1 00:00:05,799 --> 00:00:08,969 ఆ విచారణలో నాకు చేదు అనుభవం ఎదురయ్యాక, 2 00:00:09,553 --> 00:00:11,137 నాకు అస్సలు నిద్ర పట్టలేదు. 3 00:00:11,137 --> 00:00:12,847 చాలా సిగ్గుగా అనిపించింది. 4 00:00:14,224 --> 00:00:16,268 నేను పచ్చి ఉల్లిపాయ తిన్నా కూడా నా మూడ్ మారలేదు. 5 00:00:16,268 --> 00:00:20,689 కాబట్టి, సూర్యోదయం కాక ముందే లేచి, బయటకు వెళ్లి 6 00:00:20,689 --> 00:00:24,442 నిండు పున్నమి చంద్రుడిని చూడాలనుకున్నాను. 7 00:00:26,236 --> 00:00:30,407 ప్రతీ ఏడాది, ఆ ఎర్రని చందమామను చూసి ఓ కోరిక కోరుకుంటుంటాను. 8 00:00:31,032 --> 00:00:35,161 ఆ కోరికలేవీ నిజం కాలేదు, కానీ ఆ రోజు కోరుకున్నది మాత్రం నిజమైంది. 9 00:00:38,373 --> 00:00:39,749 నా పుస్తకం! 10 00:00:39,749 --> 00:00:41,251 అత్యంత రహస్యమైనది 11 00:00:41,751 --> 00:00:44,296 అది ఇక నాకు దక్కదు అనుకున్నా. 12 00:00:44,296 --> 00:00:46,006 అది ఖచ్చితంగా ఉచ్చు అయితే కాదు, 13 00:00:46,006 --> 00:00:49,634 ఎందుకంటే, దాన్ని తీసుకున్నప్పుడు నా మీద బండ రాయి ఏదీ పడలేదు. 14 00:00:50,635 --> 00:00:52,679 అయితే దీన్ని ఎవరు ఇక్కడ పెట్టుంటారు? 15 00:00:53,263 --> 00:00:54,431 బహుశా అది ముఖ్యం కాదేమో. 16 00:00:59,060 --> 00:01:03,732 ఇది నాకు మళ్లీ దక్కితే చాలు అనుకున్నాను, ఎందుకంటే రాయాల్సింది చాలా ఉంది మరి. 17 00:01:09,654 --> 00:01:13,074 కానీ విచిత్రమేంటంటే, నా బుర్ర పని చేయడం ఆగిపోయింది. 18 00:01:13,074 --> 00:01:16,536 కాబట్టి, నాకు ఏమీ తోచనప్పుడు, ఏప్పుడూ ఏదైతే చేస్తానో, ఇప్పుడు కూడా అదే చేయాలని అనుకున్నాను. 19 00:01:17,120 --> 00:01:19,456 ఒక అత్యవసర నిఘా పని మీద వెళ్లాను. 20 00:01:38,183 --> 00:01:40,227 పిల్లులు ఎలా 21 00:01:48,276 --> 00:01:50,278 పదివేల డాలర్ టవర్ 22 00:01:50,278 --> 00:01:51,363 టవర్ కోసం సమయం 23 00:01:51,363 --> 00:01:54,532 అందులో హోదా, డబ్బులు బోలెడంత ఉన్నాయి 24 00:01:57,869 --> 00:01:59,829 నాకు ఏమీ తోచట్లేదు ఎందుకని? 25 00:02:00,413 --> 00:02:02,874 ఎందుకంటే నేను చాలా ప్రమాదకరమైనదాన్ని, హ్యారియట్. 26 00:02:02,874 --> 00:02:06,086 నువ్వు నాలో రాసేవన్నీ, ఇతరులకు బాధ కలిగిస్తాయి. 27 00:02:06,086 --> 00:02:08,087 అది మంచిది కాదు, పాపా. 28 00:02:08,671 --> 00:02:12,133 కానీ నిజం చెప్పినందుకు ఎప్పుడూ క్షమాపణ కోరవద్దు అని ఓల్ గోలీ చెప్పింది. 29 00:02:12,634 --> 00:02:16,513 ఆహా. మరి దాని వలన ఇప్పటి దాకా జరిగినవన్నీ మర్చిపోయావా, చిట్టి పాపా? 30 00:02:17,472 --> 00:02:21,560 నా మనస్సు లోలోతుల ఉన్న బాధ అంతా ఒక్కసారిగా తన్నుకుంటూ బయటకు రాసాగింది. 31 00:02:22,143 --> 00:02:24,813 అంటే, అది నాకు ఏదైతే చెప్తోందో, అది నాకు తెలిసినదే అని, 32 00:02:24,813 --> 00:02:27,107 కానీ నేను దాన్ని అంగీకరించలేకపోతున్నానని అనిపించింది. 33 00:02:27,816 --> 00:02:30,360 నేను రచయిత్రిని కాలేను. 34 00:02:31,903 --> 00:02:34,573 {\an8}నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 35 00:02:34,573 --> 00:02:36,324 మనకు నచ్చినట్లు ఉండాలి 36 00:02:37,450 --> 00:02:39,911 నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అదే అవుతాను 37 00:02:39,911 --> 00:02:41,580 నాదే తుది నిర్ణయం 38 00:02:42,080 --> 00:02:45,125 లేదు, నా జుట్టు కత్తిరించుకోను 39 00:02:45,125 --> 00:02:47,460 నాకు నచ్చిందే వేసుకుంటాను 40 00:02:47,460 --> 00:02:53,466 నాకు నచ్చినట్లుగా ఉండడం నాకిష్టం 41 00:02:53,466 --> 00:02:56,094 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 42 00:02:56,094 --> 00:02:59,180 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 43 00:02:59,180 --> 00:03:00,265 {\an8}"రచయిత్రి అవతారమెత్తిన హ్యారియట్" 44 00:03:02,434 --> 00:03:03,393 {\an8}లూయిస్ ఫిట్జ్ హ్యూ రచించిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 45 00:03:03,393 --> 00:03:06,062 జనాలు ఆఫీసులకు వెళ్లడం చూసి, 46 00:03:06,062 --> 00:03:07,689 నేను కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. 47 00:03:07,689 --> 00:03:10,901 ఒకవేళ రచయిత్రిని కాకపోతే, ఇంకేం అవుతాను? 48 00:03:15,155 --> 00:03:17,115 కిటికీలు తుడిచేదాన్ని అవుతానా? 49 00:03:21,870 --> 00:03:23,538 పూలు అమ్మేదాన్ని అవుతానా? 50 00:03:26,625 --> 00:03:29,836 పోనీ బజ్జీలు అమ్మేదాన్ని అవుతానా? 51 00:03:32,714 --> 00:03:34,799 హ్యారియట్? ఇక్కడ ఏం చేస్తున్నావు? 52 00:03:35,383 --> 00:03:36,551 ఆలోచిస్తున్నా, అంతే. 53 00:03:36,551 --> 00:03:39,387 నేను రచయిత్రిని కాకపోతే, ఇంకేం అవ్వగలనని మీరు అనుకుంటున్నారు? 54 00:03:39,387 --> 00:03:42,015 నీ అంతటి తెలివైనదానికి 55 00:03:42,015 --> 00:03:43,934 ఈ లోకంలో మంచి మంచి అవకాశాలు చాలానే ఉన్నాయి. 56 00:03:43,934 --> 00:03:45,477 నువ్వు డాక్టర్ అవ్వవచ్చు. 57 00:03:45,477 --> 00:03:47,562 నేను రక్తాన్ని చూసి తట్టుకోలేను. 58 00:03:47,562 --> 00:03:49,022 మరి టీచర్ అవుతావా? 59 00:03:49,022 --> 00:03:51,816 ఎందుకు, జనాలు వేసే పేపర్ రాకెట్లకు బలి అవ్వడానికా? 60 00:03:52,525 --> 00:03:54,861 మరి ఆస్ట్రోనాట్ అవుతావా? చంద్రుని మీదికి వెళ్లవచ్చు. 61 00:03:54,861 --> 00:03:58,323 నాన్నా, బామ్మ ఇంటికి వెళ్లేటప్పుడు కారు ఎక్కితేనే నాకు వాంతి వచ్చేస్తుంది. 62 00:04:00,492 --> 00:04:01,868 మేము నీకు సాయపడాలనే చూస్తున్నాం. 63 00:04:01,868 --> 00:04:04,996 తెలుసు, కానీ నాకు ఏకాంతంగా ఉండాలనుంది, సరేనా? 64 00:04:07,540 --> 00:04:11,211 హ్యారియట్, నువ్వు నిన్న మీ అమ్మతో బయటకు వెళ్లినప్పుడు ఈ పోస్ట్ వచ్చింది. 65 00:04:11,211 --> 00:04:12,295 కేథరిన్ గాలియానో 66 00:04:13,421 --> 00:04:14,422 ఓల్ గోలీ? 67 00:04:17,050 --> 00:04:20,512 హ్యారియట్, అందంలో నిజం ఉంది, నిజం అందంగా ఉంటుంది అనే 68 00:04:20,512 --> 00:04:21,596 కీట్స్ కోట్ ని 69 00:04:21,596 --> 00:04:25,559 నేను నీకు చాలాసార్లు చెప్పడం నీకు గుర్తే ఉంటుంది. 70 00:04:25,559 --> 00:04:28,728 నీ నిజాలన్నింటినీ ఓ పుస్తకంలో రాస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. 71 00:04:28,728 --> 00:04:32,649 ఇక అలాంటి పుస్తకాలను ఇతరులెవరూ చదవకూడదు మరి. 72 00:04:32,649 --> 00:04:38,780 ఒకవేళ చదివితే, అప్పుడు నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది, హ్యారియట్. 73 00:04:38,780 --> 00:04:42,909 అది నీకు నచ్చదు కూడా. అదేంటంటే, నువ్వు సారీ చెప్పాలి. 74 00:04:43,493 --> 00:04:44,995 సారీ చెప్పాలా? 75 00:04:44,995 --> 00:04:49,040 రచనల ద్వారా లోకంలో ప్రేమను వ్యాప్తి చేయాలి కానీ 76 00:04:49,040 --> 00:04:51,126 నీ స్నేహితులపై అలాంటి మాటలు రాయకూడదు. 77 00:04:52,335 --> 00:04:54,629 ఆ మాటలు వినాల్సి వస్తుందని నేను అనుకోలేదు, 78 00:04:55,297 --> 00:04:58,174 కానీ తను అన్న మంచి మాటలు నా చేత ఏ పని చేయిస్తాయో నాకు బాగా తెలుసు. 79 00:05:08,476 --> 00:05:10,729 జేనీ, నన్ను క్షమించు. 80 00:05:10,729 --> 00:05:15,317 పుస్తకంలో ఏవేవో పిచ్చి రాతలు రాసినందుకు, నిన్న రాత్రి క్షమాపణలు కోరనందుకు, ఇంకా అన్నింటికీ. 81 00:05:16,693 --> 00:05:20,071 నువ్వేమీ పిచ్చి, చెడ్డ సైంటిస్ట్ వి కాదు. నాకు కుళ్లు పుట్టి అలా రాశానంతే. 82 00:05:20,071 --> 00:05:21,156 కుళ్లా? 83 00:05:21,156 --> 00:05:24,492 జనాలను బాధపెట్టే రాతలు రాస్తూ నేను రచయిత్రిలా ఫీల్ అయిపోతుంటానంతే. 84 00:05:24,492 --> 00:05:28,872 కానీ నువ్వు అసలైన సైంటిస్టువి, ఈ ప్రపంచాన్ని ఇంకా బాగా చేయాలని చూస్తున్నావు. 85 00:05:28,872 --> 00:05:30,790 అది నువ్వు చెప్పేదాకా నాకు తెలీదులే. 86 00:05:30,790 --> 00:05:33,835 నిన్న ఒక కొత్త రకపు ఎనర్జీ సోర్సును తయారు చేయడానికి ప్రయత్నించాను, 87 00:05:33,835 --> 00:05:36,838 కానీ ప్రమాదవశాత్తూ అది నా ముక్కులోని వెంట్రుకపై పడి, అది కాలిపోయింది. 88 00:05:45,639 --> 00:05:47,474 నన్ను మన్నించు, జేనీ. 89 00:05:49,017 --> 00:05:50,185 క్షమించేశా పో. 90 00:05:55,690 --> 00:05:56,691 బర్రె ఆకారంలోని చిప్ తింటావా? 91 00:05:57,692 --> 00:05:58,735 థ్యాంక్స్. 92 00:06:02,489 --> 00:06:05,325 నిన్న రాత్రి నా పుస్తకాన్ని మా ఇంటి దగ్గర పెట్టింది నువ్వేనా? 93 00:06:05,325 --> 00:06:10,455 అవును. నీ దగ్గర పుస్తకం లేదంటే జాకీర్ హుస్సేన్ దగ్గర తబలా లేనట్టే. 94 00:06:10,455 --> 00:06:12,332 ఒకప్పుడు నేను కూడా అలాగే ఆలోచించేదాన్ని. 95 00:06:13,750 --> 00:06:15,877 కానీ ఇప్పుడు నాకు రచయిత్రి కావాలని లేదు. 96 00:06:15,877 --> 00:06:16,962 ఏంటి? 97 00:06:16,962 --> 00:06:19,047 నేను చేయగలిగినవి ఇంకా సవాలక్ష ఉన్నాయి. 98 00:06:19,047 --> 00:06:21,216 నేను టీచర్ ని అవ్వవచ్చని అమ్మ అంటోంది. 99 00:06:21,800 --> 00:06:24,052 కనీసం అప్పుడైనా నీకు నువ్వు శిక్ష వేసుకొనేదానివేమో. 100 00:06:27,430 --> 00:06:30,350 హేయ్, స్పోర్ట్! ఒక్క నిమిషం! నీతో మాట్లాడాలి. 101 00:06:32,185 --> 00:06:33,353 ఆగు! 102 00:06:35,814 --> 00:06:37,899 నేను అతనితో ఎలాగైనా మాట్లాడాలి. 103 00:06:37,899 --> 00:06:42,320 కాబట్టి, నాకున్న అద్భుతమైన డిటెక్టివ్ నైపుణ్యాలని ఇంకొక్కసారి ఉపయోగిద్దామనుకున్నాను. 104 00:06:49,869 --> 00:06:54,332 విల్ స్పోర్ట్ రోక్, వెంటనే వచ్చి ప్రిన్సిపల్ కి కనబడు! 105 00:06:56,751 --> 00:06:57,752 చేతులు మండిపోతున్నాయి! 106 00:06:57,752 --> 00:07:00,964 సుస్వాగతం 107 00:07:06,386 --> 00:07:07,804 నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు. 108 00:07:08,430 --> 00:07:09,556 నాకు నీపై నమ్మకం లేదు. 109 00:07:14,728 --> 00:07:17,397 పీజ్జా తీసుకుంటావా? 110 00:07:17,397 --> 00:07:20,483 దానితో పాటు మనస్ఫూర్తిగా చెప్పే సారీని కూడా తీసుకుంటావా? 111 00:07:29,951 --> 00:07:30,911 హాయ్. 112 00:07:30,911 --> 00:07:32,412 నన్ను కాస్త నా మానాన వదిలేస్తావా? 113 00:07:36,791 --> 00:07:39,669 -ఆగు. -వాలెస్, కాస్త నన్ను వదిలేయ్. 114 00:07:39,669 --> 00:07:43,590 భద్రత విషయంలో వదలడాలు, గిదలడాలు ఉండవు, స్పోర్ట్. అది నా కర్తవ్యంలో భాగం. 115 00:07:46,176 --> 00:07:47,219 థ్యాంక్స్, వాలెస్. 116 00:07:47,219 --> 00:07:48,553 థ్యాంక్స్ అక్కర్లేదులే. 117 00:07:48,553 --> 00:07:52,432 నేను హాల్ మానిటర్ ని, హ్యారియట్. ఇది నా పని, నా కర్తవ్యం. 118 00:07:54,226 --> 00:07:55,936 స్పోర్ట్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే... 119 00:07:55,936 --> 00:07:58,313 నాకు వినాలని లేదు, హ్యారియట్. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. 120 00:07:58,313 --> 00:08:00,315 నన్ను క్షమించాలని నీకు లేకపోతే, 121 00:08:00,941 --> 00:08:02,317 కనీసం ఇదైనా తీసుకుంటావా? 122 00:08:03,068 --> 00:08:06,863 మన స్నేహంలోని మంచి, చెడు విషయాల సమాహారం ఇది. 123 00:08:06,863 --> 00:08:07,948 స్నేహం - మొత్తం 124 00:08:07,948 --> 00:08:12,911 ప్లస్ ఇరవై? రాక్ పేపర్ సిసర్స్ ఆటలో ఎప్పుడూ ఎలా గెలవాలో నీకు నేర్పినందుకా? 125 00:08:12,911 --> 00:08:16,831 నీ ఇంగ్లీష్ పేపర్స్ లో స్పెల్లింగ్స్ చెక్ చేస్తున్నందుకు ప్లస్ పది. 126 00:08:16,831 --> 00:08:21,836 మైకీ మ్యాంటిల్ యొక్క 3డీ బేస్ బాల్ కార్డును ఇచ్చినందుకు ప్లస్ వంద. 127 00:08:21,836 --> 00:08:25,507 ఇక్కడ చాలా ప్లస్ లు ఉన్నాయి, హ్యారియట్. చాలా ఉన్నాయి. 128 00:08:26,091 --> 00:08:27,384 కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. 129 00:08:27,384 --> 00:08:32,347 నా ప్రాణ స్నేహితుని గురించి పిచ్చి రాతలు రాసినందుకు మైనస్ 820. 130 00:08:32,347 --> 00:08:33,974 కానీ నువ్వు మొత్తంగా చూసినప్పుడు, 131 00:08:33,974 --> 00:08:36,726 {\an8}మన స్నేహం ఇప్పటికీ సూపర్ అని నీకు తెలుస్తుంది. 132 00:08:36,726 --> 00:08:37,811 {\an8}హ్యారియట్ + స్పోర్ట్ = బెస్ట్ ఫ్రెండ్స్! 133 00:08:37,811 --> 00:08:40,480 లేదు. నువ్వు అన్నీ తప్పు లెక్కలు వేశావు. 134 00:08:40,480 --> 00:08:43,650 చూడు, ఇక్కడున్న రెండును, ఇక్కడ ఉన్న మూడును నువ్వు కలపలేదు. 135 00:08:44,275 --> 00:08:48,363 దీని ప్రకారం మన స్నేహం మైనస్ 180లో ఉంది. 136 00:08:49,322 --> 00:08:51,908 ఏం చెప్పమంటావో చెప్పు, చెప్పేస్తాను. 137 00:08:51,908 --> 00:08:52,993 చెప్పాలనే ఉంది, హ్యారియట్, 138 00:08:52,993 --> 00:08:55,662 కానీ నువ్వు దాన్ని నీ పుస్తకంలో రాసుకొని, నాకు వ్యతిరేకంగా ఉపయోగిస్తావు. 139 00:08:59,291 --> 00:09:00,875 అతడిని వదిలేయ్, హ్యారియట్. 140 00:09:00,875 --> 00:09:03,712 ఇప్పుడు అతడికి కాస్త ఏకాంతం కావాలనుకుంటా. 141 00:09:03,712 --> 00:09:05,088 కాస్త ప్రశాంతంగా ఆలోచించుకోనివ్వు. 142 00:09:07,215 --> 00:09:09,801 స్పోర్ట్ కి నా క్షమాపణలు వినాలని లేదేమో, 143 00:09:10,677 --> 00:09:12,762 కానీ నా క్లాస్ మేట్స్ అయినా వింటారని ఆశించాను. 144 00:09:13,263 --> 00:09:16,808 వ్యాంపైర్స్ కి సూర్యుడంటే ఎంత అసహ్యమో, నేనంటే మీకు అంత అసహ్యమని నాకు తెలుసు, 145 00:09:16,808 --> 00:09:19,603 అందుకు మిమ్మల్ని నేను అస్సలు తప్పు పట్టట్లేదు. 146 00:09:19,603 --> 00:09:20,937 ఎల్లెన్, రా! 147 00:09:21,980 --> 00:09:23,940 ఒక్క డ్రమ్ స్టిక్ తో ఈ సీన్ ని ఎలా చేయగలను? 148 00:09:24,983 --> 00:09:26,735 నా డైలాగ్స్ ని మర్చిపోయాను. 149 00:09:26,735 --> 00:09:29,571 రోజంతా నీ చెత్త జుట్టును తింటూ ఉంటే ఇక డైలాగ్స్ ఎక్కడ గుర్తుంటాయి! 150 00:09:32,699 --> 00:09:35,076 అభినందనలు, మేరియన్. 151 00:09:35,076 --> 00:09:39,080 అత్యంత పనికిమాలిన, చెడ్డ దానిగా నువ్వు ఇంకో అవార్డును 152 00:09:39,080 --> 00:09:41,166 సొంతం చేసుకున్నావు. 153 00:09:42,542 --> 00:09:47,339 పింకీ, పిచ్చోళ్ళ సర్కస్ లో సూపర్ స్టార్ వి కదా నువ్వు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్తావా? 154 00:09:50,050 --> 00:09:53,595 అబ్బో, జనాలు మా ఇంటికి సరదాగా గడపడానికి వస్తారు, 155 00:09:53,595 --> 00:09:55,972 మా అమ్మ కేకుని తినడానికి మాత్రమే కాదులే. 156 00:09:57,307 --> 00:09:59,184 నేను నమ్మలేకపోతున్నాను. 157 00:09:59,184 --> 00:10:03,563 నేను రాసిన పిచ్చి రాతలు అందరూ ఒకరితో ఒకరు గొడవపడేలా చేస్తున్నాయి. 158 00:10:03,563 --> 00:10:05,690 పిల్లలూ, శాంతించండి. 159 00:10:05,690 --> 00:10:08,526 ఫాల్ హార్వెస్ట్ రోజు అంటేనే అందరూ కలిసి పని చేయడం, 160 00:10:08,526 --> 00:10:09,819 చేతికి వచ్చిన పంటను కోత కోయడం, 161 00:10:09,819 --> 00:10:13,657 ఆ రుతువులో మనకి అందే అందమైన బహుమానాలను ఆస్వాదించడం. 162 00:10:13,657 --> 00:10:17,619 స్పోర్ట్, జేనీ, మీ ఇద్దరూ కలిసి పని చేయాలి. 163 00:10:17,619 --> 00:10:20,789 మీరిద్దరూ నా సూపర్ టీమ్ లో భాగం. 164 00:10:21,373 --> 00:10:26,002 అవును, తను హ్యారియట్ కి తన పుస్తకాన్ని ఇచ్చేయక ముందు మాట అది. 165 00:10:26,002 --> 00:10:27,462 -పుస్తకాన్ని ఇచ్చేశావా? -ఎలా చేయగలిగావు? 166 00:10:27,462 --> 00:10:28,547 ఎందుకు? 167 00:10:28,547 --> 00:10:30,090 తను నా స్నేహితురాలు. 168 00:10:30,674 --> 00:10:32,425 నేను మనం స్నేహితులం అనుకున్నానే. 169 00:10:32,425 --> 00:10:35,679 పిల్లలూ, కాస్త శాంతించండి, 170 00:10:35,679 --> 00:10:39,015 ఈ చెడు ఫీలింగ్స్ అన్నింటినీ దూరం చేసేసుకోండి. 171 00:10:41,685 --> 00:10:46,064 హ్యారియట్, నువ్వు కర్టెన్ మాటు నుండి తొంగి చూడటం నేను గమనించాను. 172 00:10:46,064 --> 00:10:47,315 ఏమైంది? 173 00:10:47,315 --> 00:10:49,609 నా వల్లే అందరూ గొడవపడుతున్నారు. 174 00:10:49,609 --> 00:10:52,320 అయ్యో, అదేం లేదులే. 175 00:10:52,320 --> 00:10:55,991 నటీనటులు అన్నాక, ఒక్కోసారి ఇలా కోపావేశాలకు లోను కావడం సహజమే. 176 00:10:55,991 --> 00:10:58,118 మళ్లీ జుట్టును నములుతున్నావా? యాక్. 177 00:10:58,118 --> 00:10:59,619 నన్ను వదిలేయ్. 178 00:11:00,537 --> 00:11:01,538 కాపాడండి. 179 00:11:03,206 --> 00:11:07,502 నాకు ఉల్లిపాయ పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్స్, మిస్ ఎల్సన్. 180 00:11:07,502 --> 00:11:11,756 దాని వల్ల కొన్ని రోజులు, నాలో చాలా భావోద్రేకాలు ఉన్నాయేమో అని భ్రమ పడ్డాను. 181 00:11:12,340 --> 00:11:14,509 నీలో నిజంగానే చాలా భావోద్రేకాలు ఉన్నాయి. 182 00:11:14,509 --> 00:11:16,928 లేదు. 183 00:11:16,928 --> 00:11:18,889 నాలో ఒక భావోద్రేకమే ఉంది, 184 00:11:18,889 --> 00:11:20,891 అది చాలా దారుణమైనది, చాలా చెడ్డది, 185 00:11:20,891 --> 00:11:23,101 అందుకే నేను నాటకం నుండి తప్పుకుంటున్నాను. 186 00:11:23,101 --> 00:11:25,854 -ఏంటి? -నేను లేకుంటేనే నాటకం బాగా జరుగుతుంది. 187 00:11:25,854 --> 00:11:29,608 నువ్వు సైడ్ డిషెస్ ని హీరోలు చేస్తూ 188 00:11:29,608 --> 00:11:33,486 కొత్త కొత్త డైలాగులు, పాటలు రాశావు కదా, మరి వాటి గతి ఏంటి, హ్యారియట్? 189 00:11:34,237 --> 00:11:36,197 ఒరిజినల్ స్క్రిప్టు ప్రకారమే కానివ్వండి. 190 00:11:36,197 --> 00:11:39,659 అది మేరియన్ కి ఆనందాన్ని ఇస్తుంది, అదీగాక తనది ఇందులో ప్రధాన పాత్ర. 191 00:11:39,659 --> 00:11:41,870 కాబట్టి, ఏదేమైనా... 192 00:11:41,870 --> 00:11:43,872 హ్యారియట్, లేదు. 193 00:11:43,872 --> 00:11:48,752 ఉల్లిపాయకి ఉండే ఘాటైన, విలక్షణమైన రుచి ఇతర వంటకాల్లోని రుచులన్నింటినీ 194 00:11:48,752 --> 00:11:50,879 బ్యాలెన్స్ చేసేస్తుంది. 195 00:11:50,879 --> 00:11:53,924 మాకు నీ విలక్షణమైన లక్షణం కావాలి. 196 00:11:53,924 --> 00:11:55,258 ఇంటికి వచ్చే దార్లో, 197 00:11:55,258 --> 00:11:58,929 అందరూ నన్ను చూసి అసహ్యించుకుంటున్నట్టుగా అనిపించింది. 198 00:11:58,929 --> 00:12:00,430 పావురాలు కూడా. 199 00:12:01,556 --> 00:12:04,142 మీరేమైనా పిస్తాలా ఏంటి? 200 00:12:04,142 --> 00:12:07,229 మిమ్మల్ని రెక్కల పిశాచులు అని అనడానికి బలమైన కారణమే ఉంది, తెలుసా! 201 00:12:11,733 --> 00:12:15,570 నాకు ఏడేళ్లున్నప్పుడు మొదటి పుస్తకాన్ని రాయడం మొదలుపెట్టాను. 202 00:12:15,570 --> 00:12:18,198 అప్పుడు కూడా, ఒక పెద్ద రచయిత్రి కావాలని నాకు ఉండేది. 203 00:12:18,198 --> 00:12:21,701 పదహారు పుస్తకాలు రాశాక, నేను నిజం గ్రహించాను. 204 00:12:23,620 --> 00:12:27,040 చివరికి నేను బజ్జీలు అమ్ముకొనే దానిగానే మిగిలిపోతానని. 205 00:12:36,132 --> 00:12:37,759 మనం ఇంకోసారి ప్రశాంతంగా మాట్లాడుకుందామా? 206 00:12:38,927 --> 00:12:40,512 ఇక మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు. 207 00:12:46,643 --> 00:12:49,729 హ్యారియట్. నిన్ను చూడటం ఆనందంగా ఉంది. 208 00:12:49,729 --> 00:12:51,940 ఎందుకు ఉల్లిపాయ వేషం వేసుకున్నావు? 209 00:12:51,940 --> 00:12:53,233 స్కూల్ లో నాటకం కోసం వేసుకున్నా. 210 00:12:54,901 --> 00:12:57,195 మీ కుక్కలన్నీ ఎందుకు బీటిల్స్ లా తయారయ్యాయి? 211 00:12:58,363 --> 00:13:01,449 మాకందరికీ బీటీల్స్ అంటే అంత పిచ్చి మరి. 212 00:13:02,158 --> 00:13:03,577 అంతే కదా, కుక్కలూ? 213 00:13:08,373 --> 00:13:10,333 నేను డిజైన్ చేసిన కుక్కల బట్టల్లో బాగా అమ్ముడయ్యేవి ఇవే. 214 00:13:10,333 --> 00:13:11,418 బాగానే ఉన్నావా, బంగారం? 215 00:13:12,002 --> 00:13:13,003 బాగానే ఉన్నాననుకుంటా. 216 00:13:13,628 --> 00:13:15,881 నీ రచన ఎలా సాగుతోంది? 217 00:13:15,881 --> 00:13:18,216 నేను ఇక రచయిత్రిగా ఉండదలచుకోలేదు. 218 00:13:18,216 --> 00:13:20,427 ఏంటి? ఎందుకు? 219 00:13:20,427 --> 00:13:24,180 రచయిత్రి అంటే లోకానికి ప్రేమ పంచాలని ఓల్ గోలీ చెప్పింది. 220 00:13:24,180 --> 00:13:26,474 కానీ నేను ఇతరుల తప్పొప్పులను లెక్కించడం తప్ప ఇంకేం చేయలేదు. 221 00:13:26,474 --> 00:13:29,060 నన్ను కూడా అలాగే చూశావా? 222 00:13:29,060 --> 00:13:30,312 అవును. 223 00:13:30,312 --> 00:13:31,396 మరి? 224 00:13:31,396 --> 00:13:33,398 మీకు చాలా బద్ధకం అని రాశాను. 225 00:13:33,398 --> 00:13:35,817 ఆ తర్వాత మీకు కేవలం భయమేమో అనిపించింది. 226 00:13:36,318 --> 00:13:40,822 మరి ఇంకాస్త నిఘా పెట్టి ఉంటావు కదా, అప్పుడు ఏం గమనించావో చెప్పు. 227 00:13:40,822 --> 00:13:44,659 నేను ఒకసారి, ఇకపై టొమాటో శాండ్విచులు కాకుండా టొమాటో చీజ్ శాండ్విచులను 228 00:13:44,659 --> 00:13:46,953 తినడం ప్రారంభించాలని అనుకున్నాను, 229 00:13:46,953 --> 00:13:48,872 కానీ భయమేసి ఆగిపోయాను. 230 00:13:48,872 --> 00:13:54,002 మరి మీరు మీ మొత్తం జీవితాన్ని మార్చుకోవడం ఎంత భయంకరంగా ఉంటుందో నా ఉహలకు కూడా అందలేదు. 231 00:13:54,002 --> 00:13:56,004 ధైర్యంగా ఉండటం కష్టమైన పని. 232 00:13:56,588 --> 00:13:57,589 కానీ మీరు ధైర్యంగా ఉన్నారు. 233 00:13:59,049 --> 00:14:01,176 కుక్క బీటిల్స్ అవిగో! 234 00:14:03,470 --> 00:14:05,430 -ఇక నేను వెళ్లాలి. -బై, మిసెస్ ప్లంబర్. 235 00:14:06,932 --> 00:14:07,933 గుడ్ లక్. 236 00:14:10,560 --> 00:14:13,438 నా డిటెక్టివ్ మార్గంలో ఉన్న ఇతరుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాను, 237 00:14:13,438 --> 00:14:16,149 వారిలో మిస్టర్ విథర్స్, ఇంకా అతని 26 పిల్లులు కూడా ఉన్నాయి. 238 00:14:16,149 --> 00:14:19,778 మొదట, అతను ఒక ఒంటరి పక్షి అని, దూరంగా ఉంటేనే మంచిదని అనుకున్నాను. 239 00:14:20,403 --> 00:14:22,739 కానీ అతని అమ్మగారు చనిపోయారని, దానితో అతను చాలా మనస్తాపానికి గురై 240 00:14:22,739 --> 00:14:27,410 ఈ ప్రపంచంతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాడని ఆ తర్వాత తెలుసుకున్నాను. 241 00:14:28,828 --> 00:14:30,080 మరి కార్లోస్ గురించి చెప్పనా? 242 00:14:30,872 --> 00:14:33,750 అతనొక భయంకరమైన బొడేగా దొంగ అని అనుకున్నా. 243 00:14:33,750 --> 00:14:36,962 కానీ, అతని తల్లిదండ్రుల చిన్న హోటల్ ని కాపాడుకుంటున్నాడని తర్వాత తెలుసుకున్నాను. 244 00:14:42,509 --> 00:14:44,094 హలో, పాపా... 245 00:14:46,346 --> 00:14:47,764 హలో, ఉల్లిపాయి పాపా. 246 00:14:47,764 --> 00:14:49,307 ఇప్పుడు మేము స్నేహితులం అయిపోయాం. 247 00:14:50,684 --> 00:14:54,145 మొదట్లో, నా డిటెక్టివ్ మార్గంలో ఉన్నవాళ్లందరినీ నేను ఏదోకటి అనుకున్నానని గ్రహించాను. 248 00:14:54,145 --> 00:14:57,274 ఆ తర్వాత మరింతగా పరిశోధన చేసి నిజం తెలుసుకున్నాను. 249 00:14:58,608 --> 00:14:59,859 నేను దీన్ని వెంటనే రాసేయాలి. 250 00:15:02,153 --> 00:15:03,154 నా పుస్తకం! 251 00:15:07,325 --> 00:15:08,743 చెత్త బండిని ఆపండి! 252 00:15:08,743 --> 00:15:11,288 నా పుస్తకం ఆ చెత్తలో ఉంది. 253 00:15:11,288 --> 00:15:12,956 ఆపండి! 254 00:15:18,670 --> 00:15:21,047 "అందంలో నిజం ఉంది, నిజం అందంగా ఉంటుంది." 255 00:15:21,590 --> 00:15:23,049 {\an8}జాన్ కీట్స్ కోట్ ఇది. 256 00:15:23,049 --> 00:15:23,967 {\an8}గమ్ 257 00:15:23,967 --> 00:15:27,387 {\an8}కానీ మనం ఆ నిజాన్ని వెలికి తీయాల్సి ఉంటుంది. 258 00:15:27,387 --> 00:15:29,514 ఎవరో తెలీని వాళ్ల నిజాలే నేను వెలికి తీయగలుగుతున్నప్పుడు, 259 00:15:30,348 --> 00:15:32,809 అదే పని నా స్నేహితుల విషయంలో నేను చేయలేనా? 260 00:15:42,861 --> 00:15:46,156 సరే మరి, విద్యార్థులారా. 261 00:15:46,156 --> 00:15:48,325 మీ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారా? 262 00:15:48,325 --> 00:15:50,535 నాటిక త్వరలోనే మొదలుకాబోతోంది. 263 00:15:58,084 --> 00:16:01,796 సరే, ఆ శక్తినే ఉపయోగించుకుందాం మరి. 264 00:16:03,089 --> 00:16:05,884 అందరికీ గుడ్ మార్నింగ్. 265 00:16:05,884 --> 00:16:09,804 మా ఆరవ తరగతి పిల్లలు ఫాల్ హార్వెస్ట్ నాటకం వేయబోతున్నారు, 266 00:16:09,804 --> 00:16:14,476 వాళ్లకి స్వాగతం పలకమని అందరినీ కోరుతున్నాను. 267 00:16:18,021 --> 00:16:20,148 మేము గెనుసు గడ్డలం. 268 00:16:21,608 --> 00:16:24,277 తియ్యగా, కమ్మగా ఉంటాం. 269 00:16:30,492 --> 00:16:32,369 మేము ఫ్రెంచి ఫ్రైలం. 270 00:16:32,369 --> 00:16:34,412 చిన్నగానే ఉన్నా, కరకరలాడించేస్తాం. 271 00:16:39,000 --> 00:16:44,130 నా వాసనను నేనే భరించలేను. నేను... నేను... 272 00:16:44,923 --> 00:16:47,050 "నేను క్యాబేజీని." 273 00:16:47,050 --> 00:16:50,762 అవును. నేను క్యాబేజీని. 274 00:16:52,931 --> 00:16:57,936 భయపడిపోకండి. అసలు సిసలైన వంటకం వచ్చేసింది. 275 00:16:59,604 --> 00:17:00,772 ఒకరు ఉండాల్సిన చోట ఇంకొకరున్నారు. 276 00:17:00,772 --> 00:17:01,898 అవునా? 277 00:17:01,898 --> 00:17:04,359 ఇప్పుడు అంతా అయోమయం జగన్నాథం అయిపోతుంది. 278 00:17:18,707 --> 00:17:20,000 హేయ్, చూసుకో. 279 00:17:24,462 --> 00:17:26,046 నీకు హ్యారియట్ కనిపించిందా? 280 00:17:29,092 --> 00:17:30,468 ఏం పర్లేదు. 281 00:17:35,932 --> 00:17:38,518 ఓసారి అందరూ వినండి. 282 00:17:41,354 --> 00:17:45,525 ప్రేమ, వేదనలు కలగలసిన ఒక బలీయమైన గాథను మీకు పరిచయం చేస్తున్నాను. 283 00:17:45,525 --> 00:17:47,444 అందులో శోకం, ఆక్రోశాలు ఉంటాయి. 284 00:17:47,444 --> 00:17:51,197 వెర్రితనం, కపటత్వం, క్షమాగుణాలు ఉంటాయి. 285 00:17:51,197 --> 00:17:55,160 ఇదే "ఒక ఉల్లిపాయ ఆక్రందన." 286 00:17:55,744 --> 00:17:58,038 నేను ఉల్లిపాయని. 287 00:17:58,038 --> 00:18:02,083 ఎవరికీ ఇష్టం లేని ఒక కంపు కొట్టే కూరగాయని, జనాల కంట నీరు తెప్పిస్తుంటాను. 288 00:18:04,878 --> 00:18:09,758 గెనుసు గడ్డలారా, మీ ఇద్దరూ పిచ్చోళ్ల సర్కస్ లో చేరాలని నేను రాశాను. 289 00:18:14,638 --> 00:18:17,557 కానీ నేను మరింత లోతుగా పరిశోధించాక, 290 00:18:17,557 --> 00:18:20,644 మీ ఇద్దరూ మీలాగే ఏ బెరుకూ, జంకూ లేకుండా ఉంటారని తెలుసుకున్నాను. 291 00:18:21,228 --> 00:18:22,229 పింకీ, పర్పుల్ సాక్స్... 292 00:18:24,231 --> 00:18:28,151 ఏ పిచ్చోళ్ల సర్కస్ లో అయితే చేరుతారో, ఆ సర్కస్ లోనే నేను కూడా చేరితే బాగుంటుందని 293 00:18:28,151 --> 00:18:29,903 నాకు అనిపించింది. 294 00:18:32,572 --> 00:18:33,782 మాతో మామూలుగా ఉండదు! 295 00:18:39,079 --> 00:18:41,039 కేరీ ఆండ్రూస్ ఇంటికి 296 00:18:41,039 --> 00:18:45,168 కేవలం వాళ్ళ అమ్మ చేసే కేకుల కోసమే అందరూ వెళ్తారని నేను పుస్తకంలో రాసుకున్నాను. 297 00:18:47,921 --> 00:18:49,923 ఆ తర్వాత లోతుగా పరిశోధించాను. 298 00:18:51,049 --> 00:18:54,219 జనాలు కేకు కోసమే కేరీ ఇంటికి వెళ్తారేమో, 299 00:18:54,219 --> 00:18:57,973 కానీ వాళ్లు అక్కడే ఉండటానికి కారణం మాత్రం కేరీయే. 300 00:18:58,557 --> 00:18:59,808 నిజంగానా? 301 00:19:02,561 --> 00:19:04,271 నేను దీన్ని మేరియన్ ని దృష్టిలో ఉంచుకొని రాశాను. 302 00:19:06,982 --> 00:19:08,733 బాబోయ్, ఇది నాకే చాలా దారుణం అనిపిస్తోంది. 303 00:19:08,733 --> 00:19:11,361 కానీ ఈ రాతలు నా మనస్సులో నుండి వచ్చినవి కావు. 304 00:19:12,028 --> 00:19:14,239 మూడవ క్లాసులో ఉన్నప్పుడు మేరియన్ నా స్నేహం వద్దు అంది, 305 00:19:14,239 --> 00:19:16,074 ఆ కోపంతో రాసిన రాతలు ఇవి. 306 00:19:18,660 --> 00:19:19,869 ఆ తర్వాత నేను లోతుగా పరిశోధించాను. 307 00:19:24,332 --> 00:19:29,129 శిశిరకాలానికి, చలికాలం ఎలా అయితే అడ్డుపడుతుందో, అలాగే స్నేహానికి కూడా అపార్థాలు అడ్డుగా మారవచ్చు. 308 00:19:29,129 --> 00:19:32,549 కానీ రుతువులు మామూలు అయినట్టే, స్నేహంలో ఆటుపోట్లు కూడా మామూలే. 309 00:19:32,549 --> 00:19:35,302 అది సహజమే, అది ఎవరి తప్పూ కాదు. 310 00:19:39,514 --> 00:19:41,266 నేను అందరి గురించీ కొన్ని రాశాను. 311 00:19:46,897 --> 00:19:50,025 రేచెల్ లాలీపాప్ లాంటిది. 312 00:19:50,025 --> 00:19:52,777 బయటకు కరుకుగానే కనిపిస్తుంది, కానీ లోపల తనది చాలా సున్నితమైన మనస్తత్వం. 313 00:19:57,532 --> 00:20:00,493 బెత్ ఎల్లెన్, మనం స్నేహితులుగా ఉండాలని నాకు చాలా కోరికగా ఉంది. 314 00:20:02,245 --> 00:20:03,246 నాకు కూడా. 315 00:20:15,342 --> 00:20:18,178 నేను చివరగా ఒక ముఖ్యమైన సందేశం చెప్పాలనుకుంటున్నాను. 316 00:20:30,398 --> 00:20:33,652 నేను నీపై మరీ అంత దారుణంగా ఎందుకు రాశానంటే నాకు నీపై అసూయ ఉండేది, 317 00:20:33,652 --> 00:20:36,655 ఎందుకంటే నువ్వు ఎదిగావని, ఆయన్ని కూడా చూసుకోగలవని మీ నాన్న నిన్ను నమ్ముతారు. 318 00:20:36,655 --> 00:20:39,699 మా అమ్మానాన్నలైతే, నన్ను కనీసం గోల్డ్ ఫీష్ ని కూడా చూసుకోనివ్వరు. 319 00:20:39,699 --> 00:20:41,034 నేనేమీ మిమ్మిల్ని నిందించట్లేదు. 320 00:20:41,534 --> 00:20:44,579 నేను ఓసారి వాటికి నూడుల్స్ పెట్టా. దానితో అవి చనిపోయాయి. 321 00:20:45,997 --> 00:20:49,668 నేను నీలా ఉంటే బాగుండు అని, అప్పుడప్పుడూ మా అమ్మానాన్నలు అనుకుంటుంటారని నాకు తెలుసు. 322 00:20:50,627 --> 00:20:52,879 కంగారుపడకండి. అప్పుడప్పుడూ నేనూ అలాగే అనుకుంటా. 323 00:20:53,547 --> 00:20:56,800 ఇక పుస్తకం విషయంలో అలా జరిగాక, ఇంకా ఓల్ గోలీ దూరంగా వెళ్లిపోయాక, 324 00:20:56,800 --> 00:20:59,261 నేను కాస్త ఎదిగినట్టు, నాకు జ్ఞానం కలిగినట్టు అనిపిస్తోంది. 325 00:20:59,844 --> 00:21:02,556 అయినా కానీ నాకు నా టెడ్డీ బేర్ బొమ్మని స్కూలుకు తెచ్చుకోవాలని, 326 00:21:02,556 --> 00:21:06,101 పిల్లల ప్లే ఏరియాలో ఆడుకోవాలని, రోజంతా చాక్లెట్ ఎగ్ క్రీమ్స్ తాగాలని ఉంది. 327 00:21:06,101 --> 00:21:11,481 నేను వేగంగా ఎదగాలని మీకు ఉందని నాకు తెలుసు, కానీ నేను 11 ఏళ్ల అమ్మాయిలా బాగానే ఉన్నాను. 328 00:21:11,481 --> 00:21:14,859 అదీగాక, నేను పూర్తిగా ఎదిగాక, 329 00:21:14,859 --> 00:21:17,487 "నువ్వు చిన్నప్పుడు నువ్వు భలే ముద్దొచ్చేదానివి," అని అంటారు. 330 00:21:17,487 --> 00:21:19,739 కాబట్టి మనం తొందరపడాల్సిన పని లేదనుకుంటా. 331 00:21:21,908 --> 00:21:23,368 కాబట్టి, స్పోర్ట్... 332 00:21:25,704 --> 00:21:28,206 నేనేం చెప్పాలో మర్చిపోయాను. 333 00:21:38,592 --> 00:21:43,388 శభాష్, శభాష్, అదరగొట్టేశారు! 334 00:21:44,264 --> 00:21:45,891 నాకు ఈ ఉద్యోగముంటే చాలు, ఇంకేమీ వద్దు. 335 00:21:51,646 --> 00:21:56,568 ఇప్పటి నుంచి, మరింత లోతుగా పరిశోధిస్తానని, లోకానికి ప్రేమ పంచుతున్నానని 336 00:21:56,568 --> 00:21:58,695 పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. 337 00:21:58,695 --> 00:22:00,697 అందరూ, తలా ఒక పేజీని తీసుకోండి. 338 00:22:05,660 --> 00:22:08,288 నేను స్కూల్ పేపర్ లో చేరాక నా మాట నిలబెట్టుకొని... 339 00:22:08,288 --> 00:22:09,372 హాల్ మానిటర్ కి జయహో 340 00:22:09,372 --> 00:22:11,207 ...వాలెస్ వాకర్ గురించి ఒక కథనాన్ని రాశాను. 341 00:22:11,207 --> 00:22:14,002 అందరిలా, నేను కూడా అతనొక పిచ్చోడని అనుకున్నాను, 342 00:22:14,002 --> 00:22:17,339 కానీ అతను ఒక హీరో అని తెలుసుకున్నాను. 343 00:22:19,090 --> 00:22:22,844 నా మనస్సు లోలోతుల్లో దాగున్న బాధ క్రమక్రమంగా దూరమైపోయింది. 344 00:22:23,637 --> 00:22:26,598 కానీ నేను ఓల్ గోలీని మాత్రం చాలా దారుణంగా మిస్ అవుతున్నాను. 345 00:22:26,598 --> 00:22:31,853 అదృష్టవశాత్తూ, తను నాకు నేర్పిన అతి ముఖ్యమైన విషయం మాత్రం కలకాలం నాలోనే ఉండిపోతుంది. 346 00:22:32,437 --> 00:22:36,107 నీకు గొప్ప రచయిత్రి కావాలనుంటే, నువ్వు అన్నింటినీ తెలుసుకోవాలి. 347 00:22:36,107 --> 00:22:40,028 అన్నింటినీ తెలుసుకోవాలంటే, అన్నింటినీ గమనించాల్సి ఉంటుంది. 348 00:22:40,028 --> 00:22:44,741 అన్నింటినీ గమనించాలంటే, నువ్వు డిటెక్టివ్ అవతారమెత్తాలి. 349 00:22:49,329 --> 00:22:51,748 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 350 00:22:51,748 --> 00:22:53,458 మనకు నచ్చినట్లు ఉండాలి 351 00:22:54,584 --> 00:22:57,128 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 352 00:22:57,128 --> 00:23:02,717 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 353 00:23:04,886 --> 00:23:10,559 నా చుట్టపక్కల అందరికీ మంచి చేయాలని ప్రయత్నిస్తాను 354 00:23:10,559 --> 00:23:13,103 నేను అందంగా నవ్వుతాను 355 00:23:13,103 --> 00:23:16,398 నిజం మాత్రమే చెప్పాలని తపిస్తాను 356 00:23:16,398 --> 00:23:18,984 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 357 00:23:18,984 --> 00:23:20,902 మనకు నచ్చినట్లు ఉండాలి 358 00:23:21,778 --> 00:23:24,531 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 359 00:23:24,531 --> 00:23:27,367 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 360 00:23:27,367 --> 00:23:29,953 నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అదే అవుతాను 361 00:23:29,953 --> 00:23:31,621 నాదే తుది నిర్ణయం 362 00:23:32,664 --> 00:23:35,458 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 363 00:23:35,458 --> 00:23:37,460 మనకు నచ్చినట్లు ఉండాలి 364 00:23:37,460 --> 00:23:40,297 లేదు, నా జుట్టు కత్తిరించుకోను 365 00:23:40,297 --> 00:23:42,966 నాకు నచ్చిందే వేసుకుంటాను 366 00:23:42,966 --> 00:23:48,638 నాకు నచ్చినట్లుగా ఉండడం నాకిష్టం 367 00:23:48,638 --> 00:23:51,558 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 368 00:23:51,558 --> 00:23:56,229 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 369 00:23:57,063 --> 00:23:59,065 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్