42,077 --> 00:20:43,370 నాలాగే. 384 00:20:44,079 --> 00:20:49,209 నిజం ఏమిటంటే, నేను ఉల్లిపాయ లాంటిదాన్నే. 385 00:21:12,691 --> 00:21:14,401 ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది, పిల్లలూ. 386 00:21:17,070 --> 00:21:18,613 హనీ. ఏమైందమ్మా? 387 00:21:21,074 --> 00:21:22,200 అయ్యయ్యో. 388 00:21:23,868 --> 00:21:26,705 బంగారం. ఏమైంది తల్లీ? 389 00:21:27,998 --> 00:21:30,083 అయ్యో బంగారం. 390 00:21:34,004 --> 00:21:35,171 ఎలా జరిగింది? 391 00:21:36,089 --> 00:21:39,050 నీ మిత్రులకు సారీ చెప్పావా? నీ పుస్తకం నీకు ఇచ్చేశారా? 392 00:21:39,050 --> 00:21:41,094 నాకు ఇంటికి వెళ్లిపోవాలనుంది. 393 00:21:41,094 --> 00:21:43,179 సరే, హనీ. అలాగే. 394 00:23:51,224 --> 00:23:53,226 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్