1 00:00:08,634 --> 00:00:11,264 న్యూయార్క్ కి వేసవి కంటే కష్టమైన ఒకే ఒక విషయం 2 00:00:11,345 --> 00:00:15,055 ఆకురాలు కాలం వచ్చే వరకూ ఆ వేసవి ఇలాగే కొనసాగడం. 3 00:00:15,140 --> 00:00:17,480 కొంతసేపయ్యాక, ప్రతి ఒక్కరూ అందంగా ఉండడం అటుంచి, 4 00:00:17,559 --> 00:00:20,269 కరిగిపోయిన కొవ్వొత్తుల లాగా తయారవుతారు. 5 00:00:32,073 --> 00:00:33,083 కావలెను 6 00:00:33,158 --> 00:00:35,578 అంటే, నేను నిఘా పెట్టడం తేలికవుతుందన్నమాట 7 00:00:35,661 --> 00:00:38,661 ఎందుకంటే జనం చల్లదనం కోసం ఇళ్లలోనే ఉంటారు. 8 00:00:46,463 --> 00:00:50,093 కార్టూన్లలో చూసినట్లుగా పిల్లులు తమ తోకల్ని గుండ్రంగా తిప్పలేకపోవడం బాలేదు, 9 00:00:50,175 --> 00:00:52,425 ఎందుకంటే వాటిని ఫ్యాన్ లుగా వాడుకోవచ్చు. 10 00:01:01,937 --> 00:01:04,727 బయట చాలా వేడిగా ఉంది, మిసెస్ రాబిన్సన్. 11 00:01:04,815 --> 00:01:07,105 అవును, మిస్టర్ రాబిన్సన్. 12 00:01:07,609 --> 00:01:10,899 రాబిన్సన్స్ ఇంత బోరింగ్ గా ఎలా ఉండగలుగుతున్నారు? 13 00:01:10,988 --> 00:01:12,658 బోరింగ్ గా ఉండడం ప్రాక్టీసు చేస్తుంటారేమో. 14 00:01:20,581 --> 00:01:24,631 నేను ఇంటికి వెళ్లి నా ఎ.సికి అంగుళం దూరంలో నిలబడగలిగితే బాగుండు… 15 00:01:29,464 --> 00:01:33,514 కానీ నా నిఘా దారిలో దృష్టి పెట్టాల్సిన కొత్త షాప్ ఒకటి ఉంది. 16 00:01:38,056 --> 00:01:40,176 అది గార్సియా కుటుంబం, 17 00:01:40,267 --> 00:01:43,597 ఇటువంటి దారుణమైన ఎండలో వాళ్ళపై నిఘా పెట్టాలని 18 00:01:43,687 --> 00:01:48,067 నేను తీసుకున్న నిర్ణయం కారణంగా మేమందరం ఒక వింతైన నేరంలో చిక్కుకుపోయాం. 19 00:01:49,610 --> 00:01:50,610 కావలెను 20 00:01:51,195 --> 00:01:53,855 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 21 00:01:53,947 --> 00:01:55,617 మనకు నచ్చినట్లు ఉండాలి 22 00:01:56,742 --> 00:01:59,202 నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అదే అవుతాను 23 00:01:59,286 --> 00:02:00,866 నాదే తుది నిర్ణయం 24 00:02:01,371 --> 00:02:04,291 లేదు, నా జుట్టు కత్తిరించుకోను 25 00:02:04,374 --> 00:02:06,754 నాకు నచ్చిందే వేసుకుంటాను 26 00:02:06,835 --> 00:02:12,875 నాకు నచ్చినట్లుగా ఉండడం నాకిష్టం 27 00:02:12,966 --> 00:02:15,506 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 28 00:02:15,594 --> 00:02:18,474 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 29 00:02:18,555 --> 00:02:19,555 "స్పై వర్సెస్ స్పై" 30 00:02:21,600 --> 00:02:22,680 లూయిస్ ఫిట్జ్ హ్యూ రచనపై ఆధారపడింది 31 00:02:24,394 --> 00:02:26,694 గార్సియాలని నా నిఘా మార్గంలో చేర్చినప్పటి నుండి 32 00:02:26,772 --> 00:02:28,362 నేను వాళ్ళ గురించి చాలా తెలుసుకున్నాను. 33 00:02:31,276 --> 00:02:32,276 కొత్తది 34 00:02:32,361 --> 00:02:34,951 వాళ్ళు క్యూబా నుంచి అమెరికాకి ఈ మధ్యే వచ్చారు 35 00:02:35,030 --> 00:02:37,910 వాళ్ళ భవనం మొదటి అంతస్తులో ఒక షాపు కొన్నారు. 36 00:02:38,408 --> 00:02:41,198 వాళ్ళు మాట్లాడుకుంటున్నవి నాకేమీ అర్థం కాకపోయినా 37 00:02:41,286 --> 00:02:43,156 వాళ్ళు చాలా మామూలుగానే కనిపించారు. 38 00:02:43,247 --> 00:02:44,997 -హోర్గే! -చెప్పు! 39 00:02:52,756 --> 00:02:56,336 గార్సియా దంపతులు ఎదురెదురుగా మాట్లాడుకోవడానికి బదులుగా 40 00:02:56,426 --> 00:02:59,296 వేర్వేరు గదుల్లో ఉండి ఒకరితో ఒకరు అరుస్తూ మాట్లాడుకుంటున్నారు, 41 00:02:59,388 --> 00:03:02,058 తల్లిదండ్రులు వయసు పెరిగే కొద్దీ ఇలాగే చేస్తూ ఉంటారేమో. 42 00:03:04,476 --> 00:03:05,846 వాళ్ళకి యుక్త వయసులో ఉన్న కూతురు వుంది. 43 00:03:05,936 --> 00:03:09,816 తనను మించిన సింగర్ ఎవరూ లేరని అనుకుంటూ ఉంటుంది. 44 00:03:10,691 --> 00:03:13,321 మి, మి, మి 45 00:03:14,695 --> 00:03:17,025 మి, మి, మి 46 00:03:17,114 --> 00:03:22,624 రోజూ షాపు మూసేశాక, పదివేల డాలర్ టవర్ కార్యక్రమం చూడటం వాళ్ళకు ఇష్టం. 47 00:03:24,121 --> 00:03:28,081 పదివేల డాలర్ టవర్! 48 00:03:28,667 --> 00:03:29,707 అవును! 49 00:03:29,793 --> 00:03:31,713 కాబట్టి అంతా మామూలుగా ఉన్నట్లేగా? 50 00:03:32,254 --> 00:03:33,344 కాదు. 51 00:03:33,422 --> 00:03:37,222 ఎందుకంటే, ప్రతి రాత్రీ ఆ గేమ్ షో స్టార్ట్ అయ్యే సమయానికి 52 00:03:37,301 --> 00:03:41,181 వాళ్ళ అబ్బాయి కార్లోస్, ఎక్కడికో అదృశ్యం అయిపోయేవాడు. 53 00:03:42,514 --> 00:03:47,354 దాంతో కొన్ని ముఖ్యమైన ఆధారాల కోసం నేను వాళ్ళ షాపుపై నిఘా పెట్టాలనుకున్నాను. 54 00:03:55,611 --> 00:03:56,611 తెరిచి ఉంది మూసి ఉంది 55 00:04:17,382 --> 00:04:19,592 కార్లోస్ ప్రతిరాత్రీ ఎక్కడికి వెళుతున్నట్లు? 56 00:04:20,636 --> 00:04:22,636 నాకేమీ అర్థం కావట్లేదు. 57 00:04:24,389 --> 00:04:28,309 -హాయ్ అమెరికా, ఇది టవర్ టైం. -ఇది టవర్ టైం! 58 00:04:33,857 --> 00:04:35,277 ఇది టవర్ టైం. 59 00:04:35,776 --> 00:04:37,816 ఇది టవర్ టైం! 60 00:04:38,820 --> 00:04:40,910 కార్లోస్ ఎక్కడికి వెళ్ళుంటాడని ఆలోచిస్తే: 61 00:04:40,989 --> 00:04:41,989 మొదటిది, 62 00:04:42,574 --> 00:04:44,334 బహుశా అతను బాగా ఎక్సర్సైజులు చేస్తూ ఉండొచ్చు, 63 00:04:44,409 --> 00:04:48,119 ఎందుకంటే అప్పుడే షాపులో పండ్ల అట్టపెట్టెల్ని తేలిగ్గా ఎత్తగలుగుతాడు. 64 00:04:48,205 --> 00:04:49,405 రెండవది… 65 00:04:52,459 --> 00:04:53,629 మి 66 00:04:53,710 --> 00:04:56,590 కార్లోస్ కి వాళ్ళ చెల్లి పాటలు అస్సలు నచ్చకపోవచ్చు, 67 00:04:56,672 --> 00:04:58,512 అందుకని మిస్టర్ విథర్స్ ఇంటిముందు నిలబడి 68 00:04:58,590 --> 00:05:01,640 అక్కడి పిల్లులు తన చెల్లికంటే చక్కని శృతిలో పాడడం వింటూ ఉండొచ్చు. 69 00:05:08,183 --> 00:05:09,353 మూడవది. 70 00:05:09,977 --> 00:05:11,847 లేదా బహుశా… 71 00:05:11,937 --> 00:05:14,397 మన కొత్త కంటెస్టెంట్ కి స్వాగతం పలుకుదాం, 72 00:05:14,481 --> 00:05:16,191 కార్లోస్ గార్సియా. 73 00:05:17,234 --> 00:05:22,614 కార్లోస్, నువ్వు పదివేల డాలర్లతో ఏమి చేస్తావ్? 74 00:05:22,698 --> 00:05:25,118 నేను సైబీరియాకి వెళ్ళిపోతాను, జానీ. 75 00:05:25,200 --> 00:05:29,750 దూరంగా వెళ్ళిపోవడం కోసం పదివేల డాలర్ టవర్ లో గెలవాలని శిక్షణ తీసుకుంటూ ఉండొచ్చు, 76 00:05:29,830 --> 00:05:33,250 -అప్పుడిక తన చెల్లి పాటని వినాల్సిన అవసరం ఉండదు. -లా, లా, లా, మి 77 00:05:34,084 --> 00:05:37,134 కార్లోస్ ఎక్కడికి వెళుతున్నాడో కనిపెట్టి తీరాలని నేను నిశ్చయించుకున్నాను. 78 00:05:38,422 --> 00:05:41,552 ఒక బ్రేకింగ్ న్యూస్ అందించడం కోసం ఈ కార్యక్రమానికి మధ్యలో అంతరాయం కలిగిస్తున్నాం. 79 00:05:41,633 --> 00:05:46,313 మాన్హట్టన్ లోని అప్పర్ ఈస్ట్ సైడ్ లో మరో షాపులో బొడేగా దొంగ చోరీకి పాల్పడ్డాడు, 80 00:05:46,388 --> 00:05:50,388 ఈ మధ్యాహ్నం జోస్ ఎయిటీ ఎత్ షాపులో దొంగతనం చేశాడు. 81 00:05:52,352 --> 00:05:55,942 బొడేగా దొంగా? ఆసక్తికరంగా ఉందే. 82 00:05:56,023 --> 00:05:58,693 ఈ వారంలోనే ఇది మూడవ దొంగతనం. 83 00:05:58,775 --> 00:06:03,355 బాబీస్ వైన్ షాప్, ఇంకా ఈస్ట్ సైడ్ షాపు కూడా ఈ దొంగతనానికి గురయ్యాయి. 84 00:06:03,447 --> 00:06:07,277 వైన్ షాపులు, దుకాణాల్లో ఆ దొంగ పట్టపగలే దూరి 85 00:06:07,367 --> 00:06:11,287 రాత్రికి తిరిగి రావడం కోసం తాళాలని కొట్టేస్తున్నాడని పోలీసులు అంటున్నారు. 86 00:06:11,788 --> 00:06:16,288 అతను యువకుడని, ప్రమాదకారి అని వర్ణించడం జరిగింది. 87 00:06:16,376 --> 00:06:17,376 కావలెను 88 00:06:19,213 --> 00:06:20,343 హోర్గే… 89 00:06:28,222 --> 00:06:31,852 స్ట్రీట్ లైట్లు వెలగగానే, ఆసక్తికరమైన సంఘటనలన్నీ జరుగుతాయనిపిస్తుంది, 90 00:06:31,934 --> 00:06:34,654 నేను ఇంటికెళ్ళాల్సిన టైం అయ్యిందని కూడా గుర్తు చేస్తుంది. 91 00:06:37,022 --> 00:06:38,072 కార్లోస్? 92 00:06:42,611 --> 00:06:45,451 ఇప్పుడు జరిగింది ఏమిటి? 93 00:06:50,702 --> 00:06:52,332 అతను నీ మీద నిఘా వేశాడా? 94 00:06:52,412 --> 00:06:54,792 అవును. నా మీద నిఘా వేశాడు. 95 00:06:54,873 --> 00:06:58,383 ఆగు. అతని మీద, అతని కుటుంబం మీద ముందుగా నిఘా వేసింది నువ్వే కదా? 96 00:06:58,460 --> 00:07:00,000 అది వేరు, స్పోర్ట్. 97 00:07:00,087 --> 00:07:01,087 నేనొక రచయితను. 98 00:07:01,171 --> 00:07:02,801 నేను రచయితను కావాలంటే నాకు అన్నీ తెలియాలీ, 99 00:07:02,881 --> 00:07:04,721 కాబట్టి అన్నిటినీ తెలుసుకోవడానికే నేను స్పై... 100 00:07:04,800 --> 00:07:08,600 సరే, అందరూ లేచి డాడ్జింగ్ ఆడడం మొదలుపెట్టండి! 101 00:07:13,100 --> 00:07:15,560 రూల్స్ సరిగా పాటించండి. కానివ్వండి! 102 00:07:18,772 --> 00:07:20,612 మరి నువ్వు ఏమి చెయ్యబోతున్నావు, హ్యారియట్? 103 00:07:23,652 --> 00:07:27,992 అన్నిటికంటే ముందు, కార్లోస్ నా గురించి ఏమి రాశాడో కనిపెట్టాలి. 104 00:07:28,073 --> 00:07:30,623 ఏంటి? నీ గురించి రాశాడా? 105 00:07:32,619 --> 00:07:34,369 నువ్వు అవుట్, పింకీ వైట్ హెడ్! 106 00:07:34,454 --> 00:07:38,084 ఆగు. అతను నీ మీద నిఘా పెట్టడమే కాక, నీ గురించి రాశాడు కూడానా? 107 00:07:38,166 --> 00:07:41,546 హ్యారియట్ ఏమి చేసిందో అతను కూడా అదే చేశాడు. 108 00:07:43,297 --> 00:07:45,007 మనం దానిపై దృష్టి పెట్టాలి, హ్యారియట్. 109 00:07:45,507 --> 00:07:47,717 కావాలని అవుట్ అయిపోవాలి. 110 00:07:54,808 --> 00:07:57,518 అబ్బా నా పొట్ట! నా పొట్ట మీద తగిలింది. 111 00:08:02,357 --> 00:08:04,027 నేను అవుట్ అయ్యాను! నేను అవుట్ అయ్యాను! 112 00:08:05,569 --> 00:08:08,609 మా అన్నకి బుర్ర తక్కువ. 113 00:08:13,368 --> 00:08:14,828 మీరిద్దరూ అక్కడ కింద ఏం చేస్తున్నారు? 114 00:08:16,330 --> 00:08:18,620 ఎమెర్జెన్సీగా కావాలని అవుట్ అయ్యాం, స్పోర్ట్. 115 00:08:18,707 --> 00:08:19,957 మనం చాలా విషయాలు చర్చించాలి. 116 00:08:20,042 --> 00:08:21,502 అయ్యో. 117 00:08:21,585 --> 00:08:23,545 కానీ నేను ఈ ఆట బాగా ఆడుతున్నాను. 118 00:08:25,339 --> 00:08:27,169 బాగా ఆడుతున్నావు, స్పోర్ట్! 119 00:08:28,175 --> 00:08:29,215 చూశారా? 120 00:08:31,011 --> 00:08:32,301 సరేలే. 121 00:08:33,179 --> 00:08:35,059 ఊచ్. నేను అవుట్. 122 00:08:38,477 --> 00:08:40,937 ఈ కార్లోస్ నీతో స్నేహం చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉండచ్చేమో కదా? 123 00:08:41,020 --> 00:08:42,480 అతను ఈ మధ్యే ఇక్కడికి వచ్చాడు కదా. 124 00:08:42,563 --> 00:08:44,533 కొత్త స్కూల్ లో ఎవ్వరూ పరిచయం కాలేదేమో! 125 00:08:44,608 --> 00:08:48,448 అలా అయ్యుండదు. నేను అతన్ని ఏమి కావాలని అడిగితే నా వైపు ఇలా చూసి… 126 00:08:49,613 --> 00:08:50,613 పారిపోయాడు. 127 00:08:50,697 --> 00:08:52,617 ఫ్రెండ్ కోసం చూస్తున్నట్లు అనిపించలేదు. 128 00:08:53,325 --> 00:08:54,575 మంచి పాయింటే! 129 00:08:54,660 --> 00:08:56,410 ఆగండి, మీకు అర్థం కావట్లేదా? 130 00:08:56,495 --> 00:09:00,075 నీ మీద నిఘా వేస్తున్నాడు, వేరే దేశం నుంచి వచ్చాడు, 131 00:09:00,165 --> 00:09:02,075 వేరే భాష మాట్లాడుతున్నాడు. 132 00:09:02,584 --> 00:09:03,634 కార్లోస్ ఒక… 133 00:09:03,710 --> 00:09:06,340 ఇంటర్నేషనల్ స్పై. 134 00:09:07,172 --> 00:09:09,842 ట్రాన్సిల్వేనియా నుండి వచ్చిన వేంపైర్ అయ్యుంటాడనుకున్నాను. 135 00:09:12,636 --> 00:09:15,756 సరే, పోనీలే. ఇంటర్నేషనల్ స్పై అనేది వినడానికి కూడా బాగుంది. 136 00:09:20,185 --> 00:09:21,645 స్కూల్ పూర్తయ్యే సరికి, 137 00:09:21,728 --> 00:09:26,188 ఒక ఇంటర్నేషనల్ స్పై నా వెనక పడ్డాడని అనుకోవడం తప్ప నాకు వేరే ఆలోచన రాలేదు. 138 00:09:26,692 --> 00:09:28,032 నిన్ను పట్టేసుకున్నాను! 139 00:09:39,705 --> 00:09:40,905 కాని ఎందుకు? 140 00:09:42,165 --> 00:09:44,285 నేను చూడకూడనిది ఏమైనా చూశానా? 141 00:09:47,212 --> 00:09:50,172 ఏం రాస్తున్నాడో తెలుసుకుంటే తప్ప, అతను ఏం చేయబోతున్నాడో తెలుసుకోలేను. 142 00:09:55,429 --> 00:09:56,969 అప్పుడే నాకు ఒక విషయం అర్థం అయ్యింది. 143 00:09:58,974 --> 00:10:03,104 కార్లోస్ నా మీద ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాడో తెలుసుకోవాలంటే… 144 00:10:03,187 --> 00:10:06,437 …కార్లోస్ షాపులో నా మనిషిని పెట్టాలి. 145 00:10:09,443 --> 00:10:12,243 జేనీ, నువ్వు ఈ సెమిస్టర్ స్పానిష్ తీసుకున్నావు కదా? 146 00:10:12,321 --> 00:10:14,571 అవును. చాలా బాగా మాట్లాడగలను. 147 00:10:14,656 --> 00:10:17,076 సూపర్. మీ ఇద్దరూ నాకు హెల్ప్ చెయ్యాలి. 148 00:10:17,159 --> 00:10:18,699 -ఏమి చెయ్యాలి? -తప్పకుండా చేస్తాం. 149 00:10:26,710 --> 00:10:29,210 జేనీ, నువ్వు అతని తల్లిదండ్రుల దృష్టి మళ్ళించు. 150 00:10:29,296 --> 00:10:30,416 నా సైగ కోసం వెయిట్ చెయ్యి. 151 00:10:31,340 --> 00:10:34,090 స్పోర్ట్, రెండవ అంకానికి సిద్ధంగా ఉండు. 152 00:10:35,177 --> 00:10:36,427 రెడీ… 153 00:10:37,221 --> 00:10:38,221 వెళ్ళు. 154 00:10:49,775 --> 00:10:51,355 అయ్యయ్యో! 155 00:11:31,775 --> 00:11:33,565 అదిగో, అదే ఆ పేపర్. 156 00:11:33,652 --> 00:11:35,402 అతను దాని మీదే రాస్తున్నాడు. 157 00:11:35,487 --> 00:11:36,657 మనం దాన్ని సంపాదించాలి. 158 00:11:36,738 --> 00:11:38,698 అతని దృష్టి మళ్ళించు, నేను ఆ పేపర్ కొట్టేస్తాను. 159 00:11:45,914 --> 00:11:46,924 హలో. 160 00:11:53,130 --> 00:11:55,590 హే, ఆ పెన్నీ క్యాన్డీస్ రేటు ఎంత? 161 00:11:58,844 --> 00:12:00,224 ఒక పెన్నీ. 162 00:12:02,514 --> 00:12:04,314 ఒకే. ఆసక్తికరంగా వుంది. 163 00:12:07,144 --> 00:12:09,984 మరి, అక్కడున్న పెన్నీ క్యాన్డీస్ రేటు ఎంత? 164 00:12:12,024 --> 00:12:13,234 అవి కూడా పెన్నీయే. 165 00:12:13,317 --> 00:12:14,437 సరే అయితే. 166 00:12:21,533 --> 00:12:22,533 అక్కడుంది. 167 00:12:27,122 --> 00:12:29,212 ఏయ్. ముందు చూసుకొని నడువు. 168 00:12:29,291 --> 00:12:30,581 క్షమించండి. 169 00:12:46,391 --> 00:12:48,641 మరి అవి ఎంత? 170 00:12:50,604 --> 00:12:53,324 అవి కూడా పెన్నీయే. అవన్నీ పెన్నీయే. 171 00:12:53,398 --> 00:12:56,068 ఒక్క మిలియన్-డాలర్ బార్ తప్ప. అది ఒక క్వార్టర్. 172 00:12:56,151 --> 00:12:57,191 సరే. 173 00:13:01,615 --> 00:13:02,905 అదీ, వాటిని నేను చూడొచ్చా? 174 00:13:03,575 --> 00:13:04,865 నిజంగానా? 175 00:13:05,953 --> 00:13:08,413 సరే. నా తాళాలు చూస్తూ ఉండు. 176 00:13:17,840 --> 00:13:22,180 -దొరికింది. -…వేల డాలర్ల టవర్ లో… 177 00:13:23,262 --> 00:13:24,512 హేయ్. నువ్వు ఏం చేస్తున్నావు? 178 00:13:24,596 --> 00:13:25,846 దొంగతనం చేస్తున్నావా? 179 00:13:27,391 --> 00:13:28,391 తనే దొంగ! 180 00:13:28,475 --> 00:13:29,725 ఆగు, దొంగ! 181 00:13:31,186 --> 00:13:32,226 పరిగెత్తండి! 182 00:13:40,571 --> 00:13:41,571 నా తాళాలు! 183 00:13:43,073 --> 00:13:44,453 నిన్నే! 184 00:13:44,992 --> 00:13:47,492 హేయ్. ముందు చూసి నడవమని నీకు చెప్పాను… 185 00:13:49,580 --> 00:13:51,250 రండి. ఇక్కడి నుండి పారిపోదాం. 186 00:14:01,967 --> 00:14:03,927 దొరికింది. నాకు దొరికింది. 187 00:14:04,011 --> 00:14:05,011 ఇది ఒక… 188 00:14:05,095 --> 00:14:06,885 చూద్దాం. ఓపెన్ చెయ్యి. 189 00:14:08,223 --> 00:14:09,523 ఇది ఒక మ్యాప్. 190 00:14:09,600 --> 00:14:11,230 న్యూయార్క్ అప్పర్ ఈస్ట్ సైడ్ హ్యారియట్ 191 00:14:11,310 --> 00:14:13,980 అతను నా స్పై రూట్ మొత్తాన్ని హైలైట్ చేశాడు. 192 00:14:14,646 --> 00:14:16,686 జేనీ, ఈ స్పానిష్ కి అర్థం ఏంటి? 193 00:14:20,027 --> 00:14:23,567 నీకు స్పానిష్ చాలా బాగా వచ్చనుకున్నానే! 194 00:14:23,655 --> 00:14:26,485 అవును, నేనూ అంతే అనుకున్నాను, కానీ కాదు, నాకు రాదు. 195 00:14:26,575 --> 00:14:27,575 జేనీ! 196 00:14:27,659 --> 00:14:31,039 నాకూ స్పానిష్ రాదు, కానీ అది మాత్రం కచ్చితంగా హ్యారియట్ అని అర్థమవుతోంది. 197 00:14:31,121 --> 00:14:35,291 ఏంటీ? అతనికి నా పేరు తెలుసు. కానీ అతనికి నా పేరు ఎలా తెలిసింది? 198 00:14:35,834 --> 00:14:38,424 కార్లోస్ నిజంగానే ఒక ఇంటర్నేషనల్ స్పై. 199 00:14:38,504 --> 00:14:41,094 నా స్పై రూట్ లో చూడకూడినది ఏదో చూసి ఉంటాను. 200 00:14:41,173 --> 00:14:43,473 బహుశా రాబిన్సన్స్ నిజానికి బోరింగ్ కాదేమో? 201 00:14:43,550 --> 00:14:44,800 కార్లోస్ వాళ్ళ కోసం పని చేస్తాడేమో! 202 00:14:44,885 --> 00:14:47,715 ఈ మ్యాప్ లో ఏముందో నేను వెంటనే తెలుసుకోవాలి. 203 00:14:48,430 --> 00:14:50,970 మన స్పానిష్ టీచర్ మిసెస్ మార్షల్ నీకు హెల్ప్ చేయగలదేమో. 204 00:14:51,058 --> 00:14:53,018 నాకు తెలిసి ఆమె నాలుగింటి వరకే స్కూల్ లో ఉంటుందనుకుంటా. 205 00:14:54,728 --> 00:14:56,608 అంటే ఇప్పుడు నాకు పదిహేను నిమిషాలే ఉంది. 206 00:14:57,189 --> 00:14:59,899 మీతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది, ఫ్రెండ్స్. 207 00:14:59,983 --> 00:15:01,693 మాక్కూడా సంతోషంగా ఉంది. 208 00:15:07,616 --> 00:15:08,906 ఏయ్! పరిగెత్తకూడదు. 209 00:15:16,917 --> 00:15:20,297 జోస్ ఎయిటీ ఎత్ స్ట్రీట్ షాపుని మ్యాప్ లో చూసి నేను ఆగిపోయాను. 210 00:15:20,379 --> 00:15:22,129 దాని గురించి వార్తల్లో చెప్పడం గుర్తుంది. 211 00:15:22,214 --> 00:15:25,514 బొడేగా దొంగ చోరీకి పాల్పడింది అక్కడే. 212 00:15:25,592 --> 00:15:29,262 ఒక్కసారిగా, నాకు విషయమంతా అర్థమయింది. 213 00:15:29,346 --> 00:15:34,016 కార్లోస్ షాపులో పనిచేస్తాడు కాబట్టి తాళాలు ఎప్పుడు కొట్టేయచ్చో అతనికి బాగా తెలుసు. 214 00:15:34,101 --> 00:15:36,481 కాబట్టి అతనిపై అనుమానం రాదు. 215 00:15:36,562 --> 00:15:41,532 షాపులో పనిచేసే వ్యక్తే, షాపుల్లో దొంగతనాలు చేస్తాడని ఎవరు ఊహిస్తారు? 216 00:15:41,608 --> 00:15:44,358 కార్లోస్ ఇంటర్నేషనల్ స్పై కాదు. 217 00:15:44,444 --> 00:15:46,784 అతనే బొడేగా దొంగ. 218 00:15:56,999 --> 00:15:58,289 ఏయ్! 219 00:16:04,006 --> 00:16:07,716 నేను ఇంటికెళ్ళాలని అనుకున్నాను కాని, ఆ బొడేగా దొంగకి మా ఇల్లు ఎక్కడుందో తెలియకూడదని 220 00:16:07,801 --> 00:16:09,051 నేను పరిగెడుతూనే ఉన్నాను. 221 00:16:19,438 --> 00:16:20,608 త్వరగా వెళ్ళాలి. 222 00:16:26,069 --> 00:16:28,109 -డబ్బులు లేకపోతే… -వెళ్ళడం కుదరదు. 223 00:16:28,197 --> 00:16:29,357 అయ్యో! 224 00:16:32,743 --> 00:16:35,413 స్పై సినిమాలో లాగా ఎవరైనా మన వెంట పడితే, 225 00:16:35,495 --> 00:16:38,455 సినిమాలోలాగే వాళ్ళ కన్నుగప్పాలి. 226 00:16:42,085 --> 00:16:43,085 ఏయ్! 227 00:16:45,130 --> 00:16:46,130 అటు వైపు! 228 00:16:58,143 --> 00:16:59,693 నీకు చాలా విషయాలు తెలుసని అనుకునే దొంగ 229 00:16:59,770 --> 00:17:03,020 నీ వెంట పడుతున్నప్పుడు, నువ్వు చాలా వేగంగా పరిగెత్తగలవని 230 00:17:03,106 --> 00:17:06,316 అతనికి తెలిసని నీకు తెలిస్తే అప్పుడు ఏం చేస్తావు? 231 00:17:13,784 --> 00:17:14,994 టైమ్స్ స్క్వేర్ 232 00:17:29,174 --> 00:17:30,184 ఎంపైర్ స్టేట్ 233 00:17:40,352 --> 00:17:41,602 కమాన్. కమాన్. 234 00:17:47,484 --> 00:17:48,494 ఇప్పుడు సేఫ్. 235 00:17:50,112 --> 00:17:54,412 పైకి వెళ్ళాక పోలీసులకి ఫోన్ చేసి, హీరోని అనిపించుకుందాం అనుకున్నాను. 236 00:17:56,785 --> 00:17:58,995 ఆహా, ఎంత బాగుందో చూడు. 237 00:18:01,248 --> 00:18:02,958 కానీ ఎలా? 238 00:18:04,877 --> 00:18:06,797 అర్థమైంది, రెండు లిఫ్టులు ఉన్నాయా! 239 00:18:07,713 --> 00:18:10,263 -నువ్వే. -నువ్వే. 240 00:18:10,340 --> 00:18:12,510 నువ్వే బొడేగా దొంగవి. 241 00:18:12,593 --> 00:18:14,473 ఏంటి? నేనా, నేను కాదు. 242 00:18:14,553 --> 00:18:16,853 నేనెలా బొడేగా దొంగని అవుతాను? 243 00:18:16,930 --> 00:18:19,430 మా ఫ్యామిలీ షాపులోకి వచ్చి, 244 00:18:19,516 --> 00:18:22,056 నా తాళాలు, మ్యాప్ కొట్టేసింది నువ్వే కాబట్టి. 245 00:18:22,144 --> 00:18:24,524 ఏంటి? తాళాలు కొట్టేశానా? నేనేమీ కొట్టేయలేదు. 246 00:18:24,605 --> 00:18:27,815 అవును, నిజమే, నువ్వేమీ కొట్టేయలేదు, ఎందుకంటే అవి నకిలీ తాళాలు. 247 00:18:27,900 --> 00:18:29,860 నకిలీ తాళాలంటే? 248 00:18:29,943 --> 00:18:32,653 బొడేగా దొంగకి ఎర వేయడానికి 249 00:18:32,738 --> 00:18:36,028 నేనక్కడ పనిచెయ్యని పాత తాళాలు కనబడేలా పెట్టాను. 250 00:18:36,116 --> 00:18:37,696 -నువ్వే. -కాదు. 251 00:18:37,784 --> 00:18:39,544 నువ్వే బొడేగా దొంగవి, 252 00:18:39,620 --> 00:18:43,000 నీ విషయం నేను పసిగట్టానని తెలిసింది కాబట్టి నువ్వు నన్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టావు. 253 00:18:43,081 --> 00:18:45,671 ఇది నిరూపించడానికి నా దగ్గర మ్యాప్ వుంది. 254 00:18:45,751 --> 00:18:47,041 ఆగు! నా సాక్ష్యం! 255 00:18:50,672 --> 00:18:51,672 అదిగో అక్కడున్నారు. 256 00:18:51,757 --> 00:18:53,007 ఏయ్! నాకివ్వు! 257 00:18:54,760 --> 00:18:56,090 జేనీ? స్పోర్ట్? 258 00:18:56,803 --> 00:18:57,893 స్పోర్ట్, వద్దు. 259 00:18:57,971 --> 00:18:59,471 ఇక్కడ స్పానిష్ మాట్లాడేది నేను. 260 00:18:59,556 --> 00:19:01,056 గార్సియాస్ నిన్ను ఫాలో అవ్వడానికి సాయం చేశారు. 261 00:19:01,141 --> 00:19:02,981 నేను బొడేగా దొంగని కాదు. 262 00:19:03,060 --> 00:19:04,310 కాదు, తనే! 263 00:19:04,394 --> 00:19:05,774 లేదు, నేను కాదు! 264 00:19:08,148 --> 00:19:10,028 మనమేదో మిస్ అయినట్లున్నాం. 265 00:19:10,609 --> 00:19:12,319 నువ్వు దొంగవి కాదని మాకు తెలుసు. 266 00:19:12,402 --> 00:19:14,362 నువ్వు దొంగని అడ్డుకున్నావు. 267 00:19:14,446 --> 00:19:15,446 ఏంటి? 268 00:19:17,991 --> 00:19:18,991 నేను చెబుతాను. 269 00:19:20,077 --> 00:19:23,867 నువ్వు షాపులోంచి వచ్చేటప్పుడు ఒకతను గుద్దుకున్నాడే, అతనే దొంగ. 270 00:19:23,956 --> 00:19:26,246 అతను కౌంటర్ మీదున్న తాళాలు తీసుకున్నాడు. 271 00:19:26,333 --> 00:19:28,463 పని చెయ్యని ఆ పాత తాళాలని తీసుకున్నాడు. 272 00:19:28,544 --> 00:19:30,964 గార్సియా దంపతులు నన్నూ, స్పోర్ట్ ని పట్టుకున్నాక 273 00:19:31,046 --> 00:19:34,296 మేము పోలీసులకి ఫోన్ చేసి, షాపుకి తాళం వేసి, మిమ్మల్ని వెతకడానికి బయలుదేరాం. 274 00:19:34,383 --> 00:19:37,513 అయితే, ఆగండి. దాని అర్థం… 275 00:19:37,594 --> 00:19:41,394 దొంగ పట్టపగలే షాపులలో దూరి, తాళాలని దొంగిలించి 276 00:19:41,473 --> 00:19:45,603 రాత్రికి దొంగతనం చెయ్యడానికి తిరిగి వస్తున్నాడని పోలీసులు అంటున్నారు. 277 00:19:47,312 --> 00:19:51,112 నువ్వు పాత తాళాలని నకిలీ తాళాలుగా వాడి దొంగని వెర్రివాడ్ని చేశావు. 278 00:19:51,984 --> 00:19:54,654 నువ్వు నిజంగానే దొంగకి ఎర వేశావు. 279 00:19:54,736 --> 00:19:56,106 నాకిప్పుడు అర్థం అయ్యింది. 280 00:19:56,196 --> 00:19:57,776 నువ్వొక జీనియస్ వి, కార్లోస్. 281 00:19:57,865 --> 00:19:59,825 నువ్వు జీనియస్ అని నాకెందుకు చెప్పలేదు, కార్లోస్? 282 00:19:59,908 --> 00:20:02,038 ఎందుకంటే నువ్వు నా మీద స్పై చేస్తున్నావు. 283 00:20:02,119 --> 00:20:06,079 అవును! ఇంతకీ నువ్వు నా మీద, అలాగే ఈ ప్రదేశాలలో ఎందుకు నిఘా వేశావు? 284 00:20:06,164 --> 00:20:07,544 అదేమీ లేదు, నేనొక రచయితను. 285 00:20:08,208 --> 00:20:09,208 నాకు అర్థం కాలేదు. 286 00:20:09,293 --> 00:20:13,633 ఒక రైటర్ కావాలంటే, అన్ని విషయాలూ తెలిసుండాలని మా ఆయా ఓల్ గోలీ చెబుతూ ఉంటుంది. 287 00:20:13,714 --> 00:20:16,304 అన్నీ తెలియాలంటే అన్నీ చూడాలి కదా! 288 00:20:16,383 --> 00:20:18,433 మరి అన్నీ చూడాలంటే, నిఘా వేయడమే మార్గం. 289 00:20:18,510 --> 00:20:20,180 నేను రాయడం కోసం స్పై చేస్తాను. 290 00:20:20,262 --> 00:20:22,722 అయితే నువ్వు రైటర్ వన్నమాట, బాగుంది. 291 00:20:22,806 --> 00:20:23,806 నాకు చదవడం అంటే ఇష్టం. 292 00:20:23,891 --> 00:20:27,191 అయితే, ఏదో ఒకరోజు నా మొదటి నవలని నీకు చదవడానికి ఇస్తాను. 293 00:20:27,269 --> 00:20:28,269 డీల్. 294 00:20:34,610 --> 00:20:36,820 మీరిద్దరూ బొడేగా దొంగని ఎలా పట్టుకున్నారో 295 00:20:36,904 --> 00:20:39,074 మీడియాకి చెప్తే బాగుంటుందని నా తల్లితండ్రుల అభిప్రాయం. 296 00:20:39,156 --> 00:20:41,326 మీరు చేసినదానికి మీకు క్రెడిట్ దక్కాలి. 297 00:20:41,408 --> 00:20:44,238 నేను స్పైని కదా, నా గురించి అందరికీ తెలియకూడదు. 298 00:20:44,328 --> 00:20:46,288 పైగా, అసలు నిజంగా దొంగని పట్టుకుంది నువ్వే కదా! 299 00:20:46,371 --> 00:20:48,671 నువ్వొక పెద్ద ప్లాన్ వేశావు, మధ్యలో నేను అనుకోకుండా దూరాను. 300 00:20:49,208 --> 00:20:51,378 ఆగండి. మీరు ఈ మధ్యే ఇక్కడికి వచ్చారు కదా. 301 00:20:52,085 --> 00:20:54,955 మీరు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైనుండి చూశారా? 302 00:20:55,047 --> 00:20:58,127 స్పోర్ట్ కీ, జేనీకీ, నాకూ న్యూయార్క్ సిటీ గురించి బాగా తెలుసు. 303 00:20:58,217 --> 00:21:01,177 ఓహ్, అవును. మాకు ఏ టెలిస్కోపులు పని చేస్తాయి, 304 00:21:01,261 --> 00:21:03,471 ఏవి పనిచెయ్యవు, ఇలాంటివన్నీ తెలుసు. 305 00:21:03,972 --> 00:21:05,972 అదిగోండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అక్కడ వుంది. 306 00:21:09,478 --> 00:21:14,228 ఇంకా, అక్కడొక చర్చ్ ఉంది, దాని బేస్మెంట్లో ఒక బౌలింగ్ సెంటర్ కూడా ఉంది. 307 00:21:16,360 --> 00:21:19,490 తర్వాతి రోజు వడగాల్పులు ఆగాయి, కేసు కూడా ముగిసింది, 308 00:21:19,571 --> 00:21:22,411 అలాగే పత్రికల్లో కార్లోస్ ఒక హీరో అయ్యాడు. 309 00:21:22,491 --> 00:21:24,031 నేను కూడా హెల్ప్ చేశానని అతను చెప్పాడు. 310 00:21:24,117 --> 00:21:25,487 బొడేగా దొంగని పట్టుకున్న స్థానిక పిల్లాడు 311 00:21:25,577 --> 00:21:28,327 నా స్నేహితురాలు, హ్యారియట్ ఎం. వెల్ష్ పారిపోతున్న 312 00:21:28,413 --> 00:21:30,173 బొడేగా దొంగని అడ్డుకుంది. 313 00:21:30,666 --> 00:21:35,086 "ఎం"తో సహా నా పూర్తి పేరు అతను చెప్పేలా జాగ్రత్త పడ్డాను. 314 00:21:36,213 --> 00:21:40,133 ఖచ్చితంగా ఉండాలని కోరుకునే స్నేహితుల జాబితాలోకి అతను చేరాడు, 315 00:21:40,217 --> 00:21:43,467 మేము ఒకరిని చూసి ఒకరు పారిపోకుండా మాట్లాడుకుని ఉండుంటే 316 00:21:43,554 --> 00:21:45,684 అంతకుముందే స్నేహితులం అయి ఉండేవాళ్ళం. 317 00:21:50,018 --> 00:21:51,558 ఆమె బాగుందా అని అడుగుతోంది. 318 00:21:51,645 --> 00:21:53,895 ఓహ్. చాలా రుచికరంగా వుంది. 319 00:21:54,481 --> 00:21:58,691 అలాగే గార్సియాలతో సమయం గడపటం వల్ల జేనీ స్పానిష్ చాలా మెరుగయ్యింది. 320 00:22:01,405 --> 00:22:05,485 కానీ క్లారిటా పాడడంలో మాత్రం ఎలాంటి మార్పూ జరగలేదు. 321 00:22:05,576 --> 00:22:07,736 పదివేల డాలర్ టవర్ 322 00:22:07,828 --> 00:22:11,788 అందులో పవర్, డబ్బూ రెండూ ఉంటాయి 323 00:22:11,874 --> 00:22:15,504 ఇదిగో, డబ్బు మీ సొంతం 324 00:22:17,004 --> 00:22:23,514 పదివేల డాలర్ టవర్ అందులో పవర్, డబ్బూ రెండూ ఉంటాయి 325 00:22:24,011 --> 00:22:30,141 ఇదిగో, డబ్బు మీ సొంతం ఆ పదివేల డాలర్లు… 326 00:22:30,726 --> 00:22:33,396 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 327 00:22:33,478 --> 00:22:35,148 మనకు నచ్చినట్లు ఉండాలి 328 00:22:36,273 --> 00:22:38,823 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 329 00:22:38,901 --> 00:22:44,411 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 330 00:22:46,575 --> 00:22:52,245 నా చుట్టపక్కల అందరికీ మంచి చేయాలని ప్రయత్నిస్తాను 331 00:22:52,331 --> 00:22:54,791 నేను అందంగా నవ్వుతాను 332 00:22:54,875 --> 00:22:58,085 నిజం మాత్రమే చెప్పాలని తపిస్తాను 333 00:22:58,170 --> 00:23:00,670 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 334 00:23:00,756 --> 00:23:02,586 మనకు నచ్చినట్లు ఉండాలి 335 00:23:03,467 --> 00:23:06,217 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 336 00:23:06,303 --> 00:23:09,063 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 337 00:23:09,139 --> 00:23:11,639 నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అదే అవుతాను 338 00:23:11,725 --> 00:23:13,635 నాదే తుది నిర్ణయం 339 00:23:14,353 --> 00:23:17,153 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 340 00:23:17,231 --> 00:23:19,151 మనకు నచ్చినట్లు ఉండాలి 341 00:23:19,233 --> 00:23:21,993 లేదు, నా జుట్టు కత్తిరించుకోను 342 00:23:22,069 --> 00:23:24,659 నాకు నచ్చిందే వేసుకుంటాను 343 00:23:24,738 --> 00:23:30,328 నాకు నచ్చినట్లుగా ఉండడం నాకిష్టం 344 00:23:30,410 --> 00:23:33,250 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 345 00:23:33,330 --> 00:23:37,880 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 346 00:23:37,960 --> 00:23:39,960 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ