1 00:01:27,671 --> 00:01:29,047 ఓయ్! 2 00:01:45,063 --> 00:01:46,982 సాయం చేయండి! రండి! ఆ వలని పట్టుకోండి! 3 00:01:48,567 --> 00:01:51,945 జాషువా! జాషువా! జాషువా! 4 00:01:52,029 --> 00:01:54,781 జాషువా! త్వరగా! ఈదు! వచ్చేయ్! 5 00:02:05,792 --> 00:02:06,793 ఇంక ఫర్వా లేదు. 6 00:02:35,364 --> 00:02:38,158 శారా పెర్రీ నవల ఆధారంగా 7 00:02:54,508 --> 00:02:55,717 మేలుకొన్నావా? 8 00:02:57,719 --> 00:02:59,346 నువ్వు ఎక్కువసేపు పడుకున్నట్లే లేదు. 9 00:03:02,307 --> 00:03:04,977 అంతం లేదన్నట్లుగా అనిపించే కొన్ని రాత్రులలో ఇది ఒకటి. 10 00:03:11,525 --> 00:03:14,319 ఆ పిల్లలకు మరొక కాలక్షేపం లేదు. 11 00:03:14,403 --> 00:03:15,779 నేను వెళ్లకుండా ఉండాల్సింది. 12 00:03:15,863 --> 00:03:17,573 నువ్వు వాళ్లకి శిలాజాలు చూపించబోయావు. 13 00:03:17,656 --> 00:03:19,366 వాళ్లు అంతలా భయపడతారని ఊహించలేదు... 14 00:03:19,449 --> 00:03:21,994 ఆ తరగతి విద్యార్థులలో ఒకరు మరణించారు. వాళ్లంతా విషాదంలో ఉన్నారు. 15 00:03:22,077 --> 00:03:25,038 అది విషాదం కన్నా ఎక్కువ. వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. 16 00:03:26,540 --> 00:03:27,791 అది పూర్తిగా నా తప్పే. 17 00:03:39,386 --> 00:03:40,470 శుభోదయం. 18 00:03:42,472 --> 00:03:43,682 ఏమైనా మెరుగయిందా? 19 00:03:45,726 --> 00:03:48,478 జో, ఏదో ఒకటి మాట్లాడు. 20 00:03:48,562 --> 00:03:51,398 ఫర్వాలేదు, జో. నువ్వు తయారుగా ఉన్నప్పుడే మాట్లాడు. 21 00:03:53,025 --> 00:03:55,068 ఆ సర్పం ఆమె గొంతుని తీసుకుపోయింది. 22 00:03:55,152 --> 00:03:56,445 జాన్ రాన్సమ్. 23 00:04:02,743 --> 00:04:04,536 తను ఈ వారాంతం అంతా మౌనంగానే ఉంది. 24 00:04:04,620 --> 00:04:06,997 బహుశా మనం కోరాతో మాట్లాడాలి అనుకుంటా. 25 00:04:07,080 --> 00:04:08,957 అసలు అక్కడ ఏం జరిగిందో ఆమె చెప్పగలదు. 26 00:04:13,754 --> 00:04:15,631 లూక్ వస్తున్నట్లు ఏమైనా సంకేతాలు ఉన్నాయా? 27 00:04:16,130 --> 00:04:17,466 ఇంకా లేదు. 28 00:04:18,300 --> 00:04:20,677 నువ్వు క్రాక్నెల్ దగ్గరకు వెళ్లి మనకు పాలు తీసుకురావచ్చు కదా? 29 00:04:20,761 --> 00:04:22,012 నీకు దారి గుర్తుందా? 30 00:04:22,095 --> 00:04:23,222 నాకు గుర్తుంది. 31 00:04:24,306 --> 00:04:26,183 నీటి దగ్గరగా వెళ్లకు. 32 00:04:49,414 --> 00:04:50,415 అతను వచ్చేశాడు! 33 00:04:53,168 --> 00:04:56,046 -కోరా, ఎలా ఉన్నావు? -లూక్, నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. 34 00:04:56,129 --> 00:04:57,548 నువ్వు స్కూలుని చూడాలని నా కోరిక. 35 00:04:57,631 --> 00:04:59,258 -మనం నేరుగా అక్కడికి వెళితే ఫర్వాలేదా? -మరేం ఫర్వాలేదు. 36 00:05:03,720 --> 00:05:05,764 చాలా త్వరగా వచ్చినందుకు ధన్యవాదాలు. 37 00:05:05,848 --> 00:05:07,933 అవును. నీ ఉత్తరం అందిన వెంటనే బయలుదేరాను. 38 00:05:08,642 --> 00:05:10,519 ఇది జరిగినప్పటి నుండి నాకు నిద్ర లేదు. 39 00:05:11,854 --> 00:05:13,730 అది వినడానికి మంచిగా లేదు. 40 00:05:13,814 --> 00:05:15,315 అయితే ఖచ్చితంగా ఏం జరిగింది? 41 00:05:29,705 --> 00:05:32,583 ఇక్కడికి పాలు కొనడానికి వస్తే, నువ్వే స్వయంగా పాలు పితుక్కోవాలి. 42 00:05:36,962 --> 00:05:38,130 ఇక్కడికి రా. 43 00:05:49,224 --> 00:05:53,478 భయపడకు. నువ్వు భయపడితే అది కంగారు పడుతుంది. 44 00:05:55,814 --> 00:05:56,815 చూడు? 45 00:06:03,238 --> 00:06:05,866 హలో. హలో బుజ్జీ. 46 00:06:08,994 --> 00:06:12,831 అది ఒక అంటువ్యాధిలా వ్యాపించింది. వాళ్లంతా ఏదో దెయ్యం పట్టినట్లు ప్రవర్తించారు. 47 00:06:15,375 --> 00:06:17,753 కానీ నువ్వు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మవు కదా, కోరా. 48 00:06:19,338 --> 00:06:23,759 ఏదో జరిగింది. అది పిల్లలు ఆడుకుంటున్నట్లు అనిపించలేదు. 49 00:06:24,343 --> 00:06:27,638 సరే, కానీ బహుశా దీనికి ఒక హేతుబద్ధమైన వివరణ ఉండవచ్చు, కదా? 50 00:06:28,639 --> 00:06:29,640 అంటే ఎలా? 51 00:06:29,723 --> 00:06:32,601 సేలం మంత్రగత్తెల కేసు విచారణలో ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏమిటంటే 52 00:06:32,684 --> 00:06:36,230 వాళ్లు ఏదో విషాహారం తినడంతో వారి మెదళ్లలో రసాయనిక ప్రక్రియ మారిపోయింది అని. 53 00:06:37,314 --> 00:06:42,653 క్లవీసెప్స్ పుర్పురీయ. అది ఒక రకమైన బూజు. వరిమొక్క ఇంకా తృణధాన్యాల పైన అది పెరుగుతుంది. 54 00:06:43,695 --> 00:06:46,240 ఈ విషం భ్రమలకు ఇంకా మూర్ఛలకు కారణం అవుతుందా? 55 00:06:46,323 --> 00:06:49,993 అవును, ఖచ్చితంగా. అయితే, అది ఇంగ్లండ్ లో అంత సాధారణమైనది కాదు. 56 00:06:51,370 --> 00:06:53,497 ఇక్కడ జరిగినది కూడా ఏమీ సాధారణమైనది కాదు. 57 00:06:59,628 --> 00:07:02,339 నువ్వు స్వయంగా చూడవచ్చు. 58 00:07:15,102 --> 00:07:17,271 వాళ్ల మీద ఎవరో దాడి చేశారేమో అనిపించేలా ఉంది. 59 00:07:18,856 --> 00:07:21,066 నేను తిరిగి వచ్చి ఉంటే... 60 00:07:23,318 --> 00:07:24,319 మనం చూద్దామా? 61 00:07:36,248 --> 00:07:38,083 -మిసెస్ సీబోర్న్. -నా వస్తువులు తీసుకుంటున్నా. 62 00:07:38,166 --> 00:07:39,710 కానీ పిల్లలు వచ్చే లోగా నేను ఇదంతా శుభ్రం చేయాలి. 63 00:07:39,793 --> 00:07:41,211 కంగారు పడకండి. మేము వెళ్లిపోతున్నాము. 64 00:07:41,295 --> 00:07:44,256 -మరి నువ్వు ఎవరు? -లూక్ గారెట్. 65 00:07:44,339 --> 00:07:45,424 ఆయన ఒక వైద్యుడు. 66 00:07:45,507 --> 00:07:50,012 అవును. చిన్నారులకు ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. 67 00:07:50,095 --> 00:07:53,599 వాళ్లలో జ్వరాలు లేదా ముఖం ఉబ్బడం లాంటి లక్షణాలు కనిపించాయా? వాంతులు? 68 00:07:53,682 --> 00:07:55,350 లేదు. వాళ్లకు ఆ లక్షణాలు ఎందుకు ఉంటాయి? 69 00:07:55,976 --> 00:07:59,479 -నేను సులువుగా వివరించడానికి ప్రయత్నిస్తున్నాను... -నేను మొత్తంగా చెప్పదల్చుకున్నది ఏమిటంటే 70 00:07:59,563 --> 00:08:03,358 మీ నాస్తిక ఆలోచనలతో మీరు ఇక్కడికి రాకముందు వరకూ నా తరగతి చాలా బాగుంది. 71 00:08:06,153 --> 00:08:07,446 పదండి. 72 00:08:19,124 --> 00:08:20,125 జో. 73 00:08:23,462 --> 00:08:25,380 శుక్రవారంనాడు ఏం జరిగిందో నాకు తెలియదు. 74 00:08:28,967 --> 00:08:31,720 కానీ నాకు తెలిసింది ఏమిటంటే నువ్వు మాట్లాడకపోతే నేను నీకు ఏ సహాయమూ చేయలేను. 75 00:08:38,101 --> 00:08:39,227 నేను కోపగించుకోను. 76 00:08:59,581 --> 00:09:00,999 లోపలికి వెళ్లండి, ఇప్పుడు. 77 00:09:01,083 --> 00:09:03,961 అవును, అవును. సరే, మీరు చేయవలసింది అదే అయితే... 78 00:09:04,044 --> 00:09:05,045 వెళదాం పద. 79 00:09:12,261 --> 00:09:13,470 నువ్వు బాగానే ఉంటావు. 80 00:09:14,513 --> 00:09:15,597 నిన్ను తరువాత కలుస్తాను. 81 00:09:21,144 --> 00:09:22,563 ఏం జరిగిందో వాళ్లు నీకు చెప్పారా? 82 00:09:24,147 --> 00:09:27,234 చెప్పారు. జో మానసికంగా కుంగిపోయి ఉంది. 83 00:09:27,317 --> 00:09:29,319 నీకు చెప్పాలని ప్రయత్నించాను. 84 00:09:29,403 --> 00:09:32,322 పిల్లలకి స్థిరత్వం కావాలి. కొత్త ఆలోచనలు కాదు. 85 00:09:33,282 --> 00:09:34,283 వాళ్లు కోలుకుంటారు. 86 00:09:35,075 --> 00:09:36,702 వాళ్ల తల్లిదండ్రులు కూడా భయపడిపోయారు. 87 00:09:37,786 --> 00:09:39,913 అదృశ్య శక్తిని పిల్లలు పసిగట్టగలరని వాళ్లు అనుకుంటున్నారు. 88 00:09:40,747 --> 00:09:43,375 అదృశ్య శక్తి ఉందా? కానీ, నువ్వు వాళ్ల సందేహాలు నివృత్తి చేశావు అనుకున్నాను. 89 00:09:44,084 --> 00:09:47,754 మాథ్యూ, ప్రజల మధ్యన పుట్టే కల్పిత కథలను నిర్ధారణ చేయడం మంచిది కాదు. 90 00:09:47,838 --> 00:09:48,964 అయితే నువ్వు వినలేదన్నమాట? 91 00:09:50,382 --> 00:09:54,553 ఈ ఉదయం కొందరు జాలర్లు పడవలో దాడికి గురయ్యారు. వాళ్ల వలలు ముక్కులు ముక్కలయ్యాయి. 92 00:09:55,679 --> 00:09:58,599 నయోమి! ఇంటికి వెళ్లిపో! ఈ రోజు నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. 93 00:09:58,682 --> 00:10:01,435 -మాథ్యూ. -ఆమెను నేను అనుమతించను. తనే ఒక సమస్య. 94 00:10:04,188 --> 00:10:07,024 నయోమి. నయోమి, ఆగు. 95 00:10:11,653 --> 00:10:14,198 ఆమె ఇక్కడ ఉండటం అవసరం. తను ఈ మధ్యనే తన అక్కని పోగొట్టుకుంది. 96 00:10:16,074 --> 00:10:19,036 ఇది నా స్కూల్. నన్ను క్షమించు. 97 00:10:43,977 --> 00:10:45,270 నేను చాలా మూర్ఖంగా వ్యవహరించాను. 98 00:10:46,522 --> 00:10:47,648 లేదు. 99 00:10:49,149 --> 00:10:50,901 నేను వాళ్లని శాంతింపజేయగలను అనుకున్నాను. 100 00:10:50,984 --> 00:10:55,155 అలా వాళ్ల సర్పం గురించి హేతుబద్ధమైన వివరణను ఆ పిల్లలు తెలుసుకుంటారు అనుకున్నాను. 101 00:10:55,239 --> 00:10:57,282 ఆ సముద్రంలో అలాంటి ఒక జీవి ఉందని నిజంగా నమ్ముతున్నావా? 102 00:11:00,953 --> 00:11:02,496 అవును, నేను అదే అనుకుంటున్నాను. 103 00:11:07,292 --> 00:11:09,294 నీ వ్యక్తిగత విషయం గురించి ఒక ప్రశ్న అడగనా? 104 00:11:11,380 --> 00:11:13,173 అది నీ కలల్లోకి వస్తోందా? 105 00:11:20,848 --> 00:11:22,224 నేను అదే అనుకున్నాను. 106 00:11:22,307 --> 00:11:23,934 అదంతా నా మనసులో ఉందని అనుకుంటున్నావా? 107 00:11:24,977 --> 00:11:26,270 నువ్వు దుఃఖంలో ఉన్నావని అనుకుంటున్నాను. 108 00:11:29,231 --> 00:11:33,026 డార్విన్ ఇంకా లాయెల్ లాంటి మార్గదర్శకులు రూపొందించిన సిద్ధాంతాలు ఇవి. 109 00:11:33,110 --> 00:11:35,028 ఇంకా ఆ జంతువుని స్థానిక ప్రజలు రెండు వందల సంవత్సరాలుగా 110 00:11:35,112 --> 00:11:37,155 -చూస్తున్నారు. -మంచిది. 111 00:11:37,823 --> 00:11:38,824 అవును. 112 00:11:38,907 --> 00:11:40,325 అదిగో చూడు. 113 00:11:40,409 --> 00:11:42,119 -ఏంటి? -నీ అభిరుచి. 114 00:11:42,619 --> 00:11:44,371 అయితే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా? 115 00:11:44,454 --> 00:11:45,956 నేనేం అనుకుంటున్నాను అనేది ముఖ్యం కాదు. 116 00:11:47,666 --> 00:11:50,085 నాకు తెలిసిందల్లా కష్టపడకపోతే నువ్వు నిజం తెలుసుకోలేవు. 117 00:11:51,378 --> 00:11:53,881 నీ మీద నీకు నమ్మకం పెంచుకుని వెళ్లి నీ పని నువ్వు చేసుకో. 118 00:12:29,833 --> 00:12:30,834 విల్. 119 00:12:32,252 --> 00:12:34,338 ఎలా ఉన్నారు? జో ఎలా ఉంది? 120 00:12:35,088 --> 00:12:36,173 మీకు అంతరాయం కలిగిస్తున్నానేమో. 121 00:12:36,256 --> 00:12:38,091 లేదు, అస్సలు లేదు. లోపలికి వస్తారా విల్? 122 00:12:44,014 --> 00:12:46,767 -అది పడవా? ఎటువంటి పడవ? -సరే, అది ఎంత దూరం? 123 00:12:47,351 --> 00:12:49,853 మా స్నేహితుడు, లూక్ గారెట్, లండన్ నుంచి వచ్చారు. లోపలికి వచ్చి అతడిని కలవండి. 124 00:12:49,937 --> 00:12:52,439 లేదు, లేదు, నేను విందుకు వెళ్లాలి. 125 00:12:52,523 --> 00:12:55,025 నేను కేవలం మీరు బాగానే ఉన్నారో లేదో చూడటానికి వచ్చాను. 126 00:12:55,734 --> 00:12:58,654 స్కూలులో జరిగిన దాని గురించి పిల్లలు నాకు చెప్పారు. 127 00:12:58,737 --> 00:13:01,865 ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. కానీ జో ఎలా ఉంది? 128 00:13:02,783 --> 00:13:05,827 -తను... -కోరా? నువ్వు రావాలి. 129 00:13:06,787 --> 00:13:12,167 నేను మీకు అంతరాయం కలిగిస్తున్నాను. బహుశా మనం రేపు మాట్లాడుకుందామా? 130 00:13:12,751 --> 00:13:14,378 అలాగే. ఉంటాను. 131 00:13:16,505 --> 00:13:17,506 ఆగండి. 132 00:13:20,259 --> 00:13:21,260 అతను ఎవరు? 133 00:13:22,261 --> 00:13:23,428 విల్ రాన్సమ్. 134 00:13:24,429 --> 00:13:26,640 ఆ పెద్ద గొంతుక ఉన్న వృద్ధ మతగురువా? 135 00:13:30,143 --> 00:13:32,396 ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు. 136 00:13:32,479 --> 00:13:36,233 -నేను చెప్పదల్చుకున్నది అది కాదు... -లేదు, అది పొరపాటు. నేను వాళ్లని భయపెట్టాను. 137 00:13:37,734 --> 00:13:39,194 ఇదంతా మీరు ప్రారంభించలేదు. 138 00:13:39,945 --> 00:13:42,072 నేనే చేశాను అని రాత్రంతా మెలకువగా ఉండి ఆలోచిస్తూ ఉన్నాను. 139 00:13:43,866 --> 00:13:46,535 కొన్నిసార్లు అర్ధరాత్రుళ్లు మనకి అబద్ధాలు చెబుతాయి. 140 00:13:48,287 --> 00:13:49,496 అవును. 141 00:13:54,168 --> 00:13:58,088 జోకి ఎలా సహాయపడగలమో మీ దగ్గర ఏదైనా ఉపాయం ఉండవచ్చని స్టెల్లా అనుకుంది. 142 00:14:00,257 --> 00:14:01,633 ఇది చాలా విచిత్రంగా ఉంది, కోరా. 143 00:14:03,343 --> 00:14:04,887 తను మాట్లాడలేకపోతోంది. 144 00:14:04,970 --> 00:14:06,471 ఏంటి? 145 00:14:06,555 --> 00:14:07,681 తను భయంతో ఉంది. 146 00:14:11,852 --> 00:14:14,938 నా స్నేహితుడు లూక్ ఒక వైద్యుడు. అతను వచ్చి జో తో మాట్లాడగలడు. 147 00:14:20,944 --> 00:14:24,448 ధన్యవాదాలు. అలాగే. అది నిజంగానే మేలు చేస్తుంది. 148 00:14:26,992 --> 00:14:31,496 సరే, మీరు మీ అతిథి దగ్గరకు వెళ్లడం మంచిది అనుకుంటాను. 149 00:14:32,706 --> 00:14:33,874 అవును. 150 00:14:35,083 --> 00:14:36,335 మీరు కోటు వేసుకోకుండానే వచ్చారా? 151 00:14:49,598 --> 00:14:50,599 ధన్యవాదాలు. 152 00:14:54,937 --> 00:14:56,063 వీడ్కోలు. 153 00:14:56,146 --> 00:14:57,147 ఉంటాను. 154 00:15:25,926 --> 00:15:27,177 డ్రింక్? 155 00:15:30,806 --> 00:15:35,102 ఈ సీసాని శనివారంనాడు నీ పుట్టినరోజు కోసం దాచి ఉంచానని మార్తా చెబుతోంది. 156 00:15:35,853 --> 00:15:37,020 నాకు ఎందుకు చెప్పలేదు? 157 00:15:37,104 --> 00:15:40,023 -పుట్టినరోజులంటే ఎవరికి ఇష్టం? -అందరికీ పుట్టినరోజులు, పార్టీలు అంటే ఇష్టం... 158 00:15:42,317 --> 00:15:43,652 నేను ఎప్పుడూ పార్టీ చేసుకోలేదు. 159 00:15:44,444 --> 00:15:45,487 నేను నిన్ను నమ్మను. 160 00:15:47,072 --> 00:15:48,657 మైఖేల్ పార్టీలు చేసుకునేవాడు. 161 00:15:49,867 --> 00:15:54,830 జనం తాగేవారు, దర్పం ప్రదర్శించేవారు. అలాగే అతను నాకు కూడా దర్పం చూపించేవాడు. 162 00:15:54,913 --> 00:15:58,208 అయితే, ఇప్పుడు మనం కూడా ఒక పార్టీ చేసుకోవాలి. 163 00:15:58,792 --> 00:16:02,254 ఈ శనివారం, నీ పుట్టినరోజు సందర్భంగా నేను పార్టీ ఇస్తున్నాను. 164 00:16:15,475 --> 00:16:17,519 విల్ నిజంగా జో గురించి ఆందోళనగా ఉన్నాడు. 165 00:16:18,353 --> 00:16:21,273 నువ్వు ఆమెను పరీక్షిస్తావని చెప్పాను. నువ్వు ఏమీ అనుకోవు అని ఆశిస్తాను. 166 00:16:21,857 --> 00:16:25,360 ఖచ్చితంగా అనుకోను. నేను హిప్నాసిస్ ప్రయత్నిస్తాను. 167 00:16:25,444 --> 00:16:28,906 నువ్వు జోని సమ్మోహపరుస్తావా? అది ప్రమాదకరం కాదా? 168 00:16:28,989 --> 00:16:32,034 లేదు. ఒక ఆస్టిన్ వైద్యుడి పరిశోధనల్ని నేను చదువుతున్నాను. 169 00:16:32,117 --> 00:16:33,327 అతను వైద్య ప్రక్రియనే అనుసరిస్తాడు. 170 00:16:33,410 --> 00:16:35,954 పేషంట్లు అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి ఆయన సహకరిస్తాడు. 171 00:16:36,038 --> 00:16:38,707 వాళ్ల అంతరాంతరాలలోని భయాలను, గోప్యమైన కోరికలు లాంటి వాటిని వెలికి తీస్తాడు. 172 00:16:39,208 --> 00:16:40,751 అది క్షేమమైనదేనా? 173 00:16:40,834 --> 00:16:44,087 ఖచ్చితంగా. నేను నీకు రుజువు చేయగలను. 174 00:16:47,591 --> 00:16:49,676 నా తల లోపల ఉన్నదంతా అన్వేషించాలని గట్టిగా నిర్ణయించుకున్నావా? 175 00:16:52,554 --> 00:16:53,680 అది కేవలం ఒక ఆలోచన. 176 00:16:56,433 --> 00:16:58,101 సరే, నేను ఏం చేయాలి? 177 00:16:58,602 --> 00:17:03,941 ఏమీ లేదు. నిజంగా. ఉన్న చోటే అలా వెనక్కి వాలు. 178 00:17:18,163 --> 00:17:19,164 ఇప్పుడు... 179 00:17:20,499 --> 00:17:22,209 నేను ఇదంతా చేయలేనేమో. 180 00:17:22,291 --> 00:17:24,586 కానీ, హిప్నాసిస్ లో ఉన్న గొప్పతనమే అది. నువ్వు ప్రయత్నించనక్కరలేదు. 181 00:17:25,587 --> 00:17:26,839 నేను చెప్పింది అలా అనుసరించు చాలు. 182 00:17:28,674 --> 00:17:29,675 నేను నిన్ను నమ్ముతాను. 183 00:17:32,511 --> 00:17:34,429 దీర్ఘంగా, స్థిరంగా శ్వాస పీల్చు. 184 00:17:36,682 --> 00:17:38,267 నిన్ను నువ్వు తేలిక పర్చుకో. 185 00:17:39,810 --> 00:17:42,688 నీ అవయవాలు భారంగా ఉన్నాయి. 186 00:18:11,175 --> 00:18:12,176 తేలికపడు. 187 00:18:13,760 --> 00:18:15,888 నీ భయాలు అన్నీ వదిలేయ్. 188 00:18:18,473 --> 00:18:20,809 నీ కోరికలకు లొంగిపో. 189 00:18:35,574 --> 00:18:38,785 నీ పని నువ్వు చేసుకో అని నేను అన్నప్పుడు, నేను నా గురించి చెప్పలేదు. 190 00:18:39,786 --> 00:18:40,829 ఇంకా ఎంత దూరం అది? 191 00:18:45,626 --> 00:18:48,170 ఇక్కడ దొరికే కొన్ని అవశేషాలు కొన్ని వేల సంవత్సరాలుగా ఎవరి కంటా పడలేదు, 192 00:18:48,253 --> 00:18:50,339 బహుశా లక్షల సంవత్సరాలుగా. 193 00:18:53,175 --> 00:18:57,304 దాని లోపల రక్తం ప్రవహించకపోతే, నాకు ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంటుంది. 194 00:18:59,890 --> 00:19:01,767 నాకు ఈ శిలాజాలు తపాలా ద్వారా వచ్చేవి. 195 00:19:02,935 --> 00:19:05,729 వాటికి కాగితాలు తగిలించి ప్రదర్శన డబ్బాలో పెట్టేదానిని. 196 00:19:07,898 --> 00:19:10,943 ఆ పెద్ద భవంతిలో నేను కలిసినప్పటి కంటే ఇప్పుడు చాలా భిన్నంగా కనిపిస్తున్నావు. 197 00:19:27,543 --> 00:19:28,669 లూక్! 198 00:19:29,169 --> 00:19:30,295 ఇది ఏంటి? 199 00:19:34,508 --> 00:19:36,844 డోర్సెట్ ప్రాంతంలో ఆనింగ్ అనే పరిశోధకురాలు కనుగొన్న వెన్నుపూస మాదిరిగా ఉంది. 200 00:20:30,647 --> 00:20:31,899 ఇక్కడ ఏం జరిగింది? 201 00:20:31,982 --> 00:20:33,400 ఆ జంతువు వలని ముక్కలు చేసింది. 202 00:20:33,483 --> 00:20:35,444 -జాలర్లను దాదాపు బోటు నుండి పడవేయబోయింది. -ఏం చేసింది? 203 00:20:35,527 --> 00:20:37,905 -అది అందరినీ చంపేసి ఉండేది. -నీటిలో ఏదైనా ఉందా? 204 00:20:37,988 --> 00:20:39,740 మీరు చూశారా? అది ఎలా ఉంటుంది? 205 00:20:39,823 --> 00:20:42,367 బహుశా మీరే మాకు చెబుతారా? దాని గురించి మీకు చాలా బాగా తెలుసు అనుకుంటా. 206 00:20:42,451 --> 00:20:43,577 ఏంటి? లేదు, నేను... 207 00:20:43,660 --> 00:20:46,705 నువ్వు మా అమ్మాయి క్లాస్ రూమ్ కి వెళ్లినప్పటి నుంచి తనకు పీడకలలు వస్తున్నాయి. 208 00:20:46,788 --> 00:20:48,415 మిసెస్ సీబోర్న్ మీకు సహాయం చేయడానికే వచ్చింది. 209 00:20:48,498 --> 00:20:49,666 నేను వాళ్లని భయపెడితే క్షమించండి. 210 00:20:49,750 --> 00:20:52,419 -భయపెట్టావా? వాళ్లని ఏం చేశావు? -మనం ఇంక వెళ్లాలి. 211 00:20:54,254 --> 00:20:56,715 ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలియదు, మేం పట్టించుకోము కూడా. 212 00:20:56,798 --> 00:21:03,305 కానీ నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే, అది ఏమైనా సరే, దయచేసి ఆపేయ్. 213 00:21:24,618 --> 00:21:25,619 నాన్నా? 214 00:22:06,869 --> 00:22:09,371 -మా నాన్నని చూశావా? -అవును, అతను ఇప్పుడే వెళ్లాడు. 215 00:22:22,176 --> 00:22:23,468 నిజానికి, నేను ఒక బీర్ తాగుతాను. 216 00:22:25,679 --> 00:22:26,930 అలాగే. 217 00:22:40,569 --> 00:22:43,447 -నయోమి. -శామ్యూల్. 218 00:22:56,710 --> 00:22:58,086 వలలు గురించి విన్నావా? 219 00:23:00,214 --> 00:23:01,215 అవును. 220 00:23:07,262 --> 00:23:09,473 కానివ్వు. తాగు. తాగు. 221 00:23:11,183 --> 00:23:12,226 మన కోసం మరొకటి తీసుకువస్తాను. 222 00:23:25,531 --> 00:23:28,242 మరేం ఫర్వా లేదు. నేను ఉన్నాను. 223 00:23:36,625 --> 00:23:37,626 -నాకు నొప్పి కలిగిస్తున్నావు. -ఇలా రా. 224 00:23:38,961 --> 00:23:40,003 నాకు నొప్పి కలిగిస్తున్నావు. 225 00:23:45,759 --> 00:23:48,178 -వద్దు. -ఇలా రా. 226 00:23:50,764 --> 00:23:52,724 ఆపు. ఇలా చేయడం పాపం. 227 00:23:53,225 --> 00:23:55,686 మీ అక్కలాగా నువ్వు కూడా తిరుగుబోతువి అనుకున్నాను. 228 00:24:06,363 --> 00:24:09,157 క్షమించు, ఫాదర్. క్షమించు. 229 00:24:45,694 --> 00:24:48,447 ఆ సర్పం. దెయ్యంలా ప్రవర్తిస్తోంది. 230 00:24:49,198 --> 00:24:50,616 మా ఆత్మల కోసం ప్రార్థన చేయండి, ఫాదర్. 231 00:24:51,325 --> 00:24:52,826 మనం ప్రార్థన కన్నా ఎక్కువే చేయాలి. 232 00:25:03,170 --> 00:25:06,632 కోరా. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 233 00:25:07,841 --> 00:25:09,176 -హలో, మార్తా. -హలో. 234 00:25:09,718 --> 00:25:11,178 స్టెల్లా, ఇతను లూక్ గారెట్. 235 00:25:11,762 --> 00:25:12,930 లూక్, ఈవిడ స్టెల్లా రాన్సమ్. 236 00:25:13,013 --> 00:25:15,307 డాక్టర్ గారెట్, మిమ్మల్ని కలవడం ఎంతో గొప్పగా ఉంది. 237 00:25:16,433 --> 00:25:17,476 లోపలికి రండి. 238 00:25:17,559 --> 00:25:19,853 ఇల్లంతా చిందరవందరగా ఉంది, దయచేసి క్షమించండి. 239 00:25:20,354 --> 00:25:22,940 ఇంటి పనులు పూర్తి చేయడానికి నేను కష్టపడుతున్నాను. 240 00:25:26,777 --> 00:25:28,362 విల్ తన గదిలో ఉన్నారా? 241 00:25:29,071 --> 00:25:33,116 ఒక పారిషకుడిని కలవడానికి వెళ్లి ఉంటారు. మిమ్మల్ని కలవలేకపోయినందుకు బాధపడతారు. 242 00:25:40,082 --> 00:25:41,083 హలో. 243 00:25:44,962 --> 00:25:47,381 సరే, ఈ శనివారంనాడు కోరా పార్టీకి మీరు అందరూ రావాలి. 244 00:25:47,464 --> 00:25:49,675 ఆ రోజు తన పుట్టినరోజు. ఆమె కోసం ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. 245 00:25:49,758 --> 00:25:50,759 విందుకు హాజరవ్వడం మాకు సంతోషమే. 246 00:25:52,469 --> 00:25:53,846 మా కోసం టీ చేస్తావా? 247 00:26:02,437 --> 00:26:03,522 ఆమె ఎలా ఉంది? 248 00:26:04,815 --> 00:26:05,858 మౌనంగా ఉంది. 249 00:26:08,026 --> 00:26:09,069 ఇది చాలా భయంగా ఉంది. 250 00:26:10,112 --> 00:26:12,489 పాపం అమాయకురాలు. భయపడిపోయింది. 251 00:26:15,200 --> 00:26:16,827 దయచేసి, కూర్చోండి. 252 00:26:24,918 --> 00:26:26,587 మీ అభిప్రాయం ఏమిటి, డాక్టర్ గారెట్? 253 00:26:29,047 --> 00:26:30,632 అపస్మారక స్థితి గురించి మీరు విన్నారా? 254 00:26:30,716 --> 00:26:31,758 లేదు. 255 00:26:32,968 --> 00:26:38,640 అది మన అంతరంగంలోని ఆలోచనలు ఇంకా భయాలు. 256 00:26:38,724 --> 00:26:44,146 మనం వాటిని నియంత్రించలేము, కానీ అవి మన మీద, మన ప్రవర్తన మీద ప్రభావం చూపుతాయి. 257 00:26:46,273 --> 00:26:49,443 అది వినడానికి భయంకరంగా ఉంటుంది. కానీ మెదడు పని చేసే తీరు అది, నేను హామీ ఇస్తున్నాను. 258 00:26:50,194 --> 00:26:54,948 నేను ఏం చేయదల్చుకున్నాను అంటే, జో ని ఒక విశ్రాంతి స్థితిలో ఉంచుతాను, 259 00:26:55,032 --> 00:26:59,286 దానితో ఆమె తనలోని ఆలోచనల్ని బయటపెట్టి తనని ఏమేం ఇబ్బంది పెడుతున్నాయో చెబుతుంది. 260 00:26:59,786 --> 00:27:01,538 దీని పేరు హిప్నాసిస్. 261 00:27:06,335 --> 00:27:07,336 ధన్యవాదాలు. 262 00:27:12,591 --> 00:27:16,845 నీ ఇబ్బందిని తొలగించడానికి డాక్టర్ గారెట్ ఒక కొత్త వైద్య ప్రక్రియను ప్రయత్నిస్తున్నారు. 263 00:27:18,222 --> 00:27:19,932 దాని పేరు హిప్నాసిస్. 264 00:27:20,599 --> 00:27:21,683 ఖచ్చితంగా. 265 00:27:27,147 --> 00:27:32,069 అద్భుతం. సరే, మనం ఈ గదిని కొద్దిగా సర్ది కర్టెన్లు మూసివేయాలి. 266 00:27:35,197 --> 00:27:38,075 మనం విల్ కోసం వేచి ఉండనవసరం లేదా? జో గనుక నా కూతురే అయితే... 267 00:27:38,158 --> 00:27:39,868 నువ్వు ఒక మగవాడి అనుమతి కోసం ఎదురు చూస్తావా? 268 00:27:45,874 --> 00:27:48,335 నేను ఫ్రాంకీ కోసం తిరిగి వెళ్లాలి. నేను జారుకుంటాను. 269 00:27:57,261 --> 00:27:59,513 క్షమించండి, ఈ ఫ్లూ ని నేను వదిలించుకోలేకపోతున్నాను. 270 00:28:19,992 --> 00:28:23,787 దయచేసి, దేవుడా. మమ్మల్ని అందరినీ కాపాడు. 271 00:28:25,122 --> 00:28:27,416 మమ్మల్ని అందరినీ కాపాడు. మమ్మల్ని క్షేమంగా ఉంచు. 272 00:28:28,125 --> 00:28:29,126 మాథ్యూ. 273 00:28:31,879 --> 00:28:33,213 క్షమించు. 274 00:28:35,007 --> 00:28:36,341 నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలియదు... 275 00:28:37,217 --> 00:28:38,218 ఇది నీ చర్చ్. 276 00:28:40,053 --> 00:28:41,054 మాథ్యూ. 277 00:28:43,640 --> 00:28:45,517 -నువ్వు కలత చెంది ఉన్నావు. -నేను కలత పడలేదు. 278 00:28:45,601 --> 00:28:46,810 నాతో కాసేపు కూర్చో. 279 00:29:06,955 --> 00:29:10,542 దేవుడితో ఒక మనిషి చేసే సంభాషణలు అతని సొంత విషయం తప్ప మరెవ్వరికీ సంబంధం ఉండదు. 280 00:29:10,626 --> 00:29:13,795 కానీ మనం ఒకరి పట్ల ఒకరం విశ్వాసంతో ఉండాలి. అది మనకు మేలు చేస్తుంది. 281 00:29:13,879 --> 00:29:15,672 -ఇలాంటి విషయాలలో నువ్వు గొప్పగా చేస్తావు. -ఏ విషయాలు? 282 00:29:15,756 --> 00:29:18,800 ఇదే. ఇంత అలవోకగా మాట్లాడగలవు, 283 00:29:18,884 --> 00:29:21,887 ఎదుటివారు మాట్లాడేది చాలా ముఖ్యమైనది అన్నట్లుగా నమ్మించగలవు, 284 00:29:22,679 --> 00:29:24,473 వాటిని నువ్వు పట్టించుకుంటున్నట్లు భ్రమింపచేయగలవు. 285 00:29:25,641 --> 00:29:28,018 -నేను కేవలం... -నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వేం ఆలోచిస్తావో తెలుసు. 286 00:29:29,811 --> 00:29:32,272 కట్టు కథలు నమ్మేవాడిలా నన్ను చూస్తావు. 287 00:29:32,898 --> 00:29:36,693 -లేదు. లేదు, నేను అనుకునేది అది కాదు. -నీకు అర్థం కాదు. 288 00:29:39,071 --> 00:29:41,156 నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టి నీటిలోకి వెళ్లడం లేదు. 289 00:29:42,324 --> 00:29:44,785 మనల్ని కబళించడానికి ఏదో వస్తోందన్న భయంతో 290 00:29:44,868 --> 00:29:47,621 -నీ పిల్లలు మంచాల మీద పడుకుని ఏడవడం లేదు. -నా పిల్లలు... 291 00:30:01,218 --> 00:30:03,178 గ్రేసీ మరణం ఒక విషాదం. 292 00:30:05,931 --> 00:30:08,559 అది అందరినీ చాలా లోతుగా కదిలించింది, కానీ అదే సూచనని మళ్లీ చేయడం అనేది 293 00:30:08,642 --> 00:30:11,103 -అంత మేలు చేయదు అని... -చెప్పు. నాకు మళ్లీ ఇదంతా వివరించు. 294 00:30:11,186 --> 00:30:14,231 గ్రేసీ బ్యాంక్స్ శరీరం మీద గోళ్ల రక్కుళ్ల గురించి వివరించు. 295 00:30:14,314 --> 00:30:17,359 పడవల మీద దాడుల గురించి వివరించు. మీ అమ్మాయి మౌనంగా ఎందుకు ఉందో చెప్పు! 296 00:30:19,152 --> 00:30:21,363 ఆ బాధ నీలో కూడా ఉందని నీ ముఖంలో నాకు కనిపిస్తోంది. 297 00:30:26,285 --> 00:30:30,956 దేవుని రక్షణలో ఎలా ఉండాలో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత నీది. 298 00:30:32,833 --> 00:30:34,710 ప్రజలను క్షేమంగా ఉంచాల్సిన బాధ్యత నీది. 299 00:31:22,132 --> 00:31:28,055 "కాబట్టి మనం భయపడము, జలాలు గర్జించినా, మనల్ని ఇబ్బందులు పెట్టినా." 300 00:32:05,801 --> 00:32:09,763 ...ఎప్పుడూ ప్రశాంతంగా ఉండు. నా స్వరం గ్రహిస్తూ ఉండు. 301 00:32:10,264 --> 00:32:13,433 నీ అవయవాలు భారంగా ఉన్నాయి. 302 00:32:16,728 --> 00:32:18,772 జో, నా గొంతు విను. 303 00:32:20,607 --> 00:32:24,111 నా వైపు జరుగు చిన్నారి. నా గొంతు నీకు వినిపిస్తోందని నాకు తెలిసేలా చెప్పు. 304 00:32:26,697 --> 00:32:30,492 జో. ఎలా జరిగిందో నాకు చెప్పగలవా... 305 00:32:31,493 --> 00:32:32,703 ఆ సర్పం. 306 00:32:36,415 --> 00:32:39,042 -నాకు భయంగా ఉంది. -నువ్వు క్షేమంగా ఉన్నావు, జో. 307 00:32:40,586 --> 00:32:42,212 భయపడవలసిన అవసరం లేదు. 308 00:32:43,630 --> 00:32:46,592 కానీ ఆ క్లాస్ రూమ్ లో జరిగిన ఘటన నిన్ను కలత పెట్టింది, అవునా? 309 00:32:46,675 --> 00:32:47,885 నేను దానిని ఆపి ఉండాల్సింది. 310 00:32:49,636 --> 00:32:52,222 నువ్వు ఏ తప్పు చేయలేదని నువ్వు అర్థం చేసుకున్నావా? 311 00:32:55,309 --> 00:32:56,518 మేము మంత్రాన్ని ప్రయోగించాము. 312 00:32:58,228 --> 00:32:59,479 దానిని ఇక్కడికి తెచ్చాము. 313 00:33:01,315 --> 00:33:02,649 దేనిని ఇక్కడికి తెచ్చారు? 314 00:33:03,275 --> 00:33:06,028 మరేం ఫర్వాలేదు. నీకు కావలసిన సమయం తీసుకో. 315 00:33:08,739 --> 00:33:10,449 అది ఒక రహస్యంగా ఉంచాలి. 316 00:33:10,532 --> 00:33:12,826 అది ఏ రహస్యం, జో? 317 00:33:14,536 --> 00:33:15,537 ఆ మంత్రం. 318 00:33:17,039 --> 00:33:18,081 మేము చేసిన ఆ మంత్ర ప్రయోగం. 319 00:33:18,832 --> 00:33:20,167 లూక్. 320 00:33:20,250 --> 00:33:25,756 జో, నా మాటని వింటూ ఉండు. భయపడవలసిన అవసరం లేదు. 321 00:33:26,882 --> 00:33:29,510 ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. నయోమి దానిని లోపలికి రానిచ్చింది. 322 00:33:30,344 --> 00:33:31,345 నేను లోపలికి రానిచ్చాను. 323 00:33:32,596 --> 00:33:33,597 అది... 324 00:33:34,097 --> 00:33:35,891 -అది మనలో ఉంది. -జో. 325 00:33:36,517 --> 00:33:37,518 జో. 326 00:33:40,395 --> 00:33:42,022 ఆపండి. 327 00:33:43,148 --> 00:33:44,149 జో. 328 00:33:46,944 --> 00:33:49,154 -ఇది ఏంటి? -విల్. ఇతను నా స్నేహితుడు. 329 00:33:49,238 --> 00:33:51,490 -డాక్టర్ లూక్ గారెట్. -గౌరవనీయులైన రాన్సమ్... 330 00:33:52,741 --> 00:33:54,117 నా కూతురిని ఏం చేస్తున్నావు? 331 00:33:54,201 --> 00:33:56,286 మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను ఆమెకు సహాయం చేస్తున్నాను. 332 00:33:56,370 --> 00:33:59,289 -మీ భార్య నాకు అనుమతి ఇచ్చారు... -విల్, అతను మా స్నేహితుడు. 333 00:33:59,373 --> 00:34:02,709 -కోరా స్నేహితుడు. ఆయనని వదిలేయ్. -ఇది నా ఇల్లు. నీకెంత ధైర్యం! 334 00:34:02,793 --> 00:34:05,546 మీరు పొరబడుతున్నారు. ఆయనని వదిలేయండి. ఇప్పుడే. 335 00:34:10,425 --> 00:34:13,178 ఇది చాలా పరిశోధించిన వైద్య ప్రక్రియ అని నేను హామీ ఇస్తున్నాను. 336 00:34:14,429 --> 00:34:15,472 మీరు నా సహాయం కోరారు. 337 00:34:15,556 --> 00:34:16,556 నాన్నా... 338 00:34:18,934 --> 00:34:20,226 నేను బాగున్నాను. 339 00:34:23,105 --> 00:34:24,147 మనం వెళదాం. 340 00:34:24,231 --> 00:34:26,567 కోరా, వద్దు. ఇది కేవలం అపార్థం. 341 00:34:27,067 --> 00:34:28,110 ధన్యవాదాలు, స్టెల్లా. 342 00:34:45,627 --> 00:34:46,628 నన్ను మన్నించండి. 343 00:34:49,630 --> 00:34:51,632 -నీకు దెబ్బలు ఏమైనా తగిలాయా? -నేను బాగానే ఉన్నాను. 344 00:34:51,717 --> 00:34:53,217 సరే, నన్ను క్షమించు. 345 00:34:53,302 --> 00:34:55,512 అతను ఇలా ప్రవర్తించాడంటే నేను నమ్మలేకపోతున్నాను. 346 00:34:56,179 --> 00:34:58,307 అది పని చేసింది. ఆమె మళ్లీ మాట్లాడుతోంది. 347 00:35:13,030 --> 00:35:15,365 ఈ మంటలు చీకటిని తరిమికొట్టు గాక. 348 00:35:16,283 --> 00:35:17,951 మనల్ని పాపాల నుండి రక్షించు గాక. 349 00:35:18,493 --> 00:35:19,828 సరే. మంటలు రగిలించండి. 350 00:35:27,544 --> 00:35:28,962 నాకు వైన్ కావాలి. 351 00:35:29,630 --> 00:35:30,756 ఏం జరిగింది? 352 00:35:31,507 --> 00:35:35,677 విల్ ఇంటికి వచ్చాడు, కానీ సంతోషించలేదు అని చెప్పుకోవచ్చు. 353 00:35:37,221 --> 00:35:38,722 -అతను నా మీద దాడి చేశాడు. -ఏంటి? 354 00:35:38,805 --> 00:35:40,849 ఎవ్వరూ ఎవరి మీదా దాడి చేయలేదు. అతను లోపలికి వచ్చాడు, 355 00:35:40,933 --> 00:35:43,936 జో కి దగ్గరగా లూక్ వంగుతూ కనిపించాడు, దాంతో అతను అతిగా స్పందించాడు. 356 00:35:44,436 --> 00:35:48,815 ఆమె పట్ల అతను భయంతో ఉండి ఉంటాడు. నువ్వు అతనికి వివరించావా? 357 00:35:48,899 --> 00:35:51,443 -అతనిని క్షమాపణలు అడిగావా? -కానీ, స్టెల్లా, నేనూ అక్కడే ఉన్నాం. 358 00:35:51,527 --> 00:35:55,280 మనుషులని మైమరచిపోయేలా చేయడం నేను చూశాను. అది విచిత్రంగా అనిపిస్తుంది. అది విచిత్రమైనదే. 359 00:35:55,364 --> 00:35:57,699 అది హిప్నాసిస్. అది పని చేసింది కూడా. 360 00:35:59,493 --> 00:36:02,162 -కానీ వెళ్లకు. మాతో పాటు ఉండు. -నేను దీనిని పూర్తి చేయాలి. 361 00:36:02,246 --> 00:36:04,122 -ఎవరికి లేఖ రాస్తున్నావు? -స్పెన్సర్. 362 00:36:06,124 --> 00:36:09,169 మీ పేషంట్, నెవ్ ఇంకా అతని చుట్టుపక్కల వాళ్లకీ సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. 363 00:36:09,253 --> 00:36:11,380 ఫ్రాంకీ, ఎలా ఉన్నావు? నీ రోజు ఎలా గడిచింది? 364 00:36:11,463 --> 00:36:14,007 లండన్ కన్నా ఈ ఊరు నాకు చాలా బాగా నచ్చింది. 365 00:36:14,550 --> 00:36:16,176 నాకు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని ఉంది. 366 00:36:16,760 --> 00:36:19,972 సరే అయితే, మనం ఇక్కడ ఎక్కువ కాలం స్థిరపడిపోయినట్లు ఉన్నాం, మార్తా. 367 00:36:21,849 --> 00:36:24,059 ఇలా రా. నువ్వు గొర్రె వాసన కొడుతున్నావు. 368 00:36:24,142 --> 00:36:26,186 -నేను కాదు. -నువ్వు ఆ వాసన వేస్తున్నావు. 369 00:36:26,270 --> 00:36:29,439 లండన్ ని వదలడం వల్ల ఎప్పుడూ ఎవ్వరికీ ఏ మంచీ జరగలేదు, కోరా. 370 00:37:37,090 --> 00:37:38,634 నా పట్ల కూడా నువ్వు కోపంగా ఉన్నావా? 371 00:37:40,010 --> 00:37:41,512 నేను కోపంగా ఉన్నా నువ్వు పట్టించుకుంటావా? 372 00:37:42,429 --> 00:37:43,680 నేను పట్టించుకుంటాను అని నీకు తెలుసు. 373 00:37:48,352 --> 00:37:52,314 ఇది చాలా చిరాకుగా ఉంది. నేను ఎవ్వరినీ కలతకు గురి చేయాలని ప్రయత్నించడం లేదు. 374 00:37:54,149 --> 00:37:55,609 నువ్వు విల్ ని క్షమాపణలు కోరాలి. 375 00:37:56,652 --> 00:37:59,154 ఒక మగవాడి అనుమతి లేకుండా నేను ఏదైనా పని చేసిన ప్రతీసారీ 376 00:37:59,238 --> 00:38:01,365 నేను క్షమాణలు చెప్పాలని ఆశించడం లేదు. 377 00:38:01,448 --> 00:38:03,742 నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు మాత్రమే క్షమాపణలు కోరాలి. 378 00:38:05,577 --> 00:38:07,454 అది నిజం అయినప్పటి మాట. 379 00:38:12,042 --> 00:38:15,045 నువ్వు ఏ తప్పూ చేయలేదు అని ఖచ్చితంగా నమ్మినప్పుడు, మరి ఎందుకు అంతలా బాధపడుతున్నావు? 380 00:38:24,847 --> 00:38:26,306 ఇంక పడుకో. 381 00:39:53,769 --> 00:39:55,270 నేను మీ అందరినీ నిద్ర లేపాలని అనుకోలేదు. 382 00:39:55,354 --> 00:39:56,730 అక్కడ ఉత్తరాల డబ్బా ఉంది. 383 00:39:56,813 --> 00:39:58,607 ఇది మీకు వ్యక్తిగతంగా అందివ్వాలని అనుకున్నాను. 384 00:40:01,693 --> 00:40:03,946 నేను క్షమాపణలు అడగాలని మార్తా చెప్పింది. 385 00:40:04,613 --> 00:40:05,656 మరి క్షమాపణలు కోరావా? 386 00:40:06,406 --> 00:40:07,824 లేదు. 387 00:40:08,367 --> 00:40:10,619 నేను ఏ తప్పూ చేయలేదు అనుకున్నప్పుడు క్షమాపణలు అడగలేను. 388 00:40:12,120 --> 00:40:13,830 సరే, నేను దీనిని చదవడానికి ఆలస్యం చేయలేను. 389 00:40:13,914 --> 00:40:14,915 మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? 390 00:40:14,998 --> 00:40:18,043 లేదు, నేను మీ నుంచి ఏమి ఆశిస్తున్నానో నేను ఆ విధంగానే ప్రవర్తిస్తున్నాను. 391 00:40:21,755 --> 00:40:22,756 కోరా, ఆగండి... 392 00:40:28,846 --> 00:40:30,138 కోరా! 393 00:40:30,222 --> 00:40:31,473 మీరు నా సహాయం కోరారు. 394 00:40:31,557 --> 00:40:34,101 -కానీ ఆమె మీద ప్రయోగాలు చేయమని కాదు. -స్టెల్లా అందుకు అనుమతి ఇచ్చారు. 395 00:40:34,184 --> 00:40:36,228 ఏంటి? ఆమెకు గతాన్ని గుర్తు చేసి మళ్లీ భయపెట్టడానికా? 396 00:40:36,311 --> 00:40:37,813 దాని గురించి మీకు ఏమీ తెలియదు. 397 00:40:37,896 --> 00:40:38,939 నాకు చాలా వరకూ తెలుసు. 398 00:40:39,773 --> 00:40:43,277 నేను మీ అనుమతి అడగలేదనీ, మీ నిర్ణయాన్ని గౌరవించలేదని మీరు ఆగ్రహంతో ఉన్నారు. 399 00:40:43,360 --> 00:40:44,736 డాక్టర్ గారెట్ తో ఉంటే మీరు ఎందుకు అడుగుతారు? 400 00:40:44,820 --> 00:40:46,822 అతడిని గౌరవించడానికి మీరు ఇబ్బంది పడరు. 401 00:40:51,743 --> 00:40:54,288 నా మీద ఇంత కోపగించుకునే హక్కు మీకు లేదు అనుకుంటున్నాను. 402 00:40:57,708 --> 00:40:58,876 బహుశా అది నిజం. 403 00:41:01,253 --> 00:41:02,629 మరి ఎందుకు కోపంగా ఉన్నారు? 404 00:42:19,748 --> 00:42:21,750 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్